Wednesday, January 22, 2025

 ☘️ *సూర్యుడు :-  గ్రహం, నక్షత్రం*  ☘️

గ్రహం అంటే గ్రహించేది సూర్యుడు గ్రహం భూమి ఉన్న సకల చరా చర  జీవుల కర్మ ను గ్రహించే వాడు .

 ఇప్పుడు భౌతిక శాస్త్రం దృష్ట్యా సూర్యుడు కేవలం నక్షత్రం మాత్రమే కాదు . ఒక ఆదర్శవంతమైన "కృష్ణ వస్తువు". 

 ఆదర్శవంతమైన  "కృష్ణ వస్తువు"  యొక్క నిర్వచనం ఏమిటంటే ఆ వస్తువు రకాల పౌనః పుణ్యాలు శోషించుకుంటూ ఉంటుంది . భూమి మీద కాలం అనేది ఒక పౌనః పుణ్యం. ఉన్న ఒకే కాలం భూమి మీద అనేక ఆలోచనా  పౌనః పుణ్యాలతో  జీవిస్తూ ఉన్న జీవుల యొక్క కర్మను సూర్యుడు అనే గ్రహం శోషించుకొంటూ ఉంటుంది . ఆధునిక భౌతిక శాస్త్రం దృష్ట్యా సూర్యుడు ఒక  నక్షత్రం + మరియు ఆదర్శవంతమైన "కృష్ణ వస్తువు" .

i) ప్రశ్న :-  భౌతిక శాస్త్రంలో  సూర్యడు కేవలం నక్షత్రం ఎప్పుడు అవుతాడు ? 
 
 సమాధానం :- కేవలం ఆస్ట్రోనమి  అంటే ఖగోళ శాస్త్రం చదివేటప్పుడు .

ii) ప్రశ్న :-  భౌతిక శాస్త్రంలో  సూర్యడు కేవలం ఆదర్శవంతమైన "కృష్ణ వస్తువు" ఎప్పుడు అవుతాడు ?  

సమాధానం:-  థర్మల్ రేడియేషన్ , లేదా ఎలక్ట్రో మాగ్నెటిక్ థియరీ చదివేటప్పుడు మాత్రమే ఆదర్శవంతమైన "కృష్ణ వస్తువు" గా సూర్యుడు గోచరిస్తాడు . 

వేదం ప్రోక్తం అయిన జోతీష్య  శాస్త్రం దృష్ఠ్య సూర్యుడు 

1). ఒక నక్షత్రం 

2). ఒక భగవంతుడు 

3). గ్రహం 

4). ఉపగ్రహము కూడా ఎందుకంటే పరమాత్మకు జీవుల కర్మల రిపోర్ట్ డేటా పంపే సాటిలైట్ కాబట్టి. 

5) . అనేక రకాల పౌనః పుణ్యాల రేడియో ధార్మిక ప్రదర్శిస్తుంది కాబట్టి కృష్ణ వస్తువు. 

6) వెలుగు ప్రసాదిస్తాడు కాబట్టి జోతిష్ 

7) మిత్ర .. .........  

కొందరు అతి తెలివి గాళ్ళు  ఒకే  ఒక్క  దృక్ కోణంలో చూస్తున్నారు .  

అసలు ఈ యూరోప్ అమెరికా దేశాల శాస్త్ర వేత్తలకు సూర్యుడుని   ఆదర్శవంతమైన "కృష్ణ వస్తువు" గా ఎందుకు పరిగణించారు . కేవలం వేద ప్రోక్తమైన పద జాలం వలన.  "కృష్ణ" అనే సంస్కృత పదానికి "కర్మ" లేదా "యాక్షన్"  అనే భావం తీసుకోకుండా "నలుపు" లేదా "బ్లాక్" అనే పదం  ఆపాదించుకొన్నారు. ఎందుకంటే కర్మ అనే పదం ఆపాదించుకొంటే కర్మ సిద్దాంతం ఒప్పుకోవాలి . కర్మ సిద్ధాంతం ఒప్పుకుంటే హిందూ ధర్మ ఒప్పుకోవాలి . హిందూ ధర్మం ఒప్పుకొంటే భయపెట్టే బైబిల్ పక్కన పెట్టవలసి వస్తుంది .  అగ్గది లెక్క .
*****
సూర్యుడిని మన సంస్కృతి లో గ్రహం ఎందుకు అన్నారో, అలానే సూర్యుడిని వివిధ రకాలుగా ఎందుకు పిలిచారో దాని అంతరార్థం ఏమిటో ఈ పైన పోస్ట్ లో వివరించబడింది, ఇది యూట్యూబ్ లో satyanarahari mallisetty గారు కమ్యూనిటీ లో పోస్ట్ చేసిన పోస్ట్ .  

No comments:

Post a Comment