Sunday, September 3, 2023

 రూపాయి , మనిషి బండి నడవడానికి అవసరం అయ్యే ఇంధనం , 
విచిత్రం ఏమిటంటే దాని విలువ మనిషిని బట్టి , 
ప్రదేశాన్ని బట్టి , 
కాలాన్ని బట్టి మారిపోతుంది ... 
ఇరవైరూపాయలు పెట్టిసామాను తెచ్చి ఇరవైఐదుకు అమ్ముకునే వానికి , 
ఆ అయిదు రూపాయలు ఎంతో విలువైనవి , 
అదే వాడి జీవన ఆధారం , 
అదే లక్షపెట్టి లక్షపదివేలుకు అమ్ముకునే వానికి ఆ అయిదు రూపాయలు పెద్ద లెక్క 
కాదు , 
వాడికి అటువంటి అయిదులు చాలానే కావాలి లెక్కకు రావాలి అంటే ,
ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా కూరగాయల మార్కెట్ వెళితే , 
కిలో ఇరవై చెబితే పద్దెనిమినిదికి ఇవ్వవా అంటూ బేరం అడతాడు , 
రెండు రూపాయలు మిగిలించడానికి , అవి వీడికి ఏ విధంగానూ లెక్కకు రావు , 
అదే రెండు రూపాయలు కూరగాయలు అమ్మే వానికి జీవన ఆధారం , 
ఇదే కోటీశ్వరుడు హోటల్ కి వెళ్లి అడక్కుండానే వంద టిప్ పడేస్తాడు , 
ఒక పక్క రెండు రూపాయలు ఎంతో విలువైనవి అంటూ బేరం అడతాడు , 
lఅదే చేత్తో లెక్కలేకుండా వంద రూపాయలు టిప్ గా పడేస్తాడు , 
ఇలా చెప్పుకుంటూ పోతే రూపాయి విలువ ఊసరివిల్లిలా రంగులు మారుస్తూ , 
మనిషిని ఆడిస్తూ పోతూ ఉంటే అదే మనిషి మాత్రం ఎప్పుడూ , దానిని సంపాదించడంలోనే ఉరుకులు పరుగులు పెడుతాడు జీవితం అంతా ! 
ఇంతేనా ఆ రూపాయి గురించి ఒక కవి " " ఆ నలుగురు " " సినిమా లో ఇలా చెప్పాడు , రూపాయి రూపాయి నువ్వు ఏమి చేస్తుంటావు అని అడిగితే .... 
హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను !!! 
భార్యా భర్తల మధ్య చిచ్చు పెడతాను !!! 
తండ్రి బిడ్డలను విడదీస్తాను !!! 
అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను !!! 
ఆఖరికి ప్రాణ స్నేహితులను సైతం విడగడతాను !!! 
అందట , ఒక్కసారి మనం కనుక దానికి విలువ ఇచ్చి ఇంట్లోకి చొరబడనిస్తే , 
అది ఇంట్లో ఉన్న రక్త సంబంధాలను సైతం కిలోల లెక్కన తూకం వేసి అమ్మేస్తుంది , 
పైన చెప్పినవి అన్నీ మనకు తెలుసు కానీ మనం కూడా సందర్భాన్ని బట్టి , 
ఆ రూపాయికి విలువ ఇస్తూ దాని వెనకాలే పరిగెడతాం , 
దానికి ఎవరు మినహాయింపు కాదు , 
అందుకే రూపాయి అవసరం ఉన్నంత వరకు జీవనాధారం , 
ఆ తరువాత అది మనిషికే పెద్ద గుది బండగా మారి దాని వేటలో , 
ఎంతో విలువైన ప్రాణాలే పొగుట్టుకునే మనుషుల్ని చూస్తున్నాం ఇప్పుడు , 
ఒక్కటి మాత్రం నిజం మనకి ప్రాణం ఉంటేనే రూపాయికి విలువ , 
మరి అటువంటి ప్రాణాలే గాలిలో కలిసిపోతే ఇక రూపాయి ఒక విలువలేని కాగితం ముక్క , ఈ సత్యం గమనించి ప్రవర్తిస్తే అదే మన వెనకాల పరిగెడుతుంది . 
ఇది నిజం ...

వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు.

 వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. విద్యార్ధుల పాఠశాల చదువుల్లో, ఐఏఎస్ అభ్యర్ధులకు, ఇతర ఉద్యోగార్ధులకు నిర్వహించే పరీక్షల్లో ఉండే చరిత్రలో కూడా ఇదే వాదన కనిపిస్తుంది. ఇక తమను తాము సంఘ సంస్కర్తలమనీ, అభ్యుదయవాదులమని చెప్పుకునే కొందరు కుహనా మేధావులు ఈ విషయంలో వైదిక సంస్కృతిపై దుమ్మెత్తిపోస్తుంటారు. అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.

*స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి - యజుర్వేదం 10.03*

*స్త్రీలు మంచి కీర్తి గడించాలి - అధర్వణవేదం 14.1.20*

*స్త్రీలు పండితులవ్వాలి - అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది)*

*స్త్రీ అందరిని జ్ ఞానవంతుల్ని చేయాలి - అధర్వణవేదం 14.2.74*

*స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి - అధర్వణవేదం 7.47.2*

*స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి - అధర్వణవేదం 7.47.1*

*పరిపాలన విషయంలో స్త్రీలు*
పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గినాలి - *అధర్వణవేదం 7.38.4*

దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి-  *ఋగ్వేదం 10.85.46*

ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.

ఆస్తిహక్కు
పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది- 
*ఋగ్వేదం 3.31.1*

కుటుంబం
సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- *అధర్వణవేదం 14.1.20*

స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి- *అధర్వణవేదం 11.1.17* 
(స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది)
నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు- *అధర్వణవేదం 7.46.3*

ఉద్యోగాల్లో
*స్త్రీలు కూడా రధాలను నడపాలి- అధర్వణవేదం 9.9.2*

*స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి-యజుర్వేదం 16.44*(ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం. 

స్త్రీలు బయటకు రాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. కైకేయి దీనికి ఉదాహరణ కదా! 
(శ్రీ రామాయణంలో కైకేయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు. దశరధుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం   కోరుకోమనగా, సమయం వచ్చినపుడు అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ).

కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్ద్యేశించి ప్రసంగించాలి- 
*ఋగ్వేదం 10.85.26*

విద్యా విషయాల్లో
ఓ స్త్రీలారా! పురుషులతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాక!  మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాక! మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను-

*ఋగ్వేదం 10-191-3*

వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్ర వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్ప బడింది. 

*వివాహం -విద్యాభ్యాసం*
ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, నీకు భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు - *అధర్వణవేదం 14-1-64* (ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు).


వేద మంత్రాలను దర్శించిన మహిళా మంత్ర ద్రష్ట లు వీరిని ఆ కాలంలో ఋషికలు అని పిలిచేవారు 

గార్గి, రోమష,
ఘోషా, విశ్వవర,
ఆత్రేయి, లోపాముద్ర,
వసుత్రపత్ని, ఇంద్రాణి,
అపాల, శ్రద్ధ,
వైవశ్వతి, యామి,
పౌలమి, సూర్య,
శ్వాస్తి, శిఖండిని,
ఊర్వశి, సచి,
దేవరాణి, ఇంద్రమాత,
గోద, జుహు,
మైత్రేయి.

వీళ్ళంతా వేదాలలో ఉదాహరించిన స్త్రీ మూర్తులు. వేదాలను  స్త్రీలు పఠించరాదు, శూద్రులు నేర్చుకోరాదు అని మనుస్మ్రతి లో చెప్పారని చేస్తున్న వితండ వాదాన్ని తప్పని నిరూపించేలా ఆధారాలతో సహా ఇస్తున్నాం. వేదాలను నేర్చుకొని వేదాలలోని పలు మంత్ర సూక్తాలు దర్శించి, వ్యాఖ్యానించిన మేధావంతులైన మహిళలు వీరంతా 

మహిళాయోగులు, స్త్రీబుుషులు, యోగిణిలు, స్త్రీ మునులనే మాటలను మనం వినివుంటాం.కాని అలాపిలవటం సరికాదు వీరిని బుుషికలు లేదా బ్రహ్మవాదినులని పిలవాలి.

బుుగ్వేదంలో 23 మంది బుుషికలు సూక్తాలు దర్శించారు. అపాల దర్శించిన సూక్తానికి ఆమె పేరు మీదనే అపాలసూక్తమని పిలుస్తారు.

విశ్వవర ఐదవ మండలంలోని 28 వ సూక్తాన్ని లోపాముద్ర 19వ సూక్తాన్ని దర్శించారు. బుుగ్వేదంలో 125 సూక్తాన్ని జుహు దర్శించింది.

గార్గి శుక్ల యజుర్వేద దర్శన ద్రష్ట యజ్ఞవల్కునితో వేదాంత చర్చ చేసింది...! బ్రహ్మ పుత్రి 

పరిపాలన విషయంలో స్త్రీలు:-
పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గినాలి - అధర్వణవేదం 7.38.4

దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి- ఋగ్వేదం 10.85.46

ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు.
కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.

ఆస్తిహక్కు:-
పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది- ఋగ్వేదం 3.31.1

కుటుంబం:-
సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- అధర్వణవేదం 14.1.20

సేకరణ...

"స్వామి వివేకానంద " గారి ముఖ్యమైన ప్రవచనాలలో కొన్ని

 🇮🇳 🧤🧤🧤🧤🧤""యావత్ ప్రపంచ యువతకు ఆదర్శప్రాయుడైన "స్వామి వివేకానంద " గారి ముఖ్యమైన ప్రవచనాలలో కొన్ని మన గ్రూప్ సభ్యులకు ప్రత్యేకం 🇮🇳🙏🙏🙏📢🇮🇳



🚩ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు   ఆ జాతి   నశించిపోతుంది.

🚩ఏ పనీ "అల్పం"  కాదు.   ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు.   అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే తెలివైనవాడు.

🚩"ఓర్పు ""  అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే "ప్రతిఫలం" అంత తీయగా ఉంటుంది.

🚩కళింకిత హృదయులకు" "అధ్యాత్మిక వికాసం" ఉండదు.

🚩తెలివైన వారి తమ పని తామే సాధించుకోవాలి.

🚩దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, "ఆత్మవిశ్వాసం"  లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.

🚩జీవితం పోరాటాల,భ్రమల పరంపర.   జీవిత అంతరార్ధం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది

🚩దైవభక్తి ,గురుభక్తి, లపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకూ నేకెవరూ "అపకారం" చేయలేరు.

🚩"పదిమంది యువకుల్ని నాకివ్వండి. ఈ "దేశ స్వరూపాన్నే" మార్చేస్తాను.

🚩పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, "ఆత్మవిశ్వాసం"  మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది.
.

🚩విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది.     అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది

🚩ప్రకృతిని పరిశీలించడం ద్వారా "నిజమైన విద్య" లభిస్తుంది.

🚩ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు   ఆ జాతి నశించిపోతుంది.

🚩"నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం "శ్రమించేవాణ్ని" చూసి ఓటమి భయపడుతుంది.
మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం.

🚩" మీ కంటె ఎక్కువ తెలివి, బలం, సత్యం, జ్ఞానం ఇంకొకరికి ఉంటే కోపించి చిందులు తొక్కడం అవివేకం.

🚩విశ్వాసమే బలము, బలహీనతయే మరణము.

🚩వేదకాలానికి తరలిపోండి.

🚩సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.

🚩సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు.

🚩విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచిచూడకూడదు. వెంటనే పని "ప్రారంభించాలి."

🚩తనకు నచ్చితే "మూర్ఖుడు " సైతం ఘనకార్యం సాధించగలడు.   కాని "వివేకి "  ప్రతి పనినీ తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు.   ఏ పని అల్పమైనది కాదు.

🚩"విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే "నిష్ప్రయోజనం". మిణుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును, లోకానికి పంచాలని చూస్తుంది.     కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినపుడే ప్రయోజనం,సార్ధకత.

🚩ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే... ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.

🚩జననం-మరణం, మంచి-చెడు, జ్ఞానం-అజ్ఞానం, వీటి మిశ్రమాన్నే మాయ అంటారు. ఈ వలలో అనంత కాలం ఆనందం కోరుకుంటూ చరించవచ్చు.

🚩"జీవితం" పోరాటాల,భ్రమల పరంపర.       జీవిత అంతరార్ధం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా "నేర్చుకోవడం"  లోనే ఇమిడి ఉంది.

🚩విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది.     అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను "తేజోమయు" లను చేస్తుంది.

🚩"టన్ను"  శాస్త్రజ్ఞానం కన్నా "ఔన్స్ "  అనుభవం గొప్పది.

🚩డబ్బులో" శక్తి"  లేదు. కానీ మంచితనంలో, పవిత్రతలో శక్తి ఉంటుంది.

🚩" చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు.

🚩"విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు.     నాకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.

🚩"విజ్ఞానం"  అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. "అనంత విజ్ఞానం" సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం. మిణుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును, లోకానికి పంచాలని చూస్తుంది.      కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినపుడే ప్రయోజనం,సార్ధకత.

🚩అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు.     చిత్తశుద్ది, పట్టుదల, ఓర్పు.  ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం.       కానీ ప్రేమ ఈ మూడింటి కన్నా "ఆవశ్యకం".

🚩"స్వార్ధం".  లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి "గొప్పనీతి." స్వార్ధంతో నిండిన ప్రతి పని "గమ్యాన్ని" చేరడానికి అంతరాయం  కలిగిస్తుంది.

🚩"సిరి సంపదలు" మంచితనాన్ని తీసుకురావు.   మంచితనం మాత్రం అభిమానాన్ని,దీవెనలను తీసుకువస్తుంది.

🚩"నిరంతరం   వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి "ఓటమి" భయపడుతుంది.

🚩"భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమే విజ్ఞానం.

🚩మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది "విద్య".

🚩మానవునికి అహంకారం తగదు ,ఈ దుర్గుణాన్ని విడిచి వినయమనే "సుగుణ సంపద" ను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది.   వినయం మనిషికి "భూషణం" వంటిది.

🚩"సహాయం" అందుతుందనీ భావించేవారు మాత్రమే పని చేయ గలరు, "ప్రత్యక్షంగా".  వారు కార్యరంగంలో ఉన్నారు గనుక.

🚩"దూరదృష్టి" తో ఆలోచించే ప్రతి వ్యక్తీ తప్పకుండా అపార్ధం చేసుకోబడతాడు.

🚩ఇతరులపై ఆనుకొనిన వ్యక్తీ సత్యమనే భగవంతున్ని సేవించ లేడు.

🚩పాశ్చాత్య దేశాల అద్భుతమైన జాతీయ జీవిత కట్టడాలు "శీలం" అనే పటిష్టమైన స్తంభాలను ఆధారం చేసుకొని నిర్మితమైనాయి.

🚩"నాగరికత"  అనే వ్యాధి ఉన్నంతవరకు "పేదరికం"  తాండవించి తీరుతుంది.   అందుకే సహాయం అవసరమై ఉంది.

🚩పాశ్చాత్య ప్రపంచం ధన పిశాచాల నిరంకుశత్వానికి గురియై మూలుగుతుంది.           ప్రాచ్య ప్రపంచం పురోహితుల నిరంకుశత్వంతో ఆర్తనాదం చేస్తుంది.

🚩ప్రతి వ్యక్తీ దేశము మహత్వం పొందగలిగితే మూడు విషయాలు ఆవస్యకములై ఉన్నాయి.1.సజ్జనత్వపు శక్తి గురించిన ధృడ విశ్వాసం. 2.అసూయ,అనుమానాల రాహిత్యం 3.సజ్జనులుగా మెలగాలనీ,మంచి చేయాలని ప్రయత్నించే యావన్మందికి సహాయపడడం.

🚩"భారతదేశ పతనానికి కారణం ప్రాచీనులు ఏర్పాటు చేసిన శాసనాలు,సంప్రదాయాలు చెడ్డవి కావడం కాదు. సంపూర్ణ పరిశీలన పొంది సక్రమంగా సిద్ధాంతాలు కావడానికి వాటికి అవకాశం లభించకపోవడమే.

🚩మనం బయటికిపోయి మన అనుభవాలు ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకొనక పోవడం, మన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించకుండా ఉండడం, మన బుద్ది భ్రష్టమై పోవడానికి గొప్ప కారణం.

🚩ఇతర దేశాలలో ప్రగల్భలాడేవారు చాలా మంది ఉన్నారు.       .కాని మతానుష్ఠాన పరులైనవారు, ఆధ్యాత్మికతను తమ జీవితాల్లో చాటి చూపిన వారిని ఇక్కడే, ఈ దేశంలో మాత్రమే చూడవచ్చు.

🚩"అపజయాలను" లక్ష్య పెట్టకండి,అవి వాటిల్లడం సహజం, అవి జీవితానికి అందం చేకూరుస్తాయి.

