Sunday, December 1, 2024

 🕉️చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
 కొంచమైన నదియు గొదవుగాదు
 విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
 విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడా విత్తనము చిన్నదేకదా!

 🕉️ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
 భాండశుద్ధి లేని పాకమేల?
 చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?
 విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాటించడంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.                    

No comments:

Post a Comment