Thursday, December 11, 2025

 🔱ఓం నమః శివాయ🔱:
*లలితో పాఖ్యానం*                     అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ,
సర్వసౌభాగ్యదాయక చక్రం చతుర్ధ ఆవరణం ఇందులో త్రిపురవాసిని అధి దేవత సంప్రదాయయోగిని యోగినీ దేవతగా సర్వసంక్షోభిణి మొదలుగా పదునాలుగు మంది దేవతలు ఉంటారు
సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసమ్పత్తిపూరిణీ, సర్వమంత్రమయీ,సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సమ్ప్రదాయయోగినీ,
దశకోణముల బహిర్దశారమైన సర్వార్దక్సాధక చక్రంలో త్రిపురాశ్రీ అధిదేవతగా, కులోత్తీర్ణ యోగిని యోగినీదేవతగా, సర్వసిద్ధిప్రదాదేవి మొదలుగా పది మంది దేవతలు ఉంటారు.
సర్వసిద్ధిప్రదే, సర్వసమ్పత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ,కులోత్తీర్ణయోగినీ,
దశకోణముల అంతర్దశారమైన సర్వరక్షాకర చక్రమైన ఆవరణలో త్రిపురమాలిని అధిదేవత, నిగర్భయోగిని యోగినీ దేవతగా సర్వఙ్ఞా దేవి మొదలగు దశ దేవతలు ఉంటారు.
సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,
అష్టకోణ సప్తావరణం సర్వరోగహర చక్రం. అధిదేవత త్రిపురాసిద్దాంబ, రహస్యయోగిని తో కూడి వశిని మొదలుగా ఎనిమిది మంది వాగ్దేవతలు ఉంటారు.
వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌలిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,
శ్రీచక్ర అష్టమావరణదేవతాః
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,
నవమావరణము సర్వానందమయి చక్రము బిందువు.
అధిదేవత మహాత్రిపుర సుందరి. యోగినీదేవత పరాపర రహస్యయోగిని.
త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ,
***
లలితాదేవి వెనక ఏడు అంతస్థుల గేయచక్రరథం, ఐదు అంతస్థుల కిరిచక్ర రథం బయలు దేరుతాయి.
లలితాదేవి దండయాత్రకు బయల్దేరిందన్న వార్త విన్న భండాసురుని శూన్యక నగరవాసులు భయభ్రాంతులౌతారు. భవనాలు అకారణంగా బీటలు వారుతుంటాయి.
లలితాదేవి దండయాత్రకు బయలు దేరిందన్న వార్త విన్న శూన్యక పట్టణవాసులు భయభ్రాంతులౌతారు. అకారణంగా భవనాలు బీటలు బారుతాయి.ఉల్కలు పడటం ప్రారంభమవుతుంది. భూకంపం, భూమి మండిపడటంతో ప్రజలంతా వణికి పోసాగారు.
చారుల ద్వారా ఈ సమాచారము విన్న భండాసురుడు భయపడక తమ్ములు విశుక్రుడు విషంగుడిని పిలిపిస్తాడు. సామంత రాజులంతా సభాస్థలికి చేరుకుంటారు.
లలితాదేవి యుద్దసంరంభంలో ఉన్న సమయంలో భండాసురుడి నగరమైన శూన్యకపట్టణంలో అనేక అపశకునాలు గోచరిస్తాయి. వెంటనే అతను  విశుక్ర విషంగులతో సమావేశం ఏర్పాటు చేస్తాడు. విశుక్రుడు పరిస్థితి విశ్లేషిస్తూ,
"దేవతలు అందరూ అగ్నికుండంలో పడి మరణించారు. ఆ అగ్ని కుండం నుండి మాత ఉద్భవించి అందరిని పునరుజ్జీవులను కావించింది. మహిళాసేనతో మనమీదకు యుద్దానికి బయల్దేరింది. వారంతా లేత చిగురుల వంటి ఆకులతో రాళ్ళను పగులకొట్టటానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పట్టికి మనము అప్రమత్తులయి మన సైన్యాన్ని వారిని ఎదురుకోవటానికి పంపించాలి." అంటాడు.
ఆ మాటలు విన్న విషంగుడు కొన్ని సూచనలు ఇస్తాడు.
1."ఏ పనైనా బాగా ఆలోచించి చేయాలి.
ముందుగా మన గూఢచారులను పంపించి వారి సైన్యం యొక్క బలం అంచనా వేయాలి.
ఏ పరిస్థితిలోనూ వారిని తక్కువ అంచనా వేయకూడదు.
గతంలో హిరణ్యకశిపుడు ఒక జంతువు చేతిలో మరణించాడు.
శంబనిశంబులు ఒక మహిళ చేతిలో హతమయ్యారు.
కాబట్టి వారి గురించి మరింత సమాచారం సంపాదించాలి.
