Thursday, December 11, 2025

🔥 చిన్న నిర్లక్ష్యం = పెద్ద ప్రమాదం! ⚡ #shorts

🔥 చిన్న నిర్లక్ష్యం = పెద్ద ప్రమాదం! ⚡ #shorts

https://youtube.com/shorts/AkilZ_q6W6M?si=FZ5l-LGgGtg15mQl


https://www.youtube.com/watch?v=AkilZ_q6W6M

Transcript:
(00:00) ఈ వాటర్ హీటర్ ని యూస్ చేయడం కారణంగా ఢిల్లీకి చెందిన 23 సంవత్సరాల అమ్మాయి ఉత్తరప్రదేశ్ కి చెందిన ఈ మూడు సంవత్సరాల చిన్న పాప ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయి వాటర్ హీటర్ ని ఇలా ప్లాస్టిక్ బకెట్ లో పెట్టి నీళ్లు వేడి చేస్తుంది. ఆ హీటర్ వేడికి బకెట్ ప్లాస్టిక్ కరిగి నీళ్లు కిందకు వచ్చేసాయి.
(00:23) ఈమె పక్కనే ఉండడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి ఆ బాత్్రూమ్ లోనే గిలగిలా కొట్టుకొని ప్రాణాలు కోల్పోయింది. ఈమె బాత్్రూమ్ డోర్ ని లోపల నుంచి లాక్ చేసింది. దాంతో వెంటనే వచ్చి ఎవరు కాపాడలేకపోయారు. యూపీలో ఈ చిన్న పాప తండ్రి స్నానం చేద్దాము అని బాత్్రూమ్ బయట ఇలా వాటర్ హీట్ చేస్తున్నాడు. ఈ చిన్న పాప ఆడుకుంటూ వెళ్లి ఆ బకెట్ లో చెయ్యి పెట్టేసింది.
(00:46) దాంతో ఈ పాప కూడా ప్రాణాలు కోల్పోయింది. అందుకే ఇలాంటి ఎలక్ట్రిక్ వాటర్ హీటర్స్ ని యూస్ చేయడం చాలా ప్రమాదం. యూస్ చేయకూడదు అని చెప్పట్లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించండి. నెంబర్ వన్ మార్కెట్ లో తక్కువ దరకు వస్తుంది అని 100 200 రూపాయల కృతి పడి నాసి రకం హీటర్స్ ని కొనకండి. ఐఎస్ఐ మార్క్ ఉన్న ఒరిజినల్ హీటర్స్ ని మాత్రమే కొనండి.
(01:07) నెంబర్ టూ వాటర్ ని హీట్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఐరన్ ఆర్ స్టీల్ బకెట్ ని యూస్ చేయకండి. అవి హైలీ ఎలక్ట్రిక్ కండక్టివ్ మెటీరియల్స్ నెంబర్ త్రీ ప్లాస్టిక్ బకెట్ లో వాటర్ హీట్ చేస్తున్నప్పుడు హీటర్ ని ఇలా సైడ్ కని పెట్టకండి. మధ్యలో ఒక కర్రను లేదా ప్లాస్టిక్ ని ఏదైనా పెట్టి దానికి రాడ్ ని వేలాడదీయండి.
(01:28) నెంబర్ ఫోర్ వాటర్ వేడెక్కాయా లేదా అని ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్ గా చెయ్యి పెట్టి చూడకండి. హీటర్ ని ఆఫ్ చేసి వైర్ ని రిమూవ్ చేసిన తర్వాతే బకెట్లు చెయి పెట్టండి. అసలే చలికాలం ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి హీటర్స్ ని యూస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రాణాలు కాపాడే ఈ విషయాలు అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను ఇవి నాకు తెలుసు అని లైట్ తీసుకోకండి.
(01:49) తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆల్రెడీ ఈ హీటర్ విషయంలో చిన్న చిన్న మిస్టేక్లు చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి మీకు తెలిసిన అందరితో వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రయిబ్.

No comments:

Post a Comment