Tuesday, September 29, 2020

జీవితం ఒక వరం.

🌸 జీవితం ఒక వరం. 🌸

🌸 ఎప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు మాటలలో. అని సార్ చెబుతుంటే మాట మీద ధ్యాస అనుకునేవాళ్ళం..
మన జీవితంలో చిన్న చిన్న ఆనందాలు కూడా ఆనందించలేని స్థితి ఉంటుంది అనేది తెలిసేవరకు అర్ధం కాలేదు... ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉన్నా మనం నిలవాలి అంటే మన గురించి ఎక్కువగా చెప్పకపోయినా పర్లేదు కానీ తక్కువ చేసుకోకూడదు... పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నా మనం ఉంటాము అదే అన్నింటికీ మూలం... మనం ఉంటేనే మిగతా ప్రపంచం ఉంటుంది... మనముంటాం కాబట్టే మన ప్రపంచం ఉంటుంది... మనం ఉంటున్నాం అనేది వరం..

🌸 ఓ ప్రసిద్ధ మానసికవేత్తని గొప్ప విషయం ఒకటి చెప్పండి అని విలేకరులు అడిగితే ఈ రోజు నేను నిద్ర లేచాను.. అది గొప్ప విషయం ఎలా అవుతుంది అని అడిగిన వాళ్లకు ఇచ్చిన సమాధానం..
నేను ఉన్నాను.. అదే నా ప్రపంచంలో అద్భుతమైన స్తితి.. అనిచెప్పారు.. ఇక్కడ అర్ధం చేసుకోవలసింది... నేను ఉంటేనే నా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నది చూసేది చేసేది.. ఆనందించేది... అంటే జీవితం ఒక వరమే..

🌸 మనం మన జీవితం లో ఉంటే ఏదైనా సృష్టిస్తాం, సాధిస్తాం,పొందుతాం.. మన జీవితం లో మనం ఉన్నంతవరకు మనం మన ప్రంచానికి అధిపతులం... రారాజులం... ఇదంత అందరికి తెలుసు... అన్ని పెద్ద పదాలు ఉపమానాలు... వాస్తవానికి మనం మనమే కానీ ఎవరికి తక్కువ కాదు అలాంటప్పుడు మనల్ని మనం ప్రేమించాలి... ఇష్టపడాలి మనతో మనముండాలి... ఇక్కడ ఇంకొకరితో పోలిక అనవసరం... కారణం మనం తెలియకుండా మన జీవితాన్ని పొలికతో చిన్నగా చేసుకుంటున్నాం... ఇది భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా... మనల్ని మనమే ఉన్నతంగా చూస్తే... ఉండేది ఉన్నతమైన స్థితే... అంటే ఉన్నతమైన స్తితి ఇంకొకరు చెబితే రాదు మనలో ఆ భావన ఉంటే వస్తుంది... ఆ ఉన్నతమైన స్థితి కోసం చేసే విన్యాసాలు అనేకం... పోటీ ప్రపంచంలో శాంతి, సౌఖ్యం, ఆనందం కోసం కూడా పరుగే...

🌸 చక్కగా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉన్న ఆనందం బయట శాలువా కప్పి పొగిడితే వస్తుందా... మనల్ని మనం గుర్తిస్తేనే ఎదుగుదలకు ఓ సోపానం.. ఆ సోపానం మీద అడుగులు మన ఎదుగుదల..
దీనికి మనం చేయవలసినది..
ఏమన్న ఉంది అంటే స్వయం ప్రేమే.. స్వయం గుర్తింపు, స్వయ0తో నడక... ఇక్కడ ఎవరు ఎవరిని నడిపిస్తున్నారు తెలిస్తే... రహస్యం బట్టబయలు.. ఒక్క మాటలో మనల్ని మనమే గుర్తిస్తే అంటే ఉన్నది ఉన్నట్లు గా చూడగలిగితే జీవితం అద్భుతమైన వరం..

🌸 మనం దేనినైనా సాధించాలి అంటే కొద్దిపాటి స్వయంగా క్రమశిక్షణ అలవర్చుకోవాలి... మనకోసం మనం చేసే పని ధ్యానం అది క్రమం తప్పకుండా చేస్తే చాలు..
అదే అన్నింటిలో మిన్నగా నుంచోబెడుతుంది... అంటే మన ఇన్నర్ ని మేలుకోలపడమే... అదే లక్ష్యాలకు అన్నింటికీ దారి... మనం ఎలాంటి లక్ష్యం పెట్టుకున్న దారి మాత్రం అదే...
ఎవరు ఎన్ని రకాలుగా చెప్పిన మనల్ని మనం విశ్వసించి నడవాల్సిందే... మనల్ని మనం విశ్వసిస్తేనే ఏదైనా సాధించేది.. పొందేది... పంచేది...

🌸 ధ్యానం సర్వ రోగ నివారిణి...
ధ్యానం సకల బోగకారిణి..

Thank you...🌸🌸🌸

Source - Whatsapp Message

Sunday, September 27, 2020

దు:ఖం నుండి శాంతి వైపుకు .....

దు:ఖం నుండి శాంతి వైపుకు .....

ఒక రాజు
ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది :

' నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టివుంటారు.

కానీ వాళ్ళంతా రాజులు కాలేదు ,

నేనే ఎందుకయ్యాను ?
ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది ?

' మరుసటిరోజు సభ లో పండితులముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు.

అపుడు ఒక వృద్ధ పండితుడు '' రాజా , ఈ నగరానికి తూర్పున బయటవున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు.

ఆయనను కలవండి.
జవాబు దొరుకుతుంది ''అన్నాడు.

రాజు వెళ్ళాడు. అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు

అది చూసి రాజు ఆశ్చర్యపోయి ,...
తన ప్రశ్న ఆయన ముందు పెడితే....

ఆయన అన్నాడు : '' ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది.

అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.''

నిరాశపడినా ,
రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు.

రాజు ఆయన్ని చూసినపుడు , ఆ సన్యాసి మట్టి తిం టున్నాడు

రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు.

కానీ తన ప్రశ్ననైతే అడిగాడు.

కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు


రాజుకూ కోపం వచ్చినా , సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు.

వాపసు వెళుతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు : '' ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది ,

అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని కలవండి.'

రాజుకంతా గందరగోళంగా వుంటూంది. అయినా అక్కడికెళతాడు.

చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు.

అపుడు ఆ అబ్బాయి అన్నాడు

'' గత జన్మ లో నలుగురు వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారితప్పివుంటారు.

ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టుక్రింద ఆగివుంటారు.

తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి , నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదటీవాడు కోపంతో

'' నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా ? '' అని కసురుకొంటాడు

రెండవ వ్యక్తిని అడిగితే..
'' నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే ''

అని వెటకారంగా అంటాడు.

మూడవ వాడు '' రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ?

''అని నీచంగా మాట్లాడాడు.

కానీ నాల్గవ వ్యక్తి మాత్రం '' తాతా , నీవు చాలా నీరసంగా వున్నావు. ఈ రొట్టె తిను , '' అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేసాడు.

ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా '' అని అన్నాడు.

రాజు దిగ్భ్రాంతి కి లోనయ్యాడు.

అపుడు ఆ అబ్బాయి మరో మాట చెప్పి ప్రాణం వదిలాడు :

'' రాజా , ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆ నలుగురు వ్యక్తులు ఒకే తల్లికి పుట్టిన నలుగురు కొడుకులు.''

ఈ కథను బట్టి
మనం గతం లో చేసినదేదీ వృథాగా పోదు అని చెప్పడానికే.

మరో కారణం ఏమంటే ,
కన్ను , ముక్కు , చెవి , నాలుక , చర్మం అనే అయిదు ఇంద్రియాల ద్వారా ,

అలాగే మన మనసు ద్వారా మనం ఎన్నో పనులు చేసివుంటాం.

వాటిలో మంచివి వుంటాయి , చెడ్డవి కూడా వుంటాయి.

అవేవో మనకు ఇపుడు తెలియవు.

మనం ఇపుడు
సంతోషంగా ,
అందంగా ,
ధనవంతంగా ,
ప్రశాంతంగా వున్నామంటే గత జన్మల్లో చేసిన మంచి కర్మలు ఇపుడు ఫలితాలు ఇస్తున్నాయని ,

ఒక వేళ మనం ఆందోళనగా , భయంగా , ఎదురుదెబ్బలు తింటున్నామంటే అప్పటి చెడు కర్మలు ఫలితాలు ఇస్తున్నాయని తెలుసుకోవాలి.

కానీ...

ఈ జన్మ లో మనం ఏమైనా పాపాలు , తప్పులు చేసివుంటే వాటినుండి విముక్తి పొందడానికి ఏమైనా పరిష్కారాలున్నాయా ?
అంటే ''

ఖచ్చితంగా వున్నాయి ''

https://chat.whatsapp.com/EKdd6PvxBbO69vk63jLFSK



మన పురాణాలు ,
శాస్త్రాలు. అవి ఏవి ?
👇🏻👇🏻👇🏻

1. ఆ చెడు పనులు ఏవో గుడికెళ్ళి భగవంతుడిముందు చెప్పుకొని ,...

ఇక మీదట అలాంటివి చేయనని మనకు మనమే గట్టి నిర్ణయం తీసుకోవాలి.

మరెవ్వరికీ చెప్పరాదు.

ఎందుకంటే దేవుడొక్కడే పరిపూర్ణుడు , ఏ లోపాలూ లేని వాడు కాబట్టి. దేవుడికి సర్వస్య శరణాగతి చేసుకోవాలి.

[ అంటే '' నీవే దిక్కు. నేను నిన్నే నమ్ముకొన్నాను '' అనే భావంతో బ్రతకడం]

2.ప్రతి రోజూ నియమం తప్పకుండా ఇంట్లో ధ్యానం , ప్రాణాయామం , ప్రార్థన , పూజ చేస్తూ , ఆ సమయంలోనూ , అలాగే ఏ ఇతర పని చేస్తున్నా - వంట చేస్తున్నా ,
వీధిలో నడుస్తున్నా , వేరే చోట్లకు ప్రయాణిస్తున్నా , తింటున్నా , మేడ మెట్లు ఎక్కి, దిగుతున్నా ... మూడు మంత్రాలను మనసులో ఎప్పుడూ స్మరిస్తూ వుండాలి[ ఇవి ఋషులు , గురువులు , వేదాలు చెప్పినవి ]

1. ఓమ నమో నారాయణాయ 2. ఓం నమ: శివాయ
3. ఓం శ్రీమాత్రే నమ:

[ మేము హిందువులం కాదు అనుకొనే వారు వారి మతం లోని దేవుడి పేర్లను స్మరించాలి ]

ప్రతి పదిహేను రోజులకు ఒక మారు [ ఏకాదశి రోజున ] ఉపవాసం చెయ్యాలి.

3.పేదలకు , ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలి.

4.ఇంట్లో రామాయణం , భారతం , భగవద్గీత , భాగవతం లాంటి పుస్తకాలను , మహా భక్తుల జీవిత చరిత్రలను [ఉదాహరణకు ధృవుడు , ప్రహ్లాదుడు , మార్కండేయుడు , అనసూయ , సావిత్రి మొదలగు వారు ]

అలాగే...

శ్రీ రామకృష్ణ పరమహంస , వివేకానంద ,
పరమహంస యోగానంద మొదలగు వారి పుస్తకాలను ప్రతిరోజూ కనీసం ఒకటి లేదా రెండు పేజీలను శ్రద్ధగా చదివి , అర్థం చేసుకొని, ఆచరించడం అలవాటూ చేసుకోవాలి.

5.జీవ హింస ఘోరమైన పాపం కాబట్టి మాంసాహారం తినకూడదు.
మద్యం తాగకూడదు.

6.ప్రతిరోజూ ఉదయాన్నే ఇంటి బయట కనిపించే చీమలకు చక్కెరనో , బెల్లమో పెట్టాలి.

ఆవులకు కూడా తిండి పెట్టడం మరవరాదు.

7.కోపం వదిలేస్తూ రావాలి. Spiritual [ అధ్యాత్మికంగా ] గా వుంటూ, మంచి పనులు, మంచి ఆలోచనలు చేసేవారితో సాంగత్యం [ స్నేహం ] కలిగివుండాలి.

దీన్నే ' సత్సాంగత్యం ' అంటాయి శాస్త్రాలు.

8. మన మేలు కోరేవారిని మనం మాటలతో , ప్రవర్తన తో ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టరాదు.

9. సంపాదనలో కొంత డబ్బును పేదలకు , దాన ధర్మాలకు ఉపయోగించాలి.

10. అహంకారం , అహంభావం వదిలేసి , నిరాడంబరంగా జీవించాలి.

పైన చెప్పిన పది పనులు చేస్తూవుంటే ,..
గతం లోనూ ,
ఈ జీవితం లోనూ చేసిన చెడు పనుల నుండి మనం విముక్తి పొంది ఇక మీదట జీవితం లో శాంతితో బ్రతకవచ్చు.

ఇది వంద శాతం సత్యం.

ఎందుకంటే ఇవి నేను చెపుతున్నవి కాదు.

మన ధర్మ గ్రంధాలు చెపుతున్న తిరుగులేని సత్యాలు... !!

Source - Whatsapp Message

మంగళసూత్రం

మంగళసూత్రం ...

దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే మన హిందూ సోదరీమణుల నవీనత పరాకాష్టకి వెళ్లి మంగళసూత్రాన్ని త్యజించడం / లేదా పక్కనపెట్టడం పరిపాటిగా మారింది. అంతేకాక ఈ సినిమాలు టీవీల పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది.

మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్రగణాల నుండి వచ్చే వాట్సాప్ లు ఫేస్బుక్ లలో వచ్చే ఫోటోలు కూడా, ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది చాలా అరిష్టం.

క్షీరసాగరమధన సందర్భంలో మాంగళ్యవివరణ

“మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో !

పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట, అమ్మ పార్వతీ దేవి కంఠాన్న ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.

“మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా !
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాంశతం”

ఓ సుభగా ! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు, అంటే పుణ్యస్త్రీగా, ముత్తయిదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది.

పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి.

భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు.

మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.

ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్యలహరి పుస్తకములో కూడా మంగళ సూత్రానికి విశేష విశిష్టత కల్పించారు.

మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకంటే, ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు.

పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలగునవి.

ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27
ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం. అంటే అర్ధం, ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి.

భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది.

అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వ సాధారణమైపోయింది.

ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం వలదు.

కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభఫలితాలు సమకూర్చగలవు.

పాశ్చాత్య అనుకరణ వెర్రిలో ఊగుతున్న మన ఆడ కూతుర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం. దీని విశిష్టతని అర్ధం అయ్యే వరకు తెలియపరుద్దాం...

లోకాసమస్తాః సుఖినోభవంతు

Source - Whatsapp Message

ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....

ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....

నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి
1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.
2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.
3. నేను రాస్తున్నదంతా నేను జీవితంలో అనుభవించినవి. నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుందని.

ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో....

1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు... నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో...
నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు.... అలాగే జాగ్రత్తగా గమనించు కూడా.. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది...నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు,.. జాగ్రత్త,.. గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా!..

2. ఏ ఒకరూ తప్పనిసరి కాదు,. తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు..
ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా,.నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు..

3. జీవితం చిన్నది..
ఒక రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన,..మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించు.

4. ప్రేమ అనేది ఒక నిలకడలేని,.. చంచలమైన ఒక భావన... కాలాన్ని,.మూడ్ ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్... నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు,.. ఓపిక పట్టు... కాలం నీ గాయాలను, బాదలను అన్నింటినీ కడిగేస్తుంది,.. కావాలంటే నీ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని గమనించు.
ప్రేమ సౌందర్యాన్ని ,. అలాగే ప్రేమ విఫలమవడాన్ని..అతిగా ఊహించుకోకు... ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో .. ( Damn crazy movies! )

5. చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు,.. కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు.. నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు..
దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే,.. కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు..

6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను,.. అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను... నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది..తర్వాత బస్సులో తిరుగుతావా నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకో...

7. నువ్వు నీ మాట నిలబెట్టుకో,.. ఇతరులనుంచి ఇది ఆశించకు.... నువ్వు అందరితో మంచిగా ఉండు,.. అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు...ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే నీకు అనవసర సమస్యలు తప్పవు.

8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ..ఒక చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్ లేదని బలంగా నమ్ము.

9. అది ఎంతకాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా!

............ నాన్న

Source - Whatsapp Message

మానవులుగా బతకటం కాదు.. మానవత్వంతో బతకాలి.

మానవులుగా బతకటం కాదు.. మానవత్వంతో బతకాలి

ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి !
ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు !

దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనేవున్నాడు.

సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు.

కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో !

జ్ఞానం.. ఆలోచించి మాట్లాడుతుంది. అజ్ఞానం.. మాట జారాక ఆలోచిస్తుంది. అమాంతం అజ్ఞానం పోయి జ్ఞానంరాదు.

కొబ్బరిచెట్టు పెరిగేకొద్దీ పాతమట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగేకొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి.

పుండు మానితే పొలుసు అదేపోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది ! జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభంలేదు !

సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి.

నీపై నమ్మకం నీకుబలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీబలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !

మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసినవారు వదిలిపెట్టలేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణంపోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది !

నీపరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో.

వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ?

నిజాయితీపరులు సింహంలాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !

ముని-మహర్షి-తపస్వి-యోగి.. వీరు వేరువేరు.
మౌనంగావుండేవాడు ముని.
నియమనిష్టలతో తపింపచేసుకునే వాడు తపస్వి.
అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి.
ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి.

పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !

ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నావాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు.

వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మవుందో లేదో తెలీదు.

నువ్వు 'నావాళ్ళు నావాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళవాళ్ళకోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !

అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈమాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !

మరణం దగ్గరపడితేనే మహాసత్యాలు బోధపడ్తాయ్.

పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది. వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగమొస్తే నీబదులు భరించటానికి ఎవరూ దొరకరు.

వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు తెరపడేరోజు ఏంతెలిసినా ప్రయోజనమేంటి ?

పక్కనెంతమందున్నా,ఎంత సంపదున్నా ఏంటి ?
30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే.. పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా వదిలేసే పోవాలి !

జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు !

మానవులుగా బతకటం కాదు..
_మానవత్వంతో బతకాలి !

Source - Whatsapp Message

Friday, September 25, 2020

పాప_పుణ్యాలు అంటే ఏమిటీ ..?

 

పాప_పుణ్యాలు అంటే ఏమిటీ ..?

మానవులు ఎలాంటి పుణ్యకార్యాలనూ చేయడానికి ఇష్టపడరు... కాని పుణ్య ఫలాన్ని మాత్రం ఆశిస్తారు., పాప ఫలితాన్ని ఆశించరు.
కాని పాప కార్యాలను మాత్రం ప్రయత్న పూర్వకం గానే చేస్తారు..., అని ధర్మనీతి శాస్త్ర నిర్వచనం...

ఇంతకీ పాపం అంటే ఏమిటి..., పుణ్యం అంటే ఏమిటి..?

"పరోపకారాయ పుణ్యాయ..,
పాపాయ పరపీడనం" ..అంటే, ఇతరులకు చేసిన మేలు పుణ్యం అనీ, ఇతరులను పీడించడం వలన పాపం సంక్రమిస్తుంది అనీ శాస్త్రవచనం...

తెలియక చేయడం, అజ్ఞానంతో చేయడం ఒక విధంగా ప్రారబ్ద ఖర్మలను అనుభవిoచడం అవుతుంది..... కానీ తెలిసి చేస్తే అది మహా పాపం అవుతుంది...

పూర్వజన్మ ల్లో చేసిన పాప దోషాల వల్లనే ఈ జన్మలో శారీరక, మానసిక వ్యాధులు వచ్చి పీడుస్తున్నాయి అని మనం గ్రహించాలి... చేసుకున్న పాప,పుణ్యాల అనుభవం కోసమే ఈ జన్మ అనునది ఆధ్యాత్మికమైన జవాబు. అయితే... ఎంతకాలం ఈ అనుభవం? అనేదీ ప్రశ్నే... దానికీ జవాబు ఉంది.

చేసిన పాప, పుణ్యాల గురించి ఈ లోకంలో తలచుకున్నంత కాలం...ఆ పాప, పుణ్య ఫలాన్ని అనుభవించ వలసిందే. ఇదేం తీర్పు..... దీనికేదైనా నిదర్శనముందా...అనే సందేహం కలగచ్చు... ఏ సందేహానికైనా సరైన జవాబు చెప్పే సామర్థ్యం మన రామాయణ, భారత, భాగవతాలకే ఉంది. దీనికి సంబంధించిన కథ ఒకటి మహాబారతంలో ఉంది. ఆ కథ ఏమిటంటే....

కృతయుగకాలంలో., ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ఈ భూలోకాన్ని ధర్మబధ్ధంగా, ప్రజారంజకంగా పరిపాలిస్తూండేవాడు. ఆయన గొప్ప దాత. దశ మహాదానాలే కాక షోడశ మహాదానాలు విరివిగా చేసాడు. అంతేకాక ఎన్నో పుణ్యకార్యాలు కూడా చేసాడు. ఇంద్రద్యుమ్నుడు చేసిన పుణ్యకార్యాల వల్ల, అతను మరణించాక దేవదూతలు వచ్చి అతన్ని సరాసరి స్వర్గలోకం తీసుకెళ్లారు... ఇంద్రద్యుమ్నుడు స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తూ ఆనందిస్తున్నాడు... అలా ఎంతకాలం అయిందో అతనికే తెలియదు.

ఒకరోజు ఇంద్రద్యుమ్నుని దగ్గరకు దేవదూత లు వచ్చి, ‘నీవు చేసుకున్న పుణ్యఫలం అయిపోయింది... నీవు స్వర్గంలో ఉండే అర్హత లేదు. భూలోకానికి వెళ్లిపో’ అన్నారు. ‘అదేమిటి.. నా పుణ్యఫలం అప్పుడే తీరిపోవడమేమిటి... ఇంకా చాలా ఉంది’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు... ‘నిరూపిస్తావా’ అని అడిగారు దేవదూతలు. ‘నిరూపిస్తాను.. నన్ను భూలోకం తీసుకొని వెళ్లండి’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు. దేవదూతలు అతన్ని భూలోకం తీసుకు వచ్చారు.

ఇంద్రద్యుమ్నునకు భూలోకం చాలా కొత్తగా కనిపించింది. అతనికి తెలిసున్న వారెవరూ కనిపించలేదు. ఆ కాలంలో భూలోక వాసులందరిలోకి అతి వృద్ధుడు మార్కండేయుడు ఒక్కడే అని తెలిసి.. దేవదూతలతో అతని దగ్గరకు వెళ్లి ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘ప్రావారకర్ణుడు’ అనే గుడ్లగూబ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు మార్కండేయుడు.

అందరూ కలిసి ఆ గుడ్లగూబ దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘నాళీజంఘుడు’ అనే కొంగ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు ప్రావారకర్ణుడు.

అందరూ కలిసి ఆ ఆ కొంగ దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘ఆకూపారుడు’ అనే తాబేలు ఉంది... వెళ్లి దాన్ని అడుగుదాం రండి అన్నాడు నాళీజంఘుడు. అందరూ కలిసి ఆ తాబేలు దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు..

‘మీరెవరో నాకు బాగా తెలుసు.... మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను.., మీరు ఇంద్రద్యుమ్న చక్రవర్తి. మీరు ఎన్నో యఙ్ఞాలు చేసారు. నన్ను ఎన్నోసార్లు కాపాడారు. దానాలు చెయ్యడం లోనూ మీరు చక్రవర్తే... ఆ కాలంలో మీరు చేసిన గోదానాలు అనంతం... దానగ్రహీతలైన బ్రాహ్మణులు ఆ గోవులను తోలుకుంటూ వెడుతూంటే.. ఆ గోవుల కాలి గిట్టల తొక్కుడు చేతనే కదా ఈ కొలను ఏర్పడింది ... అందుకే ఈ కొలనుకు ‘ఇంద్రద్యుమ్నము’ అని నీ పేరే పెట్టారు ప్రజలు... నా సంతతి వారంతా ఈ కొలనులోనే ఇప్పటికీ నివసిస్తున్నారు’ అన్నాడు ఆకూపారుడు.

దేవదూతలు ఆ సమాధానంతో తృప్తిచెంది.. ఇంద్రద్యుమ్నుని తిరిగి స్వర్గానికి తీసుకుని వెళ్లారు...... ఇదీ కథ.

కనుక కలకాలం అందరూ చెప్పుకునే విదంగా పుణ్యకార్యాలే చెయ్యాలి. అలాకాక పాపకార్యాలు చేస్తే.. ప్రజలు తలుచుకున్నంత కాలం నరకబాధలు తప్పవు...

పాపం వల్లనే దుఃఖాలు వస్తాయి, పాపం లేనప్పుడు ఆనందం కలుగుతుంది...ఏ కొంచెం దుఃఖం కలిగినా అది పాప ఫలమే కాక వేరొకటి కాదు...

మనం ఆనందంగా ఉన్నాము కదా అని, పరులను కించపరిచేలా ప్రవర్తిస్తే, అది మహాపాపం, ఎందుకంటే వారి కర్మలు వారు అనుభవిస్తున్నారు... పాపదోషం అనేది అనుభవించితే తప్ప పోదు...

అడవుల్లో ఉన్నప్పుడు, యుద్ధంలో శత్రువుల మధ్య, నీటి మధ్య, అగ్ని మధ్య ఉన్నప్పుడు, సముద్రంలో సాగుతున్నప్పుడు, పర్వత శిఖరాలను ఎక్కుతున్నప్పుడు, నిద్రలో, అజాగ్రత్తలో, సంకట పరిస్థితులలో మనలను పూర్వ జన్మలో చేసిన పుణ్యాలే కాపాడతాయి...... అంతే గానీ ఇది నా గొప్ప, నా భక్తి, నా ఒక్కడి పైననే భగవంతుని దయ అనుకోవడం,
మన అజ్ఞానం మాత్రమే...

ఉత్తమమైన ధర్మం - విదురుడు చెప్పిన ధర్మం..

" ఇతరులు తనయందు ఏ విధంగా ప్రవర్తిస్తే, తన మనస్సు కలత చెందుతుందో అదే విధమైన ప్రవర్తనను ఇతరుల యందు నీవు కలిగి ఉండకపోవడమే అన్ని ధర్మాల్లోకి కూడా ఉత్తమమైన ధర్మం " అని విదురవాక్కు...

పుణ్యం చేయడం చేతకాకున్నప్పుడు ఈ ధర్మాన్ని ఆచరిస్తే చాలు... ఈ లోకంలో పుణ్యం కాని, పాపం కాని, ఇతరుల నుంచి మనం తీసుకోలేం.... తాను చేసిన పాపకర్మ వల్లనే దుఃఖం కలుగుతుంది..... తాను చేసిన పుణ్యకర్మ వల్లనే సుఖం కలుగుతుంది.

ఈనాడు మనం నవ్వుతూ చేసిన పాపకర్మకి ( ఒకరిని కించపర్చడం, ఒకరి గూర్చి చెడుగా మాట్లాడుకోవడం, ఇలాంటివి ) రేపు ఏడుస్తూ ఆ దుఃఖాన్ని అనుభవించక తప్పదనే సత్యాన్ని మనం గ్రహించాలి...

అందుకే అవకాశం ఉన్నప్పుడే సత్కర్మలు ఆచరించాలి...., నలుగురి కి సహాయపడాలి , భగవంతుని అనుగ్రహం పొందాలి...

సర్వేజనా సుఖినోభవంతు..

🙏

Source - Whatsapp Message

గత జన్మల పుణ్య ఫలం - ఒక్క చిన్న కథ

 

🌸గత జన్మల పుణ్య ఫలం🌸

🌺ఒక్క చిన్న కథ🌺

👌పూర్వం ఒక ఊరిలో ఓ పేద కుటుంబం ఉండేది. వాళ్ళులో ఇంటి పెద్ద రోజు శివ పూజ చేస్తూ తనకి ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తనపని తాను చేసుకునేవాడు. అలా ఎన్నాళ్ళ నుండో పూజలు చేస్తూ తన బాధని శివయ్యకి వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు.

