Friday, December 13, 2024

 సనాతన హిందూ ధర్మానికి ప్రసిద్ధిచెందిన భారతదేశంలో అనేక రహస్యాలకు నెలవు. సైన్స్ కూడా చెదించలేని రహస్యం ఉన్న ఆలయం ఒకటి కేరళలో ఉంది. శ్రీ కృష్ణ భగవానుడు కొలువైన ఈ ఆలయంలో.. దేవుడి విగ్రహం ఆకలితో బాధపడుతూ ఉంటుంది. స్వామివారికి ప్రసాదం ఇవ్వకపోతే.. ఆ విగ్రహం బలహీనంగా మారుతుందని నమ్మకం. 

ఈ శ్రీ కృష్ణుని ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువేరపు లేదా తిరువరప్పు ప్రాంతంలో ఉంది. ఆ ఆలయంలో ప్రతిష్టించిన కృష్ణుడి విగ్రహం ఆకలిని అస్సలు తట్టుకోదు. కనుక ఇది ఒక అద్భుత దేవాలయంగా పరిగణించబడుతుంది. 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శ్రీకృష్ణుడికి 10 సార్లు నైవేద్యాన్ని పెడతారు. ప్లేట్‌లో ఉంచిన ప్రసాదం క్రమంగా తగ్గుముఖం పడుతుందని భక్తులు చెబుతారు. కృష్ణుడు తన మేనమామ కంసుడి సంహారం అనంతరం చాలా ఆకలితో ఉన్నాడని.. అదే విధంగా ఈ ఆలయంలోని భగవంతుని విగ్రహం ఆకలితో బాధపడుతుందని హిందువుల విశ్వాసం. స్వామివారికి నైవేద్యం పెట్టడంలో కొంచెం ఆలస్యం అయినా.. విగ్రహం స్వయంచాలకంగా సన్నబడటం ప్రారంభమవుతుంది.

ఈ ఆలయాన్ని రోజుకు రెండు నిమిషాలు మాత్రమే మూసివేస్తారు. శ్రీకృష్ణుడి విగ్రహం కేవలం 2 నిమిషాలు మాత్రమే నిద్రపోతుందని చెబుతారు. ఆలయ తాళపుచెవుతో పాటు గొడ్డలిని కూడా పూజారికి ఇస్తారు. తలుపులు తాళం కీతో తెరవలేకపోతే.. తలుపులు తెరవడానికి గొడ్డలిని ఉపయోగంచి పగలగొట్టవచ్చు.. ఈ విషయంలో పూజారికి అనుమతి ఉంది. గత కొన్ని వందల ఏళ్లగా ఈ పద్ధతి పాటిస్తున్నారు.

No comments:

Post a Comment