Monday, March 31, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-4594️⃣5️⃣9️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                   
               (సరళమైన తెలుగులో)

*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*42. వ శ్లోకము:*

*”శమో దమ స్తపశ్శౌచం క్షాన్తి రార్జవమేవ చl*
 *జ్ఞానం విజ్ఞానమా స్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజమ్ll”*

“ఇంద్రియములను నిగ్రహించడం, మనస్సును అదుపులో పెట్టుకోవడం, తపస్సు చేయడం అంటే అనుకున్న పనిని ఒక తపస్సు లాగా శ్రద్ధాభక్తులతో చేయగలగాలి. శరీరాన్ని మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడం, తన జీవనానికి కావలసిన వరకే సంపాదించుకోవాలి కాని ఎక్కువ సంపదలు, సుఖాల జోలికి పోకూడదు. శరీరమును, మనస్సును శుచిగా ఉంచుకోవడం, ఓర్పువహించడం, కపటం లేకుండా, సక్రమమైన ప్రవర్తన కలిగి ఉండటం, త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి అంటే మనసులో అనుకున్నది, మాటలతో చెప్పేది, చేతలతో చేసేది ఒకే విధంగా ఉండాలి. నిరంతరం వేదములను, శాస్త్రములను అధ్యయనం చేయడం, తద్వారా జ్ఞానం సంపాదించడం, సంపాదించిన జ్ఞానమును అనుభవంలోకి తెచ్చుకొని, ఇతరులకు మార్గదర్శకం చేయడం, దేవుడిని నమ్మడం, వేదముల మీద, శాస్త్రముల మీద నమ్మకం కలిగి వాటిని నిరంతరం అధ్యయనం చేయడం, గురువు గారి యందు భక్తి కలిగి ఉండటం, ఇవి అన్నీ బ్రాహ్మణులు ఆచరించవలసిన కర్మలు. ఈ కర్మలన్నీ బ్రాహ్మణునికి స్వభావ సిద్ధంగా పుట్టినవి. ఈ కర్మలు ఆచరిస్తేనే అతడిని బ్రాహ్మణుడు అని అంటారు.”
```
‘స్థూలంగా చెప్పాలంటే వేదములను, శాస్త్రములను అధ్యయనం చేయడం, వాటిని ఆచరించడం, వాటిని శిష్యులకు బోధించడం, ఆ విధంగా వేదవిజ్ఞానాన్ని గురుశిష్య పరంపరగా, తల్లితండ్రులు తమ కుమారులకు ఇచ్చే వారసత్వసంపదగా తరతరాలుగా వ్యాప్తిచెందించడం, మానవులను ధర్మమార్గంలో నడిపించడం. దీనినే బ్రాహ్మణ కర్మలు అని అంటారు. ఇవి చేయని వాడు పుట్టుకతో బ్రాహ్మణుడు అయినా, కర్మరీత్యా, స్వభావ రీత్యా బ్రాహ్మణుడు కాడు అనే విషయం చెప్పనక్కరలేదు.```


*43. వ శ్లోకము:*

*”శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధేచాప్యపలాయనమ్l*
 *దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ll”*

“ధైర్య శౌర్యపరాక్రమాలు కలిగి ఉండటం, తేజస్సు కలిగి ఉండటం, ఎదుడి వాడితో పోరాడే సామర్థ్యం కలిగి ఉండటం, అందరినీ పాలించే సామర్థ్యం, అందరినీ అదుపులో పెట్టగలిగే నేర్పు శాసించగల స్థైర్యం కలిగి ఉండటం, అమితమైన పట్టుదల కలిగిఉండటం, పిరికితనం, యుద్ధంలో పారిపోయే బుద్ధి లేకుండా ఉండటం, పేదలకు, అర్హులకు దానధర్మాలు చేయడం, పరిపాలనా దక్షత, న్యాయశాస్త్ర నైపుణ్యము కలిగి ఉండటం, ఇవన్నీ క్షత్రియ ధర్మాలు. ఈ లక్షణాలు ఉన్నవాడు ఎవరైనా క్షత్రియుడే. బ్రాహ్మణుడు తన బుద్ధిని ఉపయోగిస్తే, క్షత్రియుడు తన శరీరాన్ని, బుద్ధిని రెండింటినీ ఉపయోగిస్తాడు. బ్రాహ్మణుడు మంత్రిగా మంత్రాంగం చేస్తే, క్షత్రియుడు తన క్షాత్రంతో దానిని సమర్థవంతంగా ఆచరిస్తాడు. అందుకే ముందు నుండి బ్రాహ్మణ, క్షత్రియులకు అవినాభావ సంబంధం ఉంది.”
```
దేశాల మధ్య జరిగే యుద్ధాలలో సైనికులుపాల్గొంటారు. ధైర్యంతో పోరాడతారు. కాని, మనలో కూడా ప్రతిరోజూ మంచి చెడులకు మధ్య ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, అవునా కాదా.... అనే సమస్యలు... 
ఈ విరుద్ధభావాల మధ్య నిరంరతం అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కొంత మంది భయపడి పిరికి వాళ్ల లాగా ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి కొందరు ఎటువంటి సమస్యను అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు. మరి కొందరు సమస్యలకు భయపడి పారి పోతారు. దైనందిన సమస్యలను ఎదుర్కోడంలో ప్రతివాడూ క్షత్రియ గుణమును ప్రదర్శించాలి. వాడే క్షత్రియ స్వభావము కలవాడు. పిరికితనంతో ఆత్మహత్యలకు పాల్పడితే వాడికి క్షత్రియ స్వభావము లేనట్టే. అంతే కాకుండా క్షత్రియ స్వభావాలలో పరిపాలన, న్యాయ నిర్ణయం ముఖ్యమైనవి. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ పరిపాలన, న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి వేళ్లూనుకు పోయింది. అధికారంలో ఉన్న రాజకీయనాయకులు, కార్యదర్శి స్థాయి అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. న్యాయ వ్యవస్థ కూడా అప్పుడప్పుడు ఈ అవినీతి ఊబిలో చిక్కుకుపోతూ ఉంది. ఇటువంటి వారిని క్షత్రియ స్వభావం కలవారు అని అనలేము. క్షత్రియుడి మూలస్వభావము అవినీతి రహిత జీవనము, నిస్వార్ధపరత్వము, నిష్పక్షపాతము. ఇవి లేకపోతే అతడు క్షత్రియుడు కాలేడు. మూర్తీభవించిన ధర్మస్వరూపుడు కాబట్టే యమధర్మరాజును సమవర్తి అని అన్నారు. కాని మన సినిమాలు ఆయనను ఎలా చిత్రీకరిస్తున్నారో చూస్తే మనం సిగ్గుపడాలి.✍️```
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 *మన కష్టాలు కష్టాలేనా?*
                   


*’కష్టాలు! కష్టాలు!’ అని మనం తెగ బాధపడతాం.*
*కాని నిజానికి మనవి కష్టాలు అంటారా?*

*ఇంద్రుడు అంతటి వాడు శాపం తట్టుకోలేక వెళ్లి తామర తూడులో దాక్కున్నాడు.*

*నహుషుడు శాపం వలన తొండగా మారి పోయాడు.*

*సత్య హరిశ్చంద్రుదు అమ్ముడుపోయి కాటికాపరిగా ఉండలేదా?*

*హరిభక్తుడైన పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు తనసంపదలు కోల్పోయి గాడిదగా మారి ఊక తిన్నాడు.*

*పాండవులు అడవుల పాలయ్యారు. వేరేవాడి దగ్గర ఆవులు  కాచారు, గుర్రాలను మేపారు. వంటలు వండారు. సేవ చేశారు.*

*నలుడు భార్యని కూడా కోల్పోయి తన శౌర్యం కోల్పోయి అడవుల్లో తిరిగాడు.*

*దేవతలు తమ ప్రతిభ కోల్పోయి తలా ఓ దిక్కు పారిపోయి వందల సంవత్సరాలు దాక్కున్నారు.*

*రాముడంతటి వాడే భార్యతో అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది.*

*శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగే దాడులు ఎదుర్కుంటూనే ఉన్నాడు.    అనేకమంది రాక్షసులు, సైంధవుడు, జరాసంధుడు, ఎందఱో కృష్ణుడి మీదికి, అతడి రాజ్యం మీదికి మాటి మాటికి దాడులు చేశారు. చివరికి తన కొడుకుని తన కళ్ళ ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు.*
*ఆయన భార్యలనిదొంగలు ఎత్తుకెళ్ళి పోయారు. రుక్మిణికి అర్జునుడు చితి పేర్చితే యోగ విద్య ద్వారా ఆ మంటల్లోకి ఆహుతి అయింది.*

*సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి శరీరం వదిలింది.*

*పెళ్లైంది మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతీదేవి  దృతరాష్ట్రుడి తో  సహా అగ్నీకీలల్లో ఆహుతై పోయింది.*

*ఇంద్రుడి కొడుకు శాపం వలన కాకిగా మారిపోయాడు.*

*అంతటి దేవతలు, మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారు.  వీటి ముందు మనకి వచ్చే  చిన్ని చిన్ని కష్టాలు కూడా                 ఓ లెక్కంటారా?   కానేకాదు!*

*ప్రతీది కాలం నిర్ణయిస్తుంది..    నీకు ఎప్పుడు ఏది దక్కాలో అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. అది కష్టం అయినా  సుఖం అయినా.. ఓపికతో ఉండాలి.. ధైర్యంగా ఎదుర్కోవాలి...  లక్ష్యాన్ని సాధించాలి.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

చాగంటి వారి ప్రవచనాల నుండి..``` *మనిషిని మంచిమార్గంలో పెట్టగలిగే.. రెండు విషయాలు...*

 ```చాగంటి వారి ప్రవచనాల నుండి..```


*మనిషిని మంచిమార్గంలో పెట్టగలిగే.. రెండు విషయాలు...*
                  

```
ప్రకృతిలో మరే జీవికీ లేని సౌలభ్యం ఒక్క మనుష్యునికే ఉన్నది. పుట్టుకతో ఒకవేళ స్వభావంలో దోషమున్నా, చెడు గుణాలున్నా, వాసనాబలంగా గత జన్మల నుంచి దోషభూయిష్టమైన విషయాలు మనసు పుచ్చుకున్నా రెండు కారణాల చేత అతను బుద్ధిని మార్చుకోగలడు.
అంతేకాకుండా...
మంచి కార్యక్రమాలవైపు మనస్సును మళ్ళించగలడు.

అలా అత్యంత ప్రభావవంతమైనవి, బుద్ధిని ప్రచోదనం చేయగలిగినవి, మనిషిని సత్కర్మాచరణవైపు నడిపించగలిగినవి రెండు ఉన్నాయి లోకంలో–
ఒకటి సత్సంగం, మరొకటి–మంచి పుస్తక పఠనం!

సత్సంగం అంటే మంచి వ్యక్తులతో కూడిక. 
మనం ఏకాలంలో జీవిస్తున్నామో, ఆ కాలంలోనే కొంతమంది మహాత్ములు కూడా జీవిస్తుంటారు, మంచి గుణాలు కలిగిన కొంతమంది పెద్దలు జీవిస్తుంటారు, సమాజంలో లబ్ధప్రతిష్టులయినవారు, శాస్త్రాన్ని తెలుసుకుని, దానిప్రకారం అనుష్ఠానం చేసేవారు నిరంతరం శాంతికోసం పరితపించేవారు కనబడుతుంటారు.

ప్రయత్న పూర్వకంగా  అటువంటివారితో స్నేహాన్ని పెంచుకుని వారికి దగ్గరగా జీవించగలగడం, వారితో కలిసి ఉండడం... అనేది మన మనసును మంచి మార్గం వైపు మళ్ళించడానికి తోడ్పడుతుంది.


కొన్ని గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలన్నింటినీ చదివి, మంచి విషయాలను బాగా మనసుకు పట్టించుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి ఎంత కాలం పడుతుందో దానికి కోటి వంతు కాలంలో మార్పు తీసుకురాగలగినది–మంచి వ్యక్తులతో కలిసి ఉండడం.

