Thursday, June 30, 2022

ఖురాన్ చదివితే మానవత్వం నశించి ఉగ్రవాదులుగా తయారవుతారు

 ఖురాన్ చదివితే మానవత్వం నశించి ఉగ్రవాదులుగా తయారవుతారు


భగవద్గీత ,వేదం చదివితే ఉన్మాదం నశించి యోగులు గా మారుతారు

#Rajasthan #udaipur లో టైలరింగ్ పని చేసుకొని జీవించే ఒక మధ్యతరగతి వ్యక్తిని #NupurSharma కు మద్దతుగా పోస్ట్ పెట్టాడు అని అతి కిరాతకంగా నరికి చంపిన తురకలు

#NarendraModi జీ గారిని కూడా అలాగే నరికేస్తాం అని పబ్లిక్ గా వీడియో రీలీజ్ చేసిన ఇస్లాం ఉగ్రవాదులు

ఖురాన్ 2:191 "అల్లాను నమ్మని వారిని కనిపించిన చోటనే నరికి చంపండి"

ఖురాన్ 3:28 "ముస్లింలు ముస్లిం కాని వారితో స్నేహం చేయ రాదు"

ఖురాన్ 3:85 "ఇస్లాం తప్ప ఇంకే మతమూ ఒప్పుకొనబడదు"

ఖురాన్ 5:33 "ఇస్లాం ను విమర్శించే వారిని వికలాంగులను చేసి వేలాడ దీయండి"

ఖురాన్ 8:12 "ఖురాన్ కాక ఇతర పుస్తకాలను నమ్మే వారిని భయ భ్రాంతులను చేసి వారి తలలు తీయండి"

ఖురాన్ 8:60 "అల్లాను నమ్మని వారిని భయ భ్రాంతులను చేయుటకు ముస్లింలు ఉన్న అన్ని ఆయుధాలను వాడాలి."

ఖురాన్ 8:65 "అల్లాను నమ్మని వారు మూర్ఖులు. ముస్లిం లు వారితో పోరాడాలి"

ఖురాన్ 9:5 "అవకాశం దొరకగానే అల్లాను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ చంపెయ్యండి"

ఖురాన్ 9:30 "యూదులు, క్రిస్టియన్లు భ్రష్టులు. వారితో పోరాడండి"

ఖురాన్ 9:123 "మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసు లతో యుద్ధం చెయ్యండి"

ఖురాన్ 22:19 "అల్లాను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో, ఇనుప చువ్వలతో, మసిలే నీళ్లతో శిక్షించండి. వారి చర్మం, శరీరం కరిగి పోవాలి"

ఖురాన్ 47:4 "అల్లాను నమ్మని వారితో శాంతి కోసం, సంధి కోసం చూడకండి. వారు దొరికినంత నే నరికెయ్యండి"

ఇంత భయంకరమైన ఖురాన్ చదువుతూ..
దాన్ని పవిత్ర గ్రంథమంటూ..
రోజుకుఐదుసార్లు మనచెవులు చిల్లులు పడేలా "అల్లా ఒక్కడే దేవుడు" అంటూ అరుస్తు మన మధ్య మేపుకొంటూ..
వాళ్ళ చేత వేటు వేయించుకోవడానికి ఎదురు చూస్తున్న

సెక్యులర్ లు మీలాంటి వారి వల్ల ఇతరులు ఎందుకు ఛావాలి!

సేకరణ

బుద్ధుడు దేనిని నమ్మ మంటాడు......

 గ్రంథాల్లో ఉన్నాయని దేన్నీ నమ్మకండి.

పుస్తకాల్లో రాసిపెట్టారని నమ్మకండి.

పెద్దలు చెప్పారని, తల్లిదండ్రులు చెప్పారని నమ్మకండి.

మేధావులు ప్రవచించారని, ఆఖరుకు నేను బుద్ధుడని

విశదపరచాననీ నమ్మకండి.

విశ్వాసమే వినాశనానికి మూలం

మీరంతకు మీరుగా శోధించి సత్యాన్ని సత్యంగా,

అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోండి.

- కాలామ సుత్త (అంగుత్తర నికాయ)- 3.65


సేకరణ

జీవిత రహస్యాలు (సంసార జీవితంలో ముఖ్యముగా తెలుసుకోవలసిన రహస్యాలు).pdf

జీవిత రహస్యాలు (సంసార జీవితంలో ముఖ్యముగా తెలుసుకోవలసిన రహస్యాలు).pdf download here


🍁నేను... నాది..🍁

 *🍁నేను... నాది..🍁*


📚✍️ మురళీ మోహన్


👌ఒక రాజు ఓ  జ్ఞాని వద్దకు వెళ్లి.. "నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను" అన్నాడు..


"నువ్వు నీ  బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం లేదా.." అని అడిగారు ఆ జ్ఞాని..


"మా రాజ్యానికి శత్రు భయం లేదు. దొంగల భయం లేదు. మా రాజ్యంలో పన్నులు తక్కువే. న్యాయ వ్యవస్థ కూడా బాగుంది. ఎక్కడా ఎవరికీ  అన్యాయం జరగదు. ప్రజలందరూ ఆనందంగా ఉంటున్నారు. కానీ నాకే ప్రశాంతత లేదు. నేను ఏం చెయ్యాలి" అని రాజు ప్రశ్నించాడు.


"సరే నీ బాధ అర్ధమైంది. నేనొకటి చెప్తాను. అలా చెయ్యి. నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేసే" అన్నారు జ్ఞాని." అంతకన్నా ఇంకేం కావాలి.. "తీసుకోండి.. ఈ క్షణమే ఇచ్చేస్తున్నాను నా రాజ్యాన్ని" చెప్పాడు రాజు.


"సరే నాకిచ్చావు. నువ్వేం చేస్తావు.." జ్ఞాని అడిగారు. "నేను ఎక్కడికైనా వెళ్లి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాను" అన్నాడు రాజు.


"ఎక్కడికో వెళ్ళడం ఎందుకు.. ఇక్కడే నా వద్దే నా ప్రతినిధిగా ఉండి నువ్వు చెయ్యవలసిన పనులు చెయ్యి. ఎందుకంటే  నీకు పరిపాలన తెలుసు. చెయ్యగల సమర్దుడివి. ఓ ఏడాది తర్వాత వచ్చి లెక్కలు వగైరా చూస్తాను" అని చెప్పారు జ్ఞాని. 


ఒక సంవత్సరం గడిచింది. జ్ఞాని రాజుని చూడటానికి వచ్చారు. రాజు మొహంలో ఆనందం కనిపిస్తోంది. ఎక్కడా ఆవ గింజంత దిగులు కనిపించడం లేదు.  జ్ఞానిని సాదరంగా ఆహ్వానించి సపర్యలు చేసి లెక్కలు చూపించాడు రాజు.


"ఆ లెక్కలు అలా పక్కన పెట్టు గానీ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు" అడిగారు జ్ఞాని. "హాయిగా ఉన్నాను. కావలసినంత ప్రశాంతత అనుకోండి. మునుపెప్పుడు ఇంత  హాయిగా లేను. మీకు నా ధన్యవాదాలు" అన్నాడు  రాజు.


"సరేగానీ పూర్వం  నువ్వు చేసిన పనులకు, ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకు ఏవైనా తేడాలు తెలిసాయా" అని అడిగారు జ్ఞాని. "లేదు.. అప్పుడు చేసే పనులే ఇప్పుడు కూడా చేస్తున్నాను" రాజు సమాధానమిచ్చాడు.


"అప్పుడు ఎందుకు మానసిక ఒత్తిడికి లోనయ్యావు.. ఇప్పుడు ఆ ఒత్తిడి లేదా.." అని జ్ఞాని అడగ్గా రాజు అసలు విషయం  తెలిసి జ్ఞాని వంక చూసాడు.


అప్పుడు జ్ఞాని ఇలా అన్నారు...


"అప్పట్లో నువ్వు ఇది నా పని.. నా బాధ్యత.. అని ఆలోచించావు. ఇప్పుడు నువ్వు ఇది నాది కాదు. నేనిక్కడ కేవలం ఒక ప్రతినిధిని అనుకున్నావు. ఆ మనసే అన్నింటికీ మూలం. నేను అనే ఆలోచన వచ్చేటప్పుడల్లా ఆన్ని ఒత్తిడులూ, సమస్యలూ నీ చుట్టూ సుడులు తిరుగుతుంటాయి. అలా కాకుండా ఈ ప్రపంచం నాది కాదు. ఈ దేహం నాది కాదు. ఈ ఊపిరి నాది కాదు. ఇవన్నీ నాకు ఇచ్చినవే తప్ప నా సొంతం కావు.. అని నువ్వు గ్రహిస్తే సమస్యలన్నీ బాధలన్నీ పారిపోతాయి. ఈ మానసిక స్థితితోనే నువ్వు పరిపాలించు. నీ విధులు నువ్వు సాగించు. నీకు కావలసినంత ప్రశాంతత లభిస్తుంది"...🤘

'ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్'కు నాలుగు మార్గాలు...

 'ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్'కు నాలుగు మార్గాలు...


సంతోషం అనేది మానసిక శాంతిగా పేర్కొం ర దలైలామా, భారతదేశంలో నివాసం ఏర్పర చుకున్న ఈ టిబెటన్ బౌద్ధ గురువు 'ద ఆర్ట్ ఆఫ్ 'హ్యాపీనెస్' అనే పుస్తకాన్ని రచించారు. పరిపూర్ణ నడిపిస్తుంది. సంతోషానికి ఆయన సూచించే నాలుగు మార్గాలివి..


• లేబుల్స్ తీసేయాలి: మనుషులందరూ ఒక్కటే. పక్కవారి కన్నా మనం భిన్నం అని భావించకూడదు. నన్ను నేను బౌద్ధుడిగానో, దలైలామాగానో, నోబెల్ పురస్కార గ్రహీతగానో తలచను. వీటిలో ఏది అనుకున్నా బందీగా మారిపోతాను. అందుకే వీటన్నింటినీ వదిలేసి ఈ భూమి మీదున్న కోటాను కోట్ల మందిలో నేనూ ఒకడిననే ఎరుకతో ఉంటాను.


• ఆశను కోల్పోవద్దు: మానవుడి జీవిత లక్ష్యమే ఆనందం. భవిష్యత్తులో ఏమవుతుందనే విషయం ఎవరికీ తెలియదు. నేడు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, అంతా బాగా జరుగుతుందనే విశ్వాసమే మనల్ని ముందుకు:


• భౌతికానందానికి మించి...: పువ్వును చూడగానే మనసు మురిసిపోతుంది. సంగీతం: వినగానే గాల్లో తేలిపోతాం... కాసేపటికి ఆ విషయాన్నే మరచిపోతాం. ఇలా వస్తువుల వల్ల వచ్చే ఆనందం తాత్కాలికం, ధ్యానంతో సాధించే ఆనందం శాశ్వతం,


• కృతజ్ఞత, దయతో..: ఉదయం నిద్ర లేవగానే విలువైన మానవ జీవితాన్ని వృథా చేయకూడదని తీర్మానించుకోవాలి. నలుగురికి ఉపయోగకరమైన పనులు చేస్తూ, అందరితో కరుణతో మెలగాలి. కృతజ్ఞత, దయ ఉండాలి..

నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అంటారు. మానవ జీవితంలో మాటకు అంతటి ప్రాధాన్యత ఉంది.


🌹నేటి ఆత్మ విచారం 🌹

నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అంటారు. మానవ జీవితంలో మాటకు అంతటి ప్రాధాన్యత ఉంది. వంటకు మంట ఉపయోగపడుతుంది. అదే మంట దగ్ధం చేస్తుంది కూడా.

మాటను సక్రమంగా ఉపయోగిస్తే అది అమృతంగా మారుతుంది. అక్రమంగా ఉపయోగిస్తే విషంగా పరిణమిస్తుంది. అందుకే వాక్కును సద్వినియోగం చేసుకోవడం ఒక 'తపస్సు ' అని భోదించాడు శ్రీ కృష్ణుడు.

వాచిక తపస్సు అలవడాలంటే ఏం చేయాలి... ? కరపత్రాలు పంచితే సరిపోతుందా... ? బహిరంగ సభలలో ఉత్తేజపూర్వకంగా ఉపన్యసించితే ఫలితం ఉంటుందా....? ప్రవచనాలు వింటే పరిస్కారం దొరుకుతుందా....?

వాక్కు - భావవ్యక్తీకరణకు మూలం. వాక్కే అన్నిటికి కారణం అనేది ఋషి వచనం. మధురమైన మాటలనే పలకాలని వేదశాసనం.

మాట ఎలా ఉండాలన్న విషయంపై మన సనాతన ధర్మంలో విస్తృతమైన అంశాలు చెప్పారు. మనం మాట్లాడే మాట తత్కాలానికి చక్కగా ఉండటమే కాదు, శాశ్వతమైన హితవు చేకూర్చేలా ఉండాలి.

అందుకే సత్యం, ప్రియం, హితం అనే విశేషణాలను వాక్కుకి జోడించారు మన పెద్దలు.

మన సంస్కారం, అధ్యయనం, హృదయపు లోతు మన మాట ద్వారానే తెలుస్తాయి. ఈ మాటలను సవ్యంగా వినియోగించడమే తపస్సు అని చెబుతూ భగవాన్ శ్రీ కృష్ణుడు ( భగవద్గిత - 17,15) ఇలా అంటాడు.

" ఇతరులలో ఉద్వేగాన్ని కలిగించనిది, సత్యమైనది, ప్రియమైనది, హితకరమైనది, వేదాభ్యసం - వీటిని వాచిక తపస్సు అంటారు."

'అల్పజీవినైనా, అల్పవస్తువునైనాతృణీకరభావంతో చూడకూడదు. ఒకరి పట్ల నీవు గౌరవం చూపితే వారు నీపట్ల గౌరవం చూపుతారు.

" నీ శత్రువు పరిశీలించినంతగా నిన్ను నివ్వు పరిశీలించుకో " అప్పుడు నీకంటే గొప్ప మిత్రుడు నీకు వేరెవ్వరు లేరని అర్థమవుతుంది. ఇది వాచిక తపస్సు ద్వారానే సాధ్యమవుతుంది.

తిట్టడం, అవాచ్యాలు పలకడం, కసిరి కొట్టడం, పెళుసుతనం, సూటిపోటి మాటలు...ఇవ్వన్నీ సజ్జనులకు సరికానివి. ఇవి వాచిక తపస్సును దెబ్బతీస్తాయి.

మృదువుగా మాట్లాడే వారికీ స్నేహసంపద వృద్ధి చెందుతుంది. శత్రువుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.

మాట కత్తికంటే పదునైనది. అందుకే మాట్లాడే విధానం సౌమ్యంగా, మృదువుగా, ప్రేమగా నవ్వుతు పలకరించి మాట్లాడండి. ఈ సృష్టిలో ఏ జీవికి భగవంతుడు వాక్కును ప్రసాదించలేడు. కేవలం మనుసులమైన మనకు మాత్రమే భావవ్యక్తీకరణ కొరకు భగవంతుడు ప్రసాదించిన అద్భుత వరం ఈ వాక్కు.

వాక్కును అపవిత్రం చేయకుండా మనం ముందు మారుదాం...తర్వాత ఇతరులలో కూడా మార్పు తప్పకుండ వస్తుంది. మనం పరిశుద్ధులమైతే ఈ ప్రపంచం కూడా పరిశుద్ధమౌతుంది.💥☝

సేకరణ

అందమైన ముఖం కొద్దిసేపు మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ.... మన అందమైన ప్రవర్తన జీవితకాలం ఉంటుంది.

జీవిత వాస్తవికత

ఒక సమావేశం లో ఉపన్యాసం సందర్భంగా గురుాజీ 30 ఏళ్ల వ్యక్తిని నిలబడమని అడిగారు.

మీరు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో నడుస్తున్నారు. మీ ఎదురుగా ఒక అందమైన అమ్మాయి వస్తున్నట్లయితే, మీరు ఏమి చేస్తారు ?

ఆ యువకుడు - ఆమెనే చూస్తాను.

గురూజీ అడిగారు -ఆ అమ్మాయి మిమ్మల్ని దాటుకుని వెళ్ళిపోతుంటే, మీరు వెనక్కి తిరిగి చూస్తారా ?

యువకుడు - అవును, నా భార్య నా పక్కన లేకపోతే ! (సమావేశంలో అందరూ నవ్వారు)

గురూజీ అప్పుడు అడిగారు - ఆ అందమైన ముఖాన్ని మీరు ఎంతకాలం గుర్తుంచుకుంటారో చెప్పండి ?

ఆ యువకుడు 10- 15 నిమిషాలు ( మరో అందమైన ముఖం కనిపించే వరకు) అన్నాడు.

గురూజీ ఆ యువకుడితో -
ఇప్పుడు ఆలోచించండి,

మీరు గుంటూరు నుండి హైదరాబాద్ కు వెళుతున్నారు. నేను మీకు ఒక ప్యాకెట్ పుస్తకాలు ఇచ్చి, ఈ ప్యాకెట్‌ ను హైదరాబాద్ లోని ఒక గొప్ప వ్యక్తికి అందజేయమని చెప్పాను.

