Saturday, May 30, 2020

చక్కని కధ - మూడు జన్మల ముష్టివాడు

మూడు జన్మల ముష్టివాడు

చక్కని కధ

ఒక గ్రామంలో ఒక బిచ్చగాడు ప్రతి ఇంటికి వెళ్లి బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు.

ఒక రోజు ఒక ఇంటి వద్ద భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరీ అని అడిగాడు.

ఆ ఇంటి యజమాని పండితుడు.

అతను అరుగుమీద కూర్చుని పారాయణ చేసుకుంటూ ఉన్నాడు.

ఆ ఇల్లాలికి వినిపించ లేదేమో అని బిచ్చగాడు గట్టిగా మళ్లీ భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని అన్నాడు.

పండితుడికి కోపం వచ్చింది
నేనిక్కడి ఉంటుండగా నాతో మాట్లాడకుండా నాకు చెప్పకుండా ఇంత నేను సంపాదిస్తుంటే ఆమెను పిలిచి బిచ్చం అడుగుతాడా.

వీడికి తగిన శాస్తి చేస్తాను అని అనుకుని వెంటనే.... ఏమేవ్

మూడు జన్మల ముష్టివాడు వచ్చాడు
బిచ్చం వెయ్యి అని గట్టిగా అరిచాడు.

ఆ గొంతు పోల్చుకున్న ఆమె భర్తకి కోపం వచ్చిందని గ్రహించి వెంట వెంటనే బియ్యం తీసుకొచ్చి బిచ్చగాడి పాత్రలో వేసి ఆవిడ వెంటనే లోపలకు వెళ్లిపోయింది.

కానీ బిచ్చగాడు మాత్రం కదల్లేదు.

అతని చేతిలో కర్ర కూడా ఉంది.

అప్పుడు పండితుడికి అనుమానం అలజడి మొదలయ్యింది.

అకారణంగా నేను అన్న మాటలు వీడికి బాధ కలిగించాయి.

వీడిపుడు ఏంచేస్తాడు తిడతాడా లేదా ఇంకా ఏం చేస్తాడా అని లోలోపల బాధ పడుతూ చూస్తున్నాడు.

ఇంతలో బిచ్చగాడు ఏమండీ అని పిల్చాడు.

అంటూ చిన్న అహంకారాన్ని ప్రదర్శించాడు పండితుడు.

ఏం లేదు మీరు నన్ను మూడు జన్మలు ముష్టి వాడన్నారు అది ఎలాగా అన్నాడు

హ... అదా దానికే ఉంది. తెలుసుకోవాలనుకుంటున్నావా అయితే ఇలా కూచో అన్నాడు.

ఫరవాలేదు చెప్పండి నిలబడతాను అన్నాడు.

శ్లోకం :
అదత్త దానాచ్చ భవేత్ దరిద్రః
దరిద్ర దానాచ్చ కరోతి పాపం
పాప ప్రభావాత్ పునర్దరిద్రః
పునర్దరిద్రః పునరేవ పాపీ
అని శ్లోకం చదివాడు.

వెంటనే బిచ్చగాడు అయ్యా మీరు చదివిన శ్లోకానికి అర్థం నాకు తెలియదు.

నాకు అర్ధమయ్యేటట్లు మాటల్లో చెప్పండి అన్నాడు.

నువ్వు గత జన్మలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు.
అంటే రెండు కారణాలు.
నీకు లేకపోయి వుండొచ్చు.

ఉండి కూడా దానం చేయక పోయుండచ్చు.

లేకపోతే గతజన్మలో నువ్వు ముష్టి వాడివి కాబట్టి ఆ ఫలితంగా నువ్వు ఈ జన్మలో కూడా ముష్టి వాడుగా అయిపోయావు.

అంటే రెండు జన్మలు ముష్టివాడివి. అర్థమైంది మరి చెప్పొద్దన్నాడు బిచ్చగాడు.

ఎందుకు ?

ఈ జన్మలో కూడా ఇవ్వడానికి నాదగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మ కూడా. అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు.

మర్నాడు అదే సమయానికి ఆ బిచ్చగాడు పండితుని ఎదురుగా నిలబడి ఇందులోంచి బయటపడే మార్గం ఏమీ లేదా.

నేనిలాగే జన్మజన్మలకు బిచ్చగాడి గానే ఉండిపోవాలా? అని అడిగాడు.

జ్ఞానం సమయం వ్యక్తిత్వ విలువలు తెలిసిన పండితుడు ఇలా కూచో అన్నాడు.

పెద్దవారి మీదగ్గర నేను కూర్చోవడం అన్నాడు.

పర్వాలేదు కూచో జిజ్ఞాసా పరులకు శాస్త్రం చెప్పొచ్చు చెప్పాలి కూడా అందుకే ఈ శాస్త్రాలన్నీ అన్నాడు.

కూర్చున్నాడు బిచ్చగాడు.

ఇప్పుటికైనా దానం చేయడం మొదలుపెట్టాలి అన్నాడు

నేను దానం ఎలా చేస్తాను నాదగ్గర ఏముంది గనుక.

అన్నీ ఉన్నాయి లేకపోవడమనేది లేదు.

నీలో దాన గుణం ఉంటే చాలు. నీ దగ్గర ఉన్నదే దానం చెయ్.

ఈరోజునుంచి నీ కడుపుకి ఎంత కావాలో అంత మాత్రమే బిచ్చమెత్తుకుని అందులో సగం దానం చేస్తుండు.

తనకు అవసరమున్నాసరే అందులోంచి మిగిల్చి ఇవ్వడమేదానం తాలూకు ముఖ్యోద్దేశ్యం.
తను వాడుకోగా మిగిలినది ఇవ్వడం కాదు. బిచ్చగాడికి విషయం అర్థమైంది.

వెంటనే ఆరోజు నుంచి ఓ నియమం పెట్టుకున్నాడు.

తనకి ఎంత అవసరమో అంతే అడుక్కుని అందులోంచి సగం దానం చేయాలి.

ఇది ఎలా తెలుస్తుంది దాని కోసం తన చేతిని భిక్షాపాత్రగా చేసుకుని అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ అందులో సగం దానం చేస్తూ సగం మాత్రమే తిన్నాడు.

దాంతో బిచ్చగాడికి బిచ్చమెత్తుకునే ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది.

తిరగడం కాలం కూడా తగ్గిపోయింది.

అతనికి ఒక గుర్తింపు లాంటిది వచ్చింది.

కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బిచ్చమెత్తుకోడు ఇతను మన ఇంటికొస్తే ఈ రోజు బాగుణ్ణు. అనేటటువంటి భావాలు జనాల్లో కూడా వచ్చాయి.

అంతేకాదు మొన్న వాళ్ళింటి కెళ్ళాడు.
నిన్న వీళ్ళింటికి ఒచ్చాడు.
ఇవ్వాళ మనింటికి తప్పకుండా వస్తాడని వాళ్లు ఆ బిచ్చగాడి కోసం మరికొంచెం పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాల్ని సిద్ధం చేసేవాళ్లు.

అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉండేది.

సాత్వికంగా ఉండేది.
మంచి ఆహారం లభించేద తనకీ

పుచ్చకున్న దాంట్లో ఇతడు దానం చేయడం అందరూ చూశారు.

అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి పది మంది బిచ్చగాళ్లు చుట్టూ చేరి నువ్వే మా గురువన్నారు.

ఇతడికది అంగీకారం లేదు.

ఇదే నియమం పెట్టుకుని నేనెందుకు కాశీ వెళిపో కూడదు అని అనిపించింది.

బయలుదేరాడు వెడుతున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు.

తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం అందులోనున్న సగం దానం చేయడం.

మిగిలినదే తినడం
అంటే అర్థాకలి తన ఆకలి కడుపుని భగవదర్పణంగా జీవనం సాగిస్తున్నాడు.

మొత్తం మీద కాశీ పట్టణాన్ని చేరాడు.

అతను ఇదేనియమాన్ని అక్కడ కూడా పాటిస్తూ ఓ చెట్టుకింది ఎక్కువసేపు కూచునేవాడు.

ఆతడు అందరిలాగా ఒక అరగంట కూర్చుని ఏదో వస్తే తీసుకుని వెళ్లిపోవడం
ప్రసక్తి లేదు.
లేదా సాయం ధర్మం చేయండి దానం చేయడానికి వంటి మాటలు కూడా అతని నోట ఎప్పుడూ వినిపించేవి కాదు.

ఎప్పుడూ ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేవారు.

అతిని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా ఆతను వెళ్లాక ఎవరో తీసుకునే వాళ్లే తప్ప అతడు ఏనాడు అవి ఆశించలేదు.

ఇలా కొన్నాళ్లు గడిచేసరికల్లా అతని మీద పదిమంది దృష్టి పడింది. అతనొక సాధకుడని
కారణ జన్ముడనీ అతనికి ఏం చేసినా మంచి జరుగుతుంది అని చెప్పి అతని పేరుతో ఒక వేద పాఠశాల ఒక సత్రం కూడా నిర్మించారు.

ఆ సత్రం పేరు కరపాత్ర సత్రము.

అతని పేరును కరపాత్ర స్వామీజీ అని ప్రజలే ఆపేరు పెట్టారు .

కరమే పాత్రగా కలిగినటువంటి వాడి అని పేరుపెట్టారు.

ఇలాగ వేద విదులు వేదాభ్యాసం చేస్తున్నారు పిల్లలకు వేదం శాస్త్రం పురాణం ఇతిహాసాలు చెప్తున్నారు.

సత్రాల్లో బస చేస్తున్నారు వచ్చే పోయే వాళ్లు కూడా భోజనం చేస్తున్నారు.

కానీ ఇతనికీ విషయాలు ఏవీ తెలియవు.

ఇతడు మాత్రం రోజుకు నదికి వెళ్లి స్నానంచేసి ధ్యానం చేయడం మధ్యహ్నం బిచ్చమెత్తుకోవడం తనకు వచ్చినదాంట్లో సగం దానం చేస్తుండం యథాతథంగా జరుగుతోంది.

కొన్నాళ్లయింతర్వాత అక్కడ అతని దగ్గర కూర్చునే వాళ్లు నిలబడే వాళ్ళు చూసేవాళ్ళు దండంపెట్టుకునే వాళ్లు పెరిగారు.

వారి కోసం అన్నట్టుగా అక్కడ నీడని కల్పించడం పందిళ్లు వేయడం మొదలుపెట్టారు.

పెద్ద తీర్థ యాత్రగా మారిపోయింది.

ఇంకొన్నాళ్లయినాక ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఈయన్ని పెద్దగా పిలవాలని అనిపించి ఆ సభ బాధ్యత అంతా వాళ్లే భరిస్తూ కరపాత్ర స్వామీజీ ని పిలిచారు.

అందులో మాట్లాడుతున్న పెద్దవాళ్లందరూ కూడా నాకు ఈయన 15 ఏళ్లుగా తెలుసు.

వీరిని చూసిన తరువాత నాలో చాలా మార్పు అంతేకాదు కొన్ని కుటుంబాలు వాళ్లయితే మేమీయనకి దండం పెట్టిన తర్వాత మొక్కుకున్న తర్వాత మా పిల్లకి పెళ్లయిందన్నవారు,

మాకుఉన్న అప్పులన్నీ తీరాయి కష్టాలు తీరాయి అన్నవాళ్లు మాకు ఏ ఇబ్బందులు లేకుండా అయిపోతున్నాయి

పరమేశ్వరుని దర్శిస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యమూ వీరిని దర్శిస్తే నాకు జరిగిందని ఇలా అనేక రకాలుగా చెబుతున్నారు.

కానీ ఒకటి మాత్రం అందరూ చెప్తున్నది ఈయనే గురువు నాకు.

మా గురువు గారు కాశీ వెళ్లమని చెప్పారు.

అందుకే ఇక్కడ వేదాదులు అధ్యయనం చేశాను. ఇలా అనేక మంది అనేక విషయాలు చెప్తున్నారు.

మన కరపాత్ర స్వామీజీకి అర్థం కాని విషయాలు రెండు. ఇంతకీ 1) కరపాత్ర స్వామిజీ ఎవరు. ఇన్నాళ్లు కాశీలో వుండి వారిని దర్శించుకోలేక పోయాను ఎంత దౌర్భాగ్యుణ్ణి.
2) నాకు గురువు ఎవరు ఈ రెండు ప్రశ్నలను ఆయన బాధిస్తున్నా అక్కడికొచ్చే వారికి ఏమిచెప్పాలో తెలియక భగవదనుగ్రహంతో ఏవో చెప్పేసి నాకు భిక్షా సమయమయింది నేను వెళ్లాలి అన్నాడు.

ఆయన్ని ఎవరూ అడ్డుకోలేదు. అతడు సరాసరి భిక్ష ఐన తర్వాత ఒక్కసారి తన గురువు ఎవరు ఆలోచించుకున్నాడు.

ప్రశ్నించుకుంటూ ఉంటే తనకొక విషయం తట్టింది. తనలో మార్పునకు కారణమైన వ్యక్తే గురువు అని నిర్ణయించుకున్నాడు.

అంతే వెంటనే తను ఎక్కడైతే మొట్టమొదట బిక్షాటన చేసుకున్నాడో ఆ గ్రామం గూర్చి బయలుదేరాడు.

దారిలో ఇతన్ని గుర్తించిన వాళ్లు కలసి చూసి వచ్చిన వాళ్లు అక్కడ వేదం చదువుకున్న వాళ్లే కాదు ఆ సత్రంలో భోంచేసిన వాళ్లు అందరూ ప్రతి గ్రామంలోని గుర్తించి ఇతనికి స్వాగతం పలకడం అయనకేదో ఇవ్వడం అతను ఆ ధనాన్ని ఆ గ్రామంలోనే ఖర్చుపెట్ట మని చెప్పి పెద్దలకు ఇచ్చేస్తుంటే తానేమీ తీసుకోకపోవడం...

ఈయన ఖ్యాతి ఆనోట ఆనోట ప్రతి గ్రామానికి చేరింది.

అందరూ ఇతని కోసం ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు అతను తన మొదటి గ్రామానికి వచ్చాడు ఆ గ్రామంలో వాళ్ళు కూడా చాలా ఆనందంతో....
కరపాత్ర స్వామిజీ వారు వచ్చేరు అని చెప్పి ఆయనకి ఆగ్రామంలో ఉంటున్న పండితుడిని పిలిచారు.

ఆయనకూడా వెంటనే అంగీకరించాడు.

పండితుడువెళుతూనే పాద నమస్కారం చేసాడు

ఆయనకి మంత్రపూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూచోబెట్టారు.

ఆయన గురించి నేను చూశానంటే నేను చూశాను నేనక్కడ సత్రంలో పనిచేశాను అక్కడ వేదపండితులు శాస్త్ర పండితులు శాస్త్రములు అని నేర్చుకుంటారు

నేనక్కడున్నాను వీరిని మళ్లీ ఇక్కడ చూడ్డానికి చాలా ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉంది.

ఇలా చాలామంది మాట్లాడారు.

స్వామీజీ కూడా మాట్లాడటం ఐపోయిన తరువాత నాకు భిక్షా సమయం అయింది నేను వెళ్లిపోతానని చెప్పాడు.

పండితుల వారు మా ఇంటికి భిక్షకి దయచేయండి అని పిలిచారు.

వెంటనే ఆయన అంగీకరించాడు.
వాళ్ళింటికి వెళ్ళాడు.
ఇద్దరు లోపల కూర్చున్నారు.

ఆయన నియమం ముందే ఎరిగిన ఆతల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా కరతల భిక్ష పెట్టింది.

ఆవిడ ఆభిక్ష పెడుతున్నప్పుడు ఆమెకుఏదో మాతృత్వం తొణికిసలాడింది.

ఇదేం గమనించని స్వామీజీ భిక్షకోసం దోసిలి చాపాడు.

ఆవిడకు ఎందుకో అనుమానం వచ్చింది చూస్తున్నప్పుడే కొంత అనుమానము ఇలా అడిగే సరికి ఇంకా అనుమానం వచ్చింది.

సరే అని ఆయన నియమాన్ని భంగ పరచకూడదని కరతలంలో భిక్ష పెట్టింది.

అమ్మా నేను ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా అని అడిగాడు.

అయ్యో అదెంత మాట అన్నది ఆ ఇల్లాలు. వెంటనే పండితుల వారు స్వామీజీ ఆభాగం నాకు ప్రసాదంగా ఇవ్వండని చెయ్యి పట్టారు.

ప్రసాదంగా ఇచ్చేశాడు భోజనం ప్రారంభించారు.

వెంటనే పండిత స్వామిజీ ఇచ్చేశాడు.

ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తోంది.

గృహ యజమాని ఐన పండితుడు అతిథి ఐన స్వామీజీ ఇద్దరు కూడ భోజనం చేస్తున్నారు.

ఆ సమయంలో స్వామిజీ
అ అడిగాడు.

పండితుల వారు నన్ను గుర్తు పట్టారా అని.

అబ్బే నేనెప్పుడూ కాశీమహానగరం రాలేదండీ నాకు అంత అవకాశం రాలేదు అన్నాడు.

సరే నేనెవరో చెప్తా వినండి అన్నాడు

పండితుడు.... వద్దండీ శాస్త్ర ప్రకారమూ ఏరుల(నదుల), శూరుల, మహనీయుల మహాత్ముల జన్మ రహస్యం అడగ కూడదు.

సరే మీరు అడగలేదు నేనే చెప్తున్నాను వినండి.

నాగురుదేవులు మీరు.
అన్నాడు స్వామి.

అబ్బే నేను పండితుడను.
అంత వరకే అన్నాడు.

అయ్యా ముందు వినండి.

నేను ఎవరో కాదు మీమూడు జన్మల ముష్టివాణ్ణి అని చెప్పాడు.

పండితుడు ఒక్కసారిగా భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు.

ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి....
పతి భిక్ష పెట్టమని ప్రార్థించింది.

అంత మాటలొద్దు అమ్మా.
ధర్మం చెప్పేవాడు నిష్కర్షగా చెప్పాలి.

ఆనాటికే కాదు
ఈనాటికీ నేను సామాన్యుడినే.

కానీ ...
ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా అంత కఠినంగా చెప్పకపోతే నాలో మార్పు వచ్చేది కాదు.

నేను ఈనాడు ఈస్థితికి వచ్చే వాణ్ణి కాదు.

అంచేత మీరే నాగురువు అంటూ నమస్కరించారు స్వామీజీ.

లేదు లేదు మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు.

నేను మహా అహంకారిని పండితుడని గర్వం ఉండేది

నా గర్వాన్ని పోగొట్టారు కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు.

అహంకారాలు పోయాయి గనక
ఇద్దరి భావాలు ఒకటయ్యాయి. ఇద్దరూ హాయిగా పరమానందానుభూతిని పొందారు.

బెనారస్ యూనివర్శిటీ (కాశీ విశ్వ విద్యాలయం) లోఇప్పటికీ ఈ కరపాత్ర స్వామీజీ పేరుతో అవార్డ్ ఇస్తున్నారు.

శ్లోకం:
లౌకికానాంహిసాధూనాంఅర్థం వాగను వర్తతే ।ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోను ధావతి॥

1987 ప్రాంతంలో టీ.టీ.డీ. ధర్మ ప్రచార పరిషత్ ఉండేది. అందులో కాకినాడ ఆచారి దాసు (హరిదాసు)గారు*
ఈ కథ రాసారు
కానీ ప్రచురణ చేయలేదు.

ఈ కథ కాకినాడ దాసుగారికే అంకితం.
👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻

నమస్కారాలు ఇలా చేయండి

🙏🏻నమస్కారాలు ఇలా చేయండి🙏🏻

(1) తల్లి కి మరియు తల్లి తో సమానమైన వారికి... అలాగే అమ్మ వారులకు " ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలి....

(2) తండ్రికి, పాలకులకు అలాగే యోగులకు హృదయం పై రెండు చేతులు జోడించి నమస్కారం చేయవలెను......

