Tuesday, February 28, 2023

శ్రీరమణీయం: 'నేను చేస్తున్నాను' అనే కర్తృత్వ భావన ఏ విధంగా ఏర్పడుతుంది ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"477"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"నేను చేస్తున్నాను' అనే కర్తృత్వ భావన ఏ విధంగా ఏర్పడుతుంది ?"*

*"మన పరిధి విషయంలో అవగాహన లేకపోవటం వలన కర్తృత్వ భావన ఏర్పడుతుంది. ముక్తేశ్వరపురం (ముక్త్యాల) అనే పుణ్యక్షేత్రం కృష్ణానది ఒడ్డున ఉంది. ఆ గ్రామంలోని పిల్లలు ఊరిని అనుకొని ప్రవహించే కృష్ణానదిని తమ చిన్నతనం నుండి చూస్తుంటారు. కృష్ణానది అనగానే వారికి తన ఊరే గుర్తుకు వస్తుంది. వారి దృష్టిలో ముక్త్యాల ఒడ్డున ఉన్నదే కృష్ణానది అనే భావన ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని వందల మైళ్ళు ప్రవహించే కృష్ణానదికి వారి మనసులో ఒక పరిధి ఏర్పడింది. వయసు పెరిగిన తర్వాత గాని కృష్ణానది ఒడ్డున ఉన్న అనేక గ్రామాల్లో తమ గ్రామం ఒకటన్న విషయం అర్థమవుతుంది. మనలో కర్తృత్వ భావన కూడా అలాగే ఏర్పడుతుంది. చైతన్యశక్తి అనంతంగా నిండి ఉంది. ఆ చైతన్యశక్తికి దేహం అనే పరిధి ఏర్పడింది. ఆ కారణంగానే ప్రతీదీ "నేను చేస్తున్నాను" అనే కర్తృత్వ భావన ఏర్పడటానికి కారణమైంది. అదే మన సుఖదుఃఖాలకు దారితీస్తుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
              

18. ఆత్మ జ్ఞానం, మోక్షమార్గం

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 🔥 *"18"* 🔥
   🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
   🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
     💖🔥💖🔥💖🔥💖
           💖🔥🕉🔥💖
                 💖🔥💖
                       💖
*"ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ౹"*

*"శ్రీవేద వ్యాస మహర్షి రచించిన మహాభారతకథలో పాండు మహారాజు తాను ఎప్పుడయినా ఏ స్త్రీనయినా కామంతో ముట్టుకుంటే ఆ క్షణంలోనే తను అక్కడే మరణిస్తాననే ఒక ముని శాపం తనకు ఉందని తెలిసిఉన్నా ఒకరోజు తనలో చెలరేగుతున్న కామాన్ని అదుపుచెయ్యలేని వివశతకు లోనయ్యి తన భార్య అయిన మాద్రిని ముట్టుకుని ఆ క్షణంలోనే అక్కడే కుప్పకూలి చనిపోతాడు."* 

*"భర్త ఉద్దేశ్యాన్ని ముందే పసిగట్టిన మాద్రి భయంతో జరుగబోయే చెడును ఊహించి తన భర్త అయిన పాండు మహారాజుకు వద్దని చెబుతూ అతడి నుంచి దూరం దూరం జరుగుతున్నా అతడు అదేదీ వినిపించుకోకుండా తనలోని కామాన్ని అదుపు చేసుకోలేక ఆమె మీదకు వచ్చి మరీ ఆమెను తాకి అక్కడే కుప్పకూలి మరణిస్తాడు."* 

*"చూసారా! ఇక్కడ మనిషి మరణానికయినా సిద్దపడ్డాడు గాని కామాన్ని మాత్రం నియంత్రించుకోలేకపోయాడు."*

*"అత్యంత శక్తి కలిగిన కామానికి లొంగిపోయి నేరుగా వెళ్లి మృత్యువు నోట్లో పడ్డాడు."* 

*"ఈ సంఘటన మానవునికి తెలియజేసేది ఏంటంటే మానవుడు గనక మృత్యువును జయించాలనుకుంటే దానికంటే శక్తి కలిగిన కామాన్ని “బ్రహ్మచర్యం” రూపంలో ఒక ఆయుధంగా తనలో కలిగివుండి మృత్యువుతో ఆడబోయే చివరి ఆట కోసం సిద్దమై ఉండాలి అని."* 

