*పంచకళ్యాణి అంటే ఏమిటి? అది అంతటి ప్రాముఖ్యతను పొందడానికి కారణం ఏమిటి?*
గుర్రం, ఎద్దు, ఆవు…. లాంటివాటిని కొనటానికి ముందు వాటి శరీరం పైన ఉండే సుడులను చూస్తారు. ఈ సుడులు కొన్ని ప్రాంతాల్లో ఉంటే యజమానికి జయం. అన్నిటా కలిసివస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వుండే సుడులు యజమాని నష్టం తెస్తాయి. మరణం కూడా సంభవిస్తుంది.
గుర్రానికి సుడులు ఐదు నిర్దిష్ట స్థానాలలో ఉంటే దాన్ని కలిగి ఉన్న యజమానికి తిరుగే లేదు. అలాంటి ఐదు శుభసుడులను (దుష్టసమాసమే, అయినా సర్దుకుపోండి) కలిగి ఉన్న గుర్రమే పంచకల్యాణి.
సుడులకు సంబంధించి ఆవు, ఎద్దుకు ఇలాంటి ముద్దుపేర్లు లేవు. ఎందుకంటే గుర్రం రాజుగారి వద్ద ఉండేది. కాబట్టి దానికే ముద్దుపేర్లు.
కాళహస్తి సంస్థానానికి గుర్రాల వర్తకుడు వచ్చి , ఒక అద్భుతమైన గుర్రాన్ని అమ్మచూపాడు. గుర్రం బాగుంది కానీ, దానికి సుడులు సరైన స్థానంలో లేవు, కొనవద్దు అని నిపుణులు చెప్పారు. యువరాజు దానిమీద యమామోజు పడ్డాడు. అతని ముచ్చట తీర్చటానికి ఆస్థాన విద్వాంసుడు శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి రాత్రికి రాత్రి ఒక ఆస్వాశాస్త్రాన్ని రాశాడు.
ఆ శాస్త్రంలో అమ్మకానికి వచ్చిన గుర్రానికి ఉన్న సుడులు శుభప్రదమైనవే అని శ్లోకాలకి శ్లోకాలు రాశాడు.
ఆ కల్పిత శాస్త్రంని చూపి గుర్రాన్ని కొన్నారు. కొన్నాళ్ళకి సంస్థానం శ్రీమద్రామారమణ గోవిందో హరి!
ఆ పండితుడికి పోయిందేమీ లేదు, కాళహస్తిని వదిలిపెట్టి పిఠాపురం చేరాడు.
ఐదు శుభప్రదమైన లక్షణాలను లేదా సుడులను కలిగివున్న గుర్రమే పంచకల్యాణి.
No comments:
Post a Comment