Thursday, December 11, 2025

 “నా భక్తులు ఎచ్చట ఉండి పిలిచినా వారి ప్రార్థనలు నాకు వినిపిస్తాయి.

కారణం నేను ఎల్లప్పుడూ వారి హృదయాలలో ఉంటున్నాననే బలమైన విశ్వాసం వారిలో దృఢముగా పాతుకుపోయి ఉంటుంది.

దీని ఫలితముగానే త్వరగా వీరిలో దుఃఖనివారణ జరుగుతుంది.

భక్తులంటే భజనలు, పూజలు మాత్రమే కాదు, దైవమును పూర్తిగా విశ్వసించి తాను చూపిన మార్గములో నడుచుకోవాలి.

ఆయన చెప్పిన వాక్యములను విధిగా పాటించాలి.

అంతేకాని ఒక పక్క దైవ విరుద్ధమైన కార్యాలు చేస్తూ మరొక పక్క దేవునికి పూజలు, అభిషేకాలు అర్చనలు చేయడం కాదు!

ఇది భక్తి అనిపించుకోదు. ఇట్లాంటి వారు యుగములు సాగిననూ భక్తులు కాలేరు! దైవానుగ్రహము కావలెనన్నా దైవ వాక్యములను విధిగా పాటించాల్సిందే!”
.

No comments:

Post a Comment