Thursday, December 31, 2020

భారతీయమహిళాశక్తిమేలుకో!! #మహిళఅబలకాదుసబలగానిరూపించుకో

#భారతీయమహిళాశక్తిమేలుకో!!
#మహిళఅబలకాదుసబలగానిరూపించుకో!!

#యత్రనార్యస్తుపూజ్యంతేరమంతేతత్రదేవతాః!! --మనుధర్మశాస్త్రం!!
(ఎక్కడ స్త్రీలు పూజించబడతారో, గౌరవించి
ఆరాధించబడతారో అక్కడ దేవతలు ఆనందముతో వరాలను అనుగ్రహిస్తారు)

#స్త్రీ ని #జగన్మాత గా ఆరాధించే సాంప్రదాయం కేవలం మనదేశం లోనే వున్నది!!
#దేశాన్నిమాతృభావనతో ఆరాధించే సంస్కృతి మనది!! #భారతమాతాకీజై!!

భారతదేశంలో స్త్రీలకు స్వేచ్ఛ సమానతలు
లేవని భావించేవారు ఇది చదవండి!!

వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.

స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి - యజుర్వేదం 10.03

స్త్రీలు మంచి కీర్తి గడించాలి - అధర్వణవేదం 14.1.20
స్త్రీలు పండితులవ్వాలి - అధర్వణవేదం
11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది)

స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి - అధర్వణవేదం 14.2.74

స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి - అధర్వణవేదం 7.47.2

స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి - అధర్వణవేదం 7.47.1

#పరిపాలనవిషయంలోస్త్రీలు!!

పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గినాలి - అధర్వణవేదం 7.38.4

దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి- ఋగ్వేదం 10.85.46

ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.

#ఆస్తిహక్కు!!
పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది- ఋగ్వేదం 3.31.1

#కుటుంబం!!
సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- అధర్వణవేదం 14.1.20

స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి- అధర్వణవేదం 11.1.17 (స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది)

నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు- అధర్వణవేదం 7.46.3

#ఉద్యోగాలు!!
స్త్రీలు కూడా రధాలను నడపాలి- అధర్వణవేదం 9.9.2

స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి- యజువేదం 16.44
(ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం)
. స్త్రీలు బయటకు రాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది!!

. కైకేయి దీనికి ఉదాహరణ కదా.!! రామాయణంలో కైకయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు. దశరధుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా సమయం వచ్చినప్పుడు అడుగుతా నంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదా!!

5000 మంది బలిస్టులైన సైనికులతో లాగ
బడిన #శివధనుస్సు ను సీతమ్మతల్లి ఒక
చేతితోనే పక్కకు జరిపిందని రామాయణం
చెబుతోంది!! సీతమ్మ #వీర్యశుల్క!!

* నరకాసురునితో జరిగిన యుద్ధంలో
శ్రీకృష్ణుడు మూర్ఛపోతే సత్యభామాదేవి నరకునితో యుద్ధం చేసినట్టుగ భాగవతం
చెబుతుంది!!

కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్ద్యేశించి ప్రసంగించాలి- ఋగ్వేదం 10.85.26

#విద్యావిషయాల్లో!!
ఓ స్త్రీల్లారా!
పురుషలతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాకా. మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాకా. మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్దం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను- ఋగ్వేదం 10-191-3

వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్రా వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్పబడింది. ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ స్త్రీదేవతలు ఉండరు. అన్యమతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు తన దివ్యసందేశం ఇచ్చినట్టుగా లేదు.

#వివాహం - #విద్యాభ్యాసం!!
ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, నీకు భర్తకు శుభాలను కలుగచేసే దానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవ ప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు - అధర్వణవేదం
14-1-64 (ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు)........
#వేదమాతాకీజై !! #గాయత్రీమాతాకీ!!

మన ప్రాచీన వేదవాజ్ఞ్మయాన్ని అధ్యయనం
చేయండి!! ప్రచారం చేయండి!!
---మీ సామ
ర్లవేంకటేశ్వరాచార్య!!భాగ్యనగర్!!
సేకరణ

Source - Whatsapp Message

మోదీ గారు మన మీడియాకి ఎందుకు నచ్చరో ఈ క్రింది ఆర్టికల్ చదివితే మీకే అర్థం అవుతుంది.

మోదీ గారు మన మీడియాకి ఎందుకు నచ్చరో ఈ క్రింది ఆర్టికల్ చదివితే మీకే అర్థం అవుతుంది.

భారత మీడియా హౌస్ లకి స్వర్ణ యుగం :2004-2014 UPA 1 & UPA 2. మౌన ముని [మన్మోహన్] ప్రధానిగా ఉన్న 10 సంవత్సరాలు అటు లెఫ్ట్ మీడియా ఇటు ఖాంగ్రెస్ బూట్లు నాకే మీడియా కి స్వర్ణ యుగం.
మౌనముని విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడల్లా ఆయన వెంట ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు, IFS,IRS,IAS అధికారులు వెంట వెళ్ళేవారు ఇది సహజం,అవసరం కూడా. కానీ ప్రధాని పర్యటన కవరేజీ కోసం తన వెంట మీడియా ప్రతినిధులని తీసుకెళ్ళేవారు. ఒకరో ఇద్దరో కాదు తంబలు తంబలుగా వెళ్ళేవారు.

ఎయిర్ ఇండియా ఒన్ విమానంలో 36 'బిజినెస్' క్లాస్ టికెట్స్ వీళ్ళకోసం కేటాయించేవారు. విమానం ఎక్కినప్పటి నుండి వీళ్ళకి రాచ మర్యాదలు జరిగేవి. ఖరీదయిన విదేశీ మద్యం సరఫరా చేసేవారు ఇన్ ఫ్లయిట్ లో. వీళ్లలో కొందరు తమకి ప్రత్యేక బ్రాండ్ కావాలని పట్టుబట్టి మరీ సెర్వ్ చేయించుకునే వారు. ఆహారం అంతా కాంటినెంటల్ స్టైల్ అడిగి మరీ వడ్డించుకునేవారు.

ఇక ప్రధాని వెళ్ళిన దేశంలో వీళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చేసేవారు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులు. ప్రధాని సమావేశం చాలా క్లుప్తంగా జరిగిపోయేది. ఒకరో ఇద్దరినో ఆ సమావేశం కోసం వదిలి మిగతావాళ్ళు ఆ దేశంలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ ని చూడడానికి వెళ్ళేవాళ్లు అఫ్కోర్స్ ప్రయాణం కోసం కార్లు అక్కడి రాయబార కార్యాలయం అధికారులు ఉచితంగా ఏర్పాటు చేసేవారు. ఇక సాయంకాలాలు ఆయా దేశాల్లో షాపింగ్ చేసిన తరువాత ఆ దేశ ప్రధానో,అధ్యక్షుడో మన ప్రధానికోసం విందు ఏర్పాటు తప్పనిసరి ప్రోటోకాల్. సదరు జర్నలిస్టులు విందుకు హాజరయ్యేవారు. తాగినంత,తిన్నంత ...వస్తూ వస్త్తో అక్కడ అతిధులకోసం ఉంచిన మద్యం బాటిళ్ళు తమతో పాటు హోటల్ కి పట్టుకెళ్ళేవాళ్లు.

ఇక ప్రధానితో పాటు వచ్చిన అతిధులు కాబట్టి ఆతిధ్యమ్ ఇచ్చే దేశం ఉచిత కానుకలు అందరితో పాటు వీళ్ళకి కూడా. తిరిగి మన దేశంలోకి వచ్చినప్పుడు దౌత్యవేత్తలకి మాత్రమే ఉండే 'గ్రీన్ చానెల్ ' ద్వారా విమానాశ్రయం నుండి బయటికి వచ్చేవాళ్లు ...అంటే కస్టమ్స్ చెకింగ్,పన్నులు కట్టడాలు ఏమీ ఉండవు. తమతో పాటు తెచ్చుకున్న ఖరీదయిన ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ కి టాక్స్ ఫ్రీ ఎగ్జిట్ అన్నమాట. టాక్స్ పేయర్స్ సొమ్ము వీళ్ళ పాలు.

ప్రధానితో పాటు విమానంలో ప్రయాణిచ్చేటపుడు ప్రధాని కార్యాలయ [PMO ] ముఖ్య అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడం వాటిని ఉపయోగించుకొని పైరవీలు చేసి డబ్బు సంపాదించడం జరిగింది. అడిగిందే తడవుగా మౌనముని వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు. కాబట్టి అధికారులు వీళ్ళు అడిగిన పని చేసిపెట్టేవారు.ఇక ప్రధాని ఇచ్చే విందు సమావేశాలలో వీళ్ళకి 'బ్లాక్ లేబుల్ ' తప్పని సరిగా ఉండాలి. సమావేశం ముగియగానే తలా ఓ రెండు మూడు బ్లాక్ లేబుల్ బాటిళ్ళు తమతో తీసుకెళ్ళేవారు. ఒక దశలో వీళ్ళని ప్రధాని కార్యాలయ సిబ్బంది బ్లాక్ లేబుల్ బాచ్ వస్తుంది. ఈ రోజు కాబట్టి మామూలుగా కంటే ఎక్కువ కౌంటర్ల మీద పెట్టాలి అని విసుక్కునెంతగా ఉండేది వీళ్ళ ప్రవర్తన.
వీళ్ళు చేసిన సేవలకి గాను పద్మశ్రీ,,పద్మ విభూషణ్ లు కానుకగా ఇచ్చింది UPA ప్రభుత్వం.

రాజ్దీప్ సర్దేశాయ్, బర్ఖా దత్,శేఖర్ గుప్తా [పద్మ విభూషణ్ ],వినోద్ దువా , జావేద్ ఆనంద్ [ఈ పేరేంటో వింతగా లేదు ?తీస్తా సెతేల్వాద్ భర్త ],ప్రఫుల్ బిద్వాయి ,పుణ్య ప్రసూన్ బాజ్పెయీ ,విక్రమ్ చంద్రా [ఓనర్ NDTV ],ప్రాంజోయ్ గుహ తాకుర్త, రవీశ్ కుమార్ [NDTV ],అరుణ్ పూరీ , నిధి రజ్దాన్ [NDTV], కిరణ్ ధాపర్ ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. వీళ్ళందరూ ఏం పొడిచారని ? ఖాంగ్రెస్ కుంభకోణాలని వెనకేసుకువచ్చారనా?

డిసెంబర్ 2013 లో NDTV 25th వార్షికోత్సవం రాష్ట్రపతి భవన్ లో జరిగింది తెలుసా ? రాష్ట్రపతి భవన్ ఏమన్నా ఫంక్షన్ హాలా ? ఎవరి రికమెండేషన్ తో అనుమతి ఇచ్చారు ? ఇలాంటి అనుమతులే The Hindu,Times of India కి ఇచ్చారు. అసలు ఈ విషయం ఎవరి దృష్టికీ రాకపోయి ఉండవచ్చు.

రాజ్దీప్ సర్దేశాయ్ బంగ్లా ఢిల్లీ ల్యూటెన్స్ లో ఉంది. ఇతర జర్నలిస్టుల బంగ్లాలు కూడా అదే VVIP ప్రాంతంలో ఉన్నాయి. నీతి,నిజాయితీ అంటూ మడి కట్టుక్కూర్చున్న జర్నలిస్టులకి అక్కడ బంగ్లా ఉంటుందా ? NDTV మనీ లాండరింగ్ కేసులో కూరుకుపోయి ఉంది. బర్ఖా దత్, వీర్ సంఘ్వి ,రోహిణీ సింగ్ [The Wire], రాడియా టేపుల కుంభకోణంలో ఉన్నారు.

The Tribune : UPA2 కి వచ్చేసరికి ఒక జోక్ ప్రచారంలో ఉండేది అదేమిటంటే మౌనముని తన పార్టీలో ఏమి జరుగుతున్నది,అసలు తన ప్రభుత్వం గురుంచి తెలుసుకోవడానికి ట్రిబ్యూన్ పత్రిక చదివేవాడు. ఈ ట్రిబ్యూన్ పత్రిక పంజాబ్,హర్యానా,హిమాచల్ ప్రదేశ్, J&K రాష్ట్రాలలో ఫేమస్ కానీ పూర్తిగా ఖాంగ్రెస్ అనుకూల వార్తలు మాత్రమే ప్రచురిస్తుంది. అంటే తన ప్రభుత్వం గురుంచి తెలుసుకోవడానికి యే పత్రిక చదవాలో తెలియని పరిస్థితిలో ఉండేవాడు మౌనముని.

ఈ విషయం ఇక్కడ ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నది అంటే 2010 లో ఒక సమావేశంలో మాట్లాడుతూ కపిల్ సిబాల్ దాదాపు 150 ప్రింట్,ఎలెక్ట్రానిక్,వెబ్ మీడియా హౌసెస్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఖాంగ్రెస్ కి చెందినవి ఉన్నాయి అంటూ నోరు జారాడు. తన పార్టీ గొప్పదనం గురుంచి చెప్పాలనుకొని అసలు విషయం బయటపెట్టుకొని సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. 150 కాదు ఇంకా ఎక్కువే ఉన్నాయి కానీ కపిల్ సిబాల్ కి తెలియకపోవచ్చు. అసందర్భంగా కాంగ్రెస్ ని తిడుతూ సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ ని వెనకేసుకొచ్చే మీడియా కేంద్రాలు చాలానే ఉన్నాయి. కాకపోతే మనం నిశితంగా పరిశీలిచలేకపోవడమే మనకి తెలియకపోవడానికి కారణం.

కొన్ని నిజాలు : 1.శోభన భర్తీయా ,కాంగ్రెస్ MP, చైర్ పర్సన్ ,హిందుస్తాన్ టైమ్స్ . 2.సోనియా సింగ్ , కాంగ్రెస్ MP -MPRPN సింగ్ భార్య ,ఎడిటోరియల్ డైరెక్టర్, NDTV. 3. రాజీవ్ శుక్లా , న్యూస్ 24 చానెల్ యజమాని , కాంగ్రెస్ MP. 4. నవీన్ జిందాల్ కాంగ్రెస్ MP మామకి 17% స్టేక్ NDTV లో ఉంది. 5. బర్ఖా దత్ ,గ్రూప్ డైరెక్టర్,NDTV, రాడియా టేపుల కేసులో నిండుతురాలు,కాంగ్రెస్ స్టూజ్ . 6. వీర్ సంఘ్వి ,అడ్వైసర్ , హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్,రాడియా టేపుల కేసులో మరో నిందితుడు. ఈ లిస్ట్ చాలా పెద్దది వ్రాసుకుంటూ పోతే పెద్ద పుస్తకం అవుతుంది.

2014: శ్రీ నరేంద్ర మోదీ నాయక్త్వంలో BJP అధికారంలోకి వచ్చింది. PMO లో పని చేసే వారు ఎవరయినా 10.30 కల్లా వాళ్ళ సీట్లలో ఉండాలి. బయో మెట్రిక్ ని స్ట్రిక్ట్ చేశారు. ప్రధాన మంత్రి సమావేశం ఉంటే I&PR ద్వారా తెలియచేస్తారు. సమావేశానికి ముందు టీ ,బిస్కిట్స్ మాత్రమే ఏర్పాటు చేస్తారు. ప్రధాని సమావేశం అయిపోగానే ఎక్కువసేపు అక్కడ ఎవరూ ఉండడానికి వీలులేదు. రాజ్దీప్ సర్దేశాయ్,బర్ఖా దత్, రవీశ్ కుమార్ లాంటి వాళ్ళు ప్రధానికి దూరంగా ఉండి వివరాలు నోట్ చేసుకోవాలి. మౌన ముని లాగా పక్కన కూర్చోపెట్టుకొని బాతాఖానీ ఉండదు.

ఇక మోదీ విదేశీ పర్యటనకి తనతో పాటు దూర్ దర్శన్ కి సంబంధించిన 6 గురు సిబ్బందిని తీసుకెళతారు. రోజుకి 18 గంటలు పనిచేసే ప్రధాని వీలున్నంత వరకు ఎయిర్ ఇండియా ఒన్ ఫ్లయిట్ లోనే నిద్రపోతారు మరీ అత్యవసరం అయితేనే వెళ్ళిన దేశంలో హోటల్ లో బస చేస్తారు. ప్రోటోకాల్ ప్రకారం విందు ఉన్నా కేవలం పళ్ల రసంతోనే సరిపెట్టేస్తారు. తిరిగి భారత్ కి రాగానే ఎయిర్ పోర్ట్ లోనే పత్రికా సమావేశం పెట్టి విలేఖరులకి తన పర్యటన విశేషాలు చెపుతారు. ఇంకా ఇన్ఫోర్మేషన్ కావాలంటే దూర్ దర్శన్ నుండి తీసుకోవచ్చు. మద్యం,మాంసం ఉండవు. కాంప్లిమెంటరీ బ్లాక్ లేబుల్ బాటిల్స్ లేవు. మౌన ముని హయాం లో PMO లో అన్నీ విభాగాల్లో స్వేచ్చగా తిరిగి అన్నీ విషయాలు తెలుసుకునే వాళ్ళు ,కీలక రక్షణ రంగ కాంట్రాక్టుల విషయంలో తల దూర్చేవాళ్లు , చివరికి అగాస్టా హెలికాప్టర్ కుంభకోణంలో కొందరి జర్నలిస్టుల పేర్లు బయటపడ్డాయి. అంటే వీళ్ళు ఎంతలా ప్రభుత్వ విషయాల్లో చొచ్చుకుపోయారో ఊహించుకోండి. కీలకమయిన రక్షణరంగ కాంట్రాక్టుల విషయంలో విదేశీ సంస్తలతో మాట్లాడి కాంట్రాక్ట్ ఇప్పించే హామీలు ఇచ్చే స్థాయికి వెళ్లారు. ఇప్పుడు ఆ అవకాశం కాదు కదా PMO ఛాయలకి వెళ్లడానికి అవకాశం లేదు.

అన్నీ మేజర్ మీడియా హౌస్ లకి NGO ల ద్వారా విరాళాల రూపంలో డబ్బు అందేదీ. మోడీ NGO లని లెక్కలు అడిగాడు. చెప్పము లేదా చెప్పలేము అన్న అన్నీ NGO లని మూసేశాడు. స్వదేశంలో ఆదాయం రాక,విదేశాలనుండి విరాళాలు ఆగిపోవడం చేత తమ జేబుల్లోనుండి డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడం మోడీ వ్యతిరేకతకి ప్రధాన కారణం. మన్ కీ బాత్ పేరుతో మోడీ తానే నేరుగా ప్రజలతో మాట్లాడడం,అత్యవసర సమయాల్లో తానే టి‌వి ముందుకు వచ్చి నేరుగా ప్రజలకి సందేశం ఇవ్వడం తో ఈ మీడియా హౌస్ ల ప్రాధాన్యం తగ్గడం మరో కారణం. మోదీ వీళ్ళని బై పాస్ చేసేశాడు. దూర్ దర్శన్ ని ప్రజలు మళ్ళీ చూడడం ప్రారంభించారు. ఫైవ్ స్టార్ హోటళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేసి బిల్ కట్టకుండా వచ్చే అవకాశం ఇప్పుడు లేదు , వీళ్ళని ఎవరూ లెక్క చేయడం లేదు. పారిశ్రామిక వేత్తల నుండి ఇదివరకటిలాగా డబ్బు రావట్లేదు అనేకన్నా వీళ్ళని బేఖాతర్ చేస్తున్నారు. క్వింట్ జర్నలిస్ట్ సుప్రీతో మోడీ చనిపోతే బాగుండు అని వాగాడు, మోడీ ఏమన్నా చర్య తీసుకున్నడా ? ఒక ప్రధానిని అలా అనడం పత్రికా స్వేచ్చ అన్నమాట . టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ లతీఫ్ అనేవాడు మోడీకి కరోనా వైరస్ రావాలి అని బహిరంగంగా వాగాడు. కానీ ఎడిటర్స్ గిల్డ్ ఎలాంటి చర్యా తీసుకోలేదు. స్థలాభావం వల్ల చాలా విషయాలు వ్రాయకుండా వదిలేస్తున్నాను.

ఇప్పుడు చెప్పండి ! పాల్ఘార్ లో నాగా అఖాడా సాధువులని చంపితే వీళ్ళు స్పందిస్తారు అని ఎలా అనుకుంటాం ? మోదీ మీద ద్వేషం వీళ్ళు కలిసికట్టుగా ఉండడానికి కారణం. పైగా గత నెలరోజులుగా కరోనా వల్ల వచ్చిన నష్టం వల్ల చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్నీ మీడియా హౌసులు ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని స్థితి. ఉద్యోగులని తీసివేయడం,జీతాలు లేకుండా సెలవుల మీద ఉండండి అని అడిగే స్థితి. చైనా కి జలుబు చేస్తే వీళ్ళకి తుమ్ములు వస్తాయి. పాకిస్తాన్ కి కడుపు నెప్పి వస్తే వీళ్ళకి వీరేఛానలు అవుతాయి. పాపం పండింది. వీళ్ళ మీడియా కంటే వేగంగా ఫేస్బుక్ లో వార్తలు,వీడియోలు వచ్చేస్తున్నాయి. వీళ్ళు అందరూ కలిసి ఆర్నాబ్ గో స్వామిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మరో పోస్ట్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను.
#IndiaWithModi

Source - Whatsapp Message

రామాయణం 108 ప్రశ్నలు –జవాబులతో.

💐💐రామాయణం 108 ప్రశ్నలు –జవాబులతో.💐💐

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి...
🙏✍💐🏹

1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
= వాల్మీకి.

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
= నారదుడు.

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
= తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
=24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
=కుశలవులు.

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
=సరయూ నది.

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
=కోసల రాజ్యం.

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
=సుమంత్రుడు.

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
=కౌసల్య, సుమిత్ర, కైకేయి.

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
=పుత్రకామేష్ఠి.

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?
=జాంబవంతుడు.

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
= దేవేంద్రుడు.

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
=హనుమంతుడు.

15. కౌసల్య కుమారుని పేరేమిటి?
=శ్రీరాముడు.

16. భరతుని తల్లి పేరేమిటి?
=కైకేయి.

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
=వసిష్ఠుడు.

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
=12 సంవత్సరములు.

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
=మారీచ, సుబాహులు.

21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
=బల-అతిబల.

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
=సిద్ధాశ్రమం.

23. తాటక భర్త పేరేమిటి?
=సుందుడు.

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
=అగస్త్యుడు.

25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
=భగీరథుడు.

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

27. అహల్య భర్త ఎవరు?
=గౌతమ మహర్షి.

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
=శతానందుడు.

29. సీత ఎవరికి జన్మించెను?
=నాగటి చాలున జనకునికి దొరికెను.

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
=దేవరాతుడు.

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
=విశ్వకర్మ.

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
=మాండవి, శృతకీర్తి.

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
=జనకుడు.

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
=కుశధ్వజుడు.

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
=వైష్ణవ ధనుస్సు.

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
=యధాజిత్తు.

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
=మంధర.

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
=గిరివ్రజపురం, మేనమామ యింట.

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
=శృంగిబేరపురం.

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
=గారచెట్టు.

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
=భారద్వాజ ముని.

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
=మాల్యవతీ.

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
=తైలద్రోణములో.

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
=జాబాలి.

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
=నందిగ్రామము.

46. అత్రిమహాముని భార్య ఎవరు?
=అనసూయ.

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
=విరాధుడు.

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
=అగస్త్యుడు.

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
=గోదావరి.

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
=శూర్ఫణఖ.

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
=జనస్థానము.

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
=మారీచుడు.

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
=బంగారులేడి.

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
=జటాయువు.

55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
=దక్షిణపు దిక్కు.

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
=కబంధుని.

57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
=మతంగ వనం, పంపానదీ.

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
=ఋష్యమూక పర్వతం.

59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
=హనుమంతుడు.

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
=అగ్ని సాక్షిగా.

61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.

62. సుగ్రీవుని భార్య పేరు?
=రుమ.

63. వాలి భార్యపేరు?
=తార.

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
=కిష్కింధ.

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
=మాయావి.

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
=దుందుభి.

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
=మతంగముని.

68. వాలి కుమారుని పేరేమిటి?
=అంగదుడు.

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
=ఏడు.

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
=ప్రసవణగిరి.

71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=వినతుడు.

72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=అంగదుడు.

73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
=మామగారు, తార తండ్రి.

74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=శతబలుడు.

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
=మాసం (ఒక నెల).

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
=దక్షిణ దిక్కు.

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
=స్వయంప్రభ.

79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
=సంపాతి.

80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
=పుంజికస్థల.

81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
=మహేంద్రపర్వతము.

82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
=మైనాకుడు.

83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
=సురస.

84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
=సింహిక.

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
=నూరు యోజనములు.

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
=లంబ పర్వతం.

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
=అశోక వనం.

88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
=రెండు.

89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
=త్రిజట.

90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
=రామ కథ.

91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
=చూడామణి.

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
=ఎనభై వేలమంది.

93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
=విభీషణుడు.

95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
=మధువనం.

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
=ఆలింగన సౌభాగ్యం.

98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
=నీలుడు.

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
=నికుంభిల.

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
=అగస్త్యుడు.

101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
=ఇంద్రుడు.

102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
=మాతలి.

103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
=హనుమంతుడు.

105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
=శత్రుంజయం.

106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
=స్వయంగా తన భవనమునే యిచ్చెను.

107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
=బ్రహ్మ.

108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
=తన మెడలోని ముత్యాలహారం.

శ్రీ రామ జయం!
🙏👍✍🏹 🙏🙏 మీ శ్రీరామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌹🙏🌹

Source - Whatsapp Message

EXCELLENT INFO ABOUT SRI KRISHNA

EXCELLENT INFO ABOUT SRI KRISHNA

1) Krishna was born 5252 years ago.

2) Date of Birth: 18th July, 3228 B.C.

3) Month: Shravan.

4) Day: Ashtami.

5) Nakshatra: Rohini.

6) Day: Wednesday.

7) Time: 00:00 A.M.

8) Shri Krishna lived 125 years, 08 months & 07 days.

9) Date of Death: 18th February 3102BC.

10) When Krishna was 89 years old; the mega war (Kurukshetra) war took place.

11) He died 36 years after the Kurukshetra war.

12) Kurukshetra War was started on Mrigashira Shukla Ekadashi, BC 3139. i.e "8th December 3139BC" and ended on "25th December, 3139BC".

13) There was a Solar eclipse between "3p.m to 5p.m on 21st December, 3139BC" ; cause of Jayadrath's death.

14) Bhishma died on 2nd February,(First Ekadasi of the Uttarayana), in 3138 B.C.

15) Krishna is worshipped as:
(a) Krishna Kanhaiyya: Mathura.
(b) Jagannath: In Odisha.
(c) Vithoba: In Maharashtra.
(d) Srinath: In Rajasthan.
(e) Dwarakadheesh: In Gujarat.
(f) Ranchhod: In Gujarat.
(g) Krishna: Udipi, Karnataka.

16) Bilological Father: Vasudeva.

17) Biological Mother: Devaki.

18) Adopted Father: Nanda.

19) Adopted Mother: Yashoda.

20) Elder Brother: Balaram.

21) Sister: Subhadra.

22) Birth Place: Mathura.

23) Wives: Rukmini, Satyabhama, Jambavati, Kalindi, Mitravinda, Nagnajiti, Bhadra, Lakshmana

24) Krishna is reported to have Killed only 4 people in his life time.
(i) Chanoora; the Wrestler
(ii) Kamsa; his maternal uncle
(iii) & (iv) Shishupaala and Dantavakra; his cousins.

25) Life was not fair to him at all. His mother was from Ugra clan, and Father from Yadava clan, inter-racial marriage.

26) He was born dark skinned. He was not named at all throughout his life. The whole village of Gokul started calling him the black one; Kanha. He was ridiculed and teased for being black, short and adopted too. His childhood was wrought with life threatening situations.

27) 'Drought' and "threat of wild wolves" made them shift from 'Gokul' to 'Vrindavan' at the age 9.

28) He stayed in Vrindavan till 1416 years. He killed his own uncle at the age of 1416 years at Mathura.He then released his biological mother and father.

29) He never returned to Vrindavan ever again.

30) He had to migrate to Dwaraka from Mathura due to threat of a Sindhu King; Kala Yaavana.

31) He defeated 'Jarasandha' with the help of 'Vainatheya' Tribes on Gomantaka hill (now Goa).

32) He rebuilt Dwaraka.

33) He then left to Sandipani's Ashram in Ujjain to start his schooling at age 16~18.

34) He had to fight the pirates from Afrika and rescue his teachers son; Punardatta; who was kidnapped near Prabhasa; a sea port in Gujarat.

35) After his education, he came to know about his cousins fate of Vanvas. He came to their rescue in ''Wax House'' and later his cousins got married to Draupadi. His role was immense in this saga.

36) Then, he helped his cousins establish Indraprastha and their Kingdom.

37) He saved Draupadi from embarrassment.

38) He stood by his cousins during their exile.

39) He stood by them and made them win the Kurushetra war.

40) He saw his cherished city, Dwaraka washed away.

41) He was killed by a hunter (Jara by name) in nearby forest.

42) He never did any miracles. His life was not a successful one. There was not a single moment when he was at peace throughout his life. At every turn, he had challenges and even more bigger challenges.

43) He faced everything and everyone with a sense of responsibility and yet remained unattached.

44) He is the only person who knew the past and probably future ; yet he lived at that present moment always.

45)* He and his life is truly an example for every human being.🌷🙏🏻

Source - Whatsapp Message

చట్టం విఫలం అయినా ధర్మం విఫలం అవ్వదు - అవినీతికి పరిష్కారం ధర్మ ప్రచారమే

మీరు ఏ పూజా చేయలేకపోయినా రోజూ మనస్పూర్తిగా నవ్వగలిగారంటే ఏ రోగాలూ మీ దరిచేరవు. ఆనందో బ్రహ్మ

దేవుడు అంటే మనిషే అయినపుడు, దేవుడికి కోపం వచ్చింది అంటే మనిషికి కోపం వచ్చింది అని అర్ధం.

దేవుడు అంటే ప్రత్యేకంగా ఎవరూ లేరు.
మనిషి రెండు రాళ్ళతో నిప్పుని పుట్టించి తిండిని కనిపెట్టాక ఉండడానికి ఒక గూడు తయారుచేసుకున్నాడు.

ఆ గూటిని రక్షించుకోడానికి ఒక భయాన్ని సృష్టించాడు.
ఆ భయం పేరే దేవుడు !

మనిషికి ఏదో ఒక భయం అనేది కాస్తో కూస్తో ఉండాలి. ఆ భయం లేనివాళ్ళు ఉగ్రవాదులుగా తయారు అవుతారు.
భయపడే మనిషి ఎపుడూ తప్పు చేయడు. భయం లేనివాళ్ళే తప్పులు చేస్తారు.

భయం ఎందుకు లేదు అంటే దేవుడు లేడు అని నమ్మడమే !

దేవుడు ఎందుకు లేడు అంటే సాటి మనిషిని ఇంకొక మనిషి పట్టించుకోకపోవడమే !
ప్రతి మనిషీ దేవుడే అయినపుడు ఒకరిని ఇంకొకరు పట్టించుకోవాలి.

ఇక పూజలెందుకంటే మనిషి మనుగడకు క్రమశిక్షణ అవసరం.

రోజూ విధిగా చేయవసిన పనులు కొన్నిటిని ఏర్పరిచారు.అందరూ ఒక్కలాగే ఉండలేరు కనుక వివిధ విధి విధానాలు రూపొందించారు.

సూర్య నంస్కారం దగ్గరనుండి ధ్యానం,నమాజ్ ప్రతిదీ పూజే !

ఎవరికి నచ్చినపద్ధతి వారు అవలంబించవచ్చు.క్రమశిక్షణ అవసరం లేదనుకుంటే దేవుడిని నమ్మకుండా ఉండవచ్చు అది మీ ఇష్టం.

ఇక వేదాలు,మంత్రాల వల్ల వాక్కు పవిత్రమవుతుంది.
వేదోచ్చారణ వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఖురాన్ చదివినా,
బైబిల్ చదివినా,
భగవద్గీత చదివినా...
అందరూ చెప్పేది ఒకటే,దేవుడొక్కడే !

పూజ చేయడం లేదని భయపడుతున్నాం అంటే క్రమశిక్షణ లేదని భయపడుతున్నట్లే !

భయం అంటే దేవుడు,
దేవుడు అంటే మనిషి.

ఉన్నాడో లేడో తెలియని దేవుడుకోసం బ్రతికేఉన్న మనిషి భయపడుతుంటే లేనిదేవుడేమనుకోవాలి ?

అత్యంత స్వేచ్చకోసం అత్యంత క్రమశిక్షణ అవసరం అని ఒక మహనీయుడి ఉవాచ !

మనిషికి సాంకేతికత పెరిగిపోయి ఈ మంత్రాలు వద్దు అనుకుని ధ్యానం అని మొదలుపెట్టారు.
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస !

మీకు దేనిమీద ధ్యాస ఉంటే అదే మీకు దక్కుతుంది.

మహమ్మదీయులు,బ్రిటీషర్లు వ్యాపారం కోసం వచ్చారు.
వాళ్ళకు వ్యాపారం మీదే ధ్యాస ! మనకు ఆనందం మీదే ధ్యాస !

మీకూ ఆ ఆలోచనా శక్తి ఆ దేవుడివ్వాలని(మనిషే) కోరుకుంటున్నాను.

మీ ధ్యాస దేనిమీద ఉంటే అదే మీకు దక్కుతుంది.