మీరు ప్యాకెట్ డెలివరీ చేయడానికి హైదరాబాద్ లోని అతని ఇంటికి వెళ్లారు.

మీరు అతని ఇంటిని చూసినప్పుడు, అతను గొప్ప ధనవంతుడు అని మీకు తెలిసింది.

10 కార్లు, 5 గురు నౌకర్లు ఇంటి బయట నిలబడి ఉన్నారు. మీరు ప్యాకెట్ యొక్క సమాచారాన్ని లోపలికి పంపితే, అప్పుడు వారు స్వయంగా బయటకు వచ్చారు. మీ నుండి ప్యాకెట్ తీసుకున్నారు. మీరు బయలుదేరడానికి సిద్ధమయినప్పుడు, మిమ్మల్ని ఆయన పట్టుబట్టి ఇంటిలోనికి తీసుకువెళ్లారు. మీ దగ్గర కూర్చుని వేడి ఆహారాన్ని వడ్డించారు. బయలుదేరేటప్పుడు, మిమ్మల్ని అడిగారు -
మీరు దేనిలో వచ్చారు ? అని, మీరు స్థానిక రైలులో వచ్చానని చెప్పగా, అతను డ్రైవర్‌ తో, మిమ్మల్ని గమ్యస్థానానికి తీసుకెళ్లమని చెప్పారు.
మీరు మీ గమ్యం చేరుకోగానే ఆ ధనవంతుడు నుండి ఫోన్ - సోదరా మీరు హాయిగా చేరుకున్నారా ? అని.

ఇప్పుడు చెప్పండి,
ఆ ప్రముఖుడిని మీరు ఎంతకాలం గుర్తుంచుకుంటారు ?

యువకుడు అన్నాడు - గురూజీ ఆ వ్యక్తి ని చనిపోయే వరకు మనం మరచిపోలేము.

గురూజీ యువకుడి ద్వారా సభను ఉద్దేశించి మాట్లాడుతూ
"ఇది జీవిత వాస్తవికత."

అందమైన ముఖం కొద్దిసేపు మాత్రమే గుర్తుకు వస్తుంది.
కానీ.... మన అందమైన ప్రవర్తన జీవితకాలం ఉంటుంది.🙏

సేకరణ

Wednesday, June 29, 2022

సుఖదుఃఖాలను - నిర్వచించిన కృష్ణ భగవానుడు!!

సుఖదుఃఖాలను - నిర్వచించిన కృష్ణ భగవానుడు!!

ప్రపంచంలో ప్రాంతాలు ఏవైనా, మనుషులు ఎక్కడివారైనా ప్రతి మనిషి జీవితంలో ప్రధాన పాత్ర పోషించే అంశాలు రెండు ఉంటాయి.

1. సుఖం
2. దుఃఖం

మనిషి తన జీవితంలో ఈ రెండింటి మధ్య సతమతం అవుతుంటాడు.
సాధారణంగా సుఖాలకు పొంగిపోవడం, దుఃఖాలకు కృంగిపోవడం మనం చూస్తూనే ఉంటాం.
ఎందుకు ఇలా మనిషి రెండిటి మధ్య సందిగ్ధపడుతూ ఉంటాడు.
రెండు తన జీవితంలో జరిగేవే, సుఖం అయినా, దుఃఖం అయినా రెండు కూడా తన ప్రమేయంతో జరిగే పనుల వల్ల కలిగే ఫలితాలే.
మరి అలాంటప్పుడు రెండింటిని సమానంగా తీసుకోలేకపోతున్నాం ఎందుకని??

ఇదంతా మనకు ఏ విదేశీ మానసిక శాస్త్రవేత్తనో మానసిక విశ్లేషణలో చెప్పి ఉంటాడని అనిపిస్తూ ఉంటుంది.
కానీ శాస్త్రవేత్తలకు, పరిశోధకుల కంటే ముందే మన భారతీయ గ్రంథాలలో ఒకటైన, ప్రతి మనిషి తన జీవితకాలంలో తప్పక తెలుసుకోవలసిన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడనే విషయం చాలామందికి తెలియదు.
అవును మరి మహాభారతాన్ని, భగవద్గీతను ప్రస్తుత తరంలో ఎంతమంది చదువుతున్నారు అంటే ప్రశ్నార్ధకమే ఎదురవుతుంది.

【సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజమౌ, తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి.】

తాత్పర్యం:-
ఇది సుఖదాయకము, ఇది దుఃఖదాయకము అను భావము మనస్సులో

లేకుండ, సుఖముపట్ల ఆసక్తిగాని దుఃఖము యందు విరక్తి భావముగాని లేకుండా,

రెంటియందును సమభావము కలిగియుండి, లాభనష్ట భావము కూడ లేకుండ, జయపరాజయ భావము అనగా జయమునందు ఆసక్తి మరియు అపజయము నందు దుఃఖభావము లేకుండ యుద్ధము చేయుటకు నీవు సన్నద్ధుడవుకమ్ము.
అలా యుద్ధము చేసినట్లయితే ఆ యుద్ధమునందు నీవు ఎంతమందిని చంపినా నీకు పాపము అంటదు. అట్టి సమభావము వలన నీకు సుఖదుఃఖాదులు సంభవించవు.】అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భోదిస్తాడు.

పైన చెప్పబడిన శ్లోకం, దాని తాత్పర్యం భగవద్గీతలోని రెండవ అధ్యాయం, ముప్పై ఎనిమిదవ శ్లోకం.
శ్లోకాన్ని చదివి అర్థం చేసుకుంటే ఆ విషయం నిజమేనని తెలుస్తుంది.

ఇది సుఖం, ఇది దుఃఖం అనే విషయాలను మనసులో లేకుండా, సుఖం అనే విషయం పట్ల ఆసక్తి కానీ, దుఃఖం అనే విషయం పట్ల విరక్తి భావం కానీ కలిగి ఉండకుండా, రెండు విషయాల పట్ల ఒకే విధమైన ప్రవర్తన కలిగి, రెండింటికి ఒకే విధంగా స్పందిస్తూ ఉండాలి. దీని వల్ల లాభం, దీని వల్ల నష్టం అని ఆశించడం మరియు వదులుకోవడమనే విషయాలను ఎప్పటికి పరిగణలోకి తీసుకోకూడదు.
అలాగే ఈ పోటీ ప్రపంచంలో కొన్ని విషయాలలో గెలుస్తూ, విజయం సాధిస్తూ ఉంటాము.
మరికొన్ని విషయాలలో ఓటమి పాలు అవుతూ ఉంటాము.
అలాంటివాటిని కూడా వేరు వేరుగా చూడకుండా రెండింటి గురించి ఆలోచించకుండా కేవలం చేయవలసిన విషయం గురించి ఆలోచించి, పనిని చేయడం మాత్రమే మనిషి కర్తవ్యం అని.
అలాంటి భావన మనసులో ఉంటే ఏ సుఖదుఃఖాలు మనిషిని వెంటాడవని, ఎలాంటి దిగులు జీవితంలో ఉండదని తెలుపుతుందీ శ్లోకం.

మనిషి జీవితంలో గందరగోళానికి కారణమైన సుఖదుఃఖాలను సమానంగా తీసుకోవడమనే విషయం తేలికైనది ఏమి కాదు. కానీ అసాధ్యం కాదు కదా.
ప్రస్తుత తరం చిన్న చిన్న పరాజయాలకు కృంగిపోతూ, కొన్ని సందర్భాలలో ఆత్మహత్యల వరకు వెళుతున్న సందర్భాలు నిత్యం చూస్తూనే ఉంటాము.
కాబట్టి మొక్కకు రక్షణ, పోషణ ఇస్తే మహావృక్షం అవుతుంది. అలాంటి పోషణ ఏదంటే, ఇదిగో ఇలాంటి జ్ఞానాన్ని పిల్లలకు విశ్లేషణగా చెప్పడమే.

ఓం నమో నారాయణాయ 🙏

సేకరణ

శివుడు స్మశాన వాసి ఎందుకు అయ్యాడు?

శివుడు స్మశాన వాసి ఎందుకు అయ్యాడు?

త్రిమూర్తులు లో ఒక్కడైనా పరమశివుడు కైలాసం లో, కాశీ లో వశిస్తుంటాడు. అయితే ఈయన స్మశానం లో కూడా వశిస్థాడని చెపుతారు. అంతటి మహిమన్వితునికి స్మశానం లో ఉండవలసిన అగత్యం ఏమిటి?ఈ ప్రశ్నలకు మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో సమాధానం దొరుకుతుంది.


ఒక సారి కైలాసం లో పార్వతీపరమేశ్వరులు ఇరువురు మాట్లాడు కుంటుండగా, పార్వతీదేవి పరమేశ్వరుని, స్వామి మీరు స్మశానం లో ఎందుకు నివసిస్తారు?అని ఆడిగిన0ది. దానికి సమాధానం గా శివుడు.
దేవి ఒకమారు బ్రహ్మదేముడు నన్ను కలిసి మహేశ్వర స్మశానం లో ఉగ్రభూతాలు జనావాసాల మీద పడి ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నాయి. అనిచెప్పాగా నేను వాటిని నియంత్రి0చడానికి స్మశాన వాసినయ్యాను. అంతే కాకుండా మరణించిన వ్యక్తి ని దహనం చేసి బంధువులు వెనుతిరిగిన తరువాత ఆ జీవుడు ఒంటరిగా ఏడుస్తుంటే నేను అతనిని ఓదార్చి స్వాంతన చేకూరుస్తాను. అంతే తప్ప మరొక కారణం లేదు అని చెప్తాడు.

ఈ చిన్ని కధ వల్ల మనకు తెలిసే విషయం ఏమిటంటే. మనిషి జీవన పర్యంతం భగవత్ స్పృహ లేకుండా, సంసార బంధం అనే చట్రం లో ఇరుక్కొని, లోక వ్యవహారం లో ఇబ్బడి ముబ్బడిగా కూరుకు పోయి అంత్యకాలం లో భార్యాపిల్లలు బంధువులచే వదిలివేయ బడి ఆ జీవుడు ఏకాకి అయి విలపిస్తుండగా, అప్పుడు ఆ ఆసుతోషుడు అక్కున చేర్చుకుని స్వాంతన చేకూరుస్తాడు.

అందుకే దూర్జటి తన కాళహస్తీశ్వర శతకం లో ఇలా అంటాడు

దంతంబు ల్పడనప్పుడే తనువునం దారూఢియున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే
వింతల్మేన చరించునప్పుడె కురుల్వెల్వెల్లగానప్పుడే
చింతింప న్వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!

పరమశివా ఈ శరీరం లో సకల శక్తులు ఉన్నప్పుడే ధనసంపాదన ఎలా చేస్తామో అలాగే భగవంతుని పైన కూడా చిత్తము ఉంచి పర్యంతం దేవుని సేవలో తరించాలి.!

హర హర మహాదేవ

సేకరణ

పరమేశ్వరా శరణు..శరణు...✍️

🍁పెరిగే వయసు
తరిగే ఆయువు
జీవులకి ఎన్నో చెబుతాయి

కొందరికి
జీవిత కాలానికి తగిన
పాఠాలు
గుణపాఠాలు

మరికొందరికి
పెరిగిన
తరిగిన
బంధాలు
అనుబంధాలు

ఇంకొందరికి
తీర్చుకోవలసిన
పంచుకోవలసిన
బరువులు
బాధ్యతలు

ఎందరికో
వదులుకోవలసిన
తీర్చుకోవాలనుకున్న
కోరికలు
ఆశలు

నాకు మాత్రమే
తెలుస్తున్నది
నీ ఒడిలో సేద తీరే సమయం
దగ్గరవుతున్నదని
ఆర్తితో పెల్లుబికే కన్నీటితో
నీ పాదాలను నిరంతరం కడిగే
అవకాశం చేరువవుతున్నదని
జనన మరణాల చక్రములో
పరిభ్రమిస్తున్న జీవునికి
మాయ తొలగి
నీలో ఐక్యం అయ్యే శుభతరుణం
వస్తున్నదనీ

⚜️💦పరమేశ్వరా శరణు..శరణు...✍️

సేకరణ

ఆ మార్పు ఇంకెలా ఉంటుందో?!

వర్తమాన సమయంలో మనం ప్రేమను, గౌరవాన్ని ఇతరుల నుండి ఆశిస్తున్నాము. 


ఇది కలియుగం. 

కలియుగంలో మనం అడుగుతూ ఉంటాము. 

సత్యయుగంలో ఎలా ఉంటారు? 

ఇచ్చేవారిగా ఉంటారు. 

అందుకే వారిని దేవతలంతారు. 

దేవత అంటే దాత. 

అనగా ఇచ్చేవారని అర్ధం. 


సత్యయుగంలో సంపన్నంగా ఉంటారు. 

సంపన్నంగా ఉన్నవారు ఇతరుల నుండి ఏమీ ఆశించరు. 

వారికి ఆ అవసరమే ఉండదు. 


ఒక్కసారి ఆలోచిస్తే కనుక... 

మనం కలియుగంలో ఉంటూ కూడా,  

ఇప్పుడు మన ఆత్మిక బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వలేదు కూడా.. 

కాస్త ఛార్జ్ అయ్యింది.. 

అయినా కూడా, 

మనం అడగడం నుండి ఇవ్వడంలోకి, 

ఆశించడం నుండి అంగీకారంలోకి బదిలీ అయ్యాము. 


కాస్త అవగాహనతో, 

ధ్యానంతో బ్యాటరీ కాస్త ఛార్జ్ అయ్యినా సరే మార్పు ఎంతగా వచ్చింది మనలో! 

బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయినప్పుడు మనలో వచ్చే ఆ మార్పు ఇంకెలా ఉంటుందో?!


సేకరణ. మానస సరోవరం 👏

నేటి జీవిత సత్యం. అదే అసలైన జ్ఞానం.

నేటి జీవిత సత్యం.

ఆలోచనలు లేని స్థితి. అంటే మనసును ఖాళీగా ఉంచుకోవటం. ఆ స్థితి పొందడం ఎంతో ప్రావీణ్యం సంపాదించుకుంటే కానీ వీలుపడదు. ఆ స్థితి పొందడం వల్ల కలిగే జ్ఞానం ప్రత్యేకమైనది. నేర్చుకొని సంపాదించుకునే జ్ఞానం కన్నా, బుద్ధితో ఆలోచించగలిగే జ్ఞానం కంటే అది భిన్నమైనది, ప్రత్యేకమైనది. జీవితానికి ఉపయోగం లేని ఇతర జ్ఞాపకాలను ఆ జ్ఞానం తొలగించగలుగుతుంది. మనసులో ఉన్న పాత జ్ఞాపకాలు తొలగిపోవడం కొంతవరకు అందరిలోనూ జరుగుతూనే ఉంటుంది. ప్రత్యేకంగా తొలిసారి ధ్యానం చేసినపుడు ఇది జరుగుతుంది. ఇదివరకు ఉన్నట్టుగా కాకుండా, అంతరంగం ఖాళీ అయినట్టు గమనిస్తాం. ధ్యానం కొనసాగుతున్న కొద్దీ ఆ స్థితి మరింతగా పెరుగుతుంది. పాత సంస్కారాలన్నీ పోయి, ప్రతిరోజూ ఒక కొత్త వ్యక్తిగా మారుతూ ఉంటాం. ఇదే స్వచ్ఛమైన జ్ఞానమని నిపుణులైన సాధకులు చెప్తుంటారు.


ఒక గ్రామంలో ఓ చిరు వ్యాపారి ఉండేవాడు. అతని కొడుకులు గ్రామానికి వచ్చిన ఓ సాధువు దగ్గర శిష్యులుగా చేరారు. వారు అతని బోధనల్లో మునిగిపోయి, అతను చెప్పిన పద్ధతులు ఆచరిస్తూ ప్రశాంతంగా ఉంటున్నారు. తన కొడుకులు బాగా సంపాదించాలని వ్యాపారి కోరిక. వారిని ఎందుకూ పనికిరానివారిగా చేస్తున్నాడని వ్యాపారికి ఆ సాధువుపై కోపం పెరిగిపోయింది. ఓ రోజు కోపంతో ఆ సాధువు దగ్గరికి వెళ్లాడు. అతణ్ని ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అక్కడికి వెళ్లగానే కోపం మరింత పెరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడున్న పేడను తీసి అతని ముఖంపై విసిరాడు. సాధువు ముఖమంతా పేడతో నిండిపోయింది. శిష్యులకు కోపం వచ్చింది. సాధువు మాత్రం చిరునవ్వు నవ్వాడు. ఆ వ్యాపారి అక్కడ ఉండలేక గబగబా ఇంటికి వెళ్లిపోయాడు. అతని మనసు నిండా ఆలోచనలు. ముఖం మీద పేడ వేసినా చిరునవ్వుతో ఉన్న వ్యక్తిని జీవితంలో తను మొట్టమొదటిసారి చూశాడు. రాత్రంతా నిద్రపట్టలేదు. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తప్పు చేశాననే భావన అతని మదిలో నిండిపోయింది.

