Thursday, December 11, 2025

 @ ఏకాంతం @

సమాజం 
సాదా సిద్ధంగా ఉంచుతుంది 
కొన్ని మూసలను 
మన కోసం

వాటిలో ... 
ఏదో ఒక దానిలో 
ఒదిగిపోగలిగితే ...  
అనిపించుకో గలుగుతావు నువ్వు
'మంచి వాడివి' అని

కొన్ని ..‌ 
ప్రత్యేకమైన మూసల్లో 
ఇమిడిపోగలిగితే   
కీర్తించబడతావు నువ్వు
సక్సెస్ఫుల్ పర్సన్ గా సైతం నువ్వు

అలా చేయలేకపోతే 
పరమ దుర్మార్గుడివే.... నువ్వు
మోస్ట్ అట్టర్ ఫెయిల్యూర్ పర్సన్ వే నువ్వు

*******

ఫర్ సప్పోజ్....  

మతం లోని 
ప్రతి మూఢత్వాన్నీ ... 
అజ్ఞానాన్నీ ... మూర్ఖత్వాన్నీ .... ఉన్మాదాన్నీ... 

తల వంచుకునీ ....
కళ్ళు మూసుకునీ .....
శిరసా వహించి పాటిస్తున్నావనుకో ...
నిష్కలంక భక్తుడివి నువ్వు.

అపాత్ర దానాలు ... 
అర్థం పర్థం లేని నిరుపయోగమైన ధర్మాలూ .... 
మారు మాట్లాడకుండా మౌనంగా 
అనునిత్యం చేస్తున్నావనుకో ... 
ధర్మాత్ముడివీ అపర దాన కర్ణుడివే నువ్వు 

ఒకరు చేస్తున్న దోపిడీ ... 
ఒకరు పాల్పడుతున్న కపటం వంచనా ... 
బరి తెగించి చేసే అణచివేతా పీడనా .... 
తెలిసీ తెలిసీ ... 
వాణ్ణి మహనీయుడని కీర్తిస్తున్నావనుకో .... 
అజాత శత్రువ్వే నువ్వు 

**********

ఇంకా చెప్పాలా....

గడగడ ... 
గుక్క తిప్పుకోకుండా 
ఫారిన్ యాక్సెంట్ లో .... 
యమ స్పీడుగా ఆంగ్లం దంచి కొడుతున్నావనుకో .... 
యు ఆర్ ఎ మోస్ట్ సివిలైజ్డ్ జెంటిల్మేన్ 

అక్రమంగా నైనా సరే .... 
అన్యాయంగా నైనా సరే .... 
ఒకరిని తొక్కుకుంటూనైనా సరే ..... 
వ్యవస్థను చీడ పురుగులా దొలిచేస్తూ నైనా సరే .... 
సిరి సంపదలను సముపార్జించేసావంటే 
జగజ్జేతవే నువ్వు 

ఓ నలుగురు భట్రాజులను కూడేసి ... 
ఆహా ఓహో అనిపించుకున్నావంటే .. 
పైరవీలు చేసి అవార్డులను చేజిక్కించుకున్నావంటే ... 
ప్రముఖ కవీ ... రచయితా ... విమర్శకుడూ .... సాహితీవేత్తవే నువ్వు 

*********

ఇమిడిపోకు 
సమూహం నిర్దేశించిన మూసల్లో 

ఒదిగిపోకు 
గుంపు నిర్మించిన చట్రాల్లో 

బందీవి కాకు 
మూకలు బిగించే శృంఖలాల్లో 

Better 
FAR AWAY .....
FROM THE MADDING CROWD 

It's ok ....
NOT TO BE IN LIME LITE

LEAD A HAPPY & PEACEFUL LIFE

అహంకార 
మమకారాలెంత మాత్రం సోకని
చిదానంద స్వరూపమే పరబ్రహ్మం

త్రికరణ 
శుద్ధిగా అర్చించి 
లయమైపో అందులోనే 
ఆ అనంత ఆద్యంతరహిత శూన్యంలోనే 

- రత్నాజయ్ (పెద్దాపురం)

No comments:

Post a Comment