*_జీవితమంటేనే ఒక యుద్ధ భూమి. అక్కడ యుద్ధమే చేయాలి. లేదంటే ఓడిపోవాలి. ఓడిపోయినా మళ్ళీ యుద్ధం చేస్తూ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు విజయం సాధిస్తావు..._*
*_అదే విదంగా మన జీవితం అనే రణరంగంలో పోరాడుతు, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆగిపోయావో పతనం తప్పదు. ప్రయత్నం చేస్తూ పోయావో ఉన్నత స్థానం లో నిలుస్తావు._*
*_జీవితమంటేనే స్నేక్ అండ్ లేడర్స్ ఆట లాంటిది. నిచ్చెణలే కాదు మింగేసే పాములు కూడా ఉంటాయి._*
*_నిచ్చెణలు మాత్రమే కావాలి, పాములు వద్దంటే కుదరదు. జీవించాలంటే అన్నింటినీ స్వీకరించాల్సిందే..._*
*_మీరు నడుస్తున్న దారిలో కాలికి ముల్లు గుచ్చుకుంటే అక్కడే నడక ఆపేయరు కదా, ముళ్ళు తీసుకొని తిరిగి నడక ప్రారంభిస్తారు..._*
*_అలాగే మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మీ ప్రయాణాన్ని ఆపకూడదు. భగవంతుడు జీవితంలో సంతోషాన్ని, సౌందర్యాన్ని మాత్రమే కాదు..._*
*_ఆ జీవితం విలువ తెలిపేందుకే కన్నీళ్ళను, కష్టాలను కూడా ఇచ్చాడు. వాటిని తట్టుకొని నిలబడితేనే మనకు సంతోషం యొక్క విలువ తెలుస్తుంది.☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌸🌸🌸 🌷🙇♂️🌷 🌸🌸🌸
No comments:
Post a Comment