365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథ తో
♥️ *కథ*-*301* ♥️
*అద్భుతం* *అంటే* *ఏమిటి*?
*ఉపచేతన మనస్సు యొక్క శక్తి*
సైన్స్ నిరూపించలేనిది ఏదైనా, అది ఒక అద్భుతం అని చెప్పవచ్చు.
ఈ రోజు మనం అలాంటి ఒక కథను పంచుకుంటున్నాం, ఇది చదివిన తర్వాత మనం ఏదీ అసాధ్యమని అనిపించదు. మనకు కావలసిందల్లా మనలోని ఆ శక్తిని గుర్తించడమే.
అమెరికాకు చెందిన మోరిస్ గుడ్ మాన్ కథ ఇది. మోరిస్ గుడ్ మాన్ కాలేజీ పూర్తిచేయకుండానే వెలివేయబడ్డవాడు. తన జీవితంలో ఏమి చేద్దామనుకుంటున్నాడో అతనికే తెలియదు. అతను తన జీవితాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఏ మార్గాన్ని కనుగొనలేకపోయాడు.
ఒకరోజు అకస్మాత్తుగా, 'థింక్ అండ్ గ్రో రిచ్' ( ఆలోచించు, సంపన్నుడివి అవ్వు ) అనే పుస్తకాన్ని చూసాడు. గుడ్ మాన్ కుతూహలంతో ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభించాడు. అందులో ఉపచేతన మనస్సు గురించి తెలుసుకున్నాడు. అతను దాని గురించి చదవడం ప్రారంభించి, తన ఉపచేతన మనస్సును విస్తరించుకోవడానికి ప్రయత్నించాడు. తన ఉపచేతన మనస్సు యొక్క లోతులలోకి వెళ్లడం ప్రారంభించినప్పుడు, తన జీవితాన్ని ముందుకు నడిపించడానికి లోపలి నుండి ఒక మార్గాన్ని కనుగొనడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత, అతను తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలలోనే, ఒక విజయవంతమైన వ్యాపారవేత్త అయ్యాడు.
అయితే ఈ కథ ఇక్కడితో ముగియలేదు. మోరిస్ గుడ్ మాన్ విజయవంతమైన వ్యాపారవేత్త అయిన తర్వాత, తాను స్వంతంగా ఒక విమానాన్ని కొనుక్కున్నాడు. పైలట్ లైసెన్స్ తీసుకుని, దానిని తానే నడపడం ప్రారంభించాడు. ఒకరోజు, అతను గాలిలో ఉండగా, అకస్మాత్తుగా విమానం ఇంజిన్ ఫెయిల్ అయ్యి, అత్యవసరంగా విమానం దించడానికి ప్రయత్నించాడు, కానీ అది కుదరక, అతని విమానం కూలిపోయి నేలను తాకి, పేలిపోయింది.
ఈ విధంగా గుడ్ మాన్ ఘోర ప్రమాదానికి గురయ్యాడు. చుట్టుప్రక్కలవారు అంబులెన్స్ కు ఫోన్ చేయగా, ఊపిరి కూడా లేని ప్రమాదస్థితిలో అతనిని ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి చేరుకున్న తర్వాత వైద్యులు అతని పరిస్థితిని సమీక్షించారు. అతను చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు, అతని శరీరం మొత్తం పక్షవాతానికి గురైంది. ఊపిరి కూడా సరిగా తీసుకోలేక, మాట్లాడలేకపోతున్నాడు. కళ్ళరెప్పలు మాత్రం వేయగలుగుతున్నాడు అంతే. అతని వెన్నుపూస పూర్తిగా విరిగిపోయింది. యంత్రాల సహాయం ద్వారా మాత్రమే శ్వాస తీసుకోగలుగుతున్నాడు, వెంటిలేటర్ సహాయంతో మాత్రమే జీవించి ఉన్నాడు.
కొద్దిరోజుల చికిత్స అనంతరం గుడ్ మాన్ తనంతట తానుగా ఎప్పటికీ ఊపిరి పీల్చుకోలేడని, యంత్రం మీద మాత్రమే జీవించి ఉంటాడని, ఎప్పటికీ కదలలేడని వైద్యులు అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. అతని శరీరం పూర్తిగా చచ్చుబడిపోయి, వెన్నుపూస పూర్తిగా విరిగిపోయింది.
గుడ్ మాన్ మాట్లాడలేకపోయినా, కదలలేకపోయినా, వినగలడు. అతను డాక్టర్ మాటలు విని, తన పరిస్థితిని అంగీకరించడానికి పూర్తిగా నిరాకరించాడు. ఎందుకంటే అతనికి తన ఉపచేతన మనస్సు యొక్క శక్తి గురించి తెలుసు గనుక.
అప్పుడు తనకు తానే ఇలా చెప్పుకున్నాడు -
'నా భవిష్యత్తును డాక్టర్లు నిర్ణయించలేరు. నేను ఏమి చేయగలనో, ఏమి చేయలేనో వారు నిర్ణయించలేరు!'
ఆ రోజు నుండి సరిగ్గా మూడు నెలల తర్వాత తానే ఈ బెడ్ మీద నుండి లేచి ఈ హాస్పిటల్ నుండి బయటకి వెళ్లాలని తన మనసులో బలంగా నిర్ణయించుకున్నాడు. దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తన కాళ్ళపై తాను నడుచుకుంటూ ఆసుపత్రి నుండి బయటకు వెళ్తున్నానన్న సానుకూల ఆలోచనను అతను ఎల్లప్పుడూ తన మనస్సులో నిలుపుకునే ఉన్నాడు. అతను ఈ ఆలోచనలపై పని చేయడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా, కేవలం మూడు నెలల తర్వాత, గుడ్ మాన్ తన మంచం మీద నుండి లేచి, ఆసుపత్రి నుండి బయటకు తన పాదాలపై నడచి వెళ్ళాడు.
ఎవరూ నమ్మలేదు సరికదా అందరూ దీనిని ఒక అద్భుతంగా అభివర్ణించారు.
ఇది ఎలా సాధ్యమైందో వైద్యులెవరికీ అర్థం కాలేదు.
నేడు ప్రతి ఒక్కరూ మోరిస్ గుడ్ మాన్ ను ఒక మిరాకిల్ మ్యాన్ ( అద్భుత వ్యక్తి ) గా పిలుస్తారు. అతను అమెరికాలో ఒక మోటివేషనల్ స్పీకర్ ( ప్రేరణాత్మక వక్త ). ప్రపంచవ్యాప్తంగా తన కథను చెబుతూ పర్యటిస్తాడు.
స్వామి వివేకానంద మనందరికీ ఏదో ఒక చైతన్యపు స్థాయి ఉంటుందని తరచుగా చెబుతుంటారు. కానీ ఈ చైతన్యపు పొర చాలా పల్చగా, సన్నగా ఉంటుంది. అన్ని ఆధ్యాత్మిక సాధనల, యోగాభ్యాసాల లక్ష్యం ఏమిటంటే, మన ప్రస్తుత చైతన్యాన్ని విస్తరించడమే.
కానీ మన చైతన్యాన్ని ఎలా విస్తరించుకోగలం?
హార్ట్ ఫుల్ నెస్ అంటే ధ్యానం ద్వారా చైతన్యాన్ని విస్తరించడం, ఇంకా మన అస్తిత్వపు దివ్యికరణ.
♾️
మన చైతన్యం విస్తరిస్తున్న కొద్దీ, జీవితంలోని అన్ని అంశాలలో హృదయం నుండి మార్గదర్శకత్వం స్వయంచాలకంగా ఉంటుంది.🌸
*దాజీ*
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment