Wednesday, January 1, 2025

 *_మనం ఎంత గొప్ప వాళ్ళమైనా... ఏదో ఒక రోజుకి మనం ఉన్న ఇల్లు, స్థలము, మనకి కావాల్సిన వారందరిని వదిలేసి వెళ్లిపోవాల్సిందే._*

*_మనకంటూ సంబంధించింది ఏది మనతో రాదు. ఈ మనుషులు. ఈ ఆలోచన... ఈ జీవితం అంతా... మాయ..._*

*_సంకల్పం కోరికలు ఉరవడిలో కొట్టుకుపోయే మనసుకి ఆలోచించే సమయం అసలే దొరకట్లేదు._*

*_కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక అదేంటి అప్పుడే నా జీవితమంతా అయిపోయిందా.? అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే జ్ఞాపకాలుగా మిగిలిన గుర్తులు మాత్రం ఉంటాయి._*

*_కొంతమంది స్వార్థపరులు మిగిల్చిన కన్నీరు మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం పడిన కష్టం గుర్తుకు వచ్చిన ప్రతీ సారి గుండెను పిండేస్తూ ఉంటాయి. అవి మనకు తప్ప ఇంకెవరికి గుర్తుండదు._*

*_వారికి ఏదైతే అవసరమో దానికోసమే వాళ్లు కోరుకున్నది జరిగేవరకు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు... దాన్ని ప్రేమ, ఆప్యాయత అనుకుని పొరపడితే... ఆఖరికి బాధపడేది, గాయపడేది శూన్యమై మిగిలిపోయేది మనమే మిత్రమా..._*

*_మన అనుకున్న వాళ్లు మనలని ఏదో ఉద్ధరిస్తారనుకోవటం మన పిచ్చి, మన పొరపాటు..._*

*_మనసు పిచ్చిది అది సాగరంలా పరుగులు పెడుతూనే ఉంటుంది. కోరికలు కెరటాలై ఎగసిపడుతూనే ఉంటాయి. ఆ సముద్రానికి కూడా ఆనకట్ట ఉన్నట్టే నీ ఆలోచనలకు కూడా ఒక అనకట్టు వేసుకో..._*

*_అందులో మంచి ఏంటో, చెడేంటో అన్నది విచక్షణతో నిర్ణయం తీసుకుని అడుగులు వెయ్యి._*

*_నీ జీవిత పయనంలో ఎంతమందిని చూసావో.  ఎంతమందితో మాట్లాడావో... ఎన్నో వేల  కోట్ల కిలోమీటర్లు  దాటుకుంటూ ప్రయాణం చేసావో... నీకు తెలియని, నువ్వు చూడని వసంతాలు ఏమున్నాయ్._*

*_ఋతువులు ఎన్ని మారినా... మారని మన తలరాతలు అలానే ఉన్నాయ్. మన జీవితంలో కొన్ని ఇవ్వాలి , మరికొన్ని తీసుకోవాలి. స్వార్థం ఉండొచ్చు, తప్పులేదు._*

*_కోరికలు ఉండొచ్చు. మోసంతో కూడిన ప్రవర్తన ఉండకూడదు. లైఫ్ ఎండింగ్ ఎలా ఉండాలి అంటే మన చావుని చూసి ఆ స్మశానం కూడా కన్నీరు పెట్టేలా ఉండాలి. అదే కదా జీవితం అంటే...☝️_*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🪷🪷🪷🌷🙇🏻🌷 🪷🪷🪷

No comments:

Post a Comment