Tuesday, July 1, 2025

 💁 *కాయకల్పయోగ దీనినే సిద్ధ యోగము రహస్య యోగము అని పిలవబడుతుంది*


కాయకల్ప యోగ అనేది యవ్వనం, ఆరోగ్యం, మరియు ఆధ్యాత్మిక శాంతికి మార్గం

కాయకల్ప యోగ అనేది మన ప్రాచీన సిద్ధులు అందించిన ఒక అద్భుతమైన విజ్ఞానం.

 ఇది కేవలం శారీరక వ్యాయామం కాదు, మన జీవిత శక్తిని పెంచి, శరీరాన్ని పునరుజ్జీవింపజేసే ఒక సమగ్ర ప్రక్రియ.

కాయకల్ప యోగ ప్రయోజనాలు:

 🧘‍♀️వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది: కాయకల్ప యోగ వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసి, దీర్ఘాయువును ప్రసాదిస్తుంది.

 🌹రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఇది శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
 
🙏🏻శారీరక ఆరోగ్యం: దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, ఉబ్బసం, చర్మ వ్యాధులు వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

🧘‍♀️మానసిక ప్రశాంతత: ఒత్తిడిని తగ్గించి, మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది.
 
🙌ఆధ్యాత్మిక వికాసం: లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది, ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది.
 
🥦జీవనశైలి మెరుగుదల: అనారోగ్యకరమైన అలవాట్లను సరిచేసి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది.
 
👩🏻స్త్రీల ఆరోగ్యం: స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థను బలోపేతం చేసి, రుతుక్రమ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
 *🌿నిర్ణయం - కాలం*🌸 
  🕉️🦚🌹🌻💎💜🌈

 *🍁ఆచారాలు, నియమాలు, కట్టుబాట్లు ఉన్న కుటుంబం లో పెరిగి పెద్దదయ్యింది మాధురి...* 

 *తనకి ఇష్టమైన లెక్చరర్ ఉద్యోగం చేస్తోంది, అదే కాలేజీకి, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రతీ శనివారం కౌన్సిలర్  రిషి వచ్చేవాడు....* 

 *మాధురి, తను చిన్న నాటినుంచీ పెరిగిన వాతావరణానికీ, బయటి ప్రపంచపు తీరుకీ సమన్వయం చేసుకోలేక ఒక్కోసారి చాలా ఒత్తిడికి గురయ్యేది..* 

 *అందుకే రిషితో కౌన్సిలింగ్ తీసుకునేది మాధురి కూడా, అలా పరిచయం పెరిగి, అతని నుంచీ మానసికంగా ఒక ఊరట దొరుకుతూ, అతను, ఆమెకు, జీవనానికి ఒక బలమైన ఆలంబనగా మారిపోయాడు...* 

 *అతనితో జీవితాన్ని పంచుకోవాలనుకుంది మాధురి, కానీ ఇంట్లోవాళ్ళు, రిషి వేరే కులం అతను, పైగా ప్రేమవివాహం అని పూర్తిగా వ్యతిరేకించారు... అందరినీ ఒప్పించే అన్ని ప్రయత్నాలు చేసి చివరికి అలిసిపోయి, రిషిని ఆర్యసమాజ్ లో పెళ్ళి చేసుకుని ఇంటికి వెళ్ళింది..* 

 *తల్లి కాత్యాయని, పిన్ని *శారద బాగా తిట్టారు..* 
 *" ఇలా చేసావేమిటే, మీ* *తాతగారు, నాన్న, బాబాయ్ లకి వచ్చే కోపానికి బలి* *కాకముందే వెళ్ళిపోండి "  అని తలుపులు* *మూసేయబోతున్నారు..* 

 *" అమ్మా " అంటూ తల్లడిల్లిపోతూ కాత్యాయని చెయ్యి పట్టుకోబోయింది మాధురి..* 

 *" ఛీ ముట్టకు నన్ను, నిజంగా అమ్మను నేనంటూ, ఒకదాన్ని నీకున్నాను అని, నీకు గుర్తుండి ఉంటే, ఇలా దొంగపెళ్ళి చేసుకునేదానివా, ఇహ నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు " అంది కోపంగా కాత్యాయని,..* 

 *ఎప్పుడూ శాంతం తప్ప మరో భావం కనపడని కాత్యాయని మొహం ఇప్పుడు కోపంతో ఎర్రగా అయిపోయింది..* 

 *ఆ ఇంటి తలుపులు మూసుకుపోయాయి మాధురి, రిషి మొహాల మీద....* 

 *రిషి, మాధురి, బెంగుళూరులో జీవితం మొదలు పెట్టారు.. నాలుగేళ్ళు గడిచాయి...* 

 *కిందటేడు, తాను తల్లిని కాబోతున్న సంబరాన్ని తల్లికి చెప్పుకోవాలని, మాధురి తన ఇంటికి ఫోన్ చేసింది...* 

 *శారద ఫోన్ తీసింది " పిన్నీ నేను మాధురిని.. " అని చెప్పగానే.. " ఛీ.. " అనేసి ఫోన్ పెట్టేసింది శారద... మళ్ళీ ఆ సాయంత్రం మరొకసారి ఫోన్ చేసింది మాధురి... ఈ సారి మళ్ళీ శారదే ఫోన్ తీసి* 

 *" ఏమే శనిదానా, నా కూతురికి కుదరబోయిన బంగారంలాంటి సంబంధం, నీ విషయం తెలిసి తప్పిపోయింది, నీ బాగు నువ్వు చూసుకుని పోయావు, నా పిల్లలు బాధను అనుభవించాల్సి వస్తోంది కదే, నాశనం అయిపోతావే పాపిష్టిదానా.. సిగ్గుంటే మళ్ళీ ఫోన్ చేయకు... " అనేసి ఫోన్ పెట్టేసింది శారద...* 

 *" అయ్యో... " అని అనుకుంటూ మనసు పాడుచేసుకుని కూర్చుంది మాధురి...* 

 *రిషి ఎంతగానో నచ్చచెప్పి, మాధురిని మామూలుగా చేసాడు... కానీ వారానికే మాధురికి అబార్షన్ అయిపోయింది... పిన్ని శాపం తగిలినట్లుంది నాకు అని కుమిలిపోతోంది మాధురి... రిషి అలా ఏమీ ఉండదు, ఈ రోజుల్లో ఆడవారికి ఇవన్నీ ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి అని మాధురికి ధైర్యం చెప్పాడు... అయినా మాధురికి దిగులు రోజురోజుకి పెరిగిపోతోంది....* 

 *అలా అలా మరో రెండేళ్ళు గడిచాక ఒకరోజు రిషికి ఆరోగ్యం బాగా పాడయ్యింది.. వాంతులు అవుతూ ఉన్నాయి, జ్వరం బాగా వచ్చింది.. వైద్యపరీక్షలు చేసాక తేలింది రిషికి జాండీస్ వచ్చిందని, ఇప్పటికే ముదిరింది అని... మాధురి ఎంతలా ప్రయత్నించినా రిషిని దక్కించుకోలేకపోయింది... ఒక తెల్లవారుజామున రిషి ప్రాణం గాల్లో కలిసిపోయింది...* 

 *ఇహ ఇప్పుడు మాధురికి చుట్టూ అనంతమైన దుఃఖం మాత్రమే చుట్టుముట్టి ఉంది...* 
 *ఇంతటి దుఃఖాన్ని తీర్చే వారెవ్వరూ అని మాధురి తోడు కోసం వెతుక్కుంటే చుట్టూ శూన్యమే కనిపిస్తోంది....* 

 *ఇన్నాళ్ళూ బిడ్డలు కలగట్లేదని దిగులు పడుతూ ఉండే దాన్ని, ఇహ ఇప్పుడు ఉన్న నా ఒక్క తోడు రిషి కూడా లేడు, అని మాధురికి పిచ్చి పట్టినట్లుగా ఉంది...* 

 *రిషి కొలీగ్ ప్రీతి, వారి పొరుగింటావిడ మనీషా మాత్రం మధ్యమధ్యలో మాధురి దగ్గరకు వచ్చి కాస్తంత ధైర్యం చెప్పి ఒక గ్లాసు పాలు తాగించో, ఒక చపాతీ తినిపించో వెళుతున్నారు...* 

 *రిషి పోయిన నాలుగు రోజులకు, ఒక అర్ధరాత్రి దిగులుగా, ఒంటరిగా ఏడ్చుకుంటూ కూర్చున్న మాధురికి, ఇంక నేను బతకటమెందుకు అని అనిపించింది... చనిపోవాలి అని బలంగా అనిపిస్తోంది... పిచ్చి పట్టినట్లు బుర్ర పాడయిపోయి ఉంది మాధురికి... ఫాన్ కి చీర ముడేస్తోంది... చిన్నప్పటి జ్ఞాపకాలు , రిషితో ప్రేమ పెళ్ళి, అమ్మ గారాబం, పిన్ని శాపనార్ధాలు... అన్నీ గుర్తు తెచ్చుకుంటోంది.. కళ్ళ నుండీ ధారగా నీళ్ళు కారిపోతున్నాయి... గుండె వణికిపోతోంది బాధతోనూ, భయంతోనూ, తెలియని ఆందోళనతోనూ, అయోమయంతోనూ...* 

 *" అమ్మా మాధురీ... " అని తల్లి గొంతు ఆప్యాయంగా తీయగా వినిపించింది... కళ్ళు మూసుకుని ముడి వేసిన చీర గొలుసులోకి తల పెట్టి చీరముడి బిగించుకోబోతున్న మాధురి, ఆ ప్రయత్నాన్ని ఆపి,  ఆశగా కళ్ళు తెరిచింది, అమ్మ ఉందేమో కళ్ళ ఎదురుగా అన్నట్లుగా... చుట్టూ చీకటి తప్ప మరేమీ లేదు, మరెవ్వరూ లేరు...* 

 *" హు నా పిచ్చి కాబోతే, అమ్మ నా దగ్గరికి ఎందుకొస్తుంది " అని *అనుకుంటున్న మాధురికి నిరాశ ముంచుకొచ్చేసింది మళ్ళీ గాఢంగా...* 
 *మళ్ళీ ఉరి పోసుకునే ప్రయత్నం చేయబోతుండగా మాధురికి కళ్ళు తిరిగి వాంతి వచ్చేస్తోంది...* 

 *మంచం పక్కనే వాంతి చేసుకుంది... స్ప్రుహ కోల్పోయి మంచం మీదకి వాలిపోయింది మాధురి...* 

 *మర్రోజు పదింటికి మాధురికి తెలివి వచ్చేటప్పటికి హాస్పిటల్ లో ఉంది,  పక్కన ప్రీతి, మనీషా ఉన్నారు.. పొద్దున్నే ఎనిమిదింటికి మనీషా వచ్చి ఎన్నిసార్లు తలుపు తట్టినా మాధురి తలుపు తీయలేదు, వెంటనే ప్రీతిని పిలిచి, వాచ్ మెన్ సాయంతో తలుపు తీసి చూసి మాధురిని హాస్పిటల్ లో చేర్చారు...* 

 *మాధురి తల్లి కాబోతోంది, అని డాక్టర్ చెప్పారని ప్రీతి తెలిపింది మాధురికి...* 

 *ఆనందపడాలో లేదో తెలియని మానసిక స్ధితిలో ఉంది మాధురి... మాధురి కాస్త తేరుకున్నాక ఇంటికి వచ్చారు ముగ్గురూ...* 

 *ఇంటి గుమ్మంలో కాత్యాయని, పార్ధసారధి కూర్చుని ఉన్నారు... రిషి పోయిన దగ్గర్నుంచీ ప్రీతి కాత్యాయనికి ఫోన్ చేసి చెబుతూనే ఉంది, మాధురి పరిస్ధితి ఏ రకంగానూ బాలేదని...* 

 *అంతకుముందు రోజంతా కాత్యాయనికి, శారదకి ఒకటే గొడవ మాధురి కావాలని కాత్యాయని, వద్దే వద్దని శారద..* 

 *ఆ రాత్రి నిద్రిస్తున్న కాత్యాయనికి నిద్రలో చిన్నతనంలో మాధురితో తాను ఆడే దోబూచులాట కలగా వచ్చింది, కలలో " అమ్మా మాధురీ.. " అని పిలుస్తూ కలవరిస్తూనే ఉంది కాత్యాయని నిద్రలో...* 

 *అవన్నీ చూస్తూ ఉన్న మాధురి తండ్రి పార్ధసారధి, కిందటేడు గుండెపోటు తెచ్చుకుని ఇప్పుడిప్పుడే కాస్తంత తేరుకుంటున్న, భార్య కాత్యాయని, ఇప్పుడు మళ్ళీ కూతురు కోసం ఇలా కలవరించి కలవరించి ఏమయిపోతుందో అని భయపడి... భార్యను తీసుకుని కూతురి వద్దకు వచ్చేసాడు...* 

 *తల్లీతండ్రీ తన కంట పడగానే, మాధురి* 
 *" అమ్మా, నాన్నా... " అని గుండె పగిలేలా అరుస్తూ వచ్చి తల్లీతండ్రి పాదాల దగ్గర కూలబడిపోయి వెక్కివెక్కి ఏడుస్తోంది ..* 

 *" అమ్మా, మాధురీ.. " అని ఆరాటంగా అంటూ ఏడుస్తున్న కూతురిని గుండెలకు పొదువుకునేందుకు ప్రయత్నిస్తోంది తల్లి కాత్యాయని... మాధురి పిచ్చిదానిలా నేలకేసి తల కొట్టుకోబోతుంటే, తండ్రికి కూడా కళ్ళు తడి అయ్యాయి... " వద్దమ్మా వద్దు, ఊరుకో పిచ్చితల్లీ... " అని అంటూ పార్ధసారధి కూడా కూతురిని తన రెండుచేతులతో దగ్గరకు తీసుకున్నాడు....* 

 *సంవత్సరానికల్లా పండంటి* *పాపాయి రష్మిక, మాధురి చేతుల్లో నవ్వుతూ ఆడుకుంటోంది, అమ్మమ్మా తాతయ్యల సంరక్షణలో...* 

 *అ రకంగా, మాధురి తీసుకున్న నిర్ణయం తాలూకూ ఫలితం, కాలానుగుణంగా ఎన్నో మార్పులకు గురి అవ్వాల్సి వచ్చింది..* 

 *తులసీభాను.* 

🕉️🦚🌹🌻💎💜🌈
 *విమానంరైట్ బ్రదర్ లు కనిపెట్టారు* 

*అని చెప్పిన వాడు. నీకు అంతకు ముందే పుష్పకవిమానం. వుందని చెప్పలేదు*
*టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టిందని పండగ చేసినవాడు. 101 మంది కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీ లే అని చెప్పలేదు.*
*3d house అని మురిసిపోయే నీతో .తరాల క్రితం మయసభ వుందని చెప్పలేదు*
*చదువు విజ్ఞానం అని గొప్పలు పోయె నీకు. మొట్టమొదటి విశ్వ విద్యాలయం  భారతదేశం లోదే అని తెలియదు.*
*ఆదిమానవుడి గీతలు ఆశ్చర్యంగా చూసే నీకు . అంతకు మునుపే తాళపత్ర గ్రంథాలను రాశారు అని తెలియదు.*
*లేజర్ సర్జరీ అని డప్పు కొట్టుకొనే నీకు. సుశ్రుడు చేసిన వైద్యం తెలియదు.*
*గండు చీమల తో చరకుడు చేసిన శస్త్ర చికిత్స లు తెలియదు.*
*ఎందుకంటే.. ఇలాంటి ఎన్నో నీకు తెలియకుండా చేశారు. నీ దేశపు గర్వాన్ని నే చేతితోనే తుడిపించారు.*

*ఓ మేధావి. నీకు నిజంగా స్పృహ వుంటే . ఒక్కటే తెలుసుకో*

*ఆ బ్రిటీష్ వారి పూర్వీకులు గాడిదల మీద తిరగటం కూడా రాక మునుపే.*
*నీ. తాత ముత్తాతలు. గుర్రాలతో రథం మీద. బంగారు నగలు ధరించి తిరిగే వారు.*
*వారికి స్నానం తెలియక తోలు చుట్టుకు తిరగక ముందే.  నీ తాత ముత్తాతలు. సుగంధ ద్రవ్యాల తో స్నానాలు చేసేవారు.*

శీర్షిక: నా బాల్యం పోయింది

 ఇది నా స్వీయసృజన, అనుకరణ కానీ అనువాదం కాదు 
రచన: #అంజనీదేవి శనగల    
శీర్షిక: నా బాల్యం పోయింది
       
“ఏమైంది బంగారం ఎందుకు అలా ఉన్నావు?” అని అడిగాడు వాసుదేవ్. దిగులుగా ఏడుపు మొహంతో కూర్చుని ఉన్న ఏడేళ్ల మనవరాలు చిన్నిని చూసి. 

“తాతయ్యా ..  అదీ .. మరీ .. ” అని ఏడవటం మొదలుపెట్టింది చిన్ని.

“తాతయ్యా!  చిన్ని స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వ్యాన్ లో కూడా ఎవరితో మాట్లాడకుండా ఇలాగే ఏడుపు మొహం పెట్టుకుని డల్ గా కూర్చుంది.” అంది తొమ్మిదేళ్ళ స్వీటీ చెల్లి దిగులుగా ఉండటం చూసి.

“బంగారం కదూ, ఏమైందో చెప్పు” అన్నారు చిన్నిని అని 
అనునయిస్తూ. 

“మరీ .. అదీ… నా బాల్యం పోయింది” అని ఏడవటం మొదలు పెట్టింది.

“బాల్యం పోవటం ఏమిటి?! ” అన్నారు ఆశ్చర్యంగా వాసుదేవ్.

“ఈ రోజు స్కూల్లో మా టీచర్ ఒక లెసన్ చెప్పారు. బాల్యంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే బయటకు వెళ్లి తోటి పిల్లలతో ఎగురుతూ, గెంతుతూ, పరుగులు పెడుతూ, దొంగాట, కోతి కొమ్మచ్చి ఇంకేవో  కొత్త కొత్త  ఆటలన్నీ ఫ్రెండ్స్ తో ఆడుతారంట. అప్పుడు పిల్లలు చాలా హ్యాపీగా, హెల్తీగా ఉంటారoట. ఇంకా హోంవర్క్ రాసుకొని, చదువుకున్న తర్వాత అమ్మ చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుందంట,

నానమ్మ మంచి మంచి కథలు చెప్పి, పాటలు పాడి వినిపిస్తుందంట, ఇవేమీ లేకపోతే బాల్యం లేనట్లే, అని టీచర్ చెప్పారు. అంటే నా బాల్యం ఎక్కడో పోయింది” అని ఏడవటం మొదలు పెట్టింది చిన్ని.  

“అవును తాతయ్యా!  నాకు కూడా ఇవన్నీ  తెలియవు.  స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టివిలో కార్టూన్ షోస్ చూడటం, మొబైల్ ఫోన్లో వీడియోలు చూడటం, గేమ్స్ అయితే ప్లేస్టేషన్ లో ఆడటమే తెలుసు. మా టీచర్ ఒక లెసన్లో కర్ర- బిళ్ళ,   తొక్కుడు బిళ్ళ లాంటి ఆటలు ఎన్నో చెప్పారు.  ఆ అటలేవీ మాకు తెలియవు. ఇక్కడ ఆడుకోవటానికి పిల్లలు కూడా ఎవరూ  రారు." అంది స్వీటీ అయోమయంగా.  

“నా బాల్యం పోయింది” అని మళ్ళీ ఏడవటం మొదలు పెట్టింది చిన్ని

“అమ్మడూ!  నీ బాల్యం ఎక్కడికీ  పోలేదు.  నీ దగ్గరే ఉంది. కాకపోతే కాలక్రమేణా కొన్ని మార్పులు జరిగినాయి. ఇళ్ళు  పెద్దవి అయ్యాయి, మనసులు చిన్నవి  అయ్యాయి. పని వత్తిడితో పొరుగు వారిని పట్టించుకునే ఓపిక,  తీరిక ఎవరికీ ఉండటం లేదు. పిల్లలతో పరుగులు పెడుతూ ఆడుకునే ఆటలకు బదులు ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడ్డారు. దానివల్ల ఎక్సర్సైజ్ లేక చిన్న వయసులోనే ఊబకాయం వచ్చేస్తుంది” అన్నారు వాసుదేవ్.

“మరి  చందమామ, గోరుముద్దలు,  కథలు,పాటలు? ” అని అడిగింది ఆసక్తిగా స్వీటీ.

“అదే చెప్తున్నా.  చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెట్టే స్థానంలో సెల్ఫోన్లో వీడియోస్ చూపిస్తూ తినిపిస్తున్నారు.  
ఏం తింటున్నారో తెలియకుండా వీడియోస్ చూస్తూ తినేస్తున్నారు. చాక్లెట్లు జంక్ ఫుడ్స్ వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. నానమ్మ, తాతయ్యలు చెప్పాల్సిన, కథలు, పాటలు స్థానంలో మీరు టీవీలో కార్టూన్ షోలు, కిడ్స్ ఛానల్ లో వుండే దెయ్యం కథలు చూస్తూ భయపడుతున్నారు"  అన్నారు వాసుదేవ్.

“నానమ్మ– అంటే ఎవరు తాతయ్యా? "  అని అడిగింది చిన్ని.

“హతవిధీ! అదేనమ్మా మన దౌర్భాగ్యం.   నువ్వు “గ్రానీ” అని పిలుస్తున్నావే,  ఆవిడే మీ నానమ్మ. స్వచ్ఛమైన తెలుగులో నానమ్మ అని పిలవకుండా “గ్రానీ గ్రానీ” అని పిలుస్తున్నారు. ప్రకృతి ఒడిలోహాయిగా గడపాల్సిన బాల్యం, చీకటి గదిలో టీవీల ముందు గడిచిపోతుంది” అన్నారు వాసుదేవ్.

“ఆఁ..ఆఁ... నా బాల్యం పోయింది” అని మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది చిన్ని.

“ అమ్మా, నా చిన్ని తల్లివి కదూ, నీ బాల్యం ఎక్కడికే  పోదు.నేను ఉన్నాను కదా, నీ బాల్యం భద్రంగా తిరిగి తీసుకుని వచ్చే పూచీ నాది” అన్నారు.

“ఎలా?” అన్నారు పిల్లలు ఇద్దరూ  ఉత్సాహంగా.

“రోజా  మీ ఇద్దరూ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే  నేనూ  మీ నానమ్మ, మిమ్మల్ని పార్కుకి తీసుకొని వెళతాము. అక్కడ మీరు తోటి పిల్లలతో మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుందురు గాని. మా ఇద్దరికీ వాకింగ్ అయినట్లు ఉంటుంది, సరేనా! ” అన్నారు వాసుదేవ్.

‘ఓ ! సరే  తాతయ్యా . అయితే నేను మా ఫ్రెండ్స్ ను  కూడా రమ్మని చెప్తాను” అంది సంతోషంగా చిన్ని.

“నేను కూడా మా ఫ్రెండ్స్ ను  పార్కుకి రమ్మని చెప్తాను తాతయ్యా ” అంది స్వీటీ. 

“మరి చందమామ గోరుముద్దలు” అని టీచర్ చెప్పిన రెండో పాయింట్ తీసింది చిన్ని,

“దానిదేముంది. మనం మేడ  పైకి వెళ్లి అందరం కలిసి వెన్నెల్లో కూర్చుని  చక్కటి చందమామను, వెన్నెలను ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేద్దాం " అన్నారు. 

“మంచి ఆలోచన మావయ్య” అంది రమ్య. 

“అవును నాన్న” అన్నాడు రమేష్ ఆఫీస్ నుంచి అప్పుడే అక్కడకు వచ్చి.

“మరి నానమ్మ కథలు, పాటలు” టీచర్ చెప్పిన మూడో పాయింట్ గురించి ఆరా తీసింది.

“మీ ఇద్దరూ రోజు నానమ్మ దగ్గరకు వచ్చి పడుకోoడి, నానమ్మ మీకు మంచి మంచి కథలు చెప్తుంది.” అన్నారు,

“మరి పాటలు” అంది చిన్ని సందేహంగా,

“మీ నాన్నమ్మ పాట పాడితే మనం అందరం భయపడి పారిపోవాలి, వద్దులే నేనే మీకు మంచి మంచి పాటలు పాడి  వినిపిస్తానులే.” అన్నారు వాసుదేవ్,

“నేను పాడితే  ఇక్కడ వున్నవాళ్లే  భయపడతారు. కానీ మీ తాతయ్య పాడితే ఊరంతా భయంతో గగ్గోలు పెడుతుంది, వద్దురా బాబు నేనే నీకు మంచి మంచి కథలు, పాటలు  పాడి వినిపిస్తాను.” అని చెప్పింది వంటగదిలోంచి వీళ్ళ మాటలు వింటున్న వసుధ అక్కడికి వచ్చి.

వసుధ మాటలకు అందరూ నవ్వుకున్నారు.

“తమ బాల్యం తమకు తిరిగి వస్తుందని” తాత నానమ్మ, తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఆనందంగా గెంతులువేసారు పిల్లలు.
        
                ******************
 *కొంగజపం(జాతీయం వెనుక కథ)* -డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
      కొంగజపం అంటే అర్థం మనం చూస్తున్నది నిజం కాదు నటన అనీ. కొంతమంది ఎదుటి వారిని మోసం చేయడానికి మంచివాళ్ళుగా నటిస్తూ నోరు తెరిస్తే చాలు ధర్మసూత్రాలు వల్లిస్తూ వుంటారు. ఆ మాటలవలలో చిక్కుకొని చాలామంది మోసపోతూ వుంటారు. ఎదుటివాడు చేస్తున్నదంతా నటన. మేక తోలు కప్పుకున్న పులిలా వాని అసలు రూపం అది గాదు, వాడు పెద్ద మోసగాడు అని చెప్పడం కోసం ఈ కొంగజపం అనే జాతీయం వాడుకలోకి వచ్చింది. ఇలాంటి కొంగ జపం చేసేవాళ్ళను మనం చాలామందిని అన్ని మతాలలో చూడవచ్చు. వాళ్ళు రకరకాల దీక్షలు తీసుకుంటూ వుంటారు. ఉదయాన్నే లేవడం, భగవంతున్ని ఆరాధించడం, కఠినమైన నియమాలు ఆచరించడం, నేలమీద పడుకోవడం, దానధర్మాలు చేయడం మృధువుగా మాట్లాడడం లాంటివి ఆ దీక్షా సమయంలో చేస్తుంటారు. ఆ సమయంలో వాళ్ళను చూస్తే మనకు భక్తి భావం, వారిపై గౌరవం, సద్భావం కలుగుతుంది. కానీ నూటికి తొంభై మంది ఆ ప్రవర్తన దీక్షలో వున్నంత వరకే. నిజానికి ఆ దీక్షలు ఎందుకంటే ఆ తరువాతకూడా అలాగే మంచిగా బతకుతూ చెడు అలవాట్లను వదిలేసి జీవన విధానాన్ని మార్చుకోవడం కోసం. 
ఒక్కసారిగా ఆ మార్పు రాదు కాబట్టి నెమ్మదిగా శరీరానికి, మనసుకు అలవాటు చేయడం కోసం దీక్షలు వచ్చాయి. కానీ దీక్ష చేసే జనాల్లో తొంభైశాతం మందివి కొంగజపాలే. ఎందుకంటే దీక్ష అయిపోయిన మరుసటి రోజు నుంచే మరలా వారు అంతకుముందు ఎలా జీవిస్తున్నారో అలాగే మారిపోతారు. అంటే ఆ దీక్ష ప్రభావం కొంచం గూడా వారిమీద ప్రసరించనట్లే. కాబట్టి మనం దీక్షా సమయంలో వారి ప్రవర్తన చూసి అదే నిజమని భ్రాంతి పడగూడదు. చాలా జాగ్రత్తగా వాళ్ళను గమనించి అంచనా వేసుకోవాలి అనే వుద్దేశ్యంతో కొంగజపం అనే జాతీయం వాడుకలోనికి వచ్చింది. ఈ జాతీయం వెనుక ఒక చిన్న కథ కూడా వుంది. అదేమంటే

ఒక చెట్టుమీద ఒక కొంగ వుండేది. అది చాలా ముసలిదయిపోయింది. చెరువులో చేపలు పట్టడం చాలా కష్టమయిపోయింది. ఎక్కువ దూరం ఎగరలేక పోతోంది. దాంతో బాగా ఆలోచించి అది ఒక ఉపాయం పన్నింది.

ఒక రోజు ఒక చెరువు వద్దకు చేరి, ఒడ్డుకు దగ్గరలో, నీటిలో నిలబడి ఒంటికాలిమీద జపం చేయసాగింది. కొంగను చూసి చేపలు భయపడ్డాయి. కానీ అది మౌనంగా, ప్రశాంతంగా, చిరునవ్వుతో దేవున్ని ప్రార్థించడం చూశాయి. ఒక చేప ధైర్యం చేసి కొంచం దూరంలో నిలబడి "ఓ కొంగమామా... ఏం చేస్తున్నావు? ఎందుకలా ఒంటికాలిమీద నిలబడి వున్నావు" అనడిగింది. 

దానికా కొంగ "ఏమీ లేదు.. వయసుమీద పడింది. పెద్దవాన్ని అయ్యాను. ఇప్పటికే కడుపునింపుకోవడం కోసం ప్రతిరోజూ ఎన్నో చేపలను చంపి తింటూ ఎంతో పాపం మూటగట్టుకున్నాను. ఇక ఈ చివరి రోజులలో నన్నా మంచిగా బ్రతకాలి అనుకుంటున్నాను. అందుకే మాంసాహారం తినడం మానేసి ఆకులు, పళ్ళు తింటూ రోజూ ఇలా భగవంతుని గురించి తపస్సు చేసుకుంటున్నాను" అని చెప్పింది. చేపలు దాని మాటలు నిజమని నమ్మాయి. హాయిగా కొంగ అంటే ఏ మాత్రం భయం లేకుండా దగ్గరగా తిరగసాగాయి.
కొంగ ఎవరూ చూడకుండా తన దగ్గరకు వచ్చిన చేపలను మాత్రం గుటుక్కుమనిపిస్తూ పైకి మాత్రం దీక్ష చేస్తున్నట్లు నటిస్తూ కడుపునింపుకోసాగింది. కొద్ది కాలంలోనే చెరువులోని చేపలన్నీ ఖాళీ అయిపోయాయి. కొంగ మరొక చెరువును వెదుక్కుంటా వెళ్ళిపోయింది. ఈ కథలోంచే నీతి, నిజాయితీ లేకుండా చేసే కపట దీక్షలను ఉద్దేశించి కొంగజపం అనే జాతీయం వాడుకలోనికి వచ్చింది. కొంగజపం అంటే దొంగజపం అన్నమాట.
*****************************
డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 రచయితలు తమ అనుభవాలను అభిప్రాయాలను పాళీల్లో నింపి మన కందిస్తారు.

కొంత మంది రాతలను చదివి మనం ఎంతలా ప్రభావితం అయి పోతామంటే వాళ్ళని మన సొంత వాళ్ళు గా మన ఇంట్లో వాళ్ళు గా కలిపేసుకునేంత... ముఖ్యంగా నాలాంటి పుస్తకాల పురుగులు

ఓ సారి నేనొక రచయిత గారి ఆత్మ కధ చదివా అది చదివాక నాకు ఆయన రచనల పైనే కాదు తెలుగు భాష పైన కూడా ఎంతో అభిమానం కలిగింది ఎంత అంటే మాటల్లో చెప్పలేను

ఆ పుస్తకం ఏంటి అంటారా" కొతి కొమ్మచ్చి"

తెలుగు భాష లోకి కొన్ని కొత్త పదాలను చేర్చి మనందరం ఆయన్ని ఎప్పటికీ గుర్తుంచుకునే లా చేసుకున్నారు. 

ఆ పదాలేంటంటే "అమ్యమ్య" ,"తీత","తుత్తి".

ఈయన పుట్టింది, చిన్నతనం లో కొన్నాళ్ళు పెరిగింది, తూర్పు గోదావరి జిల్లాలో.... అందుకే కామోసు ఎటకారాన్నీ, వ్యంగ్యాన్ని కూడా తన పదాల విరుపు ల్లో అద్భుతంగా ప్రదర్శించగలరు....

" ఈస్ట్ ఈస్టే  ఎస్ట్ ఎస్టే"అని తేల్చాశారు కూడా ఉభయగోదావరి జిల్లాల గురించి

చిన్న ప్పుడు అంటే ఈటీవీ మన టీవీ ల్లో ప్రసరించడం మొదలైన రోజుల్లో మా అమ్మ" ఈ సినిమా చూద్దామే సినిమా చాలా బావుంటుందే"అని చూపించిన సినిమా " ముత్యాల ముగ్గు" అందులో అప్పుడు బాగా నచ్చింది " భజన సంఘం" బిట్టు.
ఆ తర్వాత బాగా ఊహ తెలిసిన తర్వాత నచ్చింది.
" సిఫార్సులు రికమండేషన్ల తో కాపురాలు చక్కబడవు " మామగారు అనే‌ వాక్యం.
అది నాకు ఓ కధానాయిక మాటల అనిపించలేదు ఎప్పటికీ గుర్తుంచుకుని మన నడవడిక లో కలుపుకోవాల్సిన వాక్యం లా అనిపించింది.

అలాగే " గోరంత దీపం" లో తండ్రి కూతురికి పెళ్ళి చేసి పంపేటప్పుడు చెప్పే మాటలు , ఆ  మాటల్లోనే తండ్రి అంటాడు " ఇవాళ్టి నీ అత్తిల్లే రేపు నీ కూతురికి పుట్టిల్లు అవుతుంది అని గుర్తుంచుకో అంటాడు ఎంత బరువైన నర్మగర్భితమైన మాట

"రాధాకళ్యాణం" సినిమా క్లైమాక్స్ లో ఈ క్రింది మాటలతో ఎంత అందంగా ముగుస్తుందో
" ప్రతి ఆడపిల్ల హృదయం పెళ్ళికి ముందు ఓ అద్దం లాంటిది. పెళ్ళైన తర్వాత అది భర్త ముఖంతో ఓ చిత్రం లా మారుతుంది" అని 

ముళ్ళపూడి వారి ఉవాచ లు కొన్ని

1. అమ్మకానికి పునాది నమ్మకం

2. ఏ బంధానికైనా పునాది నమ్మకం గౌరవం

3. కాల్లో ముల్లు గుచ్చుకుందని బాధ పడడం ఎందుకు కంట్లో గుచ్చుకోలేదనీ సంతోషించక

4.మంచివాడు చెడ్డవాడు అని వేరే ఉండరు అవకాశం వస్తే మంచి వాడు చెడ్డవాడు గా మారొచ్చు అవకాశం రాక చెడ్డవాడు మంచి వాడు గా ఉండి పొవచ్చు

 ఇలా ఎన్నో, బాపు గారు మెదడైతే ఈయనది హృదయం లేక ఈయనది మెదడైతే బాపు గారిది హృదయం. ఇద్దరిదీ విడదీయరాని బంధం.

"అజ్ఞానం ఇచ్చిన ధైర్యం విజ్ఞానం ఇవ్వలేదని" ఇల్లేరమ్మ ఉవాచ కానీ " కోతి కొమ్మచ్చి" చదివాక నాకు ఈయన ఈ ఉవాచకు పూర్తి గా వ్యతిరేకం అని తెలిసింది.

అందరినీ అదుపు ఆజ్ఞ ల్లో ఉంచే మన చండీరాణీ గారు ముచ్చట గా రాసిన" అత్తగారి కధలు" లకు పాతిక రూపాయల పారితోషికం పంపిన సంపాదకుడు ఈయన. శంబు ప్రసాద్ గారే ఏం చెప్పాలి అని ఆలోచించే పరిస్థితి అది.ఆవిడ అందుకు చాలా సంతోషించి వేల రూపాయల పారితోషికం కూడా ఇంత సంతోషం ఇవ్వలేదు రవణ గారు అని దాన్నావిడ ఎలా కర్సెట్టారో నవ్వుతూ వివరించారనుకోండీ

తన అప్పుల బాధలను కూడా హాస్యం గా రాసి మనల్ని  నవ్వించిన ఘనుడీయన

మనకందరికీ బాగా తెలిసిన మన తెలుగు వాళ్ళుం మన సొంతం చేసుకున్న "బుడుగు"మాటలు ఈయన వైతే రూపం బాపు గారిది.

అలా ఓ రాధ, ఓ గోపాలం,ఓ సి గానపెసునాంబ, ఓ బామ్మ, ఓ బుడుగు గాడి బాబాయ్ ఇలా మనందరికీ ఇష్టులై ఈయన రాతల్లో పుట్టి బాపు గారి గీతాల్లో తేలి మన వాళ్ళైపొయారు. రాతలాయన గీతలాయన ఈ రోజు భౌతికంగా మనతో లేక పోయినా వీళ్ళని మాత్రం మన మనసుల్లో ఎప్పటికీ నింపేశారు.

నాకు బాపు గారన్నా రమణగారన్నా చాలా ఇష్టం.ఇద్దరూ సమానమే. కానీ రమణ గారీ భాషలో చెప్పాలంటే రమణ గారు ఇంకొంచెం ఎక్కువ సమానం అన్నమాట.

ఆయన్ని కేవలం ఓ సినిమా రచయిత గా పరిగణిస్తే  నేను అస్సలు ఒప్పుకోను. ఓ గొప్ప రచయిత ఆయన... 

"కోతి కొమ్మచ్చి" చదివాక ఆయన నాకు రచయిత లా కూడా అనిపించలా నా పెత్తండ్రో, మేనమామో తన జీవిత పాఠాలను అనుభవాలను పక్కన కూర్చుని చెపుతున్నట్లు అనిపించింది. అందులో కొన్ని మాటలు కొన్ని సంఘటనలు నా మనస్సు లో ముద్రించుకుపోయాయి.
  

ప్రతి ఒక్కరూ జీవితం లో ఒక్కసారైనా చదవాల్సిన  పుస్తకం " కోతి కొమ్మచ్చి"

మహా మనిషి రమణ గారి జయంతి సందర్భంగా .....
 చుట్టరికం - ఒక వ్యాఖ్య-ఒక ప్రహసనం
రచన : కళ్యాణ్కళ్యాణ్ కిషోర్

వాట్శాపాలకీ, ఫోన్లకీ మునుపు, కాకి అరిచింది, దువ్వెన చెయ్యి జారింది, పొద్దున్నే అద్దం బద్దలయ్యింది, ఇవన్నీ చుట్టాలొస్తున్నారు అనడానికి సంకేతాలు. వీటిల్లో ఏది జరిగినా ఆరోజంతా ఎవరొస్తారా అని విపరీతమైన ఉత్సుకత ఉండేది. రిక్షానో, ఆటోనో ఇంటి ముందాగినట్టనిపిస్తే పెరటి గుమ్మం నుంచీ పది గుమ్మాలు తన్నుకుని వీధి వైపు పరిగెట్టి మరీ చూసొచ్చేయ్యాల్సిందే. చాలాసార్లు కాకులు రాకపోయినా కూడా చుట్టాలొచ్చేసేవారు. 

ఎవరైనా వచ్చేసాక ఉండే ఉత్సాహం కంటే ఎవరో వస్తారుట, అనే ఆత్రుత భలే ఉండేది. అలా అని చుట్టాలందరూ ఒకేలా ఉండరు కదా. తాతయ్య అనేవారు "పొద్దున్నే పట్టిన ముసురు, పొద్దోయాక వచ్చిన చుట్టం ఓహ పట్టాన కదలర్రా" అని. 
అంతే మరి, భోంచేసి వెళ్ళండి అంటే, మర్నాడు పొద్దున్న కాఫీ టిఫినీలు కానిచ్చి ఫస్టు బస్సుకు వెళ్తారని అర్థం. కొంత మంది చుట్టాలు వచ్చిన వారం రోజులుండి వెళ్లాకా కూడా ఆ చుట్టరికం ఏంటో అర్థమై చచ్చేది కాదు. మరీ దగ్గరి వాళ్లంతా అవతలి వీధిలోనో పక్కూళ్లోనో ఉండేవారు కాబట్టీ అన్నేసి రోజులుండే పరిస్థితి ఎలాగూ లేదు. 