అసలు ఆమె ఎవరు? ఆమెకు అండదండగా ఉన్నవారెవరు? ఆమెకు కావలసినది ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం కావాలి." అని వివరంగా చెప్తాడు.
అంతా విన్న భండాసురుడు ఆ మాటలను కొట్టి పారేస్తూ, "దేవుళ్ళు అందరూ ఆమె వెనక ఉన్నా భయపడవలసిన అవసరం లేదు. మన సైన్యంలో ఉన్న సేనాధిపతులు స్వర్గాన్నైనా కాల్చి వేయగలరు. వారందరూ హిరణ్యకశిపుడితో సమానమైన వారు. అటువంటిది ఒక అబలను జయించటం ఎంత సేపు? పనికిమాలిన ఆలోచనలతో బుర్రలు పాడుచేసుకోవద్దు." అంటూ విషంగుడిని మందలించి,
సింహాసనం నుండి లేచి, "కుటిలాక్షా సైన్యాన్ని సిద్దం చేయి శూన్యక పట్టణానికి రక్షణగా ఉండు. ఆమెను జుట్టు పట్టుకొని తీసుకు రావాలి." అని సేనాధిపతి కుటిలాక్షుడిని కోట సంరక్షణకు నియమిస్తాడు.

మంత్రులను పురోహితులను పిలిపించి అభిచారహోమం అనే క్షుద్రపూజ నిర్వహించమని ఆఙ్ఞాపిస్తాడు.
**
భండాసురుడి చేత లలితాదేవి కేశాలు పట్టుకొని లాక్కు రమ్మని ఆదేశించబడ్డ కుటిలాక్షుడు దుర్మదుడనే రాక్షసుడిని నాయకుడిగా నియమించి మొదటి సేనను యద్దరంగానికి పంపిస్తాడు. శూన్యకపట్టణ రక్షణ కోసం నాలుగు దిక్కులలో నలుగురిని పదిపది అక్షౌహిణుల సైన్యంతో నియమిస్తాడు. తూర్పుకోటను తాళజంఘుడు, దక్షిణకోటను తాళభుజుడు, ఉత్తరకోటను తాళకేతు పడమటికోటను తాళగ్రీవుడు తమతమ సైన్యాలతో రక్షణగా ఉంటారు.
శక్తిసేనను ఎదుర్కోవటానికి వచ్చిన దుర్మదుడి సైన్యాన్ని, లలితాదేవి శూలం నుండి ఆవిర్భవించిన సంపత్కరీదేవి తన ఏనుగుల సమూహంతో ఎదిరిస్తుంది. తను పంపించిన సైన్యం పరారవటం చూసిన దుర్మదుడు స్వయంగా ఉష్ట్ర (ఒంటె) వాహనుడై యుద్దరంగ ప్రవేశం చేస్తాడు. రణకోలాహలం అన్న ఏనుగును అధిరోహించిన సంపత్కరీ దేవి అతనిని ఎదుర్కుంటుంది. అప్పుడు జరిగిన భీకర పోరాటంలో సంపత్కరీ దేవి కిరీటంలోని ఒక వజ్రపురాయిని దుర్మదుడు పడగొట్టగలుగుతాడు. దాంతో ఇంకా ఆగ్రహించిన దేవి దుర్మదుడిని గుండెలో బాణాలు నాటి చంపుతుంది. దుర్మదుడి మరణంతో భయపడ్డ అతని సైన్యం వెనుతిరిగి పారిపోతుంది.
ఈ విషయం తెలుసుకున్న భండాసురుడు కోపోద్రిక్తుడైస్వయంగా ఖడ్గం తీసుకొని రణరంగానికి బయల్దేరుతాడు. అది చూసిన అతని వద్దకు వచ్చిన కుటిలాక్షుడితో, "దేవతలు కాని, యక్షులు కాని దుర్మదుణ్ణి జయించలేక పోయారు. అటువంటి వీరుడు ఒక అబల చేతిలో మరణించాడు, ఆమెను వధించటానికి కురండకుని వెంటనే పంపించ వలసింది." అని ఆజ్ఞాపిస్తాడు.
కురండుకుని పిలిపించిన కుటిలాక్షుడు, "నీవు మాయా యుద్దంలో ఆరితేరిన వాడవు. వెంటనే సైన్యం తీసుకొని వెళ్ళి శత్రువును వధించి రా." అని ఆజ్ఞాపించగానే, కురండకుడు ఇరవై అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకొని యుద్దరంగానికి బయలుదేరుతాడు.
సంపత్కరీదేవి సైన్యం లోని చండి, "చెలీ యితనితో నేను యుద్దం చేస్తాను. నీవు చంపలేవని కాదు. కాని ఈ దుష్టుడు నా చేతుల్లో మరణించాలి" అని వేడుకొనటంతో, సంపత్కరీ దేవి తన సైన్యాన్ని పక్కకు తప్పిస్తుంది.
