💥జ్ఞాన దీపం🪔
చిమ్మచీకట్లో నడుస్తున్నప్పుడు దారి కనిపించదు. అప్పుడే దీపం అవసరమేమిటో గుర్తుకొస్తుంది. అలాగే జీవితం అంధకారమయంగా మారినప్పుడు దిక్కు తోచదు. ఎటువెళ్లాలో ఒక పట్టాన తెలియదు. ఏ ఆలోచనా తట్టదు. అప్పుడూ దీపమే కావాలి. హృదయంలో వెలిగే దీపమది. అదే ‘జ్ఞాన దీపం’!
లోకంలో భౌతికంగా కాంతులీనే దీపాలకు ఆది, అంతం ఉంటాయి. మనిషిలో అంతర్లీనంగా వెలిగే దీపానికి ముగింపు ఉండదు. అది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది.
పగలు, రాత్రి- సుఖదుఃఖాలకు ప్రతీకలు. సుఖం కలిగినప్పుడు సంతోషించడం, అది లేనప్పుడు దుఃఖించడం అతి సామాన్యులు చేసే పని. ప్రాజ్ఞులు అలా కాదు.ు. సుఖదుఃఖాల్లోనూ ఒకే తీరుతో (ఆనందం) వ్యవహరిస్తారు. జ్ఞానసిద్ధి పొందినవారిని ‘బుద్ధుడు’ అంటారు. అతడు ఎప్పుడూ వెలుగులోనే ఉంటాడు. చీకటి అతడి దరి చేరదు. అజ్ఞానం అంటే, చీకటి. జ్ఞానం అంటే, వెలుగు. వెలుగు ఉన్నచోట చీకటికి తావు లేదు. అజ్ఞానం వల్లనే దుఃఖం కలుగుతుంది. జ్ఞానంతో అది తొలగిపోతుంది.
చీకటి వెలుగులు- ప్రకృతి సహజాతాలు. అవి వస్తాయి, పోతాయి. కేవలం ప్రాకృతిక వెలుగు మీదనే ఆధారపడితే, పరాధీనులై మిగిలిపోతారు. సహజమైన వెలుగు వచ్చేంతవరకు, వారు చీకట్లో జీవనం గడపాల్సి వస్తుంది. మనిషి తానే ఒక వెలుగైతే, స్వతంత్రుడిగా మారతాడు. జ్ఞానం పట్ల ప్రేమ పెంచుకోవడం వల్లనే, మానవుడు విద్యుద్దీపాన్ని కనుగొన్నాడు.
జ్ఞానం అనేది రెండు ముఖాలున్న నాణెం వంటిది. ఒక ముఖంతో బయటకు చూస్తే, విజ్ఞాన ఫలితంగా కొత్తవాటిని కనిపెట్టే శాస్త్రవేత్త అవుతాడు. మరో ముఖంతో లోపలికి చూసుకుంటే, జీవన రహస్యాలు విప్పిచెప్పగల తత్వవేత్తగా ఉంటాడు. అందువల్లే పశ్చిమ దేశాలు వైజ్ఞానికంగా ఎదిగాయి. భరతఖండం ఆధ్యాత్మిక శిఖరంగా ఉన్నతీకరణ చెందింది. ప్రపంచం దృష్టిని ఎంతగానో ఆకర్షించింది.
అజ్ఞానం అనే చీకటి వల్లే అరిషడ్వర్గాలు మనసులోకి చేరతాయి. అల్లకల్లోలాన్ని, గందరగోళాన్ని అవి సృష్టిస్తాయి. ఫలితంగా మనసు దుఃఖానికి లోనవుతుంది.
చీకటి తొలగాలంటే వెలుగు కావాలి. జ్ఞానం వెలుగుతున్న దీపం వంటిది. ‘ఇంట్లో దీపం వెలుగుతుంటే, అక్కడికి ఏ దొంగా వెళ్లడు’ అని గౌతమ బుద్ధుడు బోధించేవారు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి విషయంలోనూ అంతే! ‘లోపలి దీపం’ వెలిగించుకున్న మనిషి మనసులోకి అరిషడ్వర్గాలకు చెందిన ఏ చోరుడూ ప్రవేశించలేడు.
గాలి వీస్తున్నప్పుడు దీపం వెలగదు. పరిపరి విధాలుగా సంచరించే మనసు, వీచే గాలి వంటిది. అలాంటి నిలకడ లేని మనసులో ఆత్మజ్యోతి ప్రకాశించదు. ధ్యాన సాధనతో మనసును ఉన్నతీకరించుకోవాలి. మానవ జీవితం పెట్టుబడి వంటిది. దానికి రాబడి- లోపలి దీపం వెలగడమే!!
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