అసలిప్పుడు ఆ భయాలు గానీ, ఎగ్జైట్మెంటు గానీ ఉండేడిస్తేగా. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోకపోతే తలుపు కూడా తియ్యం. గేటెడ్ వాళ్లకైతే చెప్పక్కర్లేదు. అసలు రోజూ బయటికి వెళ్లి తిరిగి ఇంట్లోకి వెళ్లడానికి వాళ్లే నానా యాగీ చెయ్యాలి.

మాకైతే ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒక చుట్టాలుండేవారు. అన్నగాడు చుట్టాల పేరి, వచ్చిన వాళ్లతో కబుర్లన్నీ వాడు చెప్పే వాడు, అమ్మ వండి పడీసీ, ఇక వాళ్లతో కూర్చునేది. నాన్నా నేనూ ఇంచుమించు ఒక రకమే గానీ...నేను వచ్చిన చుట్టాలకి, ఏం పెట్టాలి వాళ్లు కాఫీలవీ తాగేసి వెళ్లిపోయే రకమా..మజ్జాన్నం మజ్జిగాన్నం పెట్టాలా, మావిడి పండెయ్యాలా వద్దా, పడుకోడాని పక్కబట్టలెలా అరేంజ్ చెయ్యాలీ, రెండ్రోజులుంటారా, రెండ్రోజుల్లో కదలకపోతే ఎలా కదిలించాలి.. లాంటి ప్రణాళికా రచనలన్నీ మన అకౌంటు.  ఇహ నాన్నైతే  కళ్లతోనే పలకరింపు, మరీ దగ్గరి వాళ్లైతే అదీ లేదు. 

ఇలానే...మా బాబాయి ఒడుగుకి పొలోమని ఎక్కడెక్కడి చుట్టాలూ దిగుతున్నారు. తాతయ్య వాళ్ళ ఏడుగురు అప్పచెల్లెళ్లు, వాళ్ల ఆడపడుచులు, అల్లుళ్లూ.. అబ్బో అదో ప్రవాహం నడుస్తోంది. 

రెండు పూల పూల ట్రంకు పెట్టెలేసుకుని ఒక మామ్మ గారు దిగారు. ఛాయాదేవికి తక్కువ నిర్మలమ్మకి ఎక్కువా ఉన్న ఆవిడకి ఒక డెబ్భై పైనే ఉంటాయి. దిగుతూనే ఒక పెట్టి చంకనేసుకుంటూ, ఇంకోటి పని వాణ్ణి తెచ్చీమని బెత్తాయించేసి..వీధిలోంచే అందర్నీ పలకరించుకుంటూ వచ్చింది. మా బామ్మకి ఉన్న ఏడుగురు ఆడపడుచుల్ని, వాళ్ల పిల్లల్నీ గుర్తుంచుకోవడమే పెద్ద ప్రహేళిక, ఇంకా వాళ్ల ఆడపడుచుల-ముసలి పడుచుల్ని ఎక్కడ గుర్తుపడుతుందీ..ఆహా అంటే ఓహో అని కాఫీలందించేసి, భోజనాలకి తోలేస్తోంది అందర్నీ.

 మధ్యాహ్నం భోంచేసి నడుం వాల్చిన ఆవిడ హటాత్తుగా "సుబ్బడు ఎక్కడున్నాడే పొద్దున్నుంచీ కనబళ్లేదూ..." అని అడిగింది పక్కనున్న ఇంకో శాంతకుమారిని. ఇదిగో వీడేకదా సుబ్బడు వటువు వీడేగా అని పక్కనే తుంగచాపమీద తుండుకట్టుకుని నిద్రపోతున్న పిల్లాణ్ణి చూపించి అందావిడ. 

"అదేవిషీ సుబ్బడి కొడుక్కి కదా ఒడుగు..." అని సాగదీసింది. 

"ఇంకే సుబ్బడు ఉన్నాడొదినా మనింట్లో ఒహడేగా" అని శాంతకుమారీ, "అదేవిషే..ఆ సుబ్బణ్ణి కాదూ అప్పట్లో నాకిద్దామనుకుని తప్పిపోయిందీ నాకెందుకు తెలీదూ" అని ట్రంకు పెట్టీ,  అప్పటివరకూ జారవేసిన నడుములు కొంచెం పైకెత్తి మరీ వాదించుకోవడం మొదలెట్టారు. 

ఈ కథంతా వింటూ..చెక్క వాలు కుర్చీలో పడుకుని, పొట్టమీద రేడియో పెట్టుకుని, వెలిగించని పచ్చి చుట్టని చప్పరిస్తున్న మా తాతయ్య...

"వదిన గారూ...మీరు  వాడపిల్లి వారి సుబ్బడి గురించేనా అడిగేదీ" అన్నారు. 

"ఆ... మరే అతనేగా" అందావిడ. 

"నాకు పొద్దున్నుంచే అనుమానం ఉందిలెండి. వాడపిల్లి సుబ్బన్న గారిది పక్కిల్లే, వాళ్లబ్బాయిదీ ఎల్లుండే ఒడుగు..మా వాడిది రేపు" అని చుట్ట మళ్లీ నోట్లో పెట్టేసుకుని రేడియో సౌండు కొంచెం పెంచుకుని మళ్లీ ధ్యానంలోకి వెళ్లిపోయారు. 

మళ్లీ కాఫీలవీ అయ్యాకా, ఆవిణ్ణీ, ట్రంకు పెట్టెల్నీ పక్కింటికి తరలించేరు తరువాత. 

మర్నాడు మా ఇంట్లో ఒడుక్కి మళ్లీ వచ్చింది కూడాను.
 డాక్టర్ కొచ్చర్లకోట జగదీష్ గారి రచన 

ఊరు మాటుమణిగింది. అంతవరకూ అహంకారాన్ని చూపించిన సూర్యుడు అణకువగా అణగారిపోయాడు. నిరంకుశ ప్రభువుని సాగనంపి చల్లని మారాజు మెల్లగా పైకొచ్చాడు. వెదురుదడినానుకుని అల్లుకున్న సన్నజాజులు, పక్కింటి గోడవారగా పారిజాతాలు కలిసి కుమ్మక్కై గాలిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. తన దారిన తను పోతుంటే నిలిపి, నిలదీసి పరిమళాల సొబగులద్ది, పదిమందికీ పంచమని పంపించాయి.

మనసంతా మధురమైన బాధ. అమ్మ గుర్తొచ్చింది. వెలుగుండగా అమ్మ, చీకటిపడిన పిమ్మట చందమామ! ఇవే తనకి కొండంత సేద. దీపాలు వెలిగించిన గుమ్మంలో నులకమంచం మీద అక్క ఒళ్లో పడుకుంటే బోలెడు కథలూ, కబుర్లూ చెప్పేది. అందులో రాకుమారులకి రాని విద్యా వుండేది కాదు, ఓడించని రాక్షసుడూ ఉండేవాడు కాడు. గుర్రాలు, సరస్సులు, తటాకాలు, రాకుమార్తెలు...! 

ఇంత కథా పూర్తిగా వినకుండానే మధ్యలో పడుకుండిపోయి, మర్నాడు మళ్లీ మొదట్నుంచీ చెప్పమంటూ చేసే అల్లరీ గుర్తొచ్చింది. అదెప్పటికీ సశేషమే!

ఇప్పుడెవరున్నారు? తనకు తానే! ఏం? అసలుకి తనెంత అందగాణ్ణని? వేలితో తాకితే గుచ్చుకుంటుందేమో అనేంత సూదిగా ముక్కు, అనవసరమైన కండల్లేని ఆరోగ్యవంతమైన శరీరావయవాలు. బ్రతకడానికి కావలసిన మనోధైర్యం, గొంతెత్తి పాడితే అంతెత్తుకి ఎగసిపడే మనోహరమైన గాత్రం!

‘ఒక పాటందుకోరా!’ అని అడిగిందే తడవుగా మొహమాటమెరుగని నిబద్ధత తన సొంతం. పాట మొదలయ్యేసరికి లేతపెదాలతో పాలుతాగే పసివాళ్లూ, లేగదూడలకి పాలిచ్చే పశువులూ కూడా పాట పూర్తయ్యేదాకా కాసేపు ఆగిపోయేంత మహత్తు!

అందాన్ని చూసేందుకు పనికిరాని ఆ కన్నులు మాత్రం చూసేందుకు చాలా అందంగా వుంటాయి....!

అవును. అందమైన బొమ్మను చేస్తూ, కళ్ల దగ్గరకొచ్చేటప్పటికి కళ్లల్లో నిప్పులు పోసేసుకున్నాడా బ్రహ్మదేవుడు. అదే చేత్తో అమ్మనూ పట్టుకుపోయాడు.

అంత చిన్న వయసులోనూ తత్త్వాన్ని తలకెక్కించుకుని, లలితంగా పాడేసే విద్య వాడికబ్బింది.

గోదాట్లో పడవ సాగిపోతుంటే పాటందుకుంటాడు. వాడికెవరూ చెప్పనక్కర్లేదు. 

‘నదినిండా నీళ్లు వున్నా
మనకెంత ప్రాప్తమన్నా
కడవైతే కడివెడు నీళ్లే
గరిటైతే గరిటెడు నీళ్లే’

అనగానే అంతవరకూ తానొక్కడే కష్టాల్లో కూరుకుపోయానని కుమిలిపోయే గుమాస్తా ఒకడు ‘నిజమేకదా?’ అంటూ చిరునవ్వొకటి చిందించేవాడు.

‘ఎవరెంత చేసుకుంటే అంతేకాదా దక్కేదీ?’

అన్న సూక్ష్మం... వినడానికి నిన్ను శాంతపరుస్తుంది. కానీ మనసుని ఉల్లాసపరచదు. అయితే వీడి గొంతులో మహత్యమేమో గానీ, అదికూడా నిజమేలే అనిపించేస్తుంది.

‘ధరతక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువ
కొత్తమతం పుచ్చుకుంటె గుర్తులెక్కువ
చేతకానమ్మకే చేష్టలెక్కువ
చెల్లని రూపాయికే గీతలెక్కువ’ అంటూ...

డబ్బుచేసిన ఆసామీల దర్పానికి కాల్చకుండా వాతలూ పెడతాడు. ఎగిరెగిరిపడే హంగుల్ని ఎండగడతాడు కూడా!

‘తమ సొమ్ము సోమవారం
ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం
ముప్పొద్దుల తింటా’రంటూ...

పేరసైట్ బతుకుల్ని పదిమందిలో పేర్చేస్తాడు.

‘పరులకింత పెట్టినదే
పరలోకం పెట్టుబడి...’

ఇహలోకంలో అనుభవాలకి పరలోకంలో పరిహారాలు వుంటాయని నమ్మేవాళ్లందరూ వాడి మాట విని వెంటనే ఎదురుగా కనబడే దీనులకి ఒక డబ్బు దానం చేసేవారు. 

అప్పటికప్పుడే ఎంతో పుణ్యాన్ని మూటకట్టేసుకున్న భావన. గోదాట్లో నాణాలు విసిరి దణ్ణం పెట్టుకునే అమాయక ప్రజకి పాపభీతి వుండడం సహజమే కదా?

తనకి తోడుగా ఆ కాలు విరిగిన కుర్రాడొకడు తోడయ్యాడు. వాడి మొహమంతా దైన్యం. చూపులెప్పుడూ శూన్యం. కానీ ఆ నడకలో ఒక ధైర్యాన్నీ, మనోనిబ్బరాన్నీ నింపిన ఘనత మాత్రం మనవాడిదే!

ఏదోలా డబ్బుతెచ్చి తనకు చూపు తెప్పిస్తానంటూ మాటిమాటికీ అంటున్న వాడితో ‘నీవుంటే వేరే కనులెందు’కంటూ ఆపేశాడు.

‘నా ఎదురుగ నీవుంటే తొలిపొద్దు
నువు చెంతన లేకుంటె చీకటి
నీచేయి తాకితే తీయని వెన్నెల
అలికిడి వింటేనే తొలకరి జల్లు’

అంటూ వెలుగురేఖల్నీ, చీకటిపొరల్నీ, పాలవెన్నెలల్నీ, తేనెజల్లుల్నీ కూడా తన సాంగత్యంలోనే వున్నాయంటూ నిరూపణ చేసి ఒప్పించేశాడు.

‘నిన్న రాతిరీ ఓ కలవచ్చిందీ
ఆకలలో ఒక దేవత దిగివచ్చింది
చందమామ కావాలా 
ఇంద్రధనువు కావాలా
అమ్మనవ్వు చూడాలా
అక్క ఎదురు రావాలా
అంటూ అడిగిందనీ...

నాకవేవీ అవసరం లేదనీ..

నీవుంటే వేరే కనులెందుకని
నీబాటలో అడుగులు నావని
నా పాటలో మాటలు నీవనీ’

సర్దిచెప్పాడు.

తినడానికి తిండే దొరక్క అలమటిస్తోంటే వీడి ధైర్యం చూడండి....

అడిగితే అయిదిచ్చారు
పనిచేస్తే పదొస్తుంది
దేశంనిండా దేవుడి ఏజెంట్లున్నారు....

‘పోనీరా, పోతే పోనీరా
పోయింది పొల్లు.. మిగిలిందే చాలు!’
అంటూ ఇంకా ఇలా సెలవిచ్చాడు...

‘కష్టాలే కలకాలం కాపురముంటాయిట
సౌఖ్యాలు చుట్టాలై వస్తూపోతుంటాయిట
వెళ్లాలి బహుదూరం మోయాలి పెనుభారం
ఏమైనా కానీరా మనయాత్ర మానం... అంటూ నొక్కిమరీ చెప్పాడు.

ఎందుకాపాలి బ్రతుకుని? అన్నిటికంటే ఎంతో విలువైన మనసనేది మనిషి సొంతం. దాన్ని నీ చెప్పుచేతల్లో పెట్టేసుకుంటే కాలూచెయ్యీ లేకపోయినా, కావలసినవాళ్లు కాదనేసినా ధైర్యంగా ముందుకెళ్లొచ్చు. 

దేశం నిండా దేవుడి ఏజెంట్లు... అంటే మనచుట్టూ ఉండే ప్రపంచంలో కేవలం మంచినే చూసే ఆశావాద ధోరణి కనబడ్డం లేదూ? ఎవరో ఏదో అన్నారనీ, ఏ ఒక్కరూ సాయం రారనీ కుమిలిపోయే హృదయాలకి కొండంత అండగా నిలబడే పసివాడు వీడు.

‘ఎంత మబ్బు మూసినా
ఎంత గాలి వీచినా
నీలినీలి ఆకాశం అల్లాగే వుంటుంది

ఎంత ఏడుపొచ్చినా
ఎంత గుండె నొచ్చినా
నీలోపలి ఉద్దేశం
అల్లాగే వుండా’లంటూ భుజం మీద చెయ్యేసి ముందుకి నడిపిస్తాడు వీడు. 

‘స్నేహం’ చిత్రం కోసం ఆరుద్ర, సినారె అలవోకగా రాసిపడేసిన ఈ ఆణిముత్యాలు వింటోంటే ఏదో తెలియని ఆశావాదం. నిజమైన కష్టకాలంలో ఈ పాటల్ని విని, మనసుని నా అధీనంలో నిలబెట్టుకున్న అనుభవంతో చెబుతున్నాను....

సినీ సాహిత్యానికి మళ్లీ చందమామలు, వెన్నెలలు, ఆశాజ్యోతులు కావాలి. రావాలి. 

అవి ఆరిపోబోయే దీపాల్ని తప్పకుండా నిలబెడతాయి. 
ఆవిరైపోయే అవకాశాల్ని చమురల్లే అందిస్తాయి.

బ్రతకండి హాయిగా!

........కొచ్చెర్లకోట జగదీశ్
 🙏 *హృదయ స్వరం....కథ*🙏

*నా కూతురి పెళ్లి ఏర్పాట్ల కోసం నేను కొన్ని రోజులు ఆఫీసుకు సెలవు పెట్టాను. ఆ రోజు పని ముగించుకుని ఇంటికి రాగానే నా భార్య ఒక కవరు ఇచ్చింది.*

*ఆ కవరు పైన ఏమీ లేదు, కానీ పంపినవారి పేరు చూడగానే నాలో ఆశ్చర్యం, ఉత్సుకత రెండూ కలిగాయి - 'అమర్ విశ్వాస్' - ఈ పేరు చూడగానే, అతనితో నా పరిచయం కొన్నిఏళ్ల క్రితం జరిగింది అన్న విషయం గుర్తుకొచ్చింది*.

*నేను వెంటనే ఉత్తరం తెరిచి ఒక్క శ్వాసలో ఉత్తరం మొత్తం చదివాను*. 
*ఇది ఆశ్చర్యం కలిగించే ఒక అభూతకల్పనలా అనిపించింది*.
 
*లోపల ఇలా రాసి ఉంది -*

*గౌరవనీయులైన అయ్యగారికి, మీకు ఒక చిన్న బహుమతి పంపుతున్నాను. మీ ఆదరాభిమానాల ఋణం నేను ఎప్పటికైనా తీర్చుకోగలనని నేను అనుకోను. ఈ బహుమతి నేను చూడని నా సోదరి కోసం. ఇంట్లో అందరికీ నా వందనాలు*.
*మీ*,
*అమర్*

*పాత రోజులు హఠాత్తుగా ఒక సినిమాలాగా నా కళ్ల ముందు కదిలాయి*.


*ఒకరోజు నేను కోల్కతాలో రోడ్డు మీద వెళుతుండగా, నాకు ఇష్టమైన పత్రికల పేజీలను తిప్పుతూ ఒక పుస్తక దుకాణం వద్ద నిలబడ్డాను. కొద్దిసేపటికే, దుకాణం వెలుపల ఒక చిన్న పుస్తకాల గుట్ట దగ్గర నిలబడి ఉన్న ఒక కుర్రాడిని చూశాను. అతను బుక్ షాప్ లోకి ప్రవేశించే ప్రతీ ఉన్నతవర్గ వ్యక్తుల వద్దకు వెళ్లి వారిని అభ్యర్థిస్తూ, ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు, వారి నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో, వెళ్లి తన చోటులో నిలబడుతున్నాడు. చాలా సేపు నిశ్శబ్ద ప్రేక్షకుడిలానేను దీన్ని గమనిస్తూనే ఉన్నాను.*

*మొదట చూడగానే, ఫుట్ పాత్ దుకాణదారులు సాధారణంగా చేసే ఏర్పాటు లాగానే కనిపించింది, కాని ఆ కుర్రాడి ముఖంలో నిరాశ మాత్రం మాములుగా అనిపించలేదు. ప్రతిసారీ, అతను ఒక కొత్త ఆశతో ముందుకెళ్లి ప్రయత్నిస్తున్నాడు, మళ్ళీ నిరాశపడుతున్నాడు*.

*చాలా సేపటినుండి చూస్తున్న నేను, కుతూహలాన్ని అణచుకోలేక, వెళ్ళి ఆ కుర్రాడి పక్కన నిలబడ్డాను*.

*ఆ అబ్బాయి పాత సైన్స్ పుస్తకాలు అమ్ముతున్నాడు. నన్ను చూడగానే అతని కళ్లలో మళ్లీ ఆశ కలిగి, ఎంతో ఉత్సాహంతో పుస్తకాలు చూపించడం మొదలుపెట్టాడు*.

*నేను అబ్బాయిని పరిశీలించాను. చక్కగా, శుభ్రంగా కనిపించాడు. ముఖంలో విశ్వాసం కనిపించింది, చాలా సాధారణమైన దుస్తులు ధరించి ఉన్నాడు. అది శీతాకాలం అయినా ఒక తేలికపాటి స్వెటర్ మాత్రమే వేసుకుని ఉన్నాడు*.

*ఆ పుస్తకాలు నాకేమీ పనికిరావు, అయినా ఏదో సమ్మోహనావస్థలో ఉన్నట్లుగా నేను, "బాబు, ఈ పుస్తకాల ఖరీదెంత?", అని అడిగాను*.

