Saturday, May 2, 2026

How To Live With Negative/ Toxic People? - Few Strategies for you

How To Live With Negative/ Toxic People? - Few Strategies for you

Author Name:Devika Bhatnagar's Telugu Channel

Youtube Channel Url:https://www.youtube.com/@devikabhatnagarsteluguchannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=E6_W6HPV9yM



Transcript:
(00:00) అందరికీ నమస్కారము హౌ టు లివ్ విత్ నెగిటివ్ పీపుల్ నెగిటివ్ పీపుల్ అంటే ఎనిమీస్ అనొచ్చు బద్ద శత్రువులు ఒకరు ముంగేసా అయితే ఒకరు ఎలక ఇలాంటి వాళ్ళతో జీవనం మనం సాగించాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఏం చేస్తాము బతకాలి వాళ్ళతోనే బతకాలి ఇంకా దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ మనకు ఆప్షన్ లేదు ఎవరు వీళ్ళు ఎవరు వీళ్ళు అంటే గనుక వాళ్ళు మెయిన్ గా భార్య భర్తల్లో ఉంటుంది సంబంధం భర్త గురించి భార్య చెడుగా అనుకోవడం ఈయన ఒక భద్ర శత్రువుగా భావించడం లేకపోతే భార్యనే మంచిది కాదు అనుకోవడము హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉంటుంది అండ్ ఇంకా తర్వాత ఇన్ లాస్ లో అత్తగారు కావచ్చు మామగారు కావచ్చు
(00:43) లేకపోతే బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా వీళ్ళు ఎవరైనా కావచ్చు ఇన్ లాస్ సైడ్ నుంచి ఇంకా మనము పని చేసే జాబ్ లో మన బాస్ కానీ మన కొలీగ్ కానీ ఎప్పుడు రోజు మాట్లాడాలి తప్పదు మొహం చూసుకోవాల్సింది అండ్ లేదా మన కింద పని చేసే వాళ్ళు కానీ వీళ్ళతోటి మనం మాక్సిమం టైం స్పెండ్ చేస్తాం ఇంట్లో తక్కువ ఉంటాం ఇక్కడ ఎక్కువ ఉంటాం ఆఫీస్ లో బిజినెస్ లో కానివ్వండి వీళ్ళతోటి ఎక్కువ మనకి డీలింగ్స్ ఉంటాయి వీళ్ళని వదిలి ఉండలేము వీళ్ళు మన చుట్టూ మనం వాళ్ళ చుట్టూ ఉంటాము ఇలాంటి వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయాలి వీళ్ళని ఎట్లా ఉంటది అంటే సిట్యువేషన్ కాళ్ళకు
(01:16) చుట్టుకున్న పాము కరవక మానుతుందా అన్నట్టు ఉంటది కానీ హ్యాండిల్ చేయాలి దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం మంచి మంచి స్ట్రాటజీస్ చెప్తాను చివరిదాకా అస్సలు మిస్ అవ్వకండి దీంట్లో ఏదో ఒక పాయింట్ లేదా అన్ని పాయింట్స్ మీకైతే పక్కా యూస్ అవుతాయి బై ద వే మీ అందరికీ తెలుసు నేను మీ దేవికా భట్నగర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ [సంగీతం] స్పీకర్ బయట ట్రైనింగ్ సెషన్స్ కి ఎప్పుడైనా మీ ఆర్గనైజేషన్స్ కానీ కంపెనీస్ కానీ మీరు నన్ను ఇన్వైట్ చేయొచ్చు మెయిల్ ఐడి మీకు ఆల్రెడీ ఇస్తున్నాను డెస్క్టాప్ మీదే సరే ఇప్పుడు ఈ టాక్సిక్ పీపుల్ అంటే
(02:01) నెగిటివ్ పీపుల్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎందుకు ఈ నెగిటివిటీ వస్తుంది ఎందుకు వాళ్ళని బద్ద శత్రువులు మీరు భావిస్తున్నారు అంటే కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఒకటి ఇగో పొగరు కొంచెము నేనే అనే అహంకారం ఒకటి ఆ అహంకారం ఎప్పుడైతే వస్తుందో నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి నేను డామినేటింగ్ నేచర్ నేను ఇది అని ఎప్పుడైతే అనుకుంటారో అక్కడ మనకి మొదలవుతుంది అది చాలా మందిలో ఉంటుంది ఇది ఈగో అనేది ఆ తర్వాత ఇంకొకటి ఆ సస్పిషియస్ గా అనుమానాస్పదంగా ఉండడం అనుమానం ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఈయన ఎక్కడ పోతున్నాడు ఈమె ఎక్కడ పోతుందో ఎవరితో తిరుగుతున్నారు
(02:40) ఇదొక చాలా పెద్ద అనుమానం అండి అసలు ఈ అనుమానం మొదలైతే దాన్ని అంతం చూడడం అంటే చాలా కష్టము ఇదొకటి పెద్ద అనుమానము బిహేవియర్ మీద కావచ్చు ఇంకా దేని మీద అయినా కావచ్చు ఇంకా తర్వాత సుపీరియర్ కాంప్లెక్స్ సుపీరియర్ కాంప్లెక్స్ అంటే నేను డామినేట్ చేయాలి నేను గ్రేట్ ఓకే ఓకే ఇంకా లేకపోతే దీనికి ఆపోజిట్ గా ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ తీసుకోవచ్చు ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అంటే నన్ను చిన్న చూపు చూస్తుందేమో అంటే నేను చిన్నవాడినా నేను చిన్నదన్న ఈయన ఈయన ఈయన ఏం చదువుకున్నాడు ఏంటి ఏం సంపాదిస్తున్నాడు ఏంటి నాకంటే ఈయనకి ఈయన ఏం గొప్ప ఈయన ఏం గొప్ప అది ఇన్ఫీరియర్ కాంప్లెక్స్
(03:18) సుపీరియర్ కాంప్లెక్స్ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లం అండ్ ఇంకా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడం ఇన్సెక్యూర్ గా అంటే అభద్రతగా ఫీల్ అవ్వడము అరే ఇప్పుడు సపోజ్ నేను ఒక జాబ్ చేస్తున్నాను జాబ్ చేస్తున్నప్పుడు నా పైన బాస్ నన్ను చూసి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వచ్చు అరే ఈమె చాలా టాలెంటెడ్ ఈమె కొంచెం పైకి వస్తే నా జాబ్ కి ఎసరు పెట్టేటట్టు ఉంది నాకు నిజంగా జరిగిన ఈ సంఘటనలు అట్లా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడం ఇవన్నీ ఏంటంటే ఈ నెగిటివిటీకి ఈ ఎనిమిటీ ఈ బద్ద శత్రువులుగా తయారవ్వడానికి కారణాలు అయితే ఈ బద్ద శత్రువులు ఎనిమీస్
(03:55) ఎనిమీస్ లేకపోతే టాక్సిక్ పీపుల్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి నేను మీకు డిఫరెంట్ స్ట్రాటజీస్ చెప్తాను ఫస్ట్ ది ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ అంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి మనం అంటున్నాము అవతల వ్యక్తి ఇట్లాంటి ఆయన అట్లాంటి ఆమె అనేసి అంటే వాళ్ళు వాళ్ళని ఎనిమీస్ గా వాళ్ళని నెగిటివ్ పీపుల్ గా భావిస్తున్నాము మన సంగతి ఏంటి వాళ్ళ దృష్టిలో మనం ఎనిమీస్ కావచ్చు కదా వాళ్ళ దృష్టిలో మనం నెగిటివ్ పీపుల్ కావచ్చు కదా అందుకనే ఇంట్రోస్పెక్షన్ ఫస్ట్ పాయింట్ అంటున్నాను 100% వాళ్ళు రాంగ్ కాదండి పక్కా ఎంతో కొంత మన సైడ్ లో నుంచి కూడా
(04:31) కొంచెం ఉండొచ్చు మే బి 10% 20% 50% 70% కూడా ఉండొచ్చు మనకు తెలియదు తెలుసుకోవాలి ఒక్కసారి మిమ్మల్ని మీరు చదవడం మొదలెట్టండి నా బిహేవియర్ ఎట్లా ఉంది నా టాక్ ఎలా ఉంది నా సైడ్ నుంచి ఎటువంటి తప్పులు జరుగుతున్నాయి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి నేను చేస్తున్నది ఏంటి అట్లా మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక్కసారి చదవండి ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అప్పుడు మీకు ఎంతో కొంత మీ సైడ్ నుంచి కూడా కనిపిస్తది అప్పుడు మీరు మీ సైడ్ నుంచి కూడా దున్నుకుంటూ రావచ్చు కదా మీ సైడ్ నుంచి కూడా మెల్లగా పరిష్కారం ఉంటుంది కదా అందుకని ఇంట్రోస్పెక్షన్ ఫస్ట్ పాయింట్
(05:07) అంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారు తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే అండర్స్టాండ్ ది అదర్ పర్సన్ అవతల వ్యక్తిని అర్థం చేసుకోండి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు ఆమె ఎందుకు ఇట్లా చేస్తుంది వాట్ ఇస్ ద రీసన్ ఇందాక చెప్పాను చూడండి అహంకారం అవ్వచ్చు సస్పిషియస్ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ పీరియడ్ కాంప్లెక్స్ లేదా ఇన్సెక్యూర్ ఫిల్మ్ ఏదో ఒక రీసన్ ఉంటుంది ఎందుకు వై వాట్ ఇస్ దిస్ అసలు దానికి కారణం ఏంటి మూల కారణం ఏంటి అది అర్థం చేసుకోండి అవతల వ్యక్తిని అర్థం చేసుకోండి అర్థం చేసుకున్నాక నేను ఇప్పుడు మీకు డిఫరెంట్ స్ట్రాటజీస్ చెప్తాను
(05:39) వీటిలో దేన్నైనా మీరు అప్లై చేయొచ్చు చేస్తే వాళ్ళని కొంచెం హ్యాండిల్ చేయొచ్చు వాళ్ళని హ్యాండిల్ చేస్తుంటే మనకు లైఫ్ కూల్ అవుతుంది వాళ్ళని హ్యాండిల్ చేయకపోతే నిప్పుల మీద కూర్చున్నట్టే ఉంటది ఎప్పుడు పెనం మీద కూర్చున్నట్టే ఎప్పుడు టెన్షన్ టెన్షన్ ఇక బ్రతుకు చాలా భారంగా ఉంటది వీళ్ళతోనే బతకాలి వీళ్ళని ఏం చేయలేదు ఏమో అన్నప్పుడు వాళ్ళతోని కొంచెం మనం హ్యాండిల్ చేసే సిట్యువేషన్ ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటే గనుక కొంచెం లైఫ్ ఈజీగా కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటది స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటది మామూలుగా కూడా కాదు సో కాబట్టి ఎలా