(3) గురువులకు బ్రహ్మర్షులకు వేద పండిత ఘనాపాఠీలకు, పీఠాదిపతులకు " నోటి దగ్గర అంటే మాట బయటికి వచ్చే రెండు బ్రొటన వేళ్ళు కలిసి ఉండే విధంగా " రెండు చేతులు ఉంచి నమస్కారం చేయవలెను....

(4) ప్రణవ పఠనం,బ్రహ్మ దేవుడు బ్రహ్మర్షులు, నదులు సముద్రం దగ్గర.. భృకుటి పై రెండు చేతులు జోడించి నమస్కారం చేయవలెను..

(5) గణపతి తో పాటు దేవతలు, సూర్యాది నవగ్రహాలకు, ఇంద్రాది అష్ట దిక్పాలకుల కు
శిరస్సు పై రెండు చేతులు తగులుతున్నట్టుగా ఉంచి " శిరస్సు వంచి నమస్కరం చేయవలెను.....

(6) హరి హరులకు
12 అంగుళాల ఎత్తులో రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరం చేయాలి......

ఇవి షష్ట్య నమస్కారాలు .... అని తెలియజేస్తుంది శాస్త్రం....🙏🏻🙏🏻

ఆది శంకరాచార్యులువారు "నేను 3 దోషములు..పాపములను చేశాను. నన్ను క్షమించు” అని ప్రాధేయపడ్డారు

నేను 3 దోషములు..పాపములను చేశాను.
నన్ను క్షమించు” అని ప్రాధేయపడ్డారు
శ్రీ ఆది శంకరాచార్యులువారు.👍💐

శ్రీ ఆది శంకరాచార్యులవారు ,
శిష్యులతో కాశి విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు.

గంగా నదిలో స్నానము చేసి,
దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి,
విశ్వేశరుని ఎదుట..
నేను 3 దోషములు..పాపములను చేశాను.
నన్ను క్షమించు” అని ప్రాధేయ పడ్డారు.

ఇది విన్న శిష్యులు “ఆచార్యులవారు,
ఏమి పాపమలు చేశారని ప్రాయశ్చిత్త పడుతున్నారు ?” అని అనుకున్నారు.

ఒక శిష్యుడు, ఏమిటి ఆ పాపము
నేను తెలుసుకోవాలి అని
ఆచార్యుల వారిని అడిగాడు.
దానికి శ్రీ ఆది శంకరాచార్య
ఇలా సమాధానము చెప్పారు.

1. నేను భగవంతుడిని సర్వాంతర్యామి,
సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను.
సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడడానికి మటుకు కాశి నగరానికి వచ్చాను.
అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను.

అది నేను చేసిన మొదటి దోషం.

2. తైత్త్రియ ఉపనిషద్ లో
“యతో వాచో నివర్తన్తే , అప్రాప్య మనసా సః ” భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు”
ఇది తెలిసి కూడా శ్రీ కాశి విశ్వనాధ అష్టకం వ్రాశాను. ఇది నేను చేసిన రెండవ తప్పు.

3. నిర్వాణ శతకం లో
“న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఃఖం.
న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః
అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం“ అని వ్రాశాను.
అంటే..
నాకు పాప పుణ్యములు, సుఖ దుఃఖములు లేవు. మంత్ర జపములు తీర్థసేవలు ,
వేద యజ్ఞములు లేవు.
భోజన పదార్థము, భోజనము, భోక్త (భుజించేవాడు) నేను కాదు!
నేను చిదానంద స్వరూపుడను,
శివుడను, శివుడను!

ఇంత వ్రాసి కూడా నేను తీర్థయాత్రలు చేస్తున్నాను అంటే నేను వ్రాసినవి, చెప్పినవి
నేనే పాటించటంలేదు.
అందుకనే నేను చేసిన
ఈ మూడు తప్పులని మన్నించమని ,
ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను.

నీతి :💐
మన ఆలోచన, తీరు, మాటా అన్ని
ఒకే లాగా ఉండాలి అని
శ్రీ ఆది శంకరాచార్యుల వారి కథ
మనకి తెలియజేస్తోంది.

*బయట ప్రపంచం మన పని తీరుని
మట్టుకే చూస్తుంది.
భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తాడు.

మనస్ ఏకం , వచస్ ఏకం , కర్మణ్యేకం!”

ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి
ఎందరో మహాత్ములు,
స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధితో, ఆచరించి మనకు చూపించిన యధార్ధమైనమార్గము.
స్వస్తి..!!💐

ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది ...?

🔯🔯🔯🔯🔯🔯

ఉత్కృష్ట మార్గం
🌸🌸🌸

"ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది ...? "

అని ఒక శిష్యుడు శ్రీరామకృష్ణుని ఒకసారి అడిగితే,
దానికి పరమహంస ఇలా జవాబు చెప్పారు.

🌷 నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు.
నీ మనసును మాత్రం
ఆ పరమాత్మునిపైనే నిలకడగా ఉంచి సాధనచెయ్యి ...

🌷 నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు ...వాళ్ళు నీకెంతో ప్రియాతిప్రియమైన
వాళ్ళుగానే వ్యవహరించు.
నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు.

🌷 ఒక ధనికుడి ఇంట్లో పనిమనిషి అన్ని పనుల్నీ అంకితభావంతో చేస్తుంది. ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది.

🌷 తన యజమాని పిల్లలకు అన్ని సేవలూ చేస్తుంది.
తన కన్నబిడ్డలన్నంత మమకారంతో వారిని సాకుతుంది.

🌷 నా బాబువి కదూ,
నా తల్లివి కదూ...
అని వాళ్ళను ప్రేమగా పిలుస్తూ తన చేత్తో ప్రియమార తినిపిస్తుంది.

🌷కాని, ఆమెకు తెలుసు,
ఆ పిల్లలెవరూ తనవాళ్ళు కాదని.

🌷 తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా...
దాని మనస్సంతా గట్టుమీదే, తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది.

🌷 అలాగే ... నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనియ్యి.
నీ మనసును మాత్రం,
ఆ పరమాత్ముడిపైనే లగ్నం చెయ్యి.

🌷బాల్యంలోనే దైవారాధన అనే సదాచారం నీకు అలవడకపోతే ...
సంపదలు, సౌకర్యాలు, సుఖాలు పోగేసుకునే వ్యామోహంలోపడి
ఆ పరాత్పరుణ్ని పూర్తిగా మరచిపోయే ప్రమాదం ఉంది.

🌷 సర్వసమర్థుడినన్న అహంకారం, ఆశించినవి అందటంలేదన్న దుఃఖం, అంతుపట్టని అసంతృప్తి నిన్ను పూర్తిగా ఆక్రమించుకుని అశాంతి పాలుచేసే విపత్తు పొంచి ఉంటుంది.

🌷ప్రాపంచిక వస్తువుల్ని పోగేసుకుంటున్నకొద్దీ ...
వాటి మీద నీ యావ ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది.

🌷పనసపండును కోసే ముందు అరచేతులకు నూనె రాసుకోవాలి.
లేకపోతే దాని పాలు బంకలా వేళ్ళను పట్టుకుని వదలదు.

🌷 అలాగే ముందు దైవప్రేమ అనే నూనెను అందిపుచ్చుకో...
ఆ తరవాతనే ప్రాపంచిక ధర్మాలను చేతపట్టు.

🌷 దైవానుగ్రహం లభించటానికి నీకంటూ ప్రత్యేకంగా కొంత ఏకాంత సమయం కావాలి.

🌷 పాల నుంచి వెన్న దొరకదు.
ముందు పాలనుకాచి పెరుగు తోడుపెట్టుకోవాలి.
తొందరపడి దాన్ని కదిపితే పెరుగు తోడుకోదు. పాలుగానే ఉండిపోతుంది.
చిక్కని పెరుగును చిలక్కొట్టిన తరవాతే వెన్న లభిస్తుంది.

ప్రపంచం నీళ్ల లాంటిది.
మనస్సు పాల లాంటిది.
పాలను నీళ్ళల్లో పోస్తే అదంతా
కలిసి ఏకమవుతుంది.
వెన్నని నీళ్ళల్లో వేస్తే అది తేలుతుంది.

🌷 అలాగే, ఆధ్యాత్మిక శిక్షణకు ఏకాంత సాధన కావాలి.
జ్ఞానమనే వెన్నను చిలికి తెచ్చుకోవాలి.
ఒకసారి అది లభించాక ప్రపంచమనే నీటిలో ఉంచినా అది కలవదు.

ఈ స్థితికి చేరుకోగలిగేదే ఉత్కృష్ట మార్గం !!🌞

నేను : నేనెవరు? నేను శరీరమా? శరీరము నాదా?

నేను : నేనెవరు? నేను శరీరమా? శరీరము నాదా? ఒక వేళ శరీరము నేనైతే! ఈ శరీరము నాకు తెలియకుండా మారిపోతోంది ఎందుకు? ఒహొ ఐతే శరీరము నాది.

శరీరము : ఈ శరీరము నీదైతే నీకు తెలియకుండా మార్పులు ఎలా జరుగుతున్నాయి ? నీకు తెలియకుండా, నువ్వు చెప్పకుండా ఆకలి దప్పులు ఎలా కలుగుతున్నాయి ?

నేను: మా సైన్స్ చెప్పింది అది శరీరధర్మము అని, శరీరము నాదే

శరీరము: ఐతే ఇది ఎక్కడినుంచి వచ్చింది ?

నేను: మా తల్లి తండ్రుల వల్ల ఎప్పుడో పుట్టింది.

శరీరము: ఓహొ అవునా ? ఐతే, శరీరం మీ తల్లి తండ్రుల వల్ల వచ్చింది నీదెలా
అవుతుంది ?

నేను: అవును అవును, ఇది మాతల్లి తండ్రుల వల్ల వచ్చింది. అది వాళ్ళది.
నాదికాదు.

శరీరము: ఓహొ మరి అది శుక్లమిచ్చిన నీతండ్రిదా ? శోణితముతో కలిపి గర్భంలో
మోసిన తల్లిదా ?

నేను: …….

శరీరము: పాలిచ్చి పెంచిన తల్లిదా? పోషణ భారం వహించిన తండ్రిదా ?

నేను: ఆఁ….

శరీరము: సరే కొంత పెరిగాక, పశువులిచ్చే పాలు తాగి పెరిగావు. ఇది ఆ పశువులదా?

నేను: అయ్యబాబోయ్.. ఈ శరీరము నాదనుకుంటే దీనికి ఇంత మంది యజమానులు వస్తున్నారేంటి?

శరీరము: సరి, మరి భోజనాదులు, పళ్ళు ఫలాలు తిని కదా ఈ శరీరం మార్పు చెందింది అన్న వికారంగా? మరి ఇది ఆ మొక్కలు చెట్లది కాదా?

నేను: మళ్ళీ ఇదోటా ?

శరీరము: సరి, పెరిగి పెద్దవుతున్నప్పుడు విద్యాబుద్దులు నేర్పి, సంస్కారాలునేర్పి శరీరాన్ని నిలబెట్టిన గురువులది కాదా?

నేను: ఇంకా ఎంత మంది దీనికి యజమానులు ?

శరీరము: ఉద్యోగమిచ్చి, నీ జీవన గమనానికి గాను భత్యమిచ్చిన నీ యజమాని వల్లనే కదా దీనిని పోషించి రక్షించు కుంటున్నావు, మరి ఇది ఆయనది కాదా?

నేను: నేను ప్రతిఫలంగా పని చేస్తున్నానే !

శరీరము: అవునా మరి ఇటువంటి శరీరాలు కొన్ని కోట్లు భూమి మీద ఉన్నాయి, ఇది చేసే పనే వేరొకరు కూడా చేస్తున్నారు వారికి తక్కువ దీనికి ఎక్కువ భత్యం ఎందుకు?

నేను: సరే అదీ ఒప్పుకున్నాను, అయ్యిందా ఇంకెవరన్నా ఉన్నారా?

శరీరము: దీనికి ఇంకో శరీరంతో పెళ్ళి అయ్యింది? ఆ శరీరం దీని పోషణార్థమై కష్టపడిందా లేదా? దీన్ని సుఖపెట్టిందా లేదా? మరి దానిది కూడా కదా !

నేను: అవును

శరీరము: ఇది పడిపోయాక దీని అంత్యక్రియ జరిపేవాడొకడున్నాడు కదా! మరి ఇది వాడిది కాకపోతే దానినెందుకు అంత్యేష్టి పేర నాశనము చేస్తున్నాడు? ఐతే ఇది వానిది కూడా!

నేను: అర్థం అవుతోంది…

శరీరము: ఈ శరీరములోని పంచ భూతాలను తిరిగి పంచభూతాలలో కలుపుకునే పంచభూతాలదా కాదా

నేను: అవును ఇది అందరిదీ !

శరీరము: మరి అంత దానికి నాది నాది అని నన్ను (శరీరాన్ని) పట్టుకుని విర్రవీగుతావేం? ఇది ఆ పంచ భూతాలది కూడా కాదు వానిని కూడా సృష్టించి నిర్వహించే వాడున్నాడే వానిది. ఈ శరీరానికి ఇంత మంది యజమానులు లౌకికంగా ఉంటే అందరినీ సమానంగా మాతా పితృభావంతో చూడక ఎందుకు స్వార్థచింతనతో ఉంటావ్? ఇది నీది కానప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసి దానితో ఉత్తమమైన పనులు చేయించక, నీస్వార్థం కోసం వాడుకుంటావే? అలా చేస్తే నువ్వూ ఒక దొంగవేగా?

నేను: బోధ పడింది, ఓ శరీరమా, నేను ఎప్పుడూ నేను నేను అని చూపే నువ్వు నేను కాదు. నువ్వు నా మొదటి గురువువి, నా సంరక్షకుడివి. ఎల్లప్పుడూ నాతో ఉండి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పే గురు స్వరూపానివి. ఓ శరీరమా నా జీవన గమ్యంలో కలిగే మార్పులను పరమాత్మ తోడి నాసంబంధాన్ని ప్రకృతితోడి సంబంధాన్ని తెలిపే దానవు. నీవు నేను కాదు నేను నీవు కాదు, నువ్వు నాదానవు కాదు. నేను నీవాడను కాను. పరమాత్మ నాకిచ్చిన తొడుగువు నువ్వు, కానీ లేని పోని సిద్ధాంతాలతో నేనే నీవని భావించి అసలు నెనెవరినో నేనెవరివాణ్ణో మరిచిపోయాను. అశాశ్వతమైన నువ్వు (శరీరము) నేను కాదు, అఖండము, అనంతము, ఐన పరమాత్మకు చెందినవాడను

Friday, May 29, 2020

మనీ తో పాటు మనషి కూడా విలువ ఇవ్వ వలసి వున్నది

మనీ తో పాటు మనషి కూడా విలువ ఇవ్వ వలసి వున్నది

వెంకట్ ఒక గవర్నమెంట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు...
రోజూ బైక్ లో ఆఫీసుకి వెళ్లడం, సాయంత్రం ఆఫీసు నుంచి నేరుగా ఇంటికి రావడం.

సిటీకి కొత్తగా రావడం వలన
ఆప్యాయంగా పలకరించే వారు ఎవరూ లేరు తనకు, డ్యూటీ తరువాత తన భార్యతో కలిసి కాసేపు అలా అలా తిరిగి రావడం అంతే...
హడావుడిగా పరుగులు తీసే జనాలు
ఎవరి అవసరం వారిది, ఎవరి పనులు వారివి. ఒక్కరికీ ఆగి ఆప్యాయంగా పలకరించే సమయం లేదు.
సిటీ కదా... ఇంతేనేమో అనుకుంటూ రొటీన్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.
రోజులను బిజీగా గడిపేస్తున్నాడే గానీ, జీవితంలో ఏదో తెలియని వెలితి.
బహుశా ఆ వెలితి అందరిలోనూ ఉందనుకుంటా, కానీ పైకి కనబడకుండా లేని పనిని కల్పించుకుని బిజీగా ఉన్నట్టు నటిస్తూ
వాస్తవానికి దూరంగా పారిపోతున్నట్టున్నారు.

ఒకరోజు సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తూ, యధాలాపంగా రోడ్డు పక్కన కూర్చున్న ఒక ముసలావిడను చూసాడు. ముందు చిన్న బుట్ట పెట్టుకుని ఏదో అమ్ముతోంది. దగ్గరకు వెళ్ళి చూసాడు...
బుట్టలో సపోటా పండ్లు పెట్టి అమ్ముతోంది. బాగా వయసు మళ్ళిన వృద్ధురాలు, ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతోంది అనిపించింది వెంకట్ కి. కానీ ఒక్కరూ ఆవిడ దగ్గర ఆగి పండ్లను కొనడం లేదు, అసలు అక్కడ ఒక మనిషి కూర్చుని ఉందన్న విషయం కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా బాధ కలిగింది తనకు,బండి ఒక ప్రక్కగా ఆపి ఆమె దగ్గరకు వెళ్ళాడు.
"ఎలా అమ్మా సపోటాలు, కిలో ఎలా ఇస్తున్నావ్" అనడిగాడు.
ఆమె రేటు చెప్పింది...
సరే ఒక కిలో ఇవ్వు అన్నాడు.
ఆమె ఒక కిలో తూచి సంచిలో వేసి ఇచ్చింది.
సంచిలోనుంచి ఒక పండు తీసి తిని, "ఏంటమ్మా అస్సలు తియ్యగా లేవు పండ్లు" అంటూ ఇంకో పండు సంచిలోనుంచి తీసి ఆమెకిచ్చాడు. ఆమె ఆ పండు తిని" అదేంటి నాయనా... పండు తియ్యగానే ఉంది కదా" అంది.
సరేలే అంటూ డబ్బులిచ్చి ఇంటికి బయలుదేరాడు.
ఆరోజు మొదలు ప్రతీరోజూ
ఆమె దగ్గర ఆగడం, ఒక కిలో సపోటాలు కొనడం, సంచిలోనుంచి ఒక పండు తీసుకుని తిని రుచిగా లేదు అని చెప్పడం, కావాలంటే నువ్వే చూడు అని ఆమెకు ఒక పండు ఇవ్వడం, ఆమె తిని బావుంది కదా అంటే డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్లడం - దినచర్య అయిపోయింది వెంకట్ కి.
ఒకరోజు తన భార్యతో కలిసి వెళుతూ ఆగాడు ఆమె దగ్గర...
ఎప్పటిలానే కిలో పండ్లు తీసుకున్నాడు. సంచిలోనుంచి ఒక పండు తీసుకుని తిని, పండ్లు తియ్యగా లేవని చెప్పి తన సంచిలోనుంచి ఒక పండు తీసి ఆమెకిచ్చాడు. ఆమె పండు తిని తియ్యగానే ఉన్నాయి కదా నాయనా అని చెప్పగానే డబ్బులిచ్చి బయలుదేరాడు. ఇదంతా చూసిన వెంకట్ భార్యకు కోపం వచ్చింది.
ఇంటికి వెళ్లాక
"రోజూ నువ్వు తీసుకుని వచ్చే పండ్లు చాలా తియ్యగా ఉంటాయి, ఎందుకని ఆవిడకు అబద్ధం చెప్పి బాధపెట్టావ్... పాపం కదా అసలే పెద్దావిడ" అనడిగింది.
వెంకట్ చిరునవ్వు నవ్వి
"ఆమె దగ్గర పండ్లు తియ్యగానే ఉంటాయని నాకూ తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆవిడ ఆ పండ్లన్నింటినీ అమ్మడానికి కూర్చుంటుందే కానీ, ఒక్క పండు కూడా ఆమె తినదు. అలా అని నేను కొన్న పండ్లు ఆమెకు తినడానికి ఇస్తే ఆమె తీసుకోకపోవచ్చు. అందుకే అలా అబద్ధం చెప్పి, రోజూ ఆమె తినడానికి ఒక పండు ఇస్తున్నా"అని అసలు విషయం చెప్పాడు...