*"ఎంత ఇవ్వగలరు సార్?" ఆ పిల్లవాడు అడిగాడు.*
 
*నేను, "నువ్వు ఎంతో కొంత మొత్తం అనుకుని ఉంటావు కదా, అదే చెప్పు."*

*“మీరు కూడా ఎంత మొత్తం ఇవ్వాలో అనుకుని ఉంటారు కదా, మీరు ఎంత ఇవ్వగలిగితే అంత సార్”, అన్నాడు కుర్రాడు కాస్త నిరాశగా.*

*"నీకు ఎంత కావాలి?" మళ్ళీ అడిగాను.*

*నేను అతనితో కేవలం కాలక్షేపం చేస్తున్నాననుకుని, ఆ కుర్రాడు కాసేపు ఆలోచించి,*

*"5 వేల రూపాయలు" అని కొంచెం కటువుగా అన్నాడు.*

*"ఈ పుస్తకాలకు ఎవరైనా 500 రూపాయలు ఇచ్చినా, అది చాలా ఎక్కువ",* 
*అతనిని బాధపెట్టాలని అనుకోలేదు, కానీ, గబుక్కున ఆ మాటలు నా నోట్లోంచి బయటికొచ్చాయి.*

*అప్పుడు ఆ కుర్రాడి మొహం చూడాల్సిందే... ఆ మొహంలో బోలెడంత ఆశాభంగం ఒక్కసారిగా కమ్ముకుంది.*

*నేను అన్నదానికి వెంటనే పశ్చాత్తాపపడ్డాను. అతని భుజం మీద చెయ్యి వేసి, ఓదార్పుగా మళ్ళీ ఇలా అడిగాను, "చూడు నాయనా, నువ్వు పుస్తకాలు అమ్మేవాడివని నేను అనుకోవట్లేదు. అసలు విషయమేమిటో స్పష్టంగా చెప్పు. నీకు ఏమి కావాలి?"*

*దీంతో ఆ కుర్రాడు ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు. బహుశా చాలా కాలపు నిరాశ, అతని సహనాన్ని పరీక్షించి ఉండవచ్చు.* 
*“సార్, నేను నా ఇంటర్మీడియట్ పూర్తి చేసాను. మా నాన్న ఒక చిన్న రెస్టారెంట్ లో పనిచేస్తున్నారు. మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఇప్పుడు కాలేజీలో చేరాలంటే నాకు డబ్బు కావాలి.*

*"నీ పేరు ఏమిటి?", ఆశ్చర్యంగా అడిగాను*.
  *"అమర్  విశ్వాస్" అని చెప్పాడు.*
 
*"నీ పేరు అర్ధమే విశ్వాసం, కానీ నీవు చాలా నిరాశగా కనిపిస్తున్నావు. నీకు ఎంత డబ్బు కావాలి?", అడిగాను*.


*"5 వేలు", ఈసారి నెమ్మదిగా అన్నాడు*.

*"నీకు ఆ డబ్బు ఇస్తే, మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయగలవా? ఈ పుస్తకాలకు ఎలాగూ అంత విలువ లేదు" అని అడిగాను, చిన్నగా నవ్వుతూ.*

*“సార్, మీరే నా పేరు అంటే విశ్వాసం అని చెప్పారు, మీరు నా మీద నమ్మకం ఉంచండి, నేను గత నాలుగు రోజులుగా ఇక్కడికి వస్తున్నాను,  నాతో ఇంతసేపు మాట్లాడిన మొదటి వ్యక్తి మీరే, డబ్బు సర్దుబాటు కాకపోతే, నేను కూడా ఏదో ఒక హోటల్లో పాత్రలు కడుగుతూ మీకు కనిపిస్తాను."* 
*అతని గొంతులో భయం, తన భవిష్యత్తు కరిగిపోతుందనే సందేహం కనిపించింది.*

*ఆ గొంతులో, ఆ స్వరంలో ఏముందో నాకు తెలియదు కానీ,  నా హృదయంలో అతనికి సహరించాలనే భావన ఉద్భవించింది. మనసు అతనొక మోసగాడనే ఆలోచన వైపు మొగ్గుతున్నా, నా హృదయం మాత్రం అతని మాటలను అంగీకరించమని, నమ్మమని సంకేతాలు ఇవ్వడం ప్రారంభించింది.*

*చివరికి హృదయమే గెలిచింది. నా పర్సులోంచి, షేర్ మార్కెట్ లో పెట్టుబడి కోసం ప్రక్కనపెట్టుకున్న ఐదు వేల రూపాయలు తీసి అతనికి ఇచ్చాను. ఇది నాకు కూడా చాలా పెద్దమొత్తమే, కానీ దాన్ని తీసి ఇవ్వడానికి ఏ స్వరం నన్ను ఒప్పించిందో నాకు తెలియదు*.

*“చూడు బాబు, నీ సంకల్పం ఎంత దృఢమైనదో, నీ మాటలు ఎంత శక్తివంతమైనవో నాకు తెలీదు, కానీ నా హృదయంలో నీకు సహాయం చెయ్యాలని అనిపించింది కాబట్టి ఇలా చేస్తున్నాను. నాకూ ఒక కూతురు ఉంది. నీకంటే 4-5 ఏళ్ళు చిన్నది, పేరు మినీ. మా పాప కోసం ఒక బొమ్మ కొన్నాను అని అనుకుంటాను,"* 
*అమర్ కు డబ్బు ఇస్తూ అన్నాను.*

*అమర్ ఖంగుతిన్నాడు. బహుశా అతనికి ఇది నమ్మశక్యంగా ఉండుండకపోవచ్చు. కళ్లలో నీళ్లుతో అతను నా పాదాలను తాకినప్పుడు, రెండు కన్నీటి చుక్కలు కూడా నా పాదాలను తాకాయి*.

*“ఈ పుస్తకాలను మీ కారులో పెట్టవచ్చా?” అని అడిగాడు.*
 
*"అవసరం లేదు. వీటిని నీ దగ్గరే పెట్టుకో. ఇది నా కార్డ్, నీకు ఏదైనా అవసరం వస్తే, నాకు చెప్పు." అన్నాను*.
*అతను విగ్రహంలా నిలబడిపోయాడు. నేను వెళ్తూ అతని భుజం తట్టి, కారు స్టార్ట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాను.*

*కారు నడుపుతున్నప్పుడు, జరిగిన ఆ సంఘటన నా మనస్సులో మెదుల్తూనే ఉంది, నేను జరిపిన వ్యవహారం గురించి ఆలోచిస్తూ ఉన్నాను, అందులో సందిగ్ధతే ఎక్కువగా ఉంది. ఎవరికైనా తెలిస్తే, వారు నన్ను ఒక భావోద్వేగ మూర్ఖుడిగా మాత్రమే భావిస్తారు. అందుకే ఈ సంఘటన ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకున్నాను.*

*రోజులు అలా గడిచిపోయాయి. అమర్ తన వైద్య విద్య ప్రవేశం గురించి నాకు లేఖ ద్వారా తెలియజేశాడు. నా మూర్ఖత్వంలో కొంత మానవత్వం కనిపించింది. ఏదో తెలియని శక్తి, లేదా హృదయంలో ఉన్న 'మానవత్వం', ఆ చిరునామాకు మళ్లీ ఓ రెండు వేల రూపాయలు పంపేలా ప్రేరేపించింది.*

*భావోద్వేగాలు గెలిచి, నేను నా మూర్ఖత్వాన్ని పునరావృతం చేస్తునే ఉన్నాను. రోజులు గడుస్తూనే ఉన్నాయి. అతను నాలుగు పంక్తులతో ఒక చిన్న లేఖను పంపేవాడు. అందులో రెండు నాకు వ్రాసి ఉంటే, ఒకటి అతని చదువు గురించి, మరొకటి తన సోదరి అని పిలిచే నా మినీకి వ్రాసేవాడు.*

*నేను నా మూర్ఖత్వాన్ని పునరావృతం చేసేవాడిని, దానిని మరచిపోయేవాడిని. నేనెప్పుడూ అతని దగ్గరకు వెళ్లి నా డబ్బు ఎలా సద్వినియోగపడుతోందో చూసేందుకు ప్రయత్నించలేదు, అతనూ నా ఇంటికి రాలేదు. ఇదిలా కొన్నాళ్లు కొనసాగింది.*

*ఒకరోజు, అతను పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు నాకు ఉత్తరం వ్రాసాడు. అందులో అతను తన స్కాలర్షిప్ గురించి కూడా ప్రస్తావించాడు, మినీ గురించి ఒక పంక్తి రాయడం ఇంకా మర్చిపోలేదు. ఆ ఉత్తరంలో నిజమెంతో తెలియక మరోసారి నా మూర్ఖత్వానికి గర్వపడ్డాను. కాలం గడుస్తూనే ఉంది.*

*అమర్ తన పెళ్లి శుభలేఖ పంపాడు. బహుశా ఆస్ట్రేలియాలోనే స్థిరపడాలని ఆలోచిస్తున్నాడనుకున్నాను*.

 *మినీ కూడా తన చదువు పూర్తి చేసింది. ఆమె వివాహం ఒక మంచిపేరుగల కుటుంబంలో నిశ్చయమైంది*.
*ఇప్పుడు పెళ్ళివారి కుటుంబ హోదా ప్రకారం మినీకి పెళ్లి చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ సంస్థలో ఉన్న పెద్ద అధికారి చెప్పుకోవడానికి కాగితాలపైనే సింహం. పెళ్లికి బోలెడంత డబ్బు కుదరాలి..... చాలా గందరగోళం...*
*మరి ఇప్పుడేమో ఈ చెక్కు? నేను నా ప్రపంచానికి తిరిగి వచ్చాను*.

*అమర్ మరోసారి గుర్తుకొచ్చి అతనికి కూడా మినీ పెళ్లికి ఆహ్వానం పంపాను*.

*మా ఇంట్లో పెళ్లి సందడి మొదలయ్యింది. నేను, నా భార్య ఏర్పాట్లలో మునిగిపోతే, మినీ, ఆమె స్నేహితులతో హడావిడిగా ఉంది. మా వరండాలోకి పెద్ద కారు వచ్చి ఆగింది. డ్రైవరు కారు డోరు తెరువగా, దర్జాగా కనపడుతున్న ఒక వ్యక్తి, తన భార్య ఒడిలో చంటిబిడ్డతో సహా దిగాడు*.

 *ఈ వ్యక్తిని ఇంతకు ముందు ఎక్కడో చూశానని అనుకుంటూ నేను తలుపు వద్ద నిలబడిఉన్నాను. అతను వచ్చి నా పాదాలను, ఆపై నా భార్య పాదాలను కూడా తాకాడు.*

*చాలా గౌరవంగా,“సార్ నేను అమర్..” అన్నాడు* .

*నా భార్య ఆశ్చర్యంగా నిలబడిపోయింది, నేను గర్వంగా అతన్ని కౌగిలించుకున్నాను.* 
*అతని పిల్లవాడు నా భార్య ఒడిలో ఆడుతున్నాడు. మినీ కొంత సందేహాస్పదంగా చూస్తోంది*

*అమర్ తనతోపాటు చాలా బహుమతులు తెచ్చాడు. మినీని చాలా ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు, ఒక సోదరుడిని పొందడం ఆమెకు చాలా సంతోషం కలిగించింది.*
*ఒక పెద్దన్నయ్యలాగా చేయాల్సిన అన్ని విధులను చేయడంలో అమర్ నిమగ్నమయ్యాడు. నాపై ఎలాంటి పెద్ద బాధ్యతలేవీ పెట్టలేదు, నన్ను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనివ్వలేదు.*

*అతను భారతదేశంలో ఉన్న అన్ని రోజులు చాలా త్వరగా గడిచిపోయినట్లు అనిపించింది.*

*ఈసారి అమర్ ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్తున్నప్పుడు, విమానాశ్రయంలో నాకే కాదు, నా భార్య, మినీ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి*. 
*విమానం ఆకాశాన్ని తాకడానికి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ, దానితో పాటు నా విశ్వాసం కూడా ఆకాశం అంత ఎత్తుకు ఎదిగింది. నా మూర్ఖత్వం గురించి నేను మరోసారి గర్వపడ్డాను*. 
 
*భగవంతుడు, మన విశ్వాసం - ఈ రెండే ఈ మనుష్య ప్రపంచాన్ని నడుపిస్తున్నాయని గ్రహించాను*.

*మనం మన హృదయాన్ని వింటున్నప్పుడు, ఎంపిక చేసుకునే విస్తృతమైన మానసిక ప్రక్రియ ద్వారా మనం వెళ్లవలసిన అవసరం ఉండదు; ఏది సరైనదో మనకు ఎల్లప్పుడూ తెలుస్తుంది*. 

*దాజీ*
 *హార్ట్ ఫుల్ నెస్ ధ్యానO* ❤️



 🙏 *రమణోదయం* 🙏

*మందు తినాలి తప్ప మందు పేరు జపిస్తే దీర్ఘ వ్యాధులు నయం కావు. అట్లాగే మహావాక్యాలైన "శివోహం" మొదలైన అనేక శబ్దపద విన్యాసాలను జపిస్తేనే జన్మబంధం విడిపోదు. అవి చెప్పే వస్తువైన బ్రహ్మంగా తాను నిష్ఠలో ఉండాలని భావం.*

అణకువగా ఉండటం నేర్చుకోవటము 
జ్ఞానం పొందడంలో ఒక మెట్టు...
అణకువగా ఉండటంలో మనకు పోయేది ఏమి లేదు,
లాభమే చేకూరుతుంది...
ప్రార్ధన మరియు మననం  ఈ అంతర్గత గుణమును
అలవర్చుకోవాలన్న మన మనోశక్తిని బలపరుస్తాయి!

జీవిత భోగాల కోసం
దేవుడు సాధనంగా ఉండకూడదు.
దేవుని కోసం
జీవితం సాధనంగా ఉండాలి.

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏🏻

🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.710)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె 
పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*||
                     
            🌷🙏🌷
 🌿 **చర్మంపై తేమ (Moisture) అవసరమా? ఎంత వరకు వుండాలి? మంచి సబ్బులు ఏవి?** 🌿

🌱 *ముందుమాట:*  
మన చర్మం ఆరోగ్యంగా, మృదువుగా, ప్రకాశవంతంగా ఉండాలంటే తేమ (moisture/hydration) చాలా కీలకం. చాలా మంది తేమ అనేది తడి అనే అపోహలో ఉంటారు. వాస్తవానికి తేమ అనేది చర్మ కణాలలో నీరు, సహజ నూనెలు సమతుల్యంగా ఉండటమే. సబ్బులు ఎంచుకునేటప్పుడు తేమను నిలిపే లక్షణాలు ఉన్నవే ఉపయోగించాలి.

✳️ **1. చర్మానికి తేమ అవసరమా? (Is Skin Moisture Important?)**  
*అవును. తేమ లేని చర్మం పొడిబారి, పెళ్లలు పడి, చర్మ వ్యాధులకు దారితీస్తుంది.*  
*తేమ ఉన్న చర్మం తడిగా కాకుండా తాకినప్పుడు మృదువుగా ఉంటుంది.*  
*చర్మంలోని "Hydrolipid layer" అనే సహజ రక్షణ పొర తేమతోనే పనిచేస్తుంది.*  
*తేమ లేని చర్మం త్వరగా వృద్ధాప్య లక్షణాలు చూపిస్తుంది.*

✳️ **2. తేమ ఎన్ని శాతం ఉండాలి? (Ideal Skin Moisture Levels)**  
*సాధారణంగా చర్మ తేమ స్థాయి 30%–35% ఉండాలి (Stratum Corneum లో).*  
*30% కన్నా తక్కువ అయితే “dry skin”, 35%–45% మధ్య “normal skin”, 45% పైగా అయితే “oily skin”.*  
*హ్యూమిడిఫైయర్‌తో గది తేమ సుమారు 50%–60% ఉండటం మంచిది.*

✳️ **3. తేమ తగ్గడానికి ముఖ్య కారణాలు**  
- అధిక ఫ్రిక్షన్ ఉన్న సబ్బుల వాడకం  
- వేడి నీటితో స్నానం  
- శీతాకాలం వాతావరణం  
- బాడీ లోషన్లు లేదా నూనె వాడకపోవడం  
- నీరు తక్కువ తాగడం

✳️ **4. తేమ నిలుపుకునేందుకు సబ్బు ఎంచుకునేటప్పుడు చూడవలసిన లక్షణాలు**  
✅ *TFM (Total Fatty Matter) 76% పైగా ఉండాలి*  
✅ *గ్లిసరిన్, షియా బటర్, ఆలివ్ ఆయిల్ వంటి తేమ నిలిపే పదార్థాలు ఉండాలి*  
✅ *SLS/SLES రహిత సబ్బులు మంచివి (సాంప్రదాయ సబ్బులు చాలా పొడిబార్చుతాయి)*  
✅ *pH balance – చర్మానికి సమతుల్యంగా ఉండే pH (5.5–6.5) ఉన్నవే ఉత్తమం*

✳️ **5. తేమను కాపాడే 5 మంచి సబ్బులు (Top Moisturizing Soaps)**

🧼 **1. Dove Cream Beauty Bathing Bar**  
- గ్లిసరిన్ + మాయిశ్చరైజర్ క్రీమ్ తో తయారు  
- 1/4 moisturizing cream‌తో చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది  
- Dry skin ఉన్నవారికి అత్యుత్తమం  
- pH-balanced, dermatologically tested  

🧼 **2. Pears Pure & Gentle Glycerin Soap**  
- Natural glycerin & Vitamin E తో తేమ నిలిపే ఫార్ములా  
- Daily-use కోసం మంచిది  
- Translucent మరియు హల్కీ వాసనతో ఉంటుంది  
- పొడి చర్మానికి మంచి ఎంపిక

🧼 **3. Medimix Moisturising Soap (Aloe vera + Glycerin)**  
- ఆయుర్వేద ఆధారిత చర్మ సంరక్షణ  
- తేమ మరియు ఫంగస్ నివారణకు సహాయపడుతుంది  
- శీతాకాలంలో మంచి ఎంపిక  
- సెన్సిటివ్ స్కిన్‌కు సురక్షితంగా పనిచేస్తుంది

🧼 **4. Himalaya Almond & Rose Soap**  
- ఆల్మండ్ ఆయిల్ + రోజ్ ఎస్సెన్స్ వల్ల తేమగా ఉంచుతుంది  
- తక్కువ ఖర్చుతో మంచి తేమ Soap  
- Himalaya విశ్వసనీయ బ్రాండ్  
- పరిమళభరితంగా, ఒత్తిడిని తగ్గిస్తుంది

🧼 **5. Nivea Creme Soft Soap**  
- షియా బటర్, తక్కువ హార్ష్ పదార్థాలతో  
- Nivea moisturizing cream సబ్బులోనే  
- Long-lasting hydration కోసం  
- శరీరంపై క్రీమ్ లేయర్ లా తేమను ఇన్‌లాక్ చేస్తుంది

🌿 **ముగింపు:**  
తేమ అనేది చర్మ ఆరోగ్యానికి ఫౌండేషన్ లాంటిది. మీరు వాడే సబ్బు తేమను తగ్గించకుండా, నిలిపే విధంగా ఉండాలి. పై 5 సబ్బులు అందులో ఉత్తమ ఎంపికలు. వాటిలో గ్లిసరిన్ ఆధారిత, తక్కువ రసాయనాలతో ఉండే దానిని ఎంచుకోవడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది. రోజుకు 2 సార్లు తగిన మాయిశ్చరైజర్ వాడితే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
 *🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగు అవి :*
1. *కృతయుగము,*
2. *త్రేతాయుగము,* 
3. *ద్వాపరయుగము,* 
4. *కలియుగము.* 
*ఇలా ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు, మంత్రి అని చెబుతున్నారు. మరి పురాణాలూ, శాస్రాలు యుగాల గురించి ఎం చెబుతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.*

