,*_ఎంత గొప్ప స్థానంలో ఉన్నవారమైనా,ఎదుటివారిని ఆదరించే మంచివాళ్లమే అయినా.. మన మాటతీరు సరిగాలేకపోతే ఎవ్వరూ కూడా దరిదాపుల్లోకిరారు._*
*_అవతలివారి హావభావాలను,భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం అక్షరాలా ఒక కళే!_*
*_మన దృష్టికోణం నుంచి మాత్రమే ఆలోచిస్తూ మన భావాలను ఎదుటి వారి మీద రుద్దడానికి ప్రయత్నిస్తే ఎవరూ జీర్ణించుకోలేరు._*
*_మాట్లాడే సమయంలో అవతలి వారి గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూసుకోవాలి..అదే కదా..నీ సంస్కారం.నీ పెదవి దాటిన మాట పృధ్వి దాటుతుందని సామెత._*
*_అందుకనే మనం ఏం మాట్లాడబోతున్నామో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ముందే ఊహించు కోవాలి._*
*_అన్ని కోణాల్లోనూ ఆలోచించుకుని నలుగురిలో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి."ఆలోచన నెరిగి మాట్లాడాలి._*
*_నాలుక చివరనే లక్ష్మి తాండవిస్తుంది. అంటే మాట్లాడేతీరూ తెన్నును బట్టే సంపద లభిస్తుంది.నాలుక చివరనే బంధు మిత్రులుంటారు._*
*_అంటే.. మన మాటలవల్లే మిత్రులు దొరుకుతారు, బంధువులు లభిస్తారు.నాలుక కారణంగానే బందీఅయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మాటని అదుపు చేసుకుంటే జీవితంలో ఎదగగలవు.☝🏾_*
*_🙏🏾_*
No comments:
Post a Comment