Monday, November 30, 2020

మాకు నీకు వచ్చినంత మంచి ఆలోచనలు మాకు ఎలా వస్తాయి?

కిర్రు, కిర్రు మంటు పాత సైకిల్ పై ప్రయాణం.. కొరియర్ పార్శల్స్ ఐటెమ్స్ డెలివరీ ఇచ్చే డెలివరీ బాయ్ ఉద్యోగం నాది.. పైన చూస్తే ఎర్రటి ఎండ..నీ పని నీదే..నా పని నాదే అంటూ నవ్వుతున్నట్టున్నాడు సూర్యున్ని చూస్తుంటే.. ఇంకా డెలివరీ ఇవ్వవలసిన వస్తువులు చాలానే ఉన్నాయి..ఓవైపు ఎండ దంచేస్తుంది. చల్లటి కూల్ డ్రింక్ త్రాగుదామని మనసులో ఉన్నా పదిహేను రూపాయలు ఖర్చు పెట్టాలి, దానికి ఇంకో పదిహేను రూపాయలు జతచేస్తే వచ్చే రెండు రొట్టెలతో రాత్రి భోజనం సరిపెట్టుకోవచ్చు.అంతే..అంతే.. అనుకుంటూ దారిలో చలివేంద్రం దగ్గర సైకిల్ ఆపి కడుపు నిండా చల్లటి నీళ్లు త్రాగి మళ్ళీ డెలివరీ ఇవ్వడానికి బయలుదేరా!
ఈ డెలివరీ బాయ్ ఉద్యోగం నాకు పార్ట్ టైం జాబ్.. ఈ సంవత్సరం తో నా డిగ్రీ చదువు పూర్తవుతుంది..నన్ను ఇక చదిలించలేం అంటూ ఇంట్లో వారు చేతులెత్తేసారు.. అందుకే నా చదువు వారికి భారం కాకూడదని నేను పట్నం వచ్చి నా చదువు కు కావలసిన డబ్బు ఇలా పార్ట్ టైమ్ జాబ్ ద్వారా సంపాదించుకుంటూ చదువుకుంటున్నాను...
డెలివరీ అడ్రస్ నూర్జహాన్ బేగం.. అని రాసి ఉంది.. పాత అడ్రస్సే.. వారంలో కనీసం మూడు, నాలుగు ఐటెమ్స్ డెలివరీ ఇస్తుంటాను ఆ ఇంటికి.... గొప్పింటి వారి ఇల్లు లా ఉంటుంది. ఇంటి బయట వాకిలి బయట ఎవరున్నారో లోపలినుండే చూడగలిగే అత్యాధునిక కెమేరా లు, హంగామా చూస్తే అబ్బో అనిపించేలా ఉంటుందా ఇల్లు.. కానీ నాకు కోపం వచ్చే విషయం ఏంటంటే కాలింగ్ బెల్ నొక్కాక పావుగంటకు గానీ ఎవరూ రారు.. వచ్చినా తలుపుకు ఉన్న ప్రత్యేకమైన చిన్న కిటికి తెరచి సంతకం చేసి ఐటెం తీసుకుంటారు.. ఎప్పుడు వచ్చినా ఓ పదిహేనేళ్ళ వయసున్న పాప వచ్చి సలాం అలైకుం భయ్యా అని కిటికీలోనుండే సంతకం చేసి వస్తువు తీసుకున్నాక షుక్రియా భయ్యా అంటుంది. నేను గేటు దాటంగానే తలుపుకు ఉన్న కిటికీ మూస్తుంది.. ఎందుకో ఆ అమ్మాయి అమాయకమైన చిరునవ్వు చూస్తే అంతవరకు నేను ఎదురుచూసిన కోపమంతా దూదిపింజ లా ఎగిరి పోతుంది.. ఆ అమ్మాయి చిరునవ్వు ను తలచుకుంటూ ఆ ఇల్లు చేరి సైకిల్ స్టాండు వేసి గేటు దాటుకుంటూ వెళ్ళ
యధాప్రకారం ఇంటి వాకిలి ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాను..
మామూలుగానే ఓ పావుగంటకు అవతల ఎవరో వచ్చిన చప్పుడు వినపడి వాకిలి దగ్గరకు వచ్చాను.. మొట్టమొదటి సారిగ ఇంటి వాకిలి తెరుచుకుంది. లోపల చూసిన నాకు నోటమాటరాలేదు. నా ఎదురుగా చిరునవ్వుతో ఆ పాప.. కానీ వికలాంగుల కుర్చీలో కూర్చొని ఉంది.. కాళ్ళు లేవు.. అందుకా వాకిలి దగ్గరకు రావడానికి ఇంత ఆలస్యం అవుతుంది..అమాయకమైన ఆ చిరునవ్వు వెనకాల ఇంత విషాదం ఉందా? అని నాకు తెలియకుండానే నా కళ్ళ లో నీళ్ళు కారుతున్నాయి.. ఆ అమ్మాయి ఆదుర్దాగా భయ్యా! క్యా హువా తుమ్ కో.. సబ్ తో ఠీక్ హై నా? అని అడిగింది..
హా.. హా.. ఠీక్ హై బహెన్.. బహార్ ధూప్ హైనా ఇస్ లియే ఆంఖే ధోడా లాల్ హుయే అంటూ కళ్ళు తుడుచుకొని పార్శల్ అందించాను..
భయ్యా! ఈ పార్శల్ మీరు తెరువగలరా? అంది..
తప్పకుండా తల్లీ.. అంటూ పార్శల్ తెరచి చూస్తే అందులో ఖరీదైన చెప్పుల జత..అందులోను మగవారివి.. ఇంట్లో వారికేమో.. ఆ అమ్మాయికు చెప్పులు ఇచ్చాను..
అమ్మాయి నవ్వుతూ.. భయ్యా! యే ఆప్కే లియే అంది..
నా కోసమా? నమ్మశక్యం గా లేక మళ్లీ అడిగాను..
హా.. భయ్యా! మీకోసమే తెప్పించాను.. మీరు మా ఇంటికి పార్శల్ ఇచ్చి వెళ్ళేటప్పుడు రోజూ చూస్తున్నా.. మీ చెప్పులు పాతబడి చిరిగి పోయినా మీరు అలాగే వాడుతున్నారు.. ఈ ఎండకు అవి అస్సలు పనికి రావు.. నాకు కాళ్ళు లేవు, చెప్పులతో నాకు అవసరం లేదు. కానీ కాళ్ళు ఉన్న వారికి ఆ చెప్పులు చాలా అవసరం..
అందుకే నేను మీకు ఓ చెప్పుల జత తెప్పించాను.. మీకు సరిపోతాయో, లేదో చూద్దామని వాకిలి తెరిచాను.. చెప్పులు తొడిగి చెప్పండి భయ్యా, మీ కాళ్ళకు సరిపొయాయో? లేదో? అంటుంటే నాకు నోట మాటరావడం లేదు.. దేవుడు నీకు దేహానికి వైకల్యం కలిగించాడేమో కానీ మాకు మేము మా మనసుకే వైకల్యం కలిగించుకుకున్నాం.. అందుకే మాకు నీకు వచ్చినంత మంచి ఆలోచనలు మాకు ఎలా వస్తాయి?
కళ్ళలో నీళ్లు ధారాపాతం గా కారుతుండగా క్రొత చెప్పులతో గేటు దాటాను..
మీ

రచన : మహానుభావుడు. ఫార్వర్డ్. K. నాగరాజు. పులివెందుల.

Source - Whatsapp Message

దీపం వెలిగించడం వలన కలిగే లౌకిక ప్రయోజనాలు

దీపం వెలిగించడం వలన కలిగే లౌకిక ప్రయోజనాలు

✍️ మురళీ మోహన్

🪔 దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం
దీపం అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుంది, దీపారాధాన అన్నిటిని సాధించిపెడుతుంది. అందుకని నేను సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకం అర్ధం.

ఒక్కో దీపానికి ఒక్కక్క ప్రత్యేకత ఉంటుంది. ఆవునేతితో వెలిగించిన దీపాపు కాంతి రోజు కనీసం 1 గంట సమయమైనా చిన్నవయసు నుండి చూడగలిగినట్లైతే దీర్ఘకాలంలో గ్లూకోమా రాదు (కంటికి సంబంధించిన వ్యాధి. షుగరు వ్యాధిగ్రస్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల పూర్తిగా కంటి చూపు కోల్పోవచ్చు. దక్షిణ భారత దేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో షుగరు వ్యాధిగ్రస్తులు చాలా ఎక్కువ).

నువ్వుల నూనె దీపపు కాంతి కిరణాలు రోజు కనీసం 1 గంట పాటు కళ్ళ మీద పడితే కంట్లో శుక్లాలు (cataract) రావు. ఆవునేయి, నువ్వులనూనెతో వెలిగించిన దీపపు కిరణాలు కళ్ళ దృష్టి (eye sight) ని మెరుగుపరుస్తాయి.

అందువల్ల మనం చేసే ప్రతి శుభకార్యంలో దీపం తప్పక ఉంటుంది. మనం పూజ సమయంలో దీపం వెలిగించడం చేత ఈ కిరణాలు మన కంటిలోనికి ప్రవేశించి, మనకు మేలు చేస్తాయి. శ్లోకంలో "సర్వ తమోపహం" అంటే అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుందని. ఇక్కడ కూడా చూపూ కోల్పోవడం వల్ల జీవితంలో ఏర్పడే అంధకారాన్ని తొలగిస్తొంది దీపం.

ఒక గది మధ్యలో ఆవునేతి దీపం వెలిగించి, హృద్రోగులు (heart patients), రక్తపోటు (B.P) తో బాధపడేవారు, ఎక్కువగా ఒత్తిడి (stress) కి లొనయ్యేవారు రోజు 1 గంట సమయం కనుక ఆ దీపం దగ్గర కూర్చుని చూస్తే కొద్దిరోజులలోనే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని, రక్తపోటు(B.P) అదుపులో ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది.

మనం చదువుకున్నాం, కాంతి(light)కి విద్యుత్-అయస్కాంత స్పెక్ట్రం (electro-magnetic spectrum) ఉంటుందని, ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత (temperature) ఆ ప్రాంతంలో ఉన్న కాంతికిరణాల రంగు (color of light rays) మీద ఆధారపడి ఉంటుందని, ఒక్కక్క రంగు కిరణానికి ఒక్కక్క ఫ్రీక్వేన్సి(frequency) ఉంటుందని. అలాగే మనం వెలిగించే దీపపు కాంతికి ఉన్న విద్యుత్-అయస్కాంత శక్తి (electro-magnetic force) ఆ ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత మీద, వాతావరణం మీద తన ప్రభావాన్ని చూపించి ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని మారుస్తుంది. గాలిలో మార్పులు తీసువచ్చి, దాని ద్వారా మన శరీరంలోనికి ప్రవేశించి, నాడులను శుభ్రపరచి, వాటి ద్వారా రక్తంలోకి ప్రవేశించి దానికున్న దోషాలను తీసివేస్తుంది. ఇది చాలా సూక్ష్మంగా జరిగే ప్రక్రియ (process).

ఆవునేతి దీపపు కాంతికి, నువ్వుల నూనె దీపపు కాంతికి, మిగితా దీపాల కాంతికి కూడా చాలా సూక్ష్మమైన తేడా ఉంటుంది. అందువల్ల ఒక్కో దీపం ఒక్కొక్క విధమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది.

మనలోని అజ్ఞానపు చీకట్లను తొలగించి, పారమార్థిక భక్తి, జ్ఞాన కాంతులను హృదయాల్లో నింపాలని భగవంతుని కోరు కోవాలి 🪔

Source - Whatsapp Message

మన ఇతిహాసాలు ధర్మవ్యాధుని కథ

📖 మన ఇతిహాసాలు 📓

ధర్మవ్యాధుని కథ

✍️ మురళీ మోహన్

🙏పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మఱచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మఱచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది.

ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.

అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.

కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు.

కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.

ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు.🤘

Source - Whatsapp Message

వ్యక్తిత్వ వికాస సూత్రాలు

వ్యక్తిత్వ వికాస సూత్రాలు
☔☔☔🦋🌻🥀🌹



🤰 నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది.

🦋 చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతుంది.

🌴 మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది.

👨‍💼 జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మసరుతాము...

👌 ఐసులా కరిగిపోయే ఐశ్వర్కం కన్నా, మాటలా నిలిచిపోయే మంచితనమే గొప్పది.

🕰 కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే...

👌 మంచి ఎక్కడ వున్నా పరిగ్రహించు. చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు.

నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా కన్నీరుతుడిచే ఒక్క వేలు మిన్న...

🙏 మేలు చేయక పోయిన పర్వాలేదు. ఎవరికి కీడు మాత్రం చేయకూడదు.

👬👭 నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోవడం అన్నిటికంటే కష్టతరం.

😊 సంతృప్తిగలవాడు మట్టిని ముట్టినా బంగారమవుతుంది.

📘👬 పుస్తకాలు, స్నేహితులు కొద్దిగా ఉన్నా మేలైనవిగా ఉండాలి.

🤴 ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు.

👨‍👨‍👧‍👦 మనం 🕊పక్షుల్లా గాలిలో ఎగరడం, 🐠చేపల్లా నీటిలో ఈదడం నేర్చుకున్నాము. కానీ భూమిపై 👨‍👩‍👦‍👦మనుషుల్లా ఎలా జీవించాలో మనకు తెలియడం లేదు .

ఆకలి వేసినా సింహం గడ్డిమేయదు. కష్టాలెన్ని చుట్టు ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.

👍 ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టలెదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.

🌅👁📖 మనిషి దీపమైనా కావాలి. అద్దమైనా కావాలి, ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి ప్రతిబింభాన్నిస్తుంది. ప్రతి వారు దీపం కాకపోవచ్చు, కాని అద్దం కాగలరు. "తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడమే జీవితం."👍

Source - Whatsapp Message

ఋణం

ఋణం:-

తన ధర్మాన్ని తాను సరిగా నిర్వర్తిస్తూ ఉన్నా చాలా మంది కష్టనష్టాలు పడుతూ ఉంటారు. ఒక్కో సారి జాతక రీత్యా దశ, అంతర్థశలను అనుసరించి జపం, దానాలు వంటివి ఎన్నో పరిహారాలు అనుసరించి చేయించినా పెద్దగా ఫలితం కనిపించక రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. అందుకు కారణం ఋణాలు అంటే అప్పులు కాదు .


ఆ ఋణాలు :-

పితృఋణం. మాతృఋణం , పుత్రికా ఋణం , స్త్రీ ఋణం, సోదర ఋణం , దైవ ఋణం , ఋషి ఋణం , దాన ఋణం, గురు ఋణం ,

ఈ తొమ్మిది ఋణాలు మనిషి జీవితంలో ఎప్పుడూ ప్రభావితం చూపిస్తూ ఉంటాయి . ఈ ఋణాలను తీర్చుకొనకపోతే ఆ వ్యక్తి మీద ఆ ఋణ బాధల ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎన్ని పూజలు, హోమాలు చేయించినా సరైన ఫలితాలు ఉండదు. ఎంత కష్టపడినా జీవితం లో ఉన్నత శిఖరాలకు ఎదగలేక నిరాశ నిస్పృహలకు లోనౌవుతారు .

ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఋణబాధలతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తి యొక్క జాతక పరిశీలన చేసి ఏ ఋణ బాధ అతనికి కష్టాలు కలుగచేస్తోందో గ్రహించాలి. దానితో పాటుగా గ్రహసంబంధ విషయాలను గుర్తించాలి . గ్రహాలకు సంబంధించిన పరిహరాలను చేయటానికి ముందుగా ఈ తొమ్మిది ఋణాలు నుంచి అతడిని విముక్తుడిని చేసే మార్గాలు సూచించి అతను పాటించే నియమాలు, విధి విధానాలు తెలుసుకుని ఆ తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన పరిహరాలను చేయించడం ద్వారా తగిన విధంగా ఫలితం ఉంటుంది.

పితృఋణం :- మరణించిన తండ్రి , తల్లి లేక అందుకు సమానమైన రక్త సంబంధీకులు మరణించిన తరువాత ఏ వ్యక్తి అయినా వారికి తాను చేయాల్సిన కర్మలను చేయకపోవడం ఆబ్దికం, సంవత్సరీక , తర్పణాలు విడవడం వంటివి శాస్త్రోక్తంగా కర్మలను నిర్వహించకపోవడం వల్ల ఆ వ్యక్తి వారికి ఋణపడి ఉంటాడు . ఇందువల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం లో ఆటంకాలు, తీవ్ర నష్టాలు చూడటం జరుగుతున్నది. అకారణ శత్రువులు, అవమానాలు, నిందలు, కోర్టు వ్యవహారాలు, చెరసాల వంటి కష్టనష్టాలు పితృఋణం వల్ల కలుగుతుంది. ఇటువంటి సమస్యలు ఉన్న వారు ముందుగా పితృఋణం క్షయం చేయించుకోవాలి ‌ . ఆ తర్వాత మిగిలిన పరిహారం త్వరగా ఫలిస్తాయి.

