Monday, May 31, 2021

శివుడు అర్ధనారీశ్వరుడుగా ఎందుకు అవతరించవలసి వచ్చింది? ఈ అవతరణం వెనుక ఉన్న రహస్యమేమిటి?

🕉️శివుడు అర్ధనారీశ్వరుడుగా ఎందుకు అవతరించవలసి వచ్చింది? ఈ అవతరణం వెనుక ఉన్న రహస్యమేమిటి?

✍️ మురళీ మోహన్

🙏 అర్ధనారీశ్వరతత్వం మానవాళికి ఇచ్చే మహాసందేశమేమిటి? అనే విషయాలను విరించే కథ శివపురాణంలోని శతరుద్ర సంహితంలో కనిపిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడికి ఈ కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయడం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. కానీ అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవంపోస్తూ ఎంతకాలంగా తన పనిని తను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతిల్లిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రసన్నుడయ్యాడు. అయితే బ్రహ్మకు ఆ క్షణాన ప్రసన్నమైన శివుడు అంతకు ముందులా కాక ఒక తేజోవంతమైన విచిత్ర స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు.

సగం పురుషుడు, సగం స్త్రీ రూపంగల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది. పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మసృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వభాగం నుండి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్ధమైన ఒక రూపాన్ని ధరించమని తనకుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్ధించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొమ్మల మధ్య నుండి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మతపస్సు చేసి మెప్పించాడు. కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆ ఆజ్ఞను ఆమె శిరసావహించింది.

బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆలోకంలో నారీ విభాగం కల్పితమైంది. స్త్రీ, పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుండి ప్రవర్తిల్లింది. స్త్రీశక్తి సామాన్యమైనది కాదని ప్రతివారు స్త్రీమూర్తులను గౌరవించి తీరాలని ఆది దేవుడు, ఆది పరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్ధ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తిసామర్ధ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కధాసందర్భం వివరిస్తుంది. అంతేకాక సృష్టి స్థితి, లయ కారకులో సృష్టికర్తా అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన, దానివల్ల ఎక్కువ ఫలితం కలుగలేకపోయిందని పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తుంది. స్త్రీశక్తి విశిష్టతను తెలియజెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు. కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించటం కానీ, స్త్రీలను, స్త్రీ శక్తిని కించపరచటం కానీ ఎంతమాత్రమూ దైవ హితం కాదనే విషయాన్ని ఈ కధలో మనం గమనించవచ్చు.🙏

Source - Whatsapp Message

పురాణాలలో విడ్డూరాలు - నిజానిజాలు

🍁పురాణాలలో విడ్డూరాలు - నిజానిజాలు🍁
ఒక చిన్న కధ

✍️ మురళీ మోహన్

👌ఏదో చిన్న గొడవ వలన క్రీ.శ.2090లో మూడవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఇంచుమించు అన్ని బలవత్తరమైన దేశాల వద్ద అణ్వాస్త్ర సంపద వున్నాయి. అందరూ యుద్ధంలో పాల్గొని ఒకరి మీదకొకరు ఈ అస్త్రాలు సంధించుకున్నారు. కొన్ని ఉత్తర దక్షిణ ధ్రువాల మీద కూడా పడ్డాయి. అక్కడున్న మంచుకొండలన్నీ కరిగిపోయి ఒక్కసారి మొత్తం ప్రపంచమంతా జలప్రళయంలో మునిగిపోయాయి. దాదాపు అన్ని దేశాలు నీటమునిగిపోయాయి. అన్ని భవనాలు అగ్నికీలలో దగ్ధమయి తరువాత జల ప్రళయం వలన మునిగిపోయి, ఎక్కడనుండో కొట్టుకువచ్చిన మట్టితో కప్పబడిపోయాయి. ఈ భీభత్సం ఒక పది రోజులు జరిగాక మరల మామూలుగా నీరు తీసేసింది.వాతావరణం అంతా మారిపోయింది. దేవుని దయ వలన కొందరు మాత్రం ఎత్తైన కొండ గుహలలో, కొన్ని జీవ జంతుజాలం గుహలలోనో ఎక్కడో నక్కి ప్రాణం దక్కించుకున్నారు. వారు బయటకు వచ్చి చూస్తె కొత్త ప్రపంచం, మొత్తం మారిపోయి కనబడుతోంది. ఆకలేస్తోంది. వారు చెట్టులు, పుట్టలు వెతికి వారికేమైనా దొరికితే తింటూ బ్రతుకుతున్నారు. వారిలో కొంతమంది కొన్ని గుహలలోను, లేదా వారిదగ్గరున్న పుస్తకాలలోనూ వారు చూసిన ప్రపంచం గురించి రాసారు. అప్పుడు రాకెట్స్ ఉండేవని, ఎలా ఉండేవో నమూనాలు రాసుకున్నారు, దూరంగా వున్నవాళ్ళతో ఫోన్లో మాట్లాడేవారని, టీ వీలు, ఇంటర్నెట్, వగైరా, వగైరా గురించి రాసుకున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి, ఎలా చికిత్స చేసేవారో, ఆపరేషన్లు, ఇతర జీవన ఆరోగ్యం గురించి ఎన్నో రాసుకున్నారు. అవన్నీ ఒక చోట భద్రంగా దాచుకున్నారు. నేడు వారికి తిండి దొరకడమే ప్రధానం. అన్నీ పోవడంతో వారు కేవలం కొన్ని ఆకులు కప్పుకుని బతుకుతున్నారు. వారికున్న జ్ఞానంతో కొన్ని ఇళ్ళు కట్టుకున్నారు. వారి సంతానానికి విషయం చెప్పారు. కానీ తిండి కోసం వారు మరిన్ని ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.

ఇలా ఒక పది తరాలు గడచి పోయాయి. అప్పుడు వారిలో ఒకడు వీరు ముందున్న ప్రదేశానికి వచ్చాడు. అక్కడ కొన్ని పాడుబడ్డ ఆవాసాలు కనబడ్డాయి, శిధిలమై. వాటిలో వాడికొక పుస్తకం దొరికింది. దానిలో ఎలా జీవించాలో రాసుంది, అంతకు ముందు ఎలా జీవిన్చారో రాసుంది. ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ తెగలో కొంతమందికి చెప్పాడు. భగవంతుడిని ఎలా ఆరాదిన్చేవారో తెలుస్కుని, వారు కూడా ఆ పద్ధతి పాటించారు. ఇదే భూగోళానికి అటువైపు కూడా కొంత మంది బ్రతికి బట్ట కట్టారు. వాళ్ళు ఎప్పుడో వీళ్ళను కలుసుకున్నారు. వాళ్ళు వీళ్ళ దగ్గరున్న పుస్తకాలలో విషయాల గురించి విన్నారు. అప్పట్లో గాల్లో వేల్లెవారట, ఇది నమూనా అంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. తిండే దొరకని మనకు ఈ కట్టు కధలు అవసరమా అంటూ గేలి చేసారు. ఈ తెగ వాళ్ళనందరినీ పిట్టకధల దొరలూ అని ముద్ర వేసారు. వారి జీవన విధానాన్ని వెక్కిరించారు. వారి గ్రంధాలను తిట్టారు. అప్పుడు విమానాలుంటే ఇప్పుడెక్కడికి పోయాయి. ఏది నువ్వొకటి తయారు చెయ్యి అన్నారు. కానీ అప్పుడు కరెంటు లేదు, ఎలక్ట్రానిక్స్ లేదు, ఏమి లేదు. వారికి ఆ జ్ఞానం లేదు. వీళ్ళు ఇప్పుడు ఆ పుస్తకాలలో విషయాన్ని ప్రాక్టికల్ గా చూపలేకపోతున్నారు కాబట్టి వీళ్ళవన్నీ కాకమ్మ కబుర్లు అని, వీళ్ళు వట్టి వెధవలోయ్ అని ముద్ర వేసారు. అవును నిజమే అని ఈ తెగలో కొంతమంది మిగతా వారిని ఎద్దేవా చేస్తున్నారు. ఆస్తిక నాస్తిక మతాలు పుట్టాయి. ఆ పుస్తకాలు నమ్మిన వాళ్ళు వెర్రి వెంగలప్పలు నమ్మనివాళ్ళు ఆధునీకులు అని పేర్లు పెట్టుకున్నారు.

పైదంతా చదివితే మీకేమైనా గుర్తుకొస్తోందా? ఈ రోజున జరుగుతున్న విషయం స్ఫురిస్తోందా? మన వాంగ్మయంలో చెప్పారు ఒకప్పుడు పుష్పక విమానంలో విహరించారట అంటే అదొక కట్టు కధ. ఒకప్పుడు రాజ్యాలలో ఈ విధంగా రాజ్యం చేసారట అంటే మరొక పిట్ట కధ. అస్త్ర, శాస్త్రాలతో యుద్ధం చెయ్యగలిగేవారట. సమయం ఇలా గణించారు, శస్త్రచికిత్సలు చేసారు, కుంభ సంభవులు పుట్టారు అంటే ఇవన్నీ mythology అని కొట్టి పారేస్తున్నారు. మంత్రప్రభావం, ప్రాభవం ఇదంటే దాని మీద నమ్మకం లేక చింతకాయలు రాల్చమంటున్నారు. జలప్రళయం వచ్చి అందరూ మునిగిపోతే ఒక మనువు బ్రతికాడని, తరువాత ఎందరో మహర్షులు వచ్చి మనకొక జీవన విధానం నేర్పారు అని మన పురాణం చెబుతోంది.. నిత్యసత్యాలన్నీ మన వాంగ్మయంలో, గ్రంథాలలో ఉన్నాయంటే నమ్మి పాటించిన వారు ఒక 8000 ఏళ్ళ క్రితం ఎలా వుండేవారో నేడు కొన్ని తవ్వకాలలో బయట పడ్డాయి. అదే మనకు అవతలి వైపు వాళ్ళు అప్పటికి అడవి పందులు వేటాడుకుంటూ వుండేవారు కనీసం 1000 సంవత్సరాల క్రితం వరకు. కాలక్రమేణా వారు కొన్ని కనిపెట్టారు, మనం అందరం వాడుకుంటున్నాం. అది నిజం, ఇదీ నిజం. కానీ పురాతన గ్రంథాలలో ఎలా ఉండేదో అప్పటి మన మనుష్యుల జీవనం, న్యాయం, ధర్మం జీవన విధానం, శాస్త్ర దృక్పధం ఆరోగ్య పరిరక్షణ విధానం అన్నీ రాసి వుంది. దేవుడిని ఎలా చేరాలని రాసి వుంది. దాన్ని నమ్మి పట్టుకున్న మనం తప్పక సాధించగలం. కావలసినదల్లా దాని మీద నమ్మకం. వారు చెప్పిన విషయాలను పూర్తిగా అర్ధం చేసుకోగల సామర్ధ్యం కావాలి. వాటి గురించి మనం మరింత లోతుగా పరిశీలించాలి. శోధించాలి, సాధించాలి. అంతేకానీ మనకు మనం తక్కువ అంచనా వేసుకుని మనం ఆత్మన్యూనతా భావం పనికిరాదు. మన మీద, మన గ్రంథాలపై, మన పురాణాల మీద మనకు నమ్మకం, గౌరవం వుండాలి. కాదంటారా?🤔

Source - Whatsapp Message

ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది ...?

🕉️ ఉత్కృష్ట మార్గం 🕉️
🌸🌸🌸

✍️ మురళీ మోహన్

🤘"ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది ...? "

అని ఒక శిష్యుడు శ్రీరామకృష్ణుని ఒకసారి అడిగితే,
దానికి పరమహంస ఇలా జవాబు చెప్పారు.

నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు.
నీ మనసును మాత్రం
ఆ పరమాత్మునిపైనే నిలకడగా ఉంచి సాధనచెయ్యి ...

నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు ...వాళ్ళు నీకెంతో ప్రియాతిప్రియమైన
వాళ్ళుగానే వ్యవహరించు.
నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు.

ఒక ధనికుడి ఇంట్లో పనిమనిషి అన్ని పనుల్నీ అంకితభావంతో చేస్తుంది. ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది.

తన యజమాని పిల్లలకు అన్ని సేవలూ చేస్తుంది.
తన కన్నబిడ్డలన్నంత మమకారంతో వారిని సాకుతుంది.

నా బాబువి కదూ,
నా తల్లివి కదూ...
అని వాళ్ళను ప్రేమగా పిలుస్తూ తన చేత్తో ప్రియమార తినిపిస్తుంది.

కాని, ఆమెకు తెలుసు,
ఆ పిల్లలెవరూ తనవాళ్ళు కాదని.

తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా...
దాని మనస్సంతా గట్టుమీదే, తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది.

అలాగే ... నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనియ్యి.
నీ మనసును మాత్రం,
ఆ పరమాత్ముడిపైనే లగ్నం చెయ్యి.

బాల్యంలోనే దైవారాధన అనే సదాచారం నీకు అలవడకపోతే ...
సంపదలు, సౌకర్యాలు, సుఖాలు పోగేసుకునే వ్యామోహంలోపడి
ఆ పరాత్పరుణ్ని పూర్తిగా మరచిపోయే ప్రమాదం ఉంది.

సర్వసమర్థుడినన్న అహంకారం, ఆశించినవి అందటంలేదన్న దుఃఖం, అంతుపట్టని అసంతృప్తి నిన్ను పూర్తిగా ఆక్రమించుకుని అశాంతి పాలుచేసే విపత్తు పొంచి ఉంటుంది.

ప్రాపంచిక వస్తువుల్ని పోగేసుకుంటున్నకొద్దీ ...
వాటి మీద నీ యావ ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది.

పనసపండును కోసే ముందు అరచేతులకు నూనె రాసుకోవాలి.
లేకపోతే దాని పాలు బంకలా వేళ్ళను పట్టుకుని వదలదు.

అలాగే ముందు దైవప్రేమ అనే నూనెను అందిపుచ్చుకో...
ఆ తరవాతనే ప్రాపంచిక ధర్మాలను చేతపట్టు.

దైవానుగ్రహం లభించటానికి నీకంటూ ప్రత్యేకంగా కొంత ఏకాంత సమయం కావాలి.

పాల నుంచి వెన్న దొరకదు.
ముందు పాలనుకాచి పెరుగు తోడుపెట్టుకోవాలి.
తొందరపడి దాన్ని కదిపితే పెరుగు తోడుకోదు. పాలుగానే ఉండిపోతుంది.
చిక్కని పెరుగును చిలక్కొట్టిన తరవాతే వెన్న లభిస్తుంది.

ప్రపంచం నీళ్ల లాంటిది.
మనస్సు పాల లాంటిది.
పాలను నీళ్ళల్లో పోస్తే అదంతా
కలిసి ఏకమవుతుంది.
వెన్నని నీళ్ళల్లో వేస్తే అది తేలుతుంది.

అలాగే, ఆధ్యాత్మిక శిక్షణకు ఏకాంత సాధన కావాలి.
జ్ఞానమనే వెన్నను చిలికి తెచ్చుకోవాలి.
ఒకసారి అది లభించాక ప్రపంచమనే నీటిలో ఉంచినా అది కలవదు.

ఈ స్థితికి చేరుకోగలిగేదే ఉత్కృష్ట మార్గం !!🌞

🔯🔯🔯🔯🔯🔯

Source - Whatsapp Message

నేటి జీవిత సత్యాలు.

నేటి జీవిత సత్యాలు.

🌹అవకాశం ఆకాశమంత ఎత్తులో ఉన్నప్పుడు నిచ్చెన వెయ్యడం దండగ అని మూర్ఖులు అనుకుంటాడు..కానీ ఎగరాలంటే ఏమేం చెయ్యాలి అని తెలివైన వాడు ఆలోచిస్తాడు..చెయ్యాలి అనే కోరిక బలంగా ఉంటే చాలు ఓoటి కాలుతోనైన ఎవరెస్ట్ ఎక్కేయేచ్చు..

🍃🌹లక్ష్యాలు జీవితాన్ని ఆసక్తికరంగా మారిస్తే వాటిని అధిగమించడం జీవితానికి ఓ అర్థాన్ని ఇస్తుంది.

🍃🌹జ్ఞానాన్ని మించిన సంపద లేదు..సహనాన్ని మించిన ఆయుధం లేదు..విశ్వాసాన్ని మించిన భద్రత లేదు..నవ్వును మించిన ఔషధం లేదు..ఆశ్చర్యంగా ఇవన్నీ ఉచితమే..

🍃 🌹అంతా మన మంచికే అని భావిస్తే,ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా దైర్యంగా ఎదురుకోవచ్చు..

🍃🌹ఓటమి ఒంటరితనం ఈ జీవితంలో చాలా నేర్పిస్తాయి..ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే ఇంకోటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది..

🍃🌹పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు..కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారిని ఎవరూ బాగుచేయలేరు..

🌅శుభ శుభోదయం తో
మానస సరోవరం.

Source - Whatsapp Message

ఉత్తమ దృక్పథం

💥ఉత్తమ దృక్పథం
🕉️🌞🌎🏵️🌼🚩

సమాజాన్ని, నిత్యం ఎదురయ్యే అనుభవాలను మనిషి దర్శించే విధానమే దృక్పథం. పరవళ్ళు తొక్కుతున్న గోదావరి ఆనకట్ట మీదుగా రైలు ప్రయాణిస్తోంది. ఓ మహిళ వెంట తెచ్చుకున్న పసుపు, కుంకుమల్ని భక్తితో- పవిత్రమైన ఆ నీళ్ళలోకి జారవిడిచింది. పక్కనే కూర్చున్న యువకుడికి ఆమె చర్య హాస్యాస్పదంగా అనిపించింది. అతడు అల్పాహారం తిన్న తరవాత పొట్లం కట్టిన కాగితాన్ని నలిపి అదే నీళ్ళలోకి విసిరేశాడు. ఆ చర్యలు సంస్కృతీ సంప్రదాయాల ఆచరణలో వాళ్ళ దృక్పథాన్ని తెలియజేస్తాయి.
జరిగే సంఘటనలను సామాన్యులు యథాతథంగా గ్రహిస్తారు. సత్పురుషుల వ్యక్తిత్వం అందుకు విభిన్నం.శ్రీరాముడు అనేక సందర్భాల్లో సంఘటన అంతర్లీనతను గ్రహించి ఉత్తమ దృక్పథాన్ని ప్రదర్శించడం గమనించవచ్చు.
సీతా లక్ష్మణ సమేతుడై రాముడు అరణ్యాలకెళ్ళాడు. భరతుడికి ఆ విషయం ఆలస్యంగా తెలిసింది. పితృ సంస్కారాలను భారంగా పూర్తిచేశాడు. అన్న లేని అయోధ్యలో ఇక ఏమాత్రం ఉండలేక, ఆయనను అయోధ్యకు తీసుకువస్తానంటూ బయలుదేరాడు. సైన్యం, ప్రజలు భరతుడితో కలిసి ముందుకు నడిచారు. కొంత ప్రయాణం తరవాత వారు గుహుడి నివాసాన్ని సమీపించారు. భరతుడు సైన్య సమేతుడై రావడాన్ని గుహుడు దూరంనుంచే చూశాడు. రాముడికేదైనా అపకారం చెయ్యబోతున్నాడేమో అని అతడి మనసు కీడును శంకించింది. భరతుణ్ని సమీపించి తన అనుమానాన్ని వ్యక్తపరచాడు.
గుహుడి మాటలు భరతుణ్ని తీవ్రంగా బాధించాయి. తనకు తండ్రిలాంటి వాడైన శ్రీరాముడిని అరణ్యం నుంచి అయోధ్యకు తీసుకెళ్ళడానికే తాను వచ్చానని చెప్పాడు. అతడి మాటలు విని గుహుడు సంతోషించాడు. రాముడు అరణ్యానికి వెళ్ళిన మార్గాన్ని చూపించాడు. భరతుడు గుహుణ్ని కలుపుకొని ముందుకు సాగిపోయాడు.
కొంత ప్రయాణం తరవాత భరతుడు భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆ రుషి భరతుడికి అతడి పరివారానికి మంచి ఆతిథ్యం అందించాడు. కుశలప్రశ్నలడిగిన పిమ్మట భరద్వాజుడు అతడి రాకలోని ఆంతర్యాన్ని ప్రశ్నిస్తూ రామలక్ష్మణులకేదైనా అన్యాయం తలబెట్టబోతున్నావా అంటూ నిర్భయంగా, నిర్మొహమాటంగా అడిగాడు. ఆ ప్రశ్న వినడంతోనే భరతుడు దుఃఖితుడయ్యాడు. మహర్షిని సమీపించి తనకే పాపం తెలియదని విన్నవించుకున్నాడు. భరతుడి నిజాయతీని అర్థం చేసుకున్న భరద్వాజుడు అతన్ని… ఓదార్చాడు. రాముడి ఔన్నత్యాన్ని మరోమారు భరతుడికి తెలియజెప్పాడు. రామలక్ష్మణుల్ని చేరుకోవడానికి దారిని చూపించాడు.
మరికొంత దూరం ప్రయాణం చేసిన భరతుడు సీతారామలక్ష్మణులు నివసిస్తున్న చిత్రకూట పర్వతాన్ని సమీపించాడు. భరతుడు సపరివారంగా రావడంవల్ల ఆ ప్రాంతమంతా ధూళి వ్యాపించింది. లక్ష్మణుడు అందుకు కారణాన్ని అన్వేషిస్తూ చెట్టు పైకెక్కి చూశాడు.
భరతుడు సైన్యసమేతుడై రావడం కనిపించింది. భరతుడి రాక లక్ష్మణుడికి అపోహను కలిగించింది. పరుషోక్తులతో భరతుణ్ని నిందించడం ప్రారంభించాడు.
శ్రీరాముడు ఆ సందర్భంలో భరతుడి పట్ల ఔదార్యాన్ని ప్రదర్శించాడు.