అందుకే శంకర భగవత్పాదులు మోహముద్గరంలో–
```
*’సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః’*``` అంటారు. 

మంచి మనుషులతో కలిసి ఉన్నంత మాత్రం చేత అది విశేష ప్రభావాన్ని చూపుతుంది.

రామకృష్ణ పరమహంస ఒక మాట చెబుతుండేవారు...

ఏనుగు తనంతట తానుగా ఎవరికీ లొంగదు. కానీ మావటికి లొంగి ఉంటుంది. అయినా నడుస్తూ నడుస్తూ దారిలో కనిపించిన చెట్ల కొమ్మలను తొండంతో విరిచే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ మావటి   దాని తొండంమీద చిన్న దెబ్బ వేయగానే తొండాన్ని దించేస్తుంది.

అలాగే మంచివారితో కూడి ఉన్న కారణం చేత మనం కూడా మంచి మార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది.

సమకాలీన సమాజంలో మంచి వ్యక్తులతో కలిసి జీవించడం ప్రయత్నపూర్వకంగా వారి స్నేహాన్ని పొందడం ఎంత గొప్ప లక్షణమో, మంచి పుస్తకాలు ఇంట్లో ఉండడం –అంతమంది మహాత్ములు ఇంట్లో ఉండడంతో సమానం.

వివేకానందుడు రాసిన పుస్తకాలు, రామకృష్ణ పరమహంస ప్రవచనాలతో ఉన్న పుస్తకాలు, కంచి కామకోటి పూర్వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర మహా సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణాలు, శృంగేరీ పీఠాధిపతులు భారతీ తీర్ధ మహాస్వామి వారి దివ్యవాక్కులు... ఇటువంటి మహాత్ముల మాటలతో కూడిన పుస్తకాలు ఇంట్లో ఉండడం అంటే అటువంటివారితో కలసి జీవించడంతో సమానం.

మీరెప్పుడెప్పుడు అటువంటి వారినుండి నాలుగు మంచి మాటలు విందామని అనుకుంటున్నారో అప్పుడప్పుడు సిద్ధంగా ఉండి మీతో మంచి బోధలు చేయడానికి వాళ్ళు మీ ఇంట్లోనే కుర్చీ వేసుకుని సిద్ధంగా కూర్చోవడంతో సమానం.✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 🔔 *ఓం శక్తి* 🔔

*🙏108 శక్తిపీఠాలు🙏*

      *పరమేశ్వరుడు పరాశక్తితో వీటన్నింటా సన్నిధి చేసి ఉంటాడు. వీటిని స్మరించినా, విన్నా..భక్తులకు పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది. అష్టోత్తర శతనామాలను జపించినా, పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకున్నా దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి.* 

     *శ్రాధ్ధ కాలంలో వీటిని స్మరించినయెడల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఇవి సాక్షాత్తు ముక్తి క్షేత్రాలు.*

1. వారణాసిలో...విశాలాక్షి
2. ముఖనివాసంలో..గౌరి
౩. నైవిశంలో...లింగధారిణి
4. ప్రయాగలో..లలిత
5. గంధమాదనంమీద..కౌముకి
6. మానస క్షేత్రంలో..కుముద
7. దక్షిణ క్షేత్రంలో..విశ్వకామ
8. ఉత్తర క్షేత్రంలో..విశ్వకామప్రరూపిణీ
9. గోమంతంలో..గోమతి
10. మందరంలో..కామచారిణీ

11. చైత్రరథంలో..మదోత్కట
12. హస్తినాపురంలో..జయంతి
13. కన్యాకుబ్జంలో..గౌరి
14. మలయాచలంపై..రంభ
15. ఏకామ్ర పీఠంలో..కీర్తిమతి
16. విశ్వక్షేత్రంలో..విశ్వేశ్వరి
17. పుష్కర క్షేత్రంలో..పురుహూతిక
18. కేదారంలో...సన్మార్గదాయిని
19. హిమాలయంలో..మంద
20. గోకర్ణంలో..భద్రకర్ణిక

21. స్థానేశ్వరంలో..భవాని
22. బిల్వక్షేత్రంలో..బిల్వపత్రిక
23. శ్రీశైలంలో..మాధవి
24. భద్రేశ్వరంలో..భద్ర
25. వరాహాశైలంమీద..జయ
26. కమలాయంలో..కమల
27. రుద్రకోటిలో..రుద్రాణీ
28. కాలంజర క్షేత్రంలో..కాళి
29. శాలగ్రమంలో..మహాదేవి
౩౦. శివలింగక్షేత్రంలో..జలప్రియ

౩1. మహాలింగంలో..కపిల
౩2. మాకోట క్షేత్రంలో..ముకుటేశ్వరి
౩౩. మాయాపురిలో..కుమారి
౩4. సంతానక్షేత్రంలో..లలితాంబిక
౩5. గయాక్షేత్రంలో..మంగళాదేవి
౩6. పురుషోత్తమపురంలో..విమలాదేవి
౩7. సహస్రాక్షంలో..ఉత్పలాక్షి (సిధ్ధ పీఠాలు)
౩8. హిరణ్యాక్షంలో...మహోత్పల
౩9. విశాపాక్షేత్రంలో..అమోఘాక్షి
4౦. పుండ్రావర్ధనంలో..పాడల

41. సుపార్శ్వసుపార్శ్వం
42. త్రికూటంలో..రుద్రసుందరి
4౩. విపులక్షేత్రంలో..విపులాదేవి
44. మలయాచలంమీద..కళ్యాణి
45. సహ్యాద్రి మీర..ఏకవీర
46. హరిశ్చంద్ర క్షేత్రంలో..చంద్రిక
47. రామతీర్ఠంలో..రమణ 
48. యమునలో..మృగావతి
49. కోటతీర్థంలో..కోటవి
50. మాధవవనంలో..సుగంధ

51. గోదావరిలో..త్రిసంధ్య
52. గంగాతీరంలో..రతిప్రియ
53. శివకుండంలో..శుభానంద
54. దేవికాతటంలో..నందినీదేవి
55. ద్వారవతిలో..రుక్మిణీ
56. బృందావనంలో..రాధ
57. మధురలో..దేవకి
58. పాతాళంలో..పరమేశ్వరి
59. చిత్రకూటంలో..సీత
60. వింధ్యపర్వతంపై..వింధ్యావాసిని

61. కరవీరదేశంలో..మహాలక్ష్మి
62. వినాయకక్షేత్రంలో..ఉమాదేవి
63. వైద్యనాథంలో..ఆరోగ్య
64. మహాకాళక్షేత్రంలో..మమ మహేశ్వరి
65. ఉష్ణతీర్థంలో..అభయ
66. వింధ్యపర్వత సానువుల్లో..నితంబ
67. మాండవ్యంలో..మాండవి
68. మహేశ్వరపురంలో..స్వాహాదేవి
69. ఛాగలండభూమిలో..ప్రచండ
70. అమరకంటకంలో..చండిక

71. సోమేశ్వరంలో..వరారోహ
72. ప్రభాసతీర్థంలో..పుష్కరావతి
73. సరస్వతిలో..దేవమాత
74. తటంలో..పారావారాదేవి
75. మహాలయంలో..మహాభాగ
76. పయోష్ణిలో..సింగలేశ్వరి
77. కృతశాచంలో..సింహిక
78. కార్తీకంలో..అతిశంకరి
79. ఉత్పలావర్తకంలో..లోలాదేవి
80. శోణసంగమక్షేత్రంలో..సుభద్ర

Sree Mahalakshmi Gayatri Mantra 108 times  🙏🏻
https://youtu.be/Lb5-xaVZhp4

81. సిధ్ధవనంలో..లక్ష్మీమాత
82. భరతాశ్రమంలో..విశ్వముఖి
83. కిష్కింధ పర్వతంపై..తారాదేవి
84. దేవదారువనంలో..పుష్టి
85. కాశ్మీరంలో..మేధాదేవి
86. హిమాద్రిలో..భీమాదేవి
87. హిమాద్రిలో..తుష్టి,విశ్వేశ్వరి
88. కపాలమోచనక్షేత్రంలో..శుధ్ధి
89. కాయావరోహణంలో..మాత
90. శంఖోధ్ధారంలో..ధరాదేవి

91. పిండాకారంలో..ధృతి
92. చంద్రభాగాతీర్థంలో..కళాదేవి
9౩. అచ్ఛోదంలో..శివధారిణీ
94. వేణాక్షేత్రంలో..అమృతాదేవి
95. బదరీక్షేత్రంలో..ఊర్వశి
96. ఉత్తరకురుక్షేత్రంలో..ఔషధి
97. కుశద్వీపంలో..కుశోదక
98. హేమకూటంలో..మన్మధ
99. కుముదక్షేత్రంలో..సత్యవాదిని
100. అశ్వత్థంలో..వందనీయ

101. వైశ్రవణంలో..నిధి
102. వేదవదనంలో..గాయత్రి
10౩. శివసన్నిధిలో..పార్వతి
104. దేవలోకంలో..ఇంద్రాణి
105. బ్రహ్మవదనంలో..సరస్వతి
106. సూర్యబింబంలో..ప్రభ
107. మాతలలో..వైష్ణవీమాత
108. సతులలో..అరుంధతి

109. స్త్రీలలో..తిలోత్తమ
110. చిత్తంలో..బ్రహ్మకళ
111. శరీరధారులలో..శక్తిరూపిణీ
 సతీదేవి అంగభూతాలు.

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
 🔔 *జై శ్రీరాం* 🔔

*ప్రాచీన ప్రదేశాలు – ఆధునిక నామధేయాలు* 

        *రామాయణం* 

1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం – గంగోత్రి, ఉత్తరాఖండ్

2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) – గంగాసాగర్, వెస్ట్ బెంగాల్

3. కాంభోజ రాజ్యం – ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).

4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా

5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు – గోకర్ణ, కర్ణాటక
6. సీతాదేవి భూమిలో లభించిన చోటు – సీతామర్హి, బీహార్

7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) – జనక్ పూర్, నేపాల్

8. కోసలదేశం – రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం

9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం – ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.

10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) – ఘాఘర నది.

11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) – అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.

12. తాటక వధ జరిగిన ప్రదేశం – బక్సర్, బీహార్

13. అహల్య శాపవిమోచన స్థలం – అహిరౌలి,బీహార్

14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) – సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్

15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు – శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
16 దండకారణ్యం – చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.

17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) – సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.

18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) – నాసిక్, మహరాష్ట్ర.
19. కబంధాశ్రమం – కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.

20. శబరి ఆశ్రమం – సర్బన్, బెల్గావి, కర్ణాటక.

21. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం – హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.

22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక

23. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం – ధనుష్కొటి, తమిళనాడు.

24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు

25. రత్నద్వీపం / సింహళం / లంక – శ్రీలంక.

26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) – కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక

27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు – దునువిల్ల, శ్రీలంక

28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం – దివిరుంపోల, శ్రీలంక.

29. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం – ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.

30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) – కుశార్, పాకిస్తాన్.

31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) – లాహోర్, పాకిస్తాన్

32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) – తక్షశిల, పాకిస్తాన్

33. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించెను. 

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
 *మార్చి 31*

*దురాశ దుఃఖానికి దారితీస్తుంది*

*తిండి, నిద్ర, మాటలలో మితాన్ని పాటించినప్పుడు ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉంటాయి. మానవ ధర్మాలను మనం నిర్వర్తించాలి. మన శక్తికి తగిన పనులలో ప్రవేశించాలి. ఏ స్థానములో, ఏ పరిస్థితిలో, ఏవిధముగా ప్రవర్తించాలో చక్కగా విచారణ చేయాలి. దేశ కాల పరిస్థితుల ప్రభావమును దృష్టిలో ఉంచుకొని సక్రమముగా ప్రవర్తించాలి. అప్పుడే మనకు క్షేమం కలుగుతుంది.* 

*ఒక చిన్న ఉదాహరణ చూడండి. నీటిలో జీవించడము చేపకు సహజము. దానికది ఆనందము. నీటికంటే ఉత్తమమైనది కదా అని దానిని పాలలో వేస్తే అది ప్రమాదానికి గురి అవుతుంది. పాలకంటే నీరు తక్కువదైనప్పటికీ నీటియందే చేప సురక్షితముగా జీవించడానికి అవకాశముంది. అట్లే, మనకు మించిన స్థానాన్ని, పదవులను, సిరిసంపదలను ఆశించినప్పుడు మన ఇంద్రియములు పెడమార్గం పట్టే ప్రమాదముంది.* 

*మనం జీవించడానికి ఎంత అవసరమో అంత ఆశించవచ్చు. దురాశ దుఃఖానికి దారితీస్తుంది.*
🌺🌺🌺 🙏🕉️🙏 🌺🌺🌺
 *కలశం తొ పూజ ఎందుకు చేస్తారు? సృష్టికి ముందు ఏం జరిగింది?*

*ఇంట్లో శుభకార్యం లేదా వ్రతం చేస్తున్నారంటే. తప్పకుండా కలశాన్ని ఏర్పాటు చేయాల్సిందే. రాగి, ఇత్తడి, వెండి లేక మట్టి పాత్రను తీసుకుని దాని నిండా నీరుపోసి దానికి పసుపు, కుంకుమ రాసి అందులో నాలుగు మామిడి ఆకులు ఒక కొబ్బరికాయ ఉంచి దాని చుట్టూ పసుపు దారం చుట్టి కలశాన్ని ఏర్పాటు చేస్తారు.*

*అయితే కలశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే... సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు పాల సముద్రము మీద శయనించుచున్న తరుణంలో అతని నాభి నుంచి ఒక కలువ పువ్వు ఉద్భవించినది.*
 
*దాని మీద కూర్చుని బ్రహ్మ ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. అంతా జలమయమై ఉన్న విశ్వంలో బ్రహ్మ సృష్టి ప్రారంభమైంది. సృష్టికి ముందు విశ్వమంతా జలమయంగానే వున్నదని పురాణాలు చెప్తున్నాయి.*

*విశ్వం జలమయం కావడం సమస్త జీవులను నీరే ఆధారమనే విషయాన్ని మానవాళి అర్థం చేసుకోవచ్చు. నీరు పూజ్యనీయమైంది. అందుకే ఏ పూజ చేసినా కలశం ఏర్పాటు చేసి... అందులో పవిత్ర జలంతో నింపుతారు.*
 
*కలశానికి పూచే పసుపు కుంకుమలు, మామిడి ఆకులు సౌభాగ్యానికి సంకేతం. కలశములోని నీరు సమస్త విశ్వానికి ప్రతీక. ఇందులో దేవతలుంటారని వారిని ఆహ్వానించే దిశగానే కలశపూజ చేస్తారని విశ్వాసం. ఈ కలశాన్ని పూజించడం ద్వారా సకల దేవతామూర్తులను పూజించడంతో సమానం.*

*┈┉┅━❀꧁హరి ఓమ్꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🍁🌹🍁 🙏🕉️🙏 🍁🌹🍁
 *_జీవితమనేది ఊరికే కాదు... కన్నీళ్లు పెట్టికోవాలి... కష్టాలు ఎదుర్కోవాలి... బాధలు తట్టుకోవాలి... మనస్సుకి గాయాలు చేసుకోవాలి... మాటలకు గుండె ముక్కలు కావాలి... ఎదురు దెబ్బలు తినాలి..._*

*_అంతేకాదు కొన్నిసార్లు బంధాలను కోల్పోవాలి... సహనంతో మెలగాలి... గుణపాఠాలు నేర్చుకోవాలి... చేసిన తప్పులను దిద్దికోవాలి... ప్రతిక్షణం నీతో నీవు యుద్ధం చేయాలి._*

*_నీ మీద నీకు నమ్మకం ఉండాలి... నీ నిర్ణయం మీద నీకు ధైర్యం ఉండాలి... నీ నిశ్చయత మీద నీకు ప్రణాళిక ఉండాలి... నీ ఆలోచన మీద నీకు నిలకడ ఉండాలి..._*

*_ఎన్నో ఆశలు ఉండొచ్చు కానీ, ఆశలు లేకున్నా ఉన్నదానిలో తృప్తిగా, మనస్ఫూర్తిగా... మనసారా... బ్రతకడం నేర్చుకోవాలి..._*

*_ఏదో చేయాలని ఆశ... ఎదో చేయలేకున్నా చేసేదానిలో సంతృప్తి పొందాలి... లోకమంతా విహరించకున్నా విరహం లేకుండా బ్రతకగలగాలి..._*

*_ఆశించటం అంటే కనపడే చెట్టుపై ఉన్న కాయలను  కోసినంత సులువు కాదు... ఆశించిన దానిని పొందడం దానికి ఎంతో నిబద్ధతతో నిజాయితీగా ఉన్నప్పుడు అనుకున్నవి పొందగలం._*

*_అలాగే ఎన్ని ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురైనా... నీ చుట్టు అంధకారం చుట్టు ముట్టినా... తొందరపడకు, కాస్త సహనం వహించు... అవన్నీ నీకు తల వంచుతాయి..._*

*_ఎప్పుడు ఏమరుపాటు వద్దు. నేర్పుగా, ఓర్పుతో... ముందుకు సాగిపో... నీ నిర్ణయం సరైంది అయితే పైవాడు తప్పక అనుగ్రహం చూపిస్తాడు ఇందులో ఎలాంటి సందేహం లేదు._*

*_నమ్మటం... నమ్మకపోవడం అది నీ ఇష్టం. నీ చేతనైతే నమ్మకం నీలో ఉంటే... ఆ దైవమే నీకు దారి చూపిస్తుంది. దానికి ఉండవలసింది నీమీద నీకు ఆత్మవిశ్వాసం, రెండవది ప్రయత్నవాదం._*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🏵️🌻🏵️ 🌷🙇🌷 🏵️🌻🏵️
 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
          *మానవత్వ పరిమళం*

*రెండక్షరాల ప్రేమకు- ఇతరులకు సాయం చేసే చేతులు ఉంటాయి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు పరుగులు తీసే పాదాలుంటాయి. ఆక్రందన వినగలిగే చెవులు ఉంటాయి. కష్టాల్ని ప్రత్యక్షంగా చూసే కళ్లుంటాయి. ఈ లక్షణాలున్న రెండక్షరాల ప్రేమను రెట్టింపు చేస్తే నాలుగక్షరాల మానవత్వం అవుతుంది. ఇది ఎక్కడి నుంచి పుడుతుంది? పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. విలువలు, మర్యాదలు, సంస్కృతి, సంప్రదాయాలు, సుఖాలు, దుఃఖాలు... అందరూ కలిసి పంచుకునేవారు. ఇంట్లో పెద్దవారు అనుబంధాలకు పెద్దపీట వేసేవారు. కలుషితాలను సైతం కలుపుకొనిపోయే నదీప్రవాహంలా మానవత్వంతో సాగిపోయే సమాజం ఉండేది.*

*జీవితంలో సాధించడం, అనుభవించడం, సాఫల్యం పొందడం అనేవి ముక్కాలి పీటకు మూడుకాళ్ల వంటివి. ఇందులో మొదటి రెండింటితోనే చాలామంది జీవితాన్ని గడిపేస్తుంటారు. జీవిత సాఫల్యం సులువుగా లభించదు. దీనికి కావలసిన ముడిసరకు- ప్రేమ. దీన్ని పంచడం, పెంచడం, తిరిగి పొందడంలో సమత్వం ఆచరించాలి.*

*రమణ మహర్షి పశుపక్ష్యాదుల పట్ల ప్రేమ, ఆదరణ చూపేవారు. జంతువులను, పక్షులను ప్రేమతో పలకరించి లాలించేవారు. తన చేతులతో తినిపించేవారు. అది చూసిన ఓ భక్తుడు 'భగవాన్! మేము మీ మాట కోసం, మీ చేతి ప్రసాదం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా, మా చూడరు. ఇది న్యాయమా?' అని దానికి రమణులు చిరు నవ్వుతో 'పశువులు, పక్షులు అత్యంత సహజంగా నా దగ్గరకు వస్తాయి. ఏ కోరికలు, ఏ ప్రశ్నలు వాటికి ఉండవు.*

*అందుచేత వాటిని నేను సహజంగా ప్రేమిస్తాను. వాటి పట్ల మానవత్వంతో ప్రవర్తించడం నాకు ఇష్టం అన్నారు.*

*సాఫల్యం సాధించడానికి మానవత్వంతో పాటు, దాన్ని ప్రదర్శించడానికి ఫలితాలకు అతీతమైన ధైర్యం కావాలి. మరణించాక కూడా గుర్తుండి పోవాలంటే, చరిత్ర పుటల్లో రాయదగిన పనులు చెయ్యాలి. రాముడికి ఉడత చేసిన సాయం చిన్నదే. కానీ అది నేటికీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. పరోపకారమే పుణ్యమని, పరపీడనం పాపమని అష్టాదశ పురాణాల సారాంశం.*

*సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడాలన్నారు గురజాడ. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ థెరెసా ఆచరించి చూపారు. ఇతరులకు చేసే మేలే నిజమైన సంపద అన్నది మహమ్మద్ ప్రవక్త ప్రబోధం. నువ్వు జీవించడమే కాదు, సాటి వారిని కూడా జీవింపజేయాలని జీసస్ బోధించాడు. వీటన్నింటి అంతరార్థం ఒక్కటే- ప్రేమపూరిత మానవత్వం.*

*నేటికీ కుబేరులే కాకుండా సగటు మనుషులు ఎందరో ఎన్నో రూపాల్లో మానవత్వం కనబరుస్తున్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి సామాజిక సమస్యలతో పాటు ప్రకృతి విపత్తులు, ప్రాణాంతక రోగాల సమయాల్లోనూ చేయూత ఇస్తున్న ఎంతోమంది అదృశ్య దానకర్ణులు ఉన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు జీవకారుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.*