(06:13) హ్యాండిల్ చేయాలి ఫస్ట్ పాయింట్ నేను చెప్తాను కొన్ని పాయింట్స్ చెప్తాను ఇవన్నీ మీరు రాసుకోండి లేదా ఏ పాయింట్ అయినా ఒకటి నచ్చితే గనుక దాన్ని అప్లై చేయండి ఫస్ట్ అఫ్ ఆల్ డోంట్ ప్రొవోక్ దెమ్ వాళ్ళని రెచ్చగొట్టకండి ఆల్రెడీ తేడా అని తెలుసు మనకి ఆ తేడా మనుషులను మళ్ళా మనము రెచ్చగొట్టి వాళ్ళని ఇంకేదైనా మన మాట తో గాని మన చేతలతో గాని ఆ సిచుయేషన్ ని కొంచెం వర్స్ట్ గా చేయకండి ఆల్రెడీ నిప్పు ఉంది దాంట్లో పై పెట్రోల్ పోస్తా అంటే ఎట్లా అది అన్ కంట్రోలబుల్ అయిపోతది అందుకని మీరు వాళ్ళని ప్రొవోక్ చేయకండి వాళ్ళని ప్రొవోక్ చేసి రెచ్చగొట్టే మాటలు
(06:47) మాట్లాడటం బిహేవియర్ కానీ ఇవన్నీ అస్సలు వద్దు కొన్నిసార్లు వాళ్ళు అరుస్తా ఉంటారు వాళ్లే అరుస్తున్నారు మీరు ఏం చేస్తారంటే మీ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు క్లోజ్ రిలేషన్ వాళ్ళతోనే గొడవలు వద్దు మనకి గమ్మును అరవనీయండి అరవనీయండి మీరు నోరు తెరవకండి నోరు తెరిచారంటే అక్కడ రచ్చ రచ్చ అయిపోయి నానా గందరగోళం మొదలైతది నోరు తెరవకుండా గమ్మున కూర్చోండి ఒక చోట మీ పని ఏదో మీరు చేసుకోండి చేసుకుంటా ఎంజాయ్ చేయండి ఎట్లా అరుస్తున్నారు వాళ్ళ లాంగ్వేజ్ ఎట్లుంది ఏమేమి వొకాబులరీ వాడుతున్నారు వామ్మో ఎంత తెలివితేటలు అమ్మో ఈమెకి నమస్కారం పెట్టి
(07:24) అన్నట్టు లోపల అనుకుని ఎంజాయ్ చేస్తూ ఉండండి అండ్ దీన్ని నాగింగ్ అంటారు లెట్ దెమ్ నాగ్ ఎంజాయ్ దేర్ నాగ్ మంచిగా అర్థం ఎంజాయ్ చేస్తూ గమ్మని ఉండాలి ఏం అనకండి అరిచి అరిచి వాళ్ళు నోరు మూసుకుంటారు ఎస్ వాళ్లే నోరు మూసి ఎంతసేపు అరుస్తారు ఆ అరిచేటప్పుడు మీరు గాని ఇంకేదైనా పుల్లు వేసారు అనుకోండి నానా గోలతో అందుకని అక్కడ ఏమి అనొద్దు సిట్యువేషన్ చూసి మీరు గమని ఉండండి వాళ్ళు కూల్ అయినాక మెల్లగా అయినాక అప్పుడు మెల్లగా ఆ సిట్యువేషన్ చూసి మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టండి అప్పుడు మీరు ఏం చెప్పినా వాళ్ళు వింటారు వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు మీరు