మీ ధ్యాస దేవుడిమీద ఉంటే దేవుడు,
కత్రినా కైఫ్ మీద ఉంటే కత్రినా కైఫ్ దక్కుతుంది.

ఎవరు ఎవరిని పూజించాలి ?

వేదాలు అందరూ చదవలేరని తెలిసాక బ్రాహ్మణులే గొప్పవారని వర్ణాలలో ప్రధమ స్థానాన్ని ఇచ్చారు.

మనిషి మనసులో ఏది నాటితే అదే మహావృక్షమవుతుంది.

ఆ మహావృక్షాన్ని పెకిలించాలంటే ఒక్కరితో సాధ్యం కాదు.మనుషులలో సమిష్టి తత్వం లోపించితే వచ్చేది అసహనమే !

ధ్యానం అంటే పూజ,
పూజ అంటే ధ్యాస !

మన మీద మనకు ధ్యాస ఉంటే మనల్ని మనం ప్రేమించుకోగలుగుతాం !

మనల్ని మనం ప్రేమించుకున్నకొద్దీ ప్రతిదీ ప్రేమమయం గానే కనిపిస్తుంది.

ప్రేమ ఉన్నచోటే అసూయ ఉంటుంది.
అసూయ చెందుతున్నామని ఎవరికివారికి తెలుస్తూనే ఉంటుంది.

అసూయ ఫక్కున నవ్వితే పోతుంది కానీ నవ్వించేవారెవ్వరు ?

మనకు నచ్చినవారిని నవ్వించగలం కానీ నచ్చనివారిని నవ్వించడమెలా?

నవ్వడం కూడా ఆరోగ్యమే,
నవ్వించేవాడూ దేవుడే !

కాబట్టి మీరు ఏ పూజా చేయలేకపోయినా రోజూ మనస్పూర్తిగా నవ్వగలిగారంటే ఏ రోగాలూ మీ దరిచేరవు.
ఆనందో బ్రహ్మ :

మీ... సూర్య, మోహన్

Source - Whatsapp Message

మహిళల రక్షణకోసం రూపొందించిన చట్టాలు, ఐపీసీ సెక్షన్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ నేరానికి ఏ శిక్ష..?

మహిళల రక్షణకోసం రూపొందించిన చట్టాలు, ఐపీసీ సెక్షన్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ నేరానికి ఏ శిక్ష..?

సెక్షన్ 100 : ఆత్మరక్షణ కోసం ఎదుటి వారిపై దాడి చేస్తే తప్పు లేదు. ఆ సమయంలో సదరు వ్యక్తి చనిపోయినా మీకు శిక్ష పడదు.

166(బీ) : ఈ సెక్షన్ ప్రకారం బాధితురాలికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఇవ్వకపోతే సిబ్బంది, యాజమాన్యం మీద కేసు వేయవచ్చు.

228(ఏ) : అత్యాచారానికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు, ఫొటోలు ప్రచురించరాదు. అలా చేస్తే సదరు సంస్థపై చర్యలు తీసుకోవచ్చు.

354 : స్త్రీ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, అవమానపర్చినా, అనుమతి లేకుండా ఫొటో, వీడియో తీసినా ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయవచ్చు.

376 : 18 ఏళ్లలోపు ఉన్న యువతితో సెక్సులో పాల్గొంటే నేరం. ఒకవేళ ఆమె ఇష్ట ప్రకారమే చేసినా సదరు పురుషుడికి ఈ సెక్షన్ కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది.

376 : వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధిస్తే ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. దీని ప్రకారం సదరు వ్యక్తి జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

494 : భార్య ఉండగా మరొకరిని పెళ్లి చేసుకుంటే ఈ సెక్షన్ ప్రకారం సదరు వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది.

498(ఏ) : ఓ వివాహిత స్త్రీని ఆమె భర్తగానీ, భర్త బంధువులుగానీ శారీరకంగా, మానసికంగా హింసించినా, అందుకు ప్రేరేపించినా, ప్రోత్సహించినా ఈ సెక్షన్ కింద కేసు వేయవచ్చు. కనీసం మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కట్టాల్సి వస్తుంది.

509 : మహిళలతో అవమానంగా మాట్లాడినా, సైగలు చేసినా ఈ చట్టం ప్రకారం శిక్షకు అర్హులు.

294 : రోడ్డు మీద నడుస్తుంటే, బస్టాప్‌లో, ఇంకెక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యకరంగా పాటలు పాడుతూ ఎవరైనా ఇబ్బంది పెడితే ఈ సెక్షన్ ప్రకారం వారిపై కేసు నమోదు చేయవచ్చు. కనీసం మూడునెలలకు తగ్గకుండా వారికి జైలుశిక్ష పడుతుంది. లేదా జరిమానా కట్టాల్సి ఉంటుంది.

354 (డీ) : ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా వెక్కిరించినా, అనుకరించినా, వారిపై ఈ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నిందితులకు 3 నుంచి 5 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశముంది. మీరు పనిచేసే ప్రదేశాల్లో మీ తోటి ఉద్యోగులుగానీ, మీ బాస్‌గానీ సెక్స్‌కోసం ఇబ్బంది పెడితే 2013 వేధింపుల చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.

499 : ఫొటోలు మార్పింగ్ చేసి ఇబ్బందికరంగా ఇంటర్నెట్‌లో పెడుతున్న ఘటనలు ఈ మధ్య బాగా వెలుగుచూస్తున్నాయి. ఇలాంటివి మీకు ఎదురైతే ఈ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే సదరు వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది.

354(బీ) :మహిళను పై నున్న దుస్తులను బలవంతంగా తొలగిస్తే (compelling her to be naked) సంబంధిత ఆ వ్యక్తికి 3 నుంచి 7 ఏళ్ల దాకా శిక్షపడుతుంది. 13/2013 సవరణ చట్టం ద్వారా ఈ సెక్షన్ అదనంగా చేర్చారు.

354(సీ) : మహిళ లేదా విద్యార్థిని అనుమతి లేకుండా ఫొటోలు/వీడియోలు తీసి వాటిని ఇతరులకు పంపించినా (voyeurism) సంబంధిత వ్యక్తికి ఏడాది నుంచి 3 ఏళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. ఆ వ్యక్తి తిరిగి అదే నేరానికి పాల్పడితే 3 నుంచి 7 ఏళ్ల దాకా శిక్షతో పాటు జరిమానా విధిస్తారు.

373 : 18 ఏళ్ల మైనర్ బాలికను కొనుగోలు చేస్తే పదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తారు.

316 : నిండు గర్భవతిని చంపితే సంబంధిత వ్యక్తిపై ప్రాణహరణం కింద (cvpable homicide) నేరం మోపుతారు. ఆమె మరణించడానికి బదులుగా గర్భంలోని శిశువు (quick unbron child) మృతిచెందితే ఈ సెక్షన్ కింద 10 ఏళ్ల దాకా జైలుశిక్ష పడుతుంది.

376(బీ): ఒకరికన్నా ఎక్కువ మంది మహిళపై లైంగికదాడి చేస్తే, ఒక్కొక్కరికీ 20 ఏళ్లు తగ్గకుండా జీవితఖైదు శిక్ష విధించబడుతుంది. 13/2013 సవరణ చట్టం ద్వారా ఈ సెక్షన్ సవరించారు.

366(ఏ) : మైనర్ బాలికను వ్యభిచారానికి ప్రోత్సహించినా, ప్రలోభ పెట్టినా పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు.

*366 : స్త్రీలు, బాలికలను బలవంతంగా ఎత్తు కెళ్లి పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా పడుతుంది.

Source - Whatsapp Message

మన జీవితంలో ఉన్న ప్రతీ బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే

🍁 మనమందరము తెలుసుకోవలసిన విషయం🍁

✍️ మురళీ మోహన్

🤔మనిషి ఎల్లప్పుడూ ఒంటరిగా కాకుండా ఒక సొంత కుటుంబాన్ని ఏర్పరచుకొని జీవనం సాగిస్తాడు. తన కుటుంబంతో జీవనం సాగించడానికి ఒక ఇంటిని కట్టి దానినే దేవాలయం గా భావిస్తారు.

" ఇంటి పేరు అనురాగం ముద్దుపేరు మమకారం మా ఇల్లే బృందావనం "
అంటూ ప్రతీ వారి లాగానే మనం కూడా, మా ఇల్లు కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటాం.

కానీ నేడు మన బృందావనం బీటలు వారి చివరికి మమకారం తగ్గి అహంకారంతో రగిలి అతలాకుతలం అయ్యింది.

ఆలోచిస్తే ఒకే ఇంట్లో పెరిగినవాళ్ళం, ఒకే బడిలో చదివినవాళ్ళం, ఒకే ఊళ్ళో తిరిగినవాళ్ళం .... కానీ మన వయస్సు పెరుగుతున్న కొద్దీ పెద్దల ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి.

దీనికి కారణం మారుతున్న కాలంతో పాటు, రోజురోజుకి మనిషిలో పెరుగుతున్న స్వార్ధం. ఎందుకంటే మన చిన్నతనంలో
"కలసి ఉంటే కలదు సుఖం" అని చెప్పేవారు,
కానీ నేడు " కలసి కలహించుకోవడం కన్నా
విడిపోయి సంతోషంగా
ఉండటం మేలు".
అంటున్నారు.

ఇది భౌతిక , కుటుంబ ఎడబాటు అయితే అంత ఇబ్బందేమీలేదు. కాని
చిన్నతనంలో ఉన్న కుటుంబాలని నేటి కుటుంబాలతో పోల్చి చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది.

"వెన్నలాంటి రాత్రులలో చందమామ మిస్ అవ్వలేదు కానీ చందమామ కధలు చెప్పేవారు మిస్ అయ్యారు.

ఎండా కాలంలో వేసవి సెలవులు మిస్ అవ్వలేదు కానీ ఆ వేసవి సెలవుల్లో ఇంటిల్లిపాదినీ ఒక దగ్గర చేర్చే పెద్ద దిక్కు మిస్ అయ్యారు.

ప్రతి సంవత్సరం వచ్ఛే పండగలు మిస్ అవ్వలేదు కానీ ఏ పండగ నాడు
ఏ తీపి వంటకం వండాలో చెప్పే మనిషి మాత్రం మిస్ అయ్యారు".

దీనికి కారణం నేటి తరానికి కధలు చెప్పడానికి ట్యాబ్లు, యూ ట్యూబ్లు ఉన్నాయి. అదే వేసవి సెలవులు వస్తే సమ్మర్ కోర్సులు, క్రాష్ కోర్సులు ఉన్నాయి. అలాగే పండగలు వస్తే తినడానికి రెస్టారెంట్స్, తిరగడానికి షాపింగ్ మాల్స్ ఉన్నాయి.

అందుకే నేటి తరానికి అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు అవసరం లేదు. అందుకే మన భారత దేశంలో కూడా ఉమ్మడి కుటుంబాలు శాతం తగ్గుముఖం పడుతుండగా చిన్న కుటుంబాల శాతం పెరుగుతూ ఉంది.

నేటి తరానికి ఏదైనా అవసరం అనుకుంటే వాళ్ళని ఒక క్రాష్ కోర్సులో జాయిన్ చేస్తారు.ఇలా చివరికి వ్యక్తిత్వ వికాసం కూడా కోర్సుల్లో జాయిన్ అయి నేర్చుకుందుకు ప్రయత్నిస్తారు..

వాళ్ళు వృత్తిలో రాణించడానికి పాఠాలు చెప్పగలరేమో గాని జీవితానికి కావాల్సిన నైతిక విలువలు, సాంప్రదాయాలు, ప్రేమాభిమానాలు మాత్రం నేర్పించలేరని తెలియడం లేదు.

ఒక అర్ధ శాస్త్రవేత్త చెప్పిన
మాటను గుర్తుచేస్తాను

" All human relations are commercial relations"

అంటే

" మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార బంధాలే".

ఏమో కొంత మందిని చూస్తూంటే ఈ మాట నిజమనిపిస్తుంది. నేటి సమాజంలో మనిషి బంధాలను ప్రేమతో కాక డబ్బుతో ముడి వేస్తున్నారు. ఎక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందో ఆ బంధాలు దృఢంగా ఉంటాయి.

ప్రేమ, అభిమానాలు వ్యక్త పరచడానికి ఇచ్చిపుచ్చుకోవడమనేది ఒక పద్ధతి. అంతే కానీ పుచ్చుకొనే ధోరణితో బంధాలు ఏర్పడితే అవి ఎక్కువ కాలం నిలబడవు.

ప్రేమకు ప్రాధాన్యత ఉన్నచోట డబ్బు ఉంటుంది.కానీ డబ్బుకి ప్రాధాన్యత ఉన్నచోట మాత్రం ప్రేమ నిలబడదు.

కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం.

" ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం కానీ,మన కోసం కన్నీళ్లు కార్చే మనిషిని మాత్రం కొనలేం "

ఈ మాటలు నిజం .
నేను చెప్పడం కాదు
యాపిల్ కంపినీ సృష్టి కర్త,
తన ఆఖరి రోజులలో డైరీలో రాసుకున్న మాటలివి.


"Relationships never dies with natural death, but these relationships are always murdered with EGO, IGNORANCE and SELFISHNESS".

అందుకే మన జీవితంలో
ఉన్న ప్రతీ బంధాన్ని నిలబెట్టుకోవాలి.
ఎందుకంటే "

When you say sorry to someone, It means that you are not wrong and other one is right. But it means that you have given importance to relationship more than 'EGO'.
Let's have a smooth relationships.🙏

Source - Whatsapp Message

మంచి మాటలు

ఆత్మీయ బంధుమిత్రులకు మార్గశిర గురువారపు ఉషోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు పూజ్య గురుదేవుల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో ఆనందంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు బాధలు మిగిల్చిన 2020 కొద్దీ గంటలలో ముగిసిపోతుంది ,ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్న ప్రతి ఒక్కరి జీవితంలో మన తెలుగు ఉగాది స్థానంలో ఆంగ్ల సంవత్సరాది ఒక భాగమైపోయింది ...
గురువారం --: 31-12-2020 :--
నేటి AVB మంచి మాటలు
సంవత్సరం లో పడిన బాధలు , కష్టాలు అన్ని పోయి రాబోయే కొత్త సంవత్సరంలో మీ జీవితం ఆనందాల హరివిల్లు కావాలనీ మీరు మీ కుటుంబసభ్యులందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ 365 రోజులు గడిచిపోవటానికి ఇంకా ఒక్కరోజే ఉన్నది . ఈ సంవత్సరం పూర్తిగా అంతమైపోవటానికి ఇంకా కొద్ది సమయమే ఉంది , ఈ సంవత్సరం నీవు సంతోషంగా గడిచిపోవాలంటే నీ పట్ల ఎవరైనా తప్పు చేసినట్లేతే మంచి మనసుతో వారిని క్షమించు ఎవ్వరి పట్ల కోపం ఉంచుకోవద్దు . మనం కూడా ఎప్పుడైనాఎవరో ఒకరికి ఇబ్బంది కలిగించిఉంటాము ,వారికీ క్షమాపణ చెపుదాము దయచేసి నన్ను కూడా మీరు క్షమించ గలరు ఎవరినైనా ఎప్పుడైనా ఇబ్బందులు పెట్టినట్లయితే

మిత్రమా ! ఈ రోజుల్లో ఎవరికీ ఎవరు
శాశ్వతం కాదు ఉన్న కొద్దీ రోజులు నవ్వుతు నవ్విస్తూ ఉండాలి .

మనం
మృతి చెందుతే ప్రాణం పైకి పోతుంది . మన దేహం కిందికి పోతుంది కానీ ! పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది ప్రాణాన్ని దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరుని కాపాడుకోవడం గొప్ప .

లక్షలు ఉన్నవాళ్లకోసం కాదు మంచి లక్షణాలు ఉన్నవాళ్లకోసం వెంట పడండి లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ మంచిలక్షణాలు ఉన్నవాళ్లను కొల్పేతే తిరిగి సంపాదించుకోలేం

ఇది
వద్దు అది నా దగ్గర లేదు అన్ని ఈ రెండూ చెప్పి చూడండి మన వాళ్ళు అయినా మనతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది .

ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో మన
ఆహ్వానం లేకుండా కనిపించని కొత్త శత్రువులు వచ్చి కూర్చున్నారు కరోనా రూపంలో ,కొత్త సంవత్సరములో అన్నా వాటిని సమైక్యంగా పారదోలుదాం

ఆపద సమయములో చాలా మంది తమ మంచి మనసుతో సమైక్యంగా ఎందరినో అదుకు న్నారు వారందరికీ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములు ,ఇదే సమైక్య భావన ఇకముందు కూడా కొనసాగిద్దాం

సేకరణ ✒️
మీ ...AVB సుబ్బారావు 💐🤝🌷🕉️🙏

Source - Whatsapp Message

కరోన వచ్చాక రైతులు చేసుకునే ప్రతి పండగ వెనకాల ఉన్న భారతీయ శాస్త్ర విజ్ఞానం విలువ బయటిదేశాల సిటీ మేధావులకు తెలిసివచ్చింది.

