*అనుకోని సంఘటనలతో మొదలవుతుంది ఏదైనా ఒక పలకరింపు.*
*కొన్ని కారణాలతో ముగిసిపోతుంది ప్రతి పలకరింపు...!!*
*నమ్మకాలు చెడిన దగ్గర...విశ్వాసాలు జీవం కోల్పోతుంటాయి.*
*మనసు చచ్చిన దగ్గర ఇంకా ఎలాంటి సర్దుబాట్లు జరగవు.*
*మన నమ్మకం కాపాడుకోవాలీ,ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని కాపాడాలీ.**
*ఇష్టమనే_జీవితం.*
*మన ఇష్టాన్ని గౌరవిస్తూ... ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని కాపాడుతూ... బతికేయడమే నిజమైన ప్రేమ సిద్ధాంతం.*
*ఏదో ఒక కారణంతో దగ్గరయ్యే మనం ఏదో ఒక కారణంతోనె దూరం_అవడం చాలా సహజం.*
*అన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సిన సందర్భాన్ని గట్టిగా ఎదుర్కోవడమే నిజమైనఇష్టం..!*
*కొన్ని బంధాలకు అంతం ఉండదు.*
*కొన్ని అనుబంధాలకు జీవమే అసలే ఉండదు.*
*భలేగా విడిపోతారు కదా...ఎంతో కావలసిన వాళ్ళైనా..*
*కారణాన్ని భలేగా పెద్దది చేసి...*
*సిద్ధంగా ఉండాలి ప్రతి కారణం వెనక ఒక నిజాన్ని మన మనసులో దాచుకోవడానికి...!*
*బంధాన్ని బాధ్యత భావించండి సంతోషంగా ఉంటారు.*
*బంధాన్ని బరువుగా మోయకండి. జీవితంలో మనశాంతిని*
*కోల్పోతారు...!!*
No comments:
Post a Comment