Saturday, July 31, 2021

ఉచితం

ఉచితం

ఓ దొంగ ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు.

ఇంటి ముందు కాపలాగా ఓ కుక్క ఉన్నది. దొంగను చూసింది కానీ, ఏ చప్పుడు చేయకుండా చూస్తూ ఉండిపోయింది.

తనను చూసి కూడా మొరగని కుక్కను చూసిన దొంగ ఆలోచనలో పడ్డాడు. దొంగతనానికి వెళదామా? వద్దా ?? అని...

ఒకవేళ ఇంటి లోపలకు వెళ్ళాక కుక్క అరిచిందంటే ఏం చేయాలి. ఇప్పుడే అరిచినా వేరే ఇంటికి దొంగతనానికి వెళ్లొచ్చు అని అనుకున్నాడు.

ఇలా ఆలోచిస్తూ చివరగా తాను తెచ్చిన రొట్టెముక్కను కుక్కకు విసిరాడు.

అంతే, వెంటనే ఆ కుక్క గట్టిగా అరుస్తూ అతని వెంట పడి కొరకడానికి ప్రయత్నించింది.

అప్పుడు ఆ దొంగ కుక్కను చూసి... నన్ను చూసి కూడా అరవని నువ్వు ఇప్పుడు రొట్టె ముక్క ఇవ్వగానే అరుస్తున్నావు ఏంటి అని అడిగాడు...

నువ్వు ఊరికే ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు ఈ ఇంటి బంధువో లేక తెలిసిన వ్యక్తివో అయుంటావనుకున్నాను... కానీ, ఎప్పుడైతే నువ్వు నాకు ఉచితంగా రొట్టె ముక్క ఇచ్చావో అప్పుడే అర్థం అయింది నువ్వు దొంగవని అని చెప్పింది కుక్క.

మరి ఆలోచించవల్సిన విషయమే కదండీ ఇదీ...

ఉచితం అనగానే ఆలోచన మరిచి ఎగబడిపోతున్నారు జనాలు..

ఉచితంగా ఇచ్చారంటే అందులో ఎంతటి మర్మముందో అర్థం చేసుకున్నది కుక్క, కానీ, మనుషులైన మనం మాత్రం ఉచితంగా ఎందుకు ఇస్తున్నారో అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాం...

ఓ కుక్క గ్రహించినంత కూడా ఈ మానవులు గ్రహించలేకున్నారంటే బాధాకరమే మరి.

Source - Whatsapp Message

రహస్యం

🎊💦రహస్యం💥

 ❄️💎⛱️💦🌹🍓

ఎంత ఓపికతో ఉంటామో అంత

  "అగ్రస్థానం"

ఎంత దూరంగా ఉంటామో అంత

  "గౌరవం"

ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత
 
"మనశ్శాంతి"

ఎంత తక్కువ ఆశపడతామో అంత

  "ప్రశాంతత"

ఎంత తక్కువ మాట్లాడతామో అంత

" విలువ ".

  ఇదే జీవితంయొక్క రహస్యం.

🍁💖🐥🌷🦜

Source - Whatsapp Message

Friday, July 30, 2021

శ్వాస విజ్ఞానము

శ్వాస విజ్ఞానము:-

శ్వాసతో పుట్టిన మనం, శ్వాస విడిచి వెళ్లిపోయేలోపు అసలా శ్వాసనే గుర్తించకపోవడం, పట్టించుకోకపోవడం ఓ విచిత్రము. అట్టి శ్వాసను మనం గుర్తించకపోయినా, దాని శక్తిని మనం పట్టించుకోకపోయినా -- మనం మనకు తెలియకుండానే దాన్ని మనం ఉపయోగించుకొంటాము. ఉదాహరణకు, ఏదైనా బరువు ఎత్తేటప్పుడు కానీ, కాలువలు దాటవలసి వచ్చినప్పుడు కానీ అసంకల్పితంగానే మనం శ్వాసను బిగిస్తాము. కొన్ని సెకన్లు మాత్రమే జీవించే ప్రాణి నుండి బ్రహ్మం వరకు అందరూ శ్వాసిస్తారు. అలాగే శిలలు, పర్వతాలు, కొండలే కాకుండా ఆకాశం కూడా శ్వాసిస్తుంటుంది. సెకనుకు 18 కి.మీ.ల చొప్పున ఆకాశం వ్యాకోచిస్తుందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

❇️ శ్వాస - సోహం:-
మనం శ్వాస తీసుకున్నప్పుడు 'సో' అనే శబ్దం, వదిలేటప్పుడు 'హం' అనే శబ్దం వచ్చును. 'సో'లో 'ఓ' అనే శబ్దం, 'హం'లో 'మ్' అన్న శబ్దం అంతర్లీనంగా ఉన్నది. ఈ రెండు కలిపి 'ఓం' అవుతుంది. ఓం అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తి అనగా ఆదిపరాశక్తి. ఈ వివరణ మనకు తెలియక పోయినా, ఒక్కసారి మనము శ్వాస తీసుకుని వదిలినచో, ఆ ఆదిపరాశక్తి యొక్క ప్రభావం ఖచ్చితంగా మన మీద ఉండి తీరుతుంది అని ఋషుల వాక్కు.

శ్వాస ఎంత వరకు లోపలికి తీసుకుంటామో, అక్కడి నుండే మళ్ళీ వదలిపెడుతున్నాము. ఈ ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మధ్యన ఉండు బిందువు 'శక్తి' యొక్క స్థానం అని తెలుసుకుని, ఆ బిందువు మధ్య ఖాళీ జాగాపై దృష్టి ఉంచగలిగితే అదే 'ప్రాణాయామము' అనబడుతుంది.


❇️ శ్వాస - ఆయుష్షు:-
ప్రాణికోటికి భగవంతుడు ఆయుష్షును శ్వాస లెక్కలో ఇవ్వడం జరిగింది. నిమిషానికి ఎక్కువ శ్వాసలు ఖర్చుపెట్టినచో- తక్కువ ఆయుష్షు., మరి నిమిషానికి తక్కువ శ్వాసలు తీసుకున్నచో - ఎక్కువ ఆయుష్షు కలిగి ఉంటారు. సాధారణ మానవుడు సాధారణ కాలంలో నిమిషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటాడు. పరుగెత్తినపుడు, కోపంగా ఉన్నప్పుడు 18-24 సార్లు శ్వాసిస్తాడు. కామకేళి అనగా మైథున కాలంలో 35 సార్లు అంటే అన్నిటికన్నా ఎక్కువ శ్వాసలు ఖర్చు పెడతాడు. మనిషి సరాసరిన రోజుకు 21,600 సార్లు శ్వాసిస్తాడు.
➡️ కోతి నిమిషానికి 32 సార్లు శ్వాసించి 20 సంవత్సరాలు జీవిస్తుంది.
➡️ కుక్క నిమిషానికి 38 సార్లు శ్వాసించి 13 సంవత్సరాలు జీవిస్తుంది.
➡️ గుర్రం 19 సార్లు శ్వాసించి 35 సంవత్సరాలు జీవిస్తుంది.
➡️ తాబేలు నిమిషానికి 5 సార్లు శ్వాసించి 200 సంవత్సరాలు జీవిస్తుంది.


❇️ శ్వాస - నాడులు:-
మన శరీరములో 272000 నాడులున్నాయి. నాడులనగా ప్రాణవాయువు (శ్వాస) యొక్క రాకపోకలకు మార్గములు, నరములు కావు. ఈ 272000 నాడులలో 10 నాడులు ప్రధానమైనవి. వీటిని దశ నాడులు అని పిలుస్తారు. అవి..

1. ఇడ నాడి - ఎడమ ముక్కు రంధ్రం నందు
2. పింగళ నాడి - కుడి ముక్కు రంధ్రం నందు
3. సుషుమ్న నాడి - నాసికాగ్రం నందు
4. గాంధారి నాడి - కుడి నేత్రం
5. అస్తిని నాడి - ఎడమ నేత్రం
6. పూష నాడి - కుడి చెవి
7. యశస్విని నాడి - ఎడమ చెవి
8. ఆలంబన నాడి - నోరు
9. లకుహా నాడి - శిశ్నము
10. శంభని నాడి - గుదము

మరణం సంభవించినప్పుడు పైన ఉదహరించిన 10 ద్వారాలలో ఏదో ఒక ద్వారం గుండా ప్రాణం బయటకు పోవును.

వీటిల్లో అత్యంత ప్రధానమైనది 3 నాడులు. అవి
1. ఇడ నాడి - ఎడమ ముక్కు రంధ్రం నందు
2. పింగళ నాడి - కుడి ముక్కు రంధ్రం నందు
3. సుషుమ్న నాడి - నాసికాగ్రం నందు
మనం తీసుకుంటున్న శ్వాస కుడి ముక్కు ద్వారా ఎక్కువగా బయటకి ప్రవేశిస్తే సూర్యనాడి పనిచేస్తుందని, ఎడమ ముక్కు ద్వారా ఎక్కువగా బయటకు వస్తే చంద్ర నాడి పనిచేస్తుందని తెలుసుకోవలెను. సుషుమ్న నాడి యందు శ్వాస ఆడుతున్నప్పుడు రెండు ముక్కు రంధ్రాల గుండా శ్వాస బయటకు వస్తుంటుంది. ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు శ్వాస మార్చుకుంటున్నప్పుడు కొన్ని సెకన్లు మాత్రమే సుషుమ్న నాడి యందు శ్వాస నడుస్తుంది. ఈ సమయంలో మనం ఏమి ఆశించిన అవి సిద్దించును.
సూర్యనాడి ఉష్ణ శక్తికి, చంద్రనాడి శీతల శక్తికి ప్రతీకలు. అందువలన శీతల వ్యాధులకు సూర్యనాడి, ఉష్ణ సంబంధిత వ్యాధులకు చంద్రనాడి ఉపయోగకరము. మరి సూర్యనాడి నడుస్తున్నప్పుడు ఘన పదార్థాలు, చంద్రనాడి నడుస్తున్నప్పుడు ద్రవపదార్థాలు తీసుకోవడం ఉత్తమం. కొద్దిసేపు ఎడమ చేతి కింద ఒత్తిడి తెచ్చిన లేదా ఎడమ వైపు తిరిగి పడుకున్నా కుడి శ్వాస ఆడడం ప్రారంభమవుతుంది., అలాగే ఎడమ శ్వాసను నడపాలంటే కుడి చేతి కింద ఒత్తిడి తెచ్చిన లేక కుడి వైపు తిరిగి పడుకున్నా కొద్దిసేపట్లో ఎడమవైపుకు మారుతుంది.
స్త్రీ, పురుషులిద్దరూ ఒకే నాడి నడుస్తుండగా సంయోగం చేసినా అసలు గర్భధారణ జరుగదు. పురుషుని యొక్క ఎడమ స్వరం, స్త్రీ యొక్క కుడి స్వరం పని చేస్తుండగా సంయోగం జరిగితే పుత్రికా సంతానం కలుగుతుంది., అలాకాకుండా పురుషుని యొక్క కుడి స్వరం, స్త్రీ యొక్క ఎడమ స్వరం పనిచేస్తుండగా సంయోగం జరిగితే పుత్ర సంతానం కలుగుతుంది.

❇️ శ్వాస - పంచప్రాణాలు:-
శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి--
1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.

1.ప్రాణము:- అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.
2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.
3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు. ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.
4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.
5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.

❇️ శ్వాస - చక్రాలు:-
ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై
➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు
➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు
➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు
➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు
➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు
➡️ ఆజ్ఞా చక్రము నందు - 1000 సార్లు
➡️ సహస్రారము నందు - 1000 సార్లు
అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.

❇️ శ్వాస - అంగుళాలు:-
సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు. శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.
➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.
➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.
➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే - బ్రహ్మానందం కలుగుతుంది.
➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.
➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.
➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.
➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.
➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే - అదృశ్యం అవ్వగలరు.
మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు. అలాంటి వారు అమరులు అవుతారు.

❇️ శ్వాస - సృష్టి వయస్సు:-
మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన
➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.
➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.
➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.
➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.
➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) - 43,20,000 సంవత్సరాలు.

❇️ శ్వాస - సాధన:-
సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.
మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు. దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.
84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.

Source - Whatsapp Message

నోటితొందర

🌹నోటితొందర🌹

ఒకానొక రైతు తన పొలం రోజూ నాశనం అవుతుండటంతో.. పక్క పొలం రైతు పైన అనుమానం వచ్చింది..🙄
అనుమానం వచ్చిన వెంటనే.. అలోచించకుండా.. అతను కనపడగానే.. నోరు పారేసుకుని అనాలోచితంగా నానా మాటలు అనేసాడు..😬
మరుసటి రోజు పొద్దున.. ఒక గాడిద పొలంలోకి వచ్చి.. నాశనం చేస్తుంటే.. చూసి దాన్ని తరిమికొట్టి..
తన పక్క పొలం రైతు విషయంలో తాను చేసిన పొరపాటును తెలుసుకుని... సారీ.. అనే రెండు పదాల మాటని చెప్పడానికి వెళ్ళాడు..😯

అందుకు తన తోటి రైతు.. తనకి ఒక బ్యాగ్ నిండా.. ఎండిన ఆకులు ఇచ్చి.. ఊరి చివర పారేసి రమ్మని చెప్పాడు..
ఎందుకు చెప్పాడో.. అని ఆలోచిస్తూ.. చెప్పిన పని చేసి తిరిగి వచ్చాడు..😥
మళ్ళీ తను ఇచ్చిన బ్యాగులో.. పారేసినా.. ఆకులను తీసుకు వస్తే.. క్షమిస్తా అని చెప్పాడు..😏
ఆనందంతో.. రైతు.. అక్కడకి వెళ్ళి చూస్తే.. ఒక్కటంటే ఒక్క ఆకు కూడా లేదు..
వట్టి చేతులతో తిరిగి వచ్చి.. జరిగిన విషయం చెప్పాడు...😖

అందుకు తన తోటి రైతు.. నవ్వుతూ.. నోటి నుంచి వచ్చే మాట కూడా అంతే...😡
మట్లాడే ముందు ఆలోచించి మాట్లడితే.. అందరికి మంచిది... అని చెప్పి వెళ్ళిపోయాడు..🤔

అందుకే.. అనాలోచితంగా మాట్లాడే కొన్ని పదాలు మన తోటి వారిని ఎంతగానో బాధిస్తాయి.. బంధాలను తెంపెస్తాయి
అది పరాయివారయినా.. మన మిత్రులయినా.. బందువులయినా...🤕

ఆవేశంలో ఉన్నప్పుడు.. ఒకటికి రెండుసార్లు ఆలోచించి... తరువాత మాట్లాడండి.. కాలు జారితే వెనుకకు తీసుకోవచ్చు... నోరుజారితే ఆ మాటను వెనుకకు తీసుకోలేము.. నాలుకను మించిన ఆయుధం మరొకటి లేదు... అది బంధాలను కలపవచ్చు, చిటికెలో తెంచవచ్చ్చు . నాలుకను అదుపులో పెట్టుకోగలిగిన వారు జీవితాన్నే అదుపులో పెట్టుకోగలరు. 💥నాలుక అదుపుతప్పితే సర్వం నాశనమే.💥

💥 సర్వేజనాః సుఖినోభవంతు💥

Source - Whatsapp Message

విజయం అంటే ఏమిటి ?

విజయం అంటే ఏమిటి ?.....

మన దేశం నుండీ ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీ లో విద్యార్థులతో మాట్లాడుతూ '' విజయం అంటే ఏమిటి? '' అని అడిగితే ఒక యువతి '' విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం , '' అనింది.
అపుడు ఆ ప్రొఫెసర్ '' అయితే ఇరవైఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవుంతుడు ఎవరో చెప్పండి? '' అంటే ఎవరూ చెప్పలేదు. [ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి] బ్ర్తతకడానికి కొంత డబ్బు కావాలి కానీ , డబ్బే బ్రతుకు కాదు. అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట.
మరో యువకుడు లేచి '' విజయం అంటే బలం / శక్తి '' అన్నాడు. అలా అయితే అలెగ్జాండర్ , నెపోలియన్ ,ముస్సొలిని ,హిట్లర్ , స్టాలిన్ , బిన్ లాదెన్ ... వీళ్ళంతా బలవంతులు , ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా , వీళ్ళు జీవితం లో సంతోషంగా వుండగలిగారా ? వీళ్ళ జీవితాలు ఎలా గడిచి , ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా ! తన బలంతో , తన ముష్టిఘాతాలతో మహా బలవంతులను మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్ , తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు. అయితే విజయమంటే బలం / శక్తి సంపాదన కాదు అన్నమాట.
మరో యువతి '' విజయమంటే ప్రఖ్యాతి , అందం ,'' అనింది. అయితే కేట్ మోస్ , జీన్ ష్రింప్టన్ , సోఫియాలారెన్ , మార్లిన్ మన్రో ...లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు. భారత్ విషయానికొస్తే , పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే , అమితాబ్ బచ్చన్ తో సహా , ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకొనని హిందీ సినిమా హీరో నే లేడు. డానీ, కబీర్ బేడీ , మహేష్ భట్ లతో ఆమె ప్రేమ , పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర , రాజేష్ ఖన్నా , అమితాబ్ బచ్చన్ .. ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే. కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి , నమ్మిన వాళ్ళు మోసం చేస్తే , తాగుడుకు బానిస అయ్యి , ఒక దశలో కాలికి కురుపు లేచి , అది ఒళ్ళంతా ప్రాకి , ఏ శరీరం కోసం అయితే అంతమంది మగ వాళ్ళు పిచ్చిక్కెపోయారో , అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే , ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని , జనం ఆమెను తాళ్ళతో కట్టి , ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని కంప్లైంట్ చేస్తే , కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు. అయితే అందం , ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట .

మరోసారి మరొకరు '' విజయమంటే అధికారం '' అని అన్నారు. అయితే '' కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి '' అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు. మా అనంతపురంలో ఒకప్పుడు రాష్ట్రపతి గా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి , పందులు దొర్లుతున్నాయి. విజయం అంటే అధికారం కాదు అన్న మాట.

చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీ లో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు - '' విజయం అంటే ఏమిటి ? '' అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు , '' మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా ? '' అందరూ '' తెలుసు '' అన్నారు. '' వాళ్ళ అవ్వ , తాతల పేర్లు తెలుసా ? ''అని అడిగితే అయిదారుమంది ''తెలుసు '' అన్నారు. '' వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా ? '' '' తెలియదు '' అన్నారు.
అపుడు ప్రొఫెసర్ గారు '' శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , బుద్ధుడు , ఆదిశంకరుడు , అందరూ '' ఓ , తెలుసు '' అని ముక్తకంఠం తో బదులిచ్చారు. '' మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు ? ''
అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి , ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు తిరుగుతుండగా ఇలా అనింది : '' సార్ , మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం , రాముడు , కృష్ణుడు , బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం ఇదే : '
తమ కోసం , తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది , ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే ! ''

'' నా గురించి నేను దు:ఖించకపోవడమే నా ఆనందానికి కారణం '' అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట , '' ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు , అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క '' [ Only they live who live for others , the others are more dead than alive] అని వివేకానంద 1896 లో అన్న మాట ఇదే కదా.

Source - Whatsapp Message

నేటి మంచిమాట

🌷నేటి మంచిమాట

మనకు సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు...

గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి...

స్నేహం నేర్పలేని జాగ్రత్తలు మోసం నేర్పుతుంది...

అందుకే ఏది జరిగినా మన మంచికే...
ముందు నీకేంకావాలో తేల్చుకో , నీవు ఏమి కోరుకుంటున్నావో తెలుసుకో రెండిటిమధ్య దూరం ఎంత తగ్గించగలిగితే అంతదుఃఖం నీనుండి దూరమైనట్లే
ఆలోచన నిద్ర పోనివ్వలేదు,

అంటే. ..

అది మనం సాధించాల్సింది అయినా అయ్యుండాలి. లేదా
బాధించేది అయినా అయ్యుండాలి.!!
మనిషి తీర్చుకొనే ప్రతీకారం కంటే కాలం చెప్పే సమాధానం చాలా గొప్పది


ఏ కాంతాన్ని ఇష్టపడు, అది నిన్ను ఒంటరి తనాన్ని దూరం చేస్తుంది..!

కాలంతో స్నేహం చెయ్యి,ప్రతి క్షణం తోడుగా ఉంటుంది..!

భవిష్యత్తు కు ప్రేమను పంచు, అది నీ జీవిత గమ్యాని కి దారి చూపిస్తుంది..!

నీ కన్నిటికి దైర్యం నేర్పు, కష్టం కూడా నీకు దాషోహం అవుతుంది..

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

జీవితం సమాహారం

💦జీవితం సమాహారం🎊
🕉️🌞🌎🏵️🌼🚩

జీవితం అంటేనే ఆటుపోట్ల సమాహారం. అందులో ఎప్పుడూ విజయాలే ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఒకోసారి పరాజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ పరాజయాలనే పరమపదసోపానాలుగా మల్చుకుంటే బతుకు కావడికుండలాగా సమంగా సాగిపోతుంది. ఇంతకీ ఆ పరాజయాలు నేర్పే పాఠాలు ఏమిటో!

డబ్బు విలువ నేర్పుతుంది
చాలా పరాజయాలు ధననష్టంతోనే ముడిపడి ఉంటాయి. అప్పటి వరకూ ఈ చేతికి తెలియకుండా ఆ చేతితో ఖర్చుపెట్టేసిన బంగారుబాబులకి దరిద్రం ఎప్పుడైనా, ఎవరినైనా వరించవచ్చని తెలిసొస్తుంది. నిజంగా అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బు లేకుండా పోవచ్చునని అర్థమవుతుంది. వెరసి... డబ్బు విలువ తెలిసొస్తుంది.

మనుషుల విలువ నేర్పుతుంది
‘విజయానికి బంధువులు ఎక్కువ’ అని పెద్దలు అంటూ ఉంటారు.కాస్తంత కష్టం రాగానే తుపాకీ దెబ్బకి కూడా దొరక్కుండా మన చుట్టుపక్కల జనాలంతా కనిపించకుండాపోవచ్చు. అలాంటి కష్ట సమయాల్లోనే ఎవరు మనవారో, ఎవరు కాదో అర్థమవుతుంది. ఇతరుల దృష్టిలో మన విలువ ఏమిటో తెలిసొస్తుంది. ఎవరి తత్వం ఏమిటో బోధపడుతుంది.

వినయం విలువ నేర్పుతుంది
అంతాబాగున్నప్పుడు ఎగిరెగిరి పడుతూ ఉంటాము.మనంతటి వాడు లేడని మిడిసి పడుతూ ఉంటాము. ఒక్కసారి ఎదురుదెబ్బ తగిలితే కానీ మనం కూడా సాధారణ మనుషులమే అని తెలిసిరాదు. కష్టాలకీ, కన్నీళ్లకీ, పరాజయాలకీ, పరాభవాలకీ ఎవ్వరూ అతీతం కాదని తెలిసొస్తుంది. అంతేకాదు! ఇతరులని కూడా ఇక నుంచి గౌరవంగా చూడాలనీ, వినయంతో మెలగాలనీ అనిపిస్తుంది.
లక్ష్యం విలువ నేర్పుతుంది
కష్టపడితే ఏదీ కాళ్లదగ్గరకి రాదు. అలా వచ్చేదానికి విలువ ఉండదు.లక్ష్యం ఎంత అసాధ్యంగా ఉంటే దాని ఛేదనలో అంత తృప్తి ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఆ లక్ష్యాన్ని తప్పిపోయినప్పుడు దాని విలువ ఏమిటో తెలిసొస్తుంది. దాన్ని ఏలాగైనా ఛేదించి సాధించాలన్న పట్టుదలా పెరుగుతుంది.

జీవితం విలువ నేర్పుతుంది
అప్పటివరకూ ఎడాపెడా సాగిపోయిన జీవితం పరాజయంతో ఒక్కసారిగా నిలిచిపోయినట్లు అవుతుంది. ఆ క్షణంలో మనకి కాలం, కష్టం, కరుణ, దురలవాట్లు, సంతోషం, అడ్డంకులు, ప్రణాళికలు... వంటి అనేక విషయాల గురించి అవగాహన ఏర్పడుతుంది. మన వ్యక్తిత్వం గురించీ, ఆలోచనా విధానం గురించి ఒక స్పష్టత కలుగుతుంది.

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Thursday, July 29, 2021

నవ్వు నలభై విధాల మేలు

😄నవ్వు నలభై విధాల మేలు😅
😀😃😄😁😆🤣😇😜🤪🤓

మనిషి స్వభావాల్లో ఎక్కువ ప్రమాదకరమైనది కోపం.
దానికి విరుగుడు హాస్యం. హాస్యచతురత అలవడితే కోపాన్ని నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. అవతలివారి కోపాన్ని చల్లార్చేందుకూ హాస్యం ఉపకరిస్తుంది.

కొన్ని ఉదాహరణలు చూద్దాం.

👉 పేద కుర్రవాడొకడు హోటల్లోకి చొరబడి, మస్తుగా ఫలహారాలు సేవించాడు. సొమ్ము చెల్లించమనేసరికి డబ్బులు లేవని బిక్కమొహం వేశాడు.

ఆ యజమానికి కోపం ముంచుకొచ్చింది. చాచిపెట్టి
గూబమీద కొట్టాడు. పిల్లవాడు ఆ దెబ్బకు గిర్రున తిరిగి కిందపడ్డాడు.

కాసేపటికి తేరుకొని, మెల్లగా 'అయ్యా! ఈ లెక్కన నేను రోజూ రావచ్చా' అని అడిగాడు. యజమానికి ముందు నవ్వు వచ్చింది. ఆ తరవాత కన్నీళ్లు వచ్చాయి. కుర్రవాడి మీద అంతలా కోపం ప్రదర్శించినందుకు సిగ్గుపడ్డాడు.

హాస్యప్రవృత్తి మనిషిని ఆరోగ్యవంతుణ్ని చేస్తుంది. 'రోజుకు ఒకసారైనా మనసారా బిగ్గరగా నవ్వని రోజు జీవితంలో వృథా అయినట్లే' అన్నాడొక రచయిత.

'నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అని ప్రముఖ సినీదర్శకులు జంధ్యాల చెప్పిన మాట తెలుగునాట విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

సృష్టిలో నవ్వగలిగే జీవి మనిషి ఒక్కడే! కనుక నవ్వు మనిషిసొత్తు.

నవ్వు నాలుగు విదాల చేటు అనేది నమ్మదగిన మాటకాదు. నవ్వుకుని వదిలేయవలసిన మాట.

'నాలో హాస్యప్రవృత్తి లేకుంటే నేను ఏనాడో ఆత్మహత్యకు పాల్పడవలసి వచ్చేది' అన్నారు గాంధీజీ.

కోపంలోంచి, నిరాశలోంచి తేలిగ్గా బయటపడటానికి మనిషి హాస్య చతురతను అలవరచుకోవాలి.

👉 ఒక మంత్రిగారి సుపుత్రుడు కళాశాలలో బాగా అల్లరి చేసేవాడు. ఉపాధ్యాయులను ఏడిపించేవాడు. వాణ్ని ఏమీ చెయ్యలేక ఒక తెలుగు మాస్టారు 'ఓరి ఇరవై అయిదూ, ఇరవై ఆరూ! నోర్మూసుకు కూర్చో' అనేవారు.

అది తిట్టో ఏమిటో అర్థమయ్యేదికాదు. చివరికి కళాశాల ఫేర్‌వెల్‌ ఫంక్షన్ లో కొందరు విద్యార్థులు 'గురువుగారూ ఇవాళ చివరిరోజు కదా, ఇవాళైనా ఆ ప్రహేళిక విప్పండి' అని అడిగారు.

దానికి ఆయన 'తెలుగు సంవత్సరాల పేర్లు వెతుక్కోండి' అన్నారు.

తీరాచూస్తే ఇరవై అయిదు-ఖర, ఇరవై ఆరు- నందన!

"ఖర నందన"

అంటే, రోజూ వాణ్ని 'గాడిదకొడకా' అని ఆయన కసితీరా తిట్టేవారన్నమాట.

👉 అప్పట్లో కేంద్రమంత్రులు సంప్రదాయ అంబాసిడర్‌ కార్లు వదిలేసి, విదేశీ వాహనాల కొనుగోలుపట్ల మొగ్గు చూపడంపై చట్టసభలో పెద్ద దుమారం రేగింది.

పెద్దపెద్ద విదేశీ కార్లలో మహారాజుల్లా తిరగడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ఘోరం.
అంటూ ప్రతిపక్షసభ్యులు విరుచుకు పడ్డారు.
సభలో ఉద్రిక్తతలు చెలరేగాయి.

అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి లేచి 'అవును నాకు ఇష్టం లేదు... అంతపెద్ద కారులో నావంటి పొట్టివాడు కూర్చుంటే బయటికి అసలు కనపడడు' అన్నారు. సభ గొల్లుమంది. గాంభీర్యం తొలగిపోయింది. హాస్యస్ఫురణ కారణంగా ఒకోసారి అనుకోని ప్రయోజనాలు చేకూరుతాయి.

👉 చైనా దురాక్రమణ సందర్భంగా మనదేశం కోల్పోయిన భూభాగం విషయమై డాక్టర్‌ రాంమనోహర్‌ లోహియా ఆవేదనగా ప్రసంగిస్తున్నారు.

'గడ్డికూడా మొలవని వృథా భూభాగం కోసం ఇంత రభస చెయ్యాలా' అని నెహ్రూజీ ఆ వాదనను తోసిపుచ్చారు.

వెంటనే డాక్టర్‌ లోహియా 'మీ బట్టతలపై కూడా ఏమీ మొలిచే అవకాశం లేదుకదా, అదీ వృథా అని ఒప్పుకొంటారా' అని అడిగారు. అంతవరకూ ఆయన చేసిన ప్రసంగం సాధించలేనిదాన్ని ఈ ఒక్క చమత్కారపు ప్రశ్న సాధించింది. లోహియా హాస్య చతురతకు నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయింది.

మనిషి విరగబడి నవ్వినప్పుడు మెదడు నుంచి విడుదలయ్యే రసాయనాలు రక్తపోటును తగ్గించి, గుండెను తేలికచేస్తాయని సైన్సు నిరూపించింది. అందుకే వైద్యులు బాగా నవ్వమని సలహా ఇస్తున్నారు. నవ్వును ఒక చికిత్స (లాఫింగ్‌ థెరఫీ)గా ప్రయోగిస్తున్నారు.

దీని ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది.

'ఖరీదైన సౌందర్య లేపనాలకన్నా మనిషి మొహాన్ని ఆకర్షణీయంగా చూపించేది- పెదాలపై చక్కని నవ్వే'
😀😃😄😁😆😂🤣😇🤪😜

Source - Whatsapp Message

మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి

🕉️🌺🌼 మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి 🌺🌼
🥀 1. అర్ధ దోషం
🥀 2. నిమిత్త దోషం
🥀 3. స్ధాన దోషం
🥀 4. గుణ దోషం
🥀 5. సంస్కార దోషం.
🌺🌼 ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయి.
🍁 అర్ధ దోషం 🍁
🌺🌼 ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒకవ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతోవున్న మూటని ఇవ్వడం చూశాడు. భోజనంచేసి, సాధువు ఒకగదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే శిష్యుడు దాచినడబ్బు మూటవుంది. హఠాత్తుగా సాథువు మనసులో దుర్భుధ్ధి కలిగింది. ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తనసంచీలో దాచేశాడు. తర్వాత శిష్యుని వద్ద సెలవుతీసుకుని, తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసినపనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.
🌺🌼 తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనంవల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దున్నే మలంగా విసర్జించబడినతర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థంచేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతాచెప్పి, ఆడబ్బును తిరిగిచ్చేసాడు శిష్యుడిని "ఏవృత్తి ద్వారా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు?" అని అడిగాడు.
🌺🌼 శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బుకాదు". అని తలవంచుకొన్నాడు. ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం.
🍁 నిమిత్త దోషం 🍁
🌺🌼 మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమగల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాకకూడదు. ఆహారంమీద దుమ్ము, శిరోజాలవంటివి పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతివంట భుజిస్తే వారి దుష్టగుణాలు అవతలివారికి కలుగుతాయి.
🌺🌼 భీష్మాచార్యులవారు కురుక్షేత్రయుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధంముగిసేవరకు అంపశయ్యమీద ప్రాణాలతోనేవున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీకృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచిమంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు. అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది. "ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించి నప్పుడు ఎందుకు ఎదిరించలేకపోయారు?"అని అనుకొన్నది.
🌺🌼 ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు, "అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూవచ్చాను. నా స్వీయబుధ్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది. శరాఘాతాలతో, ఛిద్రమైన దేహంతో, ఇన్నిరోజులు ఆహారం తీసుకోనందున, ఒంట్లోఉన్న పాతరక్తం - బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను. నాబుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను" అన్నాడు భీష్ముడు. చెడ్డ గుణాలున్నవారు ఇచ్చింది తిన్నందువల్ల మనిషిలోని మంచి గుణములు నశించి 'నిమిత్త దోషం' ఏర్పడుతుంది.
🍁 స్ధాన దోషం 🍁
🌺🌼 ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలుండాలి. వంటచేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాలవల్ల చేయబడినవంట కూడా పాడైపోతుంది. యుధ్ధ రంగం, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివికావు.
🌺🌼 దుర్యోధనుడు ఒకసారి 56 రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి, విదురుని యింటికి భోజనానికెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమి పెట్టాలని ఆలోచించి, ఆనంద సంభ్రమాలతో తొందరపడి, అరటి పండు తొక్కవల్చి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు.
🌺🌼 ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధాభక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏదిచ్చినా సంతోషంగా తీసుకుంటాను"అని అన్నాడు. కనుక
మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి.
🍁 గుణ దోషం 🍁
🌺🌼 మనం వండే ఆహారం సాత్వికఆహారంగా వుండాలి. సాత్వికాహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకికమాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.
🍁 సంస్కారదోషం 🍁
🌺🌼 ఆహారం వండేవారి సంస్కారాన్నిబట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతివంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతివంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది.🕉

Source - Whatsapp Message

ఆశించటం (expectation) ఉంటుందో అక్కడ తిరస్కారం ఉంటుంది...

ఆధ్యాత్మికత యొక్క మూల సూత్రం ఏది ఆశించకపోవటం, ఎక్కడ ఆశించటం (expectation) ఉంటుందో అక్కడ తిరస్కారం ఉంటుంది, ఎక్కడ తిరస్కారం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది, ఆశించటం లేనిచోట తిరస్కారం ఉండదు, దుఃఖం ఉండదు, ఈరోజు ప్రపంచాన్నీ ఈ ఆశించటం (expectation) అన్నది భయబ్రాంతులని చేస్తుంది. నేను ఎవరి నుంచి ఏది ఆశించను, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను, వాళ్ళంతట వాళ్ళు వచ్చి సహాయం చేస్తాం అంటే కాదనను. ఇక్కడ ప్రతిఒక్కరు తమ తమ పూర్వజన్మల కర్మ సంస్కారాలని బట్టే కర్మలని చేస్తారు. ఇది అర్ధం చేసుకుంటే చాలు. - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ

Source - Whatsapp Message

ఎంగిలి దోషం

🦜🍎ఎంగిలి దోషం🍎🦜

మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి 'ఎంగిలి దోషం' అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు.

ఎంగిలి చాలా ప్రమాదకరం, ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే.

ఇంతెందుకు ! స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది, అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికి రాదు అని అర్థం..

పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. అది కనీసం మర్యాద. పొరపాటున కూడా పెద్దలు, గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు.

పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు. ఉపనయనంలో హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకముందు నేను ఎంగిలి తినడం వలన ఏదైనా పాపం వచ్చివుంటే అది శమించుగాక అని ప్రాయాశ్చిత్తం చేయిస్తారు. ఇక ముందు తినను అని అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు.

ఐదువేళ్ళతో నోటిలో నమలడానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి. నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకుని, అది నమలలేక, తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెప్తుంది.

పూర్వం మన ఇళ్ళలో ఎవరి కంచాలు, చెంబులు వారికే ఉండేవి. అతిథులు వచ్చినప్పుడు, వారికి వేరే పాత్రలలో ఇచ్చేవారు. ఒక 50 ఏళ్ళ క్రితం వరకు పేదవారి ఇళ్ళలో కూడా వెండి కంచాలు, చెంబులు ఉండేవి. వెండి అనేది చాలాశాతం క్రిములను తన ఉపరితలం మీద నిలువనీయదు. అది వాటిని నశింపజేస్తుంది. ఇంకొన్ని ఇళ్ళలో అయితే వెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడా కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు. ఇప్పుడు కూడా వెండి క్రిమిసంహారకమని శాస్త్రవేత్తలు ఋజువు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్ధమైందా మనము పూజల్లో వెండి వస్తువులకు ప్రాధాన్యం ఎందుకు ఇస్తామో ?!

వంట వండే సమయంలో సైతం మనవాళ్ళు మడి కట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. మాట్లాడితే పొరపాటున నోటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం.

కొందరు ఈనాటికి నిత్యపూజకు మడి నీళ్ళు పడితే చాలామంది వరలక్ష్మీ వ్రతం, వినాయకచవితి మొదలైన పర్వదినాలప్పుడు, పితృకర్మలు చేసే రోజుల్లో మడి కట్టుకుని నీళ్ళు పడతారు. ఆ దైవకార్యం పూర్తయ్యేవరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు, అశుభ్రంగా ముట్టుకోరు.

ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు. ఆహారం (అది ఏదైనా సరే) పడేయకూడదు. అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు. ఎంతకావాలో అంతే వడ్డించుకుని తినాలి. ఆహారం వృధ చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో నోటిద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని ఈ ఎంగిలిదోషాన్ని నిర్వచిస్తున్నారు.

ఎంగిలి దోషం అంటని మూడు పదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి.

1. చిలక కొరికిన పండు,
2. తేనెటీగ నోటిద్వారా తయారైన తేనె.
3 దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవుపాలు. వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనమూ సేవించవచ్చు.

వేద సంస్కృతి వల్ల మనకు లభించిన పూర్వ ఆచారాలను మన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధి కోసం పాటిద్దాం.

సర్వే జనాః సుఖినో భవంతు

Source - Whatsapp Message

అంతరాలు, ఓ చక్కని వ్యాసం

అంతరాలు, ఓ చక్కని వ్యాసం :-

1) చిన్నప్పుడు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు తినడానికి ఇంటినుండి అమ్మ చేసినవి తీసుకెళ్ళేవాళ్ళం, కొంతమంది రైల్లో కొనుక్కుని తినేవాళ్ళని చూసినపుడు మనమూ అలాగే కొనుక్కుని తినాలనిపించేది!
అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, అది మన స్థాయికి చేయదగ్గది కాదు, డబ్బులున్న గొప్ప వాళ్ళు చేసేది అని!

ఇప్పుడు పెద్దయ్యాక మనం కొనుక్కుని తినే టైంకి ఆ పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళు ఆరోగ్య రీత్యా ఆహారం ఇంటినుండి తెచ్చుకుని తింటున్నారు.

దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది .

2) చిన్నప్పుడు కాటన్ దుస్తులు వేసుకుంటే, కొంతమంది టెర్లిన్ బట్టలు తొడుక్కునే వాళ్ళు, అదిచూసి అటువంటివి కావాలనిపించినపుడు, నాన్న చెప్పే వారు అది ఖరీదైనది మనం అంత పెట్టగలిగేవాళ్ళంకాదని!

పెద్దయ్యాక మనం టెర్లిన్ వాడటం మొదలు పెడితే వాళ్ళు కాటన్ కు దిగారు ఇప్పుడు, కాటన్ దుస్తుల ధరే ఎక్కువ !

దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ..😒🤔

⚖⚖⚖⚖⚖⚖⚖

3) చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్న కాటన్ ప్యాంటుకే మోకాళ్ళ దగ్గర చినిగితే పారేసెందుకు మనసొప్పక అమ్మ లేదా టైలర్ తమ పనితనం చూపి నీట్ గా #రఫ్ చేసి ఇస్తే మళ్ళీ హ్యాపీగా వేసుకునేవాళ్ళం!

పెద్దయ్యాక చూస్తే జనం ఆ మోకాళ్ళదగ్గర చిరుగులు ఉన్నవాటిని ఫ్యాషన్ పేరుతో #అధికధరలకు కొంటున్నారు !

దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ...🤔😒

⚖⚖⚖⚖⚖⚖⚖⚖

4) ఓ వయసులో మనకు సైకిల్ కొనగలగడమే కష్టం, అదీ సాధించేసరికి వాళ్ళు స్కూటర్ నడిపించేవాళ్ళు, మనం స్కూటర్ కొనే సమయానికి వాళ్ళు కార్లలో తిరిగేవారు, మనం కొంచెం ఎదిగి మారుతి 800 కొనే సమయానికి వాళ్ళు BMW ల్లో తిరిగారు, మనం రిటైర్మెంట్ వయసుకి వచ్చిన కూడబెట్టుకున్న వాటితో కొంచెం పెద్ద కారు కోనేసమయానికి వాళ్ళు ఆరోగ్యావసరాలతో సైక్లింగ్ చేస్తున్నారు!

దాంతో ఇప్పటికి ఆ అంతరం
అలాగే ఉండిపోయింది . .🤔😒

ప్రతి దశలో ప్రతి సమయాన విభిన్న మనుషుల మధ్య స్థాయి అంతరం ఉండనే ఉంటుంది.

"ఆ అంతరం నిరంతరం" ఎప్పటికి ఉండి తీరుతుంది

రేపటిఆలోచనతో ఇవాళ్టిది వదులుకుని మళ్ళీ రేపటిరోజున గతించిన #ఇవాళ్టి గురించి చింతించేకంటే, ఇవాళ అందినదానితో ఆనందిస్తూ ఆస్వాదిస్తూ రేపటి స్వాగతం పలకడం శ్రేయస్కరం.

మన, మనవారి గురించి
కాలాన్ని వెచ్చిద్దాం
💐🌹💐🌹💐🌹💐🌹

మనం నవ్వుతూ ఉందాం😊
జీవితం కూడా సంతోషంగా ఉంటుంది * 😊

Source - Whatsapp Message

ఈనాటి జీవిత సత్యం.

ఈనాటి జీవిత సత్యం.

భరించరాని కష్టాలూ, నష్టాలూ ఎదురైనప్పుడు ధనికులైనా, దరిద్రులైనా, అధికారులైనా, పాలకులైనా, పండితులైనా, పామరులైనా భగవంతుడి వైపు చూస్తారు. గుడులకూ, గోపురాలకూ తిరుగుతారు. ఆధ్యాత్మిక గురువులను ఆశ్రయిస్తారు. తమ గోడు వెళ్ళబోసుకుంటారు. వారి దుఃఖాన్ని తగ్గించడానికి గురువులు ఏవో రెండు మంచి మాటలు చెబుతారు. పూర్వం అంతకన్నా కష్టపడినవారి ఉదాహరణలు చెప్పి ఓదారుస్తారు.

జపాన్‌లో ఇస్సా అనే ఒక ప్రముఖ కవి ఉండేవాడు. అతను హైకూ కవిత్వాన్ని ధారాళంగా ప్రవహింపజేసిన వాడు. అతని పూర్తి పేరు కొబయాషి ఇస్సా. జపాన్‌లో నలుగురు ప్రముఖ హైకూ కవుల్లో (ది గ్రేట్‌ ఫోర్‌) ఇస్సా ఒకరు. ఇస్సా అతని కలం పేరు. ‘టీ కప్పు’ అని దాని అర్థం. చిన్న వయసులోనే ఇస్సా ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎంతో దుఃఖాన్ని అనుభవించాడు. ఇస్సాకు మూడేళ్ళ వయసులో తల్లి మరణించింది. పెంచి పోషించిన అవ్వ అతనికి పధ్నాలుగేళ్ళు వచ్చేసరికి కన్ను మూసింది. తండ్రి మరొకరిని వివాహం చేసుకున్నాడు. ఇస్సాను అతని సవతి తల్లి ఎంతో హీనంగా చూసేది. అతనికి ముప్ఫై ఏళ్ళ వయసు రాకముందే... అయిదుగురు పిల్లలు ఒకరి తరువాత మరొకరు మరణించారు. ఆ తరువాత, అతను ఎంతగానో ప్రేమించిన భార్య మరణించింది. ఇలా జీవితమంతా విషాదాన్ని అనుభవించిన ఇస్సాకు... ఆ కష్టాలే కవిత్వాన్నీ, జీవిత తత్త్వాన్నీ తెలియజేశాయి.

రోగాలు, మరణాలు, కష్టాలు ఒకదాని తరువాత మరొకటి చుట్టు ముట్టేసరికి ఊపిరాడని ఇస్సా... ఆనాటి జెన్‌ గురువు ఒకరిని ఆశ్రయించాడు.‘‘ఎందుకు ఈ లోకంలో ఇంత బాధ ఉంది?’’ అని ప్రశ్నించాడు.

ఆ గురువు అతని వివరాలన్నీ అడిగాడు. ఇస్సా తన జీవితంలోని విషాదాన్నంతటినీ ఏకరవు పెట్టాడు.

‘‘నేను ఒక కవిని. ఎప్పుడూ ఏకాంతంగా, మౌనంగా ఉంటూ, నాకు తట్టిన ఆలోచనలను కవిత్వంగా మలిచాను. నా బాల్యంలోనే తల్లి, అవ్వ మరణించారు. ముప్ఫై ఏళ్ళు వచ్చేసరికి నా కళ్ళ ముందే అయిదుగురు పిల్లలు రాలిపోయారు. నా భార్య నాకు దూరమయింది. శాశ్వత నిద్రలోకి జారిపోయింది. నాకు తెలిసి ఎవరికీ, ఎప్పుడూ ఎలాంటి హానీ చేయలేదు. నాకెందుకు ఇంత దుఃఖం కలిగింది? ఈ చావు బతుకులేమిటి’’ అని తన వేదన వెళ్ళబోసుకున్నాడు.

ఆ జెన్‌ గురువు చాలా ప్రశాంతంగా ‘‘అంతే! అది అంతే! ఈ జీవితం ఉదయాన్నే పడే ఒక మంచు బిందువు లాంటిది. మరణాన్ని వెంట తీసుకురావడమే జీవిత లక్షణం. మరణానికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఉండాల్సిన పని లేదు. పొద్దున్నే ఒక ఆకు మీద కురిసిన మంచు బిందువు ఏ చిన్న గాలి వీచినా పడిపోతుంది. సూర్యోదయమై, ఎండ పడిన వెంటనే ఆవిరైపోతుంది. ఎవరి జీవితమైనా ఇంతేనని మరచిపోకూడదు. ఈ నిత్యసత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి’’ అని చెప్పాడు.

ఆ మాటలు ఇస్సాకు ఎంతో ఊరట కలిగించాయి. ఇవన్నీ అతనికి తెలియని విషయాలు కావు. కానీ గురువు నోటి నుంచి ఒక అద్భుతమైన నూతన శక్తితో అవి వెలువడ్డాయి. అందుకే ఆ మాటలు ఇస్సాకు ఔషధంలా పని చేశాయి. దుఃఖాన్నీ, విషాదాన్నీ విడిచిపెట్టి కవిత్వ రచనలో మరింతగా నిమగ్నమయ్యాడు. హైకూ రచనలో సమున్నతంగా నిలిచాడు.

నీతి : ఏది ఏమైనా కష్టాలు దుఃఖాలు బాధలు నష్టాలు అవమానాలు పొందినవారే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. ఈ లోకంలో జ్ఞానవంతులందరూ కూడా ఇలాంటి బాధలు అనుభవించిన వారే కదా. వారికి కలిగిన దుఃఖాలు బాధలతో పోల్చుకుంటే మనమేస్తితిలో ఉన్నామో ఆలోచించుకోండి.

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Wednesday, July 28, 2021

వాట్సప్ సమూహ వినియోగదారుల వింత లక్షణములు.

వాట్సప్ సమూహ వినియోగదారుల వింత లక్షణములు.

1. కుప్పరులు
వీరు రోజస్తమానం కుప్పలు తెప్పలుగా సమాచారమును సమూహములో గ్రుమ్మరించుచుందురు.

2. ఆకస్మికులు
వీరు అప్పుడప్పుడు తమ ఉనికిని తెల్పుటకు అసందర్భపు సమాచారమును సమూహములో ప్రచురించెదరు.

3. విధ్యుక్తులు
వీరు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లేదా రాత్రి వేళలో శుభోదయం, శుభరాత్రి లాంటి సమాచారములు మరియు లేదా పుట్టిన రోజు శుభాకాంక్షలు, వివాహ శుభాకాంక్షలు లాంటివి మాత్రమే సమూహములో ప్రచురించెదరు.

4.గవాక్షులు.
వీరు సమూహములో ఏమి జరుగుతున్నదో చూచెదరుకాని ఎటువంటి సమాచారమునూ ప్రచురించరు. బహుశా వీరికి సాంకేతిక పరిజ్ఞానం కాని భాషా పరిజ్ఞానం కాని లోపించి ఉండవచ్చు.

5. అవ్యవస్థితులు.
వీరు అనేక సమూహములలో సభ్యత్వం కలిగి ఉండుటచే ఏ సమాచారమును ఎక్కడ ముద్రించవలయునో అనే అయోమయావస్థితిలో ఉండి తను ప్రస్తుతం ఉన్న సమూహములోని సమాచారమును అదే సమూహములో ప్రచురించెదరు.

6. అనుక్రియాయులు.
వీరు సమూహములో ప్రచురించబడిన ప్రతి సమాచారమునకు, కార్యాలయంలో అధికారి ఎవరి ఉత్తరము వారికి తన వాఖ్యనము వ్రాసి ఏవిథంగా పంచునో ఆ విధంగా తన వాఖ్యనము తో విధిగా ప్రతిస్పందిస్తారు.

7. తంత్రజ్ఞులు.
వీరు తమ సమాచారములతో అందరూ ఏకభవించాలని ఆశిస్తారు.

8. పృథక్ లు.
సమూహములో వీరి ఉనికి మిగతా సభ్యులెవరికి తెలియదు. తామరాకు మీది నీటి బొట్టులాగా.

9.అసంబద్ధులు.
వీరు ప్రచురించే సమాచారమునకు సమయము సందర్భము ఉండదు. సాయంకాలమునకు శుభోదయ మన్నన ఉదయమున శుభ రాత్రి మన్నన లాంటివి ప్రచురించెదరు.

10. మేషియలు
వీరు తమ మేథస్సుననుసరించరు. తమకంటే ముందున్న సమాచారమును సరించి, తథనుగుణంగా సమాచారమును తప్పు ఒప్పు విచారణ విస్మరించి ప్రచురించెదరు.

11. తస్కరులు.
వీరు ఇంతకు ముందే ప్రచురితమైన సమాచారమును కాపీ చేసి పేస్ట్ చేయుదురు.

12. రవాణాగ్రేసరులు.
వీరు వివిధ మార్గములలో తమకు సంక్రమించిన సమాచారమును కేవలం రవాణా చేయుదురు. అది ఎటువంటి సమాచారము, ఇతరులకు అది ఉపయోగకరమా అనేది కూడ పట్టించుకోరు.

ఇది ఎవరిని దృష్టి లో ఉంచుకొని వ్రాసినది కాదు.
ఒకవేళ మీకలా అనిపిస్తే అది కేవలం కాకతాళీయం మాత్రమే. హాయిగా నవ్వుకోండి. ఆనందో బ్రహ్మ.

Source - Whatsapp Message

నేను డబ్బుని💰...

🤑నేను డబ్బుని💰👈
మీరు మరణించినప్పుడు⚰ నన్ను మీతో మోసుకు వెళ్ళలేరు 🤗

🤑నేను డబ్బుని 💷👈
నేను దేవుణ్ణి కాను👺కానీ... ప్రజలందరు నన్ను దేవుని కంటే ఎంతో ఎక్కువగా పూజిస్తారు, కోరుకుంటారు😍

🤑నేను డబ్బుని💶👈
నేను ఉప్పు లాగా అవసరమే కానీ మోతాదుకు మించితే🏥 అనర్దమే 👹

🤑నేను డబ్బుని 💵👈
నేను మీతోవుంటే అందరూ మీతోనే ,నేను లేకపోతే మీకు ఎందరు వున్నా మీరు ఏకాకి కాక తప్పదు🙇🕴

🤑నేను డబ్బుని💵👈
సమస్త కీడులకు మూలము నేనె ,అయిననూ జనులంతా నా వెంటే 🏃

🤑నేను డబ్బుని💷👈
నన్నెంతగా ప్రెమిస్తే అంతగా మిమ్మల్ని అందరూ ద్వేషించేలా🗡🔪 పరిస్తితులు మార్చేస్తాను😡

🤑నేను డబ్బుని💴👈
నేను అనేకుల్ని ధనవంతులుగా చేసాను ,కాని మరణం🚑🚨 నుంచి వారిని తప్పించలేను.

🤑నేను డబ్బుని👈
నాకు స్తిరత్వం ⤴️⤵️↩↪🌪 లేదు😜

🤑నేను డబ్బుని💳👈
నన్ను దేవుడు సృష్టించలేదు🙏మీరే నన్నుసృష్టించి నేను ఆడించినట్లు ఆడుతున్నారు

👏👏👏👏

Source - Whatsapp Message

నేటి అక్షర సత్యాలు

🌷నేటి అక్షర సత్యాలు

మనకు సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు...

గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి...

స్నేహం నేర్పలేని జాగ్రత్తలు మోసం నేర్పుతుంది...

అందుకే ఏది జరిగినా మన మంచికే...

ముందు నీకేంకావాలో తేల్చుకో , నీవు ఏమి కోరుకుంటున్నావో తెలుసుకో రెండిటిమధ్య దూరం ఎంత తగ్గించగలిగితే అంతదుఃఖం నీనుండి దూరమైనట్లే
ఆలోచన నిద్ర పోనివ్వలేదు,

అంటే. ..

అది మనం సాధించాల్సింది అయినా అయ్యుండాలి. లేదా
బాధించేది అయినా అయ్యుండాలి.!!
మనిషి తీర్చుకొనే ప్రతీకారం కంటే కాలం చెప్పే సమాధానం చాలా గొప్పది


ఏ కాంతాన్ని ఇష్టపడు, అది నిన్ను ఒంటరి తనాన్ని దూరం చేస్తుంది..!

కాలంతో స్నేహం చెయ్యి,ప్రతి క్షణం తోడుగా ఉంటుంది..!

భవిష్యత్తు కు ప్రేమను పంచు, అది నీ జీవిత గమ్యాని కి దారి చూపిస్తుంది..!

నీ కన్నిటికి దైర్యం నేర్పు, కష్టం కూడా నీకు దాషోహం అవుతుంది..

శుభ మధ్యాహ్నం తో మీ మానస సరోవరం 👏

Source - Whatsapp Message

మద్యపానం వద్దు, ఒకవేళ అలవాటు ఉంటే వ్యసనంగా చేసుకోకు , నీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకు...

" విస్కీ " రెండు అక్షరాలు " బ్రాందీ " రెండు అక్షరాలు " రమ్ " రెండు అక్షరాలు " జిన్ " రెండు అక్షరాలు " వోడ్కా " రెండు అక్షరాలు " బీర్ " రెండు అక్షరాలు " స్కాచ్ " రెండు అక్షరాలు తాగడానికి వాడే " గ్లాసు " రెండు అక్షరాలు కలుపుకునే " నీళ్లు " " " " సోడా " రెండు అక్షరాలు అవి అమ్మే " బార్ " రెండు అక్షరాలు కొలత చూసే " పెగ్ " రెండు అక్షరాలు తాగాక ఎక్కే " మత్తు " రెండు అక్షరాలు మత్తెకువైతే కక్కే " వాంతి " రెండు అక్షరాలు దారిలో తూలిపడే " రోడ్డు " రెండు అక్షరాలు పడ్డాక మోసుకుపోయే " జనం " రెండు అక్షరాలు జనం దృష్టిలో పోయే " మానం " రెండు అక్షరాలు అది చూసి కన్నీళ్లు పెట్టే " భార్య " రెండు అక్షరాలు వ్యసనమయితే వచ్చే రోగం " రెండు అక్షరాలు ఆసుపత్రిలో పెట్టె " ఖర్చు " రెండు అక్షరాలు దానికోసం చేసే " అప్పు " రెండు అక్షరాలు అప్పుకోసం అమ్మే " ఆస్తి " రెండు అక్షరాలు తేడా వస్తే వచ్చే " చావు " రెండు అక్షరాలు చస్తే చివర్లో మోసే " పాడి " రెండు అక్షరాలు పూడ్చే " గుంత " కాల్చే " అగ్ని " రెండు అక్షరాలు చివరికి చేసే " తిథి " రెండు అక్షరాలు గోడకి తగిలించే " ఫోటో " రెండు అక్షరాలు అందుకే జీవితంలో రెండు విషయాలు గుర్తించుకో ఒకటి : మద్యపానం వద్దు రెండు : ఒకవేళ అలవాటు ఉంటే వ్యసనంగా చేసుకోకు , నీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకు....

Source - Whatsapp Message

నీవు ఎవరు?

నీవు ఎవరు
🤔🤔🤔🤔🤔🤔🤔🤔

64 లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..
అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహం పెరుగుతుంది.
ఈ దేహం నేనే అంటాం.

కానీ ఎలా?
నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?
ఏ భాగము వినదు.
వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.
చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది.
అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.
ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?
ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?

ఎందుకంటే ఈ దేహం నీది కాదు. నీకు ఆదేవుడిచ్చిన పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే.
ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈ దేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.
ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో.
రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.
రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.
చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం.
ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం ఔతాయి.

రూపానికి ముందు నువ్వున్నావు.
రూపంలో నువ్వున్నావ్.
రూపం వదిలేశాకా నువ్వుంటావు.
ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు.
ఈ దేహం దేవుడిచ్చిన ఒ అద్భుత వరం. ఆయనే ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు. ఆయనే తయారు చేశాడు. ఆయనే సమయం అవ్వగానే నాశనం చేస్తాడు. ఈ దేహంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారం లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ అయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి, అయన ఆగమన్నప్పుడు ఆగిపోతాయి.

కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అందుకు థ్యాన మార్గమే శరణ్యం.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

తృప్తి

🌷తృప్తి 🙏

ఒక సాధువు ఊళ్లు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే.. నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతడి కంట పడింది. వంగి, చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ ఆ నాణెం వల్ల అతడికేం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, అవసరం లేదు. తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి. అవి చాలు. ఆ నాణెం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు. అందువల్ల ఆ నాణేన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు. దాని అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు! చివికిన బట్టలతో కొందరు ఎదురైనా వాళ్లూ సంతోషంగానే ఉన్నారు తప్ప, ఎవరినీ చెయ్యి చాచడం లేదు. సాధువుకు సంతోషం వేసింది. ప్రజలు సంతృప్తిగా ఉండడం, అతడికి సంతోషాన్నిచ్చింది. ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు. తెల్లారి సాధువు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు, తన సైన్యంతో పక్కరాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు. అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే, రాజు వారికి ఆగమని సైగ చేసి, రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు. ‘‘ఓ సాధు పుంగవా.. రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళుతున్నాను.

నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి’’ అని కోరాడు. సాధువు తనకు దొరికిన నాణేన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ‘ఏమిటి దీనర్థం’ అన్నట్లు సాధువు వైపు చూశాడు. సాధువు చిన్నగా నవ్వి, ‘ఓ మహారాజా.. ఈ నాణెం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవడంతో, అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను. అలాంటి వాళ్లు ఒక్కరూ కనిపించలేదు. అంతా సంతృప్తిగా కనిపించారు. ఉన్నదానితో సంతృప్తి చెందకుండా, ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే కనిపిస్తున్నారు. అందుకే ఈ నాణెం మీకు ఇచ్చాను’’ అని చెప్పాడు. రాజు అంతరార్థం గ్రహించాడు. దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు. నిరంతరం.. లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉంటే, ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం. ఆ భాగ్యం లేని వాడు.. ఎంత ఉన్నా.. ఏమీ లేనివాడే!

శుభ సాయంత్రం తో మీ మానస సరోవరం 👏

Source - Whatsapp Message

జామ ఆకులతో 8 ఆరోగ్య ప్రయోజనాలు

🌷జామ ఆకులతో 8 ఆరోగ్య ప్రయోజనాలు🌹

జామపండ్లతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో... జామ ఆకులతోనూ చాలా ఉన్నాయి. జామ ఆకులతో టీ తయారుచేస్తారని తెలుసా. జామకాయలు, ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ c, పొటాషియం, ఫైబర్ లభిస్తాయి. అందుకే మనం జామకాయల్ని తినాలి, ఆకుల రసం తాగాలి. జామపండ్లను తింటే జలుబు వస్తుందని పెద్దవాళ్లు అంటుంటారు. అందువల్ల మరీ బాగా ముగ్గినవి కాకుండా దోరగా ఉన్నవి తింటే మేలు. జామకాయలు మన దేశంలో కంటే... మధ్య అమెరికాలో ఎక్కువగా కాస్తాయి. అక్కడి నుంచే ఈ చెట్లు ప్రపంచమంతా విస్తరించాయి. ఎండ వాతావరణంలోనే పెరిగే ఈ కాయలు... ఏడాదంతా కాస్తూనే ఉండటం మనకు కలిసొచ్చే అంశం. మరి జామకాయల ఆకులతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం......

జామ పండ్ల ఆకుల రసం తాగితే... మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమపద్ధతికి చేరతాయి. చాలా ఎక్కువసేపు బ్లడ్ షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్ ఉండేవారికి ఇది ఎంతో మేలు చేసే అంశం. అందువల్ల భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే కలిసొస్తుంది. దాదాపు రెండు గంటలపాటూ బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఓ నాలుగు జామ ఆకుల్ని నీటిలో పది నిమిషాలు ఉడికించి, ఆ నీటిని తాగేయడమే. ఈ నీరు రుచిగా ఉండకపోయినా... ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలాగే తాగేయడం మేలు. మార్కెట్లలో జామ ఆకుల టీ ప్యాకెట్లు లభిస్తున్నాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు... విషవ్యర్థాలను చంపేసి... గుండెకు మేలు చేస్తాయి. జామకాయల్లోని పొటాషియం, కరిగిపోయే ఫైబర్... గుండెను కాపాడతాయి. జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. హైబీపీ, చెడు కొలెస్ట్రాల్ వంటివి గుండె జబ్బులకు కారణమవుతాయి. అందువల్ల జామ ఆకుల రసం తాగాలి.......

మహిళల్లో పీరియడ్స్ టైమ్‌లో చాలా మంది మహిళలు పొట్టలో నొప్పి వస్తున్నట్లు బాధపడతారు. జామ ఆకుల రసం ఈ నొప్పులను అదుపుచేస్తుంది. రోజూ ఈ రసం తీసుకుంటే మేలు జరుగుతుంది.....

జామకాయలు జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. ఎంత ఎక్కువగా జామకాయలు తింటే అంతగా జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం పారిపోతుంది. ఒక జామకాయ... మన రోజువారీ అవసరమయ్యే ఫైబర్‌లో 12 శాతం ఇస్తుంది. జామ ఆకుల రసం కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డయేరియా (విరేచనాలు)కి చెక్ పెడుతుంది......

జామకాయల్లో కేలరీలు తక్కువ. అందువల్ల ఇవి తింటే ఆకలి తీరుతుంది. అలాగే ఎక్కువ కేలరీలు బాడీకి చేరవు. పైగా వీటిలోని విటమిన్లు, మినరల్సూ మేలు చేస్తాయి......

కాన్సర్ వస్తే... దాన్ని వదిలించుకోవడం ఓ సాహసమే. అసలు కాన్సరే రాకుండా చేసుకుంటే బెటర్ కదా. జామ ఆకుల్లో కాన్సర్‌ను నిరోధించే గుణాలున్నాయి. కాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా కూడా ఇది చేస్తుంది. కణాలను కాపాడుతుంది. కాన్సర్ మందుల కంటే... జామ రసం నాలుగు రెట్లు ఎక్కువగా ప్రభావం చూపించగలదని పరిశోధనల్లో తేలింది. జామకాయలు, ఆకుల్లో విటమిన్ సీ ఉంటుంది. ఇది వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఓ ఆరెంజ్ తింటే వచ్చే సీ విటమిన్ కంటే డబుల్ సీ విటమిన్ జామకాయను తింటే వస్తుంది. బాడీకి వ్యాధులు రాకుండా ఉండాలంటే... సైలెంట్‌గా జామకాయలు తినేస్తూ ఉండాలి. మనకు వేడి చేసినప్పుడు విటమిన్ సీ బాడీ లోంచీ వెళ్లిపోతుంది. దాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే జామకాయలు తినేయాలి......

జామకాయ నిండా పోషకాలే. పైగా ఫైబర్ కూడా ఉంటుంది. తింటే మంచి ఆహారం తిన్నట్టే. జామ ఆకులు కూడా అంతే. చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. బయటి కాలుష్యం వల్ల మన చర్మం పాడైపోతుంది. అడ్డమైన మచ్చలు, కణతులు, ఏవేవో వస్తుంటాయి చాలా మందికి. వాళ్లు జామకాయలు తింటూ... జామ ఆకుల రసం తాగేస్తూ ఉంటే... ఆటోమేటిక్‌గా స్కిన్ నయమవుతుంది. చర్మం ముడతలు పడకుండా జామకాయ కాపాడుతుంది.....

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

'విసుగుదల ' అనేది, ఒక గొప్ప ఆధ్యాత్మిక విషయం....

'విసుగుదల ' అనేది, ఒక గొప్ప ఆధ్యాత్మిక విషయం. అందుకే దున్నపోతులకి (జంతువులకి) విసుగు ఉండదు. అవి చాలా ఆనందంగా, సంతోషంగా కనిపిస్తాయి. విసుగు చెందేది మనిషి ఒక్కడే. మనిష్యులలో కూడా, ప్రతిభావంతులు, తెలివిగలవాళ్ళు మాత్రమే విసుగు చెందుతారు. మూఢమతులు విసుగు చెందరు. వారు ఉద్యోగాలు చేసుకుంటూ, డబ్బు సంపాదించుకుంటూ, బ్యాంకులో ధనాన్ని పెంచుకుంటూ, పిల్లల్ని పెంచుతూ, కంటూ, తింటూ, సినిమాహాళ్ళల్లో కూర్చుంటూ, హోటళ్లకు వెళ్తూ, అందులో ఇందులో పాల్గొంటూ చాలా సంతోషంగా ఉంటారు. వారికి విసుగు ఉండదు. నిజానికి వారు ఇంకా మానవులు కాలేదు. మనిషి ఎప్పుడైతే, విసుగు చెందడం మొదలుపెడతాడో, అప్పుడే మానవత్వం గల మనిషి అవుతాడు. అత్యంత తెలివిగల శిశువు, అత్యంత విసుగు చెందే శిశువే..! బుద్ధుడు సంపూర్ణంగా విసుగు చెందాడు. గుర్తుంచుకో, ప్రపంచం చెడ్డగా ఉందని అతడు దానిని త్వజించలేదు. ప్రపంచంతో విసిగిపోయి అతడు దానిని త్వజించాడు. ప్రపంచం చెడ్డదీ కాదు, మంచిదీ కాదు. నువ్వు తెలివిగలవాడివి అయితే అది నీకు విసుగు కలిగిస్తుంది. మూఢమతివి అయితే ముందుకుపోవచ్చు. అల్ప విషయాలలో నీకు ఆసక్తి ఉంటుంది. చేసిందే చేస్తుంటావు. అలా చేస్తున్నావని కూడా నీకు తెలియదు.
'తెలివి' అంటే, ఉన్నవి ఉన్నట్లుగా చూడడం.

- ఓషో (ఆనందం)

Source - Whatsapp Message

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

మనిషి ని అర్థంచేసుకోవడం కష్టం కానీ,
అపార్థం చేసుకోవడం సులభం..
నమ్మిన వ్యక్తి మీద ఎవరేం చెప్పినా సులభంగా నమ్మలేం కానీ,
ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహంతో ఉంటే,
చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు..
కానీ అదే వ్యక్తులు విడిపొతే కలిపేవాళ్ళు ఉండరు..
మీ బలహీనతలను ప్రపంచానికి తెలియనివ్వకండి,
ఎందుకంటే వాటితో ఆడుకోవడానికి లోకం ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంది...

నిజమే నలుగురితో మాట్లాడం నాకు తెలియదు,
మాటలతో మాయ చేయటం నాకు తెలియదు,
అబద్ధాలు చెప్పి దగ్గరికి తీసుకోవడం నాకు చేతకాదు,
కానీ నాకు తెలిసింది ఒకటే...
నవ్వుతూ పలకరించి, నా వాళ్ళు అనుకోవటం తప్ప...
బయట గరికగడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు,
అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేరు..

✨జీవితంలో మొత్తం ఎగుడు దిగుడు దారిలోనే కొనసాగుతోంది

💫అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా..

⚡కిందకు వచ్చినప్పుడు బాధపడకండా ముందుకు వేళ్ళేవాడే నిజమైన విజేత._

❄️శుభోదయంతో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Monday, July 26, 2021

మధుమేహంలో రెండు రకాలు కలవు.

మధుమేహంలో రెండు రకాలు కలవు.

టైప్ 1 మధుమేహం:

కొందరిలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. వీరికి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని టైప్ 1 డయాబెటిస్ అంటారు. ఇది చిన్న పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది.

"టైప్ 2 మధుమేహం / Type -2 Diabetes":

వివిధ కారణాల వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత కాదు. పాంక్రియాస్, ఇన్ఫెక్షన్స్ వల్లగాని, ఆహార నియమాలు సరిగా లేకపోవడం చేత, క్రమంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అందువల్ల టైప్ 2 మధుమేహం వస్తుంది.

"గెస్టెషనల్ డయాబెటిస్ / గర్భధారణ సమయ మధుమేహం (Gestational Diabetes )":

గర్భవతుల్లో 2 నుంచి 5 శాతం వరకు ఈ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఈ డయాబెటిస్‌కు సరిగా వైద్యం అందించకపోతే తల్లీ, బిడ్డలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రసవం తర్వాత డయాబెటిస్ ఉండవచ్చు.

"లక్షణాలు":

'పాలీయూరియా / Poly Urea (అతిగా మూత్రం రావడం)'

'పాలీడిప్సియా / Poly Dypsia (దాహం వేయడం)',

'పాలీఫాజియా / Poly Phagia (అతిగా ఆకలి వేయడం)',

కొద్ది సమయంలోనే గుర్తించదగిన బరువు తగ్గడం,

అలసట నీరసం కలగడం,

చూపు మందగించడం,

లైంగిక సమస్యలు రావడం,

కారణాలు:

అతిగా పాలుత్రాగడం మరియు పాల ఉత్పత్తులు భుజించడం,

క్రొత్తగా పండిన ధాన్యాలను వంటలలో వాడడం,

తాజాగా చేసిన సురను (మధువును) సేవించడం,

అతిగా నిద్ర పోవడం, శరీరశ్రమ కావలసినంత చేయకపోవడం,

మానసిక ఆందోళన,

భారీ కాయం,

అహారపు అలవాట్లు,

ముందుగా తిన్నది జీర్ణంకాకముందే తిరిగి భుజించడం,

ఆకలి లేకున్నా ఆహారం తీసుకోవడం మరియు అతిగా ఆహారం తీసుకోవడం,

వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది.

గంటల తరబడి కూర్చోని ఉండటం,

పోషకపదార్థాలు సరిగా లేని ఆహారం తీసుకోవడం,

వేపుడు కూరలు, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు తీసుకోవడం,

మాంసాహారం అధికంగా తీసుకోవడం,

బేకరీ పదార్థాలు, తీపి పదార్థాలు అధికంగా తీసుకోవడం,

నిల్వ వుండే పచ్చళ్ళు తీసుకోవడం,

కొన్ని రకాల మందులు అధికంగా తీసుకోవడం వల్ల,

స్టెరాయిడ్స్ ( Steroids ) కారణంగా,

కొన్ని రకాల వైరస్, ఇన్ఫెక్షన్స్ కారణంగా,

హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం వస్తుంటుంది.

"జాగ్రత్తలు":

రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి.

భోజనానికి అరగంట ముందు వైద్యులు సూచించిన మందులు వేసుకోవాలి.

ముందులు వేసుకోవడం మాత్రమే కాదు. వాటిని ప్రతిరోజూ సరియైన సమయంలోనే వేసుకోవాలి.

సమయ పాలన లేకపోతే మందులు వేసుకుంటున్నా శరీరంలో ఒక అపసవ్య స్థితి ఏర్పడుతుంది.

ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి.

ఇన్సులిన్‌ వేసుకోవడంలోనూ కాల నియమాన్ని పాటించాలి.

మధుమేహంలో కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకు తెలియదు. అందుకే వారు ఏటా ఒకసారి పాదాల్లో స్పర్శ ఎలా ఉందో తెలుసుకోవాలి.

స్పర్శ లేకపోతే ప్రతి ఆరుమాసాలకు వీలైతే మూడు మాసాలకు ఒకసారి పరీక్ష చేయించాలి.

పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నాయేమో గమనించాలి.

గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి.

పాదాలను ప్రతి రోజూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

ఇన్‌ఫెక్షన్లతో కాళ్లకు చీము పడితే చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి.

అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ పరీక్షలు, అలాగే కళ్లు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్‌ సలహా మేరకు చేయించుకోవాలి.

మధుమేహం ఉన్న వారికి మూత్ర పిండాలు దెబ్బతినే అవకాశం ఉంది.

దీనివల్ల మూత్రంలో ఆల్బుమిన్‌ అనే ప్రొటీన్‌ విసర్జించబడుతుంది. అంతిమంగా ఇది కిడ్నీ దెబ్బ తినడానికి దారి తీస్తుంది.

అందుకే ప్రతి మూడు మాసాలకు, ఆరు మాసాలకు పరీక్ష చేసి మూత్రంలో ఆల్బుమిన్‌ ఉందా లేదా కనుగొనాలి.

మధుమేహం ఉన్న వారిలో గుండె కండరాలకు రక్తాన్ని కొనిపోయే కరొనరీ రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది.

అందుకే గుండె నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ఇసిజి, ట్రెడ్‌మిల్‌ పరీక్షలు చేయించుకోవడం అవసరం.

అలాగే కొలెస్ట్రాల్‌ పరిమాణాన్ని తెలిపే లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు చేయించాలి.

ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

రక్తంలో త్వరగా కరిగిపోయే పీచుపదార్థాలను కలిగి సోడియం ,కొలెస్ట్రాల్ లేని జామపండు మధుమేహ వ్యాధిగ్రస్థులు తినతగిన పండ్లలో ఒకటి.

నేరేడు పళ్ళు కూడా చాలా మంచిది.

*

Source - Whatsapp Message

నేటి ఆణిముత్యాలు.

నేటి ఆణిముత్యాలు.

ఓర్పు, ఓరిమి, సహనము
కోల్పోయినట్లయితే
ఎంతోకాలం
శ్రమించి, కష్టించి, కృషిచేసిన

సంపాదించిన

మంచిపేరు, ప్రతిష్ఠలు
ఒక క్షణంలో

మటుమాయం
అయిపోతాయి. సంపాదించడం ఒక ఎత్తు.
దానిని నిలబెట్టుకోవడం

మరొక ఎత్తు
సమాజంలో కొందరు

మనం ఏం చేస్తున్నాం

అనే దాన్నికన్న
ఎదుటి వాళ్లు ఏం చేస్తున్నారు
అనే దానిపైన ఎక్కువ

ఆసక్తి చూపిస్తారు జాగ్రత్త .

మానస సరోవరం 👏

Source - Whatsapp Message

నేటి మంచిమాట

🍃🥀ఊహాని ఎంత గొప్పగా ఆస్వాదించినా,అది ఊహే అని మాత్రం మర్చిపోకు.!
మనం సంతోషంగా బతకాలి అంటే,ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేయాలి..!!

🍃🥀జీవితం నీది,బతుకు నీది,మంచైనా చెడైనా,కష్టమైనా,సుఖమైనా నీదే కాబట్టి నీకు ఏది ఇష్టమైతే అది చెయ్,ఎందుకో తెలుసా..!
విమర్శలకు భయపడి,నువ్వు నీ నిర్ణయాలను,నీ ఇష్టాలను మార్చుకుంటే,రేపు నీవు ఎదుర్కోబోయే కష్టాలను,వాళ్ళెవరూ తీర్చరు..!!

🍃🥀ఆహారం పాత్ర లో కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. తింటే గానీ దాని రుచి, శుచి తెలీదు..!
మనుషులు అలంకరించుకొని రంగు రంగుల బట్టల్లో అందం గానే కనిపిస్తారు. వాళ్ళ ఆలోచనలను పసిగడితే తప్పా వాళ్ళ అసలు రూపం బయట పడదు..!!

మానస సరోవరం 👏

Source - Whatsapp Message

నవ్వు 😀నవ్వించూ

నవ్వు 😀నవ్వించూ
🕉️🌞🌎🏵️🌼🚩

‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక మాయరోగం’ అని తాత్వికుల అభిప్రాయం. పెద్దగా నవ్వటం అమృత హృదయుని లక్షణమని పెద్దలంటారు.

‘‘నవ్వును జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికిన్
దివ్వెలు – కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్
పువ్వులు వోలె ప్రేమరసముల్ వెలిగ్రక్క విశుద్ధమైనవే
నవ్వులు – సర్వము దుఃఖదమనంబు వ్యాధులకు మహీషదుల్’’

అన్నారు మహాకవి గుర్రం జాషువాగారు. నవ్వు సర్వరోగ నివారిణి. అటువంటి నవ్వును నవ్వాలా, వద్దా అని ఆలోచించడం అర్ధరహితం.

చిరునవ్వు, సకిలింపు, ఇకిలింపు, ముసి,ముసి నవ్వు, మూగనవ్వు, గుడ్డినవ్వు, పక,పకలు, అట్టహాసం ఇలా నవ్వనేక రకాలు. దేనికదే సాటి. భరతముని నాట్యశాస్త్రంలో ‘స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం’ అని నవ్వుని వర్గీకరించాడు. ఆధునికి సాహిత్యంలో హాస్యాన్ని కొత్తపుంతలు తొక్కించిన పానుగంటి లక్ష్మీనరసింహరావు గారు మొలక నవ్వు, మొద్దు నవ్వు, కిచకిచ నవ్వు, కిలకిల నవ్వు, ఇగిలింపు నవ్వు, సకిలింపు నవ్వు, కుండమూకుడు నవ్వు, కప్పదాటు నవ్వు, వెర్రి నవ్వు, తిట్టు నవ్వు అంటూ నవ్వుకి అనేక రూపాలిచ్చారు.

అయితే, నవ్వంటే ఏమిటిని, దానికి నిర్వచనం చెప్పమంటే మాత్రం మహామహులకే సాధ్యంకాలేదు. నవ్వు ఒక అనిర్వచనీయమైన అనుభూతి. దానిని అనుభవించాలే కానీ, అర్ధాలు వెదికి ప్రయోజనం లేదు. నవరసాల్లో ఒకటైన హాస్యం మనసుకు ఆనందం కలిగిస్తూనే విజ్ఞాన్ని అందిస్తుంది. ఆ రసాస్వాదన చేసిననాడు అసంకల్పితంగా వచ్చేదే నవ్వేమో!

జనజీవనంలో అంతర్లీనంగా హాస్యం తద్వారా నవ్వు గేయాలు, పాటలు, పొడుపు కథల రూపంలో నిక్షిప్తమై ఉంది .

‘‘కలకల నవ్వే లక్ష్మణదేవ రపుడూ – కలతలు పుట్టెను కపులందరికినీ
కిలకిల నవ్వే లక్ష్మణదేవ రపుడూ – కిలకిల నవ్వగా ఖిన్నుడయ్యె రాజూ
ఇందరి చిత్తమ్ము లీవిధమ్ముననూ – నిండిన కొలువెల్ల కడుచిన్నబోయె’’

లక్ష్మణుడి నవ్వు రాముని కొలువులో కల్లోల్లాన్నే సృష్టించింది. గుమ్మడి పండ్ల దొంగ భుజాలు తడుముకున్నట్టు ప్రతి ఒక్కరూ తమలోని లోపాన్ని తలుచుకుని సిగ్గుతో కుంచించుకోపోయిన వైనం జానపదుల నోటి నుండి ఎంతో రమణీయంగా జాలువారింది. ద్రౌపది నవ్వు కురుక్షేత్ర సంగ్రామానికే హేతువైంది. ఇక మధురవాణి నవ్వు కన్యాశుల్కానికే ఊపిరైంది.

మనకు నవ్వు పట్ల ఎప్పుడు శీతకన్నే అయినా మన ప్రాచీన, ఆధునిక కవులు వీలైనప్పుడల్లా నవ్వుని అందించడానికే ప్రయత్నించారు. ఆంధ్ర మహాభారంతో తిక్కన్న నవ్వుల గురించి వివరిస్తూ, 32 రకాల నవ్వుల గురించి చెప్పారు. అవి: 1. పిన్న నవ్వు 2. అల్ల నగవు 3. అలతి నవ్వు 4. చిరునవ్వు 5. మందస్మిత 6. హర్ష మందస్మిత 7. అంతస్మితం 8. జనిత మందస్మితం 9. ఉద్గత మందస్మితం 10. అనాదరం మందస్మితం 11. సాదర దరహాసం 12. తిన్నని నవ్వు 13. లేత నవ్వు 14. కొండొక నవ్వు 15. పెలుచన నవ్వు 16. ఉబ్బు మిగిలి నవ్వు 17. గేలికొను నవ్వు 18. ఒత్తిలి నవ్వు 19, అపహాసం 20. రోషకఠిన హాసం 21. ఊద్భుట నవ్వు 22. కలకల నవ్వు 23. ఎల నవ్వు 24. ప్రౌఢ స్మితము 25. బెట్టు నవ్వు 26. కన్నుల నవ్వు 27. కన్నుల నిప్పుల రాలు నవ్వు 28. కినుక మానిన నవ్వు 29. కినుక మునుగు నవ్వు 30. కఠిన నవ్వు 31. నవ్వురాని నవ్వు మరియు 32. ఎర్ర నవ్వు.

ఇవికాక, ఆధునికి కవులు మరికొన్ని నవ్వులను కనిపెట్టారు. తలకాయ నవ్వు – తల మాత్రం తెగ ఝాడిస్తూ వంచేసి కళ్లు మూసుకు నవ్వడం, లయధాటీ నవ్వు – తాళం వెయ్యటానికి వీలై ఉండేది. తుపాకి నవ్వు – పెదిమల బద్ధలు చేసుకుని ఠప్పున బయల్దేరేది, కొన ఊపిరి నవ్వు – గుక్క తిరగని సమయం దాకా మాట్లాడి అప్పుడు మాట తెమలకుండా, నవ్వు రాకుండా నవ్వడం, కోతి నవ్వు – నవ్వేమో అని ఇతరులు భ్రమించేది, దాగుడు ముచ్చీ నవ్వు – అధికారి ఎవరైనా కని పెడతారేమో అనే భయంతో చప్పున ఆపేసుకోవడానికి ప్రయత్నించే టప్పటిది, సరి విషపు నవ్వు – నవ్వు జాతిలో చెడబుట్టి లోపలి ఏడుపుని ఓ ప్రక్క నుంచే వెళ్లగక్కేది, డోకె నవ్వు, దొంగ నవ్వు, కొలిమి తిత్తి నవ్వు, గుడ్స్ బండి నవ్వు ఇలా అనేకం.

ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, నవ్వులో ఎన్ని వంద రకాలున్నాయని వెడకడం మానేసి మల్లెపూవులాంటి స్వచ్ఛమైన నవ్వు నవ్వొకటి నవ్వుతూ ఉండండి. లేకపోతే ‘నవ్వనివాడు దున్నపోతై పుట్టున్’ అనను కానీ…

‘‘అకాల మృత్యుహరణం
సర్వ వ్యాధి నివారణం
సమస్త దురితోపహారం
హాస్యరసామృతం – పావనం శుభం.’’

సౌమ్యశ్రీ రాళ్లభండి

🕉️🌞🌎🏵️🌼🚩

Source - Whatsapp Message

శిల్పి అందంగా శిల్పాలను ఎలా చెక్కగలుగు తున్నారు?

సామాన్యుడు -
మీరు ఇంత అందంగా శిల్పాలను ఎలా చెక్కగలుగు తున్నారు?

శిల్పి - అందమైన శిల్పాలు ఆ రాళ్లలో దాగి ఉన్నాయి, నేను చేసేదల్లా ఎక్కువ ఉన్న రాతిని తొలగించడమే . అదే విధంగా మనలో ఆనందం నిండుగా ఉంది, చేయవలసిందల్లా బాధలను తొలగించు కోవడమే.

మీ స్నేహాన్ని పువ్వుతో పోల్చకండి వాడి పోతుంది , మంచుతో పోల్చకండి కరిగిపో తుంది , ఆకుతో పోల్చకండి రాలి పోతుంది , మీ నవ్వుతో పోల్చండి శాశ్వతంగా నిలిచిపోతుంది .

కరోనా సెకెండ్ వేవ్ మరియు ధర్థ్ వేవ్ అంటూ ఆందోళన చెందకుండా పిల్లలని రోజూ గంటైనా ఎండలో ఆడుకొనివ్వండి తిరగనివ్వండి నువ్వులు , బెల్లం ఉండలు , వేరుశనగ ఉండలు రోజూ పెట్టండి పండ్లు , మజిగ , రాగిజావ , అరటి పండ్లు బాగా అలవాటు చేయండి పెసర బద్ద పరిమాణం పచ్చ కర్పూరం రోజు ఒకసారి తప్పనిసరిగా తినిపించండి , అన్ని వేవ్ లు తోకముడుస్తాయి పచ్చ కర్పూరం క్రిమి సంహారిణి

జీవితం ఒక ప్రయాణం‌ మాత్రమే, ఇక్కడ మన పనులు ముగించుకుని తర్వాత తిరిగి వచ్చిన చోటికి వెళ్ళి పోతాము .

నీ నిజాధామం నీవు ఎక్కువ కాలం నివసించేది ఈ ప్రపంచంలో కాదు ! కీర్తి ప్రతిష్టలు ధన సంపాదన కోసం కాదు ? నీవు ఇక్కడికి వచ్చింది. ధర్మాన్ని అందించడానికి సంతోషాన్ని నలుగురికి పంచడానికి మాత్రమే అని గమనించండి.

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

నేటి మంచిమాట.

🌷నేటి మంచిమాట.

మంచివారుమార్పు కోసం మాట్లాడుతారు. అసూయ తో ఉన్నవారు చులకనగా మాట్లాడుతారు.

కానీ జ్ఞానం కలవారు మౌనంగా ఆలోచించి మాట్లాడుతారు.

నిజానికి మాట మనిషిని మారుస్తుంది. మౌనం మనసును మారుస్తుంది. ఇదే జీవితం.

నాకు ఏమీ తెలియదు అనుకునే వాడు అమాయకుడు నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు" నేను తెలుసుకోవాల్సినవి
చాలాఉన్నాయి అనుకునేవాడు..

_నిత్య విద్యార్థి, తేలుసుకున్నవాటిలో సత్య..అసత్యాలు
గ్రహించేవాడు మేధావి"*

మానస సరోవరం 👏

Source - Whatsapp Message

నేటి జీవిత సత్యం.

నేటి జీవిత సత్యం.
🍃🌷ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు చెడుని ప్రశ్నించకుండా చెతులుకట్టుకున్న మంచివారి వల్ల చెడిపోతున్నది..
దైర్యంగా అడగలేని భయస్తుల వల్ల మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల సమాజం చెడిపోతున్నది..

🍃🌷మనం మౌనంగా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది ఎప్పుడైతే ఆ మౌనం భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడు మనమెంత మంచి చేసినా అన్నీ మరిచిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఈ మనషులు..

🍃🌷మనిషి సక్రమముగా బ్రతకడం మానేసి అన్నీ అక్రమాల వెంట పరిగెడుతున్నడు, అక్రమ సంపాదనలు, అక్రమ కట్టడాలు, అక్రమ అధికారాలు అక్రమ చావులు అన్ని అక్రమాలే..

🍃🌷ఆశపడిన ప్రతీది మనకు దొరకపోవచ్చు అంత మాత్రాన మనం దురదృష్టవంతులం కాదు అంతకు మించిన అదృష్టం ఎదో మన కోసం ఎదురుచూస్తుందని మరచిపోకు నేస్తం..

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Saturday, July 24, 2021

గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం

గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం

"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"

అయితే ఈ శ్లోకం ఎందులోది?

ఏ సందర్భంలోది?
ఎవరు వ్రాశారు? వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా?

ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది.
కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.

ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు.

కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు "ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు. మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తినని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని.

ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే, అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా!! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు.

అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు.
🙏💐🙏💐🙏💐🙏

ఇటువంటి కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం, అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు. ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు. మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని, గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ అంకితం 🌷🙏🌷

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః

వ్యాస మునీంద్రుడు సాక్షాత్‌ విష్ణు స్వరూపుడు. గురువులకే గురువు. ‘మునీనాం అహం వ్యాసః’ అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని విభూతి యోగంలో చెప్పాడు🌹🙏🌹

🙏💐🙏💐🙏💐🙏

Source - Whatsapp Message

#కాశీలో జరిగిన ఒక #యదార్ధ_సంఘటన

#కాశీలో జరిగిన ఒక #యదార్ధ_సంఘటన
ఒక ఊరిలో ఒక పేద కుటుంబం జీవిస్తూ ఉండేది.ఆ ఇంట్లోవారందరూ ధార్మికులు,దైవ భక్తి కలవారు.ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు.వయస్సులో చిన్నవాడైన భక్తిలో మాత్రం అందరికీ ఆదర్శంగా ఉండేవాడు.తనకి ఆటలయందు అస్సలు ఆపేక్ష ఉండేది కాదు.ఒకసారి ఆ పిల్లవాడు తన తాతగారితో కలిసి ఒక సత్సంగానికి వెళ్ళాడు,అక్కడ ఒక సాధువు కాశీ గురించి ప్రవచించడం విన్నాడు.ఆ పసితనం లోనే ఆ పిల్లవాడికి కాశీ దర్శించుకోవాలనే కోరిక మనస్సులో దృడంగా నాటుకుంది.ఎలా వెళ్ళాలో తెలియదు.అతని ఇంట్లో వారు కూడా ఎన్నడూ కాశీకి వెళ్ళలేదు.తను అందరినీ కాశీ గురించి అడుగుతూ ఉండేవాడు.ఇలా ఉండగా ఒక రోజు పెద్ద వర్షం పడుతుండగా ఒక పిడుగుపాటు తగిలి తన ఇంట్లోని వారంతా కాలగతి చెందారు.అప్పుడు తను ఇంట్లో లేకపోవడం వలన తానొక్కడే బ్రతికాడు.ఇక ఒక్కడే అనాధలా మిగిలిపోయాడు.ఆ చిన్నవాడు రోజూ తన వాళ్ళను తలచుకుంటూ ధారాపాతంగా ఏడుస్తూ ఉండేవాడు.ఆ పిల్లాడ్ని చూసి ఆ ఊరివారంతా బాధ పడేవారే కానీ ఓదార్చలేకపోయేవారు.
అప్పుడు అతని ఊరికి ఆ సాధువు మళ్ళీ వచ్చాడు .....
ఆ సాధువు ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి
"ఎందుకు అనవసరంగా బాధపడుతూ కలాన్నంతా వృధా చేసుకుంటావు.ఏ బంధమూ శాశ్వతము కాదు నాయనా.జన్మనిచ్చిన తల్లిదండ్రులు వెళ్లిపోవచ్చు కానీ ఈ విశ్వానికే తండ్రి ఆ కాశీ విశ్వేశ్వరుడు అతనే మన తండ్రి.అతను అనాధనాధుడు,అతను ఉండగా ఎవరూ అనాధలు కారు.ఆయన్నే ధ్యానిస్తూ ఉండు నిన్ను సదా రక్షిస్తూ ఉంటాడు" అని చెప్పి వెళ్ళిపోయాడు.ఆ సాధువు మాటలతో సేద తీరి తన దుఃఖాన్ని మరచి మళ్ళీ కాశీ విశ్వేశ్వరునిపై తన దృష్టి నిలిపాడు.

ఒక గుడిసె కట్టుకుని కాశీ విశ్వనాధుడే తన తల్లి తండ్రి అని వాళ్ళ దగ్గరకు వెళ్ళడమే జీవిత ధ్యేయం అని నమ్మి ఎంతో శ్రమించసాగాడు.చదువులేదు ఏ పని చేతకాదు,ఇది వరకు పని చేసిన అనుభావం కుడా లేకపోవడం వలన ఒక చోట ఒక పనిలో చేరాడు.తను కాశీకి వెళ్ళలేదు కనుక కాశీని దర్శించుకుని వచ్చిన వారిని కాశీ గురించి అడిగేవాడు ... కాశీకి వెళ్ళడానికి ఎంత ఖర్చవుతుందో తెలుస్కుని తన సంపాదనలో కాస్త దాచాలని నిర్ణయించుకున్నాడు.రోజూ మూడు పూటలా భొంచేయడానికి కుడా తన సంపాదన సరిపోయేది కాదు.అయినా తను వాటిలోనే సగం దాచి కాశీకి చేరాలని నిర్ణయించుకున్నాడు.

అక్కడి విశ్వనాధుడిని,విశాలాక్ష్మి అమ్మవారిని,అన్నపూర్ణా దేవిని,డుండి గణపతిని , కాళ భైరవ స్వామిని తన మనస్సులోనే ఊహించుకుంటూ,ప్రతి రోజు స్నానం చేసేప్పుడు గంగమ్మలో స్నానం చేసే భాగ్యం ఎప్పుడు కలుగుంతుందో అనుకుంటూ ,అన్నం తినేప్పుడు అన్నపూర్ణమ్మ చేతి వంట తినే మాహాభాగ్యం ఎప్పుడు కలుగుతుందో అనుకుంటూ నిరంతరం కాశీ ఆలోచలనతోనే గడుపుతుండేవాడు ...

అలా ఇరవై సంవత్సరాలు ఎంతో కష్ట పడి పొదుపు చేసి దాచుకున్న డబ్బులతో రేపే కాశీకి వెళదాము అనుకుని ఆనందంతో నిద్రపోయాడు.రాత్రికి రాత్రే అతని ఇంట్లో ఒక దొంగ తను దాచుకున్న డబ్బు దోచుకుని పోయాడు.ఉదయం లేచి కాశీ యాత్రకూ బయలుదేరుదాం అనుకుంటుండగా తను దాచుకున్న డబ్బు కనిపించలేదు ... వేసిన గొళ్ళెం వేసినట్లే ఉంది డబ్బు ఎలా పోయిందో అనుకుంటూ గుడిసంతా ప్రతి అంగుళం వెతికాడు కాని డబ్బు కనిపించలేదు ...

అతని బాధకు అంతే లేదు ... తన ఆశలన్నీ అడియాశలైయ్యాయనీ, శరీరంతో విశ్వేశ్వరుడ్ని కలవలేను కనుక చనిపోయి అయినా విశ్వేశ్వరుడిని కలవాలని అనుకున్నాడు , వెంటనే వెళ్ళి ఒక బావిలో దూకాడు.మునిగిపోతూ స్పృహ కోల్పోయాడు ...

తనకు స్పృహ వచ్చేసరికి ఒక గట్టు మీద ఒకావిడ వొడిలో పడుకుని ఉన్నాడు.ఆవిడ ఎవరో తెలియదు .ఎక్కడ ఉన్నాడో తెలియదు,ఆవిడ అతన్ని ఒక చోటుకి తీసుకుని వెళ్ళింది.అక్కడ ఒకతను ధ్యానంలో కుర్చుని ఉన్నాడు.అప్పుడే ధ్యానం ముగిసి కళ్ళు తెరిచి ఈ కుర్రవాడ్ని చూసాడు తను.వొళ్ళంతా భస్మం రాసుకుని,జుట్టంతా ఎఱ్ఱగా ఉంది ,జడలు కట్టిన జుట్టుతో ఉన్న అతన్ని చూస్తే ఈ కుర్రవాడికి తెలియని భక్తి భావం కలిగింది." స్వామి మీరెవరు ..... " అని అడగాలనుకున్నాడు కాని అతనికి నోట మాట రావడం లేదు ..

అలా కాసేపు తదేక దృష్టితో చూస్తుండగా ఇతని హృదయంలో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది.మనసు నెమ్మదించి స్వస్వత పొందింది.కళ్ళు మూతలు పడుతూ ధ్యానస్తుడయ్యాడు.అలా ఎంత సేపు ధ్యానంలో ఉండిపోయాడో కుడా తెలియదు.నిదానంగా ధ్యానం నుండి బాహ్య స్మృతిలోకి రాగానే ఆ సాధువును గుర్తు పట్టాడు.తను చిన్నప్పుడు ఇంట్లో వారి గురించి బాధ పడుతుండగా తన మనస్సును మార్చి విశ్వనాధుని వైపుకి త్రిప్పింది ఈ సాధువే అని జ్ఞాపకానికి వచ్చింది.ఇరవైయేళ్ళ క్రితం చుసిన ఆ సాధువును మళ్ళీ కలిసినందుకు పట్టరాని ఆనందం కలిగి,ఎవరి ప్రేరణ వలన తన మనస్సు భగవంతుని వైపు తిరిగిందో ,ఎవరిని దర్శిస్తుండడం వలన మనస్సు ప్రశాంతత పొందుతోందో ఆయన్ని మళ్ళీ చూడగలిగాను,ఇది నా తండ్రి ఆ విశ్వనాధుని అపార కరుణే అనుకుని , ఆ సాధువుకు భక్తి పూర్వకంగా నమస్కరించి ఒక ప్రశ్న అడగాలనుకున్నాడు ,కానీ ఎంత ప్రయత్నిస్తున్నా మళ్ళీ మాటలు రాని పరిస్థితి .అతనికి కలిగిన భావనలు,ఆ ఆనందానుభూతి,గొంతు గద్గదం అవ్వడం ,కళ్ళ నుండి ఆనందాశ్రువులు జాలువారడం ఇవన్నీ అతన్ని ఆశ్చర్యానందాలకు గురిచేస్తుండగా ఆ సాధువు ఇతన్ని ఆశీర్వదించి,అతన్ని తీసుకుని పక్క గదిలో ఉన్న ఒకావిడ దగ్గరకు తీసుకువెళ్ళాడు ...

