Sunday, December 1, 2024

 *తోటకూర...*

*ఇది అందరికీ తెలిసిన కధే అనుకుంటా..*
*మంచి మాటని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదే కదా అని...*

*ఒక బాబు చిన్నతనంలో,*
*తల్లి దగ్గరికి వచ్చి తను దొంగిలించి*
*తెచ్చిన తోటకూర కట్టలను చూపించి,*
*అమ్మా, నేను నీకు ఇవాళ*
*కూరల ఖర్చు తప్పించాను.. అని గొప్పగా చెప్పాడు..*

*అది విన్న*
*ఆ తల్లి, ఒక నిముషం తటపటాయించి, ఏమనుకుందో ఏమో, సరే,*
*ఆ తోటకూర ఇలా ఇవ్వు బాబు.. అని కొడుకు దగ్గరనుంచి తోటకూర తీసుకుంది...*

*ఓహో , నేను చేసిన పని అమ్మకి నచ్చింది అనుకుని, వాడు అలా దొంగతనాలకి*
*అలవాటు పడ్డాడు...*

*తల్లి కూడా కొడుకు ఎలా ఎదుగుతున్నాడో,*
*అంతగా పట్టించుకోలేకపోయింది...*

*పెద్దయ్యాక, వాడొక పెద్ద దొంగ అయ్యాడు,*
*ఒక పెద్ద దొంగతనంలో పోలీసులకి పట్టుబడ్డాడు..*

*జైల్లో పెట్టి పోలీసులు శిక్షిస్తున్నారు...*

*అంతలో తల్లి పరుగులు పెట్టుకుంటూ,బాధ పడుతూ పోలీస్ స్టేషన్ కి*
*వచ్చింది,ఒకటే ఏడుస్తూ* *పోలీసులకి చెప్తోంది,*
*" నా బాబు ఏ తప్పూ చెయ్యడు, వాడిని వదిలిపెట్టండి" అని...*

*అప్పుడు పోలీసులు.." వాడొక పెద్ద దొంగ,*
*వాడికి ఏ తప్పూ తెలీదు అని చెప్తావేంటి, కావాలంటే, వాడినే కనుక్కో ఫో..అని విసుక్కున్నారు..*

*అప్పుడు తల్లి ఏడుస్తూ, కొడుకు దగ్గరికి వచ్చింది,*
*" ఏం చెప్తున్నార్రా వీళ్ళు, నువ్వు దొంగవేవిట్రా " అంటూ ఏడుస్తోంది...*

*అప్పుడు కొడుకు తల్లిని దగ్గరికి రమ్మని చెప్పి,*
*తల్లి చెవిని గట్టిగా మెలిపెట్టాడు,*
*తల్లికి నొప్పి పుట్టినా వదల్లేదు.*
*అప్పుడు తల్లి " ఏమిట్రా, ఈ పిచ్చి పనులు.. అని విసుక్కుంది...*

*అప్పుడు వాడు తల్లితో ఒకటే మాట చెప్పాడు "అమ్మా,* *తోటకూర దొంగతనం నాడే,*
*నువ్వు నా చెవిని ఇలా గట్టిగా మెలిపెట్టో,*
*నన్ను కొట్టో...దొంగతనం తప్పురా" అని చెప్పుంటే ఈ రోజున నేనిలా దొంగనయ్యేవాడిని కాదు కదా.. అని తల్లిని మందలించాడు....*

*నేర్పాల్సిన,నేర్చుకోవాల్సిన బాల్యంలో,*
*సందర్భాన్ని బట్టి పిల్లలకి తల్లితండ్రులు ఒక మంచి మాటను చెప్పటం, ఒక మంచి పద్ధతి నేర్పటం ఎంత అవసరమో...*
*నేర్పకపోతే పర్యవసానం ఏమిటో ఈ కధ చెప్పకనే చెబుతుంది...*

No comments:

Post a Comment