Saturday, October 30, 2021

కాస్త పట్టు విడుపులతో ముందుకు వెళ్ళండి వివాహం చేసుకోండి, జీవితాన్ని ఆనందమయం, సంసార జీవితాన్ని సాఫల్యం చేసుకోండి.

కాస్త పట్టు విడుపులతో ముందుకు వెళ్ళండి వివాహం చేసుకోండి, జీవితాన్ని ఆనందమయం, సంసార జీవితాన్ని సాఫల్యం చేసుకోండి. - ముప్పై సం. దాటితే ముప్పే

ఇటీవల కొద్ది మంది 30, 31, 32, 33, సం. లు దాటినా వివాహం గురించి ఆలోచిస్తూనే అన్వేషణ చేస్తూ కాలయాపన చేస్తున్నారు.

కోరికలు గుర్రాల్లాగా పరిగెత్తడం, గవర్నమెంట్ ఉద్యోగస్తులే కావాలని, ఇద్దరు ఉద్యోగస్టులై ఉండాలని కోరుకోవడం, వాట్సాప్ ఫోటోలపై ఆధారపడటం
ఉద్యోగం ఉన్నా తల్లిదండ్రుల ఆస్తి పాస్తులు బాగా ఉండాలని కోరుకోవటం.

అందచందాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం, కాస్త నల్లగా ఉన్నా , చామన ఛాయ ఉన్నా రిజెక్ట్ చేయడం, తెల్లగా, సన్నగా, నాజూగ్గా ఉండాలని కోరుకోవడం, లావుగా ఉంటే రిజెక్ట్ చేయడం.

బట్ట తల ఉంటే రిజెక్ట్ చేయడం, పట్టింపులు జాతకాల పిచ్చి పెరగటం, కట్నం బాగా రావాలని, కుటుంబం ఆర్ధికoగా బలంగా ఉండాలని, కట్నాలు పెద్దగా ఇచ్చే శక్తి లేకపోవడం.

అబ్బాయిలు లేకుండా అమ్మాయిలే ఉండే కుటుంబం కావాలని కోరుకోవడం, పెళ్లి నిర్ణయంలో తల్లిదండ్రుల పాత్ర తగ్గి పోవడం, దూర భారమని, సొంత జిల్లావారే కావాలనుకోవడం.

ఉద్యోగం చేస్తున్నా సాలరీ హైక్ కొరకు కంపెనీ మారుతూ పెళ్లి వాయిదా వేసుకోవడం, ఫారిన్ వెళ్లి రావాలనుకోవడం, ప్రొఫైల్ బాగున్నా వెళ్లి చూసి రాకుండా వాట్సాప్ లో ఫోటోలు తెప్పించుకొని ,కేవలం ఫొటోలో బాగాలేరని రిజెక్ట్ చేసుకుంటూ పోవడం.

పాపం కొందరు అక్కా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ కొరకు తన పెళ్లి వాయిదా వేసుకోవటం. ఒక్కొక్కరు ఒక్కొక్కరి పై కారణాలతో ఆలస్యం చేసుకుంటున్నారు.

ఈలోపు పుణ్య కాలం కాస్త పోయి 30, 31 , 32 , సం . దాటుతాయి. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా అన్న సామెతలా అవుతుంది.

ముఖం లో గ్లామర్ తగ్గి పోతుంది. లావవుతారు , బొజ్జలు పెరిగి పోతాయి
బట్ట తల వస్తుంది .వయస్సుకు తగ్గ వారు దొరక్క
అవకాశాలు తగ్గి పోతాయి, పెళ్లి కావటం ఇంకా ఆలస్యం ఆవుతుంది. కొన్ని సందర్భాల్లో అనర్ధాలు జరగ వచ్చు .

బాల్య వివాహం వల్ల ఎన్ని ఆరోగ్య పర అనర్ధాలున్నాయో
లేట్ మ్యారేజ్ వల్ల అంతకంటే ఎక్కువ ఆరోగ్య పర, సామాజిక పర అనర్ధాలున్నాయని సైన్స్ చెబుతుంది.

ఏ వయస్సుకు తగ్గ అచ్చట ముచ్చట ఆ వయస్సులో తీరకపోవడం పెద్ద శాపం. లక్షల్లో జీతాలున్నా ,కోట్ల ఆస్తిపాస్తులున్నా జీవితం అడవి కాచిన వెన్నెల్లా వృధా కావడమే.

అందరికి అన్నీ అనుకూలంగా అమరిన సంబంధము దొరకడం కాస్త కష్టమే. మొదట ప్రయత్నం చేయండి దొరికితే మంచిదే. లేనిపక్షంలో సర్దుకుపోవాలి అప్పుడే జీవితం సుఖమయంగా సాగుతుంది వచ్చిన సంబంధం మంచిదా కాదా అన్నది చూడండి. అందం, ఆస్తిపాస్తులు ఇవి అశాశ్వతం అని తెలుసుకోండి జీవితం అశాశ్వతమైనది ఉన్నంతవరకు సుఖ సంతోషాలతో జీవించాలి వంకలు పెడుతూ పోతే పుణ్యకాలం కాస్తా ముగిసిపోతుంది.

సేకరణ

శాశ్వత సంపద

261021H2015. 271021-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

శాశ్వత సంపద
➖➖➖✍️

ఎటువంటి మనిషైనా ఈ భూమ్మీదకు వచ్చి ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు. కొద్దో గొప్పో దివ్య శక్తి సంపన్నుడు కావాలి. ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తం చేసి తిరుగు పయనం కావాలి. అదే అతడి శాశ్వత సంపద.

వేదాలు పదేపదే చెప్పే విషయం…. దేవుడు, మనిషిని పూర్తిగా తన పనిలో ఉంచుకోవాలని నిత్యం అనుకుంటాడు. మనిషి తాను శరీరం తప్ప మరేమీ కాదన్న భ్రమలో ఉంటూ దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు.

శరీరం ఒక ఊబి అంటాడు అరవిందుడు. అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం. ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం. ఇప్పుడైనా శరీరాన్ని (శరీర భావాన్ని) వదిలి ఆత్మ వైపు తిరగడం (ఆత్మావలోకనం) అత్యవసరమని మనిషి గ్రహించి, ఆత్మజ్ఞానం పొందిన రోజునే అతడు దివ్యశక్తి సంపన్నుడవుతాడు.

ఏ అవకరం లేని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ శరీరం నాదని సంతోషంగా చెప్పుకొంటున్నాం. ఈ శరీరాన్ని మనకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా వారికి మనం ఏం ఇవ్వాలి?

మా పని మేం చేశాం, నీ ధర్మం నువ్వు నెరవేర్చు అన్నట్లుగా ఉంటుంది ఈ భూమ్మీద మనిషి జన్మ రహస్యం. శరీరాన్ని చూసి ఆనందపడవచ్చు. అందంగా ఉన్నదైతే మురిసిపోవచ్చు. శరీరాన్ని పోషించి సుఖపెట్టవచ్చు. కాని, ‘ఈ శరీరం దేనికి ?’ అని ఎప్పుడైనా నిజాయతీగా ప్రశ్నించుకోవాల్సిందే.

మానవ శరీరం రావడం అదృష్టం. శరీరం గురించి తెలుసుకుంటూ దాని పరిమిత భావాన్ని పోగొట్టుకోవాలి. శరీరం "నేను" కాదని తెలుసుకోవాలి. శరీర ప్రయోజనం తెలుసుకోవాలి. శరీర బంధం తాత్కాలికమని గ్రహించాలి. ఈ శరీరం ఉపయోగించి ఇతరులకు సాయపడటం, లోకం కోసం మంచి పనులు చెయ్యడం మంచిదే. సందేహం లేదు. ఇలాంటి వారికి శరీరం ఎక్కువ కాలం ఉండాలి. వాళ్లు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి.

పుట్టుక కోసం, మరణం కోసం ఈ శరీరం వచ్చినట్లు కనపడుతుంది అందరికీ. శరీరం తప్ప ఇంకేం లేదన్నట్లు బతుకుతారు కొందరు. శరీరాన్ని ఈడుస్తూ బతుకుతారు మరికొందరు. శరీరం జడం. అది శవం లాంటిది. ‘నీ శవాన్ని నువ్వు మోస్తూ… తిరుగుతున్నావు’ అంటారు రమణ మహర్షి.

నీకిచ్చిన శరీరంతోనే ముక్తిని సాధించి, జీవన పరమార్థం నెరవేర్చుకోవాలి అంటున్నాయి ఉప నిషత్తులు.

అందరూ ముక్తిని సాధించలేరు. ఎంతో కొంత ప్రయత్నం చేసి దివ్యశక్తి సంపన్నులయ్యే అవ కాశం ఉంది అందరికీ.

జీవితాంతం ఈ శరీరంతో తిరుగుతూ ఉంటాం. దారి మార్చి, ఈ శరీరంతోనే మన అంతరంగ ప్రయాణం మొదలు పెట్టవచ్చు. అప్పుడు దివ్యశక్తి తొలకరి మొదలవుతుంది. మనసు సారవంతమవుతుంది. కొంతకాలం తరవాత పచ్చటి ఆత్మ పంట పండుతుంది.

దయతో, ప్రేమతో మన అంతరంగ ప్రయాణానికి వాహనంగా ఇచ్చి, ఆత్మను శక్తిసంపన్నం చేసుకోవడానికి ఈశ్వరుడు ప్రసాదించిన అవకాశమే ఈ మానవ శరీరం అని బోధపడుతుంది.

దివ్యత్వం వైపు మనం వేసే ప్రతి అడుగు భగవంతుడికి ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది.

మన నేత్రాలు ధ్యానం కోసం మూసినప్పుడు అంతర్నేత్రం తెరుచుకోవడం, హృదయంలో జ్ఞానకమలం వికసించడం ఆయనకు పరమానందం కలిగించే అంశాలు.

ఒకనాటి ఉదయం మట్టిలో నాటిన విత్తనం మూడోరోజు మొలకగా కనిపిస్తుంది. నల్లటి కారుమబ్బు వద్దన్నా జలజలా చినుకులు రాలుస్తుంది. ప్రకృతిలో ప్రతీది సహజంగా జరిగిపోయే ఏర్పాటు ఉంది.

జీవితమూ అంతే. అది జీవించడానికే! జీవించడమే గొప్ప సాధన. సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. గొప్పగా జీవిస్తే దివ్యత్వం కనిపిస్తుంది. అష్టాంగ యోగ మార్గాలు, అష్టాదశ పురాణాల్లో మంచి విషయాలు దివ్యంగా జీవించే నరుడి ముందుకొచ్చి దర్శనం ఇస్తాయి.

ఆధ్యాత్మిక సాధన లో యమ-నియమాలు ముందుగా చెప్పి తరవాత సాధన క్రమం అంతా చెబుతారు.

మంచితనం లేనివాళ్లకు యోగం అబ్బదు. చెడ్డవాళ్లకు… ‘ఆలోచనలు’ అడ్డగించడం వల్ల ధ్యానం కుదరదు.

మానసిక పరిశుభ్రత లేనివారికి, ఆరోగ్యదాయకమైన యోగా అనుకూలపడదు.

భక్తి లేనివారికి జ్ఞానం ఒంటపట్టదు. జీవించడంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి.

జీవితం ఈశ్వర ప్రసాదం. భక్తిగా రెండు చేతులు పైకెత్తి దివ్యజీవనాన్ని ఆహ్వానించాలి. ఆటుపోట్లతో, హెచ్చుతగ్గులతో, సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా దైవ ప్రసాదం గా జాగరూకతతో అనుభవించాలి. నిజమైన సాధన ఇదే.

ఊపిరి ఆపడం, భూమిలోకి దిగబడిపోవడం, ముళ్లమీద పడుకోవడం వంటి యోగ సాధనాలు తీవ్ర అభ్యాసం వల్ల వస్తాయి. శరీర అంతర్గత శక్తులు ద్యోతకం అవుతాయి. మేధ వికసించి ఆత్మావలోకనం కలుగుతుంది..

జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధనలో ఉన్నత శిఖరాలకు చేరినట్లే. ఒక దీపం మరోదీపం వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో వెలుగుని నింపాలి. అంతకంటే మనిషి జీవితానికి సార్థకత లేదు. సాధన చేసి సత్యం తెలుసుకున్న మానవుడు ధర్మం గా మంచి పనులకే పూనుకొంటాడు. పూనుకోవాలి.

ఆధ్యాత్మిక జీవితం అనేటప్పటికి అనేక సాధన ల మయం అనే భావన ఉంది. పుట్టుక నుంచి మరణం వరకు జరిగేది సాధనే. ఏం చేస్తున్నామో ఎరుకతో చేస్తే అంతా అద్భుతమైన సాధన. లేకపోతే బతుకే అయోమయం.✍️

. 🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సేకరణ

ఒక భారతీయుడిని హాంగ్ కాంగ్ వాళ్ళు ఏనాడు తమ ఇంటికి భోజనానికి కూడా పిలవలేదు.

ఒక సంవత్సర కాలం హాంగ్-కాంగ్ లో నివసించి,
అక్కడ అందరికీ తలలో నాలుకలా మారిన
ఒక భారతీయుడిని అక్కడి వాళ్ళు ఏనాడు తమ ఇంటికి భోజనానికి కూడా పిలవలేదు.

అతనిని దూరంగానే ఉంచారు.

అతను ఉండబట్టలేక ఒక హాంగ్ కాంగ్ పౌరుడిని అడిగాడు - "నన్ను ఎందుకు మీ ఇళ్లకు భోజనాలకు, పార్టీలకు పిలవరు" అని.

హాంగ్ కాంగ్ పౌరుడు ఒకేఒక ప్రశ్న వేశాడు..
"రెండు వందల సంవత్సరాలు మిమ్మలను ఏలిన బ్రిటిష్ వాళ్ళ మొత్తం సంఖ్య ఎంత ఉంటుంది ?" అని

"సుమారు పదివేల మంది" అని చెప్పాడీ భారతీయుడు

"పదివేల మంది...
32 కోట్ల మందిని అజమాయిషీ చేశారంటే..
సిగ్గు పడాల్సిన విషయం...
మీకు సిగ్గుగా లేదా ?" అని అడిగాడు.

"భారతీయుల ద్వారానే వాళ్ళు 32 కోట్ల మందిని హింసించారు అనేది నిజం."
1) జనరల్ డయ్యర్ 'షూట్' అని ఆర్డర్ ఇవ్వగానే 1300 మంది నిరాయుధులైన, అసహాయులైన భారతీయులను కాల్చిన వారు ఎవరు ?
ఆ సైనికులు మీ భారతీయులు కాదా...?

2) ముస్లింలు మీపై దండయాత్రలు చేసినపుడు... వాళ్లకు సాయపడింది మీ భారతీయులే కదా !

అదే బ్రిటిష్ వాళ్ళు హాంగ్-కాంగ్ మీద పడ్డప్పుడు, వాళ్ళ సైన్యంలో ఒక్క హాంగ్కాంగ్ దేశపు వ్యక్తి లేడు.
ఇది మా దేశ భక్తి.

ఆలోచించకుండా తమ దేశాన్ని తాకట్టు పెట్టే భారతీయులు రెండురకాల నేరాలు చేశారు.👇

i)దేశం కోసం దేనికైనా తెగించే మహావీరులు బహుకొద్దిమంది ఉంటారు. మీరు, మీస్వార్థపూరిత పెద్దలు కలసి, వాళ్లను వేధించి కాల్చుకు తిన్నారు.

ii) మీ దేశ వ్యతిరేకులకు పట్టం కట్టారు.
మీకు మీదేశ పెద్దలనబడేవాళ్లు నేర్పిన పిరికితనాన్ని వంటపట్టించుకుని... మీరు సర్వనాశనమై..
మీ దేశాన్ని కూడా ముక్కలుముక్కలు చేసుకున్నారు.