*1. కృతయుగం:*
➖➖➖➖
*నాలుగు యుగాలలో మొదటిది కృతయుగం. దీనినే సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగం నందు నారాయణుడు లక్ష్మి సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము పదిహేడు లక్షల ఇరవై ఏడూ వేల సంవత్సరములు. ఈ యుగం లో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యుగంలో అకాలమరణాలుండవు. ఇక ఈ కృతయుగమునకు రాజుగా సూర్యుడు* *అంటే రవి మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు. బంగారమునకు అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారుమయముగా ఉండేది. ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేదము విరోధము లేక చక్కగా కాలకు నడిచినది. సూర్య ప్రభావము చేత సుక్షత్రియులు, గురు ప్రభావము చేత సద్బ్రాహ్మనులు జనించి ధర్మ మయిన పాలన నడిచినది. ఇక సకాలమునకు వర్షం మంచి పంటలు పాడి పశువులు అభివుద్ది చెంది ప్రజలు సుఖమయిన జీవనము గడుపుతూ ధర్మమయిన పాలన సాగుతుంది. సూర్య, గురువులు వారికి మిత్ర గ్రహములయైన కుజ, చంద్ర, కేతువుల సహాయముతో ధర్మమయిన పాలన చేస్తూ ఉన్నారు. శని, శుక్ర, బుధ, రాహు గ్రహములు కదలక మెదలక కొంత వరకు వాగ్వివాదము కల్పించ ప్రయత్నము చేసిరి. శని, శుక్ర, బుధ, రాహు గ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగు వానిని చూసి శాపానుగ్రః శక్తి గలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడై పుట్టేందుకే ఇటువంటి అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడు తున్నాడు అని అనడము వలన ఆ తపోశక్తి శాప రూపమున త్రేతాయుగములో రాక్షస వంశము అధికమయ్యెను. తపస్సుచే దైవబలమును సంపాదించారు కాని కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగములో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహము పెంచేవారు అధికమయ్యారు. ఈవిధముగా కృతయుగమున సవ్యముగా నడిచి త్రేతాయుగము ఆరంభమయినది.*

*2. త్రేతాయుగము:*
➖➖➖➖➖
*త్రేతాయుగములో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగం కాల పరిమాణము పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము మూడు పాదములపై నడుస్తుంది. ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు అంటే మంగళుడు. మంత్రిగా శుక్రుడు నియమితులైయ్యారు. కుజుడు పురుష కారకుడు యువకుడు , యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహు బాల పరాక్రమ వంతుడు, సత్యము పలుకువాడు రాజుగా ఆచారమునకు కట్టుబడి ఉండక తిరుగువాడు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు మాయ మంత్ర తంత్రవాది కుజునకు పరమ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలము పాలించవలసి వచ్చింది. రాక్షస గురువు శుక్ర బలమున దుష్ట శక్తి, మాయా మంత్రం ప్రభావము చేత రాక్షసులను పురిగోలిపి యజ్ఞ యాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు , రూపవతులయిన స్త్రీలకూ, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవాడు. రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్య పాలనను బ్రష్టు పట్టించి స్త్రీ వ్యామోహము వలన కలహము పెంచి ప్రజలను పీడించి రూపవతులు అగు స్త్రీలచే, యువకులకు ప్రాణ హానిని కలిగించేవారు. నాలుగు హంగులలో ప్రథమ మయిన మంత్రము యజ్ఞ యాగాదులు మొదలగు దైవ కార్యములు వాటిని జరిపించు బ్రాహ్మన వంశాములను అంతరించేలా చేసేవారు. ఇలా రాక్షసుల వలన, దుర్మార్గుల వలన మంత్రి సామంతుల వలన త్రేతాయుగములో నాలుగింట ఒక భాగము దెబ్బతిన్నది. కుజ గ్రహ బలము చేత ధనుర్ విద్యా పారంగతులు అయిన రాజ యువకుల చేత రాక్షస సంహారము చేయించుచు, అధర్మపరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకూ రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించెను. ఈవిధంగా త్రేతాయుగమున ధర్మము నాలిగింట ఒక పాదము తగ్గి ద్వాపరయుగం మొదలవుతుంది.*

*3. ద్వాపరయుగం:*
➖➖➖➖➖
*ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ యుగం కాల పరిమాణము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది. ద్వాపర యుగమున రాజుగా చంద్రుడు , మంత్రిగా బుధుడు నియమితులయి పాలన చేస్తున్నారు. చంద్రుడు గురు గ్రహ వర్గమునకు చెందినవాడు బుధుడు శని వర్గమునకు చెందినవాడు. వీరు ఒకరికి ఒకరు పడనివారు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు, దుష్టులకు ఇచ్చి సాదువుల సజ్జనుల, రూపవతుల, పతివ్రతలకు, కన్యలకు అపకారము చేయు వారిని పురిగొల్పుతాడు. బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్థ భాగము నశింప చేసి, రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మారుస్తాడు.*

*ఇక ఈ యుగంలో నాలుగు*

*హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచింది. బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్థ భాగము నశింప చేసి, రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మారుస్తాడు. ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచింది. చంద్రుడు సకల విద్యా పారంగతుడు బలవంతుడు మనో కారకుడు మాతృ కారకుడు కాన రాజుల విధ్యాపారంగుతులను చేసి ధనుర్ విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనము చేయుటకు స్వయముగా భగవానుడే కృష్ణుడిగా అవతరించి దేవతా వర్గమున కొందరిని అంటే ఇంద్రుని అంశలు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు తోడుచేసుకొని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటు మాయం చేస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగమున ధర్మము రెండు భాగాలు నశించి కలియుగము ప్రారంభము అవుతుంది. అంటే మంత్రం యుగము అంతరించి యంత్రయుగము ప్రారంభము అవుతుంది.*

*4. కలియుగము:*
➖ ➖ ➖ ➖
*మన ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని చెబుతారు. కలియుగం కాల పరిమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు. సూర్య సిద్ధాంత ప్రకారము క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభం అయింది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు. ఈ కలియుగమునకు రాజు శని మంత్రులు రాహు కేతువులు. రాహువు కేతువు ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కొంత కాలము రాహువు మంత్రిగా కొంత కాలము కేతువు మంత్రిగా పాలన చేయుచున్నారు. నాలుగు ధర్మ శాస్త్రములు అదృశ్యం అవ్వగా అప్పుడు కలియుగము ముందుకు నడిచేను. ధర్మమును నిలబెట్టు శాస్త్రములు ఉన్న తన పని సాగదని కలియుగము నడవదని తలంచి కలియుగ ఆరంభములోనే శాస్త్రములను వారిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపు చేస్తూ వచ్చాయి. ఇక అప్పటినుండి కూరము, కుచ్చితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి, వర్ణ సంకరములు మొదలై, దొరలే దొంగలయ్యారు. దైవభక్తి తగ్గి, గురుభక్తి, మాతృపితృ భక్తి అపురూపము అయింది. దైవమును నమ్మి పూజించు కాలము పోయి గురువును పూజించు కాలము వచ్చింది. ఇక హింసా సిద్ధాంతము ఎక్కువ అయి, పాపము వలన దుఖము అనుభవిస్తాము అన్న భయమే లేకుండా* *పోయింది. పుణ్య కార్యములు కరువయ్యాయి. ఎలాగైనా ధనాన్ని, స్త్రీని పొందినవాడే గొప్పవాడని అనుకునే వారు ఎక్కువయ్యారు. దొంగలకు దారి చూపే వారు ఎక్కువయ్యారు. ఇంకా ప్రజలు స్వధర్మమును వీడి అన్య ధర్మములను ఆచరించు కాలమునకు పోయారు. వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. అయితే కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలములో కొంత మంది ధర్మాత్ములు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు పనులు చేస్తున్నారు. ఈవిధంగా కలియుగం మంచి అనేదానికి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతూ నడుస్తుంది. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమము చేస్తాడని చెబుతారు.*🙏

✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀
 శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…
   నడిచే దేవుడు…పరమాచార్య పావన గాధలు…


        *విభూతి - అహంకారం*
                 
```
పరమాచార్య స్వామి వారు మహారాష్ట్రలోని సతారాలో మకాం చేస్తున్నారు. చాలామంది భక్తులు వారి దర్శనార్థమై వేచియున్నారు. మహాస్వామి వారి భక్తులలో వీణావాదన విద్వాంసుడొకడు ఉన్నారు. మహాస్వామి వారి సతారా ఆగమనం గురించి విని అతను కూడా వారిని దర్శించుకోవడానికి వచ్చాడు. మహాస్వామి వారిముందు తన వీణా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని అతని కోరిక.

కొద్దిసేపటి తరువాత ఎలాగో మహాస్వామి వారిని దర్శించుకున్నాడు. దర్శనానంతరం తన వీణ పైన ఒక కృతిని వినిపిస్తానని మహాస్వామి వారిని వేడుకున్నాడు. స్వామి వారి అనుమతితో వాయించడం మొదలుపెట్టాడు. పరమాచార్య స్వామి వారు సకల కళల్లోను సర్వ శాస్త్రాల్లోను నిష్ణాతులన్నది జగమెరిగిన సత్యం. ఆ విద్వాంసుని వీణావాదనం చాలా అద్భుతంగా ఉంది అక్కడున్నవారందరికి బాగా నచ్చింది.

కొద్దిసేపు అక్కడ అంతా నిశ్శబ్ధంగా ఉంది. తరువాత మహాస్వామి వారు ఆ వీణను తీసుకుని ఒక కృతిని వాయించారు. ఆ విద్వాంసునికంటే మహాస్వామి వారిది పరమాద్భుతంగా ఉంది. మహాస్వామి వారు ముగించిన వెంటనే ఆ విద్వాంసుడి కళ్ళు అపరాధ భావనతో వర్షించాయి. వెంటనే స్వామి వారి పాదములపై పడి సాష్టాంగం చేసాడు. పదే పదే అలా చేస్తూనే ఉన్నాడు. పరమాచాస్వామి అతనివైపు చూసారు కాని ఏమి మాట్లాడలేదు. కొద్దిసేపటి తరువాత స్వామి వారు లోపలికి వెళ్ళారు.

జరుగుతున్న విషయం అందరూ చూస్తున్నారు కాని ఎవ్వరికి ఏమి అర్థం కావటం లేదు. ఆ విద్వాంసుడు బయటకు వెళ్ళిపోయిన తరువాత కొంతమంది స్వామి వారి భక్తులు ఏమి జరిగిందని అడిగారు. ఆ విద్వాంసుడు వారితో, “నేను అహంకారంతో పెద్ద పొరపాటు చేసాను. మహాస్వామి వారు నా అహంకారాన్ని తుడిచేసారు.” అని అన్నాడు. కాని వారికేం అర్థంకాక అసలు ఏమి జరిగిందో చెప్పమన్నారు.

“నా పాండితీ ప్రకర్ష చూపించుకోవాలని చాలా క్లిష్టమైన కృతిని ఒకదాన్ని వీణ పైన పాడాను. మధ్యలో కొన్ని స్వరాలు మరచిపోయాను. చుట్టూ చూస్తే ఇక్కడ వీణ ఎవరికి రాదు తెలిసి కొన్ని తప్పు స్వరాలు కలిపి పూర్తిచేసాను. సంగీతంలో స్వరదోషం చాలా పెద్ద తప్పు. నేను ముగించిన తరువాత పరమాచార్య స్వామి వారు ఆ వీణనందుకొని నేను తప్పుగా నుడివిన స్వరాలని సరిగ్గా వాయించి చూపించారు” అని అన్నాడు.

ఇంకా అతను ఇలా చెప్పాడు, “పరమాచార్య స్వామి వారు చాలా చాలా క్లిష్టమైన కృతిని ఒకదానిని వాయించారు. ఆ కైలాసనాథుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు స్తుతించిన కృతి అది. రావణ గర్వాన్ని శివుడు భంగపరచినట్టు నా అహంకారాన్ని మహాస్వామి వారు తొలగించారు”

మన పూర్వ జన్మ పుణ్యఫలంగా ఈశ్వరుడు మనకు వివిధ విభూతులను ఇస్తాడు. వాటిని ఆ భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించాలి కాని, అవి ఉన్నందువల్ల నాఅంతవాణ్ణి అని అహంకరించకూడదు. అది మనిషి వినాశన హేతువు.✍️```
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏
.     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
 శ్రీమద్భాగవతం లోని కథ…
```
                 *రంతిదేవుడు*
                

*పూర్వం     రంతిదేవుడను రాజేంద్రుడుండెడి వాడు. ఆతడు రాజైననూ మహాయోగి వలె విషయ వాంఛలకు లోనుగాక నిరతం హరినామ స్మరణతో కాలంగడిపేవాడు. దైవవశమున లభించిదానితోనే తృప్తిపడేవాడు. ఆ రాజు తన సంపదలను దానం ఇచ్చి ఇచ్చి బీదవాడైనాడు. కుటుంబంతో సహా చాలా కష్టాలపాలైనాడు. నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్ళు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా గుండెదిటవు కోల్పోలేదు.*
```
ఒకరోజు ప్రాతఃకాలమున అతనికి నెయ్యి,  పాయసము, హల్వా, నీళ్ళు లభించాయి. భోజనకాలం వచ్చాక రంతిదేవుడు సకుటుంబముగా భోజనముచేయ సిద్ధపడ్డాడు.

భరింపరాని క్షుత్పిపాసల బాధ తీర్చుకుందామని అనుకుంటుండగా ఓ దీన బ్రాహ్మణుడు అతిథియై వచ్చాడు. రంతిదేవుడెంతో ప్రేమతో అతన్ని గౌరవించి హరిసమర్పణముగా ఆహారంలో అర్ధభాగాన్ని అతడికిచ్చాడు. ఆ విప్రుడు కడుపారా భుజించి సంతృప్తుడై వెళ్ళాడు.

ఇంతలో ఒక శూద్రుడు వచ్చి అన్నంపెట్టమని అడిగాడు. వచ్చిన అభ్యాగతునిలో భగవంతుడిని దర్శించి ఆదరంతో ఆ శూద్రునికి మిగిలిన తన ఆహారంలో ఒకభాగాన్నిచ్చాడు రంతిదేవుడు. వాడు సంతృప్తిగా తిని వెళ్ళాడోలేదో కుక్కల గుంపుతో ఒకడువచ్చాడు. “రాజా! నేను, ఈ కుక్కలు ఆకలిచే మిగుల పీడితులమై యున్నాము. మాకు సరిపోయే ఆహారము ఇమ్ము” అని వాడన్నాడు.

అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచిమాటలాడి పంపాడు రంతిదేవుడు.

ఇక రంతిదేవుని వద్ద మంచినీళ్ళొకటి మిగిలాయి. అదీ ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి. దప్పికతో ప్రాణాలు కడగడుతున్న రంతిదేవుడు అవి త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు “అయ్యా! నేను చాలా దీనుడను. చాలా దాహంగా ఉంది. నీరసముతో అడుగు ముందుకు వేయలేకున్నాను. నీవద్దనున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు”. 

ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుని చూచి “ఓ అన్నా! నావద్ద అన్నంలేదు కాని ఈ తీయ్యని నీళ్ళున్నాయి. దగ్గరకురా. నీ దాహం తీరేటట్లు త్రాగు. ఆపదకలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవడం కన్నా పరమార్థమేమున్నది మానవులకు”? అని రంతిదేవుడన్నాడు.

తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని కూడా లెక్కచేయక రంతిదేవుడు “నా జలదానంతో ఈతడి బాధ ఆయాసం దాహం తొలగితే నాకంతే చాలు. అంతా ఈశ్వరేచ్ఛ” అని ఆ చండాలుని పాత్రలో నీళ్ళు పోశాడు.

బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవుని ఎదుట ప్రత్యక్షమై జరిగినదంతా విష్ణుమాయా ప్రభావం అని చెప్పారు.

బ్రాహ్మణ శూద్ర చండాల వేషములలో వచ్చినది వారే అని ఎఱుక కల్గించి ఆశీర్వదించారు.

రంతిదేవుడు వారికి నమస్కరించినాడు. ధీరుడైన రంతిదేవుడు వారిని ఏదీ కోరలేదు. స్థిరమైన విష్ణుభక్తులకే కోరికలుండవు కదా! కడకు విష్ణుపదాన్ని పొందాడు.

ఆ రాజేకాదు ఆ రాజు కథను బాగా విని అర్థంచేసుకున్న వాళ్ళందరూ ఆతని మహిమచే యోగులై కడకు మోక్షం సంపాదించారు.

ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాం:

దానము తీసుకొనువానికి హితము కలిగించు దానిని ఫలాపేక్షరహితంగా ప్రేమతో ఇవ్వడం ఉత్తమ దానం.

ఇదియేకాక అడిగినవానిలో భగవంతుడిని దర్శించి తన ప్రాణాలు నిలబెట్టుకోవడనికి ఎంతో అవసరమైనది తనకు లేక పోయినా ఇచ్చివేసిన రంతిదేవుడు ధన్యుడు.✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 *శూర్పణఖే త్రివక్ర ...!!*
                


*ఆనందగురువు అనే దేవర్షి యొక్క కుమార్తె ‘సుముఖి.’*

*ఆమె తన తండ్రి వద్ద  శిష్యరికం చేస్తున్న ‘శంఖచూడుడ’నే యువకుని ప్రేమించింది.*

*కానీ గురుపుత్రిక కావడం వలన  ‘శంఖచూడుడు’ ఆమె ప్రేమని నిరాకరించాడు.  దానితో అతనిపై పగపట్టిన ‘సుముఖి’ అతని మీద లేనిపోని నిందలు వేసింది.*
```
కుమార్తె మాటలను నమ్మిన గురువు గారు   ‘శంఖచూడుడు’ని తండ్రి వద్ద ఫిర్యాదు చేశాడు. 

నిజానిజాలు గ్రహించకుండా గురువుకి అపచారం చేసాడనే అభియోగంతో తన పుత్రుని  కాళ్ళు, చేతులు నరికించాడు అతని తండ్రి.

మరణావస్థలో భూమి మీదకు కూలిపోయిన  శంఖచూడుడు “న్యాయ విచారణ జరపకుండా శిక్షించడం న్యాయమా? ధర్మమా?” అని ఆక్రోశించాడు అడిగాడు.

ఆ సమయంలో భూభారాన్ని మోస్తున్న ఆదిశేషువు వెలుపలికి ప్రత్యక్షమై    “శంఖచూడా! విచారించకు. నీమీద అపనిందలు వేసిన సుముఖిని నేను శిక్షిస్తాను” అని అభయమిచ్చాడు.

మరుజన్మలో శంఖచూడుడు రావణుని సోదరుడు విభీషణునిగా జన్మించాడు. అతని చెల్లెలు శూర్పణఖగా  ‘సుముఖి’ జన్మించింది.
 
ఆదిశేషువు లక్ష్మణుని గా జన్మించి  వనవాస కాలంలో తనను కామించి వచ్చిన శూర్పణఖ ను దండించి నీతిని నిలబెట్టాడు. 

శూర్పణఖ దానవకులంలో జన్మించినా అత్యంత సౌందర్యవతి.  ఆమె  నిజంగానే శ్రీరాముని ప్రేమించింది.  కానీ శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడైనందున ఆమె ప్రేమను తిరస్కరించాడు.

ఇది పూర్వజన్మల పాప కర్మల ఫలితం. రామావతారంలో రాముని ప్రేమను పొందలేని శూర్పణఖ కృష్ణావతారంలో ప్రేమను పొందినది.  రామావతారంలో నిరాకరించిన 
శ్రీ రాముడు కృష్ణావతారంలో , గోకులంలో  ఆమె ప్రేమను స్వీకరించాడు....

అది ఏవిధంగా  జరిగిందంటే  దుష్టుడైన కంసుని వధించడానికి మధురానగరానికి వచ్చిన బలరామకృష్ణులు  ముందుగా కలసినది పూలమాలలు కట్టి అందరికి ఇచ్చే ‘త్రివక్ర’ అనే  అందవికారమైన స్త్రీని. 

త్రివక్ర పువ్వులు మాలలు కట్టి కంసుని భవనంలో విక్రయించేది.

ఆమె శ్రీకృష్ణుని గురించిన వృత్తాంతమంతా తెలుసుకుని శ్రీరాముడే… శ్రీకృష్ణుడని గ్రహించి అతనే తన ప్రాణ నాయకుడని భావిస్తూ పూజించసాగింది.

ఆమె ప్రేమకు, భక్తికి కట్టుబడిన కృష్ణుడు  ఆమెను అనుగ్రహించాడు. లక్ష్మణునిగా రామావతారంలో శూర్పణఖని శిక్షించిన బలరామునికి  అన్ని విషయాలు మరొకసారి గుర్తుచేసి కృష్ణుడు త్రివక్రకు మోక్షం అనుగ్రహించాడు...✍️```
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 ♠️శంకరాభరణం శంకరశాస్త్రి జె.వి. సోమయాజులు గారి జయంతి సందర్భంగా జ్ఞాపకాల సంస్మరణ నివాళులు 

స్టిల్ :- త్యాగరాజ స్వామి వారిలా  సోమయాజులు , 'త్యాగయ్య' 1981 చిత్రం లోనిది. 