లక్ష్మణుడిని వారిస్తూ భరతుడి రాక సమయోచితంగా ఉందంటూ కొనియాడాడు. అతడు వచ్చిన పిమ్మట పరుష వచనాలను ఉపయోగించ వద్దని ఆ విధంగా మాట్లాడితే అది తనను గురించి మాట్లాడినట్లే కాగలదని అన్నాడు. రాజ్యం కోసం ఆశతో ఈ విధంగా భరతుణ్ని నిందిస్తున్నావన్న భావన తనకు కలగగలదని చెప్పాడు.
ఈ విధంగా గుహుడు, భరద్వాజుడు, లక్ష్మణుడు వంటివారు శంకించిన భరతుడి వ్యక్తిత్వాన్ని శ్రీరాముడు తన దృక్పథంతో సరైన కోణంలో దర్శించాడు. అన్నదమ్ముల బంధాన్ని కలకాలం నిలుపుకోగలిగాడు.
మనందరం నకారాత్మకతను విడిచిపెట్టాలి. తోటి మనుషులపట్ల, జరిగే సంఘటనల పట్ల సరైన దృక్పథాన్ని కలిగి ఉండాలి. జీవితాన్ని ఆదర్శమయంగా తీర్చిదిద్దుకోవాలి.
ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంకలాంటి మనిషిలో కూడా వెయ్యి వంకలు కనిపిస్తాయి.

ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే వెయ్యి వంకలున్న మనిషి కూడా నెలవంక లాగా అందంగా కనిపిస్తారు. కాగితం నలిపేటపుడు చెత్తగా చూస్తాం. డబ్బయినపుడు దేవుడిగా చూస్తాం. మనమూ కాగితమే, చెత్తవడం దేవుడవడం మన స్థాయిని బట్టే ఉంటుంది*

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

Sunday, May 30, 2021

హీరాకానీ, శివాజీ వీరగాధలలోని కథ...

💥నీతి కథ💥🚩
🕉️🌞🌎🏵️🌼🚩
హీరాకానీ


శివాజీ వీరగాధలలోని కథ

దేవీ భక్తుడైన ఛత్రపతి శివాజీ ఒక రాజ్యాన్ని మాత్రమే స్థాపించలేదు. నిదురిస్తున్న కేసరముల వంటి భారతీయులలో గుండెలలో మఱిచిపోయిన ధర్మాన్ని మాతృదేశభక్తిని ప్రతిష్ఠించినాడు. ఆదర్శ పురుషుడైన శివాజీ రాజభోగాలను తృణప్రాయంగా ఎంచేవాడు. అప్పటి కాలంలోని ఇతర నవాబులవలె కాకుండా వ్యసనాలకు దూరముగా ఉండేవాడు శివాజీ.

భారతీయతత్త్వాన్ని బాగా జీర్ణించుకున్న శివాజీ తన రాజ్యాన్ని సర్వసంగ పరిత్యాగి ఐన సన్యాసికి దానంచేసి అతని ప్రతినిధిగా ప్రజాక్షేమం కోసం రాజ్యం చేశాడు. ఎప్పుడూ ప్రజలపై అధిక పన్నులు వేయలేదు. తన పట్టాభిషేకానికి కూడా తన ధనమే వినియోగించినాడు కానీ ప్రజల సొమ్ము ముట్టుకోలేదు.

శివాజీ రాయగఢ్ కోట శత్రువులకు అభేద్యంగా కట్టుదిట్టంగా ఉండేది. ప్రొద్దున ఆఱింటికి తెఱిచిన కోట తలుపులు రాత్రి తొమ్మిదిగంటలకు మూయబడుతాయి. ద్వారం మూసి ఉన్న సమయంలో చీమకూడా లోనినుండి బైటికి వెలుపల నుండీ లోనికి రాకూడదు. ఇది ఛత్రపతి శివాజీ ఆజ్ఞ. రాజ్య రక్షణార్థం ఇట్టి కట్టుదిట్టాలు తప్పలేదు. ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి తొమ్మిది తరువాత కోట ద్వారం తెఱవబడదు.

హీరాకానీ అనే గ్రామవాసి రోజూ కోటలో ఉన్న అధికారులకు సైనికులకు పాలుపోయటానికి వచ్చేది. అందఱికీ తనకు చేతనైన సహాయం చేసేది. ఇలా ఉండగా ఒక రోజు సాయంకాలం పాలుపోయటానికి కోటలోకి వచ్చింది హీరాకానీ. ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది. పురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది. ఇంటికి వెళదామని సమయంచూస్తే తొమ్మిది దాటిపోయింది. పరుగులుతీసి కోటగుమ్మం చేరింది హీరాకానీ.

కావలి వాళ్ళు హీరాకానీ చాలా మంచిది అని అభిమానం ఉన్నా రాజాజ్ఞ ధిక్కరించలేక తలుపులు తీయలేదు. “అయ్యో! ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి ఆకలివేస్తుంది. వాడికి పాలివ్వాలి” అని ప్రాధేయపడింది. హీరాకానీ మీద జాలి పడిన కావలి వాళ్ళు “తల్లీ రాజాజ్ఞ మేము మీఱలేము. ఈ ఒక్క పూటకి మీ ఆయన పాలుపడతాడులే. ఈ సైనికుని ఇంట్లోనే పడుకో. ఉదయం ఆఱవ్వంగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము” అని ఊఱడించినారు.

మఱునాడు ప్రొద్దురాగానే కావలివాళ్ళు హీరాకానీని వెదకసాగారు. ఎక్కడైనా ఆదమఱచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు. అలా వెదుకుతున్న వారికి కోటగోడ వద్ద హీరాకానీ పాల పెరుగు కుండ కనిపించింది. పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోటమీద రాయికి వ్రేలాడుతూ కనిపించింది. ఆశ్చర్యపోయిన కావలివాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నవించారు. ఒక స్త్రీ అభేద్యమైన కోట అర్ధరాత్రి ఒంటరిగా దాటడమా? అది ఎలా సాధ్యం అని నివ్వెరపోతూ స్వయంగా పరిస్థితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ.

ఇంతలో హీరాకానీ రానేవచ్చింది. వణుకుతూ శివాజీ ముందు నిలబడి “అయ్యా! రాత్రి పాలకై ఏడుస్తున్న నా బిడ్డడు గుర్తుకు వచ్చాడు. ఇక ఏ దారీ తోచలేదు. కోటగోడలెలా దాటానో నాకే తెలియదు. కొండలూ గుట్టలూ తుప్పలూ ఆ నడిరాత్రి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్డ ఒక్కడే నాకు జ్ఞప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభూ!” అని ప్రార్థించింది హీరాకానీ.

శత్రువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. హీరాకానీకి అందఱూ చూస్తుండగా సాష్టాంగవందనం చేశాడు! “అమ్మా! మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ఇక ఈ కోటగోడలెంత? ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతాను” అని ఆమెను పంపివేశాడు అమ్మ విలువ తెలిసిన శివాజీ. ఇప్పటికీ ఈ బురుజు హీరాకానీబురుజు అనే పిలవబడుతోంది.



ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:

1. ఒక స్త్రీకి మాతృమూర్తికి భారతీయులు ఇచ్చే గౌరవం ఈ కథలో మనకు స్పష్టముగా తెలుస్తున్నది. ఛత్రపతి అయివుండికూడా శివాజీ అందఱిముందూ సామాన్యురాలైన హీరాకానీ పాదాలపై పడి నమస్కరించెను.

2. తనకు ఎన్ని పనులున్నా ప్రసవవేద పడుతున్న సైనికుని భార్యకు సహాయపడి తన పరోపకార బుద్ధిని మనకు నేర్పింది హీరాకానీ.

3. ఎంత హీరాకానీ మీద జాలి ఉన్నా రాజాజ్ఞను గౌరవించి వారి కర్తవ్యాన్ని పాలించి సేవాధర్మాన్ని కాపాడిన కావలి వాళ్ళు ధన్యులు.

🕉️🌞🌎🏵️🌼🚩

Source - Whatsapp Message

విలువైన 8 గొప్ప పాఠాలు

విలువైన 8 గొప్ప పాఠాలు

⚜️ ఇతరుల భావాలతో ఆటలాడకు..
అలా చేయటం వలన
నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు గాక
కాని ఒక మంచి వ్యక్తిని
నువ్వు జీవితాంతం కోల్పోతావు.

⚜️ ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది
దానికి గల కారణం
అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు మంచి వ్యక్తుల మౌనం

⚜️ నేను వారిపట్ల చాలా కృతఙ్ఞడనై వున్నాను ఎవరయితే నన్ను నిరాకరించారో..వారి వలనే నేను నా అంతట నేనుగా ఎదిగాను

⚜️ నీలో స్నేహ గుణం అన్నది
నీ బలహీనత అయితే
ప్రపంచంలో నువ్వు అందరికన్నా
బలమైనవాడివని అర్ధం

⚜️ నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నవారి జీవితాల్లో
బాధలు వుండవు అని అనుకోవద్దు
వారి వద్ద వాటిని ఎదుర్కుని నిలబడే ధైర్యం వలనే
ఆ విధంగా తారసపడతారు

⚜️ అవకాశాలు సూర్యకిరణాలు వంటివి అందుకే వాటిని వీలయినంత త్వరగా దొరకబుచ్చుకోవాలి ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు

⚜️ నువ్వు వెలుగులో వున్నంత కాలం నిన్ను అందరూ అనుసరిస్తారు అదే నువ్వు చీకట్లో వుంటే నీ నీడ కూడా నీతో రాదు

⚜️ "నిశ్శబ్దముగా వుండు"
ఎందుకంటే నాణెము ధ్వణి చేసినంతగా నోట్లు చేయవు
విలువ కలిగినవి అలానే వుంటాయి.

మానస సరోవరం. 👏

Source - Whatsapp Message

Friday, May 28, 2021

దేవుడికి అన్నీ తెలుసు

💥దేవుడికి అన్నీ తెలుసు 💥
🕉️🌞🌎🏵️🌼🚩

ఒక పండితుడు ఎన్నో శాస్త్రాల్లో పాండిత్యం సాధించినవాడు. వాదోపవాదాల్లో ఎందర్నో పండితుల్ని జయించినవాడు. దాంతో అతనికి అంతులేని ఆత్మవిశ్వాసం, అహంకారం. ఎవర్నీ లెక్క పెట్టేవాడు కాదు.
అతను నిరంతరం దేశ సంచారం చేసేవాడు. ఎందర్నో కలిసి ఎంతో విషయసేకరణ చేసేవాడు. ఆవిధంగా ఒకసారి ఒక గ్రామం బయల్దేరాడు. దారిలో సూర్యుడు తీక్షణంగా తన కిరణాల్ని ప్రసరించాడు. పైగా అది వేసవికాలం. ఎండమండిపోతుంది.

సూర్యుడికి పండితుడయినా పామరుడయినా ఒకటే కదా! ఎవడ్నీ వదిలి పెట్టడు కదా! పైగా పండితుడికి బట్టతల. మృదంగం వాయించినట్లు తలను కిరణాలనే కట్టెల్తో కొట్టాడు.

పండితుడు చెమటతో తడిచి ముద్దయ్యాడు. భరించలేని వేడితో కొంతదూరం కూడా నడవలేననిపించింది. అటూఇటూ చూశాడు. దూరంగా ఒక పెద్ద మర్రిచెట్టు కనిపించింది. “హమ్మయ్య” అని నిటూర్చి త్వరగా అడుగులువేసి ఆ మర్రి చెట్టుకిందికి వెళ్ళాడు. తల్లి కౌగిలిలా ఆ మర్రిచెట్టు నీడ చల్లగా ఉంది. అది చాలా పెద్దమర్రిచెట్టు. దట్టమైన కొమ్మలు ఆకులు. విశాలంగా విస్తరించింది. ఆ మర్రిచెట్టు కింద జనం విశ్రాంతి తీసుకోడానికి ఎవరో బండలతో అరుగులు కట్టారు. ఇంకెవరో చలువ పందిరి ఏర్పాటు చేశారు. నీటికుండలు ఏర్పాటుచేశారు. పండితుడికి ప్రాణం లేచివచ్చినట్లయింది. ముఖం కడుక్కుని చల్లని నీటిని కడుపునిండుగా తాగి బండలమీద చల్లటి నీడలో కాసేపు విశ్రమించాడు. మెలకువరాగానే కళ్ళు తెరిచి పైకి చూశాడు.

మర్రిచెట్టులోని చిన్నిచిన్ని ఎర్రటి కాయలు తననే చూస్తున్నట్లనిపించాయి. మర్రిచెట్టు పర్వతమంత మహావృక్షం. అంతపెద్ద చెట్టుకు ఇంత చిన్ని కాయలా? పండితుడికి నవ్వు వచ్చింది.

అతని మనసులో గుమ్మడికాయలు మెదిలాయి.
సన్నటి తీగకు పెద్దపెద్ద గుమ్మడికాయలు. పెద్ద మర్రి వృక్షానికి చిన్నిచిన్ని కాయలు. ఇందులో ఏదో తేడా ఉన్నట్లనిపించింది. ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు దేవుడు కొన్ని తలకిందుల పనులు చేశాడేమో అనిపించింది. లేకుంటే నిజానికి ఇక్కడ గుమ్మడికాయలు, అక్కడ మర్రిపండ్లు ఉండాలి అనుకున్నాడు.

అంతలో ఉన్నట్లుండి గాలి వీచింది. గాలికి ఒక చిన్ని మర్రిపండు తుపాకీ గుండు దూసుకొచ్చినట్లు పండితుడి తలపై టంగుమని శబ్దం చేస్తూ పడింది. ఆ దెబ్బతో నిముషంపాటు పండితుడి కళ్ళు బైర్లుకమ్మాయి. వెంటనే ఆ మర్రిపండు స్థానంలో గుమ్మడికాయ తన తలమీద పడివుంటే ఎలా ఉండేదని ఊహించాడు. ఆ ఊహే భయం కలిగించింది. పగిలిన తన తలను ఊహించుకుని బెంబేలెత్తిపోయాడు.
పండితుడి అహంకారం అదృశ్యమైంది.

చేతులు జోడించి ఆకాశంలోని చూసి “దేవా! ఏది ఎక్కడ ఎందుకు ఉండాలో నీకు తెలుసు. నా అజ్ఞానంతో ఇంకోలా భావించాను. నన్ను మన్నించు తండ్రీ” అని తలను నేలకు వాల్చి దేవుణ్ణి వేడుకున్నాడు.*

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

Thursday, May 27, 2021

ఇన్ని యాదృచ్చికములు ( Coincidences) ఒకేసారి ఎలా సాధ్యమవుతుంది?

ఇన్ని యాదృచ్చికములు ( Coincidences) ఒకేసారి ఎలా సాధ్యమవుతుంది?
ఒక్కసారి ఆలోచించండి 🤔
1. చైనాలోని వుహాన్ లోని జీవ ప్రయోగశాల అమెరికన్ కంపెనీ అయిన "జిఎస్‌కె (గ్లాక్సోస్మిత్‌ క్లైన్)" కి చెందినది
2. (యాదృచ్చికంగా) GSK ... Pfizr ఫైజర్‌ కంపెనీని ను సొంతం చేసుకుంది.
3. ( యాదృచ్చికంగా ) ఫైజర్ వుహాన్ Lab లో లీక్ అయిన అదే వైరస్ కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తుంది.
4. ( యాదృచ్చికంగా ) డా. ఫోస్సీ ఈ పరిశోధన చేశారు.
5. టీకాల వాడకాన్ని ప్రోత్సహించే డాక్టర్ ఫోస్సీ ( యాదృచ్చికంగా ) అమెరికా అధ్యక్షుని కి ముఖ్య సలహాదారు .
6. ( యాదృచ్చికంగా ) GSK కి "బ్లాక్ రాక్ ఫైనాన్స్" కంపెనీ ద్వారా నిధులు సమకూరుతాయి.
7. (యాదృచ్చికంగా ) బ్లాక్ రాక్ ఫైనాన్స్ ... 'ఓపెన్ ఫౌండేషన్' అనె కంపెనీని నిర్వహిస్తుంది ( సోరోస్ ఫౌండేషన్ ).
(యాదృచ్ఛికంగానే) సోరోస్ ఫౌండేషన్ లోనే మన మన్మోహన్ సింగ్ గారి కుమార్తె పనిచేస్తున్నారు.
( యాదృచ్ఛికంగా ) పంజాబ్ రైతుల ఉద్యమం కు వ్యతిరేకంగా టూల్ కిట్ విడుదల వెనుక షోరోస్ గారి హస్తం బయటికి వచ్చింది.
8. GSK...... (యాదృచ్చికంగా ) ఫ్రెంచ్ కంపెనీ అయినా "AXA" కి సేవలు అందిస్తుంది.
9. సోరోస్ ఫౌండేషన్ యొక్క జర్మన్ మాతృ సంస్థ .... "వింటర్‌థుర్."
10. జిన్ ( యాదృచ్చికంగా ) వుహాన్‌లో ఒక ప్రయోగశాలను నిర్మించారు.
11. మరియు దీనిని జర్మన్ కంపెనీ " అల్లియన్స్" కొనుగోలు చేసింది.
12. దీనికి అత్యధిక వాటాలు కలా వాటాదారు ఉన్నాడు, అతను (యాదృచ్చికంగా) 'బ్లాక్ రాక్' యొక్క వాటాదారు.
13. 'బ్లాక్ రాక్' కేంద్ర బ్యాంకులను నియంత్రిస్తుంది మరియు ప్రపంచ పెట్టుబడి మూలధనంలో మూడింట ఒక వంతును నిర్వహిస్తుంది.
14.( యాదృచ్చికంగా ) బ్లాక్ రాక్.... బిల్ గేట్స్ యాజమాన్యంలోని మైక్రోసాఫ్ట్ యొక్క ప్రధాన వాటాదారు.
15. మరియు ( యాదృచ్చికంగా ) మైక్రోసాఫ్ట్.... ఫైజర్ (Pfizer) యొక్క వాటాదారు.
16. ( యాదృచ్చికంగా ) ఇది WHO యొక్క మొదటి స్పాన్సర్.
17. (యాదృచ్చికంగా), వుహాన్ లోని 'వుహాన్ వైరస్' ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది.
▪️ఇక ప్రపంచ స్థాయి వ్యాక్సిన్ వ్యాపారం మొదలైంది! వ్యాక్సిన్ పోటీదారుల శక్తిని అంచనా వేయడంలో 'ఫైజర్ కంపెనీ' విఫలం అయి ఊహల్లో ఉండిపోయింది. 😴
▪️భారత దేశం మరియు దక్షిణ ఆసియా దేశాలు అధిక జనాభా సాంద్రత కారణంగా ఎక్కువ వైరస్ ప్రభావిత ప్రాంతములు కావున, అక్కడి మార్కెట్ పై ఎక్కువ అంచనాలు పెట్టుకుంది మరియు డాలర్ల సంపాదన పై కలలు కంటూ ఉండిపోయింది ఈ వ్యాక్సిన్ మాఫియా . ఒక్క భారత్ లో ఏడు లక్షల కోట్ల రూపాయల సంపాదన పై అంచనా వేసుకుంది.
▪️కానీ! (యాదృచ్ఛికంగా ) కలలో కూడా ఊహించని విధంగా భారతదేశం నుండి 'Covaxine వ్యాక్సిన్' మరియు 'Kovishield వ్యాక్సిన్లు' పుట్టుకొచ్చాయి. సులభంగా భారత దేశ వ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా చొచ్చుకుపోయాయి.
▪️ఫైజర్ కంపెనీ.... మరియు దాని వెనక ఉన్న పైన తెలిపిన పెట్టుబడిదారుల కలలన్నీ కల్లలయ్యాయి.😢
▪️ఇక Covaxine మరియు Kovishieldల వాడకం మరియు పనితీరులపై తప్పుడు ప్రచారం, దుమ్మెత్తి పోయడం మొదలైంది. తయారీకి ప్రోత్సాహం ఇచ్చిన నాయకత్వం పై కూడా పార్టీలు, కులాలు, మతాలు అంటగట్టారు దుష్ప్రచారం మొదలు పెట్టారు . (ఇందులో భారత దేశానికి చెందిన నాయకులు , పత్రికలు , మేధావులు పాలుపంచుకోవడం యాదృచ్ఛికమా?) వీరి దుష్ప్రచారాన్ని నమ్మేన గుడ్డి ప్రజలు వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనుకడుగు వేశారు. వారి పాచికలు పరాయి. ఇంతలో కోవిద్ సెకండ్ వేవ్ డ్రామా మొదలైంది!
18.Covaxine and Kovishield వ్యాక్సిన్లు తగు జాగ్రత్తలు మధ్య తరలించి వెంటనే నేరుగా ప్రజలపై వినియోగించవచ్చు . కానీ, దీనికి విరుద్ధంగా ' ఫైజర్ వ్యాక్సిన్' చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి తరలింపుల్లో మరియు నిల్వ చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ధర కూడా చాలా ఎక్కువ. ( ఫైజర్ యొక్క అనుబంధ సంస్థ అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది.)
19. ఫైజర్ యొక్క అనుబంధ సంస్థ రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లకు బాధ్యత వహిస్తుంది.
20. ఫైజర్ కంపెనీ తన వ్యాక్సిన్‌ను అమెరికాలో 1,100 రూపాయలకు, యూరప్‌లో 1,800 రూపాయలకు విక్రయిస్తుంది.
- దీని ధర భారత్‌కు రూ .2,700. గా నిర్ణయించింది (వారి అంచనా ప్రకారం 130 కోట్ల మంది జనాభా కి ₹ 7 లక్షల కోట్ల మార్కెట్‌తో , ఒక్కొక్కరికి రెండు మోతాదు తో ).
ఫైజర్ వ్యాక్సీన్ ప్రయోగదశలో మనుషుల మీద ప్రయోగించినపుదు ఏడు మందిలో రక్తం గడ్డకట్టడం కనిపించింది . అందువలన భారత్ ఆ వ్యాక్సిన్ వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు .
అంతేకాక ఆ టీకా కంపెనీ పెట్టిన నిబంధనల వల్ల వాడకంలో ఏదైనా రియాక్షన్ను వచ్చి ఏ భారతీయ పౌరుడైనా నష్టపోతుంటే, అతను ఫైజర్‌పై కేసు పెట్టలేడు. (ఆ నిబంధనలను ఒప్పుకోకుండా దీనికి భారత ప్రభుత్వం నిరాకరించింది. అందువలన ఫైజర్ వ్యాక్సిన్ భారత్లో గుర్తించబడలేదు).
22. ఫైజర్ ను గుర్తించాలని రాహుల్ గాంధీ ( యాదృచ్చికంగా ) ట్వీట్ చేశారు.
23. భారత్లో ఫైజర్ వ్యాక్సిన్ ఆమోదించబడకపోతే, (యాదృచ్చికంగా) భారత లో తయారయ్యే వ్యాక్సిన్‌కు అవసరమైన ముడి పదార్థాలను అమెరికా ఆపివేస్తుంది.
భారతదేశం యొక్క ముక్కు పగలు కొట్టవచ్చని అతను( Biden) భావించాడు, కానీ దీనికి విరుద్ధంగా, అమెరికా యొక్క గోచీ తొలగించబదె పరిస్థితి వచ్చింది, అప్పుడు బిడెన్ కి భారత తయారీ టీకాతో చికిత్స చేయవలసి వచ్చింది.
24. థర్డ్ వేవ్ లొ, చిన్నపిల్లలకు వ్యాధి సోకుతుందని ప్రచారం ప్రారంభమైంది, (యాదృచ్చికంగా ) మరియు.... ఒక వారంలోనే ఫైజర్ చిన్న పిల్లలకు వ్యాక్సిన్ తమ వద్ద రెడీ గా ఉందని ప్రకటించింది!.
మరి చిన్న పిల్లలపై ఆ వ్యాక్సిన్ వాడకంపై అన్ని క్లినికల్ పరీక్షలు మొదలై... ఒకే వారంలో జరిగాయా?
ఈ కంపెనీల కుట్ర ఏమిటంటే......,
1)ఒక అజ్ఞాన వైరస్ను సృష్టించడం,
2) ప్రజలలో వ్యాప్తి చేయడం,
3) వారిని WHO లాగా మాట్లాడటం,
4)మార్కెట్ టీకాలు వేయడం,
5)భారీ మొత్తంలో డబ్బు సంపాదించడం మరియు ,
6) ఒకే ప్రజలపై పాలన చేయడం, భూమి జనాభాను తగ్గించడం.
25. జో బిడెన్ ఆ రోజు Mask ధరించి బయటకు వచ్చి ముసుగు తీసివేసి, రెండు టీకాలు తీసుకున్న వారు Mask ధరించాల్సిన అవసరం లేదని బహిరంగంగా ప్రకటించారు( యాదృచ్చికంగా ) .
ఇది మార్కెటింగ్ యొక్క ఒక రూపం. ఫైజర్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా ఉంటుంది అని ప్రపంచానికి తెలియ చెప్పే ఉద్దేశ్యం.
"ఇన్ని ట్విస్టులు ( యాదృచ్చికాలు) మన్మోహన్ దేశాయ్ చిత్రం లో కూడా లేవు.
డాక్టర్ ఫోస్సీ ( అమెరికా అధ్యక్షుని సలహాదారు) + బిల్ గేట్స్ మరియు మిలిందా గేట్స్ ఫౌండేషన్ + Pfizer + జార్జ్ సోరోస్ + రాగా మరియు సొగా ల కుట్ర పూరిత వ్యవహారాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి .
దీనికి ఏకైక పరిష్కారం! దుష్ట పన్నాగాలుతొ, రోగాలతో వ్యాపారాలు చేసే ఇలాంటి దుర్మార్గులను దూరంగా పెట్టండి .
అటువంటి సంస్థలకు వెన్నుదన్నుగా ఉండే క్రూర రాజకీయాలు చేసె నేతలకు అధికారాన్ని ఇవ్వద౦కాదు, వారి ఉత్పత్తులను ఉపయోగించకూడదు.
Traditional గా మన సాంప్రదాయ జ్ఞానాన్ని తిరిగి బయటికి తె౦డి మరియు మనల్ని, మన సమాజాన్ని, మన దేశాన్ని రక్షించండి.
Post ఈ పోస్ట్ యొక్క ఎవరో రచయిత తెలియదు, కానీ ఇందులో వాస్తవాలు ( యాదృచ్చికంగా ) ఉన్నాయని గ్రహించి పోస్ట్ చేశాను
💐💐💐💐💐

Source - Whatsapp Message

చనిపోదాం అనుకున్నవాడు... సీఎం అయ్యాడు!

🙏చనిపోదాం అనుకున్నవాడు... సీఎం అయ్యాడు!🙏

ఆరేళ్లకు అనాథలా మారాడు. పదేళ్లకు కార్పెంటర్‌ అవతారమెత్తాడు. పదకొండేళ్లకు తొలిసారి బడిలో అడుగుపెట్టాడు. ఆపైన నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేశాడు. చివరికి బతకలేక ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కట్‌ చేస్తే... అదే కుర్రాడు పీజీ పూర్తి చేశాడు. ఎమ్మెల్యే అయ్యాడు. 22ఏళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఇటీవలే అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

కలిఖో పుల్‌... పాతాళం నుంచి పర్వతం అంచుల దాకా సాగిన ఆయన ప్రయాణం, జీవితానికే కొత్త పాఠాలు నేర్పిస్తుంది.

కలిఖో పుల్‌... ఆ పేరుకు అర్థం ‘మంచి భవిష్యత్తు’ అని. ఏరికోరి తల్లి అతనికి ఆ పేరు పెట్టుకున్నా, వూహ తెలిసినప్పట్నుంచీ అతనికి చీకట్లు తప్ప, రేపటిపైన ఆశ ఎప్పుడూ కనిపించలేదు. పుల్‌ పదమూడు నెలల చిన్నారిగా ఉన్నప్పుడు తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. మరో ఐదేళ్లకు అల్లారు ముద్దుగా చూసుకుంటూ వచ్చిన తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అలా ఆరేళ్ల వయసులో తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని అనాథలా మిగిలాడు పుల్‌. చుట్టుపక్కల వాళ్లెవరూ పట్టించుకోలేదు. చుట్టాలెవరూ దగ్గరకు తీయలేదు. ఎటెళ్లాలో తెలీక దిక్కుతోచని స్థితిలో ఉన్న పుల్‌ని పక్క వూళ్లొ ఉండే అతడి అత్తయ్య తీసుకెళ్లింది. అదీ అతడి మీద ప్రేమతోనో, చదివించి పెద్ద చేయాలనో కాదు... ఇంట్లో పనులకు పనికొస్తాడని.

• పదేళ్లకు వడ్రంగిగా...

ఆరేళ్ల వరకూ పుల్‌ బడి మొహాన్ని చూడలేదు. ప్రతిరోజూ అడవికెళ్లడం, కట్టెలు కొట్టుకొని రావడమే అత్తయ్యవాళ్లింట్లో అతని పని. పుల్‌ కట్టెలు తీసుకొస్తేనే అతడికి ఆ రోజు అన్నం దొరికేది. ఆటల్లో పడో, ఆరోగ్యం బాలేకో అడవికి వెళ్లలేకపోతే ఆ పూటకి పస్తులే. దాంతో చదువుకీ, అందమైన బాల్యానికీ దూరంగా అడవి చెట్ల మధ్యే పెరిగాడు. పదేళ్ల వయసొచ్చేసరికి పక్క వూళ్లొని ‘హవాయి క్రాఫ్ట్‌ సెంటర్‌’లో వడ్రంగి పని నేర్చుకోవడానికి వెళ్లాడు. అక్కడ రోజుకి రూపాయిన్నర స్టైపెండ్‌ అందేది. అత్తయ్య కుటుంబం మీద ఆధారపడకుండా ఆ డబ్బులతోనే ఎలాగోలా బండి నడిపించేవాడు. పనిలో నైపుణ్యం సాధించే కొద్దీ స్టైపెండ్‌ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో అక్కడే ఉంటూ కుర్చీలూ మంచాలతో మొదలుపెట్టి రెండేళ్ల పాటు చెక్కతో రకరకాల కళాకృతులు తయారు చేసేవరకు నైపుణ్యం పెంచుకున్నాడు. అతడి ప్రతిభ ఆ శిక్షణా కేంద్రం నిర్వాహకులనూ ఆకర్షించింది. అక్కడుండే ట్యూటర్‌ సెలవు మీద వెళ్లడంతో శిక్షణ పూర్తయ్యాక పుల్‌కే మూడు నెలల పాటు జీతమిచ్చి శిక్షకుడిగా పనిచేసే అవకాశం కల్పించారు.

• నేరుగా ఆరులోకి...

పుల్‌ పనిచేస్తోన్న హవాయి క్రాఫ్ట్‌ సెంటర్‌కు ఎక్కువగా ఆర్మీ, పారా మిలటరీ, ప్రభుత్వ అధికారులు వస్తుండేవారు. వాళ్లందరూ హిందీ, ఇంగ్లిష్‌లోనే మాట్లాడేవాళ్లు. పుల్‌కి అస్సమీస్‌ తప్ప మరో భాష రాదు. వినియోగదారులు చెప్పేది తనకు అర్థమవ్వాలంటే హిందీ కానీ, ఇంగ్లిష్‌ కానీ నేర్చుకోవాల్సిందే అనుకున్నాడు. దాంతో తప్పని పరిస్థితుల్లో పదకొండేళ్ల వయసులో ఓ నైట్‌ స్కూల్‌లో ఒకటో తరగతిలో చేరాడు పుల్‌. ఇతర సబ్జెక్టులతో తనకు అవసరం లేదనీ, హిందీ ఇంగ్లిష్‌ మాత్రమే బాగా నేర్పించమనీ టీచర్లని అడిగేవాడు. ఓరోజు పుల్‌ చదువుతోన్న స్కూల్‌కి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డిప్యూటి కమిషనర్‌ తనిఖీకి వచ్చారు. అందరికంటే పెద్దవాడు, చురుగ్గా ఉంటాడు కాబట్టి వాళ్లని ఆహ్వానించే బాధ్యతని స్కూల్‌ పుల్‌కే అప్పగించింది. స్కూల్లో చదువు ఎలా చెబుతున్నారంటూ మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన పుల్‌, చివర్లో ఓ ప్రార్థన గీతాన్నీ పాడాడు. చెక్క పని నేర్చుకునే పిల్లాడు అంత బాగా మాట్లాడటం, పాడటం డిప్యూటీ కమిషనర్‌ దృష్టిని ఆకర్షించింది. వెంటనే అతడి గురించి ఆరా తీశాడు. విషయం తెలుసుకొని ఆయనే చొరవ తీసుకుని పుల్‌ని డే స్కూల్‌కి మార్పించి, నేరుగా ఆరో తరగతిలో అడ్మిషన్‌ ఇప్పించాడు. అదే పుల్‌ జీవితానికి కీలక మలుపు. పొద్దున చదువుకుంటూనే రాత్రుళ్లు హస్తకళల కేంద్రంలో శిక్షకుడిగా పనిచేసేవాడు.

• ఆత్మహత్యవైపు అడుగులు

తరగతులు మారే కొద్దీ పుల్‌కి ఖర్చులూ ఎక్కువయ్యాయి. అతడు పనిచేసే చోట వచ్చే డబ్బులు బతకడానికీ చదువుకీ సరిపోయేవి కావు. దాంతో తెలిసిన వాళ్ల ద్వారా అతికష్టమ్మీద ఓ ప్రభుత్వ కార్యాలయంలో నైట్‌ వాచ్‌మన్‌గా ఉద్యోగం సంపాదించాడు. సాయంత్రం ఐదు గంటలకు ఆ కార్యాలయంలో జాతీయ జెండాను అవనతం చేయడం, ఉదయం ఐదింటికి జెండా ఎగరేయడం, ఆ మధ్యలో కార్యాలయానికి కాపలా కాయడం అతడి పని. నెలకు రూ.212 జీతం వచ్చేది. రాత్రి ఉద్యోగం, పొద్దున స్కూలుతో రోజుకి నాలుగైదు గంటలకు మించి నిద్ర ఉండేది కాదు. ఆ జీతం కూడా సరిపోకపోవడంతో ఖాళీ సమయంలో సిగరెట్లూ, పాన్‌లూ అమ్ముతూ ఎంతో కొంత సంపాదించుకునేవాడు. కానీ దురదృష్టం పుల్‌ని మరోసారి దెబ్బకొట్టింది. అనుభవిస్తోన్న పేదరికానికి తోడు కడుపులో అల్సర్ల సమస్య అతడిని మరింత బాధపెట్టింది. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక ఆరేళ్లపాటు అలానే భరించాడు. కానీ చివరికి ఆపరేషన్‌ చేయించుకోకుంటే సమస్య పూర్తిగా ముదిరిపోయే పరిస్థితి వచ్చింది. డబ్బుల కోసం బంధువుల్ని ఆశ్రయిస్తే ఒకరు రెండు రూపాయలూ, మరొకరు ఐదు రూపాయలూ చేతిలో పెట్టారు. ఆ క్షణం తనకంటూ ఎవరూ లేరనీ, తాను బతికి సాధించేది ఏమీ లేదనీ పుల్‌కి అనిపించింది. ఆత్మహత్య చేసుకుందామని దగ్గర్లోని ఓ నదిమీదున్న బ్రిడ్జి పైకెక్కాడు. కానీ చుట్టూ మనుషులు ఉండటంతో దూకడానికి అతడికి ధైర్యం సరిపోలేదు. దాదాపు నలభై నిమిషాలు అక్కడే ఎదురు చూశాక, చనిపోవడం తనవల్ల కాదనిపించి వెనుతిరిగాడు.
చదువుకుంటూనే పని
జీవితంలో డబ్బు ఎంత అవసరమో బంధువుల ప్రవర్తనతో పుల్‌కి అర్థమైంది. ఎలాగైనా ఆపరేషన్‌ చేయించుకోవాలనీ, బతికి సాధించి తానేంటో నిరూపించాలనీ అనుకున్నాడు. నేరుగా తనని స్కూల్లో చేర్పించిన డిప్యూటీ కమిషనర్‌ నేగి దగ్గరకు వెళ్లి తన పరిస్థితి వివరించాడు. అతడిని చూసి జాలిపడ్డ నేగి చేతిలో రెండువేల ఐదొందలు పెట్టి పంపించాడు. ఆ డబ్బుతో చికిత్స చేయించుకున్న పుల్‌, తరవాత ముఖ్యమంత్రికి అభ్యర్థన పెట్టుకొని, దాన్నుంచి వచ్చిన మెడికల్‌ గ్రాంట్‌తో నేగి డబ్బులు తిరిగిచ్చేసి జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాడు. క్రమంగా పుల్‌ ఆరోగ్యం మెరుగు పడింది. చేతిలో ఎంతో కొంత నైపుణ్యం ఉంది. చదువును కొనసాగిస్తూనే డబ్బులు సంపాదించడానికి వచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. పుల్‌కి వెదురుతో ఫెన్సింగ్‌ నిర్మించడం, గుడిసెలు అల్లడం బాగా వచ్చు. అదే విషయాన్ని తనకు పరిచయమున్న వాళ్లందరికీ చెబుతూ, ఏదైనా అవసరముంటే కబురుపెట్టమనేవాడు. అలా ఓ జూనియర్‌ ఇంజినీర్‌ ఇంటిచుట్టూ వెదురుతో ఫెన్సింగ్‌ నిర్మించే పని దొరికింది. మూడ్రోజుల పాటూ ఒక్కడే అడవికి వెళ్లి వెదురుని నరుక్కొని వచ్చి ఆ నిర్మాణాన్ని పూర్తిచేశాడు. దానికి అతడికి దక్కిన మొత్తం నాలుగొందల రూపాయలు. ఆ తరవాత ఆరొందల రూపాయలకు ఓ గుడిసె నిర్మించే పని దొరికింది. కొన్ని రోజులకు రెండు వేల రూపాయలకు ఓ వెదురు ఇంటిని నిర్మించే పనీ ఒప్పుకున్నాడు. అలా చదువుకుంటూనే ఓ చిన్నస్థాయి కాంట్రాక్టర్‌గా మారాడు. పనికీ, చదువుకీ మధ్య పుల్‌ నిద్రనీ, వ్యక్తిగత జీవితాన్నీ త్యాగం చేశాడు తప్ప పుస్తకాలని ఏ రోజూ పక్కకి పెట్టలేదు. ఓవైపు ఇంటర్‌ చదువుతూనే మరోపక్క తాను సంపాదించుకున్న డబ్బులతో నాలుగు సెకండ్‌ హ్యాండ్‌ ట్రక్కులనీ కొని వాటిని అద్దెకి తిప్పేవాడు.