(07:58) అరవద్దు తర్వాత మెల్లగా కామ్ అయినాక మీరు కూల్ గా ఎక్స్ప్రెస్ చేయండి నువ్వు అట్లా చేసావు కాబట్టి ఇట్లా అయింది దీనికి ఇది అన్నట్టుగా మెల్లగా మాట్లాడండి అప్పుడు వింటారు మీరు కొట్టిన గాని పడతారు తెలుసా వాళ్ళు అట్లా ఉంటది సిట్యువేషన్ అందుకని ఎప్పుడన్నా ఆ సిచుయేషన్ ని చూసి మీరు వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం బిహేవ్ చేయడం అస్సలు తగలదు అండ్ ఇక్కడ మీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ రెండు కంట్రోల్ లో ఉంచుకోవాలి బాడీ లాంగ్వేజ్ ఒకటి ఇంపార్టెంట్ మీరేం మాట్లాడట్లేదు కానీ మీ బాడీ లాంగ్వేజ్ తో సవా లక్ష ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తున్నారు దాని వల్ల
(08:30) అర్థం చేసుకోలేరా మహా తెలివి మంతులు వాళ్ళు ఓకేనా మీ బాస్ కానీ సబ్ఆర్డినేట్ కానీ అత్తగారు కానీ అమ్మో ఆమె ఏమనదు కానీ చేసేదన్నీ చేస్తది చేసే పనులన్నీ చేస్తది అన్ని అని వాళ్లే వాళ్ళకి తెలిసిపోతుంది అక్కడ అందుకని బాడీ లాంగ్వేజ్ ని కూల్ గా ఉంచుకోండి ఎలాంటి నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకండి బాడీ లాంగ్వేజ్ తోటి ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ నో కోల్డ్ వార్ నో హాట్ వార్ కోల్డ్ వార్ అంటే అసలు రెండు మూడు రోజుల నుంచి మాట్లాడట్లేదు రెండు మూడు వారాల నుంచి మాట్లాడలేదు నెలల తరబడి నోరు మూసుకొని అస్సలు మాట్లాడట్లేదు అది కోల్డ్ వార్ హాట్ వార్ అంటే మాటకు మాట
(09:03) జవాబు ఇచ్చేసి నానా గందరగోళంగా చుట్టుపక్కల అంతా నాలుగు నలుగురు జమేటట్టు తిట్టుకోవడము అలాంటి సిట్యువేషన్ ని హాట్ వార్ అంటారు రెండు వద్దు రెండు డేంజరే సో కాబట్టి ఇది ఎట్లా ఆపొచ్చు అంటే మన లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ ఈ రెండు కంట్రోల్ లో ఉంటే ఆటోమేటిక్ గా దీన్ని మనం ఆపుకోవచ్చు ఇంకొకటి చాలా మందికి వాళ్ళ ఇగో కొంచెం నేనే గొప్ప అని ఆ ఫీలింగ్ ఉంటది ఆ ఈగోని సాటిస్ఫై చేయాలా ఇప్పుడు మనం ఎవరితో ఉన్నాము హస్బెండ్ వైఫ్ అత్తగారు మామగారు లేకపోతే బాసు కొలీగ్ వీళ్ళు వీళ్ళతోటి రోజు మనకు రోజు జరిగేదే కదా ఒక్క స్టెప్ కిందకి వచ్చి వీళ్ళ ఎగోని
(09:44) సాటిస్ఫై చేస్తే మనం కింద పడతామా పడము ఇది గుర్తుపెట్టుకోండి కింద అయితే మనం పడము మెల్లగా వాళ్ళని కొంచెం అర్థం చేసుకోండి మెల్లగా వాళ్ళ ఇగో ని సాటిస్ఫై చేయండి ఆ ఎట్లా అంటే హిందీలో పంజాబీలో అంటారు జహా అప్నా తుసి గ్రేట్ హో అంటే నువ్వు చాలా గ్రేట్ తుసి గ్రేట్ హో అంటే నువ్వు చాలా గ్రేట్ అబ్బో నేను నీ అంత తెలివి నాకు లేదు అమ్మో నువ్వు చాలా ఇంటెలిజెంట్ ఆ నీకు చాలా నాలెడ్జ్ ఉంది నువ్వు బాగా చదువుకున్నావ్ నువ్వు ఇట్లా అట్లా అనేసి కొంచెం పొగడండి నువ్వు స్మార్ట్ గా ఉంటావు ఆ అత్తగారు మీకున్న ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడిదండి మీరు చాలా మంచివారు మీరు మంచి