🙏🌱రైతులు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సమయం వృధా చేయకుండా రైతులు ఉపయోగించే కార్తెల గొప్పతనం వచ్చే తరానికి తెలిసేలా ప్రయత్నం చేయండి.
🙏🌞🌎నాసా (NASA) రాకముందే నవ గ్రహాలు తెలుసు , 7 వారాలు, 6 ఋతువులు, 12 మాసములు ( నెలలు) , 2 పక్షములు, 15 తిథిలు, 12 రాశులు, 27 నక్షత్రములు, 8 దిక్కులు, 4 యుగములు, ☀️ఉత్తరాయణం: సూర్యుడు మకరరాశి , ☀️దక్షిణాయనం: సూర్యుడు కర్కాటక రాశి , 60 సంవత్సరాలు పేర్ల కాలమాన చక్రం , తెలుగు అంకెలు 123... హిందు సంఖ్యమనం , దశాంశ పద్ధతి 0.0001...4 వేదాలు, 108 ఉపనిషత్తులు వచ్చే తరాలకు , యువ రైతులకు చెప్పాల్సిన అవసరం వచ్చింది.
🙏ఇంగ్లీష్ హాస్పిటల్స్ రాకముందే ఆయుర్వేదం ఉంది.
🙏 జిమ్ లు రాకముందే వ్యాయంశాల మన దగ్గర ఉన్నాయి.
🙏 యూరియా రాకముందు రోగాలు లేని వ్యవసాయం చేశాం.
🙏 మానసిక వ్యాధులకు ఇంగ్లీష్ మందులు రాకముందే యోగ, పూజ , భజన తో treatment చేసేవాళ్ళము.🙏 కరోన వచ్చాక C,D విటమిన్లు తీసుకోండి రోగనిరోధక శక్తి , ఆక్సీజన్ పెంచుకోండి అంటూ ఇంగ్లీష్ డాక్టర్లు చెపుతున్నారు. సంధ్య వందనం తో D విటమిన్ తో పాటు మానసిక పునరుత్తేజానికి ప్రకృతిని ఆరాదిస్తున్నాం. ఆక్సిజన్ ఇచ్చే తులసీ మొక్కకు దీపం పెట్టడం తో మానసికంగా రోగనిరోధక వ్యవస్థని ఉత్తేజం చేస్తున్నాం.
🙏ములికలతో అగ్నిహోత్రం చేస్తూ గాలి నుంచి వచ్చే వ్యాధులకు అడ్డుకట్ట వేస్తున్నాం.
🙏autopathy కి నోబెల్ prize అంటే చప్పట్లు కొట్టం కానీ పండగ పేరుతో సంవత్సరం కి కనీసం 24 సార్లు ఏకాదశి పేరుతో వ్రతం పేరుతో ఉపవాసం చేస్తున్నాం C విటమిన్ నిమ్మరసం తాగుతున్నాం.
🙏 ఆక్సిజన్ కోసం ఊపితిత్తుల కోసం ప్రాణయమం చేస్తున్నాం. శారీరక రోగనిరోధక శక్తి కోసం సూర్య నామస్కర్ , కుస్తీ, నియుద్ద , కబడ్డీ లాంటి ఆటలు నేర్చుకున్నాం.
🙏పరమాణు పరిశోధన కోసం నటరాజ రూపాన్ని పరిశోధన చేస్తున్నారు, పతంజలి మహర్షి విగ్రహాన్ని ఆస్ట్రేలియా లో పెట్టుకున్నారు .1920 నుంచే జర్మనీ పిల్లలకు సంస్కృతం నేర్పిస్తున్నారు. 😄🙏2019 వరకు అందరూ మేధావులే కరోన వచ్చాక మన జ్ఞానం ఎక్కడ ఉందో రైతులకు , మిగతా జనాలకు తెలిసివచ్చాయి 🙏🌱
🙏🙏 టూత్ పేస్ట్ , దవడ కింద పిజ్జా, నోట్లో కూల్ డ్రింక్స్ , ప్యాకెట్ ఫుడ్ ఇలా ప్రతి చెత్త తినే సిటీ ఇంగ్లీష్ మేధావులకు ఏమి తెలియదని ఎతులు ఎక్కువ మ్యాటర్ తక్కువని కరోన వస్తే కానీ మనకు తెలియలేదు 😄😄😄 పౌడర్ , సబ్బు లు కాన్సర్ కారకాలు అని ఈ మధ్యనే తెలిసింది.
🙏 మీ పేస్ట్ లో ఉప్పు ఉందా, బొగ్గు ఉందా , వేప లవంగం ఉందా అంటారు కానీ పేస్ట్ ప్రమాదం అని వాడు చెప్పాడు మనం తెలుసుకొము. 😄
🤣మన సదువులు ఒకడు చెప్పింది వినడానికి కానీ ఆలోచించి మారడానికి కాదేమో బానిసత్వం ఇంకా పోలేదేమో 😄😄
😄🙏కరోన వచ్చాక రైతులు చేసుకునే ప్రతి పండగ వెనకాల ఉన్న భారతీయ శాస్త్ర విజ్ఞానం విలువ బయటిదేశాల సిటీ మేధావులకు తెలిసివచ్చింది. అందుకే మనకన్నా ఎక్కువ యోగ, అగ్నిహోత్రం, సంస్కృత భాష , ఆయుర్వేదం, భగవత్ గీత, indian clubs, hindu push ups నేర్చుకుంటున్నారు 🙏🙏

Source - Whatsapp Message

కుటుంబ జీవనానికి ఆద్యం మన భారతీయం. మూలాలకు తరలి వెళదాం

అందర్నీ ఆలోచింపచేసే ఒక చిన్న కథ.
"నాన్నగారు! చదువుకున్న నేను ఉద్యోగం చెయ్యకూడదా? అమ్మ కూడా పెద్ద చదువులు చదివింది, అయినా మీరు ఉద్యోగం చెయ్యనివ్వలేదు. పెద్దవదినని కూడా ఉద్యోగం మాన్పించారు... ఎందుకని నాన్నా... " నిలదీస్తున్నట్లుగా ప్రశ్నించింది వైష్ణవి.

"బంగారూ..." కూతుర్ని ప్రేమగా అలానే పిలుస్తారు చంద్రశేఖరం గారు...

"ఇప్పుడు నీకు వచ్చిన సందేహమే పాతికేళ్ల కిందట మీ అమ్మకు, నాలుగేళ్ళ కిందట మీ పెద్ద వదినకు వచ్చింది. కానీ నా పెద్దరికానికి విలువనిస్తూ, మీ అన్నయ్యతో సహా అందరూ ఎదురు ప్రశ్నించలేదు. ఇప్పుడు అందరికీ ఒకేసారి వివరంగా చెప్తాను... ఇలా వచ్చి కూర్చోండి." అన్నారు చంద్రశేఖరం గారు.

విషయం గంభీరమైనదిగా అనిపించి కొడుకులు ఇద్దరూ గోపాల కృష్ణ, వంశీకృష్ణ చేస్తున్న పని అక్కడికి ఆపుజేసి వచ్చి తండ్రి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. భార్య శైలజ, పెద్దకోడలు సుహాసిని ఎదురుగా చాప పరుచుకుని కూర్చున్నారు. వైష్ణవి నాన్న కూచి. తండ్రి వడిలో తలపెట్టి కూర్చున్నది. కూతురి తల నిమురుతూ చెప్పడం ప్రారంభించారు చంద్రశేఖరం గారు.

"మా నాన్నగారు నాకు 16, మీ అమ్మకు 12 సంవత్సరాల వయసు రాగానే పెళ్లి చేశారు. అప్పటికి బాల్యవివాహాల నిషేధం ఉంది. అయినప్పటికీ వృద్ధులైన మా తాతా బామ్మల కోర్కె తీర్చడానికి మాకు పెళ్లి చేసేశారు. అయితే నా చదువు పూర్తయి, ఉద్యోగం సంపాదించేవరకు , మీ అమ్మ వాళ్ళింట్లోనే ఉండటానికి, తనకు కూడా నచ్చినట్లు చదువుకోవడానికి , ఆతర్వాతనే కాపురానికి పంపడానికి రెండువైపుల పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. నా అదృష్టమో, దైవబలమో 23 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసింది. ఉన్న ఊళ్ళోనే ఉండే అవకాశం కలిగింది. అప్పటికి మీ అమ్మ ఇంకా డిగ్రీ చదువులోనే ఉంది. ఇంకా చదువుకుంటానని ఆశ పడింది. సరే అన్నాను. ఒక పి.జి. పూర్తిచేసింది. ఈలోగా గోపాలకృష్ణ, వంశీకృష్ణ పుట్టేరు. పిల్లల ఆలనపాలనలో చదువు సాగలేదు. ఇంతలో బంగారుతల్లి పుట్టింది. వీళ్ళు ముగ్గురు చదువుల్లో పడేసరికి మళ్ళీ మీ అమ్మకు చదువుపై ధ్యాస మళ్లింది. వొద్దనలేదు నేను. మరొక పి.జి. చేసింది. అప్పుడు ఉద్యోగం చెయ్యాలనే ఆలోచన నాకు చెప్పింది. మన కుటుంబ పోషణకు నా జీతం సరిపోతోంది. నువ్వు ఉద్యోగం చేస్తే, ఇంట్లో నేను ఎంత సహాయం చేసినా కూడా ఒత్తిడితో సతమతమౌతావు. అంతే కాక నీవు చేసే ఉద్యోగం నీకు కాలక్షేపం మాత్రమే... మన చదువు విజ్ఞానాన్ని ఇవ్వాలి కానీ మరొకరి భవిష్యత్తును కాలరాసేది గా ఉండకూడదు, మరొకరి జీవనోపాధిని మనం అడ్డుకోకూడదు అని చెప్పేను.

మీ అందరికి గుర్తుండే ఉంటుంది... మీ అమ్మ ఇంట్లో ఉండి, మీకు బోధించిన జ్ఞానం వలన మీ చదువుల్లో మీకు వచ్చిన బహుమతులు, స్కాలర్షిప్పులు ... మీరు ట్యూషన్ ఎక్కడ చదువుతున్నారని అందరూ అడగడం... మా అమ్మ దగ్గర అని మీరందరు గర్వంగా చెప్పడం..."

కాసేపు చెప్పడం ఆపి పిల్లల వైపు చూసారు. అందరూ తల ఊచారు.

"చదువు జ్ఞాన సముపార్జనకే కానీ ఉద్యోగం చేయడానికి కాదు. మన ఇంట్లో ఉన్న అందరూ ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేదు కదా... ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. అవసరానికి మించి ధన సంపాదన చేయాల్సిన పని లేదు"

"నాన్నా! మీ మాటలకు అడ్డువస్తున్నాను అనుకోకండి. స్త్రీకి ఆర్ధిక స్వాతంత్య్రం, స్వేచ్ఛ లేకుండా కట్టడి చేయడం కాదా ఇది?" ప్రశ్నించింది వైష్ణవి.

"శైలజా, నీకు మీ పుట్టింటివారు ఇచ్చిన నగలు, ధనం, నాకు కట్నం పేరుతో ఇచ్చిన డబ్బు ఎక్కడ ఉన్నాయి?"

" నా దగ్గర బీరువాలో కొన్ని, లాకర్ లోకొన్ని నగలు, బాంక్ లో డబ్బు, మీకు ఇచ్చిన కట్నం డబ్బులు కూడా నా పేరునే వేశారు కదా... మా నాన్న ఇచ్చిన భూమి కూడా నా పేరునే ఉంది" అన్నది శైలజ.

"అమ్మా సుహాసిని, నీ సంగతి?"

"నా డబ్బు, నగలు అన్ని నా దగ్గరే ఉన్నాయి మామగారు"

"వైష్ణవి, నీకు చేయించిన నగలు, నీకు మీ అన్నలు, అమ్మ, నేను ఇస్తున్న డబ్బు ఎక్కడ ఉన్నాయి?"

"నా దగ్గరే, బాంక్ లో డబ్బులు ఉన్నాయి"

"మీకెవరికైనా భావ వ్యక్తీకరణ లో కానీ, చదువు సంధ్యలలో కానీ, ఏ పని చేయడానికైనా కానీ షరతులు, కట్టుబాట్లు ఉన్నాయా?"

"లేవు"

"అంటే మనింటికి సంబంధించినంత వరకు స్త్రీధనం, స్త్రీస్వేచ్ఛకు భంగం లేనట్లే కదా" నవ్వుతూ అడిగారు చంద్రశేఖరం గారు.

"చూడమ్మా... మన ఇంట్లో పురుషాధిక్యత కానీ, స్త్రీ అణచివేత కానీ ఉండదు. స్త్రీ భావి తరాలకు ఆరోగ్యమైన సంతానాన్ని అందించాలి. అది మగవారిగా మాకు చేతకాని పని. సాధ్యమైనంత వరకు శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండి, వేళకు తింటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటే చక్కని బిడ్డలు కలుగుతారు. ఇంట్లో పనులు చేసుకుంటూ, తనవాళ్ళు వచ్చేసరికి ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే, బయటనుంచి వచ్చేవారికి, ఇంట్లో ఉన్నవారికి కూడా సంతోషంగా ఉంటుంది. అప్పుడే బంధాలు బాగుంటాయి.

పగలంతా ఉద్యోగం పేరుతో ఇద్దరు అలసిపోయి వచ్చి, ఒకరి మీద ఒకరు విసుక్కుంటు, ఏదో తప్పనిసరిగా ఇంత ఉడకేసుకుని తినగానే అలసిన శరీరాలు యాత్రికంగా విశ్రాంతి కోరుకొని, మళ్ళీ ఉదయం నుండి ఉరుకులు పరుగులు, తీరా పిల్లల్ని కనే సమయానికి సెలవు దొరక్క వత్తిడి, తీరా పిల్లలు పుట్టాక వాళ్ళని సరిగ్గా పెంచే తీరిక లేక, ఆయాలకు, బేబీ కేర్ సెంటర్ కు అప్పగించడం, కాస్త పెద్దవగానే హాస్టల్ లో వెయ్యడం, మేము ముసలి అవగానే వృద్ధాశ్రమానికి వెళ్లడం... అవసరం అంటావా?"

అందని దూరాలకు పరుగులెత్తి, అందే ఆనందాల్ని, అనుబంధాల్ని దూరం చేసుకోవడం ఎందుకు తల్లి? సమాజం మారాలంటే మార్పు మనతోనే మొదలు పెడదాం. ఆరోగ్యకరమైన జాతిని అందిద్దాం. ఇదే నా ఉద్దేశ్యం" ముగించారు చంద్రశేఖరం గారు.

"మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు వాస్తవం మామయ్యగారు. చదువుకుని, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే నన్ను ఉద్యోగం మాన్పించినందుకు మొదట్లో కోపం వచ్చినా, మీరు, అత్తయ్యగారు, మిగతా కుటుంబసభ్యులు నన్ను ఆదరించిన తీరు, నన్ను ఆలోచింపజేశాయి. ముఖ్యంగా మన కుటుంబాలలో ఇద్దరూ ఉద్యోగస్టులవడం వలన బంధువులను పెళ్లిళ్లలో , అదికూడా మొక్కుబడిగా మాత్రమే కలవగలుగుతున్నాం. ఇప్పుడు ఇంట్లో ఉన్న మేము మన గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు, మన కుటుంబాలలో ఉన్న మిగతా సభ్యులతో తరచుగా తీరిగ్గా మాట్లాడుకుంటున్నాం. ముక్కు మొహం తెలియని సామాజిక అనుసంధాన వేదికల కంటే మన కుటుంబ, బంధువర్గమే పెద్దది, శ్రేయోదాయకమైనది అని అర్ధమైంది. వంటలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఎన్నో కొత్తవిషయాలు గూగుల్ అవసరం లేకుండానే తెలుస్తున్నాయి. మీ విశాలమైన ఆలోచన నాకు చాలా నచ్చింది. ఇది నాకే కాదు మరో మూడునెలల్లో మన కుటుంబం లోకి రాబోయే నా బిడ్డకి కూడా నేను నేర్పుతాను" అంది సుహాసిని.

"చాలా సంతోషం సుహాసిని, పిల్లలూ.. మీరేమంటారు..."

"నాన్నగారు, నేను కూడా మీరు పదవీవిరమణ చేసేవరకు ఉద్యోగం మానేస్తాను" అన్నాడు వంశీకృష్ణ...