*"అప్పుడిక మృత్యువు ఓటమి ఖాయం మానవుని విజయం తధ్యం."*

*"స్త్రీ పురుష శరీరాల మద్య జరిగే సంభోగం అనే వ్యవహారం ఈ మనస్సుకు తిరిగి అనేక జన్మలు ఈ లోకంలోకి రావడానికి అవసరమయినంత శక్తిని ఇస్తోందని జనులంతా గ్రహించాలి."* 

*"ఈ లోకంలో మత్తుపానీయాలు, మాంసాహారం, స్త్రీ పురుష సంభోగం అనే మూడింటిని పొందడం కోసం జనులలో అనేకులు ధర్మమార్గాన్ని వదలిపెట్టి మరీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు."* 

*"ఇదంతా ఎంతో విచారకరం."*

 *"శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ గౌతమ బుద్ధుడు, శ్రీ స్వామి వివేకానంద, శ్రీ షిర్డీ సాయిబాబా, శ్రీ రమణ మహర్షి, శ్రీ వెంకయ్య స్వామి లాంటి మహాపురుషులు ఇంకా లోకంలోని అనేకమంది మహాపురుషులు లోకానికి తెలియజేసింది ఏమిటి?"*

*"ఆ మహాపురుషులంతా తమ శరీరాలను మనసు కోరుకునే తాత్కాలిక సుఖ భోగాల వైపు వెళ్ళనివ్వకుండా తమ బుద్ధి బలంతో మనసును కట్టడి చేసి ప్రారబ్దం ఉన్నంత వరకూ ఈ మానవ లోకంలో శరీరంతో ఉంటూ వారి జీవిత కాలంలో వారు గడిపిన జీవితమే లోకంలోని తక్కిన ప్రాణుల ముక్తికి ఒక మార్గంగా చూపి చివరికి ఒకరోజు వారు తమ భౌతికశరీరాన్ని త్యజించి ‘అనంతమయిన ఆనందం’ లభించే ‘ఆత్మ’ అనే స్వస్వరూప స్థితిలో ఏకమైపోయారు."* 

*"లోకం లోని జనులు “భగవంతుడు” అని పలికేది అలాంటి జీవితాన్ని గడిపిన ఆ ఆదర్శ మహాపురుషులనే."* 

*“ఆ మహా పురుషులకు శతకోటి హృదయపూర్వక నమస్కారాలు”."*

*"చూసారా..! కేవలం “విచారణ చేయకపోవడం” అనే పొరపాటు వల్లే మానవుడు ఈ “మానవజన్మ” అనే మహత్తరమయిన అవకాశాన్ని చేజేతులా వ్యర్దం చేసుకుంటున్నాడని తెలుస్తోంది గదా!"*

*"జ్ఞానులు మానవ శరీరం యొక్క పరమ ప్రయోజనమయిన మోక్షం కొరకు ఎన్నో ఉపాయాలు చెబుతున్నా కొందరిలో ఇంకా సందేహాల మబ్బులు తొలగడం లేదు."*

*"వారిలా అమాయకంగా ప్రశ్నిస్తున్నారు."*

*"మా వద్ద పుష్కలంగా డబ్బు ఉన్నప్పుడు తినాలి అనిపించినవన్నీ తినడం, తాగాలి అనిపించినవన్నీ తాగడం, కొనాలి అనిపించినవన్నీ కొనడం, చూడాలి అనిపించినవన్నీ చూడడం, అనుభవించాలి అనుకున్నవన్నీ అనుభవించడం చేస్తే అసలు తప్పేంటి?"* 

*"ఇవన్నీ చెయ్యడం వల్ల మాకు ఆనందం కలుగుతోంది కదా!"* 

*"పోయేరోజు వచ్చినప్పుడు ఎలాగూ పోతాం."*

*"అనుభవించినా పోతాం. అనుభవించకపోయినా పోతాం."*

*"మరి ఎన్నో సుఖాలు అనుభవించగలిగే స్తోమత కలిగి ఉండి ఎందుకు ఊరకే కూర్చోవాలి."*

*"ఎందుకని మేము మా కోరికలను చంపుకుని దుఃఖంతో జీవించాలి!"* 

*"అని అడుగుతున్నారు."*

*"వారి ప్రశ్నలకు సమాధానం చూద్దాం."*

*"మరణంతోనే మనిషి జీవితం గనక సమాప్తం అయ్యేట్లయితే అసలు మనిషికి ఇక దిగులు ఎందుకు ఉంటుంది?"*

