Sunday, August 20, 2023

మొండితనం పట్టుదల ఈ రెండింటికి గల వ్యత్యాసం ఏమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.

 [7/7, 20:23] +91 98491 63616: మొండితనం పట్టుదల ఈ రెండింటికి గల వ్యత్యాసం ఏమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.

✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు

 రాజారావు రమల ముద్దుల  కూతురు సుధ.  ఏడో తరగతి  చదువుతోంది . తల్లిదండ్రుల అతి గారాబం వల్ల మొండిగా తయారయింది. అడిగింది ఇవ్వకపోతే అలక మొదలుపెట్టేది.   ఏడుపుతోనైనా  సాధించుకుంటుంది  తప్ప ఆలోచించదు.  

ఒకసారి వాళ్ళ ఊరుకి  సర్కస్ వచ్చింది. తీసుకెళ్లమని అమ్మానాన్నలని అడిగింది సుధ. ఆఫీసు పని మీదవెళుతున్నానని ,  తరువాత తీసుకెళ్తామని చెప్పాడు వాళ్ళ నాన్న. 
ఏ కళన ఉందో కానీ కొత్త డ్రెస్, బూట్లు కొంటానంటే  ఆగుతానంది సుధ. సరేనన్నాడు సుధ నాన్న. ఆయన తిరిగి వచ్చాక కూడా పనెక్కువై  ఈ  విషయం మరచిపోయాడు. సుధకి  కూడా గుర్తు లేక పోవడం వలన మళ్ళీ అడగలేదు.  

నెలరోజుల తరువాత ఒకసారి   జ్వరంతో బాధపడుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంది సుధ. ఆ సాయంత్రం బడి నుండి  విద్య  అనే స్నేహితురాలు వచ్చి సుధని పరామర్శించింది. మాటల మధ్యలో  ‘ఆ రోజే సర్కస్ చూడడానికి చివరి రోజు’ అంది.  

 అంతే। అమ్మానాన్నలని  సర్కస్ చూడడానికి  తీసుకెళ్లమని  అడిగింది సుధ.  జ్వరంతో  ఉన్నప్పుడు  బయట తిరిగితే బలహీనంగా ఉండటం వల్ల ఆనందించలేవని చెప్పారు వాళ్ళు. ఆరోజుతో ఆఖరు కాబట్టి వెంటనే వెళదామని ఏడుపు ప్రారంభించింది సుధ. దాంతో వాళ్ళు సరేనన్నారు. 

సర్కస్ జరుగుతున్న ఆవరణలోనే జెయింట్ వీల్ కూడా ఉంది. సర్కస్ కి సమయం ఉండడంతో జెయింట్ వీల్  ఎక్కుతానంది సుధ.

  “నీరసంగా ఉన్నావు. కళ్ళు తిరుగుతాయి. వద్దని’ చెప్పాడు సుధ  నాన్న.

 ’ నా ఫ్రెండ్  విద్య ఎక్కింది. నేనూ ఎక్కుతాను’ అంది సుధ బింకంగా. తనని ఒప్పించలేక సరేనన్నారు అమ్మానాన్నలు.  
 ఎత్తైన ప్రదేశానికి వెళితే వాంతులవుతాయన్న భయంతో క్రిందనే నిలుచుంది సుధ వాళ్ళమ్మ. 

జెయింట్ వీల్ ఎక్కి నాన్న చెయ్యి పట్టుకుని కూర్చుంది సుధ. కానీ  జెయింట్ వీల్ పైకి వెళ్లేసరికి భయంతో ఆపించమని ఒకటే కేకలు పెట్టింది.  కూతురినే చూస్తున్న  వాళ్ళమ్మ  ఆపరేటరుకి  చెప్పి చక్రాన్ని ఆపించింది.   

ఆ ప్రదర్శనలో ఏమేమి ఉన్నాయో చూస్తూ వెళుతుండగా  ఐస్ క్రీమ్ కొనమని   అడిగింది సుధ.  ‘జ్వరంతో ఉన్నావు. ఇప్పుడు తింటే జలుబు చేస్తుందని’ చెప్పారు కానీ   వినలేదు సుధ. ఏడువు ముఖం పెట్టేసరికి ఐస్ క్రీమ్ కొనిచ్చాడు వాళ్ళ నాన్న. 

‘ఇలా అన్నింటికీ మొండితనం ప్రదర్శిస్తే   కష్టం. వద్దని చెబితే వినాలి . నువ్వు పట్టిన కుందేలుకి  మూడే కాళ్ళు అనకూడదు. నీ మేలుకోరి చెప్పే మా మాటలు   వినాలి” అన్నాడు సుధ  నాన్న. ఊహూ.. వినను … అని అడ్డంగా తలూపింది  సుధ. 

  ఐస్ క్రీమ్ తినేసి బయటకి వస్తుంటే సుధ నాన్న తాలూకా స్నేహితుడు కనిపించాడు. వాళ్ళూ కుటుంబంతో వచ్చారు. ఆయన భార్యను,  కొడుకును సుధ అమ్మకి  పరిచయం చేసాడు. అందరూ కలసి కాసేపు  దగ్గర్లో ఉన్న  బెంచీ మీద కూర్చున్నారు.  
మాటల మధ్యలో వాళ్ళ కొడుకు గురించి చెబుతూ “వీడికీ మధ్య మెడిసిన్ లో  సీటు వచ్చింది” అని చెప్పాడు ఆయన. 

“చాలా సంతోషం. పార్టీ ఇవ్వాల్సిందే” అంటూ అబ్బాయికి అభినందనలు చెప్పారు సుధ అమ్మానాన్న. 

“తొలి ప్రయత్నం కాదు లెండి. మూడో ప్రయత్నంలో వచ్చింది. డాక్టర్ కావాలన్నది వాడి  కల. లాంగ్ టర్మ్ కోచింగు తీసుకుని మొత్తానికి కల నెరవేర్చుకున్నాడు” అన్నాడు ఆయన. 

కుర్రాడికి మరోసారి అభినందనలు చెప్పారు  సుధ అమ్మానాన్న.

వాళ్ళకి ధన్యవాదాలు చెప్పిన తరువాత ఆ కుర్రాడు  “మెడిసిన్లో  సీటు రాకపోతే రెండేళ్లు వృధా అవుతాయని వీళ్ళు  భయపడ్డారు. కానీ కష్టపడి చదివి ర్యాంకు  సాధించాను” అన్నాడు గర్వంగా.   

“నీలో  కూడా మా సుధలాగా మొండితనం ఎక్కువే. అనుకున్నది సాధించావు” అంది సుధ అమ్మ.

  “దాన్ని మొండితనం అనకూడదు. పట్టుదల అనాలి” అని  సరిదిద్దాడు సుధ నాన్న. 

“అనుకున్నదల్లా సాధించుకుంటానని మొండితనం అన్నారు నా విషయంలో.    ఇప్పుడేమో పట్టుదల అంటున్నావు.  రెండింటికీ  తేడా ఏమిటి” అనడిగింది సుధ.

 సుధ నాన్న “ చాలా ఉంది. మొదటిది  స్వార్ధం కోసం, రెండోది  ప్రయోజనం కోసం’ అన్నాడు. 

తల గోక్కుంటూ “సరిగా అర్ధమయ్యేలా చెప్పండి” అంది సుధ. 

“సరే. చిన్న చిన్న కోరికలు తీరకపోతే నిరాశ పడిపోయి  అలగడం, ఏడవడం,  మూర్ఖంగా  ప్రవర్తించడాన్ని మొండితనం అంటారు.  అందులో కేవలం   స్వార్థం ఉంటుంది.  మొండిపట్టు పట్టడం మంచిది కాదు. మొండితనం వలన కొన్నిసార్లు ఎదురుదెబ్బలు, నష్టం కలగొచ్చు.  నీ విషయమే మాట్లాడుదాం. ‘జ్వరంతో ఉన్నావు కాబట్టి బయట తిరగొద్దు, విశ్రాంతి తీసుకో’ అని  చెప్పాం .  జెయింట్ వీల్ ఎక్కవద్దన్నా ఆలకించావా? ఐస్ క్రీమ్ తినవద్దన్నా ఆగావా? అలా  మొండితనంతో కోరిన కోరికల వలన నష్టమే తప్ప లాభం ఉండదు. రేపు నీ ఆరోగ్యం క్షీణిస్తే నీ మొండితనమే కారణమౌతుంది” అని వివరించాడు సుధ నాన్న . 

“అలాగా… పట్టుదల గురించి కూడా చెప్పండి” అనడిగింది సుధ.
[7/7, 20:23] +91 98491 63616: “ఒక ఉన్నత లక్ష్యం కోసం బలమైన కోరిక పెట్టుకుని సాధించుకోవడాన్నే  పట్టుదల అంటారు. ఆ కోరిక సాధించుకోవడంలో వివేకం, విజ్ఞానం, విచక్షణ  ఉపయోగించాలి. పట్టుదలతో ప్రయత్నించేవారికి విజయం లభిస్తుంది.  ప్రయోజనం కలుగుతుంది. నీ లాంటి విద్యార్థులు గొప్ప  ఆశయం పెట్టుకుని అది నెరవేర్చడానికి  పట్టుదలతో ప్రయత్నించాలి. అప్పుడే ఆ అబ్బాయిలా  మంచి స్థాయికి వెళతారు”  అని చెప్పాడు  సుధ నాన్న. 

 తనకి అర్ధమైందన్నట్టు తలాడించింది సుధ.  
“ ఇకముందు మొండితనం వదిలేస్తాను. మీ మాట వింటూ  కష్టపడి చదువుతాను.  పట్టుదలతో ప్రయత్నించి గొప్పదాన్నవుతాను” అని మాట ఇచ్చింది  సుధ.   వాళ్ళమ్మా నాన్నతో సహా అందరూ  హాయిగా నవ్వుకున్నారు .  
—---***-----

బీహార్ లోని ఓప్రభుత్వ కార్యాలయంలో జరిగిన యదార్థ సంఘటన




 *ఆమె ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్.*

*ఆరోజు ఆమె ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.*

*ఆమె రోజులాగే ఆఫీసులో అన్ని గదులు ఊడ్చి సిబ్బందితో రోజు మాదిరే సంతోషంగా గడుపుతూ ఉంది, సిబ్బంది మాత్రం మమ్మల్ని విడిచి పోతున్నావు అంటూ భావోద్వేగాలతో కళ్ళు చెమర్చుతున్నాయి. సాయంత్రం 5 గంటలయ్యింది, సిబ్బంది బొకేలతో హడావుడిగా వున్నారు.*

*అంతలో జిల్లా కలెక్టర్ కారు వచ్చి ఆగింది, కలెక్టర్ కారు దిగి నేరుగా అస్వీపర్ వద్దకు వెళ్లి ఆమె కాళ్లకు దండం పెట్టాడు.*

*మరో పెద్దకారు వచ్చి ఆగింది, ఆకారులో పెద్ద పేరున్న సివిల్ ఇంజనీర్, ఆయన కూడా వచ్చి అస్వీపర్ కాళ్లకు దండం పెట్టాడు.*

*మరో కారు వచ్చింది, ఆకారులో పేరున్న గుండె వైద్య నిపుణులు వచ్చి రాగానే ఆస్వీపర్ కాళ్ల మీద నన్ను క్షమించమ్మా 5నిమిషాలు ఆలస్యంగా వచ్చాను అని ప్రాధేయపడ్డాడు.*

*ఈ ముగ్గురూ(కలెక్టర్, సివిల్ ఇంజనీర్, గుండె వైద్య నిపుణులు)అస్వీపర్ కుమారులట. అక్కడ వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారింది. అందరి కళ్ళలో కన్నీళ్లే. స్వీపరుగా పని చేస్తూ కుమారులను చదివించానని, నాకష్టాన్ని పిల్లలు వృధా చేయలేదని, స్వీపరుగా నాఉద్యోగం ఆనందంగా నిర్వహించానని ఇంతకంటే నాకు మాటలు రావటం లేదంటూ, ఇక్కడి ఆఫీసుని, సిబ్బందిని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందని కన్నీళ్ళు తుడుచుకుంటూ ప్రసంగాన్ని ముగించారు.*

*(బీహార్ లోని ఓప్రభుత్వ కార్యాలయంలో జరిగిన యదార్థ సంఘటన).*
🙏🙏🙏 🙏🙇🏻‍♂️🙏 🙏🙏🙏

Friday, August 18, 2023

కర్మ క్షేత్రం!

 *కర్మ క్షేత్రం!*
------------------
జీవితం అంటే కత్తుల వంతెన
జీవితం అంటే నిప్పుల నిచ్చెన
నెత్తురోడుతుందని
నిప్పు కాలుతుందని
కూర్చుంటే
నిలువ నీరువై పోతావు
బురద ఏరువై పోతావు
ప్రతీ క్షణం మరో క్షణానికి తరుముతుంది
ప్రతీ కణం కొత్త కణాన్ని 
కోరుతుంది
నువ్వేమీ పూలశయ్యపై
పడుకునేందుకు రాలేదు
నువ్వేమీ పాల బువ్వనే
తినేందుకు వీలులేదు
సవాలులో ప్రమాదముంది
సాహసిస్తేనే ప్రమోదమవుతుంది
భీరువుగా కూరుకోకు
భద్రతనే కూరుకోకు
ప్రతీ అడుగు రేపు కొరకు పడనీ
నిన్నలో నిలిచిపోకు
ప్రతీ గొడుగు వాన కొరకు తెరవనీ
చినుకులో తడిచిపోకు
నువ్వు ఒక మట్టిముద్దవు కారాదు
ఎవరు ఎట్లా పడితే అలా మలిచేందుకు
నువ్వు ఒక శస్త్రమల్లే మారి చూపు
నువు కోరుకున్న రీతిలో గెలిచేందుకు
మస్తిష్కం ఓ ఆయుధం
మనస్సు ఒక మర్కటం
ఆలోచనకు పదును పెట్టు
అవివేకాన్ని పాతిపెట్టు
నువ్వేక్కేందుకే ఆ శిఖరం వుంది
నువ్వు గెలిచేందుకే జీవితం వుంది
జీవితం ఓ యుద్ధం
కృష్ణుడెవరు తోడుండరు
జీవితం ఓ కురుక్షేత్రం
గీత నెవరు బోధించరు
నరుడూ నీవే నారాయణుడూ నీవే
మిత్రుడు నీవే శత్రువు నీవే
నీ మార్గం నువ్వు చేసుకోవాలి
నీ సమరం నువ్వే గెలుచుకోవాలి!!
----  _*దండమూడి శ్రీచరణ్*_
9866188266

Thursday, August 17, 2023

రామచంద్ర డోంగ్రే తన భార్య అస్థికల నిమజ్జనానికి కూడా డబ్బులు లేని ఓ భాగవతకథకుడు.

 


రామచంద్ర డోంగ్రే తన భార్య అస్థికల నిమజ్జనానికి కూడా డబ్బులు లేని ఓ భాగవతకథకుడు. 

కథకు ఒక్క రూపాయి కూడా తీసుకోని  మహానుభావుడా మీకు పాదాభివందనం🙏 

తులసి ఆకులను మాత్రమే తీసుకునే గౌరవనీయులైన రామచంద్ర డోంగ్రే మహారాజ్ వంటి భాగవతాచార్యులు కూడా ఉన్నారని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది.  

ఆయన ఎక్కడ భాగవతకథ చెబుతారో, అందులో ఏ విరాళం వచ్చినా, 
అదే నగరంలో లేదా గ్రామం లోని పేదల సంక్షేమం కోసం విరాళంగా ఇచ్చేవారు.

ఎలాంటి ట్రస్ట్ వారి నుండి సృష్టించబడలేదు, మరియు ఎవరినీ శిష్యులుగా చేయలేదు.

తనకిష్టమైన ఆహారాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత, ఠాకూర్జీకి భోజనం పెట్టి ప్రసాదం తీసుకునేవాడు.  

డోంగ్రే మహారాజ్ కలియుగానికి చెందిన దానవీర కర్ణుడుగా చెప్పవచ్చు.

గోరఖ్‌పూర్‌ లోని క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చిన చౌపాటీలో ఆయన చివరి ప్రసంగంలో కోటి రూపాయలు సేకరించారు.

తానేమీ తీసుకోలేదు.

డోంగ్రే మహారాజ్ వివాహం చేసుకున్న తరువాత తన మొదటిరాత్రి సమయంలో, ఆయన తన భార్యతో, 

"దేవి, మీరు నాతో ఉన్నప్పుడు 108 భాగవతకథలను చెప్పాలనుకుంటున్నాను.
ఆ తర్వాత మీరు కోరుకుంటే, మేము గృహస్థాశ్రమం లోకి ప్రవేశిస్తాము" అని చెప్పాడు.

దీని తరువాత, 
డోంగ్రే జీ మహారాజ్ భాగవతకథలను ప్రవచనం చేయడానికి ఎక్కడికి వెళ్లినా, ఆయన భార్య కూడా ఆయనతో పాటు వచ్చేది.

108 భాగవతకథలు పూర్తికావడానికి దాదాపు ఏడు సంవత్సరాలు పట్టింది.  

అప్పుడు డోంగ్రే మహారాజ్ తన భార్యతో ఇలా అన్నాడు. 
ఇప్పుడు మీరు అనుమతిస్తే, మేము గృహస్ధాశ్రమంలో ప్రవేశించి, మీకు మన వంశ ఉద్ధరణకు పిల్లలను కనాలి అనుకుంటున్నాను అన్నాడు.

దీనిపై ఆయన సతీమణి.. 
‘‘మీ నోటి నుంచి 108 భాగవతకథలు విని, గోపాలుడినే నా కొడుకుగా స్వీకరించాను, కాబట్టి ఇప్పుడు మనకు పిల్లలు పుట్టాల్సిన అవసరం లేదు’’ అని చెప్పింది.

అలాంటి భార్యాభర్తలు ధన్యులు. 

కృష్ణునిపై వారి ప్రేమ అలాంటిది.

డోంగ్రే జీ మహారాజ్ భార్య అబూలో నివసించేవారు. మరియు డోంగ్రేజీ మహారాజ్ భాగవతకధారసాన్ని దేశంలో మరియు ప్రపంచానికి చేరవేసేవారు.

భార్య చనిపోయిన ఐదురోజుల తర్వాత ఆయనకు విషయం తెలిసింది.  
ఆయన తన భార్య అస్తికలను   నిమజ్జనం చేయడానికి వెళ్ళాడు. 

ఆయనతో పాటు ముంబైకి చెందిన స్వామి "రతీభాయ్ పటేల్ జీ" కూడా ఉన్నారు.
 