ముఖాన గాంభీర్యత.. నుదుటన విభూతిరేఖలు.. సాంప్రదాయ బద్ధమైన పంచెకట్టు.. సంస్కృతిని ప్రతిబింపచేసే జీవన శైలి. ఆయన పేరు జొన్నలగడ్డ వేంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. వెండితెర పేరు జెవి సోమయాజులు, ప్రేక్షకులకు మాత్రం శంకరాభరణం శంకరశాస్త్రి, రంగస్థలంతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన వెండితెరపైనా, బుల్లితెరపైనా మెరిసే ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు.

శ్రీకాకుళం జిల్లా లుకలాంలో 1928 జూస్ 30 తేదీన జొన్నలగడ్డ వేంకటశివరావు, శారదాంబ దంపతులకి జన్మించిన సోమయాజులు పూర్తిపేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. చదువుకొనే వయసులోనే నాటకాలపై ఆసక్తి పెంచుకొన్న ఆయన తన సోదరుడు, ప్రముఖ నటుడు రమణమూర్తితో కలిసి కన్యాశుల్కంతో పాటు నాటక ప్రదర్శనలిచ్చేవారు. కన్యాశుల్కంలో రామప్ప పంతులు పాత్ర వేస్తూ ప్రసిద్ధి చెందారు. 45 ఏళ్లలో 500 ప్రదర్శనలు ఇచ్చారు. విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. 

మహబూబ్ నగర్ డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే 'శంకరాభరణం'లో నటించే అవకాశం వచ్చింది. అంతకుముందే ‘రాధా కృష్ణయ్య' చిత్రంలో కీలక పాత్రని పోషించారు. అయితే ఆ చిత్రం పరాజయాన్ని చవిచూడటంతో పేరు రాలేదు. ‘జ్యోతి’లోనూ ఓ పాత్రని పోషించారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శంకరాభరణం’తో సోమయాజులు పేరు మార్మోగిపోయింది. ఆ తరువాత తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి విశేషమైన పేరు సంపాదించారు. 'సప్తపది', 'త్యాగయ్య', 'వంశవృక్షం', 'సితార', ‘తాండ్ర పాపారాయుడు', 'మగధీరుడు', 'మజ్ను' ఇలా అన్ని భాషల్లో కలిపి 150కిగాపై చిత్రాలు చేశారు సోమయాజులు. అయితే ఇన్ని సినిమాలు చేసినా గానీ.. జెవి సోమయాజులు అనగానే.. అందరికీ గుర్తుకొచ్చే పాత్ర మాత్రం శంకరశాస్త్రి. అంతలా ఆ పాత్రకు జీవం పోసిన సోమయాజులు. 

ఒక్కొక్కరు ఒక్కో పాత్ర కోసం పుట్టారా అన్న భావం కలిగించేల ఆ పాత్ర తీరు, ఆహార్యం, వ్యక్తిత్వం, గంభీరత, సాంప్రదాయ కళాభినివేషం లాంటి  జొన్నలగడ్డ వెంకట సోమయాజులు, శంకరశాస్త్రి కోసం పుట్టినట్టు కనిపిస్తుంది. 

అంతకు ముందు ఆయన ' రారా కృష్ణయ్యా 'లో తొలిసారిగా పాత్రధారణ చేసినా, 'శంకరాభరణం'తోనే విఖ్యాతులయినారు. 

నాటకరంగం సినిమా రంగానికి పెట్టిన 'భిక్ష'లో ఆయన ఒకరు. చిన్నతనం నుంచి స్వస్థలమైన విజయనగరంలో నాటకాలు ప్రదర్శిస్తూ, ఔత్సాహికులలో విశిష్టమైన నటుడిగా ఆయన ప్రఖ్యాతి పొందారు. నాటకాల పోటీలు నడిపిన పలు పరిషత్తుల్లో ఆయన చాలాసార్లు ' ఉత్తమ నటుడు ' బహుమతి అందుకున్నారు. నాటకాలతో పరిచయం వున్నవాళ్లకు సోమయాజులు పేరు కొత్త పేరేం కాదు. 'కన్యాశుల్కం'లోని రామప్పపంతులు, 'గుమస్తా'లోని గుమస్తా, 'పంజరం'లోని డాక్టరు, 'నాటకం'లో రఘుపతి,'కాళరాత్రి'లోని నరహరి, 'పల్లెపడుచు'లోని సూరయ్య మొదలైన పలు పాత్రల్లో సోమయాజులు జీవించారు; 'కారెక్టర్ యాక్టర్'గా ప్రశంసింపబడ్డారు. సోమయాజులుది తనదీ అని ఒక ప్రత్యేక బాణీ. ఆయన బాణీని అనుకరించినవారూ వున్నారు; అనుకరించాలని ప్రయత్నించినవారూ వున్నారు. “ఆయన వయసులోని సగం వయసు రంగస్థలం మీదనే  గడిచింది" అని అయన అన్నమాటలో అతిశయోక్తి కనిపించదు. ఆ విధంగా నాటక రంగం మీద విశేషమైన అనుభవం గడించి, శంకరశాస్త్రిగా చిత్రాల్లో అవతరించారు. 

ఆయనకు ఈ పాత్ర తెచ్చిన ఖ్యాతి, ఘనత - కొలవలేనివీ, మాటల్లో చెప్పలేనివీ. విశాఖపట్నంలో డిప్యూటీ కలెక్టర్ హెూదాలో వున్న సోమయాజులును ఇవాళ ఎవరూ సోమయాజులుగా చూడడం లేదు; శంకరశాస్త్రిగానే చూస్తున్నారు. శంకణాల దగ్గర్నుంచి, పాదాభివందనాల వరకూ ఆయనకు లభిస్తున్న అభినందన కెరటాలు అనంతం! ఒక్క చిత్రంతోనే పెక్కు చిత్రాల పేరు తెచ్చుకున్న సోమయాజులు గారిని,

జయంతి సందర్భముగా జ్ఞప్తికి చేసుకుంటూ🙏
 " ఈ రచన నా స్వంతరచన " - తులసీభాను

💞 మనసు కథలు 💞

🌺 నిర్ణయం - కాలం 🌺

ఆచారాలు, నియమాలు, కట్టుబాట్లు ఉన్న కుటుంబం లో పెరిగి పెద్దదయ్యింది మాధురి...

తనకి ఇష్టమైన లెక్చరర్ ఉద్యోగం చేస్తోంది, అదే కాలేజీకి, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రతీ శనివారం కౌన్సిలర్  రిషి వచ్చేవాడు.... 

మాధురి, తను చిన్న నాటినుంచీ పెరిగిన వాతావరణానికీ, బయటి ప్రపంచపు తీరుకీ సమన్వయం చేసుకోలేక ఒక్కోసారి చాలా ఒత్తిడికి గురయ్యేది.. 

అందుకే రిషితో కౌన్సిలింగ్ తీసుకునేది మాధురి కూడా, అలా పరిచయం పెరిగి, అతని నుంచీ మానసికంగా ఒక ఊరట దొరుకుతూ, అతను, ఆమెకు, జీవనానికి ఒక బలమైన ఆలంబనగా మారిపోయాడు...

అతనితో జీవితాన్ని పంచుకోవాలనుకుంది మాధురి, కానీ ఇంట్లోవాళ్ళు, రిషి వేరే కులం అతను, పైగా ప్రేమవివాహం అని పూర్తిగా వ్యతిరేకించారు... అందరినీ ఒప్పించే అన్ని ప్రయత్నాలు చేసి చివరికి అలిసిపోయి, రిషిని ఆర్యసమాజ్ లో పెళ్ళి చేసుకుని ఇంటికి వెళ్ళింది..

తల్లి కాత్యాయని, పిన్ని శారద బాగా తిట్టారు.. 
" ఇలా చేసావేమిటే, మీ తాతగారు, నాన్న, బాబాయ్ లకి వచ్చే కోపానికి బలి కాకముందే వెళ్ళిపోండి "  అని తలుపులు మూసేయబోతున్నారు..

" అమ్మా " అంటూ తల్లడిల్లిపోతూ కాత్యాయని చెయ్యి పట్టుకోబోయింది మాధురి.. 

" ఛీ ముట్టకు నన్ను, నిజంగా అమ్మను నేనంటూ, ఒకదాన్ని నీకున్నాను అని, నీకు గుర్తుండి ఉంటే, ఇలా దొంగపెళ్ళి చేసుకునేదానివా, ఇహ నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు " అంది కోపంగా కాత్యాయని,.. 

ఎప్పుడూ శాంతం తప్ప మరో భావం కనపడని కాత్యాయని మొహం ఇప్పుడు కోపంతో ఎర్రగా అయిపోయింది.. 

ఆ ఇంటి తలుపులు మూసుకుపోయాయి మాధురి, రిషి మొహాల మీద....

రిషి, మాధురి, బెంగుళూరులో జీవితం మొదలు పెట్టారు.. నాలుగేళ్ళు గడిచాయి... 

కిందటేడు, తాను తల్లిని కాబోతున్న సంబరాన్ని తల్లికి చెప్పుకోవాలని, మాధురి తన ఇంటికి ఫోన్ చేసింది... 

శారద ఫోన్ తీసింది " పిన్నీ నేను మాధురిని.. " అని చెప్పగానే.. " ఛీ.. " అనేసి ఫోన్ పెట్టేసింది శారద... మళ్ళీ ఆ సాయంత్రం మరొకసారి ఫోన్ చేసింది మాధురి... ఈ సారి మళ్ళీ శారదే ఫోన్ తీసి 

" ఏమే శనిదానా, నా కూతురికి కుదరబోయిన బంగారంలాంటి సంబంధం, నీ విషయం తెలిసి తప్పిపోయింది, నీ బాగు నువ్వు చూసుకుని పోయావు, నా పిల్లలు బాధను అనుభవించాల్సి వస్తోంది కదే, నాశనం అయిపోతావే పాపిష్టిదానా.. సిగ్గుంటే మళ్ళీ ఫోన్ చేయకు... " అనేసి ఫోన్ పెట్టేసింది శారద...

" అయ్యో... " అని అనుకుంటూ మనసు పాడుచేసుకుని కూర్చుంది మాధురి... 

రిషి ఎంతగానో నచ్చచెప్పి, మాధురిని మామూలుగా చేసాడు... కానీ వారానికే మాధురికి అబార్షన్ అయిపోయింది... పిన్ని శాపం తగిలినట్లుంది నాకు అని కుమిలిపోతోంది మాధురి... రిషి అలా ఏమీ ఉండదు, ఈ రోజుల్లో ఆడవారికి ఇవన్నీ ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి అని మాధురికి ధైర్యం చెప్పాడు... అయినా మాధురికి దిగులు రోజురోజుకి పెరిగిపోతోంది....

అలా అలా మరో రెండేళ్ళు గడిచాక ఒకరోజు రిషికి ఆరోగ్యం బాగా పాడయ్యింది.. వాంతులు అవుతూ ఉన్నాయి, జ్వరం బాగా వచ్చింది.. వైద్యపరీక్షలు చేసాక తేలింది రిషికి జాండీస్ వచ్చిందని, ఇప్పటికే ముదిరింది అని... మాధురి ఎంతలా ప్రయత్నించినా రిషిని దక్కించుకోలేకపోయింది... ఒక తెల్లవారుజామున రిషి ప్రాణం గాల్లో కలిసిపోయింది...

ఇహ ఇప్పుడు మాధురికి చుట్టూ అనంతమైన దుఃఖం మాత్రమే చుట్టుముట్టి ఉంది... 

ఇంతటి దుఃఖాన్ని తీర్చే వారెవ్వరూ అని మాధురి తోడు కోసం వెతుక్కుంటే చుట్టూ శూన్యమే కనిపిస్తోంది....

ఇన్నాళ్ళూ బిడ్డలు కలగట్లేదని దిగులు పడుతూ ఉండే దాన్ని, ఇహ ఇప్పుడు ఉన్న నా ఒక్క తోడు రిషి కూడా లేడు, అని మాధురికి పిచ్చి పట్టినట్లుగా ఉంది... 

రిషి కొలీగ్ ప్రీతి, వారి పొరుగింటావిడ మనీషా మాత్రం మధ్యమధ్యలో మాధురి దగ్గరకు వచ్చి కాస్తంత ధైర్యం చెప్పి ఒక గ్లాసు పాలు తాగించో, ఒక చపాతీ తినిపించో వెళుతున్నారు...

రిషి పోయిన నాలుగు రోజులకు, ఒక అర్ధరాత్రి దిగులుగా, ఒంటరిగా ఏడ్చుకుంటూ కూర్చున్న మాధురికి, ఇంక నేను బతకటమెందుకు అని అనిపించింది... చనిపోవాలి అని బలంగా అనిపిస్తోంది... పిచ్చి పట్టినట్లు బుర్ర పాడయిపోయి ఉంది మాధురికి... ఫాన్ కి చీర ముడేస్తోంది... చిన్నప్పటి జ్ఞాపకాలు , రిషితో ప్రేమ పెళ్ళి, అమ్మ గారాబం, పిన్ని శాపనార్ధాలు... అన్నీ గుర్తు తెచ్చుకుంటోంది.. కళ్ళ నుండీ ధారగా నీళ్ళు కారిపోతున్నాయి... గుండె వణికిపోతోంది బాధతోనూ, భయంతోనూ, తెలియని ఆందోళనతోనూ, అయోమయంతోనూ...

" అమ్మా మాధురీ... " అని తల్లి గొంతు ఆప్యాయంగా తీయగా వినిపించింది... కళ్ళు మూసుకుని ముడి వేసిన చీర గొలుసులోకి తల పెట్టి చీరముడి బిగించుకోబోతున్న మాధురి, ఆ ప్రయత్నాన్ని ఆపి,  ఆశగా కళ్ళు తెరిచింది, అమ్మ ఉందేమో కళ్ళ ఎదురుగా అన్నట్లుగా... చుట్టూ చీకటి తప్ప మరేమీ లేదు, మరెవ్వరూ లేరు... 

" హు నా పిచ్చి కాబోతే, అమ్మ నా దగ్గరికి ఎందుకొస్తుంది " అని అనుకుంటున్న మాధురికి నిరాశ ముంచుకొచ్చేసింది మళ్ళీ గాఢంగా... 
మళ్ళీ ఉరి పోసుకునే ప్రయత్నం చేయబోతుండగా మాధురికి కళ్ళు తిరిగి వాంతి వచ్చేస్తోంది... 

మంచం పక్కనే వాంతి చేసుకుంది... స్ప్రుహ కోల్పోయి మంచం మీదకి వాలిపోయింది మాధురి...

మర్రోజు పదింటికి మాధురికి తెలివి వచ్చేటప్పటికి హాస్పిటల్ లో ఉంది,  పక్కన ప్రీతి, మనీషా ఉన్నారు.. పొద్దున్నే ఎనిమిదింటికి మనీషా వచ్చి ఎన్నిసార్లు తలుపు తట్టినా మాధురి తలుపు తీయలేదు, వెంటనే ప్రీతిని పిలిచి, వాచ్ మెన్ సాయంతో తలుపు తీసి చూసి మాధురిని హాస్పిటల్ లో చేర్చారు...

మాధురి తల్లి కాబోతోంది, అని డాక్టర్ చెప్పారని ప్రీతి తెలిపింది మాధురికి... 

ఆనందపడాలో లేదో తెలియని మానసిక స్ధితిలో ఉంది మాధురి... మాధురి కాస్త తేరుకున్నాక ఇంటికి వచ్చారు ముగ్గురూ...

ఇంటి గుమ్మంలో కాత్యాయని, పార్ధసారధి కూర్చుని ఉన్నారు... రిషి పోయిన దగ్గర్నుంచీ ప్రీతి కాత్యాయనికి ఫోన్ చేసి చెబుతూనే ఉంది, మాధురి పరిస్ధితి ఏ రకంగానూ బాలేదని...

అంతకుముందు రోజంతా కాత్యాయనికి, శారదకి ఒకటే గొడవ మాధురి కావాలని కాత్యాయని, వద్దే వద్దని శారద.. 

ఆ రాత్రి నిద్రిస్తున్న కాత్యాయనికి నిద్రలో చిన్నతనంలో మాధురితో తాను ఆడే దోబూచులాట కలగా వచ్చింది, కలలో " అమ్మా మాధురీ.. " అని పిలుస్తూ కలవరిస్తూనే ఉంది కాత్యాయని నిద్రలో... 

అవన్నీ చూస్తూ ఉన్న మాధురి తండ్రి పార్ధసారధి, కిందటేడు గుండెపోటు తెచ్చుకుని ఇప్పుడిప్పుడే కాస్తంత తేరుకుంటున్న, భార్య కాత్యాయని, ఇప్పుడు మళ్ళీ కూతురు కోసం ఇలా కలవరించి కలవరించి ఏమయిపోతుందో అని భయపడి... భార్యను తీసుకుని కూతురి వద్దకు వచ్చేసాడు...

తల్లీతండ్రీ తన కంట పడగానే, మాధురి 
" అమ్మా, నాన్నా... " అని గుండె పగిలేలా అరుస్తూ వచ్చి తల్లీతండ్రి పాదాల దగ్గర కూలబడిపోయి వెక్కివెక్కి ఏడుస్తోంది .. 

" అమ్మా, మాధురీ.. " అని ఆరాటంగా అంటూ ఏడుస్తున్న కూతురిని గుండెలకు పొదువుకునేందుకు ప్రయత్నిస్తోంది తల్లి కాత్యాయని... మాధురి పిచ్చిదానిలా నేలకేసి తల కొట్టుకోబోతుంటే, తండ్రికి కూడా కళ్ళు తడి అయ్యాయి... " వద్దమ్మా వద్దు, ఊరుకో పిచ్చితల్లీ... " అని అంటూ పార్ధసారధి కూడా కూతురిని తన రెండుచేతులతో దగ్గరకు తీసుకున్నాడు....

సంవత్సరానికల్లా పండంటి పాపాయి రష్మిక, మాధురి చేతుల్లో నవ్వుతూ ఆడుకుంటోంది, అమ్మమ్మా తాతయ్యల సంరక్షణలో...

అ రకంగా, మాధురి తీసుకున్న నిర్ణయం తాలూకూ ఫలితం, కాలానుగుణంగా ఎన్నో మార్పులకు గురి అవ్వాల్సి వచ్చింది..

తులసీభాను.
మంగళవారం
16 : 6 : 2020
 పవిత్రత: (తమిళ మూలం)
: టి.ఎస్. వరదరాసన్
 (శ్రీలంక తమిళ కథ)
-------------------------------------
   సాయంత్రం నాలుగు గంటల సమయం. మూర్తి మాష్టర్, వినాయకుడి గుడి పూజారి గణపతి అయ్యర్ ఇద్దరూ పూజారి గారి ఇంటి వరండాలో కబుర్లు చెప్పుకుంటున్నారు. వారి సంభాషణలో ఎన్నో విషయాలు దొర్లి చివరకు సాహిత్యం చోటు చేసుకుంది. అయ్యర్ మూర్తి మాష్టారుని "నీవు విధిగా "కళై సెల్వి" పత్రిక చదువుతున్నావా? అని అడిగాడు.

   "అవునవును. ఆ పత్రిక మొదటి సంచిక నుంచి చూస్తూనే ఉన్నాను కానీ అన్ని సంచికలూ చదవలేదు సుమా! అయినా ఎందుకూ? ఏమైనా ప్రత్యేకమా?"

   "అనుకోకుండా ఆ పత్రిక పాత సంచిక ఒకటి చదివాను. అందులో ఒక కథ……"

   "ఎవరు రాసినది?"