🚩అపజయాలచే నిరుత్సాహం చెందకండి. "ఆదర్శాన్ని "  చేగొని వేయిసార్లు ప్రయత్నించండి. వేయి సార్లు ఓటమి చవిచూస్తే కూడా ఇంకోసారి ప్రయత్నించండి.

🚩బలహీనతకు పరిష్కారం దానిని గురించి" చింతన" చెందడం కానే కాదు. బలాన్ని గురించి ఆలోచించడమే.    అందుకు ప్రతిక్రియ మనుష్యులలో నిబిడీ కృతమైవున్న "బలాన్ని" గూర్చి వారికి బోధించండి.

🚩"ఆత్మవిశ్వాసాన్ని" గూర్చి నేర్చి దానిని ఆచరణలో చూపించి ఉంటే, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అనర్ధాలు,దుఃఖాలు దాదాపు మటుమాయమై పోయేవి.

🚩మానవ చరిత్రనంతటినీ పరికిస్తే, ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువగా సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి "ఆత్మ విశ్వాసమే"  అని తెలుస్తుంది.    తాము ఘనులమనే విస్వాసంతో వారు జన్మించారు, ఘనులే అయ్యారు.

🚩"ఒక మనిషికి మరొక మనిషికీ మధ్య గల తారతమ్యం ఆత్మవిశ్వాసం ఉండడం, ఆత్మ విశ్వాసం లేకపోవడం, అనే భేదం వలన కలుగుతుందని మనం గుర్తించవచ్చు.

🚩"సంకల్పనశక్తి"  తక్కిన శక్తులన్నిటికన్నా బలవత్తరమైనది.   అది సాక్షాత్తు భగవంతుని వద్ద నుండి వచ్చేది కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవలసిందే.    నిర్మలం,బలిష్ఠం అయిన సంకల్పం సర్వశక్తివంతమైనవి.

🚩"ఆత్మవిశ్వాసపరు"లైన కొందరు వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర.        ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని బహిర్గతం చేస్తుంది.

🚩"స్వార్ధరాహిత్యమే" విశేష లాభదాయకం.    కాని దానిని అలవరచుకొనే "ఓర్పు" జనానికి లేదు.

🚩"ఇతరులకు మేలు చేయాలనే నిరంతర ప్రయత్నంచే మనలను మనం మరచి పోవడానికి ప్రయత్నిస్తున్నాం.    ఇలా మనలను మనము మరచిపోవడమే జీవితంలో గొప్ప గుణపాఠం.

🚩"అవివేకంతో".  మనిషి తనను తాను ఆనందమయుణ్ణిగా చేసుకోగలనని భావిస్తాడు.     కాని అనేక సంవత్సరాలు కొట్టూమిట్టాడి స్వార్ధపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదేగాని ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు.

🚩జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకో.      ప్రకృతే బలవంతముగా నీ చేత త్యాగం చేయిస్తుంది. కనుక ఇష్టపూర్వకంగానే ఇచ్చివేయి.

🚩"ఏది స్వార్ధపరమో అదే అవినీతి, స్వార్ధరహితమైనదేదో అదే "నీతి."

🚩పవిత్రంగా ఉంటూ ఇతరులకి మేలుచేయడమే పూజలన్నింటి "సారం."

🚩"దుస్థితిలో ఉన్నవారి కోసం పరితపించి సహాయానికై ఎదురు చూస్తే,అది వచ్చే తీరుతుంది.

🚩ఈ జీవితం క్షణికమైనది,లోకంలోని ఆడంబరాలు    క్షణ భంగురాలు.      కాని ఇతరుల నిమిత్తం జీవించే వారు మాత్రమే శాశ్వతంగా జీవిస్తారు. తక్కినవారు జీవచ్ఛవాలు.

🚩"నాయనా! ప్రేమ ఎన్నటికి అపజయం పొందదు;నేడో,రేపో లేదా యుగాల తదనంతరమో సత్యం జయించే తీరుతుంది.      ప్రేమ విజయాన్ని సాధిస్తుంది.

🚩నా సోదరులారా! మనం పేదలం,అనామకులం.     కాని అత్యున్నత స్థితిలోని వారికి సదా అవే పరికరాలైనాయి.

🚩"అసత్యం" కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది,మంచితనం కూడా అంతే.

🚩"వ్యాకోచమే" జీవనం,సంకోచమే మరణం. యావత్తు ప్రేమ వ్యాకోచం, యావత్తు స్వార్ధం సంకోచం.కనుక ప్రేమ మాత్రామే ఏకైక "జీవన ధర్మం".

🚩అనేకుల హితం కోసం సర్వుల సంక్షేమం కోసమూ లోకంలోని అతి సాహసవంతులూ, సర్వోత్తములూ త్యాగం చేయాలి. 

🚩"అనంత ప్రేమ"  కరుణ గల వందల కొద్దీ బుద్దులు అవసరమై ఉన్నారు.

🚩లోకానికి కావలసింది శీలం.       ఎవరి జీవితం ప్రజ్వలించే ప్రేమతో, నిస్వార్ధమయమై ఉంటుందో అలాంటివారే లోకానికి అవసరం.     ఆ ప్రేమ వారు ప్రతి పదాన్ని పిడుగులా ధ్వనింప చేస్తుంది.

🚩మతం సిద్ధంతాలలోనూ, రాద్ధాంతాలలోనూ, ప్రజ్ఞావాదాలలోనూ లేదు. మతం అంటే మన స్థితి, మన పరిణతే. మతమంటే సాక్షాత్కారానుభవమే.

🚩మనుష్యుడు జన్మించినది ప్రకృతి జయించడానికి మాత్రమే కాని దానిని అనుసరించడానికి కాదు.

🚩"ఈ ప్రపంచం ఒక పెద్ద గారడీశాల.    మన మిచ్చటికి రావడం మనల్ని బలిష్ఠులుగా చేసుకోవడానికే.

🚩" సత్యానికై దేనినైనా సరే త్యజించవచ్చు, కానీ దేనికొరకైనా "సత్యాన్ని" త్యజించకూడదు.

🚩"మానవుడికి మరణం లేదు, జననమూ లేదూ, దేహాలు నశిస్తాయి.కాని అతనికి మరణం లేదు.

🚩మృగత్వం,మానవత్వం,   దివ్యత్వం-ఈ మూడు కలిస్తేనే మానవుడవుతాడు.

🚩"గులాబి పువ్వు" తన పరిమళాన్ని గుబాళించేటట్లు,నువ్వు దానం చేయి. ఇస్తున్నాననే "స్ప్రుహ" లేకయే ఇవ్వటం దాని ధర్మం.
లోపాలను బట్టి మానవుణ్ణి నిర్ణయించవచ్చు.

🚩"ప్రకృతిని ప్రేమించు,అందాన్ని ఆస్వాదించు,మంచిని ప్రోత్సహించు,విజ్ఞానానికిచేయుతనివ్వు..

🚩"పనిని సాధించడానికి సాధనలపై గురి ఏర్పరచుకోవలన్నదే   నేను జీవితంలో నేర్చుకున్న అతిగొప్ప పాఠం.

🚩"ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగి పోతాయి.

🚩"మానసికంగా బలహీనులైనవారే తప్పులు చేస్తారు.   ఈ బలహీనత అనేది వారివారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు.

🚩"ధీరులు" సత్యమార్గాన్ని ఎప్పుడూ తప్పరు.

🚩ముందు స్వచ్ఛంగా ఉండు, అప్పుడు అధికారం వస్తుంది.

🚩"అనుభవాల క్రమమే జీవితం.     అనుభవమే గురువు..

🚩"అవివేకం మనల్ని మందలిస్తుంది     .జ్ఞానం మనల్ని అందులోంచి విడిపిస్తుంది.

🚩"నన్ను తాకవద్దు అనడం ఓ మానసిక వ్యాధి,    వ్యాప్తియే జీవనం, సంకుచితమే మరణం, ప్రేమ ద్వారా అందరిని నీలో ఇముడ్చుకో.

🚩మతం ఒకరకంగా గొప్ప అనుభవమని మనం మర్చిపోకూడదు.

🚩జీవితానుభవానికి చదువు బాలికల్లో ప్రభావం చూపడం లేదనే భావన ఇప్పటికి అలానే వుంది.

🚩"ఆత్మను గురించి తెలియకుండా దేవుణ్ణి గురించీ తెలుసుకోలేమని మన పురాతన గ్రంథాల భాష్యం.

🚩"ఆత్మవిశ్వాసం" సడలితే ఓటమి ప్రారంభమైనట్లే.

🚩"ఆలోచనలు" జీవిస్తాయి,సుదూరం ప్రయాణం చేస్తాయి.

🚩"నీ ఆశయ సాధనలో వెయ్యిసార్లు విఫలం చెందినా ప్రయత్నం విరమించకు.

🚩"ప్రేమ,కోపం ఒకదాని కొకటి వ్యతిరేకం.

🚩"ఐశ్వర్యానికి తమ్ముడు "అహంకారం".

🚩"చెడు తలచేవారు,కీడు తలపెట్టేవారు ప్రశాంతత కోల్పోతారు. వెలుగు చూడరు.

🚩"అదృష్టవంతుని" కి జాగ్రత్త తోడైతే ఎడారిని కూడా స్వర్గతుల్యం చేయగలడు.

🚩"గొప్ప కార్యాలెప్పుడు గొప్ప త్యాగాలవల్లే సాధించబడతాయి.

🚩"ఈ లోకాన్ని ఏ ఇద్దరు ఒకే మాదిరిగా చూడరు.

🚩"దానం" చేయడం మన భాగ్యం.    అది తెలుసుకోవడం వలనే మనం అభివృద్ది చెందుతున్నాం.

🚩దేవుడొక్కడే,   మనుషులు వేర్వేరు పేర్లతో పిలుస్తారు.

🚩"తమ మనుగడకై ఇతర దేశాలపై అధారపడే దేశాలు పతనం కాక తప్పదు.

🚩మనిషైనా,జాతైనా ఇతరులను ద్వేషించి జీవించలేదు.

🚩పొందాలనే కాంక్ష స్వార్ధం,   స్వార్ధం దురవస్థకు దారి తీస్తుంది.

🚩"ధ్యానం " మన ఊహను రూపొదించుకోవడం వల్ల సాధ్యమవుతుంది.

🚩ఇంతకు ముందుకంటే ప్రపంచం నేడు "జ్ఞానసముపార్జన" లో మరింత ఐక్యమత్యంతో వుంది.

🚩"నాటకం "అన్ని కళలలోకి కష్టతరమైంది.

🚩"గుడ్డిగా నమ్మడం పెద్ద తప్పిదం.

🚩"ఆధునిక ప్రపంచం" లో పనిని గురించి మాట్లాడినంతగా ఆలోచనల్ని గురించి మాట్లాడటం లేదు.

🚩"బద్దకమే" అసలు పాపం, అదే పేదరికానికి కారణం.

🚩"స్వర్గం" లో జీవించడానికి, ఈ ప్రపంచంలో జీవించడానికి తేడా లేదు.

🚩మూర్ఖులకు సెలవు దినం సోమరితనం, మన పేదరికానికి అసలు మూలం" సోమరితనం".

🚩వైవిద్యమే జీవితపు ఆత్మ.

🚩ధనం శక్తి కాదు.     మంచితనమే శక్తి.

🚩పరిస్థితులకు ఆత్మ, ప్రజలకు మత్తు మందు, భౌతికంగా అనారోగ్యవంతుడికి ఏ మతము అంగీకారం కాదు.

🚩మనం జీవితంలోనూ,అదృష్టంలోనూ,   మతంలో కూడా వ్యాపారస్తులమే.

🚩"మనల్ని కౄరులు గా మార్చేది మతమే, అత్యంత" సాత్వికులు"గా మార్చేది మతమే.

🚩ప్రపంచంలో కోర్కెలే లేని "మూర్ఖులు" ఉంటారు.    దానికి కారణం వాళ్ల మెదడు లోభభూయిష్టం కావడమే.

🚩"నిరుపేదల కష్టాలను చూచీ ద్రవించే హృదయం కలవాడే "మహాత్ముడు".

🚩"ప్రతి జాతి,ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు తమ మోక్షసిద్ధికి తామే ప్రయత్నించాలి.

🚩"చాలా మందికి మోక్షం కావాలా అంటే అవునంటారు. కాని కొందరే పొందగలరు.

🚩"మనం గ్రహించాల్సింది సమాజానికి మోక్షం లభించనిదే వ్యక్తిగా మోక్షం కలుగదు.

🚩"జీవితపు రహస్యం" సంతోషం కాదు. అనుభవం ద్వారా విద్య.

🚩"చరిత్ర మొదలైనప్పటి నుండి మనిషి రక్షణ కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు.

🚩"ధనం,సంపాదన తప్పనిసరిగా సామాన్య ప్రజల పేదరికాన్ని తగ్గిస్తాయి.

🚩"మనిషి లక్ష్యం" న్యాయం కంటే మించినది.

🚩వికాసానికి కారణం? కోరిక.

🚩"విచక్షణ"  కంటే భావావేశం గొప్పది. అయితే "భావావేశం" విచక్షణకు విరుద్ధంగా ఉండకూడదు.

🚩"మన అదృష్టానికి మనమే కర్తలం."

🚩"మొత్తం "ప్రపంచ సంపద "కంటే మానవులే విలువైనవారు.

🚩"నాగరకుడి" వివేచనతో పని చేయడానికి  "విశ్రాంతి" అవసరం.

🚩"ఈ దేశానికి వీరుల అవసరం వుంది.      .అందుకే మీరు వీరులుకండి.

🚩"పరతత్వాన్ని" దాన్ని గూర్చి చెప్పే తత్వశాస్త్రమే "వేదాంతం".

🚩"ప్రతి విజ్ఞాన శాస్త్రానికి దాని విధానం దాని కుంది.

🚩"మనం సంతోషపడే విషయాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి.

🚩" ప్రతి మానవజీవికి అనంతమైన సంతోష భావన వుంటుంది.

🚩" మతానికి కులం లేదు,కులం ఒక "సామాజిక వ్యవస్థ".

🚩"సత్యాన్ని,స్వచ్ఛతను, అదృష్టాన్ని నాశనం చేయలేము.

🚩"మానవుడు స్వార్ధపు మోపు.

🚩"సముద్రం లోతు, ఆకాశమంత వైశాల్యం.    అలాంటి హృదయమే కావాలి.

🚩"మాటలలో నీ శక్తి వ్యయపరచవద్దు...నిశ్శబ్దంగా ధ్యానం చేయి.

🚩"నాయకుడు శీలవంతుడు కాకపొతే అనుచరులు విధేయులు కావడం సాధ్యం, కాదు.    నాయకుని శీలం పవిత్రమైనకొద్దీ 
అనుచరులు విశ్వాసం,విధేయత పెంపొందుతాయి.

🚩సర్వ దేవతలకన్నా మానవుడు అధికుడు, మానవునికన్నా అధికులెవ్వరు లేరు

🚩"పరిస్థితులు" మనిషి అదుపులో వుండవు కాని అతని ప్రవర్తన అతని ఆధీనములోనే వుంటుంది.

🚩"ప్రతి మనిషిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది.

🚩"గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి , ప్రయత్నం రాజీలేని ధోరణిలో సాగాలి అపుడే "విజయం" మనదవుతుంది.

🚩"మానవునిలోని పరిపూర్ణతను వ్యక్తపరచడమే విద్య, అతనిలో దివ్యత్వాన్ని వ్యక్తపరచడమే" మతము."

🚩వివేకవంతుడు ఎప్పుడూ వర్తమానములోనే జీవిస్తాడు.

🚩జీవితము చిన్నది ధైర్యముగా పోరాడు, ఉదాత్తమైన లక్ష్యం కోసం దానిని" త్యాగం" చేయడానికి వెనుకాడకు.

🚩"ప్రతి జీవిలోనూ దివ్యత్వం గర్భితంగా వుంది.     అంతర్గతముగా ఉన్న ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి.

🚩"ఇనుప కండరాలు, ఉక్కు నరాలతో ఎదిగిన మనిషికే "వజ్రసంకల్పం" సాధ్యపడుతుంది.

🚩"లేవండి, మేల్కొనండి గమ్యం చేరేంత వరకు విశ్రమించకండి.

🚩"ఓర్పు, ప్రేమ, నిజాయితి మన అస్త్రసస్త్రాలైనప్పుడు ఈ ప్రపంచములో ఏ శక్తి మనలను అడ్డుకోలేదు.

🚩"మన దేహాన్ని కాని మన మనసును కాని బలహీన పరిచే ఎంతటి కోరికలైనా నిర్ద్వందముగా త్యాగము చేయాలి.

🚩" ఎక్కడెక్కడ పోరాటం , తిరుగుబాటు ఉద్భావిస్తాయో అక్కడే జీవముంది, సత్యముంది, చైతన్యముంది.    ప్రతీ గొప్పకార్యము 
అవహేళన, ప్రతిఘటన ఆ తరువాత అంగీకారము అనే మూడు మజిలీల గుండా సాగిపోతుంది.

