*_జీవితంలో ఒక సమస్య పరిష్కారం అవ్వగానే మరొక సమస్య వస్తూనే ఉంటుంది. దాన్నే అంటారు జీవితం..._*
*_అలా సమస్యలు వస్తూ, పోతూ ఉంటాయి పలకరిస్తూ ఉంటాయి. అంతమాత్రాన మనం డీలా పడితే ఎలా.?_*
*_సమస్యలను చూసి కొంతమంది డీలా పడిపోతారు. భయపడి పోతారు. కొంతమంది తమ జీవితాన్ని ముగించేసుకుంటారు. ఎంతటి దౌర్భాగ్యమో కదా.!_*
*_సమస్యలు మనకు రాకుండా ఎవరికి వస్తాయి.? మనిషిగా నీవు జన్మనెత్తినావంటేనే సమస్యల్లో ఉన్నావని అర్థం... మనిషిగా నీ కది సహజమే.!_*
*_వీలైనంతవరకు సమస్యను సమస్యలా చూడకండి... మీ జీవితంలో ఒక భాగంలా చూడండి. అది మీకు పెద్దగా కనిపించదు..._*
*_జీవితంలో సమస్య రాగానే తల్లడిల్లిపోకుండా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించండి. అప్పుడే మనం ధైర్యంగా మనం అనుకున్నవి చేయగలం, సాధించగలం._*
*_ప్రతీ సమస్యకు పరిస్కారం ఉంటుంది... అంతలోనే తల్లడిల్లి పోతే ఎలా.?_*
*_సమస్యను పరిష్కరించే దిశలో మన ఆలోచన ధోరణి ఉండాలే తప్ప సమస్యను సమస్యలాగా చూస్తూ మూలకు కూర్చొని రోదిస్తే ఎలా.?_*
*_చాలా మట్టుకు మనకున్న సమస్యలు అతి చిన్నవే ఆలోచిస్తే... సమస్య సమసి పోతుంది. మనం ఎలా అనుకుంటే మనకు మన సమస్య అలా కనబడుతుంది._*
*_సమస్యలను పక్కన నెట్టి ప్రయత్నిస్తూ ముందుకు సాగితే... తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం._*
*_దానికి కావాల్సింది కేవలం కాస్త ఓపిక, ప్రయత్నంవాదం. మనపై మనకు విశ్వాసం మాత్రమే. ☝️_*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌸🌸🌸 🌺🙇♂️🌺 🌸🌸🌸
No comments:
Post a Comment