 *"మీరు చెప్పినట్లే అన్నీ చెయ్యవచ్చు."* 

*"తాగి తిని మత్తుగా ఏ చెట్టు క్రిందో నడుం వాల్చి పొడుకోవచ్చు."* 

*"అలాగే మరణమే గనక మనిషి జీవితానికి అంతిమం అయితే అప్పుడు ఇక ఈ లోకంలోని జనులకు భయం దేనికి?"*

*"సత్యం పలకడం ఎందుకు?"* 

*"ధర్మంగా ఉండటం ఎందుకు?"* 

*"జీవించడానికి ఎన్నో నియమాలు ఆంక్షలు ఎందుకు?"* 

*"మరణమే మానవ జీవితానికి అంతిమఘట్టం అయితే కర్మలు చేసేటప్పుడు ఇది పుణ్యం ఇది పాపం అనే భావనలు మనలో ఎందుకు కలుగుతున్నాయి?"* 

*"ఈ శరీరంతో పాటు మనిషి కూడా మరణించేట్లయితే అప్పుడు అది అందరూ పండగ చేసుకోవాల్సిన విషయమే అవుతుందిగాని దుఖించాల్సిన విషయం ఎందుకు అవుతుంది?"* 

*"ఎందుకంటే మరణం తర్వాత ఇక ఏమీ లేదు అనుకుంటే ఇక అది మోక్షంతో సమానమే గదా!"* 

*"అప్పుడు ఇక్కడెవడు ఉంటాడు."* 

*"మరణంతో దుఃఖం మొత్తం ముగిసిపోయేపని అయ్యేట్లయితే అప్పుడు అందరూ మరణం బాట పట్టేవారే గదా."*

*"కానీ లోకంలో అలా జరగట్లేదే!"*

*"మరణం అంటేనే మనిషి భయపడుతున్నాడు."*
             

ఆత్మజ్ఞానం

 🪔🪔 ఆత్మజ్ఞానం🪔🪔

🌹తనను తాను తెలుసుకోవడాన్నే ఆత్మజ్ఞానం లేదా ఆత్మజ్ఞత అంటారు ఆధ్యాత్మిక వేత్తలు. అన్ని జ్ఞానాల కన్నా మహోన్నతమైన జ్ఞానమిది! దీన్ని గురువులు బోధించరు. విద్యాలయాల్లో చెప్పరు. గ్రంథ పఠనం వల్ల సమకూర్చుకోలేం. అయినప్పటికీ సులభంగా పొందగలం. దానికి మార్గం హృదయ పరిపక్వత, పరిశుద్ధత, ఆత్మాన్వేషణ, ఆత్మావలోకనం. 

🌹వీటన్నింటిలో ఎవరికి వారు తామంత తాముగా ప్రయత్నం చేస్తేనే అది సాధ్యం. ఆ సాధనను ఆత్మశోధన అంటారు.ఆత్మాన్వేషణకు నిర్మలమైన మనసు, సరళమైన ఆలోచనా విధానం ఉండటం ముఖ్యం. అవి ఆత్మ పరిపక్వత, సత్యాన్వేషణ, సదసద్వివేచనలకు కొంతవరకు ఉపకరిస్తాయి. అవే మహాద్భుత రహస్యాలను సైతం వెల్లడిస్తాయి. ఆ పరిపక్వత స్థాయిని నిర్ణయించడం, నిర్ధారించడం సామాన్యులకు శక్యం కాదు.

🌹గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక చోట 'కష్టసుఖాలను సమానంగా తట్టుకునే శక్తిని నాకివ్వు భగవంతుడా!' అంటారు. ఆ మాటలు చదివిన చాలామందికి 'కష్టసుఖాలను సమానంగా తట్టుకునే శక్తి ఇమ్మని అడిగే బదులు అవి లేకుండా చేయమని అడగవచ్చు కదా?' అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ ఆత్మావలోకనం చేసుకునే ఆలోచన, జ్ఞానం ఉన్నవాడు కాబట్టే అలా అడిగాడు. 

🌹నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈ రోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఇహలోక బంధాలన్నీ ఆ కోవకే చెందుతాయి. ఆయా క్షణాల్లోనే మనిషిలోని బలహీనతలు బయటపడి అతడి అసలు స్వరూపం బహిర్గతం అవుతుంది. అందుకే ఆ క్షణం కాస్త ఓర్చుకోగలిగితే మనిషి మహోన్నతుడవుతాడు. అలా కావాలనుకునేవారు కోరుకోవలసింది తట్టుకునే శక్తినే కాని, అవి లేకుండా చేయమని మాత్రం కాదు.