🚩"ఈ ప్రపంచములో మన ఘనత మూన్నాళ్ళ ముచ్చటే ... సంపదలు, కీర్తిప్రతిష్టలు నశించిపోయేవే.    పరుల కోసం జీవించేవారే మనుషులు, మిగిలినవారంతా జీవన్మ్రుతులు.

🚩"ప్రస్తుతం మనం శరీరాన్నే నేను అనుకుంటున్నాము.    ఈ శరీర స్పృహ అధికంగా ఉన్నంత వరకు ధ్యానం, ఏకాగ్రతలు సాధ్యం కావు. కాబట్టి ప్రస్తుతం మన పూర్తి పోరాటం శరీరంతోనే.

🚩"శ్రీ రామకృష్ణుల సందేశం దేశమంతా వ్యాప్తి చెందిననాడే భారతదేశం ఉన్నత స్థితికి చేరుకోగలదు.

🚩"మానవ చరిత్ర" నంతటిని పరికిస్తే ఘనకార్యాలు చేసినవారి జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువ సామర్ధ్యమిచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే. మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడా ఆత్మవిశ్వాసమే, ఆత్మవిశ్వాసం అన్నింటిని సాధించగలదు.

🚩"అసహాయత నుండి ఆధారపడే ధోరణిలో నుంచి స్త్రీలు బయటపడాలి.    ఏ చిన్న కష్టం వచ్చినా ఒదిగిపోయి భోరున విలపించేదుకు మరో ఒడి కోసం ఎదురు చూడటం మానుకోవాలి . మానసికంగా శక్తిమంతులై ఎంతటి" విపత్కర పరిస్తితు" లైనా ఒంటరిగా ఎదుర్కోవాలి.

🚩"పరాక్రమం, పోరాటతత్వం,  పురుషుల సొంతమనే భ్రమలనుంచి బయటపడాలి.     ఆ కోణంలోను తమకు అడుగుజాడలను పరచిన ఝాన్సీరాణి, రుద్రమ దేవి వంటి నారీమణులను ఆదర్శంగా తీసుకోవాలి.

🚩"ఏ పనినైనా సాదించాలంటే దీక్ష,పట్టుదలతో పాటు ధ్దృడసంకల్పం అత్యావశ్యకం . నేని సముద్రాన్ని ఔపాసన పట్టేస్తాను , నేని కొండలను పిండి పిండి చేస్తాను అంటాడు. పట్టుదల గల వ్యక్తి. అలాంటి వాళ్ళు ఏ లక్ష్యాన్ని అయినా సాధించగలుగుతారు.

🚩"నీకు మంచి జరగాలని కోరుకున్నట్లే ఇతరులకు కూడా మంచి జరగాలని కోరుకో.

🚩"ఇతరుల కోసం మనం తీసుకునే అత్యల్పమైన శ్రమ మనలో ఉన్న శక్తిని తట్టి లేపుతుంది.    ఇతరుల శ్రేయస్సును గురించి ఏ కొంచెం ఆలోచించినా కూడా అది సింహానికి సమమైన శక్తిని మన హృదయానికి క్రమక్రమముగా ఇస్తుంది.

🚩'"మనసా వాచా కర్మణా పవిత్రతను పాటించు.

🚩"భయమెరుగని సాహసంతో వ్యక్తి జీవించాలి.    మత సిద్ధాంతాలతో వ్యక్తి మనసు పాడుచేసుకోకూడదు.

🚩"ఆత్మ విశ్వాసం,దేవుని యందు విశ్వాసం ఇవియే ఔన్నత్యానికి కీలకం.

🚩"ఏది తొందరపడి చేయకూడదు. పవిత్రత,ఓర్పు,ఎడతెగని ప్రయత్నం ఈ మూడు విజయానికి సోపానాలు. వీటన్నింటి కన్నా మఖ్యమైంది ప్రేమ. అనంతమైన కలం నీ ముందు వుంది,   అనవసరమైన తొందరపాటు వద్దు.

🚩"పవిత్రత,సత్యసంధత నీలో నెలకొంటే అన్ని సవ్యంగా జరుగుతాయి. నీలాంటి వందల మంది మనకు కావాలి. వారు సమాజం మీదకు దూకి దానిని అదరగొట్టాలి.

🚩"ఎక్కడకు వెళ్ళినా నూతన జీవితాన్ని మహోన్నతమైన శక్తినీ అందించాలి.

🚩"ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం.
ఓర్పుతో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చెయ్యవచ్చు.

🚩"ఆత్మ సందర్శమునకు తోడ్పడని జ్ఞానం అజ్ఞానం.

🚩"చావు బతుకులు ఎక్కడో లేవు. బలంలో బతుకుంది, బలహీనతలో చావుంది.

🚩" మన గురించి మనం ఆలోచించుకోవడమే స్వార్ధం. అదే మహాపాపం.

🚩" నేను నరకానికి వెళ్ళడం వాళ్ళ నా సోదరులకు ఉపయోగం ఉంటుందంటే, నరకానికి వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నామని అనగలిగిన వాడే నిస్వార్ధపరుడు.

🚩"పేదల కోసం, పీడిత ప్రజల కోసం ఎవరి హృదయం ద్రవిస్తుందో వారే మహాత్ములు.

🚩"బీదలు,నిరక్షరాస్యులు,అమాయకులు,భాధ పీడితులు వీరిలో మనం భగవంతున్ని చూడగలగాలి. వీరి సేవయే భగవంతునికి ప్రియమైనది.

🚩"ఏ కార్యాన్ని సాధించాలన్న పవిత్రత, సహనం,పట్టుదల,ప్రేమ అవసరం.

🚩"ఒకటీ రెండు గ్రామాలకు చేసిన సేవ, అక్కడ తయారైన పదీ ఇరవైమంది కార్యకర్తలు ఇవి చాలు. అవే అన్నటికీ నాశనం కానీ బీజంగా ఏర్పడతాయి. వీటి నుంచే కాలక్రమేణా వేలకు వేలమంది ప్రజలు ప్రయోజనం పొందుతారు. మనకిప్పుడు వందలకొద్దీ నక్కలతో పని లేదు. సింహాలవంటి వాళ్లు ఆరుగురు చాలు. వారితోనే మహత్తరమైన పనుల్ని సాధించవచ్చు.

🚩"మీకు నచ్చిన పనిని మీరు బాగానే చేస్తారు. కానీ ప్రతి పనిని మీకు నచ్చేట్లు చేడమే విజయ రహస్యము.

🚩"మనమందరమూ కష్టపడి శ్రమించాలి.   మన కృషిపైన భావిభారత బాగ్యోదయం ఆధారపడి ఉంది.

🚩"బీదసాదల దుస్తితియే భారతదేశంలోని అన్ని అనర్ధాలకు మూలకారణం.    వారిని ఉద్ధరించడమే మన ప్రస్తుత కర్తవ్యం.

🚩"ఆకలితో అలమటిస్తున్న ఈ దేశ ప్రజలను హృదయపూర్వకంగా ప్రేమించిన నాడే "మన భారతదేశం" జాగృతమవుతుంది.

🚩"ప్రజలకు నాయకత్వం వహించేటప్పుడు వారికీ సేవకులలా మనం ప్రవర్తించాలి.     స్వార్ధాన్ని విడనాడి కృషి చేయాలి.

🚩"నువ్వు స్వార్ధరహితుడవైతే ఒక్క పారమార్ధిక గ్రంధాన్నైనా చదవకుండానే, ఒక్క దేవాలయాన్నైనా దర్శించకుండానే పరిపూర్ణుడవుతావు.

🚩" ప్రజల పట్ల వాత్సల్యాన్ని చూపించాలి.   పేదల సేవకన్నా మించిన భగవారాధన లేదు.

🚩"యువకులారా ! లెండి మేల్కొనండి! ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలుగెత్తి పిలుస్తుంది. ఉత్సాహ భరితులై రండి.

🚩" ఒక మనిషి శీలాన్ని తెలుసుకోవాలంటే అతడు చేసే అతి సాధారణమైన పనుల్ని చూడండి, అసాధారణమైన కార్యాలను కాదు.

🚩"ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి "ఆద్యాత్మిక విద్య" ఒక్కటే శరణ్యం.

🚩"నువ్వు భగవంతుని కోసం ఎక్కడ వెతుకుతున్నావు? పేదలు,దుఃఖితులు, బలహీనులు అందరు దైవాలు కాదా ముందుగా వారినెందుకు పూజించకూడదు.    గంగ తీరంలో బావి తవ్వడం ఎందుకు? ప్రేమకున్న అనంత శక్తిపై నమ్మకం ఉంచు.

🚩"పిరికివాడు"  మాత్రమే 'ఇది నా తలరాత' అని అనుకుంటాడు.

🚩" సిద్ధాంతాలు మతం కాదు. మంచిగా ఉంటూ మంచిని పెంచడమే మత సారాంశం.

🚩"యువకులారా! నా ఆశలన్నీ మీ మీదే ఉన్నాయి.    నా మాటను విశ్వసించే సాహసం మీకు ఉంటే మీ అందరికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంది.

🚩" ఈ లోకంలో సత్సాంగత్యం కంటే పవిత్రమైనది వేరొకటి లేదు.

🚩" సేవ చెయ్యి,ఏ స్వల్పమైనా ఇవ్వు, కాని బేరమాడ వద్దు.

🚩" ఎట్టి పరిస్థితులలోను నీవు శారీరకంగా కాని, మానసికంగా కాని, నైతికంగా కాని లేక ఆధ్యాత్మికంగా కాని బలహీనుడవు కాబోకు.

🚩"నీవు సదా విగ్రహమే దేవుడని భావించవచ్చు. కానీ దేవుడు విగ్రహమనే భ్రాంతి విడవాలి.

🚩" మహిళల స్థితి గతులను మెరుగు పరచకుండా ప్రపంచ సంక్షేమానికి ఎలాంటి ఆస్కారము లేదు.   పక్షి ఒక్క రెక్కతో ఎగరడం సాధ్యం కాదు.

🚩"ఏదీ కోరని వారే ప్రకృతిని జయించినవారు.

🚩"ప్రయత్నం చేయని వాడి కంటే పాటు పడేవాడు ఉత్తముడు.

🚩"తన సంతానంలో ఏ ఒకరినైనా సేవించు అధికారమును భగవంతుడు నీకు ప్రసాదించినచో నిజంగా నీవు ధన్యుడవే. ఇతరులకు లేని సేవాభాగ్యం నీకు కలుగుట చేత ధన్యుడవైతివి. ఈ సేవనే ఆరాధనముగా భావించు.

🚩"నీ పురోభివృద్ధి కోసం, ఈ ప్రపంచం అనే ఒక వ్యాయామశాలను కల్పించినందుకు భగవంతున్ని కొనియాడు. నువ్వు ఈ ప్రపంచానికి సహాయం చేయగలనని ఎన్నడూ తలంచవద్దు.

🚩"స్వార్ధ చింతన లేనప్పుడే మనం ఘనకార్యాలు సాధిస్తాం. మన ప్రభావం ఇతరులపై పడుతుంది
.
🚩"పుణ్యపురుషులు ఇతరుల కొరకే జీవిస్తారు. జ్ఞానులు ఇతరుల కొరకు తమ జీవితాన్నే అంకితమిస్తారు.

🚩" త్యాగమూ, సేవ భారతదేశ ఆదర్శములు.   వీటిని పటుతరం చేస్తే అంతా బాగుంటుంది.

🚩"మానవుణ్ణి అధ్యయనం చేయి, అతడే సజీవ కావ్యం.

🚩"మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే ఆత్మగౌరవం.

🚩" ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీకు ఈ లోకంలో అసాధ్యమేమి లేదు.

🚩" పలువురి హితం కోసం అందరి సుఖం కోసం ఈ లోకంలో ధైర్య స్తైర్యాలు మెండుగా కలవారు తమను త్యాగం చేసుకునే తీరాలి. ఎప్పటికి తరగని శాశ్వతమైన ప్రేమ,కరుణాకటాక్షాలు కలిగిన బద్ధులు నేటికి అవసరం.

🚩'విముక్తి' అనే భావన ఎల్లప్పుడూ ఎవరి యందు జాగ్ర్రుతమై ఉన్నదో, వాడే విముక్తిని పొందుతాడు.

🚩" ఆర్ధిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి.

🚩" జీవితం ఒక సంగ్రామం, కాని దానిని జయించుటకొక వ్యూహం కావలెను.    దాని రూపకల్పన స్థాయిని అందవలెను. అదియు కౌమారమునందే. సందేహమెల? భావి జగజ్జేతావు నీవే.

🚩 "చర్చ విజ్ఞానాన్ని పెంచుతుంది. వాదన అజ్ఞానాన్ని సూచిస్తుంది.

🚩"నిజాయితీ, ప్రేమ,ఓర్పు,మన అస్త్రశస్త్రాలైనపుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మనను అడ్డుకోలేదు.

🚩" ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే...ఏ ఆదర్శమూ లేని మనిషి యాభైవేల తప్పులు చేస్తాడు.

🚩"మనిషన్నవాడు ఏ మంచి పని చేయాలన్న కృషి అవసరం. ఎందుకంటే రాపిడి లేకుంటే వజ్రం మెరుస్తుందా? అలజడి లేకుండా సముద్రం పలుకదు.   కదలిక లేకుండా గుండె బతకదు.

🚩"మీ శక్తిని మాట్లాడడంలో వృధా చేయకుండా మౌనంగా ధ్యానం చేయండి. బయటి ఒరవడి మీలో ఎటువంటి అలజడిని కలిగించకుండా చూసుకోండి.    మీ మనసు అత్యున్నత స్థితిలో ఉన్నపుడు మీకు దాని స్పృహ ఉండదు.    ఆ నిశ్శబ్దపు ప్రశాంతతలో శక్తిని మరింతగా నిలువ చేసుకోండి.      ఒక ఆధ్యాత్మిక శక్తి కనుక యంత్రంగా తయారుకండి.

🚩"ఉత్సాహవంతులైన యువకులు తమ జీవితాన్ని దేశ సంక్షేమం కోసం అంకితం చేయాలని మనమందరం భావిస్తాం. ఐతే ముందుగా వాళ్లకో జీవితాన్ని అందివ్వాల్సిన భాధ్యత కూడా మనందరి పైనే ఉంటుంది.

🚩" విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు. అపజయం "తుది మెట్టు" కాదు.

🚩"స్వయంకృషి,    పట్టుదల,ధృడ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి.

🇮🇳 ప్రేరణాత్మక వ్యాఖ్యలు 🇮🇳

🚩"బలంతో, ధైర్యంతో, భాద్యతతో పోరాడడం నేర్చుకో...నీ విధికి నీవే విధాతవని తెలుసుకో.

🚩"సర్వ సన్నద్ధులైన యువకులు నేడు కావాలి.

🚩"వివేకం మనిషికి మాత్రమే గల గొప్ప వరం. మనసును స్వాధీనంలో ఉంచుకుని బుద్దితో వివేకము తో ,ముందుకు నడిచేవాడు మహాత్ముడు. సమర్ధుడు అవుతాడు. జీవితంలో విజయాన్ని సాధించ గలుగుతాడు. మనసును స్వాధీనంలో ఉంచుకోని వ్యక్తికీ పతనం తప్పదు.

🚩"రోజా పుష్పం కింద ముల్లున్నాయని దిగులు వద్దు. ముళ్లపై పూలు వికసించాయని తెలుసుకో.      అలాగే మనం విజయం సాధించాలంటే కష్టనష్టాలుంటాయి. వాటిని అధిగామిస్తేనే మనం విజయం సాధించగలం.

🚩"గమ్యం పట్ల ఎంత శ్రద్ద వహిస్తామో, ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్లే మార్గం పట్ల కూడా అంతే శ్రద్ద వహించాలి.

🇮🇳 భక్తి గురించి 🇮🇳

🚩"భక్తి సముద్రంలో మునిగినప్పుడు ఈ ప్రపంచం మరొక నీటి బిందువులా కనిపిస్తుంది.

🇮🇳 దేశం గురించి 🇮🇳

🚩"దేశభక్తి" అంటే కేవలం మాతృదేశాన్ని ప్రేమించడమే కాదు. తోటి మానవులకు సాయం అందించడం.

🇮🇳 వ్యక్తుల గురించి 🇮🇳

🚩"కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు.   కాని, ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు.

🚩" విలువైన వస్తువు విలువైన వారి దగ్గర ఉంటే దానికి మరింత విలువ పెరుగుతుంది.

🇮🇳 విద్య గురించి 🇮🇳

🚩"విద్య" మనిషి జీవితానికి వెలుగునిస్తుంది.   మనిషి వికాసానికి, నడవడికి తోడ్పడుతుంది

.---"స్వామి వివేకానంద"-
ఇచ్చిన సందేశములనుండి,. సేకరించడమైనది. మన Impact సభ్యులకు గాను
🙏🙏🙏🙏🙏🙏

గ్రూప్ లోని అందరూ తప్పక చదవాల్సిన మెసేజ్ ఇది..