(10:22) నాలెడ్జ్ పొరపాటున నేను ఏమైనా తప్పు మాట్లాడితే మీరు క్షమించండి మీ కూతుర్ని అనుకోండి అట్లా మంచి మంచి మాటలు మాట్లాడండి వాళ్ళ ఇగో అక్కడ నొక్కేయండి ఎప్పుడైతే మీరు వాళ్ళ ఇగో ని సాటిస్ఫై చేస్తారో అవతల అపోజిట్ పర్సన్ ని అక్కడ సిట్యువేషన్ కంట్రోల్ అవుతుంది వాళ్ళకి అదే కావాలి ఆ తగ్గింది కదా ఇప్పుడు చూడు కిందకి వచ్చింది దారిలోకి వచ్చింది అనేసి వాళ్ళు సంతోష పడతారు సంతోషపడండి మనది ఏం పోయింది మనం కింద పడుతున్నామా మన క్యారెక్టర్ ఏమైనా కిందకి వస్తుందా మన వాల్యూ ఏమి తగ్గుతుంది ఏం తగ్గట్లేదు మనకి ఇక్కడ టెన్షన్ తగ్గిపోతుంది టెన్షన్ అస్సలు పెట్టుకోవద్దు ఆ టెన్షన్
(10:56) ఏంటంటే మీరు ఏం చేస్తున్నా మీరు ఏం తింటున్న మీరు అసలు బతుకుతున్నా కానీ బతికినట్టు ఉండదు అందుకని వాళ్ళని ఇగోని సాటిస్ఫై చేసి మంచిగా మాట్లాడండి నువ్వే గ్రేట్ నువ్వే అది ఇది అని చెప్పి మొదలు పెట్టండి అది అయిపోతుంది ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతారు వాళ్ళు అండ్ ఇలాంటి వాళ్ళని ఒక రైట్ టైం రైట్ ప్లేస్ రైట్ సిట్యువేషన్ చూసుకొని కొంచెం మెల్లగా కూల్ గా మాట్లాడి కింద పడేయండి మీ మాటలతోనే కింద పడేయొచ్చు ఎస్ మంచి మంచిగా మీరు కావాలంటే స్క్రిప్ట్ రాసుకోండి ఇట్లా మాట్లాడితే బాగుంటుంది అని వస్తే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అనుమాన భర్త ఉన్నాడు అనుమాన
(11:35) భార్య ఉంది ఎప్పుడు చూసినావ్ ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావ్ ఎవరితో తిరుగుతున్నావ్ ఎవరితో సంబంధం ఉంది ఇట్లాంటి ఈ అనుమానం క్యారెక్టర్లు ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను రైట్ టైం రైట్ సిట్యువేషన్ అండ్ రైట్ వర్డ్స్ యూస్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు ఒక మంచి సిట్యువేషన్ చూసుకోండి కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఏదో ఒక సిట్యువేషన్ వస్తది వాళ్ళు అన్ని వింటారు ఆ ఉంటుంది ఇగిలిస్తూ ఉంటారు అట్లాంటి టైం లో మీకు ఒక మాట చెప్పనా అండి అని చెప్పి మొదలెట్టేయండి మొదలెట్టి మెల్లగా మన పెళ్లి అయినప్పటి నుంచి సిచుయేషన్స్ అన్ని గుర్తు చేయండి
(12:10) ఎంత బాగా తిరిగే వాళ్ళు ఎంత బాగుండేవాళ్ళము మీరంటే నాకు చాలా ఇష్టం మీకంటే నాకు ఎవ్వరూ లేరు దేశంలో నమ్మండి ఇది అట్లా ఇట్లా అని చెప్పి మెల్లగా మాట్లాడి మీరు అప్పుడప్పుడు అనుమానిస్తూ ఉంటారు నాకు చాలా బాధ అనిపిస్తది నా క్యారెక్టర్ అలాంటిది కాదండి మీరు గట్టిగా మీరు కాకపోతే ఎవరు నమ్ముతారు మీరే సర్వస్వం అనుకోని వచ్చాను కదా మీ దగ్గరికి అన్నట్టుగా ఇదొక చిన్న సిట్యువేషన్ చెప్తాడు అంటే ఆ రైట్ టైం రైట్ ఫుల్ ప్లేస్ లో మీరు మంచి మాటలు మాట్లాడితే గనుక వాళ్ళు చక్కగా ట్యూన్ అయిపోతారు ఇప్పుడు తాగుబోతు పడుతున్నాడు తాగుతా ఉన్నాడు మాటిమాటికి వచ్చి తిడుతున్నాడు