   "రచయిత ఎవరో గుర్తు లేదు కానీ ఆ కథలో ఒక ఘటన నన్ను కలవర పెడుతోంది"

   "సరే! అయితే కథ చెప్పు. నాకు గుర్తొస్తుందేమో చూద్దాం"

   "మూడేళ్ల క్రితం మన దేశంలో వరదలొచ్చిన విషయం నీకు గుర్తు ఉందా? ఆ నేపథ్యంలో ఈ కథ రాయబడింది. ఒక గ్రామం వరదల్లో మునిగి పోయాక అందరూ ఎత్తైన ప్రదేశాలను వెతుకుతూ పరిగెడుతుంటారు. ఒక ధనవంతుడు తన ఎత్తైన మేడపై ఉన్నాడు. ఆ ఇంట్లో అతను ఒంటరిగానే ఉన్నాడు. ఒక బీద స్త్రీ వరదలకు భయపడి అతడి మేడపైకి ఎక్కుతుంది. ఆ ధనవంతుడు అవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకుంటాడు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. అతను బలవంతంగా అనుభవించే ప్రయత్నం చేయబోతాడు. ఆమె తన‌ జీవితం కన్నా పవిత్రతకే విలువనిచ్చి కిటికీ నుంచి దూకి తన పవిత్రతను కాపాడుకుంటుంది. ఈ కథ గురించి నీవేమంటావ్?"

   "ఇందులో ఆలోచించాల్సినదేముంది? పురాణ కాలం నుంచి కొనసాగుతున్న నిరంతరమైన కథా వస్తువే. ఈ నేపథ్యంలో జీవమున్న కథ రావాలంటే అది కథా నిర్మాణం పైనా, దానిపై అది తీసుకునే రూపం పైనా, ఎలాంటి వచనంలో రాయబడిందో దానిపైనా ఆధారపడి ఉంటుంది. నేను ఆ కథ చదవలేదు. అది చదివాకే మాట్లాడగలను." 

    "మాష్టారూ! నేను కథని మూల్యాంకనం చేయమని అడగలేదు. పురాణ కాలం నుంచి రాసిన కథలన్నీ చదివాను అన్నావుగా నీవు. ఈ కథా వస్తువు గురించి నీ అభిప్రాయం ఏమిటి?"

    "నువ్వు నన్ను ప్రత్యేకంగా అడుగుతున్నది ఏమిటి అయ్యా? ఆ స్త్రీ తన శీలం కాపాడుకోవడం కోసం జీవితాన్నే త్యాగం చేసిన విషయమేగా? అదేనా?" అన్నాడు.

    "అవును అవును ఆ విషయమే!"

    "ఒక స్త్రీ అందునా ఒక తమిళ స్త్రీ గొప్పతనం అందులోనే ఉంది కదా. కాదంటావా? తమిళ సాంప్రదాయం ప్రకారం పవిత్రత పోగొట్టుకోవడం కన్నా మరణించడమే మంచిది కదా?"

    అయ్యర్ తలాడిస్తూ "నువ్వు కూడా ఇదే అంటున్నావా?" అని అడిగాడు.

    మూర్తి మాష్టారు విస్తుపోయాడు.తనేమైనా తప్పు చెప్పాడా? ఈ అయ్యరు అసలు ఇలా ఎందుకు అడుగుతున్నాడు?"

     ఒక నిమిషం పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ విషయమై ఆలోచించాక ధైర్యం వచ్చినట్లు, గణపతి అయ్యర్ నిశ్శబ్దాన్ని ఛేదించాడు.

    "మాష్టరూ! ఈ వ్యక్తిగత విషయం నాకు నా భార్యకూ మాత్రమే తెలుసు. అది నేను నీకు చెప్పబోతున్నాను. నీకు చెప్పినా ఏ ప్రమాదమూ జరగదులే. నేను చెప్పిన కథ విన్నాక ఇద్దరం "పవిత్రత" అంటే ఏమిటో మాట్లాడుకుందాం.
                      *******
    గత సంవత్సరం మురుగన్ కోవెలలో నేను పూజారిగా పనిచేసానని మీకందరికీ తెలుసు. ఆ కొవెల ఉన్న చోట కనీసం ఒక యాభై మంది తమిళులు కూడా నివసించటం లేదు. ఏమైనా ప్రత్యేక పర్వదినాల్లో మాత్రం వేరే ప్రాంతాలనుండి భక్తులు వచ్చేవారు. సింహళ ప్రజలు కూడా సాంప్రదాయంగా కోవెలను దర్శించి అర్చనలు చేయించేవారు. 

   సింహళ తమిళ ప్రజల మధ్య కొట్లాటలు చెలరేగినప్పుడు ముప్పాతిక శాతం తమిళులు యాలపానం ఊరికి తిరిగి వెళ్ళిపోయారు. కానీ నేను 
కోవెలలో పూజార్చనలు చేయకుండా ఎలా పారిపోగలను? నేను నా భార్యని యానపానంకి వెళ్ళిపోమన్నాను. తను మాత్రం నీకేమైనా అయితే దాన్ని నేనూ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తను ఒక్కర్తీ వెళ్ళిపోవడానికి  ఒప్పుకోలేదు. 

    సింహళ ప్రజలు కూడా ఈ కోవెలకు వచ్చి ప్రార్థన చేసుకునే సాంప్రదాయం ఉన్నందున, కోవెల కార్యక్రమాలలో జోక్యం చేసుకుంటారని గాని, ఏదైనా ప్రమాదం ఉంటుందని గాని నేను భావించలేదు. ధైర్యం కూడదీసుకుని నా భార్యని కూడా కోవెలకు దూరంగా వెళ్ళిపోమని మరోసారి కోరనూ లేదు.

    ఆ రోజు బుధవారం. మాతో రోజూ తిరుగుతూ కోవెలకూ తరచుగా వచ్చే సింహళ వనిత బేబీ నోనా  
"మీరిద్దరూ ఇక్కడ ఉండడం అంత తెలివైన పని కాదు అయ్యా! మూడు లారీల్లో  దుండగులు ఈ ప్రదేశానికి వస్తున్నారని నాకు ఎవరో చెప్పారు. వారు తాము వస్తున్న దారిలో తమిళులందరినీ చెప్పలేని కష్టాలకు గురి చేస్తున్నారు అని నాకు తెలిసింది. వారు ఈ దారి వైపుగా కూడా ఇవాళో రేపో రావొచ్చు. మీరిప్పుడే పోలీసు స్టేషన్కి వెళ్ళండి, వారి సహాయంతో మీరు క్షేమంగా కొలంబో చేరుకోవచ్చు" అంది.

   ఆమె అన్నది వినగానే "ఓ దేవుడా మురుగా! నన్ను క్షమించు" అని నాలో నేను అనుకుని రెండు పెట్టెల్లో ముఖ్యంగా తీసుకు వెళ్ళగలిగే సామానులు సర్దేసాను. భార్య దారంలో కట్టి మెడలో వేసుకున్న తాళిబొట్టు తప్ప మిగిలిన నగలన్నీ కూడా ఒక పెట్టెలో పెట్టాను. అన్ని తయారీలు చేసుకునే సరికి సాయంత్రం అయిదు అయ్యింది. ఇల్లు వదిలేయడానికి సిద్దమవుతున్న తరుణంలో బేబీ నోనా పరిగెత్తుకుంటూ వచ్చి "అయ్యా! సిల్వా అతనితో మరో ఇద్దరు వచ్చేస్తున్నారు. అమ్మగారిని వారి కంటబడకుండా దాచేయండి. వాళ్ళు ఆమె గురించి అడిగితే ఆమె నిన్ననే వెళ్ళిపోయిందని చెప్పండి. మీరు ఇక్కడ ఉండడం ప్రమాదకరం, నాక్కూడా" అని చప్పున అంతర్ధానమైపోయింది. 

    నాకు సిల్వా బాగా తెలుసు. అతడొక చిత్రమైన మనిషి. అప్పుడప్పుడూ ఓ ముద్దు చేసిన కుక్కలా అయ్యా! అయ్యా!  అని ప్రేమగా పిలుస్తూ నాదగ్గర నుంచి యాభై సెంట్లు లేదా రూపాయి చాలా సార్లు తీసుకువెళ్ళిన వాడే! అతడు రౌడీ కూడా అయ్యుండవచ్చనే కాస్త దూరంగానే ఉంచాను.

    ఒకటి రెండు సార్లు రోడ్డు మీద నా భార్యని ఒంటరిగా చూసాడు. అతడి చూపులూ, నవ్వులూ తిన్నగా లేవని తను చెప్పింది. ఇప్పుడు వాడు వస్తున్నాడంటే దాని అర్థం….?.

     ఒక్క క్షణం నాకేం చేయాలో తోచలేదు. ఆలోచించేందుకు సమయం కూడా లేదు. ఇంట్లో కాస్త ఎత్తైన చోట మూడు పెద్ద కర్ర దుంగలూ, కొన్ని పాత పెట్టెలూ ఉన్నాయి. నా భార్యని పైకెత్తి ఎక్కి ఆ దుంగలూ, పెట్టెల మధ్య కనిపించకుండా దాక్కోమన్నాను. నేను వరండాలో చూస్తూ ముందుకి వచ్చాను. నేను వస్తూండగానే ఒక గుంపు ఇంటి ఆవరణలోకి వచ్చేసింది.

   నేను లోలోపల వణికిపోతున్నాను. అయినా నన్ను నేను కూడదీసుకుని  నవ్వుతూ సిల్వాతో "ఏమిటి సిల్వా? ఈ పక్కకి ఎందుకు వచ్చావు?" అని అడిగాను.

    "నేను ఇప్పుడే వచ్చాను. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావో లేక  తాళం వేసి యాలపానంకి పారిపోయావో తెలుసుకుందామని వచ్చాను" అన్నాడు.

    జవాబు ఇచ్చినప్పుడు నా గొంతు స్పష్టంగా లేకపోయినా "నేను మురుగన్ దైవాన్ని ఎలా వదిలి వెళ్తాను" అన్నాను.

    సిల్వా "మాక్కొంచెం తాగేందుకు నీళ్లు కావాలి" అనగానే "సరే" అని వంటింట్లోకి వెళ్ళాను. నా వెనుకే వాళ్ళూ వస్తున్నట్టు అనిపించింది. కానీ నేను  తిరిగి చూడలేదు. ఇత్తడి పాత్రలో నీళ్ళు నింపి తిరిగి చూడగానే ఆ ముగ్గురు రౌడీలూ నా ముందు నిలుచుని కనిపించారు. నేను పట్టుకున్న గ్లాసు వణుకుతోంది.

   "సరే! అయ్యా! అమ్మగారు కనిపించడం లేదేమిటీ"

   నేను ఎన్నోసార్లు మననం చేసి కంఠతా పట్టిన మాట "ఎందుకూ? ఆమె నిన్నే తన ఇంటికి వెళ్ళిపోయిందిగా" అన్నాను.

     పిడుగులాంటి చెంప దెబ్బ తగిలింది. చేతిలో ఉన్న గ్లాసు నీళ్ళూ కింద పడ్డాయి. నేను కళ్ళు తెరిచే లోపు, ఓ రౌడీ నన్ను ఒక చేత్తో నడుం దగ్గర పట్టుకుని మరో చేత్తో బాదటం మొదలు పెట్టాడు.

    "ఒరేయ్! తమిళ పందీ! నాతో అబద్ధం చెబుతున్నావు. ఇవేళ ఉదయం కూడా నీ భార్యని చూసాను" అన్నాడొకడు.

     మరొక రౌడీ "రాస్కెల్! నాకు చెప్పు ఆమెను ఎవరింట్లో దాచావు? అనడంతో నా హృదయం కొంచెం తేలిక పడింది. నేను ఆమెను ఇంకెవరి ఇంట్లోనో దాచేను అనుకుంటున్నారు అని. అంటే నా ఇంట్లో ఇక వెతకరు. నా జీవితం పోయినా, నా భార్య పవిత్రత పోదు" అనుకున్నాను.

     "ఏం మాట్లాడవేంరా? రాస్కెల్!"

   దెబ్బలు! ముష్టి ఘాతాలు! చెంప దెబ్బలు! నేను అచేతనంగా పడిపోయాను. నన్ను పట్టుకుని నిలబెట్టారు.

    "ఆమె ఎక్కడుందో మాకు నువ్వు చెప్పవు కదా? మా మనుషులు గల్లె నుంచి వచ్చి బజార్లో ఉన్నారు. మేం వాళ్ళకి నిన్ను ఇచ్చేస్తే నీ చర్మం ఒలుస్తారు, ఉల్టాగా కట్టేసి సజీవ దహనం చేస్తారు. అదే నీకు మంచిది. పద నా కొడకా!" అంటూ నన్ను నిలబెట్టి మళ్ళీ కొట్టడం మొదలు పెట్టారు. వాళ్ళు ఎంత తీవ్రంగా కొడుతున్నారంటే నేను అస్సలు నిలబడలేక పోతున్నాను.

    నన్ను ఈడ్చుకుంటూ హాలు మధ్యకు తీసుకు వచ్చారు. నా భార్య పైన దుంగల మధ్య కూర్చుని ఉంది. వాళ్ళు హాలు దాటుతున్నారంతే!

    "ఆగండి! ఆగండి!" అంటూ అరుస్తూ నా భార్య కిందికి దూకేసింది. ఆమె పరిగెడుతూ నా దగ్గరకు వచ్చి "ఆయన్ని వదిలెయ్యండి" అని అరిచింది.

   వాళ్ళు నన్ను వదిలేసారు. ఆరు మొరటు  చేతులు ఆమెను చుట్టుముట్టాయి. వాళ్ళు వెనుకనుంచి ఒక టేబుల్ కోడికి నన్ను కట్టేసారు. నా భార్యను ఈడ్చుకుంటూ వంటగది వైపు తీసుకుని వెళ్ళారు. రెండు నిమిషాలలోనే తన తీవ్రమైన అరుపులు నాకు వినిపించాయి. ఆ తర్వాత ఆమె అరిచిందో లేక రక్తపోటు పెరిగి నేను మూర్ఛపోయానో తెలియదు. నా మెదడు మొద్దు బారి పోయింది. 

    మళ్ళీ నాకు తెలివి వచ్చేసరికి, ఆ టేబుల్ దగ్గర ఒకరి ఒడిలో ఉన్నాను. నన్ను అంత ప్రేమగా లాలిస్తున్నదెవరో తెలుసుకోవాలని ఆతృతగా కళ్ళు తెరిచాను.

    ఆమె నా భార్య.

    పవిత్రత పోగొట్టుకున్న ఒక భార్య…… 

   శతాబ్దాల పాటు వారసత్వంగా జీర్ణించుకున్న పవిత్రతా భావం నన్ను హింస పెడుతోంది. 

   పవిత్రత పోగొట్టుకున్న నా భార్య ఒడిలో నేను పడిఉన్నాను. నా శరీరం సిగ్గుతో మెలికలు తిరిగిపోతోంది. నా మెదడు నన్ను తననుండి వేరుచేసుకుని నేలపై పడిపోమంటోంది.
 
    నా ముఖంపై ఒక కన్నీటి చుక్క రాలింది. ఆ తరువాత మరొకటి, ఇంకొకటి అలా నా ముఖం కన్నీటి చుక్కలతో తడిసిపోయింది.

   ఇక్కడ ఆమెను విష సర్పాలు కరిచి ఆనందం జుర్రుకున్నాయి. తన శరీరం, మెదడుకూ వేదనలో మునిగిపోయాయి. కొన్ని శరీరాలు ఆమె శరీరాన్ని ఏదో చేసాయి. అది నా శరీరాన్ని సైతం కాల్చేసింది.

     ఆ ఘటన నా మెదడు పై ఏ ప్రభావమూ వేయకపోయుంటే తన పవిత్రత పోయేది కాదా? తను నేరమని తలచకుండా చేసినదానికి తనని శిక్షించాలా? ఆమె మెదడుకి ఏ సంబంధమూ లేకుండా కేవలం శరీరానికి హాని జరగడం వలన,  తన పవిత్రతను పోగొట్టుకుందని ఆమెను నిందించితే, మరి వైద్యుల దగ్గరకు వెళ్ళే ఆడువారి సంగతేమిటి మరి?" 

    నా మెదడుని చికాకు పెట్టే ఈ ఆలోచనలను తోసి పారేసాను. గుండెలో నా భార్య పట్ల గర్వం నిండి, ఆమె దయకీ, అభినందనకీ పాత్రురాలు అనిపించింది. మెల్లగా ఆమె చేతులు పట్టుకుని నా గుండెలకు చుట్టుకున్నాను.

    ఆ తరువాత పోలీసులు వచ్చారు. ఈ విషయంలో బేబీ నోనా సహాయం చేసిందని నాకు తరువాత తెలిసింది. ఎన్నో కష్టాలు ఓర్చుకుని, నిర్వాసితుల కోసం ఏర్పరిచిన ఆశ్రయంలో ఉండి బాధలనుభవించాక ఇక్కడికి ఎలాగో చేరుకున్నాం. 

                     ********* 
     " ఇప్పుడు చెప్పు మాష్టర్! బలవంతంగా నేరం చేయబడితే ఒక స్త్రీ పవిత్రత పోయినట్టేనా? ఒక పవిత్రమైన భార్య భర్త చితి మంటల్లో భార్య కలిసిపోవాలని, అది తన ధర్మమనీ  సమాజం నిర్దేశిస్తుంది. బలవంతం వలన భార్య దీన్ని ఆమోదిస్తే ఆమె గుణవంతురాలూ, దైవికురాలూనా? లేక సహేతుకం కాని సమాజ నిర్ధేశాలకు బలి అవుతోందా? నాకు చెప్పు. మాష్టర్…..?"

     భావోద్విగ్నుడై గణపతి అయ్యర్ ఏడ్చేసాడు.

    "నన్ను క్షమించండి అయ్యా! తరాల తరబడి మన రక్తంలో పేరుకుపోయిన భావాల వలన ఆలోచించకుండా ఎన్నో విషయాలపై మన అభిప్రాయాలు వెల్లడించేస్తాం. నేనూ తెలివితక్కువ తనంగా ఏదో అనేసాను. అయ్యా! సహేతుక ఆలోచన పేరిట కొందరు వ్యక్తులు అనవసరమైన విషయాల పై అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. కానీ ఈ రోజు సహేతుకమైన ఆలోచనాపరుణ్ణి కనుక్కోగలిగాను" అన్నాడు మూర్తి మాష్టారు. అయ్యర్ ఇంట్లో వేలాడుతున్న గాంధీ చిత్రం అయ్యర్ ముఖంతో కలుస్తున్నట్లుంది అనుకున్నాడు మూర్తి మాష్టారు‌.

-ఆంగ్లం నుంచి అనువాదం: ఆర్.ఎస్. వెంకటేశ్వరన్. Copied from FB
 శీర్షిక : 
మసకేసిన సంధ్యా సమయం

బెల్లంకొండ భవానీకుమారి
(ఇది నా స్వీయ రచన )


"హలో"
ఉలిక్కిపడి ప్రక్కకు చూసింది వైదేహి.
ప్రక్కనే కూర్చుని  ఉన్నాడొకాయన. 70 -75  మధ్య వయసు ఉండవచ్చు. చూడగానే ఆహార్యం బట్టి బాగా చదువుకున్న వాడిలా కనిపించాడు. డ్రెస్సింగ్ కూడా చాలా నీటుగా వున్నది. మెళ్ళో టై అతనికి మరింత హుందాతనం తెచ్చిపెట్టింది. చిరునవ్వుతో ఆయన కేసి చూసింది. 
"స్టూడెంట్ వా "ఏం చదువుతున్నావు ?అడిగాడాయన.
బి.టెక్ ఫైనల్ ఇయర్ అండీ, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలోనండి  "మర్యాదగా చెప్పినఁది వైదేహి.
ఏ బ్రాంచ్ ?
సాధారణంగా అపరిచితులతో ఎక్కువ మాట్లాడదు వైదేహి‌. కానీ ప్రక్కన కూర్చున్న పెద్దమనిషి ఎంతో సౌమ్యంగా, హైలీ ఎడ్యుకేటెడ్ గా అనిపించటంతో చెప్పింది.

"నన్నెప్పుడూ క్యాంపస్ లో చూడలేదా ?" అన్నాడాయన చిరునవ్వుతో.

"లేదండీ, మీరు ప్రొఫసర్ అనుకుంటా, కానీ రిటైర్ అయి వుంటారు, గెస్ట్ ఫ్యాకల్టీనా " కుతూహలంగా అడిగింది.

ఆమె అలా అడగటానికి కారణం వుంది. ఆయనకు ఈజీగా డెబ్బయి దాటి వుండవచ్చు. అందుకే అలా అడిగింది. నవ్వుతూ మాట్లాడుతున్న ఆయన మొహంలో హఠాత్తుగా మార్పు వచ్చింది. నేను ప్రొఫసర్ లా కనిపిస్తున్నానా నీకు,
అన్నాడు చాలా కోపంగా.