 🍃🪷 గ్రూప్ లోని అందరూ తప్పక చదవాల్సిన మెసేజ్ ఇది..

ఒక ఊర్లో పదో తరగతి మిత్రులు, ఓ 80 మంది కలిసి చదువుకున్నారు. కొందరు పై చదువులకని, కొందరు బతుకు బాటను వెతుక్కుంటూ బయటి దేశానికి వలసకనీ , కొందరు ఊళ్ళోనే తోచిన పని చేసుకుంటూ ,  కొందరు పక్కనున్న పట్టణంలో చిన్నదో, పెద్దదో వ్యాపారం చేసుకుంటూ గడపసాగారు..గడప దాటారు.  ఓ పది సంవత్సరాలు గడిచిపోయాయి..

ఇంతలో 'WHAT's App" లేదా మరో   యాప్ వచ్చింది. ఒక మిత్రుడు అందరం రోజూ పలకరించుకుందాం, సాధకా బాధకాలు చెబుకుందాం అనే ఉద్దేశ్యంతో.. ఓ గ్రూపు Creat చేసాడు. కొద్దిరోజుల్లోనే... 80 మందిలో.. 60 మంది నెంబర్ లు దొరకబట్టి... గ్రూపులో add చేశారు..
చిన్ననాటి మిత్రులే గాని, ఇప్పుడే కొత్తగా పరిచయం అయిన వ్యక్తుల వలె.. ఎంతో ఉత్సాహంతో పలుకరించుకునే వాళ్ళు. ఎవరెవరు.. ఏమేం పనులు చేస్తున్నారో.... ఎక్కడెక్కడ ఉన్నారో.. పెళ్లి.. పిల్లల విషయం... ఒకటేమిటి... సర్వం సంభాషించుకునే వాళ్ళు..
మళ్ళీ పాత రోజులు గురుతు చేసుకుంటూ... మంచి మంచి సూక్తులు.. శాత్రాలు, పంచులు, జోకులు వేసుకుంటూ ఎంతో సంబర పడిపోయేవారు. అందరూ అడ్మిన్ లే !

ఇలా ఎంతో జోష్ గా గ్రూప్ నడుస్తుంది. ఒక రోజు open చేయక పోతే.. వందల సంఖ్యలో Unread మెసేజ్ లు ఉండేవి.  గ్రూపు పుణ్యానా... ఒకనాడు అందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనం (Get Together/ Reunion) కూడా ఏర్పాటు చేసుకున్నారు..రోజులు గడవసాగాయి. 

ఒకనాడు, గ్రూపులో ఓ మిత్రుడు... "Good Morning" మెస్సేజ్ పెట్టాడు.
ఇంకో మిత్రుడు కలుగజేసుకొని "ఎందుకురా ఈ పనికి రాని మెస్సేజ్? ఏదైనా పనికి వచ్చే మెసేజ్ పెట్టండి. Good Morning , Good Night లతో ఒరిగేది ఏం లేదు" అని అన్నాడు..
ఇక అయోమయంలో, ఏమెసేజ్ పెట్టాలో తెలియక... ఆ Good Morng చెప్పిన మిత్రుడు... మళ్ళీ ఏనాడూ మెస్సేజ్ చేయలేదు..

ఒకనాడు... ఆ ఊళ్ళో జరిగిన ఓ దొంగతనం గురించి... తీవ్రంగా చర్చ నడుస్తున్న సమయంలో... ఒక మిత్రుడు... తాను చూసే సినిమా టాకీస్ తో పాటు, పోస్టర్ తో దిగిన ఫోటో ఒకటి , ఈ గ్రూపులో షేర్ చేసాడు..

"అరేయ్.. మేము ఇంత తీవ్రంగా చర్చ నడిపిస్తే... మధ్యలో నీ సోది ఏంది రా?? ఏదైనా పనికి వచ్చే పోస్ట్ పెట్టు" అని అనగానే....
ఏ పోస్ట్ , ఎప్పుడు పెట్టాలో అర్థం కాకపోవడంతో..మరొక్కమారు అతను... గ్రూపులో ఏ పోస్ట్ పెట్టలేదు.
'ఒకతనను..మంచి మసాలా వేసి వండిన.... 'సాంబారు' తో పోస్ట్ చేసాడు.
'ఎప్పుడూ.. తిండి విషయలేనా?? ఏదైనా పనికి వచ్చే పోస్ట్ చేయమన్నారు' ఇంకొకరు..

ఆ సాంబార్ పోస్ట్ వ్యక్తి వెంటనే గ్రూపు నుండి Left అయ్యాడు..
ఓసారి దేశ, రాష్ట్ర రాజకీయాలు మీద వాదోపవాదాలు నడుస్తున్నాయి.
"మా పార్టీ ఇది చేసింది, అది చేసింది"  అని తీవ్రంగా వాదించుకుంటున్నారు. 
ఎదురుగా ఉంటే.. కొట్టుకునే వాళ్లే!!
ఇంతలో మధ్యలో.. ఒక మిత్రుడు...  ఓ "అమ్మాయి ఫోటోలో.. 'ఫోన్ నెంబర్ కావాలా??" అని రాసి ఉన్న ఫొటో పెట్టాడు..

ఆ ఇద్దరు "రాజకీయ మేధావులకు".. ఎక్కడో కాలింది.  ఇద్దరు కలిసి.. ఈ మిత్రున్ని తిట్టారు. ఏదైనా.. పనికి వచ్చే..  పోస్ట్ పెట్టమన్నారు.
అంతే.. మరోమారు.. ఈ మిత్రుడు ఏ పోస్ట్ పెట్టలేదు..

ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. అవి చెబితే... ఇది కూడా పనికి రాని పోస్ట్ అవుద్దని చెప్పడం లేదు. మిత్రులు మన్నించాలి...🙏
ఇలా... ఏ పోస్ట్ పనికి వచ్చేదో..  ఈ గ్రూపులో ..  దెంతో లాభసాటిగా ఉంటుందో అర్థం కాక..  ఒక్కొక్కరు... పోస్టులు చేయడం మానేశారు.
చివరికి... గ్రూపులో ఓ నిశ్శబ్బ వాతావరణం నెలకొంది..

ఒకప్పుడు ఫోన్ లో TOP లో కనబడిన గ్రూపు కాస్త.. ఎక్కడో అడుగుకి పడిపోయింది. Search లో వెతికితే గాని దొరకడం లేదు..
అప్పుడప్పుడు..ఊళ్ళో ఒకరినొకరు.. ఎదురెదురుగా కనబడినా... మారు మాట్లాడుకునే వాళ్ళుకాదు..

అందుకే..మిత్రుల మధ్యన అడ్డుగోడలు ఏం పెట్టుకోకండి..
బడి గోడ మీద కూర్చున్నప్పుడు... ఏం మాట్లాడుకుంటాం??
కాలేజి కాంటీన్ లో, టీ తాగుతూ..  ఏం డిస్కషన్ చేస్తాం??
వాడకట్టు మిత్రులు , ఊరి మిత్రులు ఓ బస్టాండ్ దగ్గరి చెట్టు కింద కూర్చొని ఏం మాట్లాడుకుంటాం??
వీటిలో.. ఏ ఒక్క ముచ్చటకు హద్దు ఉండదు..!
ఓ హాద్డే ఉంటే.. ఆ ముచ్చట ఎంతో సేపు.. ఎంతోకాలం నడవదు..

మనం ఏదైనా... జాబ్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొంటున్నమా?? 
ఏదైనా ఓ సంఘటన మీద డిస్కస్ చేయడానికి?? లేదు కదా..

మిత్రుల మధ్యన.... ఎప్పుడూ.. పనికి వచ్చే ముచ్చటనే ఉండక్కర్లేదు. Good Morning, Good Night ల వల్ల... ఆ మిత్రుడు మనతో కలిసి ఉన్నాడని , ఆనందంగా ఉన్నాడని అనుకోండి. 
ఏ పోస్ట్.. ఎప్పుడైనా.. ఏ సమయంలోనైనా పంపనివ్వండి. ఎందుకంటే.. అతని.. ప్రతి  విషయాన్ని.. మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాడు..

తుమ్మినా.. దగ్గినా కూడా మెసేజ్ లు పెట్టే వాళ్ళను చూసి తిట్టకండి. ఎందుకంటే.. ఎందుకంటే.. ప్రతి క్షణాన్ని, మీతో కలిసి ఓ మధుర స్మృతిగా మలుచుకుందాం అని అనుకుంటున్నారు..

చివరగా ఓ సందేశం...
మిత్రుల మధ్యన ఎప్పుడైతే... హద్దుల అడ్డుగోడలు ఏర్పడతాయో...మెల్లమెల్లగా.. 
ఆ స్నేహబంధం బీటలువారి బద్దలైపోతుంది..
ఈ మెసేజ్ అయిన మొత్తం చదివారా లేదా నిజంగా..

స్నేహితులు ఒక గొప్ప తరగని ఆస్తి..
అంతే..."దానికి విలువ లేదు" అంటే వెలకట్టలేము ఆని..విలువే లేనిది అని కాదు..

🍃🪷సే:వల్లూరి సూర్యప్రకాష్ కరీంనగర్

మీరు టైమును ఎలా Spend చేయాలి?

 🧤🧤🧤🧤🧤"
" మీరు టైమును ఎలా Spend  చేయాలి?
       🙏🙏🙏
👍" 1)" ఈ అని యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏమిటి? ఇది నాకు నా కుటుంబానికి ఏమి ప్రయోజనము.

👍2)" నాకు నా సంస్థకు/ నాకు నా కుటుంబం/ నాకు ఈ ప్రపంచానికి. ఏమి ప్రయోజనం

3)" నైపుణ్యాలు నేర్చుకొని లక్ష్యానికి అన్ని వృత్తుల మీద" Basic Knowledge" కలిగి ఉండాలి.

4)" మన యొక్క బలాలు, బలహీనతలు తెలుసుకోవాలి?

5)" సమయ నిర్వహణ కఠినంగా పాటించి తీరాలి
( Set Time)

6)" మీరు చేయవలసిన జాబితా ( to do list)

7)" Peiorized  and Repeiorized.

8)" 24 గంటలు సమయాన్ని " Prepare"
చేసుకుని పని చేయాలి.

9)" work తగ్గిన.   Happy అనుకోకూడదు.
   " Work is God."

10)" royalty గా  Food enjoy చేస్తూ      "Time management zone"
పరిధిలో ఉండాలి.

11)" మీ" Life Proper"గా ఉంటే- మీ వర్క్,
"Work proper" చేయగలరు.

12)" ఇష్టపడి పని చేయటం "భోగం"--
చేసే పనిని ఇష్టపడటం "యోగం".

13)" ధనవంతులు-- డబ్బులో జీవిత మని ఊహించుతారు, జీవిస్తారు.

14)" భాగ్యవంతులు- ఆరోగ్యం ప్రధాన అంశముగా భావించి జీవిస్తారు. (Food enjoy చేయగలరు) ప్రతి ఏకాదశి పర్వదినము ఉపవాస దీక్ష ఉండాలి.

15)" మీ పిల్లలకు నేను ఉన్నాను అనే భరోసా ఇస్తూ, ఆడుతూ, యోగ, ధ్యానము, నీతి కథలు, డ్రాయింగ్, అబకస్, భగవద్గీత నేర్పించాలి.

16)" నేటి పోటీ ప్రపంచంలో" మాతృభాషతోపాటు, ఇంగ్లీషు, హిందీ నేర్పించడం, అలాంటి స్నేహితులను సంపాదించి పెట్టి,
వారి భావాలు, ఆలోచనలు, తీర్చిదిద్దుటకు ఎంతో ఉపయోగకరం.

18)" మీ కుటుంబానికి, భోజనానికి కొన్ని నిబంధనలు పాటించండి.
వడ్డించుటలోనూ, తినే విధానములోనూ క్రమశిక్షణ, ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాన్ని మరింత
పెంచే లాగున ఉండాలి.
⏰⏰⏰⏰⏰⏰

17)" మీ పిల్లలకు చిరునవ్వు, నేర్పించండి, ప్రోత్సహించండి, మీరు అలాగే  చిరునవ్వుతో, భావోద్వేకాలు కోపము లేకుండా ప్రశాంతంగా ఉండండి.

అంతా అయోమయం

 🌺 గుమస్తాలు మాయం, 
కూలీలు మాయం 
💝కోడళ్ళ పనితనం మాయం
🌸అత్తమామల మాటసాయం మాయం 
🌹అల్లుళ్ళ గౌరవ హోదా మాయం 
☀️పోస్టుమాన్ మాయం 
🌺ఆసాంతం వినే వైద్యుడు మాయం 
🤦చీర--రవిక మాయం 
🙁పుస్తక పఠనం మాయం 
🌸రేడియోకి శ్రోతలు మాయం 
🌸పెరడు బావి మాయం 
🌹సైకిలు మాయం 
🌺ఎండావకాయ మాయం 
🌹కుంపటిపై దిబ్బరొట్టి మాయం 
🌸మట్టి వాసన మాయం 
💐పిడతకింద పప్పు బండి మాయం 
🌹వందరోజులాడే సినిమాలు మాయం 
☺️అర్ధరాత్రయినా నిశ్శబ్దత లేని నిశిరాత్రులు మాయం 
🌸ఉపాధ్యాయుడు మాయం 
🌹కుంకుడుకాయ సీకాకాయ మాయం 
🌹వాకిట పూలమొక్కలు మాయం 
🌸పిచ్చుకలు, సీతాకోకచిలుకలు మాయం 
🌹సత్తుగిన్నె చారు మాయం 
💐స్కూల్లో మైదానం మాయం 
🌸సంఘంలో నిదానం మాయం
💐తరవాణి దబ్బాకు వాము పప్పునూనె మాయం 
☀️వానపాము మాయం 
🌹చెరువుల్లో ఆటలు మాయం 
💐కోతికొమ్మచ్చి కబడ్డీ మాయం 
😄అవ్వ.....!!  గోచీ కూడా మాయం 
🌹థూళి లేని గాలి మాయం 
🌸పాళీ ఉన్న పెన్ను మాయం
💐ఖాళీ ఉన్న స్నేహితుడు మాయం 
🌹నిలకడగా కురిసే వాన మాయం
🌺నిర్మానుష్యమైన ఏకాంతం మాయం 
💐కంటికి నిద్ర మాయం
💖వెన్నెల చూడాలనే కన్నులు మాయం
💐పట్టుమని పదినిమిషాల ఏకాగ్రత మాయం 
🌹హారన్ కూత లేని వీధి మాయం 
💐దోమలు లేని పార్కులు మాయం 
🌸తోటమాలి కొలువే మాయం 
🌹దాచుకుందామంటే వడ్డీరేటు మాయం 
🌸 *'ఒక అల్లం పెసరె'* అని కేక వేసే పాక హోటల్ మాయం
☀️సగం సగం పంచునే తేనీరు మాయం 
☺️నిఖార్సయిన చేగోడీ, వడియం, అప్పడం మాయం 
😄ప్రేమ ప్రకటించే పొందిక మారి ప్రేమ లేఖలు మాయం  
😪ఎవరి చరవాణి లోకి వాళ్ళు మాయం 
☹️అంతా సాంకేతిక *మయం*

*చివరకి నాణ్యమైన విబూది కూడా మాయం*

*అంతా అయోమయం*

తల్లుల పేర్లు

 _👇👇👇 *తల్లుల పేర్లు* 👇👇👇_

1.శ్రీరాముని తల్లి........*కౌసల్య* 
2.శ్రీకృష్ణుని కన్న తల్లి.....*యశోద*
3.సూర్యుని తల్లి........*అదితి*
4.శంకరాచార్యుని తల్లి...*ఆర్యమాంబ*
5.రామకృష్ణపరమహంస తల్లి..*చంద్రమణి దేవి*
6.వివేకానందుని తల్లి......*భువనేశ్వరి దేవి*
7.పరశురాముని తల్లి .....*రేణుక*
8.ధృవుని తల్లి ......*సునీత*
9.ప్రహ్లాదుని తల్లి .....*లీలావతి*
10.వామనుని తల్లి ....*అదితి*
11.హనుమంతుని తల్లి....*అంజనాదేవి*
12.దత్తుడి తల్లి....*అనసూయ మాత*
13.గోవిందుని తల్లి....*వకుళా దేవి*
14.భీష్ముని తల్లి.....*గంగాదేవి*
15.వ్యాసుని తల్లి.....*సత్యవతి*
16.గౌతమ బుద్దుని తల్లి....*మాయాదేవి*
17.కర్ణుడి పెంచిన తల్లి...*రాధ*
18.యమధర్మ రాజు తల్లి....**
19.శనైశ్చరుని తల్లి....*ఛాయాదేవి*
20.భరత మహారాజు తల్లి....*కైకేయి*
 
