ప్రధానమైన ఈశ్వరనామాలు రెండు-
1. అంతా
2. అన్ని. 🎋🎋🎋 'అంతా నేనే' అని ఉండేవాడు ఈశ్వరవాది.
'ఏదీ నేను కాదు' అని ఉండేవాడు - నిరీశ్వరవాది. 🌴🌴🌴. సత్యంలో అసత్యం ఉండదు.
సత్యమొక్కటే ఉంటుంది. అసత్యంలో సత్యాసత్యములు రెండూ ఉంటాయి. 🌱🌱🌱 విచిత్రమైన విషయం ఏమంటే- అప్రయత్నంగా వచ్చేదాని విషయంలో ప్రయత్నం చేస్తుంటాం. ప్రయత్నంతో వచ్చేదాని విషయంలో అప్రయత్నంగా ఉంటున్నాం. ❤️❤️❤️. 'సత్యము' అన్న పదం
ఒక్కటే అసత్యం. ఇంకేదీ అసత్యం కాదు. 'అసత్యం' అన్న పదం ఒక్కటే సత్యం. ఇంకేదీ సత్యం కాదు. 🌿🌿🌿 సముద్రంలోని చేప సముద్రాన్ని చూడాలని సాధన చేసిందట.
మనం చేస్తున్నదీ అదే.
No comments:
Post a Comment