😱 సాధన చేయకుండా కుండలిని శక్తి మేల్కొంటుందా 💠 గతజన్మలో చేసిన సాధన కారణం 🔥 మీకు ఇలా జరిగిందా 🧘
Author Name:My Journey Sg
Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XWWHkidza7M
Transcript:
(00:01) సహైకం్రవయం [సంగీతం] స్పాంటేనియస్ స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఎలాంటి ప్రణాళిక సాధన గ్రూ మార్గదర్శనం లేకుండా అకస్మాత్గా లోపల గాఢమైన చైతన్య మార్పు సంభవించడం ఇది ఒక ఆలోచన కాదు ఒక విశ్వాసం కాదు ఒక ప్రత్యక్ష అనుభవం వ్యక్తికి ఒక్కసారిగా జీవితం తన అంతర్యం ప్రపంచాన్ని అన్నీ కొత్తగా కనిపించవచ్చు నేను ఎవరు అనే ప్రశ్న ఒక్కసారిగా లోతుగా తాకవచ్చు.
(00:32) కొన్ని సందర్భాల్లో అది తీవ్రమైన శాంతిగా అపారమైన ఆనందంగా అనిపించవచ్చు. మరి కొన్ని సందర్భాలలో అది భయంకరంగా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన మనసు నిర్మాణం ఒక్కసారిగా కదిలిపోతుంది కదా. ఇలాంటి అనుభవం చాలా మంది జీవితంలో తీవ్రమైన సంఘటనల ద్వారా వస్తుంది. ఉదాహరణకు ఒక ప్రమాదం జరిగి అక్కడ మనకు ఇష్టమైన వ్యక్తిని ఎవరినైనా కోల్పోతే తీవ్రమైన ఎమోషన్స్ వస్తుంటాయి.
(01:01) ఆ బాధలో నుంచి ఆ క్షోభలో నుంచి చాలా లోతైన ప్రశ్నలు గడిపిన కాలం తెలుస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి స్పష్టమైన కారణం లేకుండానే సంభవించవచ్చు. వ్యక్తి నడుస్తూ ఉండగానే ప్రకృతి చూస్తూ ఉండగానే లేదా సాధారణ రోజు మధ్యలో ఇలా అకస్మాత్తుగా చైతన్య విస్తారణను అనుభవించవచ్చు. ప్రపంచం ఒక్కసారిగా అన్ని ఒకటే అన్న భావనను కలిగించవచ్చు.
(01:27) శరీరం మనసు సరిహద్దులు కరిగిపోయినట్లు అనిపించవచ్చు. ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం ఇది ఆత్మ మేల్కొలుపు లేదా కుండలిని స్వయంగా మేల్కొనడం అని చెప్పబడుతుంది. యోగా శాస్త్రంలో వ్యక్తి సిద్ధ స్థితిలో ఉన్నప్పుడు శక్తి సహజంగా పైకి ఎగసి చైతన్యాన్ని విస్తరింపజేస్తుందని చెబుతారు. కొందరు దీన్ని పూర్వజన్మ సంస్కారాల ఫలితంగా కూడా భావిస్తారు.
(01:50) అయితే సాంప్రదాయ గురువులు ఒక ముఖ్యమైన విషయం చెబుతారు. మేలుకొలపటం కంటే దాన్ని స్థిరపరచడం చాలా ముఖ్యమని. అనుభవం ఒక్కసారిగా రావచ్చు కానీ దాన్ని బ్యాలెన్స్ చేయడమే చాలా కష్టమైన పని కదా శాస్త్రీయంగా చూస్తే ఇలాంటి అనుభవాల సమయంలో మెదుడులోని కొన్ని భాగాలు క్రియాశీలత మారుతుంది. ముఖ్యంగా డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనే భాగం ఐ మీన్ ఇది వ్యక్తిగత గుర్తింపుతో ఐ మీన్ ఈగోతో సంబంధం కలిగి ఉంటుంది.
(02:17) అది తాత్కాలికంగా తగ్గిపోవచ్చు. దాంతో నేను అనే భావన కరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఎమోషన్స్ లో చాలా మార్పులు సంక్రమిస్తాయి. అందుకే అనుభవం చాలా గాఢంగా అనిపిస్తుంది. ఇది మిస్టరీ అనుకునేలా అనిపించిన మెదడు స్థాయిలో జరిగే సహజమైన మార్పుల వల్ల కూడా రావచ్చు. అయితే ప్రతి స్పాంటేనియస్ అనుభవం ఆరోగ్యకరమే అనుకోవడం సరైంది కాదు. కొన్ని సందర్భాల్లో ఇది మానసిక ఆరోగ్య సంక్షోభంలో కూడా ఉంటుంది.
