Thursday, December 11, 2025

 @ అవమానుషం @

విసుగొచ్చింది
ఈ మనుషుల్ని చూసీ చూసీ ...

మార్పు లేకుండా 
ఎందుకిలా గిడసబారిపోయారు?

*******

సంతతి మీదా ..
సంపద మీదా అంతులేని ఆశ 

రంగులనీ మతాలనీ ...
దేశాలనీ నాగరికతలనీ ...
అంతస్తులనీ అంతరాలనీ ....

తెలిసీ తెలియని తనమే తత్వంగా 
నగ్నత్వాన్ని ద్విగుణీకృతం చేస్తారు

*******

స్వయంగా ప్రకాశించలేరు
సహజంగా పరిమళించలేరు
సప్తవర్ణాల్ని ప్రతిఫలించలేరు

రకరకాల 
స్వప్నాల్ని అల్లుతారు 
సహజత్వాన్ని సాగదీస్తారు
సౌందర్యాన్ని తగలేస్తారు 

ఆఖరి మెట్టు మీద 
పాతాళంలోకి జారిపడతారు 

*******

ఏది ఏమైనా 
సమాలోచనల సంఘర్షణలో ...

స్వర్గాన్ని 
నేలకు దించే ప్రయత్నం 
చేస్తారని ఆశ

- రవి మారుత్
( 'కోపోద్రిక్త స్వరం' నుండి)

No comments:

Post a Comment