• పాతికేళ్లకే ఎమ్మెల్యే

చిన్న కాంట్రాక్టర్‌గా మొదలుపెట్టి డిగ్రీకి వచ్చేనాటికి పక్కా ఇళ్లు నిర్మించే కాంట్రాక్టులూ చేసే స్థాయికి పుల్‌ ఎదిగాడు. చదువూ, కాంట్రాక్టులకి తోడు కాలేజీ విద్యార్థి సంఘానికి జనరల్‌ సెక్రటరీ బాధ్యతలతో పుల్‌ క్షణం తీరికలేకుండా గడిపేవాడు. డిగ్రీ చివరి సంవత్సరానికి వచ్చేనాటికి పుల్‌ మూడు లక్షల ఖర్చుతో ఓ సొంత ఇంటినీ నిర్మించుకున్నాడు. అల్సర్‌ నుంచి బయటపడ్డ నాటి నుంచీ అతడి సంపాదనలో సగం సొంతానికీ, మిగతా సగం పేద రోగుల వైద్యానికీ కేటాయిస్తూ వస్తున్నాడు. కాంట్రాక్టర్‌గా మారాక ప్రభుత్వాసుపత్రులకు వెళ్తూ రోగుల అవసరాలు తెలుసుకొని ఆర్థిక సాయం చేసేవాడు. అలా క్రమంగా అతడి ఔదార్యం గురించి ఆనోటా ఈనోటా అందరికీ తెలియడం మొదలుపెట్టింది. విద్యార్థి సంఘం నాయకుడిగానూ మంచి పేరు సంపాదించాడు. డిగ్రీ పూర్తయ్యాక, లా కాలేజీలో చేరాడు. మరోవైపు కాంట్రాక్టర్‌గా ఎదుగుతూ 37 ప్రభుత్వ భవనాలూ, డజనుకు పైగా బ్రిడ్జిలూ, వందల కిలోమీటర్ల రోడ్లూ నిర్మించాడు. అతడు నిర్మించిన భవనాల నాణ్యత నచ్చడంతో ప్రభుత్వం టెండర్లు లేకుండానే అతడికి పనులను అప్పజెప్పేది. చిన్న వయసులోనే స్థానికంగా పుల్‌ సంపాదించిన పేరు కాంగ్రెస్‌ పార్టీ దృష్టిని ఆకర్షించింది. అతడు పార్టీలో సభ్యుడుకాకపోయినా తమ తరఫున పోటీ చేయాలంటూ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. ప్రభుత్వ కాంట్రాక్టులనే ప్రజా సేవగా భావిస్తూ చేస్తూ వచ్చాడు పుల్‌. అలాంటిది నేరుగా ప్రభుత్వం తరఫునే పనిచేసే అవకాశం వచ్చేసరికి ఆనందంగా ఒప్పుకున్నాడు.

• మంత్రిగా 22ఏళ్లు

తొలి ఎన్నికల్లో పుల్‌ అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించి, పాతికేళ్లకే మంత్రిగా మారాడు. ఆ తరవాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రత్యర్థులపైన 90శాతం కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతోనే గెలుస్తూ వచ్చాడు. మంత్రిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడు. ‘ఒకప్పుడు ఆపరేషన్‌ కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అపాంగ్‌ రెండువేల ఐదొందలు గ్రాంట్‌ ఇచ్చారు. అదే వ్యక్తి ఈ రోజు నా పెళ్లికి అతిథిగా హాజరవడాన్ని నమ్మలేకపోతున్నా’ అంటూ పుల్‌ తన పెళ్లిలో కన్నీటి పర్యంతమయ్యారు. 23ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 22ఏళ్లు పుల్‌ మంత్రిగా పనిచేశారంటేనే ప్రజలకూ అధికార పక్షానికీ ఆయనపైన ఎంత నమ్మకమో అర్థమవుతుంది. ఈటానగర్‌లోని పుల్‌ అధికార నివాసం ఓ ఆస్పత్రినే తలపిస్తుంది. నిత్యం ఆయన సాయం కోరి వచ్చే రోగులు ఉండటానికి ఆయన ఇంట్లోనే కొన్ని గదులు కేటాయించారు. ఇరవై నాలుగ్గంటలూ అక్కడ వైద్యులను అందుబాటులో ఉంచి వచ్చిన వాళ్లను పరీక్షించే ఏర్పాట్లు చేశారు. ఇరవై ఏళ్లుగా రాజకీయంగానూ బలపడుతూ వచ్చిన పుల్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో అనిశ్చితి కారణంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనకు ఇటీవలే తెరదించారు. ఇతర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రానికి తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

‘నాకు దేవుడిపైన నమ్మకం లేదు, ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి కూడా నాకు సాయపడలేదు. కానీ కష్టమే దేవుడని నమ్ముతా. అదే జీవితంలో ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారీ నన్ను నిలబెట్టింది. ఇప్పుడు నా కారుమీద ఎగిరే జెండాను చూస్తున్నప్పుడల్లా ఒకప్పుడు చౌకీదార్‌గా నేను రోజూ జెండాను ఎగరేసిన రోజులు గుర్తొస్తుంటాయి. ఇప్పటికీ నా తొలిరోజుల్నాటి చెక్క పనిముట్లు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నా ఐదుగురు కొడుకులకూ వాటిని చూపిస్తూ నా గతాన్ని గుర్తు చేస్తా. నన్ను మంత్రిగా కాకుండా ఓ మామూలు కార్పెంటర్‌గా, కాంట్రాక్టర్‌గానే చూడమని వాళ్లకు చెబుతా. ఒకప్పుడు రోజుకు పన్నెండు గంటలు ప్రభుత్వ వాచ్‌మన్‌గా పనిచేసిన నేను ఇప్పుడు ఇరవై నాలుగ్గంటలూ ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి చేరుకున్నా. నేను సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు’ అంటూ యువతను ప్రశ్నిస్తారు పుల్‌.

నిజమే... ఎందుకు సాధించలేరు?

• ఇంకొంత

భారత్‌-చైనా సరిహద్దుకు రెండు వైపులా నివసించే కమన్‌ మిష్మి అని ఓ చిన్న తెగలో కలిఖో పుల్‌ పుట్టారు. కుటుంబంలో బడికెళ్లి చదువుకున్న మొదటి వ్యక్తి ఆయనే.

పుస్తకాలు చదవడం, పర్యటనలకు వెళ్లడం, స్నేహితులతో చదరంగం ఆడటాన్ని బాగా ఇష్టపడతారు. ఖాళీ దొరికనప్పుడల్లా తన పిల్లలను అనాథ శరణాలయాలకు తీసుకెళ్లడం, వాళ్లతో కలిసి స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం అలవాటు.

* విద్య, వైద్యం, ఆర్థిక, న్యాయ, విద్యుత్‌, సాంఘిక శిశు సంక్షేమం లాంటి అన్ని ప్రధాన శాఖల్లో ఆ రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రిగా పనిచేసిన అనుభవం పుల్‌ సొంతం.🙏

Source - Whatsapp Message

అమ్మ అబద్దాలు

అమ్మ అబద్దాలు 😊

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిఝంగా నిజం అండి...
అవునండి మనకి అబద్ధాలు చెప్పకూడదు, ఎప్పుడూ నిజమే చెప్పాలి అని హరిశ్చంద్రుడు , గాంధీగారి కధలు చెప్పిన అమ్మ, మన చిన్నప్పటి నుండి మనకెన్ని అబద్ధాలు చెప్పిందో తెలుసా?

అందగాడిని గాకున్నా ......
చందమామనంటుంది

కంచం నిండా తిన్నా .......
కొంచెమే కదా అంటుంది

అల్లరెంతగా చేసినా .......
పిల్లలింతేనని చెబుతుంది

అత్తెసరున పాసయినా .......
కొత్త సిలబసే కారణమంటుంది

ఆటలు పాటలు రాకుంటే .......
వాటికి విలువలేదంటుంది

ఇంత కప్పు నే గెలిస్తే మాత్రం .......
ఎంతో గొప్పని అంటుంది

తప్పులెన్ని నే జేసినా ........
ఒప్పులుగనే లెక్కలేస్తుంది

అప్పుడప్పుడూ అబద్దమాడినా .......
చెప్పనే చెప్పదు నాన్నకైనా

పాతికేళ్ళ వయసున్నా ........
పసివాడిగానే చూస్తుంది

కష్టపడి వాళ్ళు సంపాదించినా .......
అదృష్టం నాదంటుంది

మనం తల్లి తండ్రులo అయ్యాకే తెలిసేది .......
అమ్మ అబద్ధాలు

ఆమె మమతల నుంచి .......
రాలిన పూలరెక్కలం

ఆమె వాత్సల్యంతో ఒలికించిన .......
తేనె చుక్క లం

ఏమిచ్చి ఆ ఋణం తీర్చుకోగలం
కన్నీటితో కాళ్ళు కడగడం
ప్రేమతో అమ్మని చూసుకోవడం తప్ప..🙏

Source - Whatsapp Message

జీవితం ఒక పయనం

💥జీవితం ఒక పయనం
🕉️🌞🌎🏵️🌼🌈🚩


జీవితం ఒక అంతులేని పయనం. ఈ సుదీర్ఘ వింతపయనంలో నిమిషాలు, గంటలు, దినాలు పరుగులు తీస్తూ ఉంటాయి. మాసాలు గడిచి సంవత్సరాలుగా మారుతుంటాయి. జీవితంలో అన్నీ సవ్యంగా సాగుతూ ఉన్నంతకాలం మాసాలు నిమిషాలుగా, సంవత్సరాలు గంటల గడియారంలో ముళ్లలా చకచకా నడుస్తూఉంటాయి.

సమస్యలు ఎదురుపడగానే క్రమం అంతా తారుమారవుతుంది. ఇలా జరగడానికి కారణం ఏమైఉంటుంది? కాలమహిమ అని కొందరు, కాదు మనసే ఖలనాయకుడని మరికొందరు వాదిస్తారు. కాలం ఒక మహాప్రవాహం. దానికి ఎదురీది గట్టెక్కాలనుకునే మనస్తత్వం ఉన్న మనిషికి జీవితం సవాలుగా మారుతుంది. ప్రవాహంతోపాటు సాగిపోదామన్నా, అది సాఫీగా సాగుతుందన్న భరోసా లేదు. తేడా భావనలోనే ఉంది. ప్రతికూల పరిస్థితులను ప్రతిఘటిస్తూ, సుడిగుండంలో చిక్కుపడిన దుంగలా తలకిందులుగా తలపడటమా? లేక తుంగలా తలవంచి ప్రమాదం నుంచి బయటపడటమా? ఈ ప్రశ్నలకు సమాధానం వ్యక్తి మానసిక స్థితిపైన ఆధారపడి ఉంటుంది.
గుణాత్మకమైన ప్రకృతి ప్రభావంవల్ల వ్యక్తిత్వపు మానసిక స్థితిగతులు మార్పు చెందుతుంటాయి. వీరులు, ధీరులు, రుషులు, తాపసులు తప్పటడుగులు వేయడానికి ప్రకృతి ప్రలోభాలే కారణమని మన పురాణాలు గళమెత్తి చాటుతున్నాయి. ఆరుగురు అంతశ్శత్రువుల దాడికి ఆగలేక మనసు ఆగమాగమై మూగపోవచ్చు లేదా చతికిలపడవచ్ఛు అర్జునుడి వంటి జగదేక ధనుర్ధరుడు కురుక్షేత్రంలో చతికిలపడ్డాడు. విశ్వామిత్ర మహర్షికి మేనక కనిపించగానే మనసు మూగబోయి మనిషిని దాసుడిగా మార్చేసింది. బంధానికి, మోక్షానికి మనసే కారణమన్న ఉపనిషత్తు వాక్యం అక్షరసత్యం.

ఆత్మజ్ఞానానికి చిత్తశుద్ధి, ఏకాగ్రబుద్ధి- రెండూ ముఖ్యమైన సూత్రాలు. మనసు అద్దంలా మారినప్పుడే శుద్ధజ్ఞానం మెరుస్తుంది. ప్రపంచాన్ని గెలుచుకున్నా, మనసును జయించకపోతే ఆ వీరుడు ధీరుడు కాలేడు. స్థితప్రజ్ఞుడే ఈ ప్రపంచంలో అసలైన ప్రాజ్ఞుడు. ఆత్మజ్ఞానం అంటే తానేమిటో తెలుసుకోవడం. అంతా తానై ఉన్నానన్న ఎరుక కలగడంతో ఒంటరిపోరాటం మొదలవుతుంది. ఏకాత్మ భావన అంటే మానసికంగా అందరూ ఒకటే. శారీరకంగా ఎవరికి వారే. అందుకే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్నాడు యోగీశ్వర కృష్ణుడు.

తామరాకుపైన నీటిబొట్టులా భౌతికజీవితంలో మెరవాలి. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటిన విధంగా, జీవన్ముక్తి వివేకంతో మనిషి సంసార సాగరాన్ని ఈదుకు రావాలి. ఐహిక బంధాల్లో చిక్కుపడి ఆముష్మిక పంథాకు దూరం కాకూడదు. భార్య, బిడ్డలు, హితులు, స్నేహితులు, సిరిసంపదలు... ఇవేవీ శాశ్వతం కాదు.

ఇవన్నీ మహాప్రస్థానంలో నాందీప్రస్తావనలు. కాశీయాత్రలో తప్పని మజిలీ స్థావరాలు. మహాప్రస్థానంలో ధర్మరాజును చివరిదాకా అనుసరించింది ధర్మం ఒక్కటే. ఆత్మీయులు అనుకున్నవారు, ఆత్మబంధువులన్నవారు ఊరి పొలిమేర దాకా కలిసి వస్తారేతప్ప, ఊర్ధ్వయాత్రలో మనిషి ఏకాకి మాత్రమే. ఆత్మజ్ఞానం ఒక ఊర్ధ్వగమనం కాబట్టి వ్యక్తి చైతన్యాన్ని చిక్కబట్టాలి. మనోబలంతో ముందుకు సాగాలి. కొంతమంది తమకు తామే గొప్పగా తలబోసుకుంటూ పటాటోపంగా యజ్ఞాలు చేస్తారు. సదా సంసారంలో ఎదురీత సాగిస్తూ ఉంటారు. మనసును వశం చేసుకున్న సాధకులు జీవనయాత్రను జైత్రయాత్రగా మలచుకుని యోగసిద్ధి పొందుతారు.

అంతులేని పయనంలో, ధర్మరాజుకు ధర్మంలా తోడువచ్చేది- ఆధ్యాత్మికసాధనే!

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

నేటి కాలంలో పోరాటాలు అర్థం మారిపోయింది.

🍃🌹నేటి కాలంలో పోరాటాలు అర్థం మారిపోయింది.

ఒకప్పుడు పోరాటం అంటే నిస్వార్ధంగా సాగేది,నేడు తమ స్వార్ధాల కోసం చేసే వారు కూడా పోరాటం అంటున్నారు..


అవసరాలకై ఆకలి తీరినంత వరకే విస్తరికి విలువ..అటు తర్వాత అది ఎంగిలాకని చెత్తకుప్పలో పడేస్తారు.!!

చాలావరకు మనల్ని చూసి కుళ్లిపోయేవాళ్లే ఉంటారు,మళ్లీ పైకి పైకి తీపి మాటలు మాట్లాడుతారు,వాళ్ళు అంటే నాకు పరమ చిరాకు..వాళ్ళని చూసినప్పుడల్లా ఒక్కటే అనిపిస్తుంది.,
I am something special.

దేవుడి దయవల్ల నేను ఇలా లేను అని కుళ్లిపోయే వాళ్ళు ఇంకా కుళ్ళి కుళ్ళి కుళ్ళి పోతూనే
ఉంటారు.. అందుకు మన పని మనం చేసుకుంటూ పోవడమే..పరిష్కారం

✒️స్వామి రాధాకృష్ణ*

💎💥💦🌹🌟

Source - Whatsapp Message

నీజాయితీ

💥నీజాయితీ💥
🕉️🌞🌎🏵️🌼🚩

గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర, సత్యరాజు అనే యువకుడు కొత్తగా పనిలో చేరాడు.

సత్యరాజు ఎంతో నిజాయితీగా, చురుగ్గా పనిచేస్తూ, అతితక్కువ కాలంలోనే యజమాని మెప్పుపొందాడు.

అయితే, సత్యరాజుకు కాస్తకోపం ఎక్కువ. కూరగాయలు కొనడానికి వచ్చినవాళ్ళు ఎక్కువగా
బేరమాడుతూ విసిగిస్తే, "వెళ్ళండి, వెళ్ళండి! మీరేం కొంటారు." అంటూ కసురుకునేవాడు.

ఇందుకు ముఖ్యకారణాల్లో ఒకటి, ఏ రకం కూరగాయలు ఏ ధరకు అమ్మాలో ముందుగానే నిర్ణయించివుండడం.