_దశరధరామ్, APSPDCL, తిరుపతి._

100 Quotes from The Secret

 100 Quotes from The Secret

1. If you can think about what you want in your mind, and make that your dominant thought, youwill bring it into your life.
2. Through this most powerful law, your thoughts become things in your life.
3. As you think of yourself living in abundance, you are powerfully and consciously determining your life through the law of attraction.
4. The only reason why people do not have what they want is because they are thinking more about what they don’t want than what they do want.
5. The law of attraction is the law of creation. Quantum physicists tell us that the entire Universe emerged from thought!
6. What you are thinking now is creating your future life.
7. Your thoughts are seeds, and the harvest you reap will depend on the seeds you plant.
8. Whether you have been aware of your thoughts in the past or not, now you are becoming aware. Right now, with the knowledge of The Secret, you are waking up from a deep sleep and becoming aware!
9. Decide what you want to be, do, and have, think the thoughts of it, emit the frequency, and your vision will become your life.
10. The law of attraction is a law of nature. It is as impartial and impersonal as the law of gravity is.
11. Your feelings are your greatest tools to help you create your life.
12. Your thoughts determine your frequency, and your feelings tell you immediately what frequency you are on.
13. You can purposefully use your feelings to transmit an even more powerful frequency, by adding feeling to what you are wanting.
14. There is no greater power in the Universe than the power of love.
15. The feeling of love is the highest frequency you can emit.
16. There is a truth deep down inside of you that has been waiting for you to discover it, and that Truth is this: you deserve all good things life has to offer.
17. You get to choose what you want, but you must get clear about what you want.
18. Asking is the first step in the Creative Process, so make it a habit to ask.
19. You must believe that you have received. You must know that what you want is yours the moment you ask.
20. In the moment you ask, and believe and know you already have it in the unseen, the entire Universe shifts to bring it into the seen.
21. Claim the things you want by feeling and believing they are yours.
22. How it will happen, how the Universe will bring it to you, is not your concern or job. Allow the Universe to do it for you.
23. Ask once, believe you have received, and all you have to do to receive is feel good.
24. If you have an intuitive or instinctive feeling, follow it, and you will find that the Universe is magnetically moving you to receive what you asked for.
25. Remember that you are a magnet, attracting everything to you.
26. It is as easy to manifest one dollar as it is to manifest one million dollars.
27. Create your day in advance by thinking the way you want it to go, and you will create your life intentionally.
28. It is impossible to bring more into your life if you are feeling ungrateful about what you have.
29. When you give thanks as though you have already received what you want, you are emitting a powerful signal to the Universe.
30. The reason visualization is so powerful is because as you create pictures in your mind of seeing yourself with what it is you want, you are generating thoughts and feelings of having it now.
31. Everyone has the power to visualize.
32. To use the law of attraction to your advantage, make it a habitual way of being, not just a one-time event.
33. To attract money, you must focus on wealth.
34. The only reason any person does not have enough money is because they are blocking money from coming to them with their thoughts.
35. When you need money, it is a powerful feeling within you, and so of course through the law of attraction you will continue to attract needing money.
36. The shortcut to anything you want in your life is to BE and FEEL happy now!
37. Your wealth is waiting for you in the invisible, and to bring it into the visible, think wealth!
38. “I am a money magnet.”
39. “I love money and money loves me.”
40. Giving is a powerful action to bring more money into your life, because when you are giving you are saying, “I have plenty.”
41. Prosperity is your birthright, and you hold the key to more abundance – in every area of your life – than you can possibly imagine.
42. The key is your thoughts and feelings, and you have been holding the key in your hand all of your life.
43. When you do not treat yourself the way you want others to treat you, you can never change the way things are.
44. When you make feeling good a priority, that magnificent frequency will radiate and touch everyone close to you.
45. People are responsible for their own joy.
46. Focus only on things you love, feel love, and you will experience that love and joy coming back to you – multiplied!
47. Treat yourself with love and respect, and you will attract people who show you love and respect.
48. To make a relationship work, focus on what you appreciate about the other person, and not your complaints.
49. Healing through the mind can work harmoniously with medicine.
50. All stress begins with one negative thought.
51. Love and gratitude can part seas, move mountains, and create miracles.
52. Illness cannot exist in a body that has harmonious thoughts.
53. Start thinking happy thoughts and start being happy.
54. Just the simple process of letting go of negative thoughts will allow your natural state of health to emerge within you.
55. Laughter attracts joy, releases negativity, and leads to miraculous cures.
56. You have the ability to give so much to the world by emitting feelings of love and well-being, despite what is happening around you.
57. When you feel good you uplift your life, and you uplift the world.
58. You are the master of your life, and the Universe is answering your every command.
59. Your ability to think is unlimited, and so the things you can think into existence are unlimited.
60. When we open our minds to the unlimited creative power, we will call forth abundance and see and experience a whole new world.
61. There are no limits to what you can create for You, because your ability to think is unlimited!
62. The Universe offers all things to all people through the law of attraction.
63. You have the ability to choose what you want to experience.
64. When you are praising or blessing you are on the highest frequency of love.
65. Instead of focusing on the world’s problems, give your attention and energy to trust, love, abundance, education, and peace.
66. The law of attraction says like attracts like.
67. You are energy, and energy cannot be created or destroyed. Energy just changes form.
68. As you ask and feel and believe, you will receive.
69. When you emit the perfect frequency of what you want, the perfect people, circumstances, and events will be attracted to you and delivered!
70. When you say “I am,” the words that follow are summoning creation with a mighty force, because you are declaring it to be fact.
71. When you conceive something in your mind, know it is a fact, and that there can be no question about its manifestation.
72. You are a genius beyond description, so start telling yourself that and become aware of who you really are.
73. All your power is in your awareness of that power, and through holding that power in your consciousness.
74. The real secret of power is the consciousness of power.
75. Be aware of everything around you, because you are receiving the answers to your questions in every moment of the day.
76. To not love ourselves can keep what we want from us.
77. To attract the things we love we must transmit love, and those things will appear immediately.
78. We are all connected, and we are all One.
79. The Secret is within you.
80. The more you use the power within you, the more you will draw it to you.
81. The time to embrace your magnificence is now.
82. See yourself living in abundance and you will attract it.
83. The law of attraction is always working, whether you believe it or understand it or not.
84. Your thoughts become things.
85. The emotions are an incredible gift that we have to let us know what we’re thinking.
86. Our feelings are a feedback mechanism to us about whether we’re on track or not, whether we’re on course or off course.
87. Life can be absolutely phenomenal, and it should be, and it will be, when you start using The Secret.
88. You will attract everything that you require.
89. You can start with nothing, and out of nothing and out of no way, a way will be made.
90. Asking the universe what you want is your opportunity to get clear about what you want.
91. Receiving involves feeling the way you feel once your desire has manifested.
92. When you want to change your circumstances, you must first change your thinking.
93. Gratitude is absolutely the way to bring more into your life.
94. The daily practice of gratitude is one of the conduits by which your wealth will come to you.
95. When you visualize then you materialize.
96. Expectation is a powerful attractive force.
97. Success comes from within, not from without.
98. Your joy lies within you.
99. The Universe is a masterpiece of abundance.
100. You can change your life and you can heal yourself.

10 Lessons From Rules Of Work by Richard Templar

 🚩🚩🚩🚩🚩🚩🚩10 Lessons From Rules Of Work by Richard Templar 
      🔥🔥🔥
🌺1. Walk Your జీవో Talk
Whenever you say something, live by it. Let people know you as a person who does what he says he will do. Always walk your talk. 

🦚2. Have A Plan
No matter whats going on, always have a plan in life. Plan for the year. Plan for the next 2 years. Plan for the next 5 years. And plan for the next 20 years. Have a plan. 

🪷3. Carve A Niche For Yourself 
Create a unique identity with what you do. Make sure you are known for doing something unique. Don’t get involved in what everyone is doing. Do something special. 

🧤4. Stay Focused On Your Long Term Goals 
You can’t afford to lose sight of your long-term goal for a second. For you there is no time off, no downtime, no loung-ing around time, no slipups, no mistakes, no accidental deviations from the script. 

You have to become like a master criminal—they lead incredibly law-abiding lives because they can’t risk breaking a tiny law in case it draws attention to themselves and the really big crimes get revealed—and watch what you say and what you do.

💅🏿5. Learn From Others Mistakes 
A clever man learns from his own mistakes, but a wise man learns from others’ mistakes. Learn from the mistakes of others. Study how others made errors and commit to avoiding them. 

🚩6. Develop The Right Attitude 
Be optimistic. Be positive. Share positivity with your colleagues, your friends and your acquaintance. The right attitude will attract you the right people to your life. 

🌻7. Cultivate a Smile
Smile when it’s getting tough. Smile when it’s hell. Smile no matter what.
And what sort of smile? Friendly, genuine—make sure it extends to your eyes—sincere, frank, honest, open, happy.

🌸8. Be Cool
At work you should retain your cool at all times and, no matter what, never ever lose your dignity. If there’s an office costume party, you can laugh and joke with everyone else, but let them do the dressing up. You remain apart from all that office nonsense.

💐9. Speak Well
You can keep your regional accent; that’s not the problem. Look at why we speak—it is to communicate, to convey information—rather than how we speak. Speaking well means getting information across clearly and effectively. It doesn’t matter how you speak, but it does matter that you speak clearly.

🌷10. Know Yourself—Strengths and Weaknesses
If you are going to be a winner, you have to be incredibly objective about yourself. A lot of people can’t do this; they can’t turn the spotlight on themselves objectively enough or brightly enough to see themselves as others see them. And it’s not just how others see us; it’s also how we see ourselves. We all carry a mental image of ourselves—what we look like and sound like, what makes us tick; how we work—but how realistic is this image
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

నేటి చుట్టరికాలు

 నేటి చుట్టరికాలు **

పేరుకి ఉంటుంది రక్త సంబంధం 
కాని మనసులకి ఉండదు ఏ సంబంధం 

కలిసి యుండలేరు 
కలిసినా మనస్పూర్తిగా మాట్లాడుకోలేరు 

నేనే పెద్ద ,నేను చిన్న అనే ఆలోచన తప్ప 
పలకరింపుకి పెదవుల్ని కదిలించలేరు 

వారి స్వార్ధం ,స్వప్రయోజనమే ముందు 
మన తోటి వారే , మన వారే అని తలంచకుండు 

గౌరవం ఇస్తున్నా అది అందుకోలేరు 
ఇంకేదో కావాలని ,బెట్టుగా కూర్చుంటారు 

కుటుంబంలోని బంధాలు కంటే 
సమాజంలోని డబ్బు ,పరపతికై చూస్తుంటారు 

మనవాళ్లు మన స్థాయి కన్నా తక్కువైతే 
మాటవరసకి పిలిచి అవమానిస్తారు 
ఒకవేళ రాకపోతే రాలేదని సాధిస్తారు 

తనకంటే బంధువులలో గొప్పవాళ్లు ఉంటే 
అతిది మర్యాదలతో సత్కరిస్తుంటారు 

ఒకరిని ఒకరు నమ్మలేరు 
ఒకరిపై ఒకరు ప్రేమను పొందలేరు 

నిజమైన ప్రేమ , వాత్సల్యం మరుస్తారు 
కనిపించే డాబుకి ,డబ్బుకి విలువిస్తారు 

అందరిముందు పలానా అని చెప్పుకోలేరు 
ఒకరు వీరికన్నా బాగుంటే ఓర్చుకోలేరు 

అవసరం ఉంటే మాత్రం ఆత్మీయత కురిపిస్తారు 
అవసరం లేదంటే నీ గురించి ఆరా కూడా తీయరు 

పల్లెటూర్లలో ఉన్నప్పుడు చుట్టమే కదా ఆత్మీయం 
పట్నాలు వచ్చాక ఏకాంతమే నీకున్న ఆతిధ్యం 

పండుగలకైనా ఆహ్వానించు కోగల్గుతున్నారా ఇప్పుడు 
ఎవరి తీరు వారే ,ఎడ ముఖం పెడ ముఖాలే కదా ఎప్పుడూ 

పిలిస్తే ప్రేమగా  పలికే చుట్టరికాలు ఉండాలి కాని 
వచ్చామా ,వెళ్ళామా అంటే మాత్రం అవి చట్టరికాలే 

మారుతున్న కాలంతో పాటు బంధాలు మారుతున్నాయి 
ఆ బంధాలు వలన వట్టి బాధలే మిగులుతున్నాయి 

గుర్తుంచుకోండి అందరూ ....... 
మన వారు ,మనకోసం ఉన్నప్పుడు ఆ బంధాన్ని నిలుపుకోండి ఎప్పుడూ

నదీ సముద్ర న్యాయము

 *నదీ సముద్ర న్యాయము*
***************
*నదులన్నీ  సముద్రంలోనే కలుస్తాయి.*
*"నదీనాం సాగరో గతిః" అన్నట్లు.అంటే నదులన్నింటికీ సముద్రమే చివరి గమ్యస్థానం అనే అర్థంతో ఈ నదీ సముద్ర న్యాయమును ఉదాహరణగా చెప్పవచ్చు.*

*నది,సముద్రము వేర్వేరు. వాటి రుచులు కూడా వేరే.అయితే నదులు సముద్రంలో కలిసి తమ రూపాలను కోల్పోయి సముద్ర రూపం పొందుతాయి.అయినా అవి బాధ పడవు. వాటి చివరి గమ్యస్థానం సముద్రమే కాబట్టి. సముద్రంలో కలిసే చివరి క్షణం వరకూ పరోపకారార్ధమే పరమావధిగా భావిస్థాయి.*

*ఇలా ఎక్కడెక్కడో పుట్టిన నదులు  వివిధ రకాల పేర్లతో పిలవబడటం మనందరికీ తెలిసిందే. ఒక్కో నది ఒక్కో రకంగా ప్రయాణిస్తూ ఉంటుంది.వరదలా ఉప్పొంగుతూ పరుగులు తీయడం, గంభీరమైన గమనం సాగించడం.,వంకర టింకర ఇరుకు దారుల్లోంచి ప్రవహించడం ఇలా ఎన్ని రకాలుగా ప్రయాణం సాగించినా చివరకు కలిసేది సముద్రంలోనే. అంటే సాగర సంగమమే నది యొక్క పరమార్థం.*

*దీనినే మన జీవితానికి  అన్వయించుకుందాం.మనిషి జీవితం నదిలాంటిది.పుట్టుక నుండి మరణం దాకా కాలంతో పాటు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది.* 

*నది  అతి చిన్న  బిందువుగా ఎలా మొదలవుతుందో.మనిషి పుట్టుక కూడా అలాగే అతి చిన్న రూపం నుండి మొదలవుతుంది.*

*నదితో అనేక ఉపనదులు ఎలా కలుస్తాయో,వానలు, వరదలు ఎలా ముంచెత్తుతాయో, ఆ విధంగానే మనిషి జీవితంలో కూడా  అనేక సమస్యలు,ఆటంకాలు ఎదురౌతాయి, రకరకాల మనుషులు, బంధాలు అనుబంధాల కలయిక లు,విడివడటాలు ఉంటాయి.అయినా నది గమ్యాన్ని చేరేంత వరకు ఆపకుండా తన ప్రయాణం ఎలా సాగిస్తుందో,ఆ ప్రవహించే సమయంలో పరిసరాలను సస్యశ్యామలం చేస్తూ వెళుతుందో, మనిషి కూడా తన గమ్యాన్ని చేరేంత వరకు ఆ విధంగా సాగిపోతూ ఉండాలి.* 

*ఆగని ఆ ప్రయాణంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా లక్ష్యాన్ని వీడకుండా, ఆదర్శవంతంగా ప్రవహిస్తూ,పయనించి నంత మేరా విలువల పచ్చదనంతో  వెలుగుతూ,ఆ వెలుగుల్ని సమాజానికి పంచుతూ అనంత విశ్వ సాగరంలో విలీనం అయిపోవాలి.అదండీ నదిలాంటి జీవితం అంటే.*

*అప్పుడే జీవితం సార్ధకం అవుతుంది.అనంత విశ్వంలో కలిసినా  చేసిన మంచి పని ఈ పుడమిలో  పచ్చని చెట్టులా పల్లవిస్తూనే ఉంటుంది.*