"చిన్నన్నా... నువ్వు చేసే ఉద్యోగం మానేసేది కాదు... పదిమందికి భుక్తి పెట్టే వ్యవసాయం.. నీ పరిశోధనలు నువ్వు చేస్తూ, మరిన్ని ఎక్కువ పంటలు నిచ్చే సేంద్రీయపద్దతులు కనిపెట్టు..." అన్నది వైష్ణవి

"అంతేనంటావా.. "

"నాన్నగారు మీ ఈ విలువైన ఉపన్యాసం మా వరకే పరిమితం కాకూడదు. మీరు అనుమతిస్తే మన కుటుంబాలలో అందరికి పంపిస్తాను. సాంకేతికత మేలును కూడా చేస్తుందిగా" అన్నాడు వంశీకృష్ణ...
ఆడవాళ్ళని ఉద్యోగం చెయ్యనివ్వడం లేదని నన్ను ఆడిపోసుకునే మన కుటుంబంలో ని ఇతరులకు కూడా నా ఉద్దేశ్యం అర్ధమవుతుంది. నావి కుత్సిత, సంకుచిత భావాలు కావని వాళ్ళు కూడా తెలుసుకుంటారు."

కుటుంబ జీవనానికి ఆద్యం మన భారతీయం. మూలాలకు తరలి వెళదాం*👏👏

Source - Whatsapp Message

ఫ్రెండ్ వల్ల నేను బాధ పడ్డాను. నన్ను అలా బాధ పెట్టడం అతని తప్పు కాదా?

♻️ ప్రశ్న : ఒక్కొక్కసారి నాకు ఏ కారణం లేకుండా దుఃఖం వస్తుంది ఎందువల్ల?

🔆 జవాబు: ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే ఒకరి దుఃఖం ఇతరులకు అంటూకోగలదు. దుఃఖంతో ఉన్న వారి ఆరా లోపల నిలబడితే ఆ వ్యక్తి డిప్రెషన్ అనుకోకుండా మీకు అంటుకునే ప్రమాదం ఉన్నది. నిష్కారణంగా మీకు దుఃఖం అనిపించినప్పుడు మీ ఆరాను శుభ్రం చేసుకోవడం నేర్చుకొండి. ! శక్తివంతమైన బంగారు కాంతి మీ ఆరా లోకి ప్రవహిస్తున్నట్లు ఊహించుకొండి. ఆ బంగారు కాంతి మీ ఆరా లోని గ్రే రంగు నెగిటివ్ కాంతిని బయటికి ఎండలోకి పంపిస్తున్నట్లు ఆ ఎండలో ఆ గ్రే రంగు నెగిటివిటీ నాశనమై పోతున్నట్లు మీరు ఊహించండి.
🧧 మీరు నలుగురి మధ్య ఉన్నప్పుడు బంగారు తెల్లని కాంతి మీ చుట్టూ రక్షణ కవచంలా ఉన్నట్లు ఫీల్ అవండి. ఆ రక్షణ కవచాన్ని ధరించండి.

🧲 ప్రశ్న: నాకు చేతబడి లాంటిది జరిగిందని అనిపిస్తే నేనేం చేయాలి?

🌴 జవాబు: పైన చెప్పిన విధంగానే చేయండి.మీ ఆరాను శుభ్రపరుచుకోండి. రక్షణ కవచాన్ని మీ చుట్టూ ఏర్పరచుకోండి. మీ చుట్టూ ఉన్న ఆరా బుడగ పరావర్తనం చేస్తుందని భావించండి. మీ మీదికి ఏ చెడు ప్రభావం అయితే పంపబడిందో ఆ ప్రభావాన్ని తిప్పి కొడుతుంది. కనుక పంపిన వాళ్ల దగ్గరికే ఆ చెడు తిరిగి వస్తుంది. దాని వల్ల మీ దగ్గరికి చెడును పంపిన వాళ్లు తాము చెడును పొందుతారు. మీ దగ్గరికి తమ ప్రేమను పంపిన వారు తాము కూడా ప్రేమను పొందుతారు.
♨️ నెగిటివిటీ ని గురించి మీరు ఆలోచించి మీ వంతుగా దానికి మరింత నెగిటివిటీ ని శక్తివంతం చేయకండి. ఆ నెగిటివిటీ కి మీరు దూరంగా ఉండండి అంటే పట్టించుకోకుండా వైరాగ్యం గా ఉండండి. మీ వైపు వచ్చే నెగిటివిటీ నుండి మిమ్మల్ని కాపాడమని మీ మార్గదర్శకులను ఆర్క్ ఏంజిల్ మైకేల్ ను అడగండి!

🔺 ప్రశ్న :నా బాయ్ ఫ్రెండ్ వల్ల నేను బాధ పడ్డాను. నన్ను అలా బాధ పెట్టడం అతని తప్పు కాదా?

🕉️ జవాబు: మీ సంతోషానికి మీరు మాత్రమే కారకులు! వేరే ఎవ్వరూ కాదు! దీనిని ఒక బాధ్యత వహించడం అంటారు. ఆత్మ పరిపక్వం కావడానికి అది గుర్తు! ఇతరుల పనుల ప్రభావం మొదట్లో మీ మీద పడవచ్చు. మీరు విషయాలకు దూరంగా ఉండే కొద్ది మీ ఎమోషన్స్ ను మీరు కంట్రోల్ చేసుకునే కొద్ది ఎదుటి వారి చర్యలకు ప్రతిస్పందించకుండా ఉండటం మీరు నేర్చుకుంటారు. వాళ్ల నెగిటివ్ పనులు మీకు పిల్ల తరహా గానూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినట్లు అర్థమవుతాయి. మీలోనే మీరు అంతర్ ఆనందాన్ని ఆత్మస్థైర్యాన్ని భేషరతు ప్రేమను సృష్టించుకోవడం, నేర్చుకోవడం మొదలు పెడతారు.
💊 ఇప్పుడు ఇక వాళ్ల వల్ల మీకు ఎలాంటి హాని జరగదు. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరు. అప్పుడు మీరు సంతోషంగా ఉండాలని. దుఃఖంగా ఉండాలనో డిప్రెషన్ లో ఉండాలనో ఎంచుకుంటారు. మీరు ఎలా కోరుకుంటే అలా జీవితంలో ఉండగలుగుతారు. మీ కంట్రోల్ లో మీరు ఉంటారు. ఇతరులను ఎప్పుడు కూడా తప్పు పట్టకండి. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మీరే నేర్చుకునే పాఠాలకు బాధ్యత వహిస్తారు.మీరు ఎలా ఫీల్ అయ్యే విధంగా ఉండాలంటే అలా ఉంటారు.


💐💐💐💐💐💐💐💐💐

Source - Whatsapp Message

హిందువు కావడానికి హిందువుగా బ్రతకాడానికి 101 కారణాలు

హిందువు కావడానికి
హిందువుగా బ్రతకాడానికి 101 కారణాలు


1. నేను హిందువుని, ఎందుకంటే భగవంతుడిని గ్రహించడం జీవిత గమ్యం అని నాకు చెబుతుంది.
2. హిందూ ధర్మం నేనే ఆత్మ అని నేర్పుతున్నాను, శరీరం కాదు అని చెప్తుంది.
3. హిందూ ధర్మం నాకు నచ్చిన ఏ పేరు లోనో మరియు ఏ రూపంలోనైనా దేవుణ్ణి ఆరాధించడానికి సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తుంది.
4. హిందూ ధర్మం, దేవుడు బయట మాత్రమే కాదు, నాలో కూడా ఉన్నాడు అని చెప్తుంది.
5. సత్యం మాత్రమే విజయం సాధిస్తుందని హిందూ ధర్మం బోధిస్తుంది.
6. సాధువులు మరియు ఋషులు దేవుని ప్రేమ మరియు దయకు జీవన రుజువులు.
7. నిస్వార్థ సేవ అత్యున్నత కర్తవ్యం అని హిందూ ధర్మం బోధిస్తుంది.
8. నా స్వంత నిజమైన ఆత్మ తత్వాన్ని కనుగొనటానికి హిందూ ధర్మం నాకు సహాయపడుతుంది.
9. హిందూ ధర్మం మనలో ఇప్పటికే ఉన్న దైవత్వం యొక్క అభివ్యక్తిగా భావిస్తుంది.
10.శరీరం యొక్క అశాశ్వతతను చూడటానికి హిందూ ధర్మం నాకు సహాయపడుతుంది.
11. హిందూ ధర్మం నాకు అనువైన విధంగా దేవుణ్ణి పూజించే స్వేచ్ఛను ఇస్తుంది.
12. సర్వజ్ఞుడైన భగవంతుడిని చేరుకోవడానికి ఒక్క మార్గం మాత్రమే లేదని హిందూ ధర్మం అంగీకరించింది.
13. జీవితంలోని వివిధ దశలను జరుపుకోవడానికి హిందూ ధర్మం నాకు మార్గనిర్దేశం చేస్తుంది.
14. హిందూ ఋషులు మరియు భక్తుల కథలు చదవడం నాలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.
15. హిందూ ధర్మం ఆలోచన మరియు హేతుబద్ధీకరణను ప్రోత్సహిస్తుంది.
16. హిందూ పండుగలు అందరికీ ఆనందకరమైన కార్యకలాపాలను అందిస్తాయి.
17. హిందూ ధర్మం ఆరోగ్యకరమైన సాధారణ ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది.
18. నేర్చుకున్నవారిని, జ్ఞానులను గౌరవించమని హిందూ ధర్మం నాకు బోధిస్తుంది.
19. ప్రాచీన హిందూ దేవాలయాలు నా పూర్వీకుల విస్మయం మరియు ఆశ్చర్యాన్ని చూపిస్తాయి.
20. దేవుని సృష్టిని సేవించడం ద్వారా నేను దేవుణ్ణి ఆరాధించగలను.
21. శరీరం మరియు మనస్సు ఆరోగ్యంగా ఉండటానికి యోగా సహాయపడుతుంది.
22. ధ్యానం మనస్సును శాంతపరుస్తుంది మరియు అంతర్గత శాంతిని ఇస్తుంది.
23. నా శరీరంపై పూర్తి నియంత్రణ సాధించడానికి యోగాసనాలు నాకు సహాయపడతాయి.
24. వేద మంత్రాల శ్లోకం అంతర్గతంగా మరియు బాహ్యంగా సానుకూల ప్రకంపనలను సృష్టిస్తుంది.
25. హిందూ ధర్మం చిన్నది లేదా పెద్దది అనే తేడా లేకుండా జీవులను మన స్వంతంగా సేవ చేయడానికి బోధిస్తుంది.
26. అన్ని జీవులలో మానవులే గొప్పవారని హిందూ ధర్మం చూపిస్తుంది.
27. ఏ పని లౌకిక కాదు కానీ ప్రతి పని ఆధ్యాత్మిక క్రమశిక్షణ కావచ్చు.
28. జయించడం అంటే త్యజించడం.
29. అత్యధిక లాభం స్వీయ నియంత్రణ సాధించడం.
30. హిందూ ధర్మం ఎవరిపైనా దేనినీ బలవంతం చేయదు.
31. అన్ని మతాలను గౌరవించమని హిందూ ధర్మం నాకు బోధిస్తుంది.
32. హిందూ ధర్మం ఏ పాపిని శాశ్వతంగా ఖండించదని భరోసా ఇస్తుంది.
33. నేను ఎల్లప్పుడూ నన్ను సంస్కరించుకుంటాను మరియు పరిపూర్ణతను సాధించగలనని హిందూ ధర్మం నాకు ఆశను ఇస్తుంది.
34. హిందూ ధర్మం నా శరీరానికి, మనసుకు వివిధ విభాగాలను అందిస్తుంది.
35. నా జీవితానికి నేను బాధ్యత వహిస్తానని హిందూ ధర్మం నొక్కి చెబుతుంది.
36. నేను ఎప్పుడూ స్వచ్ఛమైన, ఎప్పుడూ స్వేచ్ఛగా, ఎప్పటికి పరిపూర్ణమైన ఆత్మ అని హిందూ ధర్మం నొక్కి చెబుతుంది.
37. నా కోసం సత్యాన్ని కనుగొనడానికి హిందూ ధర్మం నన్ను అనుమతిస్తుంది.
38. భౌతిక విషయాలలో కూడా దేవుని ఉనికిని అనుభూతి చెందడానికి హిందూ ధర్మం నన్ను అనుమతిస్తుంది.
39. నా మొదటి దేవుడు నా తల్లి అని హిందూ ధర్మం చూపిస్తుంది.
40. గురువును గౌరవించకుండా జ్ఞానం పొందలేరని హిందూ ధర్మం చూపిస్తుంది.
41. పవిత్రమైనా, లౌకికమైనా ప్రతి జ్ఞానం దేవుని నుండే వచ్చిందని హిందూ ధర్మం బోధిస్తుంది.
42. ప్రతి ఒక్కరిలో దేవుడు అంతర్గత మార్గదర్శి అని హిందూ ధర్మం బోధిస్తుంది.
43. ప్రతి స్త్రీ దేవుని శక్తి యొక్క స్వరూపం అని హిందూ ధర్మం బోధిస్తుంది.
44. ఆత్మకు లింగం, జాతి, కులం లేదని హిందూ ధర్మం బోధిస్తుంది.
45. సంపూర్ణంగా మరియు నిస్వార్థంగా చేసిన ప్రతి పని నన్ను పరిపూర్ణంగా చేస్తుంది.
46. నేను నృత్యం ద్వారా భగవంతుడిని చేరుకోగలను.
47. నేను సంగీతం ద్వారా దేవుణ్ణి కనుగొనగలను.
48. నేను కళల ద్వారా దేవుణ్ణి కోరుకుంటాను.
49. మంచి ఎప్పుడూ చెడుపై విజయం సాధిస్తుందని హిందూ ధర్మం నాకు బోధిస్తుంది.
50. హిందూ ధర్మం నన్ను దేవుడికి భయపడమని చెప్పదు కాని దేవుణ్ణి ప్రేమించమని చెప్తుంది
51. దేవుడు నా స్నేహితుడు.
52. దేవుడు నా గురువు.
53. దేవుడు నా తల్లి.
54. దేవుడు నా తండ్రి.
55. దేవుడు నా ప్రేమికుడు.
56. దేవుడు నన్ను భరించేవాడు
57. దేవుడు నా బిడ్డలో,నాలో కూడా ఉన్నాడు.
58. దేవుడు ప్రతిదానిలో స్వచ్ఛమైనవాడిగా మరియు అందమైనవాడుగా ఉన్నాడు.
59. దేవుడు కూడా దు దుఃఖమైన స్థితిలో ఉన్నాడు అని చూపించాడు.
60. దేవుడు అంతర్గత నియంత్రిక.
61. దేవుని చిత్తం లేకుండా ఏమీ జరగదు.
62. నేను పరిపూర్ణత సాధించే వరకు జీవితం పుట్టుక మరియు మరణాల పరంపర అని హిందూ ధర్మం బోధిస్తుంది.
63. నా స్వంత సామర్థ్యం ప్రకారం ఉపవాసం మరియు జాగరూకత పాటించటానికి నాకు స్వేచ్ఛ ఉంది.
64. నా మనస్సును భక్తి మరియు స్వచ్ఛతను పెంపొందించడానికి మాంసం మానుకోవాలని హిందూ ధర్మం నన్ను ప్రోత్సహిస్తుంది.
65. భగవంతుడిని ప్రేమించటానికి వినయంగా ఉండటానికి హిందూ ధర్మం నన్ను ప్రోత్సహిస్తుంది.
66. ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా చూడమని హిందూ ధర్మం నాకు చెప్తుంది.
67. హిందూ ధర్మం నాకు అహింస మరియు ఇతరులకు గాయపడకుండా ఉండటానికి నేర్పుతుంది.
68. బలహీనులకు, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడానికి హిందూ ధర్మం నాకు బోధిస్తుంది.
69. దేవుని అనుగ్రహం ద్వారా పాపులను కూడా శుద్ధి చేయవచ్చని హిందూ ధర్మం చూపిస్తుంది.
70. హిందూ ధర్మం నమ్మటంలో కాదు, ఉండటం మరియు మారడం.
71. దేవుడు ప్రతిదీ మరియు ప్రేమతో ఇచ్చిన దేన్నీ అంగీకరిస్తున్నాడని హిందూ ధర్మం చూపిస్తుంది.
72. అధర్మం నుండి ధర్మాన్ని రక్షించమని భగవద్గీతలో దేవుడే స్వయంగా చెప్పాడు.
72. ధర్మం యొక్క మార్గాన్ని చూపించడానికి దేవుడు భూమిపై అవతరించాడని హిందూ ధర్మం చూపిస్తుంది.
73. నన్ను పాపిగా భావించడం దైవదూషణ అని హిందూ ధర్మం చూపిస్తుంది.
74. ప్రతి చర్యకు దాని ప్రతిచర్య ఉందని హిందూ ధర్మం బోధిస్తుంది.
75. ప్రార్థనలు మరియు దేవుని పేరును పునరావృతం చేయడం ద్వారా కర్మను మార్చవచ్చు.
76. పవిత్ర ప్రజలకు, మంచి భక్తులకు సేవ చేయడం ద్వారా నేను దేవునికి సేవ చేయగలను.
77. కర్మ సిద్ధాంతం నేను నా స్వంత విధి యొక్క సృష్టికర్త అని చూపిస్తుంది.
78. వేదాలు నిర్భయతపై బోధిస్తాయి.
79. భగవద్గీత స్వీయ ప్రేరణపై ఉత్తమ మాన్యువల్.
80. పురాణాలు సరళమైన కథలలో గొప్ప సత్యాలను ఇస్తాయి.
81. రామాయణం ఎలా జీవించాలో నాకు చూపిస్తుంది.
82. శ్రీమద్ భాగవతం ఎలా చనిపోవాలో నాకు నిర్దేశిస్తుంది.
83. జీవితంలో కష్టాలను ఎలా ఓడించాలో మహాభారతం నాకు చూపిస్తుంది.
84. ఉపనిషత్తులు నా నిజమైన ఆత్మ గురించి అత్యున్నత సత్యాన్ని నాకు నిర్దేశిస్తాయి.
85. భగవంతుడిని వివిధ మార్గాల్లో ఎలా ఆరాధించాలో అగమాలు నిర్దేశిస్తుంది.
85. ఇతిహాసాలు మరియు పురాణాలు సృజనాత్మకతను పెంపొందించడానికి సహాయపడతాయి.
86. ఇతరులను గాయపరచడం నా స్వయాన్ని గాయపరచడమే అని హిందూ ధర్మం బోధిస్తుంది.
87. నేను మరొకరి స్వాధీనంలో ఉండకూడదని హిందూ ధర్మం బోధిస్తుంది.
88. నా పెద్దలను గౌరవంగా చూడాలని హిందూ ధర్మం నాకు బోధిస్తుంది.
89. హిందూ ధర్మం నాకు జీవితంలోని వివిధ దశలలో వేర్వేరు విధులను నిర్దేశిస్తుంది.
90. ఇతరుల కోసమే స్వార్థాన్ని వదులుకోవడాన్ని హిందూ ధర్మం ప్రశంసించింది.
91. శరీరాన్ని, మనస్సును శుద్ధి చేసే ధర్మ
కర్మగా వివాహాన్ని హిందూ మతం సూచిస్తుంది.
92. హిందూ ధర్మం మరణాన్ని పాత వస్త్రం యొక్క మార్పుతో పోలుస్తుంది.
93. మంచి చర్యలు చేయడం ద్వారా నేను దేవుణ్ణి ఆరాధించగలను.
94. హృదయంలో స్వచ్ఛమైన వారు భగవంతుడిని చూడగలరని హిందూ ధర్మం చూపిస్తుంది.
95. గొప్ప ప్రయత్నం ద్వారా ఎవరైనా గొప్పతనాన్ని సాధించగలరని హిందూ ధర్మం చూపిస్తుంది.
96. హిందూ ధర్మం ప్రతి ఒక్కరూ - పురుషుడు, స్త్రీ, బిడ్డ మరియు వృద్ధులు గొప్ప సాధువులు మరియు ఋషులు కావచ్చు.
97. హిందూ ధర్మం శిక్షించేది దేవుడే కాదు, మన స్వంత కర్మ అని చూపిస్తుంది.
98. భగవంతుని ప్రేమికులు ఏ జాతికి, కులానికి చెందినవారు కాదని హిందూ ధర్మం చూపిస్తుంది.
99. హిందూ ధర్మం సహనాన్ని మాత్రమే కాకుండా సార్వత్రిక అంగీకారాన్ని బోధిస్తుంది.
100. హిందూ ధర్మం వైవిధ్యంలో ఐక్యతను చూస్తుంది.
101. హిందూ ధర్మం అన్ని మతాలకు తల్లి.