అయినా, ఈ కసురుకోవడం కోప్పడడంలాంటివి మానుకోమని, గంగాధరం ఎంతగానో చెప్పిచూశాడు.

కానీ, సత్యరాజు ఇవేమీ వినిపించుకోలేదు.

ఒకరోజు, ఆ ఊరిపెద్ద ఇంట్లో పనిచేసే మనిషి మీద సత్యరాజు దురుసుగా మాట్లాడడంతో,గంగాధరం నానా మాటలూ పడాల్సి వచ్చింది.

ఇక ఊరుకుని లాభంలేదని గంగాధరం, సత్యరాజును పనిలోంచి తీసివేశాడు.

దిగాలుపడిపోయిన సత్యరాజు రెండురోజుల తర్వాత తిరిగి గంగాధరం వద్దకు వచ్చి, తనను పనిలోకి
తీసుకోమని బతిమాలడం మొదలు పెట్టాడు.

అయితే, గంగాధరం, అతడు చెప్పేది వినిపించుకో
కుండా గొంతుపెద్దది చేసి, "ఏయ్, చెప్తుంటే మనిషినికాదూ వెళ్ళు, పో!" అంటూ అరిచాడు.

గంగాధరం తనను కుక్కను అదిలించినట్లుగా కరకుగా మాట్లాడడంతో, సత్యరాజు మనసు కలుక్కుమన్నది. అతడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూండగా తలదించుకుని వెనక్కు తిరిగాడు.

వెంటనే గంగాధరం అతణ్ణి, "సత్యరాజు ఇలారా!" అంటూ పిలిచాడు.. సత్యరాజు వెనక్కువచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు.

అప్పుడు గంగాధరం, "ఇప్పుడు
నీకు అర్థమయిందా? ఒక మనిషితో మరొకమనిషి మర్యాదగా, గౌరవంగా మాట్లాడకుండా కసురు కుంటే ఆ మనిషి ఎంతగా బాధపడతాడో!" అన్నాడు సౌమ్యంగా.

నిజంగానే సత్యరాజుకు ఆ బాధ అనుభవంలోకి వచ్చింది .

అతడు వినయంగా చేతులు జోడిస్తూ, "ఆ బాధ ఎలావుంటుందో తెలిసివచ్చింది. బాబూ!" అన్నాడు.


"ఇప్పుడు నేను, నిన్ను నమ్మగలను. వెంటనే పనిలో చేరు," అన్నాడు గంగాధరం శాంతంగా...

సత్యం మృదు ప్రియం ధీరో వాక్యం హితకరం వదేత్ ఆత్మోత్కర్ష స్తదానిందాం పరేషాం పరివర్ణతే ..

నీతి మృదువుగా, ప్రియముగా, ధైర్యము గా, హితకరముగా సత్యము పలుకుట అభ్యసించాలి. నిన్ను నీవు *పోగడుకోవటం ,పరులను నిందించుట విడిచి పెట్టాలి.

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

ఏకాంతంగా కాసేపు మనతో మనం ...

*ఏకాంతంగా కాసేపు మనతో మనం ...

ప్రశాంత వాతావరణంలో ఏకాంతంగా ఆలోచిస్తే
వారి వారి ఆలోచనా విధానం,
బలాబలాలు,
శక్తి సామర్ధ్యాలు,
ఆశలు ఆశయాలు,
విదితమౌతాయి.

ఏకాంతంగా సమయం గడపటం చేతగాని వారిలో లోపం ఉంటుంది.

భూమిలో నాటబడిన విత్తనం ఒంటరిగానే భూమిని చీల్చుకొని మొక్కవుతుంది.

నీటిలో ఈదే చేప కూడా ఒంటరిగానే ఈదుతుంది.

ఆకాశంలో పక్షి మినహాయింపేమి కాదు మరి.

గొప్పవారైనవారు గుట్టుగా గడిపిన సమయం లెక్కకు మిక్కువే.
గోప్యంగా వేసుకున్న ప్రణాళికలు ఎక్కువే.

రాజకీయనాయకులు, వ్యాపారులు, విద్యావేత్తలు, సంఘసంస్కర్తలు, దైవ సేవకులు.

పురోగతికైనా, అధోగతికైనా ఏకాంత సమయం ఎంతో అవసరం.

ఏకాంత సమయంలో తట్టిన ఆలోచనల్ని ఆచరణలో పెట్టుటకు
స్వశక్తి, ఇతరుల శక్తి కూడ బెట్టుకోవాలి.

మోటార్ సైకిల్ను నడుపుతూ సర్వీసింగ్ చేయగలమా ... సర్వీసింగ్ లేని మోటార్ బైక్ కొంత కాలానికి పనిచేయడం ఆగిపోతుంది .. ఆలాగే మన మెదడు కూడా ..
మన మెదడు లో ఆలోచనలకి కాస్త రెస్ట్ ఇచ్చి ... ధ్యానం తో ఏకాంతం లో మన మెదడునీ మనసుని కాస్త శుద్ధి చేసుకుని రెట్టించిన ఉత్సాహంతో .. మరిన్ని అవకాశాలు అందుకోవాలి ....

అత్యంత శక్తివంతమైన ఏకాంత సమయాన్ని సంపూర్ణంగా మన అభివృద్ధి కి ఉపయోగ పడేలా చేయగల శక్తి కేవలం థ్యానం కి మాత్రమే ఉంది ...

ధ్యానం ఎంత మృధు మధురంగా ఉంటుందో తెలుసా???

ప్రయత్నించి ప్రయోజనం సొంతం చేసుకుంటారని ఆశిస్తూ.

మానస సరోవరం
👏👏👏👏👏👏

Source - Whatsapp Message

Wednesday, May 26, 2021

శాంతి మంత్రాలు

శాంతి మంత్రాలు
హిందూ సంస్కృతి గొప్పదనం తెలియాలంటే...వీటి అర్థం తెలిస్తే సరిపోతుంది
శాంతి మంత్రములు సమాజంలో, దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్నిపెంచడానికి దోహదం చేస్తాయి.
ఇవి మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని ప్రస్తుత కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి చదివేవారు. వేదవిదులైన పండితుల ద్వారా పఠించబడే ఈ శాంతి మంత్రములు సమాజంలో, దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్నిపెంచడానికి దోహదం చేస్తాయి. వీటి అర్ధం తెలుసుకోవడం ద్వారా పూర్వం రోజుల్లో పండితులకు, గోవులకు భారతీయ సమాజంలో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది.

1. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:-
సర్వ జీవులు రక్షింపబడుగాక... సర్వ జీవులు పోషింపబడుగాక... అందరూ కలిసి గొప్ప శక్తితో కూడి పని చేయాలి ( సమాజ ఉద్ధరణ కోసం )... మన మేధస్సు వృద్ది చెందుగాక... మన మధ్య విద్వేషాలు రాకుండు గాక... ఆత్మా ( వ్యక్తిగత ) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక...

2. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు..
ఓం సర్వేషాం శాంతిర్భవతు..
ఓం సర్వేషాం పూర్ణం భవతు..
ఓం సర్వేషాం మంగళం భవతు..

తాత్పర్యం:-
సర్వులకు సుఖము, సంతోషము కలుగుగాక..
సర్వులకు శాంతి కలుగు గాక..
సర్వులకు పూర్ణ స్థితి కలుగుగాక.. సర్వులకు శుభము కలుగుగాక..

3. ఓం సర్వేత్ర సుఖిన: సంతు, సర్వే సంతు నిరామయా,
సర్వే భద్రాణి పశ్యన్తు మాకశ్చి: దుఃఖ:మాప్నుయాత్...

తాత్పర్యం:-
సర్వులు సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక..
సర్వులు ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండు గాక..
అందరికీ ఉన్నతి కలుగు గాక..
ఎవరికీ బాధలు లేకుండు గాక..

4. కాలే వర్షతు పర్జన్య: పృథివీ సస్య శాలినీ
దేశోయం క్షోభ రహితో బ్రహ్మణా సంతు నిర్భయ:

తాత్పర్యం:-
మేఘాలు సకాలములో కురియుగాక. భూమి సస్యశ్యామలమై పండుగాక. దేశములో ఏ బాధలు లేకుండు గాక. పురోహితులు ( పురం 'ఊరు' నకు హితం చేసేవారు ) వారి సంతతి నిర్భయులై సంచరించెదరు గాక.

5. ఓం అసతోమా సద్గమయ,
తమసోమా జ్యోతిర్గమయ,
మృత్యోర్మా అమృతంగమయ..
ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:-
సర్వవ్యాపి, నిరాకారుడైన భగవంతుడా, మమ్ములను అసత్యము ( మిధ్య ) నుంచి సత్యమునకు గొనిపొమ్ము. ( అజ్ఞానం అనే ) అంధకారము నుండి ( జ్ఞానస్వరూపమైన ) వెలుగునకు దారి చూపుము. మృత్యు భయము నుండి శాశ్వతమైన అమృతత్వము దిశగా మమ్ము నడిపించుము.

6. స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహీం మహీశా,
గో బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం, లోకా: సమస్తా సుఖినో భవంతు...

తాత్పర్యం:-
ప్రజలకు శుభము కలుగు గాక. ఈ భూమిని పాలించే ప్రభువులందరూ న్యాయ మార్గంలో పాలింతురు గాక. గోవులకు, బ్రహ్మజ్ఞానం కలిగిన వారలకు శుభము కలుగు గాక. జగతి లోని సర్వ జనులందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లెదరు గాక.

7. ఓం శం నో మిత్ర: శం నో వరుణ:
ఓం శం నో భవత్వర్యమా:
శం నో ఇంద్రో బృహస్పతి:
శం నో విష్ణు రురుక్రమ:
నమో బ్రాహ్మణో, నమో వాయు:
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి
ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి
తన్మామవతు తద్వక్తారమవతు
అవతు మాం, అవతు మక్తారం
ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:-
సూర్యుడు, వరుణుడు, యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు వీరందరూ మన యెడల ప్రసన్నం అగుదురు గాక.. బ్రహ్మ జ్ఞానం కలిగిన పండితులకు వందనం. వాయుదేవునకు వందనం. నీవే ప్రత్యక్ష బ్రహ్మవు. నేను బ్రహ్మమునే పలికెదను. సత్యమునే పలికెదను. సత్యము, బ్రహ్మము నన్ను రక్షించు గాక, నా గురువును, సంరక్షకులను రక్షించు గాక.

8. ఓం ద్యౌ శాంతి: అంతరిక్షం శాంతి:
పృథివీ శాంతి: ఆపా శాంతి: ఔషదయ శాంతి:
వనస్పతయ: శాంతి: విశ్వే దేవా: శాంతి:
బ్రహ్మ శాంతి: సర్వం శాంతి: శాంతి రేవా: శాంతి:
సామా: శాంతిరేది : ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:-
స్వర్గము నందు, దేవలోకము నందు, ఆకాశము నందు, అంతరిక్షము నందు, భూమి పైన, జలము నందు, భూమిపై ఉన్న ఓషధులు, వనమూలికలు, అన్ని లోకము లందలి దేవతల యందు, బ్రహ్మ యందు, సర్వ జనుల యందు, శాంతి నెలకొను గాక. ( పంచభూతముల వలన కాని, బ్రహ్మ మొదలగు దేవతల వలన కాని, అపాయములు కలుగకుండును గాక ) శాంతి యందె శాంతి నెలకొను గాక. నాయందు శాంతి నెలకొను గాక.

పైన చెప్పిన శాంతి మంత్రములు చదివి అర్ధం చేసుకోండి. మన హిందూ సంస్కృతీ ఎంత గొప్పదో తెలుస్తుంది. మన కోసమే కాక, అందరి క్షేమం కోసం, సర్వ ప్రాణుల సుఖ సంతోషాల కోసం ప్రార్ధించడం మన భారతీయ
సంస్కృతిలో ఉన్న గొప్పదనం .
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు🙏
ఓం శాంతి శాంతి శాంతిః

Source - Whatsapp Message

మీరూ ఇలాంటివారేనా???

మీరూ ఇలాంటివారేనా🤔😷

ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు.
అయితే ఆ వ్యక్తికి అతను యమధర్మరాజని తెలియదు.
యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్ళు అడిగారు.
ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే,
కానీ దాహం అని అడిగినందుకు అతను యమధర్మరాజుకు నీళ్లు ఇచ్చి దాహం తీర్చాడు.

నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు ఆ వ్యక్తితో, నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యమునిని... కానీ! నీవు తాగడానికి సిద్ధంగా ఉంచుకున్న నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని, యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చారు.
నీకు ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో అదే జరిగి తీరుతుంది
కానీ గుర్తుంచుకో...
నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే....
ఆ వ్యక్తి ఆ డైరీ తీసుకుని ఓపెన్ చేసాడు.

మొదటి పేజీలోనిది చదివాడు...
అందులో తన పక్కింటాయనకు "లాటరీ రాబోతోంది అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు" అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు, వాడు గొప్పవాడు కాకూడదు, అని రాశాడు.

తర్వాత పేజీ చదివాడు...
"తన స్నేహితుడికి ఇంటర్వ్యూలో పాసైయ్యి మంచి ఉద్యోగం రాబోతోంది " అది చదివి అతడు ఫెయిల్ అయ్యిపోవాలి, అతనికి ఉద్యోగం రాకూడదు, అని రాశాడు.

తర్వాత పేజీలో "తన స్నేహితురాలకి భర్తకి కోర్టులో నడుస్తున్న విడాకుల కేసు కోర్టు కొట్టివేసి ఇరువురికీ ఒకటి చేస్తుంది" అని చదివి వెంటనే అలా జరగకూడదు, వారు విడిపోవాలని రాసాడు,

ఈ విధంగా ప్రతి పేజీనీ చదువుతూ....
ఏదో వొకటి రాస్తూ...

చివరికి...!
ఖాళీగా ఉన్న తన పేజీలో తనకు కావలసింది రాయలని అనుకోగా...
ఈలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతినుండి డైరీని తీసుకుని,
నీకు ఇచ్చిన ఐదు నిమిషాల సమయం పూర్తి అయ్యింది. ఇప్పుడు నీవు ఏమి రాయకూడదు. నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల వ్యక్తిగత విషయాలలోనూ, ఇతరులను చింతన చేయడంలోనే, నీ సమయం అంతా వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం నీకిచ్చినా... స్వయంగా నువ్వే నీ జీవితాన్ని కష్టంలోకి నెట్టుకుని, చావుదాకా తెచ్చుకున్నావు
నీ యొక్క మృత్యువు నిశ్చితం అయింది అని డైరీ తీసుకున్నాడు యముడు.
ఆ వ్యక్తి చాలా పశ్చాతాప పడ్డాడు. వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ తనువును చాలించాడు.

ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అద్భుతమైన అవకాశాలను
తానే స్వయంగా గానీ...
బంధుమిత్రులు,
శ్రేయోభిలాషులు,
ఇరుగుపొరుగువారు,
బాటసారుల రూపంలో గాని మనకు పంపిస్తాడు.
కానీ మనము వ్యర్థము ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము.
ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారి పైన సదా భగవంతుని కృప నిండి ఉంటుంది.

ఈ సంగమయుగంలో భగవంతుడు కలం మనచేతికి ఇచ్చి
"మీ భాగ్యరేఖను మీరే రాసుకోండి" అని ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నారు.
కానీ మనము పర చింతన చేస్తూ సమయము వృధా చేసుకుంటున్నాము. మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాం...

సమస్త లోకా సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి 🙏

Source - Whatsapp Message

👍 _*త్వరలో అంతరించబోతున్న పాత తరం తస్మాత్ జాగ్రత్త

ఎండమావులు

చిన్నప్పుడు
ఏ పండక్కో..పబ్బానికో
కొత్త గౌను కుట్టిస్తే..
ఎంత ఆనందమో...

ఎప్పుడు పండగ
వస్తుందా, ఎప్పుడు
వేసేసుకుందామా
అన్న ఆతృతే...

ఇంటికి చుట్టాలొచ్చి
వెళ్తో వెళ్తూ.. చేతిలో
రూపాయో... అర్ధ
రూపాయో పెడితే
ఎంత వెర్రి ఆనందమో...

చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే
దుఃఖం తన్నుకు వచ్చేది...
ఇంకా ఉంటే బాగుండు
అన్న ఆశ...
ఎంత ఆప్యాయతలో...

సినిమా వచ్చిన ఏ
పదిహేను రోజులకో
ఎంతో ప్లాన్ చేసి
ఇంట్లో ఒప్పించి
అందరం కలిసి
నడిచి వెళ్లి..
బెంచీ టికెట్
కొనుక్కుని సినిమా
చూస్తే ఎంత ఆనందమో...

ఇంటికొచ్చాకా ఒక గంటవరకూ
ఆ సినిమా కబుర్లే...
మర్నాడు స్కూల్ లో
కూడా...
ఆ ఆనందం ఇంకో పది
రోజులుండేది...

అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం...అమాయకత్వం..

పక్కింట్లో వాళ్లకి రేడియో
ఉంటే..ఆదివారం
మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం
ముందు కూర్చుని
రేడియో లో సంక్షిప్త
శబ్ద చిత్రం (ఒక గంట కి
కుదించిన) సినిమాని
వింటే ఎంత ఆనందం...
మనింట్లో కూడా రేడియో
ఉంటే...అన్న ఆశ...

కాలక్షేపానికి లోటే లేదు...
స్నేహితులు
కబుర్లు, కధలు
చందమామలు
బాలమిత్రలు...

సెలవుల్లో మైలు దూరం
నడిచి లైబ్రరీ కి వెళ్లి
గంటలు గంటలు
కథల పుస్తకాలు
చదివి ఎగురుకుంటూ
ఇంటికి రావడం....

సర్కస్ లు,
తోలు బొమ్మలాటలు
లక్కపిడతలాటలు...
దాగుడు మూతలు...
చింత పిక్కలు
వైకుంఠ పాళీ
పచ్చీసు..
తొక్కుడు బిళ్ళలు..
ఎన్ని ఆటలో...

మూడు గదుల రైలుపెట్టి
లాంటి ఇంట్లో అంతమంది
ఎంత సంతోషంగా ఉన్నాం...
వరుసగా కింద చాపేసుకుని
పడుకున్నా ఎంత హాయిగా
సర్వం మరిచి నిద్రపోయాం...

అన్నంలో కందిపొడి..
ఉల్లిపాయ పులుసు
వేసుకుని తింటే
ఏమి రుచి...
కూర అవసరమే లేదు..

రెండు రూపాయలు తీసుకెళ్లి
నాలుగు కిలోల
బియ్యం తెచ్చేది...
ఇంట్లో, చిన్నా చితకా
షాపింగ్ అంతా నేనే...
అన్నీ కొన్నాకా షాప్
అతను చేతిలో గుప్పెడు
పుట్నాల పప్పో, పటికబెల్లం
ముక్కో పెడితే ఎంత
సంతోషం...
ఎంత బరువైనా
మోసేసేవాని..

ఎగురుతున్న విమానం
కింద నుండి
కళ్ళకు చెయ్యి అడ్డం
పెట్టి చూస్తే ఆనందం...

తీర్థం లో ముప్పావలా
పెట్టి కొన్న ముత్యాల దండ
చూసుకుని మురిసి
ముక్కలైన రోజులు...