ఒకరోజు పార్వతీదేవి శివుడితో "స్వామి అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు. కరుణించి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా." అంటే శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. పార్వతికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు! ఇప్పుడు మీరు ఆ భక్తుడిని కరుణించి పేదరికం మాపి ధనవంతుడిని చేయకపోతే ఊరుకొను అంది. శివుడు మళ్ళి నవ్వి దేవి! నీకోరిక కాదనలేను కాని జరగబోయే విపరీతాలు నీవు ఎరుగవు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి. అనుభవిస్తే కాని కర్మ పరిపక్వం చెందదు. అన్నాడు. అయినా వినలేదు. పట్టుబట్టింది. శివుడు ఇక కాదనలేక

దేవి! నీకోరిక ప్రకారం అతడిని ధనవంతుడిని చేస్తాను. చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు. అని అక్కడ మాయమయ్యాడు శివుడు. ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై "నిన్ను నేను రోజు గమనిస్తున్నాను. ఎందుకు అలా సేవలు చేస్తావు ఆ శివుడికి. భోళా శంకరుడు అన్నారు కానీ ఎప్పుడైనా కనికరించాడా? వృథాగా పూజలు చేయకు అని ఒక వజ్రపు రాయి చేతికి ఇచ్చి ఇది అమ్ముకొ చాలా డబ్బు వస్తుంది. హాయిగా బ్రతకవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఆ వజ్రపు రాయిని చూసే సరికి మతి పోయింది. ఎన్నో కోరికలు మనస్సులో మేలిగాయి. అది కొనాలి ఇది కొనాలి. ఇంకేదో చేయాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు. పెట్టెలో భద్రంగా దాస్తుంటే భార్య వచ్చింది. ఏమిటి అంటే జరిగింది చెప్పాడు. ఆవిడకి దానిమీద ఆశ పుట్టింది. చీరలు నగలు అంటూ వంద కోరికలు ఏకరువు పెట్టింది. ఇద్దరికీ వాదనలు జరిగాయి. భార్యని బయటికి గెంతి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు, చేతిలో ఉన్న రాయిని చూసి దాని వెలుగులు చూసి నాకు ఇవ్వు. నేను తాగాలి జూదం ఆడాలి, అప్పులు తీర్చాలి అన్నాడు. పెద్ద గొడవ అయింది. పక్కనే ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒక్కటి వేశాడు. అంతే అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. అడ్డువచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు. అది చూసిన దొంగలు వాడిని చంపి వజ్రం ఎత్తుకుపోయారు. అది చూసిన భటులు ఆ దొంగలని చంపేసి రాజుగారికి ఇచ్చారు. దానిని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పోదిగాడు.

చూశావా! పార్వతీ! ఏమి జరిగిందో! ఒక్క రాయి ఎన్ని బ్రతుకులు మార్చిందో, ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో! ఎన్ని ప్రాణాలను బలిగొందో!

ఆపేదవాడు పూర్వం బ్రాహ్మణ వశంలో జన్మించి భార్యని పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికీ దానం ధర్మం చేయలేదు. భక్తి మాత్రం మెండు. ఆ భక్తే ఈజన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చడం కుదరదు. అనుభవిస్తేనే కర్మ తీరుతుంది. ఏ వస్తువు ఎక్కడికి చేరాలో ఎవరికీ దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేనివాడు పొందలేడు. తాత్కాలికంగా విలువైన వస్తువులు మనదగ్గర ఉన్నట్లు కనిపించినా అర్హత లేకపోవడం చేత తొందరగానే పతనం అవుతాయి. పేదవాడు,మంచివాడు అనేది ఉండదు. గతజన్మలో భార్య బిడ్డలని చంపాడు. భార్య గయ్యాళి అయింది. కొడుకు వ్యసనపరుడై తండ్రిని చంపాడు. వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం. పుట్టుకైనా చావైనా తాను చేసుకున్నదానిని బట్టే వస్తుంది. ఇదే విధి అని సెలవిచ్చెను.....🙏



Source - Whatsapp Message

Thursday, September 24, 2020

మీ జీవితం మీ చేతుల్లో.....1

🌹మీ జీవితం మీ చేతుల్లో.......🌹- 1

1) మన గురించి మనం చేసే ప్రతి ఆలోచన మన పట్ల వాస్తవమవుతుంది.

2) మనము వేటినైతే బయటికి పంపుతున్నామో వాటిని తిరిగి పొందుతున్నాము.

3) ప్రతి ఒక్కరూ వారి వారి జీవన పరిస్థితులకు వారే బాధ్యులు.

4)మన మనసులో నుంచి జనించే ప్రతి ఆలోచన, మన నోటిలో నుంచి వెలువడే ప్రతి వాక్కు మన జీవిత అనుభవాలని సృష్టిస్తున్నాయి.

5)మన పరిస్థితులను మనమే సృష్టించుకొని మన నిరాశా నిస్పృహలకు ఇతరులను నిందిస్తూ మన శక్తిని మనమే కోల్పోతున్నాము.

6)నిజానికి ఏ వ్యక్తి గాని ఏ ప్రదేశం గాని మనల్ని ప్రభావితం చేయలేవు, ఎందుకంటే మన మనస్సులో ఆలోచనలు చేసేది నిశ్చయంగా మనమే కాబట్టి.

7)మన మనస్సులో శాంతిని సామరస్యాన్ని సృష్టించుకుంటే వీటినే మన జీవితాల్లోని దర్శించవచ్చును.

8) "అందరూ అన్ని వేళలా నాకు సహకరిస్తారు" అనే నమ్మకాన్ని నీవు ఎంపిక చేసుకున్నట్లు అయితే మీ సబ్ కాన్షియస్ మైండ్ బేషరతుగా మీ నమ్మకాన్ని అంగీకరించి మీ జీవితంలో అదే వాస్తవమై యేటట్లు చేస్తుంది.

9)ఈ విశ్వము మనం ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనలు మరి ప్రతి నమ్మకాన్ని పూర్తిగా సమర్థిస్తుంది.

10)ఈ విశ్వ శక్తి మనలో ఉన్నదున్నట్లుగా నే మనల్ని అంగీకరించి మరి మన నమ్మకాల్నే మన జీవితాల్లో ప్రతిఫలించే టట్లు చేస్తుంది. ఉదాహరణకు
నాకెవ్వరూ లేరు,
నేను ఒంటరి వాడ్ని,
నన్ను ఎవరు ప్రేమించరు,
నాకు ఎవ్వరు సహకరించరు...
అనే నమ్మకాలతో మీరు గనక జీవిస్తూ ఉంటే మీ జీవితాలలో అలాంటి ప్రతిఫలాలను తప్పక పొందుతారు.
🌹నిజానికి ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం ప్రేమించు కోవడం ఎలాగో నేర్చుకోవాలి
🌹మనల్ని మనం నిజంగా ప్రేమించుకుంటే జీవితంలో ప్రతిదీ మనకు అనుకూలిస్తుంది
❤ Love urself..🕊
Be with urself.. always be a miraculous being..

Source - Whatsapp Message

ఈలాంటి మాటలకూ గతి తప్పుతున్న మన బ్రతుకులను మళ్ళి గాడి లొ పెట్టె శక్తి ఉంది.

1.నాకు ఉచిత విద్య లభించడం లేదండీ —
.... హెన్రీ ఫోర్డ్ కి కూడా లభించ లేదు

2. జీవితం లో చాలా సార్లు ఓడిపోయానండి
....................... అబ్రహం లింకన్ చాలా అపజయాలను చూశాడు

3. నేను చాలా పేద కుటుంబానికి చెందిన వాడిని —
.....................- అబ్దుల్ కలాం కూడా బీద కుటుంబం నుండే వచ్చాడు

4. నేను చిన్నప్పటినుండి అనారోగ్య వంతుడిని
........................ నటి మర్లీ మాట్లిన్ చిన్నప్పటి నుండి అవకరం తోనే ఉంది

5. జీవితం అంతా సైకిల్ మీదే గడిచిపోతోంది —
........................ నిర్మా సబ్బు కర్సన్ భాయి పటేల్ సైకిల్ మీద తిరిగి అమ్మాడు

6. ఒక ప్రమాదం జరిగి నాధైర్యాన్ని కోల్పోయాను —
........................ నాట్య మయూరి సుధా చంద్రన్ కృత్రిమ కాలు తో డాన్సు చేస్తుంది

7. చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు . నన్ను చూసే వారే లేరు .
....................... ఎ ఆర్ రెహమాన్ తండ్రి కూడా చిన్నప్పుడే పోయారు

8. కుటుంబ భారం అంతా నా మీదే ఉంది . అందుకే ఎదగ లేక పోయాను
............ లతా మంగేష్కర్ కూడా చిన్నప్పుడే కుటుంబ భారం మోసింది

9. నేను చాలా పోట్టివాడిని
....................... సచిన్ టెండూల్కర్ కూడా పోట్టివాడే

10. నేను మంద బుద్ది వాడిని
............... థామస్ ఆల్వా ఎడిసన్ కూడా చిన్నప్పుడు మంద బుద్దివాడే

11. నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను . దానితో ఏమి చెయ్యగలను ?
................. ధీరూ భాయి అంబానీ కూడా చిన్న ఉద్యోగం తోనే మొదలు పెట్టాడు

12. నా కంపెనీ దివాలా తీసింది . నన్నెవరు నమ్ముతారు ?
.................. పెప్సీ కోలా కూడా రెండు సార్లు దివాలా తీసింది

13. నేను ఒకసారి నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురి అయ్యాను .ఇప్పుడు ఏమి చెయ్యగలను ?
............. వాల్ట్ డిస్నీ మూడు సార్లు నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురి అయ్యారు

14. నా వయసు ఐపోయింది . ఇప్పుడు ఏమి చెయ్యగలను
............. కెంటకీ ఫ్రైడ్ చికెన్ హర్లాండ్ శాండ ర్స్ 60 వ ఏట కె ఎఫ్ సి మొదలు పెట్టాడు

మనం ఉన్న చోటునుండి ఉన్నతి కి వెళ్ళాలి అనే కోరిక ప్రబలంగా ఉంటె మనం వెళ్ళగలం

పూర్తిగా చదివిన వారికి ధన్యవాదాలు

ఈలాంటి మాటలకూ గతి తప్పుతున్న మన బ్రతుకులను మళ్ళి గాడి లొ పెట్టె శక్తి ఉంది.

ఒక్కరు స్పూర్తి ని పొందిన ఈ రోజు కు మనం ఒక మంచి పని చేసినట్లే !

Source - Whatsapp Message

వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే..

💫వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే..

🔸 అతినిద్ర
🔸 బద్ధకం
🔸 భయం
🔸 క్రోధం
🔸 అలసత్వం
🔸 ఎడతెగని ఆలోచన

...అనే ఈ ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది. భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి.

నిజానికి జీవితం మన భావోద్వేగాలకు అనుకూలంగా నిర్మించబడిలేదు. మన భావోద్వేగాలూ జీవితాన్నీ మార్చలేవు. ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది. అనుకున్నది జరగడం, జరగకపోవడం సంభవమే. విజయంలో పొంగిపోతే అహంకారం పలకరిస్తుంది. అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత వరిస్తుంది. మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదిలివేయడం, లోపాలను సవరించుకుంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి ఉన్నతి లభిస్తాయి.

💫ఈ క్రమంలో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే..

✨నిద్రలో శరీరం విశ్రాంతమౌతుంది. ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ.. అతినిద్ర లేదా నిద్ర లేమి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే మహాబాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే.

✨రెండో లక్షణం బద్ధకం. ఇష్టమయిన దాని కోసం అవసరమైన దానిని వదిలివేయడం బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి, సమయానికి ఏ పనీ పూర్తిచేయలేం.

✨అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని అనుమోదించలేని సమయంలో కలిగేది భయం. భయం వల్ల ఏ పనిని సంకల్పించినా.. ‘‘ఇది నాకు సాధ్యపడుతుందా.. అపహాస్యం పాలవుతానేమో... అపజయం కలుగుతుందా’’ అనే అనుమానాలు వెన్నాడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గుతుంది, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు, శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం.

✨ఇక.. క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం దీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తపుఁతుంది. దాని వల్ల బుద్ధి సరిగా పనిచేయదు.

✨అలసత్వం వల్ల విద్య దక్కదు. విద్య లేనివానికి ధనం లేదు, ధనం లేక మిత్రులు ఉండరు, మిత్రులు లేకపోతే సుఖమూ ఉండదు.

అలాగే..

✨ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు. ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి. ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితేనే విజయం. ఇలా ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి.👏

ఓం శాంతి🙏🏻

Source - Whatsapp Message

Wednesday, September 23, 2020

పరమాత్ముడిని పొందాలంటే ప్రాపంచిక ఉనికికి అతీతంగా వెళ్ళగలగాలి.

పరమాత్ముడిని పొందాలంటే ప్రాపంచిక ఉనికికి అతీతంగా వెళ్ళగలగాలి.

ఉన్నది ఒక్క పరమాత్మే అన్న గ్రహింపుతో ఈశ్వరార్పితం కావాలి.

అంటే శరణాగతి కావాలి.

శరణాగతి కలిగివుండడం అంత సులువైనది కాదు.

అలాగని అసాధ్యం కాదు.

శరణాగతితత్వం
భక్తితో,
కృతజ్ఞతతో,
ప్రార్ధనతో ముడిపడి వుంది.

భక్తి : భగవంతుని పట్ల ప్రేమే భక్తి.

స్వస్వరూప అనుసంధానమే భక్తి.

అనన్య దైవచింతనయే భక్తి.

సమస్త ఆచార వ్యవహారాలను భగవంతుడికి అర్పించడం భక్తి.

ఆత్మానుభవం పొందడానికి ఏ విషయాలైతే ఆటంకాలుగా ఉన్నాయో వాటిని వదిలించుకోవడమే భక్తి.

