Thursday, January 2, 2025

 *దైవానుగ్రహం.....*

*మనకి అనుభవంలోకి వచ్చిన ప్రయోజనం వెనుక అవ్యక్తంగా ఉన్న పరమాత్మను గుర్తిస్తే దైవానుగ్రహం నిరంతరంగా ఎలా వర్షిస్తుందో తెలుస్తుంది. దైవం యొక్క స్వరూపమే అనుగ్రహం అనే విషయం అప్పుడు అర్థమవుతుంది.*

*తల్లి కడుపులో చిన్న వీర్యపు బిందువుగా మొదలైన మన జీవితం తొమ్మిది నెలల్లో చక్కని రూపుదిద్దుకోవడం మనకు అనుగ్రహంగా కనిపించటంలేదు. పుట్టినప్పుడు జానెడు పకందుగా ఉండి ఆ తర్వాత ఆరడుగులు పెరగడంలో ఆశ్చర్యం కలగటంలేదు.*

*కానీ ఎవరో ఎక్కడో ఏదో ఒక వస్తువు సృష్టించారని తెలిస్తే తెగ ఆశ్చర్యపోతాం. మనం అనుభవించటం మినహా స్వయంగా చేయలేని ఎన్నో విషయాలు ప్రకృతి మనకు అందిస్తుంది. మనతో నిమిత్తం లేకుండా జరిగిపోయే పనంతా దైవమే...*

*గులాబీ మొక్క నాటి నీళ్ళు పోస్తే, పువ్వు సిద్ధమవుతుంది. కానీ ఇది దైవానుగ్రహం అని మనకు అనిపించదు.*

*మామిడిపండులోని తియ్యదనం అంటే ఇష్టపడతాం. అది మనకు లభించటాన్ని అనుగ్రహం అంటాం. పండులో తియ్యదనం ద్వారా వ్యక్తమైన అనుగ్రహం భూమిలో టెంకె నాటినప్పుడే ఉంది.*

*రుచికరమైన వంటచేసి పెట్టినవారి శ్రమను గుర్తించి కృతజ్ఞతలు చెప్తాం. కానీ అసలు ఆ వంటకు మూలమైన ఆహార పదార్థాలను అందించిన దైవానుగ్రహాన్ని మనం గుర్తించం.*

*ఈ సృష్టి అంతా దైవానుగ్రహంగా వ్యక్తమవుతుంటే... కొంత మంది మాత్రం పరిమిత ఫలాల్ని ఆశించి అవి నెరవేరటాన్ని బట్టి అనుగ్రహాన్ని కొలతలు వేసుకుంటారు...*

     *🔱|| ఓం నమః శివాయ ||🔱*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁

No comments:

Post a Comment