Quotes

 _______________________
🔥మందు అలవాటు పడిన వారికి వద్దురా బాబూ అని ఎంత చెప్పినా...
రాత్రి వింటాడు..
పొద్దున షరామామూలే..
చీకటి పడ్డాక 
మళ్లీ షరాబీ మామూలే ..!
_______________________
🔥జూదం ఆడేవాడిని ఆడని వాడు gambler అనుకుంటాడు..
ఆడేవాడు మాత్రం తనో
*GAME* blar అనుకుంటాడు..!
_______________________
🔥ఖైనీ వేసుకునే అలవాటున్న వాడు నువ్వు చెప్పినప్పుడు విన్నట్టే అనిపిస్తాడు...
కాసేపయ్యాక మళ్లీ ఖైనీ వేసుకోవాలనిపిస్తే కానీ
అనేసుకుంటాడు..!
_______________________
🔥రేసులాడేవాడు అలా రాసుకుంటూనే ఉంటాడు..!
_______________________
🔥పూర్వం చెయ్యి తడిపితే లంచం అనేవారు..
ఇప్పుడు చెయ్యి 
కదిపితే చాలు..
లంచం ఇచ్చెయ్యాల్సిందే..!?
_______________________
🔥వేశ్యల దగ్గరికి వెళ్తే విటుడు అంటారు కదా..
మరి అజ్ఞాతంగా 
వేశ్యా వాటిక నడుపుతూ వేశ్యలకు ఆశ్రయం ఇచ్చే వాడిని విరాటుడు అనాలా..అనలేమేమో..!
భారతం బాధపడుద్ది..!!
_______________________
🔥అప్పు చేసేటప్పుడు ప్రామిసరీ నోటు రాస్తారు..
ఎగ్గొట్టాలనుకునేవాడు
దానిని ప్రా"మిస్"అరీ నోటు అనుకుంటాడు..
ఎలాగైనా తీర్చాలనుకునే వాడు అది "హామి"సరి 
నోటుగానే గౌరవిస్తాడు..
రాయించుకునే వాడు మాత్రం 
దానిని ప్రా"మిసైల్"గానే పరిగణిస్తాడు..!
_______________________
🔥అప్పుతో చెలగాటం నిప్పుతో చెలగాటం కంటే ప్రమాదకరం..!
_______________________
🔥ఎందుకో గాని పూర్వం అప్పిచ్చు వాడు వైద్యుడు 
అనేవారు..
ఇప్పుడు మాత్రం చికిత్స పూర్తయ్యాక చిప్పిచ్చు వాడే వైద్యుడు..(మంచి డాక్టర్లకు
క్షమాపణలతో..
ఎవరైనా ఉంటే సుమీ..!)
_______________________
🔥గుడిని,గుడిలో లింగాన్ని మింగితే దేవాంతకులు..
గుడిని,గుడిలో లింగాన్ని కూల్చితే దైవాంతకులు..!
_______________________

         _సురేష్ కుమార్..ఇ_

మాటతీరు

 *🦋HappY SundaY🦋* 
     Date:  *16-04-2023*
        *ఆదివారం*
*BeautifuL $torY...®️✍🏻*  
  
*మాటతీరు*
          *అనంత్* చదువు ముగించి ఉద్యోగంలో చేరటానికి వ్యవధి ఉందని స్వంత ఊరు చేరాడు. ఆ ఊరిలోనే చిన్న నాటి స్నేహితులను పలకరించాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. *గోవింద్, కేశవ* వ్యాపారం చేస్తుంటారు. ఇంట్లోలేరు. సుభద్రమ్మ ఒక్క తే ఉంది. అనంత్ ని చూసి నవ్వుతూ, రావయ్యా అనంత్.., ఎన్నాళ్ళకీ అంతా బాగున్నారా అడిగింది. బాగున్నామత్తా అన్నాడు.
        *ఆ!!! ఏంబాగులే...* ఇంతకూ నీకు ఉద్యోగం వచ్చిందా..! లేక ఇంకా మీ నాన్న సంపాదనే తింటూనే ఉన్నావా? అనంత్ సమాధానం  చెప్పేలోపు సుభద్రమ్మ అందుకుని, ఇంత చదువు చదివి అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. *ఏంలాభం చెట్టల్లే* ఎదిగారు. ఇంకా తండ్రి మీదే ఆధారపడి తింటూ కూర్చున్నావు. మీ నాన్న కష్టం తీరేది కాదు. పెద్ద చదువు వుంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి అంటారు. మా కేశవ, గోవింద్ లను చూడు. నీలాగా పెద్ద చదువులు చదవలేదు. చిన్నప్పటినుండి వ్యాపారంలో ఆరి తేరబట్టి కదా *కనక వర్షం* కురిపిస్తున్నారు. ముఖాన సిరి లేదు. నీకు ఆ గీత రాయలేదు ఆ దేవుడు. ఏం చేస్తాం మనసు లో పెట్టుకుని కుమిలి కుమిలి ఏడవ్వాల్సిందే. మా *అమ్మాయి పెళ్ళి ఝంఝం* చేశాము. ధనికులు వాళ్ళు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా...! గోవింద్ కి కోరిన కట్నం, పిల్లకి కోరిన నగలతో పిల్ల నిస్తామని వచ్చారు. కేశవకీ అలాగే అనుకో. *నీకైతే ఉద్యోగం, సద్యోగం లేదాయె...* పిల్లనెవరిస్తారు నీకు? ఇస్తే ఆ పిల్లకు ఉరికంబమే కదా నీతో పెళ్ళి. అలా అని డ్రైవర్, వెయిటర్, కూలి, ప్యూను
పనులు కూడా చెయ్యలేవు ఇంత చదివీ. *టైం వుంటేనే కదా వచ్చావు.* మా పిల్లలకు టైం వుండదు. *టైం అంటే డబ్బు* అని అంటారు పిల్లలు. ఏదైనా తింటావా? మా ఇంట్లో ఎన్నో ఉన్నాయి తినేందుకు. మొహమాటం లేకుండా అడుగు. అయినా *మీ అమ్మ ఏం చేస్తుందిలే...!.* మీ పొట్టలే నింపడం కష్టం. విచారించకు డబ్బు లేదని. గోవింద్ సాయం చే‌స్తాడులే. ఇలా సుభద్రమ్మ ధోరణి సాగి పోతుంటే వెళ్ళొస్తా నత్తా అంటూనే లేచాడు. అసూయ కాబోలు లేక తనను కించ పరిచి మనసు లోని అసంతృప్తిని దాచాలనకుందో. కొందరి *ధోరణి గాయం* చేసే లాగా వుంటుంది.
       ఒకవేళ తనకి *మంచి ఉద్యోగం* వచ్చింది అని చెప్పి వుంటే సుభద్రమ్మ అత్త ఏమై పోయి వుండేదో!!! మరునాడు ఉదయం *స్వీట్స్ సుభద్రమ్మ చేతుల్లో* పెట్టి, నమస్కరించి, తనకు *ముంబైలో మంచి ఉద్యోగం* వచ్చింది అని పెద్ద జీతం, ఇల్లు కారు హంగులతో బాగా వుంది, కుటుంబం మొత్తంగా ముంబైకీ  వెళ్ళేముందు, *గోవింద్, కేశవలని* చూసి పోదామని వచ్చానత్తా...! అని అన్నాడు. సుభద్రమ్మ నిలబడలేక పడబోయి తమాయించుకుంది. *ఖంగు తినే సమయం ఈసారి సుభద్రమ్మది.* 
మిత్రమా...!
చాపలత్వం ప్రమాదమే ఎప్పటికైనా....!
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*Your's....*
    *-🎤K ®️avindra Dheera,*
      *M.Sc (Psy), D.Ed &B.Ed*
      *Motivational Speaker &Trainer*        
      *NLP Practitionar*
      *Life skills coach*
      *🎯Impact Foundation.*
*Cell: 9848105906*

"వ్యక్తి వికాసము దానికి గల సూత్రములు"

 🌷🌷🌷🌷🌷🌷
" వ్యక్తి వికాసము దానికి గల సూత్రములు"
         💅🏿💅🏿💅🏿

🙏సమర్పణ:- "MAZUMDAR BANGALORE
87925-86125.'
       💐💐💐
 " మీలో అన్ని రకాల వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకుంటూ వాటికై సాధన చేస్తూ అన్ని పరిస్థితులలోనూ ఆధారపడే రీతిలో 'వ్యక్తిత్వాన్ని' సాధించినప్పుడే  మీకు "పరిపూర్ణ వ్యక్తిత్వం" సిద్ధిస్తుంది . అందులో ఏమాత్రం సందేహము లేదు.
      🙏🙏🙏
🌹" మీరు ఎదుటి వ్యక్తి యొక్క ఉనికిని గుర్తించి అతని కార్యకలాపాలను గుర్తుంచుకొని మాట్లాడటం ఈనాడు చాలా అవసరం.  ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అతనికి ఇష్టమైన విషయాలపై మాత్రమే మాట్లాడాలి.  అప్పుడే మీ రాక ఆసక్తికరమైన వ్యక్తిగా మిమ్ములను గౌరవిస్తాడని గుర్తుంచుకోండి!

🪷" మిమ్మలను ప్రజలందరూ ఇష్టపడతారని భావించుకొని వారితో మెలగండి.  మీతో ప్రజలు మాట్లాడాలనే భావం కలగజేస్తే ,  ప్రజలు కూడా హృదయపూర్వకంగా స్పందించగలరు.   ఒకవేళ మీరు అంటి ముట్టనట్లు ఉంటే బహుశా మీరు ఏకాంతాన్ని కోరుకుంటున్నారో అని ప్రజలు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి, ఫొయె ప్రమాదం ఉందని తెలుసుకోండి?   మీరు ఇతరుల సహచర్యాన్ని కోరుకోకపోతే ఒంటరి వారై  మిగిలిపోతారు.

🔥" మీయొక్క సొంత లోపాలని ఎల్లప్పుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి.
  అంత మాత్రాన కావాలని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు.
నిజంగానే పొరపాటు మీ వల్ల జరిగితే సరదాగా ఇతరులకు చలోక్తి విసరటానికి అవకాశం ఇచ్చేవారు అవుతారు. జాగ్రత్త!
తద్వారా ఇతరులలో ఉన్నత భావం పెంపొందించటమే కాదు, మీ వ్యక్తిత్వంలో మరింత మృదువత్వం వస్తుంది.
మీలో ఉన్న మంచి చెడులను నిర్భయంగా ఒప్పుకోండి!  అలాగే అదే దృష్టితో ఎదుటివారిని చూడండి!  
ఒక వ్యక్తి తన లోపాలను నిజాయితీగా ఒప్పుకున్నప్పుడే ఇతరులకు చెప్పడానికి అవకాశము ఏర్పడుతుంది.  అప్పుడే మీరు ఇతరులను  వారి దృష్టి కోణంలో అర్థం చేసుకునే శక్తి వస్తుంది., (Empathy)
ఇతరుల యొక్క శక్తి సామర్థ్యాలను గౌరవించగలుగుతాము.

💐" మీరు ఒక వ్యక్తిని గ్రీట్ చేసేటప్పుడు హృదయపూర్వకంగా చేయండి.
   " గుడ్ మార్నింగ్ అన్నప్పుడు మీ చెయ్యి సహుదయం తో లేవటంతో పాటు, ఓ "చిరునవ్వు" ను కూడా ప్రదర్శిస్తే  ఫలితం అద్భుతంగా ఉంటుంది కదా!  మీరు హృదయపూర్వకంగా మాట్లాడటంలో సహజత్వాన్ని చూపించండి.

🚩" ఇతర వ్యక్తులతో "ఆత్మవిశ్వాసాన్ని" పెంపొందించేటట్టు ప్రవర్తించాలి.  "ఆత్మ నున్యతా" తో వారు బాధపడుతున్నట్లు మీరు గమనిస్తే , మీరు అతనిలోని మంచి గుణాలను అభినందించండి.  అప్పుడు అతనిలోని "ఆత్మ నూన్యత" "భావం తరిగి "ఆత్మవిశ్వాసం" బాగా పెరుగుతుందని తెలుసుకోండి!  మీరు అతని గురించి మాట్లాడటం కంటే కూడా అతను తెలివితో చేసిన కార్యకలాపాలను గురించి మాట్లాడి "అభినందనలు" తెలియజేయండి.   స్త్రీల విషయానికి వస్తే  తమ అందాన్ని , ఆకర్షణ ప్రశంసంచటం ఇష్టపడతారని మర్చిపోకండి , అయితే మీరు చేసే అభినందనలలో "నిజాయితీ" తోడు కావాలి సుమా,!

🌻" నేను" అని కాకుండా "మీరు " మనం అనే పదాన్ని ఎక్కువగా వాడటం మీరు నేర్చుకోండి!   మీరు తరచూ మాట్లాడే విధానమును బట్టి మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎదుటివారు అంచనా వేసే అవకాశం ఉంది.
మీరు వారితో కలిసి పోయారో లేదో పరీక్షించుకోవాలంటే మీ అభిప్రాయాలు ఎన్ని చెప్పారన్నది 'కోలబద్ద " గా భావించండి.   అందుకే మీరు, మీది అతను, అతనిది ,ఆమె యొక్క అనే పదాలను మీరు ఉపయోగించిన మీ వ్యక్తిత్వ వికాసము వారి వద్ద  వికసించదు సుమా!

🌸" మీరు ప్రేమించటం నేర్చుకోండి,.  మానవుని యొక్క సహజ ప్రవృత్తి ప్రేమించటం, ప్రేమింపబడటం, మీ వల్ల ఎవరో ఒకరు సంతోషపడే బాధ్యతను స్వీకరించండి.
మనుషులను ప్రేమించడంలో లభించే ఆనందము, తృప్తి అపూర్వమైన దన్న సంగతి గుర్తుంచుకోండి?

🌼" మీ స్నేహితులను ఆరాధించండి.   ఇతరుల పట్ల మనం ఉదారంగా ప్రవర్తించినప్పటికీ, ఇతరులు మన పట్ల దయతో మంచిగా ప్రవర్తించకపోవచ్చు.  వాళ్లు స్వార్థపరులు అయి ఉండవచ్చు.  వాళ్లు మనకు విధేయులుగా మంచివాళ్లుగా ఉండటంలో విఫలమైతే "నిరాశావాదము," పెంచుకొని ఇతరుల పట్ల ద్వేషము పెంచుకోవద్దు.
మనము మనుషుల వైఫల్యాలను మనం సహించాలి , వాళ్లు మారిపోయే మంచి వాళ్ళు అయ్యే అవకాశం కూడా ఉంది అని తెలుసుకోండి.  లేకపోతే వాళ్ళ నైజము అంతే అని భావించండి. వారిని శత్రువులుగా చూడకండి.
పాముకు కోరల్లో విషము ఉండును, తేలుకు కొండెము నందు విషము ఉండును.  కుట్టటం వాటి యొక్క సహజ లక్షణము. ప్రేమించటం నీయొక్క సహజ లక్షణము.
అలా సరిపెట్టుకోండి.

🧤" తరచుగా మీ యొక్క వాతావరణంన్ని, మారుస్తూ ఉండండి.
సెలవుల్లో దేశంలోని ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళండి.
కొత్త కొత్త వ్యక్తులను కలుసుకోండి.  అప్పుడప్పుడు మీ భార్యా పిల్లలను మీతో తీసుకెళ్లకుండా , ఒంటరిగా విశ్రాంతి  కాలాన్ని గడపండి.  అదేవిధంగా మీ భార్యా పిల్లలకు కూడా ఒంటరిగా విశ్రాంతి కాలాన్ని గడపటానికి అణువుగా వారికి అవకాశం ఇవ్వండి.
మీది ఉన్న ఇంటినే పట్టుకొని వేలాడకుండా దాన్ని , అమ్మి కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు,  తరచుగా పాత ఫర్నిచర్ ను  వాడే కంటే అప్పుడప్పుడు వాటిని మార్చవచ్చు, కానీ అహంకారముతో పక్కనున్న ఇంటితో మీరు వారితో  పోల్చుకొని ఆడంబరాలకు పోకండి. ఇంట్లో ఉన్నంతసేపు విశ్రాంతి గా హాయిగా గడపండి.  ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరాలని ఉబలాటపడండి.

💅🏿" వైఫల్యాలు నుండి విజయము సాధించిన వ్యక్తులు ఆనందంగా ఉండే వ్యక్తులతో , మీరు సహచర్యం చేయండి .  వారు నేర్చుకున్న గుణపాఠం తెలుసుకొని, మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుకోండి.  మీలో మీరు ఒంటరిగా తమలో తాము బతకటం హానికరం.  మనలో కొత్త దృక్పథం కొత్త ఆలోచనలు కొత్తవరవడి కొత్త ఆశలు మొలకతించగలిగే.       కొత్త వ్యక్తులతో సంబంధం ఎంతో అవసరం అని గుర్తించండి!  ప్రతి వారం సామాజిక సంబంధమైన ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనండి.   మీ ఇరుగుపొరుగు వాళ్లతో వెళ్ళండి . క్లబ్బుల్లో కొత్త వ్యక్తులను కలుసుకోండి.
ఇంటా, బయట కొత్త ఆటలలో కొంత సమయాన్ని పాలుపంచుకోండి,. వీరు ఇతరులతో కలిసి ఉన్నప్పుడు మీ సహచరులను మీ కన్నా ఉన్నతులుగా  లేదా తక్కువ వారు గా మీ ఆలోచనలకు  తావు ఇవ్వకండి.  మనుషులంతా  నీకన్నా అధికులనే ఆలోచనకు కూడా తావివ్వకూడదు.
ఇతర రంగాల్లో నైపుణ్యము సాధించిన వ్యక్తుల నుండి కొత్త విషయాలను నేర్చుకోండి,
వాటిని ఆచరించండి.
మీయొక్క సంతోషము డబ్బులో గాని అందంలో గాని లేదు సంతోషమనేది మన తెలివితో సాధించిన విజయము వల్ల మనము సంపాదించుకున్న స్థానంలో ఉంది ,అని గుర్తించండి!  ఆధ్యాత్మిక చింతనలో," హరి సర్వోత్తమ", " వాయు జీవో త్తమ' తత్వజ్ఞానముతో,  తారతమ్య సిద్ధాంతము,
యొక్క విశిష్టత, గురించి
తెలుసుకొని "మోక్షానికి" ప్రాకులాడండి!
💚❤️💜🦚🙏

" ఒక్కసారి మీ ఆలోచనకి పదులు పెట్టండి" ? ఇది ఎంతవరకు సబబు?

