Thursday, December 11, 2025

నీకుగా నువ్వు ఎవ్వరినీ కోల్పోవద్దు. వారు నిన్ను కోల్పోతే వద్దనవద్దు. వారికి ఆ స్వేచ్ఛ ఉంది. దేనికయినా సిద్ధంగా ఉండు.

 'సర్.. విపరీతమైన #బాధ వస్తుంది. ఏడుపు వస్తుంది. తట్టుకోవడం కష్టమవుతుంది.'

'బాధ ఎందుకు?'

'ఏమో తెలియదు. నా చుట్టూ ఉన్న social beings వలన ఒంటరితనం పెరిగి పోతుంది. అందరి లాగ ఉండలేక పోతున్నాను. రోజు రోజుకీ odd one out అయిపోతున్నాను.'

'అయితే ఏంటి? సోషల్ బీయింగ్స్ వారికి అవసరమైతే odd one out తో కూడా రేలషన్ పెట్టుకుంటారు. నువ్వు బలంగా తయారవ్వాలి.'

'...'

'నిజానికి odd one out కాదు. ఈ భూమి మీద ప్రతీ ఒక్కరూ #యూనిక్. ఆ విషయాన్నీ అంగీకరించ లేని మూర్ఖులు మాత్రమే అలా అంటారు.'

'ప్రతీ ఒక్కరూ నీకు బ్రతకడం రాదు, బ్రతకడం రాదని ప్రతీ నిమిషం చంపేస్తున్నారు.'

'వారలా అంటున్నా ఆ మాటలను పట్టించుకోవద్దు. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. వారికి అదే సమాధానం.'

'బ్రతకడం రాదు అంటే ఎక్కడ లేని బాధ అనిపిస్తుంది సర్..'

'నీకు బ్రతకడం వచ్చని వారికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీకు అవసరమైనట్లుగా, ఇష్టమైనట్లుగా జీవించే ప్రయత్నం చెయ్యి.'

'మిమ్మల్ని కూడా చిన్నప్పుడు ఇలాగే అనేవారా?'

'నన్నయితే ఎప్పుడూ బ్రతకడం రాదనే అనేవారు. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు... ఎవరని చెప్పగలను? అందరూ బ్రతకడం రాదన్న వారే.. చివరికి చిన్నతనంలో ప్రేమించిన అమ్మాయి కూడా నీకు బ్రతకడం రాదని ప్లేటు ఫిరాయించి వెళ్లిపోయింది.'

'అయ్యో..'

'ఎవరికో నిరూపించడం కోసం నువ్వు బ్రతకాల్సిన మార్గం ఎన్నుకోవద్దు. నువ్వు తినే ఆ కొద్దిపాటి ఆహరం, షెల్టర్ కోసం మనసు చంపుకుని నటిస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. ఇక్కడొక మాట, అక్కడొక మాట, ఈ రోజొక మాట, రేపొక మాట చెబుతూ బ్రతకాల్సిన అవసరమేంటి? నీ కోసం మాత్రమే బ్రతుకు. వీలయినంత వరకు ఇతరులకు, ఇతర జీవరాశులకు హాని కలిగించకుండా నీకు ఎలా నచ్చితే అలా బ్రతుకు. నీ ఆత్మ సాక్షిని చంపుకుని, లౌక్యం పేరుతో నటిస్తూ ఆరోగ్యం పాడుచేసుకుని సంపాదించిన డబ్బంతా రేపు హాస్పిటల్ కి కట్టడం తప్ప నువ్వు సాధించేది ఏమీ ఉండదు.'

'మరి వారిని ఎదుర్కోవడం ఎలా?'

'ఎవరినీ ఎదుర్కోవలసిన అవసరం లేదు. వారు అలాగే వాగి, వాగి వెళ్ళిపోతారు. నిజానికి వారు నీ బ్రతుకు కోసం అలా అనడం లేదు. నువ్వు వారికి అనుకూలంగా బ్రతకడం లేదనే కసితో నీ ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీసే పనిలో భాగంగా ఇలా అంటారు. అది నీ మీద ప్రేమ అనుకోవద్దు. పోయే వారిని పోనివ్వు. ఎవరినీ వెళ్ళొద్దని బ్రతిమాలాడవద్దు. నీకుగా నువ్వు ఎవ్వరినీ కోల్పోవద్దు. వారు నిన్ను కోల్పోతే వద్దనవద్దు. వారికి ఆ స్వేచ్ఛ ఉంది. దేనికయినా సిద్ధంగా ఉండు.'

Source link: http://youtube.com/post/Ugkx4_eT7JRh67X7i-AWzdGQFb9videjlMii?si=M7yMc06w8gQ9eehQ


No comments:

Post a Comment