రతీ భాయ్, నా దగ్గర ఏమీ లేదు, అస్తికలను నిమజ్జనం చేయడానికి ఏదైనా ఖర్చు అవుతుంది కదా! అని డోంగ్రేజీ మహారాజ్ తనతో చెప్పారని ఆయన తరువాత చెప్పారు.

అప్పుడు మహారాజ్, 'ఇలా చెయ్యి. భార్య మంగళసూత్రం మరియు చెవిపోగులు అమ్మిన తర్వాత వారికి ఎంత వస్తె అంతతో వారు అస్థికలు నిమజ్జనం కోసం ఉపయోగిస్తారు' అని చెప్పారు.

ఏడుస్తూ, సేఠ్ రతీభాయ్ పటేల్ చెప్పారు ఈ విషయం.

మహారాజశ్రీ ఆజ్ఞతో ప్రజలు దేనికైనా సిద్ధమయ్యారు అయినా ఆయన ఒప్పుకోక పోవడంతో,
ఆ మహానుభావుడు భార్య అస్థికల నిమజ్జనానికి కూడా డబ్బు లేదు.
    
మనం ఒకే సమయంలో ఎందుకు చనిపోలేదు
అని వెక్కి వెక్కి ఏడవడం తప్ప నా నోటి నుంచి ఒక్కమాట కూడా రావడం లేదు.

సనాతన ధర్మం ప్రధానం.  

అటువంటి సాధువులు మరియు మహాత్ములు మీకు సనాతన సంస్కృతిలో మాత్రమే కనిపిస్తారు.  

మన దేశంలో చాలా విషయాలు మనందరికీ చేరవు.  

మన దేశ సంస్కృతి మనందరికీ తెలియచేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను.
 
జై శ్రీ రాధే కృష్ణ 🚩🙏

అంత గొప్ప నిర్లిప్తుడైన మహాత్ముడు, సన్యాసి పాదాల వద్ద కోటినమస్కారాలు పెట్టినా తక్కువే.🙏

భార్య ఇంటికి ఆభరణం!!

 భార్య ఇంటికి ఆభరణం!!*  (నేడు ప్రపంచ వివాహ దినోత్సవం) * భరించేది భార్య, * బ్రతుకు నిచ్చేది భార్య, * చెలిమి నిచ్చేది భార్య  * చేరదీసేది భార్య  * ఆకాశాన సూర్యుడు    లేకపోయినా... ఇంట్లో  భార్య లేకపోయినా... అక్కడ జగతికి వెలుగుండదు, ఇక్కడ ఇంటికి వెలుగుండదు.  * భర్త  వంశానికి సృష్టికర్త  * మొగుడి అంశానికి మూలకర్త, కొంగు తీసి ముందుకేగినా... * చెంగు తీసి మూతి తుడిచినా...ముడిచినా.. తనకు లేరు ఎవరు సాటి  * ఇల లో తను లేని ఇల్లు...  కలలో.... ఊహకందని భావన... * బిడ్డల నాదరించి... * పెద్దల సేవలో తరించి * భర్తని మురిపించి.. మైమరపించి... * బ్రతుకు మీద ఆశలు పెంచి...  * చెడు ఆలోచనలు త్రుంచి... * భ్రమరం  లా ఎగురుతూ... * భర్త ను భ్రమల నుండి క్రిందకు దించుతూ... * కళ్ళు కాయలు కాచేలా... * భర్త  జీవితాన పువ్వులు పూచేలా చేసిన జీతం లేని పని మనిషి.   జీవితాన్ని అందించే మన మనిషి ...  ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం  ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప.  అదే  భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం * 🌹🌹🌹🌹🌹🌹

Sunday, August 13, 2023

శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం అనేది అంతకన్నా ముఖ్యం...

 [13/08, 5:34 pm] pasupulapullarao@gmail.co: శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం అనేది అంతకన్నా ముఖ్యం... కొన్ని రోగాలకు మూల కారణం మానసిక ప్రశాంతత లేక పోవడమే... అదే పెద్దలు గతంలో చెప్పారు మనేది (మానసిక)కి మందే లేదని... మానసిక రోగం అనేది అనేక సమస్యలు ద్వారా అవి పెట్టే బాధలు ద్వారా... మానసిక సమస్యలు అనేవి చెడు కర్మల ఫలితమే... మానసిక సమస్యకూ మందు సరైన సాధన ద్వారా చెడు కర్మలు దగ్దం చేసుకోవడం మాత్రమే పరిష్కారం... సరైన సాధన ద్వారా మానసిక చికిత్స, శారీరక రోగ చికిత్స మొదలగు ఆన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది... బోనస్ గా ఆత్మ శక్తి పొంది నిరంతరం ఆనందంగా జీవిస్తారు.
అలాగే క్వాంటిటీ ధ్యానం అనేది ఉండదు... క్వాలిటీ ధ్యానం మాత్రమే ఉంటుంది... క్వాంటిటీ ధ్యానం అంటే గంటలు గంటలురోజులు రోజులు రోజులు నటిస్తూ చేయడం... క్వాలిటీ ధ్యానం అంటే సరైన సాధన ద్వారా శ్వాస మరియు అలోచనలు లెని స్థితికి చేరుకొని అనంతమైన విశ్వశక్తి పొందడం.
[13/08, 5:46 pm] pasupulapullarao@gmail.co: Mental health is more important than physical health... The root cause of some diseases is lack of mental peace... The same elders said earlier that we (mental) have no cure... Mental illness is caused by many problems and the suffering they cause... Mental problems are the result of bad karma... The only solution to mental problems is to burn off bad karmas through proper practice.
Also there is no quantity meditation... There is only quality meditation... Quantity meditation means practicing for hours and hours and days and days and days... Quality meditation means reaching the state of breath and thoughtless through proper practice and gaining infinite cosmic energy.
[13/08, 5:47 pm] pasupulapullarao@gmail.co: मानसिक स्वास्थ्य शारीरिक स्वास्थ्य से अधिक महत्वपूर्ण है... कुछ बीमारियों का मूल कारण मानसिक शांति की कमी है... उन्हीं बुजुर्गों ने पहले कहा था कि हमारे (मानसिक) इलाज का कोई इलाज नहीं है... मानसिक बीमारी कई समस्याओं के कारण होती है और उनके कारण होने वाली पीड़ा... मानसिक समस्याएं बुरे कर्मों का परिणाम हैं... मानसिक समस्याओं का एकमात्र समाधान उचित अभ्यास के माध्यम से बुरे कर्मों को जलाना है।
इसके अलावा कोई मात्रा ध्यान नहीं है... केवल गुणवत्ता ध्यान है... मात्रा ध्यान का अर्थ है घंटों और घंटों और दिनों और दिनों तक अभ्यास करना... गुणवत्ता ध्यान का अर्थ है उचित अभ्यास के माध्यम से सांस और विचारहीन स्थिति तक पहुंचना और अनंत प्राप्त करना ब्रह्मांडीय ऊर्जा.

How to create wealth

 How to create wealth

1. Set clear financial goals: Start by identifying your financial goals, whether it's saving for retirement, buying a house, or starting a business. Having clear objectives will help you stay focused and motivated.

2. Develop a comprehensive budget: Create a detailed budget that outlines your income, expenses, and savings. This will allow you to track your spending habits, identify areas where you can cut back, and allocate more funds towards savings and investments.

3. Live within your means: Avoid the temptation of overspending and accumulating debt. Try to live within your means by distinguishing between wants and needs. Prioritize your expenses and make conscious decisions about where to spend your money.

4. Save and invest wisely: Make it a habit to save a portion of your income regularly. Create an emergency fund to cover unexpected expenses and save for short-term goals. Consider investing in stocks, real estate, or other investment vehicles that align with your risk tolerance and financial goals.

5. Educate yourself about personal finance: Take the time to learn about personal finance, investment strategies, and wealth management. This knowledge will empower you to make informed decisions about your financial future and increase your chances of success.

6. Develop multiple streams of income: Diversify your income sources to increase your cash flow and financial stability. This can be done through side hustles, freelancing, starting a business, or investing in income-generating assets.

7. Minimize debt: Keep your debts under control by avoiding unnecessary borrowing and paying off existing debts as soon as possible. High-interest debts, such as credit card debt, can eat into your wealth-building efforts.

8. Take calculated risks: Wealth creation often involves taking calculated risks. Identify opportunities that align with your financial goals and risk tolerance, such as investing in stocks or starting a business. However, always conduct thorough research and seek professional advice before making significant financial decisions.

9. Continuously track and review your financial progress: Regularly review your financial situation and assess whether you are on track to reach your goals. Adjust your strategies if necessary and stay disciplined in your wealth-building efforts.

10. Seek professional guidance: Consider seeking advice from financial advisors, wealth managers, or investment professionals who can provide personalized guidance based on your specific circumstances and goals. They can help you develop a tailored financial plan and make informed investment decisions.

A severe vitamin B12 deficiency can lead to deep depression, paranoia and delusions, memory loss, incontinence, loss of taste and smell, and more* *Don't suicide, think positive

 *A severe vitamin B12 deficiency can lead to deep depression, paranoia and delusions, memory loss, incontinence, loss of taste and smell, and more*
*Don't suicide, think positive*

*డిప్రెషన్‌ను జయిస్తే, చావాలన్న ఆలోచనను చంపేసినట్టే!*

          అలాంటి డిప్రెషన్‌ నుంచి బయటపడేసేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ‘వన్‌ లైఫ్‌’ అలాంటిదే! ఎవ్వరికీ చెప్పుకోలేని, ఎవరికైనా చెప్పుకుంటే ఏమనుకుంటారోనన్న భయాలేవీ లేకుండా హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి కష్టాలను చెప్పుకోవచ్చు. మాట్లాడితేనే కదా, మనసు కుదుటపడేదీ!!

‘వన్‌ లైఫ్‌’ హెల్ప్‌లైన్‌ నంబర్‌: 7893078930 &9703706660

డిప్రెషన్‌ లక్షణాలు ఇవీ..
♦️ జనాలతో కలవడానికి ఇష్టపడకపోవడం. గ్రూపులకు దూరంగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతూ ఉండడం.

♦️ డల్‌గా, జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా ప్రవర్తిస్తూ ఉండడం.

♦️ ఏదో ఒకవిధంగా ఇదే విషయాన్ని చెప్తూ ఉండడం. సోషల్‌ మీడియాలో ఎక్కువగా డిప్రెషన్‌ సంబంధిత పోస్ట్‌లు పెడుతూ ఉండడం.

♦️ ఒంటరితనం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం......... మొదలైనవి.
  కొందరు ఆడవాళ్లలో డిప్రెషన్ ఎక్కువ... ఎందుకంటే!

మగవారితో పోల్చుకుంటే ఆడవారిలో డిప్రెషన్ ఎక్కువ. ఈ విషయాన్ని వైద్యులు ఎప్పుడోనే పసిగట్టేశారు. ఆడవారిలో ప్రత్యేకంగా ఉండే హార్మోనులు, వారి పట్ల కఠినంగా ఉండే సమాజం వల్లే వారిలో డప్రెషన్ ఎక్కువ అని తేల్చేశారు. కానీ కొందరు ఆడవాళ్లు మరింత త్వరగా డిప్రెషన్తో బాధపడటం వైద్యులని కలచివేసింది. దీని వెనుక కారణం ఏమిటో కనుక్కోవాలని అనుకున్నారు. ఫలితం ఇదిగో...

వేర్వేరు ఆడవారిలో డిప్రెషన్ తీరుని గమనించేందుకు 1,300 మంది ఆడవారిని పర్యవేక్షించారు. వీరిలో estradiol అనే హార్మోనులే మార్పులే వారి డిప్రెషన్ తీరుని ప్రభావితం చేస్తున్నట్లు తేలింది. మనం తరచూ వినే estrogen అనే హార్మోనులో ఒక ముఖ్య రసాయనమే ఈ estradiol. ఈ estradiol రుతుక్రమాన్ని నియంత్రించడంతో పాటుగా భావోద్వేగాలను ప్రభావితం చేసే serotoninను కూడా అదుపులో ఉంచుతుంది. అదే ఒకోసారి డిప్రెషన్కు దారితీస్తుంది.

ఆడవారిలో estradiol హార్మోను తగినంత లేకపోతే డిప్రెషన్తో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. మెనోపాజ్ తర్వాత కొందరు తీవ్రమైన డిప్రెషన్కు లోనుకావడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. త్వరగా మెనోపాజ్ దశకు చేరుకునేవారు, రుతుక్రమం సరిగా లేనివారిలో డిప్రెషన్ లక్షణాలు కనిపించడానికి కారణం ఇదే! డిప్రెషన్ అనేది కేవలం మన బయట పరిస్థితుల వల్లే కాదు, శరీరంలోని హార్మోనుల వల్ల కూడా ఏర్పడవచ్చని తేలిపోయింది. కాబట్టి తరచూ నిరాశకి లోనవ్వడం, ఆకలి మందగించడం, జీవితం, త్వరగా భావోద్వేగాలకి లోనుకావడం, జీవితం నిస్సారంగా తోచడం, నిద్రలేమి... లాంటి సమస్యలు వచ్చినప్పుడు, అశ్రద్ధ చేయకుండా ఓసారి వైద్యుని సంప్రదించి చూడమని సూచిస్తున్నారు. హార్మోను లోపం వల్లే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నట్లయితే, వైద్యులు తగిన చికిత్సను అందించే అవకాశం ఉంటుంది కదా!

*👉బి 12 లోపం - 7 హెచ్చరిక సంకేతాలను విస్మరించకండి!*

          అత్యంత క్లిష్టమైన, కానీ పట్టించుకోని విటమిన్లలో, విటమిన్ B12 ఒకటి. విటమిన్ బి 12 శరీరంలోని ప్రతి కణం యొక్క జీవక్రియ లో పాల్గొంటుంది. విటమిన్ బి 12 లోపం చికిత్స చేయకుండా వదిలివేస్తే, దీర్ఘకాలిక రక్త వ్యాధులు అలాగే నరాల సమస్యలకు దారితీస్తుంది. ఇక్కడ విటమిన్ B-12 లోపం సంబంధించిన ఏడు హెచ్చరిక వివరింపబడినవి.

*1.   మైకము.*

మైకము మరియు తల తిరుగుడు తరచుగా బి 12 లోపం సూచిస్తుంది. మీరు ఒక స్థానంలో కూర్చొని ఆ స్థానంలో నుండి చాలా వేగంగా లేచినప్పుడు, మీకు తల తిరుగుతున్న భావన ఎదుర్కొంటారు. మీరు మెట్ల పైకి లేదా క్రిందకి నడుస్తున్నప్పుడు, మీకు మైకము అనుభూతి ఉండవచ్చును. అది కూడా ప్రమాదకరమే. దీర్ఘకాలిక తల తిరుగుడు లక్షణాల లోపమునకు అవసరమైన చికిత్స కోసం మీ డాక్టర్ దృష్టికి తీసుకురావాలి.

*2.  మతిమరుపు.*
          
       దీర్ఘకాల మరియు అపాత్రోచితమైన మతిమరుపు B12 లోపం కావచ్చు. చాలామంది రోగులు ముఖ్యంగా వారి సీనియర్ సంవత్సరాలలో, దీనిని చిత్తవైకల్యం (డెమెన్షియా) లేదా మెదడు క్షీణదశ (అల్జీమర్స్) బాధగా భావించవచ్చు కానీ నిజానికది బి 12 లోపం కావచ్చు. ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా బి 12 లోపమును నిర్ధారణ చేయవచ్చు, మరియు ఒక అనుబంధ నియమావళి మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

3.  కండరాల బలహీనత
కండరాలలో విటమిన్ బి 12 మరియు తగినంత ఆక్సిజనీకరణం లేకపోవడం వలన సోమరితనము మరియు అపాత్రోచితమైన కండరాల బలహీనత చూపించవచ్చు. హఠాత్తుగా పెద్ద లోడ్లు తీసుకెళ్ల లేని పరిస్థితి లేదా ఒక జిమ్ బ్యాగ్ నిర్వహించలేని స్థాయికి చేరతారు.
4.  పాలిపోయిన శరీర ఛాయ
బి 12 లోపం బాధపడుతున్న వారిలో ఎర్రరక్త కణాలు లేకపోవడం వలన శరీర ఛాయ పాలిపోయి ఉంటుంది. శరీరం అదనపు బిలిరుబిన్ విడుదల చేయడం వలన గులాబి బుగ్గల స్థానంలో లేత పసుపు రంగు వస్తుంది.

  5.  పిన్నులు మరియు సూదులు
మీరు మీ శరీరం మీద ఏమి గుచ్చనప్పటికి, మీ శరీరం అంతటా పిన్నులు మరియు సూదులతో పొడుస్తున్న అనుభవం, బి 12 లోపానికి సంకేతాలు. బి 12 లోపం వలన కలిగే తిమ్మిరి లేదా విద్యుత్ షాక్ తరంగాల భావన ఫలితంగా, రోగులలో నరాల నష్టం కలగవచ్చు. తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, పేలవమైన ఎర్ర రక్తకణాల ఉత్పత్తి వలన శరీరంలో నరాల సమస్యలు కలగడానికి బి 12 విటమిన్ ఎక్కువ ప్రభావం కలిగిస్తుంది.

 *6.  అకారణ అలసట.*

రాత్రి మంచి నిద్ర పోయినప్పటికి ఎప్పుడూ రోజుల తరబడి అలసట పొందుతూంటే అది B12 లోపం వలన కావచ్చును. ఇది B12 బాధ్యతగాఎర్ర రక్త కణాల ఉత్పత్తి చేయలేకపోవడం కారణంగా ఎర్ర రక్త కణాలు లేకపోవడం, మీ అవయవాలకు ఆక్సిజన్ రవాణా లేకపోవడం వలన తీవ్రమైన అలసట కలుగుతుంది.

 *7.  దృష్టి లోపాలు.*

దీర్ఘకాలిక తక్కువ బి 12, దృష్టి మార్పులకు దారితీసి, దృష్టి దెబ్బతింటుంది. రెటీనా దెబ్బతినడం, కంటిలోని రక్త నాళాల అడ్డంకులు ఫలితంగా ఉంటుంది. ఆప్టిక్ నెర్వ్ నష్టం ఫలితంగా, కాంతి సూక్ష్మగ్రాహ్యత, స్పష్టంగాలేని లేదా ద్వంద్వ దృష్టి, ట్రేసర్లు లేదా నీడలు ఎదుర్కొంటారు. అయితే, మందులు పూర్తి దృష్టిని పునరుద్ధరించవచ్చు.