డబ్బు హోదా ఉంటే.. చాలు !
పరాయివాళ్లను, ఎంత నీచులైనా గౌరవిస్తారు.

మీరూ, మీకుటుంబం...! అంతే !
"లెట్ ద సొసైటీ అండ్ ద కంట్రీ గో టు హెల్"
అనుకుంటారు.
ఎవరైనా వచ్చి మీ కుటుంబం మీద పడి దాడి చేసేంత వరకూ... నాకెందుకు లే అనుకుంటారు. ఎవడో వచ్చి మెత్తగా తంతే.. అప్పుడు బయటకు వచ్చి.. మమ్మల్ని ఎవరూ రక్షించలేదు అని శాపనార్థాలు పెడతారు. కానీ.. అప్పటి వరకూ... తాము ఇంకొకరికి సహాయ పడలేదు అనే విషయాన్ని మాత్రం మరచిపోతారు. అంత నిస్సిగ్గు జన్మలు మీవి. మీరు మా ఇంటికి వస్తే.. మీ బుద్ధులు మాకు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే మిమ్మల్ని మేము.. ఇళ్లలోకి పిలవం.. అని నిర్మొహమాటంగా చెప్పేశాడు.
శాంతి.. సహనం అనే చవట దద్దమ్మ మాటలు కట్టిపెట్టి.. పౌరుషం.. ప్రతీకారం అనే మాటలు వంటబట్టించుకుంటే తప్ప "మీ భారతీయులు.. మీ భారత దేశం" బాగుపడే అవకాశమే లేదు.. అంటూ ముగించాడతడు !!

సేకరణ

Thursday, October 28, 2021

ఇంద్రియ నిగ్రహం

🙏🕉🙏 ...... "శ్రీ"

🌻🌻 "ఇంద్రియ నిగ్రహం" 🌻🌻
🌼🌻🌼🌻🌼🌻🌼
🌼🌻🕉🌻🌼
🌼🌻🌼
🌼

"సృష్టిలో మానవజన్మ ఎంతో క్లిష్టమైనది. అతడు పుట్టడంతోనే అతనిలో మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు. అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు.
ఆ పదకొండులో
1. అయిదు జ్ఞానేంద్రియాలు,
2. అయిదు కర్మేంద్రియాలు, మనసు ఉన్నాయి."

"1.శ్రోత్రం (చెవి),
2.త్వక్‌ (చర్మం),
3.చక్షుషీ (కన్నులు),
4.జిహ్వా (నాలుక),
5.నాసికా (ముక్కు) అనేవి జ్ఞానేంద్రియాలైతే,"

"1.పాయు (మలద్వారం),
2.ఉపస్థ (మూత్రద్వారం),
3.హస్త (చేతులు),
4.పాద (కాళ్లు),
5.వాక్‌ (మాట) అనేవి కర్మేంద్రియాలు.
ఈ పదింటికి చివర మనసు."

"ఇదీ ఇంద్రియసమూహం.
"ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి. ఇంద్రియనిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య."

"ఇంద్రియాలు గుర్రాల వంటివని, రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని, అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని, కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు."

"1.మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి.
2.చర్మం పనికిరాని స్పర్శను కోరుతుంది.
3.కళ్లు అశ్లీలాన్ని చూస్తాయి.
4.నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది.
5.ముక్కు దుర్గంధాలనే స్వీకరిస్తుంది.
6.మల, మూత్రద్వారాలు పనిచేయకుండా పోతాయి.
7.కాళ్లూ చేతులూ హింసను ఆచరిస్తాయి.
8.మాట అదుపు తప్పుతుంది."

"ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తయితే,9.మనసు అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు."

"అసలు పది ఇంద్రియాలను మంచిగాను, చెడుగాను మార్చేది మనసే. మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి."

"అందుకే వాల్మీకి- ‘ఇంద్రియాల సత్‌ప్రవర్తనకు, అసత్‌ప్రవర్తనకు మనసే మూలకారణం’ అని రామాయణ మహాకావ్యంలో అంటాడు."

"చెడు వినకుండా, చెడు కనకుండా, చెడు అనకుండా, చెడు తినకుండా, చెడు ఆఘ్రాణించకుండా ఉండగలిగేవాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం."

"ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి. జ్ఞానం లేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదే."

"అది ఎవరిమీదనైనా పడవచ్చు. నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని, నిప్పును తాకడానికి సాహసించడు. ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు."

"కనుక ఏ పనిచేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం. లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి. ఇంద్రియాలు అదుపులో ఉన్నంతవరకు మనిషి ఉజ్జ్వలంగా వెలిగిపోతాడు."

"1.కళ్లు బాగా కనబడతాయి 2.చెవులు బాగా వినబడతాయి. 3.నాలుక రుచిని గుర్తిస్తుంది 4.ముక్కు వాసనలను పసిగడుతుంది. 5.చర్మానికి స్పర్శ తెలుస్తుంది."

"ఇంద్రియాల్లో ఏ ఒక్కటి అదుపుతప్పినా, అన్ని ఇంద్రియాలూ క్రమంగా పట్టుతప్పిపోతాయి. పర్యవసానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది."

"ప్రకృష్టమైన (విశిష్టమైన) జ్ఞానమే ప్రజ్ఞ. అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం. అది ఉన్నంతకాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది. మెదడును చక్కగా ఉంచుకోవడానికి ‘ఆయుర్వేదం’ ఇలా మార్గోపదేశం చేస్తోంది-"

"1.’పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి. అలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడంవల్ల ఇంద్రియాలన్నీ పటిష్ఠంగా ఉంటాయి. అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది."

"జ్ఞాపకశక్తి వర్ధిల్లుతుంది’.ఇంద్రియాల వెనక ఉన్న ఇంతటి సాంద్రమైన విషయాన్ని మనిషి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి."

"అందువల్ల జితేంద్రియుడు (ఇంద్రియాలను జయించినవాడు) కావాలో, ఇంద్రియజితుడు (ఇంద్రియాలతో ఓడిపోయినవాడు) కావాలో తేల్చుకోవలసింది మనిషే"
🌼🌻🌼🌻🌼
🌼🕉🌼
"శ్రీ"

సేకరణ

మన చిన్నతనం లో

మన చిన్నతనం లో :-

చేతులు షర్ట్ లోపల ఉంచి, నా 'చేతులు పోయాయి' అనేవాళ్ళం

4 రంగుల్లో ఒక పెన్ ఉంటే, అన్నీ బటన్స్ ఒకేసారి నొక్కేసేవాళ్ళం ఏం జరుగుతుందో చూసేందుకు

భయపెట్టడానికి తలుపు చాటున నిల్చునే వాళ్ళం
లోపలకి వచ్చేవారిని #భౌ అని భయపెట్టే వాళ్ళం

నిద్రపోయినట్టు నటించేవాళ్ళం ,అమ్మ నాన్న ఎవరో ఒకరు మంచం వరకు ఎత్తుకొని తీసుకు వెళ్తారు కదా అని.

బస్సులో వెళ్తుంటే , పైనున్న చందమామ మనల్ని follow అవుతున్నదని గుడ్డి నమ్మకం.

రెండు చేతులు చాచి గుండ్రంగా తిరుగుతూ వర్షంలో తడిచేవాళ్ళం

పండులో గింజ మింగి, లోపల చెట్టు మొలుస్తుందేమోనని భయపడేవాళ్ళం

రూమ్ బయటకు పరుగెత్తుకువచ్చి, మరిచింది గుర్తొచ్చి మరల లోనికి పరుగెత్తేవాళ్ళం

గుర్తుందా ! మనం చిన్నప్పుడు ఎంత త్వరగా ఎదిగి పెద్దవుతామా అని కుతూహల పడేవాళ్ళం

పెరిగి పెద్దయిన తరువాత, చిన్నతనం ఎంత బావుండేది అని బాధ !!

బాల్యం జీవితపు అతి మధురమైన జ్ఞాపకం.

ఎందుకంటే మనం ఈ మెసేజ్ చదువుతున్నపుడు తప్పనిసరిగా మన మోహం పై చిరునవ్వు విరిసి ఉంటుంది.

దేవుడు వరం ఇస్తే మరల ఒకసారి మన బాల్యం లోకి పంపు అని కోరుకుంటాము

school జీవితం !!

కేరింతలు కొట్టే స్నేహ సమూహం !!

రంగు రంగుల యూనిఫామ్ !!

చిన్న చిన్న ఫైటింగ్ లు !!

ఆప్యాయంగా చూసే టీచర్లు !!

First love experience లు...!!
Friends పుట్టించే పుకార్లు!

గ్రూప్ ఫోటోలు !!

combined స్టడీలు !!

ఎప్పటికి తరగని Boring పీరియడ్స్
తొందరగా అయిపోయే drill పీరియడ్!!

రోజూ ఉదయం 7-8 అయినా గానీ నిద్ర లేవని నేను, జెండా పండుగ రోజు మాత్రం ఉదయం 4 గంటలకే నిద్ర లేవడం!!

ఎడతెగని వాదోపవాదాలు !!

మిత్రులతోనే చిలిపి తగాదాలు!!

మరిచిపోలేని మార్కుల కాగితాలు !!

భయపెట్టే progress report లు !!

సొంతంగా చేసిన "నాన్న సంతకం"

తప్పుని correct అని వాదించే సొంత ప్రయత్నం !!

అబ్బో.... అదొక గొప్ప ప్రయాణం, మరిచిపోలేని మన బాల్యం!!
ప్రతి మనసులో కరిగి, కన్నీరుగా మారే మధుర జ్ఞాపకం !!

మీ స్నేహితుల మొహంలో చిన్ని నవ్వు కోసం... మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి ..

😊😊😊😊🤣🤣🤣🤣

సేకరణ

వివాహమహోత్సవంలో మూడు ముళ్ల బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.. .

వివాహమహోత్సవంలో మూడు ముళ్ల బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అసలు మూడు ముళ్లు ఎందుకు వేస్తారు. ఏడడుగులకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. మరి వివాహనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం.🙏

వివాహం.. అంటే రెండు మనుషులే కాదు ఇరు కుటుంబాల కలయిక. ముఖ్యంగా హిందు సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహం అనేది జన్మల జన్మల బంధం అని అంటారు. అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు(మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్) అని అంటారు. ఇందులో ప్రాముఖ్యత గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. అయితే తెలుసు ఈ మహత్కార్యం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వివాహంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఘట్టాలు మూడు ముళ్లు, ఏడు అడుగులు గురించి తెలుసుకోవాలి. చాలామందికి వరుడు.. వధువు మెడలో మూడు ముళ్లు ఎందుకు వేస్తాడు. ఏడడుగులకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి.
​మూడు ముళ్లకున్న ప్రాధాన్యత..

మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి వచ్చింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు ఉన్నాయి. సూత్రం అంటే తాడు. అంటే ఆధారమైనది అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి తయారు చేస్తారు. ఆ పోగులకు పసుపు రాసి రూపొందిస్తారు. ఈ తాళిని వరుడు.. వధువు మెడలో మూడు మూళ్లు వేస్తాడు. మంగళ సూత్రధారణ జరుగే సమయంలో వేదపండితులు ఓ మంత్రాన్ని పఠిస్తారు. మాంగల్యం తంతనానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! అనే మంత్రాన్ని పండితులు పఠిస్తూ మహత్కార్యాన్ని పూర్తిచేస్తారు.

​మూడు ముళ్లే ఎందుకు వేస్తారంటే..🙏

హిందూ సంప్రదాయం ప్రకారం మూడు అనే సంఖ్యకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా మూడు అనేవి మంగళకరమని భావిస్తారు. అందుకే మంగళ సూత్రానికి మూడు ముళ్ల వేస్తారు. మానవులకు స్థూల, సూక్ష్మ , కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి. పెళ్లి సమయంలో ఒక్క ముడి ఒక్కో శరీరానికి వేసేది. అంటే భాహ్యశరీరంతోనే కాదు మొత్తం మూడు శరీరాలతో మమేకం అవుతాను అనే అర్థంలో ఈ మూడు ముళ్లు వేస్తారు.

మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత బంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడులనుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రం ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని నమ్ముతారు. అందుకే హిందూ స్తీ మంగళ సూత్రం ధరిస్తుంది. వివాహిత మెడలో మంగళ సూత్రం లేదంటే భర్త చనిపోయినట్లుగా భావిస్తారు.

​ఏడడుగులు ఎందుకు వేస్తారంటే..🙏

మూడు ముళ్ల తర్వాత హోమం చుట్టూ ఏడడుగులు ప్రదక్షిణ చేస్తారు వధువరులు. అంటే జీవిత భాగస్వామితో ఏడు జన్మల వరకూ తోడుంటా అని వాగ్ధానం చేస్తూ ఏడడుగులు వేస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక్కో అడుగుతో ఒక్కో భరోసాను జీవిత భాగస్వామికి ఇస్తున్నట్లు లెక్క.

మొదటి అడుగు.. అన్నవృద్ధికి. అంటే అన్నపూర్ణగా పిలిచే మనదేశంలో పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వేసేది.

రెండో అడుగు.. బల వృద్ధికి.. వధువరుల ఇరు కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలతో ఉండాలని వేస్తారు.

మూడో అడుగు.. ధన ప్రాప్తి కలగాలని వేస్తారు.

నాలుగో అడుగు.. దంపతులిద్దరూ సదా సుఖ సంతోషాలతో ఉండాలని వేస్తారు.

ఐదో అడుగు.. ఒక్క తమ కుటుంబం మాత్రమే కాకుండా సమాజానికి తమ చేతనైన మేరకు సాయం చేస్తామని చెబుతూ ఐదో అడుగు వేస్తారు.

ఆరో అడుగు.. వైవాహిక జీవితంలో ఎలాంటి కలహాలు, అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని వేస్తారు.

ఏడో అడుగు.. శారీరకంగా, మేధో పరంగా పుష్ఠి కలిగిన సంతానాన్ని కలిగించాలని వేసే అడుగు.🙏

సేకరణ

అప్పట్లో అలా... ఇప్పటితో పోల్చితే.... 1990లలో జీవనం ఎలా వుండేది?

అప్పట్లో అలా... ఇప్పటితో పోల్చితే.... 1990లలో జీవనం ఎలా వుండేది? తెలియాలంటే మాత్రం తప్పని సరిగా చదవాలి మరి.

డబ్బుకు ప్రాధాన్యం ఇప్పటి తో పోల్చితే, అపుడు బాగా తక్కువ.

2000 కు ముందు వరుసగా 3, 4 ఏళ్లు కరువు వచ్చినా, బియ్యం, తదితర నిత్యావసరాల ధరలు పెరగలేదు.

విశాలమయిన ఇళ్ళు. అపార్ట్మెంట్స్ దాదాపుగా లేవు.

రోజూ ఇంటికి భిక్షానికి వచ్చి, పెట్టిన అన్నం, కూరా సంతోషంగా తీసుకుని వెళ్ళే వారు.

సంక్రాంతి వస్తుందంటే, పోటీలు పడి అమ్మాయిలు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులేశే వారు.

కేటరింగ్లు లేవు. ఏ శుభకార్యం జరిగినా, బంధువులు పది రోజులు ఉండి, తలా చెయ్యి వేసి, వంటల నుంచీ బట్టలు ఉతికే వరకు అన్నీ చేసే వారు.

పిల్లలకు స్వీట్స్, కారప్పూస అన్నీ ఇంటిలోనే తయారు చేసి, అత్తయ్యలు తెచ్చేవారు.

ఎందరో పిల్లలు బంధువుల ఇళ్ళల్లో ఉంటూ చదువుకునే వారు.

బంధువులు వస్తే రెండు మూడు వారాలు ఉండి వెళ్ళే వారు. వాళ్ళు వెళ్లి పోతుంటే పిల్లలు, వెంటపడి అపుడే వెళ్ళవద్దు అని ఏడిచేవారు. ఇపుడు బంధువులు వస్తున్నారంటే ఏడుస్తున్నారు.