ఆ గదిలో ఒకావిడ బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నది.ఆవిడ మోములో చిరు మందహాసము,ఆమె కన్నులలో కాంతి అమృత కిరణాలను ప్రసరింపజేస్తున్నదా అన్నట్లు ఉన్నది. కోటి సూర్యుల దివ్య తేజస్సు ఆ గదినంతా ఆక్రమించినట్లున్నది .ఈ కుర్రవానికి ఒక్కసారిగా తన శరీరము తట్టుకోలేనంత తజేస్సు నరనరాల్లో ప్రవహిస్తున్న భావన కలిగి నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు.అతని మదిలో ఎన్నో స్మృతులు తళుక్కుమని మెరుపులా మెరిసి అంతర్ధానం అవుతున్నాయి.అతను జీవితంలో ఎన్నడూ పొందని ప్రశాంతతను ఆ క్షణం పొందుతున్నాడు.తనకు జ్ఞానోదయం కలిగినట్లు తన బృకుటిలో ఒక జ్యోతి దర్శనం అయ్యింది.అలా కాసేపు ఆవిడ సన్నిధిలో కుర్చున్నాడు.

అటు తరువాత ఇతన్ని ఆశీర్వదించి అక్కడినుండి తీసుకుని ఇంకో గదిలో ఉన్న ఒకావిడ దగ్గరకు వెళ్ళింది ,ఆవిడ చూడటానికి పండు ముత్తైదువలా ఉన్నది.ఎర్రటి బొట్టు,తల నిండా కనకాంబరం పువ్వులు,ఎర్రటి అంచున్న తెల్లటి చీర కాసిపోసి కట్టుకుని కుర్చుని ఉన్నది. ఇతన్నిచూస్తూనే రా నాయనా అంటూ నవుతూ పలకరించిది.ఒక్కసారిగా ఆ కుర్రవాడు అయిదారేళ్ళ పసి బాలుడిలా మారిపోయాడు.ఆ పిల్లవాడ్ని దక్కరకు తీసుకుని, తన వొడిలో కూర్చోబెట్టుకుని ఒక తీయ్యటి పదార్ధం తినిపిస్తున్నది. అటువంటి పదార్ధం తను తన జీవితంలో తినలేదు.కడుపు నిండా తిన్న తరువాత ఆ పసివాడికి జోల పాడి నిద్రపుచ్చింది ...

నిద్రలేచేసరికి తన పక్కనే ఒకతను కుర్చుని ఉన్నాడు.అతని చుట్టూ పెద్ద పెద్ద కుక్కలు అతన్నే చూస్తూ కుర్చుని ఉన్నాయి.అతని రూపు చూడటానికి భయంకరంగా ఉన్నా తన మొగములో చిరునవ్వు ఇతన్ని విశేషంగా ఆకర్షించింది.తన ఈ కుర్రవాడితో ఇలా అన్నాడు," కుక్క ఒక విశిష్టమైన జంతువు,విశ్వాసానికి ప్రతీక,తన వారు ఆపదలో ఉంటే ప్రాణాన్ని కుడా లెక్కచేయకుండా ఎంత పెద్ద శత్రువుతోనైనా పోరాడుతుంది.అటువంటి జీవికి ఆహారం పెడితే శత్రు బాధలు ఉండవు అని చెప్పాడు." తరువాత అతన్ని తీసుకుని ఒక చిన్న గున్న ఏనుగు దగ్గరకు వెళ్ళాడు.ఆ ఏనుగు ఇతన్ని చూస్తూనే ఆనందంతో గెంతుతూ దాని తొండంతో తన మీద కూర్చుండ బెట్టుకుని ఆ నగరం అంతా ఉత్సాహంగా తిరిగింది.ఈ నగరాన్ని అతను అంతకు ముందు ఎన్నడూ చూడలేదు కానీ అణువణువునా పవిత్రతతో భాసిస్తోంది,ఎంత చూసినా తనివి తీరడం లేదు.అలా తిరిగి తిరిగి ఇద్దరు ఆ పెద్దావిడ దగ్గరకు తిరిగి చేరుకున్నారు ఆవిడ ఇద్దరికీ కడుపు నింపి సేదతీర్చింది ...

మళ్ళీ తనుకు మంచి నిద్రపట్టేసింది.

అప్పుడు అతనికి ఒక కల వచ్చింది ... ఆ కలలో తను చుసిన వారంతా మళ్ళీ కనిపించారు ... ఆ సాధువు అతనితో , " నువ్వు నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు కదా ఏవిటో ఇప్పుడు అడుగు అన్నాడు." ... ఆ కుర్రవాడు " స్వామీ,చిన్నప్పుడు మా ఊరిలో నా దుఃఖాన్ని పోగొట్టి విశ్వనాధుని వైపు నా మనస్సు త్రిప్పిన ఆ సాధువు మీరే,మీ వల్లనే నేను ప్రేరణ పొంది సర్వేంద్రియములు నా తండ్రి వైపు నిలుపగాలిగాను,మిమ్మల్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కలవడం ఎంతో ఆనందంగా ఉన్నది.ఇక్కడ నాకు కలుగుతున్న అనుభూతులను మాటల్లో వర్ణించలేను,నేను చుస్తున్నదంతా కలా నిజమా అనే సంభ్రమాశ్చర్యాలకు గురువతున్నాను ... కానీ నా సందేహాలివి,నేనెక్కడ ఉన్నాను,ఇక్కడకు ఎలా వచ్చాను,మీరంతా ఎవరు అని ప్రశించాడు,ఎందుచేత నన్ను ఇంతలా ఆదరిస్తున్నారు, మీ అందరి ఆదరణ పొందడానికి నేను చేసుకున్న పుణ్యమేమిటి ? అని అడిగాడు ...

అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు ...

నిన్ను బావిలో మునిగిపోతుండగా కాపాడిన ఆవిడే గంగ,నువ్వు ఇన్నేళ్ళు చూడాలని పరితపించిన ఆ విశ్వనాధుడిని నేనే,బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆవిడే విశాలాక్షీ దేవి,నీకు కడుపు నిండా అన్నం పెట్టిన పెద్ద ముత్తైదువ అన్నపూర్ణా దేవి,కుక్కలను ఆడిస్తూ కనిపించిన అతనే కాళ భైరవుడు,నిన్ను తన మీద కూర్చోబెట్టుకుని తిరిగిన గున్న ఏనుగే మా డుండి గణపతి,నువ్వు చుసిన నగరమే ఇన్నేళ్ళు నువ్వు కలలు గన్న పరమ పవిత్ర కాశీ నగరం అని వివరించి ... ఇప్పుడు నీ కోరిక నెరవేరిందా " అని అడిగాడు ...

అతనికి మిక్కిలి ఆనందం కలిగి ఆనందాశ్రువులతో స్వామి వారి పాదాల మీద వ్రాలి స్తుతించి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు ... " తండ్రీ,నాకు చిన్నప్పుడు కనిపించి దిశా నిర్దేశం చేసి కాశీని చేరుకొని ఇక్కడ కొలువైఉన్న నిన్ను సేవించమని చెప్పావు ,నీ ఆజ్ఞను శిరోధార్యంగా భావించి కష్టసుఖాలను లక్ష్యపెట్టక ఇన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలు ఎదురైనా నీ నామస్మరణ వీడలేదు.అయినా నేను కాశీకి అనుకున్న విధంగా ఎందుకు రాలేకపోయాను ??? "

అప్పుడు స్వామి వారు ఇలా అన్నారు ...

" నాయనా,అంత కంటే ముందు నీ పూర్వ జన్మ వృతాంతం తెలుసుకోవాలి ... నీవు పూర్వ జన్మలో ప్రస్తుతం నువ్వు పని చేస్తున్న జమీందారు ఇంట్లోనే రెండు తరాలకు ముందు జన్మించావు.నీకు ఎంత సంపద ఉన్నప్పటికీ దానధర్మాలు చేసి ఎరుగావు,పరమ లోభివి.ధనమందు నీకు మిక్కిలి పేరాశ ఉండేది.నీ దగ్గర పనిచేస్తున్న వారికి సమయానికి జీతము ఇచ్చేవాడవు కావు.ఇలా నీకు ఎనభై సంవత్సరాలు వచ్చేంత వరకూ ధనమందు ఆశ పోలేదు.అప్పుడు మీ ఊరికి ఒక యోగి వచ్చాడు.నీ అదృష్టవశాత్తూ నువ్వు ఆయన సత్సంగానికి వెళ్లావు.ఆయన మాటల్లోని వేదాంతానికి ఆకర్షితుడవైనావు."

" నీ ప్రవర్తనలో పరివర్తన వచ్చింది.ఆ యోగికి శిష్యుడవైనావు. పేదలకు దానాలు చేసి ఆ యోగితో కలసి కాశీకి ప్రయాణమైనావు.కానీ నీ వయస్సు సహకరించక మార్గ మధ్యలోనే కాలం చేసావు.నీ చివరి క్షణాల్లో కాశీకి వెళ్ళాలని అనుకోవడం వల్లను,ఒక సత్పురుషునికి భోజనం పెట్టుట వల్లను విశేష పుణ్యఫలం లభించింది.కానీ అంతకు ముందు చేసిన పాప కర్మలు కుడా నువ్వు అనుభవించక తప్పదు కనుక అదే ఊరిలో ఒక నిరుపేదగా జన్మించి,పసి వయస్సులోనే అనధావు అయ్యావు.ఎనభై సంవత్సరాలు అందరినీ బాధపెట్టినందుకు అందులో నాలుగవ వంతు అనగా ఇరవై సంవత్సరాలు మాత్రమే నువ్వు కష్టపడ్డావు.ప్రతి క్షణం నా గురించి తపించినందువల్ల నేడు నీకు మా అందరి దర్శన భాగ్యం కలిగింది."

నువ్వు కాశీకి రావాలని ప్రయాణ ఖర్చులకోసమై దాచిన డబ్బును దోచుకున్నది నేనే,"అన్నాడు ఆ మహా దేవుడు.

ఆ కుర్రవాడు," స్వామీ,ఎందుకని మీరు నేను దాచుకున్న డబ్బును దొంగిలించారు ? అవి లేకపోతే నేను కాశీకి ఎలా రాగలను ? ఏమి మీ ఆట ? అని అడిగాడు ...

అప్పుడు విశ్వనాధుడు ఇలా అన్నాడు , " నేను దొంగిలించినది నీ డబ్బును కాదు ... నీ కర్మను మాత్రమే ... నీ కర్మలకు ప్రతిఫలం ఆ ధనం.కనుక ఆ కర్మలనే నేను దోచుకున్నాను.అవి లేక నీవు కాశీకి ఎలా రాగలవు అనే కదా నీ సందేహం ... "

" చెబుతాను విను,పరీక్షించకుండా దేని విలువా బయట పడదు.నన్ను నమ్మిన ప్రతి భక్తుడినీ మొదట పరీక్షిస్తాను అప్పుడే తన స్థాయి ఏమిటో అందరికీ తెలిసి ఆదర్శనీయుడు, పుజ్యనీయుడు,అనుసరించుటకు యోగ్యుడు అవుతాడు.నీవు తీవ్ర మనస్తాపానికి గురియై దేహ త్యాగం చేసి నన్ను చేరుకుందాం అనుకున్నావు.కానీ ఆత్మహత్యా దోషం మళ్ళీ జన్మ జన్మాంతరాలు కట్టి కుడిపేస్తుంది.ఆ దోషం నీకు అంటకుండా కాపాడవలసిన కర్తవ్యం నాదే.అందుకే నిన్ను గంగమ్మ రక్షించింది.ఏ ఇతర కారణాల వల్ల అయినా ఏ జీవుడైనా ఆత్మ హత్య చేసుకుంటే ఆ దోషానికి తగిన ప్రతి ఫలం అనుభవించాల్సిందే."

" నీవు దేహ త్యాగం చేయుటకు మారుగా తీవ్రంగా పరితపించి ఉన్నా నీకు అక్కడనే మా అందరి దర్శన భాగ్యం కలిగి అక్కడే కాశీ నగరం ఏర్పడేది.జీవుల ఆలోచనలను,చర్యలను బట్టి కార్యాచరణాలు మారిపోతూ ఉంటాయి.కాశీని స్మరిస్తూ ఎక్కడ ఉన్నా కాశీ వాసమే అని గుర్తించు " అని వివరించాడు.

ఆ కుర్రవాడు స్వామి వారి అపార కరుణా వాత్సల్యానికి ఆనందాశ్రువులు కారుస్తూ అలా నిల్చుండిపోయాడు. అప్పుడు స్వామి వారు అతనికి కశీలోనే ఉండేందుకు ఒక చోటు చూపించి యాత్రకు వచ్చేవారికి కాశీ విశిష్టతను వివరించమని ఆదేశించాడు. ఆ కుర్రవాడు ప్రతి రోజు గంగా స్నానం ఆచరిస్తూ,విశ్వనాధ,విశాలాక్షి,అన్నపూర్ణా దేవిలను సాకారముగా దర్శిస్తూ,కాశీ విశిష్టతను యాత్రికులకు వివరిస్తూ అవసానదశలో శివైక్యం చెందాడు.అతని పేరు గుర్తు రావడం లేదు కానీ ఆయన సమాధి ఓక ఘాట్లో ఉన్నదని చెప్పారు.

అందుచేత కాశీ స్మరిస్తూ మనంకూడా మానసికంగా కాశీలోనే జీవించి తరిద్దాం ..

Source - Whatsapp Message