*ధన్యవాదములు..*

*-మీ నవీన్ నడిమింటి.*

🔊పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్‌ ముప్ప* *🔶50-60% మందిలో గుర్తింపు*

 *🔊పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్‌ ముప్ప*

*🔶50-60% మందిలో గుర్తింపు*

*🔷అయిదు పాఠశాలల్లో ఏఐజీ అధ్యయనం*

*🍥ఈనాడు, హైదరాబాద్‌: పిల్లలు అడిగిందే తడవుగా బిస్కెట్లు, చాక్లెట్లు, మిఠాయిలు, నూడుల్స్‌, కూల్‌డ్రింకులు, సమోసాలు వంటి తినుబండారాలు కొనిపెడుతున్నారా..?! అయితే తస్మాత్‌ జాగ్రత్త.. ఇవన్నీ వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నాన్‌-ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌(ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ)కు దారితీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అయిదు కార్పొరేట్‌ పాఠశాలల్లోని 1,100 మంది చిన్నారులపై చేసిన అధ్యయనంలో ఈ సమస్య గుర్తించారు. 10-14 ఏళ్లలోపు చిన్నారుల్లో 50-60% మంది ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ ఉన్నట్లు తేలింది. ఇందులో 20% మందికి కాలేయం గట్టిపడి సిర్రోసిస్‌కు దారితీసే ప్రమాదం ఉందన్నారు. తర్వాత కాలేయ మార్పిడి ఒక్కటే శరణ్యమని వైద్యులు స్పష్టీకరించారు. ఆరు నెలలపాటు సాగిన ఈ అధ్యయనంలో అల్ట్రాసౌండ్‌, కాలేయ పరీక్షల ద్వారా ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీని గుర్తించారు.*

*💥ఏంటీ ఫ్యాటీ లివర్‌..?*

*🌀సాధారణంగా తాగుడు అలవాటు ఉన్నవారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. మద్యం అలవాటు లేకపోయినా ఆహార ప్రభావంతో ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ పెరుగుతుంది. అతిగా తిన్నప్పుడు కొవ్వు రూపంలోకి మారి కాలేయంలో నిల్వ చేరుతుంది. శరీరానికి శక్తి అవసరమైనప్పుడు కాలేయం దీనిని వినియోగిస్తుంది. శారీరక శ్రమ లేకపోతే కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన అలవాట్లు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా ప్యాకెట్లలో దొరికే జంక్‌ఫుడ్‌కు పిల్లలు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. వారి లంచ్‌ బాక్సుల్లోనూ బిస్కెట్లు, పిజ్జాలు, బర్గర్‌లు వంటివి పెడుతున్నారు. అంతేకాక చిన్నారుల్లో శారీరక శ్రమ లోపిస్తోంది. చాలా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు అసలు ఆటస్థలాలే లేవు. ఇళ్లలో టీవీలు, సెల్‌ఫోన్లకే అతుక్కుపోతున్నారు. ఫలితంగా బరువు పెరిగి ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ బారినపడుతున్నారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.*

*💥నాలుగు దశలు*

*💠నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌లో నాలుగు దశలు ఉంటాయి. సింపుల్‌ స్టియటోసిస్‌, స్టియటో హెపటైటిస్‌, ఫైబ్రోసిస్‌, నాలుగోది తీవ్రమైన సిర్రోసిస్‌. తుది దశ వరకు గుర్తించకపోతే కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం ఉండదని వైద్యనిపుణులు అంటున్నారు.*

*💥లక్షణాలు లేకుండానే దాడి*

*✳️ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ సమస్య ఉన్నా ఎలాంటి లక్షణాలు బయటపడవని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో మాత్రం పొట్ట పెరిగి ముందుకు రావడం, కుడివైపు పొట్ట పైభాగంలో గుచ్చినట్లు నొప్పి ఉండటం కనిపిస్తాయి. ఇవి సాధారణమేనని నిర్లక్ష్యం చేస్తున్నారు. అల్ట్రాసౌండ్‌, లివర్‌ ఫంక్షన్‌ టెస్టులు చేసినప్పుడు అసలు సమస్య బయట పడుతోంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే రాబోయే తరం తీవ్రమైన కాలేయ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పటికే జనాభాలో 30% మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.*

*💥ఆరోగ్యకర అలవాట్లే రక్ష*

    
*◼️మార్పు తల్లిదండ్రుల నుంచే రావాలి. జంక్‌ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉంటూ పిల్లలూ అనుసరించేలా చేయాలి. ఇంట్లో వండిన తాజా ఆహారమే లంచ్‌ బాక్సుల్లో అందించాలి. అధిక బరువు ఉంటే ఆహారంలో పిండి పదార్థాలు తగ్గించాలి.*
    
*◼️రిఫైన్డ్‌ షుగర్స్‌, మైదాతో చేసిన పదార్థాలు, మిఠాయిలు తగ్గించాలి. తృణధాన్యాలతో చిరుతిళ్లు(స్నాక్స్‌) చేసి పెట్టాలి.*
    
*◼️విద్యార్థులు తరచూ ఆటలాడేలా ప్రోత్సహించాలి. పాఠశాలల్లో రోజూ కనీసం 45 నిమిషాలు క్రీడలకు కేటాయించాలి. ఇంట్లోనూ తల్లిదండ్రులు వారితో కలిసి ఆడుకోవాలి.*

*💥సమస్య తీవ్రం కాకముందే మేలుకోవాలి*

*🔆పిల్లల పరిస్థితి చేయి దాటక ముందే తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తం కావాలి. ప్రతి పాఠశాలలో వ్యాయామ విద్యకు ప్రాధాన్యమివ్వాలి. ప్యాకెట్‌ ఫుడ్‌లో వాడే ప్రిజర్వేటర్లు ఇతర పదార్థాలు జీర్ణకోశంలోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి. చాలామంది పిల్లలు దంతాలు తోమి టూత్‌పేస్ట్‌ నురగ మింగేస్తుంటారు. ఇందులో ఉండే టైటానియంతోనూ మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చిన్నప్పటి నుంచే మంచి ఆహార అలవాట్లపై అవగాహన కల్పించాలి. ప్రతిఒక్కరు ఏడాదికోసారి కాలేయ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్‌ను గుర్తించవచ్చు.*

*🎙️డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, ఛైర్మన్‌, ఏఐజీ*
 🌱🌱🌱🌱
           🌷🌿 *HaPpY ℳỖŘŇĮŇĞ*🌿🌷

           *రోజు వేసుకునే చెప్పులు కూడా*
      *మనకి ఒక నీతి గుర్తు చేస్తాయి తెలుసా*
                 *బయటికి వెళ్తున్నావా...*
                *తప్పుకు తావి ఇవ్వకు...*
               *చెడుకు బానిస అవ్వకు..*
                 *అజాగ్రత్తగా ఉండకు...*
             *క్షేమముగా వెళ్లి క్షేమముగా*
                 *రమ్మని చెపుతాయి...*
              *వాటికి తెలుసు కదా వాటి*
                  *బాధ ఎలా ఉంటుందో..*
                     *ఒక చెప్పు తెగితే*
                  *రెండో చెప్పు పడేస్తారు*
         *ఇంకో చెప్పు ఏ తప్పు చేయకుండా*
                    *శిక్ష అనుభవిస్తుంది...*
  
        🌷🌿 *శుభ శుభోదయం ఫ్రెండు*🌿🌷

అదే మనిషి "కర్తవ్యం

 🐩🐤 *Haքքɨɛɛɛɛ Sʊռɖaʏ*🌻🌼
      💕💘 *HaPpY MoRnInG*💞💦

        *ఒకరి మెప్పు కోసం మరొకరిని*
         *కష్టపెట్టడం "ప్రేమ" కాదు....*

          *ఒకరి బాగుకోసం మరొకరిని*
      *బలి చేయడం "బాధ్యత" కాదు.*

    *నువ్వు మంచి వాడిని కాకపోయినా*
           *గొప్పవాడివి కాకపోయినా*

               *ఇతరుల మనసును*
       *గాయపరిచకుండా ఉంటే చాలు*
             *అదే మనిషి "కర్తవ్యం"*

    🌷🌻 *స్వచ్చమైన శుభోదయం*☘🌷
             .🌹🌸 *హ్యాపీ సండే*🌸🌹

అంతర్దృష్టి యొక్క జ్ఞానం

 [12/08, 9:24 pm] pasupulapullarao@gmail.co: *అంతర్దృష్టి యొక్క జ్ఞానం*      

పురాతన కాలంలో ప్రసిద్ధ రాజు జనకుడు భారతదేశంలోని మిథిలా ప్రాంతాన్ని పరిపాలించేవాడు.
 
ప్రసిద్ధ ఇతిహాసం రామాయణం ద్వారా ఆయన సీత తండ్రి అన్న విషయం మనకు విదితమే.
అతనికి ఒక రోజు రాత్రి ఒక వింత కల వచ్చింది. ఒక శక్తివంతమైన రాజు అతని రాజ్యం మీద దాడి చేసి అంతా నాశనం చేసాడు. ప్రాణాలను కాపాడుకోవడానికి అతను అడవిలోకి పారిపోవాల్సి వచ్చింది.

ఇప్పుడు జనక మహారాజు దట్టమైన అడవిలో ఒంటరిగా ఉన్నాడు, యుద్ధం ఓడిపోయాడు, పరుగుతో అలసిపోయాడు, ఆకలితో ఉన్నాడు. అంత దట్టమైన అడవిలో అతనికి ఏమి దొరుకుతుంది?

ఇలా కొన్ని రోజులు గడిపిన తర్వాత, ఒకరోజు ఒక బాటసారి అతని పరిస్థితి చూసి జాలిపడి అతనికి ఒక రొట్టె ముక్కను ఇచ్చాడు.

రాజు దానిని తినడానికి చెట్టుకింద కూర్చోగానే, ఒక పెద్ద కాకి అకస్మాత్తుగా          ఆ రొట్టెముక్కను లాక్కుపోయింది.
దానితో జనక మహారాజు గట్టిగా అరుస్తూ, నిద్ర నుండి మేల్కొన్నాడు.
అతను తన రాజమందిరంలో తన సొంత మంచం మీద చెమటతో తడిసిఉన్నాడు.

ఈ కల వల్ల అతను సరిగ్గా ఆలోచించలేకపోయాడు.
అతడు మతపరమైన, ఆధ్యాత్మిక వ్యక్తి అయినందున, కల గురించి ఆలోచిస్తూ, ఆశ్చర్యానికి గురయ్యాడు….     "కల కంటున్నప్పుడు నేను నా మంచం మీద ఉన్నాను, కానీ నా మనస్సు పూర్తిగా అడవిలోనికి వెళ్ళి పోయింది.

కాకి నారొట్టెను లాక్కొని ఎగిరిపోయింది. నేను పరిగెత్తుకుంటూ, అరుస్తూ, చెమటతో  మేల్కొన్నాను.

కానీ ప్రశ్న ఏమిటంటే, ఆ క్షణంలో అసలు నిజం ఏమిటి?

”నేను మంచం మీద పడుకున్నది- నిజమా! లేక  యుద్ధంలో ఓడిపోయి అడవిలో తిరగడం నిజమా!”
ప్రశ్న ప్రామాణికమైనదే, కానీ సమాధానం ఏమిటి?
ఆ క్షణం నుండి, జనకమహారాజు సమాధానం వెతకడంలో నిమగ్నమై, మరేవిషయం పైన దృష్టి సారించ లేకపోయాడు.

పగలు- రాత్రి తన ఆస్థానానికి మత నిపుణులను, మతవిశ్వాసులను పిలిచి, వారు ఏ సత్యాన్నియథార్థమైనదని నమ్ముతారు, "ఈ సత్యాన్నా లేక                   ఆ సత్యాన్నా" అని అడుగుతూ   ఉన్నాడు.
ఆయన పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు, మంత్రులు, శ్రేయోభిలాషులంతా ఆందోళనకు గురయ్యారు.

గొప్ప మతపరమైన, జ్ఞానం ఉన్న మహాపండితులు కూడా అతని గందరగోళాన్ని పరిష్కరించలేకపోయారు.
ఈ వార్త అష్టావక్రుడు చెవులకు చేరింది, అతను వెంటనే దర్భారుకు వచ్చాడు.

సహజంగా, జనక మహారాజు అష్టావక్రుడికి కూడా అదే ప్రశ్నను పునరావృతం చేశాడు

అష్టావక్రుడు నవ్వుతూ  " ప్రభూ! రెండూ నిజం కాదు." అని జవాబిచ్చాడు.
జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. ఇప్పటి వరకు ఆయన సంప్రదింపులు జరిపిన వారంతా రెండు పరిస్థితులలో కనీసం ఒక దానినైనా నిజమని వివరించి నిరూపించేందుకు ప్రయత్నించారు!
ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితిలో, జనక మహారాజు ఆశ్చర్యానికి లోనవడం గొప్ప పరిణామం.
అష్టావక్రుడు తన అభిప్రాయాన్ని విపులీకరిస్తు జనకునితో ఇలా అన్నాడు - "చూడoడి, మీరు కలలు కంటున్నప్పుడు, మీ రాజభవనంలోనే ఉన్నారు, కాబట్టి ఆ క్షణంలో అరణ్యాలలో సంచరించడం నిజం కాదు.
అదేవిధంగా, మీరు రాజభవనంలో ఉన్నప్పటికీ,  ఆ సమయంలో మీ మనసు అడవిలో తిరుగుతోంది కాబట్టి ఆ క్షణంలో మీరు రాజభవనంలో ఉన్నారన్నది కూడా నిజం కాదు."
 జనక మహారాజు అతని ఉద్దేశాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు, కానీ ఇప్పుడు అతని ఉత్సుక్తత కొత్త మలుపు తీసుకుంది.
అతను వెంటనే, "అలాంటప్పుడు నిజం ఏమిటి?!"  అని అడిగాడు.
అష్టావక్రుడు, "నిజమే  మీలోని దీర్ఘదర్శి, (మనఃసాక్షి) ఈ రెండు సంఘటనలకు సాక్ష్యంగా ఉన్నాడు. అతనికి దేనితోనూ సంబంధం లేదు." అని చెప్పాడు.

ఇది విన్న జనక మహారాజు తన జీవితానికి కొత్త దిశను కనుగొన్నట్లుగా ఆత్మ సాక్షాత్కారం పొందాడు.

ఇప్పుడు అతనికి జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంది, ఏది జరిగినా, అతను జీవించి ఉన్నంతవరకు ఒక దీర్ఘదర్శిగా అనుభూతి చెందాలి.
ఆవిధంగా, గురువు హోదాలో అష్టావక్రుడు చాలాకాలం తరువాత జనకుడిలో దీర్ఘదర్శిని స్థిరపరచాడు.

ఈ సమస్త అంశం  'అష్టావక్రగీత' పేరుతో చాలా ప్రసిద్ధి చెందింది.
మానసిక వికాసంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే మనం కూడా జనకమహారాజులా ఉత్సుక్తతతో ఉండాలి.

మనం దానిని సంపూర్ణంగా చేయలేకపోవచ్చు, కానీ క్రమంగా, మనలోని సాక్షి అనే భావనను మేల్కొల్పాలి.

మన దుఃఖాలు, సుఖాలు, ఎత్తుపల్లాలు, వస్తువులు, బంధువులు, మిత్రులు, శత్రువులు మాత్రమే కాదు, మన స్వంత భావాల హెచ్చు తగ్గులు కూడా మనకు 'పరాయివే’ అని అర్థం చేసుకోవాలి.

వాటన్నిటినీ చూసేందుకు మనం ప్రేక్షకులం మాత్రమే కాని, మనం అవి కాదు. కాబట్టి వాస్తవమేమిటంటే, లోపల లేదా వెలుపల కూడా మనపై ప్రభావం చూపే సంఘటనలు ఏమీ లేవు.
మనస్సు,  హృదయానికి సాక్షిగా ఉన్నప్పుడు, రెండూ సంపూర్ణ సమకాలీకరణను పొందుతాయి, అప్పుడు చైతన్యం స్పష్టంగా ఉంటుంది, మంచితనం సహజంగా వ్యక్తమవుతుంది
[12/08, 9:26 pm] pasupulapullarao@gmail.co: *Wisdom of Insight*

In ancient times the famous King Janaka ruled the Mithila region of India.
 
We know from the famous epic Ramayana that he is the father of Sita.
He had a strange dream one night. A powerful king invaded his kingdom and destroyed everything. He had to flee into the forest to save his life.

Now Janaka Maharaja was alone in the dense forest, defeated in battle, tired from running, and hungry. What will he find in such a dense forest?

After spending a few days like this, one day a passer-by took pity on his condition and gave him a piece of bread.

As the king sat down under the tree to eat it, a large crow suddenly snatched the piece of bread.
With that, Janaka Maharaja woke up from his sleep with a loud shout.
He was drenched in sweat on his own bed in his palace.

This dream made him unable to think straight.
As he was a religious and spiritual person, thinking about the dream, he was surprised…. "During the dream I was on my bed, but my mind was completely lost in the forest.

The crow grabbed Narote and flew away. I woke up running, screaming, and sweating.

But the question is, what is the real truth in that moment?

”I was lying on the bed- really! Or is it true that he lost the battle and wandered in the forest!”
The question is valid, but what is the answer?
From that moment on, Janakamaharaja became engrossed in searching for an answer and could not focus on anything else.

Day and night he called religious experts and heretics to his court and asked them which truth they believed to be true, "this truth or that truth".
Seeing his condition, family members, ministers and well-wishers were worried.

Even great religious and learned Mahapandits could not solve his dilemma.
This news reached the ears of Ashtavakra, who immediately came to the court.

Naturally, Janaka Maharaja repeated the same question to Ashtavakra

Ashtavakra laughed, "Lord! Neither is true." He replied.
Janaka Maharaja was surprised. All those he has consulted so far have tried to explain and prove at least one of the two situations to be true!
However, in the present situation, Janaka Maharaja was taken by surprise, a great development.
Elaborating on his point, Ashtavakra said to Janaka – “See, when you are dreaming, you are in your palace, so wandering in the jungles at that moment is not true.
Similarly, even if you are in the palace, it is not true that you are in the palace at that moment because your mind is wandering in the forest."
 Janaka Maharaja understood his intention well, but now his curiosity took a new turn.
He immediately asked, "Then what is the truth?!" he asked.
Ashtavakra said, "Truly the seer in you, (manahsakshi) is the witness of these two events. He has nothing to do with anything." He said.

Hearing this, Maharaja Janaka found a new direction for his life and became self-realized.

Now he has only one goal in life, no matter what happens, he must feel like a visionary as long as he lives.
Thus, Ashtavakra, in the capacity of Guru, established the seer in Janaku after a long time.

