Monday, December 16, 2024

 *వేమన శతకము*
 కులము లోన నొకడు గుణవంతుడుండిన
 కులము వెలయు వాని గుణము చేత
 వెలయు వనములోన మలయజంబున్నట్లు
 విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: కులములో ఒక వ్యక్తి గుణవంతుడన్నట్లయితే ఆ కులమంతా అతనివలన గౌరవాన్ని పొందుతుంది. వనములో ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నప్పటికీ ఆ వనమంతా వాసన వెదజల్లుతుంది.

 పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
 మాటకన్న నెంచ మనసు దృఢము
 కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
 విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: పూజపునస్కారముల కంటే బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.

 ఉత్తముని కడుపున నోగు జన్మించిన
 వాఁడె చెఱకు వాని వంశమెల్లఁ
 జెఱకు వెన్నుపుట్టి చెరపదా! తీపెల్ల
 విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: చెరకు మొక్క చివర కంకిపుట్టి చెరకు యొక్క తీపిని చెరచునట్లుగా, ఉత్తమ వంశములో దుష్టుడు పుట్టిన ఆ వంశము యొక్క గౌరవము నశించును.        

No comments:

Post a Comment