*ఒక్కోడిది ఒక్కో బాధ::*
*మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు - కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది...*
*కర్ణుడు కృష్ణుడుని అడిగాడు...*
*నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది..*
*అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే..*
*ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకునిరాకరించారు..*
*ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో..*
*పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు..*
*పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు..*
*ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది..*
*ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే..*
*నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే..*
*అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు...*
*దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు...*
*నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను..*
*నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది..*
*నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ వేరుచేయబడ్డాను..*
*చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు..*
*నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను...*
*నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి..అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు..కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను..*
*నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా..*
*నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు..*
*మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ..*
*సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది.*
*జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునవడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది..*
*అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది..*
*సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది...*
*అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు...పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన...*
*ఒకటి గుర్తుంచుకో కర్ణా..*
*జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి..*
*జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు..*
*దుర్యోధనుడు అవనీ యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే..*
*ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు..*
*మనకు ఎంత అన్యాయం జరిగినా..*
*మనకు ఎన్ని పరాభవాలు జరిగిన..*
*మనకు రావల్సినది మనకు అందకపోయినా...*
*మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది..*
*జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో..అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు..మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు...ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు..అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు..*
*“శ్రీకృష్ణం వందే జగద్గురుం”*
*మన సంస్కృతి..*
No comments:
Post a Comment