Source - Whatsapp Message

శ్రీరమణ మహర్షి

శ్రీరమణ మహర్షి
తేదీ ప్రకారం గా రమణ మహర్షి జయంతి ఈరోజు తిథి ప్రకారం రేపటి రోజు
రమణ మహర్షి
(డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.

16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు. బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నాడు.

రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవాడు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు.

వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.

ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవాడు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గములని కూడా బోధించేవాడు.

శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాతి గాంచిన ఈయనకు తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. భగవాన్ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ 'ఆరుద్ర దర్శనం (పునర్వసు నక్షత్రము) ' నాడు జన్మించాడు. శ్రీ భగవాన్ గారి తల్లి తండ్రులు శ్రీమతి అళగమ్మాళ్, శ్రీ సుందరేశం అయ్యర్లు. శ్రీ భగవాన్ గారికి ఇద్దరు సోదరులు (నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరేశ అయ్యర్ గారు అక్కడ ప్లీడరుగా పని చేసే వాడు.

పూర్వాశ్రమంలో భగవాన్ అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవాడు. అపారమైన దేహదారుఢ్యం కలిగి ఉండేవాడు. బాల్యంలో చదువు మీద ఆసక్తి చూపించేవాడు కాదు. తిరుచ్చుళిలో సరైన విద్యాసౌకర్యం లేకపోవడం వలన వాళ్ళ చిన్నాన్న వద్దకు (సుబ్బాయ్యర్) వెళ్ళాడు. రమణులు చిన్నతనంలో బాగా నిద్ర పోయేవాడు. ఎలాంటి నిద్ర అంటే ఆయన నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఆయన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా ఆయనకు తెలిసేదికాదు. ఈయన అసలు పేరు వేంకటేశ్వర. ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వర అని రాయమంటే వెంకట్రామన్ అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది. రమణ గారి తండ్రి చనిపోవడం వల్ల సుబ్బయ్యర్ గారు నాగస్వామి (రమణ గారి అన్నయ్య), రమణ లను మధురై తీసుకుని వెళ్ళిపోయాడు. రామస్వామి అయ్యర్ అనే ఆయన అరుణాచలం వెళ్ళివస్తుండగా రమణులు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగాడు. ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా, ఆమాట విన్న తరువాత ఆయనలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయండం, రుచుల కోసం ప్రాకులాడటం మానేశాడు.

స్వీయ-శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గము". వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనే కాకుండా, అనేక మత సారములను మార్గాలను తన బోధనలలో బోధించేవారు.


రమణ మహర్షిని గూర్చిన ఒక వ్యాసం వ్రాసాన్ని ప్రసిద్ధ ఫ్రెంచ్ రచయిత సోమర్ సెట్ మామ్ రాసాడు.

30 డిసెంబరు 1879 లో జన్మించిన భగవాన్ రమణమహర్షి. 20 వ శతాబ్దపు మహర్షి
అని అనేకులచే కీర్తించబడిన భగవాన్ రమణులు సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అవతారం అని అనేక మంది ఉపాసకులు అనుభవాల ద్వారా చెప్పారు. ఆత్మసాక్షాత్కారానికి విచారమార్గాన్ని చూపిన గురువులు రమణులు.

----------------------

భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి నిన్ను నీవు తెలుసుకునే ఎరుకకు సరళమైన ఆధ్యాత్మికమార్గం మౌనమే అని తనజీవితం ద్వారా మనకు చూపించిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి. మౌనంలో విశ్రమించు, మనస్సు మూలాల్ని అన్వేషించు, ‘నేను’అనే భావం ఎక్కడినుంచి వస్తుందో చింతన చేస్తూ పరిశీలిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది. అదే మౌన తపస్సు అంటారు మహర్షి. నిశ్శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని చేసే మౌన సాధన వల్లే ఈశ్వర సాక్షాత్కారమవుతుంది అని ఉపదేశించేవారు అరుణాచల రమణులు.

తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో 1879 డిసెంబర్ 30న వెంకటరామన్‌గా జన్మించిన రమణ మహర్షికి పదహారు సంవత్సరాలున్నప్పుడు అంతు తెలియని జబ్బు చేసింది. మరణం అంచుల దాకా వెళ్లి, భగవత్కృపతో బతికి బయటపడ్డారు. ఆ సమయంలో తన మనసులో కలిగిన ప్రేరణతో ఇల్లు వదిలి ఎన్నో దివ్యస్థలాలకు నెలవైన అరుణాచల పర్వతాన్ని చేరారు. అక్కడి కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ, మౌనస్వామిగా పేరు పొందారు. విరూపాక్ష గుహలో ధ్యాన మగ్నుడై ఉన్న ఈ బాలయోగిని కావ్యకంఠ గణపతి ముని సందర్శించుకుని, తనను చిరకాలంగా పట్టి పీడిస్తున్న ఎన్నో సందేహాలను తీర్చుకుని, ఆయనకు రమణ మహర్షిగా నామకరణం చేశారు. అప్పటినుంచి దేహాన్ని చాలించే వరకు రమణ మహర్షి ఆ ప్రదేశాన్ని వీడి ఎక్కడకూ వెళ్లలేదు.
అరుణాచలంలో అడుగిడినప్పటినుంచి చాలాకాలం వరకు మౌనంలోనే ఉన్నారు మహర్షి. భక్తులు అడిగిన ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్నలకు సమాధానాలు రాసి చూపుతూ ఉండేవారు. కొన్నాళ్ల తర్వాత జిజ్ఞాసువులైన భక్తులపట్ల ఆదరంతో పెదవి విప్పి పరిమితంగా మాట్లాడేవారు. అవి భక్తుల సందేహాలను తీర్చేవి, వారి బాధలను రూపుమాపేవి. అలా మౌనోపదేశం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్యజ్యోతి స్వరూపులు భగవాన్ రమణులు.

రమణుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సమకాలీన భారతీయులకు తెలియజేసినవారిలో ముఖ్యులు కావ్యకంఠ గణపతి ముని కాగా పాశ్చాత్యులకు పరిచయం చేసిన వారిలో ప్రధానమైనవాడు పాల్ బ్రింటన్. రమణ మహర్షి దీర్ఘమౌనంలోని అంతరార్థాన్ని గ్రహించిన బ్రింటన్, అనంతర కాలంలో ఆయనకు శిష్యుడై, అమూల్యమైన తన పుస్తకాల ద్వారా భగవాన్ జ్ఞానసంపదను ప్రపంచానికి చేరువ చేశారు.అద్వైత వేదాంతమే తన తత్వంగా నిరూపించుకున్న రమణ మహర్షి జంతువులు, పక్షులు, సమస్త జీవులలోనూ ఈశ్వరుణ్ణి సందర్శించారు. ఆయనే అనేక మంది భక్తులకు ఆరాధ్యదైవంగా దర్శనమిచ్చారు. ఆయన అలా అగుపించింది కేవలం హిందూమతంలోని వారికే కాదు, బౌద్ధులకు బుద్ధ భగవానుడిగా, క్రైస్తవులకు జీసస్‌గా, ముస్లిములకు మహమ్మద్ ప్రవక్తగా కూడా దర్శనమిచ్చినట్లు అనేకమంది చెప్పుకున్నారు. తన ఆశ్రమంలో యథేచ్ఛగా సంచరించే అనేకమైన ఆవులను, కోతులను, లేళ్లను, శునకాలను కూడా ఆయన అది, ఇది అనేవారు కాదు. అతడు, ఆమె అనే సంబోధించేవారు. పక్షపాతం చూపడాన్ని, ఆహార పదార్థాలను వృథా చేయడాన్ని ఆయన చాలా తీవ్రంగా పరిగణించేవారు.

‘‘గురువు మౌనంలో ప్రతిష్థితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందుతుంది’’ అని చెప్పిన రమణులు అరుణాచలంలో అడుగిడినప్పటినుండి సిద్ధిని పొందేవరకు మౌనం అనే విలువైన సాధన ద్వారానే అమూల్యమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపదను మనకందించారు.1950, ఏప్రిల్ 14న తనువు చాలించేవరకు ఆయన కొన్ని వేల మందికి తన ఉపదేశాల ద్వారా ఉపశమనం కలిగించారు. కొన్ని వందలమందిపై చెరగని ముద్ర వేశారు. కొన్ని తరాల వారిపై బలంగా ప్రభావం చూపారు. ఇప్పటికీ కూడా అనేకులు రమణ మహర్షి నిజంగా భగవానులే అని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని ఆయన ఎప్పుడూ వమ్ము చేయలేదు, చేయరు కూడా! ఎందుకంటే వారి నమ్మకమే ఎంతో రమణీయమైనది మరి!

రమణ వాణి

మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలోని కొన్ని నీటిబిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం అవివేకం. మానవత్వాన్ని వదులుకోకుండా కడదాకా కొనసాగించడం వివేకవంతుని లక్షణం. భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతదూరంలో ఉంటాడు. సావధానంగా వినటం, సంయమనంతో సమాధానమివ్వటం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవటం, ప్రశాంతంగా జీవించటం అందరికీ అవసరం. నీ సహజస్థితి ఆనందమే. దానిని కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. అయితే అది బయట ఎక్కడో ఉందనుకోవడమే తప్పు. అది నీలోనే ఉంది. అది గ్రహించడమే జ్ఞానవంతుల లక్షణం. భగంతుని అనుగ్రహం ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. దానిని పొందడానికి అవసరమైనవే ప్రయత్నం, సాధన. మన జీవితంలో అనివార్యమైన, నిశ్చయమైన ఏకైక ఘటన మృత్యువు. దానిని గుర్తించి, చనిపోయేవరకు సకల జీవుల పట్ల సంయమనంతో, విచక్షణతో మెలగడం అందరికీ అత్యవసరం. జీవితంలో వ్యతిరేక పరిస్థితులు ఎవరికైనా తప్పవు. అయితే అన్నీ భగవంతుని నిర్ణయం ప్రకారమే జరుగుతాయని తెలుసుకుని, భారాన్ని ఆయన మీద వేసి, వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేక మేడలే. వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి, వాటి మీది నుంచి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోక తప్పదు. సజ్జనులతో సహవాసం జన్మజన్మల వాసనలను రూపుమాపడంలో తోడ్పడుతుంది. మనం నమ్మిన వారిని భౌతికంగా మాత్రమే కాదు, వారిని స్మరించడం, ధ్యానించడం, వారితో మానసికంగా అనుబంధం పెట్టుకోవడం ద్వారా కూడా వారి సాయం లభిస్తుంది. నీ విశ్వాసమే నీ ఆయుధం.

శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు..

ఓం నమో భగవతే శ్రీరమణాయ !

ప్రతిరోజూ ఉదయం 5 గం.లకు క్రమంతప్పకుండా భగవాన్ కూర్చునే హాలు తెరచేవారు, భక్తుల దర్శనార్ధం. స్వామి సమక్షమే ఈశ్వరసందర్శనం లాగా, స్వామి ప్రమేయం లేకుండానే, భక్తులు సాష్టాంగ నమస్కారాలు చెయ్యడము ఉపనిషద్ పారాయణం, ధ్యానం చెయ్యడం జరిగిపోతూ ఉండేవి. ఆశ్రమ నియమాల ప్రకారం స్త్రీలు రాత్రులందు ఆశ్రమంలో వుండకూడదు కావున, బయటనుండి స్త్రీలు ఆ సమయానికి ఆశ్రమానికి వచ్చేవారు.

ఆరున్నరగంటలకు స్వామి స్నానంముగించి ఫలహారం సేవించి కొండమీదకు వెళ్ళేవారు. మిగిలినవారు తమ దైనందిన పనులు చూసుకునేవారు. అంటే, తోట నుండి పూలు తెచ్చి పూలు కట్టడం, వంటకు కావలసిన సంభారాలు వూరిలోనికి వెళ్లి తేవడం, వంటపని, పశువులను శ్రద్ధగా చూసుకునే పని యిలాంటివి. మరి కొందరు ఆశ్రమకార్యాలయంలో పఠనాలయమ్ నిర్వహణా కార్యక్రమం లో వుండేవారు.
వేదపాఠశాల నిర్వహించేవారు మాతృభూతెశ్వరునికి, దేవి యోగంబకు, స్కందునికి, వినాయకునికి, శ్రీచక్రమునకు, ఆగమవిధి ప్రకారము పూజలు చేశేవారు. పర్వదినాలలో విశేషపూజలు చేసేవారు.

ఎనిమిది గంటలకు స్వామి మరల హాలులో సోఫాలో కూర్చునేవారు. ఎక్కువగా మౌనంగా ధ్యానముద్రలో వుండేవారు. ఆసమయంలో భక్తులు తాము వ్రాసిన స్తోత్రాలు, పాటలు పాడేవారు. కొందరు తమ వాదనా పటిమ స్వామి ముందు ప్రదర్శించాలని ఉవ్విళ్ళూరేవారు. వారికికూడా మౌనమే స్వామి సమాధానం. ప్రశ్నలు అర్ధవంతమై, అవతల వ్యక్తి జిజ్ఞాసతో కూడినది అయితే సమాధానం ఇచ్చేవారు. చాలా మంది మటుకు స్వామివదనం చూస్తూ ఆత్మవిచారము, ధ్యానము సులభంగా అభ్యాసము చేశేవారు.

