Tuesday, December 9, 2025

 *కాశీలోని ద్వాదశ ఆదిత్యులు - మొదటి భాగం*

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸 *హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ సందర్శించాలని ఆశిస్తారు. సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పురాణాలు పేర్కొన్న వారణాశి శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వార్ల నివాసం.*

🌿 *పావన గంగా తీరంలోని ఈ పుణ్య క్షేత్రంలో బహుళ సంఖ్యలో దివ్యారామాలు నెలకొని ఉన్నాయి. శివ, విష్ణు, గణపతి, దేవి, భైరవ ఆదిగా గల దేవీదేవతల ఆలయాల వెనుక ఉన్న విశేషాలను పురాణ ప్రాశస్తాన్ని కాశీ ఖండం విపులంగా వివరిస్తుంది.*

🌸 *ప్రత్యక్ష నారాయణుడు ఈ మందిరాలలో వర్తులాకార గ్రహ రూపంలో (అంటే ముఖము మాత్రమే) అధికంగాను, రెండు చోట్ల సంపూర్ణ రూపంలోనూ దర్శనమిస్తారు. అన్నిచోట్లా స్వామి సింధూర వర్ణ శోభితులే ! ఈ ద్వాదశ ఆదిత్య మందిరాలు అన్నీ దాదాపుగా ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా తెరిచే ఉంటాయి.*

🌿దేశం మొత్తం మీద సుమారు పది దాకా ఆలయాలలో మాత్రమే మూల విరాట్టుగా పూజలు అందుకొనే శ్రీ సూర్య నారాయణ స్వామి, కాశీలో ఏకంగా పన్నెండు ఆలయాలలో కొలువై ఉండటం ప్రత్యేకంగా పేర్కొనాలి. అవి..

🌹1) కేశవాదిత్యుడు:

🌸ఆదిత్యుడు ఈ క్షేత్రంలో విష్ణుమూర్తిని (కేశవుడు) గురువుగా స్వీకరించి, తపమాచరించి శివానుగ్రహం పొందాడు. అందుకే ఈయన కేశవాదిత్యుడు. శ్రీ ఆది కేశవ స్వామి ఆలయంలో (రాజ్ ఘాట్ ఫోర్ట్ దగ్గర రాజ్ ఘాట్ వేరు, రాజా ఘాట్ వేరు. గమనించ గలరు..) కొలువైన ఈ ఆదిత్యుని సేవిస్తే సద్గురు కృప లభిస్తుంది.

🌿విష్ణుమూర్తి కాశీకి వచ్చి, మొదటగా నివాసం ఏర్పరచుకున్న స్థలం ఈ ఆదికేశవాలయం. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతివారు తప్పక దర్శనం చేయాలి
                        
🌹2) మయుఖాదిత్యుడు:

🌸సూర్య భగవానుడు ధూత్ పాప, ధర్మ నదుల సంగమ స్థానం వద్ద  వైకుంఠ వాసుని ఉపదేశం మేరకు, విశ్వనాధుని అనుగ్రహం ఆపేక్షిస్తూ మహోగ్ర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సు వలన రోజురోజుకీ సూర్య కిరణాలు లోకాలు భరించలేనంతగా వేడెక్కిపోసాగాయి. సూర్య తాపాన్ని ప్రజలు తట్టుకోలేక పోయారు.

🌿గంగాధరుడు సాక్షాత్కరించి తన చల్లని హస్త స్పర్శతో ప్రచండుడిని చల్లబరిచారు. లోకాలకు ఉపశమనం కలిగించారు. నేటికీ ఈ మాయుఖాదిత్యుని విగ్రహం మీద నిరంతరం నీటి బిందువులు ఉండటం గమనించవచ్చును. ఇదే కిరణా నదీ ప్రవాహంగా మారి పంచగంగా ఘాట్ లో కలుస్తుందట. 

🌸సూర్యుడు ప్రతిష్టించిన పరమేశ్వర లింగం గాభస్తీశ్వరుడిగా, అమ్మవారు మంగళ గౌరి గా పంచ గంగా ఘాట్ లో కొలువు తీరి ఉన్నారు. సూర్యుడు కూడా మయూఖాదిత్యునిగా మంగళ గౌరీ ఆలయంలో వెలిసాడు. ఈ స్వామిని ఆరాధించిన వారికి అనారోగ్యం దరిచేరదు

🌿నిత్య జీవితంలోని అశాంతులు అన్నీ తొలగి పోతాయని విశ్వసిస్తారు.