*అయినవారికి మనం సాయం చేయడం మంచితనం. అదే అందరూ మనవారే అనుకుని చేసే సహాయం- మానవత్వం. సమస్త ప్రాణికోటినీ సమదృష్టితో చూడాలి. దానివల్ల ఎదురయ్యే సాఫల్య వైఫల్యాలను సమభావంతో స్వీకరించినప్పుడే అనిర్వచనీయమైన మానవత్వం పరిమళాల్ని వెదజల్లుతుంది.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🦚🌴 🦚🌴🦚 🌴🦚🌴

Co-Living Hostels EFFECT:Hyderabad Coliving Hostels Real Facts Exposed By Astrologer Satyanarayana

Co-Living Hostels EFFECT:Hyderabad Coliving Hostels Real Facts Exposed By Astrologer Satyanarayana



[ప్రశంస] నమస్తే వెల్కమ్ టు మాగ్న టీవీ నేను ఆదిత్య ఇటీవల కాలంలో పెళ్లికి ముందే సహజీవనం ఇంగ్లీష్ లో కాస్త పాష్ గా చెప్పాలంటే కోలీవింగ్ ఇది చాలా అఫీషియల్ గా చూస్తున్నారు ఇదేదో ఒక గొప్ప విషయం అన్నట్టుగా చాలా మంది ఫీల్ అవుతున్నారు అసలు ఈ కోలీవింగ్ ఎఫెక్ట్ అనేది ఈ జనరేషన్ పిల్లల మీద ఏ విధంగా ఉంది అసలు కో లీవింగ్ లో ఉన్న తర్వాత దాని తర్వాత అసలు వాళ్ళు పర్సనల్ గా ఎలాంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇలాంటి ఎన్నో అంశాలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనాడు గారు ఉన్నారు ఒకసారి సార్ తో మాట్లాడిచ్చి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఆది మై డియర్ జూనియర్ ఎన్టీఆర్ ఎస్ థాంక్యూ సార్ సర్ కో లివింగ్ కల్చర్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ లో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది అసలు ఈ కో లివింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనొచ్చు అసలు దీని ఇంపాక్ట్ అనేది రానున్న రోజులో ఏ విధంగా ఉండిపోతుంది కో లివింగ్ అని చక్కగా పోస్ట్ గా ఇంగ్లీష్ లో చెప్తున్నారు దీన్ని తెలుగులో ఏంటంటే ఉంచుకోవడము రంకుతనము ప్రాస్టిట్యూషన్ అని పచ్చి భాషలో చెప్పాలి ఇది మేము యాంగ్లో ఇండియన్ స్కూల్లో చదువుకున్నాం రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి మాకందరూ యంగ్లో ఇండియన్ టీచర్స్ే బ్రిటిషర్స్ సంతానం వాళ్ళు వాళ్లే చేయలేదు కోలివింగ్ ఆ తర్వాత ఇప్పుడుఉన్నటువంటి దేశాలలో మనం వినడం అంతే కలిసి ఉంటారు వాళ్ళు కానీ తెల్లవాళ్ళకు ఉన్న గొప్ప ఒక కమిట్మెంట్ ఏంటంటే ఇఫ్ దే గివ్ కమిట్మెంట్ టు వన్ పర్సన్ వాళ్ళతోనే ఉంటారు నెవర్ లుక్ అట్ ద సెకండ్ పర్సన్ దట్ ఇస్ ద సిస్టం ఇన్ బ్రిటన్ ఇన్ యusఎస్ఏఎవరీవేర్ ఓకే దట్ ఇస్ నాట్ కన్సిడర్డ్ యస్ కోలివింగ్ అప్పుడు కూడా మా చిన్నప్పుడు కూడా అది కోలివింగ్ గా కన్సిడర్ చేసేవారు కాదు దాన్ని ఏమనేవారంటే ఒక బ్రిటిషర్ ఒక ఆడమ్మాయి ఉంది ఇంకొక ఆయన ఎవరో చేసుకున్నాడు పెళ్లి వాళ్ళు వాళ్ళు ఆమెకి ఇద్దరు సంతానం ఉండొచ్చు వీళ్ళకి ఇద్దరు సంతానం ఉండొచ్చు కలిసి చేసుకుంటారు కమిట్మెంట్ తో కావలసినంత కాలం మాత్రము వాళ్ళు డైవర్స్ తీసుకున్నంత కాలము ఉంటారు మ్యారేజ్ చేసుకుంటారు తర్వాత విడిపోయేటప్పుడు అండర్స్టాండింగ్ తో డైవర్స్ అయిపోతారు దే విల్ డిజల్వ్ దర్ మ్యరేజ్ దిస్ ఇస్ ద సిస్టం దేర్ ఇస్ నో సిస్టం ఆఫ్ కోలింగ్ అట్ ఆల్ ఇన్ ద ఎంటైర్ గ్లోబ్ ఎవరి వల్ల వచ్చింది ఎలా వచ్చింది అంటే మన తెలుగు వాళ్ళ వల్లే వచ్చింది ఇది కేవలము మాస్టర్స్ డిగ్రీలు చదవడం కోసం యుఎస్ఏ లండన్ వెళ్లి అక్కడ వాళ్ళు ఎవరో తీసుకొచ్చినటువంటి పాశ్చాత్య దేశాల కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాకుండా హౌ డేర్ దట్ దీస్ పీపుల్ విల్ డు కోలివింగ్ ఏమన్నా అంటే సుప్రీం కోర్ట్ు సైటేషన్ ఇచ్చింది ఎవరితో కావాల్సిస్తే వాళ్ళతో ఉండొచ్చు ఒక జడ్జ్ గారు ఇచ్చారు అని చెప్పి ముసలోళ్ళు మధ్యవాళ్ళు చిన్నోళ్ళు పిల్లలు అందరూ కోలింగ్ చేస్తారు ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్ మనం మీడియా ఛానల్స్ లో చూస్తూ ఉంటాం ఫలానా హోటల్లో రైడింగ్ జరిగింది సో అక్కడ వ్యభిచారం జరుగుతుంది సో అమ్మాయి అబ్బాయి ఒక రూమ్లో ఉంటే తీసుకెళ్తున్నారు పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు జైలు తర్వాత చూస్తూ ఉన్నారు మరి అది తప్పైనప్పుడు పెళ్లి కాకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇక్కడ కోలివింగ్ అని అఫీషియల్ గా ఇప్పుడు మనం హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ముఖ్యంగా మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబోల్ లాంటి ఒక వాష్ ఏరియాస్ అనొచ్చు అలాంటి ఏరియాస్ లో చూసుకుంటే లిటరీలీ ఇట్స్ ఏ కాల్డ్ బిజినెస్ అంటే కోలీ వింగ్ అని బయట అఫీషియల్ గా బోట్స్ పెట్టేసి మీకు నచ్చితే ఇద్దరు కలిసి ఉండొచ్చు మీకు లాండ్రీ సర్వీస్ ఉంది మీకు నచ్చితే కుక్ చేసుకొని తినొచ్చు మీరు బయటికి వెళ్ళాలంటే కింద కార్ సర్వీస్ ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు వీళ్ళకి ఇస్తూఉన్నారు ఫెసిలిటీస్ ఏంది అక్కడ చేస్తే తప్పు తప్పయినప్పుడు మరి ఇక్కడ ఎందుకు తప్పు అవ్వదు అది తప్పే అది అయితే మన పోలీసులు ఏంటంటే ద పోలీస్ సిస్టం ఇస్ దేవుడ్ అన్నమాట ఓకే పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా గట్టిగా కన్నెర చేస్తే ఎవడు బతకలేడు అందుకనే ఎప్పుడు కూడా పోలీస్ సిస్టం ని మనం గౌరవించాలా లా అండ్ ఆర్డర్ ని గౌరవించాల గవర్నమెంట్ ఎప్పుడు కూడా లిబరైజ్డ్ పాలసీలతో ఉంటుంది చూసి చూడనట్టు పాలసీల్లో పోతుంది సో సుప్రీం కోర్టులో మేజర్స్ అయినటువంటి వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చని అప్పట్లో ఒక జడ్జిమెంట్ వచ్చిందని చెప్పి ఆ సైటేషన్ని చూపించి చట్టంలో ఉన్నటువంటి ఒక లూప్ హోల్ని వాడుకొని వీళ్ళు కోలివింగ్ అనేటటువంటి అది హాస్టల్స్ పెడతారు పీజీ హాస్టల్ ఇలా ఈ టైప్ లోకి వచ్చేసింది సో దీనివల్ల పోలీస్ డ్యూటీ ఏంటి అది పోలీస్ డ్యూటీ కాదు మనం పోలీసులని ఎప్పుడూ అనకూడదు ఓకే ఎందుకంటే రైడ్ చేయాలనుకుంటే నిమిషంలో రైడ్ చేస్తారు వాళ్ళు పోలీస్ కి ఏంటి కంప్లైంట్ షుడ్ బి లార్జడ్ ఓకే ఆ కంప్లైంట్ లార్డ్ అయినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు రెస్క్యూ కి వస్తారు రక్షిస్తారు అండ్ మానవత్వంతో కష్టపడతారు వాళ్ళు ఏంటంటే హెల్ప్ చేయాలి అన్న మోటోతోనే తప్ప ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే ఎవ్వరు కూడా పాడు చేయాలని చూడరు అందువల్ల అది అలసగా తీసుకొని ఈ యాజమాన్యాలు ప్రైవేట్ యాజమాన్యాలు ఈ కోలింగ్ సిస్టం తో లాడ్జ్ లాగా హాస్టల్స్ లాగా ఇలాగ రన్ చేయడం జరుగుతుంది మీరు చెప్పినట్టుగా యాక్చువల్ గా ఇది చాలా అన్హెల్తీ హ్యాబిట్ అన్నమాట ఎందుకంటే ఇప్పుడు నా స్టూడెంటే ఇప్పుడు లండన్ లో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పాపం ఫస్ట్ డైవర్సీ ఒక పిల్లాడు కూడా ఉన్నాడంట ముందే చెప్పిందంట వాడు మాస్టర్స్ ఈ మాస్టర్స్ డిగ్రీ చేయడం వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి అన్నమాట వీళ్ళు మాస్టర్స్ డిగ్రీ కోసం అని పిల్లలు ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తారు బ్యాంకులు లోన్లు వాళ్ళంతకి మీ కెపాసిటీ ఉన్నవాళ్ళు వెళ్ళండి అంటే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా వెళ్ళలేరు అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు గారే కొంతమంది స్టూడెంట్స్ చదువుకుంటే సాక్షి పక్కనే నాగేశ్వరావు గారి ఇల్లు మాది బంజారా హిల్స్ అక్కడే సాక్షి పక్కన భాస్కర్రావు మెడికల్ కాలేజ్ పక్కన మా కజిన్ ఉంటాడు దాన్ని ఎదురుకొండగానే నాగేశ్వరావు గారి అమ్మాయి చనిపోయిన అమ్మాయి సో అక్కడ అకి నాగేశ్వరావు గారు ఏం చేసేవారంటే ఎవరైతే స్టూడెంట్స్ వెళ్తున్నారో ఫారిన్ కి ఆయన డిపాజిట్ వేసేవాడు అప్పట్లో 15 లక్షలు 20 లక్షలు వేసేసి తర్వాత వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇచ్చేవారు ఆ తర్వాత కొంతకాలం కన్సల్టెన్సింగ్ కంపెనీస్ అలా వేసి ఇచ్చేవి ఇప్పుడు ఏమైపోయిందంటే బ్యాంకులో లోన్లు ఇచ్చేస్తుంటే ప్రతి ఒక్కడు వెళ్తున్నాడు వెళ్ళినవాడు చదువుకోకుండా ఈ కోలిబింగల్ మొదలు పెడుతున్నాడు ఆ అమ్మాయి ఏం జరిగింది ఆ బ్రిటన్ లో ఉన్న అమ్మాయి మాస్టర్స్ డిగ్రీ వచ్చినోడితో అంతా చెప్పిందంట ముందు చెప్పిన తర్వాత మ్యారేజ్ కోలివింగ్ చేశారు చేసిన తర్వాత వాడు వాడుకున్నంత కాలం వాడుకొని మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని అవాయిడ్ చేస్తే ఆ అమ్మాయి లిటరల్ గా పిచ్చిది అయిపోయింది అండ్ ఆ అమ్మాయికి కనుక కన్సోలింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ గనుక చేయకుండా ఉంటే ఈ పాటికి ఆ అమ్మాయి సుసైడ్ చేసుకొని చచ్చిపోను లేకపోతే మెంటల్ హాస్పిటల్ లో పడిపోను ఉమ్ అండ్ రికవర్ అవ్వడానికి చాలా కాలం పట్టింది ఓకే అండ్ ద సేమ్ కేస్ విత్ యusఎస్ఏ ఆల్సో యుఎస్ఏ లో కూడా ఒక అమ్మాయి ఇద్దరు వాళ్ళు ఇక్కడే మా దగ్గరే చదువుకొని ఆ తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు 2000 చెప్తుంది 2014 లో వెళ్ళిపోయాను సార్ నేను అండ్ ఆఫ్టర్ దట్ ఐ లెఫ్ట్ ఫర్ ద మాస్టర్స్ డిగ్రీ ఇద్దరం కూడా మేము ఒక అండర్స్టాండింగ్ కి వచ్చాం ఏమ అండర్స్టాండింగ్ బొంగల అండర్స్టాండింగ్ మేము అండర్స్టాండింగ్ కి వచ్చి ఉన్నాం సార్ ఇప్పుడు వాడు నన్ను 10 ఇయర్స్ వాడుకొని అవాయిడ్ చేస్తున్నాడు సార్ సో దిస్ ఇస్ ద థింగ్ యక్చువల్లీ హాపెనింగ్ ఇన్ ద సిస్టం ఆఫ్ పోలివింగ్ సో ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ ఎందువల్ల అంటే సమాజ భ్రష్టత్వానికి ఇది ఇది అవుతుంది ఇది యాక్చువల్ గా ఫారెన్ కంట్రీస్ నుంచే ఇవన్నీ వెస్టర్న్ కంట్రీస్ లో ఏంటంటే వాళ్ళకి డబ్బు ఉంటాయి వస్తాయి వెస్టర్న్ కల్చర్ వేరు నిజంగా దాన్న అందరికీ తెలుగు వాళ్ళకి ఎందుకు ఆపాదించాలంటే మనవాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కువైపోయింది ఓకే ఇక్కడ ఇండియన్స్ వెళ్ళిన తర్వాతే అయిపోయింది అందుకే ట్రంప్ ఐరన్ ముక్కు పాదంతో తొక్కుతున్నాడు వాళ్ళ దేశం కోసం సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఏం పని వీళ్ళకి మాస్టర్స్ డిగ్రీ చేయడానికి వెళ్ళిన నోరు మూసుకొని మాస్టర్స్ డిగ్రీ చేయాల అక్కడ వీళ్ళ తల్లిదండ్రులను పాపం ఎంత కష్టపడి పంపిస్తున్నారు అక్కడ డబ్బులు బ్యాంకు లోన్లు తీర్చాల వాళ్ళకి ఇంకా ఆ 20 హవర్స్ పర్ వీక్ వీళ్ళు పార్ట్ టైం జాబ్లు చేయాల అయే చేయనివ్వట్లేదు ట్రంప్ ఇప్పుడు వెళ్ళనోడు అర్నికి వస్తాం వస్తా అర్థం చేయాలి అంతే చదువుకోవడం కోసం వస్తే చదువు అంతే ఇది చేయక అని చెప్పాడు కరెక్ట్ గా చెప్పాడు ఆ తర్వాత పోర్న్లని వదిలేస్తే డబల్ డబుల్ ట్రిపుల్ ట్రిపుల్ జాబులు చేయడాలు ఇవన్నీ ఈ కోలింగలు చేయడాలు ఇవన్నీ చేయడం వల్ల వెస్టర్న్ నుంచి నార్త్ ఇండియాకి వచ్చేసింది ఓకే నార్త్ ఇండియా నుంచి బెంగళూర్ ఇది మల్టీ ఇద కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి ఆటోమేటిక్ గా వచ్చేస్తది అండ్ కాస్మోపాలిటన్ మనంద కూడా హైదరాబాద్ కూడా కాస్మోపాలిటన్ సో ఇట్లాంటి మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ సిటీస్ లో అది నార్త్ వాళ్ళు ఎక్కువైతే ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కి వచ్చేసారో మనక అంటించేశరు వాళ్ళు ఎలాగో చేస్తారు దాంతో అందరూ ఉండరన్నమాట నార్త్ ఇండియాలో కూడా చాలా కట్టుదిట్టంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నాకు తెలిసినటువంటి నార్త్ ఇండియన్స్ ఐఏఎస్ లు కొడతారు ఆర్మీలోకి పోతారు దే విల్ డెడికేట్ దేర్ లైఫ్ నార్త్ అంటేనే కమర్షియల్ వాళ్ళంతా కూడా అంత చక్కగా సిస్టమాటిక్ గా వెళ్తారు హెల్ప్ఫుల్ నేచర్ కూడా ఉంటుంది బట్ బట్ ఇలాంటి విషయాల్లో కొంతమంది వాళ్ళ వల్ల ఈ పబ్ కల్చర్ ఈ కల్చర్ లో వచ్చేసి కాస్మోపాలిటన్ కల్చర్ లో ఈ కోలివింగ్ అనేటటువంటిది వచ్చిందన్నమాట దీనివల్ల వాడికి మంచిది కాదు ఈ అమ్మాయికి మంచిది కాదు సార్ జనరల్ గా ఇప్పుడు ముఖ్యంగా మన తెలుగులో చూసుకుంటే పెళ్లి అనేది చాలా ప్రాముఖ్యతమైనది రెండు కుటుంబాలు చూసుకోవాలి మాట్లాడుకోవాలి అటు తరాలు ఇటు తరాలు అంటారు కానీ అది ఎలా అయిపోయింది అంటే అదంతా జమానాలో ఉంది ఇప్పుడు లేదు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు ఎందుకు మీ ఇద్దరు కలిసి ఉంటున్నారు అంటే మేము జీవితాంతం కలిసి ఉండాలంటే ఒకళనిఒకళ్ళ అర్థం చేసుకోవాలి కదా అందుకే కలిసి ఉంటున్నాం అనే ఒక రీజన్ అనే ఒక ట్యాగ్ తీసుకొస్తున్నారు సో దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు ఎప్పుడు ఎవరిని ఎవరు అర్థం చేసుకోలేరు ఎంతకాలం ఉన్నా అర్థం చేసుకోలేరు ఒక వంక వంక లేని అమ్మ డొంక పట్టుకొని ఏడ్చింది అనేటటువంటి సామెత లాగా ఓకే ఏదో ఒక రీజన్ చూపించాలా జనాల్ని కళ్ళు కప్పాలా మోసం చేయాలా దే ఆర్ కాల్డ్ యస్ చీటర్స్ ఇలాంటి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వీళ్ళు చీటర్స్ అన్నమాట అంటే హిపోక్రైట్స్ వాళ్ళ మనసుని వాళ్ళని వాళ్ళే ఆత్మవంజనం చేసుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులకు ద్రోహం చేస్తున్నారు సమాజానికి దోషం చేస్తున్నారు వీళ్ళని చూసి ఇంకా కొంతమంది తయారవడానికి కి తయారవుతున్నారు యాక్చువల్ గా పెళ్లి అనేటటువంటిది రెండు కుటుంబాలను చూసి వాళ్ళందరినీ ఏడుతరాలు పోనే వదిలేసేయండి ఇటు పెద్దలు అటు పెద్దలు పెద్ద మనుషులు అంతా బైండ్ ఓవర్ అయ్యి కాపరాలు చేసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇటు అటు కలిపి పెద్దలు చెప్పిన విననటువంటి సమాజం అయిపోయింది ఇప్పుడు పెళ్లి కొడుకులు వాళ్ళు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది వినటంలేదు పోలీస్ ఆఫీసర్స్ ఐపిఎస్ లు చెప్పేది వినడం లేదు పెద్ద మనుషులు చెప్పేది వినటంలేదు లర్న్డ్ కౌన్సిల్స్ అడ్వకేట్స్ చెప్పేది వినటంలేదు ఇంకా ఎవరి మాట వింటారు వీళ్ళు మూర్ఖులు అన్నమాట వీళ్ళు ఏం చేస్తారు పాపం హనరబుల్ జడ్జెస్ రీకన్సిలేషన్ కోసం ఎన్నో కౌన్సిలింగ్లు పెట్టి సాక్షాత్తు జడ్జీ గారే నువ్వు సినిమాకి వెళ్ళమ్మా నువ్వు మంచిగా ఉండండి బయటకి పో అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అందరిని ఇంత మంచిగా చేస్తారు ఇంత మంచిగా చేసేటటువంటి పెళ్లిలో నిలబడినటువంటి ఈ కాలంలో వీళ్ళద్దరికి వీళ్ళద్దరు ఎలూప్మెంట్ అంతే వెళ్ళిపోతున్నారు చేసుకుంటున్నారు మోజ ఇప్పుడు ఎన్ని కేసెస్ లేవు ఒక 10 కేసెస్ లో ఎయిట్ డైవర్స్ కేసెస్ ఉన్నాయి పెళ్లియన కేసెస్ లో నా స్టూడెంట్స్ యుఎస్ నుంచి బ్రిటన్ నుంచి పోలీస్ ఆఫీసర్ సిసిఎస్ లో చూసుకోండి ఉమెన్ సెల్ లో చూసుకోండి షికాబల్ మేడం వీళ్ళందరూ పెడతారు ఎన్ఆర్ఐలు వీలున్నంత వరకు వద్దు మీ పిల్లల్ని ఇక్కడే ఇచ్చుకోండి ఆ ఫారెన్ మోజులో వద్దు అని పాపం ప్రతి పోలీస్ ఆఫీసర్ బాగా తెలిస్తే తప్ప అని అన్నా సరే విదేశీ మోజులో డాలర్స్ మోజులో మేము ఇచ్చేయాలి అచ్చేయాలిని వెళ్లి ఇది అంటించుకొచ్చారు అన్నమాట వీళ్ళంతా సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ అర్థం చేసుకోవడం అనేది ఎన్ని సంవత్సరాలకైనా జరగని పని అది కాబట్టి అర్థం అనేది ఎక్కువ కూడా అక్కర్లేదు రెండు మూడు నెలలోనే క్లాసులు వచ్చేస్తాయి ఎందుకు ఇప్పుడు మాకు మా ప్రొఫెసర్ గారు సూర్యనారాయణ గారు ఉండేవారు మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఆ సార్ ఏం చెప్పేవాడంటే ఎవరైనా ఫోన్లు మాట్లాడుకుంటుంటే లవర్స్ ఇద్దరు మా స్టూడెంట్స్ మాట్లాడుకొని మాట్లాడుకొని అనేవారు ఏంటి సార్ మాట్లాడుకొనియండి అంటున్నారంటే ఫుల్ 24 హవర్ మాట్లాడుకొని అండి మొత్తం మీద ఒక నెలలో డమాలని ఎవరికో వాళ్ళు విడిపోతారు టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ ఎప్పుడైతే అతి సర్వత్ర వర్జ వర్జయతే ఎక్కువ స్నేహం చేసేవాడు కూడా డమేలని ఆ స్నేహం పోద్ది ఎక్కువ మాట్లాడుకొని ఏమ ఉండదు ఇక్కడ సొల్లు నువ్వు ఏం తిన్నావ్ నేనేం తిన్నాను మీ అమ్మ ఏం చేసింది నేను ఏం చేసాాను నువ్వు అక్కడికి వెళ్ళావు ఇక్కడికి వెళ్ళావు మొత్తం డమాలి నువ్వు వాడితో మాట్లాడుతున్నాని ఫోన్ చేసినప్పుడు నీ కాలు ఎంగేజ్ వస్తుంది ఇే వస్తాయి అండ్ పజసివ్నెస్ వచ్చి భార్యా భర్తల మధ్య పజసివ్నెస్ వచ్చేస్తుంటే ఇలాంటి వివాహ ప్రేమ ప్రేమలో ఇలాంటివన్నీ వచ్చి డమాలని వెళ్ళిపోతారు సో ఇది కూడా ఏమవుతుందింటే అంటే ఈ కోలివింగ్ సిస్టం కూడా ఎక్కువ కాలం ఉండదు ఓ రెండు మూడు నెలల తర్వాత డమాలు అయిపోయేటటువంటి వాళ్ళు అంతే మాక్సిమం వన్ ఇయర్ కంటే ఎక్కువ ఉండదు ఆ తర్వాత ఏమవుతారంటే రియల్ గా మంచి వాళ్ళు ఉంటారు పాపం అందులో వాళ్ళు బాగా అటాచ్డ్ అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఫీల్ అయ్యి ఆ అటు అమ్మాయినా అటు అబ్బాయినా ఇద్దరు కూడా ఫీల్ అయ్యి డిప్రెషన్ కి వెళ్ళేటటువంటి సందర్భాలు ఉంటాయి ఇప్పుడు ఆడపిల్లలు చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు అలానే మగపిల్లలు ఏదో పతివ్రతలుని మనం చెప్పకూడదు వీళ్ళు కూడా హోప్లెస్ ఫెలోస్ ఉన్నారు సో చీట్ చేసేటటువంటి వాళ్ళు దీనివల్ల అటు ఆడపిల్లలయినా ఇటు మగపిల్లలయినా వీళ్ళు దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి అండ్ డిప్రెషన్ కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఆ దాని ద్వారా అమ్మాయి పోయే బాటిల్ మిగిలాయి అన్నట్టు ఉంది ఇప్పుడు అమ్మాయిలు కూడా బాటిల్స్ పట్టేసుకుంటున్నారు ఇంకా కోలివింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ మ్యారేజ్ అనేటటువంటి కాన్సెప్ట్ ని దాంట్లో కూడా వచ్చేసి ప్రీ వెడ్డింగ్ ప్రీ శోభనాలు ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ వచ్చేసి మొత్తం సిస్టమే ఏదో ఒక రోజున చక్కగా పవిత్ర భావంతో పెట్టినటువంటి వివాహ వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించే దాన్ని ఈ కోరింగ్ సిస్టమే బాగా పెరిగిపోద్ది ఫ్యూచర్ లో ఎస్ ఎస్ టెక్నాలజీ పరంగా ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతున్నందుకు అందరం గర్వించదగ్గ విషయం బట్ బట్ సంప్రదాయాలు సంస్కృతి విషయానికి వస్తే మాత్రానికి పొరుగు దేశాలు ఈరోజు భారతదేశాన్ని చూసి నేర్చుకుంటున్నాయి కాబట్టి మన వాళ్ళు దాన్ని చిన్నచూపుగా చూడకుండా దయచేసి మీ సాంప్రదాయాలని మీ సంస్కృతులు ఏవైతే ఉన్నాయో అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఎలాంటి రూల్స్ ఉన్నాయో వాటిని అవే ఫాలో అవ్వదు ఎందుకంటే అవి నిజంగా మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం కాబట్టి ఈ పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి వాటి మీద రుద్దొద్దు అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆ వేడుక అనేది మా ఛానల్ ద్వారా మేము కూడా తీసుకొస్తున్నాం అండ్ కో లివింగ్ గురించి చాలా చక్కని వివరించారు థాంక్యూ సార్ థాంక్యూ ధన్యవాదాలమ్మ  