మాతృఋణం :-

ఏ వ్యక్తి అయినా తెలిసీ , తెలియక తన తల్లికి కోపాన్ని, వేదనను కలిగించడం , ఆమేను తిట్టడం, కొట్టటం, ఆమెపట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం , ఒక బిడ్డకు తల్లిని దూరం చేయడం లేక కుటుంబానికి యజమానురాలిని దూరం చేయడం మాతృశాపం గురిచేస్తుంది.దీని వలన విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ధనం తీవ్రంగా నష్టపోతారు , గృహం లో మనఃశాంతి లోపిస్తుంది. భూ, పశు సంపద వివాదాలు మొదలైన నష్టాలు చవిచూస్తారు . ఇటువంటి సమస్యలు ఉన్న వారు ముందుగా మాతృఋణ శుద్ధి చేయించుకుని మిగిలిన పరిహారాలు ఆచరించాలి.

పుత్రికా ఋణం:-

స్త్రీ సంతానం పట్ల దురుసుగా ప్రవర్తించడం , వారిని అకారణంగా బాధించడం వలన వారికి వేడుకలు చేయకపోవడం వల్ల వారి నుంచి ధనం , వస్తువులను తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం వల్ల పుత్రికా ఋణం ఏర్పడుతుంది. కొంత మంది వారి పుత్రికలకు వారికి ఇవ్వవలసిన ఆస్థిని ఇవ్వకుండా మగ పిల్లలకి మాత్రమే ఇచ్చి పుత్రికలకు ఇవ్వకపోవడం వల్ల కూడా కలుగుతుంది. ఈ విధమైన ఋణం వలన ఆ వ్యక్తికి భార్యతో విభేదాలు, సంతానంతో విభేదాలు కలగటం తో పాటు ధనం నష్టం, అవమానాలు, ఒక్కో సారి ఒంటరిగా జీవించడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు ఉన్న వారు ముందుగా పుత్రికా ఋణం తప్పకుండా తీర్చుకోవడం తప్పనిసరి.

స్త్రీ ఋణం :-

భార్య , పర స్త్రీ వీరిద్దరి విషయం లో ప్రియురాలు. ఉంపుడు గత్తె విషయంలో కూడా చేసే దుర్మార్గం స్త్రీ ఋణంగా పీడిస్తుంది.

భార్యను కొట్టడం , తిట్టడం, ఆమే స్వర్జితం దొంగిలించడం , భయపెట్టి లాక్కోవడం, ఆమెను పస్తులుంచడం, మానరక్షణకు వస్త్రాలు సమకూర్చక పోవడం , కుటుంబ అవసరాలకు తగిన ధనం ఆమెకు ఇవ్వకపోవడం, ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం లేక వెళ్లి పోయేలా చేయడం , భార్యాభర్తలను లేని పోని అనుమానం తో , లేనిపోనివి సృష్టించి వారిని విడదీయడం , పరస్ర్తీని కామించడం , ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, ఆమె మీద నిందలు ప్రచారం చేయడం, ఆమెను బలాత్కారం చేయడానికి సన్నాహాలు చేయడం , భయపెట్టడం , ఉంపుడుగత్తెగా ఉన్న స్త్రీ పట్ల నిర్దయగా ప్రవర్తించడం , అనుమానం తో వేధింపులు పెట్టడం , మానసికంగా శారీరకంగా హింసించడం ఇటువంటివి అన్ని స్త్రీ ఋణంగా పరిగణనలోకి వస్తాయి. ఈ ఋణం వలన ఆ వ్యక్తికి భార్యతో సఖ్యత ఉండదు. గృహ శాంతి ఉండదు. ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు దీనికి తొడు వ్యసనాలకు బానిస అవుతాడు. దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. మానసిక అశాంతిని పొందుతారు. దారిద్ర్యం తో పాటు శరీరం రోజురోజుకూ శుష్కించి పోవడం జరుగుతుంది. అశ్లీలం పట్ల అమితమైన ఆసక్తి పెరుగుతుంది. ఇటువంటి సమస్యలు ఉన్న వారు జీవితం లో ఒక్క పని కూడా ముందుకు రావడం జరుగదు. ఈ స్త్రీ ఋణం తీర్చుకుంటే తప్ప వేరే మార్గం లేదు.

సోదర ఋణం:-

తన రక్త సంబంధీకులతో అంటే తన సోదరులతో వివాదాలు పెట్టుకోవడం వారి స్వార్జితమైన ధనం తన అవసరాలకు వాడుకోవడం లేక వారికి చెందవలసిన ధన, కనక, వస్తు, వాహన, భూ, గృహ, లాంటి వాటిని తీసేసుకోవఠం వల్ల సోదర ఋణం ఏర్పడుతుంది. ఈ ఋణం కలిగిన వ్యక్తి దారిద్ర్యం పొందుతారు. తన జీవిత కాలం అంతా కష్టపడినా కూడా మనశాంతి పొందడు. అతని కుటుంబంలో భార్య లేక భార్య వైపు బంధువుల యొక్క ఆధిపత్యము అధికంగా ఉంటుంది. జీవితం చివరి దశకు వచ్చే సరికి హీనమైన, దీనస్థితి పొందుతారు.

దైవ ఋణం :-

తెలిసి తెలియని దైవం పట్ల చేసే తప్పిదాలు ఈ దైవ ఋణానికి కారణం అవుతాయి. ఈ ఋణం పొందిన వ్యక్తులకు దైవం పట్ల నమ్మకం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఇతరుల కోసం తానూ దైవాన్ని ఆశ్రయిస్తాడు కానీ దైవాన్ని మనసా వాచా కర్మణా ఆరాదించడు, అవకాశం కుదిరినప్పుడు వితండవాదం చేస్తారు ..వీరు ఎటువంటి పూజలు చేయించరు ఒక వేళ చేయించినా ఫలితం ఉండకపోగా వీరికి చేయించిన పౌరోహితుడు వీరితో అనేక ఇబ్బందులు పడతాడు...

ఇక భ్రుణ హత్య, పుత్రుడిని చంపడం, పెంపుడు జంతువులను చంపడం , గోహత్య వంటి పంచమహపాతకాలతో పాటు ఒక మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైతే దైవ ఋణం పాలవుతారు..వీరు సొంత మనుషులను కూడా హింసించడానికి వెనుకాడరు.

ఈ ఋణం వలన ప్రప్రథమంగా సంతాన హీనత కలుగుతుంది.. లేక అంగవైకల్యం తో సంతానం కలుగుతుంది. ఆ సంతానం పై అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. ఈ ఋణం కలిగిన వ్యక్తికి అధికమైన కుటుంబ సమస్యలు ఉంటాయి. మానసిక అశాంతిని కలిగి ఉంటారు..వీరితో పాటు వీరి సన్నిహితులకు కూడా చెడు ఆలోచనలను చేసి ప్రభావితం చేస్తారు .

ఋషి ఋణం:

తమ వంశానికి మూలపురుషుడు ఋషిని సేవించలేకపోవడం , సాదు సన్యాసుల పట్ల తెలిసో తెలియకో అమర్యాదగా ప్రవర్తించడం, ఋషిప్రోక్తమైన ఉపదేశాలను హేళన చేయడం వల్ల, తీసుకున్న మంత్రాన్ని సరిగా జపం చేయలేక అది ఇచ్చిన వారిని తక్కువ చూడటం , ఋషి ఋణం కిందకు వస్తాయి.ఋషి ఋణం ఉన్న వారిలో మూర్ఖత్వం పెరిగిపోతుంది. ఆవేశం వల్ల అనేక కష్టనష్టాలను పాలవుతుంటారు. ఏం చేసినా కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక విధంగా పరుల నోట్లో నానుతూ ఉంటాడు . ఇటువంటి వారు ఋషి ఋణం తీర్చుకోవాలి.

దాన ఋణం :-

ఒకరికి దానం చేస్తానని చెప్పి మాట ఇచ్చి చేయకపోవడం లేదా దానం చేసి ప్రతి ఫలం కోరటం, పనికి రాని దానం చేయడం, దానం చేసిన వానిని తిరిగి బలవంతంగా సొంతం చేసుకోవడం ఇవన్నీ దాన ఋణం కలిగిస్తాయి.

ఈ ఋణం పొందిన వారు తరచుగా వివాదాలు పాలవుతారు. ధనం , కుటుంబ జీవనం నష్టపోయినపుడు, వ్యసనాల పాలు అవుతారు. దారిద్ర్యం , ఋణ బాధలు, బంధు , మిత్రుల నిరాదరణకు పొందటం తో పాటు అవమానాలు అపకీర్తిని భరించవలసి వస్తుంది.

గురు ఋణం:-

గురువు లేదా అంతకు సమానమైన హితుల పట్ల చేసే అపచారం గురు ఋణం గా బాధిస్తాయి.తరచు తగవులు, మిత్రులతో విభేదాలు, ఉపాధిని కోల్పోవడం , వివేకాన్ని కోల్పోయి సమాజం లో అపకీర్తిని భరించవలసి వస్తుంది.

ఈ 9 రకాల ఋణాలు ఒక వ్యక్తి యొక్క జాతక చక్రం లోతుగా పరిశీలిస్తే అర్దం అవుతుంది.

సశేషం

9542552784

Source - Whatsapp Message

మ(హా)న భారతం - విడాకుల పర్వం

మ(హా)న భారతం - విడాకుల పర్వం



🤘ఉమ్మడికుటుంబం, అన్యోన్యత ఇవే భారతీయత అనే లా ప్రపంచ దేశాలు మన కుటుంబ వ్యవస్థ ముందు తలవంచేలా ఎదిగిన దేశం భారతదేశం.

భర్త తిట్టాడంటూ విడాకులు తీసుకొని వేరు అయిపోడానికి మన వివాహతంతు ఆషామాషీగా జరిగింది కాదు. అగ్నిసాక్షిగా 'అర్థేచ ధర్మేచ కామేచ నాతిచరామి' అని భార్య చేయి పట్టుకుంది క్షణికావేశంలో వదిలెయ్యడానికి కాదు. అలా వదిలెయ్యాల్సిన పరిస్థితే వస్తే మనకు అసలు "మహాభారతం" అనేదే లేదు.

మోహించిన వాడే భర్తగా స్వయంవరంలో దొరికాడని తెలిసి సంబరపడిన ద్రౌపదికి తన అత్తచెప్పినట్టు ఐదుగురు భర్తలతో జీవించాల్సిన పరిస్థితి వచ్చినపుడే తను విడాకులు తీసుకోవాలి.

ఐదుగురు పరాక్రమశీలులు తనను పందెంలో పెట్టినపుడు మీతో నాకేంటి అవసరం అని "విడాకులు" తీసుకోవాలి.

తన మాటకాదని మరల జూదం ఆడి అడవులుపట్టి అరణ్యవాసం చెయ్యల్సి వస్తే రాచబిడ్డను నాకేంటీ ఖర్మ అని తను "విడాకులు" తీసుకొని సుఖపడొచ్చు.

వందలమంది దాసీజనంతో తన అడుగులకు మడుగులోత్తించుకుంటూ పెరిగిన ద్రౌపది విరాటకొలువులో దాసీ గా బతకాల్సిన అగత్యం లేదని పాండవుల నుండి వేరు పడొచ్చు.

ఐదుగురు బిడ్డలను యుద్దానికి పోనివ్వకుండా గెలిస్తే పాండవులను తన వద్దకు రమ్మని చెప్పి వేరు కాపురం పెట్టొచ్చు.

అయిన భర్తలే దైవం అని ఒక్కసారి వివాహం అయిన తరువాత ఆ ఇల్లే ఇక తన శాశ్వత నివాసమని నమ్మి నడుచుకుంది ద్రౌపది. అందుకే యుగాలు దాటినా మహాసాధ్విగా మహా భారతంలో తనకంటూ కొన్ని పేజీలు మిగుల్చుకుంది

ఇక కుంతి, మాద్రీ, గాంధారీ ఇలా చెప్పుకుంటూ పోతే సనాతన భారత వివాహ వ్యవస్థకు విలువనిచ్చి, మెట్టినింటి గౌరవాన్ని కాపాడిన వనితలే గానీ, వదిలిపెట్టిపోయినోళ్ళు ఎవరూలేరు.

చిన్నచిన్న గొడవలకే బంధుమిత్రాదులు పంచాభూతాల సాక్షిగా జరుగుతున్న వివాహాన్నె ఎవరో తెలియని జడ్జిల వద్దకు పోయి రద్దు పరుచుకునే పరాయి సంస్కృతిని పాతరేద్దాం.

వివాహానికి రద్దు అనే మాటేలేదు అందుకే యుగాలు గడిచి వేల సంవత్సరాలు భారీ ప్రళయాలు తట్టుకొని నిలబడగలిగింది మన హైందవ ధర్మం

హిందుత్వం మతం కాదు ఇది ధర్మం. ఏ మతానికైన ఏ నాగరికతకైన పునాది మన హిందుత్వమే🙏

Source - Whatsapp Message

నిరంతరం మనం మనలోని శక్తిని వృద్ధి చేసుకోవడం వల్ల...

🌸 నిత్య నూతనమైన ఆలోచన ఎప్పుడు కొత్త ఉత్సాహన్ని ఇస్తుంది... కారణం మనదైన ఆలోచనలు ఎంత ప్రవాహంలా అందులో కొత్త ఆలోచన మాత్రం అందరితో పంచుకోవాలి అనే భావన శక్తి రేట్టింపు చేస్తుంది... ఇక్కడే మనలోని శక్తి ప్రవాహాన్ని గమనించగలిగితే మనలో ఓ కొత్త కోణాన్ని చూస్తున్నాం అనేది కూడా అంతే ఉత్సాహం నింపుతుంది... ఇదంతా ఏమిటి అంటే నిద్రాణమైన శక్తి ఎలా ఉంటుందో దాని తీవ్రత మనల్ని ఎలా కదుపుతోంది గమనిస్తే... మనకు ఉన్న పనికి దరి అంతు ఉండదు... కదలకుండా పనిచేయవచ్చు కదా..

🌸 ఉన్న శక్తి అదే కానీ ప్రతి అనుభవంతో శక్తియొక్క తీవ్రత, రూపు మారుతూ ఉంటుంది.. అంటే పరిస్థితి బట్టి ఎక్కువ తక్కువ వ్యక్తమౌతుంది.. మన శక్తిని గుర్తించగలిగితే మనల్ని మనం దాదాపుగా తెలుసుకున్నట్లే... మన అంతరంగం కూడా వ్యక్తమైయ్యేది శక్తి ప్రవాహంతో కూడా... మనం మన పనులకు ఉపయోగించే విధానం వలన కానీ సమూహ0లో ఉపయోగించే విధానంలో కానీ... అసాధ్యమైన పనులు చేయటంలో కానీ అసాధారణ ఆలోచనలు చేయటంలో కావచ్చు కానీ వ్యక్తం అవ్వటం జరుగుతుంది... మన పనులు చక్కగా నెరవేర్చడం వల్ల సమూహంలోకి, సమూహంలో చేయటం వల్ల అసాధారణ పనులకు పెంచబడతాము... కానీ కొన్ని సార్లు అసాధ్యమైన పనులు చేసేవారిని గమనిస్తే వారు తమ అంతర్గత శక్తిని విస్వసించినట్లు మరి ఏ శక్తిని విశ్వసించలేరు కారణం వారికి అంతరంగమే ముఖ్యం కాబట్టి..

🌸 అంతర్గత శక్తి విషయంలో ఎవరు ఏవిధమైన ఆలోచన ఉన్నప్పటికీ తమని తాము విశ్వసించిన వారికి విజయం సామాన్యం... కానీ వీరికి బద్దకం కూడా అలాగే ఉంటుంది... కారణం సరైన సమయంలో స్పందించగలితే పనులు చాలా సులభంగా చేయవచ్చు అనే భావన ఎక్కువ ఉండటం వల్ల.. అంటే శక్తిని ఉపయోగించే తీరు కూడా అనుభవం తో పరిపక్వత వస్తుంది... దానికి సాధన తోడైతే మన అంతరంగపు కత్తి(శక్తి)కి పదును పెరుగుతుంది... లింకన్ గారు చెప్పినట్లు ఒక చెట్టు నరకటానికి రెండు గంటలు అవసరమైతే అందులో గంటన్నర గొడ్డలికి పదును పెట్టటానికి ఉపయోగిస్తా అనే సూత్రం మనకు అర్ధమౌతుంది.. నిరంతరం మనల్ని మనం పదును పెట్టుకుంటూనే ఉండాలి... అంటే సాధన, స్వాధ్యాయా, సజ్జనసాంగత్యంలు అనే ఆకురాయలతో మనల్ని మనమే పెంచుకుంటూనే ఉండాలి...

🌸 అంటే మనం ఎంత పెద్ద లక్ష్యం కోసం ఆలోచిస్తే అంతగా పదును మన శక్తి(కత్తి)కి అందుతుంది... ఏది చేసినా, చేయాలి అన్న శక్తి అవసరం... శక్తిని అనేక రూపాలలో మనం దర్శించవచ్చు... కనపడే శారీరక, ఆర్ధిక శక్తులు... కనపడని మానసికశక్తి అంటే ప్రేమ, క్షమ, కృతజ్ఞత, జాలి, దయ లాంటి శక్తులు కూడా మనలో భాగమే... పదును పెట్టె ఆకురాళ్లలో ముఖ్యమైనవి కూడా... సాధన వల్ల సమకూరేవి ఇవే... నిరంతరం మనం మనలోని శక్తిని వృద్ధి చేసుకోవడం వల్ల అజేయులుగా, ఆంజనేయ స్వామిలా, అనంతంగా ఉండటం చిన్నవిషయమే...
ఇప్పటికీ ఇంతవరకు...