ఇటువంటి భక్తిని దాటి పొందాల్సినది శరణాగతి.

భక్తిలో మనస్సు కరిగిపోయి తీవ్రస్థాయికి రావడమే శరణాగతి.

అంటే భక్తి యొక్క పరాకాష్ఠస్థితియే శరణాగతి.

కృతజ్ఞత : ఉత్కృష్టమైన మానవజన్మనిచ్చి మనమీద అపారదయతో అన్నీ సమకూర్చుతున్న సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు యందు ప్రేమతో వుండి,

తనచే సృజింపబడిన సమస్త సృష్టి యందు ఆ భగవంతుడినే దర్శిస్తూ అన్నివేళల్లో అన్నింటా దయతో ప్రేమతో వుండడమే కృతజ్ఞత.

ప్రార్ధన : అంతరంగపు నైర్మల్యాలను తొలగించేదే ప్రార్ధన.

ప్రార్ధన అంటే అంతర్యామి ముందు అంతరంగ ఆవిష్కరణ,

అంతరశుద్ధికై పవిత్ర ప్రయత్నం, అనంతునికై అంతరంగనివేదన.

విషయజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్లగలిగేదే ప్రార్ధన.

జీవాత్మను విశ్వాత్మలో విలీనం చేసేదే ప్రార్ధన.

అంతేగాని ప్రార్ధన యాచనల వుండకూడదు.

భగవంతుడు దగ్గర భక్తుడిగా వుండాలి,
భిక్షగాడుగా కాదు.

క్రమేపి భక్తి, కృతజ్ఞత, ప్రార్ధన తదితర అభ్యాసాలని దాటి భక్తుడు,
భగవంతుడు అన్న ద్వైతభావమును అధిగమించి ఉన్నది పరమాత్మ యొక్కటే అన్న ఆత్మభావన స్థితికి రావడమే శరణాగతి పొందడం.

అయితే నోటితో చెప్పడమంత తేలిక కాదు శరణాగతి... !!

Source - Whatsapp Message

జీవితం సార్ధకం చేసుకొనేందుకు, మూడు “ద” కారములు

జీవితం సార్ధకం చేసుకొనేందుకు,
మూడు “ద” కారములు

మనుష్యులు,
దేవతలు,
రాక్షసులు

అందరూ ప్రజాపతి యెక్క బిడ్డలు.

ఒకసారి ఆయన వద్దకు దేవతలు వెళ్ళి నాన్నగారు మాకు ఏదైనా బోధ చెయ్యండి మా జీవితాలు బాగుపడడానికి అని అడిగారు.

అప్పుడు ప్రజాపతి “ద” అని చెప్పి అర్దమయ్యిందా నేనేం చెప్పానో అని అడిగారు..

అప్పుడు దేవతలు “అర్దం అయ్యింది నాన్నగారు మేం అలానే పాఠిస్తాము” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.

తరువాత ఆయన వద్దకు మనుష్యులు వచ్చి నాన్న గారు మాకు ఏదైనా బోధ చెయ్యండి అని అడిగారు.

అప్పుడు మరలా ప్రజాపతి “ద” అని చెప్పి అర్దమయ్యిందా నేనేం చెప్పానో అని అడిగారు..

అప్పుడు మనుష్యులు “అర్దం అయ్యింది నాన్నగారు మేం అలానే పాఠిస్తాము” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.

తరువాత అక్కడికి రాక్షసులు వచ్చారు.

నాన్న గారు మాకూ ఏదైనా బోధ చెయ్యండి అని అడిగారు.

అప్పుడు మరలా ప్రజాపతి “ద” అని చెప్పి అర్దమయ్యిందా నేనేం చెప్పానో అని అడిగారు..

అప్పుడు రాక్షసులు “అర్దం అయ్యింది నాన్నగారు మేం అలానే పాఠిస్తాము” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.

ముగ్గురకు చెప్పింది “ద” నే

కానీ ఆ మూడు “ద” లకు ఎంతో తేడా ఉంది.......

దేవతలకు “ద” అని చెప్పడంలో అర్దం:

మీరు దేవతలనే శరీరాలతో సమస్తమైన భోగములు అనుభవిస్తుంటారు
(భోగ లాలసతో) .

కాబట్టి మీకు ఉండవలసింది “దమము” (దమము అంటే ఇంద్రియ నిగ్రహం).

మీరు ఇలా దమము లేకుండా భోగములను అనుభవిస్తుంటే ఒకనాటికి మీ పుణ్యం అయిపోయి క్రిందపడిపోతారు.

అందుకని మీరు దమమును కలిగియుండాలి.

మనుష్యులకు “ద” చెప్పడంలో అర్దం:

మనుష్యునిగా పుట్టినవారికి ఏ బోధ చెయ్యకుండా వచ్చేది లోభం.

కాబట్టి ఈ లోభానికి విరుగుడు “దానం”

కాబట్టి నిన్ను నువ్వు ఉర్దరించుకోవడానికి దానం చెయ్యడం నేర్చుకో.....

ఆ దానం నిన్ను ఉర్దరిస్తుంది. ఉత్తర జన్మలు దానిపై ఆధారపడి ఉంటాయి.

అసురులకు “ద” అని చెప్పడంలో అర్దం:

మీకు ఎప్పుడూ కోపం.
ఎవరో ఒకరిని ఎప్పుడు బాధ పెడుతూ ఉంటారు.

కాబట్టి మీరు “దయతో” ఉండడం నేర్చుకోండి....

ప్రస్తుత కలియుగంలో పై చెప్పిన మూడు రకాల వాళ్ళు భూమి మీదే ఉన్నారు

కామ, క్రోధ, లోభములు అనే మూడు రకాల గుణములు కలిగిన వ్యక్తులు ఉన్నారన్నమాట...

కాబట్టి మన జీవితాలను ఉర్దరించుకోవడానికి…..

కోపం వస్తే ---నాలో ఆసురీ ప్రవృర్తి పెరుగుతుంది కనుకు నేను దయ కలిగి యుండాలి అని దాన్ని జయించండి


మీకు భోగలాలస ఏర్పడితే – నేను దమాన్ని కలిగియుండాలి అని జ్ఞాపకం ఉంచుకొని గెలవండి.

ఎవరికైనా ఎందుకు ఇవ్వాలి అని అనిపిస్తే – ఈ విషయం జ్ఞాపకం తెచ్చుకొని
దానం చేసి గెలవండి....

మీలో ఉన్న కామ, క్రోధ, లోభములను పై మూడు “ద” కారాములతో జయిస్తే మీ జన్మసార్ధకమైనట్లే.....!!

.....................

Source - Whatsapp Message

ఎన్నటికీ వీడనిది ఋణానుబంధం..

ఎన్నటికీ వీడనిది ఋణానుబంధం.. "పువ్వు తొడిమనుండి విడిపోతుంది, పండు చెట్టునుండి రాలిపోతుంది, కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరు’ అని మహాభారతం చెబుతోంది.శరీరం తాను స్పృశించిన ప్రతిదానితోను ఒక రకమైన స్మృతిని పెంపొందించుకుంటుంది.
ఈ విషయం చదివేముందు ఒక్కమాట !
ఒక తండ్రి 70 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత చనిపోయినప్పుడు పెద్దకొడుకు వయస్సు 40, రెండవ కొడుకు వయస్సు 37, మూడవ కొడుకు వయస్సు 33, నాలుగవ కొడుకు వయస్సు 30. సంవత్సరాలు అయితే…
అంటే పెద్ద కొడుకుతో 40 ఏళ్ళు ఉంటే, చివరి నాలుగవ కొడుకుతో 30 ఏళ్ళు మాత్రమే వున్నాడు. ఎందుకు ?
మీ అనుభవంలో… ఒక సంతానం ఏదైనా కోరితే డబ్బులు లేకున్నా అప్పుచేసి వారి కోరిక నెరవేరుస్తాము, కానీ మరో సంతానం ఏదైనా కోరితే చేతిలో డబ్బులున్నా వాడి కోరిక తీర్చాలనిపించదు ఎందుకని ?
అలాగే కొంతమంది విషయంలో ఎక్కువ ప్రేమ చూపిస్తాం ఎందుకని ?
ఈ జగత్తులో ప్రతిదీ కాలంతో పాటు వచ్చి కాలంతో పాటు చెల్లిపోతాయి. వచ్చి వెళ్ళేది కనకనే జగత్తు అన్నారు. జాయతే గఛ్ఛతే ఇతి జగం. రావడమూ మన చేతిలో లేదు, పోవడం అంతకంటే మన చేతిలో లేదు. కాని మానవులు ఉండే కొద్దికాలం లో నూ సర్వమూ ’నేను చేశాను’ అని అహంకరిస్తూనే ఉన్నాడు, నాతో సహా, ఎవరెన్ని చెప్పినా, అవన్నీ శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యాలే అయిపోతున్నాయి. కాలం తో ఋణానుబంధం తీరిపోతూ ఉంటుంది, ముఖ్యం గా వీటిని చెప్పేరు. ఋణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయాః, పశువులు, భార్య/భర్త, బిడ్డలు,ఇల్లు. వీటితో ఉండే అనుబంధం కాలంతో పాటు చెల్లిపోతుంది. మరోలా కూడా చెప్పుకోవచ్చేమో! మానవులంతా ఈషణ త్రయం చుట్టూ తిరుగుతూ ఉంటారు, కాని అదేం లేదని బుకాయిస్తుంటారు. ఈ ఈషణాలేంటీ? దారేషణ,ధనేషణ, పుత్రేషణ అన్నారు. దారేషణ భార్య/భర్త కోసం పాకులాట, ధనేషణ సొమ్ము సంపాదనకోసం పాకులాట, పుత్రేషణ కొడుకుల గురించిన పాకులాట. జీవితంలో వీటిని వదలిపెట్టడం చాలా కష్టమనీ చెప్పేరు.
మనకు పూర్వ జన్మ కర్మల వలననే ఈ జన్మలో…
తల్లి, తండ్రి, అన్న, అక్క, భార్య, భర్త, సోదరులు, పిల్లలు, భందువులు,
ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు,
శత్రువులు మిగతా సంబంధాలు… ఈ ప్రపంచంలో మనకు లభిస్తాయి.
ఎందు కంటే మనం వీళ్లకు… ఈ జన్మలో… ఏదో ఒకటి ఇవ్వవలసి, లేదా తీసుకొనవలసి రావచ్చును.
మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు.
మనకు… పూర్వజన్మలో సంబంధంవున్న వాళ్ళే ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు. వాటినే మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా వున్నట్లు చెబుతారు…
ఋణాను బంధం:-
గత జన్మలో మనం ఎవరి వద్దనైనా రుణం తీసుకుని వుండచ్చు లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్టపరచి వుండొచ్చు.
అటువంటి వాళ్ళు మీకు సంతాన రూపంలో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపంలో వచ్చి మీవద్ద వున్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకూ, ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యే వరకు మనతోనే వుంటారు.
శత్రువులు – పుత్రులు:-
మన పూర్వ జన్మలో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో సంతాన రూపంలో తిరిగి పుడతారు.
అలా పుట్టి తల్లి దండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు, నానా గొడవలూ చేస్తారు.
జీవితమంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే వుంటారు.
ఎల్లప్పుడును తల్లితండ్రులను నానా యాతన పెడుతూ వాళ్ళ పరువుతీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ… ఆనంద పడు తుంటారు.