ఆవిధంగా కొద్దిసేపు గడిచిన తరువాత, 9 గం. లకు దేశవిదేశాల నుండి వచ్చిన లేఖలకు గణపతిముని వ్రాసిన జవాబులు చూసి, అవసరము అనుకున్న చోట్ల సరిచేసేవారు. తిరిగి భక్తులతో గోష్టి . పదకొండున్నర గంటలకు మధ్యాహ్న భోజనము. ఆపై రెండుగంటలవరకు స్వామి వార్తాపత్రికల చదవడమో, విశ్రమించడం చేశేవారు.
సుమారు రెండున్నర గంటలకు భక్తులందరకూ తేనీరు. మళ్ళీ హాలులో స్వామి కొలువుతీరి సాయంత్రం వరకు దేశవిదేశీ భక్తులతో సత్సంగం. కొందరు సందేహనివృత్తి చేసుకునేవారు.

కొందరు స్వామి తేజోవంతమైన కన్నులవైపేచూస్తూ, ఆత్మానందాన్ని అనుభవిస్తుండేవారు. సాయంకాలం 4.30 గం. లకు స్వామి కొండపైకి వెళ్ళేవారు. తిరిగిరాగానే, 5.30 నుండి ధ్యానసమయం. ఈ సమయంలో స్వామి వసారాలో కూర్చుని దర్శనమిచ్చేవారు. చుట్టుపక్కల అనూహ్యమైన ప్రశాంతత. వేదవిద్యార్ధుల నమక చమక పారాయణ, శ్రీ సూక్త పురుషసూక్తాలతో పరిసరాలు మారుమ్రోగిపోయేవి.

ఆతరువాత కొద్దిసేపు ఉపదేశసారము, వివిధ పుస్తక పారాయణము. ఆ సమయానికి మాతృభూతేశ్వర పూజ జరిగేది. ఆ తరువాత స్త్రీలు భోజనం చేసి నిద్రించడానికి వూరిలోనికి వెళ్ళేవారు.

స్వామి రాత్రి 7.30 ని. లకు లఘుభోజనము. ఎనిమిదిన్నరవరకు శిష్యుల ఘోష్టి. అనంతరం శిష్యులు నమస్కరించి శలవు తీసుకునేవారు.
ఆహా! యెంత నియమనిష్ఠలతో కూడిన దినచర్య. ఇట్టి దినచర్యలో స్వామితో పాలుపంచుకున్న ఆనాటి భక్తులు యెంతధన్యులో కదా! వారికి జీవన్ముక్తి కలిగింది అనుకోవడంలో అణుమాత్రం సందేహంలేదు. ఈ నాటికీ రమణాశ్రమంలో చరమాంకజీవితం గడుపుతున్న వారి జీవితాలు యెంత ప్రశాంతతను సంతరించుకున్నవో కదా!

రమణ = క్రీడించువాడు, రూప సంపదచేత సంతోషింప జేయువాడు; రమాయణీయుడు,సుందరుడు,మనోహరుడు, మనోజ్ఞుడు (ప్రియుడు,భర్త):;యోగులు రమించెడి నిత్యానంద స్వరూపమగు పరబ్రహ్మ,ఇచ్చాను సారము రామనీయమైన మూర్తిని వహించునట్టివాడు.

సర్వజీవుల హృదయములో ఎరుకగా క్రీడించెడివాడు.

భగవాన్ శ్రీ రమణమహర్షి చిన్ననాటి పేరు వెంకట్రామాన్.
బ్రాహ్మణ స్వామిగా విరూపక్ష గుహలోనున్న సమయంలో కావ్య కంఠ గణపతిముని వారికి ఈ పేరు ప్రసిద్ధ మొనర్చారు. జగద్విఖ్యాతిగాంచిన పేరు ఇదే.

భగవాన్ ఆత్మయొక్క శుద్ధచిత్ స్వరూపంలో క్రీడించారు.
రమణీయమే వారి బోధ. రమాణీయము అంటే ఆనంద సౌందర్యముల అనుభూతి. ఈ అనుభూతి చెడులో లేదు.
మంచిలో లేదు,అసత్యంలో లేదు,సత్యంలో ఉంది; ద్వేషంలో లేదు, ప్రేమలో లేదు ; సంఘర్షణలో లేదు, శాంతిలో ఉంది.

అంతస్సు బహిస్సును అనుగమిస్తుంది,అధోగమిస్తుంది. కనుక అంతర్ముఖత్వం వ్యక్తిత్వానికి పూర్ణత్వం ఇస్తుంది.

కేవలం ధ్యాన సమాధి నిమగ్నతలోనే కాక ,ప్రాపంచిక కర్యకలపాలలో కూడా ఆనంద రసామృతాన్ని ఆస్వాదింపజేస్తుంది.

శ్రీ రమణ మహర్షి రచించిన అక్షర మణమాల అర్థ విశేషాలలోని కొన్ని....

87. మౌనియై రాయిగా నలరకయున్నచో

మౌనమిది యగునొ అరుణాచలా !

భావం

అరుణాచలా ! కటికరాయి వలె ఉన్న మౌన స్థితి నిజమైన మౌనము

కాదు.అది ఆదర్శ నీయము కాదు.

విశేషాలు

మనసునిజముగానే మౌనమవటానికి హృదయమనే పద్మం

పూర్తిగా వికసింప వలసిన అవసరము ఉన్నదని రమణులు ఈ

చరణంలో ప్రబోధిస్తున్నారు. మనస్సుని మౌనముగా చేయటమే

అసలైన మౌనం. అనగా అహంకారం నశించి. కోరికల ఆలోచనలు

లేని మౌనమని తాత్పర్యం.

ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళదలిస్తే శ్రీ భగవానులవద్దకు వచ్చి

"వెళ్ళవచ్చునా" అని అనుమతి తీసుకునే వారు. " నేను మద్రాసు

వెళుచున్నాను లేక ఇంకెక్కడికో ప్రయాణం చేయవచ్చునా"? అని

అడుగగా భగవానులు ఒక్కొక్కసారి " సరే" అని మరికొన్ని

సందర్భాలలో మౌనంగా ఉండిపోయేవారు. భగవాన్

అంగీకరించారని ఎంతో సంతోషంగా భక్తులు

ప్రయాణమయ్యెడివారు. ఎవరైనా నిజంగా ఆయన అనుమతి

తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయనవద్దకేగి ఏమైనా అడిగితే రమణులు

తమ అంగీకారాన్ని మౌనంగా ప్రకటించేవారు.

మౌనం ఆధ్యాత్మిక సాధనకు మార్గం అయితే.. జపాలు, తపాలు,

కీర్తనల మాటేమిటి? ఇవన్నీ దైవంపై మనసు కేంద్రీకృతం

చేయడానికి ఉద్దేశించినవే! అయితే దైవత్వాన్ని మనస్ఫూర్తిగా

అనుభవించడానికి మౌనం కన్నా మహత్తరమైన సాధన లేదని

చెబుతుంది రమణుల జీవితం. జపం చేస్తున్నామనుకోండి.

పెదవులు మంత్రాన్ని పలుకుతుంటాయి. చేతిలో జపమాల

తిరుగుతుంటుంది. మనసు జప సంఖ్యపైకి మళ్లుతుంది. చివరగా..

సంకల్పం పక్కదారి పడుతుంది. సాధన సమర్థవంతంగా

సాగాలంటే జపం ఆగిపోవాలి. జపమాల తిప్పడం మరచిపోవాలి.

మనసులో మౌనం ఆవహించాలి. అప్పుడు ధ్యానం ఉన్నతస్థితికి

చేరుకుంటుంది. మంత్రసాధనలో ఉన్నతమైనది

మౌనసాధన.మౌనం శక్తిమంతమైనది, ప్రశాంతమైనది. ఇదే మహర్షి. రమణ మహర్షి జయంతి సందర్భంగా తేదీల ప్రకారం ఈరోజు తిథి ప్రకారం రేపటి రోజు .

Source - Whatsapp Message

Wednesday, December 30, 2020

ఆనందం

👉 ఆనందం 👈

✍️ మురళీ మోహన్

🍌 అరటిపండ్ల వ్యాపారి పగలంతా పళ్ళు అమ్మి, రాత్రికి ఇంటికి వెళ్లే ముందు మిగిలిన సరుకులు లో నుండి పాడైనవి , కుళ్ళిపోయినవి తీసేస్తాడు. నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు. మరునాడు అందులోంచి కొన్ని కుళ్ళిపోవచ్చు. వాటినీ నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు. 'అయ్యో! పడేస్తున్నాననే బాధ ఉండదు. వాటిపై మమకారం ఉండి పాడైనవి తీయకపోతే, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది.

జీవితానుభవాలు అంతే. బాధ కలిగించే ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను , మనసులోంచి తీసేయాలి.

ఏరోజు చిట్టాపద్దులు ఆరోజే పూర్తి చేయాలి. క్షమించాల్సిన వాటిని క్షమించాలి . సానుభూతి చూపాల్సిన వారిపై, సానుభూతి చూపాలి. విస్మరించిన వాళ్లను, విస్మరించాలి. ప్రశంసించిన వాళ్లను, ప్రశంసించాలి.

మంచి అనుభూతులను చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేయాలి. చెత్త వెళ్లిపోయాక బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని మంచి ఆలోచనలతో నింపితే ఆనందం పెరుగుతుంది. చిరునవ్వు, ఆనందం కవల పిల్లలు. ఒకటి లేకుండా మరొకటి లేదు.
🌻🌺🌸🌼🌺🌸🌻

Source - Whatsapp Message

మంచి మాటలు

బుధవారం --: 30-12-2020
ఈ రోజు
AVB మంచి మాటలు 💐
ఈ రోజుల్లో మనుషులు మనుషులుగా
రాముడు కృష్ణుడు అని పిలించుకోవటం మరిచిపోయి జంతువులతో నువ్వు పులివి ,నువ్వు సింహం లాంటి క్రూర జంతువుల పేర్లతో పిలిపించుకోవటానికి ఇష్టపడుతున్నారు సమాజం మనిషిని మనిషిగా గుర్తించండం మరచిపోయింది 😞

దయచేసి
మనిషిని మనిషిగా చుడండి మనిషిగా బతకడానికి ప్రయత్నించండి , మనం బతుకుదాం తోటివారు బతకడానికి సహకరిద్దాం మనుషులుగా మారుదాం

మనం
బాధ పడితే ఓదార్చే వాళ్ళు కొందరు మనం ఎప్పుడూ బాధ పడతామా అని ఎదురుచూసే వాళ్ళు మరి కొందరు , మనతో ఏ బంధం లేక పోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు . అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు .

ఆత్మ
సంతృప్తి అనేది మనం సంపాదించే ఆస్తులను బట్టి , మనం వేసుకునే ఖరీదైన దుస్తులను బట్టి , మనం తిరిగే లగ్జరీ వాహనాలను బట్టి , ఉండే విశాలవంతమైన భవనాలను బట్టి రాదు... మన పేరు" చెప్పగానే ఎంత మంది కళ్ళలో ఆనందభాష్పాలు , హృదయం లో ఆనందం కలుగుతాయో అదే నిజమైన ఆత్మ సంతృప్తి .

కారణం లేని
కోపం బాధ్యత లేని యవ్వనం గౌరవం లేని బంధం అలంకారణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు నిలబడవు నిన్ను నిన్నుగా గుర్తించడంలోనే ఉంది నీ గొప్పతనం .
అభిమానానికి
ప్రేమ కు లొంగని మనిషి లేడు ,కాని మనం దానికి అర్హులమేనా అని ఎవరు ఆలోచించటం* లేడు

సేకరణ ✒️ AVB సుబ్బారావు 💐🌷🌷🕉️🙏

Source - Whatsapp Message

ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధను మనం తప్పక ఆచరించాలి.

1 ఆయువు,

2 విత్తము,

3 ఇంటిగుట్టు,

4 మంత్రం,

5 ఔషధం,

6 సంగమం,

7 దానం,

8 మానము,

9 అవమానం

అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచా ల్సినవి.

భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.

1 ఆయువు :- రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు.

2 ధనం ( విత్తం) :- ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగా రంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం.

అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగు తుంది.

3 ఇంటి గుట్టు:- ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.

సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.

4 మంత్రం:- ‘మననం చేసేది మంత్రం’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.

5 ఔషదం:- ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరిస్తే ఎవ్వరంటేవారు తయారుచేస్తారు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.

6 సంగమం:- సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.

7 దానం:- దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.

8 శీలం ( మానం ):- మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.

9 అవమానం :- తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవ మానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగు తుంది. దాంతో పగ.. ప్రతీకారాలు.. ఇక వాటికి అంతనేది ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం.

ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధను మనం తప్పక ఆచరించాలి.
స్వస్తి🙏🙏🙏🙏

Source - Whatsapp Message

సత్యాన్వేషణ కోసం ఒక మేథావి ప్రయత్నం.

సత్యాన్వేషణ కోసం ఒక మేథావి ప్రయత్నం.

ఇండియా లో సందుకో గుడి ఉంటుంది. భక్తులు డబ్బులు, కానుకలు తెగ వేస్తారు అసలు ఆ డబ్బంతా ఏం చేస్తారు అని పాశ్చాత్య దేశం లో ఓ మేధావికి కుతూహలం పుట్టి.దీనిమీద డాక్యుమెంటరీ వ్రాయాలి అనుకుని వెంటనే మన రాష్ట్రానికి వచ్చాడు. ఆరోజు రెస్ట్ తీసుకుని ఏ దేవాలయానికి వెళ్తే ఇన్ఫర్మేషన్ సరిగా వస్తుందో తర్జన భర్జనలు పడి హోటల్ ఓనర్ విషయం చెప్పి అడిగితే మామూలు రోజుల్లో ఎక్కువ గా రద్దీ వుండని. ఈ మేధావికి కావలసిన సరైన సమాచారం ఇచ్చే జ్ఞాని అయిన పూజారి వుండే శివాలయానికి వెళ్ళమని చెప్పాడు

మర్నాడు తీరికగా హోటల్ ఓనర్ చెప్పిన శివాలాయనికి ఆ మేధావి డాక్యుమెంటరీ కోసం వచ్చాడు.. అక్కడ పూజారి గారు ఎర్ర పట్టువస్త్రం లాటిది కట్టుకుని వున్నారు.. ఆ ప్రక్కన మరో భారీకాయం టేబుల్ దగ్గర కుర్చీ లో కూర్చుని ఉన్నాడు. ఆ ప్రక్కన రెండు చేతులకి 10 ఉంగరాలు పెట్టుకుని మరో భారీ కాయం ఉంది.. భక్తులు వస్తున్నారు ఆ రెండో భారీ కాయం అప్పుడప్పుడు వచ్చే భక్తులపై ఏవేవో అరుస్తున్నాడు..

భక్తుల రద్దీ అయిన తర్వాత మన మేధావి పూజారి గారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్ళాడు.. ఇంగ్లీష్ భాష లో మీతో చిన్న ఇంటర్వ్యూ కావాలి అన్నాడు...పూజారి గారు యం ఏ చదువుకున్నారు. ఒంటి గంటకి ఫ్రీ అవుతాను వీళ్లిద్దరూ కూడా వెళ్ళిపోతారు వైట్ చెయ్యండి అని ఇంగ్లీష్ భాష లో చెప్పి దర్శనం చేయించి తీర్థం ఇచ్చి శఠగోపం పెట్టేసారు..
అది మొదటి భారీ కాయానికి అర్ధం కాలేదు..రెండో భారీ కాయం హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాట్సాప్ లో ఎదో చూస్తున్నాడు ..మొదటి భారీ కాయం ఏంటట అని గర్జించాడు. అబ్బే ఏమీ లేదు చిన్న ఇంటర్వ్యూ కావాలట అని పూజారిగారు చెప్పారు, దానికి ఆ భారీ కాయం ఇక్కడ ఇంటర్ చదివే వాళ్ళు ఎవరూ లేరని చెప్పండి. ఈ లోపల ఒంటి గంట అయ్యింది ఆ రెండు భారీ కాయాలు సాయంత్రం 5 గంటలకు వస్తాం అని చెప్పి తమ స్వంత కార్లలో వెళ్లిపోయారు.. పూజారి గారు గర్భ గుడికి తాళం వేసి గుడి ఆవరణ ల్ ఓ చల్లని చెట్టు క్రింద బెంచి పై ఆ మేధావిని కూర్చోబెట్టి తాను కూర్చుని ఇప్పుడు అడగండి మీకు ఏం కావాలో అన్నారు.. అప్పుడు మేధావి సార్ మీకు భక్తులు డబ్బు, కానుకలు చాలా ఇస్తారు అవి దేముడు మీరు ఎలా పంచుకుంటారు అని అడిగుతూ పూజారి గారిని నిశితంగా పరిశీలించాడు. పూజారి గారు బాగా బక్కగా ఉన్నా మంచి ఆరోగ్యం తో వున్నాడు..