సాధనతో సమకూరు ధరలోన...

Thank you...🌸🌸🌸

Source - Whatsapp Message

భగవత్తత్వం

🌸భగవత్తత్వం🌸

భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది.

ఒక ఊళ్ళో పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. జీవనోపాధి కోసం అతను మేకల్ని చంపి, వాటి మాంసాన్ని అమ్ముతూ ఉండేవాడు. ఈ క్రమంలో అతని మనసు కరడుగట్టింది. ముఖంలో క్రూరత్వం, మాటల్లో కాఠిన్యం ఉండేవి. అవి జనాన్ని అతనికి దూరంగా ఉంచేవి. చివరకు అతను అద్దంలో తన ముఖం చూసి తానే భయపడే స్థితికి చేరుకొనేవాడు. ఇంట్లో వాళ్ళు కూడా అతణ్ణి చూసి భయపడేవారు. ఈ స్థితి నుంచి బయటపడడం ఎలాగో అతనికి అర్థం కాలేదు.

ఆ ఊరికి ఒక జ్ఞాని వచ్చాడు. పాపయ్య ఆయనను కలిసి, తన బాధంతా చెప్పుకొన్నాడు. తనకు ఓ దారి చూపించమని ఆయనను వేడుకున్నాడు.

‘‘నాయనా! నువ్వు భగవంతుణ్ణి ధ్యానించు. నీకు తప్పకుండా మేలు జరుగుతుంది’’ అన్నాడు జ్ఞాని.

‘‘అయ్యా! భగవంతుడు ఎవరు? అలా ఉంటాడు? నాకు తెలియజెయ్యండి’’ అని అడిగాడు పాపయ్య.

‘‘భగవంతుడు అంటే దయాసాగరుడు. ప్రేమ, కరుణ, శాంతి కలగలిసిన సముద్రం లాంటి రూపం ఆయనది. ఈ క్షణం నుంచీ ఆయన స్మరణలో ఉండడానికి ప్రయత్నించు. భగవంతుణ్ణి ధ్యానిస్తే పాపకర్మలు నశిస్తాయి. అప్పుడే నువ్వు ఆ పరమాత్ముణ్ణి చూడగలవు’’ అని చెప్పాడు జ్ఞాని.

ఆయన ఆదేశం ప్రకారం పాపయ్య తన వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించాడు. భగవంతుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరాడు. ఊర్లూ, వాడలూ తిరిగాడు. అడవులన్నీ వెతికాడు. గుడులూ, గోపురాలూ సందర్శించాడు. ప్రతి మనిషినీ నిశితంగా పరిశీలించాడు. జ్ఞాని చెప్పిన భగవంతుడి రూపం జాడలు ఎక్కడా కనిపించలేదు. విసిగి వేసారిన అతను ఒక ప్రశాంతమైన స్థలంలో చెట్టు కింద కూర్చొని, భగవంతుణ్ణి తలచుకుంటూ మధనపడసాగాడు. మనసులో ఏదో ఆరాటం... ఏదో తెలియని బాధ... అతనికి తెలియకుండానే కనురెప్పలు బరువెక్కి మూతపడ్డాయి. శరీరం తేలికయింది. క్షణాలు నిమిషాలయ్యాయి. అలా ఎన్ని గంటలు గడిచాయో తెలీదు. శరీరం ఉన్నదో లేదో తెలియని స్థితికి లోనయ్యాడు. ఏదో తెలియని ఆనందం... ఒకదాని వెనుక ఒకటిగా అనుభూతుల పరంపర... అతని చుట్టూ అపరిమితమైన వెలుగు.

ఎప్పటికో మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచాడు. అంతా కొత్తగా ఉంది. తిరిగి జ్ఞాని దగ్గరకు వచ్చి, ఆ అనుభవం గురించి చెప్పాడు.

అప్పుడు జ్ఞాని ‘‘నీలోని తపనే నీకు మార్గదర్శకం అయింది. ఇంతకాలం నువ్వు ప్రాపంచిక విషయాలతో కలిసి బతికావు. ఇప్పుడు నీకు బాహ్య విషయాల మీద వైరాగ్యం కలిగింది. అదే నిన్ను అంతర్ముఖుణ్ణి చేసింది. ఇప్పుడు నీ మనసు దానంతట అదే లోలోపల నెమ్మదిస్తుంది. ఆ నిర్మలమైన మనసు నిన్ను ప్రేమమయుణ్ణి చేస్తుంది. నీ మాట, చూపు, ప్రవర్తన అన్నీ శాంతిమయం అవుతాయి. పరమాత్మ గుణాలనూ, శక్తులనూ నీలోలోపల ధారణ చేయడమే మహోన్నతమైన తపస్సు. దాన్ని సాధన ద్వారా మాత్రమే పొందగలవు’’ అని చెప్పాడు.

భగవంతుడు ఆకాశంలోనో, గుడిలోనో... ఏదో లోకంలో సింహాసనం మీద కూర్చొనో మనల్ని పరిపాలిస్తున్నాడనుకుంటాం. అయితే భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది. భగవంతుడివైపు దారి కనిపిస్తుంది. మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. ఈ కథలోని పాపయ్యలాగే ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత క్రూరత్వం, కాఠిన్యం ఉంటాయి. ఆయుధాలతో బాధించేవాడే కాదు, ఎదుటి మనిషిని మాటలతో బాధపెట్టేవాడు కూడా క్రూరుడే! అందుకే ప్రతి మనిషీ తన అంతరంగంలోకి తొంగి చూసుకోవాలి. తనను తాను తెలుసుకోవాలి. అప్పుడే అతడిలో చైతన్య శక్తి ప్రజ్వరిల్లుతుంది.
🌹🌹🌹🌹🌹🌹🌹

Source - Whatsapp Message

Sunday, November 29, 2020

Body-Mind ని తయారుచేస్తాయి

తినడం అనేది ఒక గొప్ప ముఖ్యమైన విషయం, నోట్లోకి ఏది వెళుతుందో అదే శరీరాన్ని నిర్మాణం చేస్తుంది, మనసులోకి ఏది వెళుతుందో అది మనసుని నిర్మాణం చేస్తుంది, మనసు కూడా శరీరాన్ని నిర్మాణం చేస్తుంది, శరీరం కూడా మనసుని ప్రభావితం చేస్తుంది, శరీరం వేరే మనసు వేరే కాదు, ఇదంతా కలిపి ఒక పెద్ద system. కనుక మనము ఏది తింటామో అది శరీరంలో ఉంటుంది, ఏ పుస్తకాలు చదువుతామో అదే మన బుద్ధిలో ఉంటుంది, ఏ దృశ్యాలు చూస్తామో, ఏది వింటామో అది మనసులో ఉంటుంది, ఇవన్నీ కలిపి Body-Mind ని తయారుచేస్తాయి. - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ

Source - Whatsapp Message

ఆల్భర్ట్ ఐన్-స్టీన్ : దేవుడి మీద నమ్మకం

విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఆల్భర్ట్ ఐన్-స్టీన్ పలు విశ్వవిద్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు అతడిని
'మీకు దేవుడి మీద నమ్మకం ఉందా ' అని అడిగేవాళ్ళట.

"ఉంది. స్పినోజా చెప్పిన దేవుడి మీద నమ్మకం" అనేవాడట ఐన్-స్టీన్.

స్పినోజా 17 వ శతాబ్దపు డచ్ తాత్వికవేత్త.
అతడు చెప్పినదాన్ని ఎవరో చాలా గొప్పగా తెలుగులో ఈ విధంగా అనువదించారు.

దేవుడు మనిషికి చెప్పేది.. స్పినోజా మాటల్లో :

"..ప్రార్థనలేవీ అక్కర్లేదు. ప్రపంచం లోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి.
సృష్టి సర్వం తో మమేకం కండి.
హాయిగా నవ్వండి. భువన గానం లో భాగం కండి.

ప్రార్థనా మందిరాలకు వెళ్లడం దేనికి? నేనక్కడ ఉంటానని ప్రకటిస్తూ అవన్నీ మీ నిర్మాణాలేగా!

పర్వతాలూ, చొరలేని అరణ్యాలూ, నదులూ, సరోవరాలూ, సాగర తీరాలూ... ఇవీ నా నివాసాలు.

మీ దౌర్భాగ్యాలకు నన్ను నిందించడం వదిలెయ్యండి.
మీ తప్పటడుగులూ, పాపాలతో నాకు ప్రమేయం లేదు.

మీ పవిత్ర గ్రంధాలతో నాకే సంబంధమూ లేదు.

ఒక పొద్దు పొడుపులో, ఒక నిర్జన మైదానంలో, ఒక ఆత్మీయ మిత్రుడి స్పర్శలో, మీ బిడ్డ కళ్ళలో ఉంటాను నేను.
ఏవో పుస్తకాల పుటల్లో కాదు.

అవధి లేని ప్రేమ నేను. నేను ఏ తీర్మానాలు చెయ్యను, నిన్ను విమర్శించను. నువ్వంటే కోపాలూ , పట్టింపులూ ఉండవు.

క్షమాపణలేవీ నన్ను అడగకు. క్షమించ వలసినవేవీ ఉండవు.

నీ పరిధులూ, పరితాపాలూ, ఉద్వేగాలూ, సుఖాలూ, అవసరాలూ అన్నీ నేను నీలో నింపినవే. అలాంటప్పుడు నీ అతిక్రమణలకు నిన్నెలా శిక్షిస్తాను నేను?

నిన్ను కాల్చివేసే నరకమొకటి నేను సృష్టించి ఉంటే నేనేం దేవుణ్ణి ?

నిత్య జాగృతిలో బతుకు. అదే నీ దిక్సూచి. ఇతరులు నీకేది చేయకూడదని నువ్వు భావిస్తావో అది నువ్వు వాళ్లకు చెయ్యకు.

బతుకంటే అదేదో పరీక్ష కాదు.
ఒక రిహార్సల్ కాదు.
ఏ స్వర్గద్వారాలకో పీఠిక అసలు కాదు.
ఇక్కడ నడిచే, గడిచే వాస్తవం!!! అంతమాత్రంగానే చూడు దాన్ని.

పరిపూర్ణ స్వేచ్ఛనిచ్చాను నీకు.
శిక్షలూ, పురస్కారాలూ, పాపాలూ, సద్గుణాలూ నా నిఘంటువులో మాటలు కాదు.
ఏదో కలంతో వాటినెవ్వరూ నా దివాణంలో లెక్క కట్టరు. స్వర్గం, నరకం నీకు నువ్వే నిర్మించుకోవాలి.
ఆ స్వేఛ్చ నీదే.

ఈ బతుకు ముగిశాక ఇంకొకటేదైనా ఉందో, లేదో నేను చెప్పను. కానీ దీని తరువాత ఇంకేదీ లేదన్నంత దీక్షగా బతుకు. ఇంకొక బతుకు ఉంటే ఇంతకుముందు నువ్వు ఏం చేశావు, ఇంకేం విస్మరించావు - అనే లెక్కలు నేను తిరగదోడను.

నన్ను నమ్మకు.
నమ్మడం అన్నది ఊహాత్మకం.
నిన్ను నువ్వు నమ్ముకో.

ఏ సాగర జలంలోనో ఈత కొడుతున్నప్పుడో, ఒక శిశువును హత్తుకున్నప్పుడో, పెంపుడు పశువును నిమిరేటప్పుడో నేను గుర్తురావడమే నేను ఆశించేది.

నీ కీర్తనలు అన్నీ వదిలెయ్యి.
వాటికి ఉప్పొంగిపోతే నేనేం దైవాన్ని?

నీ ఆరోగ్యం, నీ సంబంధాలూ, సంతోషాలూ సరిచూసుకో.

అదే నాకు నువ్వు పఠించే స్తోత్ర పాఠం.

నా గురించి ఇప్పటికే నీ బుర్ర నిండా ఉన్న సరంజామా అంతా చేజార్చుకో.
చిక్కుముడి అదంతా. అద్భుతాలూ, వాటికి అన్నేసి వివరణలూ దేనికి ?

నువ్వు ఇప్పుడు ఇక్కడ శ్వాసిస్తూ ఉన్నావ్.

అంతకు మించిన అద్భుతం ఏదో ఇంకా ఎందుకు...? 🙏🏻🙏🏻🙏🏻

Source - Whatsapp Message

ఇస్తేనే వస్తుంది!

🌸ఇస్తేనే వస్తుంది!🌸

పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టడమంటే ఒక్కొక్కటి వదిలేయాలి. అధికంగా ఉన్న డబ్బులు, దుస్తులు దానం రూపంలో వెళ్లిపోవాలి. ఈ విషయాన్ని మారద వెంకయ్య రాసిన భాస్కర శతకంలోని ఓ పద్యం ద్వారా తెలుసుకుందాం.

🌹అడిగినయట్టి యాచకుల యాశ లెరుంగక లోభవర్తియైు
కడిపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె
య్యెడల నదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్‌
గుడువగనీనిచో కెరలి గోవులు తన్నునుగాక భాస్కరా!

‘పెట్టి పుట్టాడు’ అని అంటుంటారు. ‘పూర్వ జన్మలో పెడితే ఇప్పుడు పుట్టాడు’ అని దానర్థం. మనం పెట్టిందే మనకొస్తుంది. పేదవాళ్లు, బలహీన వర్గాలు ఆశ పడితే వాళ్లకు ఇచ్చేయాలి. వాళ్లకు ఇవ్వకుండా మొత్తం మనమే అనుభవిద్దామని చూడకూడదు. సమాజం నుంచి మనం సంపాదించుకున్న ఆస్తిని, తిరిగి ఏదో రూపంలో సమాజానికి అందజేయకుండా మనమే దాన్ని అనుభవిద్దామని పిసినిగొట్టు వాడిలా ప్రవరిస్తే, ఆ ధర్మదేవత ఏదో ఒక సమయంలో ఆ ఆస్తి మళ్లీ రాకుండా చేస్తుంది. ఎలా అంటే... గేదె పాలు కావాలంటే ముందుగా దూడను తాగనివ్వాలి. అలా తాగనివ్వకపోతే గేదెకు కోపం వచ్చి ఒక్క తన్ను తంతుంది. అలాగే ఇతరులకు పెట్టడం ద్వారా సమాజం నుంచి పొందాలే తప్ప, ఏమీ పెట్టకుండా పొందాలనుకోవడం పొరపాటు.

గరికిపాటి నరసింహారావు

Source - Whatsapp Message

పాపమే భవబంధాలకుమూలం

🌸పాపమే భవబంధాలకుమూలం🌸

పాపం అనే పదాన్ని ఆధ్యాత్మిక విద్యలో మలం అని కూడా అంటారు. మలం లేక పాపం అనే మాయా భూతం మనిషితో అనుచిత కార్యాలు చేయిస్తుంది. మానవుని మాన్యతను లోపింపజేస్తుంది. ఆపదలకు గురిచేస్తుంది. తద్వారా అమూల్యమైన మానవ జీవితం అయోమయమౌతుంది. ఇహ, పర లోక సాధన ఫలితం మృగ్యమైపోతుంది. మలం (పాపం) సమూలంగా వెడలిపోవాలంటే ఆధ్యాత్మిక సాధన అత్యంత ఆవశ్యకం. అది జన్మసార్థకం కలిగించి, అమోఘమైన ఆనందాన్నిస్తుంది. అది జరగాలంటే కామక్రోధాల కలుషితం ఖండమైపోవాలి. కర్మ ఫలిత త్యాగం జరగాలి. కామ్యకర్మలు శాస్త్రవిరుద్ధాలు. అవి తప్పకుండా నిషేధింపబడాలి. ఎందుకంటే అవి చిత్తశాంతిని నిర్మూలిస్తాయి. కర్తృత్వ భావం (ఇది నేనే చేశాను, నావల్లే జరిగింది అనే అహంకారం) వల్ల కామక్రోధాదులు కలుగుతాయి. కామక్రోధాదులు.. తీరని పాపరాశులు. భయంకరమైన అంతఃశత్రువులు.

🌹కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్‌

రజోగుణం వల్ల పుట్టే కామం.. క్రమంగా క్రోధంగా మారుతుందని, పాపకారణాలైన వాటిని అంతం చేయనిదే మనిషి మంచిపనులు చేయలేడని జగద్గురువైన ఆ కృష్ణపరమాత్మ గీతాశాస్త్రంలో బోధించాడు. మనిషి రాగద్వేషాలకు వశం కాకుండా అశాశ్వతమైన ప్రాపంచిక భోగాలకు స్వస్తి పలికి శాశ్వతమైన పరమాత్మ ప్రయోజనాన్ని గుర్తించాలి. పనుల ఫలితాలు పరమాత్మకర్పించాలి. తత్ఫలితంగా మనసులోని మలినం తొలగిపోతుంది. శాస్త్రవిహితమైన సత్కర్మలే ఆచరిస్తారు. అంతటితో మలం (పాపం) భస్మమైపోతుంది. అవిద్య అంతమైపోతుంది. సమానత్వ భావం అంతఃకరణశుద్ధిని కలుగచేస్తుంది. కర్తవ్యకర్మలను ప్రోత్సహిస్తుంది. కర్తవ్యకర్మలతో కామ్యకర్మలంతరిస్తాయి. అంతటితో మలమనే పాపం మాయమైపోతుంది. సమానత్వభావమే యోగమని కూడా గీతలో చెప్పబడింది. సమానత్వంతో సాధింపరానిదేది ఉండదు.