తటస్థ పుత్రులు :-
వీళ్ళు ఒకవైపు తల్లి తండ్రులకు సేవ చెయ్యరు… మరోవైపు సుఃఖంగా కూడా వుంచరు, వాళ్ళను వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు. వాళ్ళ వివాహానంతరం తల్లి దండ్రులకు దూరంగా జరిగిపోతారు.
సేవా తత్పరతవున్న పుత్రులు
:-
గతజన్మలో మీరు ఎవరికైనా బాగా సేవచేసి వుండవచ్చును, ఆ రుణాన్ని తీర్చు కోవటానికి మీకు కొడుకు లేదా, కూతురు రూపంలో ఈ జన్మలో వస్తారు. అలా వచ్చి బాగా సేవను చేస్తారు.
మీరు గతంలో ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది.
మీరు గత జన్మలో ఎవరి కైనా సేవ చేస్తే, ఈ జన్మలో మన ముదుసలి తనంలో మనకు సేవ చేస్తారు.
లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కెడు నీళ్ళు పోసేవారు కూడా మన వద్ద వుండరు.
ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుంది. అని అనుకోవద్దు.
ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగానైనా పుట్ట వచ్చును.
ఒక వేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి వుండవచ్చును. వాళ్ళే మీ కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట పుట్ట వచ్చును.
ఒక ఆవుకి తన దూడను సమంగా పాలు తాగనియ్య కుండా దూరంగా వుంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట పుడతారు.
లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో, వాళ్ళు మీకు శత్రువు రూపంలో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చు కుంటారు.
అందుకనే జీవితంలో ఎవరికీ కూడా కీడు, చెడు చెయ్య వద్దు.
ఎందు కనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే… దానికి ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం అనుభవంలోకి తెస్తుంది.
మీరు ఒక వేళ ఎవరికైనా ఒక్క రూపాయి దానంచేస్తే అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చెయ్యబడతాయి.
ఒక వేళ మీరు ఎవరి వద్దయినా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసివేయ బడతాయి.
అనగా పాపపుణ్యాలు
కొద్దిగా ఆలోచించండి మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చు కున్నారు. మళ్ళీ ఎంత ధనాన్ని మీ వెంట తీసుకెళ్తారు..? ఇప్పటి వరకు పోయిన వాళ్ళు ఎంత బంగారం, వెండి పట్టుకు పోయారు..?
చివరగా ఒకమాట !
తాతగారు సంపాదించిన ఆస్తినంతా తగిలేసి మాకు ఏమి మిగల్చలేదని ఒక కొడుకు బాధపడతాడు. దానికి కారణం అతనికి తాత తండ్రుల ఆస్తిపాస్తులు అనుభవించే యోగం లేదన్నమాట !
అతి బీద కుటుంబంలో పుట్టిన మరో తండ్రి కోట్లాది రూపాయలు సంపాదించి సంతానానికి మిగిల్చి చనిపోతాడు. దీనికి కారణం ఆ తండ్రి, తన కొడుకుకు చెల్లించాల్సిన అప్పన్నమాట !
మీ జీవితంలోని సంఘటనలను ఒకసారి బేరీజు వేసుకొని ఆలోచించండి.
నేను,
నాది,
నీది అన్నది.
అంతా ఇక్కడి కిక్కడే పనికి రాకుండా పోతుంది.
ఏది కూడా వెంట రాదు. ఒకవేళ మీ వెంట వస్తే గిస్తే మీ పుణ్య పాపఫలం వెంటవస్తుంది.
జీవితమన్నా, సంసారమన్న ఏదైనా అనండి అంత ఋణానుబంధం.
ఋణానుబంధం ఎంత బలంగా ఉంటుంద౦టే..బాగా కలిగిన ఒక ఆసామీ, కావలసినవారింటి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటారు. నాకంటే వయసులో నాలుగేళ్ళు పెద్దవాడయి ఉండచ్చు. మాకు భోజనాలు పెడుతూ ఆ ఇంటి కోడలు భోజనం ఒక కంచంలో పెట్టి పట్టుకెళ్ళి ఆయనకి పెట్టి వచ్చింది. పూర్తిగా భోజనం చేసేదాకా ఉండలేకపోయావా అమ్మా అన్నా! ఉండద్దంటారు, ఏమైనా కావాలంటే పిలుస్తారు, అందుకే అన్నీ కావలసినవాటికంటే ఎక్కువ పెడతానని చెప్పింది. ఆయనకు పది సంవత్సరాల కితం భార్య గతించింది, ఆ తరవాత కావలసినవారబ్బాయిని పెంచుకున్నారు, అతనో ఉద్యోగి, ఈయనను తన దగ్గరికి రమ్మంటాడు, ఈయన కదలి వెళ్ళడు, అలా పాడు పడినట్టున్న ఇంటిలో ఒక్కడు కూచుని కాగితాలు చూసుకుంటూ ఉంటాడు. అవేంటని ఆ ఇంటి కోడల్ని అడిగితే రావలసిన బాకీల తాలూకు నోట్లు, వడ్డీలు కట్టుకుంటూ ఉంటారు, ప్రజలు ఆయన దగ్గర సొమ్ము వడ్డీకి పట్టుకెళుతుంటారు. అదీ ఆయన చరిత్ర టూకీగా, ఆ ఇంటి కోడలు మాత్రం గత పది సంవత్సరాలుగా ఆయనకు వండి పెడుతూనే ఉంది, ఆయన భోజనానికి ఇబ్బంది పడతారని పుట్టింటికి కూడా వెళ్ళదట.. ఇది ఏ ఋణానుబంధమో తెలియదు. ఈషణ త్రయాలు ఆయనను చాలా బంధించినట్టే అనిపించింది. భార్య గతించింది, ఒకటి పోయింది, పుత్రేషణ పూర్తయింది, ఈ ధనేషణ మాత్రం ఆయనను వదలలేదనుకుంటా. చిత్రమైన జీవితాలు.
ఋణానుబంధంలో ఆయనకు భార్య గతించింది ఆ ఋణం తీరినట్లుంది, ఇక సుత, ఆలయాల (ఇంటి) ఋణం తీరినట్టులేదు.తృష్ణ మాత్రం మిగిలివుండిపోయింది, ధనం మీద మోజుపోలేదు.
వలిభిర్ముఖమాక్రాన్తం పలితైరంకితం శిరః
గాత్రాణి శిధిలాయన్తే తృష్ణ తరుణాయతే. భర్తృహరి

కరచరణాద్యవయవముల
భరముడిగెవ వళులు మొగముపై నిండారె
శిరసెల్ల వెల్లవారెను
దరిమాలిన తృష్ణయొకడె తరుణతబూనెన్. లక్ష్మణ కవి.
కాళ్ళు చేతులు మొదలైన అవయవాలన్నీ శక్తి కోల్పోయాయి,ముఖం మీద ముడుతలు పడ్డాయి, తల నెరిసింది ఇలా అన్నీ వార్ధక్యాన్నే సూచిస్తున్నాయి కాని తృష్ణ అనగా ఆశ మాత్రం ఇంకా యవ్వనంలోనే ఉంది.
మన పెద్దలు పిల్లల నుంచి సొమ్ము చేతితో తీసుకోవద్దంటారు, దీనికో కారణమూ చెబుతారు. పిల్లలు మనకు ఋణ గ్రస్తులట, ఏ జన్మలోనో వారు చేసిన బాకీ తీర్చుకోడానికి మన కడుపున పుడతారంటారు, వారి దగ్గర నుంచి సొమ్ము తీసుకుంటే ఋణ విముక్తి కావచ్చేమోనని భయం. ఈ అమ్మాయి ఏ ప్రలోభమూ లేకనే ఆయనకు సేవ చేస్తూ వస్తూవుంది, గత పది సంవత్సరాలుగా, ఇది ఏమి ఋణానుబంధమో! పోనీ వారికి ఏమైనా బంధుత్వం ఉన్నదా అంటే అదీ లేదు. ఇల్లు, భార్య, పిల్లలు, సంపద, ఆఖరుకి స్నేహితులు, హితులు,ఈ రాతలు, పలకరింపులు సర్వం ఋణానుబంధమే, అది చెల్లిపోతే……. అంతా మిధ్య. దర్పణ దృశ్య మాన నగరీ, జీవితమంతా చిత్రమే.
ఈ రోజుతో ఈ ఋణానుబంధం తీరునట్టే……
ఒక వ్యక్తి 84 ఏళ్ళు జీవిస్తే, యోగ యోగశాస్త్ర పరంగా దానిని పూర్తి జీవితంగా భావిస్తాము. ఈ జీవిత కాలంలో, 1008 చంద్ర భ్రమణాలు (పౌర్ణములు,moon cycles) ఉంటాయి. ఆ 84 ఏళ్ల మొదటి నాలుగో భాగంలో, అంటే మొదటి 21 ఏళ్లలో, శక్తి పరంగా తల్లిదండ్రుల కర్మ ప్రభావం పిల్లల మీద ఉంటుంది, ఆ తర్వాత మనం తల్లి తండ్రులచే ప్రభావితం కాకూడదు. ఆ తర్వాత వారు మనకు చేసిన వాటన్నిటికీ, మనం కృతజ్ఞతా పూర్వకంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని ఈ ప్రపంచంలోకి వారే తీసుకు వచ్చారు. ఇంకా ప్రేమ, ఆదరణలతో వాళ్లు మనకు ఎన్నో చేశారు.
ఎవరైనా తల్లిదండ్రుల చేత 21 ఏళ్ల తర్వాత ప్రభావితం కాకూడదు. ఎందుకంటే పిల్లలు తమ జీవితాన్ని నూతనంగా తయారు చేసుకోవాలి, అంతేగాని ముందు తరం చేసినదానికి ఒక నకలు కాకూడదు. ప్రతి ఒక్కరి మీద ఇరవై ఒక్క ఏళ్లు వచ్చేదాకా తల్లిదండ్రుల కార్మిక ప్రభావం ఉంటుంది, కానీ ఆ తరువాత అటువంటిదేమీ ఉండదు. చాలామంది తమ తల్లిదండ్రుల మీద ఆర్థికంగా, సంఘపరంగా, మానసికంగా ఇంకా ఆధారపడి ఉండవచ్చు, కానీ 21 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల పోషణ మీద ఆధారపడి ఉండకూడదు ఆ తర్వాత అది ఒక సంబంధం ఉంటుంది. ప్రేమ కృతజ్ఞత, ద్వారా ఒక సంబంధం ఉంటుంది. అవి మాత్రం ఎప్పటికీ ఉండవచ్చు.
శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది. దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా ’కన్నయ్య లేకుండా మేము బ్రతకలేం’ అని కన్నీరుమున్నీరు కాసాగాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్తావేదనతో యశోదమ్మను తలచుకుంటూ ఉద్ధవునితో, "ఉద్ధవా! నాకన్నయ్య భోజనం చేస్తే గానీ నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను’ అని మొండి పట్టుదలతో కూర్చొనే నాతల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను" అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు.
కంసుని చెరాలనుంచి దేవకీ వసుదేవులను విడిపించిన తరువాత బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి, వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ఇలా వ్యక్తపరిచారు:
మాకు నిన్నాళ్ళు లేదయ్యె మరియు వినుడు
నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్న
మేనికెవ్వార లాఢ్యులు మీరు కారె
యా ఋణము దీర్ప నూరేండ్లకైన జనదు (దశమస్కంధం - పోతన భాగవతం).
’అమ్మా! నాన్నా! మేము ఇన్నాళ్ళూ మీ ప్రేమ, ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్నిప్రసాదించిన వారు మీరు. అలాంటి దుర్లభమైన మానవదేహాన్ని ఇచ్చిన మీ ఋణం తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సాధ్యం ాదు.’
బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లితండ్రుల స్థానం ఎంతటి మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించలేకపోతున్నాం. అందువల్ల వారిపట్ల నిర్లక్ష్య వైఖరినీ, నిర్దాక్షిణ్యాన్నీ చూపుతున్నాం. తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్షదైవాలనీ, వారి ఋణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిదనీ నిరూపించిన వినాయకుడు, శ్రీకృష్ణుడి జీవితాలు మనకు ఆదర్శం కావాలి.

Source - Whatsapp Message

దేవ రహస్యం

దేవ రహస్యం

యమధర్మరాజు ఒక యమదూతను భూలోకానికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసుకురమ్మని పంపాడు
భూలోకానికి వచ్చాడు ఆ దూత
ఒక ఆడది అప్పుడే బిడ్డను ప్రసవించింది
అంతకు ముందు వారం ఆమె భర్త చనిపోయాడు
ఆ తల్లిని కూడా చంపేస్తే ఆ బిడ్డ ఆలనా పాలన ఎలా అని ఆ యమదూత జాలిపడి ప్రాణాలు తీయకుండానే వెళ్ళిపోయాడు

అదే విషయాన్నీ యమధర్మరాజుకు చెప్పగా
దేవరహస్యం తెలియక నీకు ఇచ్చిన కార్యాన్ని నువ్వు చేయకుండా ఉల్లంఘించినందుకు నువ్వు నీ రూపు మారి భూలోకంలోకి వెళ్ళి దేవరహస్యం అర్థం అయ్యాకే ఇక్కడకు చేరుకుంటావని శాపం ఇచ్చాడు

యమదూత పూర్తి నల్లని రూపంతో ఒక చోట మూలుగుతుండగా అక్కడకు ఓ దర్జీ వచ్చి చూసి జాలిపడి అతడిని ఇంటికి తీసుకు వెళ్తాడు
తన ఇంటి ముందు ఆవరణలో అతను కుట్టుమిషన్ పెట్టుకుని బట్టలు కుడుతూ జీవనం సాగిస్తాడు

యమదూతను తీసుకెళ్లి కూర్చోబెట్టి భార్యను పిలిచి భోజనం వడ్డించమంటాడు
తాను తాగేందుకే గంజి లేదు అతిథికి విందుభోజనమా
అన్నం లేదు ఏమీ లేదు వేళ్ళు అంటుంది
యమదూత అక్కడనుండి వెళ్లిపోతుండగా మళ్ళీ ఆమె పిలిచి సరే లోపలి రా వచ్చి బోంచేయి అంటది
అప్పుడు యమదూత ఒక నవ్వు నవ్వుతాడు
అతడి శరీరం కొంత భాగం బంగారు వర్ణానికి మారుతుంది

ఆ దర్జీ నువ్వు నా దగ్గరే ఉండి నాకు తోడుగా పని చేస్తూ ఇక్కడే ఉండొచ్చు అంటాడు అలా ఐదేళ్లు గడిచాక ఆ ఇంటిముందు ఓ స్థితిమంతురాలైన ఒక స్త్రీ ఇద్దరి పిల్లలతో దర్జీ దగ్గరకు వచ్చింది
ఆ ఇద్దరి పిల్లలలో ఒకడు అవిటివాడు
కొన్ని బట్టలు ఇస్తూ ఆ పిల్లాడికి ప్రత్యేకంగా
చాలా ఖరీధైన దుస్తులు కుట్టించమని చెప్పి వెళ్ళింది
అప్పుడు నవ్వాడు మరోసారి యమదూత
మళ్ళీ శరీరం బంగారు వర్ణంలోకి రంగు మారింది

మరొక పదేళ్లు గడిచింది ఇప్పుడు యమదూత బట్టలు కుట్టడం నేర్చుకున్నాడు అప్పుడు ఓ ఐశ్వర్యవంతుడైన వ్యక్తి కారులో వచ్చి చాలా విలువచేసే గుడ్డను ఇచ్చి తనకు ఇరవై ఏళ్లకు చినిగిపోని సూట్ ఒకటి కుట్టమని మూడురోజుల్లో వచ్చి తీసుకుంటానని చెప్పి వెళ్తాడు

యమదూత రెండు రోజులు కుట్టకుండానే జాప్యం చేసి మూడో రోజు ఒక దిండు కవర్ మరియు ఒక దుప్పటిలా కుట్టేస్తాడు అది చూసిన ఆ దర్జీ అయ్యో ఎంత పని చేసావు ఇప్పుడు అతను వచ్చి అడిగితే నేను ఏమీ చెప్పాలి అని అంటుండగానే కారు డ్రైవర్ వచ్చి అయ్యా మా యజమాని చనిపోయారు ఆయనకు దిండు కవర్ దుప్పటి కుట్టివమని చెప్పి కుట్టినవి తీసుకుని వెళ్ళిపోతాడు

అప్పుడు మరోసారి నవ్వుతాడు యమదూత పూర్తిగా బంగారు వర్ణంలోకి మారి పైకి వెళ్లిపోతుండగా అప్పుడు దర్జీ అయ్యా మీరెవరు
మీరు నా దగ్గరకు వచ్చినప్పటి నుండి మూడు సార్లు మాత్రమే నవ్వారు మీరు నవ్వినప్రతిసారి మీ రంగు మారేది కారణం చెప్పండి అన్నాడు

జరిగిన విషయం చెప్పి
మొదటి సారి
మీ భార్య అన్నం లేదు అని చెప్పింది
అప్పుడు ఆమె దరిద్రదేవతలాగా కనిపించింది
మళ్ళీ బోంచేయి అని పిలిచినప్పుడు
నాకు ఆమె మహాలక్ష్మి రూపంలో కనిపించింది
అప్పుడు తెలిసింది అభిప్రాయాలు మారుతాయి అని

రెండవ సారి
ఆ పిల్లాడు తల్లి ప్రాణాలను తీయమన్నపుడు అలోచించి వదిలేసాను కానీ అతనికి ఆమె కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి అతని అంగవైకల్యాన్ని కూడా లెక్కచేయకుండా తన బిడ్డకు సమానంగా చూసే వ్యక్తి దగ్గర చేసాడు
అప్పుడు అర్థం అయింది దేవుడు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే ఆ చోటును తప్పకుండ భర్తీ చేస్తాడు అని

ఇక మూడోసారి
అతడు మూడు రోజుల్లో చనిపోతాడని నాకు తెలుసు అందుకే అలా కుట్టాను కానీ అతను ఇరవై ఏళ్లకు చినిగిపోనంతగా ఒక సూట్ కుట్టమని ఇచ్చాడు
మనం శాశ్వతం కాదు
ఏ క్షణాన ఎవరూ పోతామో తెలియదు ఎంత కాలం ఉంటామో తెలియదు కానీ నమ్మకం
ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కానీ డబ్బును ఎక్కువగా పోగుచేసేస్తుంటారు
అక్రమంగా సంపాదించి చెర్చేస్తుంటారు
ఆశతో బతికేస్తుంటారు అని చెప్పి దేవరహస్యాలను తెలుసుకున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు యమదూత ఆ దర్జీకి కృతజ్ఞత చెప్పి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

Monday, September 21, 2020

ఎప్పుడూ తొందరపడి ఏ మనిషినీ నిందించకూడదు, అనుమానించకూడదు, అవమానించకూడదు.

