*సతివ్రతుడు, ఇంకా చెప్పాలంటే ఏక సతీవ్రతుడు..*
*అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం విజయ విహారం పత్రిక లో చదివాను...*
*సుభారావ్ బాగా తాగి ఇంటికి వచ్చి పడుకున్నాడు. బాగా తలనొప్పితో ఉదయం లేచే సరికి ఎదురుగా ఆస్ప్రిన్ టాబ్లేట్, మంచి నీళ్ళు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు. ఆ టాబ్లేట్ వేసుకుని నిద్రపోయాడు.*
*గంటకి మెలుకువ వచ్చి లేచి చూశాడు. గది అంతా బాగా సర్ది ఉంది. ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉన్నాయి. దినపత్రిక టేబిల్ మీద ఉంది.*
*పేపర్కి "డియర్! టిఫెన్ డైనింగ్ టేబిల్ మీద వేడిగా ఉంది. తినేసి పడుకో. ఐ లవ్ యూ. లల్లీ " అని స్లిప్ చూచి మరింత హాశ్చర్యపోయాడు.*
*ఎప్పుడు తాగొచ్చినా గొలపెట్టే లల్లీ ఇలా ప్రేమగా.... ఎమయి ఉంటుదబ్బా అనుకుంటూ డైనింగ్ టేబిల్ దగ్గరకి వచ్చాడు.*
*కొడుకు సతీశ్ టిఫెన్ తింటున్నాడు. "నాన్నా ! నీ ప్లేట్ అది" చూపించాడు. టిఫెన్ వేడి వేడిగా ఉంది. ఇడ్లీ తినేసి, పెసరట్టు తింటూ కొడుకుని అడిగాడు.*
*"రాత్రి ఏమైంది?" అనడిగాడు.*
*" ఏమో! నాకేం తెలుసు. నువ్వు తూలుతూ రాత్రి పదకొండు గంటలకు వచ్చావు.*
*నువ్వు వస్తూంటే డ్రాయింగ్ రూమ్లో ఫ్లవర్ వాజ్ పగలకొట్టావు. తివాచీ మీద పెద్దగా దగ్గి కక్కుకున్నావు.* *అమ్మా,నేను నిన్ను బాత్రూమ్ కి తీసుకెళ్ళాము. అక్కడ అమ్మ నీ పాంట్ విప్పుతుంటే " `వద్దు! వద్దు ! నాకు పెళ్ళయింది" అని పెద్దగా గోలచేసి మళ్ళీ పడిపోయావు"`*
*అమ్మా, నేను చాలా కష్టపడి నిన్ను మంచం మీదకి చేర్చాము. అంతే నాకు తెలుసు.*
*అంటూ కొడుకు లేచి వెళ్ళిపోయాడు.*
No comments:
Post a Comment