బిత్తరపోయింది వైదేహి, ఆయన ఆమె మొహం కేసి చూస్తూ నేను ఒస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్ లోనే సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లోనే వున్నాను, నువ్వు నన్నెప్పుడూ చూడలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. నువ్వు అదే బ్రాంచ్ కదా" అన్నాడు ఆయన ఆశ్చర్యంగా.

మతి పోయినట్టయింది వైదేహికి. ఈయన కూడా ఫైనల్ ఇయర్ లో వున్నాడంటాడేమిటి ?"ఆశ్చర్యపోతూ మరేమీ మాట్లాడలేకపోయింది.

ఇంతలో నలభై ఏళ్ళు వున్న ఒక యువకుడు, అతని వెంటే అతని తల్లి కామోసు  వచ్చారు.

"నాన్నా, ఇంటికి వెల్దాము  పదండి, డ్రైవర్ రమణ ఎన్నిసార్లు ఇంటికెళదాము అంటే మీరు రానంటున్నారట, పదండి నాన్నా , ఇంటికెళదాము" అన్నాడు ఎంతో సౌమ్యంగా, బ్రతిమిలాడుతున్నట్టుగా. . 

ఆయన అతని చేతిని విదిలించి కొట్టాడు. ఎవరు నువ్వు ? ఫైనల్ ఇయర్ చదువుతున్న నన్ను పట్టుకుని "నాన్నా అంటావేమిటి ? ఒక పక్క కాలేజీ టైం అవుతోంది, ఎలా వెళ్ళాలా అని నేను చూస్తుంటే" అన్నారు కోపంగా.

ఇంతలో ఆ రమణ అన్న అతను వచ్చాడు. ఆ కొడుకు, డ్రైవర్ చాలాసేపు ఆయనను బ్రతిమిలాడి, మొత్తానికి కార్ ఎక్కించారు.

ఆయన భార్య బెంచీమీద అలసటగా కూలబడినట్టుగా కూర్చున్నది. ఆవిడ కూడా చదుకున్న ఆవిడలానే వున్నారు.  
మామ్, మీరేమీ అనుకోనంటే ఒక మాట అడుగుతాను" అన్నది వైదేహి.
.
ఆయన మీకు ఇంజనీరింగ్ చదువుతున్నానని చెప్పారు కదూ" అన్నదావిడ.
 
"అవునండీ  ఆయన వయసుని బట్టి రిటైర్ అయ్యి చాలాకాలం అయి వుండొచ్చు. మళ్ళీ గెస్ట్ ఫ్యాకల్టీగా చేస్తున్నారేమో అనుకున్నా. అదే విషయం నేను అంటే ఆయనగారికి చాలా కోపం వచ్చింది, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను అంటారేమిటి ?" కుతూహలంగా అడిగింది వైదేహి.

ఆవిడ నిట్టూర్చి చెప్పింది, ఆయన మా వారు. ది గ్రేట్ సివిల్ ఇంజనీర్ సి.వి  రావుగారు. ఆయన పేరు తెలియని ఇంజనీరింగ్ స్టూడెంట్ వుండరనుకుంటా.  ఎన్నో ప్రాజెక్ట్స్ డిజైన్ చేశారు. రిటైర్ అయ్యాక కూడా ప్రభుత్వం ఆయనను గౌరవ సలహాదారుగా  మూడేళ్ళ క్రితం వరకు పనిచేశారు.***

హఠాత్తుగా ఆయనలో మార్పు వచ్చింది. క్రొత్తలో మేము గమనించలేదు. కానీ, ఆయన ఈమధ్య జరిగిన విషయాలేవీ గుర్తుండకపోవటం, చెప్పిందే చెప్పటం, ఒకే రకమైన ప్రశ్నలు అదే పనిగా అడగటం, ఎవరి పేర్లూ గుర్తుండక పోవటం, అలా మొదలయ్యింది" అన్నాదావిడ దిగులుగా.
.
"అయ్యో, అంత గొప్ప ఇంజినీరు వారు, ఆయన ఇలా అయిపోవడమేమిటి" భాదగా అన్నది వైదేహి.

"కొత్తలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని పదాలు గుర్తుకు రాక తడబడేవారు‌. అది పెద్దవయసు వస్తున్న కొద్దీ అలాంటివి మామూలే అనుకున్నాము" కొంచం ఆగి అన్నాదావిడ.

"ఓ రోజు నన్ను  "నువ్వెవరు, ఇలా వచ్చి నా ప్రక్కన పడుకున్నావేమిటి ?" అంటూ నన్ను  మంచం మీదనుండి తోసేశారు. నడుం విరిగినంత పనైంది. నాకు చాలా భయం వేసి, వెంటనే డాక్టర్ దగ్గిరకి తీసుకెళ్ళాము. 

రావుగారికి  "అల్జిమర్స్ అని నిర్ధారించారు. తానెవరో, ఎంత పేరు ప్రఖ్యాతులు గడించిన ఇంజినీర్ అని మర్చిపోయారు, తనకు "పద్మశ్రీ" వచ్చిందని మర్చిపోయారు. తన చిన్నప్పటి విషయాలు, కాలేజీ లైఫ్ కొంచం గుర్తు వుంది. పదే, పదే ఆ విషయాలే మాట్లాడుతూ వుంటారు. అప్పుడప్పుసూ ఇలా చక్కగా తయారై  చెప్పాపెట్టకుండా బయటకు, వెళ్ళిపోయి ఎటు వెళ్ళాలో తెలియక, ఇలా ఎక్కడబడితే అక్కడ కూర్చుండి పోతున్నారు. అందుకే ఆ రమణ అన్న అతన్ని వారికోసం, ఆయనని ప్రతి నిమిషం కనిపెట్టుకుని ఉండేలా మా అబ్బాయి ఏర్పాటు చేసాడు.

"మాకు ఇద్దరు పిల్లలు, అబ్బాయిని గుర్తు పట్టారు, అమ్మాయిని అసలే గుర్తు పట్టరు, నన్ను చూస్తే చాలా చికాకు పడతారు. 
మనవళ్ళనీ  మనవరాళ్ళనీ ఎంతో ముద్దు చేసేవారు, వాళ్ళు పుట్టినప్పుడు, తన హోదా, ఖ్యాతీ అన్నీ మర్చిపోయి, వాళ్ళని ఎత్తుకుని, ఎంతో సంతోషంగా ఆడించేవారు. పిల్లలికి గ్రాహ్యం తెలిసాక తాతగారిని ఎంతో గౌరవంతో చూసేవారు, కానీ ఆయన అందరి తాతలాగానే వాళ్ళతో ఆడుకోవటం, చదువు చెప్పటం చేసేవారు.

"మందులు వాడితే ప్రయోజనం లేదాండీ ? భాదగా అడిగింది వైదేహి.

"లేదమ్మా, దీనికి మందులు లేవు, ఒక్కోసారి తిన్నారో లేదో గుర్తు ఉండదు. ఒకసారి స్నానం చేసి టవల్ చుట్టుకుని హాల్లో కూర్చున్నారు, బట్టలు వేసుకోవడం మర్చిపోయారు‌. ఇంట్లో వున్న ఇద్దరు మనవళ్ళనీ తన స్వంత పిల్లల్నీ, బంధువులనీ అందర్నీ మర్చిపోయారు, ఎందుకో నేనంటే మండి పడతారు. దగ్గరికి రానివ్వరు, ఒక్క మా కోడలి మాట వింటారు. ఆమె పెడితేనే తింటారు, కానీ ఆమె ఎవరో మర్చిపోయారు. ఈ జబ్బుబారిన పడినవారిని విసుక్కోవటం, తిట్టడం, చేయకూడదు. ఆ వ్యాధి లక్షణాలు గుర్తించి, వాళ్ళని సహృదయంతో అర్ధం చేసుకుని, దయతో ఉండాలి. ఏ మాత్రం కఠినమైన మాటలతో భాదించినా, చాలా కృంగిపోతారు. కోడలు పని ఉండి బయటకు వెళితే, ఇంకెవరూ పెట్టినా తినరు, పాపం మా కోడలికి ఇదో పెద్ద ప్రాబ్లెమ్ అయిపొయింది, కానీ బంగారు తల్లి ఎంతో ఓపిగ్గా చూసుకుంటుంది  ఆయనని" అంటూ కళ్ళొత్తుకుంది." ఆవిడ భాదగా.

మీరంటే ఎందుకండీ కోపం ?" అడిగింది వైదేహి.

ఆమె నెమ్మదిగా అన్నది, "నిజంగా ఆయన ఉద్యోగరీత్యా చాలా బిజీగా ఉండేవారు కానీ ప్రేమమూర్తి అమ్మా, నన్ను చాలా అపురూపంగా చూసుకునేవారు, తాను ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్లినా తన స్వంత ఖర్చులమీద మమ్మల్ని తీసుకెళ్లేవారు. పిల్లల్ని కూడా ఏనాడు అశ్రద్ధ చేయలేదు, మా అమ్మాయి నాన్నగారు నన్ను మర్చిపోవటమేమిటమ్మా అంటూ ఏడుస్తుంది అన్నారావిడ భాదగా.
 
వింటున్న వైదేహికి భాదా, భయము వేసింది. "ఈ వ్యాధి రాకుండా ఏమీ చేయలేమా మేడం....ఎందుకడుగుతానంటే మా నాన్నగారు కూడా త్వరలో రిటైర్ అవ్వబోతున్నారు, అందుకని అడుగుతున్నాను" అన్నది వైదేహి.

మనుషులెప్పుడూ పనీపాటా లేకుండా కూర్చోకూడదమ్మా. నలుగురితో కలవాలి, రిటైర్ అయినా చేతనయినంత మెదడుకి, శరీరానికి శ్రమ కల్పించుకోవాలి. పజిల్స్ సాల్వ్ చేయటం, సాహిత్యం చదవటం, మంచి వ్యాపకాలు నిర్దేశించుకోవటం, ప్రోటీన్ ఫుడ్, నట్స్ తీసుకుంటూ, మంచి జీవన శైలి ఏర్పరుచుకుంటే కొంతవరకు ఈ వ్యాధి బారిన పడకుండా తప్పించుకోవచ్చు అంటారు. కానీ రావుగారు ఏ రోజు కూడా ఏ విషయంలోనూ అశ్రద్ధ చూపేవారు కాదు. మూడేళ్ళ క్రితం వరకు చాలా బిజీ. ఎందుకు ఈ వ్యాధి అంత గొప్ప ప్రతిభాశాలికి వచ్చిందో మాకూ అర్ధం కాలేదు. ఇదొక neurological  ప్రాబ్లెమ్, మెదడులోని  కణాలు త్వరితగతిన మార్పు చెందుతాయని, మెమరీ లాస్ కలుగుతుందని  చెప్పారు డాక్టర్స్, కుటుంబంలో ఎవరికైనా ఇటువంటి హిస్టరీ ఉంటే మనమేమీ చేయలేము" అంటూ పైకి లేచారావిడ.

భారమైన మనసుతో ఆమె వెళ్ళిన వైపే చూస్తుండి పోయింది వైదేహి.  
 
(సమాప్తం )
 *🌹🌹🌹   కన్నప్ప నాయనార్   🌹🌹🌹*

*పుట్టతేనియ పెరతేనె పుట్టజున్ను తొఱ్ఱతేనియ గలవందు దోచితోచి*

*కాలిదులదులనై పిండి పోలెరాలు నట్టి నింజెట్లు గలవు నీకారగింప!!68!!*

               *తేనెలలో varaities. ఇవన్నీ తెస్తాం. పైగా*

*నేరేడుపండులు నెలయూటి పండులు గొండమామిడి పండ్లు దొండపండ్లు*

*బాలపండులు నెమ్మిపండులు బరివెంక పండులు జెటిముటి పండ్ల గలివె*

*పండులు దొడివెంద పండ్లు దుమ్మికిపండ్లు జానపండులు గంగరేనుపండ్లు*

*వెలగపండులు బుల్లవెలగపండులు మోవిపండ్లు నంకెన పండ్లు బలుసు పండ్లు*

*బీరపండ్లును బిచ్చుక బీరపండ్లు గొమ్మిపండ్లీత పండ్లును గొంజిపండ్లు*

*మేడి పండ్లును మొదలుగా గూడిమాడి చెంచెతలు దెత్తురిత్తు విచ్చేయుమయ్య!!69!!*

             *రకరకాల పండ్లు పెడతాం. అసలు ఎవరూ లేకపోతే ఏం తోస్తుందయ్యా. మన వికారాలు భగవంతుడికి ఉన్నాయని భావించి ప్రేమిచడం కూడా గొప్పదే. అలా ప్రేమించగలగాలి. ఇటుకీకాక అటుకీ కాక ఉన్నాం మనం.*

*ఇల్లో! ముంగిలియో! యనుంగు జెలులో! యీడైన చుట్టంబులో*

*యిల్లాలో కొడుకో! తరింపవశమేయే పోడుముల్లేక, మా*

*పల్లెంగోరిన వెల్లనుంగలవు తెప్పల్గాగ నీకిచ్చెదన్*

*జెల్లంబో! యిట నొంటినుండ కట వచ్చేయంగదే! లింగమా!!70!!*

              *తరించాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా ఇంట్లో. ఇల్లో, ముంగిలో, పిల్లలో, చుట్టాలో ఎవరో ఉండాలి. ఏమీ లేకుండా ఒంటరిగా ఉన్నావు పాపం. నిన్ను ఇలా ఒంటరిగా చూస్తుంటే నాకేమీ తోచట్లేదు. మా పల్లెకొచ్చేయ్. కావలసినంత బోల్డు తోడు సందడే సందడి. ఇక్కడ ఒంటరిగా ఉండకు అని చెప్తూ ఉంటే ఆయన కదలకుండా ఊరుకున్నాడు. ఏం కదులుతాడండీ రాయి అని మనం అనుకుంటాం కానీ తిన్నడు అనుకోలేదు. ఈ శివుడు నామీద కోపంతో రావట్లేదు లేదా నామీద ఈయనకి నమ్మకం కలగలేదు. తనని నమ్మట్లేదు అనుకొని అంటున్నాడు.*

*నన్ను మన్నించెదవేని నీవిపుడు రా నావెంట రాకుండినన్*

*నిను నేబాసి చనంగనోప నిచటన్నీతోడిదే లోకమై*

*మనువాడంగను వాడనీకరుణ నీమౌనంబు చిత్తంబు*

*చ్చినచో మానదుగాని నిన్నిపుడు కస్తింబెట్ట నాకేటికిన్!!72!!*

             *నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోను. నేనూ ఇక్కడే ఉంటా. మొండిపట్టుతో కూర్చున్నాడు. నీతోడిదే లోకం అనుకొని ఇక్కడే ఉంటాను. నీ దయను చూస్తాను. మౌనం వదులు, పలకరించు అని నిన్ను విసిగించను. నీకెప్పుడు ఇష్టం అయితే అప్పుడు మౌనం మాను. అంతవరకూ నేను ఇక్కడే కూర్చుంటా.*

              *మొదటిపరిచయంలోనే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇక్కడే కూర్చుంటా అని ఆయనని చూస్తూ కూర్చున్నాడు. తదేకంగా ప్రేమగా చూస్తూ నిమురుతూ కూర్చున్నాడు. ఆ కూర్చోవడం ఎలా ఉందంటే*

 *‘సంపెంగ తావిబ్రుంగుడైన భృంగంబు తెఱంగున నున్నయవసరంబునం*

          *సంపెంగ పువ్వులోకి వెళ్ళిపోయిన తుమ్మెదలాగా అయిపోయాడు. తుమ్మెద సంపెంగ పువ్వులోకి వెళ్తే అక్కడినుంచి మరొక పువ్వు మీదకి వెళ్ళదు. ఎంతవరకూ అంటే అది ఆస్వాదిస్తూ అక్కడే మరణిస్తుంది.  లౌకికాస్వాదనలు కాదు శివాస్వాదనలో పడి అక్కడే ఉండిపోయాడు.*

             *ఈవిధంగా ఉంటూ ఉంటే తెల్లవారిపోయింది. వాళ్ళందరూ లేచారు. యువరాజు కనబడట్లేదు అని చూశారు. ఆయనని విడిచిపెట్టి వెళ్తే రాజుగారు ఏం చేస్తారో? అంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ తిన్నడు ఉన్న చోటికి వచ్చారు. రారా వెళ్ళిపోదాం. నిన్ను చూస్తుంటే పిచ్చివాడిలా ఉన్నావు. పద వెళ్దాం. నువ్వు రాకపోతే మీనాన్న ఎక్కడ ఉన్నాడు అని మమ్మల్ని అడుగుతాడు. పద వెళ్దాం అని వాళ్ళు గట్టిగా అడిగితే కొంతసేపటికి వీళ్ళని చూసి*

*ఈ లింగము లో బ్రాణము గాలము*

 *గడదాక నోడగట్టిన దూలం*

*బైలంకెనుండజేసితి నేలాతుందుడుకు?*

 *పల్లెకేగుడు మీరల్!!80!!*

              *చివరివరకూ నేను ఇక ఈయనతోనే. ఓడలో కట్టిన దూలంలాగా నాప్రాణం ఈయనతో కట్టేశాను. అయితే నేను పల్లెకు రాను ఇక్కడే ఉంటాను అనను. ఈయన వస్తే వస్తాను.*

*నావెంటనితడు వచ్చిన నేవచ్చెద మిమ్ముగూడి యిప్పుడు లేదా*

*యేవంక నభవుడుండిన నావంకనె తోడునీడయై వసియింతున్!!81!!*

          *ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. అంత ఎక్కువ అయిపోయాడా నీకు? అవును. ఈయన తప్ప నాకు ఏదీ ఎక్కువ కాదు.*

*నాకుం జుట్టము దల్లిదండ్రులు జెలుల్ నాథుండు నీ దైవమే*

*మీకిచ్చో బనిలేదు కస్తిపడగా మీపల్లెకుం బొండు కా*

*రాకూరంబులు సేసినం గదలి నే రానిచ్చటం బ్రాణముల్*

*పోకార్తుం తుదినాదు వేలుపునకై బొంక న్నిజంబింతయున్!!82!!*

               *అలాగని మిమ్మల్ని ఇక్కడ ఉండమని నేను చెప్పను. మీరు పొండి. ఎక్కువ బలవంత పెడితే ఇక్కడే ప్రాణం వదిలేస్తాను. ఏమాత్రం అబద్ధమాడట్లేదు. నిజం చెప్తున్నా పొండి అని వాళ్ళ మాట వినిపించుకోకుండా ఆ శివుడిని చూస్తూ కూర్చున్నాడు. ఇంక లాభం లేదనుకొని వీళ్ళు వెళ్ళిపోయారు.*

            *ఆ తర్వాత శివుడిని చూస్తూ నేను ఇలా చూస్తూ కూర్చుంటే శివుడి ఆకలి తీర్చేవాళ్ళెవరు? పాపం ఈయనని ఇన్నాళ్ళూ కనిపెట్టుకొనే వాళ్ళు లేరు. మరి నేను దొరికిన దానికి ఫలితం కనబడాలి కదా ఈయనకి. కనుక ఈయనకి ఆహారం పెట్టాలి. సమయమైపోయింది.*

*ఎన్నాళ్ళనుండియో పస్తున్నాడీ యడవిలోన నొంటి మహేశుం*

*డిన్నెగులు మాన్పవలదా కన్నారంగనిన బంటుగల ఫలమనుచున్!!85!!*

           *ఎన్నాళ్ళనుంచీ పస్తున్నాడో పాపం పెట్టేవాళ్ళు లేక? శివునికి కావలసింది ఇదే. తెలివితేటలు కాదు. మూఢత్వం అయితే అవవచ్చు కానీ అర్పణ బుద్ధి. వెంటనే స్వామివారికి నమస్కారం చేసి మంచి భోజనం తెస్తాను ఉండు అని వెళ్ళి చక్కగా మంచి బలిసినటువంటి అడవిపందిని వేటాడి దాని మాంసాన్ని బాగా కాల్చి దానిలో వేయవలసిన పదార్థాలు ఛక్కగా కలిపి దొప్పలో పట్టుకొని వస్తున్నాడు. ఆ వస్తున్న తిన్నడు ఎంత అందంగా ఉన్నాడో చూద్దాం.*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*