 🔥🔥🔥🔥🔥
' " ఒక్కసారి మీ ఆలోచనకి పదులు పెట్టండి" ? ఇది ఎంతవరకు సబబు?
        🙏🙏🙏
" దేవుళ్ళను దేవతలను పూజిస్తాం! కొలుస్తాం, భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తాం . కదా!  ఈ సృష్టికి మూలకారణం భగవంతుడే  అని మనందరికీ తెలుసు.  అందరిలో "భక్తిభావం" ఉంటుంది.   ఐతే చాలామందిలో భక్తితో పాటు , భయం కూడా పెరిగింది.   దేవతల దేవుని ఉనికిని వ్యాపారానికి నేడు వాడుకోవటం మొదలైంది.  "మద్యం దుకాణాని" కి  శ్రీరామ వైన్స్ అని, జోళ్ళ షాపుకి , శ్రీకృష్ణ షూ మార్ట్ అని, మాంసం కొట్టుకి గణేష్ చికెన్ సెంటర్..  వంటి పేర్లు పెట్టడం శోచనీయం. " కొన్ని నకిలీ వ్యాపారులు చిట్ ఫండ్స్ కంపెనీలు, మరికొందరు 40 రోజులలో మీకు నచ్చిన వస్తువులు ఇస్తాము, 1/4 డబ్బు ఇప్పుడు కట్టండి? అని చెప్పి ఎత్తేసేవి ఉన్నాయి? పవిత్రకు ప్రతీక భగవంతుడు.  అటువంటిది ఇటువంటి వ్యాపారాలకి దేవుని పేర్లు పెట్టడం ఎంతవరకు సమంజసం..  ఇప్పుడు చాలావరకు కిరాణా సరుకులు ప్యాక్ లలో లభిస్తున్నాయి.  వాటిపై దేవుని దేవతల చిత్రాలు బొమ్మలు ఉంటున్నాయి.  ఉదాహరణకి.. శ్రీ లలితా రైస్, శ్రీలక్ష్మి మినపగుళ్లు.. ఇలా.  అవేం చేస్తాం మనం..  డబ్బాలలో పోసేసి ఆ ఖాళీ ప్యాక్ లు డస్ట్ బిన్ లో పారేస్తాం..  అంతేకదా..  ఇది మన తప్పుకాదు.  గనుక వ్యాపారస్తులు తమ బ్రాండ్ వస్తువుల ప్యాక్స్ పై దేవుని దేవతల చిత్రాలు బొమ్మలు ముద్రించడం మానుకోవాలి.  కవర్లమీద, గోనె సంచులపై కూడా ముద్రిస్తున్నారు.  లుంగీలు ,తువ్వాళ్లు వంటి వస్త్రాలపై దేవుని లేక దేవతల స్టిక్కర్స్ ముద్రిస్తున్నారు.  వాడుకునే ముందు ఈ స్టిక్కర్స్ చించేసి డస్ట్ బిన్ లో పడేస్తాం.. మిగిలినపోయిన మెతుకులు వంటి ఆహార శేషాల్ని వాటిమీద పడేస్తాం dustbin నందు.  ఇది చాలా బాధాకరం.  నిరుపయోగమైన వాడేసిన కాగితాలు స్టిక్కర్స్ వంటివి దాచుకోలేం కదా.  ఇలాంటివి రోడ్ మీద పడి మన కాళ్ళ కింద లేదా మన వాహనాల చక్రాల కిందా పడి నలిగి చిరిగి ఎగిరి పోతూ ఉంటాయి.. దేవతల దేవుని చిత్రాలు ఉన్న ప్యాకింగ్ మెటీరియల్.  భగవంతునికి సంబంధించిన ఇటువంటి చేయకూడని వ్యాపార సరళి గురించి ఎవ్వరూ పట్టించుకోకపోవడం చాలా  ఆశ్చర్యం, కలిగిస్తుంది.   ప్యాకింగ్ లకు దేవుని దేవతల చిత్రాలను వాడకూడదని ముద్రించకూడదని కట్టుదిట్టమైన నిబంధనలు ప్రభుత్వం అమలులోకి  తీసుకొని రావాలి, చట్టపరమైన చర్యలు, తీసుకోవటానికి, దేవుని మరియు  దేవతల చిత్రాలను వ్యాపారానికి వాడుకోవటం సబబేనా?.. ధర్మమేనా? వ్యాపారస్తులు ఆలోచించాలి.. ఒక సారి.  వాళ్ళూ భక్తులే కదా..  భగవంతుని వలన అందరికీ మేలే కదా జరగాలి..  మన  భక్తిలో నిబద్ధత ఉండాలి.. అశ్రద్ధ అలసత్వం కాదు..  చిత్తశుద్ధి ,ఏకాగ్రత స్వచ్ఛమైన మనసు కలిగి ఉండాలి..  అప్పుడే మనకు భగవదనుగ్రహం లభిస్తుందన్న సంగతి మనకు తెలుసు.  మన సంస్కృతిని, సాంప్రదాయాలను మనమే కాపాడుకోవాలి.. ఎవరో వచ్చి కాపాడుతారు అనుకోవటం పొరపాటు. మనం  అందరం ఆలోచించాలి.? ..  ఆచరించాలి.  నేటి నుండి మనమే స్ఫూర్తి దాతలుగా మార్గదర్శకులుగా,  ఈ మార్పును అంగీకరించాలి.

" హరి సర్వోత్తమ"
" వాయుజీవోత్తమ"
🙏🙏🙏🙏🙏

"Conflict Management" ("ఘర్షణ" నిర్వహణ సామర్థ్యము)

 [4/8, 09:54] +91 87925 86125: "🚩🚩🚩🚩🚩🚩 "Conflict Management"              ("ఘర్షణ" నిర్వహణ సామర్థ్యము)          

        🌹🌹🌹
🚩సేకరణ:- Impact Foundation. సౌజన్యం తో &  సమర్పణ:- "మజుందార్, బెంగళూర్" సెల్:87925-86125.    , 
        🇮🇳🇮🇳🇮🇳
"🌹"ఒక వ్యక్తి లో అంతర్మథనంలో, లేదా మరియు ఒక వ్యక్తి తో, లేదా కుటుంబ సభ్యులతో గాని, రెండు విరుద్ధమైన కోరికలు, లేదా అభిప్రాయాలు  వ్యక్తం చేయుటలో  ఏర్పడినదే "ఘర్షణ"  అని అందురు.  దీనికి ఒత్తిడి అనేది మూలము కారణము "పాండే "అనే ఆయన ఘర్షణ బాగా యొక్క క్రమాల ప్రక్రియ చెప్పినాడు.      
          🌻🌸🪷
🌹ఇది నాలుగు రకములు
                  🔥  1)Intra- Personal":- "తనలో తానకు " అంతర్మథనం" ఏర్పడుతుంది.  మనలో జరిగే "సంఘర్షణ. " మనకు మనమే యుద్ధం చేస్తాము . సాధించిన తనపై తాను జయించిన విజయము గా పేర్కొనవచ్చు.               

🌹"2) "Inter- Personal" :-- " మన కుటుంబ విషయాలలో, బంధువులతో కుటుంబ సభ్యులతో   ఆలోచనా సరళిలో ఘర్షణ.   అనగా మనతో జీవించే వ్యక్తులు మనతోనే ఉంటారు.    మన దృష్టి వేరు గా ఉండవచ్చు , మీ కుటుంబ సభ్యులు "ఆలోచనాసరళి" ఆవిష్కరణలో పడే "ఘర్షణ.'                      

🌹3) "Intra Group":-- "మనం పని చేసే చోట, సమూహములో అనగా స్కూలు, కాలేజీ సంస్థలలో వృత్తిలో, వ్యాపారము లో, ప్రమోషన్ విషయాలలో ఏర్పడే "ఘర్షణ".        

🌹4)"Inter- Group":--" ఒక గ్రూపు కు మరియొక గ్రూపు మధ్య జరిగే "ఘర్షణ" బయట వ్యక్తుల నుండి జరిగే  ఘర్షణ, మనకు సంబంధం లేని వారితో వచ్చే "ఘర్షణ."  పేర్కొనవచ్చు .

         "మనిషి పుట్టుక తోనే, ఏడుపు రాలేదని, రెండు కాళ్లు పట్టుకుని పైకి లేపి కొద్దిగా గుంజుతారు, అప్పుడు పిల్ల ఏడవ గానే, 'అమ్మయ్య '  అని ఊపిరి పీల్చుకుంటారు, అప్పుడు పడేది,  కూడా ఒక రకమైన ఘర్షణ కదా! ఇదే ప్రారంభ "ఘర్షణ".      

🚩"ఘర్షణ" వల్ల ఉపయోగాలు:-       
           💐💐💐
💧1)"కొత్త విషయాలు, కొత్త సిద్ధాంతాలు కనుక్కో గలము,  ప్రొడక్షన్ లో వస్తువుల  "క్వాలిటీ" పెంచుటకు అవకాశము ఉండును.                     

💧2)" Positive Atitude. ":  పెరిగి బంధాలు పెరుగును.     

💧3)"ఆ సమస్యను ఘర్షణ నుండి అవాయిడ్ చేయకుండానే "సాల్వేషన్"  చేసిన తెలివితేటలు  పెరుగును.            

🏴ఘర్షణ వల్ల వచ్చే నష్టాలు:-                       
          🟡🟣🟠
💐1) మీరు అనవసరముగా మానసిక ఒత్తిడికి గురి అవుతారు.                     



💐2) మీకు అనవసరం గా సమయము వృధా అవుతుంది.          

💐3) మీ 'నిర్ణయ సామర్ధ్యము 'తగ్గుతుంది.  

💐4) పని జరగాల్సిన విధముగా జరగదు.        

💐5) "ప్రొడక్టివిటీ" దెబ్బతినే ప్రమాదముంది.           

💐6)"మీ కుటుంబ భద్రత విషయంలో కొన్ని ఆందోళనలు కలగవచ్చు.  

💐7) మీ మైండ్ నందు 'నెగిటివ్ థాట్స్" '"వచ్చును.   

💐8)మీ జీవితం లోని వ్యక్తుల మధ్య దూరం పెరిగే అవకాశము ఉండును.   "

🔔"ఘర్షణ ఎందుకు గానూ వచ్చును"?                     
          🔥🔥🔥
🌷1) జీవితంలో Goal లేకపోవుట వల్ల, ప్రతి రోజుకు ఒక 'లక్ష్యం' ఉండవలెను. అభి

 లేకపోవుట వల్ల,           

🌷2)" Lekha values, ethics, లేని వారి మధ్య ఆటంకాలు వస్తాయి, అప్పుడు "మానసిక సంఘర్షణ "  జనరేట్ అవుతుంది.                  

🌷3)" టీం మధ్య లేకపోవుట మేనేజర్    టైముకు "కోఆర్డినేషన్"   లేకపోవుట వల్ల 

"🌷4) సమయపాలన "పాటించే విషయము ద్వారా ఏర్పడును.  

🌷5)"Co-ordination లేకపోవుట వల్ల కలిగే అంతర్మధనం ఏర్పడుతుంది.           

🌷6)"సరైన గుర్తింపు లేకపోవడం వల్ల,  ఉద్యోగము నందు "డిస్క్రిప్షన్ " లేక ఏర్పడును.

🌷" కోపం ద్వారా కొందరు వ్యక్తులు కోపం బహిర్కితపరుస్తారు . మరి కొందరు అంతర్ "ఘర్షణ "పొందగలరు. ఐఏఎస్ ,ఐపీఎస్  ట్రైనింగ్ లో వారికి Complicit  మేనేజ్మెంట్ పాఠం ఉండును .     

🚩"ఈ ఘర్షణను మీరు ఎలా అధిగమించాలి?   
         🌹🌹🌹
🌻1) passive way lo ఒక విషయాన్ని సీక్రెట్ గా మేనేజరు దాయాలి.        

🌻2) "listen cute fully: ప్రతి ఒక్కరూ చెప్పినది ఓర్పుగా పూర్తిగా వినాలి, అప్పుడు అతని బాధ కొంత తగ్గును. (ఉదాహరణకు డాక్టర్ వద్దకు పేషెంట్ వెళ్ళిన డాక్టర్ బాధితుడు యొక్క సంగతి పూర్తిగా పేషెంటుకు చాలా వరకు 50% జబ్బు తగ్గును).      

🌻3) సమ భావం, తో జాతి, కుల, మత, భేద భావములను చూపరాదు.                    🌻4) సమస్య మీద దృష్టి పెట్టి ఆ "సమస్య"  మీద పోరాడాలి తప్పా  ఆ వ్యక్తి మీద కాదు. చెడు మూలాలను ప్రక్షాళన చేయాలి.                      

🌻5)" Avoid blaming : సంస్థ లో జరిగిన తప్పును వేరే వారి మీదకు తప్పు తోయ్యరాదు.  చెడు జరిగిన అది తన మీద వేసుకోవాలి . మంచి జరిగిన అది అందరికీ పంచాలి. ఇది నాయకుడి లక్షణం.                         

🌻6)" ఎప్పటికప్పుడు మీ యొక్క feedbacks తీసుకోవాలి .   మీ సహచరుల వద్ద,  మీ వల్ల ఉద్యోగులు సఫర్ అవుతున్నారు ఏమో కనుక్కోండి? మార్పులు, చేర్పులు ఉన్న టీం డెవలప్మెంట్ కొరకు చేసుకుని తీరాలి.           

🌻7)" positive feedback ఇవ్వగలిగితే కంపెనీ బయటపడితే సదరు విషయాన్ని అందరికీ పిలిచి చెప్పాలి.  

🌻8)"contraction way" లో మనలోని లోపాలు తెలుసుకోవాలి.               

🌷"Basement steps":-                          

🌺1) నీవుWin అవ్వాలి  -- నేనుWin అవ్వాలి,. 

🌺2)నీవుWin   అవ్వాలి-- నేను Loose   అవ్వాలి.                        

🌺3)   నీవు loose అవ్వాలి  ---  నేను Win అవ్వాలి.                        🌺4) నీవు   Loose అవ్వాలి -- నేను  Loose అవ్వాలి.   ఎది మంచిదో మీకు తెలుసు కదా!    

🚩"ఘర్షణ"  రావడానికి గల కారణాలు,  దానిని అధిగమించుటకు మార్గాలు, సూచనలు" తెలుసుకుందాం!               
         💐💐💐
🌞1)" Avoid Complict :- "పిల్లలతో మీరు బయటకు పోవుచున్నారు.  ఎవడో త్రాగి గొడవ చేయుచున్నాడు. మీరు అప్పుడు "అవాయిడ్" చేసి పోతారు కదా!        
 


🌞2)"Accommodation:-

"మీకు  మంచి సామర్థ్యము ఉన్నది.  కానీ చూసి చూడనట్లు వెళ్ళవలసి ఉంటుంది. (ఉదాహరణకు పిల్లల విషయంలో పిల్లలు చాక్లెట్లు తిన్నా, లేదా టీవీ చూస్తున్నా కొన్ని సమయాలలో ఇది వర్తించును)        

🌞3)Forcing:-- కొన్ని విషయాలలో అధికారము చెలాయించాలని బలవంతం పెట్టి చేయాలి. (ఉదాహరణకు మీ పిల్లలను తెల్లవారుజామున లేపుటకు గాను).            

🌞4) Compromise:- కొన్నిసార్లు మీరు తప్పులు చేయకపోయినా సారీ, చెప్పుట చేయాలి, ఆ సమయములో నేను తప్పు మాట్లాడి ఉండవచ్చు అని ఒప్పుకోండి, దానివల్ల బంధాన్ని నిలబెట్టుకోవటం అవుతుందని తెలుసుకోండి.                   

🌞5) Frequent meetings:- తరచూ సమావేశము ఏర్పాటు చేస్తూ ఏ చర్యలు తీసుకోవాలి, మార్పులు, చేర్పు లు,  పర్సనల్ డిస్కషన్స్ చేయాలి.                          

🌞6  )Never criticize:- ఏ విషయాన్ని కూడా ఎప్పుడు, ఎక్కడ విమర్శించరాదు.              

🌞7)"Always appreciate:- ఎదుటివారి మంచిని మైకులో చెప్పు, చెడును చెవిలో చెప్పు, 

🌞8)సౌమ్యంగా, సరళమైన భాషలో, సున్నితముగా, నైపుణ్యంతో , లౌక్యం గా మాట్లాడుతూ చెప్పు.

