ప్రశాంతంగా ఉన్న మనసు అలసిన… మనసు కన్నా చురుగ్గా పనిచేస్తుంది. ఇది ఎలాగో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.
ఒక రైతు ధాన్యం కొట్టులో తన చేతి గడియారాన్ని పోగొట్టుకున్నాడు. అదంటే రైతుకు ప్రాణం. దాని కోసం గోడౌన్ మొత్తం వెదికాడు, దొరకలేదు. ఆశ ఒదులుకొనే సమయంలో అక్కడ దగ్గరలో ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. వాళ్ళను పిలిచి గడియారం వెదికి ఇస్తే మంచి బహుమతి ఇస్తానని చెప్పాడు.
పిల్లలు ధాన్యం కొట్టు మొత్తం వెదికారు. కానీ వాళ్ళకు కూడా దొరకలేదు. నిరాశగా కూర్చుని ఉన్న రైతు దగ్గరికి ఒక పిల్లవాడు వచ్చి గడియారాన్ని వెతికి పెడతానన్నాడు. నిజాయితీగా కనిపిస్తున్న పిల్లవాడిని చూసి సరే అన్నాడు. వాడు లోపలికి పోయి గడియారాన్ని వెదికి తీసుకొచ్చాడు. రైతు ఆశ్చర్యంగా చూసి
ఇంత మంది వెదికినా దొరకనిది నీకెట్లా దొరికింది అని అడిగాడు. “నేనేం చేయలేదు, నిశ్శబ్దంగా ఉన్న ఈ కొట్టులో ప్రశాంతంగా పడుకొని చెవులు రిక్కించి విన్నాను. చిన్నగా టిక్ టిక్ మని వినబడ్డ వైపుకు పోతే అక్కడ కనబడింది. అంతే” అన్నాడు.
ప్రశాంతంగా ఉన్న మనసు అలసిన మనసు కన్నా చురుగ్గా పనిచేస్తుంది. కొన్ని నిముషాలు ప్రతిరోజూ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రశాంతత మీరు కోరుకున్న విధంగా మిమ్మల్ని మీరు మలచుకోవడానికి ఉపయోగ పడుతుంది.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment