Friday, July 31, 2020

ప్రశ్న : “‘కోపం’, ‘భయం’, ‘చిరాకు’ వంటి మానవ సహజమైన లక్షణాలను పోగొట్టుకోవడం ఎలా ? “

🙏ప్రశ్న : “‘కోపం’, ‘భయం’, ‘చిరాకు’ వంటి మానవ సహజమైన లక్షణాలను పోగొట్టుకోవడం ఎలా ? “🙏

🌷పత్రీజీ :

🤘“‘కోపం ‘, ‘భయం’, ‘చిరాకు’ వంటి మానవ సహజమైన లక్షణాలను పోగొట్టుకోవడం కాకుండా .. ఏవి, ఎక్కడ, ఎప్పుడు ఎలా ఉంచాలో .. అక్కడ, అప్పుడు, అలా ఉంచడం అలవాటు చేసుకోవాలి.

🤘బాత్‌రూమ్‍లో మంచాలు పెట్టడం మరి డ్రాయింగ్ రూమ్‌లో బాత్‌టబ్ పెట్టడం వంటి మూర్ఖపు పనులు చెయ్యం కదా!

🤘ప్రతి ఒక్క వస్తువుకీ ఒక నిర్దిష్టమైన స్థానం వున్నట్లే .. కోపం, భయం, చిరాకు, నవ్వు, ఆనందం .. వంటి ప్రతి ఒక్క లక్షణానికీ కూడా ఒకానొక నిర్దిష్టమైన స్థానం తప్పక వుంటుంది.

🤘నిరంతర ధ్యానసాధన వల్ల మన అంతరంగం మనకు తేటతెల్లం అవుతూ .. మన సహజ లక్షణాలన్నీ మనకు తేటతెల్లం అవుతూ .. మన సహజ లక్షణాలన్నీ మనకు అవగాహనకు వస్తూంటాయి.

🤘జీవితంలో ఏది ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా సవ్యమైన రీతిలో వుంటూ .. ప్రతి ఒక్క క్షణంలోని ఆనందాన్ని మనకు అనుభవంలోకి తెస్తాయి.

🤘ధ్యానం చెయ్యకపోతే ఈ లక్షణాలన్నీ ఏవి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండకూడదో అలా అపసవ్యంగా వుంటూ జీవితాన్ని అమిత గందర గోళంలో పడవేస్తూంటాయి.
💐☘💐☘💐☘💐☘💐☘



Source - Whatsapp Message

ఆధ్యాత్మిక పరిపక్వత ఏమిటి?

🌱💐🌱💐🌱💐🌱💐🌱

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💐తొలి సంధ్యవేళలో వెలుగులునింపే రవితేజోమయుడికి
ప్రణామం ప్రణామం 💐

🙏ఆత్మబంధువు లందరికి శుభ శుభోదయం.🙏


🐋ఆధ్యాత్మిక పరిపక్వత ఏమిటి?....🐋

🌹మీరు ఇతరులను మార్చాలనే ప్రయత్నం మాని మీరు మారడంపై దృష్టి పెట్టడం.

🌹మీరు ప్రజలను వారు ఉన్నవిధంగా అంగీకరించడం.

🌹ప్రతిఒక్కరు చేసేది వారి స్వంత దృష్టికోణంలో సరియై నదేనని భావించడాన్ని నేర్చుకోవడం .

🌹మీరు జరుగనున్నది సంఘర్షణ పడక జరగనివ్వడాన్ని నేర్చుకోవడం .

🌹మీరు ఇతరులతో సంబంధాలు నెరిపేటప్పుడు , వారినుండి ఏమీ ఆశించకుండా , మీరు ఇవ్వడం నేర్చు కోవడం .

🌹మీరు చేసే పనులన్నీ మీ స్వంత శాంతి కొరకే అని అర్ధం చేసుకోవడం .

🌹మీరు ప్రపంచానికి తెలివైనవారిగా నిరూపించే ప్రయత్నాలు మాని వేయడం .

🌹ఇతరులు నీచర్యలను సర్వత్రా ఆమోదించాలని ఆశించకూడదని నేర్చుకోవడం .

🌹మీరు ఇతరులతో పోల్చుకోవడాన్ని మాని వేయడం .

🌹 ఆధ్యాత్మిక పరిపక్వత అంటే మీ అతరంగంతో మీరు శాంతితో మనుగడ సాగించడం .

🌹మీరు "అవసరానికి" మరియు “కోరికలకు " ​​మధ్య బేధమెరిగి ఉండి ,మీ “కోరికలను వదలివేయడం .

🌹మీరు భౌతిక విషయాలలోని సంతోషంతో అనుబంధాన్ని వదలి వేయడం .

💗ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా పరిపక్వత గల జీవితాలు గడపి మీజీవితాలు ధన్యం చేసుకోలరని మనస్ఫూర్తిగా
ఆకాంక్షిస్తూ💗

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF*

🌱💐🌱💐🌱💐🌱💐🌱

Source - Whatsapp Message

_భర్త - స్థితి,గతి-పరిణామక్రమాలు....ఎలా ఉంటాయో చూడండి.

ఒక మిత్రుడు పంపాడు సరదాగా నవ్వుకోడానికి

_భర్త - స్థితి,గతి-పరిణామక్రమాలు....ఎలా ఉంటాయో చూడండి.

‘లేలేత’భర్తలు:
భార్య చుట్టూ తిరుగుతూ ఉండడం..
భార్య చూపు తగిలితే చాలనుకోవడం..,
”అసలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ పెళ్ళవదు”,అనుకోవడం..!
భార్య దగ్గరే స్వర్గం ఉంది అని భావించడం..
అసలు సృష్టిలో భార్య,తను తప్ప ఎవ్వరూ లేరనుకోవడం...!
అన్నీ పనులూ వచ్చని చెప్పడం..!
తమ జీవితంలో సంఘటనలన్నీ,అడిగినా అడక్కపోయినా స్వచ్ఛందంగా,అమాయకంగా ఉన్నది ఉన్నట్టు భార్యకు చెప్పేసుకోవడం..!
కొన్ని బలహీన క్షణాల్లో ..భవిష్యత్తు ఊహించక భయంకర వాగ్ధానాలు చేయడం..

{“ఈ దశ పెళ్ళైన పదహారు రోజుల పండగ వరకు ఉంటుంది..!”}

‘దోర’భర్తలు:
పదహార్రోజులంత ఉత్సాహం ఉండదు కానీ ,
కొంత పచ్చి మిగిలుంటుంది....
“అన్నీ చెప్పేసామే..!
కొన్ని దాచ వలిసిందే “అని అలోచిస్తూ ఉండడం..
పర్లేదులే పరాయిది కాదుకదా కట్టుకున్న భార్యేగా అర్థం చేసుకుంటుంది లే ,అయినా మా మధ్య రహస్యాలు ఉండకూడదు”
అని నమ్మకంగా ఉండటం..
కాస్త బాహ్య ప్రపంచంలో వేరే మనుషులు కూడా కంటికి కనపడుతూ ఉండడం.
భార్యని చీటికి మాటికి సినిమా-షికార్లకి తిప్పడం..
అడక్కపోయినా చీరలు -నగలు కొనిస్తూ ఉండడం..!
భార్యకి చిన్నగాయం అవడానికి కొన్ని క్షణాల ముందునుండే కంగారు దిగులు..
కళ్ళల్లో నీళ్ళు తెచ్చేసుకోవడం..
విలవిల్లాడిపోవడం..
భార్య వైపు బంధువులను కూడా అతి ప్రేమగా చూడ్డం..
భార్య పని చేస్తుంటే లాక్కుని ‘నే చేస్తాలే’అనడం..
తనని పని చేయనివ్వక పోవడం...

{“ఈ స్థితి పెళ్ళైన ఆర్నెల వరకూ ఉంటుంది..!”}

‘వగరు’భర్తలు:
అన్నీ అనవసరంగాచెప్పేసాం అని దిగులు పెరగడం..!
ఆఫీస్ అయి పోయిన వెంటనే స్కూల్ పిల్లాడిలా ఉత్సాహంగా వెంటనే ఇంటికి వచ్చేయడం..
“ఉద్యోగం చేసి ఇంటి పనులూ చేయడం నా వల్ల కాదు “అని అనుకోవడం..
అప్పుడప్పడూ మాట మాట పెరిగి,
మళ్ళీ సర్దుకు పోవడం..
కొంచెం భార్యని అదుపులో పెట్టుకోవాలి అనే విపరీత ఆలోచనలు రావడం..!
బైటకి తిప్పడం తగ్గించడం.భార్య ఏదైనా కొనమని చెప్తేనే కొనడం..!
భార్యకి చిన్న చిన్న దెబ్బలు తగిలి తనకి చూపిస్తూ తిరిగితే “ఏదైనా మందు వేసుకో “ఎంతసేపని అలా పనిచేస్తూఉంటావ్”అని పేపర్ చదవుతూ రెండు వేళ్ళతో పేపర్ వొంచి ..నిర్లిప్తతగా చెప్పడం..
కానీ భార్య వల’పు’ వల్ల కాదులే మనం కూడా ఇంటి పని చెయ్యాల్లే కాస్త ,పాపం తను ఒక్కతే కష్టంకదా చేసుకోవడం..అని భావించడం..!

{“ఈదశ పెళ్ళైన ఆర్నెల్ల నుండి మెదటి సంవత్సరం వరకూ ఉంటుంది..!”}

‘పండిన’భర్తలు:
భార్యకి తన విషయాలు అన్నీ చెప్పడం తప్పని నిర్థారించుకోవడం..!
భార్యతో కాస్త ముభావంగా ఉండడం ..ముక్తసరిగా మాట్లాడ్డం..!
భార్యని ఖశ్చితంగా అదపులో పెట్టాలి ..
లేకపోతే కష్టం అని నిర్ణయించుకోవడం..
ఆఫీస్ అయ్యాక ఊరంతా తిరిగి ఉసూరుమంటూ ఇంటికి రావడం రావడం తోనే భార్య సంధించే,
“ఎందుకు లేటైంది?
ఆఫీస్ అయ్యాక ఎక్కడికైనా వెళ్ళారా..?....”
లాంటి ప్రశ్నలు .. తట్టుకోలేక కోప్పడ్డం
(ఇది మొదటి స్వచ్ఛమైన కోపం)
‘ఏమనుకుంటోందో నేనంటే??’
అని తనలో తను మాట్లాడుకుంటూ ఉండడం..
ఇంట్లోపని నేను చెయ్యను చేస్తే చేస్తుంది లేకపోతే మానేసుకుంటుంది...అయినా ఆడవాళ్ళపని మనం చేయడమేంటి..?అని నిశ్చయించుకోవడం..!

{“ఈదశ మొదటి సంత్సరం దాటాకా ఆర్నెల్లు ఉంటుంది..!”}

‘పొగరు’భర్తలు:
నేను మగాణ్ణి నా ఇష్టం ..
అనే భావనతో మెలగడం..భార్య ఏమైనా ప్రశ్నలు అడిగినా ,తన గతం ఎత్తి దెప్పుతూంటే
చిరాకు పడ్డం ..కోపంగా అరవడం..ఇంట్లోంచి ఆవేశంగా వెళిపోవడం..
రాత్రికి చల్ల బడ్డం..తనే ముందుగా,భార్యతో మాట్లాడ్డం “అన్నం తిందామా”అని అడగడం..
మళ్ళీ ఉదయం మామూలే..

{“ఈదశ ఆర్నెల్లు ఉంటుంది..!అంటే పెళ్ళయ్యి అప్పటికి రెండేళ్ళు ముగుస్తుంది..ఈ దశ దాటాక క్రొత్త కష్టాలు మొదలౌతాయి...!”}

‘విసుగు’భర్తలు:
పిల్లల ఏడ్పులతో విసుగు చెందడం..!
భార్య, ”పిల్లల్ని చూస్తూండండి”అని చెప్పినప్పుడు.
కోపం-చికాకు అణుచుకోవడం..
ఓర్పు క్షీణించడం..
“ఛ ఛ కొంపలో మనశ్శాంతి లేదు”
అని వీధుల్లో తిరగడం..
పాత మితృలను కలవడం..
పుట్టింటిని,అమ్మా నాన్న ను ఎక్కువ తలుచుకుంటూ ఉండటం...
చదుకున్న రోజులు గుర్తు తెచ్చుకోవడం..
ఇంటికి వెళ్ళాలంటేనే చికాకు రావడం..
భార్యపై అరుస్తూ ఉండడం..
భార్యతో వాదనకు దిగడం..
భార్య తన గతం ఎత్తి దెప్పుతుంటే,
వస్తువులు పగలకొట్టడం..
ఆవేశంగా బైటకి వెళిపోవడం..
ఈ దశలో భార్య తనకి కనిపించేలా తన అనారోగ్యం..దెబ్బలు చూపిస్తూ,ప్రదర్శిస్తూ తిరుగుతూ ఉన్నా..భర్త అస్సలు పట్టించుకోరు ఏమీ స్పందించరు..”ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి ఏం చిన్న పిల్లా??”అని మనసులో అనుకోవడం....
“ఇంకా పెళ్ళికాని తన స్నేహితులకి చేసుకోవద్దురా నామాట విను”అని సలహాలు చెప్తూండడు..
పెళ్ళి చేసుకున్న వాళ్ళపై జాలి ,సానుభూతి చూపడం..

{“ఈ దశ పిల్లలు హైస్కూల్ చదువులకు వచ్చే వరకూ ఉంటుంది...!”}

’దిగులు’భర్తలు:
ఆదాయం కంటే ఖర్చులు పెరగడం..
అప్పులు చేయడం..
ముందు ఘోరం ఊహించక,భార్యని “ఏమైనా మీ ఇంట్లో వాళ్ళని అడుగుతావా??”
అని అభ్యర్థించడం..!
భార్య తెచ్చిచ్చి,గొడవలైనప్పుడల్లా “మా పుట్టి

ంటివాళ్ళు ఇస్తేనే గానీ దిక్కు లేదు”అనే ఈ అతి ప్రమాదకరమైన అస్త్రం ప్రయోగించినపుడు..
భార్యని ఏమీ అనలేక,మానసికంగా కుంగిపోవడం..కుమిలిపోవడం..
గిలగిల్లాడిపోవడం..!
భార్య”ఏం మా వాళ్ళు ఇంటికొస్తే నోరు పెగల్దే ..?మొహం మాడ్చుంటావ్..అదే మీ వాళ్ళొస్తే చంద్రబింబం అయిపోతుంది అయ్యగారి మొహం..మా వాళ్ళని చూడలేవు కళ్ళల్లో నిప్పులు పోసేసుకుంటావ్.పలకరిస్తే నీ ఆస్తులు కరిగిపోతాయా??.”లాంటి మాటలు..
భర్త వైపు చుట్టాల ఫంక్షన్లకి వెళ్ళొచ్చాక కొన్ని నెలలపాటు భార్య,”చూసావా మీ వాళ్ళు ఎలాంటి చీర పెట్టారో !ఇల్లు తుడవడానికి కూడా పనికిరాదు!ఓ మంచిగా పలకరింపు లేదు.!తిన్నావామ్మా?అని అడిగింది లేదు..!గొప్పకుటుంబాలు ..!గొప్ప వంశం మీది..!”
లాంటి మాటలు వింటూ..
“పెళ్ళి అనవసరంగా చేసుకున్నాను”
అని పశ్చాత్తాప పడడం..
మా నాన్నగారు”పెళ్ళైంది ..ముందులా కాకుండా జాగర్తగా ఉండాలి”అని చెప్పిన మాటకి అర్థం ఇప్పుడు తెలుస్తోంది...!అని బాధపడడం..
శూన్యంలోకి పిచ్చి చూపులు చూస్తూ నవ్వకోవడం
చిన్న చిన్న మానసిక,శారీరక అనారోగ్యాలు..!
ముఖంలోదిగులు -బెంగ-నిరాశ,ఎదుటివారికి
కొట్టొచ్చినట్టు కనపడ్డం...

{“ఈదశ చాలా ప్రమాదకరమైన దశ,ఈదశలోనే చాలా మంది వ్యసనాలు అలవాటు చేసుకోవడం,
పూర్వపు ఆడ స్నేహితురాళ్ళకు దగ్గర కావడం..
ఇలా చాలా ఘోరంగా ఉంటుంది..
లేదా దేవునిపై విపరీతభక్తి ..
గుళ్ళకి ,గోపురాలకి ఎక్కువ తిరగడం..
పూజలు,ఉపవాసాలు,
ఎక్కువగా చేస్తూ ఉండడం...
ఎక్కువగా దేవుని ప్రవచనాలు వింటూండడం..
అమ్మ నాన్నలపై విపరీతమైన ప్రేమ కలిగే దశ...!ఇది సుమారు పిల్లలు డిగ్రీకి వచ్చే వరకూ ఉంటుంది...!}

‘బరువు’ భర్తలు:
పిల్లలకి పెళ్ళి సంబంధాలు చూడ్డం అనే బరువు మీద పడి.....
తన బాధలు మర్చిపోవడం..
(ఇక్కడే భర్త తన భర్త తత్వాన్ని కోల్పోయి ఏదోచేద్దాం అనుకున్నవి మరిచిపోయి)
నేను తండ్రిని ..నేను తండ్రిని ..
‘పిల్లలకి పెళ్ళి చేసెస్తే ప్రశాంతంగా ఉండచ్చు’అని అనుకోవడం...

{“ఈ దశ పిల్లలకు పెళ్ళి చేసి ..ఆ పిల్లలకు పిల్లలు పుట్టే వరకు ఉంటుంది ..
అంటే ఒకప్పటి భర్త ..తండ్రి దశ దాటి తాత అవ్వడం..”}

‘చల్లారిన’భర్తలు:
పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటూంటారు..
వీరికి ఇక ఏ బాధ్యతలు ఉండవు..
ఓపికా ఉండదు..కానీ అప్పటికింకా భార్యకి ఓపిక ఉండటం ..ఒకప్పుడు తను తిట్టాలనుకున్నవి..
అనాలని ఆపుకున్నవి అన్నీ గట్టిగా భర్తకి వినిపించేలా తిట్టడం..జరుగుతుంది..
కానీ ఏమీ వినపడనట్టు “వంటైందా..?”
అని అమాయకంగా అడగడం పడక్కుర్చీలో కళ్ళ జోడు సర్దుకుంటూ పేపరు చదివినట్టు అడ్డు పెట్టుకుని ..”అన్నీ గుర్తున్నాయ్ దీనికి ఎన్నెన్ని మాటలంటోంది నాయనో పెళ్ళంత నరకం లేదు..
నడుం వొంగాక పూర్తి జ్ఞానం వచ్చి
ఏం ప్రయోజనంలేదు..
పోనీ ,తిట్టుకుంటే తిట్టుకోని మనకింత ముద్దపాడేస్తోందిగా ఎవరి పాపాన వారే పోతారు ప్రొద్దున్నేగా టివి లో ప్రసంగం విన్నాంగా..అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు”అని సమాధాన పడతారు..ఈలోపు “మింగడానికి తగలడు”
అని పిలుపు వినపడగానే ..కిక్కురుమనకుండా వచ్చి అన్నంతిని కాలం గడుపుకుంటూ ఉండడం..

{“ఈదశ చివరి దశ ఇక్కడితో భర్త పాత్రకు శుభం పడుతుంది...”}

అంకితం:*
భర్తగా మారిన వారికి..,
భర్తగా మారాలనుకునే వారికి..,
భర్తగా మారకూడదు ,అని అనుకునే వారికి..
ఈ వ్యాసం అంకితం.....
🙏🙏🙏🙏💐💐💐

దండాలు పెళ్ళైన వారికి..
పూలు పెళ్ళి కాని వారికి...👏

Source - Whatsapp Message

మనస్సు మర్మం: నీవెవరవో తెలుసుకో.. నీవే ప్రపంచం

🌸మనస్సు మర్మం: నీవెవరవో తెలుసుకో.. నీవే ప్రపంచం*🌸

అందరూ మనసు మనసు అంటారు ..
అసలు మనసు అంటే ఏమిటో ...
వాయు వేగంగా పరుగులు తీస్తూ''
లేనిది కోరుతూ ఉన్నది వదిలేస్తూ ...
గతాలను తవ్వేస్తూ భవిష్యత్ ను భయ పెట్టేస్తూ ..
కాలాన్ని వృదాచేస్తున్న ఎవరు ఈ మనసు
ఏమిటి ఈ మనసు అంటే అర్ధం ????

''ఆ'' అంటే ఎక్కడో సుదూరంగా ....................
''లోచనం అంటే కన్ను"
ఆలోచన అనే పదంలోనే 'ఆ' అంటే ఎక్కడో దూరంగా మనకన్నా భిన్నంగా గాని మనకన్నా వేరుగా ఉన్నదాన్ని సూచిస్తుంది. ఆలోచనంలో ఉన్న 'లోచనం' అంటే కన్ను అని అర్థం.

అంటే దీన్నిబట్టి చూస్తే ''మన మనసే ఒక కన్ను అనవచ్చు''.
ఈ మనసు అనే కన్ను ఎంత సేపటికి బయటకే పరుగెడుతుంది .
కాబట్టి దీన్ని ఆలోచనం అంటున్నాం. అంటే బాహ్యంగా ఉన్న విషయాన్ని
''మనలోనే ఉన్న మనసుతోనే చూస్తున్నాం. '' మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ- పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే.
''నీవెవరో తెలుసుకో' అని బోధించిన రమణ మహర్షుల వారైనా 'నీవే ప్రపంచం' అన్న జిడ్డు కృష్ణమూర్తి తత్వమైనా నీలో ఉన్న ప్రపంచాన్ని నిన్నే చూడమంటోంది.
అరిషడ్వర్గాలను స న్యసించి ''మనసు బుద్ది వాక్కు ''ను ఏకం చేసి పరుగులు తీసే మనసును నిలువరించి ''
'' భాహ్యంగా ఎక్కడి నుండి ఎక్కడికో పరుగులు తీస్తున్న ఈ ''లోచనంను'' అభ్యాసం ద్వారా ( బాహ్య ప్రయాణం నుండి అంతః ప్రయాణం చెస్తూ ) అంతర్ముఖం గావించిన వారు మాత్రమే సాధకుడు ''
ఇక నేను ధ్యానిని ......
నేను యోగిని .....
నేను సాధకుడను ......
నేను సన్యాసిని ............
నేను గురువును .....
నేను ... నేను ......
ఇలా ఎవరి మనసుకు వారు నేను '' నేను '' నేనే '' అని చెప్పుకునే వారు '' ముందు ఎవరికీ వారు మన ''మనసును జయించామా , అరిషడ్ వర్గాలు అదుపులో ఉంచామా '' ( కామ ,క్రోధ , లోభ, మోహ , మధ మాత్సర్యాలను పూర్తిగా సన్యాసించమా ) అని '' మన గురువును అడిగేస్తే మనకు సత్యం చెప్పేస్తాడు '' అదేనండి మన గురువు మన మనస్సే .. మనం యోగులమా , భోగులమా అని మనల్ని మనకు అద్దంలో చూపిస్తుంది . '' ఈ మనసును జయించనంత కాలం నువ్వు సాధకుడవు కాదు ..'' భోదకుడవు మాత్రమే " సాధన చేద్దాం సాధ్యం కానిది ఏముంది.👏

Source - Whatsapp Message

Sunday, July 26, 2020

ఆ బాలుడే తరువాతి కాలంలో చాణక్యుడిగా ప్రసిద్ధి పొందాడు.

👌 ఒక చిన్న బాలుడు తన తల్లితో కలిసి నివసించేవాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ బాలుడు అన్ని విషయాలలో చాలా చురుకుగా, తెలివిగా మరియు చూడడానికి అందంగా ఉండేవాడు. ఆ బాలుని తల్లి ఎప్పుడూ విచారంగా ఉండేది.

ఒకరోజు ఆ బాలుడు తల్లిని , ఎందుకమ్మా ఎప్పుడూ విచారంగా ఉంటావు? అని అడిగాడు. దానికి ఆమె ” ఒక జ్యోతిష్కుడు నీకు ఉన్న ప్రత్యేకమైన పలువరుస (పళ్ళు) కారణంగా నీకు చాలా కీర్తి, ప్రతిష్టలు వస్తాయి అని చెప్పాడు” అని చెప్పింది. దానికి ఆ బాలుడు అందులో విచారించవలసినది ఏముంది? నాకు కీర్తి రావడం నీకు ఇష్టం లేదా? అని అడిగాడు. బాబూ; ఏ తల్లి తన కొడుకు గొప్పవాడు కావాలని కోరుకోదు? నాకు ఇష్టమే, కాని నీకు వచ్చే కీర్తి,ప్రతిష్టల కారణంగా నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతావేమో అని భయంగా ఉంది,అని చెప్పింది.

అదివిన్న బాలుడు కూడా ఏడవడం ప్రారంభించాడు. కొంతసేపటి తరువాత ఇంటి నుండి బయటకు వెళ్ళి ఒక పెద్ద రాయి తీసుకుని తన పలువరుస(పళ్ళు) ఊడిపోయేలా కొట్టుకోసాగాడు. అతని నోటి నుండి రక్తం కారసాగింది.

ఇంటినుండి బయటకు వచ్చిన ఆ తల్లి అది చూసి ఆశ్చర్యంతో, బాధతో ఎందుకలా కొట్టుకుంటున్నావని ఆ బాలుని అడిగింది. అప్పుడు ఆ బాలుడు ఈ పలువరుస(పళ్ళు) కారణంగా నేను నీకు దూరమౌతానంటే, అలాంటి పలువరుస(పళ్ళు) నాకు వద్దమ్మా, నేను నీకు సేవ చేస్తూ నీ ఆశీస్సుల వల్ల మాత్రమే జీవితంలో పైకి రావాలని కోరుకుంటున్నాను అన్నాడు.
ఆ బాలుడే తరువాతి కాలంలో చాణక్యుడిగా ప్రసిద్ధి పొందాడు.🙏



Source - Whatsapp Message

Friday, July 24, 2020

"నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?" అతడు అనుకున్నాడు నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ?

"మనలో చాలామందిమి అనుకుంటాం . నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?"
అతడు అనుకున్నాడు నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని

జరిగిన కధ !

స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో 1892 లో జరిగిన వాస్తవం.

18 సంవత్సరాల ఆ యువకుడు ఫీజులు కట్టలేక ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో ఉన్నాడు . అతడు తల్లి తండ్రులు లేని అనాధ !

అతడూ అతడి స్నేహితుడూ కలిసి ఒక పధకం ఆలోచించారు . వాళ్ళ యూనివర్సిటీ లో ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేద్దామనీ , అందులో ఖర్చులు పోను మిగీన దానితో తమ ఫీజులు కట్టెయ్యవచ్చు అనీ నిర్ణయించుకున్నారు.

అప్పట్లో గొప్ప పియానో వాద్య కారుడు
Ignace J.Paderewski. వద్దకు వెళ్ళారు...ఆయన మేనేజరు ఫీజు రూపం లో 2000 డాలర్లు కనీస మొత్తం గా ఇవ్వాలనీ,ఆ పైన ఇతర ఖర్చులు అనీ ఒప్పదం చేసుకున్నారు.వీళ్ళు అంగీకరించారు.టికెట్లు అమ్మడం సాగించారు . అనుకున్న రోజు వచ్చింది . ప్రోగ్రాం అద్భుతం గా జరిగింది . అయితే వీళ్ళు అనుకున్నట్టు వసూళ్లు రాలేదు.మొత్తం 1600 డాలర్లు మాత్రమె వచ్చింది.

వాళ్ళు #Paderewski. దగ్గరకు వెళ్ళారు . వసూలు అయిన మొత్తమూ,400 డాలర్లకు చేక్కూ పట్టుకు వెళ్లి జరిగిన మొత్తం విషయం చెప్పారు . సాధ్యమయినంత త్వందరలో ఆ మిగిలిన సొమ్ము చెల్లిస్తాము అనీ,క్షమించమనీ అన్నారు.

వాళ్ళ గురించి Paderewski. కి తెలీదు .. ఆయన వాళ్ళని అతకు ముందు చూడలేదు . ఆయన ఆ చెక్కును చింపేశాడు . . 1600 డాలర్లూ వాళ్ళ చేతిలో పెడుతూ వాళ్ళతో ఆయన ఇలా అన్నాడు.

"మీకు అయిన ఖర్చులు ఎంతో లెక్క పెట్టుకోండి. మీ ఫీజులకు ఎంతో అవుతోందో అది కూడా ఇందులో నుండి మినహాయించుకోండి. ఏమైనా మిగిలితే ఆ మిగిలిన సొమ్ము నాకు ఇవ్వండి "

ఈ సంఘటన Paderewski మానవతను చాటి చెబుతుంది . తనకు తెలీని , తనకు ఏమీకాని , వారి వలన ఎటువంటి ప్రయోజనమూ ఆశించకుండా తన శ్రమనూ , తన ఆదాయాన్నీ ఇవ్వడం Paderewski హృదయం గురించి చెబుతోంది కదూ!

మనలో చాలామందిమి, అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని.

అదే ఉత్తములకీ మనకీ తేడా !
ఇది ఇక్కడితో ఆగిపోలేదు

Paderewski తర్వాతి కాలం లో పోలాండ్ ప్రధాని అయ్యారు.

రెండో ప్రపంచ యుద్ధం లో పోలాండ్ సర్వ నాశనం అయిపొయింది.15 లక్షల మంది ఆకలితో అలమటించే స్థితికి చేరారు.

Paderewski కి ఏమి చెయ్యాలో తోచలేదు . ఎవరిని అడగాలో తోచలేదు . చివరికి అమెరకా ఆహార , పునరావాస విభాగాన్ని సంప్రదించాడు

దానికి అధిపతి #HerbertHoover . ఇతడే తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా అయ్యాడు . అతడు వెంటనే ప్రతిస్పందించాడు . టన్నులకొద్దీ ఆహార పదార్ధాలు పోలాండ్ కు సరపరా జరిగింది. పోలాండ్ లో ఆహార సంక్షోభం నివారించబడింది

Herbert Hoover చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి Paderewski అమెరికా వెళ్లి హూవర్ ను కలిశాడు . కృతజ్ఞతలు చెబుతూ ఉండగా హోవర్ అన్నాడు

కొన్ని సంవత్సరాల క్రితం మీరు కాలేజీ ఫీజులు కట్టలేని ఇద్దరు యువకులకు సహాయం చేశారు .వారిలో నేను ఒకడిని.

ఈ ప్రపంచం ఒక అద్భుతమైన విషయం!!!

"నీవు ఏది ఇస్తావో అది నీవు అనేక రెట్లు పొందుతావు అనే గీతాసారం ఇది."

"
The world is a wonderful place. What goes around usually comes around."*

Source - Whatsapp Message

జీవించటం అంటే ఏమిటి..!?

జీవించటం అంటే ఏమిటి..!?

🌸 జీవించటం అంటే..
కేవలం సుఖంగా కాలం గడపటం కాదు.
హాయిగా సుఖంగా కాలాన్ని వెళ్లదీస్తూన్న
వారంతా నిజానికి జీవించటం లేదు
ఇంతకీ జీవించటం అంటే ఏమిటి మరి..!?

🌸 గొప్ప విషయాల సృష్టి, లేదా గుర్తింపు ఒకే మూసలో జీవించే వారివల్ల ఎన్నడూ
సాధ్యపడనేలేదు. విభిన్న పరిధుల్లో అన్వేషణలు చేసేవాడికే; ప్రయోగ
పరిశోధనలు చేసేవాడికే.. అంతఃచేతన
సుసంపన్నం అవుతుంది. లోలోపల... ద్వారాలనేకం తెరుచు కుంటాయి.

అపుడు మన అస్తిత్వం విస్తరిస్తుంది. మన వ్యక్తిత్వం
పెరుగుతుంది. మన పరిధి పెద్దదౌతుంది..కనుక మనకు సాధ్యమైనన్నిపరిధుల్లో జీవితానుభవం పొందాలి. ఎందుకంటే అనుభూతులే జీవితం కనుక.

🌸 నిజమైన మనిషి ఎప్పటికీ ఏఒక్కదానిలోనూ
స్థిరపడలేడు. నిజమైన మనిషి నిరంతర అన్వేషి.
నిరంతర సంచారి. నిరంతర శోధకుడు.
నిరంతర అభ్యాసి. నేర్చుకునేవాడుగా వుంటాడు.
నేర్చేసుకొని వుండడు. పండితుడుగా మిగిలిపోడు.

🌸 ఏది నేర్చుకున్నా సంపూర్ణంగా సమగ్రంగా ల్లోతుల్లో నేర్చే ప్రయత్నంలోనే వుంటాడు. అది నాట్యమో
గానమో లేఖనమో కవిత్వమో కావొచ్చు. ప్రేమ
కూడా కావొచ్చు. ఏదైనా లోతుల్లోకి వెళితేనే..
దాని రహస్యాలు వెల్లడవుతాయి.

🌸 ఓ పుష్పం అందంగా వికసిస్తుంది. సుగంధాలు
సైతం వేదజల్లుతూ. కనిపించే దాని అందాలు..
కనిపించని ఆ మొక్కమూలంలో కదా వుంటాయి. అలా దాన్ని వ్యక్తం చేసేందుకు బహుశా అది పడిన
తపనా; రహస్య ప్రయత్నమూ..మట్టిని పువ్వుగా మార్చే ఆ ప్రక్రియ..వివిధ రూపాలుగా రంగులు, సువాసనలు వంటి అసలు రహస్యాలన్ని
మూలంలో..వేర్లలో వుంటాయి. పుష్పాలు కేవలం
ఆ మొక్కయొక్క ఆనందపు ప్రకటనలు మాత్రమే.

అన్నింటినీ అలా వాటిలోతుకంటా తరచి చూడటం వస్తే.. మనల్ను మనమే మనలోతుల్లోకి చూడటం అలవడుతుందని
అది నేర్వటమే..జీవించటమని తత్వం అంటుంది...

🌸 నేర్చుకోవడంలో సోక్రటిస్ని, చెప్పడంలో గర్జియప్ ని.. సంగీతం లో బిస్మిల్లాఖాన్ని,
ప్రేమించటంలో అమ్మ ని, నిత్యం నేర్చుకుంటూ, నేర్పుతూ... కాళీ అనేది ఉంచకుండా ఎలా ఉండాలో చెప్పే పత్రి sir ని ... వీరంతా మనకు రోల్ మోడల్స్...
మన జీవితం మనమే తీర్చి దిద్దుకుంటే అదే అసలు జీవనం.. ఎందుకంటే అక్కడ ఉండేది మనమే... ఎం చేసిన ఎలా చేసిన అనుభూతి మనదే... ఆస్వాదన మనదే.. జీవితం మనదే.. జీవించేది మనమే... ఇంకొకరితో పోలిక లేకుండా మన జీవితంలో మనం లయమౌదాం...

Thank you....🌸

Source - Whatsapp Message

Thursday, July 23, 2020

ఆడది ఏమి చేసినా తప్పే ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి...

ఆడది ఏమి చేసినా తప్పే ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి...
●నవ్వితే అమ్మో ఆపిల్ల చూడండి బుద్ది లేకుండా ఎలా నువ్వుతుంది అంటారు!!!
●ఏడిస్తే దరిద్రం ఎడవకూడదు అంటారు!!!
●నలుగురిలో కలిసిపోతే సిగ్గు ఎగ్గూ లేకుండా చూడండి ఎలా వుందో నలుగురిలో అంటారు!!!!
●నలుగురితో కలవకపోతే ముచ్చు మొహంది అస్సలు కలవదు అంటారు!!!
●బయటకు వెళ్లి అన్ని పనులు చక్కబెట్టుకుంటే అమ్మో..అసాద్యురాలు అంటారు!!!
●బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే చేతకానిది అసమర్థురాలు అంటారు!!!
●ఉద్యోగం చేస్తే మగరాయుడు అంటారు!!!
●ఇంట్లో ఖాళీగా ఉంటే సోమరి అంటారు!!!
●లక్షణంగా తయారయితే సోకులాడి అంటారు!!!
●చింపిరిగా ఉంటే మోటు మనిషి,,మొరటు మనిషి అంటారు!!!
●భర్తను ప్రపంచంగా భావిస్తే..రెండో పని లేదు మొగుడే ప్రపంచం అంటారు!!!
●భర్తను పట్టించుకోకుండా హద్దుల్లో ఉంటే దానికి పొగరు బెట్టు చేస్తుంది అంటారు!!!
●పిల్లల్ని త్వరగా కంటే ముసలిదయ్యింది అంటారు !!!
●లేటుగా కంటే..ఈలోపు కొన్ని నోర్లు గొడ్రాలు అంటారు!!!
●భర్త బయటకు వెళ్లెప్పుడు ఎదురొస్తే ఈవిడ ఎదురొస్తేనే తిరిగి వస్తారా అంటారు!!!
●భర్త బయటకు వెళ్లెప్పుడు రాకపోతే ఎప్పుడు పని పని,,దీనికి ఇంటి పని తప్ప మొగుడు ధ్యాస ఉండదు పాపం పొద్దునే వెళ్తే ఎప్పుడో రాత్రికి కదా వచ్చేది అంటారు!!!
●భర్త కోసం ఎదురు చూస్తుంటే ఎక్కడికి పోతారు రారా...అంటారు!!!
●ఎదురుచూడకపోతే వాడి జీతం మీద వున్న శ్రద్ధ మనిషి మీద ఉండదు అంటారు!!!
●పిల్లలకి భయం చెప్తే వామ్మో...అది తల్లి కాదు రాక్షసి అంటారు!!!
●ముద్దుగా గారాబంగా పెంచితే హద్దు లేకుండా పెంచుతుంది అంటారు!!!
●ఒక రూపాయి ఖర్చు పెడితే దుబారా అంటారు !!!
●దాచిపెడితే పీనాసి అంటారు !!!
●ఓపెన్ గా మాట్లాడితే ఏది దాచుకోలేదు అంటారు!!
●మౌనంగా ఉంటే కుళ్లు ఎక్కువ వ్యసన పడుతుంది అంటారు !!!

#ఇవన్నీ ప్రతి ఒక్క మహిళ ఏదో సమయంలో ఎదుర్కొంటూనే ఉంటుంది...

#కాని తానెక్కడ కృంగిపోదు ఎందుకంటే స్త్రీ కాబట్టి మాతృమూర్తి కాబట్టి...

#గౌరవించక పోయినా పర్వాలేదు బాధ పెట్టవద్దు

Source - Whatsapp Message

పెళ్లంటేనూరేళ్లు

పెళ్లంటేనూరేళ్లు

🙏తాళాలు, తప్పట్లు, పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, మూడు ముళ్లు, బంధువుల సందడి ఇది భారతీయ హిందూ సంప్రదాయ పెళ్లి. ఇల్లంతా పచ్చటి తోరణాలు, చుట్టాల ముచ్చట్లు, ఆడవాళ్ల ఆభరణాలు, పట్టుచీరల సోయగాలు, పిల్లల కోలాహలంతో.. పెళ్లి ఇంటి సందడే సందడి. ఇక మూడు ముళ్లతో ఒక్కటయ్యే జంట సంగతి చెప్పనక్కరలేదు. చిలిపి ఆలోచనలు, సిగ్గు తెరలు, ముసిముసి నవ్వులు, అందమైన అలంకరణలో మెరిసిపోతుంటారు వధువు, వరుడు.



పవిత్రంగా భావించే హిందూ సంప్రదాయ పెళ్లిలో చాలా విశిష్టతలున్నాయి. చాలా ఆచారాలు, సందప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం వెలుతులో కొత్తజీవితాన్ని ఆహ్వానిస్తున్న వధూవరులు.. పెళ్లికి పరమార్థం చెప్పే వేదమంత్రాలు.. శ్రావ్యంగా వినిపించే మంగళవాయిద్యాలు.. మనస్పూర్తీగా దీవించే పెద్దలు.. అందరికీ ఆహ్వానం పలికే పచ్చటి పందిరి.. ఘుమఘుమల సువాసనలతో నోరూరించే విందు భోజనం.. అన్నింటి మేళవించే.. తెలుగింటి పెళ్లి వైభోగం. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడాలంటే.. అయితే పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ఘట్టం, ప్రతి ఆచారం, ప్రతి వాగ్ధానం వెనక చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయి. అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది.
హిందూ సంప్రదాయానికి అద్దంపట్టే తెలుగు పెళ్లిలోని విశేషాలు, వాటి విశిష్టతలు ఏంటో ఒక్కసారి గుర్తుచేసుకుందాం..

బాసికంపెళ్లిఅంటేయేమిటి ?

ముందుగా వధూవరుల అలంకరణకు ఖచ్చితంగా ఉపయోగించేది బాసికం. వధూవరుల నుదుటిపై కాంతులీనే ఆభరణమే బాసికం. దీన్ని పూలతో, బియ్యపు గింజల కూర్పుతో, ముత్యాలతో తయారు చేస్తారు. దీన్ని పెళ్లి సమయంలో ఖచ్చితంగా వధూవరులు కట్టుకోవాలి. ఎందుకనే డౌట్ అందరికీ ఉంటుంది. దృషి దోష నివారణకు బాసికాన్ని కడతారు. సున్నిత భాగాలపై దృష్టి దోషం తగలకుండా ఉండటానికి బాసికాన్ని కడతారు.

జీలకర్ర, #బెల్లం

జీలకర్ర, బెల్లం కలిపితే ధన విద్యుత్ ఉత్పన్నమై వస్తువులను ఆకర్షించే శక్తి కలుగుతుందని సైన్స్ చెబుతోంది. జీలకర్ర, బెల్లం పెట్టడం వల్ల తలపై ఉండే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. అలాగే జీలకర్ర, బెల్లం మిశ్రమం బాగా కలిసిపోతుంది. అలా వధూవరులు కూడా కలిసిపోవాలని పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.

వధూవరుల మధ్యలో తెర మధ్యలో ఉంచే తెరకు కూడా అర్థం ఉంది.

వధువును జీవాత్మగా, వరుడిని పరమాత్మగా భావిస్తే మధ్యలో ఉండే తెర మాయ. జీవాత్మకు పరమాత్మ దర్శనం కావాలంటే మాయను తొలిసారి తలపై చేతులు ఉండగా భ్రూమధ్య స్థానంలోనే చూస్తారు. ఇలా వాళ్ల బంధం బలపడుతుందని అర్థం.

కన్యాదానం దానం చేస్తే ఆ వస్తువుతో మనకు అన్ని సంబంధాలు తెగిపోతాయి.

కానీ పెళ్లిలో మాత్రం అలా కాదు. దానాలలో అతి శ్రేష్టమైనది కన్యాదానం. పెళ్లికూతురి తండ్రి తన కూతురిని వరుడికి దానం ఇస్తారు. పంచ భూతాల సాక్షిగా, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురిని ధర్మ, అర్థ, కామ, మోక్షాలకై అల్లుడికి దానమిస్తాడు వధువు తండ్రి. ఈ దానం వల్ల తనకు బ్రహ్మలోక ప్రాప్తి కావాలని కోరుకున్నట్లు. బ్రహ్మముడి వధువ చీర అంచును, వరుడి ఉత్తరీయం చివరలను కలిపి ముడి వేయటం అంటే జీవితాంతం ఆశీస్సులను, బ్రాహ్మణాశీర్వచనాలను దంపతుల కొంగులతో ముడివేయటమే. వధూవరుల బంధం శాశ్వతంగా, స్థిరంగా ఉండాలని ఈ ముడి వేయిస్తారు.

ఉంగరాలు తీయటం పెళ్లిలో ఉంగరాలు తీసే కార్యక్రమం వధూవరులతో పాటు.. చుట్టూ ఉన్న వాళ్లందరికీ చాలా సరదా. చూడటానికి చాలా సరదాగా కనిపించే తంతు ఇది.

పోటీ పడి గెలవాలనే పట్టుదలని, అంతలోనే తను ఓడిపోయి ఎదుటి మనిషిని గెలిపించాలనే ప్రేమ భావనని చిగురింపజేస్తుంది.

మంగళసూత్రం సూత్రంఅంటేదారం.

మంగళప్రదమైంది కనుగ మంగళ సూత్రం. ఇది వైవాహిక జీవితం నుంచి సమస్త కీడులను తొలగిస్తుందని నమ్మకం. ఈ మాంగల్యాన్ని వరుడు, వధువు మెడలో వేసి మూడుసార్లు ముడి వేస్తాడు. మూడు ముళ్లే ఎందుకు ? మనకు మూడుతో విడదీయరాని సంబంధం ఉంది. త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు, ఇలా ఏది చూసినా మూడే ఉంటాయి. అలా మూడుకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి ముడులు కూడా మూడు ఉన్నాయి. అలాగే మనకు స్థూల, సూక్ష్మ, కారణ అని మూడు శరీరాలు ఉన్నాయి. ఆ మూడు శరీరాలకు మూడు ముళ్లు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి స్థూల శరీరం ఉన్నా, లేకున్నా వారి మధ్య ఆ బంధం ఉండాలి అనేది అందులోని పరమార్థం.

మాంగళ్య ధారణ సమయంలో మంత్రం మాంగళ్యధారణ సమయంలో చదివే మంత్రానికి చాలా విశిష్టత ఉంది.

మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా, కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాం శతమ్.

అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో నేనే నీ మెడలో మాంగళ్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను. నీ మెడలోని మాంగల్యంతో నీవు శత వసంతాలు జీవించాలి. నీ మాంగళ్యమే నాకు రక్ష. నా జీవితం, నా జీవనగమనం ఈ మాంగళ్యంపైనే ఆధారపడి ఉందని అర్థం.

తలంబ్రాలు-తలంబ్రాలు

వివాహంలో ముఖ్య ఘట్టం. వధూవరుల భావి జీవితం మంగళమయం కావటానికి మంగళ ద్రవ్యాలచే చేయించే పవిత్ర కర్మ ఈ తలంబ్రాలు. వీటికి వాడేవి అక్షతలు.

(అక్షత అంటే విరిగిపోనివి అని అర్థం.)

ఇక దానికి బియ్యాన్నే ఎందుకు ఉపయోగిస్తారంటే బియ్యం ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలని, గృహస్థు ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండాలని వాడతారు. పాణిగ్రహణం కన్యచేతిని వరుడు గ్రహించటమే పాణిగ్రహణం. వరుడు తన కుడి చేతితో వధువు కుడిచేతిని పట్టుకోవటాన్ని పాణిగ్రహణం అంటారు. ఇకపై నేనే నీ రక్షణ భారం వహిస్తానని సూచించటానికి,

(పురుషుని కుడి చేయి బోర్లించి, స్త్రీ కుడి చేయిపైకి ఉండేలా చేయి పట్టుకోవాలి.)

దీనికి అర్థం ఇంటి యజమానురాలిగా, ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగా ఇంటికి రమ్మని ఆహ్వానించటం.

హోమం పవిత్రమైన అగ్ని మనిషికి, దేవునికి వారధిగా ఉంటుంది
హోమం చుట్టూ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్టు అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఏడు సార్లు తిరుగుతారు.

ఏడుఅడుగులపరమార్థం

భార్యా భర్తలు ఇద్దరు కలిసి వేసే ఏడు అడుగుల్లో ప్రతి అడుగుకి అర్థం ఉంది. ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటామని, ఇద్దరం ధైర్యంతో, శక్తితో అన్ని అవసరాలని తీర్చుకుంటామని, ఇద్దరం కలిసి కుటుంబం సుఖ సంతోషాల కోసం పాటుపడతామని, కష్టసుఖాలలో కలిసి ఉంటామని, ఇద్దరు కలిసి పిల్లల్ని మంచిదారిలో పెంచుతామని, ఇద్దరం కలిసి సుఖ, శాంతి కోసం పాటుపడతామని, ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామని, జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటామని చెబుతారు.

నల్లపూసలుధరించేదిఎందుకు

మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ధరిస్తారు. అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.

భార్య, భర్తకు ఏ వైపు ఎలాంటి కార్యాలలోనైనా భర్తకు భార్య ఎడమ వైపునే ఉండాలన్నది నియమం.

పూజలు, దానాలు, ధర్మాలు చేసేటప్పుడు భార్య, భర్తకు ఎడమవైపునే ఉండాలి.

కన్యాదానం, విగ్రహ ప్రతిష్టలప్పుడు కుడి వైపున ఉండాలి.

కాలితోబియ్యంనెట్టడంఎందుకు ?

కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో కాలుపెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోనికి వస్తుంది. లక్ష్మీ నివాసముండే వరి బియ్యం లేదా బియ్యంతో నిండిన కలశంను గడపపై ఉంచుతారు. ఇలా దీన్ని ఇంట్లోకి నెట్టుతూ లోపలికి పెళ్లికూతురు వస్తే లక్ష్మీదేవినే ఆ ఇంట్లోకి తీసుకొచ్చినట్టు అవుతుందని అర్థం. ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం వస్తుందని నమ్మకం.🙏



Source - Whatsapp Message

Wednesday, July 22, 2020

నిన్ను నీవు తెలుసుకో

నిన్ను నీవు తెలుసుకో

🤘 మానవుడు సంఘజీవి. అతడు ఒంటరిగా జీవనం సాగించలేడు. అందుకే జనజీవనం తప్పదు.
ఒక వ్యక్తిగాని, సమాజంగాని, జాతిగాని అభివృద్ధి పథంలో నడవాలంటే ముందుగా తమ ప్రస్తుత పరిస్థితుల్ని కూలంకషంగా తెలుసుకోవాలి. గతాన్ని, గతం నేర్పిన పాఠాలను వర్తమానంలో ప్రతిబింబింపజేయాలి. అంతే తప్ప- గతాన్ని మరిచిపోయి భవిష్యత్తుకు రాచబాట వేయాలనుకోవడం అవివేకం !!

మనలో చాలామంది ప్రధానంగా రెండు పెద్దతప్పులు చేస్తుంటారు. మొదటిది, గతాన్ని తలచుకొంటూ వర్తమాన కర్తవ్యాన్ని ఉపేక్షించడం. రెండవదేమో, భవిష్యత్తును గురించి కలలుకంటూ తక్షణం  నిర్వర్తించాల్సిన విధులను మరచిపోవడం. ఇవి రెండూ క్షమించరాని తప్పిదాలే. గతం నేర్పిన పాఠాలను మనసులో ఉంచుకొని భవిష్యత్తులో ఎదుర్కోవలసిన పరిస్థితులపై సరైన దృక్పథంతో వ్యవహరించాలి. వర్తమాన కర్తవ్యాన్ని సముచితమైన విజ్ఞత, సందర్భోచితమైన దక్షత, సమయస్ఫూర్తితో నిర్వర్తించాలి.
కాలం మహిమాన్వితం !!

కాలగమనంలో గతం, వర్తమానం, భవితవ్యం అనే ఈ మూడూ నిరంతరం మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఫలితంగా వాటి ప్రభావం ఎంతోకొంత మనసుపై పడి తీరుతుంది. నిన్నటి రోజును గుర్తు చేసుకోవడం సింహావలోకనం అవుతుంది. రేపటిని ఊహించుకోవడం ముందుచూపు అంటారు. నిన్నటికి, రేపటికి మధ్య ఉన్నదే వర్తమానం. దీన్ని విస్మరించకూడదు. మన జీవిత సౌధానికి ఇదే పునాది.
రేపటి ఉన్నతి కోసం మనలోని మంచి, చెడు, బలహీనతల్ని గుర్తించాలి. ఇది చాలా ముఖ్యం. ఒక బలహీనుడు ఉన్నాడు. అతడు తన బలహీనతల్ని ససేమిరా అంగీకరించడు. అలాంటి వ్యక్తి జన్మలో బలవంతుడు కాలేడు. ఇంకొకతనేమో పుట్టెడు దుఃఖాల్లో మునిగి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. తన బాధలకు కారణాలను వాటికి అనుకూలించిన పరిస్థితులను వెతుక్కొని జరిగిన తప్పుల్ని సరిదిద్దుకొని సంతోషంగా ఉండేలా అడుగు ముందుకు వేయాలి. అప్పుడే అతడు సుఖసౌఖ్యాలను పొందగలుగుతాడు. అతనలా చేయకపోగా నాకేం... సుఖంగా ఉన్నాను అని బాహ్యాడంబరాన్ని ప్రదర్శించాడా- అతడెన్నటికీ నిజమైన ఆనందభోగాలు అనుభవించలేడు !!

రోగికి జబ్బునయం కావాలంటే ముందుగా రోగలక్షణాలను తెలుసుకోవాలి. రోగ కారణాలు కనుక్కోవాలి. అటుపై తగిన మోతాదులో సరైన మందులు వాడితే రోగనివారణ సాధ్యపడుతుంది. ఇదే సూత్రం వ్యక్తికి, జాతికి సైతం వర్తిస్తుంది.
జీవితంలో మంచి చెడులు నేనంటే నేనే ముందంటూ మనిషి జీవితంలో ప్రవేశించడానికి పోటీపడతాయి. అలాగే జాతి చరిత్రలోనూ స్వర్ణశకాలు చీకటి యుగాలు చోటుచేసుకుంటాయి. ఈ వాస్తవాన్ని ఎవరూ విస్మరించే వీల్లేదు !!

నేటి యువతరాన్ని నైరాశ్యం నిస్పృహలు పట్టిపీడిస్తున్నాయి. వాటిని అధిగమించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంటేనే జీవితంలో ముందడుగు వేయగలమన్న పెద్దల మాట చద్దిమూట.
‘నిన్ను నీవు తెలుసుకో’ అంటారు తత్త్వవేత్తలు. ఆంధ్రమహాభారతం శాంతి పర్వంలో చెప్పిన విధంగా- మన జీవితం సొంత ఇంటిలో అలవాటు ప్రకారం బతికే అంధుడి బతుకు వంటిది కాకూడదు. ధైర్యంగా కష్టాలనెదుర్కొంటూ ముందుకెళ్ళాలి. నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టాలి. దుఃఖం, పరాజయం, పతనాన్ని పక్కకు నెట్టి ఆనందాన్ని, విజయాన్ని, అభ్యుదయాన్ని సొంతం చేసుకోవాలి.🙏



Source - Whatsapp Message

Tuesday, July 21, 2020

ఆధ్యాత్మికత అంటే..! ఋణాను బంధo

ఆధ్యాత్మికత అంటే..! ఋణాను బంధo 🤝

♥️-{అందరినీ ప్రేమించటం }-♥️

ఆధ్యాత్మికత ఆంటే మనం నిత్యంచేసే పనుల్ని వదిలిపెట్టకుండా ఇంకా నైపుణ్యంతో చేయాలి అని అర్ధం.

నీలోని నీశక్తి గ్రహించి, నువ్వంటే ఎవరివో తెలుసుకుని జ్ఞానాన్ని జీవితంలో ఆచరించడమే ఆధ్యాత్మికత.

ఈ ఆధ్యాత్మికత మనల్ని ఇంకా శక్తి మంతుడిని, జ్ఞానిని, ప్రతిభావంతుడిని చేస్తుంది.

అందుకే "నహి జ్ఞానేన సదృశం" అన్నది భగవద్గీత. మనలో జ్ఞానం ఆధ్యాత్మికత ఎంత ఉన్నాయో కనీసం వారానికి. ఒక్కరోజు అయినా పరిశీలించు కోవడం మంచింది. కాలం కర్పూరం కొద్దిగా కూడా ఉపయోగించక పోయినా కరిగి పోతాయి.

గతంలో మనం చేసుకున్న సత్కర్మల వలన లభించే గొప్ప అవకాశాలు మన నిర్లక్ష్యం బద్ధకం అజాగ్రత్త వలన చేజారి పోతాయి.

ఆధ్యాత్మిక ప్రస్థానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు క్షణ కాలమైనా దాని పైనుండి దృష్టి మరల్చని స్థితియే ఏకాగ్రత. ఏ ఆకర్షణలు లౌకికమైన ఇంద్రియ సుఖాలు, ఆఖరికి జీవితంలోని మమతా మొహాలు కూడా నీ దృష్టిని మరల్చకూడదు.

నీవు నీఆధ్యాత్మిక ప్రస్థానంతో తాదాత్మ్యం కావాలి. ఇదే సమయంలో మనం మన స్వధర్మాలను ఎంత మాత్రం మరచి పోకూడదు. నిత్య జీవితంలోని మనం నెరవేర్చ వలసిన ప్రతి పనిని మరింత నైపుణ్యంతో శ్రద్ధగా చేయాలి. లక్ష్యం స్థిరంగా ఉండాలి.

ఆధ్యాత్మికత పేరుతో దీనికి లోపం కలిగిస్తే ఏ వ్యక్తితో మనకి ఉన్న ఈ జన్మలో తీర్చ వలసిన కర్మ ఋణాన్ని తీర్చక పోతే, అది రాబోయే జన్మ జన్మలకి వాయిదాపడే ప్రమాదముంది. ఇది కుటుంబంలోని వ్యక్తులకీ వర్తిస్తుంది, అనుబంధాలకీ, శత్రుత్వాలకీ కూడా వర్తిస్తుంది.

ఈ కారణంగానే మనం కోరుకున్న వారితో కంటే, మనం కోరుకోని వారితోనే వేదనా భరితంగాఎక్కువ జీవితం గడపవలసి వస్తుంది. అనివార్యమైన బంధాలు బంధనాల్లా, వేదనకు గురి చేసినా సహనంతో భరించక తప్పదు..

మీకు ఓ సందేహం రావచ్చు. వేధిస్తూ మనతోటే అనివార్యంగా జీవించే వారిని ఎదిరించి దూరంగా వెళ్ళి పోకూడదా అని..?

అన్ని బంధాలను వదిలించుకోవడం సాధ్యం కాదు. 'ఋణానుబంధ రూపేణా పశు పత్నీ సుతాదాయా' అన్నారు.

జీవులని ఋణాలు కలుపుతాయి. ప్రేమలూ కలుపుతాయి. రుణం తీరి పోతుంది. ప్రేమతో ఏర్పడ్డ బంధం పెరుగుతుంది. రుణం తీరిపోయిన వాళ్ళు ఒక్క క్షణం కూడా మనతో ఉండరు.

ప్రేమ బంధం కలిగిన వారు ఎప్పటికి వెంటే ఉంటారు.

అందరినీ ప్రేమిద్దాం. అందరితో ఋణానుబంధం కాక ప్రేమానుబంధం పొందుదాం. ఏకాగ్రత సాధిద్దాం !

🙏🌹🌞🌹🙏

Source - Whatsapp Message

పురంజనోపాఖ్యానం

పురంజనోపాఖ్యానం

👌పూర్వకాలంలో ‘పురంజనుడు’ అనబడే రాజు ఉండేవాడు. ఆయన తాను నివసించడానికి యోగ్యమయిన కోట, తాను నివసించడానికి యోగ్యమయిన రాజ్యమును అన్వేషిస్తూ బ్రహ్మాండములు అన్నిటా తిరిగాడు. కానీ ఆయనకు ఏదీ నచ్చలేదు. చిట్టచివరకు హిమవత్పర్వతపు దక్షిణ కొసను ఉన్నటు వంటి ఒక దుర్గమును చూశాడు. ‘ఇది చాలా బాగుంది. నేను ఇందులో ప్రవేశిస్తాను’ అని అనుకున్నాడు. అపుడు అందులో నుంచి చాలా అందమయిన యౌవనము అంకురిస్తున్న ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ బయటకు వస్తుంటే ఆవిడ వెనుక అయిదు తలల పాము ఒకటి బయటకు వచ్చింది. ఆవిడ పక్కన పదకొండు మంది కాపలా కాసే భటులు వచ్చారు. ఒక్కొక్కరి వెనుక నూర్గురు చొప్పున సైనికులు ఉన్నారు. ఆవిడను చూసి పురంజనుడు ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించాడు.

పురంజనుడు తాను ఒక్కడినే ఉన్నానని తనతో ఎవరూ లేరని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన వెనక ‘అవిజ్ఞాతుడు’ అనబడే మిత్రుడు ఉంటాడు. అవిజ్ఞాతుడు అనగా తెలియబడని వాడు అని అర్థం. ఆయన ఎప్పుడూ పురంజనుడి వెనకాతలే ఉంటాడు. కానీ పురంజనుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడడు. అటువంటి మిత్రుడు ఉండగా పురంజనుడు ఆ కాంతను ‘నీవు ఎవరు’ అని అడిగాడు. అపుడు ఆమె ‘ఏమో నాకూ తెలియదు. నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. నేను పుట్టి బుద్ధి ఎరిగి ఇక్కడే వున్నాను. ఈ కోటలో ఉంటూ ఉంటాను. నువ్వు మంచి యౌవనంలో ఉన్నావు. నా పేరు ‘పురంజని’, నీ పేరు పురంజనుడు. అందుకని నీవు ఈ కోటలోనికి రా. వస్తే మనిద్దరం మానుషమయినటువంటి భోగములను అనుభవిద్దాము. నూరు సంవత్సరములు నీవు ఇందులో ఉందువు గాని.

ఈ కోటకు ఒక గమ్మత్తు ఉంది. ఈ కోటకు తూర్పు దిక్కుగా అయిదు ద్వారములు ఉంటాయి. ఈ అయిదు ద్వారముల నుండి బయటకు వెళ్ళవచ్చు. కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కోట ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుడినే తీసుకువెళ్ళాలి. ఆ మిత్రులకు పేర్లు ఉంటాయి. వాళ్ళతోనే బయటకు వెళ్ళాలి. అలా ఆ ద్వారంలోంచి బయటకు వెడితే ఒక భూమి చేరతావు. ఆ దేశంలో నీవు విహరించవచ్చు మరల వెనక్కి వచ్చేయవచ్చు’ అని చెప్పింది. ఆయన చాలా సంతోషించి ఆవిడని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ కలిసి సంతోషంగా జీవనం గడుపుతున్నారు.

పురంజనుడు అంటే ఎవరో కాదు, మనమే. మనకథే అక్కడ చెప్పబడింది. పురంజనుడు కోట కోసం వెదుకుతున్నాడు. వెతికి వెతికి దక్షిణ దిక్కున హిమవత్ శృంగము నందు వ్రేలాడుతున్న కోటను చూశాడు. దక్షిణ దిక్కున ఊరికి శ్మశానం ఉంటుంది. అనగా ఎనాటికయినా శ్మశానములో చేర వలసినటు వంటి శరీరములో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. పురంజనుడు అక్కడికి వెళ్లేసరికి ఒక అందమయిన మేడ కనిపించింది. ఇక్కడ మేడగా చెప్పబడినది శరీరములో గల తల. శరీరమునకు పైన చక్కటి ఒక అందమయిన తలకాయ ఉంటుంది. దాని మీద ఉన్న వెంట్రుకలే పూలలతలు. చేతులు కాళ్ళు ఇవన్నీ అగడ్తలు. లోపల ఉన్నటు వంటి ఇంద్రియములు భోగస్థానములు. లోపల రత్నములతో కూడిన వేదికగా చెప్పబడినది హృదయ స్థానము. అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అక్కడ ఒక పాన్పు ఉంది. దానిమీద మనం రాత్రివేళ నిద్రపోతాము. అనగా ఇంద్రియములు మనస్సు బడలిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలో ప్రవేశించి నిద్రపోతాయి.

అప్పుడు మనకి ఏమీ తెలియని స్థితి ఏర్పడుతుంది.
పురంజని ఎదురు వచ్చి తనను వివాహం చేసుకోనమన్నది. అపుడు పురంజనుడు ఆమెను నీవు ఎవరు అని ప్రశ్నించాడు. ఆవిడ నాకు తెలియదు అంది. ఆవిడ... బుద్ధి... ఆవిడని అయిదు తలల పాము కాపాడుతూ ఉంటుంది. అవే పంచ ప్రాణములు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానము. లనేటటువంటి అయిదు ప్రాణములు.

ఈవిడతో పాటు 11మంది భటులు వచ్చారు. వారే పంచ జ్ఞానేంద్రియములు.. పంచ కర్మేంద్రియములు.. మనస్సు.. ఈ పదకొండింటికి ఒక్కొక్క దానికి కొన్ని వందల వృత్తులు ఉంటాయి. ఈ వృత్తులన్నీ కలిపి వారి వెనక వున్న భటులు. ఇంత మందితో కలిసి ఆవిడ వచ్చింది. వివాహం చేసుకోమన్నాడు చేసుకుంది. ఆవిడ ఒక మాట చెప్పింది ఈ కోటకు తూర్పు దిక్కుగా అయిదు ద్వారములు ఉన్నాయి... అందులోంచి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నీవు ఒక్కొక్క స్నేహితుడినే పట్టుకుని వెళ్ళాలి అని చెప్పింది. అంటే..

మనం అందరమూ అనుభవించేటటువంటి సుఖములే ఈ ద్వారములు. పనులు చేయడానికి మనం అందరం ద్వారంలోంచే కదా బయటకు వెళతాము. జీవుడు కూడా వాటిలోంచే బయటకు వెళ్ళి వ్యాపకములు చేస్తూ ఉంటాడు. తూర్పు దిక్కున వున్న రెండు ద్వారములే ఈ రెండు కళ్ళు. ఈ రెండు కళ్ళతో జీవుడు బయటి ప్రపంచమును చూసి దానితో సమన్వయము అవుతూ ఉంటాడు.

ఒకటవ ద్వారము పేరు ‘ఖద్యోత’,
రెండవ ద్వారము పేరు ‘ఆవిర్ముఖి’.

..అవి ఎంత చిత్రమయిన పేరులో చూడండి. ఈ రెండు ద్వారముల లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకొక్క స్నేహితుడితో వెళతాడు..

ఒకడు ‘ద్యుమంత్రుడు’,
రెండవ వాని పేరు ‘మిత్రుడు’..

ద్యు’ అంటే కాంతి. మిత్రుడు అంటే సూర్యుని పేరు. మీరు ఈ కళ్ళతో లోకమును వెలుతురూ వున్నపుడు మాత్రమే చూడగలరు. అందుకని ఈ కంటితో ఈ ఇద్దరు మిత్రులను పట్టుకుని ‘విభ్రాజితము’ అనబడే దేశమునకు వెడుతూ ఉంటాడు. వెళ్ళి ఈ లోకమునంతటిని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇవి రెండూ రెండు ద్వారములు.

క్రిందను మరో రెండు ద్వారములు ఉన్నాయి. వాటి పేర్లు ‘నళిని’, ‘నాళిని’. ఈ రెండు ద్వారముల నుండి బయలు దేరినపుడు ‘అవధూతుడు’ అనే స్నేహితుడితో వెడతాడు. ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉండరు. అవధూతుడు అంటే అంతటా తిరుగువాడు.. వాయువు.. వాయువు అనే స్నేహితునితో ‘సౌరభము’ అనే దేశమునకు వెళతాడు. అనగా ఈ ముక్కుతో వాసనలు పీలుస్తూ ఉంటాడు. సౌరభము అంటే వాసన. ఈవిధంగా అవధూతుని సాయంతో నళిని, నాళిని గుండా సౌరభము అనే దేశమునకు వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు.

మూడవది.. ఒకటే ద్వారం. దీనిపేరు ‘వక్తము’ అనగా.. నోరు. ఈ ద్వారం లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఒక స్నేహితుడి భుజమ్మీద చెయ్యి వేస్తాడు. ఆయన పేరు ‘రసజ్ఞుడు’. ఒకోసారి బయటకు వెళ్ళేటప్పుడు రసజ్ఞుడితో వెళ్ళడు. ‘విపణుడు’ అనే ఆయనను పిలిచి ఆయన భుజమ్మీద చేయివేస్తాడు. ‘రసజ్ఞుని’తో వెళ్ళినప్పుడు ‘బహూదకము’ అనే దేశమునకు వెళతాడు. ‘విపణుడి’తో వెళ్ళినప్పుడు ‘అపణము’ అనే దేశమునకు వెడతాడు. రసజ్ఞుడితో వెళ్ళడం అంటే పండుకాయ, అన్నం, పులిహోర, చక్రపొంగలి మొదలయినవి నోట్లో పెట్టుకొని రుచిని తెలుసుకొనుట. విపణుడితో వెళ్ళినపుడు ‘ఆపణం’ చేస్తాడు. ఆపణం చేయడం అంటే మాట్లాడడం. పనికిమాలిన వన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఈశ్వర సంబంధమయిన విషయములు తప్ప మిగిలినవి అక్కర్లేని వన్నీ మాట్లాడతాడు.

కుడిపక్కన ఓక ద్వారం ఉంది. దీనిపేరు ‘పితృహు’. ఇది కుడిపక్క చెవి. ఈ ద్వారంలోంచి ఒకే స్నేహితుడితో బయటకు వెళ్ళాలి. ఆయన పేరు ‘శృతిధరుడు’. అనగా వేదం. దీనితో వెళ్ళినపుడు పాంచాల రాజ్యమునకు వెడతాడు. అనగా వేదములో పూర్వభాగమయిన కర్మలను చేసి ఇక్కడ సుఖములను స్వర్గాది పైలోకములలో సుఖములను కోరుతాడు. పుణ్యం అయిపోయాక క్రిందకు తోసేస్తారు. చాలాకాలమయిన తర్వాత ఒక గొప్ప గురువు దొరికితే అప్పుడు మాత్రమే ఎడమ చెవి ద్వారం లోంచి బయటకు వస్తాడు. ఇప్పుడు కూడా శ్రుతిధరుడి మీదనే చేయి వేసుకుని బయటకు వస్తాడు. కానీ ఉత్తర పాంచాల రాజ్యమునకు వెళతాడు. ఉత్తర పాంచాల అంటే నివృత్తి మార్గ. సుఖములను కోరుకోడు. అది వేదము ఉత్తర భాగము. అందుకని ఎడమ చెవి ద్వారం లోంచి వెళ్ళినపుడు మోక్షమును కోరతాడు.

ఆ తర్వాత ఉత్తరము నుండి వెళ్ళే ద్వారమునకు ‘దేవహూ’ అని పేరు. అలాగే తూర్పున తిరిగి ఈ కోటకు క్రింది భాగంలో ఒక ద్వారం ఉంది. అదే మూత్ర ద్వారం. దాని పేరు ‘దుర్మదుడు’ అక్కడ మదమును కల్పించే ఆవేశం ఉంటుంది. ఆ ద్వారంలోంచి బయటకు వెళ్ళినపుడు దుర్మదుని భుజమ్మీద చెయ్యి వేసి సుఖమనే సామ్రాజ్యమును చేరతాడు. ఆ సామ్రాజ్యము పేరు ‘గ్రామికము’ పశువులు కూడా పొందుతున్న సుఖమేదో ఆ సుఖమును పొందుతున్నాడు. అందుకని గ్రామికమయిన దేశమునకు వెళతాడు.

పడమట అనగా వెనుక భాగమందు ఒక ద్వారముంది. అది మలద్వారము. దాని పేరు ‘లుబ్ధకుడు’. అంటే ఉన్నదానిని బయట పెట్టని వాడు. లోపలే కూర్చుని వుంటుంది. బలవంతంగా తోస్తే బయటకు వెళుతుంది. అందుకని దాని పేరు ‘వైశసము’. అలా రెండు రకములుగా వెళుతుంది. జీవుడు నేను వెళ్ళను అని ఈ పురమును పట్టుకు కూర్చుంటాడు. ఇందులోంచి బలవంతంగా తీసేస్తారు. అంత పెచీపెట్టి తన శరీరం మీద భోగముల మీద తన ఐశ్వర్యం మీద కాంక్ష పెంచుకున్న వాడిని తరిమి తరిమి ఇదే శరీరంలో అధోభాగమున ఉన్న అపానవాయు మార్గం గుండా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే వైశసము అనే భయంకరమయిన నరకంలో యాత్ర మొదలుపెడతాడు.

ఇన్ని.. ద్వారములు ఉన్నాయి. ఇవి కాకుండా తన రాజ్యము నందు ఎందరో ప్రజలు ఉన్నారు. అందులో ఇద్దరు కళ్ళులేని వాళ్ళు ఉన్నారు. వారు పుట్టుకతో అంధులు. పురంజనుడు వారిద్దరి భుజముల మీద చేతులు వేసి వాళ్ళతో కలిసి వెళుతూ ఉంటాడు. ఒకాయన భుజమ్మీద చేయి వేస్తె ఆయన తీసుకువెళుతూ ఉంటాడు. కళ్ళు లేని వాడు. ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు. ఆయన పేరు ‘దిశస్మృత్’. రంధ్రములు లేనటువంటి కాళ్ళు గుడ్డివి. వాటిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాయి.

ఇంకొక అంధుడి మీద చెయ్యి వేసి వాడు చెప్పినవి చేస్తూ ఉంటాడు. చేతులకు కన్నములు ఉండవు. వాటిని ఏమి చెయ్యమంటే దానిని చేస్తూ ఉంటాయి. అలా తాను చేతులతో చేసిన దుష్కర్మల చేత తానె బంధింపబడుతూ ఉంటాడు. అందుకని ఇద్దరు గుడ్డివాళ్ళతో తిరుగుతున్నాడు. ఇటువంటి వాడు ‘విషూచుడు’ అనబడే వాడితో అంతఃపురంలో భార్యాబిడ్డలతో ఎప్పుడూ సుఖములను అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు ఒక రోజున గుర్రం ఎక్కాడు. దానికి తన పక్కన 11మంది సేనాపతులను పెట్టుకున్నాడు. ఇవె పది ఇంద్రియములు, ఒక మనస్సు.. వాటికి ఒకటే కళ్ళెం. ఒకడే సారధి. అందుకని ఆ రథం ఎక్కి తాను చంపవలసినవి, చంపకూడని వాటిని కూడా చంపేశాడు. అనగా తాను చెయ్యవలసిన, చెయ్యకూడనివి అయిన పనులను చేశాడు. చంపకూడని వాటిని చంపడం వలన అవి అన్నీ పగబట్టి ఇనుపకొమ్ములు ధరించి కూర్చున్నాయి.

అటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు. భార్యను చూశాడు. ‘అయ్యో నిన్ను విడిచి పెట్టి వెళ్ళిపోయాను. బాగున్నావా.. అన్నాడు. ఆవిడ అలకా గృహంలో ఉంది. అనగా మరల సాత్విక బుద్ధి యందు ప్రవేశించాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దది అయిపోతోందేమోనని అనుమానం వచ్చింది. అనగా మెల్లిమెల్లిగా బుద్ధి యందు స్మృతి తప్పుతోంది. వీడికి అనుమానం రాగానే ఒక రోజునస్నానం చేసి ‘ఉజ్వలము’ అనే వస్త్రం కట్టుకుని వచ్చింది. ‘అబ్బో, మా ఆవిడకి యౌవనం తరగడం ఏమిటి’ అనుకున్నాడు. మళ్ళీ కౌగలించుకున్నాడు. ‘ఉజ్వలము’ అంటే తన బుద్ధియందు తనకు భ్రాంతి. అయినా ‘నా అంతవాడిని నేను’ అంటూ ఉంటాడు...

Source - Whatsapp Message

బోరు కొడుతోందా…???

😏 బోరు కొడుతోందా…???

సద్గురు : 'విసుగుతో చచ్చిపోతున్నాను!’ అని చాలా మంది అంటుంటారు. నన్నడిగితే ఎలా అయినా చావవచ్చునేమో కాని విసుగుతో మాత్రం చావ కూడదు అంటాను. మీ చుట్టూ జీవితం ఇంత బ్రహ్మాండంగా పరుగెడుతూ ఉంటే మీకు విసుగెలా వస్తుంది? ఒక్కసారి కళ్ళు పూర్తిగా తెరిచి ఈ సృష్టి మొత్తం తేరిపారా చూసి, ‘ఇంక చూడడానికి ఏమీలేదు’ అని మీరు అనగలిగితే,అప్పుడు విసుగు చెందడాన్నినేను ఒప్పుకుంటాను. కానీ మీ పరిస్థితి అలా లేదు కదా! కనీసం మీ శరీరంలో ఉన్న ఒక్క కణమైనా ఎలా పనిచేస్తోందో మీకు తెలియదు. అటువంటప్పుడు ‘విసుగొస్తోంది, బోరు కొడుతోంది’ అని ఎలా అంటారు?

ఒక్కసారి కళ్ళు పూర్తిగా తెరిచి ఈ సృష్టి మొత్తం తేరిపారా చూసి, ‘ఇంక చూడడానికి ఏమీలేదు’ అని మీరు అనగలిగితే, అప్పుడు విసుగు చెందడాన్నినేను ఒప్పుకుంటాను.

సూర్యుడు రోజూ ఉదయిస్తాడు, మనకిదేమి విసుగ్గా అనిపించదే! మరి మీకు ఇంకొకటేదో విసుగు అనిపిస్తోందంటే మీరు మీ మనసుకి పూర్తిగా బానిస అయిపోయారు అని, మీ మనసు మిమ్మల్ని పూర్తిగా కబళించి వేస్తోంది అని అర్ధం. ఇలాగే కొనసాగితే మీ మనసు మిమ్మల్ని పూర్తిగా పతనం చేస్తుంది.

నిజానికి విసుగు మీ మనసుకు సంబంధించినది. ఎందుకంటే నిన్నా, మొన్నా జరిగిన సంఘటనల జ్ఞాపకాలు మీ మనులో మాత్రమే ఉంటాయి. ఈ సృష్టిలో ముందు జరిగిన సంఘటనల జ్ఞాపకాలు ఎక్కడా వ్రాసి ఉండవు. జ్ఞాపకాలు కేవలం మీ జ్ఞాపక శక్తికి, మనసుకి సంబంధించినవి. అలాంటపుడు మీకు కావలిసిందే మీరు సృష్టించుకోవచ్చు కదా? ఎలాగు బాహ్య ప్రపంచాన్ని మీ ఇష్ట ప్రకారం మార్చలేరు, సరిదిద్దలేరు. ఉదాహరణకి మీకు మీ ఆఫీసు నచ్చలేదు, సరే ఇంకో ఆఫీసు వెతుక్కుని మారుతారు. అలాగని మీ కుటుంబం మీకు కావలసినట్లు లేకపోతే కుటుంబాన్ని మార్చలేరు కదా? అలా మార్చలేనప్పుడు అది ఒక అంతులేని సమస్యగా మిగిలిపోతుంది. బయటవాటిని అన్నంటిని ఎల్లకాలం మార్చలేము; అందుకే మార్పు అనేది మీలోనే రావాలి. మీలో పరివర్తన వస్తేనే, మీ చుట్టూ ఉన్నవన్నీ మారే అవకాశముంది.

అందుకే మీ మనసుని ఏదోవిధంగా ధ్యానంపై లగ్నం చేస్తే ఈ విసుగనేది ఉండదు. మనసు గత జ్ఞాపకాలపై ఆధారపడి పనిచేస్తోంది కాబట్టే ఈ తిప్పలు. మీ మనసులో నుంచి పుట్టే ఉహలూ, నిన్న మొన్నటి జ్ఞాపకాలూ, వీటితోనే మీ జీవితం నడుస్తుంది. నిన్న జరిగిన జ్ఞాపకాలకు పునర్జీవనమిస్తుంది మనసు. నిన్న జరిగిన సంఘటనలను గుర్తుతెచ్చుకోవడం మళ్ళీ ఆ సంఘటనను జీవించినట్లే కదా? అలా చేసిన పనినే మళ్ళీ మళ్ళీ గుర్తుతెచ్చుకోవడంతొ విసుగు మొదలవుతుంది.

ఎన్నో కోణాలుండే ఈ జీవితంలో విసుగు అనేది రావడానికి ఆస్కారమే లేదు. జీవితం ఎంత బ్రహ్మాండమైనదంటే ఇది మీ తర్కానికి అందదు, మీ మనసులో ఇమడదు.

మీకు ఎప్పుడూ విసుగొస్తోంది అంటే మీరు జీవితాన్ని పూర్తిగా వృధా చేస్తున్నారు అని అర్థం. మీ ఆలోచనలతో మీరు విసుగు చెందవచ్చేమో కాని మీచుట్టూ జరుగుతున్న జీవితం వల్లనైతే కాదు. ఎందుకంటే జీవితం ఎంతో ఉల్లాసభరితమైనది. ఎన్నో పోగులతో నేసిన వస్త్రంలాంటిది. ఎన్నో కోణాలుండే ఈ జీవితంలో విసుగు అనేది రావడానికి ఆస్కారమే లేదు. జీవితం ఎంత బ్రహ్మాండమైనదంటే ఇది మీ తర్కానికి అందదు, మీ మనసులో ఇమడదు. మీ శక్తిసామర్ధ్యాలన్నీ ఉపయోగించినా, శాయశక్తులా ప్రయత్నించినా, ఎన్ని తంటాలు పడినా మీరు జీవిత ప్రక్రియలను గ్రహించలేరు. మీరు వేయి సంవత్సరాలు జీవించినా కూడా వాటిని గ్రహించలేరు. ఎంత కాలం గడిచినా మీరింకా సంభ్రమాశ్చర్యాలకు గురవుతూనే ఉంటారు. ఇంకా జీవితం మొట్టమొదటి పేజీలోనే ఉంటారు. ఇంకా జీవితం యొక్క మూల సిద్ధాంతాలను గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఎలాగంటే ఒక అంతులేని పొరలున్న ఉల్లికి పొరలెన్ని వొలచినా, ఇంకా పొరలు వస్తూనే ఉంటాయి. అదొక అంతులేని ప్రక్రియ. జీవితం కూడా ఒక అంతులేని ప్రక్రియ.

అందుకే ఈసారి మీకు విసుగనిపించినప్పుడు హాయిగా ధ్యానం చేసుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో నడవటమంటే మనసు, శరీరం అనే ఈ రెండింటి వలయంలోనే మీ జీవితం గడిపేయకుండా, మీ మనసునీ, శరీరాన్నీఉపయోగించి మీరనుకున్న చోటికి వెళ్ళగలగడం అని అర్ధం. మీ శరీరాన్నీ, మనసునీ కావలసిన విధంగా మలచుకో గలిగితే, అప్పుడిక విసుగు అనే సమస్య ఉత్పన్నం కాదు! 👍



Source - Whatsapp Message

Something to ponder upon: TELUGU

Something to ponder upon:

TELUGU

For those whose mother tongue is Telugu, Who loves Telugu and who wants to know something about Telugu. Interesting Facts of Telugu Language

1. Telugu Language was known to exist since the Time period 400 BCE.

2. In 2012 Telugu has been voted as the 2nd best script in the world by International Alphabet Association, Korean ranks no 1.

3. Speaking Telugu Language activates about 72000 neurons in your body, highest for any Language in the world proven by Science.

4. An ethnic group from Sri Lanka called Sri Lankan Gypsy people mostly speak Telugu.

5. There are many many Telugu communities in Myanmar Just do a Google Search.

6. In 16th century an Italian Explorer Niccolò de’ Conti found that the words in Telugu language end with vowels, just like those in Italian, and hence referred it as “The Italian of the East”.

7. Telugu ranks 3rd by the number of native speakers in India (75 million people), and 15th in the Ethnologue list of most-spoken languages worldwide.

8. Telugu derived from trilinga, as in Trilinga Desa, “the country of the three lingas”. According to a Hindu legend, Shiva descended as a linga on three mountains: Kaleswaram in Nizam, Srisailam in Rayalaseema and Bhimeswaram in Kostha.

9. Telugu is the only language in the Eastern world, that has every single word ending with a vowel sound.

10. Telugu language has the most number of सामितलु i.e., idioms and proverbs.

11. Telugu language previosuly also known as Tenungu or Telungu.

12. Rabindranath Tagore is said to have stated that Telugu is the sweetest of all Indian Languages.

13. About 200 Years ago about 400 people Telugu speaking people were taken to Mauritius as plantation workers, now Prime Minister is one of their descendants.

14. A Palindrome of 40 slokas which when read from start to end is Ramayana and end to start Mahabharata, there is no other Language like this.

15. Sri Krishnadevaraya visited this temple in Srikakulam and paid homage to the deity. It was here that Krishnadevaraya wrote the literary classic, Amuktamalyada at the order of the Lord Andhra Vishnu who had said “Des Bhashalandu Telugu Lessa” (Telugu is the greatest among the state’s languages”) and ordered Sri Krishnadevaraya to adopt Telugu as the official language of his province.

16. We have a single lettered poem in Telugu also called ekakshara padhyamulu
Often said by all Greatest Saints that...Telugu language is greatest boon from Creators.

Be proud to Be a Telugu person.

Source - Whatsapp Message

Monday, July 20, 2020

సుశనుడు

#సుశనుడు

అనేక సందర్భాలలో దేవతల వలన కలిగిన ప్రమాదాలతో తల్లడిల్లిన రాక్షస జాతినే శుక్రాచార్యుడు కాపాడినట్లు అనేకానేక పురాణకథలలో కనిపిస్తుంటుంది.

రాక్షసులకు గురువైన ఈ శుక్రాచార్యుడి జన్మకు సంబంధించిన కథ విచిత్రంగా ఉంటుంది.

పూర్వం యక్షులకు రాజైన కుబేరుడు దేవరాజైన ఇంద్రుడి కోశాగారానికి అధిపతిగా ఉంటుండేవాడు అయితే ఈ కుబేరుడి ఆధిపత్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో సుశనుడు అనే ఒక ముని సమయం కోసం వేచి ఉండేవాడు. ఆ మునికి తగిన సమయం ఆసన్నం కాగానే తన యోగశక్తి సహాయంతో కుబేరుడి ఆధీనంలో ఉన్న సంపద మొత్తాన్ని సంగ్రహించుకుని తీసుకువెళ్ళాడు.

ఆ విషయం తెలిసిన కుబేరుడు తను సుశనుడి చేతిలో మోసపోయినందుకు ఎంతగానో బాధపడుతూ ఎవరికి చెప్పినా ఫలితం లేదని చివరకు పరమేశ్వరుడినే శరణువేడాడు. శరణన్న వారిని ఆదుకునే శంకరుడు కుబేరుడికి అభయమిచ్చి సుశనుడిని సంహరించి ఆ ధనాన్ని మళ్ళీ కుబేరుడికి అప్పగించాలనుకున్నాడు.

అయితే ఈ విషయం తెలిసిన సుశనుడు మొండి ధైర్యంతో ఎలాగైనా పరమేశ్వరుడి నుంచి తప్పించుకోవాలని అనేక విధాలుగా తరుణోపాయం కోసం ఆలోచించసాగాడు. తాను ఎక్కడ దాక్కున్నా పరమేశ్వరుడు తనను పట్టి సంహరిస్తాడనే నిర్ణయానికి వచ్చి ఆ ముని తన యోగమాయతో పరమేశ్వరుడి చేతిలో ఉన్న శూలం మీదకు చేరి కూర్చున్నాడు.

శూలం మీద ఉన్న తనను శివుడు గమనించడులే అనుకున్న ఆ మునికి నిరాశే ఎదురయింది. సకల చరాచర జగత్తును శాసించగల శివుడు మునిని కనుక్కోలేకపోవడం అనేది అసంభవం. తన శూలాగ్రం మీదనే తనకు కోపాన్ని తెప్పించిన ముని ఉన్నాడని గమనించిన శివుడు తన చేతిలోని శూలాన్ని మరొక చేతితో వంచాడు. ఆనాటినుండి అలా వంగిన శూలం శివుడికి పినాకము అనే ఆయుధంగా మారిపోయింది.

అల్లరి చేష్టలు లాగా తనను చీకాకు పరుస్తున్న మునిని శివుడు ఒక చేత్తో పట్టుకుని తన నోట్లో వేసుకుని మింగివేశాడు. అలా సుశనుడు పరమేశ్వరుడు గర్భంలో తిరగడం ప్రారంభించాడు. పరమేశ్వరుడి గర్భగోళంలో వుండలేక తనను రక్షించమని అనేక రకాలుగా ఆముని ఈశ్వరుడిని ప్రార్ధిస్తూ ఎలాగైనా బయటకు తీయమని వేడుకున్నాడు. అయినా చాలాకాలం వరకు శివుడు అతడి మాటలను వినిపించుకోలేదు.

సుశనుడు మరీమరీ ఆర్థ్రత నిండిన భక్తి భావంతో శివుడిని ప్రార్ధిస్తూ ఎలాగైనా తనను వెలుపలికి రప్పించమని ఎన్నోమార్లు వేడుకున్న మీదుట శివుడు శాంతుడై తన సర్వ రంధ్రాలను మూసి ఒక్క రంధ్రాన్ని మాత్రం తెరిచి వుంచి ఆ రంధ్రం నుండి సుశనుడిని బయటకు రమ్మనమని చెప్పాడు. చేసేది లేక ఈశ్వర శుక్లం వెలవడే ఆరంధ్రం నుండే సుశనుడు బయటకు వచ్చాడు. ఆనాటి నుండి సుశనుడు శుక్రుడు అయ్యాడు.

బయటకు వచ్చిన శుక్రుడు గొప్ప తేజస్సుతో వెలుగొందుతూ కనిపించాడు. శివుడికి అప్పటికీ అతడిమీద కోపం చల్లారలేదు. అతడిని పట్టి సంహరించబోతుండగా ఈశ్వర గర్భం నుంచి వెలువడినవాడు తనకు పుత్రుడితో సమానమని పార్వతీదేవి శివుడికి నచ్చచెప్పి అతడిని రక్షించమని ప్రార్ధించింది.

పార్వతీదేవి ప్రార్ధన మేరకు పరమేశ్వరుడు శుక్రుడిని విడిచి పెట్టాడు. శుక్రుడు కూడా తనమీద దయ చూపిన పార్వతీ పరమేశ్వరులకు మొక్కి వెళ్ళిపోయాడు. అలా సుశనుడు అనే ముని అనంతర కాలంలో దానవులకు గురువైన శుక్రాచార్యుడిగా మారిన ఈ కథను భారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు వివరించి చెప్పాడు.

ఈ శుక్రాచార్యుడు కథ కొద్దిపాటి తేడాతో శివపురాణంలో కూడా కనిపిస్తుంది.

🙏🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

Saturday, July 18, 2020

కర్మలే కారణం ..!!

కర్మలే కారణం ..!!


🤔మన జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు కారణం ఎవరు ?ఏమిటి ?
కష్టాలకు ,సుఖాలకు ,లాభాలకు ,నష్టాలకు ,ఎదుగుదలకు ,తరుగుదలకు,కారణం ఎవరు ?
మన తెలివి తేటలా?
స్వయం కృషా?
మన తలరాతా?
మన కర్మా?
దైవ శక్తా ?
ఏది కారణం ? అనే ప్రశ్నలు చాలా మందికి వస్తాయికానీ,
ఈ ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం దొరకదు.కానీ ఓ ప్రయత్నం చేద్దాం !

మనం ఇప్పుడు అనుభవించే ప్రతి ఫలితానికి, గతంలో అనుభవించిన ప్రతి ఫలితానికి కారణం వేరెవరో కాదు.మనం చేసిన కర్మలు ,ఆలోచనలే .
భగవంతుడు మన కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు.అవే మన సుఖాలు ,దుఖాలు .
అదృష్టం -దురదృష్టం అనేవి కూడా కర్మలో ఒక భాగమే.
గత జన్మ కర్మలతో మాత్రమే మన ఈ జీవితం పూర్తిగా నడవటం లేదు .
మనిషి కి కొన్ని అవకాశాలు కూడా కల్పించాడు.దాన్నే స్వయం కృతం అంటారు.ఈ స్వయం కృతం ద్వారా బాగు పడొచ్చు లేక చెడి పోవచ్చు .అది వాళ్ళిష్టం.

భగవంతుడు మనకు నోరు ఇచ్చాడు.దానితో మనం ఏం చేస్తున్నాము?
కొంత మంది మంత్రం చదువుతున్నారు.కొంతమంది పారాయణాలు,భజనలు చేస్తున్నారు.కొంతమంది మంచి విషయాలు మాట్లాడుతున్నారు.కొంత మంది అబధ్ధాలాడుతూ ,చెడు మాట్లాడుతూ మోసాలు చేస్తూ వున్నారు.ఇవే స్వయంకృతాలంటే.వీటిని బట్టి భగవంతుడు ఫలితాలు ఇస్తాడు.మంచికి మంచి ఫలితం .చెడుకి చెడు ఫలితం .
అందుకే చేసుకున్న వాడికి చేసుకున్నంత ఫలితం అన్నారు.
సక్సెస్ అయినా ,ఫెయిల్ అయినా కారణాలు మూడు చెబుతారు .

1.పూర్వ జన్మ సుకృతం.

2.భగవదనుగ్రహం.

3.ఈ జన్మ ప్రయత్నం .🙏



Source - Whatsapp Message

మాయ అంటే ఏమిటి?

మాయ అంటే ఏమిటి?

🤘 రమణ మహర్షిని ఒకతను చాలా రోజులనుంచీ "మాయ అంటే ఏమిటి?" అని అడుగుతూ ఉండేవాడు. మహర్షి ఏమీ చెప్పేవారు కాదు. మౌనంగా ఉండేవారు. ఇలా ఉంvడగా ఒకరోజున రాష్ట్రపతిగా ఉన్న బాబూ రాజేంద్రప్రసాద్ మహర్షి దర్శనార్ధమై వచ్చారు.ఆశ్రమవాసులందరూ హడావుడి చేసారు. మహర్షి ముఖంలో మాత్రం ఏ మార్పూ లేదు. ఒక సామాన్యుడు వస్తే ఎలా ఉన్నాడో రాష్ట్రపతి వచ్చినా అలాగే ఉన్నాడు. రాజేంద్రప్రసాద్ గారు మహర్షి సమక్షంలో మౌనంగా కాసేపు కూర్చున్నారు. దర్శనం అయిపోయాక రాష్ట్రపతి వెళ్ళేటప్పుడు అందరూ ఆయనకు సెండాఫ్ ఇవ్వడానికి పోలోమంటూ పరిగెత్తి పోయారు. మహర్షి దగ్గర ఎవరూ లేరు. ఈ సందేహం అడిగిన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. అప్పుడు మహర్షి అతనితో " మాయ అంటే ఇదే " అని ఒక్కమాట మాత్రం చెప్పారు. వారు అసలైన గురువులు.

గురు శిష్యులు:-- ఏ గురువైనా శిష్యునిలో ఆత్మశక్తిని పెంపొందించాలి. తనను తాను తెలుసుకునే దారి చూపించాలి. అంతేగాని ఎల్లకాలమూ గురువుమీద శిష్యుడు ఆధారపడి ఉండేటట్లు చెయ్యరాదు. అతన్ని తన చుట్టూ తిప్పుకొని తన అవసరాలకు అతన్ని వాడుకోకూడదు. లౌకిక వాసనలు వారిమధ్యన ఏవీ ఉండరాదు. ఇద్దరి ఆలోచనా "దైవానుభూతిని ఎలా పొందాలి" అన్న ఒక్క విషయం చుట్టూనే పరిభ్రమించాలి. భయమూ స్వార్ధమూ అపనమ్మకమూ అనవసర సంభాషణలూ వారిమధ్యన ఉండరాదు. ఒకరికొకరు సైకలాజికల్ బరువు దించుకునే చెత్తబుట్టలు కాకూడదు. అలాంటి గురుశిష్యుల బంధం నిజమైనది. "ఆశ్చర్యో వక్తా కుశలస్యలబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానువిష్ట:" అంటుంది కఠోపనిషత్తు. అలాంటి గురువూ శిష్యుడూ ఇద్దరూ ఆశ్చర్యకరమైనవారే అని అర్ధం. అటువంటివారి మధ్యనే బ్రహ్మానుభూతి అనే అద్భుతం ఆవిష్కరింపబడుతుంది.

మనస్సే నిజమైన గురువు.అది నీలోనే ఉంది.:--నిజమైన గురువు మన మనసే. "శుద్ధమనసే అసలైన గురువు" అని శ్రీ రామకృష్ణులు అన్నారు. "మరి గురువును బయట వెదకడం ఎందుకూ?" అంటే "తెలియక" అని జిల్లెళ్ళమూడి అమ్మగారు జవాబు చెప్పారు. తగినంత పరిశుద్ధమైన మనసు మనలో లేదు కనుక బయట ఒక గురువు అవసరం అవుతుంది. దానికి తగినంత పరిపక్వతా శుద్ధతా వచ్చినపుడు అదే గురువు అవుతుంది. "కొన్నేళ్ళ సాధన తర్వాత నీ మనసే నీ గురువౌతుంది." అని బ్రహ్మానంద స్వామి అనేవారు. గురుశక్తీ దైవశక్తీ సాధకుని మనస్సులో ప్రవేశించినపుడు అంతా మనసులోనే అర్ధమౌతుంది.*🙏



Source - Whatsapp Message

దత్తాత్రేయుని 24 గురు గురువులు

దత్తాత్రేయుని 24 గురు గురువులు

🙏దత్తాత్రేయుని మనం త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరు ల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నాం.
దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది. దత్తాత్రేయుడు అతి పురాతన దేవుళ్లలో ఒకడు. ఈ దేవుడి గురించిన ప్రథమ ప్రస్తావన మహాభారత మరియు రామాయణం వంటి మహాకావ్యాలలో కనబడుతుంది.
దత్తాత్రేయ స్వామి ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా అధినాథ్ సంప్రదాయానికి సంబంధించిన ఆది - గురు ( ఆది గురువు ) గా గుర్తిస్తున్నారు . దత్తాత్రేయ మొట్ట మొదటిలో యోగ దేవుడుగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ తర్వాత అతడు మరింత భక్తికి సంబంధించిన వైష్ణవ పూజావిధానాలను పుణికి పుచ్చుకుని సంలీనమయ్యాడు ఇతడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు.
దత్తాత్రేయుని 24 మంది గురువులు.
యాదవ వంశానికి మూలపురుషుడైన యదువు అనే రాజు దత్తాత్రేయుని చూచి స్వామీ మీరెలా సదానంద, చిదానంద స్వరూపులై ఉండ గలుగుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు దత్తాత్రేయుల వారు ఇలా సెలవిచ్చారు.
యదు రాజా ! నేను సమస్త ప్రకృతిని పరిశీలించి అన్నింటి నుండీ జ్ఞానం సంపాదించాను. చెప్తాను విను.
ప్రకృతిలో నాకు 24 మంది గురువులున్నారు. కొన్నింటినుండి ఎలా ఉండాలో తెలుసుకున్నాను, కొన్నింటినుండి ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను. అని
1. భూమి నుండి –
క్షమా, పరోపకారత్వం నేర్చుకున్నాను.
2. వాయువు నుండి-
నిస్సంగత్వం, నిర్లేపత్వం.
3. ఆకాశము నుండి-
సర్వవ్యాపక తత్త్వం.
4. జలము నుండి –
నిర్మలత్వం, మాధుర్యం స్నిగ్ధత్వం,
5. అగ్ని నుండి –
తేజస్సు, ఈశ్వర తత్త్వం.
6. సూర్యుని నుండి-
జలగ్రాహి, జలత్యాగియు,లోకబాంధవుడు, సర్వలోకాలకు అతడొక్కడే అని తెలుసుకున్నాను.
7. చంద్రుని నుండి –
వృద్ధి క్షయాలన్నవి దేహానికే కాని, ఆత్మకు కావు అని తెలుసుకున్నాను.
8. పావురాల జంట నుండి –
కామక్రోధాలకు వశమైనచో ఆత్మానురాగం కోల్పోతారని తెలుసుకున్నాను.
9. అజగరము నుండి(కొండ చిలువ) –
దైవికంగా లభించిన దానికి తృప్తి చెంది, లభించని దానికై వెంపర్లాడక ఉండాలని కొండచిలువ నుండి నేర్చుకున్నాను.
10. సముద్రం నుండి-
తనలో ఉన్న మనోభావాలను బైటకు పొక్కనీయకూడదని నేర్చుకున్నాను.
11. మిడత నుండి –
సుఖమని భ్రమించి మోహమనే జ్వాలాగ్నికి బలి అయి, మృత్యువుకి చేరువవుతుందని తెలుసుకున్నాను.
12. తేనెటీగ –
యోగి ఎవరినీ నొప్పించకుండా భిక్ష సంపాదించుకొన్నట్లు, తేనెటీగ కూడా ఏ పువ్వు కూడా బాధపడకుండా, గాయపడకుండా తేనెను సంగ్రహిస్తుంది. ప్రతీ పుష్పాన్ని వదలకుండా తేనెను సేకరించినట్లే ఏ గ్రంథాన్ని, ఏ ఒక్క విషయాన్ని వదలకుండా శాస్త్రాధ్యయనం చేయాలనేది తెలుసు కున్నాను. తాను కష్టపడి కూడబెట్టిన తేనెను (తేనెపట్టును) పరాయి వారికి వదిలేస్తుంది. కానీ యోగులు రేపటి అవసరాల కోసం సంపాదించరు.
13. గజం(ఏనుగు)నుండి –
ఏనుగు తనకున్న స్త్రీలౌల్యం వల్ల ఎంత బలమైనదైనప్పటికీ, ఇతరులకు వశపడుతుంది.
14. మధుహారి –
ఇతరులు కూడబెట్టిన వస్తువును, న్యాయాన్యాయాలు ఆలోచించకుండా అపహరించేవాడు నీచుడు అనబడతాడు.
15. లేడి నుండి-
అమాయకత్వంతో వేటగాని వలలో పడుతుంది. అమాయకత్వం కూడదని తెలుసుకున్నాను.
16. చేప నుండి –
జిహ్వ చాపల్యంతో ఇంద్రియనిగ్రహం కోల్పోయి ఎరకు చిక్కి బాధపడుతుంది. జిహ్వ ఎంత చేటు చేస్తుందో తెలుసుకున్నాను.
17. పింగళ(ఒక వేశ్య) నుండి –
భౌతిక వాంఛలకు, ధనాశకు లొంగి కాలాన్ని, సాధనాన్ని (మనశ్శరీరాలు) దుర్వినియోగం చేసుకోకూడదని తెలుసుకున్నాను.
18. కురరము(లకుముకి పిట్ట) నుండి –
ఇతరులకు, తనకు మధ్య తేడాలు గ్రహించక వారితో పోటీపడటం మంచిది కాదు అని గ్రహించడం.
19. బాలుడి నుండి –
పాపపుణ్యాలు ఎరుగక యోగితో సమానుడిలా ఉండాలని తెలుసుకున్నాను..
20. కన్యక నుండి-
ఎటువంటి పరిస్థితులున్నప్పటికీ, కుటుంబ గౌరవాన్ని కాపాడటం.
21. శరకారుడు (విలుకాడు) నుండి –
ఏకాగ్రత.
22. సర్పము నుండి –
జీవితం అశాశ్వతమని గ్రహించినదానివలె తనకంటూ స్థిరనివాసం ఏర్పరుచుకోదు.
23. సాలెపురుగు –
ఎన్నిసార్లు లయమయినా, మరల మరల సృష్టిస్తుంది. ప్రయత్నం వల్ల కార్యసిద్ధి.
24. పురుగు నుండి –
భ్రమరకీటకన్యాయం వలె మనస్సంతా భగవంతుని మీదే లగ్నంచేసి చివరకు భగవంతునిలో లీనం అవ్వాలి అనేది తెలుసుకున్నాడు.
ఆ విధంగా ప్రకృతిలోని ప్రతీ అణువు తనకు గురువేననీ, తన మనస్సు కూడా తనకు గురువేనని తెలియచెప్పారు.
ఆ విధంగా తానే స్వయంగా దేవతలు, రాజులు, మహర్షులకి ఎందరికో గురువైనప్పటికీ, అహంకారం లేకుండా సృష్టిలోని ప్రతీ అణువు నుండి నేర్చుకుంటూ శిష్యుడు కూడా అయ్యాడు.
24.ఏకాదశుల పేర్లు మరియు ఫలాలు..
1. చైత్ర శుక్ల ఏకాదశి –
‘కామదా’ - కోర్కెలు తీరుస్తుంది.
2. చైత్ర బహుళ ఏకాదశి - '
వరూధిని' - సహస్రగోదాన ఫలం లభిస్తుంది.
3. వైశాఖ శుద్ధ ఏకాదశి - '
మోహిని' - దరిద్రుడు ధనవంతుడగును.
4. వైశాఖ బహుళ ఏకాదశి -
'అపర' - రాజ్యప్రాప్తి.
5. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి - '
నిర్జల' - ఆహారసమృద్ధి.
6. జ్యేష్ఠ బహుళ ఏకాదశి - '
యోగినీ' - పాపాలను హరిస్తుంది.
7. ఆషాఢ శుద్ధ ఏకాదశి - '
దేవశయనీ' - సంపద-ప్రాప్తి (విష్ణువు యోగనిద్రకు శయనించే రోజు).
8. ఆషాఢ బహుళ ఏకాదశి - '
కామిక' - కోరిన కోర్కెలు ఫలిస్తాయి.
9. శ్రావణ శుక్ల ఏకాదశి - '
పుత్రదా' - సత్సంతాన ప్రాప్తి.
10. శ్రావణ బహుళ ఏకాదశి -
'అజ' - రాజ్య, పత్నీ, పుత్ర ప్రాప్తి మరియు అపన్నివారణం.
11. భాద్రపద శుద్ధ ఏకాదశి –
పరివర్తన' - యోగసిద్ధి (యోగనిద్రలో విష్ణువు ప్రక్కకు పొర్లును కనుక పరివర్తన).
12. భాద్రపద బహుళ ఏకాదశి -
'ఇందిరా' - సంపదలు, రాజ్యము ప్రాప్తించును.
13. ఆశ్వయుజ శుక్ల ఏకాదశి -
'పాపాంకుశ' - పుణ్యప్రదం.
14. ఆశ్వయుజ బహుళ ఏకాదశి -
'రమా' - స్వర్గప్రాప్తి.
15. కార్తిక శుక్ల ఏకాదశి - '
ప్రభోదిని' - జ్ఞానసిద్ధి (యోగనిద్ర నొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు).
16. కార్తిక కృష్ణ ఏకాదశి - '
ఉత్పత్తి' - దుష్టసంహారము (మురాసురుని సంహరించిన కన్య విష్ణు శరీరము నుండి జనించిన రోజు).
17. మార్గశిర శుక్ల ఏకాదశి -
'మోక్షదా' - మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).
18. మార్గశిర కృష్ణ ఏకాదశి - '
విమలా' (సఫలా) - అజ్ఞాననివృత్తి.
19. పుష్య శుక్ల ఏకాదశి - '
పుత్రదా' - పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).
20. మాఘ కృష్ణ ఏకాదశి -
'కల్యాణీ' (షట్తిలా) - ఈతిబాధ నివారణం.
21. మాఘ శుక్ల ఏకాదశి -
'కామదా' (జయా) - శాప విముక్తి.
22. మాఘ కృష్ణ ఏకాదశి -
'విజయా' - సకల కార్య విజయం (ఇది భీష్మ ఏకాదశి).
23. ఫాల్గుణ శుక్ల ఏకాదశి -
'అమలకీ' - ఆరోగ్యప్రదం.
24. ఫాల్గుణ కృష్ణ ఏకాదశి - '
సౌమ్యా' - పాపవిముక్తి.🙏



Source - Whatsapp Message

ఆధ్యాత్మికత మనకి ఎందుకు అంత ముఖ్యం

🌹 ఆధ్యాత్మికత మనకి ఎందుకు అంత ముఖ్యం 🌹

👌మనిషి ఎప్పుడూ సుఖంగా శాంతిగా వుండాలను కోవటం వల్ల. తానూ తనవాళ్ళూ ఎప్పుడూ సుఖంగా శాంతిగా వుండటం కోసం మనిషి నిరంతరం ఆరాటపడుతుంటాడు. ఎల్లప్పుడూ కేవలం అందుకోసమే ప్రయత్నిస్తుంటాడు. ఏ ఆలోచన చేసినా, ఏ పనిచేసినా అది కాక మరో కారణం ఉండనే వుండదు. సుఖ శాంతుల కోసం మనిషి తనకు చాతనైనంత వరకు ఎన్నో ఏర్పాట్లు చేసుకొంటూ వున్నాడు. ఆ ఏర్పాట్లు చేసుకోవటానికి ఎంతో శ్రమ, బాధ పడుతూనే వున్నాడు. ఐనా జీవితంలో ఎన్నోసార్లు మళ్ళీ మళ్ళీ అశాంతీ, అలజడీ, దుఃఖమూ, భయమూ, విసుగూ ఎదురౌతూనే వున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటని చూసినట్లయితే ఈ క్రింది నాలుగు విషయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
మార్పు
మరణం
ప్రతికూలత
ఊహలు

ఈ నాలిగిటి వల్ల మనిషి అశాంతితో, అలజడితో, విసుగుతో, బాధతో, భయంతో ఇంకా ఏదో చేయాలనే తాపత్రయంతో చివరికి మృత్యువు ఒడిలోకి జారి పోతుంటాడు. సామాన్యమైన వ్యక్తులంతా ఈ వూబిలో పడిపోయి వుంటారు.

మార్పు:- ఏదో ఒక వస్తువును కొన్నప్పుడు చాలా సంతోషంగానే, ఆనందంగానే వుంటుంది. ఐతే ఆ వస్తువుని జాగ్రత్త పరచడంలో అలసట, ఆందోళన, భయము పొంచి వుంటున్నాయి. కొంత కాలం తర్వాత మార్పు వల్ల ఆ వస్తువు పాతబడి పోతుంది. దాని స్థానంలో మరో కొత్తది కావాలనిపిస్తుంది. కొత్తది కొంటే పాతదాన్నేమి చేయాలి? ఇదో సమస్య. ఐనకాడికి అమ్మేయాలా?
ఎవరికైనా ఇచ్చేయాలా? లేకపోతే ఎక్కడ పెట్టాలి?

ఇదొక ఎడతెగని అంతర్మధనం. ఈ రకమైన అంతర్మధనం, ఊగిసలాట కేవలం వస్తువుల విషయంలోనే కాక, బంధువులు, స్నేహితుల విషయంలో కూడా వర్తిస్తున్నది.
సమస్యతో సహజీవనం చేయడం, సర్దుకు పోవడం తప్పనిసరిగా మారుతున్నది.

మరణం :- తాను మరణిస్తానేమోననే ఆందోళన ఉండనే వుంది.అలాగే తనవాళ్ళు మరణిస్తారనే భయము, అలజడి, దుఃఖము.

ప్రతికూలత :- తాను అనుకున్నది జరగనప్పుడు చికాకు, బాధ పడటమే కాకుండా, చిన్న, పెద్ద విషయాలలో కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదు అని మళ్ళీ మళ్ళీ గతించిన చేదు విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొని బాధ పడుతుంటాడు.

ఊహలు :- భవిష్యత్తుకు సంబంధించిన విషయాల ఊహలతో సతమత మౌతుంటాడు.

ప్రతి మనిషీ ఎంతటి ప్రయత్నం చేసి ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ మార్పుల వల్లా, మరణం వల్లా, ప్రతికూలతల వల్లా, ఊహలవల్లా బాధ,దుఃఖము, అశాతి, అలజడి, విసుగు, ఆందోళన అడుగడుగునా ఎదురౌతూనే వున్నాయిగదా! కానీ ఈనాడు కొత్తగా వచ్చిన సమస్యకాదు. అనాదిగా మానవుడు ఎదుర్కొంటున్న సమస్యే. ఐతే మేధావంతులైన ప్రాచీన మహర్షులు జటిలమైన ఈ సమస్యను కూలంకషంగా అధ్యయనం చేసి మహత్తరమైన అనుభవాలతో ఈ క్రింది పరిష్కార మార్గాన్ని ప్రతిపాదించారు.

మనిషి తన ఆధీనంలో లేనటువంటి బాహ్య విషయాల ప్రభావానికి లోనవటం వలన తాను అంతర్గతంగా దుఃఖము, బాధ, విసుగు, అలజడి, ఆందోళన, భయము మొదలైన వికారాలను పొందుతున్నాడు. బాహ్య విషయాలు తన ఆధీనంలో లేనివి కనుక తాను తనకు అనుగుణంగా మార్చగలిగేవి కాదు. అందువల్ల వాటిని మార్చాలనే ప్రయత్నం ఎంత గొప్పగా చేసినా, కాలానుగుణంగా అది నిరుపయోగమే కాగలదు.ఐతే బాహ్య విషయాల ప్రభావానికి తాను లోనవటం వల్లనే గదా తాను దుఃఖము మొదలైన వికారాలకు గురౌతున్నది. కావున తాను ఏదోవిధంగా బాహ్య విషయాల ప్రభావానికి లోను కాకుండా ఉండగలిగితే దుఃఖ పడవలసిన అగత్యం వుండదు. ఈ విధమైన దృక్పథంతో బాహ్య విషయాలను ప్రక్కన పెట్టి అంతర్గతంగా తమలో ఏమి ఉన్నదో, దుఃఖము, భయము మొదలైన వికారాలు అసలు ఎలా కలుగుతున్నాయో నిశితంగా పరిశీలించారు.

ఇదే అంతర్ముఖం అవ్వటం, అంతశ్శోధన చేయటం అనబడుతుంది.ఇప్పటివరకు తాను బహిర్ముఖుడై తనకు బాహ్య విషయాల వల్ల దుఖం కలుగుతున్నదని గ్రహించడం చేత, అసలు బాహ్య విషయాలు ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అలా చూస్తున్నప్పుడు తనకు గోచరమౌతున్న స్థూల విషయాలన్నీ పంచ భూతములతో నిర్మితమైనవిగనూ, తాను పంచభూతముల కంటే సూక్ష్మముగనూ, భిన్నముగనూ వున్నట్లు తెలియుచున్నది.

ఇప్పటివరకు స్థూల దేహమే తాననుకోవటం వలన దేహ సంబంధ మైన విషయాలు తనపై నాపాదించుకోవటం జరిగింది. ఇప్పుడు ఇతర విషయాల సరసన దేహం కూడా తనకు భిన్నంగా గోచరిస్తున్నది. అలాగే స్థూలమైన దేహం కంటే సూక్ష్మమైన ఇంద్రియాలు, అంతకంటే సూక్ష్మమైన మనస్సు, బుద్ధి, ప్రాణము తనకు గోచరమౌతున్నాయి కనుక ద్రష్టయైన తాను గోచరమౌతున్న దృశ్యానికి భిన్నముగా సూక్ష్మతమమై యున్నట్లు తెలియుచున్నది. ఈ విధంగా సాంఖ్యానమ్ చేసిన మహర్షులు ఆత్మ యొక్క విస్త్రుతత్వాన్ని వివరించారు. 🙏



Source - Whatsapp Message

Friday, July 17, 2020

నిద్రకు ముందు తర్వాత ఏదేవుణ్ణి స్మరించాలి

నిద్రకు ముందు తర్వాత ఏదేవుణ్ణి స్మరించాలి

శరీరానికి, మనస్సుకి ఎంతో ప్రశాంతతనిచ్చే నిద్ర రోజులో అందరికీ ఎంతో ముఖ్యం. అటువంటి నిద్రకు, ముందు తరువాత కూడా దేవుడ్ని స్మరిస్తే ఎంతో చక్కటి శాంతి లభించి, మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుందనేది పెద్దల మాట. అయితే, ఇంతకీ, పడుకునే ముందు... తరువాత ఏ దేవుళ్లని స్మరించుకోవాలి?

మనం ప్రతీ రోజూ తప్పక చేసే రెండు పనులు… పడుకోవటం, లేవటం. ఈ పనులు మనిషే కాదు… జీవులన్నీ చేస్తాయి. మరి మనిషి కూడా జంతువుల్లాగా నిద్ర రాగానే పడుకుని , తెల్లవారగానే లేవటమేనా? ఇంకేం తేడా లేదా?

పెద్దలు ఏమంటున్నారు? దైవాన్ని నమ్మే మనిషి పడుకునే ముందు, నిద్ర లేవగానే దైవాన్ని స్మరించాలంటున్నాయి శాస్త్రాలు. ఏ పని చేసినా మనం దైవ నామ స్మరణ చేస్తాం. దీనివల్ల శాంతి లభించి, మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుందట. ఇంతకీ ఏ దేవుణ్ణి స్మరించాలి? దీనికి కూడా పండితులు ఓ మాట చెప్పారు.

శంకరుడు...
నిద్రించే ముందు మనం శివుడ్ని స్మరించాలి. ఓం నమః శివాయ అంటూ శంకరుణ్ణి ధ్యానిస్తూ నిద్రలోకి జారుకోవాలి. ఇలా ఎందుకంటే, శివుడు లయకారుడు. ఆయన్ని స్మరిస్తూ నిద్రలో లయిస్తే పీడకలల వంటివి లేకుండా హాయిగా పడుకోగలుగుతాం.

విష్ణుమూర్తి..
అలాగే… నిద్ర లేచిన వెంటనే… మనస్సులో స్మరించాల్సిన నామం… విష్ణు నామం. విష్ణువు అంటే స్థితికారుడు. ఆయనే మనల్ని రోజంతా క్షేమంగా, ఆనందంగా ముందుకు నడిపేవాడు. కాబట్టి… విష్ణువును స్మరిస్తూ మేల్కొనాలి అంటారు పండితులు.

ఏదో ఒక విష్ణు మంత్రం జపిస్తూ నిద్ర లేవాలి. అప్పుడు ఆ నారాయణుడే మనల్ని రోజంతా భద్రంగా కాపాడుతూ వుంటాడని భావం.

ఇక నిద్ర మేల్కొన్న తరువాత కళ్లు తెరిచే ముందు రెండు అర చేతులు రాపిడి చేసుకుని కళ్లపై అద్దుకోవాలి.

ఆ తరువాత అరచేతుల్లోకి చూస్తూ కళ్లు విప్పాలి.

అరచేతుల్లో లక్ష్మీ, సరస్వతీ, గౌరీ దేవిలు కొలువై వుంటారని శాస్త్రం.

అందుకే, ఇలా చేయటం వల్ల రోజంతా శుభప్రదంగా వుంటుంది...!!

Source - Whatsapp Message

కోపం తగ్గించుకోవడం వివేకవంతుల లక్షణం.

కోపం తగ్గించుకోవడం వివేకవంతుల లక్షణం.

ఇది సేకరించిన పోస్టు
""""""""""""""""""""""

కోపంవలన కలిగే నష్టాలు, కోపాన్నితగ్గించుకునే పద్ధతులను ప్రముఖ మెజీషియన్, సైకాలజిస్ట్, మార్గనిర్దేశకులు అయిన శ్రీ.బి.వి. పట్టాభిరామ్ గారి సలహాలను పాటిద్దాం, ఆరోగ్యమే మహాభాగ్యం అని చాటుదాం.


"మా ఇంట్లో నా మాటకెవరైనా ఎదురుచెప్తే భరించలేకపోతున్నాను సార్!

చేతిలో ఏదుంటే అది వారి మీదకు విసిరేస్తున్నాను. ఈ కోపం తగ్గించుకోడానికి మీ దగ్గర చిట్కాలేమైనా ఉన్నాయా?" అంటూ ఉస్సూరని కూర్చున్నాడు ఓ చిరుద్యోగి.

"తప్పకుండా ఉన్నాయి.అయితే మీకు ఏయే సందర్భాల్లో కోపం వస్తూందో ఎప్పుడైనా గమనించారా?" అని అడిగాను.

"దానికి సమయం, సందర్భం అక్కర్లేదు.
ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి మా ఆవిడ వెంటనే మంచినీళ్ళివ్వకపోతే కోపం.
ఒక వేళ మంచినీళ్ళిచ్చినా,
వెంటనే ఎందుకు టీ తీసుకురాలేదని కోపం.
ఒకవేళ రెండూ ఇచ్చినా టిఫిన్ ఏదైనా తెచ్చి తగలెయ్యొచ్చు కదా అని అరుస్తాను

ఒకవేళ ఇవన్నీ తెచ్చినా ’పిల్లలెక్కడికి తగలడ్డారు?’ అని తిడతాను.
ఒకవేళ వాళ్లంతా ఇంట్లోనే ఉంటే, ’పుస్తకాలు ముందేసుకోకుండా ఏం చేస్తున్నారు భడవల్లారా?’ అని కరుస్తాను.

ఒకవేళ వాళ్ళు చదువుతున్నా, వాళ్ళకు అంతకు ముందు వచ్చిన ఛండాలం మార్కుల గురించి తిట్టి, ఇలా అయితే మీరు అడుక్కుతింటారని నానా మాటలూ అంటాను.

ఎందుకిలా కోపం వస్తోందో తెలియడం లేదు.

ఒక్కోసారి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. భగవంతుడు ఈ కోపాన్ని నా ఒక్కడికే ఇచ్చాడేమోననిపిస్తుంది." అన్నాడు దిగాలుగా.
"కోపం మీకే కాదు, ప్రతి జీవికీ వస్తుంది.

పిల్లికీ, కుక్కకీ కూడా కోపం పాలెక్కువే.కోపం మీ ఒక్కరి ఆస్తీ కాదు.అయితే దాన్ని అదుపులో ఉంచుకోవడం వివేకవంతుల లక్షణం. తప్పనిసరైతే, కోపాన్ని నటించాలి తప్ప, నిజంగా కోపం తెచ్చుకోకూడదు. దానివల్ల సంబంధ బాంధవ్యాలు చెడిపోతాయి. విలువ ఇచ్చేవారు కూడా ఇవ్వరు.

మీ పట్ల భక్తి పోయి, భయం ఏర్పడుతుంది. చివరికి మిమ్మల్ని విడివిపెడతారు"అన్నాను.

"నిజమే. మా అబ్బాయికి ఎంసెట్ లో మంచి ర్యాంకు రాలేదని గొడ్డును బాదినట్లు బాదాను.వాడు ఆ రోజే ఇంట్లోంచి పారిపోయాడు. ఇంతవరకూ రాలేదు. నిజానికి మా వాడు మంచి స్టూడెంటే. ఆ సంవత్సరం ఎంసెట్ పరీక్షలో ఒక అధికారి తన కూతురి కోసం, పేపర్ లీక్ చెయ్యడం వల్ల చాలా మంది బ్రిలియంట్ స్టూడెంట్స్ దెబ్బతిన్నారని తరువాత తెలిసింది. మా వాడి జాడ ఇంతవరకూ తెలియలేదు. అసలు ఉన్నాడో లేడోనని భయంగా ఉంది" అన్నాడు కళ్ళనీళ్ళు కుక్కుకుంటూ.

" మీ కోపానికి ఫలితం చూశారు కదా! మీరింకా కోపాన్ని పెంచుకుంటూ పోతే, మిగతా వారితో మీ సంబంధాలెలా ఉన్నా, మీ ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం!" అన్నాను.

"నా ఆరోగ్యానికా? నేను బాగానే ఉన్నాను కదా! ఏదో ఆ కోపం వచ్చినప్పుడు అలా ఉంటాను తప్ప తరువాత మామూలవుతున్నాను" అన్నాడు అమాయకంగా.

"అని మీరనుకుంటున్నారు. మీకు కోపం వచ్చినప్పుడు మీ శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా?" అని ప్రశ్నించాను.
"మార్పులా?" అని అడిగాడు.

"అవును. పది మార్పులు జరుగుతాయి. అవి మీ వయస్సును రోజురోజుకూ తగ్గిస్తాయి." అంటూ ఆ పది మార్పులూ ఇలా చెప్పాను.

1.కోపం వచ్చినప్పుడు ఎడ్రినల్ గ్రంధులు విడుదల చేసే హార్మోన్స్ అధికమై, శరీరానికి అత్యధిక శక్తి వచ్చి ఏ అఘాయిత్యమైనా చేయించగలవు.

2.ఎడ్రినల్ గ్రంధులు విడుదల చేసే హార్మోన్ల వల్ల బాడీ కెమిస్ట్రీలో మార్పులు వస్తాయి. రసాయనాలు విషతుల్యం కాగలవు.

3.ఉచ్ఛ్వాసనిశ్వాసాలు అత్యధికమై కోపాన్ని మరీ పెంచుతాయి.

4.గుండె కొట్టుకునే వేగం తీవ్రమవుతుంది.

5.రక్త ప్రసరణ అత్యంత వేగాన్నందుకుంటుంది. దానివల్ల రక్తపుపోటు రావచ్చు,ఉంటే పెరగొచ్చు.

6.కోపం వల్ల నోరెండిపోతుంది. ఫలితంగా జీర్ణక్రియ తాత్కాలికంగా ఆగిపోతుంది.

7.చేతులు,పెదవులు వణుకుతాయి.చెమట పడుతుంది.

8.శరీరంలో కండరాలు బిగుసుకుంటాయి.

9.రక్తప్రసరణ అస్తవ్యస్తమై, శరీరంలో కొన్ని క్రియలు దెబ్బతింటాయి.

10.చివరిదైనా ముఖ్యమైనది మీ కోపం మిమ్మల్ని గుండె, లివరు వీటికి సంబంధించిన జబ్బులకు గురి చేస్తుంది.

"కాబట్టి మీ కోపం, మీ కుటుంబ పరిస్థుతులనే కాక, మీ శారీరకస్థితిని కూడా అతలాకుతలం చేయగలదు. మైగ్రెయిన్, అల్సర్స్, గ్యాస్, షుగర్ వ్యాధి, రుమాటిజం(కీళ్ళ నొప్పులు) వంటి జబ్బులు కోపిష్టి వారి ఆప్తమిత్రులని మరిచిపోకండి!" అన్నాను.

"మీరు ఇవన్నీ చెప్పి భయపెట్టకండి. నా కోపం తగ్గించే మార్గం చెప్పండి. మీరంతా అదృష్టవంతులు.మీకు కోపం రాదు" అన్నాడు బాధగా.

"ఎవరన్నారు? అందరికీ కోపం వస్తుంది. సహజంగా కోపం రాని వారిక్కూడా కోపం వచ్చే సంఘటనలు ఎన్నో రోజూ జరుగుతున్నాయి.

ఉదాహరణకు ట్రాఫిక్ జామ్ లు, టెలిఫోన్ల్ రాంగ్ కాల్స్ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వకపోతే పని జరగపోవడం, అప్పు దొరక్కపోవడం, పిల్లల చదువులు, లోకంలో కులాల పిచ్చి పెరిగి, చేతికందిన అదృష్టం జారిపోవడం ఇలా ఎన్నో!

చివరికి ఒక రోజు పేపరు వాడు పేపరు వెయ్యకపోయినా, టీవీలో చెత్త ప్రోగ్రాములు వచ్చినా, పాలవాడు ఆలస్యంగా వచ్చినా కోపం వచ్చి తీరుతుంది. అలాగని ప్రతి దానికీ చెలరేగిపోయి, చేతిలో వున్నది విసిరికొడితే, ఒకరోజు సమాజం మిమ్మల్ని ఏకాకి చెయ్యడం తప్పదు! అందరూ మిమ్మల్ని విసిరేస్తారు!" అన్నాను.

"అయితే నన్నేం చెయ్యమంటారు?" జాలి కలిగేలా అడిగాడు. నా మాటలు అతన్ని దాదాపు భయపెట్టాయి.

"ఏమీ పరవాలేదు. ముందు ఇంటి వారి మీద కోపం తెచ్చుకోవడం మానండి. మీరేమన్నా చచ్చినట్లు పడతారనే ధీమా నుంచి బయటపడండి. వారికీ కోపం ఉంటుందని మరిచిపోకండి!

బయటివారి మీద కోపం ఇంట్లో ప్రదర్శించకండి. కుటుంబసభ్యులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మరిచిపోకండి. ఇక ఈ పద్ధతులు పాటించండి.

1.కోపం వచ్చినప్పుడు ఒకసారి దీర్ఘమైన శ్వాస తీసుకుని మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి. వీలైతే దైవనామం స్మరించండి.

2.ప్రతి నిత్యం ఏదో ఒక రిలాక్సేషన్ ఎక్సర్స్ సైజు 10 నిమిషాలు చేయండి. లేదా యోగాభ్యాసం చెయ్యండి.

3.కోపం వచ్చినప్పుడు ఒక గ్లాసు నీళ్ళు తాగడమో, వంద వరకూ అంకెలు లెక్కపెట్టడమో చేయండి.

4.ఇతరులు నిజంగా తప్పుచేసినప్పుడు కోపం వచ్చినట్లు నటించండి తప్ప, నిజంగా కోపం తెచ్చుకోకండి.

5.చివరగా, మీకు చాలా పనులు వాయిదా వేసే అలవాటుంది కాబట్టి, ఇవాల్టి, కోపాన్ని మరునాటికి వాయిదా వేయండి!" అంటూ లేచాను.

సర్వేజనా సుఖినోభవంతు

Source - Whatsapp Message

నాటి పాతాళ లోకమే నేటి అమెరికా!

నాటి పాతాళ లోకమే నేటి అమెరికా!
➖➖➖➖➖➖➖➖

పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరిం చారు.

👉 సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు.

👉 ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖ రేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.)

👉 కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland) (సగర పుత్రులు బూడిద కుప్పలు గా మారిన ప్రదేశం) మరియు

👉 హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి.

👉 వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తోలి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే దీని పురాతన నామం మహాబలి భూమి, ఇప్పుడది మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందింది.

👉 ఈ మలిపునగరంకు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం.

👉 బలిచక్రవర్తిని శ్రీ మహా విష్ణువు పాతాళానికి అధిపతి గా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగు తోంది.

👉 పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనా లు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా స్వరంగం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము.

👉 రాముడి ఆజ్ఞ మీద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజింతారు. మధ్య అమెరికా, హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని Lost City of the Monkey God‘ గా వ్యవహరిస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారు (Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు 1939 లో వెళ్ళడించారు.)

👉 “సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ" అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురుల కు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు.

👉 భూమినుండి 50000 యోజనాల దూరంలో పాతాళం ఉన్నది. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పు కున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది.

👉 అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, Oregon లో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీ కూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే.

👉 మూల అమెరికాయులు (రెడ్ ఇండియన్లు) విగ్రహారాధన చేస్తారు. ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడు తుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం The light of India లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఉన్నది.

👉 వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలు అవుతుంది. ఇంచు మించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరి పోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు. వారి పండగలు కూడా మన దశరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియ చెయ్య వలసిన అవసరం ఉన్నది.

ఒకసారి నడిచే దేవుడు కంచి పరమాచార్య వారు మూల అమెరికాయుల మంత్రాలకు మన మంత్రాల కు ఉన్న సంబంధం వివరిస్తారు. ఒకప్పుడు ఈ లోకాలన్నింటిలో ఒకే ధర్మం విలసిల్లేది.

అక్కడివారి వద్ద తాళం కనబడుతోంది. కేవలం హిందూ ధర్మంలో ఆ తాళం, దాని చిక్కుముడి విప్పే తాళంచెవి కూడా ఉన్నాయి అని పరమాచార్యులు అన్నారు.

ఎంత సత్యమో కదా !!!
♦️♦️♦️♦️♦️♦️♦️

Source - Whatsapp Message

"RIP" అంటే అర్థం ఏంటి? ఎందుకు ఎక్కడ వాడాలి??

"RIP" అంటే అర్థం ఏంటి? ఎందుకు ఎక్కడ వాడాలి??
మనం ఈ మధ్యకాలంలో ఎవరైనా చనిపోయిన వార్త విన్నప్పుడు watsapp లో లేదా social media లో జనాలు గుంపులో మందలాగా RIP అని రాసి పెడుతుంటారు. బాగా చదుకున్నామనుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు కూడా ఆ పదానికి అర్థం ఏమిటో తెలుసుకోకుండానే RIP అని పెట్టడం ఒక ఆచారంగా మారిపోయింది. కాని ఈ పదాన్ని ఎవరు ఉపయోగించాలి ఎవరి కోసం ఉపయోగించాలో చూద్దాం.

అసలు ఎవరిదైన మరణ వార్త విన్నప్పుడు RIP అనే పదం వాడటం మన సంస్కృతి లో లేదు పాశ్చాత్య మతాలైన క్రైస్తవం, ఇస్లాం ఆచారల నుంచి పుట్టింది. హిందూధర్మం గురించి మరిచిపోవడం వల్ల జనాలకు ఈ పదం వాడుక దాని అర్థం మీాద అవగాహన లేకుండా పోయింది.

RIP అనే పదానికి అర్థం "Rest in Peace" (శాంతిగా శయనించి శాశ్వత నిద్రను పొందు ) ఈ పదం కేవలం ఎవరినైతే గొయ్యి తవ్వి పాతిపెడతారో వాళ్ళ కోసం మాత్రమే వాడాలి అంటే ముస్లిం లేదా క్రైస్తవులు మరణించినప్పుడు ఈ పదం వాడొచ్చు ఎందుకంటే వారి ఆచారం ప్రకారం వారు మరణానంతరం ఆ వ్యక్తిని పాతిపెట్టి పడుకోమని చెప్పి ఎప్పుడైనా "judgement day" లేదా "కయామత్ కే దిన్" వచ్చినప్పుడు ఈ శవాలన్నీ పునర్జీవులౌతాయని వారు నమ్ముతారు. అంటే అప్పటి వరకు విశ్రాంతిగా శయనించమని RIP అని రాస్తారు లేదా కోరుకుంటారు.

కానీ హిందూ ధర్మం సాంప్రదాయాల ప్రకారం శరీరం భౌతికమైనది, ఆత్మ అమరమైనది,అందుకే హిందూ ధర్మంలో మరణించిన వ్యక్తిని కట్టెలు నెయ్యితో యథాశక్తి కాలుస్తారు. అంటే ఒక హిందూ చనిపోతే RIP(Rest In Peace) అని రాయడంలో అర్థమే లేదు. హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి ఆత్మ వేరొక దేహంలోకి వెళుతుందని పునర్జీవం పొందుతుందని నమ్ముతారు. ఆ ఆత్మకు కొత్త దిశ/సద్గతి ప్రాప్తించాలనే శ్రాద్ధకర్మలు శాంతిపాఠాలు చేస్తారు.

అంటే హిందూ ఎవరైనా మరణిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరాలని లేదా వినమ్ర శ్రద్ధాంజలి లేదా శ్రద్ధాంజలి అని మాత్రమే రాయాలి. Fashion కోసమో style గా ఉంటుందనో లేదా తెలియకుండానో లేదా గుంపులో మంద లాగా RIP అని రాయకూడదు. అదే క్రైస్తవం లేదా ముస్లింలు మరణించినప్పుడు RIP అని రాయవచ్చు.

ఈ మధ్య శ్రద్ధాంజలి అని రాయడానికి కూడా బద్దకించి shortcutలు వెతుక్కుంటున్నాం. ఆ క్రమంలోనే ఈ RIP మనకు అంటుకుంది. అవివేకంతో ఒకరు చేసారని దానినే గుడ్డిగా follow అవుతున్నాం. ఈ విషయం ఎవరినీ ఉద్దేశించినది కాదు కేవలం వాస్తవాలు తెలియచెప్పడం కోసమే.

అందుకే ఇప్పటికైనా భవిష్యత్తులో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారని ఈ విషయం తెలియని చాలామందికి తెలియపరుస్తారని కోరుకుంటున్నాం.

Source - Whatsapp Message

ప్రస్తుత వివాహ వ్యవస్థ

ప్రస్తుత వివాహ వ్యవస్థ

ఎవరిని కించపరచటానికో వ్రాసింది కాదు. సంఘంలో జరుగుతున్న సంఘటనలు వారి స్పందనలు మాత్రమే. ....
"ఆడపిల్లలు, వారి
తల్లిదండ్రులదే పైచేయి"

కావలసిన అర్హతలు: BTech, Software ,America
అబ్బయికి సొంత ఇల్లు,
తండ్రికి పెన్షన్ వచ్చే ఉద్యోగం.
సిగరెట్, మందు అలవాటు లేకుండా, మంచి పర్సనాలిటీ, ఉన్నత కుటుంబం.
ఆడపిల్లల తల్లితండ్రులకు
సపోర్ట్ గా ఉండాలి.

ఇంటర్వ్యూ:

ఫోన్ చేయ్యగానే పిల్ల తల్లి మాట్లాడుతుంది.భర్తకు అవకాశంలేదు.

"అబ్బాయి చదువు,తెలివితేటలూ పరీక్షించి లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తాడు సదరు కంపెనీ వాడు".
కాని,
10th పాస్ కాని తల్లి " మీ అబ్బాయి
ఏ యూనివర్సిటీలో చదువుకొన్నాడు?" అనే ప్రశ్న. ( అంటే ఉద్యోగమిచ్చినవాడు వెధవ అన్నమాట ఈవిడ దృష్టిలో)
మీ అబ్బాయి ఫోటో, వివరాలు whatsapp లో పంపండి , మా అమ్మాయిది పంపుతాము అంటుంది ! మనం పంపిస్తే వారు పంపరు. తరవాత
మనమే ఫోన్ చేయాలి. అడిగితె మొదటి వారం:
"ఇంకా అమ్మాయి చూడలేదండి". రెండవ వారం :
" అమ్మాయి లేట్ గా వస్తోందండి.
ఇంకా చూడలేదు" .
మూడవ వారం:
" ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉందండి".
నాలుగో వారం:
శని,ఆదివారాలలో " అమ్మాయి తలనోప్పని పడుకుందండి" .
ఐదో వారం:
అమ్మాయి పేకేజ్ మీకన్నా 10 వేలు ఎక్కువండి. ఒప్పుకోలేదు" అని కానీ , లేదా " మీరు ఇన్ని సార్లు చెయ్యవలసిన అవసరం లేదండి . మేమే చేస్తాము" అనిఫోన్ పెట్టేసి, తరవాత మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు.

అమ్మాయిల విషయానికొస్తే:
తల్లి తండ్రుల గారాబం, తరవాత వారిమాట వినకపోవడం , మితిమీరిన స్వేచ్ఛా జీవితంతో పెళ్లి చూపులనాడు పెళ్ళి కోడుకుతో సంభాషణ ఏకాంతంగా:

"మీ ఇంట్లో బాగేజీ , లగేజి ఉన్నాయా?
మీ ఇంట్లో వీల్ ఛైర్ లు ఉన్నాయా?
మీ ఇంట్లో డస్ట్ బిన్లు ఉన్నాయా?
మీ ఇంట్లో రాహు కేతువులున్నాయా?"
అని అబ్బాయి తల్లితండ్రుల
నుద్దేసించి పై ప్రశ్నలు . తరవాత,

"మీ అమ్మ నాన్నలు మనతో
ఉండడానికి వీలు లేదు,

నా సెల్ నువ్వు ఆన్సర్ చెయ్యొద్దు.
నీ సెల్ నేను ముట్టుకోను!

నేను వంట చెయ్యను.
కర్రి పాయింట్ లో తెచ్చుకుందాము!

నాజీతం బ్యాంకులో ,
నీ జీతం ఖర్చుపెడదాము!"

ఇంకా కొంతమంది " మనకి పిల్లలు వద్దు" అని నిబంధనలు.

లేకపోతె తాంబూలాలు లేవు.
కొన్ని తరవాత చెప్పి కూడా
తాంబూలాలు కాన్సిల్ చేసుకొన్న కేసులు చాలా ఉన్నాయి..

పెళ్ళైన తరవాత ఖర్మకాలి పడక విడాకుల వరకు వస్తే,
విడాకులకై సంతకం పెట్టాలంటే లక్షలు పరిహారం.
అప్పటికే అబ్బాయి క్రెడిట్,డెబిట్ కార్డులు బాలన్స్ జీరో చేసేస్తుంది.
విడాకులైనా ఏ మాత్రము
మార్పు, బాధ లేకుండా
కొత్త పెళ్లి కూతురు లాగ అవే కండిషన్లు.
సర్దుబాటు వ్యవహారం, పశ్చత్తాపం ఏకోశానా ఉండవు.
వీటన్నిటికి తల్లి సపోర్ట్!

అమెరికానుండి వచ్చిందంటే సూట్కేసులతో సరాసరి ఎయిర్ పోర్ట్ నుండి అమ్మగారి ఇంటికే. 15 రోజుల తరవాతో లేదా వెళ్ళిపోయే టప్పుడు ఒక వారం ముందరో ప్రత్యక్షం.

ప్రమాదమేమంటే,
మగవారికి సంతానోత్పత్తి 90 సంవత్సరాలు దాకా ఉంటుంది. కాని
ఆడవారికి మొనోపోజ్ వచ్చిందంటే కుదరదు. ఇప్పుడు 35 సంవత్సరాలు దాటితే వచ్చేస్తోంది. తల్లితండ్రులు ఈ సంగతి తెలిసో, తెలియకో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నారు.
ఆడపిల్లల సంపాదన మరిగి వారికి వచ్చిన సంబంధాలు తోసిపుచ్చే తల్లితండ్రులు కూడా ఉన్నారు. కొంత మంది ఆడపిల్లలు స్వయంగా చెప్పిన వ్యధ ఇది !
ఇవండీ! మన మగ పిల్లలకు వివాహం కాకపోవడాని కారణాలు , వాస్తవాలు!
అనుభ వించిన వారు చెప్పిన
నగ్న సత్యాలు!
మాట్రిమొని కన్వెక్షన్లకు వెళ్ళినప్పుడు అక్కడి తల్లితండ్రులు , ఆడపిల్లలు వేదనతో చెప్పిన యదార్ధ సత్యాలు. అంతేకాని, ఆడపిల్లలమీద అభాండాలు వెయ్యడం కోసం మాత్రం కాదు. ఇది కేవలం అటువంటి ప్రవృత్తి కలవారికి మాత్రమె!
30 సం. వయసు దాటిఅదృష్టవంతులైన పెళ్లి కాని ప్రసాదులకు ,పెళ్లి చేసుకొని బాధలుపడి విడాకులు తీసుకొన్న అబ్బాయిలకు,
ఇంకా పెళ్ళి చేయ్యక మంచి , మంచి అని సంబంధాలు వెదుకుతూ
అత్యాశతో వయసు దాటబెట్టిన అమ్మాయిల తల్లితండ్రులకు ,
18 వయసు ఫోటోలు పెట్టి పాకేజీలను , క్వాలిఫికేషన్లు పోల్చుకొని
అత్యాసతో చార్మింగ్ పోయి జుట్టుకు రంగేసుకుని ఇంకా ఎదురు చూస్తున్న అమ్మాయిలు , అబ్బాయిలకు
ఈ పోస్ట్ అంకితం.

పోయిన వయసు రాదు.
"35 వయసు దాటిన అబ్బాయిలు ఇంటర్ కాస్ట్ కి వెళ్ళిపోవడమే ఉత్తమం".

"పురుషుడు-స్త్రీ- వయస్సు"
ఇవి మూడే ముఖమైనవి.
జీతం, చదువు కాదు
ఒక వ్యక్తి ఆవేదన.

ప్రస్తుత కాల మాన , ఈ సమాజ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ తమ జీవిత అనుభవాలను , జరుగుతున్న వాస్తవాలను గుర్తెరగాలి ,చూసి జీర్ణించుకోవాలి , మనస్సు దిటవు చేసుకొని జీవించాలి .

కులము కూడు పెట్టదు ,
మతము మంచి నీళ్ళు ఇవ్వదు .
కుల మతాలను చూసి ఆనందపడకు ,ఇవి జీవించడానికి ఉపయోగ పడవు .

ఈ కరోనా కేసులలో , చావులలో ఏ బంధాలు ,రక్త సంబంధాల వాళ్ళు ,ఈ కులాలు , మతాల వాళ్ళు ....... దగ్గరకు రారు .

ఒక్క విషయం అందరూ గమనించాలి .
అన్ని కులాలు ,మతాలు వారు అందరూ కలిసి పనిచేస్తేనే ఆహారం మన నోటిలోకి చేరుతున్నది .

మానవ పుట్టుక పరమార్థం , జీవిత పరమార్థం తెలుసుకుని ,
మనిషి సగటు ఆయుష్షు గుర్తెరిగి జీవితాలు సార్థకం చేసుకోండి .

మరి చేస్తున్న వ్యాపారాలలో కులస్తులు పండించిన పంటలు , కులస్తులచే తయారు చేసిన వస్తువులను తీసుకొచ్చి , కులస్తులతో మాత్రమే వ్యాపారము చెయ్యొచ్చుగా ...

తమ పిల్లలను తమ కులస్తుల దగ్గరే అన్ని చదువులు పూర్తి చేయించి తమ కులస్థుల దగ్గరే జాబ్స్ చెయ్యొచ్చుగా .....

కేవలం 100 % తమ కులస్తులచే పూర్తిగా నిర్మించిన ఇండ్లలో నివశించోచ్చుగా ..
ఇంటిలో ఉపయోగించే ప్రతి వస్తువు తమ కులస్థులచే తయారు
చెయ్యబడినదిగా ఉండాలని అనుకోవచ్చుగా ...

అన్నీ కుదిరినప్పుడు కులస్థుల నే వివాహము చేసుకోనియ్యండి .
కుదరనప్పుడు ఇంకా ఆశతో వేచి చూడక ... రెండు వైపులా పెద్దల అనుమతితో , నచ్చిన మెచ్చిన కులము వారిని చేసుకోండి .
ఎవరి జీవితాలు వారివి . ఆనందముగా ,స్వేచ్ఛగా ,గౌరవంగా ,ఆరోగ్యముగా ,అన్నోన్యముగా జీవితము కొనసాగించండి .
శుభం .. శుభమస్థు ..

Source - Whatsapp Message

ప్ర'పంచ' దంపతులు గూర్చి తెలుసుకుందాం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ప్ర'పంచ' దంపతులు గూర్చి తెలుసుకుందాం
☘☘☘☘☘☘☘☘
ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా 5 విధాలు గానే ఉంటారు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మొదటిది లక్ష్మీనారాయణులు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై ఆలోచనకూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
రెండవది
గౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం,
తలనుంచి కాలిబొటనవ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు, రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత,ఆలోచనలకు తల,కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం,
కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మూడవది
బ్రహ్మ సరస్వతుల జంట
బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం, దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని ఇలా
ఏ మాట మాట్లాడినా,
ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య ..ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
నాల్గవది
ఛాయా సూర్యులు సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు,
అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది.
తనభర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు.అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది,ఛాయాదేవి.
ఏ ఇంట భర్త కఠినంగా. కోపంగా ,పట్టుదలతో ఉంటాడో.
ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఐదవది
రోహిణీ చంద్రులు
రోహిణీ కార్తెలో
రోళ్ళు కూడా పగులుతాయనే
సామెత ఉంది,
చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని,
ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడునూ,
ఏ జంట భర్త మెత్తగా ఉండి,లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోనుఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Source - Whatsapp Message