Thursday, December 11, 2025

 కొంత మంది అడుగుతారు కదా..! చచ్చాక డబ్బులు తీసుకోని వెళ్తావా అని వాళ్ళందరికీ చెబుతున్నాను.. చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా డబ్బులు చాలా అవసరం...                                                   
  ❤️💖❤️                                                              నదిలో మునిగిపోయి కొట్టుకుపోతున్న ఒక బాలుడు 'రక్షించండి, రక్షించండి' అంటూ పెద్దగా కేకలు పెడుతున్నాడు. అటుగా పోతున్న పెద్దమనిషి నదిలోకి దూకి, మునిగి పోతున్న ఆ బాలుడిని రక్షించాడు. ఆ బాలుడు పెద్దమనిషి కాళ్ళ మీద పడి, "స్వామీ! మీరు మీరు రక్షించకపోతే ర చచ్చిపోయే వాడిని, మీ ఋణం ఎలా తీర్చుకోగలను." అని వేడుకున్నాడు. "నాకు ఈత వచ్చు కాబట్టి రక్షించాను, ఇందులో నా గొప్పదనం ఏమీలేదు... అయితే, భవిష్యత్తులో నీవు రక్షించబడాల్సినంత గొప్పవాడివని నిరూపించుకో!! నిన్ను రక్షించకపోతే ఒక గొప్ప వ్యక్తిని ఈ దేశం కోల్పోయేదనిపించుకో.... అంతే "
❤️💖❤️
ఒక చిన్న చీమ మీ కాలిని కాటేయగలదు, కానీ మీరు దాని కాలిని కొరకలేరు. అందుకే జీవితంలో ఎవరినీ చిన్నగా చూడకండి. వారు చేయగలిగింది, బహుశా మీరు చేయలేకపోవచ్చు.                ❤️💖❤️

No comments:

Post a Comment