This entire subject is very popularly known as 'Ashtavakra Geeta'.
To reach higher heights in mental development we too must be curious like Janakamaharaja.

We may not be able to do it perfectly, but gradually, we should awaken the sense of witness within us.

Not only our sorrows, pleasures, ups and downs, objects, relatives, friends and enemies, but also the ups and downs of our own feelings must be understood as 'alien' to us.

We are not only the audience to watch it all, but we are not them. So the reality is that there are no events that affect us either within or without.
When the mind witnesses the heart, the two attain perfect synchronicity, then consciousness is clear, goodness manifests naturally
[12/08, 9:26 pm] pasupulapullarao@gmail.co: *अंतर्दृष्टि की बुद्धि*

प्राचीन काल में प्रसिद्ध राजा जनक भारत के मिथिला क्षेत्र पर शासन करते थे।
 
प्रसिद्ध महाकाव्य रामायण से हमें ज्ञात होता है कि वह सीता के पिता हैं।
एक रात उसे एक अजीब सपना आया। एक शक्तिशाली राजा ने उसके राज्य पर आक्रमण किया और सब कुछ नष्ट कर दिया। उसे अपनी जान बचाने के लिए जंगल में भागना पड़ा।

अब जनक महाराज घने जंगल में अकेले थे, युद्ध में हार गये थे, दौड़ने से थक गये थे और भूखे थे। इतने घने जंगल में उसे क्या मिलेगा?

कुछ दिन ऐसे ही बिताने के बाद एक दिन एक राहगीर को उसकी हालत पर दया आ गई और उसने उसे रोटी का एक टुकड़ा दिया।

जैसे ही राजा उसे खाने के लिए पेड़ के नीचे बैठा, अचानक एक बड़े कौवे ने रोटी का टुकड़ा झपट लिया।
इसके साथ ही जनक महाराज जोर से चिल्लाकर नींद से जाग उठे।
वह अपने महल में अपने बिस्तर पर पसीने से लथपथ था।

इस सपने ने उसे सीधे सोचने में असमर्थ बना दिया।
चूंकि वह एक धार्मिक और आध्यात्मिक व्यक्ति था, इसलिए सपने के बारे में सोचकर उसे आश्चर्य हुआ... "सपने के दौरान मैं अपने बिस्तर पर था, लेकिन मेरा मन पूरी तरह से जंगल में खोया हुआ था।

कौवे ने नरोटे को पकड़ लिया और उड़ गया। मैं दौड़ता हुआ, चिल्लाता हुआ और पसीने से तर हो उठा।

लेकिन सवाल यह है कि उस पल का असली सच क्या है?

''मैं बिस्तर पर लेटा हुआ था- सच में! या यह सच है कि वह युद्ध हार गया और जंगल में भटक गया!”
सवाल तो जायज है, लेकिन जवाब क्या है?
उस क्षण से, जनकमहाराज उत्तर की खोज में तल्लीन हो गए और किसी और चीज़ पर ध्यान केंद्रित नहीं कर सके।

वह दिन-रात धार्मिक विशेषज्ञों और विधर्मियों को अपने दरबार में बुलाता था और उनसे पूछता था कि वे किस सत्य को सत्य मानते हैं, "यह सत्य या वह सत्य"।
उनकी हालत देखकर परिवार के सदस्य, मंत्री और शुभचिंतक चिंतित हो गए।

बड़े-बड़े धार्मिक एवं विद्वान महापंडित भी उनकी इस दुविधा का समाधान नहीं कर सके।
यह बात अष्टावक्र के कानों तक पहुंची तो वे तुरंत दरबार में आये।

स्वाभाविक रूप से, जनक महाराज ने अष्टावक्र से वही प्रश्न दोहराया

अष्टावक्र हँसे, "प्रभु! कोई भी सत्य नहीं है।" उसने जवाब दिया।
जनक महाराज को आश्चर्य हुआ। अब तक उन्होंने जिन लोगों से परामर्श किया है, उन्होंने कम से कम दो स्थितियों में से एक को समझाने और सच साबित करने की कोशिश की है!
हालाँकि, वर्तमान स्थिति में, जनक महाराज आश्चर्यचकित रह गये, यह एक महान घटना थी।
अपनी बात को विस्तार से बताते हुए अष्टावक्र ने जनक से कहा – “देखो, जब तुम स्वप्न देख रहे हो, तब तुम अपने महल में हो, इसलिए उस समय जंगलों में भटकना सत्य नहीं है।
इसी तरह, भले ही आप महल में हों, लेकिन यह सच नहीं है कि आप उस समय महल में हैं क्योंकि आपका मन जंगल में भटक रहा है।
 जनक महाराज उनके अभिप्राय को भलीभांति समझ गये, परंतु अब उनकी जिज्ञासा ने एक नया मोड़ ले लिया।
उन्होंने तुरंत पूछा, "फिर सच क्या है?" उसने पूछा।
अष्टावक्र ने कहा, "सचमुच तुम्हारे अंदर का द्रष्टा (मनःसाक्षी) इन दोनों घटनाओं का साक्षी है। उसका किसी भी चीज़ से कोई लेना-देना नहीं है।" उसने कहा।

यह सुनकर महाराजा जनक को अपने जीवन की एक नई दिशा मिली और वे आत्मज्ञानी हो गये।

अब उसके जीवन का एक ही लक्ष्य है, चाहे कुछ भी हो जाए, जब तक वह जीवित है, उसे एक दूरदर्शी की तरह महसूस करना चाहिए।
इस प्रकार, अष्टावक्र ने, गुरु की हैसियत से, लंबे समय के बाद जनकू में द्रष्टा की स्थापना की।

यह संपूर्ण विषय 'अष्टावक्र गीता' के नाम से बहुत प्रसिद्ध है।
मानसिक विकास में ऊँचाईयों तक पहुँचने के लिए हमें भी जनकमहाराजा की तरह जिज्ञासु होना चाहिए।

हो सकता है कि हम इसे पूरी तरह से न कर पाएं, लेकिन धीरे-धीरे हमें अपने अंदर साक्षी भाव को जागृत करना चाहिए।

न केवल हमारे दुःख, सुख, उतार-चढ़ाव, वस्तुएँ, रिश्तेदार, मित्र और शत्रु, बल्कि हमारी अपनी भावनाओं के उतार-चढ़ाव को भी हमारे लिए 'पराया' समझना चाहिए।

हम न केवल यह सब देखने वाले दर्शक हैं, बल्कि हम भी वे नहीं हैं। तो वास्तविकता यह है कि ऐसी कोई भी घटना नहीं है जो हमें भीतर या बाहर प्रभावित करती हो।
जब मन हृदय का गवाह बनता है, तो दोनों पूर्ण समकालिकता प्राप्त कर लेते हैं, तब चेतना स्पष्ट होती है, अच्छाई स्वाभाविक रूप से प्रकट होती है

లీడర్ కి ఉండాల్సిన 25లక్షణాలు

 *లీడర్ కి ఉండాల్సిన 25లక్షణాలు*

1. *లీడర్*- గతాన్ని వదిలేయాలి.
2. *లీడర్*- నేర్చుకోవడం అపోద్దు
3. *లీడర్*- మనసులో ఉన్న విషయం బయటకు  చెప్పాలి.
4. *లీడర్*- ఈగో వదిలేయాలి. 
5. *లీడర్*- బాద్యత సక్రమంగా నిర్వర్తించాలి.
6. *లీడర్*- తప్పును కూడ శాoతoగ చెప్పాలి. 
7. *లీడర్*- ఎవరైనా బాదలో ఉంటే ఓదార్పు ఇవ్వాలి.
8. *లీడర్*- బాదలో ఉన్నా వారికి బరోస ఇవ్వాలి.
9. *లీడర్*- అన్నీ సందర్భాలనీ స్వీకరించాలి.
10. *లీడర్*- ఎంత కఠిన నిర్ణయం ఆయన  తీసుకునే దైర్యం ఉండాలి.
11. *లీడర్* - మార్గ దర్శకుడు కావాలి.
12. *లీడర్*- ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.
13. *లీడర్*- సమస్యలపై కాంప్రమైజ్ అవ్వకూడదు.
14. *లీడర్*- తన అనుచరుల కంటే ఒక అడుగు ముందు ఉండాలి.
15. *లీడర్*- తన అనుచరులకు ఎల్లప్పుడూ అభినందనలు తెలుపుతుండాలి
16. *లీడర్*- తను ఉన్న చోట్ల నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి.
17. *లీడర్*- సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, ఎల్లప్పుడూ ఎంతోకొంత ఇస్తూనే ఉండాలి.
18. *లీడర్*- అనుచరుల ఎదుగుదలను కోరుకునే వాడైఉండాలి.అడ్డుకోకూడదు.
19. *లీడర్*- తన స్వార్థం కోసం కాకుండా 
అనుచరుల కోసం అందరికోసం ఆలోచించాలి.....
20. *లీడర్* కు ఆహంకారం ఉండకూడదు.
21. *లీడర్* వివాధ రహితుడుగా ఉండాలి
22. *లీడర్* బెదిరింపులకు దిగొద్దు
23. *లీడర్* ప్రశ్నించే వారికి సమాధానం చెప్పగలగాలి 
24. *లీడర్*  ఎప్పుడు నేర్చుకోవాలి ప్రతి సబ్జెక్టు తెలుసుకోవాలి.
25. *లీడర్* మానవత్వం కలిగివుండాలి..

Friday, August 11, 2023

ఓంకార శబ్దాన్ని మొదట చిన్న శ్రుతిలో మొదలుపెట్టి, తారస్థాయికి చేర్చి, చివరకు హం అనే శబ్దంతో ముగించాలి🔱

 ఓంకార శబ్దాన్ని మొదట చిన్న శ్రుతిలో మొదలుపెట్టి, తారస్థాయికి చేర్చి, చివరకు హం అనే శబ్దంతో ముగించాలి🔱

1. అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న విశ్వంలో ఆకాశ తత్వంతో నినదించిన తొలి రుక్కు, బ్రహ్మవాక్కు- ఓంకారం! అది అకార, ఉకార, మకారాలనే బిందు సంయుక్తంగా ఏర్పడిన మొట్టమొదటి శబ్దం. 

2. అకారం సృష్టికి, ఉకారం పోషకత్వానికి, మకారం లయకారకత్వానికి చిహ్నాలు.

3. ఓంకారం- బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వం.

4. అది కేవలం ఓ మంత్రం కాదు; అన్ని మంత్రాలకూ అదే- బలం, జీవం, శక్తిరూపం.

5. ‘ఓంకారం లేని మంత్రం ప్రాకారం లేని గుడి వంటిది’ అని పెద్దల మాట. 

6. మంత్రాలకు పరిపుష్టినిచ్చేది, రక్షణ కల్పించేది ఓంకారం. ఓం అనేది ఒక మతానికి సంబంధించినది కాదు. 

7. అది ప్రార్థనా మందిరం లోని ఘంటానాదం. 

8. ప్రతి మనిషి గుండె చప్పుడూ అదే.

9. నిత్యమూ యోగులు, మహర్షులు జపించేది, మోక్షదాయకమైనది ఓంకారం అని వేదం ప్రకటించింది.

10. ప్రతి నిత్యం 21 మార్లు ఓంకారం జపించడం వల్ల, మనిషి శరీరంలోని 21 తత్వాలు- అంటే, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కోశాలు, పంచ ప్రాణాలు, మనసు ఉత్తేజితమవుతాయని యోగ శాస్త్రం చెబుతోంది. మనిషి జన్మ ‘సోహం’తో ప్రారంభమవుతుంది. సో అని వూపిరి పీల్చడం, హం అని వదలడంతో జన్మ ప్రారంభమవుతుంది. సో నుంచి హం వరకు- అంటే గాలి పీల్చి జీవితాన్ని ప్రారంభించి ‘హం’ అంటూ వదిలి నిర్గుణత్వానికి మళ్లేవరకు, ‘కోహం’లోనే జీవిత అన్వేషణ సాగాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. కోహం అంటే, నేనెవరు అని ప్రశ్నించుకోవడం. తానెవరో, ఎందుకు జన్మించాడో, ఏ మార్గంలో వెళ్లడానికి ప్రయత్నించాలో మనిషి తెలుసుకోవడం; చివరకు ఎక్కడికి చేరుకోవాలో బోధించేవే.

11. వేదాలు, ఉపనిషత్తులు, ఇతర పురాణాలు. వీటిన్నింటికీ ఓంకార సాధనే మూలాధారం.విమానం దూరంగా ఉన్నప్పుడు శబ్దం తక్కువగా ఉంటుంది. దగ్గరకు వచ్చేకొద్దీ, ఆ శబ్దం పెద్దదిగా మారుతుంది. విమానం తిరిగి దూరంగా వెళ్లిపోయినప్పుడు, శబ్దం చిన్నగా మొదలై, సాగి, ఆ తరవాత ఆగిపోతుంది. అలాగే ఓంకార శబ్దాన్ని మొదట చిన్న శ్రుతిలో మొదలుపెట్టి, తారస్థాయికి చేర్చి, చివరకు హం అనే శబ్దంతో ముగించాలి. నాభి నుంచి శబ్దాన్ని ప్రారంభించి, గొంతులో కొనసాగించి, పెదవులతో ముగించాలని యోగశాస్త్రంలోని ‘ఓంకారోపాసన’ తెలియజేస్తుంది.

ఓంకార శబ్దసాధనకు, సంగీత సాధనకు దగ్గరి సంబంధం ఉంది. మంద్ర స్థాయి, తారస్థాయి- రెండూ సంగీత శ్రుతిలో మేళవించి ఉన్నట్లే, ఓంకార నాదమూ ఉంటుంది. అది లయబద్ధంగా సాగినప్పుడు- వ్యాధుల నుంచి ఉపశమనంతో పాటు శరీరానికి జవసత్వాలు లభిస్తాయని చెబుతారు. మానవుడు సత్వ, రజో, తమోగుణాలతో ఉంటాడు. 

12. అతిశయం, అహంకారం అతణ్ని వశం చేసుకున్నప్పుడు- పూర్తిగా సత్వగుణంలోకి మనసును నడిపించి సత్య ధర్మ శాంతి ప్రేమలను అందజేసే ఔషధమే ఓంకారం! 

13. సత్యాన్వేషణలో మనిషికి సహకరించేది, ఆధ్యాత్మిక చింతన వైపు అతణ్ని మళ్లించేది, ఆవేశాన్ని అణచి అహింసా మార్గం వైపు నడిపించేది ఓంకారోపాసన- అని మహాత్మాగాంధీ అనేవారు.సీతను రావణుడు అపహరించడంతో, శ్రీరామచంద్రుడు దుఃఖితుడయ్యాడు.ఆమె జాడ కనుగొనే యత్నంలో, సుగ్రీవుడితో మైత్రి సాగించాడు. అనంతరం సీతాన్వేషణకు ఆంజనేయుణ్ని దక్షిణ దిక్కు వైపు పంపించాడు. శత యోజనాల సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమయ్యాడు హనుమ. మహేంద్ర పర్వతం మీద నుంచి ఎగరడానికి ఆయన సన్నద్ధమైన తీరు ఓంకార తత్వాన్ని తెలియజేస్తుంది. ఆకాశమార్గాన వెళ్లాలని నిశ్చయించుకొన్న మారుతి, వూపిరి దీర్ఘంగా పీల్చి వదులుతూ కొంతసేపు ప్రాణాయామ స్థితిలో ఉన్నాడు. ఒక్కసారిగా శక్తినంతా కూడదీసుకొన్న ఆయన, ప్రణవ నాదం(ఓం శబ్దం)తో కుప్పించి ఆకాశవీధిలోకి ఎగిరాడని సుందరకాండ వెల్లడిస్తుంది.

14. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల పునరుద్ధరణకు; మంత్ర జపాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు, ఆత్మశక్తితో జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు అనువైన సాధనే- ఓంకారం. యోగులు సంకల్పాలను నెరవేర్చుకొనే క్రియ. 

15. ఓంకార సాధన అందరికీ ఆరోగ్యకరం, ఆనందదాయకం

Monday, August 7, 2023

పరిపూర్ణ స్నేహం అమరం, స్నేహం వరం కాపాడుకో శుభం

 పరిపూర్ణ స్నేహం అమరం
***********************
స్నేహం వరం కాపాడుకో శుభం
***************************

జగమంతా మాయ మిత్రుల వలయం,
హితులు కరువై అంతా అయోమయం,
జల్లెడ పట్టినా కానరారన్నది నిస్సందేహం,
నేడు స్నేహమన్నదాయె ఒక అర్థరహిత పదం. 

సమయానికి దిగజారి పోయే సన్నిహితులు,
అవసరాలకు చల్లగ జారిపోయె స్నేహితులు,
నమ్మకానికి బహు దూరమాయె అసలైన మైత్రి,
కలుషితమాయెనే అమూల్య స్నేహం ఓ ధరిత్రి !

విలువలు వేళ్ళ మీద లెక్కించడ మాయె,
విలువైన స్నేహం అవినీతులకు వశమాయె,
ప్రాప్తమున్న దొరకు సన్నిహితుడు తప్పక మరి,
ప్రాణ స్నేహితులున్న పదిలంగా ఉంచుకో మరి.

స్నేహమన్నది అమృతం అందుకే అమరం,
దూరాన్ని జయించి పదిల పరచునెపుడు స్నేహం,
మిత్రులకు హితుడై స్నేహ విలువలనాస్వాదించు,
అర్థవంత జీవిత ప్రాప్తికి సన్నిహిత భావాన్నార్జించు.

అమూల్యమైన స్నేహం,
మాసి పోదది అమరం,
స్నేహంలో ఉట్టిపడు జీవం,
స్పందించు…నీ జన్మ ధన్యం.