వ్యక్తి ఆ పవిత్రగుణంతో సమాజాన్ని సంతసపరచే బృహత్తరమైన కర్మలు చేయడానికి పూనుకొంటాడు. నిస్వార్థ బుద్ధితో దానధర్మాలు చేయడం, ఆపదలోనున్నవారిని ఆదుకోవడం, సంఘీభావం వెలయించే సలహాలివ్వడం, సత్యసాధనోద్ధరణ సాగించడం, ధర్మో రక్షతి రక్షితః అనే సూక్తిని మనసా వాచా నమ్మి, ఆచరించడం మొదలైన సద్గుణాలతో తరిస్తాడు. పరమాత్మను నమ్మినవారు ఎన్నటికీ చెడిపోరు. వారు అన్నివిధాలా అత్యంతోన్నత ప్రయోజనాన్ని పొందగల్గుతారు.
👏👏👏

Source - Whatsapp Message

Saturday, November 28, 2020

జీవుడినైనా దేవుడినైనా నిష్కామంగానే సేవించడం అలవరచుకోవాలి.

మనసు విచిత్రమైంది. ఒకే ఆలోచన మీద నిలకడగా ఉండదు. మంచి మాటల దారాలతో కట్టినప్పటికీ గాలిపటంలా గిరికీలు కొడుతుంది. కష్టసుఖాలను పక్కపక్కనే ఉంచి ఒకదాన్ని ఎంచుకొమ్మంటే సుఖం వైపే మొగ్గు చూపుతుంది. దుఃఖానికి వెనకడుగు వెయ్యడం, సుఖం కోసం ఆరాటపడటం- రెండూ మనసుకున్న బలహీనతలే. సుఖాస్వాదనకు అలవాటుపడిన మనసు అది తన నుంచి దూరం కావడం ఏ మాత్రం సహించలేదు. కోరికలు నిండిన మనసుతో భగవంతుణ్ని సేవిస్తే అది బానిసత్వం. వాంఛారహిత స్థితితో దైవం ముందు సాష్టాంగపడటం నిజమైన భక్తుడి తత్వం. సర్వేశ్వరుడికి ఇష్టమైంది నిష్కామసేవ.
సుఖం అనే గాలాన్ని చూపించి మనసును మోహింపజేయడం లోక స్వభావం. అస్థిరతకు చిరునామా వంటి మనసును కారణజన్ములు గాటన కట్టేయగలుగుతారు. కోరికలకు తలలూపే నైజాన్ని మాన్పించి కష్టసుఖాలు రెండూ జీవుడి ప్రస్థానంలోని భాగాలే అని దాని చేత ఒప్పిస్తారు. అన్నమాచార్యులు, పోతన వంటి మహాపురుషులు నాటి పాలకులు తమపై విసిరిన ఆశల వలల్ని ఛేదించగలిగారు. తాత్కాలిక కష్టాలను అనుభవించారు. ఆ ఇక్కట్లు వారి చరితను శోభింపజేసి, శాశ్వత మోక్షప్రాప్తికి కారణమయ్యాయి.
అన్ని సమయాల్లోనూ సుఖంగా జీవించగలగడం ఒక నేర్పు. పాంచభౌతికమైన దేహాన్ని ఆకలి దప్పులు బాధిస్తుంటాయి. అవి తీరినప్పటికీ కొంతమంది అసం తృప్తులు నిరాశతో జీవిస్తుంటారు. సిద్ధార్థుడు సతీ సుతులను వదిలి పెట్టాడు. నిరాహారుడై తపస్సు చేశాడు. అతడు పొందిన జ్ఞానోదయ సారాంశం- అన్ని దుఃఖాలకు కారణం కోరికలు అన్న సత్యం.ఈ వాస్తవం కొన్ని శతాబ్దాల పాటు దేశ దేశాల్లోనూ ప్రభావం చూపించింది. పాలకుల నుంచి ప్రజానీకం వరకు ఆశారహిత జీవనంలోని మాధుర్యాన్ని చవి చూశారు.రాజ్య విస్తరణ కాంక్షను విడిచిపెట్టి అశోకుడు అన్ని శోకాల్నీ అధిగమించాడు. నిష్కామంగా ప్రజల్ని సేవించి ప్రజారంజక పాలకుడు అనిపించుకున్నాడు.
ప్రతి ఏడాది కాలం గీసే ప్రకృతి చిత్రం నిష్కామ సేవకు ప్రతీకగా నిలబడుతుంది. సూర్యభగవానుడి ఎండ ధాటికి భూమి బీటలు వారుతుంది. వరుణదేవుడి కరుణా దృష్టికై ఆకాశాన్ని అర్థిస్తుంది. సామాన్యుల శ్రవణేంద్రియాలకు వినిపించని నిశ్శబ్ద సందేశాన్ని ప్రకృతి పరమాత్మకు చేరవేస్తుంది. ఈ నేలతో సంబంధంలేని రుతుపవనాలు ఏ మూల నుంచో వేగంగా వీస్తాయి. ఆకాశం ఒక్కసారిగా తన రూపాన్ని మార్చుకుంటుంది. ఉరుములు ఉరుముతాయి. నీటికై ఎదురు చూసీ చూసీ భూమి అడుగు పొరల్లో ఎండిపోతున్న విత్తనాన్ని నీటి చెమ్మ పలకరిస్తుంది. చల్లని తన స్పర్శతో ఆ గింజకు ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. ఎంతో ఉత్సాహంతో భూమి పైపొర దాకా ఎదిగొచ్చిన విత్తనం రెండుగా చీలిన తన భాగాలను ఒక్కటిగా చేసి నమస్కార ముద్రతో ఆకాశానికి ప్రణామం చేస్తుంది. ఏరులుగా నదులుగా పారిన నీరు దాహార్తితో అలమటిస్తున్నవారి గొంతు తడుపుతుంది. నిశ్శబ్దంగా పైకెదిగిన మొక్క ధాన్య సిరుల్ని రైతుకు అందిస్తుంది.ప్రపంచ చిత్రపటం మీద కాలం గీసిన ఈ చిత్రం ప్రతి ప్రాణికీ సుపరిచితమైందే. భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే వర్ణాల కలయికతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
పంచభూతాత్మకమైన శరీరంలో కొలువైన మనసు తెలుసుకోవాల్సిన సత్యం ఒకటుంది- ఏదీ నీది కాదు, నీతో ఏదీ రాదన్న వాస్తవానికి మనసు తలొగ్గక తప్పదు. ప్రలోభపెట్టే కోరికలకు ప్రభావితం కావడాన్ని మనసు తగ్గించుకోవాలి. జీవుడినైనా దేవుడినైనా నిష్కామంగానే సేవించడం అలవరచుకోవాలి.

Source - Whatsapp Message

Friday, November 27, 2020

ప్రతి స్త్రీ కూడా తాను ఒక వ్యక్తిగా ఏమి చేయాలని కోరుకుంటే అది చేయాలి.

👩‍🦰 ప్రతి స్త్రీ కూడా తాను ఒక వ్యక్తిగా ఏమి చేయాలని కోరుకుంటే అది చేయాలి. అదేదో సమాజంలో ఒక ధోరణిగానో లేకపోతే ప్రపంచంలో అదొక్కటే చేయదగిన పనిగానో చిత్రించకూడదు. ఒక స్త్రీ ఇద్దరు పిల్లల్ని కని వారిని పెంచి పెద్దచేయాలనుకుంటే అది ఆమెను రోజంతా పనితో తీరిక లేకుండా చేస్తుంది. ఆమె బయటికి వెళ్లి ఉద్యోగం చేయకోడదని నేననటం లేదు. ఒక వ్యక్తిగా ఆమె ఏమి కోరుకుంటే అది చేయవచ్చు. ఆ స్వేచ్ఛ ఆమెకుంది. కానీ ఇద్దరు పిల్లలుండడమంటే కేవలం పునరుత్పత్తి కాదు. మీరు తరువాతి తరాన్ని తయారు చేస్తున్నారు. రేపటి ప్రపంచం ఎలా ఉంటుందన్నది నేటి తరం తల్లుల స్వభావమే నిర్ణయిస్తుంది.

‘‘మీరేం చేస్తున్నారు?’’ అని నేను మహిళలను అడిగినప్పుడు, చాలా మంది‘‘ఏమీలేదు, నేను ఇల్లాలిని మాత్రమే’’ అని చెప్తుంటారు. ‘‘నేను కేవలం ఇల్లాలినే అని మీరెందుకు చెప్తారు?’’ అని అడుగుతాను నేను. ఇద్దరు ముగ్గురు జీవితాలను పెంచి పోషించడంలోని ప్రాధాన్యాన్ని వాళ్లు గుర్తిస్తున్నట్లు నాకనిపించడం లేదు. అది చాలా ముఖ్యమైన పని. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’ వంటి మాటలెప్పుడూ మా అమ్మ నాతో అనలేదు. కాని ఆమె జీవించిన పద్ధతి ఎలాంటిదంటే ఆమె మమ్మల్ని ప్రేమించిందా, లేదా అన్న ఆలోచనే మాకెప్పుడూ రాలేదు. ఆమె జీవితమంతా మాకే అంకితమైపోయింది కాబట్టే అటువంటి ప్రశ్న ఎప్పుడూ తలెత్తలేదు. ఆమె మాకోసమే జీవించిందని మాకు తెలుసు. ఆ కాలంలో ఆవిడ మాతో లేని జీవితాన్ని అసలు నేను ఊహించను కూడా లేను.

నేనేమిటి అన్న విషయంలో మా అమ్మ ఎప్పుడూ క్రియాశీలక పాత్ర పోషించలేదు, కాని ఆమె నా చుట్టూ కల్పించిన వాతావరణమే లేకపోతే నేను ఇప్పుడున్నట్టుగా ఎప్పటికీ ఉండగలిగేవాడిని కాదు. అటువంటి వాతావరణాన్ని కల్పించడానికే ఆమె తన జీవితాన్ని అంకితం చేసింది, ఇదెక్కడో తన పాత్ర పోషిస్తుందని ఆమెకు సంపూర్ణంగా తెలుసు. నా విషయంలో ఆమె చేసిన అతి ముఖ్యమైన పని ఇది. ఇది ముఖ్యమైన పని కాదని ఎవరైనా ఎందుకనుకుంటున్నారు? మా చిన్నతనంలో మేము దేని గురించీ ఆలోచించవలసిన అవసరం లేకపోయింది. మాకు కావలసిన ఆధారం ఎప్పుడూ ఉండేట్లు ఆమె చూసింది. మా చుట్టూ ఏం జరుగుతున్నా, దాన్ని పట్టించుకోకుండా మేము కాలం గడిపేయగలిగాం; రోజుల తరబడి కళ్లు మూసుకొని కూర్చునే అవకాశాన్నిది నాకిచ్చింది.

ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా ఆర్థిక చట్రమే. డబ్బు అంటే మీకు కావలసిన వస్తువులను సమకూర్చుకోవడం. పురుషులు, వారి కుటుంబానికి కావలసినవి సమకూర్చుకునే పనిచేస్తుంటే స్త్రీలు జీవితంలోని మరింత సుందరమైన అంశాలగురించి మాట్లాడేవారు. ఇప్పుడు స్త్రీలు కూడా సంపాదనలో పడాలని కోరుకుంటున్నారు. కుటుంబానికి అటువంటి అవసరం ఉంటే మంచిదే, ఆమె అలాగే చేయవచ్చు. కాని ఇది ఆమె చేయవలసిన పనుల్లో సంపాదనే మెరుగైన పని అన్న భావనను స్థిరపరచకండి. ఆమె పాడగలిగితే, సంగీత వాద్యాలు వాయించగలిగితే, వండగలిగితే – లేదా తన పిల్లల్ని ప్రేమిస్తే – ఆమె అందంగా ఓ పువ్వులాగ జీవించగలుగుతుంది – అది చాలు కదా.

స్త్రీ డబ్బు సంపాదిస్తేనే విలువైన పని చేస్తున్నదనుకోవడం సరైనది కాదు. ఆర్థికావసరం ఉంటే, ఆమెకటువంటి కోరిక ఉంటే, ఆమె అలాగే చేయవచ్చు. కాని లోకంలో మనం అటువంటి విలువలు స్థాపించవలసిన అవసరం లేదు. అది సమాజవికాసం కాదు; జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం కంటే జీవనోపాదే ఎక్కువ ముఖ్యమన్న తిరోగమనమైన చర్య అవుతుందది.🤔

మీ
మురళీ మోహన్

Source - Whatsapp Message

Thursday, November 26, 2020

క్షణికావేశంతో నిర్ణయాలు ఎన్నటికి ఫలితాన్నివ్వవు ..నోరుజారేముందు ఎంతవరకు అది భరించ సాధ్యమోకూడా నిర్ణయించుకోవాలి

క్షణికావేశంతో నిర్ణయాలు ఎన్నటికి ఫలితాన్నివ్వవు ..నోరుజారేముందు
ఎంతవరకు అది భరించ
సాధ్యమోకూడా నిర్ణయించుకోవాలి

సత్యహరిచ్చంద్రుడి పాత్ర , మాట ఇచ్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు , అది శక్తికి మించినదైతే చాతకాదని విన్నవించుకో , లేదా తీర్చడానికే సిద్ధమైనప్పుడు , ఉత్పన్నమయ్యే సమస్యలనుకూడా సంతోషంగా అనుభవించడానికి సిద్ధంగా ఉండు అనిపిస్తుంది .. భారతంలో ధర్మరాజుపాత్ర " నీ బలహీనతవలన సంభవించే నష్టాన్ని నీవే భరించాలి తప్ప , ఆ బలహీనత కారణంగా అదికారం ఉందికదా అని నీ ప్రక్కవారినికూడా యిరుకునబెట్టే ప్రయత్నంచేయకు అని చెప్పినట్లనిపిస్తుంది ..

ఎన్నో సౌకర్యాలున్నా , చేతినిండా ఆదేసించే అదికారం ఉన్నా
అన్ని భోగాలను త్యజించి , ఆత్మజ్ఞానంకోసం చెట్టుకింద కూర్చున్న గౌతమబుద్ధుడు తొలుత లోకానికి పిచ్చివాడిగానే కనిపించి ఉండొచ్చు ..
ముక్కుమూసుకొని తపసుచేసుకొనే సర్వసంఘపరిత్యాగికి , శరీరభోగాలకై అలమటిస్తూ , మాయలోపడి దొల్లుతున్న లోకo పిచ్చిగా కనిపించవొచ్చు ..

బాబా ఆ గ్రామంలో అడుగుపెట్టకముందు , షిర్డీ అనే గ్రామం ఒకటుందని ఆ ప్రాంతవాసులె పట్టించుకొలేనంత కుగ్రామం , ప్రస్తుతం ప్రపంచ పటంలో వాసికెక్కిన పట్టణాలలో శిరిడీ కూడా ఒకటిగ వన్నెకెక్కింది ..రుచి చూడనంతవరకూ
పదార్ధం విలువ తెలియదు , ఆయనెవరో అర్థం కానంతవరకు కొన్ని సంవత్సరాలపాటు నిత్యము గమనిస్తున్న ఆ గ్రామవాసులకే అర్థంకాలేదు .. ఆయన నిత్యచర్యలు
నిథానంగా వోక్కక్కరే ఆయనను కలుస్తూ , పొందిన అనుభవాలు ఆయనొక మహాత్ముడని మూల మూలకు ప్రచారం పాకింది ..

అయన సిద్ధాంతంలో ఒక భాగం
" మాట యివ్వకు , యిస్తే ప్రాణంపోయేపరిస్థితిలో కూడా అది తప్పకు " అని .. మనిషి ఉన్నంతవరకే దేన్ని సాదించాలన్నా , దేనిని తీర్చాలన్నా .. చావు , పుట్టుకలకు అతీతమైన మహాత్ములవాక్కు , వారు శరీరం చాలించినా , అవి నెరవేరుతునే ఉంటాయనేది నిత్యము , సత్యమూ కూడా ..

దేనిని క్షణికోద్రేకంతో నిర్ణయించుకోకు , ఒకటి రెండు సార్లు గట్టి నిర్ణయంతో ఆలొచించు , అడుగుపెట్టినచోట సంశయాలకు తావివ్వక , సడలని విశ్వాసంతో నమ్మకం గట్టిదైతే , సమాధికూడా సజీవంగా జవాభిస్తూనే ఉంటుంది ..

మహాత్ముల మాటలెప్పుడూ మొదట విడ్డూరంగానే అనిపిస్తాయి ..
సద్గ్రంథాలలో సత్యహరిచ్చంద్రునిలాంటి పాత్రలెప్పుడూ సత్యదూరమేమో అని సందేహాలను రేకింతించవొచ్చు , గట్టి ప్రయత్నంతో , విశ్వాసముంచి అడుగుముందుకుపడితే , అవే స్వానుభవానికొచ్చి , మనసు వాస్తవానికి దగ్గరకాగలదని పెద్దలమాట

Source - Whatsapp Message

ప్రేమా ? పగా ? అమ్మను మోసంచేస్తున్నాను !

