*_📌కర్మ ప్రాప్తి_*
*_మనిషి చేసే కర్మలు పక్షులు కట్టుకున్న గూడు మాదిరిగా ఉండాలి తప్ప సాలీడు కట్టుకున్న గూడు మాదిరిగా కాదు... పక్షి కట్టుకున్న గూడు తనకి రక్షణగా ఉంటుంది. ఒకవేళ తాను అక్కడ నుండి వెళ్ళిపోయినా మరొక పక్షికైనా నివాసంగా ఉండేందుకు అనుకూలంగా ఉంటుంది. కానీ సాలీడు గూడు కట్టుకునేది కీటకాలను చంపి తినడానికి... అలా తన గూడులో చిక్కుకున్న కీటకాలను చంపి తింటూ చివరికి అదే గూడులో చిక్కుకుని చనిపోతుంది. అంత కష్టపడి కట్టి ఎలాంటి ఉపయోగం లేదు సరికదా, అదే తన నాశనానికి కారణమయింది... అలానే మనం కూడానూ కర్మలు చేసినపుడు మనకే కాక, ప్రజా ప్రయోజనార్థం ఉండేలా చూసుకోవాలి. దేవుడు అన్నీ ఇచ్చాడు కదా అని ఇష్టం వచ్చిన రీతిగా చేసుకుంటూ పోతే చివరికి నాశనమే దక్కుతుంది..._*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁
No comments:
Post a Comment