స్నేహ దినోత్సవ శుభాకాంక్షలు. 
మీ,
NADIGOTTI CHANDRM 
Director
Avani WONDERS

అధికారం / 24. AUTHORITY (ఓషో రోజువారీ ధ్యానాలు - Osho Daily Meditations )

 *🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 24 / Osho Daily Meditations  - 24 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 24. అధికారం / 24. AUTHORITY 🍀*

*🕉. ఏది ఒప్పు ఏది తప్పు అని ఎవరినీ ఎప్పుడూ అడగకండి. జీవితం అనేది తెలుసుకోవడానికి ఒక ప్రయోగం. 🕉*

*ప్రతి వ్యక్తి స్పృహతో, అప్రమత్తంగా మరియు జాగరూకతతో ఉండాలి మరియు జీవితంలో ప్రయోగాలు చేయాలి మరియు అతనికి ఏది మంచిదో కనుగొనాలి. ఏది మీకు శాంతిని ఇస్తుందో, ఏది మీకు ఆనందాన్ని కలిగిస్తుందో, ఏది మీకు ప్రశాంతతను ఇస్తుందో, ఏది మిమ్మల్ని ఉనికికి మరియు దాని అపారమైన సామరస్యానికి దగ్గరగా తీసుకువస్తుందో అది మంచిది. మరియు మీలో ఏది సంఘర్షణ, దుఃఖం, బాధను సృష్టిస్తుందో అది తప్పు. మీ కోసం ఎవరూ నిర్ణయించలేరు, ఎందుకంటే ప్రతి వ్యక్తికి తన స్వంత ప్రపంచం, అతని స్వంత సున్నితత్వం ఉంటుంది. మనం ప్రత్యేకం. కాబట్టి సూత్రాలు పని చేయవు. ప్రపంచమంతా ఇందుకు నిదర్శనం. ఏది ఒప్పు ఏది తప్పు అని ఎవరినీ ఎప్పుడూ అడగవద్దు. ఏది ఒప్పో ఏది తప్పు అని తెలుసుకోవడానికి జీవితం ఒక ప్రయోగం.*

*కొన్నిసార్లు మీరు తప్పు చేయవచ్చు, కానీ అది మీకు అనుభవాన్ని ఇస్తుంది, దానివల్ల ఏది నివారించాలో మీకు తెలుస్తుంది. కొన్నిసార్లు మీరు ఏదైనా మంచి చేయవచ్చు, మరియు మీరు చాలా ప్రయోజనం పొందవచ్చు. ప్రతిఫలం స్వర్గం మరియు నరకంలో ఈ జీవితానికి మించినది కాదు. అవి ఇక్కడ మరియు ఇప్పుడు ఉన్నాయి. ప్రతి చర్య దాని ఫలితాన్ని వెంటనే తెస్తుంది. అప్రమత్తంగా ఉండండి మరియు చూడండి. పరిపక్వత గల వ్యక్తులు అంటే ఏది సరైనది, ఏది తప్పు, ఏది మంచి, ఏది చెడు అని స్వయంగా గమనించి, కనిపెట్టిన వారు. మరియు దానిని తాము కనుగొనడం ద్వారా, వారు విపరీతమైన అధికారం కలిగి ఉంటారు. ప్రపంచం మొత్తం ఇంకేదైనా చెప్పవచ్చు కానీ అది వారికి తేడా లేదు. వారికి వారి స్వంత అనుభవం ఉంది ఇక అది సరిపోతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 24 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 24. AUTHORITY 🍀*

*🕉  Never ask anybody what is right and what is wrong. Life is an experiment to  find out.  🕉*

*Each individual has to be conscious, alert, and watchful, and experiment with life and find out what is good for him. Whatever gives you peace, whatever makes you blissful, whatever gives you serenity, whatever brings you closer to existence and its immense harmony is good. And whatever creates conflict, misery, pain in you is wrong. Nobody else can decide it for you, because every individual has' his own world, his own sensitivity. We are unique. So formulas are not going to work. The whole world is a proof of this. Never ask anybody what is right and what is wrong. Life is an experiment to find out what is right, what is wrong.*

*Sometimes you may do what is wrong, but that will give you the experience of it, that will make you aware of what has to be avoided. Sometimes you may do something good, and you will be immensely benefited. The rewards are not beyond this life, in heaven and hell. They are here and now. Each action brings its result immediately. Just be alert and watch. Mature people are those who have watched and found for themselves what is right, what is wrong, what is good, what is bad. And by finding it for themselves, they have a tremendous authority. The whole world may say something else, and it makes no difference to them. They have their own experience to go by, and that is enough.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

ఆచరణీయ అంశాలు.....

 *ఆచరణీయ అంశాలు.....*

1 *ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం*

2 *మాటమీద ధ్యాస ఉండడం*

3 *ఇతరుల విషయాలలో దూరి పోకుండా ఉండడం (మనం తప్ప అందరూ ఇతరులే)*

4 *వర్తమానంలో ఉండడం*

5 *ఎదుటి వ్యక్తులను అద్దంలాగ అ చూడాలి (లోపాలను మనలో సరిచేసుకోవాలి)*

6 *మనం ఆధ్యాత్మిక జీవితానికి 50 శాతం ప్రాపంచిక జీవితానికి 50 శాతం సమయాన్ని కేటాయించాలి.*

7 *మనసు మాట మనం వింటున్నా మా లేక మన మాట మనసు వింటుందా గమనించుకోవాలి*

| 8 *జరిగి పోయిన విషయాన్ని ప్రస్తుత విషయానికి పోల్చకూడదు*

9 *ధ్యానం 25% సజ్జన సాంగత్యం 25% ఆచరణాత్మక మైన జీవితం 50 శాతం ఉండాలి.*

10 *ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి ప్రస్తావన రాకూడదు*

11 *ఎవరిని జడ్జి చేయకూడదు. కామెంట్ చేయకూడదు.*

12 *మన స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు మరియు ఇతరులు స్వేచ్ఛ కు భంగం కలిగించకూడదు*

13 *మనమీద మనకు నిరంతరం నిఘా ఉండాలి.*

14 *మన భావనలను ఎప్పుడూ సరిగా ఉంచుకోవాలి*

15 *పెద్దవాళ్ళను గౌరవించడం చిన్నవారి పట్ల గౌరవం కలిగి ఉండడం*

16 *ఎదుటివారిని బట్టి మనం మన స్థితిని కోల్పోకూడదు (ఎప్పుడు సహజ స్థితిలో ఉండాలి*)

17 *భార్య భర్తలు ఒకరికొకరు ప్రేమ, గౌరవం కలిగి ఉండాలి.*

18 *సమాజం పట్ల కరుణ బాధ్యత కలిగి ఉండాలి.*

19 *దేని పట్ల ఎస్టిమేషన్ గాని ఎక్స్పెక్టేషన్ కానీ ఉండకూడదు*

20 *వంద మాటలు మాట్లాడే సందర్భంలో ఒక్కమాటతో సమాధానం చెప్పాలి.*

21 *మన ప్రాణ శక్తిని కోల్పోకుండా చూసుకోవాలి*
🌷🌷🌷 🙏🪷🙏 🌷🌷🌷

జ్ఞాననేత్రం.....

 *జ్ఞాననేత్రం.....*

*రెండు కళ్లులేని అవధూత ఒకరు అమర్ నాథ్ గుహ ముందు కూర్చున్నారు. ఒకరిద్దరు ఆయనని గుర్తించిన సాధువులు సాష్టాంగ ప్రణామం చేశారు. ఆయన గురించి ఆ సాధువులనడిగితే అవధూత బాబా అని చెప్పారు. నేను ప్రణామం చేసాను. బైటో బేటా అన్నారు. ఈలోపు ఒకాయన బాబాకు పాదాలు తాకి నమస్కరించాలని వడి వడిగా పరుగెత్తుకొచ్చాడు. వెళ్ళిపో మూర్ఖుడా అని బాబా అరిచాడు. ఆయనక్కడే భయపడి ఆగాడు బాబా మీరు సమానత్వం కలిగిన వారు కదా ఒకరిని దగ్గరికి రానించి ఇంకొకరిని నిరాకరించుటకు కారణమేమి అని వినయంగా నేను అడిగాను.*

*ఎదురుగా ఉన్న తెల్లటి వస్త్రాలున్న వాడి పేరు శ్యామ్ లాల్ బొంబాయిలో పెద్దవ్యాపారి. భార్యకు భయపడి తల్లిదండ్రుల సేవ చేయవలసి వస్తుందని బీద వృద్ధాశ్రమంలో చేర్చాడు. అక్కడ 4 నెలల నుండి డబ్బులు చెల్లించనందున వృద్ధాశ్రమం వారు వీడి తల్లిదండ్రుల మెడలు పట్టి బయటికి నెట్టారు. రోడ్డులో అడుక్కోని తింటున్నారు. వీడు తల్లిదండ్రుల సేవ చేయకుండా ఎన్ని యాత్రలు చేస్తేనేమి. నీకు సంతానం కలుగుతుందా అని అరిచాడు బాబా వాడిని అడగండి అన్నారు. ఏమయ్య పెద్దమనిషి నిజమేనా అని అడగగా, అయ్యా అద్దం ముందుండి ముఖం దాచలేము. బాబా నా కళ్లు తెరిపించారు, దయచేసి నా తల్లిదండ్రులు ఇప్పుడెక్కడ ఉన్నారో బాబా వారే చెబితే ఎన్ని కష్టాలొచ్చిన నా ఇంట్లోనే సేవ చేస్తాను అన్నాడు.*

*శివాజీ టెర్మినల్ స్టేషన్ ముందున్నారు పోయిన వెంటనే తల్లిదండ్రులను సేవించు. దానధర్మం చేసుకో నీ వెంట వచ్చేది పుణ్యకర్మలె లేదంటే ఎంత సంపాదించినా ఇక్కడ వదిలి వెళ్లేదే, పుణ్యకర్మ ఫలమే నీ వెంట వస్తుంది. తల్లిదండ్రులు పెంచి పెద్దచేసి ఉన్న ఆస్తి ఇచ్చి, నీవే సర్వస్వంగా భావించి నీకు సేవలు చేశారు. వారి ఋణంలో పడకు అని బాబా చెప్పారు. బాబా మీ ఆజ్ఞ శిరసారవహిస్తాను. కాని మీకు కళ్లే లేవు ఎలా నన్ను తెల్లవస్త్రాల వాడు అన్నారు. ఒరే చర్మనేత్రాలు లేకున్నా జ్ఞాన నేత్రం లేనివాడే నిజమైన గుడ్డివాడు. ఇప్పుడు చెబుతా చూడు. ఇక్కడి సాధువులు ఇతను "రామ్ పురి నాసిక్" ఇతను "లక్ష్మణ్గిరి ఇఠార్గి" ఇతను "జ్ఞానానంద్ ఆంధ్రదేశం" ఇతను "సీతారామ్ బాబా అయోధ్య".. బేటా అందుకే జ్ఞాననేత్రము సంపాదించుకోవాలి.. అన్నారు.*

*అప్పుడు సేట్ జి బాబా మీరు గొప్ప మహాత్ములు కళ్లు లేకుండానే అందరినీ గుర్తించారు. నా కళ్లు తెరిపించారు బాబా ఇప్పుడు నా గురించి నా తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు. ఒక్కక్షణం ఆగి శ్యామ్లాలని ఎంతో అల్లారు ముద్దుగా ఒక్కడని గారాబంచేసి పెంచాము వాడు భార్యపై ప్రేమచే ఆమె చెప్పిందెల్లా వింటూ చివరికి మనల్ని రోడ్డుపై వేశాడు. వానికెలా పుణ్యమొస్తుంది అని నీ తండ్రి, మీరలా అనకండి హేరామ్ వాడు ఎక్కడున్నా చల్లగా ఉంటే మనకదే చాలండి అని నీ తల్లి అంటుంది. అదేరా తల్లి ప్రేమ అని బాబా చెప్పారు.*

*అప్పుడు ఆ సేట్ జి.. బాబా నాకొక మేలు చేయండి.. మీరు నా తల్లిదండ్రులకు ఒక సందేశం పంపండి మీ శ్యామ్లాల్లో మార్పు వచ్చింది మిమ్ముల ఇంటికి తీసుకెళ్ళి సేవ చేస్తాడు, మీరు అక్కడే అతనొచ్చిన దాక ఉండండి అని తెలుపండి. అని వేడుకున్నాడు. బాబా అతనిలో కలిగిన మార్పుకు సంతోషించి అలాగే నాయన అని ధ్యానముద్రలో ఉండి అతని తల్లిదండ్రులకు ఇక్కడి నుండే సందేశమిచ్చారు. ఈ మాటలు వారికి వినిపిస్తున్నాయి. వారు అలాగా హేరామ్ ఎంత సంతోష కరమైన వార్త వాడి కోసం ఇక్కడే ఎన్ని రోజులైనా ఎదురుచూస్తాము ఇద్దరికి కంటి చూపు తగ్గింది ఎక్కడికి వెళతాము, మీరెవరో మా శ్యామ్ని తొందరగా రమ్మని చెప్పండి చూడక చాలా కాలమైందని నీ తల్లిదండ్రులు అంటున్నారు. వెంటనే వెల్లి వారిని సేవించు నీకు సంతానము కలుగుతుంది అని బాబా అన్నారు. అప్పుడు బాబాకు మ్రొక్కి అతను వెళ్లి పోయాడు.*

*అప్పుడు నేను బాబాని బాబా మీరిక్కడ నుండే ఫోన్ కైనా ఈ అడవిలో సిగ్నల్స్ లేవు. ఈ భూమండలంలో మీకు ఏ ఎదురులేకుండా దూరంలోనిది దర్శించడం, వినడం, చూడడం, వారికి సందేశం పంపడం, వారితో మాట్లాడడం కొన్ని వేల కిలో మీటర్ల దూరం పనులు మీరు దగ్గరి వ్యక్తితో జరిపినట్టు జరిపారు. మీరు పుట్టుగ్రుడ్డివారై ఇంత గొప్పగా ఎలా తయారైయారు. అని అడుగగా.. అప్పుడు బాబా.. నాయన పూర్వం ఋషులకు పుస్తకాలు, ఫోన్లు, విమానాలు లేవు, ఆకాశంలో వెళ్లుట, మస్తకం నుండి మస్తకానికి చదువు చెప్పుట, సందేశాలు పంపుట చేసేవారు. మా గురువుతో యోగధ్యానం, గురుసేవ 20 సంవత్సరాలు కఠోరంగా చేసి నేర్చుకున్నాను. నిత్యం నిరంతరం 50 సంవత్సరాలు ధ్యానం చేశాను. నా వయస్సు 90 సంవత్సరాలు, ధ్యానంతో అన్నీ సిద్దిస్తాయి. కళ్లు లేకున్నా పర్వాలేదు జ్ఞాననేత్రం ఉంది చాలు అని అన్నారు.*

*బాబా.. నేడు మానవులు సాదన చేసి ఫలితం రాలేదని మాని వేస్తున్నారు ఎందుకు అని అడుగగా.. నాయన.. ఒక్క రోజులో ఏమి సాధించలేము ఋషులు, మునులు కొన్ని సంవత్సరములు కఠోర ధ్యానం చేస్తే ఫలితం పొందారు. మనస్సులో ఏ కోరిక, యోగం సైత ధ్యానం చేస్తే త్వరగా ఫలితమొస్తుంది. మనస్సును శూన్యం చేయాలి. వెంటనే ధ్యానావస్థ కలుగుతుంది. లేనిచో ఎన్ని రోజులు ధ్యానం చేసినా ఫలితం సున్నా. ధ్యానికి యోగం చక్కగా ఉపకరించుచూ. మనోలయం చేయుటకు శ్వాసని శ్వాసతో లయం చేసినచో ప్రాణాప్రాణంలు ఏకమై కేవల కుంభకం సిద్ధించి నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది. అప్పుడు దివ్యనేత్రం తెరవబడుతుంది. ఆత్మజ్ఞానం లభిస్తుంది. త్రికాలజ్ఞానం కలుగుతుంది. ఎందరో యోగులు సర్వం తెలసి పిచ్చివాళ్ళలాగ మౌనంగా ఉన్నారు. యోగులు అంతటా ఉన్నా రహస్యంగా ఇతరులు గుర్తు పట్టకుండా వారిని మరుగు పరుచుకొని ఉంటారు. ఇప్పుడు నేను శ్యామ్ కళ్లు తెరిపించుటకే ఇలా చేశాను నేను రహస్యంగా ఉంటాను. మీరు సాధువులు యోగం ధ్యానం మహిమ గ్రహించారు కదా, ఇప్పుడు మీరు కూడా సాధన చేసి తరించండి. అని.. ఓం నమః శివాయ.. అని మౌనముద్రలోకి బాబా వెళ్లి పోయారు...*

   *🌟|| ఓం నమః శివాయ ||🌟*
🪷🪷🍁 🙏🕉️🙏 🍁🪷🪷

Thursday, August 3, 2023

క్రైస్తవ మత ప్రచారకునితో జగద్గురువుల సంభాషణ-1973 - శ్రీ విభాత మిత్ర

 క్రైస్తవ మత ప్రచారకునితో జగద్గురువుల సంభాషణ-1973 - శ్రీ విభాత మిత్ర

శ్రీ శ్రీ శ్రీ శృంగేరీ శారదాపీఠము యొక్క ముప్పైఐదవ జగద్గురువులైన శ్రీ అభినవ విద్యాతీర్థుల వారి కాలములో [1973] ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది.

గురువుల వద్దకు దర్శనానికి ఒక క్రైస్తవ మత ప్రచారకులు వచ్చినారు. ఆయన ఉద్దేశము , వారి మతము సర్వశ్రేష్ఠమయినది , కాబట్టి తమ మతానికి జనులను ఆకర్షించి వారికి స్వర్గ ప్రాప్తికి మార్గాన్ని చూపించవలెను. అందుకోసము జగద్గురువులను ఒప్పించి జనాలను క్రైస్తవ మతానికి చేర్పించాలని కోరడానికి వచ్చినారు. విషయము తెలిసిన జగద్గురువులు , వారి మతపు గొప్పదనము యేమిటో తెలుసుకోవలెనని ఆదరముతో ఆహ్వానించి సంభాషించినారు. 

యోగక్షేమాలు , కుశల ప్రశ్నలతర్వాత జగద్గురువులు అడిగినారు , 

జగద్గురువులు :" మీరు ఇక్కడికి వచ్చిన కార్యమేమిటి ? "

" క్రైస్తవ మత ప్రచారకులు [ క్రై. మ. ప్ర. ] : " స్వామీ , నేను మీ ఊరిలో , మీ మఠము సమీపములో ఒక క్రైస్తవ సంస్థను తెరవాలనే ఉద్దేశముతో వచ్చినాను. "

గురువులు : " ఇక్కడ సంస్థను తెరచుటకు కారణము ?" 

క్రై. మ. ప్ర.: " నేను ప్రజలకు ఇక్కడనుండే ధర్మోపదేశమును ఇవ్వాలని ఆశిస్తున్నాను. "

గురువులు : " మీరు ఉపదేశించునది యేమి ?"

క్రై. మ. ప్ర.:"  "మా మతమును గురించి, దాని శ్రేష్ఠతను గురించీ , జనులకు ఉపదేశము చేసి , వారందరినీ మా మతానికి మార్చుకోవాలనుకొంటున్నాను. "

గురువులు :" మీరు జనులకు ఉపదేశము ఇచ్చే ముందు నాకు కూడా మీ మతమును గురించి తెలిపితే , నేను కూడా తెలుసుకుంటాను గదా ? "

క్రై. మ. ప్ర.:" అట్లే కానివ్వండి, మీరు నన్ను ప్రశ్నలు అడగండి, నేను వాటికి సూక్త సమాధానములను ఇవ్వగలవాడను  "

గురువులు : " మీ మతము మొదలై ఎన్ని సంవత్సరాలయినది ?"