మర్నాడు పొద్దున్నే వెళ్లి సాధువు పాదాలపై పడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు తాను క్షమించలేనని చెప్పాడు. అందరూ విస్తుపోయారు. ‘క్షమించవలసినంత తప్పు నువ్వేం చేయలేదు’ అన్నాడు సాధువు. కానీ వ్యాపారి పశ్చాత్తాపంతో తాను నిన్న వచ్చి అతని ముఖంపై పేడ వేసిన విషయాన్ని గుర్తుచేశాడు. అప్పుడు సాధువు చిరునవ్వుతో ‘నిన్న ఆ పని చేసిన వ్యక్తి ఈ రోజున లేడు. అంటే ఆ గుణం ఈ రోజున నీలో లేదు. ఈ రోజు నువ్వు ఏ అపకారమూ చేయలేదు. కాబట్టి నిన్ను క్షమించ వలసిన అవసరం లేదు’ అన్నాడు. అదీ క్షమాగుణం.

ఒక వ్యక్తిని మొదట తప్పు చేశావని నిరూపించి, తర్వాత క్షమించడం క్షమ అనిపించుకోదు. ఆ క్షమించిన విషయం సైతం ఆ వ్యక్తికి తెలియకుండా జరిగిపోవాలి. వారిలో తప్పు చేశామనే భావనే రాకూడదు. అది సరైన క్షమ. వారి తప్పును ఎత్తి చూపిస్తున్నావంటే వారిని ఇంకా క్షమించడం లేదని తెలుసుకోవాలి. తప్పు చేశామనే భావన పెద్ద శిక్ష. సాధనతో సంపాదించుకున్న జ్ఞానం ఈ భావన నుంచి తప్పించి జీవితాన్ని విశాల దృక్పథంతో చూసేలా చేస్తుంది. అదే అసలైన జ్ఞానం.

అవతలి వ్యక్తుల తప్పులను ఎత్తిచూపడమే పనిగా పెట్టుకునేవారు లోకంలో కోకొల్లలు కనిపిస్తుంటారు. వారంతా ఒకసారి తమ తప్పులను గుర్తించగలిగితే, ఎదుటివారిని అర్థం చేసుకోగలుగుతారు. అంటే, తప్పును సమర్థించాలని కాదు, తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయాలే కానీ, దాన్ని చేస్తున్న వ్యక్తిని తప్పుబట్టకూడదు. పై కథలో సాధువు అనుసరించిన విధానం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అంతటి సహనశీలత ఉండకపోవచ్చు. కానీ, అభ్యాసంతో అన్నీ సాధ్యమే! మన మనసు పారదర్శకంగా ఉంటే, అవతలి వ్యక్తి మనసూ అంతే పారదర్శకంగా కనిపిస్తుంది. మనలో మాలిన్యాలు ఉంటే, ఎదుటివారిలోనూ అవే కనిపిస్తాయి.

సేకరణ. మానస సరోవరం 👏

మంచి మాట..లు(28-06-2022)

మంగళవారం :-28-06-2022
ఈ రోజు AVB మంచి మాట..లు

సమస్యలు లేకపోతె జీవితంలో కొత్తదనం ఏమి ఉండదు.. మీరెప్పుడు ఓడిపోలేదు అంటే మీరు ఎప్పుడు కొత్తగా ఏమి ప్రయత్నం చేయలేదు అని అర్థం

కుటుంబాలు వేరు వేరుగా ఉండి పంచభక్షా పరమాన్నలు తినేకన్నా కలిసిఉండి గంజి తాగినా బాగుంటుంది.. ఏది తిన్నా ఏమి చేసినా ఆ రోజుకే పరిమితం మరునాడు మరలా తినాల్సిందే.. చేయాల్సిందే

మనసు చెప్పిందల్లా మనం వినటంకాదు.. మనం చెప్పినట్లు మనసు వినేలా చూసుకోవాలి.. అప్పుడే సమస్యలు తగ్గుతాయి

సేకరణ ✍️ AVB సుబ్బారావు

సేకరణ

మనసు మాటల ముత్యాలు

🌹🙏🏻శుభోదయం🌹🙏🏻

మనసు మాటల ముత్యాలు

🌹 విలువైన మాటలు చెప్పే వాళ్ళు
దొరకడం మన అదృష్టం..
కానీ
అవి విలువైన మాటలు అని
తెలుసుకోలేక పోవడం మన దురదృష్టం...!

🌹 ప్రశ్నలతో ఈ సమాజం ప్రతి క్షణం నిన్ను వేధిస్తుంటే...!
ధైర్యంగా బ్రతికి చూపించి...
ఇదే నా సమాధానం.. అని చెప్పడమే జీవితం...!

🌹 గడ్డిపోచలు మాత్రమే నీటిపై
తేలియాడుతుంటాయి
ముత్యాలు కావాలంటే నీటి
లోపలికి మునగక తప్పదు.

🌹 ఏదైనా నీవు చేయగలను
అనుకుంటే చేయగలవు,
చేయలేను అనుకుంటే చేయలేవు.
నమ్మకంలోని నాణ్యతే నీకు
నాణ్యమైన జీవితాన్ని ఇస్తుంది.

🌹 పోరాడితే పోయేదేమీ లేదు
గెలిస్తే విజయం వరిస్తుంది
లేకుంటే అనుభవం వస్తుంది.
ఆ అనుభవం రేపటి నీ విజయానికి దారి
చూపుతుంది.

🌹 ఆలోచించే విధానము
జ్ఞాపకము ఉంచుకునే శక్తి
మాట్లాడే పద్ధతి మరియు
విజ్ఞానాన్ని నేర్చుకునే కోరిక
వీటన్నిటినీ నిరంతరము మెరుగుపరచుకుంటూ
నడిచేవారు తాము తలపెట్టిన పనిని అత్యంత
సమర్ధతతో నిర్వహించగలుగుతారు.

సేకరణ

మంచి మాట..లు(27-06-2022)

సోమవారం :-27-06-2022
ఈ రోజు AVB మంచి మాట..లు

ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం పాము శిల అయితే పాలు పోస్తాం ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం
ఎలుక
రాతిది వినాయకుడి ముందు ఉంటే పూజిస్తాం

తల్లి తండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి నమస్కారం చేస్తాం...,ప్రాణాలతో ఉంటే వుద్దాశ్రమం లో వది లేస్తాం చని పోయిన వాడికి భూజాన్ని అందిస్తాం బతికి ఉన్న వాడికి చేయూత నివ్వం.

రాయిలో
దైవత్వం ఉందని తెలుసుకున్నాం , మనషి లో మానవత్వాన్ని గుర్తించలేక పోతున్నాం...
జీవం లేని వాటిపై ప్రేమ ఎందుకు ప్రాణం తో ఉంటే ద్వేషం ఎందుకు
ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు గాని,దయచేసి ఎవరికీ కీడు చేయకండి ఎందుకంటే వారి మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది 🤝..

మిత్రమా !
బోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చకోకు...

ఈ క్షణమే నీది..నీవు ఏదైనా. ఎవరికైనా
మంచి చేయాలన్నా ఈ క్షణమే నీది..,,,,నీవు ఏమి చేసినా మంచిదైనా.. చెడు అయినా.. మంచి చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.... చెడు చేస్తే మనసు ఆందోళన పడుతుంది .
నిన్న నీది కాదు.. గడిచిపోయింది కాబట్టి.. రేపు నీది కాదు..ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ క్షణమే నీది !

మనతో ఏ
బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు

నీవు ఎంత మంది
హృదయాలను గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు మనకంటే మంచివారు ఇంకెవ్వరూ ఉండరు .

నీవు ఎప్పుడూ
బాధ పడుతుంటే నీకు బ్రతుకు భయపెడుతుంది అదే నీవు ప్రతీ క్షణం నవ్వుతూ ఉంటే ఆనందం తల వంచుతుంది.మీ ముందు

.నీవు
నిర్ణయం తీసుకున్నాక ఆ దారి ఎలా ఉన్నా గమ్యం* చేరాల్సిందే... నిర్ణయం తీసుకునేముందే.. ఒకటికి రొండు సార్లు ఆలోచించుకోవాలి
సేకరణ ✍️AVB సుబ్బారావు

సేకరణ

మంచి మాట..లు(18-06-2022)

శనివారం :-18-06-2022
ఈ రోజు AVB మంచి మాట..లు
నరుడే నారాయణుడు అంటారు.. అందరిలో దేముడు ఉంటాడు అంటారు.. మరి ఇతరులను మోసం చేయటం.. దోచుకోవటం.. మాటల చేతల ద్వార బాధ పెట్టటం చేస్తుంటాము.. మరి అటువంటప్పుడు.. పైవన్నీ దేముడికి చేస్తున్నట్లేగా..🤔 ఆలోచించండి

కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది,
డబ్బుకు మనమిచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది,
సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానం ఇస్తుంది..

వంద బంధాలు ఉండవచ్చు, కానీ మనకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తాయి ఆ వందలో ఎన్ని బంధాలు నిజమైనవని...

మాటే కదా అని ఆలోచించకుండా ఇవ్వకండి.. మాట ఇస్తే తప్పక నెరవేర్చాలి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా.. మాట నేరవేర్చకపోతే మనం వారికీ ఋణగ్రస్తులమే అని గమనించండి

అనుభవం బట్టి ఫలితం ఎలా వస్తుందో.. అలానే మన ఆలోచనలు.. మన చేతల ద్వారా మనం చేసే పనులబట్టే దేముడు కూడా మనకు ప్రతిఫలం ఇస్తాడు అని గమనించండి
సేకరణ ✒️AVB సుబ్బారావు 🤝

సేకరణ

జపం ఎందుకు, ఎలా చేయాలో తెలుసా??

 జపం ఎందుకు ఎలా చేయాలో తెలుసా??


🌷🕉🌷


ఒకప్పుడు మనిషి జీవితాన్ని ఎంతో ఉన్నతంగా, క్రమశిక్షణగా ఉంచిన వాటిలో ధ్యానం చేయడం, జపం చేయడం ప్రముఖ పాత్ర వహించాయి. ప్రస్తుత కాలంలో ఉన్న వేగవంతమైన జీవితంలో ఈ జపాన్ని, ధ్యానాన్ని చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారని చెప్పాలి. అయిదు నిమిషాలు పాటు కుదురుగా ఉండలేని వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇలా కుదురుగా ఉండలేకవడమనే సమస్య వల్ల జీవితంలో నిర్వహించాల్సిన ఎన్నో పనులలో కూడా విఫలం అవుతూ ఉంటారు. వీటికి పరిష్కారంగా అందరికీ అందుబాటులో ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేసుకోదగినది జపం.


ఈ తరానికి ఈ మాట ఆశ్చర్యంగా అనిపించినా ఇదే గొప్ప పరిష్కారం. జపం అంతే ఒక దేవతా మంత్రాన్ని పదే పదే ఉచ్చరిస్తూ ఆ మంత్రంలోని వైబ్రేషన్ ను సొంతం చేసుకోవడం. నిజానికి ఇది కాస్త ఓపికతో కూడుకున్నది అయినా దాన్ని సాధించిన తరువాత పలితం మాత్రం చెప్పలేనంత గొప్పగా ఉంటుంది.


జపం కూడా చేసే విధానాన్ని బట్టి దాని పలితాన్ని ఇస్తుంది. అందరికీ అనుకూలమైన ప్రాంతం ఇల్లు. ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది. ఇక భారతీయ సాంప్రదాయంలో నదులు ఒక భాగం. వీటిని ఎంతో పవిత్రంగా చూస్తారు భారతీయులు. అలాంటి నదిలో చెసే జపం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. దేవతా స్వరూపంగా చూసే జంతువులలో ఆవు ఎంతో గొప్పది. అలాంటి ఆవుల నిలయమైన గోశాలలో జపం వందరెట్లు పలితాన్ని ఇస్తుంది. యాగశాలలో చేసే జపం అంతకుమించి ఫలితాన్నిస్తుంది . ఇక దేవుళ్ళు స్వయంభువు గానూ, ప్రతిష్టగానూ కొలువై ఉన్న పుణ్యతీర్ధాలలోను, దేవతాసన్నిధి లోనూ చేస్తే పదివేలకోట్ల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అన్నిటికీ మించి ఆ పరమేశ్వరుడి సాన్నిద్యంలో అంటే శివాలయంలో జపం చెస్తే అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది.


అలాగే జపాన్ని కూడా వివిధ రకాలుగా  అంటే వివిధ అసనాలలో చేయడం వల్ల కూడా ఫలితాలు వేరుగా ఉంటాయి.


వెదురు తడకపై కూర్చుని చేస్తే దారిద్ర్యము సంభవిష్తుంది కాబట్టి ఎప్పుడూ ఇలా చేయకూడదు. 


రాతిపై కూర్చుని చేస్తే రోగాలు వస్తాయని అంటారు. అందుకే రాతిమీద కూర్చుని చేయకూడదు. 


నేలపై కూర్చుని చేస్తే ధుఖము కలుగుతుంది. మనిషి జీవితానికి ప్రశాంతత పోగొట్టేది దుఃఖమే. ఆందుకే దీనికి దూరంగా ఉండాలి.


 కొయ్యపీటపై కూర్చుని జపం చేస్తే దౌర్భాగ్యము కలుగుతుంది. 


గడ్డితో చేసిన చాపపై  కుర్చీని జపం చేస్తే చిత్తచాపల్యము కలుగుతాయి. అంటే మనసు నిలకడగా ఉండదు. 


జింక చర్మము పై కూర్చుని చేస్తే జ్ఞానసిద్ధి కలుగుతుంది. చాలామంది యోగులు, సన్యాసులు దీనిపైనే జపం చేస్తారు. 


వ్యాఘ్ర చర్మం(పులి తోలు)పై కూర్చుని జపం చేస్తే  మోక్షము సిద్ధిస్తుంది. ఎంతో గొప్ప మహర్షులు పులిచర్మం పై జపం చేస్తారు.


వస్త్రాన్నీ పరచుకుని దానిమీద కూర్చుని జపం చేస్తే డబ్బు సమకూరి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి


పేముతో అల్లిన ఆసనం మీద కూర్చుని జపం చేస్తే ఎంతో రోగాలతో సతమతం అవుతున్న వారికి ఆ రోగాలు  నివారణ అవుతాయి.


ధుఖాలు పొగొట్టుకొవడానికి -కంబళి పైన కూర్చుని జపం చేసుకొవాలి. అలాగే ధర్భలతో చేసిన ఆసనంపై కూర్చుని జపము చేసినా పుష్టిని కలుగిస్తుంది.


ఒకప్పటి కాలంలో వందేళ్లు చేసిన జపానికి కలిగే పలితం ఇప్పటి కాలంలో ఒక గంట కూర్చుని జపం చేస్తే దాని పలితం ప్రస్తుత మనిషి జీవితాన్ని ఎంతో గొప్ప మార్పులోకి తీసుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జపం చేయడం అలవాటు చేసుకుంటే జీవితం సమస్యల నుండి బయటపడుతుంది.


ఓం నమః శివాయ🙏


🌷🕉🌷

మందలో మంచిని మాత్రమే గ్రహించి చెడును వదిలేయాలి.

 🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺

🌴 ఆవు గడ్డి తిని పాలు ఇస్తుంది. పాలు త్రాగి విషం ఇస్తుంది పాము. కొందరి గుణాలు ఇలానే ఉంటాయి. కనుక మన చుట్టూ ఉన్నవారిని గమనిస్తూ ఉండాలి. మంచిని మాత్రమే గ్రహిస్తూ చెడును గమనిస్తూ ఉండాలి. కష్టం అయినా సరే మంచి మార్గము గుండా పోవడానికి ప్రయత్నం చెయ్యాలి. చెడ్డవారి సాంగత్యమునకు పూర్తిగా దూరముగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి వారి మాటలు వలన మనలోని మంచి భావాలు, మంచి ఆలోచనలు అడగంటుకు పోయే ప్రమాదమూ లేకపోలేదు. కనుక అందరినీ కలుపుకుంటూ పోవాలి. కానీ మందలో మంచిని మాత్రమే గ్రహించి చెడును వదిలేయాలి. అదే మనకు ఆనందకరమైన, ఉత్తమమైన జీవనాన్ని ఇస్తుంది 🌴

సేకరణ

సర్వ వ్యాధులకు మందులేని స్వయం చికిత్సా విధానం అనాటమిక్ చికిత్స pdf telugu ebook

అనాటమిక్ చికిత్స pdf telugu ebook download link

పోషణ (telugu) pdf ebook

Poshana telugu Pdf ebook download link



Tuesday, June 28, 2022

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

వెయ్యి యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం..

నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఎంతో అవసరం.

నిన్ను నువ్వు గెలిస్తే..

నీ నుంచి నీ గెలుపును ఎవరూ దూరం చేయలేరు.

నిన్నటి గురించి ఆలోచించడం

రేపటి గురించి బాధ పడటం

ఈ రెండు తోడు దొంగలు

అవి రెండు కలిసి కాలాన్ని

(సమయాన్ని)దోచేస్తాయి.

