Sunday, December 1, 2024

 *ఇది కథ కాదు*
*అయినా చదవగలరు.🙏🏻*
🌼🌼🌼🌼🌼🌼🌼
*ఇప్పటి సమాజంలో 90% అర్ధ నగ్నంగా ఉన్న స్త్రీలను చూసి ఆనందించేవారు ఎవరో తెలుసుకోండి., స్త్రీ స్వేచ్ఛ విషయమై నిజం తెలుసుకోండి., ఇది చదివి సత్యాన్ని అర్థం చేసుకోండి...*

*ఒక రోజు స్థానికంగా మహిళా సభ ఏర్పాటు చేయగా సభాస్థలికి వచ్చిన మహిళలు ఎక్కువ.., పురుషుల సంఖ్య తక్కువ..!!*

*దాదాపు ఇరవై ఐదేళ్ళ సుందరి వేదికపై మోడ్రన్ దుస్తులు ధరించి మైక్ పట్టుకుని మగ సమాజాన్ని తిట్టిపోసింది..!!*

*అదే పాత గోల... మగవారి దుష్టపు ఆలోచన, చెడు ఉద్దేశాలను నిందించింది., పొట్టివి, చిన్నవైన బట్టలు ధరించే స్వేచ్ఛను వెనకేసుకు వస్తూ., అది లేకపోవటం జనాల ఆలోచనలలో లోపం, రోగం అని చెప్పింది.. ఏది కావాలంటే అది ధరించే స్వేచ్ఛను సమర్థించింది..*

*ఆ తర్వాత హఠాత్తుగా సభాస్థలం నుంచి ఆకర్షణీయంగా మంచి దుస్తులు ధరించి ఉన్న ముప్పై, ముప్పై రెండేళ్ల యువకుడు లేచి నిలబడి తన అభిప్రాయాలు చెప్పేందుకు అనుమతి అడిగాడు..!!*

*అనుమతి ఇచ్చి మైక్‌ను ఆయన చేతులకు అందజేశారు. మైక్ చేతికి రాగానే మాట్లాడటం మొదలుపెట్టాడు..!*

*తల్లులారా, అక్కా చెల్లెళ్ళారా, మీరందరూ ఎవరో నాకు తెలియదు.. మీకెవరికీ నేను తెలియను., కానీ నన్ను చూస్తే నేను ఎలాంటి వ్యక్తినో చెప్పగలరు. నా దుస్తుల పరంగా మీరు నా గురించి ఎలా భావిస్తున్నారు - రౌడీషీటర్ లాగా ఉన్నానా లేక డీసెంట్ గానా..??*

*సభాస్థలం నుండి అనేక స్వరాలు ప్రతిధ్వనించాయి - మీరు దుస్తులు, సంభాషణలో మర్యాదగా కనిపిస్తున్నారు... మీరు పద్ధతిగా ఉన్నారు... గౌరవంగా కనిపిస్తున్నారు....*

*ఇది వింటూనే ఒక్కసారిగా అతను వింతగా ప్రవర్తించాడు... హాఫ్ ప్యాంట్ టైపులో ఉన్న తన లోదుస్తులను మాత్రమే వదిలేసి స్టేజి పైనే మిగతా బట్టలన్నీ తీసేసాడు..!!*

*ఇది చూసి.... సభా స్థలమంతా ఆగ్రహావేశాలతో దద్దరిల్లింది. మోసగాడు, గుండా, సిగ్గులేని వాడు, అసలు వీడికి ఏ మాత్రం లజ్జా.. అభిమానం అంటూ ఏమీ లేవు.... వీడిని వదలొద్దు...*

*ఈ కోపంతో కూడిన మాటలను విని అతను ఒక్కసారిగా మైక్‌లో గర్జించాడు..*

*“ఆగండి... ముందు నా మాట వినండి., ఆ తర్వాత చంపండి., నన్ను సజీవ దహనం చేయాలన్నా చేయవచ్చు..!!*

*ఇప్పుడే.... ఈ సోదరి చిన్న బట్టలూ, బిగుతుగా, పొట్టిగా ఉన్న బట్టల పక్షం తీసుకుని, వస్త్ర స్వాతంత్య్రం కోసం వేడుకుంది... వస్త్ర స్వాతంత్య్రం లేకపోవటం "ఉద్దేశం మరియు ఆలోచనలో తప్పు" అని చెబుతోంది...!!*