వెంకట్ తన భార్యతో కలిసి వెళ్లిపోగానే
వృద్ధురాలికి కొంచెం దూరంలో కూరగాయలు అమ్మే ఒకామె వృద్ధురాలి దగ్గరకు వచ్చి
" రోజూ చూస్తున్నాను... ఆ అబ్బాయి వస్తాడు, పండ్లు కొంటాడు. బాగాలేదని మొహం మీదే చెబుతాడు. అయినా కూడా రోజూ నువ్వు ఒక పండు ఎక్కువ తూయడం నేను చూస్తూనే ఉన్నా. అటువంటి వాడికి రోజూ ఒక పండు ఎందుకు ఎక్కువిస్తున్నావ్" అని అడిగింది.
వృద్ధురాలు చిన్నగా నవ్వి చెప్పింది
"పిచ్చిదానా... నేను తీసుకొచ్చే పండ్లన్నీ తియ్యగానే ఉంటాయని నాకు తెలుసు, అయినా తియ్యగా లేవని అబద్ధం చెప్పి కావాలనే రోజూ ఒక పండు నాచేత తినిపిస్తున్నాడు. ఆ అబ్బాయి చూపిస్తున్న ప్రేమకు ఆప్యాయతకు తెలియకుండానే ఒక పండు దానంతటదే ఎక్కువ తూగుతోంది" అని.

నిజంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలలో ఎంతో ఆనందం దాగుంటుంది కదా. అన్ని ఆనందాలనూ డబ్బుతో కొనలేం, ఎదుటివారి పట్ల ప్రేమ ఆప్యాయతలే జీవితంలో నిజమైన తియ్యదనాన్ని నింపగలవు. మనిషికి ఉండవలసిన ఉదార స్వభావం కనుమరుగైపోతోంది. ఇవ్వడంలో ఉన్న ఆనందం, తీసుకోవడంలో దొరకదు.
ఆనందం పంచితే పెరుగుతుందే గానీ తగ్గదు.

అన్నీ ఉన్నా కూడా
ఈరోజుల్లో ఆప్యాయంగా పలకరించే వారు లేకుండా పోతున్నారు. ఆప్యాయంగా పలకరించడానికి ఎదుటివారితో మనకు బంధుత్వమే ఉండనవసరం లేదు, అందరూ ఆప్తులే అని చెప్పడం కోసమే ఈ చిన్న కధ..

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌...దేశభక్తి...

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌..ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్‌ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్య్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు..
ఎందరో విప్లవకారులకు, స్వాతంత్య్ర సమర యోధులకు స్పూర్తినిచ్చిన వీరుడు.. రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్‌ జైలులో 27 ఏళ్లు దుర్భర జీవితం గడిపినా చలించని ధీరుడు వీర సావర్కర్‌.
దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్‌ బ్రిటిష్‌ పాలనపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒక కవిగా, రచయితగా, వక్తగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని జాగత పరిచారు.
1857 స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్‌ వారు భారత్‌ను స్వాధీనం చేసుకొని పాలనపై పట్టు బిగించారు. భారతీయుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జన్మించే నాటికి దేశం కఠోర బానిసత్వంలో మగ్గుతూ అష్టకష్టాలు పడుతోంది. దీనికితోడు సామాజిక కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలలో మునిగిపోయిన భారత సమాజాన్ని సంస్కరించేందు ఎన్నో సాంఘిక, మత ఉద్యమాలు వచ్చాయి. మరోవైపు బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలకు తోడు రహస్య విప్లవోద్యమాలు కూడా ప్రారంభ మయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో జన్మించిన సావర్కర్‌ స్వాతంత్య్రం కోసం పోరాడే రహస్య విప్లవ యోధుడిగా మారాడు. అదే సమయంలో ఆయన సాహితీవేత్తగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా భిన్న కోణాల్లో సేవలు అందించారు.

దేశం కోసమే జీవితం

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జీవితాన్ని రెండు భాగాలుగా ఆవిష్కరించవచ్చు. ఇందులో ముందుగా ప్రథమార్ధాన్ని చూద్దాం. 1883 మే 28న నాసిక్‌ జిల్లా భాగూరు గ్రామంలో దామోదర్‌ పంత్‌, రాధాబాయి దంపతులకు జన్మించారు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌. సావర్కర్‌ అన్న గణేష్‌ దామోదర్‌ సావర్కర్‌, తమ్ముడు నారాయణ రావు సావర్కర్‌. ఈ ముగ్గురు సోదరులు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు.
ఆనాటి బ్రిటిష్‌ పాలనలో భారతీయులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన సావర్కర్‌ సోదరులు తమ కుల దేవత అష్టభుజాదేవి ముందు దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాన్ని సమర్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆశయ సాధన కోసం ‘రాష్ట్ర భక్త సమూహ్‌, మిత్ర మేళా, అభినవ భారత్‌’ అనే సంస్థలను స్థాపించారు.
పుణే పెర్గ్యుసన్‌ కాలేజీలో బిఎ పూర్తి చేసుకున్న వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ ‘బార్‌-ఎట్‌-లా’ చదువు కోసం 1906లో లండన్‌ బయలుదేరారు. న్యాయవిద్య పైకి ఒక సాకు మాత్రమే. అప్పటికే సావర్కర్‌కు వివాహమైంది. ఒక కుమారుడు కూడా. తెల్లవారి గడ్డ లండన్‌ నుంచి విప్లవోద్యమం నడపాలనే కృత నిశ్చయంతో అక్కడికి వెళ్లారు. విప్లవ కారులతో కలిసి పని చేశారు. వారందరికీ సావర్కర్‌ రూపంలో ఒక మార్గదర్శి కనిపించాడు.
సావర్కర్‌ లండన్‌లో ఉన్న సమయంలోనే అన్న గణేష్‌ సావర్కర్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం అండమాన్‌లో కారాగార శిక్ష విధించింది. సావర్కర్‌ న్యాయ విద్య పూర్తి చేసినా, బ్రిటిష్‌ రాణికి విధేయత ప్రకటించడానికి నిరాకరించినందుకు బార్‌ ఎట్‌ లా పట్టా నిరాకరించారు. సావర్కర్‌ కుడి భుజం మదన్‌లాల్‌ ధింగ్రా బ్రిటిష్ ఆర్మీ అధికారి సర్ విలియం హట్ కర్జన్‌ విల్లేని హతమార్చాడు. గణేష్‌ సావర్కర్‌కు శిక్ష విధించిన జాక్సన్‌ అనే అధికారిని అనంత లక్ష్మణ కర్హరే అనే విప్లవ యోధుడు కాల్చి చంపాడు. ఈ రెండు ఘటనల తర్వాత వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై నిఘా పెరిగింది. చివరకు ప్యారిస్‌ నుంచి లండన్‌ వచ్చిన సావర్కర్‌ను రైల్వేస్టేషన్‌లో బంధించారు. స్టీమర్‌లో భారత్‌కు తీసుకొస్తుండగా సముద్రంలో దూకి తప్పించుకునే ప్రయత్నమూ ఫలించలేదు.

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌కు న్యాయస్థానం అండమాన్‌ జైలులో రెండు యావజ్జీవ కారాగార శిక్షలు (50 ఏళ్లు) విధించింది. న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటిరచగానే. ‘బ్రిటిష్‌ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట’ అని చమత్కరించారు ధీశాలి అయన సావర్కర్‌. అంతేకాదు ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి స్పందిస్తూ ‘దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేం’ అని వ్యాఖ్యానించిన మహనీయుడు సావర్కర్‌. 1911 జూలై 4 నుంచి ప్రారంభమైన అండమాన్‌ కారాగార శిక్ష ఎంతో కఠినంగా సాగింది. కొబ్బరి పీచు వలవడం, గానుగ ఆడించి నూనె తీయడం వంటి కఠిన పనులు చేయించారు.
జైలులో ఉన్న రోజుల్లో సావర్కర్‌ తన రచనా వ్యాసాంగాన్ని సాగించారు. తోటి ఖైదీలకు చదువు చెప్పారు. కులమత బేధాలు పాటించకుండా సంస్కరించారు. దేశంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన వత్తిడి కారణంగా 1923 డిసెంబర్‌లో సావర్కర్‌ను అండమాన్‌ నుంచి మహారాష్ట్రలోని ఎరవాడ జైలుకు తరలించారు బ్రిటిష్‌వారు. అనంతరం 1924 జనవరి 6న రత్నగిరి జిల్లా దాటిపోవద్దు, రాజకీయాల్లో పాల్గొనరాదనే షరతులతో బ్రిటిష్‌ ప్రభుత్వం వీర సావర్కర్‌ను పూర్తిగా విడుదల చేసింది.

సంఘ సంస్కర్తగా పునర్నిర్మాణం

సుధీర్ఘకాలం కారాగార జీవితం తర్వాత ఆంక్షలతో విడుదలైన సావర్కర్‌ జీవితం ద్వితీయార్థమంతా హిందూ సమాజ సంస్కరణలో సాగిపోయింది. నాటి హిందూ సమాజం అనైక్యత, అంటరానితనం, సాంఘిక దురాచారాలతో కష్టాలు పడుతోంది. సమాజంలోని ఈ అసమానతలు రూపుమాపి జాతిని సమైక్యం చేసేందుకు నడుం బిగించారు సావర్కర్‌. సావర్కర్‌ తన గ్రామంలోని హరిజనుడి ఇంట టీ తాగడం సనాతన ఆచార పరాయణులకు ఆగ్రహం తెప్పించింది. అంటరానితనం కారణంగానే మన హిందూ సమాజంలో అనైక్యత, మత మార్పిడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు సావర్కర్‌. హిందువులు అంతా బంధువులేనని చాటి చెప్పారు.

1929లో రత్నగిరిలోని విఠలేశ్వరాలయంలోకి హరిజనులకు ప్రవేశం కల్పించారు వీర సావర్కర్‌. మహారాష్ట్ర అంతటా ఈ కార్యక్రమం ఒక ఉద్యమ రూపంలో కొనసాగింది. పాఠశాలల్లో అన్ని కులాల విద్యార్థులు కలిసి చదువుకునేలా ప్రోత్సహించారు. 1931లో పతిత పావన మందిరాన్ని నిర్మించి శంకరాచార్యులచే ప్రారంభించారు సావర్కర్‌. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యత తీసుకురావడానికి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. హిందూ సమాజం నుంచి కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం అంటే మనకు శత్రువులను పెంచుకోవడమేనని గుర్తు చేసేవారు సావర్కర్‌. అన్యమతం స్వీకరించిన వారిని శుద్ధి ఉద్యమాల ద్వారా తిరిగి హిందూ సమాజంలోకి తీసుకొచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హిందూ సంఘటన కోసం సామూహిక గణేష్‌ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.

హిందుత్వం, జాతీయ వాదం

హిందుత్వ పేరు వినగానే ఏదో రూపంలో వీర సావర్కర్‌ గుర్తుకు వస్తారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే హిందువు అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు సావర్కర్‌.
‘ఆసింధు సింధు పర్యంతా యస్యభారత భూమికా
పితభూః పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మతాః’
‘సింధూ నది మొదలు హిందూ మహా సముద్రం వరకూ ఉన్న ఈ భారత భూమిని మాతభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించిన వారంతా హిందువులే..’ హిందువులు అంటే ఎవరనే ప్రశ్నకు వినాయక దామోదర్‌ సావర్కర్‌ ఇచ్చిన స్పష్టమైన సమాధానం ఇది.
హిందువనే పదం సాంస్కృతిక జీవితానికి సంబంధించినది. దేశంలో నివసించే ప్రతి వ్యక్తి ప్రాంతం, భాష, మతాలకు అతీతంగా తాను భారతీయుడినని భావించాలి. అదే మన జాతీయత అని చెప్పారు సావర్కర్‌. హిందుత్వం అనేది మన జాతీయతను సూచిస్తుంది. దేశంలో మతాలు ఎన్ని ఉన్నా జాతీయత ఒక్కటే. జాతీయత అనే నదిలో అన్ని మతాలు, వర్గాలు సెలయేర్లలా కలిసిపోవాలి అని కోరుకున్నారు సావర్కర్‌. ఏ మతం వారైనా భారతీయులే. వారు ముస్లింలైతే భారతీయ ముస్లింలు, క్రైస్తవులైతే భారతీయ క్రైస్తవులు. అంతేకాని ‘ఏ మతం ప్రత్యేక జాతి కాదు’ అని చెప్పారు సావర్కర్‌.
హిందుత్వాన్ని భారత జాతీయతతో సమానంగా నిర్వచించారు సావర్కర్‌. ప్రపంచంలో ఎన్నో దేశాలు, జాతులు, మతాలు, సాంస్కృతులు ప్రత్యేక అస్తిత్వంతో ఉన్నట్లే హిందూ జాతీయత తనదైన గుర్తింపుతో మనుగడ సాగిస్తుంది. హిందూ సంఘటన అంటే జాతి సంరక్షణ అని చెప్పారు సావర్కర్‌. హిందువుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా ఘర్షణ తప్పదు. ఈ స్వీయ రక్షణ కోసం హిందూ సంఘటనోద్యమాన్ని ప్రారంభించారు వీర సావర్కర్‌. స్వాతంత్య్రంతో పాటు దేశ విభజన కూడా తప్పదని చాలా ముందుచూపుతో గ్రహించారు సావర్కర్‌. ఆనాటి బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో హిందువులు చాలా తక్కువ. అందుకే హిందువులు సైన్యంలో చేరాలని ప్రోత్సహించారు సావర్కర్‌. సావర్కర్‌ ఈ పిలుపు ఇవ్వడాన్ని తప్పు పట్టిన వారంతా, తర్వాత కాలంలో ఆయన దూరదష్టిని అభినందించారు.
1938 నాటికి బ్రిటిష్‌ ప్రభుత్వం వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై అన్ని ఆంక్షలను ఎత్తేసింది. తరువాత హిందూ మహాసభకు ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.

చరిత్రకారుడు, సాహితీవేత్తగా..

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ స్వాతంత్ర యోధునిగానే కాక చరిత్రకారునిగా, సాహితీవేత్తగా కూడా ప్రసిద్ధులు. ఆయన గ్రంధాలు ప్రజల్లో దేశభక్తిని రగిలించేవి. ఈ కారణం వల్లే బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన రచనలపై గట్టి నిఘా పెట్టింది. చాలా ఏళ్ల పాటు నిషేధం కూడా అమలులో ఉంది. భారతదేశంతో పాటు విదేశీ చరిత్రలను కూడా ఎంతో లోతుగా అధ్యయనం చేసి మనకు సాహిత్య సష్టి చేశారు సావర్కర్‌.
సావర్కర్‌ 1908లో లండన్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ను రాశారు. ఆనాడు జరిగిన ఉద్యమాన్ని బ్రిటిష్‌ చరిత్రకారులు కేవలం సిపాయిల తిరుగుబాటుగా అభివర్ణించారు. కానీ అది స్వాతంత్య్ర సంగ్రామమని స్పష్టంగా లోకానికి చాటి చెప్పారు సావర్కర్‌. దీన్ని ప్రపంచంలోని పలు భాషల్లోకి అనువదించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రచురణకు ముందే ఈ గ్రంధాన్ని నిషేధించింది. దీన్ని ముద్రణ కోసం భారత్‌ లోని తన అన్న గణేష్‌ సావర్కర్‌కు పంపగా, బ్రిటిష్‌ వారు పసిగట్టారు. ఆయన్ను ఆరెస్టు చేసి అండమాన్‌కు పంపింది ఈ కేసులోనే. మహారాష్ట్రలోని అన్ని ముద్రణాలయాలపై ముందు జాగ్రత్తగా దాడులు జరిపారు. అయినప్పటికీ విదేశాల్లో ముద్రించిన ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ రహస్యంగా భారతదేశం చేరింది. ఈ గ్రంథం ఎంతో మంది స్వాతంత్య్ర సమర వీరులకు, విప్లవ యోధులకు స్పూర్తినిచ్చింది.
సావర్కర్‌ అండమాన్‌ జైలులో బందీగా ఉన్నప్పుడు అక్కడ విధించిన కఠిన శిక్షలకు చింతిస్తూ కూర్చోలేదు. చేతులకు, కాళ్లకూ బేడీలు వేసి శరీరాన్ని బంధించారు, కానీ మనసును కాదు అనుకునేవారు. స్వతహాగా ఆయన కవి. శిక్ష సమయంలో జైలు గోడల మీదే కవితలు రాశారు. వీటిని కంఠస్థం చేసి, గుర్తు పెట్టుకొని, తర్వాత కాలంలో గ్రంథస్తం చేశారు. కొద్ది నెలల తర్వాత జైలు సిబ్బంది ఆయనకు కాగితాలు, కలం సమకూర్చారు. అండమాన్‌ జైలులో ఉన్న సమయంలోనే కమల, గోమాంతక్‌, మహాసాగర్‌ తదితర గొప్ప కావ్యాలు వచ్చాయి.
1922లో జైలు గోడల మధ్యే హిందుత్వ గ్రంధ రచనకు పూనుకున్నారు సావర్కర్‌. హిందుత్వకు సమగ్ర నిర్వచనం ఇచ్చిన గ్రంథం ఇదే.
సావర్కర్‌ తన ఆరోగ్యం క్షీణిస్తున్న దశలో కూడా రచనా వ్యాసాంగాన్ని వదిలిపెట్టలేదు. 1963లో ఆయన రాసిన ‘భారత ఇతిహాసంలో ఆరు స్వర్ణపుటలు’ మన చరిత్రలోని ముఖ్య ఘట్టాలను ఉల్లేఖిస్తూ స్వాభిమానాన్ని చాటి చెప్పింది. అండమాన్‌ జైలులో తాను గడిపిన దుర్భర జీవితంపై రాసిన ఆత్మకథ మరాఠా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచి పోతుంది. దీని ఆధారంగా ఎన్నో రంగస్థల నాటకాలు కూడా వచ్చాయి.
ఆధునిక భారతీయ రాజనీతిజ్ఞులలో సావర్కర్‌ ఒకరు. ఆయన మహోన్నత ఆదర్శవాది, మానవతా వాది, హేతువాది కూడా. అభ్యుదయ, వైజ్ఞానిక, శాస్త్రీయ దృక్పథాలు ఆయన రచనలు, ఉపన్యాసాల్లో కనిపిస్తాయి.

స్వదేశీ ప్రభుత్వ నిర్దయం

సావర్కర్‌ జీవితం అంతా సంఘర్షణలతోనే సాగింది. బ్రిటిష్‌ ప్రభుత్వంతో పాటు స్వదేశీ ప్రభుత్వం కూడా ఆయనపట్ల నిర్దయగానే వ్యవహరించింది. మహాత్మాగాంధీ హత్యోదంతంలో ఆయనను అన్యాయంగా అరెస్టు చేశారు. అనంతరం నిర్దోషిగా విడుదల చేశారు. దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహానీయునికి దక్కాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం ‘అప్రతిహతీ స్వాతంత్య్ర వీర’ అనే బిదురుతో గౌరవించింది. జీవిత చివరి దశలో తన 86వ ఏట జీవితం చాలించదలచి ఆహారాన్ని త్యజించారు సావర్కర్‌. 1966 ఫిబ్రవరి 26న ఈ లోకం నుంచి విముక్తి పొందారు. ఆ మహనీయుడు అందించిన స్ఫూర్తి కోట్లాది మంది భారతీ యుల్లో అగ్నికణమై చిరస్థాయిగా నిలిచిపోతుంది.