ఈరోజు ఓ చిన్న కధతో మీ ముందుకు.

ఒక జంట ఓడలో ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి ఓడ మునిగిపోతోంది. అందరూ లైఫ్ బోట్ లోకి వెళ్తున్నారు, ఆ లైఫ్ బోట్లో ఇంక ఒక్కరికే స్థానం ఉంది, జంట మాత్రమే ఇంక ఓడలో మిగిలింది, భార్య భర్త ఎవరో ఒక్కరే లైఫ్ బోట్లోకి వెళ్ళగలరు. ఇద్దరూ ఆలోచిస్తున్నారు, ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ఉంచేసి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకేసాడు. వెనక నుంచి భార్య అరుస్తూ ఏదో చెప్తోంది. తరగతిలో పిల్లలకి ఈ కధ చెప్తున్న ఉపాధ్యాయురాలు కధ చెప్పటం ఇక్కడ ఆపేసింది. పిల్లలూ, ఆవిడ భర్తతో ఏమని ఉంటుందో చెప్పగలరా అని పిల్లలని ప్రశ్నించింది, టీచర్. పిల్లలు ఒకేసారి చెప్పారు, ఇంత మోసమా, నిన్ను గుడ్డిగా నమ్మాను, అని ఉండచ్చు టీచర్ అన్నారు. ఒక బాబు మౌనంగా కూర్చుని ఉన్నాడు, టీచర్ ఆ బాబుని అడిగింది నువ్వేమి చెబుతావు అని. ఆ బాబు చెప్పాడు, మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి, అని చెప్పి ఉంటుంది అన్నాడు. టీచర్ కళ్ళల్లో ఆశ్చర్యం, నీకు ఈ కధ ముందే తెలుసా, అని అడిగింది. బాబు తల అడ్డంగా ఊపాడు, లేదు, నాకు ఈ కధ తెలీదు, మా అమ్మ జబ్బుతో చనిపోతూ మా నాన్నకు చెప్పింది, మన బాబు జాగ్రత్త అని.. అన్నాడు. ఈ సారి టీచర్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఈ కధలో భార్య కూడా ఇదే చెప్పింది, నీ సమాధానం సరి అయినది అని చెప్పింది టీచర్.

ఇహ కధ విషయానికి వస్తే భర్త ఇంటికి చేరి తమ కూతురిని కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకుంటూ, బాగా చదివించి, పెళ్ళి చేసి మంచి జీవితాన్ని కూతురికి అందించి ఒక రోజు కన్ను మూసాడు. తండ్రి వస్తువులని ఒకచోట చేర్చి పక్కన పెట్టేయాలి అని కూతురు తండ్రి వస్తువులు సర్దుతోంది. తండ్రి డైరీ కనపడింది, అందులో రాసుకున్నాడు, భార్యకు చెప్పుకుంటున్నట్టు, నీతోపాటే ఓడలో ఉండి మునిగిపోయి నీళ్ళ కిందే నీతోనే ఎప్పటికీ ఉండిపోవాలి అనిపించింది, కానీ మనమ్మాయిని ఎవరు చూసుకుంటారు, నిన్ను బతికిద్దామనుకుంటే, నీ ప్రాణాంతక జబ్బు చివరి స్టేజ్ లో ఉంది, ఎలానూ నువ్వు మరణం అంచుల్లో ఉన్నావు. మరి మనమ్మాయికి ఎవరు తోడు.అందుకే ఎక్కువ ఆలోచిస్తే బలహీనపడిపోతానేమో అనిపించి లైఫ్ బోట్లోకి దూకేసాను. మనసులో ఎంత ఏడ్చుకున్నానో నీకు తప్ప ఇంకెవరికి అర్ధం అవుతుంది, అని డైరీలో భార్యకి చెప్పుకున్నాడు.

మరి....అదండీ కధ..!!!!

పైపైన ఏదో చూసి ఎప్పుడూ ఎదుటి మనిషిని నిర్ణయించకూడదు, ఎవరు ఏంటీ అని, మనకి తెలియని లోతులు చాలా ఉండచ్చు వారి జీవితాల్లో. ఎప్పుడూ తొందరపడి ఏ మనిషినీ నిందించకూడదు, అనుమానించకూడదు, అవమానించకూడదు.👏

Source - Whatsapp Message

నిందా స్తుతి సమయంలో

💐 నిందా స్తుతి సమయంలో .....💐

🌊 సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది. అతను వెంటనే
" ఈ సముద్రం మహా దొంగ"అని రాశాడు.

కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో
"ఈ సముద్రం గొప్ప దాత" అని రాశాడు.

ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి పోయాడు. అతని తల్లి ‘ "ఈ సముద్రం
నా కొడుకులాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న మహమ్మారి " అని
రాసింది.

ఒక పెద్దతను సముద్రంలోకి వెళ్లి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో
"‘ఈ సముద్రం ఒకటి చాలు జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను " అని రాశాడు.

అనంతరం ఒక పెద్ద అల వచ్చింది.
వీరందరూ రాసిన మాటలను తుడిచి పెట్టేసింది.

రకరకాల అభిప్రాయాలను సముద్రం తన అలలతో తుడిచేసుకుంది అలానే
మన జీవితంలో ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడరాదు...

ఇంకా
ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నింటిని విని ఎవరిపైనా చెడు
అభిప్రాయానికి రాకూడదు.
వారిని కూడా మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి.

ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆలోచించండి.
దాని తొలగించి ముందుకు
అడుగు వేయండి.
భగవంతుని తోడుగా చేసుకోండి..

వినయం విధేయతతో విజయం మీ సొంతం అవుతుంది.

మనస్సాక్షి , భగవంతుడు ఒప్పుకునేలా జీవించాలి.🙏

Source - Whatsapp Message

Sunday, September 20, 2020

నిజమైన గుర్తింపు సాధనం

మంచి కధ

👌 నిజమైన గుర్తింపు సాధనం👌

👉ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగటానికి వచ్చాడు. “నీ విశేషం ఏంటి?” అని అడిగితే, “మనిషి అయినా, జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను.” అని చెప్పాడు.

రాజు అతడిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు.

👉కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన, ఖరీదైన గుర్రాన్ని చూపించి, అడిగాడు.
అప్పుడు అతను, “ఇది జాతిగుఱ్ఱం కాదు.” అని అన్నాడు.
రాజు చాలా ఆశ్చర్యపోయాడు.

👉అడవి నుంచి గుర్రపువాడిని పిలిపించి అడిగితే అతడు - “గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది.
దీనిని ఆవు పాలు పోసి పెంచామ”ని చెప్పాడు.

👉రాజు తన ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు అతడు- “ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే దాణా నోట్లోకి తీసుకుని తలెత్తి తినేది.” అని చెప్పాడు.

👉రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది.
అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, కోడిగుడ్లు, ఉదారంగా పంపించాడు.
అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు.

👉కొన్ని రోజుల తర్వాత అతడు రాణీ గురించి అడిగాడు... అప్పుడు ఉద్యోగి చెప్పాడు- “ఆమె తీరుతెన్నులు, వ్యవహారం రాణి లాగానే ఉన్నాయి. కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు.” అని..
రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు.
అప్పుడు అత్తగారు అన్నది- “నిజం ఏంటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు. కానీ మా కూతురు పుట్టిన ఆరు నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రాచసంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురుగా పెంచుకున్నాము.

👉రాజు మళ్లీ తన ఉద్యోగిని అడిగాడు, “నీకు ఎట్లా తెలిసింది?” అని. అతను చెప్పాడు- “రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది.
ఒక రాణి స్తాయి వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది. అది రాణిగారిలో ఎక్కడా లేదు....

👉రాజు మరొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు, మేకలు కానుకగా ఇచ్చి తన దర్బారులో నియమించుకున్నాడు

👉కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు.
ఉద్యోగి, “నా ప్రాణాలకు అభయం ఇస్తే చెప్తాను.” అని అన్నాడు.
రాజు మాట ఇచ్చాడు. అతడు, “మీరు రాజూ కాదు, రాజు కొడుకూ కాదు. మీ వ్యవహారం రాజు లాగా లేదు.” అని అన్నాడు.
రాజుకు చాలా కోపం వచ్చింది.
కానీ అభయం ఇచ్చేశాడు కదా. అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు.
తల్లి అన్నది- “ఇది నిజమే నాయనా. నువ్వు ఒక రైతు కొడుకువు.
మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్తత తీసుకుని పెంచుకున్నాము.” అని.

👉రాజా ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ విషయం ఎట్లా తెలుసు?” అని అడిగాడు.

👉అప్పుడు ఉద్యోగి- “రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్రా ఇస్తారు. కానీ మీరు గొర్రెలు, మేకలు, తిని తాగే వస్తువులు కానుకిస్తున్నారు.
ఈ పద్ధతి రాజులది కాదు, రైతువారిదే అవుతుంది.” అన్నాడు...

☘మనిషి దగ్గర ఎంత ధనము, సంపదలు, సుఖము, సమృద్ధి, వైభవం, శక్తీ ఉన్నా ఇదంతా బయటికి కనిపించడానికే!

🌺 మనిషి నిజమైన గుర్తింపు సాధనం అతడి వ్యవహారమే.🌺

Source - Whatsapp Message

అసలైన అందం

🌸 అసలైన అందం 🌸

🌹ప్రతి మనిషిలో ఒక అందం ఉంటుంది. ఆ అందానికి మెరుగులు దిద్దేది అలంకారం.

🌹కానీ నిజమైన అందం అంటే ఇతరులను ఆకర్షించే విధంగా ఉండేది కాదు. అలాగే అలంకారం అంటే శరీరానికి రంగుల మెరుగులు అద్దడం కాదు.

🌹మనిషికి నిజమైన అందాన్ని ఇచ్చేది ఏమిటంటే మాట్లాడే మాటతీరు.

🌹దానికి మెరుగులు దిద్దడం అంటే మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి ఎదుటి వారి మనసును ఆకర్షించే విధంగా మాట్లాడటం.

🌹అలా ఆలోచించకుండా, అర్థం లేకుండా మాట్లాడడం అంటే "గురి చూడకుండా బాణం వదలడం లాంటిది ".

🌹ఏదైనా ఒక మాట మాట్లాడితే, ఆ మాట మాట్లాడిన తరవాత తిరిగి ఆలోచించాల్సిన అవసరం రానే రాకూడదు. కాబట్టి ఏది మాట్లాడినా ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి.

🌹నిజానికి మాట్లాడడం ఒక కళ. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, మాట్లాడాలి అనేది కూడా ఒక అద్భుతమైన విద్య. నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంట పడతాయి. నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచు కుంటూ ఉంటే అలాంటి వాడికి ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది.

🌹చెట్టు యొక్క సారం పండులో వ్యక్తం అయినట్లుగా, మనిషి యొక్క సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉండాలి.

🌹ఎవరైతే మంగళ కరమైన మాట తీరును కలిగి ఉంటాడో, అది ఆ మనిషి సంస్కారానికి గీటురాయిగా నిలుస్తుంది.

🌹 ‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడ కూడదో తెలుసుకో గలిగినవాడు వివేకవంతుడు’.

🌹 ఎవరైతే తమ మాటల వల్ల, చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించ కుండా ఉంటారో వారే ఉత్తమ పురుషులు.

🌹ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ

🌹ఆకట్టుకునేలా మాట్లాడటం అనే ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు, ఎలా మొదలు పెట్టాలో, ఎప్పుడు, ఎలా ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ.

🌹మాటలే మంత్రాలు, మాటలు చురకత్తుల కన్నా చాలా పదునైనవి కనుక వాటిని జాగ్రత్తగా వాడాలి, లేదంటే ఎదుటి వారి సున్నితమైన మనసును మాటల రంపాలతో పరపర కోసినట్లే అవుతుంది.

🌹ఈ మాటలు అనేవి మనసుపై వత్తిడి తెచ్చేంత బలమైనవి కనుక సున్నితంగా వాడాలి, ఈ మాటలనేవి ఆణి ముత్యాల కన్నా ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.

🌹మాట్లాడటం అందరూ చేస్తారు. అయితే తను మాట్లాడే మాటలను అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు.