కాబట్టి కాలాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేయాలి

శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

నేటి జీవిత సత్యం. మన ఆలోచనలే మనం.

నేటి జీవిత సత్యం.
మన ఆలోచనలే మనం.

మనిషిని మనిషిగా నిలబెట్టగల్గినవి ఆలోచనలే. మన సంకల్ప వికల్పాలకు మన మనస్సే ఆధారం. అది సాత్వికమైతే మన ఆలోచన ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. రాజసమైతే తమకనుకూలంగా ఉంటుంది. తామసికమైతే ఇతరుల విషయంలో ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే మనస్సు మీద అదుపు ఉండాలని చెప్తారు. మనస్సు వశంలో ఉన్నప్పుడే, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే మనస్సుతో పాటు ఇతర ఇంద్రియాల మీద పట్టు సాధించగల్గుతాడో, అప్పుడే మనిషి ఒక చక్కని ఆలోచనాపరుడిగా నిలబడగల్గుతాడు.
ఆలోచించే దానికంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఒక్కోసారి మనం మన స్థాయి కంటే మించిపోతామో ఏమో అనిపిస్తుంది. జీవితం ఒక పద్ధతిలో సాగాలంటే అందుకు మన ఆలోచనా సరళి దోహదకారి అవుతుంది. అసలు ఆలోచించడ మెందుకనే వారు కూడా ఉండవచ్చు. కానీ ఆలోచించకుండా ఏ మనిషీ ఉండజాలడు. మన సంకల్పం సక్రమ స్థితిలో ఆవిర్భవించినప్పుడు, మన ఆలోచన చక్కగా కొనసాగుతుంది. ఎప్పుడైతే మన ఆలోచన సరిగా సాగుతుందో అప్పుడు ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి రాగలుగుతాం.
సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ఒకచోట చెప్పిన మాట ఆలోచనాత్మకమైంది.
‘‘ఎదుటి వారిని విమర్శించే ముందు మనం వారి స్థానంలో ఉండి ఆలోచించాలి’’ అనడంలో మనల్ని మనం చక్కదిద్దుకునే ఏర్పాటు మాత్రమే కాదు, ఎదుటి వారి దృష్టిలో పలుచన కాని వారమై కూడా ఉండాలన్న ఉపదేశం తేటతెల్లమవుతుంది.

సంకల్పించడం, ఆలోచించడం అనేవి మనిషికి గొప్ప వరాలు. వాటిని సాధించాలంటే జీవితాన్ని క్రమశిక్షణ మార్గంలో నడిపించాలి. ఈ క్రమశిక్షణ పుట్టుకతోనే రావాలని అనుకుంటారు కాని అది ఒకరిని ఆదర్శంగా తీసుకున్నపుడే సాధ్యమవుతుంది. ఆ ఒక్కరు తల్లిదండ్రులలో ఒకరు కావచ్చు, గురువు కావచ్చు, స్నేహితుడు కూడా కావచ్చు.
క్రమశిక్షణతో కూడిన ఆలోచన మనిషిని మహోన్నత శిఖరాలకు అధిరోహింపజేస్తుంది. ఒక సదాలోచన బుద్ధున్ని సత్యాన్వేషకున్ని చేసింది. ఒక సదాలోచన అంబేద్కరును రాజ్యాంగ నిర్మాతను చేసింది. ఒక సదాలోచన వివేకానందుని సన్యాసిని చేసింది. ఒక సదాలోచన దయానందుణ్ణి మనిషిని చేసింది. ఆలోచనకు ప్రతిరూపంగానే మనిషి భాసిస్తాడు. కనుకనే మనిషిని మేధావి అని పిలుస్తాం.
‘హెయిన్‌’ అనే పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రవేత్త ‘‘మంచి ఆలోచనలు చేసేవారే మంచి పనులు చేస్తుంటారు’’ అని సెలవిచ్చాడు. ఇది ముమ్మాటికీ నిజం. మంచి ఆలోచన మంచి పనికి దారి తీస్తుంది. మంచిపని మంచి ఫలితాన్ని ఇస్తుంది. ‘‘జీవితంలో గొప్పగా ఎదగాలంటే సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవా’’ లన్న బెన్నిసన్‌ మాటలు గమనింపదగ్గవి. ఉన్నతమైన ఆలోచనలే ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి. గొప్ప పనులు చేయాలంటే మొదట గొప్పగా ఆలోచించక తప్పదు. చరిత్రలో నిలబడ్డ మహా పురుషులందరూ గొప్పగా ఆలోచించినవారే.
మంచి స్వభావం మనిషికి అలంకారమైనప్పుడు మంచి ఆలోచన అతనికి కిరీటంగా భాసిస్తుంది. ‘యద్భావం తద్భవతి’ అనే మాట ఒకటుంది. ఏది అనుకుంటే అది అవుతుందని దాని అర్థం. నిజానికి అందరు అనుకున్నది అవుతుందా? ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో సంకల్పించి, కార్య రంగంలోకి దూకుతారో వారికే విజయం సంప్రాప్తమవుతుంది.
కొందరు అదేపనిగా ఆలోచిస్తుంటారు. ప్రతి దానికి ఆందోళన చెందుతుంటారు. మనస్సు కకావికలం కాగా, విచారానికి లోనవుతారు. కాని జరిగిన వాటిని గూర్చి, జరగబోయే వాటిని గూర్చి పండితులు ఆలోచించరు. లోకంలో జరిగినవి, జరగబోయేవి మనల్ని ప్రభావితుల్ని చేస్తాయి. కాని బుద్ధిశాలురు జరుగుతున్న విషయాలను మాత్రమే పట్టించుకుంటారు. వారు వర్తమానంలో జీవిస్తారు. వాస్తవికతను ఆవిష్కరిస్తారు. పరిస్థితులను బట్టి వ్యవహరిస్తారు. కాని సామాన్యులు తద్భిన్నంగా ఆలోచిస్తూ జీవితాలను దుఃఖమయం చేసుకుంటారు.
మనస్సును నిగ్రహించుకున్నప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి. అందుకే మన పెద్దలు ఆలోచనల్ని గుర్రాలతోను, మనస్సును పగ్గాలతోను పోల్చి చెప్పారు. అప్పుడు శరీరం రథంగాను, బుద్ధి సారధి గాను మారిపోయి, మనిషి అనుకున్న గమ్యం చేరడానికి వీలు కలుగుతుంది.

మనిషిని గమ్యం వైపు ప్రయాణింపజేసే ఆలోచనలే నిజమైన ఆలోచనలు. అందుకు మొదట మనిషి లక్ష్య శుద్ధి కల్గిన వాడు కావాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి జీవితంలో, అతనికి ఆలోచనల కంటే మించి సాయపడేవి మరేవీ ఉండవని గట్టిగా చెప్పవచ్చు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

✍️... నేటి చిట్టికథ, వారే నిజమైన యోగులు,సన్యాసులు...

✍️... నేటి చిట్టికథ


పూర్వము జాజిలి అనే తపస్వి వుండేవాడు

.అతను చాలాకాలం ఘోరమైన తపస్సు చేశాడు.
ఎండనక వాననక కదలక మెదలక కూచుని,నిల్చుకొని తపస్సు చేశాడు



.అతను చెట్టు
అనుకొని పక్షులు ఆయన జడలలో గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టడం కూడా ప్రారంభించాయి.గుడ్లు పిల్లలై యెగిరి పొతుం డేవి.పిచ్చుకలు తన తలపై గూళ్ళు కట్టుకుని నివసిస్తున్నా తాను నిశ్చలంగా తపస్సు చేసుకో గలుగుతున్నానని,తనది గొప్ప తపస్సు అనే అహంకారం
అతనిలో కలగసాగింది.

ఒకనాడు అతనికి యిలా ఆకాశవాణి వినిపించింది....
నీవేమో గొప్ప తపస్వినని గర్వపడుతున్నావు.కాశీ పట్నం లో తులాధారుడు అనే సామాన్య వ్యాపారి నీ కన్నా ఎన్నో రెట్లు గొప్పవాడు జ్ఞాన వృద్ధుడు.అతన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందు' అని

జాజిలికి చాలా ఆశ్చర్యం కలిగింది.

తన తపశ్శక్తి తో ఆకాశమార్గాన కాశీ పట్నం చేరి
తులాధారుడింటికి బయల్దేరాడు.

జాజిలి అంత దూరం లో ఉండగానే తులాధారుడు ఎదురుగా వచ్చి అతనికి స్వాగతం చెప్పి మీరెందుకు వచ్చారో నాకు తెలుసు.పిచ్చుకలు మీ జడలలో నివాసం ఏర్పరుచు కున్నంత మాత్రాన మీరు ఎంతో గొప్పవాడినని గర్వించి చిత్త వికారాన్ని పొందారు.
ఇంత చిన్న సంఘటనకే నీకు చిత్తచాంచల్యం కలిగితే
మీరు ఏమి తపస్సు చేసినట్లు?

గర్వము మటుమాయం కాగా జాజిలి నమ్రభావం తో తులాదారునికి నమస్కరించి మహాత్మా సామాన్య సంసారి అయిన మీకు యింతటి తపశ్శక్తి ఎలా కలిగింది?తెలియజేయండి.అని ప్రార్థించాడు.

తులాధారుడు జాజిలికి యిలా జ్ఞానబోధ చేశాడు.
నేను చేసే వృత్తి కేవలం నా కుటుంబ పోషణకు చాలినంత మాత్రమే సంపాదిస్తాను.
నేను అమ్మినా కొన్నా తూనికల్లో గానీ,ధరల్లో గానీ మోసం చెయ్యను న్యాయంగా సంపాదిస్తాను.ఎక్కువ లాభాలు తీసుకొను.అహంకార మమకారాలకు అతీతంగా వుంటూ
తామరాకు పైన నీటి బిందువు వలె అసంగుడనై తృప్తి తో ధర్మయుక్తంగానా మనస్సును స్వాధీనం లో వుంచుకొని జీవిస్తున్నాను.యిదే నా తపస్సు.నేనే చేసే సాధనలో మీకు ఏమైనా సందేహముంటే నీ జడలో కాపురముంటున్న పిచ్చుకలను అడుగు.అన్నాడు.


పిచ్చుకలు తులాధారుడు చెప్పింది నిజము.గర్వము,మాత్సర్యము వున్న మనసులో
హింస వుంటుంది.హింస అంటేనే అధర్మం.అంటూ యెగిరి పోయాయి.

తులాదారుని ఉపదేశం తో గర్వాన్ని త్యజించి సవినయుడై అతనికి నమస్కరించి
నిజమైన తపస్సు ఏదో.నిజమైన యోగి అంటే ఎవరో తెలుసుకొని వెళ్ళిపోయాడు.


' జ్నేయస్సనిత్య సన్యాసి యోన ద్వేష్టి న కాంక్షతి'అని.. గీత బోధిస్తున్నది.



ఎవరిలో ద్వేషము,కాంక్ష వుండదో,ఎవరైతే ఫలాన్ని ఆశించకుండా కర్మను చేస్తాడో అతనే నిజమైన సన్యాసి యోగి అని భగవద్గీత వుద్ఘాటిస్తుంది.


కాషాయవస్త్రాలు ధరించి,జడలు పెంచి అడవుల్లో తపస్సు చేసినంతమాత్రాన యోగి కాలేడు.ఎవరిలో ద్వేషభావము వుండదో,ఎవరు కరుణా పూరిత హృదయులో,ఎవరు మమకార,అహంకారములు లేకుండా వుంటారో సుఖ దుఃఖముల యెడ సమభావంతో
మెలుగుదురో,ఎవరు క్షమాగున సంపన్నులో వారే నిజమైన యోగులు,సన్యాసులు...


🔹🔸🔹🔸🔹🔸🔹


చదివి చదివి కొంత చదువంగ చదువంగ
చదువు చదివి యింక జదువు చదివి
చదువు మర్మములను చదువలేడయ్యెను
విశ్వదాభిరామ వినురవేమ.


ఎన్ని చదువులు చదివి, ఎన్ని విద్యలు నేర్చినా, ఆత్మతత్వము తెలియని మనిషి మూర్ఖుడే కదా!

🔹🔸🔹🔸🔹🔸🔹

సేకరణ

Story: అలాగే, గొప్పవాళ్ళు, ఏమీ ఆశించకుండా ఇతరులకు మేలు చేస్తారు

అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు వుండేవారు. ఆయనికి చుట్టు పక్కల అన్ని రాజ్యాల్లో తన రాజ్యం గొప్పదిగా గుర్తించపడాలని చాలా తాపత్రయం వుండేది

ఒక సంవత్సరం దీపావళి పండుగ దెగ్గిర పడుతుంటే రాజుగారికి ఓ ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాలకన్న ఆయన రాజ్యం లో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని ఒక పోటీ ప్రకటించారు

రాజ్యంలో అందరికన్న బాగా దీపాలు పెట్టిన వారికి రాజుగారు స్వయంగా బహుమానం ఇస్తారని రాజ్యమంతా దండోరా వెయ్యించారు

రాజ్యంలో ప్రజలంతా కూడా పోటీలో ఉత్సాహంగా పాలుగున్నారు. ఒకరినిమించి ఒకరు ఇంటికి దీపాలు పెట్టుకుని అలంకరించుకున్నారు

దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారకులతో రాజ్యాన్ని పర్యటించారు. యెన్నో అద్భుతమైన ఇళ్ళను చూసి చాల సంతోషించారు

ఊరి చివరలలో ఉన్న ఒక ఇల్లు చీకటిగా కనిపించింది

రాజుగారు ఆ ఇంటిని చూసి, “ఆ ఇంట్లో యెవరుంటారు? యెందుకు వాళ్ళు ఇల్లు అలంకరించుకోలేదు?” అంటూ ఆ ఇంటి వైపుకు అడుగులు వేశారు

ఇంటి దగ్గిరకు వెళ్ళి చూస్తే ఇంటి బయిట రహదారి లో ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ దీపం వెలుగులో రహదారిలో ఒక గొయ్యి కనిపించింది. ఇంటి అరుగు మీద ఒక అవ్వ కూర్చుని ఆ దీపం ఆరిపోకుండా అందులో నూనె పోస్తోంది

ఇది చూసిన రాజుగారు, అవ్వ, నువ్వు ఇక్కడ యెమి చేస్తున్నావు? మీ ఇంటికి దీపాలు యెందుకు పెట్టలేదు?” అని అడిగారు

“నా దగ్గర రోజు ఒక్క దీపం పెట్టే అంత డబ్బే వుంది. రహదారి మీద ప్రయాణం చేసే బాటసారులు ఈ గొయ్యి కనిపించకపోతే ఇందులో పడిపోతారు. అందుకే దీపం నా ఇంటిలో పెట్టుకోకుండా నేను ఇక్కడ దీపం పెడుతున్నాను” అని చెప్పింది

జవాబువిన్న రాజుగారు చాల ఆశ్చర్యపోయారు

ఊళ్ళో అందరూ వారి ఇళ్ళని దీపాలతో అలంకరించికుంటే అవ్వ మట్టుకు బాటసారులకు దారి చూపించటంకోసం దీపం పెట్టిందని, రాజ్యంలో అందరికన్న బాగా దీపాలు పెట్టినది ఆ అవ్వేనని ప్రకటించి, బహుమానం కూడా ఆ అవ్వకి ఇచ్చారు

మరునాడు రాజుగారి ఆదేశంపై పనివాళ్ళు వచ్చి రహదారిలో వున్న గోతిని మరమ్మత్తు కూడా చేసారు

ఎప్పుడూ మన స్వలాభం కోసం కాకుండా
సమాజం కోసం కూడా ఆలోచించాలి

పిబంతి నద్య స్స్వయ మేవనాంభః

ఖాదంతి నస్వాదు ఫలాని వృక్షః

పయోధరా స్సస్యమదంతి నైవ

పరోపకారాయ సతాం విభూతయః

నదులు తమ నీటిని ఉపయోగించుకోవు. చెట్లు తమ తీయటి పండ్లను తాము తినవు. మేఘాలు వర్షించాం కదాని, కాయగూరలను కోరుకోవు. ఇవన్నీ పరోపకారం చేస్తున్నాయే గానీ ఫలితాన్ని ఆశించడం లేదు. అలాగే, గొప్పవాళ్ళు, ఏమీ ఆశించకుండా ఇతరులకు మేలు చేస్తారు
శుభోదయం

సేకరణ

Story: దొంగను పట్టే మసికుండ

దొంగను పట్టే మసికుండ:

విదర్భ నగరానికి రాజు ఇంద్రసేనుడు. ఈ రాజుకు చంద్రసేనుడు అనే మిత్రుడు కూడా వున్నాడు. ఇంద్రసేనుని వద్ద నాగమణి అనే గొప్ప వజ్రం ఉండేది. ఒక ముని ఆ వజ్రాన్ని రాజుకి బహుమానంగా ఇస్తూ ఈ వజ్రం ఎవరి వద్ద ఉంటే వాళ్ళకు అపజయం అనేది కలగదు అని చెప్పాడు. అప్పడినుండి రాజు ఆ వజ్రాన్ని తన పూజ గదిలో ఉంచి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొనేవాడు. వజ్రం గురించి తెలిసిన చంద్రసేనుడు నాగమణిని దొంగిలించాలనే దుర్బుద్ధి కలిగింది. ఒకరోజు రాత్రి చంద్రసేనుడు నాగమణిని రహస్యంగా దొంగిలించి ఒకచోట దాచాడు. మరుసటి రోజు రాజుకు వజ్రం కనిపించకపోయేసరికి చాలా దిగ్బ్రాంతికి లోనయ్యాడు.