(12:42) కొడుతున్నాడు అలాంటి వాళ్ళని కూడా ఏదో ఒక టైం లో వాళ్ళు వింటారు ఆ టైం లో ఎట్లా ఉంటది అంటే సిట్యువేషన్ మీరేం చెప్పినా వాళ్ళు వింటారు వాళ్ళ బుర్ర కాస్త ఎక్కుతది దాన్ని మంచి ట్యూనింగ్ చేయండి మొత్తం మంచి ట్యూనింగ్ చేయండి చేసినప్పుడు వాళ్ళు కొంచెం మారుతారు అదే ఇప్పుడు తీసుకోండి ఇదే సిచుయేషన్ వాళ్ళు ఏదో కోపంలో ఉన్నారు సిట్యువేషన్ వర్స్ట్ గా ఉంది అట్లాంటి టైం లో మీరు ఇంకేదైనా అన్నారు అనుకోండి ఒక్క మాట అన్నా గాని అక్కడ పెద్ద గందరగోళం అయిపోయి అసలు కొన్ని సిచుయేషన్స్ మీరు నమ్మరు ఆ మర్డర్ల దాకా వెళ్ళిపోయినాయి మర్డర్ దాకా వెళ్ళిపోతారు
(13:19) అండ్ లేకపోతే విడాకులు అంటారు ఇంకా ఒకరినొకరు తిట్టుకోవడం ఇక నీకు నాకు సంబంధం లేదనేసి నానా గోల అయిపోయి ఇక బాస్ ఎంప్లాయ్ ఎంప్లాయర్ ఎంప్లాయి మధ్యలో అయితే ఇక యు ఆర్ ఫైర్డ్ అనేసి లేకపోతే నేను రిజైన్ చేస్తున్నా పో అని చెప్పేసి అట్లా ఉంటది సిట్యువేషన్ అందుకనే కొంచెం ఆ సిచుయేషన్ లో కొంచెం మీరు ఎప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడండి చెప్పేవాళ్ళకు చెప్పే విధంగా చెప్తే గనుక వాళ్ళు వింటారు మీకు చెప్పడం రాలేదు మీకు హ్యాండిల్ చేయడం రాలేదు అంటే గనుక అక్కడ కష్టమైంది అందుకని ఈ సిట్యువేషన్స్ మనకి ఆ పర్సన్ ని బట్టి ఆ పరిస్థితులను బట్టి
(13:55) మెల్లగా మనం మెల్లమెల్లగా మార్చుకొని మన విధానం మన బిహేవియర్ మన ఆటిట్యూడ్ మన హ్యాండ్లింగ్ మెథడాలజీ అనేది మార్చుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది ఇదే లైఫ్ స్కిల్స్ అండి ఇలాంటి సిట్యువేషన్ మీరు హ్యాండిల్ చేయగలరు ఇట్లా ఈ స్కిల్ ఉంటే గనుక అర్థమైందా ఇది అండ్ ఇంకొకటి ఆ ఇలాంటి వాళ్ళని మార్చడానికి టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ ది హోమ్ ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళిపోండి ఇప్పుడు ఈవెన్ ఆఫీస్ కొలీగ్స్ మధ్యలో కూడా అవుతది ఔటింగ్ కి వెళ్తా ఉంటారు అందరూ ఆఫీస్ కొలీగ్స్ అయినా ఇంట్లో వాళ్ళు అయినా ఓపి పిక్నిక్ కి వెళ్ళండి ఓ సినిమాకి