వీర సావర్కర్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాలు

– 1883 మే 28 – మహరాష్ట్ర నాసిక్‌ జిల్లా భాగూరు గ్రామంలో రాత్రి 10 గంటలకు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జననం
– 1892 – తల్లి రాధాబాయి మరణం
– 1898 – దేశ స్వాతంత్య్రం కోసం జీవితాన్ని సమర్పిస్తానని కుల దేవత అష్టభుజాదేవి ముందు ప్రతిన
– 1899 సెప్టెంబర్‌ – తండ్రి దామోదర్‌ పంత్‌ మరణం, ‘రాష్ట్రభక్త సమూహ్‌’ రహస్య సంస్థ ప్రారంభం
– 1900 – ‘మిత్రమేళా’ అనే రహస్య సంస్థ ప్రారంభం
– 1901 మార్చి – యమునా బాయితో వివాహం’
– 1902 – పూణే ఫెర్గ్యూసన్‌ కాలేజీలో చేరిక
– 1904 మే – ‘మిత్ర మేళా’ పేరు ‘అభినవ్‌ భారత్‌’ గా మార్పు
– 1905 డిసెంబర్‌ – బిఎ ఉత్తీర్ణత
– 1906 జూన్‌ 9 – ‘బార్‌ ఎట్‌ లా’ చదువు కోసం ఇంగ్లాడ్‌ చేరిక
– 1908 మార్చి – ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ రచన
– 1909 – సావర్కర్‌ కుమారుడు ప్రభాకర్‌ మరణం, అన్న గణేష్‌ సావర్కర్‌కు అండమాన్‌ జైలు శిక్ష. బ్రిటిష్‌ రాణికి విధేయత చూపనందుకు సావర్కర్‌కు బార్‌-ఎట్‌-లా డిగ్రీ నిరాకరణ
– 1909 – లండన్‌లో కర్జన్‌ వైలీని హతమార్చిన సావర్కర్‌ అనుచరుడు మదన్‌లాల్‌ ధింగ్రా
– 1910 మార్చి 13 – లండన్‌ రైల్వే స్టేషన్‌లో సావర్కర్‌ అరెస్టు
– 1910 జూలై 18 – స్టీమర్‌లో భారత్‌ తీసుకువస్తుండగా సముద్రంలో దూకి తప్పించుకునే యత్నం
– 1910 డిసెంబర్‌ 24 – సావర్కర్‌కు అండమాన్‌ యావజ్జీవ కారాగార శిక్ష విధింపు
– 1911 జనవరి 31 – సావర్కర్‌కు రెండో యావజ్జీవ కారాగార శిక్ష విధింపు
– 1911 జూలై 4 – అండమాన్‌ కారాగార శిక్ష ప్రారంభం
– 1918 – సావర్కర్‌కు తీవ్ర అనారోగ్యం
– 1922 – ‘హిందుత్వ’ గ్రంధ రచన
– 1923 డిసెంబర్‌ – ఎరవాడ జైలుకు సావర్కర్‌ బదిలీ
– 1924 – రాజకీయాల్లో పాల్గొనరాదు, రత్నగిరి వదిలి పోరాదు అనే షరతులతో సావర్కర్‌ విడుదల
– 1924 – ‘గోమంతక్‌’ గ్రంథ రచన
– 1925 – కుమార్తె ప్రభ జననం, అస్పశ్యతకు వ్యతిరేకంగా ఉద్యమం
– 1927 – రత్నగిరిలో మహాత్మా గాంధీజీతో సమావేశం, అండమాన్‌ అనుభవాలపై పుస్తక రచన
– 1931 ఫిబ్రవరి – రత్నగిరిలో పతిత పావన మందిర ప్రారంభం
– 1937 – సావర్కర్‌పై ఆంక్షల ఎత్తివేత, పూర్తిస్థాయి విడుదల.. హిందూ మహాసభ అధ్యక్షునిగా ఎన్నిక
– 1938 అక్టోబర్‌ – హైదరాబాద్‌ విముక్తి సత్యాగ్రహం
– 1943 – సావర్కర్‌ షష్టిపూర్తి
– 1945 మార్చి – సావర్కర్‌ అన్న గణేష్‌ సావర్కర్‌ మరణం
– 1946 ఏప్రిల్‌ – సావర్కర్‌ సాహిత్యంపై నిషేధం ఎత్తివేత
– 1948 ఫిబ్రవరి 5 – గాంధీ హత్య కేసులో అరెస్టు
– 1949 మే 10 – నిర్దోషిగా విడుదల
– 1949 అక్టోబర్‌ – తమ్ముడు నారాయణరావు మరణం
– 1958 – సావర్కర్‌కు 75 ఏళ్ల సందర్భంగా అమతోత్సవం
– 1959 – పూణె విశ్వ విద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్‌
– 1963 – ‘భారతీయ ఇతిహాస్‌ కే ఛే స్వర్ణిమ పష్ట్‌’ పుస్తక ప్రచురణ
– 1963 మే – సావర్కర్‌ భార్య యమునాబాయి మరణం
– 1966 ఫిబ్రవరి 26 – వీర సావర్కర్‌ శాశ్వత నిష్క్రమణ
(మే 28 సావర్కర్‌ జయంతి)

Source: జాగృతి

రిమోట్‌ యాప్‌లతో ఖాతాలు ఖాళీ!

రిమోట్‌ యాప్‌లతో ఖాతాలు ఖాళీ!
రూటు మార్చిన జార్ఖండ్‌ సైబర్‌ మోసగాళ్లు

OTP కి స్పందన లేకపోవడంతో కొత్తరూటు

సైబరాబాద్‌లో ఐదునెలలో 20 కోట్లు లూటీ


OTP అనగానే ఇప్పుడు చాలామంది ఫోన్‌ కట్‌ చేస్తుండటంతో సైబర్‌ నేరగాళ్లు కొత్త రూటు ఎంచుకున్నారు.
OTP సైబర్‌ దొంగలుగా పేరొందిన జార్ఖండ్‌ ముఠా సభ్యులు ఇప్పుడు రిమోట్‌ యాప్‌లతో దోచేస్తున్నారు. ఎనీడెస్క్‌ యాప్‌, టీమ్‌ వ్యూయర్‌ యాప్‌, క్విక్‌ సపోర్టు తో పాటు మరికొన్ని రిమోట్‌ యాప్‌లను తమ చోరీలకు అస్ర్తాలుగా వాడుతున్నారు.

ఇటీవల హైదరాబాద్‌ కు చెందిన సుధాకర్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. సార్‌.. ఎయిర్‌టెల్‌ నుంచి మాట్లాడుతున్నా. మీ ఫోన్‌ సేవలు కొద్దిసేపట్లో నిలిచిపోతాయి. ఇందుకు మీరు KYC అప్‌డేట్‌ చేసుకోవాలన్నాడు. మీరు జస్ట్‌ క్విక్‌ సపోర్టు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.. మిగతాది మేము చూసుకుంటాం.. అన్నారు. అప్పటికే సుధాకర్‌కు కొన్ని ముఖ్యమైన కాల్స్‌ వచ్చేవి ఉండటంతో ఓకే అన్నాడు. క్విక్‌ సపోర్ట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని అతనికి ID నీ కూడా చెప్పేశాడు. సార్‌ మీరు ఎవరికైనా ఓ రూపాయిని ట్రాన్స్‌ఫర్‌ చేయండని చెప్పాడు. అలా పది నిమిషాలు గడిచిందో లేదో.. సుధాకర్‌ ఖాతా నుంచి లక్ష రూపాయలు మాయమయ్యాయి. ఖంగుతిన్న సుధాకర్‌.. వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశారు. సుధాకర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఐడీ ఇవ్వగానే దాంతో పార్టనర్‌గా మారిన సైబర్‌ క్రిమినల్‌.. రూపాయి బదిలీ చేయమన్నప్పుడు సుధాకర్‌ UPI పిన్‌ నెంబర్‌, PASSWORD ను తెలుసుకొని మరుక్షణమే లక్ష రూపాయలు కొట్టేశాడు. ఇలా ఒక సుధార్‌ కాదు.. చాలామంది ఇటీవల రిమోట్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని తమ ఖాతాలను గుల్లచేసుకున్నారు. ఇలా ఒక్క సైబరాబాద్‌ పరిధిలోనే గత ఐదునెలలో వివిధ సైబర్‌ క్రైం అంశాలకు సంబంధించి బాధితులు రూ.20 కోట్లు పోగొట్టుకున్నారు.

📱రిమోట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేస్తే ఏమైతదంటే

కంప్యూటర్ల లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉండే నిపుణులు రిమోట్‌ యాప్‌ల ద్వారా వాటిని పరిష్కరించేవారు. ఉదాహరణకు ఇండియా లో ఉన్న కార్పొరేట్‌ సంస్థ కంప్యూటర్లలో ఏ సమస్య వచ్చినా, లేదా పని పురోగతి తెలుసుకోవడానికి ఈ యాప్‌లను వినియోగించేవారు. రిమోట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ఒక ఐడీ వస్తుంది. దానిని మనం అవతలివారికి చెప్తే వారు ఆ ఐడీని కాపీచేసుకుని పార్టనర్‌గా మారి మన కంప్యూటర్‌ను ఇతర ప్రాంతం నుంచి చూస్తారు. ఇది సాంకేతికంగా ఐటీ పరిశ్రమలో చాలా ఉపయోగపడుతుంది. కానీ, దీనిని జార్ఖండ్‌ సైబర్‌ నేరగాళ్లు తమ నేరాలకు అనువుగా మార్చుకుంటున్నారు. వాటిని డౌన్‌లోడ్‌ చేయించి మన కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ ఫోన్‌లను వారి ఆధీనంలోకి తెచ్చుకుని మన ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, UPI బ్యాంక్‌ ID లను తెలుసుకుని ఖాతాల్లో డబ్బును దోచేస్తున్నారు.

📱యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఎవరూ చెప్పరు

ఏ బ్యాంక్‌, ఏ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రిమోట్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోమని చెప్పవు. ఉన్నత విద్యావంతులతో పాటు ఫోన్‌పై అవగాహన ఉన్నవారిని సైతం సైబర్‌ మాయగాళ్లు బోల్తా కొట్టిస్తున్నారు. అదే సాధారణ ఫోన్లు వాడి కొంచెం తెలివిగా ఉండే వారిని వీరు మోసం చేయలేపోతున్నారని మా అధ్యయనంలో తేలింది. OTP లు, రిమోట్‌ యాప్‌ల ఐడీ చెప్పొద్దు. KYC లు అన్నా పట్టించుకోవద్దు. ముఖ్యంగా హిందీలో మాట్లాడి మేము అధికారులమంటే అది సైబర్‌కాల్‌గా అనుమానించాలి. భాష యాసను గుర్తుపట్టండి. వచ్చి రాని ఆంగ్లం, ఉత్తరాది యాసలో హిందీ మాట్లాడితే వారికి సమాధానం ఇవ్వకుండా ఫోన్‌ కట్‌ చేయాలి.

-CHY శ్రీనివాస్‌ కుమార్‌, ACP సైబరాబాద్‌

Thursday, May 28, 2020

మనోశక్తి - Mind Power

🌹. మనోశక్తి - Mind Power 🌹


🌸ఆలోచన అంటే ఏమిటి? ఆలోచన యొక్క విశిష్టత ఏంటి🌸

1) ఆలోచనలు, feelings, emotions అన్ని అహం నుండి పడుతున్నాయి.
అహం మన వ్యక్తిత్వం నుండి, సంఘం నుండి ఏర్పడిన బుద్ధి వల్ల వస్తుంది.

మనం మన సాధనతో, conscious మైండ్కి suggestions ఇవ్వాలి. అంతర్ ప్రపంచం తనకు తానుగా ఏది మనకు ఇవ్వదు.

2) వాయువును మన కళ్ళతో చూడలేము, కానీ ఇంద్రియాలు పసిగట్టగలవు. అలాగే ఆలోచనలు కూడా మన కళ్ళకు కనపడవు. వీటిని telepathy ద్వారా పసిగట్టవచ్చు.

3) ఆలోచనలకు బలమైన ఉక్కు కడ్డీలను వంచే శక్తి, laser కిరణాలను కేంద్రీకరించి ఏ వస్తువునైనా రెండు ముక్కలుగా చేసే శక్తి ఉంది.
for ex:--ezypt లో పెద్ద పెద్ద టన్నుల బరువున్న రాళ్లను అప్పటి కాలంలో వారి ఆలోచనా శక్తిని కేంద్రీకరింపచేసి ఆ రాళ్లను ఎత్తి పిరమిడ్ లను నిర్మించారు.

4) ఒక ప్రాంతంలోని వారంతా వర్షాలు రావాలని సంకల్పిస్తే భౌతిక వాతావరణం మారి వర్షాలు కురుస్తాయి. for ex:--యజ్ఞాలు.... యోగులు, ఋషులు వారి ఆలోచనాశక్తితో వర్షాలు రావాలని సంకల్పిస్తే వర్షాలు వస్తున్నాయి.

5) మన ఆలోచనలకు బలమైన అయస్కాంత ఆకర్షణ శక్తి ఉంది. దాని ద్వారా ఇతరుల ఆలోచనలును ప్రభావితం చేయవచ్చు. అలాగని మన ఆలోచనలు ద్వారా ఇతరులకి హాని చేయడం, ప్రమాదం తలపెట్టడం, లాంటివి జరగవు. వాళ్ళ సంకల్పం లేనిదే ఆలోచనలు వారిని ప్రభావితం చేయలేవు.

6) మనం మన ఆలోచనలును,నమ్మకాలను పరిశీలించాలి. ఆలోచనల పట్ల ఎరుక ఉండాలి. ఆలోచనలను పరిశీలన, పరీక్షించడం, ద్వారా సక్రమమైన రీతిలో వాటిని ఉపయోగించుకోవచ్చు.

7) ఆలోచన ఒక్కసారి మన మైండ్ నుండి వెలువడితే దానిని ఉపసంహరించడం మన చేతిలో లేదు, అది ఎక్కడో ఒక చోట వాస్తవ రూపం చెందుతుంది.

🌹 🌹 🌹 🌹 🌹

Wednesday, May 27, 2020

సబ్జాతో కూల్‌ కూల్‌....!

* సబ్జాతో కూల్‌ కూల్‌....!

వేసవిలో చల్లచల్లటి ఫలూదా తాగుతుంటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే ఫలూదాలో సబ్జాగింజల్ని వాడతారు కనక. ఎండవేడిని తగ్గించడంలో ఈ గింజలు అద్భుతమైన ఫలితాన్ని అందిస్తాయి. అందుకే మీరు బయట మార్కెట్‌లో వీటిని కొనుక్కుని.. తరచూ వాడండి..

ఫలూదా, రూహప్జా, నింబు పానీ, పాన్‌ గుల్కండ్‌ మిల్క్‌షేక్‌, సా్ట్రబెర్రీ ఫలూదా, మ్యాంగో ఫలూదా, మ్యాంగో షర్బత్‌, రోజ్‌మిల్క్‌, ఐస్‌క్రీములు, కుల్ఫీ, షరబత్‌ వంటి వాటిలో నానబెట్టిన సబ్జాగింజలు జోడించినప్పుడే వాటికి రుచి ఎక్కువ. చక్కటి ప్రయోజనమూ కలుగుతుంది.

• బరువు తగ్గేందుకు...

సబ్జా గింజలు ఏదో ఒక రూపంలో తీసుకుంటే బరువు తగ్గుతారు. ఎందుకంటే వీటితో చేసిన పానీయాలు తాగితే.. అంత త్వరగా ఆకలి వేయదు. ఇందులోని అత్యధిక పీచుపదార్థం జీర్ణక్రియల్ని చురుగ్గా ఉంచుతుంది. వేసవిలో తగినంత పీచు తీసుకోవడం అవసరం.

• వేడిని తరిమేస్తుంది..!

వేసవిలో శరీరాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆ వేడి వెంటనే తగ్గాలంటే సబ్జాగింజలను వాడాలి. గింజల్ని రెండు మూడు గంటలు నీళ్లలో నానబెడితే కాస్త తెల్లగా ఉబ్బుతాయి. వీటిని ఒక గ్లాసులోకి పోసుకుని, నిమ్మరసం, పంచదార లేదంటే రకరకాల జ్యూస్‌లలో కలుపుకుని తాగేయొచ్చు.

• మధుమేహానికి

రక్తంలోని షుగర్‌ లెవెల్స్‌ను బ్యాలెన్స్‌ చేసే గుణం వీటికి ఉంది. ముఖ్యంగా డయాబెటిక్‌ టైప్‌ 2 నియంత్రణకు చక్కగా పనిచేస్తుంది. నానబెట్టిన తరువాత ఉబ్బిన ఈ గింజలను పాలలో కలుపుకుని.. కాస్త వనీలా వేసుకుని తాగొచ్చు. సాధారణ పాలుతోనే కాదు, ఆల్మండ్‌ మిల్క్‌, సోయా మిల్క్‌లలోను మిక్స్‌ చేసుకుని తాగొచ్చు.

• మలబద్ధకాన్ని వదిలిస్తుంది

వేసవిలో పీడించే సమస్యల్లో మలబద్ధకం ఒకటి. వయసు మీరిన వాళ్లలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువ. నానిన సబ్జాగింజలను పాలలోకి కలుపుకుని రాత్రి పడుకునేముందు తాగితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

• గడబిడకు ఉపశమనం...!

వేసవిలో ఉన్నట్లుండి అజీర్తి వేధిస్తుంటుంది. వేడి తీవ్రంగా ఉన్నప్పుడు తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవ్వదు. కడుపులో గందరగోళం ఏర్పడుతుంది. ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎసిడిటీ కూడా పెరుగుతుంది. ఇలాంటి వారు గ్లాసుడు సబ్జా మిల్క్‌ తీసుకుంటే చక్కటి ఉపశమనం దొరుకుతుంది. ఈ సమయంలో కాఫీలు, టీలు బాగా తగ్గించాలి.

• చర్మానికి, జుట్టుకు...

మనం తినే తిండిలో విటమిన్‌ కె కలిగిన పదార్థాలను తక్కువ తింటుంటాం. అందుకని అప్పుడప్పుడైనా సబ్జాతో చేసిన ఫలూదా వంటి జ్యూస్‌లు తాగుతుండాలి. ఈ గింజల్లో విటమిన్‌ కె అధికంగా ఉంటుంది. తద్వార చర్మ నిగారింపుతో పాటు జుట్టు నిగనిగలాడేందుకు ఉపయోగపడుతుంది. వీటితోపాటు ప్రొటీన్లు, ఇనుము కూడా లభిస్తాయి.

• గొంతునొప్పిని తగ్గిస్తుంది...!

కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు, కొత్త నీళ్లు తాగినప్పుడు.. చాలామందిలో గొంతునొప్పి లేదా ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. సీజన్‌ మారినప్పుడు ఇటువంటి సమస్య చుట్టుముడుతుంది. దీనికి విరుగుడు సబ్జాగింజలు. థ్రోట్‌ ఇన్‌ఫెక్షన్‌తో పాటు గురకను సైతం తగ్గిస్తాయివి.

పుట్టుకైనా చావైనా తాను చేసుకున్నదానిని బట్టే వస్తుంది. ఇదే విది..

జీవితం ఎక్కడ ఎలా మొదలవుతుందో
అక్కడే అంతమవుతుందని అందరికీ
కరాఖండీగా తెలుసు.

మనం ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు అన్నిటికీ కారణం
మనం పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలాలు
అవి అనుభవించక తప్పదు.

ఆ పరమాత్మను నిందించకండి.

ఎన్నో పూజలు చేస్తున్నాం
రోజు గుడికి వెళ్తున్నాం.

ఎన్నో మంచి పనులు చేస్తున్నాము మాకే ఇన్ని కష్టాలు అని బాధపడకండి.

మీరు చేసిన మంచి పనుల ఫలితం
ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు తప్పకుండా
ఇస్తాడు...


తన బిడ్డలకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో
ఆ తండ్రికి తెలుసు కదా 🙏

చిన్న కధ..మీ కోసం..

పూర్వం ఒక ఊరిలో ఓ పేద కుటుంబం ఉండేది.

వాళ్ళు ఇంటి పెద్ద రోజు శివ పూజ చేస్తూ తనకి ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తనపని తాను చేసుకునేవాడు.

అలా ఎన్నాళ్ళ నుండో పూజలు చేస్తూ తన బాధని శివయ్యకి వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు.


ఒక రోజు పార్వతీదేవి శివుడితో "స్వామి అతడు అనేక
సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు.

కరుణించి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా."

అంటే శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

పార్వతికి కోపం వచ్చింది.

ఏమిటి స్వామి ఆ నవ్వు!

ఇప్పుడు మీరు ఆ భక్తుడిని కరుణించి పేదరికం మాపి ధనవంతుడిని చేయకపోతే ఊరుకొను అంది.

శివుడు మళ్ళి నవ్వి దేవి! నీకోరిక కాదనలేను కాని జరగబోయే విపరీతాలు నీవు ఎరుగవు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి.

అనుభవిస్తే కాని కర్మ పరిపక్వం చెందదు...అన్నాడు.