కొత్త పుస్తకం కొంటే
ఆనందం...వాసన
చూసి మురిపెం..
కొత్త పెన్సిల్ కొంటే
ఆనందం...
రిక్షా ఎక్కితే...
రెండు పైసల
ఇసుఫ్రూట్ తింటే
ఎంత ఆనందం..?

రిక్షా ఎక్కినంత తేలికగా...
ఇప్పుడు విమానాల్లో
తిరుగుతున్నాం...
మల్టీప్లెక్స్ లో ఐమాక్స్
లో సినిమా చూస్తున్నాం.
ఇంటర్వెల్ లో
ఐస్ క్రీం తింటున్నాం..

బీరువా తెరిస్తే మీద పడి
పోయేటన్ని బట్టలు...
చేతినిండా డబ్బు...
మెడలో ఆరు తులాల
నగ....
పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...
ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...
హోమ్ థియేటర్లు...
సౌండ్ సిస్టమ్స్, అరచేతిలో
ఫోన్లు...అరచేతిలో
స్వర్గాలు...
అనుకోవాలే గానీ క్షణంలో
మన ముందు ఉండే
తిను బండారాలు..
సౌకర్యాలు...

అయినా చిన్నప్పుడు
పొందిన ఆ ఆనందం
పొందలేకపోతున్నాం
ఎందుకు నేస్తం...?
ఎందుకు...?ఎందుకు...?

చిన్నప్పుడు కోరుకున్నవి
అన్నీ ఇప్పుడు
పొందాము కదా...
మరి ఆనందం లేదేం...
ఎందుకంత మృగ్యం
అయిపోయింది...
ఎండమావి
అయిపోయింది..

మార్పు ఎందులో...?
మనలోనా...?
మనసుల్లోనా...?
కాలంలోనా...?
పరిసరాల్లోనా...?
ఎందులో... ఎందులో...?
ఎందులో నేస్తం...?
చెప్పవా తెలిస్తే....!!

👍 త్వరలో అంతరించబోతున్న పాత తరం తస్మాత్ జాగ్రత్త ...😢😢🙏

రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగు అవ్వబోతోంది.

అవును ఇది ఒక చేదు నిజం.!!

ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.

వాళ్ళు..

రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు.!
ఉదయం పెందరాళే లేచేవాళ్ళు.!
నడక అలవాటు ఉన్నవాళ్ళు.!
మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు.!

వాళ్ళు.....

ఉదయమే వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !
ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!
మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!
పూజకు పూలు కోసే వాళ్ళు !
వాళ్ళు....

పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !
మడిగా వంట వండేవాళ్ళు!
దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!
దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు.!
దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!
మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!!

వాళ్ళు

అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు.!
కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు..!
స్నేహంగా మెలిగే వాళ్ళు...!
తోచిన సాయం చేసేవాళ్ళు..!
చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు...!

వాళ్ళు

ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు..!
ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు...!
పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు...!
ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు....!

వాళ్ళు

పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు.!
కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు..!
సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు...!
పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ....!

వాళ్ళు ...

తీర్థయాత్రలు చేసేవాళ్ళు.!
ఆచారాలు పాటించే వాళ్ళు..!
తిధి,వారం ,నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు.!
పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు..!

వాళ్ళు ....

చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు.!
లుంగీలు, చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు...!
చిరిగిన చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు....!
అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు.!

వాళ్ళు ....

తలకు నూనె రాసుకునే వాళ్ళు .!
జడగంటలు పెట్టుకున్నవాళ్ళు..!
కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు...!
చేతికి గాజులు వేసుకునే వాళ్ళు.... !

ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషుల తో స్నేహంగా గడిపిన తరం.....

ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు

మీకు తెలుసా ?

వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.

మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.

మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి

లేదంటే .....
లేదంటే ....
లేదంటే ....

ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.
.
వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో మానవత్వం తో,స్నేహం తో కూడి ఉండే తరం..
.
సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!
.
స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !
.
కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!
.
ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగినతరం

ద్వేషం, మోసం లేని స్నేహ జీవనం గడిపిన తరం అది!
.
సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది.!
.
లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !🙏
.
ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!😊
.
తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం
.
వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది 🤔
.
మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .🙏
.
సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజాలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి...

సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని మార్చేయ్యకండి.!!!
తప్పులను సరిదిద్దగలది సంస్కారమే!🤝
.
సర్కారు చేసే చట్టాలు కాదు...🙏

రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను,స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు..🤔

_అందరూ బాగుండాలి అందులో మనం వుండాలి *🌹🙏

Source - Whatsapp Message

ఈరోజు వైశాఖ పూర్ణిమ - బుద్ధపూర్ణిమ

ఈరోజు వైశాఖ పూర్ణిమ - బుద్ధపూర్ణిమ

గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువై, పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. వైశాఖ పూర్ణిమను మహా వైశాఖి, బుద్ధ పూర్ణమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజున ఏ ఆధ్యాత్మిక సాధనలు చేసినా అధిక ఫలితం ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న పరమగురు పరంపర ముఖ్య కేంద్రంలో ఈ ప్రేరణను అందుకుంటారని భాగవత పురాణంలో వివరించబడింది. పరమగురు పరంపర కేంద్రాలు భూమి మీద అదనంగా ఆరు ఉన్నాయి. అవి జెనీవా, లండన్, న్యూయార్క్, టోక్యో, డార్జిలింగ్, ఆఫ్రికాలోని ఒక ప్రాంతం. ఈ కేంద్రంలో పరమగురు పరంపర ప్రస్తుత కాలపు ఆశ్రమాలుగా భావిస్తారు. భూగోళపు జీవుల గమ్యం ఈ కేంద్రం నుంచి బాధ్యతతో నిర్దేశింపబడుతుంది. వృషభ పూర్ణిమ సమయంలో చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్నప్పుడు పరమ గురువు, వారి శిష్యులు హిమాలయ శ్రేణులలోని వైశాఖ లోయలో కలుస్తారు. ఈ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఉత్తములు సంవత్సర ప్రణాళికను అందుకుంటారు. వీరు ఆ ప్రణాళికను మిథున పూర్ణిమ సమయంలో ఈ కింది వారికి ప్రసారం చేస్తారు. ఆలోచనాపరులు, మానవ జాతి నాయకులు, జంతు జాలం, వృక్ష జాతి, ఖనిజ సంపద. ఈ నాలుగు జాతులు భౌగోళిక జీవుల చతుర్భుజ అస్తిత్వాన్ని తెలియజేస్తాయి. అనాదిగా ఉన్న ఈ వ్యవస్థ కాలక్రమంలో మహా వైశాఖిగా, తదుపరి కాలంలో ఇది బుద్ధ పూర్ణిమగానూ ప్రసిద్ధిగాంచినది. యాదృచ్ఛికంగా జగద్గురు పీఠం అంతర్జాతీయ కేంద్రం అదే శబ్ద ఉచ్చారణతో ఉన్న విశాఖపట్నంలో ఉంది. విశాఖ సముద్ర మధ్యంలో వైశాఖేశ్వరుని ఆలయం కూడా ఉంది. అంతర్దృష్టి గలవారు వారి వారి భావ పవిత్రతను బట్టి ఈ అనురూప్యతను అర్థం చేసుకుంటారు.

పూర్ణిమ సమయంలో ధ్యానం మనసు, ఇంద్రియాలు, శరీరానికి ఎంతో ఉపయోగకరం. ఈ సమయంలో సహకారపు, అయస్కాంతపు శక్తుల ద్వారా ఆత్మ ఈ మూడు ఉపకరణాలను సులువుగా అనుసంధాన చేయగలదు. ఈ ధ్యానంపై ఆసక్తి ఉన్నవారు పూర్ణిమ ముందు రోజు నుంచి తేలికైన ఆహారం తీసుకోవాలని, భౌతిక వ్యవహారాలను కట్టుదిట్టం చేసుకోమని సూచించారు. ఎవరైతే తమ శరీరం, ఇంద్రియాలు, మనసును పవిత్రమైన ఆలోచన, చేతల ద్వారా సంధానపరుచుకుంటారో వారు పూర్ణిమ శక్తులను అనుభూతి చెందగలరు. సూక్ష్మ ప్రయాణం ద్వారా వైశాఖ లోయలో నిర్వహింపబడే జ్ఞానుల వార్షిక మహా సమావేశానికి అనుభూతి చెందగలిగే అవకాశం కూడా కలుగుతుంది. సిద్ధార్ధుని బుద్దునిగా మార్చిన బోధివృక్షం పూజా భజనకు నిలువైంది.

వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షానికి పూజచేసే ఆచారం బుద్దుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది. బేతవన విహారంలో బుద్ధుడు ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పువ్వులు తెచ్చారు. కాని ఆసమయంలో బుధుడు ఎక్కడికో వెళ్లి ఉన్నాడు. భక్తులు బుద్దుని దర్శనం కోసం చాలాసేపు వేచి చూశారు. ఎంతసేపటికి బుద్దుడు రాకపోవడంతో భక్తులు నిరుత్సాహం చెంది ఆ పుష్పాలను అక్కడే వదలి వెళ్లిపోతారు. దీనిని గమనించిన బేతవన విహారదాత అనంత పిండకుడు పూజకు తెచ్చిన పూవ్వులు నిరుపయోగం కావడం జీర్ణించుకోలేకపోయాడు. బుద్ధుడు రాగానే ఈ విషయం గురించి చెప్పిన పిండకుడు, మీరు లేనప్పడు కూడా పూజ కొనసాగడానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్లాలని కోరాడు. శారీరక పారిభాగాది (అవయవాలు) పూజలు అంగీకరించని బుద్ధుడు, ఒక్క బోధివృక్షాన్ని మాత్రమే పూజకు అనుమతించాడు. తన జీవితకాలం, తదనంతరమూ ఈ ఒక్క విధమైన పూజ సాగడమే సమ్మతమైందని చెప్పాడు. దీంతో బేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు. గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. అప్పడు ఒక గొప్ప ఉత్సవం సాగింది. కోసలదేశపు రాజు తన ఉద్యోగులతో, అనుచరులతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధభిక్షకులు వచ్చారు. ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులలో ప్రబలింది. ఆ పూజ ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు సాగించడం ఒక ఆచారమైంది. ఇప్పడు బౌద్దమతం ప్రబలి ఉన్న అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షపూజ సాగుతూ ఉంది.

అందరికి బుద్ధపౌర్ణమి శుభాకాంక్షలు..

Source - Whatsapp Message

*ఒకసారి ఒక చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు... ఇలా అడిగాడు..* *నేను ఎందుకు పేదవాడను?* *బుద్ధుడు సమాధానం చెప్పాడు:* సహాయం చెయ్యడానికి డబ్బు అవసరం లేదు ..

పది మందికి - సహాయపడాలి అంటే ఎంత డబ్భు అవసరం

ఒకసారి ఒక చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు... ఇలా అడిగాడు..

నేను ఎందుకు పేదవాడను?

బుద్ధుడు సమాధానం చెప్పాడు:

మీరు ఎందుకు పేదవారు అంటే మీరు ఎటువంటి ఔదార్యము కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు, కాబట్టి మీరు పేదవారు అని అన్నారు,

నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది కనుక?అని ఆ పేదవాడు అడిగాడు..

అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు

మీరు ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను మీరు కలిగివున్నారు తెలుసా!!!...

మొదట మీ ముఖం ఉంది, మీరు ఇతరులతో మీ ఆనందాలను (నవ్వులను) పంచుకోవచ్చు .. ఇది ఉచితం ...ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది ...

రెండవది మీ కళ్ళు మీకు ఉన్నాయి, మీరు ప్రేమ మరియు శ్రద్ధతో ఇతరులను చూడవచ్చు ..
ఇది నిజం... మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు ... వాటిని మంచి అనుభూతితో చేయండి...

మూడవది మీకు భగవంతుడు ప్రసాదించిన నోరు ఉంది, ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు .. మంచి చర్చించి, సత్సంగములో చేర్పించి ... వాటిని విలువైనదిగా భావించండి ..
దానితో ఆనందము మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి ...

నాలుగవది మీకు భగవంతుని ప్రసాదమైన గుండె ఉంది.... మీ దయగల హృదయంతో , భగవంతున్ని ప్రార్థిస్తూ ... మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు ... ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు... వారి జీవితాలను తాకవచ్చు...

మీరు కలిగి ఉన్న చివరి ఐదవ సంపద మీ శరీరం .... ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు ... అవసరమైన వారికి చేతనైన సహాయం చేయవచ్చు....

సహాయం చెయ్యడానికి డబ్బు అవసరం లేదు ..

ఒక చిన్న శ్రద్ధ , సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు... భగవంతుడు మనకిచ్చిన జీవితం.. కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ !

*మిత్రులారా! కావున ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికి చేతనైన సహాయం చేస్తూ, మన జన్మను చరితార్థం చేసుకొని మానవ జన్మకు సార్థకత చేకూర్చుదాం.

🌹🙏🌹

Source - Whatsapp Message

బుద్ధుడు! ఓ సజీవ సాక్ష్యమా..అదెలా!?

ఈరోజు బుద్ద పౌర్ణమి సందర్భంగా ఒక చక్కటి సందేశం.
బుద్ధుడు! ఓ సజీవ సాక్ష్యమా..అదెలా!?
-----------------------------------------------
భిక్షపాత్రతో నిలబడివున్న బుద్ధుడిని చూడగానే ఆ రోజు..ఓ ఇంటతనికి పరమచిరాకు కలిగింది.

సోమరి పోతులు, తిండికూడా సంపాదించుకోలేని చవట
సన్నాసులు. వూరిమీదపడి జీవించే
పరాన్న భుక్కులు..ఇలాంటి వారివల్ల సమాజానికి ఆదర్శమా ఉపయోగమా!? పెడితే తింటారు. పొమ్మంటే పోతారు. ఇలాకాదు. ఏదేమైన ఈరోజు వీరికి బుద్ధిచెప్పాలి. అనుకున్నదే తడవుగా కోపంతో..

బుద్దుడ్ని చూస్తూ నానా మాటలూ అన్నాడు. తిట్టితిట్టి అలిసిపోయానని అర్ధమైయ్యిందతనికి. ఐనా బుద్దుడిలో మార్పులేదు సరికదా..
"అయ్యిందా..!? ఇంకేమైనా వుందా" అన్నట్టు..చిరునవ్వుతో చూసాడు అసలేమి జరగనట్టే ! పైగా.."సుఖిభవ" అంటూ అతన్ని
దీవించిమరీ కదిలాడు బుద్దుడు అక్కడినుండి.
ఇదిమరీ చిరెత్తుకొచ్చింది ఇంటతనికి. వెళ్లిపో తున్న బుద్ధుడిని ఆపిమరీ అడిగాడు.

@ నిన్ను ఇన్ని తిట్టానుకదా నన్ను దీవించటం ఏమిటీ..!? నికేమన్నా పిచ్చా. అసలు బుర్ర వుందా నీకు..!?
# భిక్షకోసం మీముందుకు వచ్చాను. దాత ఏమిచ్చినా స్వీకరించటం భిక్షకుడి ధర్మం.
దాత ఇష్టం.. భిక్షగా వారేమైనా ఇవ్వొచ్చు.
ఆ పాత్రని ఆహారంతో నింపితే..ఆ ఫలితం మీది. లేదూ! ఆ పాత్రని మీతిట్లతో నింపితే అపుడూ ఆ ఫలితం మీదే! కర్మ మీది. తత్
ఫలితమూ మీదైనపుడు నాకెందుకు చింత.

దాతగా మీపని మీరు చేశారు. స్వీకర్తగా నాపని నేను చేయాలిగా. ఏమిచ్చారన్న దానితో నాకు ప్రమేయం లేదు. మీరేమిచ్చినా ప్రతిగా మీపట్ల కృతజ్ఞతని వ్యక్త
పరచటం బిక్షకుడి ధర్మం. అదేకదా...చేసాను..అన్నాడు బుద్దుడు నవ్వుతూ.

ఇంటతను నివ్వెరపోయాడో క్షణం.
మరుక్షణం అతను బుద్ధుడి పాదాలవద్ద వున్నాడు. ఐనా అతని కళ్ళు వర్షిస్తూనే వున్నాయి ధారపాతంగా. బుద్ధుని మార్చా
లని పూనుకున్న అతనిలోనే సమూలమైన మార్పు వచ్చింది..

'బుద్ధుడు.. ఓ తామరాకుమీది నీటిబొట్టు వంటి వాడని. జీవిస్తూనే..జీవితాన్నెలా
అంటకుండా ఉండాలో; జీవిస్తూనే..
ఆ జీవితాన్ని ఇతరుల కోసమెలా
వాడాలో; తెలిపే ఓ సజీవ సాక్ష్యమని.
అతనికి అర్ధం అయ్యింది.

బుద్ధుడులాంటి వ్యక్తే బహుశా ఈ భూమ్మీద లేకుంటే..మానవాళికిది సాధ్యమేనన్న సంగతెలా నిరూపితమై ఉండేదని అతనికిపుడు అవగతమైయ్యింది.
👏👏👏👏

Source - Whatsapp Message

"పెరుగుట విరుగుట కొరకే" అంటే ఇదే మరి.

ఇంటి ముందు చెట్టు పోయి ఇంట్లో A.C వచ్చింది
ఇంటి బయట పొయ్యి పోయి ఇంట్లో గ్యాస్ వచ్చింది
ఇంటి ముందు అరుగులు పోయి ఇంట్లో టీవీ వచ్చింది
ఇంటి ఆవరణలో పెరడు పోయి పాలరాయి ఫ్లోర్ అయింది
ఇంటి బయట కుండ పోయి ఇంట్లో ఫ్రిడ్జ్ అయింది
ఒంట్లో బద్దకం చేరి ఇంట్లో వాషింగ్ మెషీన్ అయింది
ఇంటి బయట రుబ్బురోలు పోయి ఇంట్లో మిక్సీ అయింది
ఇంట్లో పుస్తకాలు పోయి చేతిలో మొబైల్ అయింది
ఇంటిముందు రంగవల్లులు పోయి పెయింటింగ్ లు వచ్చాయి
ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో అనాధలయ్యారు
ఇంటి బయట మరుగుదొడ్లు ఇంట్లో ఎటాచ్ బాత్రూమ్స్ అయ్యాయి
అమ్మ,నాన్న,అత్త,మామ,బాబాయ్,పిన్ని పిలుపులు మామ్, డాడ్,అంటీ,అంకుల్ గా మారాయి
శరీరానికి రాసే సున్ని పిండి పోయి మార్కెట్లో సబ్బులయ్యాయి
జుట్టుకు పెట్టుకొనే కుంకుడుకాయలు పోయి షాంపూలు అయ్యాయి
గడపకు కట్టే పచ్చని తోరణాలు ప్లాస్టిక్ పువ్వులయ్యాయి
వంట చేసుకొనే మట్టి పాత్రలు ఇంట్లో స్టీల్,ప్లాస్టిక్ గిన్నెలయ్యాయి
ఇంట్లో ఆయుర్వేద వైద్యం మరచి పోయి వీధిలో
మెడికల్ షాపులకు వలసకట్టాము
శరీరాన్ని కప్పుకొనే దుస్తులు పోయి ఫ్యాషన్ మాయలో గుడ్డ పీలికలయ్యాయి
ముఖానికి రాసుకొనే పసుపు,మీగడ పోయి మార్కెట్లో ఫేస్ క్రీములయ్యాయి
పొడుగైన వాలుజాడలు కోత్తిమీర కట్టలయ్యాయి
చేతికి అందంగా పెట్టుకొనే గోరింటాకు పోయి మెహిందీ కోనులయ్యాయి
కుటుంబం కలిసి జరుపుకొనే పండుగలు,పబ్బాలు
వాట్సప్ స్టేటస్ గా మారాయి
సాంప్రదాయబద్ధమైన పెళ్ళిళ్ళు పోయి డెస్టినేషన్ పెళ్ళిళ్ళు వచ్చాయి
ఎడ్లబండ్లు పోయి పెట్రోల్ వాహనాలు వచ్చాయి
పచ్చని పొలాలు ఫ్యాక్టరీలు,భవంతులయ్యాయి
కుటుంబంలో అనుబంధాలు ఆర్ధిక సంబంధాలయ్యాయి
ఇంటి చుట్టూ బంధాలు అవసరాలకు పరిమితమయ్యాయి
మనిషిలో మంచి,మానవత్వం పోయి మోసం,ద్వేషం పెరిగాయి
సంపాదన ధ్యాసలో మనిషి జీవితం యాంత్రికంగా మారింది
డబ్బే పరమావధిగా,వస్తువులే హోదాగా భావించే మనిషి రాక్షషుడయ్యాడు
నాటి మనిషి జీవితం ఆరోగ్యంగా,ఆనందంగా సాగేది..
నేటి మనిషి జీవితం ఒత్తిడి,ఆందోళనలు,
అనారోగ్యంతో సాగుతుంది..
ఆధునికత మాయలో ప్రకృతిని కలుషితం చేసి
మన గొయ్యిని మనమే తొవ్వుకున్నాము.
"పెరుగుట విరుగుట కొరకే" అంటే ఇదే మరి.