(14:31) వెళ్ళండి షాపింగ్ కి వెళ్ళండి లేకపోతే ఏదైనా టూర్ కి వెళ్ళండి తీసుకుపోండి బయటికి ఆటోమేటిక్ వాళ్ళు కంట్రోల్ లో ఉంటారు వీళ్ళకి ఏంటంటే అప్పుడు నార్మల్ సిట్యువేషన్ వస్తుంది అప్పుడు మీరు ఏం చెప్తే వాళ్ళు అట్లా వింటారు అట్లా మెల్లమెల్లగా మీరు దున్నుకుంటూ రావచ్చు మెల్లగా వాళ్ళని ప్లఫింగ్ చేసుకుంటూ దున్నుకుంటూ మీ దారిలోకి వాళ్ళని తెచ్చుకోవచ్చు మీరు కొంచెం మోల్డ్ అవ్వాలి వాళ్ళని కొంచెం మోల్డ్ చేసుకోవాలి అంతే ఇక అయిపోయింది ఇంకా అక్కడ ఏముంది ప్రాబ్లం ఇట్లా ఎలాంటి నెగిటివ్ వాళ్ళు అయినా కానీ వాళ్ళని హ్యాండిల్ చేయడం మాత్రం చాలా
(15:03) ఇంపార్టెంట్ లేకపోతే బతకడం చాలా కష్టం ఉన్నదే కొద్ది లైఫ్ మనము ఇంట్లో నిప్పున్న ఆఫీస్ లో నిప్పున్నా ఎక్కడున్నా గాని మనకి మనశ్శాంతి అనేది ఉండదు ఆఫీస్ లో గొడవలు అవుతున్నాయి ఇంటికి వస్తే ఇంట్లో మైండ్ కూడా అక్కడే తిరుగుతా ఉంటది ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎప్పుడు టెన్షన్స్ ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడము ఆఫీస్ కి వెళ్ళిన అక్కడ కూడా మీకు ఇది మెంటల్ టెన్షన్ ఉండనే ఉంటది అందుకని రెండు ప్లేస్ లు హ్యాండిల్ చేయాలంటే గనుక ఇలాంటి వాళ్ళు నెగిటివ్ వాళ్ళు శత్రువులు ఎనిమీస్ అని ఎవరినైతే మీరు అనుకుంటారో వాళ్ళని హ్యాండిల్ చేయండి లైఫ్ కూల్ అయిపోతుంది సింపుల్ ఇదే అండి
(15:40) అండ్ మిమ్మల్ని మీ బిహేవియర్ మాత్రం ఎప్పుడు కంట్రోల్ లో నుంచి తప్పించుకోకూడదు ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉంచుకోండి కూల్ గా ఉండండి యోగ ఇవన్నీ చెప్తాను కదా యోగ యోగ నిద్ర మెడిటేషన్ ప్రాణాయామ ఇవన్నీ దాని కోసమే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసమే చేస్తూ ఉండండి కూల్ గా ఉండండి మేడం బాగానే చెప్తున్నారు మేడం అంటే ఆయన నా నాకు కూడా తెలుసు కూల్ గా ఉండడం అంత ఈజీ కాదు కాకపోతే ప్రయత్నిస్తే గనుక అసాధ్యమైతే కాదు ఒప్పుకుంటారా మెల్లగా మొదలెట్టండి ఏం కాదు ఆఫ్టర్ ఆల్ చాలా ఉన్నాయి జీవితంలో చూడాల్సింది ఇది ఎంత వీళ్ళు ఎంత అనుకోండి అనుకోని మొదలెట్టండి
(16:18) టాక్ నచ్చిందా హ్యాండిల్ చేయడం మొదలుపెట్టేయండి ఎవరిని హ్యాండిల్ చేస్తున్నారో అది కూడా కొంచెం చూసుకోండి మీ యొక్క మాటలతోటి బిహేవియర్ తోటి నేను చెప్పిన స్ట్రాటజీస్ తోటి ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి వాళ్ళని అర్థం చేసుకోండి అండ్ కొన్ని స్ట్రాటజీస్ చెప్పాను దాని ప్రకారం వెళ్ళిపోండి అంతే సింపుల్ టాపిక్ నచ్చితే తప్పకుండా పది మందికి షేర్ చేసుకోండి మీ అందరి యొక్క అభిమానానికి పేరు పేరున ధన్యవాదములు మరో కొత్త టాపిక్ తో ఉంటాను మీ అందరి ముందు ఉంటాను సో అప్పటిదాకా నవ్వుతూ ఆనందంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి
(16:50) టేక్ కేర్ గుడ్ లక్

No comments:

Post a Comment