#అయ్యో_బంగారం!!

 #అయ్యో_బంగారం!!


'ఎందుకు సర్, నన్ను అలా ట్రీట్ చేస్తాడు? నేనేం తప్పు చేశాను? నేను కూడా తనతో ఈక్వల్ గా జాబ్ చేస్తున్నాను. తనకంటే ఎక్కువ గానే సంపాదిస్తాను. నేను అందంగానే ఉంటాను. ప్రేమించేటపుడు అందంగానే కనిపించాను. పెళ్ళికి ముందు కనిపించని నా కులం ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది? నా తల్లిదండ్రుల గురించి పెళ్ళికి ముందు మంచిగానే కనిపించింది, ఇప్పుడెందుకు నీ పేరెంట్స్ అలా, ఇలా అంటున్నాడు? మా కిడ్ ని చూసుకోడానికి మా అమ్మ కావలి. కానీ మా అమ్మ మా ఇంట్లో ఉంటే నా మీద ఆమె ప్రభావం ఉంటుంది అంటున్నాడు.'

'ఓకే...'

'మొన్నటికి మొన్న, నాకు హెల్త్ బాగోలేదు. అయినా లీవ్ దొరకక ఆఫీస్ కి వెళ్ళాను. వచ్చాక పిల్లోడికి కావలసినవన్నీ చూసాను. మా అమ్మ వంట తనకు నచ్చదని నేనే వంట చేశాను. ఫ్రెండ్స్ తో గడిపి లేట్ గా ఇంటికి వచ్చాడు. తినేసి వచ్చాడట. ఆ సంగతి ముందే చెబితే నేను వంట చేసే దానిని కాదు కదా! త్వరగా పడుకుని మర్నాడు ఆఫీస్ కి వెళ్ళాలి. అయినా తన కోసం వంట చేశాను.'

'ఓకే...'

'ఆ రోజు రాత్రి రెండవుతుంది. నా హెల్త్ బాగోక పోవడం వల్ల కొంచెం దగ్గు వచ్చింది. ఎక్కువ కూడా కాదు. అంతే..! తన నిద్ర పాడుచేస్తున్నానని విపరీతంగా తిట్టాడు. దరిద్రపు గొట్టు దాన్నంట. నా మొహమే చూస్తేనే దరిద్రమట. ఇంకా బ్యాడ్ వర్డ్స్ కూడా తిట్టాడు. ఏంటి సర్ ఇది? దగ్గు రావడం కూడా తప్పేనా?'

'తప్పు దగ్గు రావడంది కాదు. తప్పు భార్య అవడం. ఎప్పుడయితే భార్య అయ్యావో అప్పుడే ప్రేమ చచ్చి పోతుంది. ఎప్పుడయితే భార్య అయ్యావో అప్పటి నుండే ఇంటరెస్ట్ తగ్గుతూ వస్తుంది. ఏ బంధం అయినా మొదట్లో తియ్యగా ఉంటుంది. క్రమంగా చేదుగా, వగరుగా, కారంగా మారుతుంది. ఏ ఇద్దరయినా కొంతకాలం కలసి ఉన్న తరువాత విభేదాలు రావడం సహజం. తరువాత కూడా వారిని ఒకరితో ఒకరిని కలిపి ఉంచేది స్నేహం తప్ప మరొకటి కాదు. చట్టం, సంస్కృతి, పిల్లలు వంటివి బలవంతంగా కలిపి ఉంచుతుంది. ఎక్కడయితే స్వేచ్ఛ లేకుండా బలవంతంగా కలిసి ఉండాల్సిన కండిషన్ ఉంటుందో అక్కడ రిజెక్షన్ స్టార్ట్ అవుతుంది.'

'వాళ్ళ ఆఫీస్ లో అమ్మాయిలతో చాలా బాగా ఉంటాడు సర్..'

'అవునమ్మా. వాళ్లంతా బయటి వాళ్ళు కదా.. ఒక వేళ మీ భర్తనే మిమ్మల్ని కాకుండా వేరే అమ్మాయిని చేసుకుని ఉండి, మీరు కనుక బయట పరిచయం అయ్యి ఉంటే. అప్పుడు మీరు ఇలా రాత్రి దగ్గు వచ్చింది అని చెబితే.. అయ్యో బంగారం!! అని ప్రేమ కురిపించే వాడు. మర్నాడు ఉదయానికల్లా దగ్గు మందు, పండ్లు అన్నీ పట్టుకుని నీ గుమ్మం ముందు ఉండేవాడు.'

 *✍🏼 నేటి కథ ✍🏼*


*భయం-భయం*


ఒక ఊరిలో ఇద్దరు వ్యాపారస్తులుండేవారు. వాళ్ళు ప్రతిరోజు ఆ పల్లె నుంచి పట్టణానికిపోయి అక్కడ వ్యాపారం చేసుకొని సాయంకాలానికి తిరిగి పల్లెకు వచ్చేవారు. రోజూ మాదిరిగానే ఒక రోజు పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసుకున్నారు. వ్యాపారం అయిపోయేసరికి చాలా చీకటి పడింది. ’ఇంక ఇక్కడ ఉండటానికి వీలు కాదు మనం ఊరికి పోవాలంటే ఎట్లా’ అని ఆలోచించారు. ’సరే ఏదైతే అదవుతుంది; ఇద్దరం మాట్లాడుకుంటూ పోతే ఊరికి చేరుకుంటాము’ అని అనుకొని చిన్నగా నడక సాగించారు.

కొంత దూరం వచ్చాక వాళ్లకు ఒక నీళ్ళ బావి కనిపించింది. వాళ్ళు బావిలోకి దిగి నీళ్ళు తాగి, అక్కడ కొంతసేపు కూర్చొని, మళ్ళీ నడవడం మొదలుపెట్టారు. నడక సాగిస్తూ వాళ్ళు, వాళ్ళ ఊరి దారిలో ఉన్న చింతతోపు గురించి మాట్లాడుకున్నారు: "చింతతోపు దగ్గర చాలా దయ్యాలున్నాయి. రాత్రిళ్ళు అక్కడ నడవడం చాలా ప్రమాదకరం. కష్టం. అసలు ఆ దారిలో రావడమే మహాగగనం" అని చెప్పుకుంటూ నడుస్తున్నారు.

వాళ్ళు దగ్గర దగ్గరగా చింతతోపు దగ్గరకు వచ్చేశారు ఇప్పుడు. ఇద్దరికీ మనసుల్లో భయం మొదలైంది. "ఇక్కడ దయ్యాలుంటాయి.. ఎట్లబ్బా, దీన్ని దాటడం" అనే ఆలోచిస్తున్నారు. "సరే, నాకు నువ్వు, నీకు నేను! ఇద్దరం తోడుగా ఉన్నాం కదా, ఎలాగో ఇంతదూరం వచ్చినాం కదా, వెనక్కి పోవడం కష్టమే. ముందుకు పోదాం" అనుకుంటున్నారు. ఒకరి నడుమును ఒకరు పట్టుకొని, దగ్గరగా వచ్చి భయపడుతూ భయపడుతూ నడుస్తున్నారు.

అంతలో వాళ్ళకు గజ్జెల శబ్దం వినిబడసాగింది! ఇద్దరికీ పై ప్రాణాలు పైనే పోయాయి. ఒకడు ఇంకో ఆయనతో "అరే, నాకు గజ్జెల శబ్దంవిన్పిస్తున్నది, నీకూ వినిపిస్తోందా" అని అడిగాడు. "నాకు కూడా వినిపిస్తున్నది" అన్నాడు రెండవవాడు. "అయితే దయ్యాలు మనకు దగ్గరగా వచ్చేసినట్టున్నాయి" అని ఇద్దరూ తొందరగా నడవటం మొదలు పెట్టారు. గజ్జెల శబ్దం ఇంకా ఎక్కువగా వినిపించసాగింది. "అరే, దయ్యాలు ఇంకా దగ్గరికి వచ్చినాయి" అని నడక వేగాన్ని ఇంకా పెంచినారు. గజ్జెల శబ్దం ఇంకా చాలా చాలా ఎక్కువైంది. "అయ్యో! ఇక దయ్యాలు మన గొంతులు పట్టుకొవడమే తరువాయి" అని వాళ్లిద్దరూ పరుగు మొదలు పెట్టారు. ఇంకా ఎక్కువ శబ్దం, మరింత దగ్గరగా వినవస్తున్నది. "అమ్మో! మనం ఈ రోజు ప్రాణాలతో బయటపడటం కష్టం. ఏం చేయాలబ్బా" అని శతకోటి దేవుళ్ళని ప్రార్థించటం మొదలుపెట్టారు వాళ్ళు. అంతలో వాళ్ళకు వారి పల్లె కనిపించింది. కాలి బిర్రున పరుగెత్తుకొని వచ్చి తమ పల్లెను చేరుకొని "అమ్మయ్య, ఊర్లోకి వచ్చేశాము, ఇక భయం లేదు" అని అనుకుంటూ ఆయాసంతో రోడ్డు పక్కనే కూర్చుండిపోయారు ఇద్దరూ. ఆయాసం తీర్చుకొని, నీళ్ళుతాగారు; మళ్ళీ బయలుదేరుదామని లేచారు. ఇప్పుడు మనసులు కొంచెం తేరుకున్నాయి. గజ్జెల శబ్దం రావటం లేదు. "అమ్మయ్య! గజ్జెల శబ్దం ఆగిపోయింది. మనం త్వరపడి ఊర్లోకి రాగానే, దయ్యాలు భయపడి వెనక్కి వెళ్ళాయి. అందుకే శబ్దం రావటం లేదు" అనుకున్నారు ఇద్దరూ సంతోషంగా.

ఇంటికి పోగానే వాళ్ళల్లో ఒకాయన "బీగాలు(తాళం చెవులు) తీయాలి కదా" అనుకొని బీగాలను తడుముకొని, బీగాల గుత్తిని చేతికి తీసుకున్నాడు. "గల్లు గల్లు"మని శబ్దం అయింది. ఇద్దరూ ఒకళ్ల ముఖాలు ఒకళ్లు చూసుకున్నారు. ఇద్దరికీ ఒకేసారి అర్థం అయ్యింది- "ఇంత సేపూ తాము గజ్జెలమోత అనుకున్నది ఆ తాళాల గుత్తి శబ్దాన్నే అని! మరునాడు ఉదయం ఈ విషయం అందరికి చెప్తే, అందరూ పొట్ట చెక్కలయేలాగా నవ్వుకున్నారు.
 *దైవం చేసే పని...*
*జ్ఞాన 🕉️మార్గ*

✍ పూర్వం ఓ దేశంలో ఒక రాజుగారికో సందేహం వచ్చింది.
వెంటనే తన మంత్రిని పిలిచి "అమాత్యా! నా సైనికులు దేశాన్ని కాపాడుతున్నారు. మీరు మంత్రులుగా నాకు సలహాలు ఇస్తున్నారు. వర్తకులు వర్తకం చేస్తున్నారు. అధ్యాపకులు పాఠాలు చెపుతున్నారు. ఇలా ప్రతివ్యక్తి తనకి కేటాయించిన పనిని చేస్తున్నాడు. నా సందేహం ఏమిటంటే, "సృష్టికర్త అయిన ఈ దైవం చేసే ప్రధానమైనపని ఏమిటి?" అని.

♦రాజుగారికి వచ్చిన సందేహాన్ని తీర్చటానికి మంత్రివర్యులు "రాజగురువు"ను పిలిపించి రాజుగారి సందేహము తీర్చమని అడిగాడు. రాజగురువు వెంటనే సమాధానము చెప్పక ఓ వారము రోజులు గడువు తీసుకుని బయటపడ్డాడు. కాని, ఆరురోజులయినా రాజుగారి సందేహానికి సరైన సమాధానము స్పురించక, ఆలోచిస్తూ, నగరము బయట అశాంతిగా తిరుగుతున్నాడు.

♦అక్కడ రాజగురువును ఓ ఆవులు కాచుకునే కుర్రవాడు చూచి " స్వామీ! మీరు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. కారణం తెలుసుకోవచ్చా?" అని నమస్కారము చేసి మరీ అడిగాడు. ఆ కుర్రవాడు వినయము చూసి ముగ్ధుడయి, ఆ రాజగురువు తన సమస్యకు అతనివల్ల సమాధానము బహుశ: భగవంతుడు పంపించి వుంటాడని తలంచి, తన సమస్యని వివరించాడు. అప్పుడాకుర్రవాడు " స్వామీ! ఈ ప్రశ్నకు సమాధానము నాకు బాగా తెలుసు. రాజుగారిని నన్ను రాజసభకు పిలిపించే ఏర్పాటు చూడండి" అని చెప్పాడు.

♦రాజగురువు ఆ కుర్రవానియందు విశ్వాసముతో రాజుగారిని దర్శించి, "రాజా! మీ ప్రశ్నకు సమాధానము ఆ ఆవులు కాచే కుర్రవాడు చెపుతాడు. మీరు అతనిని సభకు అహ్వానించండి" అని తెలిపాడు. రాజు భటులని పంపి ఆ కుర్రవానిని రాజసభకు అహ్వానించాడు. రాజసభలో ఆ కుర్రవాడు " రాజా! మీ ప్రశ్నకు సమాధానము నేను చెపుతాను. కాని అడిగేవారు మీరు కాబట్టి, మీరు శిష్యుని స్థానంలో వున్నారు. చెప్పేవాడిని నేను కాబట్టి నాది గురుస్థానము. గురువు అగ్రస్థానములో కుర్చోవాలి కదా!" అన్నాడు. రాజు అతని మాటలు గ్రహించి, తన ప్రశ్నకు సమాధానము తెలుసుకోగోరి, తన సింహాసనము మీద అతని అధిష్టింప చేశాడు. రాజసింహాసనము మీద అధిష్టించి ఆ కుర్రవాడు ఇలా చెప్పాడు.

♦"రాజా! దైవము చేసే ప్రధానమైన పని ఇదే! అహంకారులను క్రింద కూర్చోపెట్టడము, అణకువతో ఉండేవారిని ఉన్నతస్థానములకు చేర్చటము." అని చెప్పి తనదారిని తాను వెళ్ళిపోయాడు.
 *మీ పిల్లల భవిష్యత్*
*కోయంబత్తూర్ లోని ఒక పాఠశాల వేసవి సెలవులు ప్రకటిస్తూ తల్లితండ్రులకు ఒక లేఖ రాసింది.*

*చదివితే అలాంటి మంచి విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలలో చదివించాలి పిల్లల్ని అనిపిస్తూంది.*

*ఆ లేఖ సారాంశం తర్జుమా చేసి ఇస్తున్నాను. నచ్చితే  మీ వాట్సాప్ ద్వారా ఇతరులకు పంపించండి.*

*ప్రియమైన తల్లితండ్రులారా,*

*గత పదినెలలుగా మీ పిల్లల్ని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దడానికి మా శాయశక్తులా కష్టపడ్డాం. పిల్లలు పాఠశాలకు రావడానికి తహతహలాడేలా చేయడంలో విజయం సాధించాం అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. రాబోయే రెండు నెలలు, మీరు, పిల్లల సహజ సంరక్షకులు వారితో గడుపుతారు. పిల్లల్ని తీర్చిద్దిడానికి కొన్ని ఉపయోగపడే కొన్ని చిట్కాలు మీతో పంచుకుంటున్నాము వారి సెలవులు ఆనందంగా, ఉపయుక్తంగా ఉండడానికి.*

*1. రోజూ రెండు పూటలా వారితో కలిసి భోజనం చేయండి. వారికి రైతులు పడే కష్టాలను వివరించండి. ఎంత శ్రమిస్తే పంట చేతికి వస్తుందో తెలియచేయండి. పదార్థాలు వృధా చెయ్యకుండా తర్ఫీదు ఇవ్వండి.*

*2. వాళ్ళు తిన్న భోజనం ప్లేటు ఎత్తడం, కడుక్కోవడం నేర్పించండి. వాళ్లకు శ్రమ విలువ తెలుస్తుంది. పని విలువ అర్ధమౌతుంది. మన పని మనం చేసుకోవడం నామోషీ కాదని తెలుస్తుంది.*

*3. పిల్లల్ని వంటింట్లోకి రానివ్వండి. వాళ్ళ సలాడ్స్ వాళ్లనే చేసుకోనివ్వండి.*

*4. ప్రతిరోజూ ఐదు కొత్త ఆంగ్ల పదాలు నేర్చుకునేటట్టు చూడండి.*

*5.  మీ ఇంటి చుట్టుపక్కల వారితో పరిచయం చేసుకోమనండి. వాళ్ళతో ఒక అనుబంధం ఏర్పడనివ్వండి.*

*6. అమ్మమ్మ, బామ్మ , తాతగార్లతో కొన్నిరోజుల పాటు గడపనివ్వండి. పెద్దవారితో ఒక చక్కటి అనుబంధం ఏర్పడనివ్వండి. పెద్దవారి ప్రేమాభిమానాలు వారికి చాలా ఉపయోగం.*

*7. మీ పిల్లల్ని మీరు పనిచేసే చోటుకు తీసుకెళ్లండి. మీరెంత కష్టపడి పనిచేయడమే కాదు, వారికి మీ కష్టార్జిత విలువ తెలుస్తుంది.*

*8. వారం వారం జరిగే సంతకు తీసుకెళ్లండి. జాతర ఉంటే చూపించండి.*

*9. వాళ్ళకి మొక్కలు నాటడం, మొక్కల సంరక్షణ లాంటి పనులు చేయించండి.*
*పెరట్లో కానీ కుండీలలో కానీ విత్తనాలు నాటించండి. వాళ్లకు చెట్ల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి తెలియచేయండి. చెట్లు, వృక్షాలు వారి జీవితంలో అంతర్భాగం అనే అవగాహన ఏర్పరచండి.*

*10. మీ చిన్ననాటి ఆనుభవాలను వారికి తెలియచేయండి. మీ కుటుంబ చరిత్ర గురించి అవగాహన కల్పించండి.*

*11. పిల్లలు సెలవులు పూర్తిగా ఇంట్లో ఉండకూడదు , బయట అడుకోవాలి అని ప్రోత్సహించండి. పిల్లలకు ఆటల్లో గాయపడడం సహజం, అలాగే ఆటలాడితే మురికిగా అవ్వడం కూడా సాధారణం. వాళ్ళకి నొప్పి తెలీనివ్వండి. అస్తమాను సోఫాలో, కుర్చీల్లో కూర్చుంటే బద్దకస్తులుగా తయారౌతారు.*
 ఈ కథ గుర్తుందా..
మన ప్రాథమిక తెలుగు వాచకం  పాఠ్యపుస్తకం లో ఉండేది...


పేదరాశి పెద్దమ్మకధ 🌹
👉🏿అనగనగా ఒక ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉండేది. ఆ పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు , కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచిగా పెళ్ళిళ్ళు చేసింది. తను దాచుకున్నవి తలోకాస్త ఇచ్చి వేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కదా! కనుక ఒక్కో కూతురి ఇంట మూడు మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పు పని లేదు. హాయిగా గడచిపోతూంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒక రోజు రెండవ కూతురు ఇంటికి బయలు దేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చక చకా నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మను సమీపించింది. నిన్ను తినేస్తాను – అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకు భయం వేసింది.
చెమటలు పట్టాయి. పెద్దమ్మ తెలివైనది. యుక్తి గలది. కాస్త ఆలోచించింది. పులితో ఇలా అంది. పెద్ద పులీ! పెద్ద పులీ! నేను ముసలదాన్నయాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు రెండో కూతురు ఇంటికి వెళుతున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు . అక్కడ పది రోజులు ఉంటాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు చేస్తుంది. సున్ని ఉండలు చేసి పెడుతుంది. అరిసెలు చేస్తుంది. అన్నీ తింటాను. ఒళ్ళు చేస్తాను. బలిసి వస్తాను. అప్పుడు తిందువుగాని – అంది పెద్దమ్మ. పెద్దపులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలి పెట్టింది. పెద్దమ్మ రెండవ కూతురు ఇంటికి వెళ్ళింది. పది రోజులు అయ్యింది. పదిహేను రోజులు దాటింది. నెల పూర్తయింది. పెద్దమ్మ మరలా అడవిన రాలేదు. ఎలాగైనా రాకపోతుందా! ఇదే దారి కదా. అప్పుడు పడతా పెద్దమ్మ పని – అని కాచుకొని కూచుంది పులి. పెద్దమ్మ మూడు నెలలు అచట గడిపింది. ఇక బయలుదేర వలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఒప్పందం కదా.
బయలు దేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది. పులితో జరిగిన గొడవ చెప్పింది. పెద్దమ్మ కూతురూ తెలివైనదే. అమ్మను కాపాడాలి. బాగా ఆలోచించింది. ఒక పెద్ద బాన తెచ్చింది. బానలో పెద్దమ్మను కూచో పెట్టింది. మూత పెట్టింది. మూతకు గుడ్డ కట్టింది. దొర్లించి వదిలి పెట్టింది. బాన దొర్లుతూ అడవినబడి పోతాఉంది. బానలోని ముసలమ్మ హుషారుగా ఉంది.
పులి నన్నేమీ చేయలేదు – అనుకుంది. “బానా బానా దొర్లు,దొర్లు” అంటూ పాడుకుంటుంది. బాన అడవి మధ్యకు చేరింది. పులి సమీపించింది. పులికి బానలో పాట వినిపించింది. పులికి ఎక్కడలేని కోపం వచ్చింది. బానను కాలితో ఆపింది. పంజాతో గట్టి దెబ్బ కొట్టింది. బాన ఢాం అని పగిలిపోయింది. ముక్కలయింది. పెద్దమ్మ బయటపడింది. భయం వేసింది. నిన్ను ఇప్పుడే తింటాను – అని పులి కేక వేసింది. పెద్దమ్మకు వణుకు పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. మళ్ళీ కాస్త ఆలోచించి పెద్ద పులీ! పెద్దపులీ!ప్రయాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది. నీరసంగా ఉంది.
అలసిపోయాను. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి వస్తాను. అపుడు హాయిగా తిందువుగాని – అంది పెద్దమ్మ. పులి “సరే” అని వదిలి పెట్టింది.
పెద్దమ్మ చెరువులోకి దిగింది. స్నానం చేసింది. బయటకు రాలేదు. గంట అయ్యింది. రెండు గంటలు అయింది. పులికి కోపం వచ్చింది. ఆకలి పెరిగింది. పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ పులి మాటలు విన్నది. కాని పట్టించుకోలేదు. ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది. పులి చెరువులో దిగింది. పెద్దమ్మను సమీపించింది. పెద్దగా అరిచింది. పెద్దమ్మను చంపేయాలనుకుంది. పంజా ఎత్తింది. పెద్దమ్మ తక్కువదా! ముందే ఆలోచించింది. రెండు గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది. పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులి కళ్ళు కనబడలేదు. కేకలు పెట్టింది. చెరువులోనే గిలగిల తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలో నడిచింది. మూడవ కూతురు ఇంటికి చేరుకుంది.
నీతి: మనకు కష్టాలు ఎదురైనపుడు భయపడకుండా, సమయానికి తగిన విధంగా ఆలోచించి, తెలివిగా మసలడం నేర్చుకొవాలి. అలా వుంటేనే మన జీవితం హాయిగా సాగిపోతుంది.
💥💥💥💥💥💥💥💥💥💥💥
 *విశిష్ట చారిత్రక తెలుగు మహిళలు - 29*

*తొలి తరం మహిళా సంపాదకురాలు - పులుగుర్త లక్ష్మీనరసమాంబ*
----------------------------

*ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్*' అన్నారు. మహిళలకు విద్యావకాశాలు లేని రోజుల్లో ఒక వనిత ఒక పత్రికకు సారధ్యం వహించడం సాధారణమైన విషయమేమీ కాదు. 

ఆ రోజుల్లో స్త్రీలలో విద్యావంతులు అతి స్వల్పం. వారిలో రచనా వ్యాసంగం పై అభిరుచి ఆసక్తి, సామర్థ్యం ఉన్నవారు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో 1904 జనవరిలో *సావిత్రి*' అనే పేరుతో మహిళల కోసం ఒక మహిళ పత్రిక ప్రారంభించారంటే ఆశ్చర్యం కలుగుతుంది.

పులుగుర్త లక్ష్మీ నరసమాంబ కవయిత్రి. చింతలపూడి నీలాచలం గారి కుమార్తె. పులుగుర్త వెంకట రత్నం గారి సతీమణి. ఆమె పితామహ మాతామహులు కవి పండితులు. పండితుడు, విమర్శకాగ్రేసుడు నడకుదుటి వీరరాజు ఆమెకు మేనమామ. కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు ఈమె గురువు. 

ఆయన వీరేశలింగం గారి సంఘ సంస్కరణ భావాలను వ్యతిరేకించేవారు. ఈమెపై ఆ ప్రభావం కొంత మేరకు ఉన్నా స్త్రీ విద్య పట్ల అభిమానం ప్రదర్శిస్తూ గ్రంథ రచన సాగిస్తూ *సావిత్రి* పత్రికలో స్త్రీల రచనల్ని ప్రోత్సహించేవారు.

లక్ష్మీ నరసమ్మ తెలుగు దేశంలో మొదటి మహిళా సంఘంగా గుర్తించబడు '
*విద్యార్థినీ సమాజాన్ని*' కాకినాడలో స్థాపించారు. తన 15వ ఏట *మహిళా కళా బోధిని*' గ్రంథం రచించారు. 

ఈమె రచించిన వ్యాసాలు సావిత్రి పత్రికలోనే గాక *హిందూ సుందరి*, *జనని* మొదలైన పత్రికల్లోనూ ప్రచురింపబడేవి. హిందీ, బెంగాలీ భాషల్లో ప్రవేశం ఉన్న నరసమాంబగారు ఆ భాషల్లోని పుస్తకాలను కూడా అనువదించారు. *లోకబాంధవి, కామ మంజరి మొదలైన గద్య గ్రంథాలు, యోగీశ్వరి, అన్నపూర్ణ, వామన పురాణం, మహిళా కళా బోధిని, స్త్రీ నీతి గీతమాల, సతీధర్మములు, అమూల్య మొదలైన పద్య కావ్యాలు, మంగళహారతులు* రచించారు.

*సావిత్రి* పత్రికకు ముందే *హిందూ సుందరి* అనే మహిళా పత్రిక 1902లో మాడభూషి చూడామణి, కళ్లేపల్లి వేంకట రమణమ్మలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొంత కాలం తర్వాత సారధ్యం మారి బాలాంత్రపు శేషమ్మ గారు సంపాదకత్వం వహించారు.

లక్ష్మీ నరసమాంబ గారు ప్రారంభించిన *సావిత్రి*' పత్రిక తొలి సంచిక (1904 జనవరి) హైద్రాబాద్లోని స్టేట్ ఆర్కైవ్స్ ఉంది. రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో లభ్యమౌతున్న 1910 నవంబరు సంచిక పై నాలుగవ సంపుటం, ఐదవ సంచిక అని ముద్రించబడింది. మధ్యలో కొంత కాలం పత్రిక వెలువడలేదని భావించాల్సి ఉంటుంది. 'ప్రతి మాసమున కొకసారి స్త్రీల కొరకు ప్రకటించబడుతున్న పత్రిక' అని పత్రికలో వ్రాసేవారు. పత్రికా భాష శుద్ధ గ్రాంథికం. పత్రికను ప్రోత్సహించవలసిందని పత్రికాధిపతులు లక్ష్మీ నరసమాంబ ఇలా విజ్ఞప్తి చేసారు. "సోదరసోదరీమణులారా! వ్యయప్రయాసల కోర్చి స్త్రీల విద్యాభివృద్ధి కొరకే పత్రికను ప్రకటించుచున్నాము. తపాలాఖర్చు, కాగితపు ఖర్చు. అచ్చు ఖర్చులకు సంవత్సరాంతమునకు పంపెడు పత్రికలకు రూ.1-0-0 అగుచున్నది. తక్కిన గుమస్తాఖర్చు, ఉత్తర ప్రత్యుత్తరములకగు పోస్టు ఖర్చు మున్నగునవి మేము భరించుచున్నాము. ఈ పనియందు మేమభిలషించిన స్త్రీ విద్యాభివృద్ధియే మాలాభము. కాబట్టి విద్యాభిమానులెల్లరు మా ఉద్యమమునకు దోడ్పడి మేమందించ బోవుచున్న వి.పి.పి స్వీకరింప బ్రార్దించుచున్నాము.

*సతీ ధర్మాలు, నీతి కథావల్లరి* లాంటి నీతి బోధకమైన రచనలు. *ధైర్యస్థైర్యాలు*, *సావిత్రి, లోక బాంధవి* లాంటి నాటికలు ఇందులో వచ్చాయి. *అబలా సచ్చరిత్ర మాల* ఈ పత్రికలోనే వచ్చింది. వేద కాలం నుంచి స్త్రీల స్థితి గతుల వర్ణన ఇందులో ఉంది. స్త్రీల రచనల్ని ప్రోత్సహించడం ఈ పత్రిక లక్ష్యాల్లో ఒకటి. 1910 జూన్ నెలలో గుంటూరులో జరిగిన ప్రథమ ఆంధ్ర మహిళా సదా ఉపన్యాసాలను కూర్చి ఒక పుస్తకంగా వెలువరించినట్లు సావిత్రి పత్రికలొ
ప్రకటించారు. 

ఈ పత్రిక సనాతన దృక్పధం కలిగి వితంతు వివాహాలను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కౌసల్య, కుంతి, ఉత్తర, అహల్యాబాయి, మొదలైన వారి విమల చరిత్రము లాచరించే వారిగా చేయడం తమ ఉద్దేశంగా సంపాదకురాలు ప్రకటించారు. 

వితంతు కాంతలకు వైరాగ్యాన్ని బోధించడం, వారిని స్వతంత్ర జీవనం చేయగలవారిగా తీర్చిదిద్దడం పత్రిక ఉద్దేశాల్లో ఉన్నాయి. లక్ష్మీ నరసమాంబ గారు ఈ పత్రికను కాకినాడ నుంచి నడిపేవారు. 1923 వరకు ఈ పత్రిక వెలువడినట్లు తెలుస్తోంది.

*ఓం నమో శ్రీవేంకటేశాయ!!*
(సమాప్తం)
 వంటిల్లే నా గతా ఏమిటీ ?

ప్రభాకర్ పెదపూడి

సుందరయ్యగారు తెల్లారకుండానే నిద్రలేచి, సందు చివర మాణిక్యం దగ్గర పాల ప్యాకెట్ తీసుకొచ్చి బ్రూ కాఫీ కలిపి, తాను తాగి,   మరో గ్లాసు అప్పుడే వాకిట్లో ముగ్గు వేసి వస్తున్న రత్నానికి అందించారు. "ఏవండోయ్! సుందరంగారూ మీకు వయసు వచ్చి ఆకారంలో మార్పు వచ్చింది కానీ, మీరు కలిపే బ్రూ కాఫీలో రుచి ఏమాత్రం తగ్గలేదండి, అద్భుతం" అంటూ ఇద్దరి గ్లాసులూ తీసుకుని వంట గదివైపు నడిచారు రత్నంగారు. 

భార్య  మెచ్చుకోలు మాటలకు సుందరయ్యగారు ఉప్పొంగిపోయారు. ఇదిగో రత్నం, ఈ రోజుకి నువ్వు అన్నం ఒకటి వార్చు, మిగిలినవి నేను వండుతాను. నీరసంగా ఉంది అంటున్నావు" సుందరంగారు స్నానానికి బయలుదేరుతూ అన్నారు. "అయ్యో మీకెందుకండీ అనవసరమైన శ్రమ, మీరలా ఉండండి పావుగంటలో తోటకూర పప్పు, ములక్కాడల రసం చేసి పడేస్తాను అన్నారు రత్నంగారు. ఇదిగో రత్నం నాకు కోపం తెప్పించకు. నువ్వు అలా పీటమీద కూర్చుని కబుర్లు చెబుతూ ఉండు, నిమిషాల్లో పని పూర్తి చేస్తాను" కోపం నటిస్తూ అన్నారు సుందరయ్యగారు. 

చెప్పిన విధంగా నిమిషాల్లో కాకుండా గంటలో వంట పూర్తి చేసి గర్వంగా బయటకు వచ్చారు సుందరయ్యగారు.  "వంట ఏమి వెలగబెట్టారేమిటీ! గర్వంగా నడుచుకుంటూ వస్తున్నారు" అడిగారు రత్నంగారు.  "దొండకాయలు కాయల పళంగా ఉల్లికారంపెట్టి వండాను, కందిపప్పు పచ్చడికి వెల్లుల్లి తగిలించాను, చారు స్థానంలో మెంతి మజ్జిగ చేర్చాను. అరటాకులు వేస్తూ అన్నారు సుందరంగారు.  "ఆ ఆ మరచిపోయాను పెరుగులోకి పెరట్లో కాసినవి, ఇంట్లో పండినవి రెండు చెక్రకేళీ పళ్ళు తెంపుకొచ్చాను, కడుపునిండా తినవే కనకవల్లీ "నవ్వుతూ అన్నారు సుందరంగారు.  

భర్త వండి వడ్డించి మురిపెంతో తినిపిస్తుంటే రత్నంగారి కళ్ళల్లో నీళ్లు వద్దన్నా వచ్చాయి. "ఈ జన్మకు మీరు నాకు చాలు " పెరుగు చేతితో భర్త కాళ్లకు నమస్కారం పెడుతూ అన్నారు రత్నంగారు. "కొంపతీసి వంటిల్లే నాకు గతా ఏమిటీ" అన్నారు నవ్వుతూ సుందరయ్యగారు.
 కథ పేరు: సృష్టి తిరగబడితే
రచన: కోడూరి తిరుమల మాధవి.

సాయంత్రం ఆరున్నర అవుతోంది మా బుజ్జి గాడి "హోమ్ వర్క్" టైమ్  స్కూల్ నుండి వచ్చాక కాసేపు ఆడుకుని ఆరున్నర కి హోమ్ వర్క్ చేయడం వాడికి అలవాటు.

ఎప్పటిలా స్కూల్ బ్యాగ్ తీసుకుని వచ్చి నా ముందు కూర్చున్నాడు" అమ్మా ఈ రోజు నాకు ఒక లెసన్ చెప్తావా!" అన్నాడు, "ఏం లెసన్? ఏదీ చూపించు అన్నాను" వాడు మోరల్ సైన్స్ బుక్ తీసి అందులో రామాయణం లోని ఒక పాఠం చూపించాడు,"సరే విను అని కథ చెప్పడం మొదలు పెట్టాను".

అయోధ్య అనే రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు కి ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి, అని
చెప్పగానే మా వాడు మధ్యలో ఆపుతూ " అమ్మా అదేంటి నాన్నకు నువ్వు ఒక్క దానివే భార్యవు కదా! మరి ఆ రాజుకు ముగ్గురు భార్యలు అంటా వేంటి? అని అడగగానే పక్కనే పేపర్ చదువుతూ వున్న మా శ్రీ వారు ఫక్కున నవ్వుతూ  "అదీ అలా అడగరా నానీ" "నేను కూడా ఇంకో పెళ్ళి చేసుకుంటాను అంటే మీ అమ్మే వప్పుకోవడం లేదు" అనేసరికి "చాల్లె నోరు ముయ్యండి ఏంటా మాటలు పసి పిల్లాడి దగ్గర "అని కసురుకుని  అప్పటికి వాడికేదో సర్ది చెప్పి పంపించేశాను.

వాడు వెళ్ళాక మా వారు నాతో "నేను ఆన్న దాంట్లో తప్పేముందోయ్ నువ్వు రోజూ పూజించే దేవుళ్ళకు కూడా ఒక్కక్కరికి ఇద్దరేసి భార్యలు వున్నారు కదా! అనే సరికి నేను ఆలోచనలో పడ్డాను. 

ఆలోచిస్తే మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది, దేవుళ్ళను చూసినా మన పురాణాలను చూసినా బహు భార్యా తత్త్వమే కనిపిస్తుంది.

ఇంక చరిత్ర చూస్తే రాజులందరికీ ఎక్కువ మంది భార్యలే వున్నారు. కొందరికి ఇద్దరు, ముగ్గురు భార్యలు ఉంటే, ఇంకా కొంత మందికి ఏకంగా పది మంది పన్నెండు మంది ఇరవై మంది భార్యలు కూడా ఉన్నారు.

ఇదెక్కడి న్యాయం చెప్పండి, భర్త భార్యను తనకు మాత్రమే సొంతం అని ఎలా అనుకుంటాడో! భార్య కూడా అంతేకదా ఎంత రాజైనా తన భర్తకు తాను పదవ భార్య గానో పన్నెండవ భార్య గానో ఉండటానికి ఏ స్త్రీ ఇష్టపడుతుంది? 

ఎంటో ఆది నుండి ఈ సమాజం లో స్త్రీ కి ఒక న్యాయం, పురుషుడి ఒక న్యాయం నడుస్తోంది. మగాడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా సమాజం ఒప్పుకుంటుంది,  పైగా అది మగతనం అంటుంది. అదే పని ఆడమనిషి చేస్తే పతిత, కులట, వ్యభిచారి, బరితెగించింది అంటూ బిరుదులు ఇస్తుంది.

స్త్రీ మాత్రం భర్తను తప్ప పరాయి మగవాన్ని కన్నెత్తి చూడడం కూడా మహా పాపం ,అది పతివ్రతా లక్షణం కాదని అలాంటి స్త్రీ కి పుట్టగతులు ఉండవని అటువంటి స్త్రీ వల్ల ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు నరకానికి పోతాయని బోధిస్తుంది.

దేవుళ్ళ లో కానీ, పురాణాలలో కానీ, చరిత్ర లో కానీ ఎక్కడా స్త్రీ కి ఇద్దరు ముగ్గురు భర్తలు ఉన్నట్టు కనపడరు.ఒక్క మహా భారతంలో ద్రౌపతి కి తప్ప అది కూడా ఆమె  కోరుకున్న వరం వల్ల అలా జరిగింది అంటారు.

అలా చూసుకున్నా పంచపాండవులకు ద్రౌపతి వున్నా మళ్ళీ వారందరికీ విడి విడిగా వేరే భార్యలు వున్నారు.

పురాణాలలో కూడా పతివ్రతల గురించి చెప్పారే గానీ ఒక్క సతి వ్రతుడి గురించి అయినా చెప్పారా?  ఎందు కంటే లేరు కాబట్టి.

ఇప్పుడు కూడా సమాజం లో భార్య పక్కనే వున్నా  పక్క చూపులు చూసే మొగుళ్ళు ఎంత మందో వున్నారు, ఇద్దరు పెళ్ళాలు వున్న వాళ్ళు వున్నారు. భార్యకు తెలియకుండా చిన్నిల్లు మెయింటెయిన్ చేసేవాళ్ళు వున్నారు, అప్పుడప్పుడూ చిరుతిండ్లు 
తినేవారు వున్నారు.

 కానీ ఆడవాళ్ళు మాత్రం గడప దాటకుండా పతియే ప్రత్యక్ష దైవం అని పవిత్రం గా వుండాలి అని కోరుకుంటారు.

సినిమాలు కూడా ఆయనకు ఇద్దరు, ఏమండీ ఆవిడ వచ్చింది, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు ఇవన్నీ సూపర్ డూపర్ హిట్లు , ఈ సినిమాలకు కోట్లలో కలెక్షన్లు,
అదే ఆవిడ కిద్దరు, ఎవమ్మోయ్ ఆయనొచ్చాడు, ఇంట్లో మొగుడు బాత్రూమ్ లో ప్రియుడు, ఇద్దరు మొగుళ్ళ ముద్దుల పెళ్ళాం అని సినిమాలు తీస్తే ఎవరైనా చూస్తారా? పైగా  దుమ్మెత్తి పోస్తారు.

అప్పుడు మాత్రం మన వాళ్ళకు  దేశ సంస్కృతి గుర్తుకు వస్తుంది, మన దేశం, మన దేశ సంస్కృతి ఏమై పోతోంది అంటూ మైకులు విరిగి పోయేలాగ ప్రసంగాలు ఇస్తారు.
నాకు తెలియక అడుగుతాను దేశ సంస్కృతి ఒక్క ఆడవాళ్ళ చేతుల్లోనే ఉందా? మగవాళ్ళ చేతుల్లో లేదా? మగవాళ్ళు చేస్తే లేని తప్పు ఆడవాళ్ళు చేస్తే వచ్చిందా?

ఆడవాళ్ళు మాత్రం ఇలాగే వుండాలి అదే సభ్యత అదే సంస్కృతి అని చెప్పే సమాజం మగవాడు కూడా ఇలాగే వుండాలి అని ఎందుకు చెప్పదు?

ఇదేం న్యాయం? అంటూ ఆవేశం తో ఆవేదనతో మాట్లాడి కాస్త ఆయాసం కూడా రావడం తో ఆగాను,

మా వారు మౌనంగా లేచి వెళ్ళి మంచి నీళ్ళ గ్లాసు తెచ్చి నాకు అందిస్తూ " కాస్త శాంతించు  సుజాతా నీ ఆవేదన నాకు అర్ధం అయింది, కాక పోతే మనది తర తరాలుగా యుగ యుగాలుగా పురుషాధిక్య సమాజం, ఇది కాదనలేని నిజం.

నువ్వన్నట్లు దేవుళ్ళు కానీ పురాణాలలో కానీ అన్ని చోట్లా బహుభార్యా తత్వం కనపడుతుంది. దీనికి కారణం ఏమిటో నేను పూర్తిగా చెప్పలేక పోయినా.
తరువాత రాచరిక వ్యవస్థలో రాజులు వారి వంశాలను వృద్ధి చేసుకోవడానికి ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ఎక్కువ మందిని పెళ్ళి చేసుకునే వారట.

ఏది ఏమైనా అనాది నుండి పురుషుడు స్త్రీ ని ఒక భోగ వస్తువు గా, విలాస వస్తువుగా, పిల్లలను కనే యంత్రం  గానే చూసాడు అన్నది  నిజం.

మొదటి నుండీ మీ ఆడవారికి సమాజం లో అన్యాయమే జరిగింది. కన్యా సుల్కం , సతీ సహగమనం, వరకట్నం, ఇలా ఎన్నో సామాజిక దురాచారాలను ఎదుర్కొన్నారు.

ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారుతున్నాయి, స్త్రీ లు కూడా విద్యావంతులు అవుతున్నారు, మంచి , చెడు తెలుసుకుంటున్నారు,అన్యాయాన్ని ఎదిరిస్తున్నారు. కాబట్టి తప్పకుండా సమాజం లో మార్పు వస్తుంది.

ఏమో అసలే ఆడపిలల సంఖ్య తగ్గిపోతూ ఉంది.మగపిల్లలకు పెళ్ళిళ్ళు కావడమే కష్టంగా వుంది, 1000 అబ్బాయిలకు 943 అమ్మాయిలు మాత్రమే ఉన్నారంట, ఇది ఇలాగే కొనసాగితే 
సృష్టి తిరగబడి నువ్వు అన్నట్టు బహు భార్యా వ్యవస్థ పోయి బహు భర్తా వ్యవస్థ వస్తుందేమో చూడు" అన్నారు.

అది విన్న నేను "వద్దండీ బాబూ అది అసలే వద్దు అన్నాను కంగారుగా"
"ఏం ఎందుకని" అని అడిగారు.
"ఎందుకండీ బాబూ ఇంకో దరిద్రాన్ని మా నెట్టిన పెడతారు,ఇప్పటి దాకా భరించినవి చాలదా? ఒక మొగుడి తోనే వేగలేక, చాకిరీ చేయలేక చస్తున్నాం.
ఇంకా మా మొహాలకు ఇద్దరు ముగ్గురు మొగుళ్ళు కూడానా...! 
అప్పుడు అంత మంది మొగుళ్ళకూ చాకిరీ చేయలేక చావాలి, అంత మందికీ పిల్లల్ని కనాలి, అంత మంది మొగుళ్ళతోనూ వేగాలి, అంత బంపర్ ఆఫర్ మా ఆడవాళ్ళ కు వద్దు లెండి అన్నాను.

దానికి మా వారు పగలబడి నవ్వి "నిజమే నోయ్ ఈ కోణం లో నేను ఆలోచించలేదు  సుమీ, భలే చెప్పావు అన్నారు.

          ****శుభం****
 #అరికాళ్ళకింద_మంటలు_శ్రీపాద_సుబ్రహ్మణ్య_శాస్త్రి!
 (#కధ_పరిచయం_శ్రీమతిPadma_Dasaradhiగారు)
  ముందు నేను శ్రీపాద వారి "ఇల్లు పట్టిన వెధవాడబడుచు"అనే కధను పరిచయం చేద్దాం అనుకున్నాను.కానీ,కొందరు పాఠక మిత్రుల కోరికమేరకు ఈ "అరికాళ్ళకింద మంటలు"అనే కధా పరిచయానికి పూనుకున్నాను.ఆ రోజుల్లో బాల్యవివాహాలు చేసిన ఆడపిల్లల్లో చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన దురదృష్ట వంతులైన ఆడపిల్లల దీనస్థితికి, ఈ కధ అద్దం పడుతుంది.వైధవ్యానికి గురైన ఆడపిల్లల్లో కొందరు పుట్టింట పెత్తనం చేపట్టి చక్రం తిప్పడాన్ని ఇల్లు పట్టిన వెధవాడబడుచు కధ వివరిస్తుంది.
దానికివిరుద్ధంగాకొందరుఆడపిల్లలుతోటిఅక్కచెల్లెళ్ళు,అన్నదమ్ములు,
అమ్మమ్మ చివరకు సొంత తల్లిదండ్రుల వలననే వివక్షకు గురై,రాత్రీ పగలూ ఇంటెడు చాకిరీతో దిగ్గుళ్ళిపోవటాన్ని ఈ అరికాళ్ళకింద మంటలు అనే కధ మనకు తెలియచేస్తుంది.
!!ఇది ఎంతో హృదయవిదారకమైన కధ!!బాలవితంతువైన రుక్కు
 మన మనసులను ఎంతగా కదిలిస్తుందంటే,మనం చటుక్కున కధలోకి ప్రవేశించి,రుక్కును వేధిస్తున్న అక్కచెల్లెళ్ళు,అమ్మమ్మ తదితర కుటుంబసభ్యుల నుండి కాపాడి,మనింట్లో దాచి పెట్టి రక్షణ కల్పిద్దాం అని ఉద్రేక పడేంతగా మన మనసులను కదిలిస్తుంది!!
సరే,కధలోకి ప్రవేశిద్దాం!!
రుక్కు!!బాల వితంతువు!చిన్నతనంలోనే భర్తను కోల్పోయి
 కన్నవారింట్లో జీతం,బత్తెం లేని చాకిరీ చేస్తున్న దురదృష్టవంతురాలు!ఆమెమీద కనికరంలేని కుటుంబ సభ్యుల దార్టీకంతో కధ మొదలవుతుంది.ఫలనా పాత్రస్వభావం ఈ విధంగా ఉంటుంది అనే వివరణ వీరి కధల్లో మనకు గోచరించదు.సంభాషణల వలననే పాత్రల స్వభావాలు కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించడం వీరి ‌రచనలలోని ప్రత్యేకత!
ఇంటెడు పనై,అందరికన్న ఆఖరుగా భోజనం చేసి రుక్కు కొద్దిపాటి విరామంకోసం కూర్చోవటం నచ్చని ఆమె అమ్మమ్మ రుక్కుని గంధం తీయమని పురమాయించటంతో ఈ కధ ప్రారంభమవుతుంది!
రుక్కు అమాయకంగా పెద్దబావ నిన్నే వెళ్ళిపోయాడు కదా?
ఇక గంధం ఎవరికోసం అని అడగగా ఆమె కోపంతో పళ్ళు కొరుకుతూ,నా కూతురూ అల్లుడూ,(అంటే రుక్కు తల్లీ తండ్రీ) లేరూ?
వాళ్ళేమన్నా ముసలాళ్ళా,ముతకాళ్ళా?నిక్షేపంలా గంధం పూసుకుంటారు,గిన్నెడు గంధం తీయమని ఆజ్ఞాపిస్తుంది!దరిద్రజాతకురాలైన రుక్కును చేసుకోవటం వలనే నిక్షేపం వంటి రుక్కు భర్త పోయాడనీ,మనోవర్తికి కూడా గతిలేనిదనీ నిందిస్తుంది!!"గంధం పూసుకుంటే ఎంతటి సుఖం కలుగుతుందో నీకెలా తెలుస్తుంది?
అలాటివి అనుభవించే జన్మేనా నీది?వెనకటి జన్మలో ఎవళ్ళని చూసి ఏడ్చావో,ఎవళ్ళ సుఖం పడగొట్టావో,ఎవళ్ళకి ఎడబాటు కల్పించావో,లేకపోతే ఇప్పుడు నీకీ రాత ఎందుకు వస్తుందీ"అని రుక్కుని మాటలతో హింసించే అమ్మమ్మ పాత్ర మనందరికీ,ముఖ్యంగా నాకు శత్రువై కూర్చుంది!!
దొడ్లో గేదే ఉంది,ఇంట్లో నేనూ ఉన్నాను అని రుక్కు మాటవరసకు అనగానే,కనిపెంచే గేదెకీ,నీకూ సాపత్యమా!బిడ్డలను కనాలనే ఊహకూడా నీకు ఉందన్నమాట అని రుక్కుని కౄరంగా మాటలతో నిందిస్తుంది!!
సరే అమ్మమ్మ ఆజ్ఞ ప్రకారం రుక్కు గంధం తీయటమనే పనికి తలొగ్గింది!!గిన్నెడు చిక్కని గంధం, గంధపు సాన మీద చాది తీయటం,అదీ ఒక్క మనిషి,ఎన్ని గంటల సమయం పడుతుందో ఒక్కసారి ఊహిస్తే మనకు కడుపు చెరువవుతుంది!
ఇంతలో రుక్కు చిన్నక్క వస్తుంది ఆమె దగ్గరకు!"చెల్లీ!!ఒక్కపని చెపుతాను చేసి పెట్టవూ""అనే నయగారపు పలకరింపుతో!!జాకెట్టు గుడ్డ ఇచ్చి సాయంత్రానికి రవికె కుట్టమని కోరుతుంది!ఈ రోజు నావల్ల కాదంటుంది రుక్కు!పెద్దక్క తన కూతురికి జుబ్బా కుట్టమని బట్ట ఇచ్చింది.చేతిలో ఉన్న పని అవగానే ఆ పని చేయాలంటుంది రుక్కు!!అప్పుడు రుక్కు చేతిలో ఉన్నపని కందులు బాగు చేయటం!ఈ కాసిని కందులూ చేశాక ఖాళీయే కదా అంటుంది చిన్నక్క!కాసిని కందులేమిటీ,ఇవి నాలుగు కుంచాల కందులు,అవి బాగు చేసేప్పటికే మధ్యాహ్నం మూడు గంటలవుతుందనీ,తరువాత తల్లీ తండ్రికోసం గిన్నెడు గంధం తీయాలనీ రుక్కు వివరించటం చూసి మన నెత్తురు ఉడికిపోతుంది!!సరే ఆతరువాత తన రవిక కుట్టమన్న చిన్నక్కకు ముందు పెద్దక్క తన కూతురికి కుట్టమన్న జుబ్బా కుట్టే పనిచూస్తాను అని చెప్పగానే,ఆ చిన్నక్క ఆడిన నిష్టూరాలు చూడండి"మీ బావ నెల కిందట తెచ్చిన జాకెట్టు గుడ్డ అది.ఆయన ఇవాళో రేపో వస్తారు!నేను ఆ జాకెట్టు వేసుకోవడం చూసి ఎంతైనా సంతోషిస్తారు.నీకు కాస్తైనా సరసం తెలిస్తేనా?అయినా నీ ఇష్టం వచ్చినట్టు తగులడు!నీకు ఆ పెద్దక్క అంటేనే ఇష్టం!సరే కనీసం రేపు పొద్దునకైనా కుట్టు"అని పురమాయిస్తుంది.ఇంతకీ చిన్నక్కకు కుట్టుపని తెలియక కాదు,రుక్కు ఉన్నదే చాకిరీకి అనే భావన ఆమెది!!
