Thursday, December 11, 2025

 Pasupula Pullarao..8919291603... మనసే అందాల బృందావనం అన్నారు ఒక సినీ కవి... మనసును అందాల బృందావనం గా ఉండాలి అన్నా జీవితం నందన వనంగా మారాలన్న అది నీ చేతుల్లోనే... నీయొక్క చేతుల్లోనే... ఈ అనంత విశ్వంలో ప్రతి పని శక్తి ద్వారానే సాధించడం జరుగుతుంది... శారీరక బలానికి ఆహారం, అధ్యాత్మిక బలానికి విశ్వ శక్తిని తీసుకోవాలి... భౌతిక అలోచనలు ద్వారా చేసే పనులు మిక్సుడు ఫలితాలు పొందడం జరుగుతుంది... సరైన సాధన ద్వారా విశ్వ శక్తిని పొంది చేసే ఆలోచనలు త్వరగా వాస్తవరూపం(manifestation) గా రూపాంతరం చెందుతాయి.
      మౌనంగా ఉండడం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు... మనసును కూడా శూన్యం చేసుకోవాలి... అపుడే శూన్యంలో శూన్యం తో కలసి విశ్వం తో మమేకం జరుగుతుంది...
     అందుకు మనసా వాచా కర్మణా కోరుకుంటూ నమ్మకం విశ్వాసంతో సరైన సాధన చేయాలి... శ్వాస మీద ధ్యాస ద్వారా మనసు మాయగాడికి పగ్గాలు వేయాలి..

No comments:

Post a Comment