వెంటనే రాజు తన మంత్రి సలహాతో రాజ మందిరంలో ఉన్న భటులతో సహా అందరినీ పిలిపించి నాగమణి దొంగిలించబడిన విషయం చెప్పాడు. దొంగ దొరకాలంటే కోటలో ఉన్న మసికుండని తాకి రావాలనీ, ఆ కుండే దొంగని పట్టిస్తుందని రాజు ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞతో రాజప్రాసాదంలోని మంత్రులు, మిత్రులు, బంధువులు అందరూ ఆ కుండ ఉన్న ప్రదేశానికి వెళ్లి ఒక్కొక్కరే ఆ కుండను తాకి వస్తున్నారు.

అందరి చేతులకు మసి అవుతున్నది. చంద్రసేనుడు కూడా అక్కడికి వెళ్ళాడు. మహిమగల కుండ తన గుట్టు ఎక్కడ రట్టు చేస్తుందో అని కుండను తాకకుండా వచ్చాడు. అందరి చేతులు పరిశీలించగా అందరి చేతులకు మసి అంటింది. ఒక చంద్రసేనుని చేతికిమాత్రం మసి అంటలేదు. ఆ విషయం భటులు రాజుకు తెలియజేసారు. రాజు చంద్రసేనుడే దొంగ అని గుర్తించాడు. అతను దొంగిలించిన వజ్రం తెప్పించి, తగిన శిక్ష విధించి చేరసాలలో బంధించాడు.

సేకరణ

మనసులోని నిర్మ్యాల్యం తొలగించుకొనేది ఎలా...????

మనసులోని నిర్మ్యాల్యం తొలగించుకొనేది ఎలా...????

💠🌺💠🌺💠🌺💠🌺💠


మనం నిత్యమూ ఆనందం, సుఖ సంతోషాలు కలుగాలని కోరుకుంటాము...
కానీ ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతున్నాము...
మనలోనే ఉండిన వీటికోసం ఎక్కడెక్కడికో తిరుగుతున్నాము...
రోగము వలన కలిగే బాధలు ఎక్కడ నుండి వచ్చాయి? కాశీ నుండా? రామేశ్వరం నుండా?!
అవి మన నుండియే వచ్చాయి కదా!!!
బాధలు మన నుండియే వచ్చినపుడు సుఖ సంతోషాలు కూడా మన నుండియే రావాలి కానీ ఎక్కడో బయట నుండి ఎలా వస్తాయి!??

కాలికి ముల్లు గుచ్చుకుంటె బాధ అంటున్నాం.
అదే రోడ్ మీద ఐదు వందల నోటు దొరికితే సంతోషిస్తున్నాము...
అంటే సుఖ దుఃఖాలు దొరికే వస్తువు బట్టి మనలో నుండియే వస్తున్నాయి కదా!
అంటే బాధలు, సంతోషాలు అన్నీ మనలోనే ఉన్నాయి.
మరి మనలో ఉండిన వాటికోసం బయట ఎందుకు వెతకడం?!

ఇది కేవలము భ్రమ, నిజమునకు మనలో లేనిదేది బయట లేదు.
పాలలో అంతరముగా ఉన్న వెన్న రావాలంటే కవ్వం పెట్టి చిలకాలి.
అలానే మనస్సును భగవన్నామము అనే కవ్వం పెట్టి చిలికితే అపుడు అనందమనే వెన్న రావడం జరుగుతుంది.

లోపల సాధన చేయనిదే బయట తిరుగుతూ అది కావాలి ఇది కావాలి అంటే ఏమొస్తుంది?!.

"మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు, మనోమూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు. మనోమూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది."
దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని
లోపల ఆత్మయే దైవం.

భగవంతుడ్ని చిత్రాలలో వెతకొద్దు చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు.

దీనిని బట్టి మనకి తెలుస్తుందేమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ మనకి కానరావడం
లేదు.
ఎందుకనీ?
మన మనస్సులో ఉన్న మాలిన్యాల వలన.!
మనలో ఉన్న దేవుడు కనబడకపోవడానికి ప్రధాన
కారణాలు రెండే రెండు తలంపులు!

మొదటిది ' నేను' అనే తలంపు.
రెండవది ' నాది' అన్న తలంపు.

మొదటిది అహంకారం, రెండవది మమకారం!
ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.

మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని
పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి..
ఎలా?

ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని పూజగదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి
చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనోమాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమును నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి.
(కర్తృత్వ భావనను తొలగించుకోవాలి).

మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యమును తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి ఆరుఅడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించాలి.

సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదవగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాల ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది.

మనస్సునూ, బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియా
లను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే, మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం.

మనలో అనేక బలహీనతలుంటాయి. అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి.


హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా దానిని
గురించి ఆలోచించం.

ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిధిలమవ్వక ముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి.

మానవుడు ఆనందమును అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ఒకటి ప్రేమ, రెండుజ్ఞానం. ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది🙏🤝👍🤝🙏

సేకరణ

🍁సమస్య - పరిష్కారం🍁

🍁సమస్య - పరిష్కారం🍁

✍️ మురళీ మోహన్

🪱ఒక పాము చాలా హుషారుగా పాకుతూ,దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...ఆ పాము కోతిని కాటు వేయబోయింది...భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి.
ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి...

తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన
కోతికి నిరాశే ఎదురయ్యింది...అలాగే భయంతో కూర్చుంది.అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని
అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు..
' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది..వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.దాన్ని వదిలేయి" అన్నారు ముని...కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది...ఇందులోని నీతి ఏంటంటే...

నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు...కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వెతకాలి.
అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ బంధువులు,ఎవ్వరూ నిన్ను రక్షించడానికి నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు.
ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోతారు... నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎవరిసహాయం కోసం చూడకూడదు..కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు...కష్టాన్ని మంచి పరిష్కారంలో తరిమికొట్టాలి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు..🤝🤝🤝🤝

సేకరణ

జ్ఞానం, పత్రీజీ సమాధానాలు

🔺 *పత్రీజీ సమాధానాలు* 🔺

🌹 *చాప్టర్ -- 4 :--- జ్ఞానం* 🌹


🍁 *ప్రశ్న :---* నా పెళ్ళి అయిన తర్వాత వేరే దేశానికి మకాం మార్చటంతో గత కొద్ది నెలలుగా నేనెన్నో మార్పులను ఎదుర్కొంటూ వస్తున్నాను. ఇది సుదూర తీరాలకు నన్ను నెట్టివేసినట్లుగా అన్పించింది. నేను జీవితంలో ఎలాంటి అనుభవాలు, పరిస్థితులు మరి సంబంధ బాంధవ్యాల్లో అయినా నెగ్గుకు రాగలను అని ఎంతో ఆత్మ విశ్వాసం వచ్చింది. 

నేను నేర్చుకున్నదంతా ముఖ్యంగా జీవితంలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ, దైనందిన జీవితంలోని ప్రతి పరిస్థితి, ప్రతి అనుభవం... అన్నింటినీ ఆనందంగా స్వీకరించే వాళ్ళతో కలిసి ఉండటమే అని నేను తెలుసుకుంటున్నాను.

దేన్నీ విశ్లేషించరు. తార్కికంగా ఉండరు. ఇది నాకు ఎంతో  ప్రత్యేకమైన పాఠం. కనువిప్పు కలిగించేలా ఉందని చెప్పాలి. ఇదంతా మానసిక ఆరోగ్యం పట్ల ఎలాంటి అవగాహన లేని వ్యక్తులను కలుసుకోవటం ద్వారా తెలిసింది. వాళ్ళలో కొందరు ధ్యానం చేసినప్పటికీ అదంతా కూడా ప్రార్థనల రూపంలోనే ఉంటుంది.


ప్రార్థనలతో ధ్యానాన్ని కలపటం వల్ల అనుకుంటా నాకు అంతా ఒక్కటిగానే అన్పిస్తుంది. మనం ఎలా తీసుకుంటున్నాం అన్నదే ముఖ్యం కదా ! అన్నింటినీ మించి ధ్యానం నాకు క్రమశిక్షణను నేర్పింది. ఎంతటి జ్ఞానం ఉన్నా సరే మన జీవితాల్లో ఇది లేకపోతే కనుక ఎంతో లోటుగానే ఉంటుంది కదా ! 


ఒకవేళ మన జీవితాల్లో క్రమశిక్షణ లేనట్లయితే మరి ఆ జీవితాన్ని నిజంగా ఊహించుకోలేం. నేను ఏ విధమైన క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నానంటే, ఒకచోట హాయిగా కూర్చుని, శక్తి ప్రవాహాన్నీ, నన్నూ ఒకే అంశంపైన కేంద్రీకరించటం గురించి చెప్తున్నాను. మరి ఇది నాకు ఒక వ్యాయామం వంటిది. ఇది నా అస్తిత్వం అంతా కలిసి చేసేలా నేను వ్యాయామం అన్నమాట. ఇది మానసికమైనది కాదు. ఆత్మ పరమైన వ్యాయామం అని చెప్ప వచ్చు. మరి ఇది అస్తిత్వం అంతటినీ గొప్ప సమర్థవంతంగా చేయటంలో ఎంతగానో దోహదపడుతుంది. నేనిప్పుడు ఆనందంగా ఉన్నానని చెప్పటం లేదు. నేను అనుభవించిన వేదనాభరితమైన క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి. కనుక నేను అలానే ఉన్నాను. ప్రతి మానవుడికి సహజంగా ఉండే భావోద్వేగాలన్నీ నాలోనూ ఉన్నాయి.


 విచారం, బాధ, కోపం వంటి సాధారణ మానవుల భావోద్వేగాలను నేను ఏ మాత్రం ప్రతికూల భావోద్వేగాలు అని చెప్పను. 


ఇటువంటి భావాలు అన్నింటినీ దాటి (వాటిని కలిగి ఉన్నప్పటికీ) వాటిని అధిగమించి చూడగలిగేలా ధ్యానం నాకు తోడ్పడింది. ఇంతకు ముందు నాకు ఏదైనా బాధ, దుఃఖం అన్పిస్తే తట్టుకోలేను కనుక అటువంటివేవీ నా జీవితంలో ఉండకూడదు అనే భయంతో ఉండేదాన్ని. 


ఈ బాధ నుంచి తప్పించుకుని పారిపోవటానికీ మరి దీన్ని పరిష్కరించటానికీ ఎన్నెన్నో చేసేదాన్ని. వృత్తిపరంగా రాణించాను. 


అయితే బాధ అనివార్యమైనది అని నేను కనుక్కున్నాను. ఈ ప్రపంచంలో ఉన్నంత వరకూ ఏదో ఒక రూపంలో అది తప్పక ఉంటూనే ఉంటుంది. ఈ జీవితంలో మనకి ఇవ్వబడిన పని ఏమిటంటే బాధతో స్నేహం చెయ్యటం ఎలా అనే మార్గాన్ని కనుక్కోవాలి. అదే మనందరి ప్రయాణం. ఎందుకంటే బాధ మనకు గొప్ప పాఠం నేర్పుతుంది. మరి బాధతో స్నేహం చెయ్యాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం క్రమశిక్షణతో ఉండటం అని నేను అనుకుంటున్నాను. మరి ఇదే నా ధ్యాన ప్రయాణం.


బాధను అధిగమించటానికీ, మైత్రి చెయ్యటానికీ, అవగాహన చేసుకోవటానికీ, మౌలికంగా బాధను నాలోకి అనుమతించటానికీ ధ్యానం నాకు ఇతోధికంగా తోడ్పడింది. ఇది నన్ను వికసింప చేసింది. కనుక ఇప్పుడు, ఈ క్షణంలో నేనెంతో శక్తివంతంగా ఉన్నాను. దూసుకుపోతాను అన్పిస్తోంది. నేను నిజంగా సంతోషాల కోసం ఎదురుచూడటం లేదు. ఎందుకంటే నా జీవిత లక్ష్యం అంతర శక్తిని పెంపొందించుకోవటమే అని నాకనిపిస్తోంది. నా గమ్యం అదే. ఒక వేళ అంతర శక్తి ఉందంటే దాని వెన్నంటే ఆనందాలూ వెల్లువలా వస్తాయి. నేను అది పొందాననే అనుకుంటున్నాను. ధ్యానం చెయ్యటం ద్వారా ఆ శక్తిని కలిగి ఉండటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు చెయ్యవలసింది ఏమిటంటే ఆత్మబలాన్ని కాపాడుకుంటూ సాగటం. దయచేసి నేనెక్కడైనా సరిగ్గా లేకపోతే నన్ను సరిదిద్దండి?


🍀 *పత్రీజీ :---* అవును. ధ్యానం మనం అంతర శక్తిని పెంపొందిస్తుంది. దేహ బలం కండరాల పై ఆధారపడితే, ఆత్మ బలం ధ్యానం పై ఆధార పడుతుంది. కండరాలు పెంచుకోవటానికి మీరు శారీరక వ్యాయామం చెయ్యాలి. ఆత్మ బలం పెంపొందించుకోవటానికి ధ్యానం చెయ్యాలి.


🌳 ధ్యానం అంటే మనస్సుకు క్రమశిక్షణను ఇవ్వటం. మనస్సుకు క్రమశిక్షణను ఇవ్వవలసిందే. మనస్సుకు శిక్షణను ఎలా ఇస్తారు మీరు? ధ్యానం ద్వారా, ఆలోచనలు చేయకుండా ఉండటం ద్వారా, కేవలం శ్వాస ధారను గమనించటం ద్వారా మీ మనస్సును శూన్యం చేస్తున్నారు. మనస్సుకు శిక్షణను ఇస్తున్నారు. ధ్యానం అంటేనే మనస్సుకు శిక్షణను ఇవ్వటం. మనస్సును క్రమశిక్షణలో ఉంచాలి. లేదంటే అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉంటుంది. ఎక్కడెక్కడికో వెళ్తుంది. అన్నింటిలో మునిగి పోతుంది. 


🌿 మరి మనస్సు శిక్షణ పొందాలి . అది ధ్యానమే ఇస్తుంది. నేను నలబై సంవత్సరాలుగా ప్రతి ఒక్కళ్ళకీ మానసిక శిక్షణ గురించి బోధిస్తూ ఉన్నాను. సహజమైన, సాధారణమైన శ్వాసను గమనిస్తూన్నప్పుడు మీరు మీ మనస్సుకు శిక్షణను ఇస్తారు. కనుక మీ కళ్ళు మూసుకోండి. సహజమైన శ్వాసతో ఏకంకండి. 


🌳 మనస్సు గురించి విశ్లేషణ వద్దు. కేవలం మనస్సును క్రమశిక్షణలో ఉంచాలి. చిత్త శుద్ధి లేని మనస్సు గురించి ఎన్ని విశ్లేషణలు చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు. మనస్సును సరియైన ధ్యాన సాధన ద్వారా నియంత్రణలోకి తేవాలి. ఆనాపానసతి ధ్యాన సాధన ద్వారా మనస్సు శూన్యం అయిపోతుంది. కనుక దయచేసి అందరికీ ఆనాపానసతి ధ్యానాన్ని నేర్పించండి. మీ దగ్గరకు వచ్చే మీ బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు వాళ్ళు అందరికీ ఈ విధంగా ధ్యానం నేర్పి సహాయ పడండి. వాళ్ళ మనస్సులను విశ్లేషించకండి. ఏ జంతువూ మరో జంతువును విశ్లేషించదు. మరి మనుష్యులు ఎందుకు వేరే మనుష్యులను విశ్లేషిస్తూ ఉంటారు? మనుష్యులందరూ పిచ్చి వాళ్ళు అనుకుంటాయి జంతువులన్నీ, వాస్తవానికి పిచ్చి వాళ్ళే మరి. ఒక పిచ్చి కుక్క అనేది ఉండదు. *“పిచ్చి పిల్లి”* అనేది ఉండదు. అయితే పిచ్చి వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఉంటారు. 


🌸 ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకదాన్ని విశ్లేషించుకుంటూ ఉంటారు. ఏ జంతువూ అలా చెయ్యదు. ఏ పక్షి అలా చెయ్యదు. ఏ చేపా అలా చెయ్యదు. కేవలం మనుష్యులు మాత్రమే అలా చేస్తారు. మరి ఆ విశ్లేషణతో తమకు తామే నరకాన్ని సృష్టించుకుంటారు. 


🏵️ ధ్యానం అంటే ఎలాంటి విశ్లేషణలూ చెయ్యకపోవటం. నేను నేనే. మీరు మీరే. నేను మిమ్మల్ని మీరుగా అంగీకరిస్తాను. నేను మిమ్మల్ని విశ్లేషించను. నన్ను నేనుగా అంగీకరించుకుంటాను. నన్ను నేను విశ్లేషించను. నేను ఒక మూర్ఖుడిని. అయితేనేం? నేను ఒక వెధవని. అయితే ఏంటిట? 