*అప్పుడు మీరంతా చప్పట్లు కొట్టి సమ్మతిని తెలియజేసారు.. మరి నేనేం చేశాను..??*

*బట్టల స్వేచ్చ మాత్రమే చూపించాను..!!*

*"ఉద్దేశం, ఆలోచన" లలో లోపమేమీ లేదు కదా., పైగా నేను మిమ్మల్ని ఉద్దేశించి ... అమ్మా, అక్కా చెల్లె అనే సంబోధించాను కూడా కదా.. ఇప్పుడు నేను అర్ధనగ్నంగా ఉన్న వెంటనే... "తమ్ముడు మరియు కొడుకు" ఎందుకు కనిపించలేదు. .??*

*నా ఉద్దేశంలో లోటు ఉన్నదని మీకెందుకు అనిపించింది..??*

*మీరు నాలో "మగవాడిని" మాత్రమే ఎందుకు చూస్తున్నారు.? తమ్ముడు, కొడుకు, స్నేహితుడు ఎందుకు మీకు కనిపించలేదు..? మీలో ఎవరికీ "ఆలోచనా ఉద్దేశ్యం"లో లోపం కూడా లేదే... అలాంటప్పుడు ఎందుకు ఇట్లా జరిగింది..??*

*నిజం ఏంటంటే..... ప్రజలు అబద్ధాలు చెబుతారు... "బట్టలు" మరియు "వస్త్రధారణ" వల్ల ఏమీ తేడా రాదు, పట్టింపు ఉండదు అని..*

*వాస్తవం ఏమిటంటే.. మానవ స్వభావం ప్రకారమే ఒకరిని "పూర్తిగా ఆవరణ" లేకుండా అర్ధనగ్నంగా చూడటం వల్ల మనస్సులో లైంగిక భావన మేల్కొంటుంది..*

*రూపం, రుచి, శబ్దం, వాసన, స్పర్శ, ఇవి చాలా ప్రభావవంతమైన కారకాలు., వాటి ప్రభావం వల్ల "విశ్వామిత్ర" వంటి మహర్షి మనస్సులో ఒక రుగ్మత తలెత్తింది.. అతను రూపాన్ని మాత్రమే చూశాడే.. ఇక మామూలు మనుషుల సంగతి ఏమని చెప్పాలి..?*

*దుర్గా సప్తశతి దేవీ కవచంలో 38వ శ్లోకంలో భగవతిని ఈ కారకాల నుండి రక్షించమని ప్రార్థన చేయబడింది..*

*“రసే రూపే చ గంధే చ శబ్దే స్పర్శే చ యోగిని..*
*సత్వరజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదా...!!*

*రుచి, వాసన, శబ్దం, తాకడం వంటి ఈ విషయాలను అనుభవిస్తూ ఉన్న వేళ యోగినీ దేవి రక్షించు గాక..! సత్వగుణాన్ని, రజోగుణాన్ని, తమోగుణాన్ని నారాయణీ దేవి రక్షించు గాక...!!*

*ఇప్పుడు చెప్పండి., భారతీయ హిందూ స్త్రీలను "హిందూ సంస్కారం"లో బ్రతకమని చెప్తే, ఏ స్త్రీల "స్వేచ్ఛ" హరించుకు పోయిందిటా..??*

*సోషల్ మీడియాలో అర్ధనగ్నంగా ఎగురుతున్న గెంతుతున్న 90% మంది అమ్మాయిలు, మహిళలు.. హిందువులే.. మరి 90% మంది సరదాగా ఆనందిస్తున్న మగవారెవరో చెప్పాలా..?*

*కళ్ళు తెరవండి... మిమ్మల్ని మరియు మీ సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోండి.., ఎందుకంటే భారతీయ సమాజం, సంస్కృతికి ఆధారం మహిళా శక్తి.., అధార్మిక, సంస్కృతి విచ్చిన్నకర బాలీవుడ్, వామపక్షాలు లాంటి విచ్ఛిన్నకర శక్తులు మన సమాజపు పునాదిని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేస్తున్నారు..!! ?*

*అణుబాంబులు వేసినంత మాత్రాన దేశం ఉనికి కోల్పోదు..*
*ఉదాహరణ :- జపాన్*

*దేశం నాశనమయ్యేది సంస్కృతి, విద్య, ధర్మం దిగజారినపుడు.*
*ఉదాహరణ :- ఆఫ్ఘనిస్తాన్*

*ఎవరి సంస్కృతి అయితే జీవించి ఉంటుందో వారు కష్టాల్లోను, ముళ్లమధ్యలో ఉంటు కూడా నవ్వుతూ ఉండగలరు..*
*ఉదాహరణ :- ఇజ్రాయెల్*

*అందుకే మనని మనం కాపాడుకోవడానికి దేశాన్ని రక్షించుకోవాలి...*
*దేశాన్ని కాపాడుకోవడానికి ముందు మన ధర్మాన్ని, సంస్కృతిని ఆచరిస్తూ కాపాడుకోవాలి...*🙏🏻

No comments:

Post a Comment