ఇంతలో పెద్దక్క రంగప్రవేశం చేస్తుంది జుబ్బాపని ఎంతవరకూ వచ్చింది అని అడుగుతూ!గంధం తీస్తున్న రుక్కుని అది ఎవరికి అని అడిగి,తల్లీ తండ్రికి అని చెప్పగానే ఆశ్చర్యపోతుంది.జుబ్బా కత్తిరింపులు మాత్రం అయినాయనీ,కుట్టే పని అవలేదనీ,భోజనాలయాక కందులు బాగు చేశాననీ,ఇప్పుడు గంధం తీస్తున్నాననీ,ఎవరూ మరోపని పురమాయించకపోతే జుబ్బాకుట్టే పనే చేస్తానని చెపుతుంది రుక్కు!చిన్నక్క రైక కుట్టమని జాకెట్టుగుడ్డ ఇచ్చిందన్న విషయం కూపీ లాగి,నీకు చిన్నక్క అంటేనే ఇష్టం లాటి నిష్టూరాలాడి,ఆ రాత్రికెలాగైనా జుబ్బా కుట్టేయమని హెచ్చరిక చేసి కదిలింది పెద్దక్క!
ఇంతలో రుక్కు దగ్గరకు చేరింది రుక్కు చెల్లెలు!తన స్నేహితురాళ్ళతో తను ఆడుకునే బువ్వాలాటలో తన వంతు బెల్లం ముక్క వచ్చిందనీ,తల్లినడిగితే తిడుతుంది కాబట్టి రుక్కునే ఇవ్వమని అడుగుతుంది.తను ఇవ్వకూడదనీ,ఇవ్వనని చెప్పిన రుక్కుమీద అక్కస్సుతో రుక్కు రెక్కలు పడిపోయేట్టు తీసిన గంధం గిన్నె ఎత్తుకుపోయి దాన్ని నేలపాలు చేసేస్తుంది!!నెత్తిన చేతులు పెట్టుకు కూలబడిన రుక్కును ఎగతాళి చేసి పారిపోతుంది చెల్లెలు!ఆ చెల్లెలు వెంటపడి,పట్టుకుని,కసితీరా నాలుగు తన్నాలనే కోరిక కలిగింది నాకిప్పుడు!!
సరే,మళ్ళీ గిన్నెడు గంధమూ తీసి జుబ్బా కుడదామని కూర్చున్న రుక్కు దగ్గరకు తల్లి వచ్చింది.రాత్రికి మడిగట్టుకుని వంట చేయమన్న పురమాయింపుతో!తండ్రికి తనే తలంటాలనే మిషతో రుక్కుకి వంటపని అంటకట్టింది తల్లి‌.పెద్దక్క,చిన్నక్కలలో ఎవరినన్నా వంటచేయించమని తల్లిని కోరుతుంది రుక్కు! దానికి తల్లి చెప్పిన సమాధానం మీరుకూడా చిత్తగించండి"వాళ్ళెందుకు చేస్తారమ్మా మనకి!వాళ్ళిక్కడ పని చేస్తే వాళ్ళ మొగుళ్ళూ,అత్తగార్లూ ఏఔ దెప్పుతారో వాళ్ళని!మనకి ఓపిక ఉంటే చేసి పెట్టాలి,లేకపోతే పంపేయాలి కానీ పనులు చెప్పకూడదు మనం"ఆరైపోయింది,వంటకు లెమ్మని తరుముతూనే,ఆ తల్లి అలవోకగా చెప్పిన పనుల జాబితా చూడండి"అరటికాయ పప్పులో వేసి,వంగవరుగూ,పనసపెచ్చు,మునక్కాడలూ వేసి పులుసు పెట్టు చాలు!చద్దన్నాల్లోకి మామిడి కాయల పచ్చడి చేయటం మర్చిపోకు!అమ్మమ్మకు కొయ్యరొట్టిలోకి కొబ్బరి పచ్చడి చేసివ్వు.అన్నట్టు పొయ్యిలోకి ఒక్క చెక్కపేడైనా లేదు,చీకటి పడకుండా అటక ఎక్కి నాలుగు పూటలకు సరిపడా కట్టెలు తీసి కింద పడేయటం మర్చిపోకు"అమ్మతనానికే మచ్చ తెచ్చే ఈ మనిషి కూడా తల్లేనా?అంతకంటే బిడ్డలు లేని గొడ్రాలు నయమే అనిపిస్తుంది ఆమె పాత్రని చూస్తే!ఆపకుండా,చెవులు ఎర్రబడినా వదలకుండా చెవులు మెలిపెట్టాలనిపిస్తుంది చదువరులకు!!
ఉసూరు మంటూ మడి కట్టుకుని వంట చేస్తున్న రుక్కు దగ్గరకి తమ్ముడు వచ్చాడు అర్జెంట్ గా అన్నం పెట్టు,సినిమాకు వెళ్ళాలనే డిమాండుతో!పెద్దక్క,చిన్నక్కలు అమ్మలక్కలతో గవ్వలాడుకుంటూ ఒకరు,మల్లెమొగ్గలు గుచ్చుకుంటూ ఒకరూ ఖాళీగా లేనందున రుక్కే తమ్ముడికి అన్నం పెట్టాల్సివస్తుంది.ఆ తమ్ముడు అన్నం మెక్కి సినిమాకు వేంచేస్తాడు రాత్రి పులుసులోకి ముక్కలు నాకు ఎక్కువ దాచి ఉంచకపోతే చితక్కొట్టేస్తా నిన్ను అనే హెచ్చరిక రుక్కుకి జారీ చేసి!!
అన్నం పెట్టి వంట చేస్తున్న రుక్కుమీద తండ్రికి కాస్త దయ కలుగుతుంది.మడి నువ్వు కట్టుకున్నావేమమ్మా,అక్కలు,అమ్మమ్మ ఏం చేస్తున్నారు అని అడగగానే గయ్యాళి అత్తగారు అల్లుడి మీద విరుచుకు పడుతుంది!సరే రుక్కుతో అప్పుడప్పుడు మాత్రమే మడి కట్టించండి,రోజూ వద్దు అని చెప్పిన అల్లుడిని అత్తగారు మళ్ళీ నిలదీస్తుంది!జుట్టున్న విధవరాలు రుక్కు వండితే ,ఆచారవంతురాలైన తనకి తినటానికి పనికి రాదు కనక రాబోయే దశమికి కోటిలింగాల రేవులో తలవెంట్రుకలు తీయించి గుండు చేయిద్దామని చెపుతుంది.ఇంకా పదిహేడు సంవత్సరాలైనా నిండలేదు కదా అని తటపటాయిస్తాడు రుక్కు తండ్రి!
దానికి అత్తగారు,విధవలకు ఇది మంచికాలం కాదనీ, వీరేశలింగంతోటలో విధవా వివాహాలు చేయిస్తున్నారనీ,నలుగురు పెళ్ళికొడులకోసం విధవలను వెతుకుతున్నారనీ,వారు తారసపడగానే సమయాసమయాలు,ముహూర్తాలు చూడకుండా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు కాబట్టి,రుక్కుని తను స్వయంగా తీసుకువెళ్ళి శిరోముండనం చేయిస్తాననీ ప్రకటిస్తుంది!!
ఇవన్నీ విన్న రుక్కు మనసులో అలజడి రేగి వడ్డనలన్నీ తారుమారుగా చేస్తుంది!ఇంటిపనులన్నీ ముగించుకుని రుక్కు పక్క చేరేటప్పటికి రాత్రి పదకొండయింది.అందరూ నిద్రలో ఉంటారు.
ఆమె ఆలోచనలలో రవికలగుడ్డ చేత పట్టుకుని కొరకొరా చూస్తూ చిన్నక్క ఒకవైపు,జుబ్బాగుడ్డ చేత పట్టుకుని పళ్ళు కొరుకుతూ పెద్దక్క ఒకవైపు,రెక్కలు పడిపోయేట్టు తను తీసిన గిన్నెడు గంధంలో సెంటు కలిపి పూసుకుని సరాగాలాడుకుంటున్న తల్లిదండ్రులు మరోవైపు,కత్తినూరుతూ మంగలి వెంటరాగా స్వయంగా చేత కత్తెర పట్టుకుని తనను తరుముతున్న అమ్మమ్మ మరోవైపూ గోచరిస్తారు..
ఒళ్ళు రణకంపరమెత్తిన రుక్కు ఆ అర్ధరాత్రి తలుపు తీసుకుని వీధిన పడింది!అక్కడ ఒక జట్కావాడు,ఆమె వాలకం గ్రహించి పంతులుగారి తోటకు దమ్మిడీ డబ్బులు తీసుకోకుండా సవారీ కట్టి బండిని ఆఘమేఘాలమీద పరుగెత్తిస్తాడు.తనకీ ఒకపదిరోజుల కిందే భర్త చనిపోయిన కూతురుందనీ,ఇంకా సంసారంకూడా చేయలేదనీ,కొద్దిరోజులు పోయాక తిరిగి పెళ్ళి చేస్తా ననీ తన కధ చెప్తాడు.పంతులుగా తోటకు రుక్కుని చేరుస్తాననీ,అక్కడ రాచకొమారుడి వంటి పెళ్ళికొడుకు సిద్ధంగా ఉన్నాడనీ,రుక్కు అక్కడికి చేరగానే పెళ్ళి చేసేస్తారనీ ఇక మీకు సుఖమేకానీ కష్టం ఉండదనీ ధైర్యం చెప్తూ మేఘాలమీద జట్కా తోలటంతో కధ ముగుస్తుంది!!
జట్కా అతని మాటలతో మనకూ రుక్కు భవిష్యత్తు మీద కొండంత భరోసా ఏర్పడి,అప్పటివరకూ ఆమె పట్ల ఏర్పడిన దిగులు పటాపంచలవుతుంది!
ఈ కధలో ఎన్నిసార్లు మనకు రుక్కు రక్షకుని పాత్ర ధరించి,ఆమె మీద దాష్టికం చేస్తున్న కుటుంబ సభ్యులని దండించి,రుక్కుని వారి బారినుండి కాపాడదామనే కోరిక కలుగుతుందో చెప్పలేను.కష్టంలో ఉన్న కన్నకూతురిని కడుపులో పెట్టుకుని కాపాడుకోవలసిన తల్లితండ్రులు కనికరం లేకుండా ‌దాసీదానికంటే హీనంగా చూడటం చూస్తే మనకు పేగు కదులుతుంది.కొన్నిచోట్ల కంటనీరు తిరుగుతుంది,కొన్నచోట్ల ఆగ్రహం పెల్లుబుకుతుంది.చదువులేని జట్కావాడికి తన బాలవితంతువైన కూతురి పట్ల కల వాత్సల్యం,ఒక చదువుకున్న,సంపన్నుడైన బ్రాహ్మణ కుటుంబంలో లేకపోయింది కదా అనే ఖేదం కలుగుతుంది.కధలో రెండే నిముషాలు దర్శనమిచ్చే జట్కావాడి పాత్ర కనిపించే ఉదాత్తత,భావ సంపన్నత అతనికి మనం మనసులోనే నమస్కరించేట్లు చేస్తాయి!!
పరిస్థితి చెడినప్పుడు తల్లితండ్రులు కూడా ఎంత కటువుగా,హేయంగా ప్రవర్తిస్తారో తెలియచేసే ఈ కధ తప్పక చదవదగినది!!వీలైతే చదవండి !!
 *✍🏼 నేటి కథ ✍🏼*

*నలుగురు మూర్ఖులు*

ఒక ఊరిలో ఒక యజమాని ఉండేవాడు ఆయనకు మూర్ఖులుగా వున్నవాళ్ళని పనిలో పెట్టుకోవాలంటే ఇష్టము . ఆయన ఒకరోజు దారిలో పోతుండగా నలుగురు మూర్ఖులు కనపడినారు. ఆయనచాలా సంతోషముగా వద్దకు వెళ్ళి "మీరు మా ఇంటిలో పనివాళ్ళుగా ఉంటారా" అని అడిగాడు. ఆమూర్ఖులు "సరే" అన్నారు. యజమాని "మీరు రేపు పొద్దున మా ఇంటికి రండి" అని చెప్పాడు. అలాగే వారు వచ్చారు

యజమాని ఒక మూర్ఖుడిని అడవిలో మేకలను మేతకు తీసుకోని పొమ్మన్నాడు. రెండవ వానిని అడవిలో కట్టెలు కొట్టుకొని రమ్మన్నాడు. మూడవ వానిని ప్రక్క ఊరికి వెళ్ల్ నెయ్యి తెమ్మన్నాడు. నాలుగవ వానిని ఇంటిలోనే ఉండి తన తల్లి సంరక్షణ చూసుకొమ్మని చెప్పాడు.

ఒక మూర్ఖుడిని మేకలు మేపడానికి పొమ్మన్నాడు కదూ? అతడు బావి దగ్గర కూర్చొని ఎదో తింటున్నాడు. ఆ బావిలోని కప్పలు బెక, బెక, బెక, బెక అంటున్నాయి. ఈ మూర్ఖుడు ఏమి అనుకున్నాడంటే; ఈ కప్పలకు కూడా చాలా ఆకలి వేస్తోంది అని. అలా అనుకొని వాడు ఒక మేకను బావిలోకి వేశాడు. ఆ కప్పలు ఇంకా అరుస్తూనే ఉన్నాయి. వాడు ఒకదాని తరువాత ఒకటిగా అన్ని మేకల్నీ బావిలోకి వేసి ఉత్త చేతులతో ఇంటికి వచ్చాడు.

ఇంకొక మూర్ఖుడిని కట్టెలు కొట్టుకొని రమ్మన్నాడు కదూ! ఆ మూర్ఖుడు కట్టెలు కొట్టుకొని బండిలో వేసుకొని వస్తున్నాడు. ఎత్తులో వెళ్తున్నాడు. బండి చక్రాలు ’పర్ పర్’ అంటున్నాయి. ఆ మూర్ఖుడు ఏమనుకున్నాడంటే "పాపం చక్రాలు బరువు మోయలేక పోరున్నాయి’ అని. అలా అనుకొని వాడు కొన్ని కట్టెలు దింపేశాడు. అయినా అట్లే శబ్దం వస్తున్నది. అలా ఒక్కటొక్కటిగా కట్టెలన్నింటినీ తీసివేసి ఖాళీ బండిని ఇంటికి తీసుక వచ్చాడు వాడు..

ఇంకొక మూర్ఖుడిని పక్కనున్న ఊరికిపోయి నెయ్యి తీసుకొని రమ్మని చెప్పాడు కదూ? వాడు మొదట నెయ్యి డబ్బా తీసుకొని బయలుదేరినప్పుడు అది బరువని అనిపించలేదు. తేలికగానే ఉండింది. అయితే కొంతదూరం వచ్చాక డబ్బా చాలా బరువు అనిపించింది. ఇంకొంత దూరము నడిచాక వాడు ఏమనుకున్నాడంటే, "ఈ డబ్బాలో దయ్యం వుంది, లేకపోతే ఎందుకు బరువెక్కుతుంది?’ అనుకొన్నాడు. డబ్బాను దించి చూశాడు అందులో అతని ప్రతిబింబము కనిపించింది. అది దయ్యమే అనుకున్నాడు వాడు. పక్కనే ఒక బావి కనబడింది. ఆబావిలో వాడు నెయ్యి డబ్బాను పారవేశాడు. "అమ్మయ్య! దయ్యం పీడ వదిలింది" అనుకున్నాడు.

నాలుగోవాడిని తన రోగిష్టి అమ్మ సంరక్షణని చూసుకొమ్మన్నాడుకదూ? ఆ మూర్ఖుడు యజమాని గారి అమ్మ ప్రక్కన కూర్చున్నాడు. అంతలో ఒక ఈగ అమె మూతిపై వాలింది. ఆమూర్ఖుడు చూసి "మా అమ్మగారిమీద వాలుతావా, నీకెంత ధైర్యం, మా అమ్మగారి మీద వాలద్దు" అన్నాడు. ఆ ఈగేమో, పక్కకు పోయినట్టేపోయి మళ్లా వచ్చి వాలింది. పట్టరాని కోపం వచ్చిన ఆ మూర్ఖుడు రోకలి తీసుకొనివచ్చి, చూపించి, "చూడు ఈసారి మా అమ్మగారి మీద వాలావంటే దీనితో కొడతానన్నాడు. దానికేం తెలుసు, అది మళ్లా వచ్చి వాలింది. దాంతో విసుగెత్తిన ఆమూర్ఖుడు రోకలి బండ తీసుకొని ఆమె ముక్కుమీద ఒక్కదెబ్బ కొట్టాడు. ఆదెబ్బకు ముసలామె చచ్చి హరీమన్నది. ఈగ మాత్రం చనిపోలేదు. యజమాని ఇంటికి వచ్చిచూస్తే ’కట్టెలు పోయే, మేకలు పోయే, నెయ్యి పోయే, అమ్మా పోయే’ అన్నట్లయ్యింది. ’ఈమూర్ఖులను పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి శాస్తి జరిగింది’ అని చెంపలు వాయించుకున్నాడు యజమాని.
 ఒక ఊరిలో ముగ్గురు స్త్రీలు అడవికి వెళ్ళి కట్టెల మోపుతో ఇండ్లకు వస్తున్నారు. 

అప్పుడే స్కూల్స్ వదిలారు. అంతలో ఒకావిడ ఒక అబ్బాయిని చూపించి వీడు నా కొడుకు "ఇంగిలీసు" బడిలో చదువుతున్నాడు అంది. 

ఇంతలో వాడి వెనుకాల వస్తున్న అబ్బాయినిచూసి రెండవ స్త్రీ అదిగో వాడు నా కొడుకు సి.బి.యస్.ఇ లో చదువుతాడు అన్నది.

ఇంతలో మరొక అబ్బాయి బడి నుంచి వస్తూ పరుగు పరుగున మూడవ స్త్రీ తల మీద ఉన్న కట్టెల మోపు తన తలమీద పెట్టుకొని ఇంత బరువెలా మొస్తున్నా వమ్మా అంటూ, ఆమె చేయి పట్టుకొని నడుస్తున్నాడు.

అప్పుడా మూడవ స్త్రీ... వీడు నా కొడుకు ప్రభుత్వ బడిలో  చదువుతున్నాడంది. 

ఆ పిల్లవాడి సంస్కారంచూసి మిగతా ఇద్దరు స్త్రీలు తలదించుకు న్నారు.

నీతి :- ఏమిటంటే మీడియం ఏదైనా సరే...! సంస్కారము అబ్బాలి కదా..! నిజమే.. అంటారా..!!
 నిజం తెలిసినా కొన్నిసార్లు  మౌనంగా ఉండడం ఉత్తమం అంటారు పెద్దలు ఇందుకేనేమో అనిపించింది 

ఒక రోజు జైల్లో మతగురువును లాయర్ ను ఒక శాస్త్రవేత్తను ఉరి తీయబోయారు 

మతగురువును ఉరి తీయగా మెడకు తాడు కట్టి లాగాలి అనగానే కొంచం దూరం వాచీ తాడు ఆగిపోయింది 
అప్పుడు మతగురువు నా దేవుడు నన్ను రక్షించాడు 
దేవుడు ఉన్నాడు అని గట్టగా అరిచాడు 
అయన మరణ శిక్ష నుండి తప్పించుకున్నాడు 

వెంటనే లాయర్ కు సిద్ధం చేసారు 
మతగురువుకు జరిగినట్టే లాయర్ కు జరిగింది 
న్యాయం గెలిచింది అన్యాయం ఓడింది అని అయన అన్నాడు 
ఆయనకు మరణ శిక్ష రద్దు అయ్యింది 

ఇక మిగిలింది శాస్త్రవేత్త 
అయన ఊరికే ఉండకుండా 
దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు 
న్యాయం ఉందో లేదో నాకు తెలియదు కానీ మీరు వేస్తున్న తాడు ఒక చోట ముడిపడింది అందుకే అది సగం లో వచ్చి ఆగిపోయింది చూడండి అని ముడి పడిన చోటును చూపెడుతాడు 

వారు ఆ ముడిని తీసి ఈ శాస్త్రవేత్తను మాత్రం సరిగ్గా ఉరితీశారు 
నిజం చెప్పినా అయన తప్పించుకోలేకపోయాడు 
అబద్ధం చెప్పాలని కాదు నీకు తెలిసినా ఆ నిజాన్ని చెప్పకుండా ఉంటె ఈరోజు అతను కూడా ఆ మరణ శిక్ష నుండి తప్పించుకునేవాడు 

అందుకే ఎక్కడ మాట్లాడాలో కాదు 
ఎక్కడ మౌనంగా ఉండాలో కూడా తెలుసుకోవాలని చెప్పేది
 *26-Mar-25, Enlightenment Story*
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
✅"ఎంతో మంచి ఆలోచన,ఒక్క సారి చదవండి!"💥

*స్విస్ టైమ్ బ్యాంక్, స్విట్జర్లాండ్ లో చదివే ఓ విద్యార్థి పరిశీలన: స్విట్జర్లాండ్ లో చదివేటప్పుడు నేను ఓ పాఠశాల దగ్గర్లోనే కిరాయికి ఉండే వాడిని.

మా ఇంటి ఓనరు,67 సం॥ల, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రిటైరైన ఒంటరి మహిళ.
ఆమెకు వచ్చే పెన్షనుతో ఆమె హాయిగా జీవించవచ్చు.అయినప్పటికీ ఆమె ఒక 87సం॥ల వృద్ధునికి సేవ చేసే పనికి కుదిరింది.

నేనామెను డబ్బు కోసం పని చేస్తున్నారా?అని అడిగాను.

"నేను డబ్బు కోసం పని చేయడం లేదు,నా సమయాన్ని *'టైమ్ బ్యాంక్ '* లో దాచుకుంటున్నాను.

వృద్ధాప్యంలో,నేను కదలలేని పరిస్థితుల్లో తిరిగి వినియోగించుకుంటాను."అన్న ఆమె జవాబు నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ టైమ్ బ్యాంక్ అనే భావన తొలిసారిగా విన్న నాలో ఆసక్తి పెరిగి మరిన్ని వివరాలడిగాను.

టైమ్ బ్యాంక్ అనేది స్విస్ ప్రభుత్వ సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం.

ప్రజలు తాము యవ్వనంలో,ఆరోగ్యంగా ఉన్నపుడు వృద్ధులకు,అనారోగ్యంగా ఉన్నవారికి సేవలందిస్తూ,సమయాన్ని దాచుకొని,
తిరిగి వారికి అవసరమున్నపుడు ఉపయోగించుకోవచ్చు.

  దరఖాస్తుదారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి,ప్రేమపూర్వక సంభాషణా నైపుణ్యం కల్గి ఉండాలి.

ప్రతిరోజు వారి సేవలను కోరుకునే వారికి అందించగలగాలి.

వారి సేవాకాలాన్ని వారి వ్యక్తిగత ఖాతాలలో సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ జమ చేస్తుంది.

అలా ఆమె వారానికి రెండు రోజులు రెండు గంటల చొప్పున వృద్ధులకు సేవలందించడానికి వెళ్లేది.

వారి గదుల్ని శుభ్రం చేయడానికి,సరుకులు తేవడానికి,వారికి సన్ బాత్ లో సహకరించడానికి, కొద్దిసేపు ముచ్చడించడానికీ సమయాన్ని కేటాయించేది.

  అంగీకారం ప్రకారం సంవత్సరం తర్వాత టైమ్ బ్యాంక్ ఆమె సేవాకాలాన్ని లెక్కించి,'టైమ్ బ్యాంక్ కార్డు'జారీ చేసేది.

ఆమెకు ఇతరుల సహాయం అవసరమున్నపుడు తన కార్డును ఉపయోగించుకుని తన ఖాతాలో ఉన్న సమయాన్ని వడ్డీతో సహా తిరిగి వాడుకునేది.

ఆమె దరఖాస్తును పరిశీలించి, టైమ్ బ్యాంక్ ఒక వాలంటీర్ ను ఆమె ఇంటికి గానీ, ఆస్పత్రికి గానీ పంపేవారు.

  ఒకరోజు నేను స్కూల్లో ఉన్నపుడు ఆమె నన్ను పిలిచి,కిటికీ శుభ్రం చేస్తుంటే స్టూల్ పైనుండి జారిపడ్డానని చెప్పింది. 

నేను వెంటనే సెలవు పెట్టి,ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్లాను.

ఆమె మడమ దగ్గర విరిగి,కొంత కాలం పాటు మంచం పైనే ఉండవలసి వచ్చింది.

నేను కొన్ని రోజుల పాటు ఇంటి పట్టునే ఉండడానికి సిద్ధమౌతుంటే,ఆమె ఏమీ దిగులు పడనవసరం లేదన్నది.

ఆమె అప్పటికే టైమ్ బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నది.
ఆశ్చర్యకరంగా రెండు గంటల్లోపే ఆవిడకు సేవలందించడానికి టైమ్ బ్యాంక్ వాలంటీరును పంపించింది.

ఆనెలంతా ఆ వాలంటీర్ ప్రతిరోజూ ఆవిడ బాగోగులు చూసుకుంటూ,     రుచికరమైన వంటలు చేస్తూ,సరదాగా కబుర్లు చెబుతూ ఉండేది.

సరైన సేవల వల్ల ఆమె త్వరలోనే కోలుకుని,తిరిగి తన పనులు తాను చేసుకోవడం మొదలైంది.
తానింకా ఆరోగ్యంగానే ఉన్నందున తిరిగి టైమ్ బ్యాంక్ లో మరింత కాలాన్ని నమోదు చేసుకుంటానంది ఆమె.

ఈరోజుల్లో స్విట్జర్లాండ్ లో వృద్ధులకు టైమ్ బ్యాంకులు సేవలందించడం అనేది సర్వసాధారణమైంది.

ఈ విధానం దేశ భీమా ఖర్చుల్ని తగ్గించడమే కాక, అనేక సామాజిక సమస్యల్ని కూడా పరిష్కరిస్తుంది.స్విస్ ప్రజలు కూడా ఈ విధానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. 

ఒక సర్వే ప్రకారం సగం మంది స్విస్ పౌరులు ఈ విధానంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది.

 ప్రభుత్వం కూడా ఈ 'టైమ్ బ్యాంక్ 'విధానాన్ని చట్టబద్ధం చేసింది.

  ప్రస్తుతం ఆసియా దేశాల్లో కూడా క్రమంగా "ఒంటరి గూటి-వృద్ధ పక్షులు" పెరిగి పోవడం ఒక సామాజిక సమస్యగా మారుతున్నది.

👍ఆలోచించండి!మనకు కూడా స్విట్జర్లాండ్ *"టైమ్ బ్యాంక్ "* విధానం ఒక మహత్తరమైన ప్రత్యామ్నాయమే కదా...!?🙋‍♂

🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*సర్వేజనా సుఖినోభవంతు*
*లోకా సమస్త సుఖినోభవంతు*
 *శుభం భూయాత్*
*ఓం శాంతి శాంతి శాంతిః*
*స్వస్తి*
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹



 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*అక్బర్ - బాయిసా కిరణ్ దేవి*
            ➖➖➖✍️
```
అక్బర్ ప్రతీ సంవత్సరం ఢిల్లీలో       ‘నౌరోజ్ కా మేళా’ ఏర్పాటు చేయిస్తుండే వాడు.