ఎంత దూరమైనా ఊళ్ళో నడిచి లేక సైకిల్ పైనే వెళ్లే వాళ్ళం. ఇపుడు ఇంటి పక్క షాప్ కైనా, బండి తీయాల్సిందే.

సైకిల్ కు హెడ్ లైట్ లేక పొతే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసే వారు. సైకిళ్లకు లైసెన్స్ లు కూడా ఉండేవట.

రిక్షా వాడు బాడుగకు పావలా తక్కువకు బేరమాడితే, ఇంకో పది పైసలు ఇప్పించండి బాబు అని బతిమాలే వాడు. ఇపుడు ఆటో వాడు, చెప్పిన రేట్ కు తక్కువ అడిగాం అనుకో, పడ తిట్టి పోకుండా ఉంటే మన అదృష్టం.

స్కూటర్, లునా, మోఫా ఉండేవి. స్కూటర్ అంటే బజాజ్ చేతక్. బుకింగ్ చేస్కుంటే, 1– 2 years తరువాత వచ్చేది.

ట్రైన్ రావడానికి కొంత ముందు స్టేషన్ కు వెళ్లి, రిజర్వేషన్ అప్పటికి అపుడే చేయించుకునే వారు, దొరుకుతుందో లేదో అని ఆందోళన లేకుండా!

సాయంత్రం ట్రైన్ లో వెళ్తుంటే, స్టేషన్ ల మధ్య గూళ్లకు చేరుకుంటున్న వేల కొద్దీ పక్షుల సందడి కనబడేది, వినబడేది. ఇపుడు ఏమీ లేదు. నిశ్శబ్ధం.

ట్రైన్, బస్ ల లో మనుషులు మాట కలిపి, తెలియని వారయినా కష్ట సుఖాలు చెప్పుకునే వారు. ఇపుడు తెలియని వారితో మాట్లాడితే, ప్రమాదమే!

కుటుంబంకి ఫ్యామిలీ డాక్టర్ ఉండే వారు. ఇన్ని కొత్త రోగాలు, స్పెషలిస్ట్ లు లేరు.

టెన్త్ లో 60% ఫస్ట్ క్లాస్ వచ్చినదంటే చాల గొప్ప.

ఇంటిలో నాయనమ్మ, తాతయ్యలు తప్పక ఉండే వారు.

కూల్ డ్రింక్ అంటే Gold Spot యే!

ప్రతి వేసవి సెలవులు తప్పక అమ్మమ్మ, తాతయ్య ల ఇంటికే. మధ్యాహ్నం చెట్లు ఎక్కడం, కాయలు కోయడం తప్పనిసరి.

నీళ్లు ఎక్కడ ఏ pump క్రిందనైనా త్రాగేసే వారు. వాటర్ ఫిల్టర్ లు లేవు.

వేసవిలో రోజూ సాయంత్రం 7 కు కరెంట్ పోయేది. కిరోసిన్ తో పని చేసే లాంతర్లు, ముగ్గు తో తోమి సిధ్ధం చేసే వారు.

గ్రామాల్లో ఎద్దుల బండ్లు పై సరదా సవారీ.

కోడి కూత తో నే నిద్ర లేవటం. అలారం లు లేవు.

అందరి ఇళ్ళలో నీటి బావులు, వేడి నీటికి బాయిలర్ లు లేక బొగ్గుల కుంపటి ఉండేవి.

ఏడు పెంకులాట, గిల్లీ దండా, దాగుడు మూతలు, గాలి పటాలు, గోళీకాయల ఆటలు, గల్లీ క్రికెట్, కోతి కొమ్మచ్చి, సైకిల్ పందేలు, ఇవే మన ఆటలు.

ఉత్తరాలు కార్డ్, ఇన్లాండ్ లెటర్స్ ప్రధాన సమాచార వారధి. అపుడపుడు ట్రంక్ కాల్ . Telegram వచ్చింది అంటే దడే…అర్ధరాత్రి అయినా వచ్చి తలుపు కొట్టి ఇచ్చే వారు.

Telephone, fridge, TV లు ఉన్నవారు గొప్ప ధనవం

కాలేజీల్లో చదివే పిల్లలకు డబ్బులు పంపాలంటే, money ఆర్డర్ యే గతి. అది తెచ్చిన పోస్ట్ మాన్ కు 2 రూపాయలు బహుమానం!

ఇంటికి పిల్లలు ఉత్తరం రాసి పంపిస్తే, దానిని పోస్ట్ మాన్ యే చదివి, వారికి వినిపించే వారు.

సినిమాకు వెళ్ళడమే గొప్ప ఆటవిడుపు. సినిమా ప్రచారం గూడు రిక్షా, పాంఫ్లెట్లు, పోస్టర్లు.

ప్రసాద్ పెన్, అశోక్ పెన్, హీరో ఫౌంటైన్ పెన్ లు చాలా పేరు గాంచినవి. Reynolds ball పాయింట్ పెన్ అంటే క్రేజ్!

స్కూళ్లకు పిల్లల కోసం గూళ్ళ రిక్షాలు ఉండేవి. 5,6 తరగతులు కు వచ్చారంటే పిల్లలే నడిచి స్కూల్ కి వెళ్లి పోయేవారు. పికప్ డ్రాప్ లు లేవు.

దీపావళి కు పది నుంచి నెల రోజుల ముందే టపాసులు పేలుతుండేవి. తారాజువ్వలు, సిసిండ్రీలు పిల్లలే తయారు చేసుకునే వారు.

గుడులలో హరికథా కాలక్షేపం సర్వ సాధారణం.

Theater కు వెళ్తే, నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ టికెట్లు. Theater లోపల సిగరెట్లు బీడీలు కాల్చుతు సినిమాలు చూసే వారు. అలానే ట్రైన్స్, హోటల్స్, బస్ ల లో కూడా యధేచ్చగా…

సినిమా పాటలకు లిరిక్స్ పుస్తకాలు పావలకు అమ్మేవారు.

పౌరాణిక, కుటుంబ, సామాజిక, భక్తిరస చిత్రాలదే రాజ్యం.

పెద్దలకు వార్తా పత్రిక లు ఈనాడు, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ, ఉదయం, వార్త, ప్రజా శక్తి. పిల్లలకు: చందమామ, బొమ్మరిల్లు, బాల జ్యోతి. గృహిణులకు: ఆంధ్ర భూమి, స్వాతి వారపత్రిక లు. యువకులకు: యువ, స్వాతి మాస పత్రికలు. పెద్దవారికి Readers Digest. ప్రభుత్వ ఉద్యోగార్థులకు Employment News Weekly.ఇలా!

వార్తలంటే రేడియో, సినిమా పాటలంటే శుక్రవారం సాయంత్రం 7 గంటలకు, అరగంట చిత్ర లహరి .సినిమా అంటే నెల కో, రెండు నెలలకో DD National లో వచ్చే తెలుగు సినిమా వచ్చేది.
దసరా, సంక్రాంతి పండక్కి ఫ్రెండ్స్ తో కలసి సరికొత్త సినిమాలు చూడటం అదోక గమ్మత్తైన సరదా.
ఎవరైన ఫ్రెండ్స్ తను చూడని సినిమా చూసివుంటే వారితొ ఆ సినీమా కథ అడిగి మరీ చెప్పించు కోవడం మహా సరదా.
ఇలా గమ్మత్తైన విషయాలు ఎన్నో, ఎన్నేనో..అప్పటి రోజులు గడిపిన వారికి మరుపురాని మధురానుభూతులు.ఆ పాత మధురాలు...తిరిగి రాని అమృత్సోవాలు.
కాదంటారా ఫ్రెండ్స్!అవునంటారని నా భావన.
సమయం పెట్టి చదివిన మీకు అభినందనలతో ...

సేకరణ

పుత్రోత్సాహం* *(కొత్త రకం కథ🙂)* ఆదర్శవంతుడైన ఒక కొడుకు కధ! ఎందరో స్ఫూర్తిగా తీసుకోవలసిన ఒకనీతికథ!

పుత్రోత్సాహం
(కొత్త రకం కథ🙂)


"అమ్మా ! నువ్వు ఇలా నిర్లిప్తంగా కూర్చుని ...నీ ప్రమేయం లేదు అన్నట్టుంటే ...నాకు కాళ్ళూ చేతులు ఆడటం లేదు! నాన్నలేని లోటు పూరించడం కష్టమే కానీ ,నీ మౌనం భరించడం ఇంకా కష్టంగా ఉంది !అన్ని ఏర్పాట్లు చేసినా ఇంకా ఏదైనామిస్ అయ్యామేమోనని మనసు పీకుతోంది. 12వ రోజు సమారాధన కోసం నాన్నకు ఇష్టమైన ఐటమ్స్ కొన్నిపురమాయించాను! నువ్వు కూడా కొన్ని విషయాలు చెప్తే నాకు బాగుంటుంది!....".... కొడుకు సురేంద్ర మాటలకు దీర్ఘంగానిట్టూర్చింది వర్ధని!

" నాకేం తెలుసురా ఏం చెప్పాలో !ఇన్నాళ్లు నాన్న ఏది చెప్తే అదే మనం చేసాం. ఆయన ఈ లోకాన్ని విడిచి పోయినాఆయన ఇష్టాయిష్టాలు ఇంకా నువ్వు గౌరవిస్తున్నావ్ అంటే ,అది మా పూర్వజన్మ సుకృతం! నీకు ఏది బాగుంది అంటేఅదే చెయ్యి నాయనా!"

" ఆయనతోనే నా జీవితం అయిపోయింది. 45 ఏళ్ల దాంపత్యంలో చిన్నపిల్లలా ఆయన చిటికెన వేలు పట్టుకునితిరుగుతూనే ఉన్నాను. ఆయన ఏది మంచిది అంటే అదే చేశాను. నాకంటూ ప్రాథమ్యాలు ,ప్రాధాన్యతలు ఉంటాయనికూడా నాకు తెలియదు !సుమంగళి గా ఉండాలని పూజలు చేశాను ,నోములు నోచాను. ఇహ ఆ భాగ్యములేకుండాపోతోంది !నన్ను బోడమ్మను చేసి ఇంట్లో కూర్చో పెడతారు! ".. ‌ ఆఖరి మాటలు అంటుంటే దుఃఖం తన్నుకొచ్చిందివర్ధనికి!

తల్లి మాటలకు కలతచెంది ఆర్ద్రతతో ఆమె తలను తన చేతులతో చుట్టి, గుండెకు పొదువుకున్నాడు కొడుకు! " నాన్నలేకపోతే ఏంటమ్మా నేనున్నాను కదా నీకు !నేను అన్నీ చూసుకుంటాను !బెంగ పడకు!"... అంటూ మాటిచ్చాడు సురేంద్ర!

బంధుమిత్రులు ,ఇరుగుపొరుగు లు ఎంత ముఖం చిట్లించినా... తన తల్లి తన మంగళ చిహ్నాలను తీయడం లేదనిసుస్పష్టం చేశాడు!. ఎందుకో ఆమెకే మనసొప్పక మంగళసూత్రాలు ,నల్లపూసలు ,మట్టెలు తీసేసింది వర్ధని!

తల్లిని దర్జాగా తీసుకువచ్చి తండ్రి కూర్చునే సోఫా లో కూర్చోబెట్టాడు సురేంద్ర! వచ్చినవారు చేసేదిలేక కాస్త జీలకర్ర నోట్లోవేసుకుని ,ఆమెను పలకరించి భోజనాలకు లేచారు!

సురేంద్ర అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ గా ప్రభుత్వంలో లో ఉన్నత పదవిలో ఉన్నాడు. అతనితో పనులు చేయించుకున్న వారు,పనులు ఉన్నవారు ,ఉపకారాలు పొందినవారు అతని దృష్టిలో పడడానికి...ఇదో ఒక మంచి అవకాశంగా భావించారు! బస్తాలతో కూరలు బుట్టల తో పళ్ళు డబ్బాలతో నేతి స్వీట్లు, మిఠాయిలు,
కేన్ల కొద్దీ పాలు ,పెరుగు లు ,నెయ్యి లు, బస్తాలతో బియ్యం ,అపరాలు ఒక్కటేమిటి అవసరానికి మించి వంద రెట్లు తెచ్చిపడేసారు ఇంటినిండా! ఎవరేంటి తెచ్చినా కాదనలేదు సురేంద్ర! పరోక్షంగా అవి కొందరు అసహాయుల పోషణార్ధం పనికి వస్తాయనుకున్నాడు!

దాన ధర్మాలు ,బ్రాహ్మణ దక్షిణలు ...భూరిగా ఇచ్చుకుని...నలుగురు ‘ఆహా ‘అని అనుకునే లాగా పూర్తిచేశాడు పితృకార్యాన్ని సురేంద్ర! ఇంటి పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ లో వెయ్యి మందికి పైగా సంతర్పణ భోజనం చేశారు! మరో వెయ్యిమందికి వండించి, శివార్లలో ఉన్న వృద్ధాశ్రమాలకు పంపించాడు సురేంద్ర! మిగిలిన సామానులు...కొంత విరాళం జోడించి..‌పిల్లలహోమ్ కు పంపేసాడు!



రెండు రోజుల్లో ...బంధువుల నిష్క్రమణతో... ఇల్లు ఖాళీ అయిపోయింది! సెలవు అయిపోవడంతో కూతురు ఢిల్లీకిప్రయాణం కట్టింది! వెళ్లేముందు పదేపదే తల్లి చుట్టూ తిరుగుతూ..." నాన్న నా గురించి ఏదైనా చెప్పారా ?నువ్వుచెప్పాల్సింది ఏమైనా ఉందా అమ్మ.. ".. అంటూ అన్యాపదేశంగా ఏదో అడగాలని అని ప్రయత్నిస్తోంది! తల్లిని తనతోరమ్మని అడిగే ధైర్యం ఆమె చేయలేకపోతోంది! ఆ మహానగరంలో తల్లికి అదనపు సౌకర్యాలు కలగజేసే పరిస్థితులుఆమెకు ప్రస్తుతం లేవు! పైగా కొండంతా కొడుకు అండ వదిలి తల్లి తనతో వస్తుందన్న ఆశ కూడా ,ఆమెకు లేదు!

వర్ధనికి కూతురు ఆంతర్యం అర్థమయ్యింది! కోడల్ని పిలిచింది! " స్వర్ణా! లాకర్ లో ఉన్న నా బంగారాన్ని నువ్వు సగంతీసుకుని , మిగిలిన సగం మీ ఆడపడుచు కియ్యి".. ‌ అంటూ బ్యాంకు లాకరు తాళం కోడలు చేతిలో పెట్టింది! " బంగారంలో సగమే అంటే.. ఈ ఇంట్లో కూడా నాకు సగం ఇచ్చి తీరాలి".... అంటూ... మొహం గంటు పెట్టుకుంది కూతురుధరణి!

వర్థని జవాబిచ్చే లోగానే, సురేంద్ర అక్కడ ప్రత్యక్షమయ్యాడు! స్వర్ణా! అమ్మ కు తాళం ఇచ్చేసేయ్! ధరణి! అమ్మ ఇప్పుడుబంగారం పంచేసేది ఏమీ లేదు! అవన్నీ అమ్మకు కావాలి! నాన్న పోవడంతో, అమ్మ జీవితమేమీ ముగిసిపోలేదు! ముందు ముందు... తన చేతుల మీద జరగాల్సిన శుభకార్యాలు ఉన్నాయి! ఈ ఇల్లు కానీ, ఈ నగలు కానీ ...అమ్మ తనచివరి క్షణం వరకు అనుభవించి ..తన తదనంతరం ఆమె కోరుకున్న వారికి ఇచ్చే హక్కు... పూర్తిగా తనదే! ఢిల్లీలో నీ ఫ్లాట్కోసం పదేళ్ల క్రితమే డబ్బు తీసుకున్నావు! ప్రస్తుతం అమ్మకు మిగిలి ఉన్న ఈ కాస్త ఆస్తి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు! ఇంటి ఆడపిల్లగా నీకు న్యాయమే చేస్తాం! నీ పుట్టింటి మీద నీకున్న హక్కులన్నీ అలాగే భద్రంగా ఉంటాయి! ఆనందంగావస్తూ పోతూ... పసుపు కుంకుమలు తీసుకుని వెళ్ళు! అమ్మని మాత్రం బాధ పెట్టొద్దు ఏవిధంగాను!".... కాస్త గట్టిగాచెప్పాడు సురేంద్ర!