పూజారి గారు డబ్బు, కానుకలు అని పేలవంగా ఓ నవ్వు నవ్వాడు.. అది పూర్వ వైభవం నాయనా గుళ్ళకి మాన్యాలు ఉండేవి రాజులు పూజారులకి ఎకరాలు పొలాలు ఇచ్చేవారట. ఇప్పుడు చాలామంది పూజారులకి రోజు గడవడం కష్టంగా ఉంది నాయనా అన్నారు. ఇంటరెస్టింగ్ గా ఉంది విపులం గా చెప్పండి అన్నాడు మేధావి. డబ్బు కానుకల ఒకప్పటి మాట నాయనా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు..నేను ఎం ఏ చదివాను ఉద్యోగం కూడా వచ్చింది ఈ అర్చకత్వం అనువంశికం గా వస్తోంది మా నాన్నగారు ఓ 40 ఏళ్ల క్రితం చనిపోవడం వల్ల నాన్నగారి భాద్యత ఉద్యోగం వదిలి నేను తీసుకున్నాను.. ప్రస్తుత పరిస్థితి లో ప్రతీ గుడి కి పాలక మండలి ఉంటుంది ఈ గుళ్లు పై వచ్చే ఆదాయ పర్యవేక్షణ కి ఓ ప్రభుత్వ శాఖ ఒకటి ఉంటుంది. ఆదాయం ఉన్న ఏ గుడి అయినా ఆ ప్రభుత్వ శాఖ ఆధీనం లో కి వచ్చేస్తుంది. ఇందాక గుడిలో పది ఉంగరాలు పెట్టుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాఁట్సప్ చూస్తున్నవాడు ఆ ప్రభుత్వ శాఖ ఉద్యోగి. వచ్చిన భక్తులని డబ్బులు కానుకలు హుండీ లో వెయ్యండి అని గదమాయిస్తూ ఉంటాడు. ఇప్పటి దాకా ఎంత మింగాడో వాడికే తెలియదు. ఉద్యోగం లో చేరిన క్రొత్తలో వాడికి సైకిల్ కూడా లేదు ఈ రోజు ఓ కారు మూడు ఫ్లాట్ లు ఉన్నాయి. రూల్ ప్రకారం భక్తులు పళ్ళెము లో వేసినవి మాకు చెందుతాయి హుండీ లో వేసినవి మాకు చెందవు. ప్రతీ భక్తుడు హుండీ లో నే కానుకలు వేసేలా చూడడమే వాడి కర్తవ్యం.దేవాలయాల ఆస్తులు వాటి పై వచ్చే రాబడి అవి ఇవి చూస్తుంటాడు ఇక భక్తులు పెద్దనోట్లు హుండీ లో వేసి చిల్లర,దొంగ నోట్లు చిరిగి అతికించబడిన నోట్లు మా పళ్లెం లో వేస్తారు..ఓ అరవై మంది పేర్లు చెప్పి అర్చన చేయిస్తారు కానీ సర్వే జనాః సుఖినో భవంతు అని ఒక్కడూ అడగడు. ఒకవేళ ఎవరైనా దైర్యం గా పెద్ద నోటు పళ్లెం లో వేస్తే అది వీరు చూస్తే ఆ రోజు మాకు నరకమే… ఇక ఎవరైనా భక్తులు అమ్మవారికి ఖరీదైన చీర పెడితే ఆ ప్రభుత్వం నియమించిన ఉద్యోగి తన కర్తవ్యం మర్చిపోయి ఆ చీరని లటుక్కుమని మాయం చేస్తాడు.. ఇక మొదటి భారీకాయం పాలక మండలి చైర్మన్,, సారా కాంట్రాక్టర్.. భక్తులు ఇచ్చిన బంగారు ఆభరణాలు ఈయన ఇంట్లో నే ఉంటాయి. ఏదో ఉత్సవాలకు మాత్రామే బయటకు వస్తాయి..

ఇక అన్నీ వేలం పాట లే. గుడిముందు కొబ్బరి కాయల దుకాణం నించి ప్రతీది వేలం వేస్తారు.. టిక్కట్లు అమ్మకం లో కుంభకోణాలు, ప్రసాదం కౌంటర్ లో కుంభకోణాలు. అమవారికి భక్తులు పెట్టే చీరలు జాకెట్ ముక్కలు కూడ వేలం వేస్తారు..

చివరికి భక్తులు కొట్టే కొబ్బరి కాయ కి కూడా వేలం పాటే. కాయలో క్రింద సగం భక్తుడు కి ఇవ్వాలి. పై భాగం ఎవరో హోటల్ వాళ్ళు వేలం పాడుకుంటారు. ఆ సగం చిప్ప కూడా మాకు దక్కదు.. చాలీ చాలని జీతం ఇస్తారు, అందులోనే నైవేద్యం మేమే వండాలి
ఈ పూజరిని ఎలా ఎప్పుడు పీకేయ్యాలా, మనకి అనుకూలం గా ఉండేవారిని ఎలా పెట్టుకోవాలా అని ఆలోచిస్తారు.. ఆ ప్రభుత్వ ఉద్యోగి మా చేత చెప్పులు కూడా మోయిస్తాడు. దొంగ తనాలు అంటకడతారు కొందరు పూజారులు వీళ్ల టార్చెర్ భరించలేక ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.. నాయనా.

గత కొన్ని సంవత్సరాలుగా భక్తులు పరాయి రాష్ట్ర దేముళ్లపై పడుతున్నారు.. చిన్న దేవాలయాల పరిస్థితి ఘోరం గా తయారయ్యింది.. రామాలయాలు వీళ్ళకి శ్రీరామనవమి నాడే గుర్తుకువస్తాయి. రామాలయం లో పని చేసే పూజారుల పరిస్థితి మరీ ఘోరం.. ఈ సందు చివరన ఉంది అక్కడికి కూడా ఓ సారి వెళ్లి చూడండి.

మధ్యలో మేధావి.. మరి ఎలా బ్రతుకుతున్నారు..

నమ్ముకున్న దేముడిని పూజారి వదిలే ప్రసక్తి లేదు.
కుంచెమ్ ఆయుర్వేదం హోమియోపతి జాతకాలు వాస్తు జ్ఞానం ఉంటుంది భక్తుల కు నమ్మకం ఎక్కువ.
పల్లెటూళ్ళలో ఎవరికైనా జ్వరం వస్తే ముందు గుడి పూజారి దగ్గర కే వెళ్లేవారు ఆయన నేర్చుకున్న వైద్య జ్ఞానం తో మందు ఇస్తారు.. కొందరు భక్తులు పూజారి కి ఇస్తే మంచిది అని భావించి మాకు గుప్తం గా సాయం చేస్తుంటారు..

దారుణం ఏమిటంటే 1983 నించి కంచె లా దేవాలయాలని కాపు కాయవలసిన ప్రభుత్వమే దేవాలయాల ఆస్తులపై పడుతోంది..

దేముడి సొమ్ము తినే ఎవరైనా సరే ఆఖరికి పొందేది అధోగతే..

మరి ఇవన్నీ చూసి మీ దేముడుకి కోపం రాదా ఆయన ఏమీ చెయ్యడా.. అని మేధావి అడిగారు..

మంచి ప్రశ్న వేశావు నాయనా.. నీకు కోట్ల ఆస్తి ఉంది లేక లేక నీకు ఓ కొడుకు పుట్టాడు. వాడికి నువ్వు వాడి ప్రధమ జన్మదినానికి ఓ 10 లక్షలు పెట్టి చైన్ చేయించి మెడలో వేస్తావు, ఓ 5 లక్షలు పెట్టి వజ్రాల ఉంగరం చేయించి వెలికి పెడతావు. ఓ 10 వేలు పెట్టి బట్టలు కొని వేస్తావు. బర్త్ డే పార్టీ కి పుర ప్రముఖుల్ని పిలుస్తావు సాయంత్రం పార్టీ పెడతావు..
అందరూ వస్తారు. బుగ్గలు నిమిరి ముద్దులు పెడుతుంటారు. కానీ వాడి కళ్ళు ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాయి.. నువ్వు చేయించిన బంగారం కానీ వజ్రాల ఉంగరాలు కానీ 10 వేలు పెట్టి కొన్న బట్టలని వాడు పట్టించుకోడు.. పార్టీ కి పెద్ద వాళ్ళు వస్తారు అని ఎక్కడో రూమ్ లో బంధించబడిన రోజూ తనతో ప్రేమగా ఉంటూ తనని ఆడించే లాలించే తాతా నానమ్మ, తోటమాలి ల కోసమే వాడి కళ్ళు వెతుకుతుంటాయి.. ఆ విధం గానే దేముడు కూడా తనే లోకం గా బ్రతికే భక్తుల కోసమే ఎదురు చూస్తుంటాడు. ఈ మాన్యాలు, ఆస్తులు ఆభరణాలు ఆయన పట్టించుకోడు.. నీ ఆనందానికి నువ్వు నగలు గట్రా చేయిస్తున్నావు, ఆయన ఏన్నడూ నాకు ఫలానా ది కావాలి అని అడగడు.. ఆయన సృష్టించిన వాటిని ఆయనకే ఇవ్వడం ఏమిటి.. మీ దేముడు ఏమీ చెయ్యడా అని ఆడిగావు మా అమ్మవారు ఊరికి కాపలా కాస్తూ ఉంటుంది. అయ్యవారు స్మశానం లో కూర్చుంటాడు.
ఎవరు పోయినా బంధు, మిత్ర జనం స్మశానం వరకే వస్తారు అక్కడ నించి అయ్యవారు చూసుకుంటారు..అని చెప్పారు.. ఈ లోపల పూజారి గారు పులిహోర చక్రపొంగలి ఆ మేధావికి పెట్టి మంచినీళ్ళు ఇచ్చారు.

మేధావి మస్తిష్కాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన మేఘం ఆవరించింది..

మరి మీ దేముడికి వీళ్ళు మంచివాళ్ళు కాదు నా సొమ్ము తినేస్తారు అని ముందే తెలియదా అని అడిగాడు..

చూడు నాయనా దైవ వాసన లేనిదే ఆయన ప్రమేయం లేకుండా ఆయన సన్నిధి లో ఉండటం ఎవరికీ సాధ్యం కాదు.. పైగా దేముడు ఎవరి ఋణమూ ఉంచుకొడు.. వీరు గత జన్మలలో ఉత్సవాలలో పల్లకీ లు మోసే వాళ్ళో, త్యాగరాజు అన్నమాచారి కీర్తనల కచేరీ లో వెనక నించి చిడతలు, సన్నాయి, తాళాలు వేసే వారో రకరకాలైన దైవ సేవలలో పాలు పంచుకున్నవారో అయ్యివుంటారు వారు సేవ చేశారు, దానికి ఫలం ఈ విధం గా ఇచ్చాడు. ఈ సదవకాశాన్ని ఇప్పుడు వారు దుర్వినియోగం చేసుకుంటున్నారు..

మరి ఉత్తమ మార్గం లో కి పోవాలంటే ఏమి చెయ్యాలి అని మేధావి అడిగాడు..

బాబూ ముందు తల్లి తండ్రులకి సేవ చెయ్యాలి..
మానవసేవ ని మించింది లేదు.. ప్రతిఫలం మీద కోరిక లేకుండా, తిండి లేనివాడికి అన్నదానం, చదువుకునే స్తోమత లేనివారికి విద్యాదానం లాటివి చేస్తే ఉత్తమ మార్గం లో కి వెళ్లడం సాధ్యం అని చెప్పారు పూజారి గారు.

మేధావి లేచి బ్యాగ్ లోంచి పూజారిగారికి ఇవ్వడానికి చాలా డబ్బు తీశాడు.. పూజారిగారు అది నాకు వద్దు మా అబ్బాయి బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్నాడు నాకు డబ్బు.పంపిస్తున్నాడు. ఈ సందు చివర రామాలయం ఉంటుంది ఆ ప్రక్కనే పాక లో పూజారిగారు వుంటారు. రామాలయ పూజారుల పరిస్థితి అంతగా బాగోలేదు. ఆయన చాలా ఆర్ధిక ఇబ్బందులతో వున్నారు. ఆయనకి ఇమ్మని చెప్పారు.

ఆయన చెప్పిన విధంగా నే ఆ సందు చివర రామాలయం ప్రక్కన ఉన్న పాకలోకి మేధావి వెళ్ళాడు. అక్కడ ఇంట్లో పరిస్థితి చూసి నేను చాలా పోరాబాటుగా ఆలోచించాను అనుకుని వృద్ధ పూజారి గారిని కలిసి జరిగినది అంతా చెప్పి నాకు ఇంకా జ్ఞానం కావాలి అని మేధావి అడిగాడు.

ఆయనకు ఆయన ఆర్ధిక సమస్యలు అన్నీ తీరిపోయి సుఖం గా బ్రతకడానికి సరిపోయే డబ్బు ఆయన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఆతిధ్యం స్వీకరించాడు. పూజారిగారు నా కష్టాలు చూసి రాముడే ఈయనని ఈ విధం గా పంపాడు అనుకున్నాడు.. మేధావి గారు పూజారి గారిని కదిలిస్తే ఆధ్యాత్మిక విషయాల మీద చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది

నువ్వు కాశీ ఒక్కసారి వెళ్ళు అక్కడ నీకు అంతా తెలుస్తుంది అని చెప్పారు రామాలయం పూజారిగారు.

సత్యాన్వేషణ కోసం మేధావి కాశీ వెళ్ళిపోయాడు..

ఒక్క రోజులో ఒక చిన్న సంభాషణ ఒక పెను మార్పు తెచ్చింది. ఇంతమంది జ్ఞానులు చుట్టూ వున్నారు వివిధ రకాలైన మాధ్యమాలద్వారా జ్ఞానం మనచుట్టూ పారుతూనే ఉంటుంది.. అయినా మన జ నాలలో మార్పు ఎందుకు రాదో ఎవరికీ అర్థం కాని ప్రశ్న…..

ఇది పూజారుల పరిస్థితి .
🍁🍁🍁🍁🍁🍁
ఇదో వేరే సమూహం లో చదివి మనసు కదిలి మీతో పంచుకోవాలని ఇక్కడ పెట్టాను. ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి🙏🙏🙏

Source - Whatsapp Message

Tuesday, December 29, 2020

మంచి మాటలు

ఆత్మీయ బంధుమిత్రులకు మార్గశిర మంగళవారం మరియు దత్తాత్రేయస్వామి వారి జయంతి శుభోదయ శుభాకాంక్షలు ,మీకు మీ కుటుంబసభ్యులకు మా ఇంటి దైవం శ్రీ గుంటి ఆంజనేయస్వామి వారు తిరుత్తణి సుబ్రమణ్య స్వామి వారు మరియు గురు దత్తాత్రేయ స్వామి వార్ల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు పూర్ణాయుస్సుతో జీవించాలని కోరుకుంటూ బతకటం ఒక్కటే జీవితానికి ముఖ్యం కాదు ,మనతోపాటు పదిమంది బతకడానికి మనం మార్గం అయినప్పుడు ఆది బతుకుకు అర్థం చెపుతుంది ..ధన్యవాదములు మీ AVB 💐🌷🕉️🙏
మంగళవారం --: 29-12-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు
గుండెల్లో బాధను పెట్టుకొని పైకి నవ్వుతూ ఉండటం చాలా కష్టంగా ఉంటుంది అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది .

మనం సమాజం కోసం ప్రతిరోజు మన పోస్టులు ఉంటాయి స్పందించిన స్పందించకపోయినా నా వంతు బాధ్యతగా సమాజాన్ని మరిచిపోకుండా గుర్తు ఉండేండుకు చేస్తున్నా . ఇల్లు కన్నా చిన్నవి గదులు . గదులు కన్నా చిన్నవి తలుపులు .తలుపులకన్నా చిన్నది తాళం . తాళం కన్నా చిన్నది తాళం చెవి . కానీ చిన్న తాళం చెవి తో మొత్తం ఇంటి లోకి వెళ్లొచ్చు .అలాగే జీవితం అనే ఇంటికి సమస్యలు అనే గదులు . పరిష్కారం అనే తలుపులు ఉండొచ్చు . మరి ఆ తలుపులను తెరిచేది హృదయ పూర్వక దైవస్మరణ అనే చిన్న తాళంచెవి .

ఆపదకు సంపద నచ్చదు , సంపదకు బంధం నచ్చదు , బంధానికి బాధ నచ్చదు , బాధకు బ్రతుకు నచ్చదు , బ్రతుకు కు చావు నచ్చదు , చావుకి పుట్టుక నచ్చదు , కానీ నీ జీవితంలో ఇవన్నీ అనుభవించక తప్పదు నేస్తమా ! .

సేకరణ మీ ✒️AVB సుబ్బారావు 🤝🌷💐🕉️🙏

Source - Whatsapp Message