🌻 ఒక జంతువులా... ఒక కుక్కలా... ఒక పిల్లిలా నేను ఆనందంగా ఉంటాను. ఒక కుక్క ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంత ఆనందంగా ఉంటాను. ఒక పిల్లి ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంత ఆనందంగా ఉంటాను. ఒక చేప ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంత ఆనందంగా ఉంటాను. ఒక పక్షి ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంత ఆనందంగా ఉంటాను. 


🌿 మీరంతా కూడా పక్షిలా ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాను.  మీరంతా కూడా పిల్లిలా ఆనందంగా ఉండాలి.  అనుకుంటున్నాను. మీరంతా కూడా చేపలా ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాను. మీరంతా కూడా కుక్కలా ఆనందంగా ఉండాలి. అనుకుంటున్నాను. ఒక మనిషిలా బాధ పడకూడదు. మీకు నమస్కారములు.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



స్ఫూర్తిదాతలు

స్ఫూర్తిదాతలు

రాదు, కాదు, లేదు జరగదు, చేతకాదు, తెలియదు. ఇలాంటివి పలాయన వాదులు చెప్పే మాటలు. కాబట్టి 'దు' చివరగా ఉండే ఇలాంటి పదాలు చేదు అన్నాడొక కవి.

అవయవాలు, అవకాశాలు, అవస్థలు లాంటివన్నీ సరిగ్గా ఉన్నా ఏదో ఒక నెపం పెట్టి పనుల్ని వాయిదా వెయ్యడం, తప్పించుకోవడం లాంటివి చేస్తూంటారు చాలా మంది. పైగా తాము చేయని పనులను సమర్ధించుకోవడానికి ఏవో సాకులు చెబుతూ ఉంటారు. నిజానికి ఏ అవకాశం లేని వారు, అన్ని దారులూ మూసుకుపోయిన వారు సైతం అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించారు. "మనసుంటే మార్గం ఉంటుంది ఆలోచన ఉంటే అవకాశం కనబడుతుంది" అనే నానుడిని నిజం చేశారు.

తినగ తినగ వేప తియ్యగా అనిపించినట్టే, పాడగా పాడగా రాగం వినసొంపుగా వస్తుంది. కావలసిందల్లా 'సాధన. అది ఉంటే 'అన్ని పనులు జరుగుతాయని వేమన ఒక పద్యంలో వివరించాడు.

సుందరకాండలో సీతమ్మవారి తెలుసుకోవడం కోసం హనుమంతుడు ఎన్నో ఇక్కట్లు పడ్డాడు. అనుభవించిన వేదన, పొందిన అవమానాలు- నైరాశ్యాలు, ఆమె జాడ తెలియక పోవడంతో ప్రాణ త్యాగం చేసుకోవాలని తీసుకున్న నిర్ణయాలు... వీటన్నింటినీ అధిగమించి తనకు తానే స్ఫూర్తి పొంది సీతమ్మవారి జాడ తెలుసుకోవడంలో కృతకృత్యుడయ్యాడు.

బాలుడైన వరదరాజ్' మందబుద్ధి. గురువు చెప్పినవి ఏవీ తలకెక్కని కాదు. చదువు రాదని నిరాశ చెంది ఇంటిదారి పట్టాడు. తోవలో దాహం తీర్చుకునేందుకు నూతి దగ్గరకు వెళ్ళాడు రాపిడి వల్ల ఏర్పడిన తాళ్ల జాడలున్న నూతి గట్టు, కుండల అడుగు భాగపు రాపిడి వల్ల అరిగి జాడలు ఏర్పడ్డ రాళ్లను చూసి నేను వీటికంటే మందబుద్ధినా!' అనుకుని గురువు దగ్గరకు తిరిగి వెళ్ళి పట్టుదలతో విద్యాభ్యాసం చేశాడు. పాణినిగా పేరు మారిన అతడు సంస్కృత భాషకు ప్రామాణిక వ్యాకరణమైన 'పాణినీయం' రచించాడు.

ఏకలవ్యుడికి విద్య నేర్పడానికి నిరాకరించాడు ద్రోణుడు. అయినా ఆయన మూర్తిని ఏర్పాటు చేసుకుని దాన్నే గురువుగా నిలిపి విలువిద్యలో ప్రవీణుడయ్యాడు.

స్టీఫెన్ విలియం హాకింగ్ సుప్రసిద్ధ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. 21 ఏళ్ల వయసులో నాడీ మండలానికి సంబంధించిన జబ్బు మొదలై క్రమేపీ అతడి అవయవాలన్నీ పూర్తిగా చచ్చుబడేలా చేసింది. మెదడు మాత్రం చక్కగా పనిచేస్తూ ఉండేది. ఆ స్థితిలోనే కృష్ణబిలాలకు(బ్లాక్ హోల్) సంబంధించిన అనేక అంశాలు మొదలుకొని, సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశాడు. శరీరం కదల్చడానికి కుదరని స్థితిలోనూ చేసిన పరిశోధనా కృషి ఆయనకు ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది.

లక్కోజు సంజీవరాయ శర్మ జన్మతః అందుడు, బ్రెయిలీ లిపి కానీ, అందుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేని కాలమది. అతడి అక్క పాఠశాలలో చదివిన విషయాలను ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే, వాటిని విని, గుర్తు పెట్టుకుని, గణితంలో అపార విజ్ఞానం సాధించాడు. గణిత మేధావిగా గణనకెక్కాడు. ఇలా... ఎన్నెన్నో ఉదంతాలు, ఉదాహరణలు ఇవన్నీ అమిత స్ఫూర్తి దాయకాలు.

- అయ్యగారి శ్రీనివాసరావు

సేకరణ

యాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన వలన ఆధ్యాత్మిక ప్రయోజనం లభిస్తుందా ?

💖💖💖
💖💖 "263" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼

"యాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన వలన ఆధ్యాత్మిక ప్రయోజనం లభిస్తుందా ?"


"మనం పుణ్యక్షేత్రాలకు తిరిగేది కూడా ఆలోచనలు తగ్గించుకోడానికే ! మనకి రోజూ ఉండే పనులు పుణ్యక్షేత్రాల్లో ఉండవు. కనుక ఆ పనులకు సంబంధించిన ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. మన మనసుకు వ్యాపకాలు అలవాటయ్యాయి. అందుకే ఇతర ఊళ్ళకు వెళ్ళినప్పుడు కలిగే శాంతిని కూడా బోర్ (విసుగు)గా భావిస్తాం. పుణ్యక్షేత్రాల్లో ఉన్నప్పుడు మనకి ఆలోచనలు తగ్గినందువల్ల వచ్చే ఆనందాన్ని అనుభవించాలి. పుణ్యక్షేత్రాల్లో కూడా ఏసి గదులకోసం, మంచి భోజనం కోసం వెతుక్కుంటే అది మన ఇంటితో సమానమే. ఒక అప్పు తీర్చేందుకు మరోక అప్పుచేస్తే అప్పిచ్చినవాడు మారతాడుగానీ అప్పుమారదు. మనం భక్తితో చేసే పనులు అలాంటివి కాకూడదు. మొక్కలు తప్పుకాదు. కానీ మన భక్తికి అవి మాత్రమే లక్ష్యం కాదు. వ్రతదీక్షలు మన కోర్కెలను ఆపటానికి ఆలంబనగా ఉండాలి !"

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
🌼💖🌼💖🌼
🌼🕉🌼


సేకరణ

ప్రాణాయామం, నామజపం ఫలితాలు ఏవిధంగా లభిస్తాయి ?

💖💖💖
💖💖 "262" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼

"ప్రాణాయామం, నామజపం ఫలితాలు ఏవిధంగా లభిస్తాయి ?"


మనసుకు శీలం అలవర్చకుండా చేసే ధ్యాన ప్రయత్నం కేవలం యాంత్రిక ప్రక్రియ మాత్రమే. ప్రాణాయామమైనా, శ్వాసమీద ధ్యాస అయినా, నామజపమైనా మనసు అనే రథానికి వేసే కళ్ళెం లాంటివి. అదే ప్రయాణం కాదు. అంతర్ ప్రయాణాన్ని సజావుగా సాగించే ఉపకరణాలు మాత్రమే. ధ్యాన విధానాలు ఎంత మంచివైనా మనకి సచ్ఛీలం అనే అర్హత అవసరం. మాటవినని పిల్లవాడిని తల్లిదండ్రులు హాస్టల్కి పంపుతారు. నేరం చేసిన వ్యక్తిని చట్టం జైలుకు పంపుతుంది. ఇదంతా మనోప్రవృత్తి మారటానికే. అలాగే ప్రతి సాధనా ప్రక్రియ మనలో సద్గుణాలను పెంచి శాంతిని అందించేందుకే. శాంతిని కాకుండా ఇతర ప్రలోభాలను ఎరగా చూపే సాధనా ప్రక్రియలు ఆధ్యాత్మికత అనిపించుకోవు !!

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
🌼💖🌼💖🌼
🌼🕉🌼


సేకరణ

🌷 మహాభారతంలోని కథ🌷

🎻🌹🙏మనం ఎప్పుడూ వినని కథ ఇది ...!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌹మీరు ఎవరైనా విన్నారేమో మరి నేనైతే వినలేదు...🌹

🌷మహాభారతంలోని కథ🌷

🌿ఒకసారి పాండవులు ‌ ద్రౌపతి అందరికి విందు ఏర్పాటు చేసి స్వయంగా వడ్డీస్తుండగా

🌸దుర్యోదనుడు దుస్సాసనుడు కర్ణుడు శకుని ఒక వరుసలో కూర్చుని ఉండగా
ద్రౌపతి వారికి వడ్డించడానికి రాగా ఆమెను ఎలాగైనా అవమానించాలని తలచిన దుర్యోదనుడు

🌿ఆమె దగ్గరకు రాగానే ఓ పాంచాలి ఈరోజు ఎవరి వంతు అని అడిగాడు
ఆమె ఆ మాటలకు చాలా అవమానంగా భావించి

🌸అక్కడ నుండి కన్నీళ్లతో లోపలకు పరుగు పెట్టింది
అప్పుడు అక్కడకు వచ్చిన శ్రీకృష్ణుడు
చెల్లి నేను మొత్తం చూస్తూనే ఉన్నాను నువ్వు బాధపడకు నువ్వు వెళ్లి వాళ్లకు వడ్డించు

🌿అదే ప్రశ్నను అతడు మళ్ళీ అడిగినప్పుడు దక్షుడి వంతు అని చెప్పు అన్నాడు

🌸ద్రౌపతి సరే అని చెప్పి వెళ్లి వడ్డించడంతో దుర్యోదనుడు ఏంటి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అని అడిగాడు
అప్పుడు ఆమె దక్షుడి వంతు అని చెప్పగా

🌿వణికిపోతు అక్కడ నుండి అవమానంతో లేచి వెళ్ళిపోయాడు దుర్యోదనుడు

🌸ద్రౌపతి కృష్ణుడి దగ్గరకు వచ్చి ఏంటి అన్నా ఈ మాయ అని అడిగింది
అప్పుడు కృష్ణుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు

🌿దుర్యోదనుడు తన భార్య అయిన భానుమతి ని అస్సలు పట్టించుకునేవాడు కాదు

🌸ఆమె పెళ్ళైనప్పటికీ కన్యగానే ఉండేది ఆమె ఒకరోజు మునిని ప్రార్థించగా ఆయన ఒక మూలికను ఇచ్చి ఇది పాలలో కలిపి దుర్యోదణుడికి తాగించమని చెప్పాడు

🌿ఆమె పాలతో ఎదురుచూస్తుండగా దుర్యోదనుడు మధ్యం సేవించి వచ్చి ఆమె ఇచ్చిన పాలను తాగకుండా కిందకు తోసేసాడు

🌸అప్పుడు అటుగా వచ్చిన దక్షుడు అనే పాము ఆ పాలను తాగగా ఆమె పై కోరికతో మానవరూపంలోకి మారాడు

🌿ఇది గమనించిన దుర్యోదనుడు తన భార్య పాతివ్రత్యాన్ని కాపాడడానికి దక్షుడి కాళ్ళ మీద పడి వేడుకున్నాడు
నేను ఆమె పై కోరిక పెంచుకుని రాలేదు

🌸 ఆమె కలిపిన పాలలో ఉన్న వసీకరణ మూలిక వల్ల ఆమెను పొందాలని అనుకుంటున్నాను

🌿నేను కిరాతకుడిని కాను కాని ఆమె వసీకరణం వల్ల ఆమెను వదులుకోలేను కనుక ప్రతి పౌర్ణమికి నేను ఆమెను వచ్చి చూస్తాను

🌸ఆమె నా పుట్టలో పాలు పోసి ప్రసన్నం చేసుకోవాలి
ఆమె పాతివ్రత్యానికి ఎటువంటి కలంకం కలగకుండా ఆ రోజు నువ్వు కూడా ఆమెతో వచ్చి నాకు నమస్కారం చేసుకోవాలి అని అన్నాడు

🌿ఆ రోజు నుండి ఇప్పటివరకు దుర్యోదనుడు దక్షుడికి భయపడి పౌర్ణమి రోజు పుట్ట దగ్గరకు వెళ్తాడు

🌸 ఈ విషయం అతడికి భానుమతికి దక్షుడికి మాత్రమే తెలుసు ఇప్పుడు నువ్వు ఆ పేరు చెప్పడంతో

🌿 అవమానంగా బావించి పరుగులు పెట్టాడు అని వివరించాడు శ్రీకృష్ణుడు......🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

సేకరణ

Monday, June 27, 2022

బ్రతకడం వేరు, జీవించడం వేరు....

 బ్రతకడం వేరు, జీవించడం వేరు. బతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది.

బంగారాన్ని ఎన్ని ముక్కలు చేసిన దాని విలువ తగ్గదు. అలాగే మంచితనంతో సంపాదించుకున్న గౌరవం కూడా ఎప్పటికి తరిగిపోదు.
"నేనే "అంతా అనుకుంటే "అహంకారం".
"మనదే "అంతా అనుకుంటే "మమకారం.
ఏమి లేదనుకుంటే "నిర్వికారం " ఒకరికి ఒకరు తోడైతే "సహకారం. ".
చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పూలు వస్తూవుంటాయి. అలాగే నీవెంతా నీతిగా బ్రతికిన కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతూవుంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవలసింది తడబడడం కాదు, నిలబడడం నేర్చుకోవాలి.
మన ఆలోచనలు ఎప్పుడు రాబోయే "భవిష్యత్ "వైపు పరుగెత్తాలి కానీ, మనతో నడవని "గతం "కోసం వేచి చూడకూడదు.
సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం,కష్టం వెనుక అవకాశం, తప్పక ఉంటుంది .

🙏లోకాసమస్తా సఖినోభవన్తు. సమస్తసన్మంళాని భవన్తు.🙏

సేకరణ

UK లో రిలీజ్ కాబోయిన The Lady of Heaven సినిమా బ్యాన్ అయిపొయింది.

 UK లో రిలీజ్ కాబోయిన The Lady of Heaven సినిమా బ్యాన్ అయిపొయింది. సినిమా హాళ్ళనుంచి వెనక్కు తీసుకోబడింది. దీనికి కారణం UK లో ఉన్న ముస్లీముల ఆందోళన. ఏమిటా ఆందోళన వెనుక ఉన్న కారణాలు?

ఫాతిమా అనే మహిళ కథ ఈ సినిమా.

ఎవరీ ఫాతిమా?

ఫాతిమా అనే ఆమె, మహమ్మద్ ప్రవక్త మొదటి భార్య ఖదీజాకు పుట్టిన కూతురు. ఈమె దాదాపుగా తన 27 వ ఏటనే చనిపోయింది. మహమ్మద్ చిన్న భార్య అయేషా తండ్రి అబూ బకర్ చేయించిన దాడిలో ఈమెకు గర్భస్రావమై ఆ గాయాలతో చిన్నవయసులోనే చనిపోయింది.

అప్పటికి మహమ్మద్ ప్రవక్త చనిపోయి ఆర్నెల్లు మాత్రమే అయింది. మహమ్మద్ చనిపోగానే, మామ అబూబకర్ వర్గానికీ, అల్లుడు ఆలీ వర్గానికీ అధికారపోరు మొదలైంది. ఆ దాడులలో మహమ్మద్ కూతురు ఫాతిమా చనిపోయింది. అంటే, ఇస్లామిక్ దౌర్జన్యాలకు బలి అయిన మొదటి మహిళ స్వయానా మహమ్మద్ ప్రవక్త కూతురే. మహమ్మద్ మామ అబూబకర్, తనకు  మనవరాలి వరసైన ఫాతిమాను చంపించాడు.

క్లుప్తంగా ఇదీ కధ. దీనిని తీసింది షియా ముస్లిం వర్గాలు. ఎందుకంటే, ఫాతిమాను వాళ్ళు గౌరవిస్తారు. అయితే, సున్నీలు దీనిని ఒప్పుకోరు. 