ప్రేమా ? పగా ?
🍀🌺🍀🌺🍀
అమ్మను మోసంచేస్తున్నాను !
➖➖➖
తల్లికి నిద్ర మాత్రలు వేసుకోవటం అలవాటు అయిపోయింది.
మాత్రలు ఇవ్వకపోతే నిద్రపోను అని మారాము చేస్తున్నది.
కొడుకుకు ఈమధ్యే పెళ్లయింది.
కోడలిది వైద్య వృత్తి.
నిద్ర మాత్రలు మంచివి కావు అని అత్త గారికి చెప్పటానికి చాలా ప్రయత్నం చేస్తున్నది. కానీ అత్తగారు వినటం లేదు. 'మీరు ఎంత అరిచి గీపెట్టినా మాత్రలు ఇవ్వను.' అని కోడలు తేల్చి చెప్పేసింది.
చివరికి ఆ తల్లి తన కొడుకుని పిలిచింది. కొడుకు వస్తూనే 'అమ్మా నోరు తెరువు' అని నిద్ర మాత్రలు తీసి ఆమె నోట్లో వేసి మంచినీరు అందించాడు. ఆమె వాటిని మింగి కొడుకుని మనసారా ఆశీర్వదించి హాయిగా నిద్రపోయింది.
ఆ అమ్మాయి కోపంగా 'ఎందుకు ఇట్లా చేశారు?' అని భర్తను అడిగింది. అతను ఆ మందు డబ్బా భార్యకు చూపించాడు. అది విటమిన్ మాత్రలు అని చూస్తూనే అమ్మాయి పెదవులపై నవ్వు విరిసింది.
నెమ్మదిగా, 'అమ్మని మోసం చేస్తున్నారా?' అని అడిగింది.
అప్పుడు అతను, 'అమ్మ కూడా చిన్నప్పుడు మోసం చేసి మాకు బోలెడు తినిపించేది. మాయ మాటలు చెప్ప నిదుర
పుచ్ఛేది .అప్పట్లో ఆమె మోసం చేసేది.. ఇప్పుడు నేను పగ తీర్చుకుంటున్నాను.' అని అన్నాడు.
ఇట్లా కూడా అమ్మను ప్రేమించవచ్చు.
💝💝💝💝💝💝💝💝💝 💝💝💝
🙏🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Source - Whatsapp Message

Wednesday, November 25, 2020

మధ్య తరగతి మనో "గతం"

🔻మధ్య తరగతి మనో "గతం"

(ఎవరో తస్కరించి వాట్సాప్ లో పెట్టేరు .. మన కోసం .)
🚩
ఎవరో ఈల వేసి పిలిచినట్టు సెల్ ఫోను
మోగగానేఆయనకేసి చూశాను
జాపుకున్న కాళ్ళకి పతంజలి నూని రాసుకుంటూ...
"పార్వతీ ! నీ కొడుకు నీ అకౌంటకి 2000 డాలర్లు పంపాడట ,
వ్వాట్సాప్ లో చెబుతున్నాడు" అన్నారు
మావారు శంకర ప్రసాదు గారు.
"డాలర్లలో చెప్పకండి, నాకర్ధమయ్యేట్టు రూపాయల్లో చెప్పండి" అన్నాను విసుగ్గా.
"2000 ని 74 తో గుణించు... రూపాయల్లో వస్తుంది " అన్నారు విద్యార్థికి లెక్క ఇస్తున్నట్టుగా
"ఆ గుణకారాలేవో మీరే చెయ్యండి,
లెక్కల మాష్టారు కదా ?" అన్నాను తెలివిగా .
"లక్షా నలభై ఎనిమిది వేలవుతుంది" అని చెప్పేసి వ్వాట్సాప్ లోకి దూరిపోయారు యధాలాపంగా.

🚩
చెప్పొద్దూ... అమెరికా వెళ్ళినప్పుడల్లా ఏ మాల్ కి వెళ్లినా ధరలు చూసి వెంటనే 70 తో గుడించేదాన్ని,
నాకు ఏడో ఏకం బాగానే వచ్చు .

రూపాయిల్లోకి మార్చాక గుండె గుభేల్మనేది .
"ఇక్కడ రూపాయల్లో ఆలోచించ కూడదమ్మా"
అనేవారు పిల్లలు.
పుట్టుకతో వచ్చింది ఊరికినే పోతుందా ?
🚩
కరివేపాకు కట్ట 70 రూపాయలట !
అందుకే.. కూరల్లో,చారులో కొంచం తగ్గించే వేసేదాన్ని.
ఎప్పుడు ఏ సంఘటన జరిగినా ...
ఎందుకో పాత జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి.
ఈయన మూడేళ్ళ కిందట రిటైర్ అయ్యాక మరీను !
🚩
ఇప్పుడు నా రెండో కొడుకు ప్రత్యేకం జ్ఞాపకంపెట్టుకుని,
నాపుట్టిన రోజుకి ఏదైనా కొనుక్కోమని లక్ష చిల్లర డబ్బులు పంపిస్తే ఆనందమే ....కానీ....
అప్పట్లో మా మావయ్య నాపుట్టిన రోజుకని ఇచ్చిన యాభై రూపాయలకి ఎంత సంబర పడిపోయానో....
ఎంత మందితో చెప్పుకున్నానో !
అంత సంతోషించడానికి కారణం ఆ వయసా ?
అప్పటి పరిస్థితులా ? లేక అవసరాలా? ఏమో!
🚩
ఇప్పుడు ఖరీదైన 4 బెడ్ రూముల అపార్టుమెంటు,
ఏసీలు,సోఫా సెట్లు,కింగ్ సైజు మంచాలు, అమెరికా పరుపులు, పేద్ధ టీవీ, ఖరీదైన కారు ...అన్నీ ఉన్నా....

ఎందుకో.. ఆ మూడు వరస గదుల అద్దె ఇంట్లో
మా అత్త గారు,మేవిద్దరం,ముగ్గురు పిల్లల్తో ఉన్నా
ఎంతో ఆనందంగా, కళ కళ్ళాడుతూ ఉండేది !
ఇరుకు అనిపించేదే కాదు.
🚩
సెకండు హ్యాండు స్కూటర్ మీద ఆయన అలా ...
గోదారి గట్టు మీదకి తీసుకెడితే ...
ఆ ‘ఇదే’ వేరు !
ఫ్రిజ్ కూడా లేదు, నలుపు, తెలుపు టీవీ లో చిత్ర లహరి చూస్తుంటే ఏమి ఆనందించాం !
🚩
మా ఆడపడుచులు వస్తే అందరం బరకం పరుచుకుని, పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే.. నిద్రే వచ్చేదికాదు !
మా అత్త గారు కూడా మధ్యలో కబుర్లు కలుపుతూ, కునికి పాట్లుపడుతూ,
"ఇంక చాలు, పడుక్కోండి, తెల్లారి పోతోంది,
మళ్ళీ పెందలాడే లేవాలి" అనేవారు.
🚩
మా కబుర్ల కంటే నవ్వులే ఎక్కువగా ఉండేవి,…
ఎవర్నీ నిద్దరోనీకుండా.
మా ఆడపడుచులు ఎంతో మంచివాళ్ళు,
ఇప్పటి టీవీ, సినిమా ఆడపడుచుల్లా కాదు.

అప్పట్లో ఈయన పినతల్లి కొడుకు పెళ్లికి వెళ్ళాలంటే మంచి పట్టు చీరలే ఉండేవి కావు.

🚩
ఇప్పుడు మూడు బీరువాల నిండా ఎవరెవరో పెట్టినవి, పెట్టించుకున్నవి,కొనుక్కున్నవి చాలా ఉన్నాయి.
పట్టు చీరలైతే లెక్కే లేదు…. ఫాన్సీ చీరలు ఉన్నా ...
ఏం కట్టుకుంటాం ?

అటూ, ఇటూ అందరి పెళ్ళిళ్ళూ అయిపోయాయి.
అందరి కుటుంబాల నించీ ఒక్కళ్ళైనా అమెరికాయో,
లండనో చెక్కేశారు.
మా రోజుల్లో కొంపకి ఒక్కళ్లు హైదరాబాద్ వెడితే ...
‘అబ్బో’ అనుకునే వాళ్ళం.
శ్రావణ మాసం పేరంటంలో ఎవరైనా
"మావాడు హైడ్రాబాడ్ లో చార్మినారు,ట్యాంకు బండూ చూపించాడు" అంటే,
మనం ఎప్పుడు చూస్తామో అనుకునే వాళ్ళం.
🚩
ప్రస్తుతం మా పిల్లలు, ఇద్దరబ్బాయిలూ,
ఒకమ్మాయి అమెరికా లో స్థిరపడ్డారు...
"శతమానం భవతి" సినిమాలో లాగ.

నేనూ,ఈయనా ఇక్కడే భాగ్య నగరంలోనే ఉండిపోయాం...
జయ సుధా, ప్రకాష్ రాజుల్లాగా.
🚩
కొడుకులు ఫోను చేసినప్పుడల్లా "గ్రీన్ కార్డు" అంటూవుంటారు....
స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ మాటిమాటికి
"నా ఉజ్జోగం?" అన్నట్టు!

ఎందుకో అమెరికా వెళ్లాలంటే ఇంకా మనసు
రావడం లేదు,
🚩
ఇక్కడే పాత స్నేహితులు,చుట్టాలతో వాట్సాప్, ఫోనులతో కాలక్షేపం చేయడమే ఇష్టం.
తరవాత్తరవాత భగవంతుడెలా నిర్ణయిస్తాడో మరి!
నాకు మాత్రం, ఆ టీవీ సీరియళ్లు, చాగంటి వారి ప్రవచనాలు చూసుకుంటూ వేళకి ఇంత ఉడకేసిపడేస్తే
హాయిగా గడిచిపోతుంది.
🚩
అన్నట్టు మొన్న వేసంకాలం మా అమ్మాయి, పెద్ద మనవరాలు, మనవడు వచ్చినపుడు వేలకి వేలు తగలేసి నాకోసం ట
స్మార్టు ఫోను,టాబ్ కొన్నారు.-....చెప్పాచెయ్యకుండా .
వాటిల్లో వాట్సాప్, యూట్యూబు పెట్టి నన్ను చూసుకోమన్నారు.
మా పెద్ద మనవరాలు మా హై స్కూల్ సైన్సు మాష్టారి లాగ అన్నీ నేర్పించి వెళ్ళింది.

ఈయన నేర్పితే రాదుకానీ...
అది నేర్పితే బాగానే అలవడ్డాయి నాకు.

నిజంచెప్పొద్దూ... అవన్నీ నేర్చుకున్నాక,
రోజూ పిల్లలందరి మెసేజీలు, ఫోటోలు, వీడియోలు,
రక రకాల విశేషాలు చూస్తుంటే ...మాటాడుతుంటే…
టైమే తెలియడంలేదు.

ఈమధ్య ‘భావుక’ మిత్ర బృందం తో చేరాక చిన్నప్పటి
నా క్లాసు మేట్లు అందరూ కట్టగట్టుకుని వచ్చినట్టుంది.

పిల్లలు ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్నారనే భావమే రావడంలేదు.
🚩
అదే నా పెళ్ళైన కొత్తలో నలభై కిలోమీటర్ల దూరం లో ఉన్న
మా అమ్మ కోసం ఎంత బెంగెట్టుకునేదాన్నో!
ఏమాటకామాటే చెప్పుకోవాలి, పాపం ఈయన వారానికి రెండుసార్లు పుట్టింటికి పంపించేవారు
బడ్జెట్ ఇబ్బందులున్నా !

తనికెళ్ళ భరణి తీసిన "మిధునం" చూస్తుంటే మా కధే తీసినట్టు అనిపిస్తుంది.
కాకపోతే లక్ష్మి, బాలు గార్లు పల్లెటూళ్ళో ఉంటారంతే.

మా పిల్లలు వారానికి రెండు మూడు సార్లు వీడియో కాల్సు చేస్తే
వంట డ్యూటీ తనదేనని పాపం శంకర ప్రసాద్ గారికి తెలుసు.
🚩
ఆయనక్కూడా వాట్సాప్, యూట్యూబు,ఫేసు బుక్కు ఉన్నా,ఆయన రూటే ...సెపరేటు.
ఎప్పుడూ రాజకీయాల గొడవే !
"వాడలా అన్నాడు, వీడిలా అన్నాడు "
అని ఆవేశపడిపోతూ ఉంటారు.

ఆ ఫేసు బుక్కులో వ్యాసాలకి వ్యాసాలు రాసేస్తుంటారు,
తానే సమాజాన్ని మార్చెయ్యాలన్నట్టు !

ఇంక టీవీ చూడ్డం మొదలెడితే స్నానమవదు,
అన్నానికి లేవరు.
పొద్దుకుంగే దాకా ఆ దిక్కుమాలిన ఛానళ్ళ లో వాదనలే వింటుంటారు.

పది మందీ కలిసి ఒక్క సారే అరిచేస్తుంటారు,
ఒకడు చెప్పీది ఇంకోడు వినిపించుకోడు.
ఈయన,"నువ్వునోరుముయ్యరా" అని అరిచేస్తుంటారు !
రోజూ ఇదో ప్రహసనం !
🚩
నేను మాత్రం, నా గది లోకి వెళ్లి, ఏసీ వేసుకుని,
సుమ ఆడవాళ్ళ చేత ఆడించే ఆటలు చూస్తూ,
వాళ్ళు కట్టుకున్న పట్టుచీరలు, నగలు చూస్తూ,
ఈటీవీ లో 'అభిరుచి' లోని రక రకాల వంటల కార్యక్రమాలని ఎంజాయ్ చేస్తుంటాను.

ఆయనకి ఇవేమీ నచ్చవు.
ఎప్పుడూ రాజకీయాలు, వార్తలు, ట్రంపు, మోడీ,
చంద్రబాబు,కేసీయారు, జగన్ను,పవన్ను......
లేక పోతే
ఆ జంతువులు ఒకదాన్నొకటి పీక్కుతినే 'విజ్ఞాన'
చానళ్ళు ట.... అవే చూస్తుంటారు.

మా దాంపత్య జీవితం లో నగలు, చీరల కోసం ఎన్నడూ ఆయన్ని వేధించలేదు కానీ..
చిన్న టీవీ ఉన్నప్పుడు మాత్రం, సీరియళ్ల టైముకి ఛానల్ మారిస్తే మాత్రం గొడవలే.

అందుకే మొన్నామధ్య మా చిన్నబ్బాయి వచ్చినపుడు, రాజీమార్గం గా
నా కోసం ఒకటి, వాళ్ళ నాన్నకి ఒక పేద్ధ టీవీ కొని పారేశాక, కొంపలో శాంతి నెలకొంది... శ్రీలంక లో లాగ..

అప్పుడప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది,
ముగ్గురు పిల్లలు, నేను, మా ఆయన, మా అత్త గారు
ఉన్నపుడు ఇల్లు ఇరుకనిపించ లేదు, డబ్బు లేదనిపించలేదు.
(ఈయన జీతం ఏ నెల్లో ఎంత వచ్చేదో నేను ఎప్పుడైనా పట్టించుకుంటేగా!)
🚩
చుట్టాలు, పక్కాలు వచ్చి మూడు,నాలుగు రోజులుండి పోయినా ఇబ్బందనిపించేది కాదు.
ఎన్నిసార్లు డికాషన్ తీసేదాన్నో..
ఎన్నిసార్లు కుక్కర్ పెట్టేదాన్నో !
సమయానికి గ్యాస్ అయిపోతే, పక్క వాటా వాళ్ళ
సిలిండెర్ ఉమ్మడి ఆస్తి అయిపోయేది.

ఫ్రిజ్ లేని రోజుల్లో అధాట్టుగా ఎవరైనా వస్తే,
పాలు, పంచదార,కాఫీ పొడికి పక్కింటి
రాధమ్మ గారే మాకు క్రెడిట్ కార్డు.
🚩
ఇప్పుడేమో లంకంత కొంపలో బిక్కు బిక్కుమంటూ మేమిద్దరమే….
అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయిలాగ.
ఎవరి ఫోన్లు, డెబిట్ కార్డులు, బాంక్ అకౌంట్లు,
ఫేసుబుక్ అకౌంట్ లు వాళ్లవే.
పిల్లలు వారంలో ఐదారు సార్లు ఫోను చేసినా ఆయనతో మాట్లాడేది తక్కువే .
ఎప్పుడైనా ఆయన ఫోను తీస్తే, "ఎలా ఉన్నార్రా ?"
అంతే. మాటలే ఉండవు.
అదే మాకయితే డైలీ సీరియళ్ళే !

మా చిన్న కోడలు ఫోను చేసిందంటే బీబీసీ దగ్గరినించీ అన్ని చానళ్ల న్యూస్ చెప్పాక,
మా బుల్లి మనవడి బొమ్మల టెంటు లోకి తీసుకెళ్లి వాడితో మాట్లాడించే లోపు
వాడు "నానమ్మ, బాయ్" అంటాడు.
వాడు బాయ్ ఎంత బాగా చెప్తాడో !
🚩
మాపెద్ద కోడలైతే వీకెండ్ లోనే మాట్లాడుతుంది,
ఉద్యోగ భారం కారణంగా .
ఈ లోగా మా పెద్దాడు వచ్చి,
"అమ్మా,గ్రీన్ కార్డు విషయం ఏంచేశారు?"అంటాడు
సినిమా మధ్యలో వాణిజ్య ప్రకటన లాగ.