పక్క గదిలో పెట్టెలు సర్దుకుంటున్న అల్లుడికి ఈ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి! వచ్చినప్పటి నుండి చూస్తున్నాడు... సురేంద్ర ఎంత శ్రద్ధగా పితృకార్యం చేసాడో, ఎంత ఆత్మీయంగా తల్లినీ, ఇతర బంధువులనూ ఆదరిస్తున్నాడో! తల్లి పట్లసురేంద్ర చూపిస్తున్న ప్రేమ... తన నిబద్ధతను నిలదీసినట్టు గా అనిపించింది అల్లుడికి!

ఉద్యోగంలోనూ ,హోదా లోను ,ఆస్తి లోనూ సురేంద్ర కు ఏ మాత్రం తక్కువ కాదు తను! కానీ ,తండ్రి పోయినపుడుఅపరకర్మలన్నీ “ మమ” అనిపించి, గయలో పిండం పెట్టి చేతులు దులుపుకున్నాడు! ఒక్కగానొక్క కొడుకు గా తన తల్లినిఆదరించక పోగా, అన్ని వసతులు ఉన్న రిటైర్మెంట్ హోమ్ లో పెట్టి తన బాధ్యత తీరింది అనుకుంటున్నాడు! భార్య చేతిలోతోలు బొమ్మలా ఆడుతూ తల్లిని దూరం చేసుకున్నాడు తను!

ఈరోజు సురేంద్ర మాటలు వింటుంటే, అతనిలో..మాతృ వాత్సల్యం నిద్ర లేచింది !ఏదో దిశానిర్దేశం జరిగినట్లుఅనిపించింది!

దిగ్గున లేచి పక్క గదిలోకి వెళ్ళాడు! సురేంద్ర భుజంమీద స్నేహంగా చేతితో తట్టి ,” సురేంద్ర నువ్వు చెప్పింది అక్షరాలనిజం !నీ లాంటి కొడుకు ఉంటే ,ఏ తల్లి అయినా భర్త లేకపోయినా...నిబ్బరంగా గుండెల మీద చెయ్యి వేసుకునిబ్రతకగలదు! చెప్పాలంటే ధరణికి ఏమి లోటు లేదు! ఇలా తండ్రి పోయిన వెంటనే పుట్టింట్లో తన హక్కులనుసాధించుకోవడం అంత మంచి పని కాదు! తన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను! అత్తయ్య గారు! మీరు ఎలాంటిబెంగ పెట్టుకోకుండా హాయిగా ఆరోగ్యంగా ఉండండి !మేము ప్రతి రోజు మీతో మాట్లాడుతూ ఉంటాం! ఏ అవసరం వచ్చినా,ధరణి మీకు సహాయం గా వస్తుంది !ఇది నా మాటగా తీసుకోండి!".. ‌‌ మనసు నిండుగా, ఆదరంగా మాట్లాడిన అల్లుడినిచూసి చాలా నిశ్చింతగా అనిపించింది వర్ధనికి!

మర్నాటి కల్లా ధరణి వెళ్ళిపోయింది! తల్లికి... తమ ఇంట్లో ..గాలి ,వెలుతురు ధారాళంగా వచ్చేటటువంటి ..మంచిగదినిఅన్ని సౌకర్యాలతో... తయారుగా ఉంచమని ...స్వర్ణను, పిల్లలను ఇంటికి పంపేసాడు సురేంద్ర! తల్లి కొడుకుల మాత్రమేమిగిలారు ఆఇంట్లో! ఆ రాత్రంతా తండ్రి స్మృతులను తల్లి తో వల్లె వేశాడు సురేంద్ర! మౌన శ్రోతగా అన్నీ వింటూకూర్చుంది వర్ధని! ఆ స్మృతులలో వీలయినన్ని మంచివే ఏరి మాట్లాడుతూ, ఎన్నో చేదుజ్ఞాపకాల ప్రసక్తే తేని కొడుకుసంస్కారానికి ముగ్దురాలయింది ఆమె!

ఆమె మరో ప్రస్థానం లో మొదటి ఉషోదయం అయ్యింది! ఆరింటికి తల్లి ఇచ్చిన కాఫీ తాగి....

" అమ్మా! కావలసినవన్నీ సర్దేసు కొన్నావు కదా! మరో గంటలో బయలుదేరాలిమనం! ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లోనైనాఆఫీస్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది! "... అన్నాడు సురేంద్ర!

కొన్ని క్షణాల మౌనం తరువాత...." నేను కొన్నాళ్ళు ఇక్కడే , మన ఇంట్లో ఉందామని అనుకుంటున్నానురా! ఇల్లుపాడుపెట్టడం నాకు ఇష్టం లేదు"... తడబడుతూ చెప్పింది వర్ధని కొడుకుతో!

" ఇల్లేమీ పాడవదు అమ్మా!పని వాళ్ళని పంపి బాగు చేయిస్తూ ఉంటాను! నువ్వు ఒక్కతివే ఒంటరిగా ఇక్కడ ఉండలేవు !నాన్న జ్ఞాపకాలు నిన్ను వదలవు !నువ్వు మాతో ఉండడమే సరి !నాకు కూడా చాలా నిశ్చింతగా ఉంటుంది!"...అన్నాడుసురేంద్ర!

" లేదు నాన్నా.. నన్ను అర్థం చేసుకో! నేను ఉండగలను! కొత్తమార్పులను వెంటనే తీసుకోలేను! నాకు కొంచెం సమయంకావాలి! ప్లీజ్!".... అంటూ బేలగా అభ్యర్ధించింది కొడుకును!

బేలగా అన్నా...తల్లి మాటల్లోని దృఢత్వాన్ని గుర్తించాడు అతను! తన మాటలతో ఆమె నిర్ణయం వీగిపోదని అర్థంఅయింది! ఎక్కువ రెట్టించకుండా..." సరే అమ్మా! నీ ఇష్టం! ఏ అవసరం ఉన్నా క్షణాల్లోనే నీ ముందుంటా!".... అని, తల్లికిమాటిచ్చి సురేంద్ర కూడా వెళ్ళిపోయాడు!

ఇల్లు ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయింది! పెద్దగా దిగులు అనిపించలేదు వర్ధనికి!తోటలోకి వెళ్ళింది. అడ్డదిడ్డంగాపెరిగి, వ్యాపించిపోయిన కొమ్మలతో... రకరకాల మందారాలూ, నిత్యమల్లిచెట్లు! వందేళ్ళనాటి ఫలసాయం లేని చెట్లు... తోటంతా నీడలు పరుస్తూ! ఆ చెట్ల వలన ఇరుగుపొరుగులతో శాశ్వత శతృత్వాలు! అయినా మారని భర్త మొండివైఖరితలుచుకుని భారంగా నిశ్వసించింది వర్ధని.

ఎంత విచిత్రమయిన మనిషో ఆయన. తా పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అనే వ్యవహారం! పురాతనమయినభావాలూ, ఆచారాలు! పొదుపు పేరిట అతికూడిక... ఇంటి ఆడపడుచులకు కూడా పూతికపుల్ల ఇవ్వనంత! అత్తగారిఇత్తడిసామాన్లు, రాచ్చిప్పల్లోవంట. పెళ్ళయిన ఇరవై యేళ్ళకు వరకూ కుంపటి వంటే! ఆరోగ్యం పేరుచెప్పి పత్యపు తిండి. నెలకు కేజీ నూనె వాడకం కూడా ఎక్కువే! తన పుట్టిల్లు మధ్యతరగతయినా... సుష్టుగా అన్ని అధరువులతో భోంచేసేభోజనప్రియులు! “

“కొడుకు చేతికందే వరకూ ..ఏడాదికి మూడుచీరలే! పోనీ లేదా పోదా అంటే... ఎగువమధ్యతరగతి నేపధ్యం. మంచిజీతమొచ్చే ప్రభుత్వ ఉద్యోగం! తన అభిప్రాయాలసాధనలో ఒకరకమైన నిరంకుశత్వం ఆయనది! తనకంటూబంధువులూ, స్నేహబాంధవ్యాలూ నెరిపే అవకాశం ఇవ్వకుండా... ఇంటిని పుస్తిని చేసిన మహానుభావుడు ఆయన!”

“మెరిట్ లో మెడిసిన్ లో సీట్ తెచ్చుకున్న సురేంద్రను , డాక్టర్ అవ్వడానికి పదేళ్ళు పడుతుందని, మెడిసిన్చెయ్యనివ్వకుండా, బలవంతంగా బీ. ఫార్మసీ లో పెట్టారు. ఇరవై యేళ్ళకే ఇంట్లోంచి బయటకెళ్ళిపోయి, స్కాలర్ షిప్స్, పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తూ, తండ్రి నుండి ఆర్ధికసహాయం ఆశించకుండా ఎంతో పైకి వచ్చాడు కొడుకు. తండ్రి దూరంచేసుకున్న బాంధవ్యాలను తన ఆత్మీయతతో దగ్గర చేసుకున్నాడు. తను జీవితంలో ఎదుగుతూ, ఎందరికో చదువులకూ, ఉద్యోగాలకూ చేయూతనిచ్చాడు. “

“చెప్పాలంటే కొడుకుని చూసే ఇప్పుడు తమను బంధువులు గౌరవించే స్థాయికి , నైతికంగా , సామాజికంగా ఎదిగాడుసురేంద్ర! కూతుర్ని నెత్తిమీద దేవతలా చూస్తూ, ఆడింది ఆట పాడింది పాటగా సాగించి... కొడుకును మాత్రం ఆంక్షలసంకెళ్ళతో అనుక్షణం క్రమశిక్షణ పేరిట దండిస్తూ, అవమానిస్తూ ఉన్న తండ్రికి ఎప్పుడూ గౌరవం తక్కువ చెయ్యలేదు ! తండ్రి మూర్ఖత్వం, నిరంకుశత్వం వలన తను ఎన్నో కోల్పోయినా, ఒక్కరోజూ తండ్రిని ద్వేషించలేదు! ఆయన ఇన్నేళ్ళకుకళ్ళుతెరిచి, వాడి మంచితనం అర్ధమయ్యి, కాస్త మృదుత్వం అలవాటుచేసుకుని, కొడుకుతో అనుబంధం పెంచుకునేసమయానికి ... మనిషే లేకుండా పోయారు! “....వర్ధని ఇలాంటి ఆలోచనలతోనే రోజులు గడిపేస్తోంది.

“ఇప్పుడు తనకు కావలసినది వండుకునే స్వేచ్ఛ ఉంది. కానీ తినడానికి మనసే లేదు. ఎక్కడికయినా వెళ్ళే స్వతంత్రంఉంది. కానీ ఎక్కడికెళ్ళాలో తెలీదు. “ఎంత పరాధీన తను! “.... వేము తిన్నంత చేదు ఆమె మనసులో! వారం కన్నాఎక్కువ ఉండలేకపోయింది ఆ ఇంట్లో ఒంటరిగా! దానికి పరిష్కారమూ సురేంద్రే చేసాడు.

మంచి ప్రణాళికతో... అన్ని ఏర్పాట్లూ చేసి, వర్ధనినీ, తమతోనే వుండే అత్తగారినీ, ధరణి అత్తగారినీ, ఇద్దరుమేనత్తలనూ...కాశీ, ప్రయాగ, చార్ ధామ్, వైష్ణోదేవి యాత్రలకు పంపించే ఏర్పాటుచేసాడు!

భర్త పోయి నెలరోజులవ్వక మునుపే యాత్రలంటే లోకం నవ్వుతుందని... వర్ధని ససేమిరా అనేసింది. సురేంద్ర తల్లితోఒకటే అన్నాడు! “ అమ్మా! జీవితం చాలా చిన్నది. ఇప్పటికే అరవైయేళ్ళు అసఫలంగా , పంజరంలోచిలుకలా...గడిపేసావు. . ఇక నుంచి ప్రతిక్షణం, నువ్వు కోల్పోయిన కాలాన్ని వెనక్కు తెచ్చుకోవాలి! చేద్దామనుకున్నవీ, చూద్దామనుకున్నవీ మొదలుపెట్టాలి! నీకు నేనున్నానమ్మా! జీవితం మళ్ళీ మొదలుపెట్టు!!వెళ్ళిపోయిన వారి గురించివగస్తూ కూర్చుని లాభం లేదు! “..... అంటూ తల్లికి ధైర్యం చెప్పాడు! వర్ధనికి తన జీవితంలో రెండవ అధ్యాయంమొదలయ్యింది!

రెండునెలల యాత్రలు, మరో రెండునెలలు ధరణి దగ్గర గడిపాకా.... సంతృప్తి చెందిన మనసు, మొట్టమొదటిసారిలోకాన్ని చూసిన ఆనందం, తన చుట్టూ ఇంత నాగరికత ఉందా అన్న విభ్రమంతో తిరిగివచ్చింది వర్ధని.

ఇల్లు బాగుచేయిస్తున్నానని, తల్లిని తమింట్లోనే పెట్టాడు సురేంద్ర! స్వర్ణతల్లి విద్యావంతురాలు, మంచి క్రియాశీలకురాలు. వర్ధనికి ఓపిగ్గా వివరిస్తూ...ఫోన్ లో ఫేస్ బుక్, వాట్సప్ పరిచయం చేసింది. ఎందరో పరోక్ష మిత్రబృందాలతో, సాహితీసౌరభాలతో వెల్గులీనే ఫేస్ బుక్ వర్ధనికి చక్కని కాలక్షేపంగా మారింది. కొడుకు సేకరించిన ఎన్నో అపురూపమయినపుస్తకాల నిధి మరో పెన్నిధి అయ్యింది ఆమెకు. భర్త తనలో పెంచి, పోషించిన నిర్లిప్తత, నిరాశ, విరక్తి.... మెల్లమెల్లగాకరిగిపోతున్నాయి! జీవితం నవనవోన్మేషంగా మారుతోంది. పిల్లలూ, పువ్వులూ, పుస్తకాలూ, పరిసరాలూ ఎన్నోనేర్పుతున్నారు!

తండ్రి సంవత్సరీకాలు కూడా ఎంతో శ్రద్ధగా పూర్తిచేసాడు సురేంద్ర! మాఘమాసం రాగానే, “ రా అమ్మా! నీ ఇల్లుచూసుకుందువు గాని”.... అంటూ వర్ధనిని బయలుదేరదీసాడు! ఆ వీధిలో బీటలువేసిన , నాచుపట్టిన గోడల్లోంచిరావిచెట్లు తొంగిచూస్తూ, అడవిలాంటి తోటతో , దిష్టిబొమ్మలా ఉండే తమ ఇల్లు.... ఎంతో అందంగా, అధునాతనంగా, విశాలంగా తయారయ్యి ఉండడం చూసి, ఆమె సంభ్రమమొందింది. ముందుగా ఆమెను ఆకర్షించినది నందన వనంలాంటి తోట.

