Saturday, January 4, 2025

 ఆత్మీయ బంధు మిత్రులకు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు 💐🌹🥭🍫లక్ష్మి పద్మావతీ సమేత తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారు,మా ఇంటి దైవం  శ్రీ రామభక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు  శ్రీ వల్లీ దేవసేన సమేత తిరుత్తని శ్రీ సుబ్రమణ్య స్వామి వార్ల అనుగ్రహంతో  మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ఈ రోజు జన్మదినోత్సవాలు మరియు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాశీస్సులు శుభాకాంక్షలు  తెలియజేస్తూ 🙌🙌🙌💐💐🥭🥭🌹

*శని వారం : 04-01-2025*
 ఈరోజు *AVB* మంచి మాట...లు 
     
         *భయపడుతూ కూర్చుంటే*
*బతకలేవు.*
*తప్పో, ఒప్పో*
*ఒక అడుగు ముందుకేసి చూడు..*
*గెలుపు అయితే*
*ముందుకు నడిపిస్తుంది.*
*ఓటమి అయితే*
*తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది.*

        *స్నేహం, డబ్బు,*,
*నూనె, నీరు లాంటివి.* *అవి ఎప్పుడు కలవవు*
*డబ్బును చూసో,*
*అందం చూసో*
*స్నేహం పుట్టదు..*
*అది మనసులో కలిగే*
*ఓ అందమైన భావన..!!*

            *అవమానం జరిగే చోట*
*నేర్చుకోవాల్సింది....తిరిగి*
*నిలబడే ధైర్యాన్ని...అంతే కానీ*
*తిరిగి అవమానించే గుణాన్ని కాదు....!!*

          *జీవితం సమస్య కాదు...*
*నీవు పరిష్కరించడానికి...*
*అది నీవు అనుభవించవలసిన*
*ఒక నిజం......!!*

         *నీకు కష్టకాలం వచ్చిందని*
*ఎన్నడూ బాధ పడకు....*
*అదే రాకపోతే నీ జీవితంలో*
*నీకు నీ వారెవరో....*
*పరాయివారెవరో...*
*ఎప్పటికీ తెలియదు.....!!*

          *నీ గతం నిన్ను ప్రశ్నిస్తే...*
*వెంటనే జవాబు చెప్పకు...*
*గతం ఒక జ్ఞాపకమే తప్ప*
*అది నీకు కొత్తగా*
*చెప్పేది ఏం లేదు....!!*

         *సాఫీగా సాగిపోయే*
*జీవితం కోసం ప్రార్థించకు.*
*కష్టాల్ని తట్టుకుని నిలబడే*
*బలం కోసం ప్రార్థించు. జీవితంలో కష్టసుఖాలు లేకపోతె చప్పగా ఉంటుంది .*

          *మెట్లు చూస్తూ నిలబడిపోతే*
*మేడ ఎక్కలేం.*
*ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే..*
*విజయం సాధించలేం.*
*అడుగు ముందుకు వేసి*
*కార్యాచరణ మొదలు చేస్తేనే పని పూర్తి అవుతుంది .*

     ✒️*మీ .. ఆత్మీయ బంధువు.. *AVB సుబ్బారావు 9985255805

No comments:

Post a Comment