అయినా వినలేదు.

పట్టుబట్టింది...
శివుడు ఇక కాదనలేక దేవి!

నీకోరిక ప్రకారం అతడిని ధనవంతుడిని చేస్తాను.

చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు.

అని అక్కడ మాయమయ్యాడు శివుడు.

ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై "నిన్ను నేను రోజు గమనిస్తున్నాను.

ఎందుకు అలా సేవలు చేస్తావు ఆ శివుడికి.

భోళా శంకరుడు అన్నారు కానీ ఎప్పుడైనా కనికరించాడా?

వృథాగా పూజలు చేయకు అని ఒక వజ్రపు రాయి చేతికి ఇచ్చి ఇది అమ్ముకొ చాలా డబ్బు వస్తుంది.

హాయిగా బ్రతకవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఆ వజ్రపు రాయిని చూసే సరికి మతి పోయింది.

ఎన్నో కోరికలు మనస్సులో మెలిగాయి.
అది కొనాలి ఇది కొనాలి. ఇంకేదో చేయాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు.

పెట్టెలో భద్రంగా దాస్తుంటే భార్య వచ్చింది.

ఏమిటి అంటే జరిగింది చెప్పాడు.

ఆవిడకి దానిమీద ఆశ పుట్టింది... చీరలు నగలు అంటూ వంద కోరికలు ఏకరువు పెట్టింది.

ఇద్దరికీ వాదనలు జరిగాయి.

భార్యని బయటికి గెంటి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు,

చేతిలో ఉన్న రాయిని చూసి దాని వెలుగులు చూసి నాకు ఇవ్వు.

నేను తాగాలి జూదం ఆడాలి, అప్పులు తీర్చాలి అన్నాడు.

పెద్ద గొడవ అయింది.

పక్కనే ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒక్కటి వేశాడు.

అంతే అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు.

అడ్డువచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు.

అది చూసిన దొంగలు వాడిని చంపి వజ్రం ఎత్తుకుపోయారు.

అది చూసిన భటులు ఆ దొంగలని చంపేసి రాజుగారికి ఇచ్చారు.

దానిని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పోదిగాడు.


చూశావా!
పార్వతీ!
ఏమి జరిగిందో!

ఒక్క రాయి ఎన్ని బ్రతుకులు మార్చిందో,

ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో!
ఎన్ని ప్రాణాలను బలిగొందో!

ఆపేదవాడు పూర్వం బ్రాహ్మణ వశంలో జన్మించి భార్యని పిల్లల్ని హత్య చేశాడు.

ఎవరికీ దానం ధర్మం చేయలేదు.

భక్తి మాత్రం మెండు.
ఆ భక్తే ఈజన్మలో నేటి వరకు కొనసాగింది.

చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు.

ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చడం కుదరదు. అనుభవిస్తేనే కర్మ తీరుతుంది.

ఏ వస్తువు ఎక్కడికి చేరాలో ఎవరికీ దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేనివాడు పొందలేడు.

తాత్కాలికంగా విలువైన వస్తువులు మనదగ్గర ఉన్నట్లు కనిపించినా అర్హత లేకపోవడం చేత తొందరగానే పతనం అవుతాయి.

పేదవాడు,మంచివాడు అనేది ఉండదు.

గతజన్మలో భార్య
బిడ్డలని చంపాడు.
భార్య గయ్యాళి అయింది.

కొడుకు
వ్యసనపరుడై తండ్రిని చంపాడు.

వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం. పుట్టుకైనా చావైనా తాను చేసుకున్నదానిని బట్టే
వస్తుంది. ఇదే విది..🙏

శివోహం..హరహర మహాదేవా...!!🙏🏻

ఏది విజయం

ఏది విజయం

ఒకానొక చిన్న గ్రామంలో ఒక ధనవంతుడు మరియు ఒక పేద రైతు ఉండేవారు. ఆ చిన్న గ్రామం పట్టణాలకి అత్యంత దూరంలో ఉండటం వలన ధనవంతుడు తన కుమారుడిని అదే గ్రామంలో ఉన్న ఒక చిన్న పాఠశాలలో చేర్పించాడు. అదే పాఠశాలలో పేద రైతు కుమారుడు కూడా చదువుతున్నాడు. అలా ధనవంతుని కుమారుడు పేద రైతు కుమారుడు ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు.

ధనవంతుని కుమారుడు తన ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలుతో పాటు అందరికంటే చదువులో కూడా చాలా చురుకుగా ఉండేవాడు. రైతు కుమారుడు చదువులో అంతగా రానించలేకపోయినా క్రమ శిక్షణలో ముందు ఉండేవాడు. చూస్తుండగానే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అందరూ స్కూలు విడిచిపెట్టే సమయం వచ్చింది.

పాఠశాల చివరి రోజు అందరి పిల్లలూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నేను డాక్టర్ అవుతాను అంటే నేను లాయర్ అవుతాను అంటూ పోటీ పడుతున్నారు. ధనవంతుని కుమారుడ్ని అడిగారు. తను కూడా అందరి లాగానే నేను ఒక పెద్ద బిజినెస్ మాన్ అవుతాను అని చెప్పాడు. అందరూ కలసి రైతు కుమారుని వైపు చూసి నువ్వు ఏమి అవుతావు అని అడిగారు. దానికి ఆ రైతు కుమారుడు చెప్పిన సమాధానం విని అందరూ అతనిని హేళన చేసారు.

అయితే ఇప్పుడు మనం మాటలతో పోటీ పడి లాభం లేదు. 40 ఏళ్ల తర్వాత అందరం ఒక చోట కలుద్దాం. అప్పుడు ఎవరు అందరికంటే గొప్ప వాళ్ళు అవుతారో వాళ్ళని అందరం కలసి సన్మానం చేద్దాం అన్న ధనవంతుని కుమారుని తీర్మానానికి అందరూ ఆమోదం తెల్పి ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు.

తర్వాత కొందరు ఉన్నత చదువుల బాట పట్టి ఊరు విడిచి పట్టణాలకి వెళ్ళిపోయారు. కొందరు పక్క గ్రామాల్లోనే ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగాల బాట పట్టారు. కాలం "ఝరీ వేగతుల్యం" అన్నారు. నలభై ఏళ్ళు గడిచాయి. అనుకున్నట్టుగానే ధనవంతుని కుమారుడు ఒకరోజు అందరి వివరాలు కష్టపడి సేకరించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ, దేశ విదేశాలలో ఎక్కడెక్కడో ఉన్న బాల్య మిత్రులందరకీ అక్కడికి హాజరవ్వాలని ఆహ్వానాలు పంపాడు. అందరి లాగానే రైతు కుమారుడికి కూడా ఆహ్వానం అందింది.

అనుకున్నట్టుగానే అందరూ ఆ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్నందువలన ఒకరికొకరు ఆళింగనం చేసుకుని కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. భోజనం అయ్యాక సభ ప్రారంభం అయ్యింది. ఆ గొప్ప వ్యక్తి నేనే అంటే నేనే అనుకుంటూ వేదిక మీదకి వెళ్లి ప్రతి ఒక్కరూ వాళ్ళు సాధించిన విజయాలు, సంపాదించిన ఆస్తులు, హోదాలు గర్వంగా చెప్పుకోవడం ప్రారంభించారు. చివరిగా రైతు కుమారుని వంతు వచ్చింది. సభకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి అతన్ని వేదిక మీదకి ఆహ్వానించారు. కానీ ఆ రైతు కుమారుడు "ఇంత గొప్ప వాళ్ళ మధ్య నేను ఏమి మాట్లాడతాను, నేను సాధించినది ఏదీ లేదుగా" అనుకుంటూ, సంకోచిస్తూ వేదిక మీదకి వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు. అంతలో అతని గురించి తెలిసిన మరో ముగ్గురు స్నేహితులు తను అంతగా చెప్పుకోవడానికి ఏమీలేదు, అతన్ని ఇబ్బంది పెట్టొద్దు, అందరూ అయిపోయారు ఇక సన్మానం ఎవరికి చెయ్యాలో నిర్ణయించండి అని అన్నారు.

ఇక వ్యాఖ్యాత మాట్లాడుతూ "అందరి అభిప్రాయాలను సేకరించిన తరువాత ఏకగ్రీవంగా ఎన్నుకోదగిన ఆ గొప్ప వ్యక్తి ఎవరో అని నేను చెప్పనవసరంలేదు. దేశ విదేశాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి, ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో ఒకడిగా నిలిచి, తన వ్యాపార సామ్రాజ్యానికి తిరుగులేని నాయకుడిగా ఎదిగిన వ్యాపార దిగ్గజం మన స్నేహితుడు అని చెప్పుకోవడానికి మనందరం గర్వించదగ్గ విషయం" అని వ్యాఖ్యాత ధనవంతుని కుమారుని కోసం చెప్తూ ఉండగా వేదిక అంతా హర్ష ధ్వానాలతో మారుమ్రోగిపోయింది. అప్పుడు వ్యాఖ్యాత అతన్ని వేదిక మీదకి వచ్చి మాట్లాడాలని కోరగా ధనవంతుని కుమారుడు వేదిక మీదకి వచ్చి ఇలా మాట్లాడటం ప్రారంభించాడు.

“మై డియర్ ప్రెండ్స్.. ఈరోజు కోసం మనం ఒకరికొకరం పోటీ పడుతూ జీవితంలోఎన్నోసమస్యలను దాటుకుంటూ రాత్రి పగలు నిద్రాహారాలు సైతం త్యాగం చేసి సమాజం గర్వించ తగ్గ స్థానంలో మనందరం ఉన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. మీరందరూ నాకీ స్థానం కల్పించి గౌరవాన్ని ఇస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక గంట క్రితం నాకు తెలిసింది. ఈ నలభై సంవత్సరాల కాలంలో నేను గెలుపు అనే ఓటమితో నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాను. నిజానికి ఈ సన్మానానికి నేను అర్హుడను కాను. ఈ సన్మానాన్ని స్వీకరించాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు. ఆయన ఎవరో ఇప్పుడు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను” అనేసరికి అందరిలో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. ఒక గంట ముందు జరిగిన సంభాషణని ఇలా గుర్తు చేసుకున్నాడు.

పూర్వ విద్యార్ధులంతా మాట్లాడుకుంటూ ఆ ప్రాంగణం మొత్తం హడావిడగా ఉంది. అందరూ డిన్నర్‌కు సిద్ధం అవుతున్నారు. అందులో ఒక వ్యక్తి తన బాల్య ఆప్త మిత్రుడ్ని చూసి అతని వేషధారణ బట్టి అతను సాదా సీదా జీవనాన్ని గడుపుతున్నాడని భావించి గర్వంతో కూడుకున్న దయతో అతన్ని పరామర్శించి వేరుగా ఉన్న ఒక టేబుల్ వద్ద కూర్చున్నారు. అందులో ఒక వ్యక్తి ధనవంతుని కుమారుడు. ఇంకో వ్యక్తి రైతు కుమారుడు. వాళ్ళ మధ్య సంభాషణ ఇలా జరిగింది.

మొదటి వ్యక్తి : నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది మరియు చాలా బాధ గానూ ఉంది.
రెండవ వ్యక్తి : బాధ ఎందుకు?
మొదటి వ్యక్తి : నా ఆప్త మిత్రుడువు అయిన నిన్ను కలుసుకున్నందుకు ఎంతో సంతోషమునూ, నిన్ను ఇలాంటి స్థితిలో చూస్తున్నందుకు మరింత భాధగానూ.
రెండవ వ్యక్తి : నాపై నీకు ఉన్న అభిమానానికి కృతజ్ఞుడను. కానీ నేను ఇప్పుడు చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నాను . నేను ఈ జీవితం పట్ల ఎంతో సంతృప్తితో ఉన్నాను.
మొదటి వ్యక్తి : కానీ అది ఎలా సాధ్యం. నవ్వు నా దగ్గర చెప్పుకోవడానికి సంకోచిస్తున్నావు.
రెండవ వ్యక్తి : సాధ్యమే. (చిరునవ్వు నవ్వి) ఇప్పుడు చెప్పడానికి కూడా నీరసించి ఉన్నాను. బాగా ఆకలేస్తుంది.
మొదటి వ్యక్తి : ఓహ్, క్షమించు మర్చిపోయాను. ( పక్కకి తిరిగి రెండు చప్పట్లు చరిచాడు)
(క్షణాల్లో టేబుల్ రకరకాల వంటకాలతో నిండిపోయింది).


రెండవ వ్యక్తి : (హాయిగా అన్నీ తినడం ప్రారంభించాడు). చాలా బాగున్నాయి. వంటలు చాలా అద్భుతంగా చేసారు. ఈ స్వీట్ చాలా బాగుంది కాస్త రుచి చూడు.
మొదటి వ్యక్తి : క్షమించరా నాకు షుగర్ ఉంది. తినలేను.
రెండవ వ్యక్తి : అవునా, పోనీ ఈ స్నాక్స్ అయినా తిను.
మొదటి వ్యక్తి : సారీ రా, నాకు బీపీ కూడా ఉంది, తినలేను.
రెండవ వ్యక్తి : పోనీ నువ్వు తినేది ఏదైనా కాస్త తిను.
మొదటి వ్యక్తి : సారీ రా . నాకు అజీర్తి వ్యాధి కూడా ఉంది. రోజూ ఒక్క పూట మాత్రమే తింటాను.
రెండవ వ్యక్తి : అంటే నాకు తోడుగా ఏమీ తినలేవా.
మొదటి వ్యక్తి : (నవ్వుతూ) ఎందుకు తినలేను, చాలా టాబ్లెట్స్ తినాలి.
రెండవ వ్యక్తి: నిన్ను చూస్తే నాక్కూడా సంతోషంగానూ, బాధగానూ ఉంది.
మొదటి వ్యక్తి: (తన ధన గర్వానికి సిగ్గుపడుతూ) నువ్వు టాబ్లెట్స్ ఏమీ వేసుకోవా ?
రెండవ వ్యక్తి : (నవ్వుతూ) నాకు డబ్బులు (జబ్బులు) లేవుగా ....

(ప్రస్తుతం) ధనవంతుని కుమారుడు ఒక్కసారిగా ఆలోచన నుండి బయటకి వచ్చాడు. అందరూ అతని చెప్పే సమాధానం కోసం ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు..


"ఆ వ్యక్తి ఎవరో కాదు నలభై ఏళ్ల క్రితం మనందరం మన భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏమవుతావురా అని అడిగితే మన ఊరిలోనే యోగా వ్యాయామ శాల ఏర్పాటు చేసుకుని మా అమ్మా నాన్నలతో ఉంటూ మన ఊరికి సేవలు చేస్తాను అని చెప్తే మనందరం అతన్ని చూసి నవ్వుకున్నాం కానీ ఈరోజు అతను మనందరికంటే ధనవంతుడు. ఎంత డబ్బు పెట్టినా కొనలేనిది ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని ఎవరు సంపాదించుకుంటారో వాడే కోటీశ్వరుడు".

"నేను కోట్లు సంపాదించాను కానీ అంతకంటే విలువైన ఆరోగ్య సంపాదనలో ఓడిపోయాను. ఆరోగ్యానికి మించిన సంపద లేదు. ఎదిగిన వాడు అంటే తన నీడలో పది మందికీ ఆశ్రయం కల్పించేవాడు, పదిమందికి పంచే ఆస్తిని సంపాదించేవాడు. మనకి ఆస్తి ఉన్నా పంచలేము. వాడికి ఉన్న ఆస్తి ఆరోగ్య విద్య, తన చుట్టూ ఉన్న వాళ్లకి ఎంత పంచినా తరగని ఆస్తి కలిగి ఉన్నవాడే ధనవంతుడు. మన సంపద పంచితే తరిగేది, వాడి సంపద పంచితే పెరిగేది. దానంలో కెల్లా గొప్పది విద్యా దానం. విద్యల్లో కెల్లా గొప్పది ఆరోగ్య విద్య. వాడు ఆరోగ్య దాత. మన సంపద ఇప్పుడు మనకి సంతృప్తిగా ఒక ముద్ద కూడా పెట్టలేకపోతుంది. వాడి సంపద ఉన్నదాంట్లో సంతృప్తిగా తినిపిస్తోంది. విద్యను పంచితే మనలాంటి వాళ్ళని తయారు చేయగలం, ఆరోగ్య విద్యను పంచితే ఒక సంపూర్ణత కలిగిన సమాజాన్ని చూడగలం". అంటూ అందరూ సంతోషంతో ఆ సన్మానాన్ని రైతు కుమారుడుకి చేసి సభ ముగించారు......
Source:- WhatsApp
సేకరణ:- స్వదేశీ నాచురల్ ప్రోడక్ట్స్
9030036524
గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు మరియు రసాయన రహిత సబ్బులు షాంపూ
స్వచ్చమైన ఆవు నెయ్యి, సైంధవ లవణం

జీవిత సత్యం

ఈరోజు జీవిత సత్యం. మంచి చేయడమే మన స్వభావం కావాలి. అంతే కానీ పదిమంది మంచిగా అనుకోవాలి అని కోరుకుంటే చివరకు నిరాశే మిగులుతుంది...!!

🦕ఎవరూ రాలేదు, ఎందుకు రాలేదు.అన్నది కాదు.. నువ్వు చేసేది మంచిదేనా కాదా అన్నదే important .!!

🦕అందరూ సహకరిస్తే మంచి పనులు చేస్తాను.. అని అమాయకంగా అనుకోరాదు..మంచి పనులు చేస్తూ ఉంటే అందరూ సహకరిస్తారు....!!

🦕ఇతరులతో పోరాడే వాడు అల్పుడు. తనతో తాను పోరాడే వాడు అధికుడు అవుతాడు...!!

🦕ఏదైనా మొదలు పెట్టాలంటే గొప్పోడివి అయి ఉండాల్సిన అవసరం లేదు. మొదలు పెట్టగానే గొప్పోడివి అవుతావు...!!

🦕ఇతరులను జయించాలి అనుకోవడం ఒక రోగం .తనను తాను జయించాలనుకోవడం ఒక యోగం...!!

🦕 పెద్ద పనులు చేయడం ఆ తర్వాత. ముందు చేతిలో ఉన్న చిన్న చిన్న పనులు గొప్పగా చెయ్యండి...!!

🦕పట్టుదల లేకపోతే గొప్ప విషయాల గురించి చర్చించడం మహా గొప్ప కాలక్షేపం అవుతూ ఉంటుంది.గమనించి చూడండి...!!👌🏽👌🏽V

Tuesday, May 26, 2020

అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి? అని యక్షప్రశ్నలలో యక్షుడు యుధిష్టరుడిని అడుగుతాడు.

” అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి? “

అని యక్షప్రశ్నలలో యక్షుడు యుధిష్టరుడిని అడుగుతాడు.

👉చుట్టుపక్కల అందరి మరణాలను చూస్తూనే ఉన్నా …
‘ నేను మాత్రం చావను ’ అనుకుంటాడు మనిషి.
అదే అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం. ” అని జవాబిస్తాడు ధర్మరాజు.

మనం రోజూ చూస్తూనే ఉంటాం గర్భస్థ శిశువుగా, రోజుల పసిగ్రుడ్డుగా
పసిప్రాయంలోనే ” అకాల మృత్యువాత ” పడి మరణించే వారిని.
అలాగే యవ్వనంలో, ప్రౌఢ ప్రాయంలో ఉన్నవారి దగ్గరనుండి
వృద్ధాప్యంలో ఉన్న వారి వరకూ వివిధ వయస్సుల్లో ఉన్నవాళ్ళు
రోజుకు కోకొల్లలుగా చనిపోతూనే ఉంటారు.
ఇన్ని చూస్తూనే ఉన్నా. ” మన దగ్గరకు మాత్రం మృత్యువు రాదు ” అన్న
భ్రమలో ఉంటూంటాం మనం.