“ అయ్యో! మామిడిచెట్టు, చింతచెట్టు ఏవిరా?”.... అంది కొడుకుతో! “ అమ్మా! నేను కొన్నిరోజులు వాటితో మాట్లాడానమ్మా. మీరు పెద్దవారయిపోయారు. మీవలన ఈ స్వార్ధపూరిత అనాగరికులకు ఇబ్బందిగా ఉంది. మీ అనుమతితోమిమ్మల్ని తొలిగించవచ్చా! మీ కొమ్మలకు అంట్లు కట్టించి... నా తోటలో మీ వంశాన్ని కొనసాగిస్తా!”.... అంటూ వాటినిప్రార్ధించేవాడినమ్మా! నమ్మూ, నమ్మకపో.... అవి రెండునెలల్లో వృద్ధాప్యం వచ్చినట్టు పూర్తిగా వడలిపోయి, మోడులయ్యాయి! అప్పుడే వాటిని కొట్టించి, ఆ కలపంతా మనింటికే వాడాను. “ అన్నాడు సురేంద్ర! వర్ధనికి ఏమీఆశ్చర్యం అనిపించలేదు. కొడుకు అచ్చం తన పోలికే! కష్టమొచ్చినపుడు ఆ మాకులతోనే పంచుకునేది. అవి కూడా విన్నట్టేఉండేవి!

క్రింద మూడు, పైన మూడు అత్యంత సౌకర్యకరమైన పడకగదులు వేయించాడు. లేలేత భానుకిరణాలుపడుతుంటే ధ్యానం చేసుకోవడానికి అనువుగా చక్కని సన్ రూమ్ , తను కోరుకునే విధంగా... విశాలమయినపూజామందిరం, అందమైన తంజావూరు దేవతామూర్తుల పటాలతో మనోజ్ఞంగా చేయించాడు! అన్నిటికన్నా మిన్న వంటగది! మొత్తం అధునాతనంగా, సౌకర్యంగా! ఆనుకున్న పాంట్రీలో.... అన్ని వరుసల్లో... రకరకాల సైజుల్లో... అమర్చినస్టీలుడబ్బాలను, గాజుసీసాలను చూసి... వర్ధని కళ్ళలో మెరుపు, పెదాల మీద చిన్నచిరునవ్వు మెలిచాయి! ఇవన్నీభర్తహయాంలో తన తీరని కోరికలు!సరుకులన్నీ చిన్నచిన్న పొట్లాలు కట్టించి,చెక్కబీరువాలో పెట్టించి తాళం వేసే వారాయన...తను దానధర్మాలు,దుబారా చేస్తుందని!

“నా కొడుక్కు అన్నీ తెలుసు తన గురించి! తన మనసులోని ప్రతి భావన, స్పందన, కోరిక, ఉద్వేగం...సమస్తం ఎరుకే ఈ పిల్లవాడికి!”... అనుకుంటూ ఆ అమ్మమనసు పుత్రవాత్సల్యంతో ఉప్పొంగిపోయింది!

ఒక మంచిరోజు తల్లిని యజమానురాలి హోదాలో... గౌరవంగా ...తమజంటతో సమానంగా ,పీటలమీదకూర్చుండపెట్టి గృహప్రవేశం చేయించాడు సురేంద్ర! తండ్రి తదనంతర ఆస్థులన్నీ తల్లి పేరిటకు మార్పించాడు! వర్ధని, స్వర్ణ తల్లితో పాటూ... ధరణి అత్తగారు కూడా ఆ ఇంటికే మారిపోయారు! ఇంట్లో పనులకు, వంటకు హెల్పర్స్ ను పెట్టాడు. వారికి సౌకర్యవంతంగా ఉండే విశాలమైన కారు కొని, డ్రయివర్ తో సహా, గుమ్మంలో పెట్టాడు! మేడమీద కు స్వర్ణా,పిల్లలతో... దిగిపోయాడు!

గృహప్రవేశం నాడు మేనత్తలు ముగ్గురినీ పిలిచి, వారు గతంలో అన్నగారిని అడిగి, భంగపడ్డ తమ తల్లిగారిబంగారం, మూడెకరాల భూమిపత్రాలు వారి చేతిలో పెట్టి,...” అత్తా! ఇది మీ అందరి ఇల్లూ కూడా! మీకు కావలసినన్నిరోజులు ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకోండి. మీకు ఏ అవసరానికయినా ఈ మేనల్లుడు ఉన్నాడని మర్చిపోకండి!”.... అంటూ ఆప్యాయంగా చెప్తుంటే.... వాళ్ళు కన్నీటితో...పరమానందభరితులయ్యారు!

“ వదినా! నీ కడుపున రాములవారే పుట్టారు వీడి రూపాన! మా అన్నయ్యకు ఈ పుత్రోత్సాహం చూసే యోగం లేదు. వీడిని రాముడని ఎందుకు అన్నామంటే, ఒకవేళ దశరధుడు , కౌసల్య తన తోనే ఉండివుంటే....సంపద ఉన్నా, లేకపోయినా... అయోధ్యలో నయినా , అడవిలోనయినా రాములవారు తల్లితండ్రులను ... అదే ప్రేమతో, వైభవంతో,అక్కరతో....లోటనేది రానీయకుండా చూసుకుని వుండేవారు నీ కొడుకులా!”...అంటూ... ఆ కన్నతల్లి కడుపుసంతోషంతో నింపేసారు!

ఆ విధంగా తల్లికి స్వయంప్రతిపత్తిని కల్పించి, సాధికారంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా బ్రతకడానికి మార్గం సుగమంచేసిపెట్టాడు సురేంద్ర! తల్లి మనసులో తండ్రిచేసిన ప్రతి అవమానాన్ని, ప్రతిగాయాన్ని తన బాధగా అనుభవించాడుఅతను ఇన్నాళ్ళూ! తనకు శక్తి ఉన్నా... కొడుకు స్వార్జితంతో పూతికపుల్ల కూడా ముట్టననే తండ్రిఅసహనంతో,విచిత్రవైఖరితో సర్దుకుంటూ...అతను పడ్డ మనక్షోభ ఇన్నాళ్ళకు ఉపశమించింది. ఆయనకు సజీవంగా ఏమీచెయ్యలేకపోయినా , ఆయన మరణానంతరం ఆయన పేరిట పేదవిద్యార్ధులకు స్కాలర్ షిప్, వృద్ధాశ్రమాలకు విరాళాలరూపంలో ఇస్తూ... పితృూణం తీర్చుకుంటున్నాడు!

ఇది మలుపులున్న కధ కాదు! కానీ ఆదర్శవంతుడైన ఒక కొడుకు కధ! ఎందరో స్ఫూర్తిగా తీసుకోవలసిన ఒకనీతికథ! తల్లిదండ్రులు, సమాజం నాకేమిచ్చిందని... ప్రశ్నించకుండా... ‘వీరికి నేనేమి చెయ్యగలను’... అని ఆలోచిస్తూ , బాధ్యతలు సక్రమంగా, సంతోషంగా నిర్వహిస్తూ, కార్యాచరణలో పెట్టే క్రియాశీలి కధ!

పుత్రోత్సాహము తండ్రికీ

పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా

పుత్రుని కనుగొని బొగడగా

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

శుభం
💐🌹🙏🌹💐

సేకరణ

విజయం పట్ల మీకే సందేహాస్పదంగా ఉన్నప్పుడూ ఈ క్రింది సూత్రాలు పాటించమని బోధిస్తాడు చాణక్యుడు.

విజయం పట్ల మీకే సందేహాస్పదంగా ఉన్నప్పుడూ ఈ క్రింది సూత్రాలు పాటించమని బోధిస్తాడు చాణక్యుడు.

1. మీదైన విజయాన్ని సాధించాలనుకున్నప్పుడు,
ఎప్పుడు తప్పులు సరిదిద్దుకోవడానికి సిద్దంగా ఉండాలి.

మీ దారిలో విజయం తారసపడదని మీకు సృష్టంగా తెలిసినప్పుడు మరింత మంచి మార్గాన్ని ఎన్నుకోవడంలో తప్పేమీ లేదు. విజయాన్నివ్వలేని మార్గాన్ని తక్షణం విడిచిపెట్టాలి.

2. మీ సామర్ధ్యం పట్ల ఆత్మ విశ్వాసం కాకుండా, అతి విశ్వాసం ఉంటే,
తక్షణం వాటిని మొహమాటం లేకుండా, ఆత్మ విమర్శతో విశ్లేషణ చేసుకోవాలి.

నీ ఆలోచనలకంటే విభిన్నంగా నీ లక్ష్యాలు ఎందుకున్నాయో అవగాహన చేసుకుని, సాధించగలిగిన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి.

3. జయాపజయాలు పగలు, రాత్రి లాంటివి. ఒక దానినొకటి వెంబడిస్తాయి. ఒక అంశంలో నీకు అపజయం ఎదురైతే, మరో లక్ష్యంతో విజయం సాధించవచ్చు.

4. నువ్వు ఎన్నుకున్న మార్గంలో విజయం లభించనప్పుడు, దగ్గర దారులు ఎంత మాత్రం వెదకకూడదు.

5. నీ ప్రయత్నాలు,
కృషి మధ్యలో ఆపేస్తే జనం హేళన చేస్తారని భావించకూడదు.

' రస విద్య' అంటే బంగారం తయారు చేసే విద్య పట్టుబడినా,
ధన వ్యామోహం తగదని, అది ప్రజలకు అపకారం చేస్తుందని వేమన తన కృషిని వదిలిపెట్టి ఆదర్శ ప్రాయుడయ్యాడు.

పొరపాటున రాజకీయ రంగంలో కొచ్చిన ఎందరో సినీ నటులు,
అది తమ విజయ వేదిక కాదని,
మళ్లి సినిమా వినోదల వేడుకలకు తిరిగొచ్చినవైనం మానందరికి తెలుసు. అనవసరమైన ఆత్మాభిమానాలతో నలిగిపోయి, జీవితాన్ని కష్టపడి అపజయల బాటా పట్టించేది మధ్య తరగతి మానవులే


6. విజయం సాధించడానికి వంతు కృషి లోపం లేకుండా చేశావు.
అయినా అనూహ్య కారణాల వల్ల సాధ్యపడలేదు.
అటువంటప్పుడు నీ విజయ మార్గాన్ని మార్చుకునే హక్కు నీకుంది.
ఇటువంటి సందర్భంలో మార్గదర్శకుల సహాయం తీసుకుంటే వారు విజయాల బాటా చూపిస్తారు.

7. ఓర్పు ఎప్పటికీ బలమే.
బలహీనత ఎంత మాత్రం కాదు.
నీ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు, మరింత ఓర్పు తో ప్రయత్నిస్తే అనితర సాధ్యమైన విజయాలు సాధించవచ్చు,

'ఓరిచితే తనపంతం ఊరకేవచ్చు; అంటారు అన్నమాచార్యులు.
ఓర్పు వహిస్తే మన పట్టుదలలన్నీ తప్పక నెరవేరతాయని భావం.

8. నీ లక్ష్యాలు సాధిస్తే గొప్పవాడరని అంతా ఆకాశానికేతెస్తారు.
లక్ష్యాలు సిద్దించకపోయినా నిరాశ పడకూడదు.

9. వైఫల్యాలు వలన మన బలలేమిటో, వాటితో మనం ఏం సాధించగలమో మరింత అవగాహనకొస్తుంది.

సేకరణ

ఋణవిముక్తి

ఋణవిముక్తి

1907 వ సంవత్సరం. కలకత్తానగరం. రెవెన్యూ ఆఫీసు.
ఆ రెవెన్యూ ఆఫీసులోనికి కలకత్తా నగరంలో పేరు మోసిన వకీలు చిత్తరంజన్ దాస్ ప్రవేశించారు.

నమస్తే రెవెన్యూ ఆఫీసరు గారూ, ముప్పై ఏండ్ల క్రితం ఈ జాబితాలో ఉన్న మనుషులు గాని, వారి వారసులు గాని ఇపుడు ఎక్కడ ఉన్నారో దయచేసి వివరాలు ఇవ్వగలరా?
నమస్తే చిత్తరంజన్ దాస్ గారూ, తప్పకుండా. మీరు కూర్చోండి. ఏమయ్యా దీనదాసూ, ఇలా రా, ఈ జాబితా తీసుకుని, వీరడిగిన వివరాలు ఇవ్వండి.
ధన్యవాదాలు రెవెన్యూ ఆఫీసరుగారూ. ఎంతసేపు పడుతుంది?
వెదికి ఇవ్వడానికి ఒకరోజైనా పడుతుంది. రేపు ఇదే సమయానికి రాగలరా?
తప్పకుండా. ధన్యవాదాలు.

రండి చిత్తరంజన్ దాస్ గారూ, మీరడిగిన వివరాలు దొరికాయి. ఇవిగోండి.
ఆహా, ధన్యవాదాలు ఆఫీసర్ గారూ, మీ ఋణం తీర్చుకోలేనిది.
సరే, చిత్తరంజన్ గారూ, మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట అడుగవచ్చా?
అయ్యో, ఎంతమాట! తప్పకుండా అడగండి.
మీరు ఇచ్చిన ఈ జాబితాలోని మనుషులందరూ ఎవరండీ? ఎందుకు వారి వివరాలను మీరు కోరారు?
ఆఫీసర్ గారూ, వీరందరూ మా తండ్రిగారి ఋణదాతలు. మా నాన్నగారు అప్పట్లో బ్రహ్మో పబ్లిక్ ఒపీనియన్ అనే పత్రికను నడిపేవారు. దానిని నడిపేందుకు గాను వీరి దగ్గర ఋణం తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆ పత్రికకు నష్టాలు వచ్చాయి. మా నాన్నగారు మా ఆస్తినంతటినీ అమ్మినప్పటికీ వీరి దగ్గర తీసుకున్న అప్పులను పూర్తిగా తీర్చలేకపోయారు. దివాలా తీశారు. నేను అప్పట్లో చిన్నవాడిని. అయితే ఇప్పుడు నేను హైకోర్టు లాయరును. కావలసినంత ధనం సంపాదించాను. అందువల్ల అప్పట్లో మా నాన్నగారి మీద నమ్మకంతో అప్పు ఇచ్చిన వారి ఋణం వడ్డీతో సహా కలిపి, అప్పట్లోనే ఇవ్వలేకపోయినందుకు నష్టపరిహారంగా రెండు రెట్లుగా ఇద్దామని సంకల్పించాను. లెక్క చూస్తే దాదాపు పదిలక్షలైంది. ఆ మొత్తాన్ని వారికి గాని, వారి వారసులకు గాని అందజేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకే వారి వివరాలనడిగాను.
చిత్తరంజన్ దాస్ గారూ, మీవంటివారిని కన్న తల్లిదండ్రులు ధన్యులు. మీ పూర్వికులందరికీ మీరు శాశ్వతపుణ్యలోకాలను సంపాదించబోతున్నారు.
కుమారునిగా అది నా బాధ్యత కదా ఆఫీసర్ గారూ. లేకుంటే ఆ వంశంలో పుట్టాను అని నేను చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనమేమిటి?
అవును దాస్ గారూ, మీవంటి వ్యక్తులకు సమకాలికుడను కావడం నా భాగ్యం.
ఎంతమాట ఆఫీసర్ గారూ, నేను అడిగిన వెంటనే వివరాలను వెదికించి ఇప్పించారు. మీ సహకారం లేకుంటే నేను కూడా వారి ఋణం తీర్చలేకపోయానే అన్న బాధతోనే జీవితం చాలించి ఉండేవాడిని. వారి వివరాలు ఇచ్చి నన్ను ఎంతో సంతోషపెట్టారు. ధన్యవాదాలు మహోదయా. సెలవు ఇప్పించండి. మరలా పని ఉన్నపుడు వచ్చి కలుస్తాను.
అలాగే వెళ్లిరండి దాస్ గారూ, మీలాంటి సత్పురుషులు ఈ దేశంలో మళ్లీ మళ్లీ పుట్టాలి.