ఇందులో పురుషులకు ప్రవేశం ఉండేది కాదు ...

అక్బర్ ఈ జాతరలో ఆడవారిలా మారు వేషాలతో వెళ్ళుచుండేవాడు. మరియు ఏ ఆడవారు అతన్ని మంత్ర ముగ్దం చేయుదురో.... వారిని అతని దాసిలు నమ్మించి కుట్ర పూరితంగా అక్బర్ సమ్ముఖానికి తీసుకు పోయేవారు.

ఒక రోజు ఈ నౌరోజ్ జాతర కు మహారాణా ప్రతాప్ సింహ్ చిన్న తమ్ముడు మహారాజు శక్తిసింహ్ బిడ్డ జాతర చూడటానికి వచ్చింది.

ఆమె పేరు ‘బాయిసా కిరణ్ దేవి’. ఆమె వివాహం బికనీర్  మహారాజు పృథివీ రాజు గారితో అయ్యింది.

బాయిసా కిరణ్ దేవి సౌందర్యాన్ని చూసి అక్బర్ తనను తాను నియంత్రణ చేసుకోలేక పోవటం...
మరియు ఆమె ఎవరు ఏమిటి అని తెలుసు కోకుండానే,
దాసీల ద్వారా మోసపూరితంగా రాణివాసం మహల్ లోనికి రప్పించు కున్నాడు.

అక్బర్ ఎప్పుడైతే బాయిసా కిరణ్ దేవిని స్పర్శిచటానికి ప్రయత్నించ గానే ....

కిరణ్ దేవి గారు నడుంలో దాచిపెట్టు కొచ్చిన ఖడ్గము తీసింది, మరియు ఏకధాటిగా అక్బర్ ను కిందపడేసి అతని ఛాతిపైన కాలుతో తొక్కుతూ మెడమీద కత్తిపెట్టింది.

మరియు గర్జిస్తూ అన్నది… “ఓరీ నీచుడా...!  నరాధముడా, నా గురించి సరిగ్గా ఎరుగనట్లున్నావు, ఎవరి పేరు చెప్తే నీకు నిద్ర పట్టదో...., ఆ మహారాణా ప్రతాప్ తమ్ముని బిడ్డను నేను...!”
“నీచివరి కోరిక ఏమిటో చెప్పు...?”

అక్బర్ ముఖం రంగు మారింది ముచ్చెమటలు పట్టాయి...!

ఎప్పుడూ ఊహించి ఉండక పోవచ్చు ఏమనంటే…,
ఈ విధంగా ఇలా ఒక నాడు అక్బర్ వంటివాడు నేడు…
ఒక రాకుమారి కిరణ్ దేవి బాయీసా గారి చరణాలల్లో ఉంటాడని....
అనుకొని ఉండడు.

అక్బర్ అన్నాడు:- 
“మిమ్మల్ని గుర్తించ లేకపోయారు,
నా ద్వారా తప్పు జరిగిపోయింది... నన్ను క్షమించు దేవీ...!”

దీనితో కిరణ్ దేవి బాయిసా  అన్నది:-
ఇక మీదట ఢిల్లీలో...
ఈ నౌరోజ్ మేళా జరగొద్దు....
అంతేగాక ఏ ఒక్క స్త్రీని ఇబ్బంది పెట్టకూడదు ....!”

అక్బర్ చేతులు జోడించి వేడుకున్నాడు “ఇక మీదట ఈ జాతర జరుగదు...!”

ఆ రోజు తర్వాత మళ్ళీ ఆ మేళా జరుగలేదు...!

ఈ దృష్టాంత వర్ణనము...
గిరిధర్ ఆసియ ద్వారా రచించిన ‘సగథ రాంబో’ పుట 632వ పేజీలో ముద్రిత మయ్యింది.

బీకనీర్ సంగ్రహాలయం లో  ఉన్న ఒక పెయింటింగ్ కూడా ఈ ఘటనను ఒక పద్యంలో చెప్ప నైనది.

కిరణ్ ఆడసింహం వలె పడగొట్టి తొక్కి మెడపై కత్తి దూయడం..!

ఈ హఠాత్ పరిణామము వలన అక్బర్ కు చేతులు చాచి ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడాల్సి వచ్చింది..!

అక్బర్ ఛాతి పైన కాలుపెట్టి నిలబడిన వీరబాలిక కిరణ్ దేవి చిత్రం ఈనాటికినీ జైపూర్ సంగ్రహాలయంలో సురక్షితంగా ఉంది.

ఈప్రకారము ఈపోస్ట్ ను షేర్ చేయండి తప్పక చేయండి!

మన పౌరుషత్వ వీర వనితల ఆదర్శ ధర్మము, దిగ్విజయ గాథలు నేటి పరిస్థితులలో అవసరం ఎంతగానో ఉపయోగ పడుతుంది.

ఈ కథను ప్రతి ఒక్క భారతీయ వ్యక్తికి తెలియాలి. 
తద్వారా మన గౌరవమయ జీవన శైలిలో భారత వీరపుత్రుల మరియు వీరాంగనల శౌర్య ధైర్య సాహస పరాక్రమము నేటి సమాజానికి కనువిప్పు కావాలి.✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
 కథానిక : 'చంద్ర శిల'

రచన: ద్విభాష్యం రాజేశ్వరరావు 

'మూన్ రాక్ ఎగ్జిబిట్ !'
'చంద్రశిల ప్రదర్శన !'
              
               తెల్లని గుడ్డ మీద పచ్చని అక్షరాలు మెరిసిపోతున్నాయి. ఆవరణ నిండా తోరణాలు! హాలు నిండా తోరణాలు! రంగురంగుల కాగితాల తోరణాలు!! 
విశాలమైన ఆవరణ. వింత కాంతిని విరజిమ్ముతున్న లోపలి హాలు. ఆవరణ నిండా కార్లు! ఎండలో తళ తళ మెరుస్తున్నాయి! మిలమిల్లాడుతున్నాయి!! 

గేటు నుండి వరండా వరకు పెద్ద క్యూ!
వరండా దాటి హాలు లోనికి వెళ్లడానికి మరింత పెద్ద క్యూ. సుమారు ఫర్లాంగ్ పొడవున పాములా మెలికలు తిరిగిన క్యూ! టెర్లిన్ చొక్కాలు, రేయాన్ ప్యాంట్లు, రంగురంగుల చీరలు, గాజుల గలగలలు, ఖరీదైన సెంటు వాసనలు... ఎండ భరించలేని సుందరాంగుల నిట్టూర్పులు.... క్యూ కదులుతోంది... మెల్లగా, హుందాగా, నిండుగా. 

ముందు జనంతో పాటు నేనూ కదులుతున్నాను.
చంద్రశిలను దర్శించాలనే కుతూహలం చంపుకోలేక, ఆఫీసుకు సెలవు పెట్టి మరీ వచ్చాను. పొడుగాటి క్యూ ను చూస్తే నిరుత్సాహం, విసుగు కలిగిన మాట వాస్తవం. కానీ చంద్రశిలను చూడాలనే ఆసక్తి వాటిని జయించింది .

"అసలు ఈ చంద్రశిల ఎలా ఉంటుందంటారు ?"
నా ముందు నిలబడిన బట్టతలాయన, ముందున్న గిరజాల పెద్దమనిషిని అడుగుతున్నాడు.
గిరజాల పెద్దమనిషి వేదాంతిలా నవ్వేడు. పేరిస్ నుండి వచ్చిన పెద్దమనిషి, ఆది మానవుడి వైపు చూసినట్టు బట్టతల ఆయన వైపు చూశాడు! 
తర్వాత ముఖం మీద పడుతున్న గిరజాల జుట్టు వెనక్కి నెట్టుకుంటూ అన్నాడు "మన రోడ్డు పక్కన ఉండే కంకర రాయిలా ఉందట! నిన్న మా అల్లుడు చూశాడు... మా అల్లుడు జియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు లెండి..." 
"అంతేనా? ఇంకా మెరిసిపోతూ ఉంటుందనుకున్నాను!" అంటూ తన ఆస్తి అంతా పోయినట్టు మొహం పెట్టి నిరుత్సాహ పడి పోయాడు బట్టతలాయన. 
'చంద్రశిలను పట్టుకొచ్చి, ఈ బట్ట తల మధ్యలో పెడితే ఎటువైపు దొర్లుతుందా?' అని ఆలోచిస్తున్నా నేను .
"దానిమీద చిన్న చిన్న రంద్రాలు కూడా ఉన్నాయట! ఆ శిల నిండా కార్బన్ ఎక్కువగా ఉంటుందని మా అల్లుడు చెప్పాడు...." గిరజాలాయన ఇంకా ఏదో చెప్పకుపోతున్నాడు. వాళ్ళ అల్లుడే చంద్రశిలకు అధారిటీ అయినట్లు అభివర్ణిస్తున్నాడు .

క్యూ ముందుకు కదులుతోంది. 
కాంప్లిమెంటరీలతో వచ్చినవాళ్లు క్యూ ని దాటుకొని, విడిది ఇంట్లోకి వెళుతున్న మగ పెళ్లి వారికి మల్లె హుందాగా, దర్జాగా లోపలికి దూరిపోతున్నారు. 
వరండాలోకి వెళ్ళగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది .చల్లని నీడలో సముద్రపు గాలి తగిలి హాయిగా ఉంది. 
వరండాలో ఒక వారగా నిలబడి ఇద్దరు పోలీసులు బీడీలు కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రజల క్రమశిక్షణ మీద  వాళ్లకు దారుణమైన నమ్మకం ఉంది కాబోలు, అసలు క్యూ దగ్గరకు రాకుండా దూరంగా ఉండిపోయారు.
క్యూ ముందుకు కదిలింది. వరండా దాటి హాలు లోనికి అడుగుపెట్టాను.
 