చనిపోయిన తన కొడుకు శవం తీసుకువచ్చి బుద్ధుని ముందు ఉంచి,
ప్రాణం పోయమని ప్రాధేయపడుతుంది ఒకానొక తల్లి.
” చావు అన్నదే లేని ఇంటినుంచి కొన్ని ఆవగింజలు తెస్తే,
వాటితో ఆ బిడ్డను బ్రతికిస్తాను ” అంటాడు బుద్ధుడు.
” ఇంతేనా, వెంటనే తెస్తా ” అని బయలుదేరుతుంది పాపం ఆ తల్లి …
తిరిగి తిరిగి అసలు సత్యం తెలుసుకుంటుంది.

పుట్టినవారు చావక తప్పదు ; చనిపోయిన వారు తిరిగి జన్మించక తప్పదు.
వచ్చేవారు పోక తప్పదు ; పోయేవారు రాక తప్పదు.

చక్రం తిరిగినప్పుడు క్రిందనున్నది మీదకి వస్తుంది.
మీదనున్నది క్రిందకి వస్తుంది.
భూలోకంలోని వారు స్వర్గలోకం లోకి వెళ్తారు.
స్వర్గలోకంలోని వారు భూలోకానికి వస్తారు.

ఈ చక్రభ్రమణానికి ఏడవడం ఎందుకు?
ఇది మనకోసం మనం ఏర్పరచుకున్న చక్రభ్రమణం.
చిన్నప్పుడు మనం పాఠాశాలలకు వెళ్ళి తరగతి తరువాత తరగతి పూర్తిచేశాం కదా.

అలాగే ఈ భూలోకం కూడా ఆత్మజ్ఞానార్థం ఏర్పడిన అద్భుత పాఠాశాల.
ఇక్కడికి వస్తాం. కొన్నాళ్ళుంటాం, కొంత నేర్చుకుంటాం, వెళ్ళిపోతాం.

క్రొత్తక్రొత్త పాఠాలు నేర్చుకోడానికి అనువుగా ఉండే
వేరు వేరు ప్రదేశాల్లో, వేరు వేరు లోకాల్లో మళ్ళీ మళ్ళీ పుడతాం.
ఇలా వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం;

కాబట్టి ఇదేమీ తప్పించుకోవలసిన విషయం కానే కాదు.
జన్మపరంపరలో పుట్టుకకు సంతోషం …
మరణానికి శోకం వెలిబుచ్చడం అంటే …

” మనం సత్యాన్ని తెలుసుకోలేదు ” అని అర్థం.
” ఇంకా అజ్ఞానం పోలేదు ” అని అర్థం.
ఏ క్షణంలోనైనా చావు రావచ్చు …
కనుక ప్రతిక్షణంలోనూ పూర్తిగా జీవించాలి.

ప్రతిక్షణంలోనూ పూర్తిగా జీవించేవాడే బ్రహ్మజ్ఞాని …
ఒకానొక పండితుడు,
మన రాకలు, మన పోకలు మన చేతుల్లోనే వున్నాయి.
వాటికి మనమే సృష్టికర్తలం.

” అమ్మ పుట్టించింది కాబట్టి నా రాక అమ్మ చేతుల్లో ఉంది” …
” నా పోక పైవాడి చేతుల్లో ఉంది ” అనేవి స్థూలదృష్టిలోనే సత్యాలు.
కానీ సూక్ష్మదృష్టిలో, దివ్యదృష్టిలో అవి అసత్యాలు. 🤔


ప్రేమ ఎప్పుడూ అద్భుతమే!

💖💖 ప్రేమ ఎప్పుడూ అద్భుతమే!💖💖

💓 అంత అద్భుతమైన భావాన్ని మాటల్లో చెప్పాలంటే కష్టం. ధ్యానం లో ఉన్నప్పుడు మాత్రమే ప్రేమ ను అనుభవించడం జరుగుతుంది.

అవును నిజం. మీరనుకుంటున్న ప్రేమ అసలు ప్రేమే కాదు.ఒకరిని ప్రేమించడం అత్యంత కష్టతరమైనది. ఎందుకంటే ప్రేమించాలి అంటే నేను అనేది చావాలి.

ఓషో అంటారు, ప్రేమించడం అనేది బలవన్మరణం లాంటిది అని. అవును ఒకరిని ప్రేమించడం అంటే పూర్తిగా అహంకారాన్ని వదులుకోవడం అని. ఒకరిని ప్రేమిస్తున్నాను అంటే విశ్వంలో ప్రతీ విషయాన్ని, వ్యక్తిని, ప్రేమించినప్పుడు మాత్రమే అది నిజం. మరి విశ్వం లో ప్రతి దాన్ని పూర్తి ప్రేమతో చూడటం కేవలం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. అదే పూర్తి ప్రేమ, మిగతాది అంతా అహంకారమే.

expectations ఉండటం, ఇలా ఉంటేనే ప్రేమిస్తాను, నేను ప్రేమిస్తున్న కాబట్టి నువ్వు ఇలాగే ఉండాలి, నిన్ను ప్రేమిస్తున్నా అంటూ ఒకరితో చెప్తూ, ఇంకొకల్లని ద్వేషిస్తూ ఉండటం ప్రేమ కానేకాదు, అది అహంకారం మాత్రమే.

అహంకారం ఎప్పుడైతే ఉండదో అక్కడ ప్రేమ, శాంతి నెలకొంటుంది.సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. నేను, నా ప్రపంచం హాయి హాయిగా, ఆనందంగా ఉంటుంది.

దానికి ఏకైక మార్గం ధ్యానం. ధ్యానం వలన ఆలోచనా విధానం మారుతుంది, దృక్పథం మారుతుంది, మాట మారుతుంది, అహంకారం తొలగిపోతుంది, ప్రేమ పుడుతుంది, అన్నింటి మీద, అందరి మీద, ఎటువంటి అంచనాలు లేకుండా, ఎటువంటి నియమాలు లేకుండా ప్రేమ పెరుగుతుంది, అదే విశ్వ శాంతికి మూలం అవుతుంది.

ఇంత జ్ఞానాన్ని సంపాదించేందుకు కారణమైనది, నన్ను నన్నుగా ప్రేమించే నేను నిన్ను నీలా, నాలా ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి గర్వపడుతున్నాను.

ప్రేమించే ప్రతివారు తెలుసుకోవలసిన విషయం ఇది, కృతజ్ఞతలు!!🙏

Monday, May 25, 2020

క్రైస్తవ మతోన్మాదం...

క్రైస్తవ మతోన్మాదం...

గోవా ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది, అందమైన సముద్ర తీరాలు, విహార యాత్రలు, హనీమూన్ లు !!!

కానీ ఆ అందమైన సముద్రాల వెనుక
మనకి తెలియని,
మనకి చెప్పని
ఒక భయంకరమైన చరిత్ర ఉంది,

మరణ భయంతో వేలాది మంది యొక్క చావు కేకలు, తమ ధర్మం కోసం చివరిదాకా నిలబడి మరణ శిక్షలు విధించబడి శవాలుగా మారిన వేలాది ప్రాణాలు, వేల మంది జైళ్లలో చీకటిలో మగ్గిన జీవితాలు ఉన్నాయి ! ఆ వేలాది మంది ఎవరో కాదు, గోవాలో స్థానిక హిందువులు !



గోవాలో వేలాది హిందువుల జీవితాలు నాశనం కావటానికి కారణం — ఒక మతం, అదే క్రైస్తవమతం !



భారతదేశానికి వ్యాపారం పేరుతో వచ్చిన వచ్చిన క్రైస్తవులు (పోర్చుగీసు, dutch, బ్రిటిష్ etc).

వీళ్లంతా వ్యాపారం పేరుతో వచ్చి ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకొని స్థానిక రాజుల మధ్య గొడవలు పెట్టి అధికారం చేజిక్కించుకునే భారతదేశాన్ని ఆక్రమించారు.



అలా పోర్చుగీసు వాళ్లు గోవాని ఆక్రమించుకున్నాక అక్కడి గోవా ప్రజల్ని తమ క్రైస్తవ మతంలోకి మార్చాలని పొర్చీగీసు వాళ్ళు ఒక్క కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు దాని పేరు గోవా ఇంక్విజిషన్..!



1542 లో ఫ్రాన్సిస్ జేవియర్ అనే పాస్టర్ ఈ గోవా ఇంక్విజిషన్ అనే చట్టం రావడానికి ముఖ్య కారకుడు. ఈ ఫ్రాన్సిస్ జేవియర్ పోర్చుగీసు రాజు అయిన జాన్ – 3 ఇలా అడిగాడు….



గోవాలో ఉన్న కొంతమంది క్రైస్తవులు సరిగ్గా క్రైస్తవ మత ఆచారాలు పాటించడంలేదని

వారిని దారిలో పెట్టాలంటే,
గోవాలో క్రైస్తవ మత నిలబడాలంటే,
కఠినమైన చట్టం కావాలని
అందుకు గోవా ఇంక్విజిషన్ తప్పనిసరి అని,
దాన్ని గోవాలో అమలుచేయాలని ఆ రాజును కోరాడు..!

ఆ తర్వాత ఫ్రాన్సిస్ జీవియర్ చనిపోయిన
8 సంవత్సరాల తర్వాత గోవాలో
ఆ భయంకరమైన చట్టం అమలులోకి వచ్చింది..!

ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం,

గోవాలో ఉన్న హిందువుల్ని భయపెట్టి, ప్రలోభ పెట్టి, హింసించి వాళ్లందరిని క్రైస్తవ మతంలోకి మార్చాలి !

1560 – 1820 వరకు గోవాలో గోవా ఇంకవిజిషన్ అమలు అయ్యింది. అంటే దాదాపు 300 సంవత్సరాలు అని మాట !
గోవా ఇంకివిజిషన్ లోని ముఖ్యమైన విషయాలు ఇవి !

గోవాలో సంస్కృతం, మరాఠి, కొంకణి భాషలో ఉన్న సాహిత్యాన్ని, హిందూ మత గ్రంధాలని అగ్గిలో వేసి తగలబెట్టడం!

హిందువులను అతి కిరాతకంగా హింసించారు.. కత్తికో కండ అంటారే అలాగ ....మెడలో నూనె తడిపిన గుడ్డలు వేసి కాళ్ళూ .. చేతులు కట్టేసి సజీవంగా తగులబెట్టేవారు.... ...

స్థానిక భారతీయ భాషలను మాట్లాడితే నాలుకలు సైతం కోసిపారేశారు.. పోర్చుగీస్ భాష కంపల్సరీ చేశారు..
హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహాలు చేసుకోవడం కూడా నిషేదం...

హిందువుల కుటుంబాల్లో బిడ్డ యొక్క తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ఒకళ్ళు చనిపోతే చాలు, ఆ పిల్లల్ని చర్చి, పాస్టర్ వాళ్ళు తీసుకొని వాళ్లని క్రైస్తవ మతంలోకి మారుస్తారు. కొన్నిసార్లు వాళ్ళ కుటుంబ ఆస్తిని కూడా చర్చ్ వాళ్ళు జప్తు చేసుకునేవారు.!

గ్రామంలో ఉండే అధికారులు అందరూ క్రైస్తవులే ఉండాలి, హిందువులు గ్రామ అధికారులుగా ఉండడానికి అనర్హులు!

గ్రామ సభలలో నిర్ణయాలు తీసుకునే అధికారం హిందువులకు లేదు! నిర్ణయాలు తీసుకునే అధికారం కేవలం క్రైస్తవులకు, క్రైస్తవ మతంలో వారికి మాత్రమే ఉండేది !

కోర్టులో హిందువులు చెప్పే సాక్ష్యం చెల్లదు, క్రైస్తవులకు మాత్రమే సాక్ష్యం చెప్పే అధికారం ఉంది, వాళ్ళు చెప్పిన సాక్ష్యము చెల్లుతుంది!

ఎక్కడైనా సరే హిందువుల గుడి, మందిరాలు ఉంటే వాటిని వెంటనే కూల్చేయాలి! గుడిని కూల్చి వాటి స్థానంలో చర్చిలు కట్టుకునేవారు

హిందువులు హిందు దేవతా విగ్రహాలను కలిగి ఉండడం పెద్ద నేరం! హిందువులు ఇంట్లో విగ్రహాలు పెట్టుకుంటే వాళ్ల ఆస్తి, డబ్బు అంతా చర్చి వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతారు. హిందువులు వారి పండగలు, శుభకార్యాలు జరుపుకోకూడదు !

గోవా ప్రజలు అందరూ వాళ్ళ మాతృభాష అయిన కొంకణి మాట్లాకూడదు, అందరూ ఖచ్చితంగా పొర్చిగీసు భాష మాత్రమే మాట్లాడాలి !

ఫ్రాన్సిస్ జీవియర్ హిందువుల్ని ఉద్దేశించి ఇలా అన్నాడు “హిందువులు జాతి అపవిత్రమైన జాతి. వారు నల్లగా ఉంటారు, అసహ్యంగా ఉంటారు. హిందువులు పూజించే విగ్రహాలు దెయ్యాలు. వాటినుండి నూనెతో కూడిన అసహ్యమైన వాసన వస్తుంది”.

పోర్చుగీసువారు చెప్పినట్టు క్రైస్తవ మతంలోకి మారకపోతే హిందువుల్ని రకరకాల చిత్రహింసలు పెట్టేవారు. వాటిలో ముఖ్యంగా

హిందువుల్ని బతికి ఉండగానే మంటల్లో వేసి కాల్చేయడం. బతికుండగానే చర్మము వలిచేయటం. మర్మాంగాలలోకి పదునైన వస్తవులతో గాయాలు చేయటం. ఈటెలతో గుచ్చి చిత్రవధ చేయడం, హిందువుల్ని తాళ్లతో కట్టి వారి నాలుక కోసేయటం. కళ్ళలో కాల్చిన ఇనుప చువ్వలు పెట్టి కంటిచూపు పోగొట్టడం. మతం మారని హిందువుల యొక్క పసిపిల్లల కాళ్లు చేతులు విరిచేయడం.

హిందువులు ఇంట్లో దేవుని విగ్రహాలు కలిగి ఉంటే కలిగి ఉంటే హిందువులకి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష !

హిందువుల ఇంట్లో తులసి మొక్క కలిగి ఉండటం నేరం. జంధ్యం వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం లాంటివి కూడా నేరం వాటిక్కూడా జైలు శిక్షలు ఉన్నాయి !

విసరి ఆంటీనియో డి నోరహ అనే పాస్టర్ గోవా ఇంక్విజిషన్ లో భాగంగా ఓ కొత్త చట్టం చేశాడు. ఆ చట్టం ప్రకారం హిందువుల దేవాలయాలను మూసివేయాలి. కొత్త దేవాలయాలు కట్టకూడదు. పాత దేవాలయాలకి మరమ్మతులు చేయకూడదు.

అలాగే హిందు దేవాలయాల్లో వుండే బంగారం మరియు డబ్బు చర్చ్ ఆధీనంలోకి రావాలి !

1620 లో అదే పాస్టర్, హిందువులు పెళ్లి చేసుకోవడం నేరం, వాళ్లు క్రైస్తవం స్వీకరిస్తే పెళ్లి చేసుకోవాలి లేదంటే వాళ్లు జీవితాంతం ఒంటరిగా మిగిలి పోవాలి అనే చట్టం చేశాడు. దానివల్ల మతం మారని హిందువులు పిల్లలు లేక అంతరించిపోతారు అని అతడి ప్లాన్.

ఈ గోవా ఇంక్విజిషన్ చట్టంలో పైన చెప్పబడిన ఘోరాలు దాదాపు 300 సంవత్సరాల పాటు హిందువుల మీద జరిగాయి.

ఈ క్రూరమైన చట్టము వల్ల వేలాదిమంది హిందువులు బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చి వేయబడ్డారు.

వేలాదిమంది హిందువులు సజీవదహనానికి, మరణశిక్షకు గురయ్యారు.

మరికొంతమంది తమ ఇల్లు ఆస్తి కోల్పోయారు. వేలాది హిందూ మందిరాలు గుడిలు కూల్చబడ్డాయి !

మరికొంతమంది హిందువులు ఈ క్రైస్తవ మతోన్మాదులు పెడుతున్న ఈ హింస తట్టుకోలేక గోవా వదిలిపెట్టి, గర్భగుడిలోని దేవుని విగ్రహం పట్టుకుని

వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోయేవాళ్లు !

ఇప్పటికి మనం గోవా లో గమనిస్తే ఆ చర్చ్ ల పునాదుల హిందువుల సమాదులు మీద, దేవాలయాలని కూల్చి కట్టిన చర్చ్ లు ఎన్నో కనిపిస్తాయి !

ఔరంగజేబు అమ్మా మొగుళ్ళు ఈ గోవా క్రైస్తవ రాక్షసులు .. ఇంత రాక్షస క్రుత్యాలకు కారణమైన ఫ్రాన్సిస్ జేవియర్ గాన్ని అక్కడ సెయింట్ గా కొలవడమే వింత..

మతం మారిన హిందువు మార బోవు హిందువులు కంచీతంగ గుర్తు చేసుకోవాలి..

ఇప్పటికి గోవా వెళ్లిన కొంతమంది అమాయకులు ఈ భయంకరమైన చరిత్ర తెలియక, ఈ దుర్మార్గానికి కారకుడు అయిన ఫ్రాన్సిస్ జీవియర్ యొక్క సమాధికి, శరీరానికి ప్రార్థన చేస్తున్నారు

గోవధ పై సుప్రీంకోర్టులో జరిగిన వాద ప్రతివాదనలు ప్రతి ఒక్కరు చదవి ఇతరులకు తెలియజేయండి

గోవధ పై సుప్రీంకోర్టులో జరిగిన వాద ప్రతివాదనలు ప్రతి ఒక్కరు చదవి ఇతరులకు తెలియజేయండి

ఈ కేసులో చాలా పేరు ప్రతిష్టలున్న న్యాయవాదులు శ్రీ సోలి సోరాబ్జీ, ఫీజు 20 లక్షలు, శ్రీ కపిల్ సిబాల్ 22 లక్షలు, శ్రీ మహేష్ జీత్మలానీ 35 లక్షల దాకా తీసుకుని వీరంతా గోమాంస వ్యాపారుల తరపున కేసును వాదించారు.

ఇక మన శ్రీ రాజీవ్ భాయికు న్యాయవాదిని పెట్టుకునడానికి తగినంత డబ్బులేదని కోర్టుకు విన్నవించిన తరువాత " కోర్టు మీకు న్యాయ సహాయం ఇస్తే ?" అని అడిగినప్పుడు " అది సంతోషమే కానీ, కేసు మేమే వాదించేందుకు అనుమతించాలని" శ్రీ రాజీవ్ భాయి కోరారు. కోర్టు అలా అనుమతిస్తునే, శ్రీ M E ఎస్కురి అనే న్యాయవాదిని ఈ కేసులో న్యాయ సహాయం కోసం నియమించడంతో కేసు కొనసాగింది.
ఇక గోమాంస వ్యాపారుల వాదనలు చూద్దాం.

1వ వాదన: గోవును రక్షించి ప్రయోజనం ఏమీ లేదు. గోమాంసం ఎగుమతితో మన భారత ఆర్ధిక వ్యవస్ఠ బలపడుతుంది.

2వ వాదన: గోవులకు తగినంత గ్రాసం ఈ దేశంలో లేక ఆకలితో చచ్చేకన్నా వాటిని చంపటం మంచిది.

3వ వాదన: మనదేశంలో మనుష్యులకే చోటులేదు. పశువులను ఎలా వసతి ఇస్తాం.

4వ వాదన: మనకు అత్యంత విదేశీ మారక ద్రవ్యం మాంసాహార ఎగుమతల వలన వస్తుంది.

5వ వాదన: మాంసాహారం తినడం మతపరమైన హక్కు.

ముస్లీం మతంలోని "ఎక్కువ గో హింసకు పాల్పడే ఖురేషీ" అనే వర్గంవారు ఈ వ్యర్ధ వాదనలు చేసారు.

ఈ వ్యర్ధ వాదనలన్నిటికీ శ్రీ రాజీవ్ భాయి అత్యంత సహనంతో, అన్ని గణాంకాలను కోర్టు వారి ముందుంచారు.

శ్రీ రాజీవ్ భాయి సమాధానాలు చూద్దాం.