Source - Whatsapp Message

గౌతమబుద్ధుడు

🕊️ గౌతమబుద్ధుడు 🕊️

ఒకసారి గౌతమబుద్ధుడు ఒక ముసలి వ్యక్తి ని, ఒక రోగిని, ఒక మరణం ను చూసిన తర్వాత దుఃఖానికి కారణం తెలుసుకోవడానికి అడవికి బయలు దేరెను.
గౌతమబుద్ధుడు ఎంతోమంది గురువుల దగ్గరకు వెళ్ళాడు. అలారకలముడు, ఉద్ధకరామభద్రుడు, ఇంకా ఎంతోమంది!
“మంత్రమే గురువు” అనీ, మరొకరు “ఆహారం లేకుండా ఉండు .. అదే నీ గురువు అవుతుంది” అనీ, “ఉపనిషతులు చెప్పిందే మననం చేస్తూండు” అనీ, “ముక్కు బిగపట్టుకుని ఉండు .. చక్రాల మీద మనస్సును ఏకాగ్రం చెయ్యి .. భృకుటి మధ్యలో మనస్సును లగ్నం చెయ్యి” అనీ రకరకాల గురువులు రకరకాలుగా బుద్ధుడికి బోధించారు.

అన్నింటినీ త్రికరణశుద్ధిగా అభ్యసించి తాను నేర్చుకున్నవన్నీ ఒక్కొక్కటిగా .. “అది తప్పు”, “ఇది తప్పు” అని తేల్చుకోవడానికి ఐదున్నర సంవత్సరాలు పట్టింది!

చివరికి సహజంగా, సరళంగా, సున్నితంగా ఉన్న తన శ్వాస మీదే .. ఏ కుంభకమూ లేని .. కేవల సహజ పూరక శ్వాస ధార మీదే తన ధ్యాస ధారను లగ్నం చేసి ” ఆనాపానసతి ” చేశాడు.
బుద్ధుడు ఒకసారి అడవిలో సాథన చెయ్యగా దివ్యదృష్టి ఓపెన్ అయ్యి తన గత జన్మలు అన్ని చూసుకొన్నాడు. అంతటా ఉన్న దుఖానికి కారణం కనుక్కొన్నాడు. తర్వాత ఇంత సాథన చేస్తే నాకు దివ్యదృష్టి తెరుచుకుని జ్ఞానం కలిగింది.ఇది అందరికీ కలగాలంటే నేను ఏం చెయ్యాలి అని ప్రశ్న వేసుకొని దివ్యదృష్టి ద్వారా చూస్తే అప్పుడు "ఆనాపాన సతి" అని పాళి భాష లో అక్షరాలు కనిపించాయి. ఆనాపాన సతి అంటే తెలుగు లో "శ్వాస మీద ధ్యాస".
దీనినే ధ్యానం అంటే శ్వాసమీద ధ్యాస అంటాం.
ఏదైతే తన దివ్యద్రృష్టి ద్వారా చూశారో అదే ధ్యానం తర్వాత అందరికీ బోధించారు.

గౌతమ బుద్ధుడు పుట్టిన రోజు పౌర్ణమి రోజు.
జ్ఞానోదయం కలిగింది పౌర్ణమి రోజు.

ఆనాపానసతి” అన్నది సుమారు 2500 సం|| క్రితం గౌతమబుద్ధుడు ఉపయోగించిన పాళీ భాష కు చెందిన పదం. పాళీ భాషలో..
‘ ఆన ’ అంటే ‘ ఉచ్ఛ్వాస ’
‘ అపాన ’ అంటే ‘ నిశ్వాస ’
‘ సతి ’ అంటే ‘ కూడుకుని వుండడం.

“ ఆనాపానసతి ” అంటే మన శ్వాసతో మనం కూడుకుని వుండడం “; దీనినే మనం “శ్వాస మీద ధ్యాస” అని చెప్పుకుంటున్నాం. “ఆనాపానసతి” అన్నది ప్రపంచానికి సకల ఋషులు, సకల యోగులు అందరూ కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం !
-
బ్రహ్మర్షి పత్రిజి*

Source - Whatsapp Message

*శాస్త్రజ్ఞానులకు పదిహేను కీలక ప్రశ్నలు… సైన్స్ ఇప్పుడొక పెద్ద దందా…* *ఏది శాస్త్రం? ఏది అజ్ఞానం? జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు 15…*

శాస్త్రజ్ఞానులకు పదిహేను కీలక ప్రశ్నలు… సైన్స్ ఇప్పుడొక పెద్ద దందా…

ఏది శాస్త్రం? ఏది అజ్ఞానం? జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు 15…

రచయిత: Dr. Sriram (Ph D & Postdoctoral) Expert (Public Policy & Governance)

నా చిన్నప్పటి నుంచీ సైన్స్ ను నికరంగా నమ్మే నేను, కొన్ని జీవితానుభవాల ద్వారా చేసుకున్న అవగాహన, ఆలోచనల్లో నుంచి వచ్చిన కొన్ని సందేహాలు.. . అసలైన శాస్త్రీయ విజ్ఞానాన్ని మాత్రమే నమ్మే వ్యక్తి గా కొన్ని ప్రశ్నలు. (వ్యాపారం కోసం ఒక సైన్స్ ను సృష్టించి, రోగాలపైన రీసెర్చ్ పేరుతో కొత్త విజ్ఞానాన్ని సృష్టించి, లాభాల కోసం సృష్టించిన దాన్ని నమ్మే వ్యక్తి కాదు నేను) ఇక్కడే ఉంది కిటుకు. ఆ కిటుకు తెలుసుకోకుండా వ్యాపార, కార్పొరేట్ వర్గాలు స్పాన్సర్ చేసి ఆర్ & డి చేసి, లాభాల కోసం ఒక రీసెర్చ్ ను సృష్టించి, అదే సైన్స్ అంటే, దాన్నే విజ్ఞానమని నమ్మితే, మూఢ నమ్మకాలు నమ్మేవారికి మీకు ఏమీ తేడా లేదు. మూఢ విశ్వాసాలను నమ్మే వారికీ – వ్యాపారమ్ కోసం ఒక సైన్స్ ను సృష్టిస్తే దాన్నే శాస్తీయ విజ్ఞానమని నమ్మి, ప్రచారం చేసే వారికీ ఎలాంటి తేడా లేదు. ఇక మీరు జవాబు ఇవ్వాల్సిన ప్రశ్నలు.

1. గత 50 ఏళ్లుగా వైద్య, చికిత్సా రంగంలో జరుగుతున్న రీసెర్చ్ విజ్ఞానం చాలావరకు ఖచ్చితమైనది కాదు. వారానికి ఒకసారి ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అని రీసెర్చ్ లో వెల్లడైతే, అదే టాబ్లెట్ ను రోజుకు 3 సార్లు వేసుకోవాలని రీసెర్చ్ లో చెప్పించి, లాభాలు చేసుకునేవి కంపెనీలు. డాక్టర్ల తో సెమినార్లలో అలాగే చెప్పించి, పేపర్లు పబ్లిష్ చేస్తే అదే సైన్స్ అని నమ్మితే అంత కంటే మూర్ఖత్వం లేదు.

2. గత 50 ఏళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మరి జబ్బులు, రోగులు ఎందుకు పెరుగుతున్నారు? రోగాలు వస్తున్నాయా లేక రోగులను సృష్టిస్తున్నారా ? రోగాలను నయం చేస్తున్నారా ? రోగులను దోచుకుంటున్నారా?

3. ఈ దేశంలో అయొడైజ్డ్ ఉప్పు అవసరం లేదు (ఒక్క హిమాలయ ప్రాంతాలకు తప్ప). గత పాతికేళ్లలో అయొడైజ్డ్ ఉప్పు అందరికీ రుద్ది, ప్రతి ఇంటా ఒకరు లేదా ఇద్దరు థైరాయిడ్ రోగులను సృష్టించింది ఎవరు మరి? అయొడైజ్డ్ ఉప్పు వాడితే మంచిదే ఐతే కోట్లకు కోట్ల రోగులు ఈ దేశంలో ఎందుకు థైరాయిడ్ రోగులు సృష్టించబడి, జీవితాంతం మందులు వాడేలా చేసింది ఏ రీసెర్చ్? ఏ సైన్స్? సైన్స్ పేరుతో అయొడైజ్డ్ ఉప్పును కోట్ల రూపాయల బిజినెస్ గా ఎలా మారింది? (కొందరు సినిమా ప్రచారకులు కూడా అయొడైజ్డ్ ఉప్పు మాత్రమే వాడాలని ఊకదంపుడు ప్రచారం చేసినట్టు గుర్తు ఆ రోజుల్లో. కోట్లకు కోట్ల థైరాయిడ్ కేసులు ఇండియాలో పెరగడానికి వారు కూడా కారణమేనా?)

4. మారుమూల గిరిజన ప్రాంతాల్లో, అయొడైజ్డ్ ఉప్పు వాడనివారిలో థైరాయిడ్ కేసులు ఎందుకు తక్కువగా ఉన్నాయి ?

5. నెలకొక యాంటీ బయోటిక్ రిలీజ్ చేస్తూ, ఒకదాన్ని మించిన శక్తి ఇంకోటి, ఒక కంపెనీని మించి ఇంకో కంపెనీ, అసలు ఇప్పుడు యాంటీ బయటిక్ ఏదీ పనిచేయడం లేదు, రెసిస్టన్స్ పవర్ బాక్టీరియాకు పెరిగి. అసలు దీనితో కొత్త రోగాలు వచ్చినా ఇంకా కొత్తగా ఎలాంటి మందు వచ్చినా పనిచేయని దీన స్థితికి వచ్చి, అసలు మానవాళి భవిష్యత్తు ప్రమాదంలో పడడానికి కారణం సైన్సు వ్యాపారంగా మారడం కాదా?

6. మీకో విషయం తెల్సా… ఐసియూలో ఎంత ప్రమాదకర బాక్టీరియా ఉంటుందో…! మార్చురీల్లో ఉండే బాక్టీరియా, ఐసియూల్లో ఉండే బాక్టీరియా దాదాపుగా ఒకటే అనే ప్రమాదకర స్థాయికి ఎందుకు వచ్చింది…

7. మూఢవిశ్వాసాలు ప్రజల్లో కొంతమందిని మాత్రమే మూర్ఖులుగా తయారు చేస్తే – వ్యాపారం కోసం సృష్టించిన సైన్స్ పరిశోధనల వల్ల అసలు మానవ, జంతు, వృక్ష జాతుల ఉనికికే ముప్పు వచ్చింది.

8. కొలెస్ట్రాల్ కు గుండె జబ్బుకు సంబంధం లేదని, అమెరికాలోని ఒక సైన్స్ జర్నలిస్టు (http://garytaubes.com/) ఏళ్ళ పాటు రీసెర్చ్ చేసి రాస్తే, అది టైం మ్యాగజైన్ కవర్ పేజీగా రాలేదా? అవన్నీ బయటకు రాకుండా ఫార్మా, మెడికల్ మాఫియా ఆ స్టడీ నొక్కిపెట్టి, వేల కోట్ల కొలెస్ట్రాల్ మాత్రల బిజనెస్ చేసుకోడం లేదా?

9. ఒకప్పుడు 150 దాకా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటే, దాన్ని 90-110 కు తగ్గించి, కొత్త షుగర్ రోగులను సృష్టించింది సైన్స్ కాదా?

10. బీపీ టాబ్లెట్ వేసుకోకపోతే స్ట్రోక్ వస్తుందని ప్రచారం చేసి, బీపీ మాత్రలను వాడాలని చెపితే… దానితో సోడియం లెవెల్స్ పడిపోయి, ఐసీయూల్లో చేరడం.., 60 ఏళ్ళ తర్వాత బీపీ మందుల వల్ల పార్కిన్సన్ రోగం ఎందుకు వస్తోంది? ఇండియాలో 55 ఏళ్లకే పార్కిన్సన్ రోగులను చూడాల్సిన విషాదానికి ఎవరు కారణం?

11. 20-25 ఏళ్ళ కింద ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ఓపీ -ఓటీ (అవుట్ పేషంట్ ఆపరేషన్ థియేటర్లు) ఉండేవి. చాలా మైనర్ సర్జరీలు అక్కడే చేసి ఒక పూటలోనే ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపేవారు (అసలు ఆసుపత్రిలో ఇన్ పేషంట్ అవసరం లేకుండానే). ఇప్పుడు అలాంటి మైనర్ సర్జరీలకు కూడా స్పెషల్ వార్డులు/ఐసియూ ల్లో చేరాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి?

12. పది రూపాయలు మాత్రమే ఖర్చయ్యే మాత్ర రేటును 300 రూపాయలకు అమ్మేలా సృష్టించిన సైన్స్ నిజంగా సైన్స్ అని ఎలా నమ్మాలి? అది నిజంగా ప్రజల కోసం సైన్స్ అయినప్పుడు ప్రజలు ఎందుకు దోపిడీకి గురవ్వాలి. ఆ సైన్స్ వ్యాపారం కోసం ఐతే అది శాస్త్రీయమా?

13. క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ పథ్యం చెప్పి తే అది నాన్ సెన్స్ అని కొట్టి పడేసే ఇంగ్లీష్ డాక్టర్లు, బీపీ, షుగర్ మందులు రాసి ఉప్పు, చక్కర తగ్గించాలనే పథ్యం చెప్పడం ఏంటి ? అక్కడ నాన్ సెన్స్ ఐతే ఇక్కడ నాన్ సెన్స్ కాకుండా ఉంటదా? అజీర్ణ సమస్యలకు ఆయుర్వేదంలో ఆహార నియమాలు పాటిస్తే మందులు లేకుండానే తగ్గుతుంది. ఇది శాస్త్రీయం. ఇంగ్లీష్ డాక్టర్లు మందులు వాడు – ఇష్టం వచ్చింది తిను – జీవితాంతం రోగిగా ఉండు అనేది శాస్త్రీయమా? పైన ఇంగ్లీష్ డాక్టరు స్వీట్, ఉప్పు వద్దని చెప్పి అజీర్ణ సమస్యలకు పథ్యం ఎందుకు చెప్పరు? ఇంగ్లీష్ వైద్యం – విజ్ఞానం గత 200 ఏళ్ళ నుంచి ఉంది కానీ ప్రపంచవ్యాప్తంగా స్థానికంగా ఉన్న వైద్య పద్ధతులు అనేక వేల సంవత్సరాలు ప్రజల్ని కాపాడాయి కదా. గుడ్డిగా అశాస్త్రీయం అని మీలాంటి వాళ్ళు కూడా ముందూ వెనకా చూడకుండా నాటువైద్యమని ముద్ర వేశారు కదా! ఆధునిక విజ్ఞానం అంత శాస్త్రీయమైతే రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి, రోగులు జీవితాంతం మందులు వేసుకునేలా చేసేది ఆధునిక శాస్త్రీయ వైద్యమా?

14. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర చికిత్సలకు ఇంగ్లీష్ వైద్యమే సరైన మందు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇతర జబ్బులకు ఇంగ్లీష్ వైద్యం ఏం చెపుతుంది అంటే, “మందులను ఆహారంగా వాడి ఆరోగ్యాన్ని కొనుక్కో, మాకు లాభాలు పండించు అని చెప్తుంది”. ఇతర ఆరోగ్య చికిత్సా పద్ధతులు ఏం చెప్తాయి అంటే ఆహారాన్ని మందుల మోతాదులో మాత్రమే తీసుకో – ఆరోగ్యాన్ని నీకు నువ్వే సంరక్షించుకో”…

15. ఇంగ్లీష్ మందుల్లో ఆహార పథ్యం లేదు అని చెప్పే డాక్టర్లు, డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ లను కలవమని మరీ విధిగా చెప్తున్నారు కదా. ఇది శాస్త్రీయత అనాలా ఏమి అనాలి? నేడు, రేపు, ఎల్లుండి ఆపై కూడా నేను సైన్స్ నే నమ్ముతాను కానీ కోట్లకుకోట్ల రూపాయలతో వ్యాపారం కోసం లాభాల కోసం సృష్టించిన సైన్స్ ను కాదు. వ్యాపారం కోసం సృష్టించిన సైన్స్ ను గుడ్డిగా నమ్మేవాళ్ళు, అంధ విశ్వాసంలో వుండి మూఢ నమ్మకాలను నమ్మే వారి మధ్య ఎలాంటి తేడా లేదు…

SOURCE: https://muchata.com/15-questions-have-no-answers/amp/

Source - Whatsapp Message

Tuesday, May 25, 2021

ఆధునికత మాయలో ప్రకృతిని కలుషితం చేసి మన గొయ్యిని మనమే తవ్వుకున్నాము.....

ఇంటి ముందు చెట్టు పూల చేట్లుపోయి
ఇంట్లో A.C వచ్చింది.

ఇంటి బయట పొయ్యి పోయి ఇంట్లో గ్యాస్ వచ్చింది.
ఇంటి ముందు అరుగులు పోయి ఇంట్లో టీవీ వచ్చింది.

చేతి. నూలు బట్ట, జనూమూ సంచీ పోయి ప్రతి ఓక్కటి ప్లాస్టిక్కు మయం ఐంది. ప్లాస్టిక్కు తో మానవ జీవితం అల్లకల్లోలం ఐపోతుందని తేల్య్సుకోలేకపోతుండు

ఇంటి ఆవరణలో పెరడు పోయి పాలరాయి ఫ్లోర్ అయింది.

ఇంటి బయట కుండ పోయి ఇంట్లో ఫ్రిడ్జ్ అయింది.
ఒంట్లో బద్దకం చేరి ఇంట్లో వాషింగ్ మెషీన్ అయింది.