భారతీయత

నేతాజీ సుభాాస్ చంద్రబోసుకు రాజకీయ గురువైన దేశబంధు చిత్తరంజన్ దాస్ గారి జీవితకథలో ఒక సంఘటనను చిన్న సంభాషణరూపంలో తెలియజేసేందుకు ఇలా ప్రయత్నం చేశాను.
ఈ సంఘటనను ప్రేరణగా తీసుకుని తెలుగులో ఒక సినిమా కూడా వచ్చింది. చిత్తరంజన్ గారికి శాశ్వతంగా అతడు ఋణపడే ఉంటాడు!

భారతదేశం మహోన్నతమైన సంస్కృతుల నిలయం, ఇటువంటి భారతదేశాన్ని సమ్మున్నతంగా నిలబెట్టే బాధ్యత మన భుజాల మీద ఉంది, భుజాల నుండి కిందకు దించుతారో నెత్తి మీద పెట్టుకుంటారో అది మీ ఇష్టం.

సేకరణ

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు మా ఇంటి దైవం శ్రీ రామ భక్త శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు మరియు శ్రీ వల్లి దేవా సేనా సమెత తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి వార్ల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
మంగళవారం --: 26-10-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
మీరు ఒకరి గురించి మంచిగా చెప్పకపోయినా పర్లేదు కానీ చెడుగా మాత్రం చెప్పొద్దు పని పాటలలేక ఏమి తోచక ఎవరో ఒకరి సంతోషం ఆనందం కొసం చేప్పే మాటలు ఇంకోకరి జీవితం నాశనం కావటానికి కారణం అవుతుంది
ఒకసారి మీరే ఆలోచించండి .

నీలో ఉన్న చికాకులన్నీ ఎగిరిపోవడానికి నీ చిన్న చిరునవ్వు చాలు , నీ కన్నీళ్ళు ఆగిపోవటానికి నీ చల్లని చూపుచాలు , నీ గుండె మంట చల్లార్చటానికి నీవు మాట్లాడే తీయని మాట చాలు , మనం ఉన్నామని భరోసా ఇవ్వడానికి మంచి స్నేహం మంచి ఆత్మీయ బంధం ఉంటే చాలు .

జీవితం నీది స్వప్నం నీది గమ్యం నీది కష్టం శ్రమ గెలుపు ఓటమి అన్నీ నీవే , నీవు కింద పడితే లేవాల్సింది నీవ్వే బాధను దిగమింగుకోవాల్సింది నీవ్వే నీకేమైన గాయాం అవుతే ఆ గాయాన్ని భరించాల్సింది నీవ్వే దైర్యం చెప్పుకోవాల్సింది నీవ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలైతే ఎగతాళీ చేస్తారు నీవు ఎవర్నీ పట్టించుకోవద్దు .


సేకరణ 🖊️*మీ ...ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 🚩🕉️

సేకరణ

మంచి మాట...లు

ఆత్మీయ బంధుమిత్రులకు ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు 🌷🤝🌹🤝💐ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుని అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ 👍కోరుకున్నవి అన్ని కావాలంటే ఎవరికీ సాధ్యం కాదు..మనం కస్టపడి sam0ఆడించినవి దేముడిచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటూ జీవిద్దాం. తినటం కోసం బతకటం కాకుండా బతకటం కోసం తిందాం💐💐🌹🌷🤝

ఆదివారం --: 24-10-2021 :--
ఈ రోజు AVB మంచి మాట...లు
నిన్ను వదిలీ వెళ్ళిన వారి గురించి ఆలోచించకు నీతో ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు ఎవరో నీ బాధను అర్థం చేసుకుంటారని ఆశించకు నీకు నువ్వే తోడు నీ దైర్యమే నీకు సరిజోడుసృష్టిలో ఏ విషయాన్నైనా ఉన్నది ఉన్నట్టుగా చూడడం ఎవరి తరం కాదు , ప్రతి ఒక్కరూ తమ కోణం నుంచి తమ మనోభావాలకు అనుకూలంగానే చూస్తారు అందుకే తమకు నచ్చిన వారిని చేర్చుకుంటారు తమని నచ్చని వారిని దూరం పెడతారు .

మన జీవితంలో ఎవరో ఒకరు గుణపాఠం నేర్పిస్తూనే ఉంటారు , ఒకరు ప్రేమలో ఇంకొకరు స్నేహంలో మరొకరు బంధుత్వంలో ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి చోటా మనమే గుణపాఠం నేర్చుకుంటూ ఉంటాం కానీ ఒక్కటి మాత్రం నిజం దెబ్బ తిన్నవాడికే గెలవాలి అనే తపన ఎక్కువ ఉంటుంది అందుకని నువ్వనుకున్నది గెలిచే వరకూ తపించు పోరాడు సాధించు చివరగా విజయ మాధుర్యాన్ని అనుభవించు .

మనకు విలువ లేని చోట
మాట్లాడరాదు ప్రేమ లేని చోట ఆశ పడరాదు మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నవారి కోసం ఎదురు చూడకుడదు మన ఆత్మ గౌరవం పణంగా పెట్టి ప్రేమించకుడదు మనల్ని దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలని చూడకుడదు మనం భారం అనుకున్న వాళ్ళతో మన భావాల్ని పంచుకోవద్దు మనది కానిది దేనిపైన ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు మన నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా ఉండొద్దు

సేకరణ 🖊️*మీ ...ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🌹🤝🌷

సేకరణ

అట్లతద్దె

23 శనివారం అట్లతద్దె

సౌభాగ్య‌దాయిని ‘అట్ల‌త‌ద్ది’
అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. ఉండ్రాళ్ళ తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు , ముత్తయిదువులు గోరింటాకు అందంగా అలంకరించుకుంటారు. మరునాడు వేకువ జామునే లేచి తలస్నానం చేసి , పూజా మందిరంలో పీఠమును పనుపు , కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు. దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరీ దేవిని పూజిస్తారు. గంధం , పసుపు , పువ్వులతో పూజిస్తారు. ఆ తర్వాత దేవికి అట్లు , ఇతర పదార్థాలు నైవేద్యంగా పెడతారు. అనంతరం శక్తి కొద్దీ ముగ్గురుకానీ , ఐదుగురు కానీ ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వటం ఆనవాయితీ. ఇలా చేసినందువల్ల గౌరీదేవి అనుగ్రహంతో సుఖాలు , సౌభాగ్యం కలకాలం నిలవడంతో పాటు పుణ్యం వస్తుందని చెబుతారు. ఇది అట్లతద్దె జరుపుకోవటంలో ముఖ్య ఉద్దేశ్యం. అట్లతద్దినాడు తెల్లవారు జామున పిల్లలు అన్నం , గోంగూర పచ్చడి , పెరుగుతో కడుపునిండా తింటారు. అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌ , ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌ అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఉయ్యాలలూగుతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. పెద్దలు మాత్రం పగలంతా ఉపవసించి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి ఆరగిస్తారు.

అట్ల తద్ది కథ

అట్లతద్దికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక రాజు కూతురు , మంత్రి కూతురు , సేనాపతి కూతురు , పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి , మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లెలి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.
ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రోదయమైంది. అమ్మా కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో’ అన్నాడు. రాజ కుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడషోపచారాలతో ఉమాదేవిని పూజించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ వ్రతానికి ‘చంద్రోదయ ఉమావ్రతం’ అని పేరు వచ్చింది. అయితే రాజకుమారి సోదరుని మాటలు నమ్మి వ్రత భంగం చేసింది. ఇది జరిగిన కొద్ది కాలానికి రాకుమారికి పెళ్లయింది.

కొంతమంది దుష్టుల మోసం వల్ల ఆమెకు ముసలి భర్త లభించాడు. ఆమె ఎంతో బాధపడింది. వ్రతం చేస్తే మంచి భర్త రావాలి గాని ఇలా ఎందుకు జరిగిందని వాపోయింది. పార్వతీ పరమేశ్వరులను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. వారు ఆమె సోదరుడు ఆమెపై ప్రేమతో చేసినదంతా చెప్పారు. అయితే మర్నాడు ఆశ్వయుజ బహుళ తదియ అని ఆ రోజు చంద్రోదయ ఉమా వ్రతం చేస్తే ఆమె సమస్య తీరుతుందని చెప్పారు. ఆమె యధావిధిగా పూజ చేసి అక్షతలు భర్త మీద చల్లగానే ఆయన యవ్వనవంతుడయ్యాడు. కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సౌభాగ్యంతో తులతూగుతారు.

అట్లతద్ది అంతరార్థం

త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం.

ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం.
రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది.

ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమయినది. పిల్లలు , పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈరోజున తెల్లవారు జామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీదేవి పూజ చేసి , ఆమెకు 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు , 11 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకుని , శిరస్సుపై అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం , 11 తాంబూలం వేసుకోవడం , 11 ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు. కనుకనే ఈ పండుగకు ‘అట్లతద్ది’ అనే పేరు వచ్చింది. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి , ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి.

సృష్టి స్థితి లయలకు కారకులయిన బ్రహ్మ , విష్ణు , పరమేశ్వరుల భార్యలు సరస్వతి , లక్ష్మి , పార్వతులకు నెల పొడవునా ఉత్సాహంగా పూజలు జరిపే మాసం ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం. కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా , పాడినా వాళ్లంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెబుతున్నాయి పురాణాలు.


అట్లతదియ రోజున అనుకూల దాంపత్యం కొరకు పఠించవలసిన అర్థనారీశ్వర స్తోత్రం


చాంపేయ గౌరార్థ శరీరకాయై
కర్పూర గౌరార్థ శరీరకాయ
ధమిల్ల కాయైచ జటాధరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

కస్తూరికా కుంకుమ చర్చితాయై
చితారజః పుంజ విచర్చితాయ
కృత స్మరాయై వికృత స్మరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ఝణత్క్వణత్కంకణ నూపురాయై
పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

విశాల నీలోత్పల లోచనాయై
వికాసి పంకేరుహ లోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

మందార మాలా కవితాలకాయై
కపాల మాలాంకిత కంథరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయై
నమశ్శివాయై చ నమశ్శివాయ II

అంభోధర శ్యామల కుంతలాయై
తటిత్రభా తామ్ర జటధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్త సంహారక తాండవాయ
జగజ్జనన్యై జగదేక పిత్రే
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై
స్ఫురన్మహా పన్నగ భూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ఏతత్పఠే దష్టక నిష్టదం యో
భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ
ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం
భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః

ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచిత అర్థనారీశ్వర స్తోత్రమ్

అట్ల తద్దె 2021 తేదీ - శనివారం, అక్టోబర్ 23, 2021
తదియ తిథి ప్రారంభమవుతుంది - అక్టోబర్ 23, 2021 న 12:29 AM
తదియ తిథి ముగుస్తుంది - 03:01 AM అక్టోబర్ 24, 2021 న

సేకరణ

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు. లక్ష్మి సరస్వతి దుర్గా గాయత్రి అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
శుక్రవారం --: 22-10-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
ఉదయాన్నే మనసుకు నచ్చిన వారికి ఆత్మీయంగా పలకరిస్తే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం అనుకోకుండానే పెదవులపై చిరు నవ్వు వచ్చేస్తుంది మనం పలకరించే పలకరింపు చిన్నదైనా మనస్పూర్తిగా పలకరిస్తే చాలు ఎదుటి వారి మనసు సంతోషంతో నిండిపోతుంది .

మనం ఆనందించే ఆనందం వస్తువులల్లో ఉండదు అది మన మనసులో ఉంటుంది సుఖశాంతులు సంపదలలో లేవు మనం సంతృప్తి పడటంలో ఉంటుంది మనం ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు .

కష్టపడుతూ పైకెదిగిన వారికి విలువలతో కూడుకున్న సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా పైకెదిగిన వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది . స్నేహం డబ్బు నూనె నీరు లాంటివి అవి ఎప్పటికీ ఒకటికి ఒకటి కలవవు స్నేహితులు వారి ప్రేమను కష్టకాలంలోనే చూపిస్తారు .

నేనిలా ఉంటాను అని చెప్పకు ఉండి చూపించు , నేనిలా చేస్తాను అని చెప్పకు చేసి చూపించు ఊహల్లో ఉండకు వాస్తవాన్ని గుర్తించు . కరెస్సీ నోటు ఎంత నలిగినా దాని విలువ తగ్గదు అలాగే మనలో మంచితనం వుంటే ఎవరు ఎన్నినిందలు వేసినా మన విలువ తగ్గదు .

🖊️సేకరణ *మీ ...ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 🤝💐🌹🌷

సేకరణ

మంచి.. మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు భాను వాసరా శుభోదయ శుభాకాంక్షలు.. ప్రత్యక్ష నారాయణుడు సూర్య నారాయణ మూర్తి వారి అనుగ్రహం తో మీకు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. గొప్ప గొప్ప వారు నా స్నేహితులు అని చెప్పుకొను.. నా స్నేహితులు బంధుమిత్రులు గొప్పవారు అని చెప్పుకుంటాను 💐🤝👍
ఆదివారం --: 17-10-2021 :--

‌ఈ రోజు AVB మంచి.. మాట.. లు

సమాజంలో బాగా సంపాదించి పలుకుబడి ఉన్న వారికేమో మనం వత్తాసు పలుకుతాము , కొద్దిగా అమాయకంగా నిజాయితీగా ఉన్నావారిని హేళన చేస్తూ తప్పు పడతాము .ఇదే ఈ లోకం తీరు నేస్తమా

మనం డబ్బును ఎంతైనా సంపాదించు ఎంతైనా పోగొట్టు కోవచ్చు కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది .

ఒంటరిగా ఉన్న అక్షరాలలో ఏ అర్థం ఉండదు అదే అ అక్షరాలు జతకడితే అర్థంతమైన పదాలు వాక్యలుగా మారిపోతాయి మనం మంచివారితో స్నేహం చేయటం వలన మన జీవితమూ అర్థవంతంగా మారి పోతుంది .

లక్షలు ఉన్నవాళ్ల కోసం కాదు మంచి లక్షణాలు ఉన్నవాళ్ల కోసం వెంటపడండి లక్షలు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ మంచిలక్షణాలు ఉన్నవాళ్లను మనం కొల్పోతే తిరిగి సంపాదించుకోలేం .

సేకరణ 🖊️*మీ ...ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 🌹🌷👍🤝

సేకరణ

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారం శుభోదయ మరియు విజయదశమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు లక్ష్మి సరస్వతి దుర్గా గాయత్రి అమ్మవార్ల అనుగ్రహం ఎల్లవేళలా లభించి మీరు చేసే మంచి పనులు అన్నిటిలో నూటికి నూరు శాతం విజయం వరించాలని కోరుకుంటూ.. అమ్మవార్ల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ... విజయం కావాలనుకునేవాడు ఎప్పుడు సోమరిగా ఉండడు.. మీకు ఎల్లప్పుడూ అన్ని విషయాలల్లో తప్పక విజయం లభించాలని కోరుకుంటూ.. మరి ఒకసారి విజయదశమి శుభాకాంక్షలు 💐🌹🌷🤝
శుక్రవారం --: 15-10-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
ఈ దసరా పండుగ మీకు శ్రేయస్సును ఆనందాన్ని మరియు విజయాలను చేకూర్చాలని మీకు మీ కుటుంబసభ్యులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు విజయ దశమి (దసరా) శుభాకాంక్షలు .

నీకు మెరుగైన జీవితం కావాలంటే నీ ఆవేశం నీపై ఉండాలి , నీ చేతకాని తనంపై ఆలోచన ఉండాలి , నీ బద్ధకం పై ఉండాలి , నీ జీవన శైలిపై మార్పులో ఉండాలి అప్పుడే నీలోని లోపాలు సరిచేసుకోగలవు .

జీవితం అనుకుంటే పోయేది కాదు , రాసుకుంటే తిరిగి వచ్చేది కాదు , ఈ సమాజంలో నీవు నేను అందరం పాత్రధారులు మాత్రమే రాత రాసే వాడు పైన ఉన్ళాడు నటించే వాళ్ళు మనతో ఉన్నారు .