హాలు లోని ట్యూబ్ లైట్ లు తెల్లని కాంతిని విరిజిమ్ముతున్నాయి. హాలు గోడలు పాలలో ముంచి తీసినట్లు తెల్లగా మెరుస్తున్నాయి. గోడకు రంగురంగుల అంతరిక్షనౌకల చిత్రాలు అమర్చబడ్డాయి. తెల్లని దీపాల కాంతి ముందు, గాజు పలక మీద వ్యోమగాముల చిత్రాలు మెరిసిపోతున్నాయి. మైక్ లో అందమైన ఆడకంఠం ఆంగ్లంలో అంతరిక్ష యాత్రా విశేషాలను అభివర్ణిస్తోంది. యాత్రకైన ఖర్చు వివరాలు చెబుతోంది.

నా ముందున్న బట్టతలాయన నా వైపుకు తిరిగి," అమ్మో! అన్ని కోట్ల డాలర్లే?! అంత డబ్బు ఉంటే ఇండియాలో కొన్ని లక్షల బిల్డింగ్స్ కట్టేయొచ్చు!... ఏమంటారు?" అన్నాడు. 
"అవును! కొన్ని కోట్ల కిళ్ళి బడ్డీలు కూడా పెట్టుకోవచ్చు!" అందామనుకున్నాను. కానీ ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను.  బట్టతలాయనకు నా చిరునవ్వు రుచించలేదు కాబోలు, ముఖం చిట్లించుకుని ముందుకు తిరిగి పోయాడు.

గోడ మీద ఉన్న 'ఈగల్' నమూనాను తిలకిస్తున్నాను. చంద్రుని ఉపరితలం మీద దిగటానికి అనువుగా అది ఎలా తయారు చేయబడిందో... దాని నిర్మాణంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో... అవన్నీ విడమర్చి చెబుతున్నాడు అక్కడ నిలబడ్డ గైడ్.
 ఇంకాస్త ముందుకు వెళితే వ్యోమనౌకల అనుసంధానాన్ని చూపించే చిత్రం ఉంది. 

దాన్ని దాటి వెళ్తే, ఎదురుగా ఉంది చంద్రశిల! 
తెల్లని నైట్రోజన్ జార్లో భద్రపరిచారు దాన్ని! మూడు స్టీల్ లెగ్స్ మీద అతి పొందికగా ఉంది. బాదం కాయ కంటే కాస్త పెద్ద పరిమాణంలో, నలుపు రంగులో, చిన్నచిన్న రంధ్రాలతో చూడటానికి మాత్రం కాస్త పేలవంగానే ఉంది! అన్ని వైపులా కనబడేలా 'నైట్రోజన్ జార్' మెల్లిగా తిరుగుతోంది. కొద్ది క్షణాల పాటు దాని వంకే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను! అది కేవలం శిలే కావచ్చు! కానీ అది అలా తిరుగుతూ ఉంటే, దాని వెనుక వందలాది మంది మేధావుల ప్రజ్ఞ, శ్రమ కనిపించింది!! మానవుడు భూమి మీద పుట్టాక సాధించిన అతి మహత్తర కార్యాల్లో ఇదొకటి! సందేహం లేదు! విశ్వ మానవ కళ్యాణానికి  చంద్రలోక యాత్ర ఏ విధంగా ఉపకరిస్తుందో యోచిస్తూ , హాలు దాటి బయటకు వచ్చాను. 

నా ముందున్న బట్టతలాయనకు పూర్తిగా ఉత్సాహం చచ్చిపోయినట్లుంది."ఇలా ఉంటుందంటే నేను రాకపోదును... రిక్షాకు రెండు రూపాయలు దండుగ!" అంటూ విసుక్కుంటూ వెళ్లిపోయాడు. 
ఆవరణ దాటి జనాన్ని తప్పించుకుంటూ రోడ్డు మీదకు వచ్చాను. వచ్చే పోయే వాహనాలతో, మనుషులతో చాలా సందడిగా ఉంది రోడ్డు. ఒక వారగా వెళ్లి జనసమ్మర్థం అట్టే లేని చోట నిలబడ్డాను. నా మిత్రుడు భాస్కరరావు '12 గంటలకు ఇక్కడకు వస్తాను!' అని చెప్పాడు !ఇద్దరం కలిసి ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలని అనుకున్నాం! 

"బాబు! రెండు రోజులు బట్టి గుక్కెడు గంజి కూడా లేదు!... ఐదు పైసలు ఉంటే ధర్మం చేయండి!" 
పక్కకు తిరిగి చూశాను .
ఎవరో ముసిలిది! దాని వయస్సు ఏడు పదులకు పైబడి ఉంటుందని ముడతలు పడ్డ దాని ముఖమే చెప్తోంది. జుట్టు పీకి పారేసిన  తాటి టెంక కి మల్లే అసహ్యంగా ఉంది. తెల్లని కళ్ళు రెండూ లోతుకుపోయి, చూడడానికి భయం కలిగిస్తున్నాయి! ఎండిపోయిన దాని గుండెలు చూస్తే, అసలు ఆమె పుట్టాక యవ్వనం చూడకుండా వృద్ధాప్యంలో అడుగుపెట్టినట్లుంది!!
దాని చేతుల్లోని ఖాళీ డబ్బా వడవడా వణుకుతోంది. రెండో చేతిలోని కర్ర మీదే ఆధారపడి నిలబడింది ఆమె. 

"బాబు! ఐదు పైసలు ధర్మం చేయండి!.. మారాజులు!"  ముసలిది గొణుగుతున్నట్లు మెల్లిగా అడుగుతోంది.
జేబులోంచి ఐదు పైసలు తీసి ముసలి దాని డబ్బాలో పడేసాను. "నూరేళ్లు బతుకు బాబు!.." అంటూ వణుకుతూ దీవించింది .
ఐదు పైసలకు నూరేళ్లు చొప్పున నా జేబులోని చిల్లరంతా దానం చేస్తే, ఎన్ని వందల ఏళ్ళ ఆయుష్షు నాకు కలిసి వస్తుందో లెక్కలు కడుతూ, నిలబడ్డాను.
" ...అయితే బాబూ... ఇదంతా ఏటి? ఇయేళ ఇక్కడ ఇంత మంది వచ్చారేటి ?".పక్కకు చూశాను. ఇంకా ముసలిది అక్కడే ఉంది !
తన ప్రశ్నకు సమాధానం కోసం నా వంక చూస్తోంది.
" అమెరికా వాళ్ళు చంద్రుని మీదకు వెళ్లి; అక్కడ నుంచి రాళ్లు, మట్టి పట్టుకొచ్చారు. అందులో ఒక రాతిని ఇక్కడ చూపిస్తున్నారు." అన్నాను. 
"ఏటి?.. ఆకాశం మీద సెంద్రుడిలోంచే?!...." 
"కాదు! భూమి మీద చంద్రుడిలోంచి!.." కసురు కున్నాను.
" ఏంటి బాబు... నేను ముసలి దాన్నని ఏళాకోళంచేస్తున్నావేటి? లేకపోతే, సెంద్రుడిలోకి వెళ్ళడమేటి?... రాళ్లు పట్రాడం ఏటి?.." "నిజమే మామ్మా... రాకెట్ మీద అక్కడికి వెళ్లారు. అది కూడా మన భూమి లాగే ఉంటుంది. అక్కడ తవ్వి రాళ్లు పట్టుకొచ్చారు. అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటే రేపటి నుంచి మనం కూడా రాకెట్  మీద జూమ్ అని వెళ్లి చక్కా రావచ్చు!"అన్నాను హుషారుగా. 
 "అయితే బాబు... అక్కడ కూడా మనలాటి  మనసులు ఉన్నారా?"
"అబ్బే! లేరు!"
"మరక్కడేటున్నాదక్కడ?" ఆసక్తిగా అడిగింది ముసిల్ది.
రావాల్సిన మిత్రుడు ఇంకా రాలేదు. అందుకే ముసలిదానితో సంభాషణ పొడిగించాను.
" అక్కడ కూడా భూమి మీద లాగే కొండలు, గోతులు, రాళ్లు రప్పలు ఉన్నాయి. అక్కడ మనుషులు బతకడానికి వీలు ఉంటుందేమో చూస్తున్నారు. బంగారం లాంటి ఖరీదైన లోహాలు ఏమైనా ఉంటే భూమ్మీదకి తెస్తారు!"అన్నాను. 
"అయితే వాటి వల్ల మనకు లాభం ఉంటదా?" 
"ఎందుకు ఉండదు?... ప్రపంచం అంతా సిరి సంపదలతో తులతూగిపోతుంది." అన్నాను హుషారుగా.
 ముసలిదానికి ఈ వాక్యం అర్థమైనట్టు లేదు!
 నా వైపు ఆశగా చూస్తూ," ఏటి బాబూ...?" అంది.
" అవన్నీ భూమ్మీదకి తెస్తే కావలసినంత డబ్బు మామ్మా! ఇంక దరిద్రం అనేది ఉండనే ఉండదు!!" అన్నాను.
ముసలి దాని ముఖంలో కాస్త ఆశ కనపడింది .నల్లని కనుపాపల వెనుక రవంత వెలుగు!!
నాకు మరి కాస్త దగ్గరగా వచ్చి కర్ర ఆసరా చేసుకుంటూ అడిగింది "నేను ఓ మాట అడుగుతాను... కోప్పడకు బాబు!.. మరి మాలాటోళ్లు అందరకీ కూడు గుడ్డ దొరుకుద్దా?" 
ముసిల్ది బోసినోరు తెరుచుకొని, గుడ్లు పెద్దవి చేసి కుతూహలంగా నా వైపు చూస్తోంది, సమాధానం కోసం.
 ముసలిదాని ప్రశ్న కాసేపు నన్ను తికమక పెట్టింది!
'నిజమే!! ప్రపంచం సౌభాగ్యవంతం కావచ్చు! కానీ, ఆ సౌభాగ్యంలో ఈ ముసలి దానికి వాటా ఉందో? లేదో?!'
 ముసలి దాన్ని చూస్తే జాలి వేసింది. అది పట్టు పరుపులు, ఎయిర్ కూలర్లు, విహారయాత్రలు, పంచభక్ష్య పరమాన్నాలు అడగటం లేదు.దానికి కావాల్సింది ప్రకృతి తాకిడి నుండి రక్షించుకోవడానికి, మానాన్ని సంరక్షించుకోవడానికి చాలినంత బట్ట !ప్రాణం నిలబెట్టుకోవడానికి గుక్కడిగంజి! పట్టెడు అన్నం!! అవి లభిస్తే ప్రపంచం ఎలా పోయినా ముసలిదానికి సంబంధం లేదు. దానికి అవి దొరుకుతాయని కచ్చితంగా ఎలా చెప్పగలను?!

 'ఒక వైపు ప్రగతి పరిగెడుతోంది. శాస్త్రం వృధ్ధి అవుతోంది. నిత్యజీవితంలో మనిషి ఎన్నో సుఖాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనసులోని ఊహలకు మల్లె అతి వేగంగా ఎగిరి, ఎక్కడికి కావలిస్తే అక్కడకు చేరుకోగలుగుతున్నాడు. 
ఇంకొక వైపు మానవత నశిస్తోంది. పగా, దౌర్జన్యం పెరిగి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించి, తను నిర్మించుకున్న ఆయుధాలతో తనవారినే బలి పెడుతున్నాడు. కొంతమంది తిండికి బట్టకు ముఖం వాచి, దినం గడపడమే కష్టంగా బతుకుతున్నారు. ఈ రెండింటికి సమన్వయం ఎక్కడ?
 ఏ శాస్త్రం.. ఏ ప్రగతి.. ఏ కళ.. దీనిని సమన్వయ పరచగలదు?! ప్రతి మనిషికి నిత్య జీవితానికి అవసరమైన వన్నీ లభించే పరిస్థితి ఎలా వస్తుంది?'
ఆలోచిస్తున్నాను .ఎక్కడా తలా తోక అందటం లేదు!
 
నేను సమాధానం చెప్పలేదని కాబోలు, ముసల్ది కర్ర టక టక లాడించుకుంటూ రోడ్డు అవతల వైపుకు మెల్లిగా కదిలిపోతోంది. కదిలిపోతున్న ముసలిదాని ముఖంలో ఎంతో ధైన్యం ఉంది. తెల్లగా పాలిపోయిన దాని గాజు కాయల్లాంటి కళ్ళలో ఎంతో విషాదం ఉంది. నీరసంగా నడుస్తున్న దాని అడుగుల్లో ఎంతో నైరాశ్యం ఉంది. కొంతసేపు కదిలిపోతున్న ఆమె వైపే తదేకంగా చూస్తూ నిలబడిపోయాను .

అంతలో రాకాసి అరుపులాంటి హారను!
కీచుమంటూ కారు ఆగిన చప్పుడు, ఆ చప్పుడులో కలిసిపోయి, లీలగా వినిపించిన మూలుగు, నా చెవులకు సోకాయి!
 కళ్ళు తిరిగినట్లు అయింది !!
దెయ్యంలాంటి కారు చక్రాల ముందు ముసల్ది బోర్లా పడి ఉంది! చేతివేళ్లు రోడ్డు మీద మట్టిని కౌగిలించుకుంటున్నాయి. దాని తల పగిలి కారిన రక్తం పీచులాంటి జుట్టును తడిపి, పక్కలకు పరుచుకుంటోంది. తలపక్కనే ఉన్న నల్లని కంకర రాయి, రక్తంలో తడిసిన చంద్రశిలలా మెరుస్తోంది. ఆ దృశ్యం చూస్తూ ఉంటే కడుపులో దేవినట్లు అయింది. క్షణం సేపు కళ్ళు బైర్లు కమ్మాయి! మనుషులందరూ కారు చుట్టూ గుమి కూడారు. కారు లోని మనిషి ఇంగ్లీషులో ఏదో సర్ది చెబుతున్నాడు. లోపల వరండాలోని  పోలీసులు ఇద్దరు కారు వద్దకు వచ్చారు. నాకు మనసంతా దిగులుగా అయిపోయింది! 

'ఆ ముసలిది చచ్చిపోయింది! అవును చచ్చిపోయినట్లు చలనంలేని ఆమె శరీరమే చెప్తోంది!!
ముసిలిది నిశ్చయంగా చచ్చిపోయింది. కొద్ది క్షణాల క్రితం అది నన్ను అడిగిన ప్రశ్న ఇంకా చెవుల్లోనే సుడులు తిరుగుతోంది!
' మరి మాలాటోల్లకి అందరికీ కూడూ, గుడ్డా దొరుకుద్దా?'అని.
 
ఇప్పుడు దానికి కూడు అక్కర్లేదు! ఎవరైనా దయచేసి ఇస్తే శవం మీద కప్పటానికి రెండు గజాల గుడ్డ కావాలి! అంతే!! భయంకరమైన దృశ్యాన్ని చూస్తూ ఇక అక్కడ నిలబడలేక ముందుకు నడిచాను.
చంద్రశిల ప్రదర్శన ఆవరణలో క్యూ ఇంకా ముందుకు కదులుతూనే ఉంది..... 

(1970 జ్యోతి మాసపత్రిక దీపావళి ప్రత్యేక సంచిక నుండి)
 సహాయం

     " రాజమ్మా... ఉన్నవా?..." పక్కింటి సుందరమ్మ మాట విని, " కనపడట్లేనానే..." కుమ్మరి సారె మీద కుండ తిప్పుతూ అన్నది రాజమ్మ.

     " ఎండాకాలం అయినా ఏమన్న బేరాలు రానట్టుంది కదా..." సుందరమ్మ కూర్చుంటూ అంది.

     " అందరూ ఫ్రిజ్జులు కొంటుండిరి... కుండలెవరు కొంటారే...పెళ్లిళ్లకు, సావులకు తప్ప...మా కాడ పెళ్లిళ్లకు కూడా కొనట్లె...మొగుడు సచ్చింది ఒకతాయే, మొగుడు వదిలేసింది ఒకతాయె...మా రాతలు ఆళ్ళ పిల్లలకు తగుల్తాయేమోనని భయం మరి..." విరక్తిగా అన్నది రాజమ్మ.

      " బాధ పడకే...రాజమ్మ. దేవుడు సుస్తానే ఉంటాడు...ఏదో ఒకటి చేస్తాడు లే..." సుందరమ్మ ఓదార్చింది.

      " నా గురించి నాకే బాధ లేదే...కోడలు, ముగ్గురు పిల్లల గురించే...అన్యాయంగా దాన్ని నా కొడుక్కి చేసుకొని దాని గొంతు కోస్తిని...కడుపు నిండా తిండి కూడా పెట్టలేక పోతున్న...వంట్ల పటుత్వం కూడా పోతుంది. దేవుడు  కూడా కండ్లు ముసుకుండే... కోట్లడిగిన్న... తిండి మందం ఎల్లినా సాలనే కదా..." కళ్ళు తుడుచుకుంది రాజమ్మ.

        " అమ్మా...కుండలు అమ్మే రాజమ్మ ఇల్లు ఇదేనా? " ఇంటి బయట మోటార్ సైకిల్ ఆపి అడిగాడు ఈశ్వర్.

     "అవునయ్య...ఏం గావాలి? " రాజమ్మ లేచి వచ్చి అడిగింది.

     " రెండు కుండలు కావాలమ్మా..." ఈశ్వర్ అంటుండగానే, " నానా...నాకు చిన్న కుండ కొనిస్తా అన్నావు..." ఈశ్వర్ కొడుకు, పదేళ్ళ సమీర్ అడిగాడు.

    " సరేలే...కొందాం..." దిగి కుండలు కొనుక్కొని వెళ్ళారు.

    " చిన్నోడిని ఏమన్న అన్నవా నాన...కుండల దగ్గర నుండి వచ్చిన దగ్గరి నుండి మాట, పలుకు లేకుండా కూర్చున్నాడు." తల్లి మాటలకి, " లేదమ్మా...నేనేం అనలేదే...ఏంటి కన్నమ్మ...ఏమైంది?" కొడుకు తలపై నిమురుతూ అనునయంగా అడిగాడు ఈశ్వర్. 

     " నాన...మనం వాళ్ళకు ఏమైనా హెల్ప్ చేద్దాం...పాపం ఆ నానమ్మ ఎంత పెద్దావిడ...కూర్చుని కుండలు చేస్తుంది...ఆ అక్కలు చిన్న పిల్లలు కదా నాన...పాపం మట్టి ఎలా తొక్కుతున్నారు చూసావా... అంత కష్టపడుతున్న...ఎంత వీక్ గా ఉన్నారో... ఏదైనా చేద్దాం నానా... ప్లీజ్ " తండ్రి గడ్డం పట్టుకొని బ్రతిమాలుతూ అన్నాడు సమీర్.

       " వాళ్ళు మనం ఊరికే డబ్బులు ఇస్తే తీసుకోరు నానా...మనం కుండలు కొన్నాంగా...అది హెల్ప్ చేసినట్టే..." నానమ్మ మాటలకు ఆమె వేపు నిరసనగా చూసి, మళ్లీ తండ్రితో " ప్లీజ్ నానా...నువ్వే కదా అంటావు...పక్కవాళ్ళకు హెల్ప్ చేయడం కూడా దేవుడికి పూజ చేయడమే అని..." అన్నాడు.

       ఈశ్వర్ కు అర్థమయింది...సమీర్  చిన్నప్పటి నుండి ఎవరైనా బాధ పడుతుంటే చూడలేడు...అచ్చం తన తాత గారి లాగానే...

       " నీ దగ్గర ఏమన్న ఐడియా ఉందా? చిట్టి సార్..." చిరునవ్వుతో అడిగాడు ఈశ్వర్. 

      " హా... నానా...మన కొత్త ఇంట్లో పూల కుండీలు కొనాలి అనుకుంటున్నాం కదా...ప్లాస్టిక్, సిరామిక్, సిమెంట్...అవన్నీ వద్దు నానా...ఆ నానమ్మ దగ్గర కుండీలు చేయించుకుందాం...అవయితే చేయడం కూడా ఈజీ కదా...అంతే కాదు నానా మనం ఎన్విరాన్మెంట్ కు కూడా మంచి చేసినట్టు కదా..." హుషారుగా చెబుతున్న కొడుకు ను దగ్గరికి తీసుకొని తలపై ముద్దు  ఈశ్వర్. 

     "వారసత్వం అంటే ఆస్తులు ఇవ్వడమే కాదమ్మా...ఇలాంటి మంచి బుద్దులు కూడా ఇవ్వడం...కదా అమ్మా..." అప్పటికే చనిపోయిన భర్త మాటలు మనవడి మాటల్లో వింటూ కళ్ళు తుడుచుకుంటూ ఉన్న తల్లి తో అన్నాడు ఈశ్వర్.

      " రాజమ్మ... ఏందీ కుండలు చేసుడు బంజేసి ఈ కుండీలు చేస్తున్నావు... చిన్నయి, పెద్దయి ఇన్ని చేసినవెందే...?!..." సుందరమ్మ ఊరినుండి వచ్చి చూసి  ఆశ్చర్యంగా అడిగింది.

       " దేవుడు కండ్లు తెరిచిండే...ఆ రోజు కుండలు కొన్న సారు 100 పూల కుండీలు చెయ్యమని డబ్బులు ఇచ్చిన్రు...ఇంకా వాళ్ళ దోస్తులకు కూడా చెప్తడంటా..." రాజమ్మ  పైకి చూసి దండం పెడుతూ అన్నది. 

       *  సాధ్యమైనంత వరకు పర్యావరణానికి మేలు చేసే వస్తువులు వాడదాం...అమ్మ ధరణి కి ఆయువు పెంచుదాం. *