క్రై. మ. ప్ర.:" మా మతము పుట్టి 1973  సంవత్సరాలయినాయి "

గురువులు :" సంతోషము , మీ మతపు ఆరంభమును గుర్తించుటకు ఒక నిర్దిష్టమైన  కాలము , సమయము ఉన్నాయని స్పష్టమైంది. మీ మతము పుట్టుటకు ముందు ప్రజలు ఉన్నారా లేరా ? మీ మతము లేనప్పుడు జనులు జీవిస్తుండేవారా లేదా ?"

క్రై. మ. ప్ర.:" జనులే లేకపోతే మేము మతబోధ ఎవరికి చేస్తాము ? మేము మా మత విషయములను నేర్చుకొని ప్రచారము చేయుటకు ముందు కూడా ప్రజలు ఉండనే ఉన్నారు. "

గురువులు : మీ మతములోకి జనులు మారితే వారికి కలుగు ప్రయోజనమేమి?"

క్రై. మ. ప్ర.:" మా మతములో చేరిన వారందరికి మాత్రమే తప్పక స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. నరకము తప్పుతుంది  "

గురువులు :" సరే , మీరు మీ మతమును అనుసరించే వారికి మాత్రము స్వర్గప్రాప్తి కలుగుతుందంటున్నారు. ఇతరులకు నరకప్రాప్తి అంటున్నారు. కానివ్వండి , మీ మతము పుట్టుటకు ముందు బ్రతికి జీవించిన కోటానుకోట్ల ప్రజలు స్వర్గానికి వెళుతుండేవారా లేక నరకానికి వెళుతుండేవారా ? "

క్రై. మ. ప్ర.:" వారంతా నరకానికే వెళుతుండేవారు. మా మత ధర్మాన్ని పాలించనందువల్ల. "

గురువులు :" ఇదెక్కడి న్యాయము ? ఈ కాలపు ప్రభుత్వాలూ , న్యాయస్థానాలు కూడా ఇటువంటి చట్టాన్ని చేయవు కదా , మీరు మీ ధర్మాన్ని, నియమాన్నీ ఏర్పరచక ముందు ఉన్నవారు మీ ధర్మాన్ని పాలించుట లేదు అన్న కారణానికి వారు నరకభాజనులవుతారు అనేది న్యాయమేనా ? ముందెప్పుడో రచించబోయే నియమాలను ఊహించుకొని వారు అనుసరించుట ఎక్కడైనా సాధ్యమా ? కాబట్టి , మీరు మీ మతమునకు సంబంధించిన నియమాలను రచించుటకు ముందే ఉన్నవారు నరకానికే వెళ్ళినారు అని చెప్పుట సమంజసమా ?"

క్రై. మ. ప్ర.:" [ బిక్క చచ్చి ], ఔను స్వాములూ , వారు అందరూ నరకానికి కాదు , స్వర్గానికే వెళ్ళిఉండాలి  " 

గురువులు :" ఇది కూడా అన్యాయమే అవుతుంది, ఎందుకంటే మీ మతపు నియమాలను రాయుటకు ముందు పుట్టి పెరిగిన వారందరూ స్వర్గానికే వెళ్ళేవారు కదా? ఇప్పుడు మీరు రచించిన మత నియమాల వల్ల , వాటిని అనుసరించే కొందరు మాత్రమే స్వర్గానికి వెళుతున్నారు. అనుసరించని వారు నరకానికే వెళుతారు అన్నట్లయింది కదా ?  అందువల్ల , మీరు మీ మత నియమాలను రచించకుండా ఉండిఉంటే అందరూ తప్పక స్వర్గానికే వెళ్ళేవారు. ఇప్పుడు మీ నియమాల వల్ల అనేకులకు అన్యాయము జరిగింది కదా ?"

క్రై. మ. ప్ర.:" [ తన మాటలకు తానే చిక్కుకొని గాభరా పడి] స్వామీ , మీరు నన్ను ఇటువంటి ప్రశ్నలను అడుగుతున్నారే ? దయచేసి నన్ను వదిలేయండి " అన్నాడు.

గురువులు :" సరే , అట్లాగే కానివ్వండి , ఆ సంగతి వద్దు. చూడండి , ఈ ప్రపంచములో ప్రజలు అనేక విధములైన దుఃఖ కష్టాలకూ , సుఖ సంతోషాలకూ లోనగుటను చూస్తున్నాము కదా , దానికేమిటి కారణము ?"
క్రై. మ. ప్ర.:" దీన్నంతటినీ భగవంతుడే  చేసినాడు "

గురువులు :" ఒకడికి ముష్టి అడుక్కోవలసిన హీన స్థితినీ , ఇంకొకడికి దానము చేయునట్టి ఉత్తమ స్థితినీ దేవుడు అనాదిగా ఇస్తున్నాడంటే , భగవంతుడు తనకు ఇష్టమైనవాడిని సుఖములోనూ , తనకు అప్రియమైన వాడిని దుఃఖములోనూ ఉండేటట్టు చేసినాడనే చెప్పవలెను కదా ?" 

క్రై. మ. ప్ర.:" అది భగవంతుని స్వంత ఇఛ్చ , స్వామీజీ , మనమేమీ చేయలేము. వాడు ఏమికావాలన్నా చేయగలడు. అది వాడిష్టము.  "

గురువులు :" భగవంతుడు ఏమి కావాలన్నా చేయవచ్చు అన్నట్టయితే , అందరికీ సుఖాన్నే ఇవ్వవచ్చును కదా ? ఆ సుఖాన్ని కొందరికి మాత్రమే ఎందుకు ఇచ్చినాడు ?దానికి కారణమేమయి ఉంటుంది ?"

క్రై. మ. ప్ర.:" [అప్రతిభుడై], అదంతా భగవంతునికి చెందిన విషయము. నేనేమి చెప్పగలను ? "

గురువులు :" మీ వాదానికి ఒక యుక్తి గానీ , తర్కము గానీ ఉన్నట్టే కనిపించుట లేదు. సరే , అదీ ఉండనివ్వండి , మరొక విషయము ; చిన్న పిల్లలుగా ఉన్నపుడే కొందరు చనిపోతారు. కొందరేమో వయసయిన తర్వాత. ఇలాగున్నపుడు , చిన్నపిల్లలు చనిపోయాక స్వర్గానికి వెళతారా లేక నరకానికా ? "

క్రై. మ. ప్ర.:" చిన్న పిల్లలు పాపము ఎలాచేయగలరు ? వారు ఒక తప్పును కూడా చేయలేరు. వారింకా చిన్నపిల్లలే కాబట్టి వారికి పాపపుణ్యాల ప్రసక్తే రాదు. వారికవి అంటవు "

గురువులు : " అందుకే అడిగినాను , వారు వెళ్ళేది స్వర్గానికా , లేక నరకానికా ?"

క్రై. మ. ప్ర.:" చిన్న పిల్లలందరూ స్వర్గానికే వెళతారు  "

గురువులు :" అట్లయితే మన తల్లిదండ్రులంతా మనగురించి చాలా పెద్ద తప్పే చేసినారు అనవలెను. మనలనందరినీ చిన్న పిల్లలుగా ఉన్నపుడే చావడానికి వదిలేయకుండా  పెంచి పోషించి పెద్ద చేసినారు. ఇది చాలా పెద్ద తప్పు కదా ? శిశువులను పుట్టగానే చంపి వేసుంటే, మనము పెరిగి పెద్దయి, తప్పు చేసేందుకు అవకాశమే ఉండేది కాదు. మనందరకూ స్వర్గమే దొరికేది ? కాదా ?"

క్రై. మ. ప్ర.:"[ మరలా చిక్కుకొని], స్వామీ మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను జవాబివ్వలేను  "  

గురువులు :" సరే , వదిలేయండి, చనిపోయే వారందరూ స్వర్గానికో లేక నరకానికో వెళతారు తప్పదు కదా, ఎప్పుడు వెళతారు అన్నది చెపుతారా ?"

క్రై. మ. ప్ర.:" భగవంతునికి ఎప్పుడు నిర్ణయించాలనిపిస్తే అప్పుడు నిర్ణయిస్తాడు , అప్పుడే పోతారు  "

గురువులు :" ఇదేమయ్యా ఆశ్చర్యము ? భగవంతుడు పిచ్చివాడా యేమి , తనకిష్టమొచ్చినపుడు న్యాయ నిర్ణయము చేయుటకు ?"

క్రై. మ. ప్ర.:" అలాగ కాదు , అక్కడ అదంతటికీ ఒక క్రమ విధానముంటుంది "

గురువులు :" సరే , మీ పుస్తకములో అదేమి క్రమ విధానమును వివరించినారో కొంచము చెపుతారా ? [ ఆయన మాట్లాడేందుకు తటపటాయించినాడు; గురువులే కొనసాగించినారు] మీ మతములో ఈ విషయము గురించి ఏమి సిద్ధాంతము ఉందో , దాన్ని నేను చెపుతాను. అది సరియా కాదా మీరే చెప్పండి"

క్రై. మ. ప్ర.:" కానివ్వండి స్వామీ , చెప్పండి "

గురువులు :" ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చనిపోయిన తరువాత , దేవుడు , ఏదో ఒకరోజు , న్యాయ నిర్ణయమును చేసి, కొందరికి స్వర్గాన్నీ , కొందరికి నరకాన్నీ ఇస్తాడు. కదా ? సరియేనా ? "

క్రై. మ. ప్ర.:"  ఔనౌను , తమరు చెప్పింది సరిగ్గా ఉంది"

గురువులు :" ఈ ప్రపంచములోనే జరుగుతున్న సంగతిని చూడండి , ఎప్పుడైనా ఎవరైనా ఒక తప్పు చేసినారంటే , విచారణకు మొదట , ఆ తప్పు చేసినవాడిని పోలీసులు కొన్నిరోజులు నిర్బంధములో ఉంచుతారు. దాని తర్వాత కూడా అతడిని పోలీసులు లాకప్ లో ఉంచాలంటే ,దానికి న్యాయాధీశుల అనుజ్ఞను పొందవలసి ఉంటుంది. అలాగ , కారణమూ , అనుమతీ లేకుండా , విచారణ చేయకుండా  ఎక్కువ రోజులు ఉంచుటకు వీలు లేదు. న్యాయాధీశులు ఒప్పుకోకుంటే అతడిని పోలీసులు నిర్బంధము నుండీ వదిలివేయ వలసి ఉంటుంది. ఇలాగున్నపుడు , ఒకడు మృతుడయిన తరువాత వాడికి , " ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చచ్చిపోయే వరకూ , అనగా , కోటి కోటి సంవత్సరాలయ్యే వరకూ జనాలు పుట్టుతూ చస్తూ ఉంటారు కాబట్టి , అదంతా అయ్యే వరకూ , ’ నువ్వు విచారణ లేకుండానే కాచుకొని ఉండాలి" అంటూ ఆ భగవంతుడు చెబితే ,అది న్యాయమనిపించుకుంటుందా ? మీరే చెప్పండి?"

జగద్గురువుల ఈ మాటను విని ఆ క్రైస్తవ మత ప్రచారకుడు దిక్కుతోచనివాడైనాడు. అప్పుడు గురువులు ఆతనికి సమాధనము చెబుతూ , 

 " మీకు మీ మతమే గొప్పది. మీరు దానిని అత్యంత శ్రద్ధతో అనుసరించవలెను. అంతే కానీ , ఇతరులతో , ’ మా మతమే శ్రేష్ఠమైనది, దానినే అందరూ అనుసరించవలెను, అలాగ ఏమైనా మీరు మా మతాన్ని అనుసరించకపోతే మీకు , నరకమూ , దుఃఖమే గతి’ అని చెప్పుట సాధువైనది కాదు. మీకు మీ తల్లి పూజనీయురాలు. ఇతరులకు వారి వారి తల్లులు పూజనీయులు. ’ మాతల్లి మాత్రమే పూజనీయురాలు , ఇతరుల తల్లులు కాదు’ అంటూ మీరు చెప్పితే అది మీ మూఢత్వమే అవుతుంది. నా తల్లి కూడా ఇతరుల తల్లులవలె సమానముగా పూజనీయురాలు అని తెలుసుకున్నపుడే మనలను ప్రపంచము ఆదరిస్తుంది. లేకుంటే ఛీత్కరిస్తుంది. " అని ఉపదేశించినారు. ఆతడిని వీడ్కొనునప్పుడు ఆతనికి జగద్గురువులు ఎప్పటివలెనే ఫలమునిచ్చి సత్కరించినారు. అతడు దానిని ఆదరముతో స్వీకరించి వెళ్ళిపోయినాడు. 

 ఆ తరువాత గురువులు భక్తులను ఉద్దేశించి ,

|| సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽత్తిష్వ కామధుక్ ||

 " మొదట యజ్ఞములతోపాటు ప్రజలను సృష్టించి ప్రజాపతి, ’ ఈ యజ్ఞములు మీకు కామధేనువులగు గాక ’ యని అంటాడు. బ్రహ్మ దేవుడు , జగత్తును సృష్టి చేయునపుడే అది సరిగ్గా నడుస్తూ ఉండుటకు అవసరమైన విధి-నియమములను రచించినాడు. ఇది మన మతపు గొప్పతనము. మన సనాతన ధర్మపు సిద్ధాంతము ప్రకారము , భగవంతుడు అనాదియైనవాడు. అలాగే ఈ ప్రపంచమూ , మన ధర్మమూ కూడా అనాదిగా ఉన్నవి. జీవరాశులకు వాటి వాటి కర్మలకు తగినట్లు ఫలము ప్రాప్తిస్తుంది. దుష్టులకు దుష్టఫలము , సత్కర్ములకు మంచి ఫలము. కర్మలు అచేతనమైనవి-అంటే జడమైనవి. ఫలము నిచ్చేది భగవంతుడే. 

భగవంతుడు దయాళువు అనునది దిటమైన మాట.. తప్పుచేసినవాడు తన తప్పును ప్రామాణికముగా ఒప్పుకొని క్షమాభిక్ష వేడితే న్యాయాధీశులు శిక్షను తగ్గిస్తారు కదా ? కానీ ఇతడు పదే పదే తప్పులు చేస్తూ ప్రతిసారీ క్షమాభిక్షను కోరితే న్యాయాధీశుడు క్షమిస్తాడా ? భగవంతుడు కూడా అట్లే. ప్రామాణికులైనవారిని క్షమిస్తాడు. కానీ పదే పదే తప్పుచేసే వాడిని ఖచ్చితముగా క్షమించడు. మన శాస్త్రములు శ్రద్ధతో పాటూ వివేకము కూడా ఉండవలెనని బోధిస్తాయి. ఇతరమతాలు శ్రద్ధ ఒక్కటీ ఉంటే చాలని చెబుతాయి. మత ధర్మములలో భావుకత మాత్రమే కాక విచారము చేయు ప్రవృత్తి కూడా ఉండవలెను. 

 శ్రీరామచంద్రుడు , శ్రీ కృష్ణుడు వంటి అవతారాలు మన ధర్మములో మాత్రమే కనిపిస్తాయి. మన ధర్మము వారివల్ల యేదో కొత్తగా స్థాపించబడినది కాదు. మన ధర్మము , అటువంటివారిని ఈ జగత్తుకు ప్రసాదించింది. ఇంతటి మహాత్మ్యమున్న సనాతన ధర్మములో మనందరమూ జన్మించినాము. ఈ సనాతన ధర్మపు బోధనలను పాలించి మనమందరమూ శ్రేయస్సుకు తగినవారము కావలెను. " అని ఉపదేశించినారు. 

{శ్రీ శృంగేరీ శారదా పీఠము వారు కన్నడ భాషలో ప్రచురించిన " శృంగేరీ పుణ్యక్షేత్రము " పుస్తకమునుండీ అనువాదము }
--సేకరణ..🙏

అతి సర్వత్ర వర్జయేత్

 .        *అతి సర్వత్ర వర్జయేత్*
.   **************************
  ఇది సనాతనం నుంచి వస్తున్న సామెత. 
  ఇదే మన జీవనానికి సదా అనుకూలత. 
   అతి మనను చితి చేరువ చేసేది. 
 అతి మనకు నిరుపయోగమెపుడైనా. 

అతి మనకు మంచైనా చెడైనా పనికి రాదు. 
 అతి ఏ జీవన రంగముననైనా ప్రమాదమే. 
  మితమే మనకు సర్వత్రా హితకరం. 
 అతిగా చేయకు. అతిగా ప్రవర్తించకు.

  వినయమైనా విర్రవీగడమైనా మితమే మేలు. 
 స్నేహమైనా శత్రుత్వమైనా మితమే అనుకూలం. 
   ఆహార సేవనమైనా మద్యపాన సేవనమైనా
   మితమునకు మించిన అది అపాయము. 

 ఏదీ మించకూడదు నీ బ్రతుకు బాటలో. 
 మించితే అది విషతుల్యమవుతుంది. 
   అమితమే మన పాలిట దురితము.
  మిత పరిమితి వలనే మతి స్థిమితము. 

          ******************
రచన:---రుద్ర మాణిక్యం (✍️కవి రత్న). 
    రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా). 

*************************************

సృష్టి - ఈ సృష్టిలో మనం

 .      *సృష్టి - ఈ సృష్టిలో మనం*
    ****************************
  
          అందమంటే  స్త్రీలదే. 
       ఆనందమంటే మగాళ్ళదే. 
       ఎందుకో యీ ప్రకృతిలోన
       ఇదే యీ మానవుల వైఖరి. 

          నవ్వడం అహో స్త్రీలదే. 
      నవ్వించడం  యీ మగాళ్ళదే. 
       నవ్వుల తీరూ పూల మాదిరి. 
        మెరిసి మురిసే వైభవమ్మది. 

        ఇంటి అందం స్త్రీల వలనే. 
      ఇంటి పోషణ మగాళ్ళ వలనే. 
       ఇల్లు మంచిగ ఉన్నయపుడే
       మనసు కెపుడూ తృప్తి ప్రాప్తీ. 

       స్త్రీల పురుషుల ఒకరినొకరీ
       ప్రేమ వలనెగ ప్రణయ సీమ. 
    ఈ ప్రణయమూ చిగురింత వలనే
          ఇల్లు అగునొక  స్వర్గ సీమ. 

