దేశమా? దైవమా?
****************
. (ఐడియా-27)
దైవం గురించి చాలా
రాస్తుంటారు!
పుంఖానుపుంఖాలుగా
భక్తి సాహిత్యం ఉంది.
ఏ కొండమీద ఏదేవుడు
న్నాడు!
స్వయంభూలు..ఎక్క
డెక్కడున్నాయి!
స్థలపురాణాలు,లింగ
పురాణాలు,స్వాములు
బాబాలు,సీతాదేవిఅడుగులు, ఆమెచీరఆరేసుకున్నచోట్లు,నీరుతాగిన కుంటలు...లక్ష్మి
సరస్వతి, పార్వతి..బహు రూపాలు,మహాత్మ్యాలు...అమ్మవారిస్వామివారి ..సయ్యాటలు,సల్లాపాలు ,ఊంజల్సేవలు,ఉయ్యాలపాటలు, మేలుకొలుపులు
...కొల్లలుగా రాసారు.
చదువుసంధ్యలేని
ఒక'పామరణ్ణి'అడుగు!
వెంకటేశ్వరస్వామి కథ,
రాములవారి కథ, శ్రీ కృ
ష్ణపరమాత్మ కథ..పొల్లు
పోకుండా వల్లించేస్తాడు
అమ్మ నాన్నల నుంచి
పిల్లలకు.. వాళ్ళ పిల్లల
కు..ఇలా తరంతరం దైవలీలాసాహిత్యం చిన్నప్పుడేఅందిపోయింది.
* * *
వీళ్ళని దేశం గురించి అడుగు! ఒక్కముక్కతెలీదు.దేశంగురించి మాకెందుకు?అదిరాజకీ యనాయకులది..అన్నట్టుగాచూస్తారు.
స్కూళ్ళలోకూడా'విద్యా
ర్థులకు రాజకీయాలు
అవసరమా?'అనే అంశంపై డిబేట్ పెట్టి-దేశము-చరిత్ర-రాజకీరాలు...ఈ అంశాలను
ప్రాముఖ్యత లేనివిగా చల్లారుస్తారు.స్వతంత్రం ఎప్పుడొచ్చిందో తెలియని వాళ్ళున్నారు.ఇందిరాగాంధీ గాంధీగారి కూతురన్నవాళ్ళు
న్నారు.మనరాష్ట్రపతి
పేరు తెలియనివాళ్ళు న్నారు.
మనమందరం నివసి
స్తున్న మానవప్రపంచం
గురించి తెలుసు కోవటం
నిరర్థకమనేవాళ్ళున్నారు.అందరినీకనిపెట్టిచూసేఆపరమాత్ముడేముఖ్యమని ఇప్పటికీ
ప్రవచన పాఠాలు
చెపుతూనే ఉన్నారు.
* * *
అందుకే జనంలో 'దైవ
భక్తి'పెరిగింది.
'దేశభక్తి'తరిగింది.
దోచుకునే వాళ్ళు దోచు
కుంటున్నారు.
దేశంమనకు అక్కరలే
దు కదా!
"నైలునదీనాగరికతలో
సామాన్యునిజీవనమె
ట్టిది"అన్నాడుశ్రీశ్రీ.
ఎవరికి కావాలి?
ఆనైలునది ఏమిటో!
నాగరికత ఏమిటో!
సామాన్యుడెవరో!
వాడిజీవనమేంటో!...
మనవాళ్ళకు కావాలా?
రోజూ భజనలు,పూ
జలు,కార్తీక దీపాలు,అ
మ్మలు,గుళ్ళోబొమ్మలు
పట్టుచీరలు,స్వామి క
ళ్యాణాలు, వైకుంఠాలు
ఉత్తర ద్వారాలు..యిం
కా యింకా...ఇవే!ఎంత
సాహిత్యమో!బట్టీపట్టే
స్తారు.రామకోటి రాసే
స్తారు.
వీళ్ళను భారతదేశం
చుట్టూ ఉన్న నాలుగు
దేశాలపేర్లు చెప్పమను
బిక్కమొహమేస్తాడు.
ఇంతెందుకు వాడి గ్రామ సర్పంచ్ పేరుగాని, మండల చైర్పర్సన్ పేరు గాని చెప్ప మనండి! అవి మనకెందుకు?
విచిత్రం ఏంటంటే ఆ
దేవుడు ఎలాగూ వీళ్ళ
ను పట్టించుకోడు!నాయకులకు జనం ఇలా ఉండటమే కావాల్సింది.ఎంత అజ్ఞానంలో ఉంటే అంత మంచిది.అందుకేగా మనకుమొదటి నుంచీ చదువులేకుండాచేసింది.వీళ్ళు వీళ్ళ దరిద్రాన్ని పోగొట్టు కునిజనం దరిద్రాన్నిపెంచుతారు.
దేశమా?దైవమా?..అని
వక్తృత్వ పోటీ పెడితే
దైవమే కావాలి!దేశం
ఎవడికి కావాలి!
ఇదీమనజనం!
నా ఐడియా ఐతే
దేవుణ్ణి గుండెల్లో ఉంచు కోండి.దేశాన్ని పాపులకు వదిలేయకండి!పేదలరాజ్యం కోసం
పాపులతో యుద్ధం
చేద్దాం రండి!
********
-ఐడియాల అప్పారావు
హైదరాబాద్
9-12-2021
(రేపు ఐడియా-28)
( from Fb memory)
No comments:
Post a Comment