 🌞9)"Success sharing to team:- మీ సమస్త విజయాన్ని అందరికీ పంచి పెట్టడం నేర్చుకోండి, (శ్రీహరికోట రాకెట్ కేంద్రము నందు ప్రయోగించిన వాటి విజయాలను ఎప్పటికప్పుడు అందరికీ షేక్ హ్యాండ్ ద్వారా, మీడియా ద్వారా, పంచి పెట్టుట మనం చూస్తూనే ఉన్నాం) నేడు మన ప్రియతమ ప్రధాని ( పిఎం,)  శ్రీ నరేంద్ర మోడీ, గారు  ప్రతి విషయములోను, సందర్భంలోనూ వ్యక్త పరచుటకు మనము చూసినాము).               

🌞10)"Correct manager:-- మీ కోపాన్ని, మీ సమయాన్ని , మీ వాగ్ధాటిని, మేనేజ్ చేసుకోండి సమయస్ఫూర్తితో! 

🚩గమనిక:- ఎదుటి వ్యక్తి విషయములో సైకాలజీ ప్రకారం అవుటకు మీ మాటలు సుమారు ఎనిమిది సెకండ్లు పట్టును. హడావడిగా అర్థం కాదు, ఎదుటి వారికి తగు సమయం ఇస్తూ నిదానముగా, క్లుప్తముగా, మాతృభాష లో తెలియపరచాలి.       

🚩మీరు బాగా చేయగలరు.  ఈరోజు ఎందుకో దీని వల్ల చేయలేకపోయారు, అంటూ "ముల్లును ముల్లుతోనే తీయాలి". అదే సామెతను గ్రహించి మీ ప్రవర్తన, మీ మాట, తీరున ప్రవర్తిస్తే "ఘర్షణ" నుండి మీరు అధికమించి గొప్ప, ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా రాణించగలరు, కీర్తించ బడ గలరు. "జైహింద్-- జై భారత్".    
     Mazumdar, Bangalore: సమర్పణ                   
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
[4/8, 09:54] +91 87925 86125: 🟠🟣🟡🟢🔴
" మీరు ఇతిహాస పురాణాలు యందు ఆసక్తి ఉన్నవారు అయితే, మీరు ఆధ్యాత్మిక దృష్టి కోణంలో " Complicit"
అనేది ఏ సందర్భాలలో ఎక్కడ జరిగింది కొన్ని విషయాలైనా పరికించండి!
       🙏🙏🙏
💐" అర్జునుడు' కురుక్షేత్ర యుద్ద" మందు కురువృద్ధులైన భీష్మ ,ద్రోణ, కృపాచార్యులు మీద యుద్ధము చేయుటయందు (తాత, గురువు,  రాజ పురోహితులు మరియు పెద్దలపై) మనసు వైకల్యము చెంది, "ఘర్షణ" కులోనైనారు కదా!

🌷" పంచభూతాలు అయినా గాలి నీరు అగ్ని భూమి ఆకాశము లను మీరు పరిశీలించిన అవి కూడా నిత్యము "ఘర్షణ" కు గురి అవుట గమనించగలరు.
ఆ)" గాలి:- ఈదురుగాలి, వడగాలి, సుడిగాలి , అంటూ తన ప్రతాపము చూపెట్టుచూ వాతావరణముతో "ఘర్షణ " పడినప్పుడు చూస్తాం కదా!

ఆ) నీరు:- బంగాళాఖాతం లాంటి సముద్రాలలో  వాయుగుండం వచ్చి, సునామీలు ఏర్పడి, ఆ వాతావరణంలో బెస్త వారికి హెచ్చరికలు సముద్రంలోనికి వెళ్ళవద్దు అని ప్రభుత్వం చేస్తుంది కదా!" నీటి ఘర్షణ" వల్ల

)ఇ)" భూమి:- భూమి కార్బన్ పొరల వల్ల ఎనర్జీ పుట్టి ,భూకంపాలు వచ్చి ఇండ్లు కూలి బ్రిడ్జిలు కూలుట చూస్తాం భూమిలో "ఘర్షణ "కదా!

ఈ)" అగ్ని:- " ఇది పుట్టించుటకు కూడా "యజ్ఞము చేయుట కు నందు రెండు వృక్షముల కర్రలతో మదనము చేసి అగ్గిపుట్టిస్తాము.   అలాగే అమెరికా లాంటి దేశాలలో
కాలిఫోర్నియా పెట్టింది పేరు . తరచూ అక్కడ అడివిలో కార్చిచ్చు రేగి కొన్ని వేలు వృక్షములు కాలిపోతే హెలికాప్టర్తో  తో మంటలను అదుపు చేయుట మనము (వార్తలు) వింటాము.
ఆర్క్ వెల్డింగ్ కూడా "అగ్నిఘర్షణ"  తోటే ఇండ్లు, బ్రిడ్జిలు కట్టుటకు ఉపయోగిస్తున్నాము.

5)"ఆకాశం:- " ఈ ఆకాశమందు " ఘర్షణ" లో భాగంగానే మేఘాలు, మబ్బులు, మెరుపులు,  పిడుగులు భూమి మీద పడుట " ఘర్షణ" పాత్ర ఉన్నది కదా!

🔥" దేవతలు రాక్షసులు క్షీరసముద్రమును కలిసి ఇరుపక్కల ఆదిశేషుని పట్టుకొని మేదో మదనము చేయగా అనేకమైనవి ,ఈ సృష్టిలో ఉద్భవించినట్లు నేటి పండితులు చెప్పే  పురాణ ప్రవచనాలు విన్నాము మరియు కొన్ని చిత్ర రంగంలో కూడా చూడటం జరిగినది కదా! అప్పుడు జరిగినది కూడా" ఘర్షణ" వల్ల

🌹" శ్రీకృష్ణ రాయబారం, అంగదరాయబారం, మొదలైన అనేక పౌరాణిక నాటకము, చిత్రరంగంలో ప్రదర్శనలో అక్కడ రాజులు పంపగా జరిగినవి మనము చదివినాము మరియు దృశ్యములను వీక్షించినాము.  ఇరుపక్షాలు మంచి,చెడులు బేరీజు వేసుకునుటకు వారు మనుషుల్లో పడిన "ఘర్షణ" కు లోను అయినట్లు మనకు తెలుయుచున్నది.

🌸" కురుక్షేత్రము సంగ్రామము నందు  ధర్మానికి - అధర్మానికి మధ్య మాత్రమే జరిగింది అన్న విషయము మనకి తెలుసు.  కౌరవుల పక్షము వైపు విదురుడు జ్ఞానుడు ఉన్నాడు ఆయన  ధర్మము చెప్పాడు. కానీ ఆ ధర్మము బానిస అయ్యింది ( దాసీ పుత్రుడు కనుక వారు లక్ష పెట్టలేదు, లెక్క చేయలేదు, అప్పుడు "ఘర్షణ" పడి ఉన్నారు.

🙏సమర్పణ : Mazumdar Bangalore,87925-86125

🌻" ఆధ్యాత్మిక కోణంలో "ఘర్షణ" 1)" ఆధ్యాత్మికం:
నా ఆలోచనలు భావాలు నావి.
2)" ఆది భౌతిక: family members observe
3)" ఆది దైవిక : తుఫాను, కరోనా, మరికొన్ని రకాల అనుకోని సమస్యలు, వచ్చిన ఎదుర్కొనులో ప్రయత్నాలు.
     🌷🌷🌷🌷🌷
    అలాగే " CONFLICT " SKILLS" గురించి తెలుసుకుందాం!
       🪷🪷🪷
1. Peace
2. Ideas not people
3. Focus on best out coming not winning.
4. Listening to others ideas
5. Understand all sites of issues
6. Multiple portonical solutions.
7. Expessing emotions
8. Refractive thinking
( Alternative)
9. Optimistic ( positive) Choose Wisely &  conflict evolvers in to opportunity.
       🔥🔥🔥

🔥🔥🔥🔥🔥🔥🔥
" Conflict Resolution Techniques."
        🙏🙏🙏
A)" Level of conflict:-
    Inter personal, friends,  international

B)"Cause of conflict:
    Perception, performance, interest personality.
      🔥🔥🔥
1)" Ask open and Question.
2.) Listen activity
3)" Begin statement with I
4)" Tame your emotions
5)" Don't take it personally.
6)" The present ,not on past
7)" show that you can compromise.
8) Don't  bad mouth someone to other
9)" Don't bad son
10)" Remember the aim
🔴🟢🟡🟣🟠💐
🔥🔥🔥🔥🔥👍

" Parenting tips" ( పేరెంటింగ్ టిప్స్)

 🔥🔥🔥🔥🔥
" Parenting tips"
( పేరెంటింగ్ టిప్స్) 
      ' మీరు సామాజిక మాధ్యమాల్లో ఎవరినైనా స్నేహితులుగా చేసుకోవాలనే అప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.   చెపుతాను ఓపికతో, మీ విలువైన, అమూల్యమైన సమయానికి వెచ్చించి వింటారా? 
     🙏🙏🙏
"Mazumdar Bangalore" 87925-86125.
       🔥🔥🔥

🦚 1)" అపరిచితులను మారు పేర్లు, ఫోటోలతో ఖాతాలను ఏర్పరచుకునే వారిని, కచ్చితంగా మీరు తిరస్కరించండి.  అపరిచితులు ఎవరైనా పదే పదే మీకు రిక్వెస్ట్ పంపిస్తూ ఇబ్బంది పెడుతుంటే ఫేస్బుక్ ఇచ్చిన ఆప్షన్  "బ్లాక్" లేదా రిపోర్ట్ ని ఉపయోగించండి. 

💐2)" మీరు మీ వ్యక్తిగత వివరాలు ఫోటోలు పోస్టులు వంటివి అతిగా పెట్టకపోవడమే మంచిది.   మీ ఖాతాలో ఉన్న స్నేహితులు చూసే విధంగా వాటిని పోస్ట్ చేసుకుంటే మేలు.   అది లేదంటే ఏ గ్రూపు వారు వాటిని చూడాలనుకుంటున్నారో ఆ మేరకే పరిమితం చేసినా మంచిదే.   అప్పుడే దుర్వినియోగం కాకుండా ఉంటాయి మీరు పెట్టిన పోస్టులకు మీ స్నేహితుల జాబితా లోని వారు స్పందించే తీరును గమనించుకోవాలి శృతిమించకుండా చూసుకోవటం ఉత్తమం.  శృతి మించి రాగాన పడకుండా ముందు జాగ్రత్త కొరకు మీకు చెప్పటం అయినది. పెద్దలు చెప్పిన మాటను  శ్రద్ధగా వినుట చేయాలి,  నిర్ణయం మీది, జీవితం మీది, బాధపడేది కూడా మీరే!  విజ్ఞులు వివేకవంతులు, ఎదుటి వారి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తాము నడుచుకుంటారు.
       🙏           
" Parenting Tips "-2
( "పేరెంటింగ్ టిప్స్")
    " మీ చిన్నారుల నిద్ర చక్కగా పోవుట లేదా?"
"Mazumdar, Bangalore" 87925-86125.
      🔥🔥🔥
      " మీ చిన్నారి పిల్లల "జీవనశైలిలో" మార్పులు నిద్రవేళ  లో అనూహ్య  మార్పులకు కారణం  అవుతున్నారు మీరే!  ఈ పరిస్థితి కొన్నాళ్ళకు నిద్రలేమి సమస్యకు దారి తీయవచ్చు.   ఈ దుష్ట    ప్ర భావము పెద్దల కంటే ఎదిగే పిల్లల పైనే అధికమని  అధ్యయనాలు. కొన్ని చెబుతున్నాయి.   ఈ పరిస్థితిని ముందు జాగ్రత్తగా గమనించుకుని చురుగ్గా స్పందించి చిన్నారులు కమ్మగా నిద్రపోయేలా చూడాలి.   ఇందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

💚 మీ పని వేళలకు రాత్రి, పగలు తేడా లేక పోవచ్చు.                       ఆ ప్రభావము చిన్నారులపై పడనీయకండి.   ఇల్లంతా వెలిగే లైట్లు, వెలుతురు ,కంప్యూటర్, స్మార్ట్ఫోన్ (smartphone) తెరల కాంతి, చిన్నారుల కంటి మీద కునుకు రాకుండా అడ్డుపడుతుంది, అని గుర్తుంచుకోండి?     మీ పిల్లలు ఆ పరికరాలకు దూరంగా ఉండేలా చూసుకోండి.    పరిస్థితిని మీరు మార్చకుంటే మాత్రం ముందు పిల్లలకు కళ్ళు పొడిబారటం వంటి సమస్య ఎదురవుతుంది.   నిద్రలేమి వల్ల ఊబకాయం, అలసట, కుంగుబాటు, వంటివి పిల్లలను వేధించ వచ్చు.

❤️ " మీ చిన్నారులు నిద్రపోయిన కచ్చితమైన వేళలు ఏర్పరచండి.   కొన్ని రోజుల పాటు దాన్ని అలవాటు గా మార్చాలి.   దానికి "21 రోజులు సూత్రము" గుర్తుంచుకోండి.   ఎవరైనా ఇరవైఒక్క రోజులు, ప్రతిరోజు ఒక పని తప్పనిసరిగా చేసినారా?  మరిచిపోరు ఇరవై రెండో రోజు కూడా ఆ అలవాటు     మానుకో రు.   పిల్లలు నిద్రించేటప్పుడు వెలుతురు, శబ్దాలు ఘాటయిన వాసన, వంటివి చేరకుండా చూడండి.   అలాకాకుండా రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుని ఉదయాన్నే నిద్రలేప వలసి వస్తే వారు చదువుపై దృష్టి పెట్టలేరు.

🇧🇴 నేడు తల్లిదండ్రులే సరే అయిన మార్గమున నడవరు, పిల్లల కొరకై తల్లిదండ్రులు కూడా రాత్రి 9 గంటలకు పడుకొని, ఉదయము సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాలకు (48) ముందుగా నిద్ర లేచిన, వారికి ఆ రోజు చాలా సమయము పొదుపు అగును.  ఎక్కువ కష్ట పడిన వారు అలసట చెందరు, వారే నేడు "భారతదేశ ఉత్తమ విజేతలు". అగును.

❤️ "గురుకులాలలో ను, సంగీత విద్య నేర్చుకునే వారు,  యోగాభ్యాసము చేయువారు, ఐ. ఐ. టీ రామయ్య గారు కూడా ఈ పద్ధతినే అనుసరిస్తూ, తెల్లవారుజామున, వారు వచ్చిన వాహనాలను 12 కిలోమీటర్ల దూరంలో ఉంచి, వారి ప్రాంగణం  నకు నడుచుకుని వెళ్ళవలెను, అనే పద్ధతి పెట్టినారు.  ఎలాంటి 'రికమండేషన్స్," ఒప్పుకోరు.  అంతటి క్రమశిక్షణా, చర్యలతో తమ శిక్షణ నేటికీ కొనసాగించుట, మనందరికీ  తెలిసిన విషయమే!

🇧🇴" నేటి పిల్లలు ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటలకు, నిద్ర లేచుట, "కరోన"  వల్ల  ఉదయము స్కూల్స్ లేనందున, వట్టి సోమరిపోతులై, నేటి పిల్లల కు  పొట్టలు, కళ్లజోడు లు వచ్చుట, నేడు మనము చూస్తున్నాము.   దానికి కారణము "తల్లితండ్రులు" అని గుర్తించండి .  సరిగా మేల్కొనండి, భారతదేశ భవిష్యత్తు ముందు తరాల వారిదే అని గుర్తించండి.

💐" తల్లిదండ్రులు నేడు పోటీ ప్రపంచం నందు పిల్లలకు అధిక ఒత్తిడి కలగజేసి' విదేశీ విద్యలు కోసం  Abroad  లో తమ పిల్లలను, చదివించాలని
వారికి అన్ని సబ్జెక్టులలో 60% నుండి 80% మార్కులు వచ్చిన, విదేశాలకు పంపవచ్చునని, అక్కడ కొన్ని యూనివర్సిటీలలో
 "Scholarships" వచ్చునని, మరికొన్ని దేశాలలో ఉచిత వైద్య,
కూడా ఉండవచ్చునని, ఆదేశాలలో చదువుకుంటూ, ఉద్యోగం కూడా చేయవచ్చునని, అంటున్నారు.
తమ పిల్లలపై, వారి తీవ్రమైన కోరికను. బలవంతంగా రుద్దుచున్నారు.  " మన భారత దేశంలో విద్యను
చదువును బట్టి అర్హత కాకుండా, కుల ప్రాతి ప్రతీకగా  మీద కోటాలు ఏర్పరచి, మరికొన్ని రాజకీయ నాయకులు,
మధ్యవర్తుల ద్వారా అమ్ముకుంటున్నారు. అని ఆవేదన కూడా ఒక కారణం కావచ్చు!
🙏🙏🙏🙏🙏
" 


🙏" మానవ సంబంధాలన్నియు, నేడు ఆర్థిక సంబంధాలుగా ఉన్నవి.