  స్త్రీలు పురుషులు ప్రేమ మైకమున
  ఏకమైతెనె పిల్లల పుట్టుక  సందడి. 
    ఆ పిల్లల లాలన ఆలన స్త్రీలదే. 
     వారి పాలన మరి మగాళ్ళదే. 

       ఇదే గద యీ సృష్టి సీమలొ 
        తరతరాలుగ సాగు తీరూ. 
        ఆగక ఈగీ ఏగు బ్రతుకుకు
 మెతుకు గతుకుల బ్రతుకు తెరువులు.

        మనము ఆగిన సృష్టి ఆగదు. 
      ఏనాడు ఆగని కాలభ్రమణము
       నందు నడిచెడి జీవులమ్మహొ ! 
  ఎపుడొ చచ్చీ  మాయ మగుదుము. 

         పుట్టి బ్రతికీ చచ్చి పోయే      
     బ్రతుకులే మనవెపుడు సృష్టిలొ.
       ఎన్ని రకముల జీవులిక్కడట
       పుణ్య పాపపు కృత్యములతో. 

    దీని కంతయు మూలమేదొ ఎవరొ
   తెలియదెవరికి ఇసుమంతయైనను
  ఎంత కాలమొ యీ సృష్టి నడకలు
  కొనసాగుతూ యిల ఉండునో గద.

                 ఇదే సృష్టీ
             మన పైన దృష్టీ
               పెట్టి నడిచెడి
              పరంపర యిది. 

        ********************
రచన :--- రుద్ర మాణిక్యం.(✍️కవి రత్న) 
  రిటైర్డ్ టీచర్.    జగిత్యాల (జిల్లా) 

************************************

జీవితం

 జీవితం:-
                 ➖➖➖ ✍️

అందరినీ విమర్శించే వారు ఎప్పటికి మనశ్శాంతిగా జీవించలేరు, కానీ అందరినీ సరదాగా పలకరించే వారు నిత్య నూతన ఆనందాలతో జీవిస్తారు. 

స్నేహం - ప్రేమ అనేవి దీపం లాంటివి.  వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడు కోవడంలోనే ఉంది అసలైన గొప్ప తనం.

నిన్నటి న్యూస్ పేపరు నేడు నీకు వేస్ట్ పేపరుగా మారవచ్చు. కానీ, రేపటికి చరిత్రను చూపించే సాక్ష్యం కూడా, ఆ వేస్ట్ పేపరే అవుతుంది. 

అవసరం లేదని దేనినీ వదిలేయకండి. ఆపదలో ఉన్నప్పుడు అదే నీకు అస్త్రంలా ఉపయోగపడవచ్చు.

ఏదీ ఊరకనే రాదు. తప్పు చేస్తే పాపం, ఒప్పు చేస్తే పుణ్యం, ఏది కావాలో,  ఏది రావాలో ఆపై నీ ఇష్టం.

మనిషికి మరణం విచిత్రమైనది ఇంటి నిండా ఆస్తులున్న కోటిశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు.

ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదోడు, చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నాడు. 

మనిషి ఎక్కడ గెలిచిపోతాడో, ఎక్కడ అలిసిపోతాడో, ఎక్కడ ఓడిపోతాడో, ఎవరికీ తెలియదు. మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళుతున్నాడు. 

మనం ఎదుటి వారి నుండి ఏమైనా ఆశించటం ఆపితే, ఆనందం మొదలవుతుంది. వారి మీద  అధికారం ఆపితే సంతోషం మొదలవుతుంది.

ఎదుటి వారిని క‌లుపుకుపోయే మనస్తత్వం మనలో ఉంటే, అందరూ మనతోనే ఉంటారు. అంతా మనకే తెలుసు, మనకెవరి అవసరం లేదనే అహం మనకుంటే  సమాజమే మనని దూరం పెడుతుంది. 

మనకు ఎంత ఆస్తి ఉందనేది కాదు ముఖ్యం. మనము ఎంత మంది మనసుల్లో ఉన్నాము అనేదే ముఖ్యం. వారి మనస్సులో మనకు మంచిగా స్థానం  ఉండాలనదే ముఖ్యం.

నిజం ఉన్నతమైనది, కానీ 
నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది.

మనం కంటితో చూడనివి చెవులతో విననివి ఎప్పుడు నమ్మవద్దు. ఎందుకంటే కొంత మంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. ✍️
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
               🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

హైదరాబాద్ లోని ప్రాంతాలకు ఆయా పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకోగలరు

 *హైదరాబాద్ లోని ప్రాంతాలకు ఆయా పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకోగలరు*:-

బేగం పేట:-
6వ నిజాం మహబూబ్ ఆలీ కుమార్తె బ‌షీర్ ఉన్నిసా బేగం ను ఉమ్రన్ అమిర్ కు ఇచ్చి పెళ్లి చేశాడు. కూతురికి క‌ట్నం కింద‌ ఒక స్థలాన్ని  కట్నంగా  ఇచ్చాడు. ఆ స్థలానికి  బషీర్ ఉన్నిసా బేగం  పేరు  మీదగా  బేగంపేట  అని  పేరు వచ్చింది. 

చార్మినార్:-
కులికుతుబ్ షా  కట్టిన  ఈ కట్టడానికి  ప్రధాన  ఆకర్షణ నాలుగు స్థంబాలు. 
ఉర్దూలో చార్ అంటే నాలుగు, మినార్ అంటే స్థంబాలు. వీటి పేరు మీదుగానే చార్ మినార్ అనే పేరు వ‌చ్చింది.

సికింద్రాబాద్:-
మూడో  నిజాం  సికిందర్ ఝా  పేరు మీద ఈ ప్రాంతానికి సికింద్రాబాద్  అనే  పేరు  వచ్చింది . అంతకుముందు  సికింద్రాబాద్ ని  లష్కర్  అని  పిలిచే వారు.

ఖైరతాబాద్:-
ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది.

శంషాబాద్:-
షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు మీద శంషాబాద్ అనే పేరు వ‌చ్చింది. ష‌మ్స్ అంటే సూర్యుడు. 
దీని అర్థం ప్ర‌భువుల యందు సూర్యుడిలాంటి వాడని,
ఈ బిరుదు నవాబ్ మొయిన్-ఉద్-దౌలా బహదూర్ కు క‌ల‌దు.

నాంపల్లి:-
నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్ అనే దివాన్‌కు నెఖ్‌ నామ్‌ ఖాన్ అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్-నామ్-పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది నాంపల్లిగా మారిపోయింది.

హిమయత్ నగర్:-
1933 లో ఏడవ నిజాం ఉస్మాన్  అలీఖాన్ యొక్క పెద్ద కుమారుడు   హిమాయత్  అలీ ఖాన్  ఆస‌ఫ్ జా పేరు మీద ఆ స్థలానికి  హిమాయత్ నగర్ అని పేరు వచ్చింది.

అబిడ్స్:-
ఆరో నిజాం కాలంలో అల్‌బర్ట్ అబిద్ అనే ఒక ఆర్మేనియా  యూదువ్యాపారి  ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. తర్వాత  కొంతకాలానికి ఆల్బర్డ్ అబిడ్  ఇంగ్లాండ్ కి వెళ్లిపోయిన‌ప్ప‌టికీ ఆ స్థలానికి ఆ పేరే స్థిర‌ప‌డిపోయింది. కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా అబిడ్స్ గా మారిపోయింది.

సోమాజిగూడ:-
నిజాం కాలంలోని రెవెన్యూ  డిపార్ట్మెంట్  అధికారైన సోనాజీకి  కొన్ని  భూములుండేవి.  
సోనాజీ కాస్త సోమాజి  అయింది.  గూడ అంటే చిన్న గూడెం లేదా ప్రాంతం అని అర్ధం. రెండు క‌లిపి సోమాజిగూడ అయ్యింది.

మాసబ్ ట్యాంక్:-
6వ కుతుబ్ షాహ్ భార్య హ‌యత్  భ‌క్షి భేగంను మాసాహెబా అని  పిలిచే వారు. మాసాహెబా పల్లె భూములకు సాగు నీరు ఇవ్వడానికి  ఒక ట్యాంక్  నిర్మించింది.  
ఆ ట్యాంక్ పేరు మాసాహెబా తలాబ్ అని పిలిచేవారు. చివరకు  ఆ పేరు మాసబ్ ట్యాంక్ అయింది.

హైదరాబాద్:-
కులీ కుతుబ్ షా భార్య భాగమతి  వివాహం తర్వాత తన పేరుని  హైదర్ మహల్ గా మార్చుకున్నారు. హైదర్ మహల్  అంటే హైద్రా నగరం అని అర్ధం. తర్వాత ఆ పేరు మీద  హైదరాబాద్ గా మారింది.

మలక్ పేట్:-
గోల్కొండ రాజు అబ్దుల్ కుతుబ్ షా  యొక్క సేవకుడు మాలిక్ యాకుబ్  పేరు  మీదగా ఈ ప్రదేశానికి మలక్ పేట్ అనే పేరు వచ్చింది.

బషీర్ బాగ్:-
బసిరుద్దౌలాకు హైద్రాబాద్ లో ఒక ప్యాలెస్ ఉండేది. ఆ ప్యాలెస్  దగ్గర  పెద్ద గార్డెన్ ఉండేది. బసిరుద్దౌలా  పేరు మీద ఆ ప్రదేశానికి బషీర్ బాగ్  అనే  పేరు వచ్చింది. బాగ్ అంటే  గార్డెన్ అని అర్ధం.

ఫలక్ నుమా:-
ఫలక్ అంటే ఆకాశం, నామ అంటే  అద్దం. ఈ ప్రదేశం అంతా  కొండలతో ఎంతో ఎత్తుగా ఉండేది. కాబట్టి ఆకాశానికి అద్దం అనే అర్థం  వచ్చేలా ఫలక్ నామ అని పేరు  పెట్టారు. ఫలక్ నామ కాస్త ఫలక్ నుమా అయ్యింది.

సరూర్ నగర్:-
రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు నాలుగు మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.

లంగర్ హౌజ్:-
గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ ఖానా కాలక్రమేణా లంగర్‌ హౌజ్‌ మారింది. 
గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.

చెంచల్‌ గూడ:-
చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చెంచల్‌ గూడగా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.

కార్వాన్:-
ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు కార్వాన్ అని పిలుస్తున్నారు. కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.

కవాడిగూడ:-
ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు.. క్రమంగా ఆ ఏరియా కవాడిగూడగా మారింది.

దోమలగూడ:-
దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ. పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమలగూడగా మారింది.

బేగం బజారు:-
హైదరాబాద్ వ్యాపారుల పై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో బేగం బజారుగా నిలిచిపోయింది.

అఫ్జల్ గంజ్:-
ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్ గా మారింది.

హైదర్ గూడ:-
మొదటి తాలుఖ్ దార్ (జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో హైదర్ గూడ ఏర్పడింది.

తార్నాక:-
తార్నాక అసలు పేరు తార్ నాకా. తార్ అంటే ముళ్లకంచె. నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది తార్నాకగా మారింది.

శాలి బండ:-
శాలి బండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ నివసించేవాడు. ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు. కాలక్రమంలో అది శాలిబండగా మారింది.

హబ్సిగూడ:- 
నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను పిలుస్తున్నారు.

మదీనా:-
ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది.

చిక్కడపల్లి:-
చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది. బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్పల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో చిక్కడపల్లిగా మారిపోయింది.

నౌబత్ పహాడ్:-
నిజాం కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి నౌబత్ పహాడ్ అని పేరొచ్చింది.

బాగ్‌లింగంపల్లి:-
గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో  పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను బాగ్‌లింగంపల్లి అంటున్నారు.

అడిక్‌మెట్:- 
అడిక్‌మెట్ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో అడిక్ మెట్ గా మారిపోయింది.

మీరాలంమండి:-
సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. దాన్ని మీరాలంమండి అనేవారు. ఇప్పటికీ మీరాలంమండి మార్కెట్ ఫేమస్.

బార్కాస్:-
నిజాం సైన్యంలో అరేబియన్‌ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పడు బార్కాస్ అని పిలుస్తున్నారు.

తాడబండ్:-
తాడబండ్ అసలు పేరు తాడ్-బన్. తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో తాడ్‌బండ్‌ గా మారిపోయింది.

ఎర్రమంజిల్‌:-
ఎర్రంమంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం ఎర్రమంజిల్‌ గా స్థిరపడింది. ఆరో నిజాం కాలంలో ఆ ప్యాలెస్‌ని రాయల్ బాంక్వెట్ హాల్‌ గా వాడేవారు.

కాచిగూడ:-
కచ్ అనే తెగ నివసించే ఏరియా కాబట్టి కాచిగూడ అనే పేరొచ్చింది.

లాడ్‌ బజార్:-
మహ్మద్ ఖులీకుతుబ్ షా భాగమతిలకు మగసంతానం లేకపోవడంతో కూతురు హయత్ భక్షీ బేగంను గారాబంగా పెంచారు. ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన లాడ్‌ బజార్ లాడ్లీ అనే పేరుమీదనే స్థిరపడింది.

ముషీరాబాద్:-
హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 1785 లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్ గా స్థిరపడిపోయింది.

ఫతే మైదాన్:-
ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒకచోట బస చేశాడు. 
ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్. ఇప్పుడక్కడ ఎల్బీ స్టేడియం నిర్మించారు.

పబ్లిక్ గార్డెన్స్:-
పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడు బాగ్-ఏ-ఆమ్ అని పిలిచేవారు.. బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు! ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్-ఏ-ఆమ్ అన్నారు. ఇంగ్లీష్‌లో పోష్‌గా పబ్లిక్ గార్డెన్.

చాదర్ ఘాట్:-
మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరొచ్చింది.

ఆస్మాన్ గఢ్:-
1887-92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ ఝా బహద్దూర్  పేరు మీద ఆస్మాన్ గఢ్ ఏర్పడింది.

ఉమ్దా బజార్:-
నవాబ్ నిజాం ఆలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద ఉమ్దా బజార్ ఏర్పడింది. హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్గా ప్రసిద్ధిగాంచింది.

గౌలిగూడ:-
గౌలీ అంటే గొర్రెల కాపరి! వాళ్లంతా ఎక్కువగా ఉండేవాళ్లు కాబట్టి ఆ ప్రాంతం గౌలిగూడగా స్థిరపడిపోయింది.

లల్లాగూడ:-
రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నిసా బేగం కోసం మౌలాలీ సమీపంలో ఒక ప్యాలెస్, ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో లాలాగూడగా మారింది. 

సుల్తాన్ బజార్:-
1933 కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడేచౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక, 
ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు.

రికాబ్ గంజ్:-
రికాబ్ గంజ్ ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు. తర్వాతి క్రమంలో రికాబ్ గంజ్‌గా మారింది. రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్. మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలటరీ ఆఫీసర్లు ఉండేవారు.

డబిర్ పురా:-
నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ డబిర్ పురాలో ఉండేవి. డబీర్ అంటే పండితుడు అని అర్ధం. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికా పేరొచ్చింది.

అంబర్‌ పేట:-
అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది అంబర్‌ పేటగా స్థిరపడిపోయింది.

చాంద్రాయణ గుట్ట:-
చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది చాంద్రాయణ గుట్టగా మారిపోయింది.

చిలకలగూడ:-
చిలకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి చిలకలగూడకు ఆ పేరొచ్చింది. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫల్ మండి మార్కెట్ మీద గుంపులుగుంపులుగా వచ్చి వాలి పళ్లు తిని వెళ్లేవి.

మంగళ్ హాట్:-
మంగళ్ హాట్ అసలు పేరు మంగళ్‌ హత్. మంగళ్ అంటే మంగళవారం. హత్ అంటే సంత. ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మంగళ్ హత్ అనే పిలిచేవారు. కాలక్రమంలో మంగళ్‌హాట్‌గా మారిపోయింది.

సైదాబాద్:-
1591లో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరు మీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారంలో ఉంది. మొదట్లో సయ్యదాబాద్ అనేవారు. తర్వాత సైదాబాద్ అని పిలుస్తున్నారు.

టప్పాచబుత్ర:-
టప్పా అంటే ఉర్దూలో ఉత్తరం అని అర్ధం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్టాఫీసులుండేవి. అక్కడి నుంచే సిటీ అంతా బట్వాడా జరిగేది. అందుకే ఆ ఏరియాని టప్పాచబుత్ర అని పిలుస్తున్నారు.

తుకారాం గేట్:-
లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు.ఈస్ట్ మారేడుపల్లి, అడ్డగుట్ట నుంచి వచ్చేవాళ్లంతా గేట్ కీపర్ తుకారాం పేరునే లాండ్ మార్కుగా వాడుకునేవారు. అలా ఆ ప్రాంతం తుకారాంగేట్ గా మారిపోయింది.

యాఖుత్ పురా:- 
హైదరాబాద్ కు చార్మినార్ గుండెకాయ అయితే, పాతబస్తీకి యాఖుత్పురా గుండెకాయ. యాఖుత్ అంటే నీలంరంగు రత్నం అని అర్ధం. నిజాం రాజుకి పచ్చలంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆ ఏరియాకు యాఖుత్ పురా అని నవాబే నామకరణం చేశాడు.

బైజూస్ పతనం..... ఎన్నో పాఠాలు...ఒక గుణపాఠం

 బైజూస్ పతనం.....
ఎన్నో పాఠాలు...ఒక గుణపాఠం

ఒక వ్యాపారంలో విజయం చూడగానే ఇక ఆ రంగం మొత్తాన్ని మింగేలాయన్న ఆతృత కొందరిలో కలుగుతుంది. ఎవ్వరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోవాలని, ప్రపంచ కుబేరుల సరసన నిలబడాలని ఇలా ఏవేవో కోరికలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి ఆలోచనలో తప్పు కనపడకపోయినా ఒక రకంగా ఇది మానసిక రుగ్మత. దీనికేదైనా పేరు పెట్టాలంటే "అలగ్జాండర్ సిండ్రోం" అని పెట్టుకోవచ్చు. 

ఒక్క రాజ్యాన్ని గెలవగానే అసలు మొత్తం ప్రపంచాన్నే గెలిచేస్తే ఎలా ఉంటుందనుకుని బయలుదేరాడు అలగ్జాండర్. ఎందరో చావుకి కారణమయ్యాడు, చివరికి తానూ ఏమీ అనుభవించకుండానే పోయాడు. 

ఏంబిషన్ ఉండొచ్చు కానీ దానికీ ఒక లెక్కుండాలి. వ్యాపారమన్నాక రిస్క్ తీసుకోవాలి కానీ మరీ నేల విడిచి సాముగారడీ చేయకూడదు. అలా చేసి దెబ్బ తిన్నవాళ్లు ఎందరో. ఆ లిష్టులో ఇప్పుడు కొత్తగా చేరిన వ్యక్తి బైజూస్ రవీంద్రన్. 