సింపుల్ గా చెప్పాలంటే, మహమ్మద్ మామ వర్గం షియాలు. అల్లుడి వర్గం సున్నీలు. మహమ్మద్ చనిపోయి 1400 ఏళ్ళైనా, ఈనాటికీ వీళ్ళు కొట్టుకు చస్తూనే ఉన్నారు. ప్రక్క మనుషులను చంపుతూనే ఉన్నారు. షియా సున్నీల గోల, అధికారం కోసం మామా అల్లుళ్ళ తగాదా తప్ప ఇంకేమీ కాదు.

ఈ సినిమా రిలీజ్ కాకూడదని, సున్నీ ముస్లిం వర్గాలు UK లో గొడవలు చేశాయి. వాళ్ళు చూపించిన కారణాలేమంటే, మహమ్మద్ ప్రవక్త వేషాన్ని ఒక మనిషి వేశాడట ! అది తప్పట ! సినిమాలో ఒక మనిషి వేషాన్ని మనిషి వెయ్యక, ఇంకెవరు వెయ్యాలో నాకైతే అర్ధం కాలేదు.

సరే, ఈ గొడవలు తట్టుకోలేని UK ప్రభుత్వం ఈ సినిమాను బ్యాన్ చేసేసింది. ఇంకోప్రక్కన ఇండియాలోని యూపీ, బెంగాల్ రాష్ట్రాలు తగలబడుతున్నాయి. కారణమేంటి? 56 ఏళ్ల మహమ్మద్ 9  ఏళ్ల ఆయేషాతో సంసారం చేశాడన్న వాస్తవాన్ని నూపుర్ శర్మ మాట్లాడటం దైవద్రోహం అయిపోయిందట. అందుకని రెచ్చిపోయి రోడ్లమీదకొచ్చి విధ్వంసాలు చేస్తారట ! అది జరిగిన వాస్తవమే కదా? అంటే తప్పేముంది?

చారిత్రకంగా జరిగిన విషయాలను కూర్చుని మాట్లాడి కూల్ గా డిబేట్ చెయ్యలేని వాళ్ళు మాత్రమే ఇలాంటి గొడవలు చేస్తారు. ఎందుకని? డిబేట్ మొదలుపెడితే వాళ్ళ మతంలోని డొల్ల అంతా బయటపడుతుంది కాబట్టి.

మొదటినుంచీ ఇస్లామనేది దౌర్జన్యంతో, హింసతో పెరిగిన మతం. చరిత్రను చదివిన ఏ విద్యార్థికైనా ఈ విషయం తెలుస్తుంది. అంతెందుకు? మొన్న శుక్రవారం నాడు కాందహార్ లోని మసీదులో సున్నీలు మానవబాంబును ప్రయోగించి హజారా ముస్లిమ్స్ 51 మందిని చంపేశారు. ఇదేంటి మరి? వాళ్ళు మీ సాటి ముస్లిములే కదా? వాళ్ళనెందుకు అలా చంపడం? పైగా వాళ్ళు మసీదులో ప్రార్ధనలు చేస్తున్నపుడు చంపారు. వాళ్ళు ప్రార్ధిస్తున్నదీ అల్లానే కదా? మరి చంపడం ఎందుకు? ఎందుకంటే, ఈనాటికీ వాళ్ళు రాక్షసులుగానే బ్రతుకుతున్నారు కాబట్టి. నాగరికమానవులుగా ఎంతమాత్రం బ్రతకడం లేదనడానికి నిన్నగాక మొన్న కాందహార్ లో జరిగిన ఈ సంఘటనే రుజువు.

అంటే, నీకు నచ్చకపోతే చంపడమేనా? లాజిక్ లేదా? రీజన్ లేదా? దేశపు చట్టం లేదా? ఖురాన్లో అలా చెప్పబడిందట. కాబట్టి వీళ్లకు సాటిమనిషిని చంపేసే అధికారం వచ్చిందట. ఏంటీ అరాచక మతం? 'ప్రక్కమనిషిని చంపు' అని చెప్పడానికి మహమ్మద్ ఎవరసలు?

ఇస్లామనేది ఏ దేశంలో ఉంటే అక్కడ విధ్వంసమే జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఏదో కొన్ని దేశాలలో తప్ప ముస్లిమ్స్ శాంతిగా ఎక్కడా లేరు. మళ్ళీ ఇస్లామంటే శాంతి అంటారు.

వాళ్ళ ప్రవక్త గురించీ, వాళ్ళ చరిత్ర గురించీ బాహాటంగా మాట్లాడాలంటే ఎందుకో అంత భయం? వాస్తవాలు బయటపడతాయనా? ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా వాస్తవాలను దాచడం ఎలా సాధ్యమౌతుందో మరి? సినిమాహాళ్లలో రిలీజ్ చెయ్యకపోతే, నెట్ ఫ్లిక్స్ లో చూస్తాం. OTT ప్లాట్ ఫామ్ ను ఎలా కంట్రోల్ చెయ్యగలరు ఈ దౌర్జన్యకారులు?

మా మతం గురించి ఎవరూ మాట్లాడకూడదు, అవి వాస్తవాలైనా సరే ! మేం మాత్రం ఎలాంటి దాడులైనా చేస్తాం. ఎన్ని దేశాల సంస్కృతులనైనా  నాశనం చేస్తాం. ఎన్ని కుట్రలైనా చేస్తాం. ఇదేనా ఇస్లామంటే? 

ఏది ఏమైనా, UK కి కూడా మూడిందన్నమాట ! శుభం ! ఇండియాను దోచుకున్నందుకు UK ఈ విధంగా పరిహారం చెల్లిస్తుందన్నమాట.!!

మీ

నందగోపాలవంశీకృష్ణశర్మ బి

👊👊#షబానాఅజ్మీ కి కంగనా రౌనత్ #చెప్పుదెబ్బ

 👊👊#షబానాఅజ్మీ కి కంగనా రౌనత్ #చెప్పుదెబ్బ


గడచిన ఒక దుర్గాష్టమి నాడు ( దసరా నవరాత్రి పండుగలలో ) బాలివుడ్ నటి షబానా ఆజ్మీ ఇలా ట్వీట్ చేసింది.


ఈ దుర్గాష్టమి నాడు

ఏ దుర్గకు గర్భస్రావము కాకుండు గాకా !

ఏ సరస్వతిని కూడా బడికి వెళ్ళనీయకుండా

అడ్డుపడరు గాకా ! ఏ లక్ష్మీ కూడా తన భర్త ముందు డబ్బు కోసం అడుక్కోకుండా ఉండుగాకా !

ఏ పార్వతీ కూడా కట్నం కోసం బలికాకుండాఉండుగాకా ! 

ఏ కాళి కూడా ఫైయిర్సె క్రీమ్ వ్రాసుకోకుండా

ఉండుగాకా ! "

అని హిందూ దేవతలను కించపరుస్తూ ట్వీట్

చేసింది.


దీనికి ప్రతిస్పందిస్తూ, బాలీవుడ్ నటి #కంగనారౌనత్ ఇలా రీ-ట్వీట్ చేసింది.


ఈ ఈద్ (ముస్లీముల పండుగ ) నాడు ఏ ఆయేషా కు ఆరేళ్ళ ముందే వివాహం జరగకుండు గాకా !

ఏ షాబానోకు కూడా త్రిపుల్ తలాక్ జరగకుండు గాకా !

ఏ మీనాకుమారి కూడా హలాలా హింసకు గురికాకుండు గాకా !

ఏ ఫాతిమా కూడా ఎవరికీ నాలుగో భార్యగా అవకుండా ఉండుగాకా !

ఏ షీలా కు కూడా బలవంతంగా బురఖా తగిలించకుండా ఉండుగాకా !

ఏ ఇష్రత్ కూడా టెర్రరిస్టుగా మార్చబడకుండా ఉండుగాకా ! 

ఏ ముంతాజ్ కూడా 14 మంది పిల్లలను

కనకుండా ఉండుగాకా!

అని కంగనా రౌనత్ రీ-ట్వీట్ చేసి చెప్పుదెబ్బ కొట్టింది.


పై ముస్లీం వనితలందరూ నిజజీవితంలో ఆ మత ఛాందసమునకు బలి అయినవారే.


శభాష్ ! #కంగనారౌనత్ జీ ! మిమ్మల్ని చూసి హిందూవులు గర్వపడుతున్నారు.

జిహాదీ ఆలోచన... ప్రపంచానికే పెనుముప్పు... కాదంటారా?

 జిహాదీ ఆలోచన...

ప్రపంచానికే పెనుముప్పు...
కాదంటారా?

ఇస్లాం మత వ్యాప్తి,
వాళ్ళ ప్లానింగ్ ఒక్కో స్టేజ్ లో ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం...
ఒక హార్వర్డ్ యూనివర్సిటీ
అధ్యయనానికి
క్లుప్తంగా తెలుగు అనువాదం ...

ఆ అధ్యయనం ప్రకారం ....
ఒకసారి గనక ఏదైనా దేశ జనాభాలో ముస్లిమ్స్ శాతం 16 శాతాన్ని దాటితే
ఇక ఆ దేశం ఏదో ఒక రోజు పూర్తి
ఇస్లామిక్ దేశంగా మారటం తథ్యం ...
వంద లేదా నూట యాభై ఏళ్ళ లోపు
దశలవారీగా ఇది జరిగిపోతుంది .

ప్రత్యక్ష ఉదాహరణలు :

ఒకప్పుడు క్రిస్టియన్ దేశాలైన టర్కీ ,
ఈజిప్టు, సిరియా ....

ఒకప్పటి హిందూ దేశమైన పాకిస్తాన్ ...
ఒకప్పటి బౌద్ధ దేశమైన ఆఫ్గనిస్తాన్ ....
ఒకప్పటి జొరాష్ట్రియన్ దేశమైన ఇరాన్ ....
ఇవన్నీ నేడు ఇస్లామిక్ దేశాలు ...

🔥 మొదటి దశ :
ముస్లిం జనాభా 2 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడు :
వాళ్ళు శాంతికాముక మతంలా నటిస్తూ
అందరితో కలిసి ఉంటారు ( ఉదాహరణకు అమెరికా , ఆస్ట్రేలియా , కెనడా, చైనా , ఇటలీ , నార్వే )

🔥 రెండో దశ :
వీళ్ళ జనాభా 2 నుండి 5 శాతానికి పెరిగిన తర్వాత :
వీళ్ళు ఆయా దేశాల్లో బాగా వెనుకబడిన ఇతరజాతులనుండి , చెరసాలల నుండి , వీధి రౌడీలగ్యాంగ్స్ నుండి వేల సంఖ్యలో జనాలను తమలో చేర్చుకుంటారు.
( ఉదాహరణకు డెన్మార్క్ ,జర్మనీ, బ్రిటన్,
స్పెయిన్ , థాయిలాండ్ )

🔥 మూడో దశ :
వీళ్ళ జనాభా 5 శాతం
కన్నా పెరిగిన తర్వాత :
వీళ్లకు కావాల్సినవి డిమాండ్ చేయటం
మొదలు పెడతారు ...
హలాల్ ఫుడ్ లాంటివి ... డిమాండ్స్ తీర్చకపోతే
దాడులకు , బెదిరింపులకు తెగబడతారు ..
వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో తమ సొంత షరియా చట్టాలు ఉండాలని డిమాండ్ కూడా మొదలు పెడతారు ( ఉదాహరణకు ఫ్రాన్స్ , ఫిలిపీన్స్ , స్వీడెన్ స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ , ట్రినిడాడ్ టుబాగో )

🔥 నాలుగో దశ :
వీళ్ళ జనాభా పది శాతం దాటిన తర్వాత :
ఆయా దేశాల్లో ప్రభుత్వ నిర్ణయాలకు
వ్యతిరేకంగా చిన్న విషయాలను కూడా
మతంతో ముడిపెట్టి పెద్దఎత్తున గొడవలు , లూటీలు , దహనాలకు పాల్పడతారు
( ఉదాహరణకు గయానా , ఇండియా , ఇజ్రాయెల్ , కెన్యా , రష్యా )

🔥 ఐదో దశ :
వీళ్ళ జనాభా 20 శాతం
దాటిన తర్వాత :
ఉగ్రవాదుల గ్రూప్స్ తయారవుతాయి ...
హత్యలు, బాంబు దాడులు , మెజారిటీ
మతానికి సంబంధించిన ప్రార్ధనా
మందిరాల పేల్చివేత ... ( ఉదాహరణకు ఇథియోపియా )

🔥 ఆరో దశ :
వీళ్ళ జనాభా 40 శాతం
దాటిన తర్వాత :

భారీ ఎత్తున మారణహోమం , తరచూ జరిగే భారీ ఉగ్రవాద దాడులు
( ఉదాహరణకు బోస్నియా , చాద్ , లెబనాన్ )

🔥 ఏడో దశ :
వీళ్ళ జనాభా 60 శాతం
దాటిన తర్వాత :
ఇస్లాంను అంగీకరించని వారిని షరియా చట్టం లాంటి వాటిని ఉపయోగించి
సామూహికంగా అంతమొందించడం ,
జిజ్యా లాంటి పన్నులు వేసి వారిని
వేధించటం ( ఉదాహరణకు
అల్బేనియా , మలేసియా , ఖతార్ ,
సుడాన్ )

🔥 ఎనిమిదో దశ :
వీళ్ళ జనాభా 80 శాతం దాటిన తర్వాత :
ఇస్లాంను అంగీకరించని వారిని
ప్రతిరోజూ అంతమొందించటం ,
నూరు శాతం ఇస్లాం దేశంగా మారటమే
ధ్యేయంగా ఇతరులను
తరిమి కొట్టటం ( ఉదాహరణకు బాంగ్లాదేశ్ , ఈజిప్టు , గాజా , ఇండోనేషియా , ఇరాన్ , ఇరాక్ , జోర్డాన్, మొరాకో , పాకిస్తాన్, పాలస్తీనా, సిరియా , తజికిస్థాన్ , టర్కీ , యూఏఈ )

🔥 తొమ్మిదో దశ :
వీళ్ళ జనాభా 100
శాతమయ్యాక :
అందరూ ముస్లిమ్స్ కదా ...
ఇకమీదట శాంతియుతంగా ఉంటారా అంటే ...
అదీ జరగదు ....
సున్నీ లు షియాలను చంపడం , అతివాద ఇస్లాం మాత్రమే ఉండాలని మితవాద ఇస్లాంను
అణచివేయటం జరుగుతూ ఉంటాయి
( ఉదాహరణకు ఆఫ్గనిస్తాన్ , సౌదీ అరేబియా , సోమాలియా , యెమెన్ )

కొసమెరుపు : 🔥
ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు 25శాతం ఉన్న వీళ్ల జనాభా ఈ శతాబ్దం
అంతానికి 50 శాతం దాటటం ఖాయం ...
కారణం ...
మిగిలిన ఇతర మతాలు
అన్నిటినీ కలిపినా ముస్లిం జననాల
సంఖ్యకు సమీపంలోకి కూడా రాలేవు ...

కాబట్టి ....
సెక్యులరిజం పేరుతో త్వరత్వరగా మన గొయ్యి మనమే
తీసేసుకుందామా ...
లేక కాస్త
అవగాహన పెంచుకుని అందుకు
తగ్గ ప్రభుత్వాలను ఎన్నుకుని మన
గొయ్యితీసే కార్యక్రమాన్ని కొన్ని దశాబ్దాలపాటు
వాయిదా వేద్దామా ?
నిర్ణయం మనదే ..

జై హింద్ 🙏🙏🙏

ఓ హిందూ మేలుకో.....

సేకరణ

నేటి చిట్టి కథ

 ✍️........ 🌻 *నేటి చిట్టి కథ🌻*


🥀పూర్వం ఓ గ్రామంలో ఒక లక్షాధికారి ఉండేవాడు. అతడికి ఒక్కగానొక్క కొడుకు. గారాబంగా పెరిగాడు. చెడు సావాసాలతో కొరకరాని కొయ్యలా తయారయ్యాడు.


🥀కొడుకు బుద్ధి మార్చాలని తండ్రి ఎంతో ప్రయత్నించాడు. అయినా అతడి తీరు మారలేదు. 


🥀రోజులు గడుస్తున్నాయి. లక్షాధికారికి ముసలితనం వచ్చింది. కొడుకేమో ఆస్తిని నాశనం చేయసాగాడు.


🥀కొడుకును దారిలో పెట్టడానికి ఒక ఉపాయం ఆలోచించాడు తండ్రి. తన ఆస్తినంతటినీ అమ్మి.. బంగారం, వజ్రాల రూపంలోకి మార్చాడు. వాటిని రెండు రాగి బిందెల్లో ఉంచి.. ఎవరికీ తెలియకుండా పెరట్లో ఒక చోట గోతి తవ్వి అందులో దాచిపెట్టాడు. 


🥀కొన్నాళ్లకు లక్షాధికారి మరణించాడు. రోజులు గడుస్తున్నా కొద్దీ కొడుకు పరిస్థితి దీనంగా తయారైంది. తిండి లేక పస్తులుండే పరిస్థితి దాపురించింది. తనకు ఎవరూ సాయం చేయరని అర్థమైంది. చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు. ‘నాన్న మాట విని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా!’ అని బాధపడేవాడు. 