🌹ఆ మాటలు మరింత ప్రభావ వంతంగా ఉండాలంటే, హృదయాంతరాల్లోని మనసుతో మాట్లాడాలి, అంతేకానీ కేవలం శరీరంలో ఉన్న మామూలు నోటితో కాదు.

🌹మనమాటే మన సంపదలకు మూలం. ఆ సంపదలే మానవ సంబంధాలకు మూలం. మనం మాట్లాడే మాటలే మనకు స్నేహితుల్ని సంపాదించి పెడతాయి, ఆ మాటలే మనకు శత్రువుల్నీ కూడా తయారు చేస్తాయి.

🌹అందుకే అన్నారు ఎవరినీ 'నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ' అని అన్నారు. అలాంటి వారికి శత్రువులే ఉండరు.

🌹కటువైన మాటలు ఇతరుల హృదయాలను గాయపరచ గలవు, అలాగే కమ్మనైన తియ్యటి మాటలు మనసులోని గాయాలను నయం చేయనూగలవు.

🌹కానీ తియ్యని మాటలతో గొంతులు కోసేవారు కూడా ఉన్నారు. అలాంటి వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మన సరైన మాటతీరు మనల్ని చంపడానికి వచ్చిన శత్రువు యొక్క మనసును కూడా మార్చగలదు

🌹మాటలు, పదాలు అనేవి కమ్మగా వండిన పాయసంలో వేసిన జీడిపప్పు, కిస్మిస్లాగా ఉండాలి. మనం మాట్లాడే మాటల మధ్యలో సందర్భాను సారంగా మనం చెప్పే సామెతలు అనేవి జీడిపప్పు లాగా, మనం చెప్పే లోకోక్తులు పాయసంలోని కిస్మిస్ లాగ అతి మధురమైనవిగా ఉంటూ ఆ మాటల పదాలు, వినేవారికి మరింత మధురంగా, తియ్యగా, కమ్మగా, వినసొంపుగా అనిపిస్తాయి.

🌹ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఈ విషయంలో రామాయణంలో నాయకుడైన పురుషోత్తముడి వంటి శ్రీరామచంద్రుడిని, సుందరకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడిని మనం ఆదర్శంగా తీసుకావాలి.

🌹మనిషికి హావభావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏం చెప్పాలి అనేదాని కన్నా, ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావ ప్రకటన మరింత ఆకర్షణీయంగా ఉండాలి.

🌹మన హావభావ వ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటుందో దాని యొక్క ఫలితం కూడా అంత మహత్తరంగా ఉంటుంది.

Source - Whatsapp Message

గరికిపాటి నరసింహారావు తెలుగు రచయిత...

ప్రముఖ అవధాని, కవి, ప్రవచన కర్త
శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.........💐💐🙏

జననం 14 సెప్టెంబరు1958

గరికిపాటి నరసింహారావు తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు. ఇతను దేశ విదేశాల్లో అవధానాలు చేశారు. వాటిలో: ఒక మహా సహస్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి. పలు టెలివిజన్ ఛానెళ్ళలో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ వేలాది ఎపిసోడ్ల పాటు పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశారు. వాటిలో 11 అంశాలను సీడీలుగా రూపొందించి విడుదల చేశారు. పద్యకావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ధారణా బ్రహ్మరాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు, కళారత్న, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవులు పురస్కారం తదితర పురస్కారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు మొదలైన గౌరవాలు అందుకున్నారు.

జీవిత విశేషాలు
గరికపాటి నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు 1958, సెప్టెంబర్ 14వ తేదీకి సరియైన విలంబి నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పాడ్యమినాడు జన్మించారు. ఇతడు ఎం.ఎ., ఎం.ఫిల్, పి.హెచ్.డి చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశారు. ఇతని భార్య పేరు శారద. ఇతనికి ఇద్దరు కొడుకులు. వారికి తన అభిమాన రచయితల పేర్లు శ్రీశ్రీ, గురజాడ అని నామకరణం చేశారు. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.

అవధానాలు
ఇతడు అవధానిగా సుప్రసిద్ధుడు. సుమారు 275 అష్టావధానాలు, 8 అర్థ శత, శత, ద్విశత అవధానాలు, ఒక మహా సహస్రావధానం దిగ్విజయంగా నిర్వహించారు. మొదటి అవధానం 1992 సంవత్సరం విజయదశమి రోజు చేశారు. 2009లో 8 కంప్యూటర్లతో హైటెక్ అవధానం నిర్వహించారు. 2006 వ సంవత్సరం బెంగుళూరు లోని ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తూండగా మేధో పరీక్ష చేయబడింది. యావదాంధ్ర దేశంలోనే కాక మనదేశంలోని వివిధ నగరాలతోపాటు అమెరికా, సింగపూరు, మలేషియా, లండన్, దుబాయి, బహ్రైన్, కువయిట్, అబుదాభి, దుబాయి, కతార్ మొదలైన దేశాలలో పర్యటించి అక్కడ అవధానాలు చేశారు.

రచనలు

సాగరఘోష (పద్యకావ్యం)
మనభారతం (పద్యకావ్యం)
భాష్పగుఛ్ఛం (పద్య కవితా సంపుటి)
పల్లవి (పాటలు)
సహస్రభారతి
ద్విశతావధానం
ధార ధారణ
కవితా ఖండికా శతావధానం
మౌఖిక సాహిత్యం (పరిశోధన)
పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు
మా అమ్మ (లఘుకావ్యం)
అవధాన శతకం
శతావధాన భాగ్యం (సంపూర్ణ శతావధానం)
శతావధాన విజయం (101 పద్యాలు)

టి.వి.కార్యక్రమాలు
ఇతడు అనేక టి.వి.ఛానళ్లలో కార్యక్రమాలు నిర్వహించాడు. వాటిలో కొన్ని:

ఏ.బి.ఎన్. ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం
ఓం టి.వి. (సి.వి.ఆర్.స్పిరిట్యుయల్)లో రఘువంశం
భక్తి టి.వి.లో ఆంధ్ర మహాభారతం: 1818 ఎపిసోడ్లు
భక్తి టి.వి.లో తరతరాల తెలుగు పద్యం
దూరదర్శన్ సప్తగిరిలో మంచికుటుంబం
ఈ.టి.వి-2 - చమక్కులు (తెలుగు వెలుగు)
తెలుగు వన్ డాట్ కామ్ ఇంటర్నెట్ ఛానల్‌లో సాహిత్యంలో హాస్యం

సి.డి.లు, డి.వి.డి.లు
వివిధ సందర్భాలలో ఈయన చేసిన ప్రసంగాలు, ప్రవచనాలు, సాగరఘోష కావ్యపఠనం సిడిలుగా డివిడిలుగా విడుదల చేయబడ్డాయి. వాటి వివరాలు:

పలకరిస్తె పద్యం (హాస్య పద్యాలు)
శివానంద లహరి
సౌందర్య లహరి
కనకథారా స్తవము
భక్త ప్రహ్లద
గజేంద్ర మోక్షము
కాశీ ఖండము
భగవద్గీత
శకుంతలోపాఖ్యానము
శ్రీకాళహస్తి మహాత్మ్యం
సాగరఘోష (1116 పద్యాలు x 20 గంటల వ్యాఖ్యానంతో సహా) (డివిడి)

పురస్కారాలు

ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ (1989)
కనకాభిషేకాలు - భీమవరం (1997), వెదురుపాక విజయదుర్గా పీఠం ( 2004)
సువర్ణ కంకణాలు- కాకినాడ (1999), విశాఖపట్నం ( 2003, 2004 మరియు2005)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం (2000)
2002లో సాగరఘోష కావ్యానికి సాధన సాహితీ స్రవంతి, హైదరాబాదు వారి పురస్కారం
2003లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం - సాగరఘోష కావ్యానికి
2004 లో నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ)
2005లో ‘సహృదయ’ (వరంగల్లు) వారి సాహిత్య పురస్కారం -సాగరఘోష కావ్యానికి
భగవాన్ సత్య సాయిబాబా వారిచే 2008 నవంబరులో సువర్ణహారం
2008 లో అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం
2011 సెప్టెంబరులో కొప్పరపు కవుల పురస్కారం
సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2012)
తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012
2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.

Source - Whatsapp Message

మన నుదిటిపై బ్రహ్మ రాసిన బ్రహ్మరాతను మార్చగల శక్తి ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే అది ఎలా పనిచేస్తుంది. దాని విధివిధానాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దామా..

👌మన నుదిటిపై బ్రహ్మ రాసిన బ్రహ్మరాతను మార్చగల శక్తి ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే అది ఎలా పనిచేస్తుంది. దాని విధివిధానాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దామా..👌

రామాపురం అనే ఊరిలో రామశర్మ అనే ఒక మంచి సమర్థుడైన గురువు గారు తన ఆశ్రమంలో శిష్యులకు శిక్షణనిస్తూ వుండేవారు. ఆయన సకల శాస్త్రాలు, విద్యలు తెలిసిన వారు. ఆయన భార్య కూడా పేరుకు తగినట్లు సాక్షాత్తూ అన్నపూర్ణా దేవియే. ఆమె తమ ఆశ్రమంలోని శిష్యులను తన కన్నబిడ్డల్లా ప్రేమగా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదు అనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా, ఒక నాడు ఆ గురు దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ బాలుడు వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు.

ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోక పోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా శిక్షణ ముగిసిందని అతడిని తిరిగి రామశర్మ దగ్గరకు పంపించారు. ఇదిలా వుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటూ ఉన్నాడు. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభ మయ్యాయి. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటే కూర్చుని ఎవరు పుడతారా అని ఆలోచించుకొంటూ ఉండగా, లోపలి నుండి చంటి బిడ్డల ఏడుపులు వినిపించాయి.

గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. నిజానికి మామూలు మనుషులకు అతను కనిపించి వుండేవాడే కాదు. కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతను ఎవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు ''బ్రహ్మ '' అని అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరా అని వినమ్రపూరితంగా అడిగాడు.

బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియ జెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకుని ఇలా చెప్పాడు.. నాయనా.. వీరు పూర్వజన్మలో చేసిన పాప కర్మల వల్ల ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవిత కాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కనాకష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు.

సాక్షాత్తూ దైవసమానులైన తన గురు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువు దగ్గరకు వెళ్ళి గురూజీ బ్రహ్మ దేవుడు రాసిన తలరాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి, ఆయన అది సాధ్యమో కాదో అనేది నాకు తెలియదు వేరే పెద్ద పెద్ద జ్ణానులకు తెలిసుండవచ్చు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించ సాగింది. ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా.. అనే దిగులుతో, వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరడంలేదు. దానికి తోడు ఆ పిల్లలిద్దరు వసంతుడి వెంటపడి అన్నయ్య, అన్నయ్య అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది.

ఒక రోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది తీర్థయాత్రలు చేసి వస్తానంటూ బయలుదేరి, పెద్ద పెద్ద జ్ణానులను కలవడానికి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు. వారందరిని వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా అని, దానికి వారికి తెలిసినదేదో వసంతుడికి చెప్పారు. చివరికి ఒక గురువు గారి వద్ద కర్మ సిధ్ధాంతాన్ని అభ్యసించి అది మన తలరాతను మార్చ గలదని ప్రయోగ పూర్వకంగా తెలుసుకొన్నాడు. ఇక వెనుదిరిగి వచ్చాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలని ఆశ్రమానికి వచ్చాడు. అప్పటికే అక్కడి పరిస్థితులు తారుమారయ్యాయి. గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు.

తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు. వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా.. అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. తమ్ముడూ.. నువ్వు బాధపడకు. ఇప్పటి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా.. ఇక నుండి నువ్వు ఎలా చెపితే అలానే చేస్తాను'' అన్నాడు శంకరుడు.

ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంతకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఆ ఆవుని అమ్మేసాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలు దేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురంటూ తిని ఆకలి తీర్చుకున్నారు.

తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా అన్నం వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా.. ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయి పోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు. దానికి వసంతుడు తమ్ముడూ.. నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు.

ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి బ్రహ్మయే రాత్రికి రాత్రి తనే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలు దేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు.

వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది. అన్నయ్యా.. నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకు పోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ.. ఊరుకోమ్మా.. ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన. ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు.

ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా.. ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అంతే అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళి పోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తుండగా ఒక మహాపురుషుడు లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తను రాసిన తల రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు.

అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, వారి తలరాతలను మార్చి గురు దంపతుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు భగవంతుడు. అదే విషయాన్ని నిరూపించాడు వసంతుడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చ గలిగేది ఒక్క గురువే. కాబట్టి మిత్రులారా ! మీరు కూడా ఒక సద్గురువును ఆశ్రయించి గురు బోధనల ద్వారా మీ తలరాతను మార్చుకో గలరని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్.👌

🤘సర్వే జనా సుఖినోభవంతు🤘

👌ధర్మో రక్షతి రక్షతః 👌

Source - Whatsapp Message

నీకర్మకు బాద్యుడవు నీవే ,అదేవిదంగా నీకర్మను మార్పు చేసుకోవలసినది,నీవే... నీతలరాతను నీవే మార్చుకోవాలి.

రమణ మహర్షి దివ్య బోధ

🤘మీరు ధనము ఎందుకు సంపాదించాలి అన్నది ఒకసారి మరల గుర్తుకు తెచ్చుకొండి .
ఎవరైన ధనము సంపాదించాలి ,అంటే తన భార్య కొరకు ,పిల్లలకొరకు ,లేదా కుటుంబం కొరకు సంపాదించాలి అంటారు .అది నిజమే ..కాని నీకొరకు సంపాదించాలి అంటే కొంతవరకు మాత్రమే వస్తుంది .అది ప్రకృతి సహజం .అదే ధనము కుటుంబం కోసం సంపాదించాలి అంటే మరికొంత ఎక్కువ వస్తుంది .అదే ధనము ప్రపంచ శ్రేయస్సుకోసం సంపాదించాలి అని అనుకుంటే అనంతమైన సంపదవస్తుంది .