బైజూస్ గురించి చెప్పాల్సిన పని లేదు. అందుకే రవీంద్రన్ గురించి చెప్పుకుందాం. 

రవీంద్రన్ ది కేరళ. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. తల్లి లెక్కల గురువైతే, తండ్రి ఫిజిక్స్ మాష్టారు. దానివల్ల సహజంగా అతనిలో టీచింగ్ జీన్స్ వచ్చాయి. స్కూల్లో పెద్దగా చదవకపోయినా ఇంట్లోనే తన గురువులుండేసరికి అలా అలా చదివి ఇంజనీరైపోయాడు. కానీ తనలోని నేచురల్ జీన్స్ అతనిని టీచింగ్ వైపు నడిపాయి. 

నెమ్మదిగా ఉద్యోగాన్ని పక్కనపెట్టి పోటీ పరీక్షలకి ప్రిపెరయ్యే విద్యార్ధులకి ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. తన పాఠాలతో విద్యార్థుల్ని ఆకర్షించగలిగాడు. వాళ్లకి మంచి రిజల్ట్ కూడా ఇప్పించగలిగాడు. ఇంతింతై అంతంతై అన్నట్టుగా చాలా బిజీ అయిపోయాడు. తన క్లాసులు నడపడానికి చోటు చాలక ఏకంగా స్పోర్ట్స్ స్టేడియం ని అద్దెకు తీసుకుని నడిపేవాడు. పెద్ద పెద్ద స్క్రీన్స్ పైన పాఠాలు చెప్పేవాడు. 

దేశంలోనే మంచి పేరు రావడంతో తన విద్యార్థులనే ఉపాధ్యాలుగా మార్చి 41 కోచింగ్ సెంటర్స్ పెట్టాడు. లెక్కలు, ఫిజిక్స్ లాంటివి దాదాపు ప్రతి కాంపిటీటివ్ ఎగ్జాంస్ కి అవసరం. వాటితో పాటు ఇతర సబ్జెక్ట్స్ కూడా తన కోచింగ్ సెంటర్స్ లో చెప్పబడేవి. అక్కడికే కోట్లల్లో సంపాదన ఉంది. 

2011లో దివ్య అనే బయోటెక్ ఇంజనీర్ తో కలిసి "థింక్ అండ్ లర్న్" (బైజూస్ కి మాతృ సంస్థ) అనే కంపెనీ తెరిచాడు. ఆమెను తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. 2015లో తన వ్యాపారాన్ని డిజిటల్ ప్రపంచంలోకి తీసుకెళ్లి లెక్కలు, సైన్స్, ఇంగ్లీష్ బోధించడం మొదలుపెట్టాడు.

రవీంద్రన్ ఎదుగుదల చూసి సికోయా క్యాపిటల్ అనే కంపెనీ రూ 480 కోట్లు పెట్టుబడి పెట్టింది. అలా డబ్బొస్తుండడంతో రవీంద్రన్ లో నెమ్మదిగా పైన చెప్పుకున్న అలెగ్జాండర్ సిండ్రోం మొదలయ్యింది. తన కంపెనీని పబ్లిక్ ఇష్యూకి తీసుకెళ్లి మరింత ఎక్కువ డబ్బు చూడాలనుకున్నాడు. 2020లో కరోనా లాక్డౌన్ కాలం అతని వ్యాపారానికి కలిసొచ్చింది. వర్క్ ఫ్రం హోం, స్టడీ ఫ్రం హోం నేపథ్యంలో బైజూస్ చాలా పాపులర్ అయ్యింది. సుమారు రూ 4000 కోట్ల ఫండ్ రైజింగ్ చెయ్యాలనుకున్నాడు 2021లో. కానీ బ్లాక్స్టోన్, ఫిడిలిటీ, జీఐసీ లాంటి అంతర్జాతీయ ఇన్వెస్టర్స్ దాదాపు రూ 9000 కోట్లు దాకా గుమ్మరించారు. ఆ దశలో కంపెనీ విలువని ఏకంగా 1లక్షా60వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనాలు వేసారు. 

అన్నీ బానే ఉన్నాయి. కానీ 2022లో ప్రమాదం మీద పడింది. అలెగ్జాండర్ ఎలాగైతే యుద్ధం యావలో పడి తన సైన్యం ఆరోగ్యాన్ని ఎలా పట్టించుకోలేదో, రాబోయే బలమైన శత్రువుని ఎలా అంచనావెయ్యలేక చావుదెబ్బతిన్నాడో.. బైజూస్ రవీంద్రన్ కూడా డబ్బు యావలో పడి తన కంపెనీ ఫైనన్షియల్ హెల్త్ ఎలా ఉంది అనేది పట్టించుకోలేదు, లీగల్ గా ఏ ప్రమాదం ఎదురుపడుతుందో అని అంచనా వెయ్యలేదు. 

విదేశాలనుండి డబ్బు తెస్తున్నప్పుడు ఫారిన్ ఫండ్స్ రెగ్యులేషన్ యాక్ట్ కి లోబడి తీసుకోవాల్సిన కొన్ని అనుమతులు, కట్టాల్సిన కొన్ని లెక్కలు ఉంటాయి. వాటిని సమయానికి ఫైల్ చెయ్యలేదు. అంతే కాదు, తన బ్రాండ్ కి ఉన్న హైప్ ని మ్యాగ్జిమం ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలనే ఉద్దేశ్యమో ఏమో విదేశాల నుంచి మరింత పెట్టుబడులు తెచ్చుకోవాడానికి ఉవ్విళ్లూరాడు. లేని లాభాలు చూపించాడు. అలా తనకి తెలియకుండానే డబ్బు యావలో పడి చాలా తప్పులు చేసేసాడు. 

వీటితో పాటూ ఆన్లైన్ లో నడుస్తున్న తన బిజినెస్ కి ఆఫ్లైన్లో కూడా ఉనికి ఉండాలనుకుని ఎక్కడ పడితే అక్కడ బైజూస్ సెంటర్స్ తెరిచాడు. అమెరికాలో కుమాన్ తెలియని వాళ్లుండరు. అక్కడ తమ పిల్లల్ని కుమాన్ ట్యూషన్స్ కి పంపని భారతీయులు ఇంచుమించు ఉండేవారు కాదు. సరిగ్గా అలాంటి ఇమేజ్ సంపాదించడానికన్నట్టుగా ఆఫ్లైన్లో బైజూస్ సెంటర్స్ తెరవడం, భారీ జీతాలిచ్చి ఫ్యాకల్టీని పెట్టుకోవడం....ఇవన్నీ తడిసి మోపెడయ్యాయి. 

ఆశ పెద్దదైతే రిస్క్ పెద్దదౌతుంది. రిస్క్ పెద్దదైతే ప్రమాదమూ పెద్దగానే ఉంటుంది. 

బైజూస్ హడావిడి చూసి అనుమానాలొచ్చిన ప్రభుత్వ సంస్థలు కొన్ని లొసుగులు లాగగానే ఆర్ధికపరమైన తప్పులు చాలా జరిగినట్టు గుర్తించారు. ఆ వెంటనే రైడ్ చేసారు. బండారం బైట పెట్టారు. ఒక్కసారిగా బైజూస్ పతనమయ్యింది. విదేశీ ఇన్వెష్టర్స్ భయపడి వెనక్కి తగ్గారు. ఇప్పుడు డబ్బు లేనిదే వ్యాపారం నడపలేని పరిస్థితి. దానికి తోడు ఆర్ధికనేరగాడిగా ముద్ర. చెదిరిన తన కల. రవీంద్రన్ కన్నీటిపర్యంతమయ్యాడు. 

ఉద్దేశ్యపూర్వకంగా తాను తప్పు చెయ్యాలని దిగకపోయినా, కేవలం అత్యాశవల్ల బుద్ధి మారిపోయి అతని చేత తెలియకుండా కొన్ని తెలిసి కొన్ని తప్పులు చేయించింది. 

బైజూస్ రవీంద్రన్ స్టూడెంట్స్ కి పరీక్షల్లో ఎలా నెగ్గుకురావాలో పాఠాలు చెప్పాడు. అలాగే అత్యాశతో ఎలా ఓడిపొకూడదో తన జీవితంతో గుణపాఠం కూడా చెప్పాడు.

🍁🍁🍁🍁🍁🍁🍁

ఉప్పు గురించి....

 ఉప్పు గురించి మాట్లాడుకుని రెండేళ్లయింది కదా, మళ్ళీ ఒకసారి.

మనం ఎక్కువ ఉప్పు తింటే అంటే 10గ్రా కంటే ఎక్కువ తింటే మూత్రపిండాలు ఆ ఉప్పుని బయటకు పంపలేవు. అప్పుడు ఆ ఉప్పు రక్తం లో ఉండిపోతుంది దానివలన రక్తం గాఢత పెరుగుతుంది . పెరిగిన గాఢత తగ్గటానికి రక్తంలో నీరు చేరుతుంది. 

నీరు చేరిన రక్తం ఎక్కువయ్యి గుండెకి చేరుతుంది, ఈసారి గుండె గట్టిగాకొట్టి ఒక స్పందన లో పంపే రక్తం పరిమాణం పెరుగుతుంది. ఆ పెరిగిన పరిమాణం వలన రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. 

ఈ పెరిగిన ఒత్తిడి తట్టుకోడానికి మొదట్లో రక్త నాళాలు వ్యాకోచిస్తాయి, కానీ దీర్ఘకాలంలో గట్టిపడతాయి దానివలన సాగే గుణం కోల్పోతాయి. దాని వలన ఈసారి గుండె ఇంకా గట్టిగా, వేగంగాకొడుతుంది. దాంతో అప్పటికే సాగటం మానేసిన రక్తనాళాలు కుంచించుకు పోతాయి. 

రక్తనాళం వ్యాసార్థం తగ్గినపుడు బెర్నౌలి నియమం ప్రకారం ఒత్తిడి నాలుగు రేట్లు పెరుగుతుంది. అందుకని పెరిగిన ఒత్తిడి వలన ఎక్కువ రక్తం మూతపిండాల్లో వడకట్టబడుతుంది. అప్పుడు ఆ ఉప్పు మూత్రం లోంచి వెళుతుంది. అయితే దానికి మూత్రపిండాలు  వాటి సామర్ధ్యాన్ని దాటి మూడు నాలుగు రెట్లు పనిచేయాలి. అలా ఎక్కువ కాలం పనిచేయటం కుదరదు. 

ఈలోగా గుండె బలంగా కొట్టడానికి దాంట్లో ఉన్న కండరం సరిపోదు అందువలన కొత్త కండరాన్ని గుండె తయారు చేసుకుని దిట్టంగా తయారవుతుంది. అయితే అలా లావు అయ్యే క్రమంలో గుండె జఠరికలో ఉండే చోటు తగ్గిపోయి గుండె పంపు చేసే రక్తం తగ్గిపోతుంది. అలాగే గుండె పనిచేయాలంటే గుండెకీ రక్తం కావాలి కాబట్టి గుండెకి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు  అంతటి మందమైన గుండెకి రక్తాన్ని అందంచలేవు. 

అపుడు మనం ఏమాత్రం గుండె మీద భారం వేసినా అంటే పరిగెత్తినా, కడుపునిండా తిన్నా
చివరికి శృంగారంలో పాల్గొన్నా గుండెకి రక్తం సరిపోక ఛాతీ లో నొప్పి వస్తుంది. ఇంకాస్త ఎక్కువైతే గుండెపోటు వస్తుంది. 

ఈలోగా మెదడులో రక్త నాళాలు చాలా చిన్నవి మరియు సున్నితమైనవి. ఇవి కొన్ని సార్లు ఈ ఒత్తిడికి మూసుకుపోయి ఆ రక్తనాళం వెళ్లే మెదడు కణజాలం రక్తం అందక చనిపోతుంది. అయితే అలాచనిపోయేవి చుక్కంత ఉంటాయి. కానీ ఒక పది ఇరవై ఏళ్లలో  ఈ చుక్కలన్నీ కలిసి మెదడు పనితీరు బాగా దెబ్బతీసి మతిమరుపు, డెమెన్షియా మొదలైన ఇబ్బందులు వస్తాయి. 

ఇవి కాక ఒకేసారి రక్త పీడనం పెరిగి మెదడులో రక్తనాళం పగిలి అక్కడ రక్త స్రావం అయ్యి పక్షవాతం రావచ్చు, లేదా మెదడులో ఒకేసారి ఒత్తిడి పెరిగిఊపిరి ఆగొచ్చు. 

ఈలోగా మూత్రపిండాలు కూడా బాగా పని చేసి చేసి అలసిపోయి ఇక పనిచేయటం మానేస్తాయి. దాంతో రక్తం లో నీరు ఒంట్లో కి చేరి ఒళ్ళు ఉబ్బుతుంది. అలాగే యూరియా, క్రియాటినిన్ లు పెరిగి ఆయాసం వస్తుంది. ఊపిరితిత్తులు ఊది ఊది అలసిపోయి ఇక ఊపిరి తీయటం మానేస్తాయి.

కాబట్టి ఉప్పు తినాలా వద్దాఉప్పు రోజుకి ఐదు గ్రాములకి మించి తినకూడదు. పది గ్రాములు మనం సాధారణంగా తింటాం. లవణ ప్రియులు ఇరవై గ్రాములవరకు తింటారు. ఉప్పు తక్కువ తినటానికి కొన్ని చిట్కాలు.

1. ముందు తినే బల్ల మీద ఉప్పు తీసెయ్యాలి  అంటే కూర, చారులో ఉండే ఉప్పు చాలు. మళ్ళీ పెరుగులో, సరిపోలేదని అన్నంలో వేసుకోకూడదు. బదులు నిమ్మకాయ వాడొచ్చు.

2. యూట్యూబ్ లో చెప్పారని వండేటప్పుడు తగినంత ఉప్పు కాకుండా తక్కువ ఉప్పు వెయ్యండి, మెల్లిగా అలవాటు అవుతుంది.

3. పోపుల డబ్బాలో ఒక గిన్నెలో ఉప్పు వేసి పసుపు, కారం వెయ్యటానికి వాడే చిన్న చెంచా వాడండి. ఉప్పు వంటలో పిడికిలితో వెయ్యొద్దు.

4.ఆవకాయ లేనిదే తెలుగువాళ్ళకు ముద్ద దిగదు,ఒప్పుకుంటాను కానీ మూత్రపిండాలు ఒప్పుకోవు.కాబట్టి వారానికి ఒకసారి ముద్దపప్పుతో అంతే కానీ ప్రతి దోశకి ఒకజాడీ తినొద్దు.

5. అన్ని పచ్చళ్లకు పై నియమం పాటించాలి.

6.చిప్సు పొట్లంలో అందులో కనిపించని గాలి ఎంతో కనిపించని ఉప్పు అంత అలాగే, ఫ్రెంచి ఫ్రైసు, పాప్ కార్ను కూడా.

7. వంటలో ఉప్పు వేసేటప్పుడు అవి తినే అమ్మా నాన్నని,మీభోజనంలో ఉప్పు వేసుకునేటప్పుడు మీపిల్లల్ని తలుచుకోండి,అప్పుడు ఉప్పు తక్కువ పడుతుంది.

8. చివరిగా ఉప్పు కొనేటప్పుడు ఉప్పు కోసం పిడికిలి బిగించి రక్తం చిందించిన గాంధీ తాతని గుర్తుకు తెచ్చుకోండి. గాంధీ తాతలాగే మీరు కూడా ఈ దేశానికి అవసరం. 

జై హింద్.

శీర్షిక న్యాయం చేయండి

 శీర్షిక
న్యాయం చేయండి

 నిన్ను పచ్చి బూతులు తిట్టాలని ఉంది ఒక స్త్రీ ని ఏమని తిట్టాలో
 ఆమె మనసును ఎలా కలత చిందించాలో ఆ పదం నేను వాడలేను

 ఎందుకంటే నేను స్త్రీవాదిని
 ఫెమినిస్ట్ ని నీవు చేసిన మోసానికి నిన్ను వేశ్య తోటి పోల్చుదామంటే  ఆమె ఎవరిని మోసం చేయదు ప్రతి వాడిని సంతృప్తి పరిచి
 తన మనసును గాయాల వీణగా మార్చుకుంటుంది

 నిన్ను తిడితే స్త్రీ జాతి తలదించుకుంటుంది
 నా జన్మకు కారణమైన జాతిని తలదించుకునేలా నేను ఎలా చేయగలను

 ఇకపోతే యాసిడ్ దాడులు కత్తుల రక్తపాతాల తో మానవత్వాన్ని మంటగల్పలేను నా వ్యక్తిత్వాన్ని దిగదార్చుకోలేను

 స్త్రీలను అత్యాచారం చేస్తే ఎన్కౌంటర్లు చేస్తున్నారు మంచిదే
 మరి పురుషులను మోసం చేసి వారి మనసులతో ఆడుకునే వారిని ఏం చేయాలి

 నువ్వు చేసిన మోసానికి నాలో నేను మదన పడుతూ నిద్రలేని రాత్రులను గడుపుతూ ప్రతిక్షణం నిన్ను తలుచుకుంటూ ఇంకా నీపై ప్రేమను కురిపిస్తూ ఉండే పిచ్చివాడిని నేను

 కాలంలో కమ్మని కలగా పరిచయమయ్యావు
 పీడకలగా గుర్తిండి పోయేలా చేశావు
 అయినా స్త్రీ మోసపోతే 
 వత్తాసు పలికి గొంతెత్తి అరిచి
 గొంతులు చించుకునే సమాజం ఇది

 మరి పురుషుడు మోసపోతే
 అరిచేవారు ఎవరు అండగా నిలబడే వారు ఎవరు
 స్త్రీ పై అత్యాచారం జరిగితే లోకంలో ఎక్కడా లేని మానవత్వం ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెగుతాయి 

 కానీ పురుషుడి మనసు పై అత్యాచారం జరుగుతుంది
 అది ఏ డాక్టర్ కూడా బాగు చేయలేకపోతున్నాడు దానికి ఒక్క స్త్రీకి కూడా శిక్ష పడడం లేదు

 మానసిక డాక్టర్లను అడగండి మా మనసు ఎంత చిత్రమయిందో

 స్త్రీ లోకమా మీకు పాదాభివందనం
 మా మనస్సులతో ఆడుకోకండి
 మావి సున్నితమైన మనసులు
 మా కోసం చట్టాలు లేవు సంఘాలు లేవు
 దయచేసి మాకు న్యాయం చేయండి


 ఇట్లు
 మీ
Chanti❤️