ఒక ఆరోగ్యంగా ఉన్న గోవు 3 నుండి 3.5 క్వింటాళ్ల బరువుంటుంది. దానిని చంపితే షుమారు 70 కిలోల మాంసం వస్తుంది. కిలోకి 50 రూపాయల చొప్పున మాంసం ఎగుమతి వలన లభించే డబ్బు రూ. 3,500/-. ఆవు రక్తానికి లభించే రొక్కం రూ.1500/- నుండి రూ.2000 వరకు. ఇక 30-35 కిలోల ఎముకలకు లభించే రొక్కం 1,000 నుండి 1,200/- . ఏతావాతా ఒక గోవును చంపి వీరు దేశానికి కానీ, వారి స్వార్ధానికి గానీ, సంపాదించే మొత్తం డబ్బు రూ.7000/-

ఒక ఆరోగ్యమైన గోవు రోజుకి 10కిలోల గోమయం,( ఆవుపేడ ), 3 లీటర్ల గోమూత్రం ఇస్తుంది. ఒక కిలో గోమయం తో 33 కిలోల ఎరువు తయారవుతుంది. దీనినే మనం సేంద్రీయ ఎరువు అంటాము. శ్రీ రాజీవ్ భాయి ఇలా చెపుతూంటే కోర్టు వారు " ఇది ఎలా సాధ్యం " అని అడిగారు. ఆయన తన వాదనను నిరూపించటానికి ధర్మాసనం ఒప్పుకున్న తరువాత కోర్టువారి ముందు శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో గోమయంతో 33 కిలోల సేంద్రీయ ఎరువును తయారుచేసి కోర్టుకు సమర్పించారు. I R C శాస్త్రవేత్తలు గోమయంతో చేసిన ఎరువును పరీక్షించి అత్యుత్తమ సేంద్రీయ ఎరువుగా ప్రకటించారు. ఈ సేంద్రీయ ఎరువు భూమికి కావల్సిన 18 సూక్ష్మపోషకాలు అందిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఈ సూక్ష్మపోషకాలలో సాగుచేసే క్షేత్రానికి కావలసిన మాంగనీసు, ఫాస్పేట్, పొటాషియం, కాల్షియం, ఐరన్, కొబాల్ట్, సిలికాన్, మొదలైనవన్నీ ఉన్నాయని నిర్ధారించారు. రసాయినిక ఎరువులలో కేవలం 3 ఖనిజాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి గోమయం ద్వారా తయారైన, సేంద్రీయ ఎరువు రసాయన ఎరువులకన్నా 10 రెట్లు గుణవర్ధకమైనది అని శ్రీ రాజీవ్ భాయి తన వాదనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనతో అంగీకరించింది.

శ్రీ రాజీవ్ భాయి కోర్టుకి అభ్యంతరం లేకపోతే, తన ఊరు వచ్చి, గత 15 సంవత్సరాలుగా తాను, తన కుటుంబ సభ్యులు ఒక కిలో గోవుపేడ నుండి, 33 కిలోల సేంద్రీయ ఎరువులు ఎలా చేస్తున్నారొ, చూడమని ఆహ్వానించారు.

తన వాదనలో శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో సేంద్రీయ ఎరువు అంతర్జాతీయ విపణిలో 6 రూపాయలు (ఇది అతి తక్కువ ధర), అనుకుంటే, ఒక రోజుకు గోమాత రూ.1,800/- నుండి రూ.2,000/- దాకా ఆదాయం తెచ్చి పెడుతుంది. (౩౩ కిలోల ఆవు పేడ నుండి 330 కిలోల సేంద్రీయ ఎరువు తయారు అవుతుంది కదా! 330 x Rs.6/-). పైగా ఈ గోవుల కు ఆదివారం శెలవులు కానీ లేవు కదా! ఈ లెక్కన గోమాత వలన ఒక సంవత్సరములో అంటే 365 రోజులలో వచ్చే ఆదాయం 1800 X 365 = Rs.6,57,000/- ఇదంతా గోమయము వలన అంటే "ఆవు పేడ" వలన వచ్చే ఆదాయం.

శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన గణాంకాల ప్రకారం రమారమి 20 సంవత్సరాలు జీవించే గోమాత వలన వచ్చే ఆదాయం దాదాపు 1 కోటి 31 లక్షల 40వేలు రూపాయలు దాటిపోవడం చూచి ఆశ్చర్యం చెందారు.

వేల సంవత్సరాల పూర్వం నుండి గోమయంలో "లక్ష్మి" నివసిస్తుందని మన పూర్వీకులు ఎందుకు భావించారో శ్రీ రాజీవ్ భాయి సశాస్త్రీయంగా సుప్రీంకోర్టులో గణాంకాల ద్వారా నిరూపించారు.

ఇది హేళన చేసిన వారికి చెంపపెట్టు. "మెకాలే" చదువులు వంట బట్టించుకున్న వారు ఎన్నో ఏళ్ళుగా మన "గోమయం లో "లక్ష్మి" నివాసముంటుంది అంటే, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళ సంస్కృతి ఇంతే, వీళ్ళు ఇలాగే మోసపూరిత మాటలు చెబుతారని నవ్విన వారు నోళ్ళు వెళ్ళబెట్టారు.

ఇక "గోమూత్రము" పై శ్రీ రాజీవ్ భాయి గారి వివరణ - "ఒక గోవు రోజుకి 2 లేక 2.25 లీటర్ల గోమూత్రం ఇస్తుంది. ఇది అనేకరకాల వ్యాధులకు, మధుమేహం, క్షయ, కీళ్ళ వాతం, కీళ్ళకు సంబంధించిన అన్ని రోగాలు, ఎముకల మూలుగ కు సంబంధించిన వ్యాధులు మొదలైన 48 రకాలైన రోగాలన్నీ సమూలంగా నిర్మూలించ గలదని ఆ గోమూత్రం ద్వారా తయారు చేసిన ఆయుర్వేద మందులు, తెలుపు తున్నాయి. (చరక మహర్షి తన సంహిత లో గోమూత్రము ఉపయోగాలన్నీ ఎంతో వివరంగా చెప్పారు)".

ఒక లీటరు గోమూత్రం భారతీయ విపణీ లో రూ.500/-లు గా ఉన్నది. అంతర్జాతీయ విపణిలో ఈ రేటు ఇంకా ఎక్కువ ఉన్నది. అమెరికాలో గోమూత్రం "పేటెంటు" కూడా చెయ్యబడింది. గోమూత్రానికి 3 పేటెంట్లు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం గోమూత్రాన్ని భారతదేశము నుండి దిగుమతి చేసుకుని, కాన్సర్ కు, మధుమేహానికి మందులు తయారు చేస్తున్నది.

అమెరికాకు ఎగుమతి చేసే గోమూత్రపు రేటు ప్రస్తుతం (వాదనలు జరిగేటప్పుడు) ఒక లీటరు రూ.1,200/- నుండి రూ.1,300 దాకా ఉన్నది. ఆ లెక్కన గోమూత్రం వలన ఆదాయం రోజుకు రూ.3,000/- , వార్షిక ఆదాయం రూ.3000/- X 365 = రూ.10,95,000/- , ఒక గోవు తన జీవిత కాలమైన 20 సంవత్సరాలలో కేవలం గోమూత్రం మీద ఇచ్చే ఆదాయం 3000X365X20 = 2,19,00,00 (అక్షరాల 2 కోట్ల 19 లక్షల రూపాయలు) గోమూత్రము వలన కోట్ల ఆదాయం.

ఇదే గోమయం "మిథైన్" అనే వాయువు ఉత్పత్తి చేస్తుంది. దీనిని మనం మన వంటగదిలో వంటకి వాడుకోవచ్చును. మన ద్విచక్ర వాహానాలను, మన కార్లు కూడా ఈ వాయువును తో నడుపుకోవచ్చును.

ఈ వాదన ధర్మాసనంలోని ఒక జడ్జీ నమ్మలేక పోయారు. అప్పుడు శ్రీ రాజీవ్ భాయి "మీరు అనుమతిస్తే, మీ కారుకు మితైన్ గాస్ సిలిండర్ అమరుస్తాను. మీ కారు మీరే డ్రైవ్ చేసి మీరే పరీక్షించండి". అని తన వాదన పటిమ చూపించారు. ఆ న్యాయాధీశుడు అనుమతించి, తన కారును 3 నెలలు మిథైన్ వాయువుతో నడిపారు. తన కారుకు కిలో మీటరుకు 50నుండి 60 పైసల కంటే ఎక్కువ ఖర్చు కాకుండా చూచి ఆయన నివ్వెర పోయాడు. అంతకు ముందు ఆయన కిలోమీటరు డీజల్ కు 40 రూపాయలు ఖర్చు చేశారు. పైగా డీజల్ లాగా పొగ లేదు. శబ్ద, వాతావరణ కాలుష్యాలు అసలే లేవు.

ఆ జడ్జీ సంతృప్తి చెందాడు. శ్రీ రాజీవ్ భాయి చెప్పినది వాస్తవమని ఒప్పుకున్నారు.

రోజు వచ్చే 10 కిలోల గోవు పేడతో ఎంత మిథైన్ వాయువు తయారవుతుందో, అది 20 సంవత్సరాలలో ఎంత దేశానికి పొదుపు చేస్తుందో చెప్పి ధర్మాసనంకు తన గణాంకాలు సమర్పించారు.

దేశంలో ఉన్న 17 కోట్ల గోవుల వలన దాదాపు 1 లక్ష 32 వేల కోట్ల ధనం పొదుపు అవుతుంది. మన రవాణా మొత్తం మిథైన్ ఆధారితమైతే, అరబ్ దేశాల నుండి మనము పెట్రోల్ గానీ, డీసెల్ గానీ, దిగుమతి చేసుకోనక్కర లేదు. మన విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టనక్కర్లేదు. మన రూపాయి అంతర్జాతీయంగా బలపడుతుంది. ఇది గోవు వల్లనే సాధ్యం.

ఈ వాదన విని సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్ఘాంతపోయి, శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన గణాంకాలు అన్నీ శ్రద్దగా పరిశీలించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం శ్రీ రాజీవ్ భాయి చెప్పిన వాదనలో "సత్యాన్ని గ్రహించి, " గో సంరక్షణ" వలన దేశానికి ఆర్ధికంగా, భారత దేశానికి ఆర్ధికపుష్టి లభించగలదని అంగీకరించారు.

సుప్రీంకోర్టు శ్రీ రాజీవ్ భాయి వాదనలను అంగీకరించే సరికి, గో హంతకుల తల బొప్పికట్టి, దిక్కుతోచలేదు. కేసు వారి చేతుల్లో నుండి జారిపోతోందని గ్రహించారు. ఎందుకంటే వారు గోవు రూ.7,000/- వేల కంటే ఆదాయం ఇవ్వదని అంతకు ముందే కోర్టుకు చెప్పారు. ఇప్పుడు శ్రీ రాజీవ్ భాయి, గోమాత కోట్ల రూపాయాలు ఆర్జించి పెడుతుంది అని ఋజువు చేశారు.

అప్పుడు గోహంతకులు "గోమాసం తినడం ఇస్లాం మత పరమైన హక్కు" అనే వాదన లేవదీశారు. శ్రీ రాజీవ్ భాయి" అయితే, ఎంతమంది ఇస్లాం పాలకులు ఈ మత పరమైన హక్కును వాడుకున్నారు? ఈ మత పరమైన హక్కు చెప్పే ఇస్లాం గ్రంధాలు ఏమిటీ" అనే ప్రశ్నలు కోర్టు పరిశీలించాలి అని కోరారు.

అప్పుడు సుప్రీంకోర్టు ఈ అంశాలు పరిశీలించడానికి ఒక విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ కి ఈ అంశాలను కూలంకషంగా పరిశీలించాలని ఆదేశించారు". ఇస్లాం పాలకులు, మతగ్రంధాలు గో మాంసం తినడంపై ఏమి చెప్పాయి ? ఆ హక్కనేది ఉన్నదో లేదో తేల్చి చెప్పమని ఈ కమిటీని ఆదేశించారు.

ఈ కమిటీ చారిత్రాత్మక పత్రాలను శోధించి, తేల్చి చెప్పినది.

"ఇస్లాం పాలకులు ఎవరూ గోవధను సమర్ధించలేదు. నిజానికి కొంతమంది పాలకులు గోవధకు వ్యతిరేకంగా చట్టాలు కూడా చేశారు. వారిలో ప్రధముడు "బాబర్" ఆయన తన "బాబర్ నామా"లో గోవధ నేరమని, అలాంటి నేరం తను చనిపోయినా ఈ దేశంలో జరగకూడదు అని వ్రాసి, తను చేసిన చట్టం కొనసాగాలని పేర్కొన్నాడు. ఆయన సంతతి వారంతా, హుమాయున్ అదే చట్టం కొనసాగించారు. చివరకు హిందూ సంప్రదాయాలను క్రూరంగా అణచివేసిన ఔరంగజేబ్ కూడా ఈ గోవధని వ్యతిరేకిస్తూ, తన పూర్వీకులు చేసిన చట్టాన్ని కొనసాగించాడు.

ఇక్కడ దక్షిణాపధంలో టిప్పుసుల్తాన్ తండ్రి, హైదర్ ఆలీ గోమాతను వధ చేసేవాడు కనపడితే "వాడి తలకాయ నరకమన్నాడు". చాలామంది ఈ శిక్షలో బలయ్యారు. టిప్పు సుల్తాన్ రాజు కాగానే, ఈ చట్టాన్ని కాస్త మార్చి, గోవధకు పాల్పడిన వారి" చేతులు నరకమన్నాడు".

సుప్రీకోర్టు నియమించిన కమిటీ ఇలా తన రిపోర్ట్ సమర్పించగానే, శ్రీ రాజీవ్ భాయి, వాదనకు మరింత పుష్టి వచ్చింది.

"గోవధ ఇస్లాం మత హక్కు అయితే, ఇస్లాం శిరసాదాల్చి పాలించిన చక్రవర్తులు బాబర్, హుమాయున్, చివరకు ఔరంగజేబ్ గోవధ కు వ్యతిరేకంగా చట్టాలను చేసి, ఎలా కొనసాగించారు" అని సూటిగా ప్రశ్నించారు.

తరువాత శ్రీ రాజీవ్ భాయి తన అత్యంత కీలక వాదన మొదలు పెట్టారు. సుప్రీకోర్టు అనుమతితో పవిత్ర ఖురాన్, హదీద్, మిగతా ఇస్లాం పవిత్ర గ్రంధాలు గోవధ గురించి ఏమి చెప్పాయో పరిశీలించమని కోరారు. ఏ ఇస్లాం గ్రంధము కూడా గోవధ ను సమర్ధించలేదు. సరికదా, హదీద్ లు, "గోవును రక్షించమని, అవి మిమ్మల్ని రక్షిస్తాయి" అని పేర్కొన్నాయి. మహమ్మద్ ప్రవక్త గోవు అమాయక ప్రాణి అని , పత్రివారు దానిపట్ల దయగలిగి ఉండాలని ప్రభోదించారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనములో " గోవును వధించిన వాడికి నరకంలో కూడా స్థానం లేదు " అని చెప్పారు.

తన వాదనను ముగిస్తూ, శ్రీ రాజీవ్ భాయి, పవిత్ర ఖురాన్, మహమ్మద్ ప్రవక్త, హదీద్ లు, గోవధను వ్యతిరేకిస్తుంటే, గోవధ ఇస్లాం మతహక్కు ఎలా అవుతుంది. ఈ మాంసాహారులను, మక్కా, మదీనాలలో ఏదైనా పుస్తకంలో గోవధ చెయ్యమని ఉన్నదేమో చూడమని చెప్పండి. అలా ఉన్నదని నాకు తెలియదు. ముస్లిం మత పెద్దలకు తెలియదు." అని ముగించారు.

గోహంతకులు మాన్పడిపోయారు. సుప్రీకోర్టు మాంసాహారులను, పదే పదే అడిగింది. వారు ఇస్లాంలో గోవధ చెయ్యమని చూపెట్టలేక పోయారు.

సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం ఈ అత్యంత కీలకమైన కేసులో 26 అక్టోబర్ 2005 న తన తీర్పును ప్రకటించింది.

ఈ తీర్పును మీరు సుప్రీకోర్టు వెబ్సైటు లో చూడవచ్చును.

తన 66 పేజీల తీర్పుతో సుప్రీంకోర్టు ఒక చరిత్ర సృష్టించింది తన తీర్పులో ఇలా పేర్కొంది.

"గోవధ రాజ్యాంగ రీత్యా, మతపరంగా కూడా పాపం. ప్రతి పౌరుడు, ప్రభుత్వము, గోవును రక్షించడం రాజ్యాంగ ధర్మముగా భావించాలి.

మనం మన రాజ్యాంగంలో, "రాజ్యాంగ ప్రకారం నడచుకుంటామని, మన జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని, మన స్వాతంత్ర్య సమరయోధులను గౌరవిస్తామని, మన సారభౌమత్వాన్ని రక్షించుకుంటూ, మన ఐకమత్యాన్ని పాటిస్తూ, ఈ దేశ సమగ్రతను పటిష్టంగా చెయ్యాలని రాజ్యాంగం వ్రాసుకున్నాం. ఇప్పుడు దానిలో గోసంరక్షణ కూడా చేరింది."

సుప్రీంకోర్టు తన తీర్పులో " 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నీ గో సంరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికి ప్రతి ముఖ్యమంత్రి, గవర్నర్, ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాలి" అని స్పష్టంగా పేర్కొన్నది.

శ్రీ మంగళ్ పాండే గోసంరక్షణ కోసం గోవు కొవ్వుతో తయారు చేసిన తుపాకీగుండును నోటిలో పెట్టుకోవడం సహించక, ఒక బ్రిటీషు ఆఫీసర్ ను కాల్చి చంపాడు. ఈ ఘటన మన ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామానికి దారి తీసి, గో సంరక్షణ ప్రారంభమైంది. శ్రీ మంగళ్ పాండే చేసిన త్యాగాలను మరిస్తే, మనం కృతఘ్నులుగా మిగిలిపోతాం.

గో సంరక్షణ ప్రతి భారతీయుని కర్తవ్యం. అది రాజ్యాంగబద్దమైనది. ఎక్కడైనా ఈ తప్పు జరిగితే ఆ తప్పు అడ్డుకోవడం నేరం కాదు.

వందే గోమాతరం! భారత జాతి యావత్తూ మాత "శ్రీలక్ష్మి "యే !!
స్వస్తి !!

ఈ ప్రపంచం ఒక పెద్ద దర్పణం వంటిది, మనం మంచిగా ఉంటే అందరూ మంచిగానే కనపడతారు...