"మీ నాన్ననడుగు" అని ఆయన మీదకి తోసేస్తాను.
ఆయనతో ఈ విషయం మాట్లాడ్డానికి వాడికెందుకో
చాలా 'ఇది'.
🚩మా అమ్మాయి అయితే ఈటీవీ జబర్దస్తు లెవెల్లో
జోకులు వేస్తూనే ఉంటుంది.
ఈ లోగా మా పెద్ద మనవడు, మనవరాలు వచ్చి,
వాళ్ళకొచ్చిన గిఫ్టులు,సర్టిఫికెట్లు చూపించేస్తారు.

“అంతసేపు మాట్లాడ్డానికి ఏముంటాయి?"
అంటారీయన.!
ఈయనకేంతెలుసు, పిల్లల్తో మాట్లాడాక నాకు టానిక్ తాగినట్టుంటుందని ?

మా అబ్బాయిలు "అమ్మా, వచ్చే సమ్మర్ కి మీరు
ఇక్కడికి రావడానికి టికెట్లు బుక్ చేస్తున్నాం " అంటే
"మీ నాన్న తో చెప్పండి" అని ముక్తాయిస్తా .

వాళ్ళ నాన్నని అడిగితే "మొన్ననే కదరా వచ్చాం"
అంటారని వాళ్లకి తెలుసు.
ఎందుకో రాను రాను అమెరికా ప్రయాణాలు బోరు కొడుతున్నాయి .

అదే చిన్నప్పుడు విమానం శబ్దం వినిపిస్తే చాలు,
బయటికి పరుగెత్తి,
విమానం కనుమరుగయ్యేదాకా చూస్తే ఎంత బాగుండేదో !

అదే ఇప్పుడు ..ఎయిరిండియాలూ, లుఫ్తాన్సాలు,
ఎతిహాద్ లు ఆనట్లేదు.

చిన్నప్పుడు పిల్లల్తో ఎర్ర బస్సెక్కి పుట్టింటికి వెడుతుంటే ...
కిటికీ లోంచి ఆ పచ్చటి పొలాలు,కాలువలు,చెట్లు ఎంత అందంగా ఉండేవని !
(అప్పట్లో ఈయన జోకు...
నేను పుట్టింటికెళ్లేటప్పుడు
ఎర్ర బస్సు వికార పెట్టదుట
అదే బస్సు తిరుగు ప్రయాణంలో
ఎంత వికార పెడుతుందోట!)

ఇప్పుడేంటి ?
హాంగ్ కాంగు, దుబాయి, ఫ్రాంక్ ఫర్టు,అబుదాబీ లు మామూలుగానే కనిపిస్తున్నాయి?

పుట్టింటినుంచి వచ్చేస్తుంటే అమ్మ కొన్న చుక్కల
కాటన్ చీర ఎంత బాగుండేది !
(ఇప్పటికీ దాచుకున్నా)
🚩
ఇప్పుడు ఈయన, పిల్లలు ఎన్ని వేలో పోసి కొన్న పట్టు చీరలు ఎందుకు అంత గ్లామరస్ గా అనిపించట్లేదు?

ఇలా చెప్పుకుంటూ పోతే.... ఎన్నో,ఎన్నెన్నో!

మా చిన్నాడి పెళ్లికి మొదలయిన టీవీ సీరియల్,
"జిగట కాంభోజి రాగాలు" ఇప్పటికీ మలుపుల మీద మలుపులు తిరుగుతూ పోతున్నట్టు, ఎప్పటికీ పూర్తి కాదు.

నా ఈ మధ్య తరగతి మనోగతం లోని కొన్నిఅనుభవాలు.

Source - Whatsapp Message

మన గ్రామదేవతలు ఎలా వెలిశారు ? మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి?

మన గ్రామదేవతలు ఎలా వెలిశారు ? మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి?
గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత – గ్రామదేవత.
గ్రామదేవతల పూజావిధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం. మానవుడు నిత్య జీవితంలో యెన్నో జయాపజయాల్ని చవి చూస్తున్నాడు. మరో వైపు తన లక్ష్య సాధనకోసం యెన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్ఠికి మూల కారకురాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవుడు, ఆమెను సంతృప్తి పరచేటందుకు యెన్నో మార్గాలను ఆశ్రయించాడు. అందులో ప్రార్థన, మంత్రతాంత్రికతలు, పవిత్రీకరణ, ఆత్మహింస, బలి అనేవి ప్రధానంగా కనిపిస్తాయి.
గ్రామదేవతల గుళ్ళు ఊరిపొలిమేరల్లో, పంటపొలాలమధ్య, చెరువు గట్లలో, వేపచెట్లక్రింద ఉంటాయి. నాలుగు బండ రాళ్ళను చేర్చి చతురస్రాకారంలో గుడి నిర్మిస్తారు. గ్రామదేవతలకు ప్రతిరూపమైన గరగను, వేపమండలను జోడించి దేవతలముందుంచి పూజిస్తారు. శక్తి దేవతల గుళ్ళు సామాన్యంగా అన్నీ తీరాల్లో ఉంటాయి.
గ్రామదేవతల విలక్షణతలు
గ్రామదేవత భయంకర స్వరూపిణి. అంతేకాదు వికటదంత.
బలిని తీసుకోవడం, రక్తపానం, ఆసవసేవనం ప్రీతికరాలు.
గ్రామదేవత గ్రామాళ్ళో వేపచెట్లక్రింద, త్రాచుపుట్టలలోపల నెలకొని ఉంటుంది.
తనను నిర్లక్ష్యం చేసిన జానపదులను పట్టి పీడించి రోగాలపాలు చేయడంలో ఈమెకు పట్టుదల మెండు.
గ్రామాలను పరిరక్షించడం, చెలరేగిన వ్యాధులను అదుపులో ఉంచడం, తనను నమ్ముకొన్న పశువులను జానపదులను యీతి భాధలు, గ్రహ బాధల నుండి శత్రువుల నుండి రక్షించడం యీవిడ నిత్యకృత్యాలు.ఊరి పొలిమేరలను, పంటపొలాలను, చెరువులను, నీటి వనరులను కాపాడుట యీమె కర్తవ్యం.
గ్రామదేవతల పూజార్లు, బ్రాహ్మణేతరులై వుంటారు.
గ్రామదేవతల పూజార్లకు సంస్కృత మంత్రాలు రావు. ఆ మంత్రాలన్నీ ఆయా ప్రాంతీయ భాషల్లో వుంటాయి.
గ్రామదేతల పూజాలను స్త్రీలు కూడా చేస్తారు.
గ్రామదేవతల స్వరూప స్వభావాలను అనుసరించి, పుట్టుక స్వభావాలను బట్టి ఒక్కొక్క తెగవారు పూజారిగా వుండటం జరుగుతొంది. చాలావరకు గ్రామదేవతలు చిన్న రాయిగానో, శూలంగానో చెట్టు రూపంలో గాని, గరగగా గానీ దర్శనమిస్తుంటారు. చౌడమ్మ, యెల్లమ్మ, దుర్గమ్మ వంటి దేవతలు భయంకర స్వరూపులుగా కనిపిస్తారు
గ్రామదేవతా వ్యవస్థ:
గ్రామాలలో వెలిసే దేవత...దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలని అంటారు.
సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు.
ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు,
ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో,కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే
కుదరకపోవచ్చు.
ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము
సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో
అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు
ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే
తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.
ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త,
ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది.
ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు
అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో
అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా
నియమించారు పూర్వీకులు.
అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు.
దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది
కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము
సరైన మూహూర్తములోనే జ్ వేయబడింది కాబట్టి
గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-
భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు.
అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన
ఆ నెల, ఆ తిథినాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారాఏదైనా లోటు పాట్లు కలిగివుంటే తొలగుతుంది.
గ్రామదేవతల ఆవిర్భావము:
పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది.
అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు
గ్రామదేవతలను ఏర్పాటు చేసారు
తొలి దశలో.
పృధ్వీ దేవత:
మొదటిది పృధ్వీ అంటే నేల,ఇది పంటకి ఆధారము,
కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన
పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు.
గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారము
కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు.
జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు.
మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూ వుండడము, దాన్నే సొమ్ముగా
మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ.
పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని
చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి
కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది.
ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో
జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.
జల దేవత:
రెండవది జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది.గుడి ఎత్తుగా కట్టినా
తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.
అగ్ని దేవత:
మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ,రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. ( చిత్తూరు పున్నమ్మ గుడిలో హారతి సమయంలో పంబల్లు వాయిస్తారు అది ఉంటూ హారతి చూస్తే అమ్మవారు ఆనందంతో వెలిగిపోతున్నట్టు కనిపిస్తోంది, ఎప్పుడూ అదే కొనసాగుతోందా తెలియదు).
సూరమ్మను ప్రతి అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమినాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు.
ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళలమ్మ (సూర్య,చంద్రుల కళ వున్న అమ్మ).
వాయు దేవత:
నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి.
కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.
ఆకాశ దేవత:
ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను
ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు,గాలివాన. ఇలాంటి వాటి నుండి
రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.
గ్రామదేవతా నామ విశేషాలు:
మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత
పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది
సొంతవూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల
రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో
వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది.
ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.
ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి
'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట.
ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు
రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది.
ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే
ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల
(ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేసే+అమ్మ=
కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది.
స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో (స్వచ్ఛమని)సు+అచ్చ= స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది.
సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది.
'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో
ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే
క్రమముగా అది మావుళ్ళమ్మ' అయింది.
ప్రజల మనసులో పుట్టే ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన. వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా 'తలుపులమ్మ'గా మారింది.ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటపుడు తల్లికి
లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.
శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో
అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా
అంకగళమ్మ, అంకాళమ్మ గా మారిపోయింది.
పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ.
ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి.
తన గ్రామములోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత
పిశాచ గణాలను గ్రామములోనికి రాకుండా
వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే.
పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి.
అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో
పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ'
అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=
సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ.
గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా
ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ.
అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ పుల్లమ్మ.
ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది
కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.
ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే
చోటవున్న తల్లి అర్పణ+అమ్మ =అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.
బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు
బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ=అప్పలమ్మ అన్నారు.
అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది
బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ
అయినది పెంటి (బాల)+అమ్మ=పెంటమ్మ.
భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో
బోనముల (భోజనమనే పదానికి వికృతి)+అమ్మ=
బోనాలమ్మ.
అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి
ఈమెను 'అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల
పిలుస్తారు.
లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది
కాబట్టి గుర్రాల+అమ్మ=గుర్రాలమ్మ అయినది.
ఊరు పేరుని బట్టి పీల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోల+అంబ='సోమపోలమాంబ'
అన్నారు.సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట..!!
పేర్లు ఏవైతేనేమి,
ఆ తల్లి ఎప్పుడూ
మనకు తోడుగా,
అండగా నిలిచి
మనందరినీ
కంటికి రెప్పలా
కాపాడుతుంది...

గ్రామదేవతా నామ విశేషాలు
మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది
వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది. 'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే '#ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.
ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది.
స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి #అచ్చమ్మగా అయ్యింది.
సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది #మావుళ్ళమ్మ' అయింది.
ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి #తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె 'తలుపులమ్మ'గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.
శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా అంకగళమ్మ, అంకాళమ్మ గా మారిపోయింది.
పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే.
పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి #పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ' అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి #పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=#సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ.
గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ. అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న)అమ్మ పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.
ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా #అప్పలమ్మ అయినది. #బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= అప్పలమ్మ అన్నారు.
అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి (బాల)+అమ్మ= పెంటమ్మ. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల (భోజనమనే పదానికి విక్రుతి)+అమ్మ= బోనాలమ్మ.
అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను '#అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు.
లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= గుర్రాలమ్మ అయినది. ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోలు+అంబ='సోమపోలమాంబ' అన్నారు.

సర్వేజనా సుఖినో భవంతు..
ఓం శాంతి శాంతి శాంతి హీ..

Source - Whatsapp Message

ఇల్లాలి పూజలే ఇంటికి శుభాలు!

ఇల్లాలి పూజలే ఇంటికి శుభాలు! (బండారు రాం ప్రసాద్ రావు)🙏🌷🌹🌺🌸💐🌾🌱🌴🌳పూజా గదిలో గంట సేపు భార్య ఉంటే..అసహనం తో ఊగి పోయే భర్తలు కూడా ఆమె పూజ గదిలోనుండి రాగానే ప్రసన్న వదనంతో చేతులు జోడించి భక్తి భావన తో తన్మయత్వం చెందుతారు...ఇల్లాలి పూజలకు అంత పవర్ ఉంది! నిజానికి భర్త అభ్యున్నతితో పాటు, కుటుంబంలో చీకు చింత లేకుండా "కాపాడుతండ్రి" అని భక్తి శ్రద్ధలతో పూజలు చేసే మహిళా మణులు ఉండడం వల్లే కొంత మంది భర్తలు ఎన్ని అసహజ కార్యాలు చేసిన ఆమె పూజలే అతన్ని పుణ్య కార్యాలవైపు నడిపిస్తున్నాయి! ధర్మం ఇంకా నాలుగు పాదాల మీద నడుస్తుంది అంటే ఇంట్లో పూజా గదిలో దీపం వెలిగించడం వల్లే! శుచి శుభ్రత ఇంట్లో పాటించడం ఎలాగో, భక్తితో ఒక అరగంట భగన్నామస్మరణ చేయడం కూడా అందులో భాగమే! పొద్దున లేవగానే ముఖం కడుక్కోగానే మెక్కడం కాకుండా మొక్కడం ఎలాగో పద్దతి గల ఇల్లాలు భర్తకు, పిల్లలకు నేర్పే మొదటి పాఠం! ఎంత నాస్తికులైనా స్నానం చేయంది ఆహారం ముట్టరు...అదేం రోగమో గానీ భార్య ఇంట్లో పూజలు చేస్తున్న పొద్దెక్కదాకా మంచం దిగని పురుష పుంగవులు పాపాల్ని ఆమె భక్తితో "మన్నించు దేవుడా" అని మొక్కుతునే భర్తకు తిట్ల సుప్రభాతం.... కోపమొస్తే రాగి చెంబు తో మొట్టికాయలు వేసే భార్యల వల్ల కూడా ముఖానికి ఇంత బొట్టు పెట్టుకుని అల్పాహారం తీసుకునే భర్తలు కూడా ఉన్నారండొయ్!! మనసు ప్రశాంతత కోసం చేసే పూజల్లో మొగ వారి కంటే ఆడవారిదే పై చేయి!! ముఖులిత హస్తాలతో దేవుణ్ణి మనస్పూర్తిగా ఆరాధించే ఇల్లాలు మొదట్నుంచీ పూజలు వ్రతాలు చేయడం వల్లే... పుణ్యం కొద్దీ పురుషుడు...దానం కొద్దీ బిడ్డలు అనే సూక్తి పుట్టింది!🌷🌹🎋🍃🍂🥀🌺🌸🍄🍁💐ఇంట్లో ఆడవాళ్ళు సౌమ్యంగా ఉంటూ, ఇంటిని, ఇంటిల్లపాదిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో అందరి పనులు విజయవంతం అవుతాయి. అలాగే లక్ష్మీ స్వరూపమైన స్త్రీని, ఏ ఇంట్లో కంటతడి పెట్టనీయక చక్కగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. పూర్వీకులు మనకి ఇచ్చిన ప్రతీ పూజలో, సాంప్రదాయాలలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు, మనుషుల జీవన శైలికి కావాల్సిన మంచి సూత్రాలు ఉంటాయి. ఇంటి గడప కడిగి...పసుపు కుంకుమలతో అలంకరించి...అగరుబత్తి ముట్టించి...ఇల్లంతా ధూపం...నింపి పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో లక్ష్మి కళ వెళ్ళి విరుస్తుంది! ఇంట్లో ఇల్లాలు బయట ప్రియురాలిని మెయింటైన్ చేసే వారి వల్ల చిన్న ఇల్లు - పెద్ద ఇల్లు కూడా కళావిహీనంగా ఉంటాయి! భర్త కూడా భార్య తో పాటు నిష్టగా పూజలు చేస్తే ఆ ఇంట్లో సర్వ సుఖాలు వెల్లివిరుస్తాయి!! దేవుని కరుణ చూపమనో, కృప సాధించాలనో, అనుగ్రహం పొందాలనో, కోరికలు తీర్చుకోవాలనో భగవంతుడ్ని ఆశ్రయిస్తాం...గుడికెళ్లి కొబ్బరికాయలు కొట్టి, అష్టోత్తరం చదివించి. పూజలు చేయించి ఆ కోరికలు తీరగానే లేదా తీరకుండానో దేవుణ్ణి మర్చిపోతాం... ఏదైనా సాధించాలంటే మనిషికి ఆ పనిచేసితీరాలి అనే పట్టుదల, ఆత్మవిశ్వాసం, తన సామర్థ్యం పై నమ్మకం, చేస్తున్న పని మీద ఇష్టం ఉండాలి. ఆ పని పూర్తయి, ఫలితం వచ్చే వరకూ వేచిచూసే ఓపిక, మధ్యలో ఎదురయ్యే ఇబ్బందుల్ని తట్టుకునే సహనశక్తి ఉండాలి...అప్పుడే భక్తి ముక్తి వస్తుంది... చిత్తం దేవునిపై...మనసు గుడి బయట విడిచిన చెప్పులపై ఉంటే భగవంతుడు మూడో కన్ను తెరుస్తాడు!! పూజారి వరమివ్వడు!!🍂🍂🌷🍃🎋🌳🌴🍄🌺🍁🌸సృష్టి ప్రారంభంలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండిటినీ దేవుడు కల్పించాడు. పాపం చేయటం లేదా పుణ్యం చేయటమనేది మానవుల పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది. చేస్తున్నది పాపమని పెద్దలు నుంచి తెలుసుకొని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను, కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకొంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది పురాణాలు ఇస్తున్న సారాంశం!! భగవంతుని అనుగ్రహం పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా తొమ్మిది రకాలైన భక్తి మార్గాలు చెప్పబడ్డాయి. అవి శ్రవణ భక్తి , కీర్తనా భక్తి :
స్మరణ భక్తి,
పాదసేవన భక్తి, అర్చన భక్తి,
వందన భక్తి,
దాస్య భక్తి,
సఖ్య భక్తి,
ఆత్మ నివేదన భక్తి ఇలా మనం తొమ్మిది రకాల పూజాదులు చేస్తాం! ప్రతి మనిషి తనకు తెలియకుండానే పై తొమ్మిది రకాల ధ్యానం లో ఉంటారట! అందువల్లే కాబోలు భారతీయ వివాహ వ్యవస్థలో ఇంకా జీవం ఉట్టి పడుతుంది అలాగే పాపం పుణ్యం కూడా మన మనసును వెంటాడుతూనే ఉంటుంది!!

