Thursday, December 11, 2025

*_"మనసులో శాంతి ఉంటే... జీవితం దివ్యం అవుతుంది"_*

*_మనలో చాలా మంది అనుకుంటుంటారు  జీవితం ఎంత గందరగోళంగా మారిపోయిందో!  ప్రతి రోజు పరుగులు... ప్రతి రోజు సమస్య ఒక్కటి కాదు  పది! కానీ,ఒక్కసారిగా ఆలోచించండి  ఈ గందరగోళం నిజంగా మన బయట ఉన్నదా...? లేక మన లోపలే ఆ కలత ఉన్నదా...?_* 

*_మనసు ప్రశాంతంగా ఉంటే... ప్రపంచం గొడవ పెట్టినా, మనం నిశ్శబ్దంగా ముందుకు సాగగలం. కానీ, మన లోపలే తుఫాను ఉంటే... చుట్టూ ఎంత నిశ్శబ్దం ఉన్నా మనం అలమటించిపోతాం._* 

*_డబ్బుతో కొన్ని సమస్యలు తిరుతాయి. కానీ,మనసుకు తాళం తెరచే సాధనం ఎక్కడ...? అది ఒక్క మనలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ శాంతిని కొనలేరు. గెలవలేరు. పంచలేరు. అది అనుభవించాలి._*

*_మన విజయాలు బాహ్య ప్రపంచానికి చెబుతాయి మనం ఎంత దూరం వచ్చామో... కానీ మన ప్రశాంతతే మనకు చెబుతుంది మనం నిజంగా ఎక్కడ ఉన్నామో అనీ._*

*_`ఒక్క మలుపు చాలు  జీవితమంతా తలకిందులవుతుంది. అందుకే, ఎప్పుడూ మనలో ఉండాల్సింది  ఆత్మవిశ్వాసం... ధైర్యం... శాంతి._*

*_మీరు కోల్పోయిన ప్రతి దాన్ని తిరిగి సంపాదించవచ్చు. కానీ మనసు కోల్పోయిన శాంతినీ మాత్రం... తిరిగి పొందాలంటే సాక్షాత్ introspection కావాలి._*

*_కాబట్టి  మీ గమ్యం ఏమైనా కావచ్చు. పేరు, సంపద, విజయాలు.ఏవైనా కానీ ఆ ప్రయాణంలో మీరు కోల్పోకూడదనిది ఏకైక విషయమైతే...అది మనస్సులో ఉండే శాంతి. ఎందుకంటే అదే మీ అసలైన బలం. అదే నిజమైన విజయానికి మార్గం.☝️_*


*_✍️మీ. తుకారాం జాదవ్. 🙏_*

No comments:

Post a Comment