(02:44) వ్యక్తి తీవ్రమైన భయం, అయోమయం, నిద్రలు సరిగా పోకపోవటం వాస్తవాన్ని గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది ఆధ్యాత్మిక మేలుకొలుపు కంటే మానసిక సమస్య కూడా కావచ్చు. ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక వికాసం సాధారణంగా శాంతిని స్పష్టతని కరుణని మరియు జీవితం మీద ఒక బ్యాలెన్స్డ్ గా దృష్టి చూపేలా చేస్తాయి. కానీ ఇలా మనకి భయాలు, గంధరగోళాలు, అస్థిరత ఇవి ఉంటే అది సైకలాజికల్ ప్రాబ్లం అని మనం చెప్పవచ్చు.
(03:12) పిల్లల విషయంలో మరికొంత జాగ్రత్తగా ఉండాలి. పిల్లల మెదడు ఇంకా అభివృద్ధి దశలోనే ఉంటుంది. వారి ఊహాశక్తి మరియు ఎమోషన్స్ అండ్ ప్రతిస్పందనలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి పిల్లలలో అసాధారణమైన అనుభవాలు కనిపిస్తే ముందు వైద్యుని సంప్రదించాలి లేదా మానసిక పరిశీలన చాలా అవసరం. ఆధ్యాత్మికతకి అర్థం తర్వాత ఇవ్వాలి కానీ పిల్లల భద్రత ఎప్పుడూ మొదట ఉండాలి.
(03:40) స్పాంటేనియస్ స్పిరిచువల్ యక్టివేషన్ ఆర్ స్పాంటేనియస్ స్పిరిచువల్ అవేకనింగ్ అనేది ఒక ముగింపు కాదు ఇది ఒక ప్రారంభం అది వ్యక్తిని లోతైన ప్రశ్నల వైపుగా నడిపిస్తుంది. జీవితం మీద ఉన్న పాత నమ్మకాలని కదిలిస్తుంది. నిజమైన పరివర్తన అనేది ఆ అనుభవం తర్వాతనే ప్రారంభమవుతుంది. స్థిరత్వం, స్వీయ అవగాహన, భావోద్వేగ, పరిపక్వత, మరియు అవసరం అయితే సరైన మార్గదర్శనం ఇలా చాలా ముఖ్యమైనవి.
(04:06) చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి అనుభవం ఎంత గొప్పదైనా మనసు అండ్ మన శరీరం ఆరోగ్యంగా ఉండకపోతే అవి పనికిరానివి కిందకి వస్తాయి. ఆధ్యాత్మికత మరియు శాస్త్రం పరస్పర విరుద్ధాలు కావు. రెండిటిని బాలెన్స్డ్ గా చూడగలిగితేనే మనం నిజమైన స్పష్టతకు చేరగలం. మరి ఇలా జరగటం మంచిదేనా అంటే మంచో చెడో కానీ ఇది మన చేతిలో లేనే లేదు కదా ఎంతో మంది ఋషులు సన్యాసులు వారి జీవితాన్ని పరిత్వజించి మరి సాధన చేస్తూ ఉంటారు.
(04:38) ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి చచ్చేలోపు తాము ఎవరో తెలుసుకోవాలి అని చాలా ప్రయత్నిస్తుంటారు పరితపిస్తుంటారు. నీ ప్రమయమే లేకుండా ఈ అద్భుతం జరిగిందంటే దానికి కారణం నువ్వు దానికి అర్హుడివి అని కానీ కొన్ని కొన్నిసార్లు కర్మని కర్మ సిద్ధాంతాన్ని నమ్మకున్నా ఇలా మన ప్రయత్నమే లేకుండా ఈ జన్మలో అలాంటి అనుభవాలు వస్తుంటే ఈ గత జన్మ సాధనని సిద్ధులని నమ్మకుండా ఎలా ఉంటాం మరి వచ్చే వీడియోలో అసలు ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏంటి గత జన్మలు ఉంటాయా తెలుసుకుందాం [సంగీతం] చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి అది వాళ్ళకి తెలిసి జరగొచ్చు తెలియకుండా జరగొచ్చు కొన్ని కలల్లో వస్తాయంటే ప్రతి
(05:20) కలకి చాలా డీప్ మీనింగ్ ఉంటది దాన్ని డీకోడ్ చేస్తే దాంట్లో అసలు ఏం మెసేజ్ ఉంది అలా తెలుస్తది నాకు కూడా కలలో చాలా సైన్స్ వచ్చేటివి అన్నమాట సో ఒక్కొక్కటి మనం ఈ సిరీస్ లో మాట్లాడుకుందాం మీరు కామెంట్ లో పెట్టండి సో మనం దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమఃశివాయ సర్వం శివం జగత్ నాశైగవాహం దం ప్రవజం [సంగీతం] ప్రజయామి నాశైగవాహం ప్రవజం [సంగీతం] ప్రజయామి సహైగవాహం ప్రవజం ప్రజయ
No comments:
Post a Comment