చండి కురండుకుని పై బాణాల జడివాన కురిపిస్తుంది. ఆమె గుర్రపు సకిలింపుకు కురండుని సైన్యం మూర్చ పోతుంది. చండి చేతిలోని పాశాయుధం నుండి కోట్లాది సర్పాలు వెలువడి సైన్యాన్ని బంధించి వేస్తాయి. కురండకుడి బాన ప్రయోగంతో చండి యొక్క వింటి నారి తెగిపోవటంతో ఆమె కోపంతో అంకుశాన్ని విసిరి వేస్తుంది. ఆ దెబ్బకు కురండుడు మరణిస్తాడు. అంకుశం తరువాత రాక్షస సైన్యాన్ని కూడా సంహరిస్తుంది.
ఈ విషయం విన్న భండాసురుడు ఉగ్రుడై 100 అక్షౌహిణుల సైన్యాన్ని అయిదుగురు సేనాధిపతులతో పంపిస్తాడు.
కరంకుడు పరివారంతో యుద్దభూమిలోకి ప్రవేశించగానే సర్పిణీ అనే మాయను ప్రయోగిస్తాడు. ఆ మాయ నుండి రణశంభరి అన్న సర్ప సైన్యాన్ని సృష్టించి శక్తిసేన మీదకు పంపుతారు. దానవులు ఇంతకు ముందు కూడా ఇటువంటి మాయాయుద్దంతో ఎందరో దేవతలను హతమార్చారు. కోటానుకోట్ల సర్పాలు శక్తిసేనను హింసించటం మొదలెడుతాయి. ఆ సర్పాలు మరణించి కూడా మళ్ళీమళ్ళీ పుడుతూ ఉంటాయి.
కరేంద్రి నూరు గాడిదలను పూన్చిన రథం మీద చక్రంతో, వజ్రదంతుడు ఒంటెనెక్కి బల్లెంతో, అదే పేరుకల మరొక సేనాధిపతి రెండు గద్దల రథం ఎక్కి బాణాలతో శక్తి సైన్యాన్ని సంహరించటం మొదలెడతారు. నకులీదేవి గరుడవాహనారూఢురాలై రణరంగంలోకి ప్రవేశిస్తుంది. ఆవిడ నోటి నుండి 32 కోట్ల ముంగిసలు ఉద్భవించి పుట్టిన పాములను  పుట్టినట్టే మింగేయటం మొదలెడుతాయి. నాగదేవత రణశంభరిని నకులి దేవి గరుడాస్త్రం ప్రయోగించి చంపేస్తుంది.
అది చూసిన మిగిలిన అయిదుగురు సేనాధిపతులు ఒక్కసారిగా నకులీదేవి మీదకు విరుచుకు పడతారు. వెనక నుండి నకులీదేవి ముంగిస సైన్యం వారి మీదకు దాడి చేస్తుంది.  గగన మార్గం నుండి నకులీదేవి గరుడారూఢురాలై చేసిన యుద్దంలో అయిదుగురు సేనాధిపతుల తలలు నరికి హతమారుస్తుంది.
సేనాధిపతుల మరణానంతరం ఇద్దరు సోదరులను చర్చలకు పిలిపించిన భండాసురుడు, "నా సేన పేరు చెప్పగానే పారిపోయే దేవతలలో ఇంతటి తెగింపు వచ్చింది అంటే నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు మనం మూలాల్ని చేధించాలి. గుర్రాలు ఏనుగులు ముందు నడుస్తుండగా ఆమె సైన్యాని కంతటికి వెనకగా ఉన్నదని చారుల ద్వారా తెలుస్తున్నది. అందుచేత ఆమె మీదకు వెనక నుండి విషంగుడు దాడి చేయవలసి ఉంటుంది" అని నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.
 లలితాదేవి వద్ద సైన్యం తక్కువగా వుండటం వల్ల వెనక భాగం వద్ద రక్షణ లేకపోవటం వల్ల ఆ విధంగా దాడి చేయటం లాభదాయకంగా వుంటుందన్న నమ్మకంతో విషంగుడు పదిహేను అక్షౌహిణుల సైన్యంతో శక్తిసేన మీద దాడికి ఉపక్రమిస్తాడు.
మొదటిరోజు యుద్దానంతరం సాయం సమయంలో విషంగుడు కొద్దిపాటి సైన్యంతో నిశ్శబ్దంగా శక్తిసేన వెనుక భాగానికి చేరుకుంటాడు. ఆ పాటికి శక్తిసేన పడమటి దిక్కు వైపు సాగిపోతున్నది. విషంగసేన ఉత్తర దిక్కుగా కదిలి తూర్పువైపు తిరిగారు. దగ్గరలోనే శ్రీచక్రరాజ రధం కనిపిస్తున్నది. లలితాదేవి చుట్టుపక్కల చాలా తక్కువ సైన్యం ఉన్నట్టు తెలుస్తున్నది.  

No comments:

Post a Comment