🌸ఆలయ స్థల వివరాలు:
K-24/34, మంగళ గౌరీ ఆలయం, పంచగంగా ఘాట్ వద్ద ఉంది. ప్రత్యామ్నాయంగా, వారు బాలాజీ ఘాట్/పంచగంగా ఘాట్ వరకు పడవ ప్రయాణం చేసి మెట్లు ఎక్కవచ్చు
                                   
🌹3) గంగాదిత్యుడు:

🌸లలితా ఘాట్ వద్ద గల నేపాలీ మందిరం క్రింద భాగాన ఉన్న నెం. 1/68 వద్ద ఉంది నేపాలీ పశుపతినాథ్ ఆలయానికి దిగువన, భక్తులు గంగా ఆదిత్యుడిని కనుగొనవచ్చు గంగాదిత్యుని కొలిచిన వారికి ఎలాంటి ధననష్టం ఉండదని అపమృత్యు భయం ఉండదని చెప్తారు.
                         
🌹4) అరుణాదిత్యుడు:

🌿గంగ ఒడ్డున సూర్యుని సహాయం కోరి తపస్సు ఆరంభించాడు ఊరువులు లేకుండా జన్మించిన వినత పుత్రుడైన అనూరుడు. సంతుష్టుడైన రవి తన రధానికి సారధిగా నియమించుకున్నాడు.

🌸త్రిలోచన ఘాట్ లో, శ్రీ త్రిలోచనేశ్వర స్వామి మందిరంలో వెనక భాగాన ఉన్న శ్రీ ఆంజనేయుని  విగ్రహం క్రింద ఉన్న ఈ రూపాన్ని పూజిస్తే దారిద్య్రం దాపురించదని,

🌿సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన పరిపూర్ణ జీవితం సంప్రాప్తిస్తుందని చెప్తారు. అరుణ్ ఆదిత్య A-2/80, త్రిలోచన్ ఘాట్ వద్ద ఉన్న త్రిలోచనేశ్వర్ ఆలయంలో ఉన్నాడు. మచోదరి తర్వాత బిర్లా హాస్పిటల్ నుండి ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.
                               
🌹5) ఖగోళాదిత్యుడు:

🌸కద్రువ వద్ద దాస్యం తొలగిన తరువాత, వినత గరుత్మంతునితో కలిసి కాశీ చేరుకొని, తన తప్పులకు పరిష్కారం చేసుకోడానికి సూర్య భగవానుని ఖగోళాదిత్యుని రూపంలో కొలవసాగింది. శుభకరుడు సంతసించి ఆమె కుమారులు లోక పూజ్యులు అవుతారని ఆశీర్వదించాడు.

🌿మచ్చోదరి ప్రాంతంలోని శ్రీ కామేశ్వర స్వామి మందిరంలోని ఖగోళాదిత్యుని ఆరాధించిన భక్తుల సంతానం, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొంటారని  చెప్తారు.

🌸ఆలయ స్థల వివరాలు:
త్రిలోచనకు ఉత్తరాన A-2/9 వద్ద కామేశ్వర్ ఆలయం వద్ద ఉంది. మచోదరి అనే ప్రసిద్ధ ప్రాంతం నుండి ఆలయానికి చేరుకోవచ్చు
                           
🌹6) లోలార్కాదిత్యుడు:

🌿తులసీ ఘాట్ వద్ద, అసి మరియు గంగా సంగమ తీరంలో లోలార్క కుండం పక్కన కొలువుతీరి ఉంటారు లోలార్కాదిత్యుడు. నదీ సంగమ జలం అంతర్వాహినిగా కుండం లోనికి చేరుకుంటుంది. కుండంలో స్నానం ఆచరించి స్వామిని సేవించిన వారి కోర్కెలు శీఘ్రంగా నెరవేరతాయని చెప్తారు......సశేషం....💐🙏.               

No comments:

Post a Comment