*పెళ్లి అయిన ఆడవాళ్లు దీపారాధన చేయాలి అంటే రోజూ తల స్నానం చేయాలా.....*
ఇది సాధారణంగా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇదే అనుమానంతో రోజూ దీపారాధన చేయడం మానేస్తున్నారు..
వివాహం అయిన స్త్రీలు నిత్యా దీపారాధనకి రోజూ తల స్నానం చేయవలసిన పని లేదు, మాములుగా స్నానం చేసి పాపటిలో కుంకుమ ధరిస్తే నిత్యా దీపారాధన రోజూ చేసుకునే పూజ చేయవచ్చు.. ఆడవాళ్లకు పాపటిలో గంగమ్మ నివాసం ఉంటుంది.. పాపటి లో కుంకుమ ధరించడం వల్ల ఆ గంగమ్మ తల్లి ని అక్కడ నిలుపుకొని పూజించి నట్టు అందువల్ల ఆడవాళ్లకు రోజూ తలస్నానం అవసరం లేదు..పాపటిలో కుంకుమ ధరిస్తే తల స్నానం చేసి నట్టు.
అయితే ఏదైనా వ్రతం ,పూజ, ముడుపు, దీక్ష లాంటివి ఉన్నపుడు తప్పక తలస్నానం చేసే చేయాలి.. ఆడవాళ్లకు బుధ, శనివారం, తలస్నానం చేయడం మంచిది, శుక్రవారం వ్రతాలు ఉన్నపుడు శుక్రవారం చేయవచ్చు, మైలు ఉన్నపుడు కచ్చితంగా, 1, 3, 4,5, రోజుల్లో తలస్నానం చేయాలి.. ఆ సమయంలో తిని తాగి మిగిల్చింది ఎవరికి పెట్టకూడదు.. అలా పెట్టడం వల్ల తిన్నవారికి పెట్టిన వారికి కూడా ఆర్ధిక ఇబంధులు వస్తాయి, ముఖ్యంగా భర్తకు పెట్టకూడదు.
|| ఓం నమః శివాయ ||
No comments:
Post a Comment