👉🏻🌿ఒకరోజు ఒక కుక్క పూర్తిగా అద్దాలతో కట్టిన ఒక మ్యూజియం లోకి వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు...ఆ హాలు నిండా అద్దాలు ఉండడం వలన, ఆ కుక్కకు చుట్టూ ఎన్నో కుక్కలు ఉన్నట్టు కనిపించింది. నిజంగానే చాలా ఉన్నాయి అనుకుని, వాటిని భయపెట్టటానికి పళ్ళు బయటపెట్టి అరిచింది....చుట్టూ ఉన్న దాని ప్రతిబింబాలన్నీ అలాగే చేసాయి. గట్టిగా అరిచింది...అద్దాలలో కూడా అలాగే కనిపించింది. ఖాళీ గా ఉండడం వల్ల శబ్దం మరింత ప్రతిధ్వనించింది. అద్దాల దగ్గరికి వెళ్ళేసరికి ఆ కుక్కలు కూడా తన మీదకు వస్తున్నట్టు భ్రమించింది. రాత్రంతా అలాగే గడిచింది. తెల్లవారి ఆ మ్యూజియం కాపలావాళ్ళు వచ్చి చూసే సరికి ఆ కుక్క చాలా దీనంగా, ఒంటి నిండా దెబ్బలతో లేవలేని స్థితిలో, దాదాపు చనిపోవటానికి సిధ్ధంగా ఉంది. కాపలావాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎవ్వరూ లేని చోట కుక్కకు దెబ్బలు ఎలా తగిలాయి, ఎవ్వరు దీనిమీద దాడి చేసారు అని....
ఆకుక్క తన ప్రతిబింబాలతో తనే పోట్లాడింది....వాటిపై దాడి చేస్తున్నాను అనుకుని, తనకు తనే భయంకరంగా గాయాలు చేసుకుంది.
ఈ ప్రపంచం కూడా సరిగ్గా అలాంటిదే.....అది మనకు మంచి కాని, చెడు కాని, చేయదు. మన ఆలోచనలు, మన మనస్తత్వమే మన మంచి చెడులను నిర్ణయిస్తుంది. మన చుట్టూ జరుగుతునది అంతా మన ఆశలు, కోరికలు, ఆలోచనల ఫలితమే. ఈ ప్రపంచం ఒక పెద్ద దర్పణం వంటిది, మనం మంచిగా ఉంటే అందరూ మంచిగానే కనపడతారు...ఈ దర్పణం ముందు ఆనందంగా పోజు ఇవ్వండి....అంతా ఆనందంగానే ఉంటుంది.🌱
🙏🙏🙏🙏

నేల తల్లి పరిరక్షణలో మనుషులు అందరూ భాగస్వాములం కావాలి

1 . మనిషి ఈ భూమ్మీద తానొక్కడినే మగాడిని అనుకొన్నాడు. నాకు ఎదురు లేదు అనుకొన్నాడు. ఏ జీవి గురించి ప్రకృతి గురించి అస్సలు పట్టించుకోలేదు. ప్రకృతిలో వున్నాము అన్న విషయాన్నీ దాదాపుగా మర్చిపోయాడు. పులిని చంపాడు , అంత పెద్ద ఏనుగును భయపెట్టాడు. దాని మీద ఎక్కి కూర్చున్నాడు. ఇంచు మించుగా అడవిని ఖాళీ చేశాడు ప్రకృతిని విద్వంసము చేసాడు. భూమి మీద గీతలు గేసాడు. ఇది మాదేశము అన్నాడు. రక్షణగా దేశము చుట్టూ కంచె వేసాడు. కర్మాగారాలలో తుపాకులు, యుద్ధ విమానాలు తయారుచేసాడు. ఇక్కడ కాకుండా అంతరిక్షంలో కాలు పెట్టాడు. అక్కడ యంత్రాలు పెట్టాడు. శత్రుదేశము దాడిచేస్తే క్షణాలలో విరుచుకు పడడానికి సైన్యాన్ని సిద్దము చేసాడు. రాకెట్లను తయారు చేసాడు దేనికీ భయపడలేదు.

ఇప్పుడు జరుగుతున్న కరోనా యుద్దములో ఒక్క తుపాకీ పేలలేదు. ఒక్క జవాను చనిపోలేదు. ఒక చుక్క ఇంధనం వాడలేదు. ఒక్క విమానము గాలిలో ఎగరలేదు. కానీ శత్రువు 200 దేశాలలో కబళించాడు. దేశాధిపతులు కంట నీరు కారుస్తున్నారు చేసేది ఏమీలేక. ఆ తుపాకీతో గురి పెడదాము అంటే కంటికి కనిపించదు. కంటికి కనిపించని జీవికి భయపడి పోయాడు. ఇప్పుడు అర్ధమైనదా ఇక్కడ నీ పాత్ర ఏంటో ? ఇన్ని రోజులూ లాక్ డౌన్ లో నువ్వు ... ఎక్కడి కి అక్కడ ఆగిపోతే ... అన్ని జీవరాశులూ, చెట్లూ సంతోషముగా ఉన్నాయి. చక్కగా ఊపిరి తీసికొంటున్నాయి. ఓజోన్ పోరా కొలు కొంటున్నది. గంగ సంతోషముగా ఉన్నది.

నీవు ఒకటి గమనించావా? ఈ కరోనా వైరస్ ఒక కీటకానికి, పక్షికి, జంతువుకి రాలేదు. నీకు మాత్రమే వచ్చింది. ఎవరు ప్రకృతిని పాడు చేశారో వాడినే పగ పట్టింది.

2 . ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకో. ఈ జీవ రాశులలో నీవు ఒక్కడివి మాత్రమే. గొప్పవాడివి కాదు. అన్ని జీవ రాసులూ గొప్పవే. అదే జీవ వైవిధ్యము. నీ అవసరము ఏ జీవికీ లేదు. ఈ జీవుల వసరము నీకు వుంది. ఈ భూమి మీద నీది ఒక అన్న పాత్ర. బాధ్యతతో మెలగడము నేర్చుకో.

3 . నా కేంటి , నాకు ఏమీ కాదు అని మందుల కంపెనీలు చాలా నిర్మాణము చేసావు. కరోనాకి మందు లేదు. నీవు కనిపెట్టినవి దేనికి పనికి వచ్చాయి. నీది మాయ... ప్రకృతిది వాస్తవము , నిజాము.... ఇప్పుడు WHO ఏమి చెబుతుంది. పౌష్ఠిక ఆహారము తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెబుతున్నారు. అది సూపర్ మార్కెట్ లో MNC కంపెనీలలో దొరికేది కాదు. అది భూమి నుండి పంట ద్వారా రావలసినదే ఖచ్చితముగా ప్రక్రుతి వ్యవసాయము ( గో ఆధారితము ) , దేశీ విత్తనము తోనే పౌష్ఠిక ఆహారము అందుతుంది.

4 . గాలి ప్రయాణాలు ఆపి కాలు క్రింద పెట్టు. ఇక చాలు నీవు ఎక్కడ పుట్టావో అక్కడికి వచ్చేయి. తినడానికి బతకవద్దు. బతకడానికి తిను. . చస్తూ బతక వద్దు. బతుకుతూ చచ్చిపోదాము. ఒకటి చెప్పు ... అసలు నీకు కావలసినది ఏమిటి ? ఎక్కువ డబ్బులా ? ఎక్కువ ఆరోగ్యమా ?

నేల తల్లి అంటున్నది పరుగులు ఆపాల్సిందే. ముందు నడవడము , నిలబడడము . కుదురుగా కూర్చోవడము నేర్చుకో. ఇవి నేర్పడానికి కరోనా వచ్చింది. ఇక్కడ నీవు బాగుండాలని విశ్వములో నేను మాస్కును ( ఓజోన్ పొరను ) వేసుకున్నా. దాన్ని నిలువునా చీల్చావు. అందుకే ఇప్పుడు నీకు మాస్క్ వేసాను.

5 నేల తల్లి అంటున్నది. ఇప్పుడు మనిషి ముందు వున్నా అతి పెద్ద సమస్యలు రెండు. ఒకటి భూతాపము తగ్గించడము. రెండవది పౌష్ఠిక ఆహారము. ఈ రెండింటికి పరిష్కారము సుభాష్ పాలేకర్ ప్రక్రుతి వ్యవసాయ విధానము.

ఇంకా ఒక్క విషయము. ఈ భూమ్మీద వర్షాలు పడాలంటే తేనెటీగ పాత్ర ఏంటో కీలకమైనది. తేనే నీ ఆహారము కాదు. దాని ఆహారము. నీకు వర్షము కావాలా? తేనే కావాలా?

భూ తాపాన్ని తగ్గించండి. శాఖాహారులు కండి. పాలిథిన్ కవర్లు వాడకండి. చేతి వృత్తులు కాపాడండి.

నేల తల్లి పరిరక్షణలో మనుషులు అందరూ భాగస్వాములం కావాలి 👏👏👏🙏🙏 మల్లీ పభుత్వాలు చెబుతున్నాయి మీరు మంచిగా ఉండకపోతే మల్లీ లాక్ డౌన్ 🙏🙏🙏🙏🌲🌲🌲🌲

ఆస్తికుడు నాస్తికుడు

ఆస్తికుడు నాస్తికుడు

ఒక ఊరిలో ఒక ఆస్తికుడు,
ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవారు.

ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు.

ఆ ఇద్దరూ కొద్దిరోజుల తేడాలో చనిపోయారు.

ముందు నాస్తికుడు చనిపోగా..

ఆ తరువాత ఆస్తికుడు మరణించాడు.

విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ని వైకుంఠానికి తీసుకుని వెళ్లి అక్కడ సభలో విష్ణువును చూపించారు.

ఆహా తన భక్తి పండింది అనుకున్నాడు ఆస్తికుడు.
ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్తుతి చేశాడు.

ఇంతలో విష్ణు దూతలు వచ్చి అతణ్ని ‘‘పద.. పద’’ అని సభలోంచి తీసుకెళ్లడం ప్రారంభించారు.

దానికి అతడు అయోమయంతో.. ‘‘ఎక్కడికి తీసుకుపోతున్నారు?’’ అని వారిని అడిగాడు.

‘‘నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది. తిరిగి భూలోకానికి తీసుకుని పోతున్నాం’’ అని విష్ణుదూతలు చెప్పారు.

‘‘నా పుణ్యం అయిపోవడం ఏమిటి?

నేను గొప్ప విష్ణు భక్తుణ్ని.

నిత్యం ఆ స్వామిని కొలిచాను’’ అన్నాడు ఆస్తికుడు.

‘‘అది నిజమే.
కానీ నువ్వు మూడు కారణాలవల్ల తొందరగా వెనక్కి భూలోకానికి వెళ్లిపోతున్నావు.

ఒకటి.. నీకు నీ జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే.

అందుకే రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక విధినిర్వహణలా పూజచేస్తూ మిగిలిన సమయంలో విష్ణువును ఆలోచనలలోనికి కూడా రానిచ్చేవాడివి కాదు.

రెండో కారణం.. ‘స్వామీ! నన్ను వచ్చే జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టించు.’ అని రోజూ ఆ దేవదేవుని కోరేవాడివి.

అంటే.. నీకు మళ్లీ పుట్టాలని, అదీ ధనవంతునిగా జన్మించాలని కోరిక ఉంది.

ఇక మూడో కారణం.. రోజూ పూజ పూర్తవగానే ‘ఒక్కసారి కనబడు తండ్రీ.. చాలు’ అని కోరేవాడివి.

అందువల్ల నీకు కేవలం ఒక్కసారి మాత్రమే విష్ణుదర్శనం అయింది.

మళ్లీ పుట్టాలనే కోరిక ఉన్నందున భూలోకానికి వెళ్తున్నావు’’ అని చెప్పారు.

అదే సమయంలో.. ఆస్తికునికి విష్ణు సభలో నాస్తికుడు కనిపించడంతో అతడు నివ్వెరపోయాడు.

‘‘వీడెలా వచ్చాడిక్కడికి?
వీడు నాస్తికుడు కదా?’’ అని అతడు విష్ణుదూతలను అడిగాడు.

దానికి వారు.. ‘‘అవును, నిజమే.

అయితే,
బతికి ఉన్నంతకాలం ఇతడు ‘దేవుడు లేడు.

దేవుడు లేడు’ అంటూ..

తెలియక చేసినా నీకంటే ఎక్కువగా భగవన్నామ స్మరణ చేశాడు.

వ్యతిరేకంగానైనా సరే..
నీకంటే ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచించాడు.

మరొక ముఖ్యకారణం.

ఇతడి ఇంట్లో ఇతడు తప్ప అందరూ ఆస్తికులే.

ఇతడి భార్య విష్ణుమూర్తి భక్తురాలు.

కొడుక్కి నారాయణ అని పేరుపెట్టుకుంది.

గడచిన నెలలో వైకుంఠ ఏకాదశి మరునాడు ఉదయం ఆమె పాయసం చేసింది.


వీడు ఇంటి అరుగు మీద కూర్చుని ఆ పాయసం తింటుండగా పొలమారింది.

విపరీతంగా దగ్గుతూ ‘నారాయణా చచ్చిపోతున్నానురా!’
అంటూ కొడుకుని పిలిచి, అతడు మంచినీళ్లు తెచ్చేలోపునే మరణించాడు.

ఏ కోరికా లేకుండా తన ప్రసాదం తిని, నారాయణ నామస్మరణ చేస్తూ మరణించినందున శ్రీమహావిష్ణువు వీడికి వైకుంఠంలో నివాసం కల్పించారు’’ అని చెప్పారు.

భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమని ఆస్తికుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు.

అయితే.. మరుజన్మలో అతడు తన పాత తప్పుల్ని పునరావృతం చేయలేదు.

మనసారా విష్ణువును కొలిచి, చేసిన కర్మల ఫలితాన్ని ఆ పరమాత్మకు ధారపోయడం ద్వారా పాప, పుణ్యాలు అంటని మహా యోగి అయ్యాడు.

తెలియక చేసినా భగవన్నామ స్మరణతో నాస్తికుడు వైకుంఠంలో స్థానం పొందితే..

మరుజన్మలో స్వామిని త్రికరణశుద్ధిగా పూజించిన పుణ్యంతో ఆస్తికుడు చివరకు ఆ స్వామి హృదయంలోనే చోటు సంపాదించుకున్నాడు.

జనన, మరణ చక్రం నుంచి విముక్తి పొందాడు.

ఓం నమో నారాయణాయ నమః
🙏🏻🙏🏻

హనుమ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి

హనుమ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి

👌 1.ఎవరిని / దేనిని ఆశ్రయించావు?

ధర్మం తెలిసిన బ్రాహ్మణుడు రావణుడు.
అపారమైన శివ భక్తుడు.అయినా పరకాంతల యందు..పరుల సొమ్ము నందు వాంఛను చంపుకోలేకపోయాడు.చివరకు రాముని ఒక్క బాణం తో పది తలలు కూలి మట్టిలో కలిసిపోయాడు. ధర్మ మూర్తి అయిన శ్రీ రాముని పాదాలను పట్టి ఆశ్రయించి….ఆయన బాట యందు నడిచిన “స్వామి హనుమ” చిరంజీవి గా మిగిలిపోయారు.చరిత్రలో నిలిచిపోయారు.

“జీవితం లో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దేన్ని పట్టుకోవాలో ….దేన్ని విడిచిపెట్టలో తెలియాలి.సరైన మార్గాన్ని తెలుసుకోవాలి.తెలియడం కాదు…పాటించే దమ్ము కూడా ఉండాలి.”

👌 2. మైత్రి యొక్క విలువ!

వంచన తో..బలం తో..భార్యను,భూమిని, బలగాన్ని తనవైపు తిప్పుకున్న వాలి కి మంత్రిగా
హనుమ ఒక్క నాటికి లేరు.
తన దారి తానూ చూసుకోలేదు.న్యాయం వైపు గా..సుగ్రీవుడి పక్షాన్నే నిలిచి…ఉన్నారు.

“జీవితం లో కస్టాలు సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం.నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు…వాళ్ళని ఎన్ని కాష్టాలొచ్చినా విడిచిపెట్టకండి.”

👌 3. అహం బ్రహ్మాస్మి-నేనే గొప్ప అని అనకు!
నాదేం లేదు…అనగలిగే గొప్ప స్వభావం కలిగి ఉండాలి!

లంకకు వెళ్ళే ముందు…హనుమ ఇలా అంటారు..!
నేను తలచుకుంటే నా శరీరాన్ని అమాంతం పెంచి వంగి ఒక్క చేత్తో అవతలి లంకా తీరాన్ని అందుకో గలను…అంత బలం ఉంది…
కాని నేను ఎలా వెళ్తానో తెలుసా?
“నా స్వామి రామ చంద్రమూర్తి యొక్క కుడిచేత్తో
తన భుజం వెనుకనున్న అక్షయ బాణ తూనీరం
లో నుండి తీసిన బాణాన్ని తన ఎడమ చేతిలోనున్న బంగారు వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెడితే ఆ బాణం ఎలా వెళుతుందో ” అలా దూసుకెళతాను…
అది నా శక్తి కాదు…!రాముడి చే విడవబడితే…
రాముడి శక్తి ఆ బాణం లో కెళ్ళి బాణం వెళుతుంది!అటువంటి రామ బాణం లా వెళతాను!”
-నేను…నా వల్ల ,నా బలం..ఇదంతా నేనె చేసాను.. అని హనుమ ఒక్క సారి కూడా అనలేదు!

👌 4. నీ మీద నమ్మకం ఉండేలా బ్రతుకు!
కొన్ని లక్షల వానర సేన!
నూరు యోజనముల సముద్రం!
జాంబవంతుడు సహా ఎందరో అతిరథ మహారథులు!
తలచుకుంటే కాని పని కాదు!కాని రాముడు నమ్మింది …అందరూ సూచించింది “హనుమనే”!

“నిన్ను నమ్మి పని అప్పగించి ….గుండెల పై చెయ్యేసుకుని హాయిగా నిద్రపోయేలా బ్రతుకు!”

👌 5. మోసం చేసేవాళ్ళు ఉంటారు.నువ్వు మోసపోకు…ఆగిపోకు..ముందుకు మరో అడుగేసి సాగిపో!
హనుమ సముద్రం దాటుతూ ఉండగా….ఒక అందమైన బంగారు పర్వతం…పైకి లేచింది!
“స్వామి…మీరు చాలా దూరం ప్రయాణం చేసి
అలసి ఉన్నట్టు కనబడుతున్నారు..!కాసేపు నా ఈ పర్వతం పై కూర్చుని….విస్రాంతి తీసుకుని,ఇక్కడ ఉన్న పళ్ళు కాయలు తిని
వెళ్ళండి “అని అంటుంది.
హనుమ…”సముద్రం లో బంగారు పర్వతమా?మాయ లా ఉంది?ఇది నాకు విఘ్నమని” ఆలోచించి…ఆ పర్వతాన్ని చేత్తో ప్రేమగా తాకి,లంకా నగరం వైపుగా వెళ్ళిపోయారు.

“చేసే పనిలో ….గమ్యాన్ని చేరుకోడం లో..ఎలాంటి అడ్డంకులున్నా ప్రయాణం ఆపకూడదని హనుమ
చేసుకున్న ప్రమాణం.”

👌 6. లక్ష్యం తప్ప మరేదీ కనబడకూడదు.
హనుమ,లంకలో సీతమ్మకోసం వెతుక్కుంటూ
రావణ అసురుని అంత: మందిరం లోనికి ప్రవేశించగా
కొన్ని వందల మంది స్త్రీలు వివస్త్రలు గా, సురా పానం చేసి…మత్తులో ఒకరిపై ఒకరు పడి అడ్డదిడ్డంగా…పడి ఉన్నారు… లెక్కలేనన్ని పళ్ళు…మధుర…పానియాలు నేలపై పది పారుతూ ఉన్నాయి.వారి ఒంటి మీద బంగారు నగలు…నేలంతా పడి ఉన్నాయి…
ఇవన్నీ చూస్తున్నా…..
హనుమ ఒక్కింత కూడా చలించలేదు…ఆతని మనసులో ఉన్నది ఒక్కటే!నా తల్లి సీతమ్మ ఎక్కడ ఉందొ?ఎన్ని కస్టాలు పడుతోందో అని…!
మురుగు కాలువ దాటినట్టు ఆ స్థలాన్ని దాటి
సీతమ్మ ను వెతుక్కుంటూ వెళ్లారూ హనుమ.

“లక్ష్యం సాధించడం లో గురి…
చేసే పని లో పట్టుదల…
పడే శ్రమలో తపన ఉంటె….మన చుట్టూ ఏమున్నా కనపడవు.”

👌 7. పెద్దరికాన్ని గౌరవించు
రావణుడు హనుమను బంధించి తీసుకు రమ్మన్నపుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించి
చివరగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు.
నిజానికి బ్రహ్మాస్త్రం హనుమను ఆపలేదు.
హనుమ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుబడ్డారు!
రావణ సభలో అంతే సులువు గా ఆ తాళ్లను విడిపించుకున్నారు.

“పెద్దలకి…నువ్విచ్చే గౌరవం నలుగురిలో నీ గౌరవాన్నే పెంచుతుంది”

హనుమ కథ లో…వెతుక్కుంటూ పొతే మన జీవితానికి కావలిసిన పాఠాలు ఎన్నో దొరుకుతాయి.ప్రతి ఊరి పొలిమేరల్లో గద పట్టుకుని నిలబడి….”ఏం భయం లేదు రా...నీకు తోడుగా నేనున్నానులే……పద “..అని తెలిపే ఆంజనేయ విగ్రహాలే.🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🍌🍌🍌🍌🍌🍌🍌🍌