🥀జీవితం నేర్పిన పాఠాలతో మనిషి పూర్తిగా మారిపోయాడు. కష్టపడి పని చేయసాగాడు. నలుగురిలో మంచివాడు అన్న గుర్తింపు తెచ్చుకున్నాడు.


🥀ఇలా ఉండగా, ఒకరోజు.. లక్షాధికారి స్నేహితుడు ఒకరు వీళ్లింటికి వచ్చాడు. ‘నాయనా! మీ తండ్రి గొప్పవాడు. ఎంతో కష్టపడి ఆస్తి సంపాదించాడు. నువ్వు ఇలా కష్టపడటం నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. ఈ ఇల్లు అమ్మివేసి ఏదైనా వ్యాపారం చేసుకో!’ అన్నాడు.


🥀దానికి అతడు..అయ్యా! మా నాన్న సంపాదించిందంతా నేను నాశనం చేశాను. ఈ ఇల్లు ఒక్కటే మిగిలింది. ఇది వారి జ్ఞాపకం. ఇల్లు అమ్మలేను. ఇకమీదట నా కష్టం మీద నేను బతుకుతాను’ అని బదులిచ్చాడు.


🥀ఆ మాటలు విన్న పెద్ద మనిషి ఎంతో సంతోషించాడు. ‘బాబూ! ఈ రోజు కోసమే మీ నాన్న ఎదురు చూశాడు. ఇక నీకు కష్టాలు ఉండవు. మీ పెరట్లో మీ నాన్న బంగారం, వజ్రాలు దాచి పెట్టాడు. వాటిని వెలికి తీసి.. ఏదైనా వ్యాపారం మొదలుపెట్టు. వృద్ధిలోకి రా!’ అని దీవించి వెళ్లిపోయాడు.

 

🥀ఆ స్నేహితుడు చెప్పిన చోట తవ్వాడు. రెండు బిందెల బంగారం, వంద వజ్రాలు దొరికాయి. ఎంతో సంతోషించాడు. కొంత బంగారం అమ్మి వ్యాపారం మొదలుపెట్టాడు. నిబద్ధతతో పని చేసి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు.


ఈ కథ మనుషులందరికీ వర్తిస్తుంది. ఇక్కడ కలిమి (ఆత్మ) అందరికీ ఉంటుంది. అది గుర్తించకుండా... దారిద్య్రం (దుఃఖం) అనుభవిస్తుంటాం. 


🥀ఆ కలిమి ఉనికిని కనుగొన్న నాడు.. దారిద్ర్యాన్ని అధిగమించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలుగుతాం.

 


☘️☘️🌼🌼🌼🌺🌼🌼🌼☘️☘️

ఋషులు తపశ్శక్తితో దర్శించి, ఏర్పర్చిన ఆచారాల వెనుక దాగివున్న విజ్ఞానాన్ని అర్థంచేసుకోలేకా అవన్నీ 'చాదస్తం' అని వెక్కిరించేవారికి ఈ వ్యాసం

 ఋషులు తపశ్శక్తితో దర్శించి, ఏర్పర్చిన ఆచారాల వెనుక దాగివున్న విజ్ఞానాన్ని అర్థంచేసుకోలేకా అవన్నీ 'చాదస్తం' అని వెక్కిరించేవారికి ఈ వ్యాసం ఒక గుణపాఠం.....


“లాభాల్లోకల్లా గొప్ప లాభం ఏమిటి?" అని యక్షుడు ప్రశ్నిస్తే "ఆరోగ్యం" అని సమాధానమిచ్చాడు ధర్మరాజు.

అనారోగ్యం, దరిద్రం - లేకపోవడమే గొప్పజీవితం... అని పెద్దల మాట. అటువంటి జీవితాన్ని ఆశిచడం, దానికోసం సాధన చేయడంలో ఏ దోషమూ లేదు.

ఎంత ప్రయత్నించినా మన చేతిలో లేనివి కొన్ని ఎలాగూ ఉంటాయి. మన నియంత్రణకందని స్థితిగతులు, ఎలా ఉన్నా మనం జాగ్రత్తపడి బాగు చేసుకోగలిగేవి చాలా ఉంటాయి.

మన చేతుల్లో ఉన్నవి చాలా ఉన్నాయి. వాటిని సాధించగలిగితే జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. చేయి దాటిన వాటి విషయంలో 'ప్రారబ్ధం' అని సర్దిపెట్టుకోవచ్చు.

'ఆరోగ్యం' అంటే కేవలం దేహసంబంధమైనదిగా కాక, మనస్సంబంధి కూడా అని గ్రహించాలి. శరీర సంబంధమైన 'వ్యాధి'కీ, మనసుకి చెందిన 'ఆధి'కీ అనుబంధం కూడా ఉంది. ఒక దాని ప్రభావం మరొక దానిపై ఉండితీరుతుంది.

విచక్షణ, విజ్ఞానం, ఉద్రేకాల్ని నిగ్రహించడం వంటివి మానసిక స్వస్థతకి ముఖ్యం. సరియైన ఆహారవిహారాలు, ఆచారవ్యవహారాలు దైహిక స్వాస్థ్యానికి ప్రధానం.

ఈ రెండింటికీ తగిన నియమబద్ధ జీవనం ప్రధాన సాధన. ఆ విధమైన జీవన విధానాలనే మన ధర్మం బోధించింది. ధార్మికమైన జీవన విధానంలో మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నడిపే సూత్రాలు ఇమిడి ఉన్నాయి.

అన్ని విధాలా స్వస్థత కలవాడు ఆధ్యాత్మికంగా ఔన్నత్యాన్ని సాధించగలడు.

● సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, ఎక్కువసేపు రాత్రి మెలకువగా ఉండకుండా నిద్రపోవడం... మొదటి మెట్టుగా నిర్ధారించారు మనవాళ్ళు. పగటి నిద్రను శాస్త్రం మంచి అలవాటుగా ఒప్పుకోలేదు.

● మన పూజల్లో, అనుష్ఠానాల్లోనే పద్మాసనం, అర్థ పద్మాసనం, ప్రాణాయామం లాంటి యోగ వ్యాయామ పద్ధతులను నిబద్ధించారు.

● పెద్దలు నిర్ధారించిన మంత్రజపాలు, స్తోత్రానుష్ఠానాలు కూడా మనలో సానుకూల స్పందనలను ఏర్పరచే శక్తి గలవేనవి - వైజ్ఞానిక శోధనలు కూడా ఋజువు చేస్తున్నాయి.

● రాగద్వేషాలను నిగ్రహించుకోవడం, వైరాగ్యం, ఆశల తీవ్రతని నియంత్రించడం వంటి వేదాంత దృక్పథం మానసిక సమతుల్యానికి మార్గం.

● సాత్వికమై, నియమం కలిగిన, సకాల భోజనం - శాస్త్రం నిర్ధేశించింది. భోజనాల నడిమి చిరుతిళ్లను, రాజసతామసాహారాలను నిషేధించింది. ఇవన్నీ ఆయురారోగ్యాలను పెంచే విధానాలు.

● శరీరాల, పరిసరాల పరిశుభ్రతను 'శౌచం' పేరుతో నియమించింది శాస్త్రం. ఇవన్నీ మనశరీరాలను దృఢంగా, శాంతంగా, నిబ్బరంగా ఉంచగలిగే పద్ధతులు.

● ఆహార విషయంలో మనవాళ్ళు పెట్టిన నియమాలు అన్నీ యిన్నీ కాదు. అవన్నీ విజ్ఞానానికి విరుద్ధాలు కావు. లోతుగా ఆలోచించలేక, క్రమశిక్షణను అంగీకరించలేని అలసత్వంతో వాటిని 'చాదస్తాలు' అని కొట్టి పారేయడం మన ప్రగతికే అవరోధం.

"మనిషికి నూరేళ్ళ ఆయువును శాస్త్రం పేర్కొంది. కానీ అందరూ అన్ని ఏళ్ళు బ్రతకడం లేదు. కారణమేమిటి? " అని ధర్మరాజు ప్రశ్నించాడు.

"అనాచారం, దురాచారమే అల్పాయువుకీ, అనారోగ్యానికి హేతువులు" అని భీష్ముడు వివరించాడు.

రోగ నివారణ కంటే, రోగం రాకుండా నియంత్రణ చాలా మేలు అని సూక్తి. ప్రాచీన పద్ధతుల్లో నియమబద్ధమైన జీవితం గడిపిన, గడుపుతున్న ఆచారవంతుల జీవితాల్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమౌతుంది.

వీటన్నిటికీ తోడు 'నేను స్వస్థుడిగా ఉన్నాను. నేను దేన్నైనా సాధించగలను' అనే సకారాత్మక ఆలోచనాధోరణి కలవారు, నిత్యం క్రియాశీలంగా ఉంటూ చైతన్యవంతమైన జీవితం గడిపేవారు. ఆయురారోగ్యాలను సాధించడమే కాక, నిత్యోత్సాహులై స్ఫూర్తివంతమైన వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా నిలుపగలరు. సార్థక జీవనులు కాగలరు.

నిత్య జీవన వ్యవహారంలో ఎన్నో కార్యకలాపాలు, మానసిక స్థితులు ఉంటాయి. వేటికి ఎంత ప్రాధాన్యమివ్వాలో తెలుసుకోగలిగే సంయమన స్థితి ధార్మిక జీవన గతిలో స్వాభావికంగా ఏర్పడుతుంది. ఇదే సుఖజీవన సోపానం.

[ పూజ్య గురువుగారు - ''బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు" రచించిన వ్యాసం.]


ఓం నమో నారాయణాయ🙏


🌷🕉🌷

చక్కని నీతికథ.

 చక్కని నీతికథ. 


సైన్సు మాష్టారు తొమ్మిదో తరగతి పాఠం చెప్పిన  తరువాత   సమయం మిగలడంతో పిల్లల్తో మాట్లాడారు. “సృష్టిలో ప్రతి జీవికీ ఏదోఒక  ప్రత్యేకత ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే, చిన్న ప్రాణుల నుండి కూడా నేర్చుకోడానికి మంచి లక్షణాలు కనిపిస్తాయి” అన్నారు. 


    నరేంద్ర అనే పిల్లవాడు “మాష్టారూ! నిజంగానా?”అన్నాడు  సందేహంగా.  


     “సందేహమెందుకురా? రేపెలాగూ ఆదివారమే. ప్రయత్నించి చూస్తే మీకే తెలుస్తుంది”  అన్నారు నవ్వుతూ మాష్టారు. 


 సోమవారంనాడు  పాఠశాలలో తొమ్మిదో తరగతికి  వచ్చినప్పుడు సైన్సు మాష్టారు నరేంద్రని నిలబెట్టి “నువ్వడిగిన ప్రశ్నకు జవాబు దొరికిందా?” అనడిగారు. 


“ఇంటికి వెళ్ళగానే ఆ విషయం మరచిపోయాను” అన్నాడు తల ఒంచుకుని నరేంద్ర.   


  వాడి ప్రక్కనే కూర్చున్న కార్తీక్ చెయ్యెత్తాడు. వాడిని చెప్పమన్నారు మాష్టారు.          


“ మా ఇంట్లో  పంచదార క్రింద పడింది. కాసేపటికి ఒక చీమ వచ్చి  పంచదార పలుకుని తీసుకుపోయింది. మరికొంతసేపయ్యేసరికి చీమల దండు వచ్చింది అక్కడకి.  ఒక్కో పలుకు చొప్పున దాదాపు మొత్తం పంచదారని తీసుకుపోయాయవి. వచ్చేటప్పుడు,  వెళ్ళేటప్పుడు వరుస పాటించాయి చీమలు. అవెళ్లే దారిలో  గిన్నె అడ్డుపెట్టాను.  ప్రక్కనుండి వెళ్లిపోయాయి తప్ప ఆగలేదు చీమలు” అన్నాడు కార్తీక్ . 


“నీకేం  అర్థమైంది?” అనడిగారు మాష్టారు. 

పిల్లలంతా కార్తీక్ వైపు ఆసక్తిగా చూసారు. 

“ఆహారం ఎక్కడుందో చీమలు త్వరగా గుర్తుపడతాయని, వరుస పధ్ధతిని  పాటిస్తాయని, దారిలో ఏదైనా అడ్డం వస్తే ఆగిపోవని, ఐకమత్యంగా ఉంటాయని తెలిసింద”న్నాడు వాడు.  


 “బాగా చెప్పావు” అని మెచ్చుకున్నారు మాష్టారు.    


“ఇంకెవరైనా?” అని మాష్టారు అడగ్గానే రాము నిలబడి  “మా  దొడ్లో  జామచెట్టు ఉంది. కాయలు కోద్దామని వెళ్లేసరికి ఒక  సాలీడు గూడు అల్లుతూ కనిపించింది. గూడు కట్టే ప్రయత్నంలో  అది జారి క్రింద పడిపోతుండేది. ఒకసారి  పెద్దగా  గాలి వీచింది. దాంతో దారం తెగిపోయింది. మరోసారి  చిన్న  కొమ్మ విరిగడంతో  దారం తెగి క్రిందపడింది. అలా ఆటంకాలు వచ్చినా పట్టు వదల్లేదది. చాలా సార్లు క్రిందపడినా ప్రయత్నం వదలకుండా ప్రయత్నించి చక్కని గూడు కట్టుకుని దర్జాగా అందులో  ఇమిడిపోయింది సాలీడు ” అన్నాడు. 


“  నీకేం అర్ధమైందో చెప్పు?” అనడిగారు మాష్టారు. 

“ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆటంకాలు వచ్చినా ఆగిపోకూడదని,  ఎన్ని  ప్రయత్నాలు చేసైనా సరే పని పూర్తి చెయ్యాలని” అన్నాడు రాము.


 బాగా చెప్పావని రాముని మెచ్చుకున్నారు మాష్టారు. 


ఈసారి మాష్టారు అడగక ముందే రవి నిలబడ్డాడు.  ‘నేనూ ఒకటి చెబుతానంటూ’ మొదలుపెట్టాడు.


  “ మా పెరట్లో  పూలమొక్కలే కాకుండా  జామ, దానిమ్మ , వేపచెట్లున్నాయి. వేపచెట్టు కొమ్మల్లో తేనెటీగలు  తేనెపట్టుని  పెట్టాయి. అక్కడ నుండి  తేనెటీగలు వచ్చి పువ్వుల  మీద వాలాయి. ఒక్కో పువ్వునుండి మకరందాన్ని నోటిలోకి తీసుకొని ఝమ్మని ఎగురుతూ  తేనెపట్టులో దాచేసి  మళ్ళీ వచ్చేవి. ఇంకో పువ్వు మీద వాలేవి. అలా రోజంతా ఎగురుతూనే ఉన్నాయి. మకరందం తీసుకెళ్తూనే ఉన్నాయి” అన్నాడు.   


“నీకేం అర్ధమైందని“ వాడిని అడిగారు మాష్టారు. 


“తేనెటీగలకి  బద్ధకం లేదని తెలిసింది. మనం కూడా రోజంతా కష్టపడి ఉత్సాహంగా పనిచేసినప్పుడే కలిగే ఫలితం తేనెలాగా తియ్యగా ఉంటుందని బోధపడింది” అన్నాడు రవి.  

 

మాష్టారు  “పిల్లలూ! నరేంద్ర అడగబట్టే  కదా వీళ్ళ  ముగ్గురూ  తెలుసుకున్న విషయాలను  మనతో చెప్పారు.  దీన్ని బట్టి  ప్రశ్నించడం అలవాటు  చేసుకోవాలని తెలిసింది కదా. వాళ్ళ ముగ్గురూ చెప్పినట్టు మనుషులు కూడా  ‘చీమల్లా ఐకమత్యంగా ఉండాలి.  కష్టపడి పని చెయ్యాలి.  తలో దారిలో వెళ్లకుండా ఒకే మాట, ఒకే బాటన్నట్టు ఉండాలి.  పనిలో  అడ్డంకులు వచ్చినా వదిలేయకుండా మరో ప్రయత్నం చెయ్యాలని, పూర్తయ్యేవరకు సాలీడులా  పట్టు విడువకూడదని తెలిసింది. తేనెటీగల విషయానికి వస్తే  అవి కష్టపడి తేనె పట్టు పెట్టినా తేనెను త్రాగలేవు. మనుషులే  వాడుకుంటారు. మనం కూడా ప్రక్కవారికి ఉపయోగపడే పనులు చేస్తుండాలని గ్రహించాలి. మీరు శ్రద్ధగా గమనిస్తే  మిగతా జీవుల్లో కూడా   మంచి లక్షణాలెన్నో కనిపిస్తాయి”  అన్నారు. 


పిల్లలంతా సంతోషంగా చప్పట్లు కొట్టి “అర్ధమైంది మాస్టారు. మేము కూడా మాలో మంచి లక్షణాలు పెంచుకుంటాము” అన్నారు ఏకకంఠంతో.


సేకరణ. మానస సరోవరం 👏