నీ ఆలోచన ఎప్పుడు క్రిందస్థాయిలో ఆలోచించకు ,పై స్థాయిలో ఆలోచించు ,నీ స్టితి మారుతుంది .ఎంతసేపు నీగురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటే ,నిస్తితి మారదు .ఎదుటివారికి సహాయం చేయలని ఆలోచన పెట్టుకో ,నిస్థితి మారుతుంది .ఎందుకు చెపుతున్నాను అంటే ...

నీవు పూర్వ జన్మలో ధనికుడివై ఉండి దానిని వినియోగించడం రాక పాడుచేసి ఉన్నావు .అందుకని నీవు ఈ జన్మలో ధనవంతుడిగా పుట్టలెదు .పూర్వ జన్మలో నీవు ధనముని సద్వినియోగం చేసివుంటే నీకు ఈ విధమైన బాధలు వచ్చివుండేవికాదు .మరి నీవు ఈ జన్మలో ధనవంతుడిగా మరలి అంటే ఏ గుడి ,గోపురం తిరిగితే ధనవంతుడిగా మారవు .ఏ భగవంతుడు నిన్ను మార్చడు .ఎందుకంటే ఈ జన్మలో నీవు ధనములేకుండగా పుడతానికి కారణం ....నీవే .నీకర్మకు బాద్యుడవు నీవే ,అదేవిదంగా నీకర్మను మార్పు చేసుకోవలసినది,నీవే ...🤘

నీతలరాతను నీవే మార్చుకోవాలి

U are the creater of u r own destiny



Source - Whatsapp Message

రమణ మహర్షి దివ్య బోధ - ఎవరు నువ్వు ?

రమణ మహర్షి దివ్య బోధ:-
----------------------------------------------------------------
ఎవరు నువ్వు ?

ఎందుకు బాధపడు తున్నావు ?

అసలు బాధపడడానికి ఎవరు నీవు ?

నీవు బాదపడడానికి గల కారణం ఏమిటి ?

అసలు నీవు శరీరానివి అను కుంటున్నావు ,

నీ మనస్సు నిన్ను ఏమరుస్తుంది..చూడు.. .

నిన్ను శరీరానికి పరిమితంగా నిన్ను చేస్తుంది .

కాని నీ మనస్సుకు లొంగ కుండా నీవు ఆత్మస్వరూపానివని నిరంతరం నమ్ము ...

ఆత్మకు బాదరాదు ,
అగ్నిలో కాలదు ,
నీటిలో తడవదు .

అసలు ఆత్మకు చావులేదు..

ఎందు కంటె ఆత్మకు చావు పుట్టుకలు లేవు..

శరీరాలను మార్చుకుంటూ పోతూ ఒక్కొక్క జన్మలో ...
ఒక పాఠం నేర్చుకోడానికి వస్తూ... ఉంటుంది.

ఈ జన్మలొ డాక్టరుగా ,

ఏరొక జన్మలొ ఏక్టరుగా ,
ఒక జన్మలొ దొంగగా ,

ఏరొక జన్మలొ వేరొక విధంగా జన్మ తీసు కుంటుంది .

మరి ఈ జన్మలో ఎందుకు నీవు బాధపడు తున్నావు ?

ఏమి తెచ్చావని బాదపడు తున్నావు ,--
ఏమి పోతున్నదని ?,

ఏమి పోతున్నదని... బాదపడు తున్నావు. పట్టికెళ్లడానికి ,
ఎక్కడికి పట్టికెడతావు ?

అన్నీ ఇక్కడే వదిలి వెడతావు .

అంత మాత్రానికి ఎందుకు బాదపడు తున్నావు ?

ఎవరు నీవు ? ఎప్పుడైనా ప్రశ్నించు కున్నావా ?

నేను ఎవరు?
అని ఈ రోజు ప్రశ్నించుకో ఇప్పుడే ప్రశ్నించుకో ,
ఆలోచించకు... ప్రశ్నించు కో నేను ఎవరు ? అని ,
జవాబు దొరికే వరకు విశ్రమించకు ,
ప్రశ్నిస్తూనే ఉండు నేనుఎవరు ? అని..

"ఎవరు నేను" అని ,..అదే... జీవిత లక్ష్యంగా పెట్టుకో...
అంతే గాని భార్యకొరకో ,

భర్తకొరకో ,
బిడ్డ కొరకు కాదు ...
నీవు వచ్చింది .. సరదాగా...న ...

ఆనందంగా జీవిత పాటాలు నేర్చుకోడానికి ,
వాటిని అనుభ వించ డానికి వచ్చావు.
అంతే కాని బాదపడ డానికి...

ఏడవ డానికి రాలెదు...

గుర్తుంచుకో...
నీవు ఆత్మ పదార్దానివని ,
శరీరాన్ని దాల్చి నిన్ను నీవు చూసు కోవడానికి పుట్టావు .

మరచిపొయి బాదపడుతున్నావు .

నీవు నిరంతరం ఆనందంగా ఉండడం నేర్చుకుంటే,

బాధ భయంతో పారి పోతుంద...

నిజం నేను చెప్పేది. నిజం నన్ను నమ్ము ,

నేను చెప్పేది విశ్వసించు...

నిన్ను నివు నమ్ముకో ,

ఎవరిని నమ్మకు నిరంతరం ఆనందముగా... ఉండడం నేర్చుకో...

ఎలాంటి పరిస్థితులు ఎదు రయినా సున్నితంగా చూడడం నేర్చుకో ,

నిన్ను ఏ పరిస్థితి ఏమి చేయలేదు...

ఎందుకంటె నేను చెప్పానుగా నీవు ఆత్మ పదార్దానివని..*

ఇది గుర్తు పెట్టు కుంటే
చాలు .

నీవు ఆనందముగా నీ జీవితానికి ధన్యత

నగురోరధికం

Source - Whatsapp Message

ఆలోచించoడి.

ఆలోచించoడి.

👌 కాగితాన్ని కనిపెట్టిందెవరు?
మనిషి.
నిప్పును కనిపెట్టిందెవరు?
మనిషి.
చక్రాన్ని కనిపెట్టిందెవరు?
మనిషి
వ్యవసాయాన్ని కనిపెట్టిందెవరు?
మనిషి
పెద్ద పెద్ద ఇల్లు,బంగళాలు కట్టిందెవరు?
మనిషి
ఓడను కనిపెట్టిందెవరు?
మనిషి
విమానం కనిపెట్టిందెవరు?
మనిషి
కంప్యూటర్ కనిపెట్టిందెవరు?
మనిషి
ఫోన్, మొబైల్ కనిపెట్టిందెవరు?
మనిషి
కార్లు, వాహనాలు కనిపెట్టిందెవరు?
మనిషి
ఇంట్లో విశ్రాంతి,సుఖము, ప్రశాంతత కొరకు ఏ వస్తువులనయితే ఉపయోగిస్తున్నావో వీటిని ఎవరు తయారు చేశారు?
మనిషి
ఏ face book,whatsap లలో postings చదువుతున్నావో వీటిని ఎవరు సృష్టించారు?
మళ్ళీ సమాధానం మనిషి
ఈ సమాజాన్ని నిర్మించిందెవరు
మనిషి ?
మతాలను,ధర్మాలను సృష్టించిందెవరు
మనిషి
మందిరము,మసీదు,చర్చి సృష్టించిందెవరు?
మనిషి
వీటిలో దేవున్ని ప్రతిష్టించిందెవరు ?
మనిషి
విచిత్రమైన విషయమేమిటంటే ప్రతి ఒక్కటీ మనిషే సృష్టించాడు
అయినప్పటికీ మనం దేవుడు చమత్కారాలు చేస్తాడని విశ్వసిస్తాం.
మనిషే దేవున్ని సృష్టంచాడనడానికి సాక్ష్యాలు
1)మనిషి తప్ప ఏ ప్రాణీ భగవంతున్ని కోరికలు కోరదు.
2)మనిషి నివాసం లేని చోట మందిరం గాని, మసీదు గాని,చర్చి గానీ లేవు.
ఇతర గ్రహాలలో గానీ, మంచు ఖండంలో గానీ.
3)వేరు వేరు దేశాలలో ప్రాంతాలలో వేరు వేరు దేవతలు, దీని అర్థం మనిషి
ఊహలతో తన ఇష్టమైన రీతిలో భగవంతున్ని సృష్టించాడు.
4)ప్రపంచంలో అనేక ధర్మాలు అనేక సాంప్రదాయాలు, అనేక పద్ధతులు
ఒకర్నొకరు విమర్శించుకోవడాలు
దీని అర్థం దేవుడు ఒకరు కాదనేగా.
అందరూ చెబుతారు దేవుడొక్కడే అని.
కానీ కొసమెరుపు అది మా దేవుడే.
5)రోజుకో క్రొత్త దేవుడు, రోజుకో కొత్త పద్ధతి. మాదే గొప్ప అనే వితండ వాదనలు.
6)ప్రశ్నించే వాన్ని నాస్తికుడనో, హృదయం లేని వాడనో ముద్ర వేయడం.
7)ఈ ప్రపంచంలో వేరు వేరు దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఎన్ని తిప్పలో ఎన్ని ప్రయాసలో వర్ణించ నలవి కాదు.
8)ఇప్పటి వరకు నాకు దేవుడు కనపడినాడని చెప్పిన మనిషే లేడు.
బుద్దుడు, వివేకానందుల వారు కూడా కనపడే మనిషికే సేవచెయ్యమన్నారు
ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చివరకు కీర్తి కాంక్ష కూడా సుమా!
9)దేవుడున్నాడు లేడు అనే వాడు కూడా ఒకే విధమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు.
10)భగవంతుడు ఎవరికీ మేలు చెయ్యట్లేదు అలా అని కీడు కూడా చెయ్యట్లేదు
11)దేవుడు లంచగొండితనం,అన్యాయం,దొంగతనం,బలాత్కారము,ఆతంకవాదము,అరాచకత్వాన్ని నిరోధించడం లేదు.
12)అమాయకమైన చిన్న పిల్లలను కాల్చుతున్నా కూడా వారిని ఆపడం లేదు.
13.మందిరాలు,మసీదులు,చర్చిలు,ధ్యానమందిరాలు ఇవి దేవుని నిలయాలనే చెప్పుకునే చోట కూడా
మహిళలు,పిల్లలు సురక్షితంగా లేరు.
14.మందిరాలు, మసీదులు,చర్చిలు కూల్చుతుంటే ఏ దేవుడూ వచ్చి ఆపలేదు.
15.అభ్యాసం చేయకుండా ఏ ఒక్క విద్యార్థి అయినా ఉత్తీర్ణుడయ్యాడా?
16)25 సంవత్సరాలముందు లేని దేవుండ్లు, రకరకాల పద్ధతులు ఈ నాడు గొప్ప గొప్పవి అయిపోయినాయి.
17)తానే దేవున్నని చెప్పుకునే వాల్లు చాలా మంది జైల్లలో ఊచలు లెక్క పెడుతున్నారు.
18)ఈ ప్రపంచంలో దేవుడే లేడని చెప్పేవాల్లు చాలా మంది ఆనందంగా ఉన్నారు.
19) హిందువులు అల్లాను స్వీకరించరు,ముస్లిములు హిందూ దేవతలను,క్రైస్తవులు హిందూ దేవతలను,అల్లాహ్ ను ఒప్పుకోరు.
హిందూ ముస్లిమ్ గాడ్ ను అంగీకరించరు. అయినప్పటికీ ఈ దేవతలంతా ఎందుకిలా అని ఎవర్నీ అడుగలేదే?
కనుక ఆనందమే దైవం ఆనందం ఎప్పుడు కలుగుతుందీ అంటే కనపడని దేవుని పేరుతో కోటాను కోట్ల వ్యాపారం చేయడం కన్నా కనపడే మనిషికి సేవచేయడంలో. వారి కళ్ళలో కనపడే కృతజ్ఞతాపూర్వకమైన చూపును అనుభవించే వారికే తెలుస్తుంది. ప్రపంచంలోని తియ్యదనమంతా ఇందులోనే ఉంటుంది. మహామహులను పూజించడం కంటే వారు చూపిన మార్గంలో వెళ్ళడమే సరియైన విధానం..🤘

Source - Whatsapp Message

Saturday, September 19, 2020

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు

 

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు

👌మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!

అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశారు. చూడండి:

ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:

👉 ధర్మో రక్షతి రక్షిత:
👉 సత్య మేవ జయతే
👉 అహింసా పరమో2ధర్మ:
👉 ధనం మూలమిదం జగత్
👉 జననీ జన్మ భూమిశ్చ
👉 స్వర్గాదపి గరీయసి
👉 కృషితో నాస్తి దుర్భిక్షమ్
👉 బ్రాహ్మణానా మనేకత్వం
👉 యథా రాజా తథా ప్రజా
👉 పుస్తకం వనితా విత్తం
👉 పర హస్తం గతం గత:
👉 శత శ్లోకేన పండిత:
👉 శతం విహాయ భోక్తవ్యం
👉 అతి సర్వత్ర వర్జయేత్
👉 బుద్ధి: కర్మానుసారిణీ
👉 వినాశ కాలే విపరీత బుద్ధి:
👉 భార్యా రూప వతీ శత్రు:
👉 స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:
👉 వృద్ధ నారీ పతి వ్రతా
👉 అతి వినయం ధూర్త లక్షణమ్
👉 ఆలస్యం అమృతం విషమ్
👉 దండం దశ గుణం భవేత్
👉 ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?

ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?

ధర్మ ఏవో హతో హంతి
"ధర్మో రక్షతి రక్షిత:"
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !

🔥 సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.

🔥 అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్
🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన

🔥 ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.

🔥 అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

🔥 కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.

🔥 గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్

🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !

🔥 రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.

🔥 పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)

🔥 శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:

🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.

🔥విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.

🔥 శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.

🔥 అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
( ఇది మరోవిధంగా కూడా ఉంది)

🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడాడు. అతి కామం చేత రావణుడు నాశనమయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.

🔥 సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

🔥లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !

🔥న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

🔥బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.

🔥 ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

🔥 అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.

🔥 ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

🔥 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !

🔥 అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

🔥అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.

🔥 ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

🔥ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా.

🔥 సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

🔥వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.

🔥 విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

🔥పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !🔥

ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.

పూర్వులు చెప్పిన దానిని మార్చరాదు🤘

Source - Whatsapp Message