ఇంటి బయట రుబ్బురోలు పోయి ఇంట్లో మిక్సీ అయింది.
ఇంట్లో పుస్తకాలు పోయి చేతిలో మొబైల్ అయింది.

ఇంటిముందు రంగవల్లులు పోయి పెయింటింగ్ లు వచ్చాయి.
ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో అనాధలయ్యారు.

ఇంటికి దూరం గా ఉన్న మరుగుదొడ్లు ఇంట్లో ఎటాచ్డు బాత్రూమ్స్ అయ్యాయి.

అమ్మ,నాన్న,అత్త,మామ,బాబాయ్,పిన్ని పిలుపులు మామ్, డాడ్,అంటీ,అంకుల్ గా మారాయి.
శరీరానికి రాసే సున్ని పిండి పోయి మార్కెట్లో సబ్బులయ్యాయి.
జుట్టుకు పెట్టుకొనే కుంకుడుకాయలు పోయి షాంపూలు అయ్యాయి.
గడపకు కట్టే పచ్చని తోరణాలు ప్లాస్టిక్ పువ్వులయ్యాయి.
వంట చేసుకొనే మట్టి పాత్రలు ఇంట్లో స్టీల్,ప్లాస్టిక్ గిన్నెలయ్యాయి.

ఇంట్లో ఆయుర్వేద వైద్యం మరచి పోయి వీధిలో
మెడికల్ షాపులకు వలసకట్టాము.
శరీరాన్ని కప్పుకొనే దుస్తులు పోయి ఫ్యాషన్ మాయలో గుడ్డ పీలికలయ్యాయి.
ముఖానికి రాసుకొనే పసుపు,మీగడ పోయి మార్కెట్లో ఫేస్ క్రీములయ్యాయి.
పొడుగైన వాలుజాడలు కొత్తిమీర కట్టలయ్యాయి.

చేతికి అందంగా పెట్టుకొనే గోరింటాకు పోయి మెహిందీ కోనులయ్యాయి.
కుటుంబం కలిసి జరుపుకొనే పండుగలు,పబ్బాలు
వాట్సప్ స్టేటస్ గా మారాయి.
సాంప్రదాయబద్ధమైన పెళ్ళిళ్ళు పోయి డెస్టినేషన్ పెళ్ళిళ్ళు వచ్చాయి.
ఎడ్లబండ్లు పోయి పెట్రోల్ వాహనాలు వచ్చాయి.
పచ్చని పొలాలు

ఫ్యాక్టరీలు,భవంతులయ్యాయి.
కుటుంబంలో అనుబంధాలు ఆర్ధిక సంబంధాలయ్యాయి.

ఇంటి చుట్టూ బంధాలు అవసరాలకు పరిమితమయ్యాయి.
మనిషిలో మంచి,మానవత్వం పోయి మోసం,ద్వేషం పెరిగాయి.
సంపాదన ధ్యాసలో మనిషి జీవితం యాంత్రికంగా మారింది.
డబ్బే పరమావధిగా,వస్తువులే హోదాగా భావించే మనిషి రాక్షషుడయ్యాడు.
నాటి మనిషి జీవితం ఆరోగ్యంగా,ఆనందంగా సాగేది..
నేటి మనిషి జీవితం

ఒత్తిడి,ఆందోళనలు,
అనారోగ్యంతో సాగుతుంది..
ఆధునికత మాయలో ప్రకృతిని కలుషితం చేసి
మన గొయ్యిని మనమే తవ్వుకున్నాము.....

Source - Whatsapp Message

సీతానవమి సందర్భంగా, హైందవ కుటుంబ వ్యవస్థ పై ఆవేదనతో...

సీతానవమి సందర్భంగా, హైందవ కుటుంబ వ్యవస్థ పై ఆవేదనతో...

హిందూ కుటుంబాల అశాంతికి కారణం..!?

-డా భాస్కర యోగి....

ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా వచ్చింది. అయన నిజ జీవితంలో ముగ్గురు భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఈసినిమాలో హీరోయిన్ తో పాటు ఇద్దరమ్మాయిలను ఒక రాజకీయ నాయకుడి కొడుకు బలత్కారం చేయబోతే.. రౌడీ నాయకుడిని ఎదిరించి అమ్మాయిలు కోర్టుకు వెళ్తారు. వాళ్ల తరఫున న్యాయవాది గా నటించాడు పవన్ కళ్యాణ్. ఆ టైటిల్... వఖిల్ సాబ్...@

ఈ సినిమా మొత్తంలో పవన్ కళ్యాణ్ చేసే ఆర్గుమెంట్ యొక్క గొప్పతనాన్ని గ్రహించడమే ప్రధాన అంశం. ఈ కేసులో నేరారోపణ అయిన వ్యక్తి తరఫున నటుడు ప్రకాష్ రాజ్ వాదిస్తాడు.వాదనలో భాగంగా అమ్మాయిలను ప్రకాష్ రాజ్ గుచ్చి గుచ్చి అడుగుతూ... "ఎప్పుడైనా శృంగారంలో నీవుపాల్గొన్నవా?" అని ఒకమ్మాయిని అడుగుతాడు... అమ్మాయి చివరికి అనేక గందరగోళాలల తర్వాత నేను నా బాయ్ ఫ్రెండ్ తో ఇష్టంతో పాల్గొన్నాను అంటుంది.

వారం రోజుల క్రితం మార్క్సిస్ట్ విమర్శకుడు కేకే రంగనాథాచార్యులు మరణించాడు. ఆంధ్రజ్యోతి సంపాదకుడు ఆయన శిష్యుడు అయిన కే శ్రీనివాస్ ఆయన స్మృతి వ్యాసం రాస్తూ... "రంగనాథాచార్యులు సంప్రదాయాలను తిరస్కరించాడు".. అని అతనిలోని ఇదే గొప్ప క్వాలిటీ తనని ఆకర్షించింది అన్నట్టుగా వ్యాసం మొదలు పెట్టాడు.

ఈ రెండు విషయాలు మనకేం నేర్పిస్తున్నాయో విజ్ఞులైన వాళ్లంతా ఆలోచించాలి. సినిమా చూసిన ఆడపిల్లలు పవన్ కళ్యాణ్ సినిమాలో చెప్పినట్టుగా చేస్తే తప్పేముంది అనుకోవడం ....@..సమాజంలో ఏ రకమైన ఎటువంటి సందేశం ఇచ్చే విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఒక రచయిత మేధావి గా చెప్పుకునే వ్యక్తి సంప్రదాయం తిరస్కరించడం గొప్ప అభ్యుదయమనీ సమాజానికి చెప్పాలని ప్రయత్నించడం ఎలాంటి ఆలోచనలు కల్పిస్తుందో ఒక్కసారి ఆలోచించండి.
మనం రామాయణం మహాభారతం... ఈ ప్రపంచానికి కుటుంబ వ్యవస్థ ను ,రాజకీయాన్ని ఇచ్చిందని మురిసిపోతాం. సౌదీ అరబియాలో రామాయణం పాఠ్యపుస్తకాల్లో కి ఎక్కిందని ఆనందపడిపోతున్నాం. మరి మన దగ్గర కుటుంబాలు శాంతిగా ఉన్నాయా..? ఇటీవల వార్తల్లో ..తండ్రిని చంపిన కొడుకులు, భార్య భర్తల మధ్యహత్యలు ..అన్నదమ్ముల మధ్య హత్యలు, అన్నాచెల్లెళ్ల మధ్య హత్యలు ,అత్తా కోడళ్ళ మధ్య హత్యలు... ఇదంతా సీరియల్స్ ప్రభావమా !సినిమాల ప్రభావమా...!

ఈ దేశంలో ఒక పదేళ్లలో కోట్ల మంది యువకులు ఏ దేశాల్లో లేనంతగా పెరిగిపోతారు. వాళ్ల మీద ఎవరి ప్రభావం ఉంటుంది..? రాణా ప్రతాప్, శివాజీ, భగత్ సింగ్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ,ఉద్యమ సింగ్ , వివేకానంద వంటి వాళ్ళ ప్రభావం ఉందా.. లేక జూనియర్ ఎన్టీఆర్ ..మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ ..విరాట్ కోహ్లీ, ఏ ఆర్ రెహమాన్... వీళ్ళ ప్రభావం ఉందా?
మన యువత పొద్దున లేచినప్పటి నుంచి బూతులు ..రోతలు ..వెగటు పుట్టించే వెకిలి కార్యక్రమాలు..వంటి వినోద కార్యక్రమాలు చూడడం ఎవరు ఆపగలరు.!? అతి చౌకగా దొరికే ఇంటర్నెట్ రకరకాల సైట్లు దుర్మార్గపు కార్యక్రమాలు చేసి యువతను ధ్వంసం చేసే వారిపట్ల నియంత్రణ లేనటువంటి వ్యవస్థ... మన యువతను ఎటు వైపు తీసుకెళ్తున్నాయి. ఇది మనం తక్షణం ఆలోచించాల్సిన విషయం. చిన్న పిల్లలు కూడా రోజుకు గంటల తరబడి ఇలాంటి దృశ్యాలుచూడడం వల్ల మానసిక మైనటువంటి నేరస్తులుగా మారుతున్నారు. నాలుగేళ్ళ పిల్లవాడు రోజూ అనేకసార్లు టీవీలలో వేల సార్లు హత్యలు ... అత్యాచారాలు చూస్తున్నాడు.. ఇటీవలకాలంలో అత్యాచారాలు చేసిన వాళ్లలో మైనర్లు ఉండడం మనం చూశాం. 1914 నుంచి 19 17 మధ్యలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. ఫ్రాన్స్ 1945 రెండో ప్రపంచ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో విజయగర్వంతో ఉన్న ఫ్రాన్స్ లో 19 26 లో టెలివిజన్ వచ్చింది. దానితోపాటు జూద గృహాలు, క్యాషి నోస్... క్లబ్బులు ,పబ్బులు విపరీతంగా తెరుచుకున్నాయి. దాంతో ప్రజలు అన్ని రకాల దురలవాట్లకు బానిసలు అయిపోయారు. వాళ్లలో దేశం పట్ల అభిమానం నశించింది. ఆ తర్వాత జాతీయత కోల్పోయి దేశం పతనం వైపు అడుగులు వేసింది. 1945 లో చాలస్ డిగొల్.. ఫ్యాన్స్ అధ్యక్షుడు అయ్యాక చేసిన మొట్టమొదటి పని ఆ దేశంలో థియేటర్లు కూల గొట్టించాడు. బార్లు ,పబ్బులు ,క్లబ్బులు మూసివేయించాడు. ఫ్రాన్స్ పై యువతరంలో గొప్ప గౌరవభావాన్ని, జాతీయతను రగిలించాడు. ఆ తర్వాత దేశం బీ ఫ్రెంచ్.. అండ్ బై ఫ్రెంచ్... అనే స్థాయికి వెళ్లింది.

ఇప్పుడు మన దేశంలో యువత కూడా అలాంటి ప్రమాదంలో పడింది. యువకులు ఒకరకంగా భ్రష్టమార్గంలో ప్రయాణిస్తుంటే మహిళలు వృద్ధులు అన్ని వయసుల వాళ్లు ఏదో రకమైన దురలవాట్లకు బానిసలవుతున్నారు. ఇవన్నీ దురలవాట్లు అని మనం అంటే వామపక్షవాదులు ఏది అలవాటు ..ఏది దురలవాటు ...అన్న దానిపై మొదట చర్చ జరగాలంటారు.

ఇక యువతీ యువకులకు అనేక పోర్న్ సైట్స్... విశృంఖల సినిమాలు... అందు బాటులోకి వచ్చాయి. ఈ దుష్పరిణామాల ప్రభావం... కుటుంబాల పై పడింది. దీని ఫలితాలు పదేళ్లు పోతే గాని మనకు అర్థం కావు.

మనం అనుకుంటున్న సంప్రదాయాలు, శాస్త్రాలు, గురువులు ఇతిహాసాలు ,ఆచారాలు ,కట్టుబాట్లు, నమ్మకాలు.. ఇవన్నీ రోజురోజుకు డొల్ల తనం గా మారుతున్నాయి. అందుకే హిందూ కుటుంబంలో శాంతి లేదు.. ప్రతివారూ ఆస్తులు, సంపాదన ,కెరీరిజం పేరుతో.. తమ సంతానాన్ని యంత్రాల్లా తయారు చేస్తున్నారు. తక్కువ సంతానం ఎక్కువ సంపాదన... ఇప్పుడు హిందూ జాతికి ప్రమాదం గా మారింది. ఉన్న ఇద్దరినీ విదేశాలకు పంపడం.. ఒక వర్గం చేస్తే... వారిని అనుకరిస్తూ డబ్బు లేని వారు కూడా లక్షలు లక్షలు పెట్టి చదివించాలనే తాపత్రయం వాళ్ళ కుటుంబ వ్యవస్థను ఆర్థికంగా ధ్వంసం చేస్తున్నది. ఈ క్రమంలో అజ్ఞానంతో విపరీతమైన వృధా ఖర్చు చేస్తూ తాగుబోతులుగా మారిపోతున్నారు. కుటుంబాలు ధ్వంసమై పోతున్నాయి.

అసలు కథ ఇక్కడే మొదలవుతుంది... డ్రైవర్లుగా ,పనివాళ్లు గా ,వంటవాళ్ళు గా ,అటెండర్లు గా... ధనికుల ఇళ్ళల్లో పని చేయడానికి ఒక వర్గం ప్రజలు చేరుతున్నారు. తదనంతర కాలంలో ఏం జరుగుతుందో మన కళ్ళతో చూస్తున్నాం.
ఇక మధ్య తరగతి ఆర్థిక వ్యవస్థ ఉన్న వాళ్ల ఆడపిల్లల్ని కళాశాలల్లో..పాఠశాలల్లో ట్రాప్ చేసి మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారు. వీళ్ళు కష్టపడి సంపాదించుకున్న సంపదంతా ఒక్క క్షణం లో వాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది.

ఇక అవసరంలేని ఆర్భాటాలతో రకరకాల కార్యక్రమాలు చేసి అప్పులపాలవుతున్నారు ఇంకొందరు. అలాగే ఏ రాజకీయ వ్యవస్థ దేశానికి మేలు చేస్తుందో ఆలోచించే సాధారణ పరిజ్ఞానం కూడా మన కుటుంబాల్లో ఉండడం లేదు. ఇక ఆధ్యాత్మిక రంగం పుచ్చి పోయింది. పూర్వం ప్రతి కుటుంబానికి కుల గురువు ఉండేవాడు. లేదా పురోహితులు ఉండేవాడు. వాళ్లతో చర్చించి ఎంత అవసరమో అంతే స్థాయిలో ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ ధర్మబద్ధంగా శాంతిగా ప్రజలు జీవించారు. స్వామీజీ లంతా ఎవరి దారి వారిదే.. ఇప్పుడు టీవీ ల్లో దర్శనం ఇచ్చే మహా మహా పండితులు అనేక రకాలవివాదాస్పద విషయాలు ప్రజలకు బోధించి సరైన జ్ఞానం ఇవ్వకుండా.. భ్రష్టులను తయారు చేస్తున్నారు. ఇక ఉపాసకుల పేరుతో జ్యోతిష్యుల పేరుతో మరికొందరు ఇంకో దారి లో ఉన్నారు.@@@@

మరోవైపు మనం పన్నులు చెల్లిస్తూ నడిపిస్తూ ఉన్న వ్యవస్థల్ని ఒక వర్గం ప్రజలు హాయిగా అనుభవిస్తున్నారు. రాజకీయ వ్యవస్థలన్నీ మనకు తెలియనివి కావు. లౌకికవాదం అనే ముసుగు తొడుక్కుని వారి ప్రయోజనాలు వారు నెరవేర్చుకుంటున్నారు. దురాశ, అజ్ఞానం, తెలియని తనం, సోమరితనం వీటన్నింటి కారణంగా సగటు హిందువు తన కుటుంబంలో సరైన పాత్ర పోషించే లేకపోతున్నాడు.

మనకు తెలియకుండా మన కుటుంబాల్లో ప్రవేశిస్తున్న పాశ్చాత్యీకరణ.. కుటుంబాల్లోని పిల్లల భవిష్యత్తును ధ్వంసం చేస్తున్నది. మరోవైపు చదువుకున్న వాళ్ళు.. వైట్ కాలర్ మనస్తత్వంతో సంపాదన ప్రెస్టేజ్ గా భావించి జీవితమంతా అదే మాన్యాలో బతికేస్తున్నారు. కుటుంబజీవనం.. సంబంధబాంధవ్యాలు.. కౌన్సిలింగ్ లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు పెళ్లి తర్వాత విడాకుల వైపు మళ్లుతున్నాయి. అందుకే ఇటీవల కాలంలో కేంద్రం త్రిపుల్ తలాక్ చట్టం తెచ్చినప్పుడు ఓవైసీ గణాంకాలు చెప్తూ హిందూ కుటుంబాల్లో ఉన్నంత విడాకుల రేటు ముస్లిం కుటుంబాల్లో లేదు అన్నాడు.
ఈ విచ్ఛిన్నం కావడానికి కారణాలను మనం అన్వేషించాల్సిన అవసరం ఉంది. హిందూ కుటుంబాల్లో అశాంతికి కారణం మనం వెంటనే కనిపెట్టాలి.

మనకు దేవాలయాల్లో కౌన్సెలింగ్ లేదు.. టీవీ లో సీరియల్ తప్ప ఇంకేమీ లేవు. సినిమాల్లో.. ద్రోహం.. అత్యాచారం.. ఇవే ప్రధాన విశేషాలు. ఇలాంటి అద్భుతాలు చెప్పే సినిమా నటులు ఇవాళ మనకు సెలబ్రిటీలు. ఒక స్వామీజీని సినిమా నటిని ఒకచోట కూర్చోబెట్టి ఓటింగ్ జరిగితే.... ఓట్లన్నీ ఆమెకే పడుతాయి. మనకు మంచి చెడ్డ నేర్పించాల్సిన మీడియా తన వ్యక్తిగత స్వార్థంతో రాజకీయ అంశాలను వివాదాస్పద అంశాలను మనకందించి ఏది న్యాయం ఏది అన్యాయమో తెలియకుండా చేస్తున్నది. మన కుటుంబాల్లో ఇలాంటి కౌన్సిలింగ్ లేని కారణంగా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నాం అనేవాళ్ళు సంప్రదాయాలను తిరస్కరించాలి అనే భావాన్ని సులభంగా తలపై మోస్తున్నారు. మనం చెప్పే సద్గుణ సంపదంతా దుష్ట శక్తులు తమ అందమైన ముఖాలతో ఒక్క క్షణం లో ధ్వంసం చేస్తున్నారు. సోషల్ మీడియా ఒక విప్లవం అని మనం అనుకుంటున్నాం... దానితో పాటుగా మోయలేనంత జ్ఞానం అజ్ఞానం తో కలిసి మన మెదళ్ళలోకి ఎక్కుతుంది. జ్ఞానం అజ్ఞానాలను వేరుచేసే హంసను మనం తక్షణం పట్టుకుని రాకపోతే మన కుటుంబ వ్యవస్థ పైకి కనిపించే మేడిపండు మాత్రమే.

(సీతానవమి సందర్భంగా. కుటుంబ వ్యవస్థ పై ఆవేదనతో... ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డా.భాస్కరయోగి వ్యాసం)

Source - Whatsapp Message