Source - Whatsapp Message

ఓం శాంతి శాంతి శాంతి: అనగా

ఓం శాంతి శాంతి శాంతి:

అనగా

మొదటిసారి శాంతి అనగానే ...
మనకి మనవారికి,
దుఖః బాధలు
తొలగాలని,

రెండవసారి శాంతి అనగానే
మన చుట్టూ ఉన్న సమస్త ప్రాణి కోటి
సుఖంగా ఉండాలని,

మూడవసారి శాంతి: అనగానే ప్రకృతిపరంగా, గ్రహాల
పరంగా ఏ ఉపద్రవాలూ భూమండలాన్ని తాకవద్దని కోరుకోవటము.



ఏ ప్రార్ధన చివరిలోనయినా మనం ఓం శాంతి శాంతి
శాంతి:

అని 3 సార్లు ఉచ్చరిస్తూవుంటాము.


విధంగా 3 సార్లు ఆనడంద్వార.....

3రకాలయిన తాపాలు (భాధలు)తొలగాలని భగవంతుని ప్రార్ధించడమన్నమాట.

ఓం శాంతి...
(ఆధ్యాత్మిక తాపంచల్లారుగాక)

ఓం శాంతి...
(ఆది బౌతికతాపం చల్లారుగాక)

ఓం శాంతి: (అది దైవిక తాపం చల్లారుగాక)

1. ఆధ్యాత్మిక తాపం అంటే, శరీరానికి సంబంధించిన వివిధరకాలైన రుగ్మతలు (రోగాలు మొదలైనవి)
తొలగాలని.

2. అది బౌతిక తాపం అంటే, దొంగలు మొదలైన వారివల్ల కలిగే భాధలు, ప్రమాదాలు తొలగాలని.

3. అది దైవిక తాపం అంటే, దైవవశంవల్ల కలిగే భాధలు యక్షులు, రాక్షసులు మొదలైన వారివల్ల కలిగే ఊహకు కూడా అందని భాధలు, ప్రమాదాలు మొదలైనవి తొలగాలని ప్రార్ధించడం.

ఓం శాంతి, శ్శాంతి శ్శాంతి:
అని 3 సార్లు చెప్పడంలో

ఇంత అర్ధం దాగివుంది అని పెద్దలు చెపుతారు...!!

Source - Whatsapp Message

మనసు....

మనసు.....

భావన, ఆలోచన, స్పందనలతో మనసు నిరంతరం ఏదోక దానితో మమేకమై పోతుంటే, దాన్ని అదే ఎలా అదుపులో పెట్టుకుంటుంది...

మనసు శరీరభావనతో ఉన్నప్పుడు శరీరం తాలూకా కష్టసుఖాలను అనుభవిస్తుంది. మండుటెండలో తిరిగినప్పుడు కష్టంగా అనిపించటం, ఏసీ గదిలో ఉంటే హాయిగా ఉండటం వంటివి మనసు పొందే దేహానుభవాలు.

మనసు ఆలోచనలో ఉన్నప్పుడు శరీరంతో నిమిత్తంలేని సంతోష దుఃఖాలను అనుభవిస్తుంది. ఏదైనా శుభవార్త గుర్తుకు రావటంతోనే సంతోషం కలగటం, అవమానకరమైన విషయం గుర్తుకు రాగానే దుఃఖం కలగటం మానవుని అనుభవంలోనివే.

మనసు శరీరభావం ఆలోచనలతో కాకుండా తన సహజస్థితిలో ఉంటే ఆత్మశాంతితో ఉంటుంది. అంటే ఆత్మలక్షణమైన పరిపూర్ణ శాంతిని మనసు అనుభవిస్తుంది. క్రియలో శరీరానికి కష్టసుఖాలు, భావనతో సంతోష దుఃఖాలు, కలుగుతున్నాయి. కాబట్టే నీళ్ళలో పడినట్లు కలవస్తే మనసుకు మాత్రం ఆందోళన ఉన్నా నిజంగా శరీరానికి ఏ తడి అంటదు.

మనసు ఈ భావనాస్థితిని దాటితే మనోమూలంలోనే ఉన్న ఆత్మశాంతి అనుభవంలోకి వస్తుంది. ఆత్మగుణమైన పరిపూర్ణశాంతి మనసుకు కలగటమే ఆత్మానుభవం. అదే దైవదర్శనం...

|| ఓం నమః శివాయ ||


Source - Whatsapp Message

ఆవును కౌగిలించుకుంటే రోగాలు నయమైపోతాయ్. భారతదేశ గొప్పతనం తెలుసుకుందాం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఆవును కౌగిలించుకుంటే రోగాలు నయమైపోతాయ్. భారతదేశ గొప్పతనం తెలుసుకుందాం
☘☘☘☘☘☘☘☘
పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్నసరికొత్త, గ్లోబల్ వెల్నెస్ విధానం “కౌ హగ్గింగ్”
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఒత్తిడిని తగ్గించడానికి మరియు వ్యక్తులలో సకారాత్మక ధోరణిని పెంచడానికి సహాయపడే ఆవును కౌగిలించుకోవడం లేదా ” కాక్ నఫ్ల” అనే తాజా వెల్నెస్ పద్ధతికి కొత్తగా క్రేజ్ ఏర్పడింది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
నెదర్లాండ్స్‌లోని రీవర్‌లో ప్రారంభమైన ఈ విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
స్విట్జర్లాండ్ మరియు యునైటెడ్ స్టేట్స్ లోని పొలాలలో ఇప్పుడు సందర్శకులకు ఈ చికిత్స లభిస్తోంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఇది వ్యక్తులలో సానుకూల దృక్పధాన్ని పెంచుతుంది. ఆవు యొక్క వెచ్చని శరీర ఉష్ణోగ్రత మరియు నెమ్మదైన హృదయ స్పందన, ఒత్తిడిని తగ్గిస్తుంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
“గావో విశ్వస్య మాతరః” ఆవు ప్రపంచానికే తల్లి వంటిది అని అనాదిగా భారతీయుల విశ్వాసం. అందుకే భారతీయులు గోవును తల్లిగా భావించి పూజిస్తారు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
భారతీయులు, ముఖ్యంగా హిందువులు గోవును తల్లిగా భావించి పూజించడాన్ని కొందరు రాజకీయ నాయకులు, అన్య మత ప్రచారకులు, హేతువాదులు హేళన చెయ్యడం అనేక సందర్భాలలో జరుగుతూ ఉంటుంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కానీ నేడు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలోని ప్రజలు గోమాత యొక్క మహిమను గుర్తించి గోవుకు సన్నిహితంగా మెలిగితే, గోమాతను ఆలింగనం చేసుకుంటే తమకున్న శారీరిక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని నమ్మి ఇప్పుడు “కౌ హగ్గింగ్” (ఆవును కౌగిలించుకోవడం), “కాక్ నఫ్ల” పేరుతో ఒక వెల్ నెస్ ప్రక్రియను ప్రారంభించి, ఎంతో ఆసక్తిగా ఆచరిస్తూ ఉండడం ఓ గొప్ప పరిణామం.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఇప్పుడు అనేక దేశాలలో ఆవును కౌగిలించుకోవడం లేదా కాక్ నఫ్ల” అనేది ఒత్తిడిని తగ్గించడానికి మరియు సానుకూల దృక్పధాన్నిపెంచడానికి సహాయపడే తాజా వెల్నెస్ పద్ధతిగా మారింది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
నెదర్లాండ్స్‌లోని గ్రామీణ పట్టణమైన రీవర్ లో ప్రారంభమైన ఆవును కౌగిలించుకోవడమనే ఈ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. స్విట్జర్లాండ్ మరియు యునైటెడ్ స్టేట్స్ లోని పొలాలలో కూడా ఇప్పుడు సందర్శకులకు ఈ కొత్త చికిత్సను అందిస్తున్నారు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
నెదర్లాండ్స్‌లోని స్పాన్‌బ్రూక్‌లో “ఫార్మ్ సర్వైవల్” నడుపుతున్న జోస్ వాన్ స్ట్రాలెన్ అనే వ్యక్తి ఆరు సంవత్సరాల క్రితం ఇతర రైతుల నుండి ఈ పద్ధతి గురించి విన్నతర్వాత “ఆవు కౌగిలింత” సెషన్లను అందించడం ప్రారంభించాడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆవుల గురించి ఇన్సైడర్తో మాట్లాడుతూ, “మీరు వాటి బాడీ లాంగ్వేజ్ ను బట్టి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అవి కళ్ళు సగం మూసుకుని, చెవులు క్రిందికి వాల్చి ఉన్నప్పుడు, అలాగే కొన్నిసార్లు వ్యక్తి ఒడిలో తల పెట్టుకుని పడుకుని రిలాక్సవుతున్నట్టుగా ఉన్నప్పుడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
“అంటే ఇది సానుకూల శక్తి మార్పిడన్నమాట. ఆవును గట్టిగా కౌగిలించుకునే వ్యక్తి ఆవు శరీరంలోని వెచ్చదనం ద్వారా రిలాక్స్ అవుతాడు. మరి కొన్నిసార్లు ఆవు హృదయ స్పందనను కూడా అనుసరిస్తాడు. ఇది ఆవుకు, వ్యక్తికి ఇద్దరికీ గొప్ప అనుభవం.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
“ప్రజలు తాము ఊహించిన దానికంటే ఎక్కువగా అనుభూతి చెందుతున్నామని తరచుగా నాకు చెప్తూ ఉంటారు. వారు ఆవు కౌగిలిలోని వెచ్చదనాన్ని, అంగీకారాన్ని, ప్రేమను అనుభూతి చెందుతారు. ఆవులో కూడా అదే విధమైన భావనను వారు గుర్తించగలుగుతున్నారు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
“నీలి ఆకాశం క్రింద పచ్చని పొలాలలో చుట్టూ ఆవులతో ఉంటే చాలు. అంతకంటే అద్భుతమైన చోటు ఉండదు.” అని పేర్కొన్నారు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
BBC కథనం ప్రకారం… ఆవు యొక్క వెచ్చని శరీర ఉష్ణోగ్రత, నెమ్మదైన హృదయ స్పందన కారణంగా మానవులలో ఆక్సిటోసిన్ పెంపొందుతుంది. అది సానుకూల దృక్పధాన్ని ఏర్పరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుందని నమ్ముతారు. ఇది సహజంగా అనుబంధం కారణంగా విడుదలయ్యే హార్మోన్.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్ లో ప్రచురించబడిన ఫ్రెంచ్ మరియు ఆస్ట్రియన్ శాస్త్రవేత్తలు 2007 లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఆవులు “వాటిని యజమానులు రుద్దడం, మసాజ్ చేయడం లేదా ప్రేమను చూపించినప్పుడు అవి తమ ఆనందము మరియు విశ్రాంతి పొందుతున్న సంకేతాలను చూపుతాయి” అని తేలింది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆవులను కౌగిలించుకునే మానవులు కూడా తక్కువ హృదయ స్పందన రేటును అనుభవించారని, శారీరకంగా తామెంతో రిలాక్స్ అవుతున్నట్లుగా అనుభూతి చెందుతున్న సంకేతాలను చూపించారు. ఇది “మానవులు – పశువుల మధ్య అనుబంధాన్ని మెరుగుపరచడానికి ఆసక్తి కలిగిస్తుంది” అని ఆ పత్రిక పేర్కొంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆచరణలో, ఆవులను కౌగిలించుకోవడం, వాటితో ప్రేమగా మెలగడం, వాటికి మసాజ్ చేయడం వంటివి ప్రతిరోజూ మూడు గంటల వరకు ఉంటాయి. కానీ మనుషుల మాదిరిగానే, కొన్ని ఆవులు ఇతర జంతువులకంటే ఎక్కువ స్నేహశీలియైనవి. అలాగే వాటికి ఆసక్తి లేకపోతే మాత్రం దూరంగా నడుస్తాయి కూడా.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఏదేమైనా, ప్రపంచ జంతు సంరక్షణ విభాగంలో విదేశాంగ సలహాదారు అయిన ఫిలిప్ విల్సన్ ఇన్సైడర్‌తో ఇలా అన్నారు: “ఆవును కౌగిలించుకున్నప్పుడు ఆవుకు కూడా కొన్ని ప్రయోజనాలున్నాయని కొన్ని నివేదికాలు వెల్లడి చేస్తున్నప్పటికీ… దీనిలో ప్రధాన లబ్ధిదారుడు కౌగిలించుకునే వ్యక్తి మాత్రమే.”
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
“జంతు సంక్షేమ సంస్థగా, జంతువుల యొక్క అంతర్గత స్వభావాన్ని ప్రజలు అర్థం చేసుకుని జీవించడం, భావోద్వేగాలు కలిగి ఉండడం, నొప్పి మరియు బాధలను అనుభవించగల సామర్థ్యాన్ని పొందడం, ​​అలాగే సానుకూల భావోద్వేగాలను నేర్చుకుంటారు మరియు అర్థం చేసుకుంటారని మేం భావిస్తున్నాం.” అని ఆయన అన్నారు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
“ప్రజలతో అవాంఛిత పరిచయం కారణంగా జంతువు మరియు వ్యక్తికి వచ్చే ప్రమాదాలు, రవాణా మరియు గృహ పరిస్థితుల వల్ల కలిగే అనవసరమైన ఒత్తిడి గురించి కూడా మేము ఆందోళన చెందుతున్నాము.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
“చికిత్సా ప్రయోజనాల పరంగా, కుక్కలు మరియు పిల్లులు వంటి పెంపుడు జంతువులను ఉపయోగించడం కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుందా? దీనివలన ఏమైనా ఉభయులకు తక్కువ ప్రమాదం కలిగిస్తుందా? అని కూడా మేము పరిశీలిస్తున్నాము.” అని ఆయన అన్నారు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఏదేమైనప్పటికీ మిగతా ప్రపంచమంతా ఇప్పుడు, ఆలస్యంగా గోమాత యొక్క మహిమను గుర్తిస్తూ ఉన్నా కొన్ని యుగాల క్రితమే గోమాత మహిమను గుర్తించి, గోవును తల్లిగా పూజించి, గో సంపదనే నిజమైన సంపదగా భావించిన భారతీయుల విజ్ఞానం ఎంత గొప్పది? గో మహిమకు అంతటి ప్రాధాన్యం ఇచ్చారు కనుకనే సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణుడే గోపాలకుడైనాడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఏనాటికైనా యావత్ ప్రపంచం సనాతన ధర్మ ఛత్ర ఛాయలోకి రావలసిందే…. ఆ నీడలో సేద దీరవలసిందే. వందే గోమాతరం.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
భారత్ మాతాకీ జై.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Source - Whatsapp Message

స్త్రీ జన్మ !

🌹స్త్రీ జన్మ !🌹

ఒకరోజు ధర్మరాజుకొక ధర్మసందేహం వచ్చింది. ‘స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం వుంటుంది’ అని. ఇదే విషయం భీష్ముడిని అడిగాడు.

దానికి భీష్ముడు నవ్వి “నీకొక కథ చెబుతాను. అందులో నీకు సమాధానం దొరకవచ్చు” అని చెప్పడం ప్రారంభించాడు.

పూర్వము భంగస్వనుడు అనే రాజు వుండేవాడు. అతను ధర్మ నిరతుడు, సత్య సంధుడు. ప్రజలను కన్న బిడ్డల కన్న మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానము కలుగ లేదు.

అపుత్రస్య గతిర్నాస్తి

అని పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడయినా లేడే అనే బాధతో అగ్ని దేవుడిని ప్రార్ధించి అగ్నిస్తుత యజ్ఞం చేసాడు. అగ్ని దేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు.

ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజయిన తన అనుమతి లేకుండా భంగాస్వనుడు యజ్ఞము చేసి నూరుగురు కుమారు లను పొందడం ఆగ్రహం తెప్పించింది. అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలనుకున్నాడు. తగిన సమయం కోసం వేచివున్నాడు.

ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్లాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారి తప్పేలా చేసాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటోతీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహము వేసింది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది.

వెంటనే గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు. స్పటికంలా స్వచ్ఛమయిన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు.

మునిగి పైకి లేచే సరికి ఆ రాజు ఆశ్చర్య కరంగా స్త్రీ గా మారిపోయాడు. అయాచితం గా ప్రాప్తించిన స్త్రీత్వానికి చాలా చింతించాడు.

“ఈ రూపముతో రాజధానికి వెళ్ళి నేను నా భార్యా పిల్లలకు, పుర జనులకు ఎలా ముఖము చూపించగలను !? " అని విచారించి...

"అయినా ఇలా అడవిలో ఉండలేను కదా !" అనుకుని చివరకు రాజధానికి వెళ్ళాడు.

మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కుమారుడిని రాజ్యాభిషిక్తుడిని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి
అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించ సాగాడు.

కాలక్రమంలో, ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి మోహించి వివాహమాడారు. స్త్రీగా ఆ మునివలన అత్యంత బలసంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు.

వారు పెరిగి పెద్దయిన తరువాత ఆ నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో....

"కుమారులారా ! నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందాను కనుక వీరు మీ
సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి" అంది.

స్త్రీ గా మారినా ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృ వాక్య పాలకులుగా తండ్రిమాట పాటించి వారు రాజ్యాన్ని
పంచుకుని పాలించసాగారు.

ఇది చూసిన ఇంద్రుడు ‘నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది
అతడికి మేలు అయ్యింది. ఎలాగైనా వీరి మధ్య బేధము కల్పించాలని’ సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి....

"రాజకుమారులారా ! ఏమిటీ వెర్రి ఎవరో ఎవరినో తీసుకు వచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా!? అసలు వీరి తండ్రి ఎవరు ? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు? " అని వారిలో కలతలు రేపాడు.

అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నపుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేని పోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు. అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. చని పోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో
ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకుని రోదించసాగింది.

ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరుగని వాడిలా బ్రహ్మణ రూపుడై...

“అమ్మా నీవు ఎవరవు ? ఎందుకిలా
రోదిస్తున్నావు ? " అని అడిగాడు.

అప్పుడు ఆమె తాను యజ్ఞము చెయ్యడము కుమారులను కనడము అడవిలో దారి తప్పి కొలనునీరు త్రాగి స్త్రీగా మారడము మునిద్వారా కుమారులను
కనడము పూసగ్రుచ్చినట్లు చెప్పింది. అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై

"రాజా ! నేను ఇంద్రుడను నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు
కలిగించాను" అని చెప్పాడు.

దానికి ఆమె "దేవా ! అజ్ఞానంతో
తెలియక పొరపాటు చేసాను. అయినా దేవతలకు అధిపతి వైన నీవు పగ తీర్చుకోడానికి నేను తగిన వ్యక్తినా ! కనుక నన్ను దయతో రక్షించు" అని వేడుకోగా....

ఆ మాటలకు కరిగి పోయిన ఇంద్రుడు "రాజా ! నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రుల నైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను ఎవరు కావాలో నీవే
ఎంచుకో " అన్నాడు.

ఆమె (భంగస్వనుడు) సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంది.

ఇంద్రుడు "అదేమిటి రాజా ! మిగిలిన వారు నీ కుమారులు కాదా !?" అని అడిగాడు.

భంగస్వనుడు " వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా !” అని చెప్పింది.

ఇంద్రుడు సంతోషంతో "రాజా ! నీ సత్యనిష్టకు సంతోషించాను. నీకుమారులు అందరినీ బ్రతికిస్తాను" అని...

“రాజా ! నీకు ఇంకొక వరము ఇస్తాను నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగి
ఇస్తాను" అన్నాడు.

దానికి ఆమె "మహేంద్రా ! నా కుమారులను బ్రతికించావు అదే చాలు.
స్త్రీగానే ఉంటాను" అంది.

ఇంద్రుడు ఆశ్చర్యంతో " అదేమిటి రాజా ! పురుషుడవైన నీవు స్త్రీగా ఉండి పోతాననడానికి కారణం ఏమిటి ? "
అని అడిగాడు.

స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గు పడి
"మహేంద్రా ! నేను స్త్రీగా ఉండడములో ఆనంద పడుతున్నాను. ఇందులో వున్న తృప్తి నాకు పుంసత్వములో కనబడలేదు కనుక ఇలాగే ఉండి పోతాను" అంది.

దేవేంద్రుడు నవ్వి “అలాగే అగుగాక”అని ఆశీర్వదించాడు.

అని పై కథంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు “యుధిష్టిరా ! ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం !” అని అడిగాడు.

స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమయిన ధర్మజుడు మౌనంగా తల పంకించాడు.

🌺🌼🌺

ఒకతెకు జగములు వణకున్ అగడితమై
ఇద్దరు కూడిన అంబులు ఇగురున్ ।
ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరా
పట్టపగలె చుక్కలు రాలున్ ॥

[ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి, ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. అంటే స్త్రీ చాలా చాలా శక్తివంతురాలని భావము]

🌹🙏🌹

Source - Whatsapp Message

మకరతోరణం, అంటే ఏమిటి?

మకరతోరణం
అంటే ఏమిటి?
దాని విశేషం ఏమి? ఈరోజు తెలుసుకుందాం.

మన దేవాలయాలలో దేవతా/దేవుని
విగ్రహాల వెనుక అమర్చిన తోరణ మధ్యభాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనబడుతుంది. దానికే 'మకరతోరణం' అని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణం మధ్యభాగంలో అమర్చటానికి గల కారణము గురించి స్కందమహాపురాణం లో ఒక కథ వుంది....· పూర్వం "కీర్తిముఖుడు" అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేకవరములను పొంది తద్వారా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు పరమశివుని పత్ని అయిన 'జగన్మాతను' కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని అతిభీకరమైన అగ్నిని సృష్టించాడు. పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది.· మరణంలేకుండా వరం పొందినా, శివుని ఆఙ్ఞమేరకు ఆబడబాగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలూ తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడేడు. భక్తసులభుడైన బోళాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవ కన్ను గా ధరించాడు.· ఆ తరువాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదనీ, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు "నిన్ను నువ్వే తిను" అని చెప్పాడు. శివుని ఆనతి మేరకు కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోకభాగంనుంచి మొదలుపెట్టి కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలాతినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు.· ఆప్రార్ధన ఆలకించిన పరమశివుడు, ఈనాటినుంచి అన్ని దేవతాలయాలలో దెవతా మూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్రభాగాన్ని అలంకరించి, దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురఃహంకారాన్ని, ఆశను, తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు అని వరమిచ్చాడు.· ఆనాటినుంచి కీర్తిముఖుడు దేవతాలయాలలోని దేవతా విగ్రహాల వెనుక వున్న తోరణామధ్యభాగాన్ని తన రాక్షస మకరముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని,, దురాశను కబళిస్తున్నాడు . ఈకారణంగానే దేవతా మూర్తుల వెనుక మధ్యభాగంలో అమర్చబడిన తోరణానికే 'మకరతోరణం' అని పేరు వచ్చింది.మనసంసృతి లో ప్రతి దానికీ ఎదో ఒక పురాణంలో ఒక కథ వుంటుంది.
🙏🌹🌳🐄🌳

Source - Whatsapp Message

క్రిస్టియానిటీ పాశ్చాత్య దేశాల్లో గల రక రకాల ప్రాచీన సంస్కృతులను ఎలా ధ్వంసం చేసి నామరూపాలు లేకుండా చేసిందో...

క్రిస్టియానిటీ పాశ్చాత్య దేశాల్లో గల రక రకాల ప్రాచీన సంస్కృతులను ఎలా ధ్వంసం చేసి నామరూపాలు లేకుండా చేసిందో "కాథరిన్ నిక్సే" అనే ఒక జర్నలిస్టుగా మారిన క్లాసిక్ టీచర్ మరియు రచయిత
" చీకటి యుగం " (క్రిస్టియానిటీ చేతిలో ధ్వంసం అయిన ప్రాచీన ప్రపంచం) అన్న తన పుస్తకం లో వివరించారు. (THE DARKENING AGE
The Christian Destruction of the Classical World
By Catherine Nixey)

ఆ పుస్తకంలో కొన్ని వివరాలు :

1600 సం.ల.క్రిందట ఆధునిక సిరియాలో ఉన్న పామిరా అభయారణ్యం లోని ఎథీనా యొక్క అందమైన విగ్రహానిని నల్లని దుస్తులు ధరించిన నమ్మకస్తులు ఇనుపరాడ్ లతో వెళ్లిన సంఘటన వివరిస్తూ ఆమె ఈ పుస్తకాన్ని ప్రారంభించింది. అంతియోకియలోని (పురాతన సిరియాలో) మేధావులను హింసించి శిరచ్ఛేదనం చేయడం అక్కడ ఉన్న వారి పవిత్ర విగ్రహాలు ధ్వంసం గురించి కూడా రాశారు.

క్రిస్టియానిటీ చేతిలో ప్రాచీన ప్రపంచం ధ్వంసం ఎప్పుడు మొదలైందో చెప్పాలి అంటే ఏథెన్స్ లోని పార్థినాన్ (కన్య దేవతా ఆలయంగా పిలుస్తారు) ఆలయాన్ని ధ్వంసం చేయడం ద్వారా అని అంటారు. లార్డ్ ఎల్గిన్ 1801-5లో “ఎల్గిన్ మార్బుల్స్” ను స్వాధీనం చేసుకున్న సంఘటన ఈ విషయం లో ఒక గొప్ప మలుపుతిప్పిన సంఘటనగా చెప్తారు . కానీ చరిత్రలో అది మొదటి ఉదాహరణ కాదు. బైజాంటైన్ యుగంలో, ఈ ఆలయాన్ని చర్చిగా మార్చినప్పుడు, ఇద్దరు బిషప్‌లు - మారినోస్ మరియు థియోడోసియోస్ - పేర్లను దాని ప్రాచీన స్మారక స్తంభాలపై చెక్కించుకున్నారు. ఒట్టోమన్లు పార్థినోన్‌ దేవాలయాన్ని ఒక గన్‌పౌడర్ నిల్వ కేంద్రంగా ఉపయోగించారు.
17 వ శతాబ్దంలో వెనీషియన్ దళాలు దాడి చేసిన ఫలితంగా అక్కడ దెబ్బతిన్న ముఖాలు గల శిల్పాలు దర్శనం ఇస్తాయి.

పార్థినోన్ ఆలయం యొక్క శిల్పాలపై ముఖాలు, చేతులు మరియు జననేంద్రియాల వంటి భాగలపై జరిగిన దాడులను ఋజువులు గా చూపిస్తూ రచయిత్రి నిక్సే అనేక విషయాలను ఈ పుస్తకంలో విపులంగా తెలియచేసారు.
"నీ పొరుగువారిని ప్రేమించు, నేర్చుకున్న విషయాలను కాపాడటం, సున్నితమైన కళలను రక్షించడం మరియు ఒక నీతి నియమాలకు కట్టుబడి ఉండటం మొ. ఉన్నత విలువలు కోసం క్రైస్తవ సంస్కృతిని స్వీకరించాము. కానీ వాస్తవానికి "ప్రారంభ చర్చి" (అంటే మొదట్లో క్రైస్తవ సంస్కృతి) మేధో వ్యతిరేకత, ఐకానోక్లాజమ్ అంటే విగ్రహ ధ్వంస విధానం మరియు ఇతర మతస్థులపై విపరీత పక్షపాతం కలిగిఉండేది అని ఆమె తన పుస్తకం లో పేర్కొంది.

నిక్సే వాస్తవానికి మాజీ క్రైస్తవ సన్యాసిని కుమార్తె. అంతేకాక ఆమె తండ్రి మాజీ సన్యాసి కూడా. ఆమె తన బాల్యంలో నమ్మకస్తురాలు అయిన కాథలిక్. పాగన్ సంస్కృతులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ అద్భుత క్రైస్తవ సంస్కృతికి గౌరవం ఇచ్చేది. కానీ క్లాసిక్ విద్యార్ధిగా ఆమె నిజాలను తెలుసుకున్నాక
ధైర్యంగా తాను విద్యార్థిగా తెలుసుకున్న విషయాలను ఆమె తన పుస్తకంలో మొహమాటం లేకుండా స్పృజించింది. అందుకే ఈ పుస్తకం ఒక వివాదాస్పదమైన గంభీర రచనగా గుర్తింపు తెచ్చుకుంది.

ఈ పుస్తకంలో నిక్సే వ్రాసిన ప్రతి వాక్యం ఉద్వేగభరితమైన అనుభూతి కలది. క్రైస్తవ సన్యాసులు ఒట్టి చేతి సంజ్ఞలతో అన్యమత గ్రంథాలను గ్రంథాలయ దుకాణాల నుండి పిలిపించేవారని, ఆ గ్రంధాల ధ్వంసం గురించి ఇంకా అలెగ్జాండ్రియాలోని సెరాపిస్ యొక్క అసాధారణమైన, అత్యంత విలువైన భారీ ఆలయం యొక్క నాశనం గురించి రచయిత్రి సానుభూతి వాక్యాలతో ఈ పుస్తకంలో వివరించారు. ఆ ఆలయం యొక్క లైబ్రరీ నుండి వేలాది పుస్తకాలు అదృశ్యమయ్యాయి, దేవాలయం యొక్క అందమైన చెక్క విగ్రహం తొలగించబడి దహనం చేయబడింది . ఒక అన్యమత ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం యునాపియస్ ఆలయం నుండి ధ్వంసం చేయబడని పురాతన నిధి దాని నేల మాత్రమే అని వ్యంగంగా వ్యాఖ్యానించాడు అంటే వారు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించి ఉంటారో తెలుస్తుంది.

పాపం నుండి తప్పించబడడానికి సిద్ధంగా ఉన్నాం అని నమ్మిన ఉన్మాదం రెచ్చగొట్టబడిన తక్కువ వయస్సు గల యువకుల పౌర సైన్యం బిషప్లకు ఉండేది. వారిచే అలెగ్జాండ్రియన్ అనే గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు మరియు అన్యమత తత్వవేత్త అయిన హైపాటియాను దుర్మార్గంగా సజీవంగా చంపించారు. కాస్టిక్ సున్నం సోడా మరియు వెనిగర్ ఉపయోగించి ఒక రకమైన రసాయన ఆయుధాన్ని వారు తమ నమ్మకాలను పంచుకోని పూజారులపై యాసిడ్ దాడులుకు ఉపయోగించేవారు.

తాత్వికమైన చర్చ శారీరకంగా మనల్ని మనుషులుగా చేస్తుంది. క్రొత్త ఆలోచనలను పంచుకోవడం ద్వారా పూర్వీకులు అణువును గుర్తించారు, భూమి యొక్క చుట్టుకొలతను కొలిచారు, శాఖాహారం యొక్క పర్యావరణ ప్రయోజనాలను గ్రహించారు. కానీ వారి మతపరమైన ఏకాభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడిన అన్యమత తత్వవేత్తలు వీరి హింసకు బలి అయ్యారు, సోక్రటీస్ ని మనం మర్చిపోకూడదు ఆయనపై మతపరమైన ఆరోపణలతో మరణశిక్ష విధించబడింది అని ఆమె పేర్కొన్నారు.

క్రైస్తవులు పిడివాదా ప్రచారానికి కారణమయ్యారు. A.D. 386 లో ఎవరైనా “మతం గురించి వాదించేవారు… వారి జీవితాలతో, రక్తంతో మూల్యం చెల్లించాలి” అని ప్రకటించిన చట్టం ఆమోదించబడింది. ప్రాచీన పుస్తకాలు ఒక క్రమపద్ధతిలో కాలిపోయాయి.
క్రైస్తవ మతం యొక్క విజయం మరొకరిని భయపెట్టి లొంగదీసుకోవడంలో ఉంది అని ఈమె రాశారు.

A.D. 529 ఎథీనా ఒక జ్ఞాన దేవత పేరు గల ఆ నగరంలోనే ఎథీనా విగ్రహం యొక్క తల నరకబడిన మరొక సంఘటన వివరిస్తూ నిక్సే తన పుస్తకాన్ని ముగుస్తుంది. పవిత్రంగా భావించబడిన ఆమె విగ్రహ అవశేషాలు ఒకప్పటి ప్రపంచ ప్రఖ్యాత తత్వశాస్త్ర పాఠశాల భవంతికి మెట్లుగా ఉపయోగించబడ్డాయి.

ఈ పుస్తకం చదువుతూ ఉంటే మన ప్రాచీన భారతంలో వేల కొద్దీ మన దేవాలయాలపై మొఘలుల దాడులు, అలాగే గోవా ఇంక్విజషన్ సమయంలో వందల కొద్దీ హిందూ దేవాలయాలపై చర్చ్ దాడుల సంఘటనలు గుర్తుకు వస్తాయి, వాటి మూలాలు ఎక్కడ నుండి వచ్చి ఉండవచ్చో మనకు అవగాహన కలుగుతుంది.

Source - Whatsapp Message