నీ మాటలను చేతలను పోగిడే వారికంటే నీ తప్పులను మృదువుగా ఎత్తిచూపేవారే నమ్మదగిన వారని తెలుసుకో . నీలో దాగి ఉన్న నీ శత్రువు బద్ధకం దాన్ని తరి‌మికొట్టు చూడు విజయం నీ సొంతం .

సేకరణ 🖊️ *మీ ... ఆత్మీయుడు AVB సుబ్బారావు 💐🌹🌷🤝

సేకరణ

మంచి మాట..లు

ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు.. మీకు మీ కుటుంబసభ్యులకు పూజ్య గురుదేవులు మరియు దుర్గా అమ్మవార్ల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. 💐🌹🌷🤝
గురువారం --: 14-10-2021 :--
ఈ రోజు AVB మంచి మాట..లు
ఎక్కడైనా దేవతలను పూలతో పూజిస్తారు కానీ పూలనే దేవతలుగా పూజించే బతుకమ్మ సంప్రదాయానికి నమస్కరిస్తు మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా.పండుగ శుభాకాంక్షలు

ఉదయించే సూర్యుడు మనల్ని ఎలా మేల్కోలుపుతాడో అలాగే మనం కూడా మనకి ఇష్టమైన వారిని అత్మీయంగా పలకరించే పిలుపే పలకరీంపు చిన్నదైనా మనస్పూర్తిగా పలకరిస్తే చాలు ఎదుటివారి మనసు సంతోషంతో నిండిపోతుంది .

మనకు మన పై అభిమానం ఎదుటి వారిని ప్రశంసిస్తుంది ..! ప్రశ్నిస్తుంది , కానీ బానిసత్యం భజన మాత్రమే చేస్తుంది . మనకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతిచోట స్వర్గమే కనిపిస్తుంది , లేనిదానికోసం ఆరాటపడుతూ చేసే ప్రతి అడుగు నరకమే నేస్తమా !

ఏ ఒక్కరి జీవితం కూడా పుట్టకతో పూలవనం కాదు , అందరివీ పడి లేచే బతుకులే మన ఒక్కరికే కాదు అసలు భూమి పైన సమస్యలు లేని మనిషి లేడు , అందుకే రేపటి రోజున సంతోషం వస్తుంది అనే ఆశతో నవ్వుతూ జీవిద్దాం .

ప్రతి పరిచయం మనకు ఒక అనుభవమే కొన్ని పరిచయాలు మనకు లేని ప్రశాంతతను తీసుకువస్తే మరికొన్ని పరిచయాలు ఉన్న ప్రశాంతతను దూరం చేస్తాయి .

సేకరణ 🖊️*మీ ... ఆత్మీయుడు. AVB సుబ్బారావు 💐🌹🌷🤝

సేకరణ

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు దుర్గాష్టమి మరియు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు 💐🤝
బుధవారం --: 13-10-3021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించేవారికి భయం ఉంటుంది గతం గురించి ఎక్కువ ఆలోచించే వారికి బాధ ఉంటుంది వర్తమానం లో జీవించేవారికి ఆనందం ఉంటుంది . మన ఆలోచనలు ఎప్పుడూ రాబోయే భవిష్యత్ వైపు పరుగెత్తాలి కానీ మనతో కలిసి నడవని గతం కోసం వేచి చూడకూడదు .

మంచివారు ఎప్పుడూ మొండి గానే ఉంటారు ఎందుకంటే వారికి నటించడం ఇష్షం ఉండదు కనుక మనషులు సంతోషంగా బతకడం మానేసి ఆర్భాటంగా బతకడానికి ఇష్టపడుతున్నారు మనకు ఉన్నదాంతో వచ్చేది సంతోషం మనకు ఉంది కదా అనుకుంటే వచ్చేది ఆర్భాటం .

డబ్బు చెబుతుంది అందరిని మరచి నన్ను సంపాదించమని సమయం చెబుతుందిఅన్నింటిని మరచి నాకోసం శ్రమించమని కానీ ! దేవుడు చెబుతాడు అందరికీ మంచి చేస్తూ ఉంఢు నీకేమి కావాలో నేను చూసుకుంటాను .

జీవితంలో అనుభవాల ద్వారా నేర్చుకునే పాఠాలు పుస్తకాలు కూడా నేర్పలేవు . ఎందుకంటే చదివి నేర్చుకునేవి పరీక్షల వరకే అనుభవాలు మాత్రం జీవితం అంతం అయ్యే వరకు .

ధైర్యంతో అన్ని సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ధైర్యాన్ని కొల్పోరాదు ,

సేకరణ 🖊️*మీ .ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 🤝🌷🌹💐..

సేకరణ

శమీ పూజ సరే, మరి జమ్మిచెట్టు ఎక్కడ? ఈ జనరేషన్‌లో ఎంతమంది ప్రత్యక్షంగా చూశారు?

🌿🌿🌿🌿🌿🌿
శమీ పూజ సరే, మరి జమ్మిచెట్టు ఎక్కడ? ఈ జనరేషన్‌లో ఎంతమంది ప్రత్యక్షంగా చూశారు?

దసరా రోజు సాయంత్రం వేళ జమ్మికొట్టి, ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో తరచూ కనిపించేదే.
శమీ పూజ సరే, మరి జమ్మిచెట్టు ఎక్కడ? ఈ జనరేషన్‌లో ఎంతమంది ప్రత్యక్షంగా చూశారు?

జమ్మిచెట్టు. దసరా వచ్చిందంటే చాలు సోషల్‌ మీడియాలో పుంఖానుపుంఖాలుగా జమ్మిచెట్లు గురించి పురాణ కథలు వచ్చి పడుతుంటాయి. అంతమాత్రాన అవి పుక్కిటి పురాణాలు ఎంతమాత్రం కావు. ఎందుకంటే శాస్త్రీయతను దైవానికి జోడిస్తేనే ప్రకృతిని కాపాడుకోగలమని మన పూర్వీకులు అప్పట్లోనే గుర్తించి.. ప్రతి పండుగకు ఒక చెట్టు.. ఒక జంతువు.. ఇలా ఏదో విధంగా మనిషిని ప్రకృతిలో మమేకమయ్యేలా ఏర్పాటు చేశారు. సైంటిఫిక్‌గా చూసినా మన పూర్వీకులు చెప్పిన ప్రతిదాన్లోనూ ఎక్కడో ఒక చోట అంతర్లీనంగా విస్త్రుత మానవాళి ప్రయోజనం దాగి ఉంటుంది. అందుకే ప్రతి పండుగ, పూజలు, నియమ నిష్టలు ఇత్యాది అంశాలను లోతుగా పరిశీలిస్తే ఎంతో ఆసక్తి కరమైన విషయాలు వెలుగుచూస్తుంటాయి. ముఖ్యంగా అవగాహన ఉన్నవాళ్లు వీటిని ఎప్పటికప్పుడు ప్రజెంట్ జనరేషన్‌కు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే 'న్యూస్‌18 తెలుగు' ఈ ప్రయత్నం చేస్తోంది.


నవరాత్రులుగా జరుపుకునే దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది జమ్మిచెట్టు. సాయంత్రం వేళ జమ్మికొట్టి, ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో తరచూ కనిపించేదే. ఈ దసరా రోజుకీ జమ్మి చెట్టుకీ మధ్య అనుబంధం ఏమిటి అన్న ప్రశ్నకు చాలా సమాధానాలే కనిపిస్తాయి. జమ్మి మనకు అంటే భారతీయులకు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే భారత ఉపఖండంలోనే ఈ వృక్షం ఉద్భవించిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకనే రుగ్వేదకాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లోనూ.. ఇప్పటికీ యజ్ఝయాగాదులకు ఈ చెట్టు కాండాన్నే అగ్నిని పుట్టించడానికి యాజ్ణికులు చిలుకుతుంటారు. వెన్నకోసం మజ్జిగను చిలికినట్టే.. అగ్ని కోసం కట్టెను సాధనంగా వాడడం మన మూలాలను ఒకసారి వెనక్కు తిరిగి చూసుకున్నట్టే నన్నది ఇక్కడ భావన.. మహారణ్యాల్లో శతాబ్దాల తరబడి పెరిగి పెనవేసుకున్న చెట్లకొమ్మల మధ్య రాపిడి ద్వారానే అగ్ని పుట్టిందని మనం చదువుకున్నాం. అంటే ఇక్కడ పూజలు, క్రతువుల్లోనూ శాస్త్రీయతను మనం వదిలేయడంలేదనే కదా..? మనం పురాణాలలోనూ, వేదాలలోనూ తరచూ వినే ‘అరణి’ని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరత్వరగా పెరిగేస్తుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బతికేస్తుంది. అందుకే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువ ఉండే అనేక ప్రాంతాలలోనూ ప్రజలకు జమ్మి తరాలుగా తెలిసిందే. రాలే ఆకులు రాలుతుంటే వచ్చేది వస్తుంటాయి. పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోవడం మనం చూడలేం. ఇలాంటి ప్రత్యేక లక్షణాలుండే రకాల్లో ఇది ఒకటి. ఇక పట్నం వాసులకు జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాలవారికీ జమ్మి అంటే ప్రాణం. దీని కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి; దీని వేళ్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి. ఈ చెట్టులోని ప్రతిభాగాన్నీ నాటువైద్యంలో ఔషధాలుగా వాడతారు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం. అందుకే వినాయక చవినినాడు పూజించే ఏకవింశతి పత్రాలలో శమీపత్రాన్ని కూడా చేర్చారు.



జమ్మిచెట్టు
ఇప్పటికీ పల్లెల్లో చెడు దరిచేరకుండా ఇంటి ప్రహరీ గోడలపై, వాకిళ్లపై జమ్మి కాండాలు ఉంచడం ప్రజల నమ్మకం. రైతులు తమ పశుపక్ష్యాదుల ఆరోగ్యం కోసం జమ్మిని పూజిస్తుంటారు. అజ్ఞాతవాసానికి బయల్దేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమినాడు వారు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి, తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా పాండవులకు అపరాజితా దేవి ఆశీస్సులు ఉండబట్టే, వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు. కేవలం పాండవులే కాదు, రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైనది అని చెబుతారు (రామస్య ప్రియదర్శనీ). పైగా జమ్మిచెట్టుని స్త్రీస్వరూపంగా (శక్తిగా) భావిస్తారు. ఆ శక్తి అనుగ్రహం కూడా రాములవారికి లభించబట్టే, ఆయన రావణునితో జరిగిన సంగ్రామంలో గెలుపొందారట.

అవును జమ్మి బంగారమే.. పూజ ముగిసిన అనంతరం చెట్టు నుంచి జమ్మి ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా భావిస్తూ భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్మాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. జమ్మి ఆకులను శుభంగా భావించి, జమ్మి కొట్టేందుకు రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలనూ సాధించాలని కోరుకోవడమే. పిల్లల మనసులోని ఈ విజయకాంక్షను గ్రహించిన పెద్దలు, వారి కోరికలు నెరవేరాలని తమ దీవెనలను కూడా జతచేస్తారు.

పాలపిట్ట

దసరా రోజున పాలపిట్టను కూడా చూడాలన్న నియమం ఒకటి ఉంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా, వారికి పాలపిట్ట కనిపించిందనీ... అప్పటి నుంచీ వారికి సకల విజయాలూ సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకనే విజయానికి శుభసూచకంగా పాలపిట్టను దర్శించే ఆనవాయితీ బయల్దేరింది.

దసరా, విజయదశమి,కాళికా మాత,అలంకారాలు,నవరాత్రి,పాలపిట్ట,
దసరా నాడు పాలపిట్ట కనిపిస్తే ఏమవుతుంది?
జమ్మిచెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ (UAE) భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మిచెట్టుని నాటమని సూచిస్తోంది. కానీ మనదగ్గర మాత్రం ఉన్న జమ్మి చెట్లూ నాశనం అయిపోతున్నాయి. ఇప్పటి పిల్లలైతే జమ్మి చెట్టుని గుర్తిస్తారో లేదో కూడా అనుమానమే. పురాణాల్లో ప్రస్తావించిన జమ్మిచెట్టు, పాలపిట్ట లాంటి వాటి ప్రాధాన్యాన్ని ఇప్పటి తరానికి శాస్త్రీయంగా వివరించి వాటి సంరక్షణకు పూనుకోవాల్సిన అవసరం ఉందని పెద్దలు చెబుతుంటారు. అమ్మవారి దేవాలయాల్లో ఈ చెట్టు లేకుండా ఉండదు. ఇప్పటి జనరేషనకు వీటిని చూపించి ప్రకృతి విలువను తెలియజెప్పాల్సిన అవసరం ఉంది.
🙏🙏🙏🙏🙏🙏

సేకరణ

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు.. మీకు మీ కుటుంబసభ్యులకు మా ఇంటి దైవం శ్రీ రామ భక్త శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు, వినుకొండ మరియు శ్రీ వల్లి దేవ సేనా సమేత సుబ్రమణ్య స్వామి వారి అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. 🤝🌷💐
మంగళ వారం --: 12-10-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
మనమందరం అనుకుంటాం ఆకాశం , భూమి ఎప్పటికి కలవవు అని కానీ వాళ్లకు తెలియదు ఒకటి లేకపోతే రెండవది ఉండదు అని కొన్ని బంధాలు అంతే మనషులే దూరం అవుతారు వారి మనసులు కాదు ! .

ఆపదలో ఆదుకున్నా ఆప్తున్ని బాధను పంచుకునే బంధువుని సలహానిచ్చే సన్నిహితుడిని నీ మేలుకోరే మిత్రున్ని నీకు దైర్యాన్ని ఇచ్చే స్నేహితున్ని జీవితంలో వీళ్ళను ఎప్పుడూ దూరం చేసుకోవద్దు ఎన్నడూ దూరం పెట్టొద్దు .

ఎన్నడూ ఆశ పడనివారు ఎన్నడూ ఆసంతృప్తికి గురికారు నారు పోయకుండా నీరు పోయకుండా పెరిగెది రెండే రెండు ఒకటి పొలంలో కలుపు రెండోది మనిషిలోని అహం ఒకదాని వల్ల పొలం నాశనమైతే రెండో దానివల్ల మనిషి నాశనమవుతారు .
సేకరణ 🖊️AVB సుబ్బారావు 🌷🌹👌👍🤝

సేకరణ

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు.. అదిదంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. దేనికైనా కాలం అనేది ఒకటుంటుంది.. కానీ అ సమయం మనకు తెలియదు.. కాబట్టి మన ధర్మం ప్రకారం మన పని మనం చేసుకుంటుపోవటమే.. ఎదో రోజు తప్పక నీ అభిష్టం నేరవేరుతుంది 💐🤝
సోమవారం :-11-10-2021
ఈ రోజు AVB మంచి మాట.. లు
జీవితంలో ఏదైనా సాధించాలి, సాదించగలను, సాదించితిరుతాను అనే సంకల్పం ఉన్న మనిషిని ఎన్ని దుష్ట శక్తులు (మనమంటే గిట్టని వారు )అడ్డొచ్చినా తన సంకల్పం ముందు బలాదూర్,,


మొత్తం జీవితం కాలంలో సరైన సమాధానం లేని ఒకే ఒక ప్రశ్న,, ఎవరిని నమ్మాలి..?

ఒక చిన్న "అబద్దం" నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది, అంతేకాదు,, ఎంతో విలువైన బంధాల్ని కూడా దూరం చేస్తుంది, గుర్తుంచుకో,,


మనిషికీ చిరునవ్వుని మించిన అందం.. వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు, అందుకే అన్నారు పెద్దలు, సంతోషమే సగంబలం అని,,
సేకరణ 🖊️మీ ఆత్మీయ బంధువు.. AVB సుబ్బారావు

సేకరణ

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు రవి వారపు శుభోదయ శుభాకాంక్షలు.. 💐ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణ మూర్తి వారి అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ.
.ఆదివారం --: 10-10-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది . డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది , మనిషికి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుంటుంది .

జీవితంలో ధనం కోల్పోతే ధనం మాత్రమే కోల్పోయినట్లు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నటే ఇతరులను అదుపు చేయడం గొప్పవిషయమే కానీ తనను తాను అదుపు చేసుకోవడం అంతకన్నా గొప్ప విషయం .

మనం ఇతరులకు మేలు చేయడం అనేది ఒక్క కర్తవ్యం మాత్రమే కాదు అది అది మనకు సంతోషం ఎందుకంటే అది నీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంపోందిస్తుంది .
ఎదుటి మనిషి చేప్పే విషయాలు వినడంలో మనం తొందరపడాలి కానీ మనం మాట్లాడటంలో తోందర పడకూడదు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మనం మాట్లాడాలి లేదా తెలుసుకుని మాట్లాడాలి .

తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగా కనిపిస్తుంది అనుభవమే మనిషికి గుణపాఠం .

సేకరణ 🖊️*మీ ... ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🌹🌷🤝

సేకరణ

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు.. లక్ష్మి పద్మావతి సమేత శ్రీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు.. తిరుత్తని వల్లి దేవసేన సమేత తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు మా ఇంటి దైవం శ్రీ రామ భక్త గుంటి ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.. నిన్న గతం ఏమి చేయలేము. రేపు భవిష్యత్ ఉంటుందో లేదో తెలియదు.. ఇప్పుడు గడుస్తున్న కాలంలో నీకు మంచి అనిపించింది ఏదైనా వెంటనే చేయండి 💐🌹🌷🤝
శని వారం --: 09-10-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
మనిషికి ఓపిక చాలా విలువైనది అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఎక్కువగా నేర్చుకుంటాడు . ఆవేశానికి ఆలోచన ఎంత ముఖ్యమో ఆశయానికి అవకాశం అంతే ముఖ్యం .

ఇప్టంతో చేసే పని మనకు శక్తిని పెంచుతుంది కష్టంతో చేసే పని మనకు శక్తిని తగ్గిస్తుంది కాబట్టి చేసేమనకు పని ఏదైనా సరే మనం ఇష్టంతో చేయడానికే ప్రయత్నించాలి వందల మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు నీ చెడు కోరుకునే వాళ్ళను దగ్గర రానియ్యకు స్వార్థంతో నిన్ను పొగిడేవాళ్ళను ఎప్పటికీ నమ్మకు

మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైనది ఎలా మారాలి అన్నది మనకు వివేకం చెబుతుంది ఎప్పుడు ఎలా మారాలి అన్నది అనుభవం చెబుతుంది ఎందుకు మారాలి అన్నది మనలోని అవసరం చెబుతుంది .

సేకరణ 🖊️*మీ ...ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🌹🌷🤝

సేకరణ

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ మరియు దసరా నవరాత్రులశుభాకాంక్షలు 💐అష్ట లక్ష్మి, గాయత్రి, సరస్వతి, మరియు నవ దుర్గా అమ్మవార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ అదృష్టం అనేది ఎక్కడో లేదు మిత్రమా ఎప్పుడు మనతోనే మన కష్టం లోనే ఉంటుంది..ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా మిత్రమా
శుక్రవారం --: 08-10-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
గతంలో జరిగిన గతాన్ని మరిచి ముందున్న గమ్యాన్ని చేరుకో భవిష్యత్తులో నిన్ను ఒద్దు అనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుతారు . ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం మనం బ్రతకాలి . ఎవరు మన కోసం బాధపడుతారో వాళ్ళని నవ్వించాలి ఎవరు మనకో‌సం ప్రతిక్షణం ఆలోచిస్తారో వాళ్ళని దూరం చేసుకోవద్దు .

జారీ పోయిన కాలాన్ని జార విడుచుకున్న అవకాశాల వైపు మళ్ళీ మళ్ళీ తిరిగి చూడకు గతంలో ఆగిపోతే భవిష్యత్ కు దారి కనపడదు ‌వైఫల్యం ముగింపు కాదు నిజానికి ఇది నీవు నేర్చుకోవటానికి లభించిన గొప్ప అవకాశం గా మేలుచుకోవాలి కానీ బాధ పడుతూ కూర్చోకూడదు. .

మనిషికి
ఓర్పు అనేది లేకపోతే జీవితంలో ఓటమి తప్పదు ఓటమి అనేది తెలియకపోతే జీవితంలో గెలుపుఅనేదిరాదు గెలుపు అనేది కావాలిఅంటే మనిషికి సహనం అనేది ఉండాలి . ప్రతి మనిషికి ఉండవలిసింది ఓర్ఫు , నేర్పు , సహనం మన జీవితం మనకేదీ నేర్పించదు జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి.

మన ముందు తగ్గి
తల దించుకున్న ప్రతివారు తగ్గినట్టు కాదు , తగ్గిన ప్రతివారు చేతగాని వారు కాదు కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే మరి కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు , తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు రేపు అనే రోజు మన వంతు కావచ్చు .

సేకరణ 🖊️
మీ ...AVB సుబ్బారావు 🤝🌹🚩

సేకరణ

మంచి మాట..లు

ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ మరియు దసరా నరవరాత్రుల ప్రారంభ శుభాకాంక్షలు శ్రీ దుర్గ అమ్మ వారు మరియు పూజ్య గురుదేవుల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..

గురు వారం --: 07-10-2021 :--
ఈ రోజు AVBమంచి మాట..లు

ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో ఒక్కటి గుర్తుపెట్టుకో నీడలో మొక్కలే ఎదగలేవు మనుషులం మనం ఎదుగగలమా .

ప్రతి ఒకరు నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి , ఒకటి తినేటప్పుడు రెండు మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యాన్ని కాపడుతుంది రెండోది బంధాన్ని కాపాడుతుంది .

మనకు ఏమైన కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు , నాకే ఎందుకు ఇలా అవుతుందని,ఒక్క మాట గుర్తుంచుకో కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది కానీ చేతకాని చవటలకు కాదు . ఆడి చూడు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది .

ఏమయ్యింది అనే ప్రశ్నల ఓదార్పు కన్నా ఒక అబద్దపు నవ్వును మొహానికి అద్దుకుని తిరగడం మేలు నీ బలం ఎవ్వరికి తెలియకున్నా బతికెయ్యవచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనీయకు మాయ దారి జీవితంలో మాయ గాండ్లు ఎందరో ?...

ఆత్మీయులైన మీకు శుభోదయ శుభాకాంక్షలు తెలియచేస్తూ *మీ ..ఆత్మీయుడు AVB సుబ్బారావు 💐🌹🌷🤝.

సేకరణ

Wednesday, October 27, 2021

నేటి ఆణిముత్యాలు. *ప్రశాంతమైన...* *మనస్సు కంటే విలువైన సంపద, ఈ ప్రపంచంలో ఏది లేదు ..*

నేటి ఆణిముత్యాలు.

ప్రశాంతమైన...
మనస్సు కంటే విలువైన సంపద, ఈ ప్రపంచంలో ఏది లేదు ..

మనశ్శాంతి లేకుంటే జీవితాన్ని గడుపుతున్న మనుషుల ఆవేదన వర్ణనాతీతం, కొన్ని సార్లు డబ్బు ఖర్చు పెట్టి ఎదైనా కైవసం చేసుకోవచ్చేమో గాని, మానసిక ప్రశాంతతను పొందలేరు ..

కుళ్ళు కుతంత్రాలు, అత్యధిక ఆశలు, గొడవలు, కల్మషం, లేని మనస్సు ఉన్నప్పుడే, జీవితంలో చెరగని చిరునవ్వు సొంతం అవుతుంది, అప్పుడే మానసికంగా ప్రశాంతముగా లాభిస్తుంది ..

ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎంతమంది వెంటఉన్నా, ఎంత సంపాదించినా, మానసిక శాంతి లాభించదు, మానసిక ప్రశాంతత లేని జీవితం వ్యర్థం, ఇలాంటి వాళ్ళు నిజంగా నిర్బాగ్యులే ...

శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

నేటి జీవిత సత్యం. *మానసిక వృద్ధాప్యం*

నేటి జీవిత సత్యం. మానసిక వృద్ధాప్యం----//-

మానసిక వృద్ధాప్యం అంటే.. "నాకు ముసలితనం వచ్చేసింది " అనే భావన...

వయసుతో నిమిత్తం లేకుండా పనిలేకుండా శరీరాన్ని మనసును మూలన కూర్చోబెట్టటమే వృద్ధాప్యం... వృద్ధాప్యం అనేది, అనుకునేది ఒక మానసిక భావన...80 ఏళ్ల యువకులు ఉంటారు...40 ఏళ్ల వృద్ధులు ఉంటారు...

భారతీయ సంప్రదాయంలో జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారుగానీ వయో వార్ధక్యాన్ని , మానసిక వృద్ధాప్యాన్ని అంగీకరించలేదు...

నిత్యవ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదని మన భారతీయ సంప్రదాయం చెబుతోంది...

ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం. దుఃఖం వల్ల వచ్చేది భావజం. వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే. కొంతమంది యాభయ్యవ పడిలోకి రాగానే వృద్ధులయ్యారంటారు. కొందరు అరవై సంవత్సరాలకు ముసలివారనిపించుకుంటారు. 70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు. కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది....

పని చేయడానికి బద్ధకించి పని సామర్థ్యాన్ని కోల్పోతే దాన్ని మించిన వార్ధక్యం మరొకటి లేదు. అటువంటివారు సమాజ ప్రగతికే కాక సొంత ప్రగతికి కూడా శత్రువులే. అతి పిసినారితనం, స్వార్థం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం వంటి దురలవాట్లు శరీరంలో అనేక సామర్థ్యాలను బలహీనపరుస్తాయి. అకాల వార్ధక్యానికి దారి తీస్తాయి. ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. అటువంటి వృద్ధులు తమ కుటుంబాలకు సమాజానికి కూడా భారమే. మానసిక ఒత్తిడులు, కుంగుబాటు వల్ల వచ్చే ముసలితనం చెదపురుగులాంటిది. మనిషి భవితను సమూలంగా తినేస్తుంది.....

అందుకే ముసలితనం వయసులో లేదు. మనసులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదని ఆరోగ్య నిపుణులు అంటారు---

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

నేటి మంచిమాట. అహంకారం

నేటి మంచిమాట.
🔥అహంకారం🔥

అర్హతకు మించి పేరువస్తే ...
అహం అధికం అవుతుంది !
పాండిత్యానికి మించి ప్రశంసవస్తే ...
పొగరు పెరిగిపోతుంది !
విద్వత్తును మించి ప్రచారంవస్తే ...
విర్రవీగడం వెల్లువవుతుంది !
సన్మానాలు .. సెహబాష్ లువస్తే…
సాధించేసామని సంబరం పుడుతుంది!
బిరుదులూ .. పురస్కారాలు వస్తే…
బాహుబలులమనే భ్రమ బరితెగిస్తుంది!
శ్రమకు మించి సొమ్ములొస్తే ...
సోమరితనం సొంతమవుతుంది!
అవసరం లేని ధనంవస్తే…
భోగలాలస భగ్గుమంటుంది!
విజ్ఞతలేకుండా బలం వస్తే…
విధ్వంసం మొదలవుతుంది!
అధికార కాంక్ష ఆవరిస్తే…
అంతరాత్మ నోరు మూస్తుంది!
అన్యాయం అవతరిస్తే...
అక్రమం అంతటా ఆవరిస్తుంది!

అందుకే ...
పదవులు.. ప్రచారాల వెంట పడకుండా
అంతస్థు.. అధికారాపేక్షలేకుండా
అత్యాశలు .. అహంకారాలు అంటకుండా
అందినదానితో తృప్తిపడుతూ
ఆనందంగా బ్రతికేయాలి!
మామూలు మనిషిగా …
మంచిగా మనుగడ సాగించాలి!

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

నేటి జీవిత సత్యం. మానవ జీవిత పరమార్ధం.

నేటి జీవిత సత్యం.
మానవ జీవిత పరమార్ధం.

వాడు నన్ను సాయం అడిగాడా..? వాడికి నేను సహాయం చేయటానికి..!

వాడికి నేను అడగకుండానే సహాయం చేశాను. కానీ వెధవకు కృతఙ్ఞత లేశమంతయినాలేదు!
....ఇలాంటి మాటలు మనం చాలా వింటుంటాం!

ఎదుటి వాడికి సహాయం చేసి వాడినుండి తిరిగి మనం ఏదో ఒకటి ఆశిస్తున్నాం !

ఏదీ లేక పోతే కనీసం కృతఙ్ఞత ఆశిస్తున్నాం...
ఇది...
"ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం" లాంటిది.

ఆశించి చేసేది సహాయం అవుతుందా...? ఒక్క సారి ఆలోచించండి!

ఒక చక్కని భర్తృహరి సుభాషితం చూడండి...

"పద్మాకరమ్ దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాలమ్ నాభ్యర్ధితో జలధరోపి జలం దదాతి సన్తఃస్వయమ్ పరహితే విహితాభియోగః"

ఏమి ఆశించి సూర్యుడు తామర కొలను వికసింప చేస్తున్నాడు...?

ఏమి ఆశించి చంద్రుడు కలువలను వికసింప చేస్తున్నాడు...?

ఏమి ఆశించి మేఘం నీటిని మానవాళికి అందిస్తున్నది?

ఏమి ఆశించ కుండా పరులహితం కోరేవాడే సత్పురుషుడు!

మనకు మనం ఎప్పుడూ గొప్పవాళ్లు గానే మనం భావిస్తాం, మన మంచి మనకు ఎప్పుడూ గుర్తుంటుంది (అది మనకు మాత్రమే)

మనం నిజంగా గొప్పవాళ్ళమే అయితే, నిజంగా మనం సత్పురుషులము అని మన మనస్సాక్షి ఒప్పుకుంటే, మనం చేసేది సహాయమే అని మనం భావించేటప్పుడు,
ఎదుటివాడు అడగకుండానే ఎందుకు సహాయం చేయకూడదు..?

జీవితమే ఒక ప్రయాణం! ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులెందరో కానీ ఏదీ శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతం కాదు. నీ నడవడిక శాశ్వతం. గెలిచేది నువ్వే.., ఒడేది నువ్వే..., గెలుపుకి పొంగి పోకుండా, ఓటమికి కుంగిపోకుండా, ధర్మ బద్ధంగా ఫలాపేక్ష లేకుండా, తోటి వారికి సహాయపడుతూ సాగిపోవడమే జీవితం

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

Parents Don’t Die

Parents Don’t Die


People say that when parents die,
the world comes to an end.
The house looks empty.
But I feel that parents live forever
and they stay with us.

The matter of the fact is that
a brother has eyes of his beloved father,
a sister has the pretty face
like the compassionate mother,
a sibling smiles like dad or
a sister cooks like mom.

Parents don't die.
They never leave us.
They live among us.
They live in us.
We are the reflections of our parents.
Despite their physical absence,
they continue to live in us.

When you want to remember parents,
when you want to see them,
when you want to be with them,
simply gather your siblings around you.

You will find the mesmerizing smile
of the mother in one sibling,
the soothing voice of the father in another. You will feel the parents very close to you.
All around you. Deep inside you..

The garden of love that parents cultivate and grow with love, from the time that you are born, with the hard work of their tears and blood; it will continue to bloom,..
unaffected by the cycles of tough weathers of life.. They shelter us in tough times..

Parents don't die.

Love your parents..
Love your siblings..
Continue to feed the garden that parents cultivated with love and compassion so that it never stops to bloom and blossom..

You will make your world a living paradise on earth.. A heaven that only knows love, compassion, care, respect and it has You..

I thought it is worth sharing ...

సేకరణ