🌹స్వామి వివేకానంద ఒక ప్రసంగంలో 'నేను కొన్ని ఒప్పులు చేసి, చాలా విషయాల్లో తప్పులు చేసినందుకు సంతోషిస్తాను. ఎందుకంటే వాటినుంచి నా జీవితంలో గొప్ప పాఠాలు నేర్చుకొన్నాను. కాబట్టి. తెలివైనవారు తమ తప్పును వెంటనే తెలుసుకొని, మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తారు. వారు చేసిన పొరపాట్ల నుంచి మరిన్ని కొత్త పాఠాలను నేర్చుకొని, తమ జీవితాన్ని ఉత్తమ భావాలతో, ఆదర్శాలతో నింపి పురోగతి చెందుతారు. దీన్నే ఆత్మాన్వేషణ' అంటారు.

🌹ఇలా ఎవరికి వారే తమలోనే ఓ విమర్శకుణ్ని పెంచి పోషించుకోవాలి. తమ ప్రతి ఆలోచనను, ఆచరణను ముందు ఆ విమర్శకుడి విచక్షణకు వదిలివేయాలి. అక్కడి నుంచి సరయినదన్న అభిప్రాయం వచ్చాక, ఇక ఎవరి విమర్శకూ మనం వెరవనక్కరలేదు. మనలో తీర్చిదిద్దుకున్న ఆ విమర్శకుడు అంతరాత్మలా నిరంతరం మనకు మార్గనిర్దేశం చేయాలి. మన తప్పొప్పుల్ని మనమే సమీక్షించుకుంటూ, మనకున్న శక్తుల్ని మనమే సమీకరించుకుంటూ ముందుకు సాగిపోతే అదే అసలైన ఆత్మజ్ఞానం.🙏

- ✍️అయ్యగారి శ్రీనివాసరావు

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 🕉 *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏🌷🙏

*భగవాన్ శ్రీ రమణ మహర్షి'*  ఉవాచ:

💥"మన ఉనికి ఎక్కడ ఆగి పోతుందో అక్కడ మన మహిమ ఉంటుందని మనకు క్రమంగా తెలుస్తుంది. ఆ స్థితిని పొందాలంటే, "ప్రభూ, నువ్వే నాకు ఆశ్రయం" అని శరణాగతి చేయాలి. 
మార్గనిర్దేశాన్ని స్వీకరించడానికి ఈ వ్యక్తి సరైన స్ధాయిలో ఉన్నాడని భగవంతుడు తెలుసుకొని దానిని అనుగ్రహిస్తాడు., హృదయం నుండి హృదయానికి మౌనంగా మాట్లాడటమే ఉత్తమ శిక్షణ."💥

🙏🌷🙏 *శుభం భూయాత్*  🙏🌷🙏

శ్రీరమణీయం: మన బుద్ధిలోని లోపాలను గురువుగారి ద్వారా మార్చుకునే వీలవుతుంది కదా ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"476"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"మన బుద్ధిలోని లోపాలను గురువుగారి ద్వారా మార్చుకునే వీలవుతుంది కదా ?"*

*"మనబుద్ధి మనదిగానే ఉంచుకొని వెయ్యిసార్లు గురువును ప్రార్ధించినా ఆయన మన మనసును మార్చలేరు. అలా కాకుండా గురువు బుద్ధిని మనం అంగీకరించిన మరుక్షణం ఆయన మన బుద్ధిని మార్చేస్తారు. మార్పును అంగీకరించే సుగుణం మనలో ఉంటేనే గురువుకు అది సులభసాధ్యం అవుతుంది. మనం స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, నాగరికత అనే పదాలను సంపూర్ణంగా తెలుసుకొని ఆ తర్వాత కోరుకోవాలి. మనంచేసే ప్రపంచాన్ని మనసు ప్రతిబింబించ గలదేకానీ మనసులోని జ్ఞాపకాన్ని ప్రపంచం ఎప్పుడూ ప్రతిబింబించదు. ఈ విషయాలు అవగాహన చేసుకొని మారని మనసుతో మారుతున్న విధానాలను స్వీకరిస్తూ వెళ్తే అది శాంతియుత జీవనమే అవుతుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
              

17. ఆత్మ జ్ఞానం, మోక్షమార్గం

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 🔥 *"17"* 🔥
   🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
   🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
     💖🔥💖🔥💖🔥💖
           💖🔥🕉🔥💖
                 💖🔥💖
                       💖
*ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ౹*

*"కాబట్టి రాజ్యాలను పాలించే నాయకులు, వైద్యులు, అధికారులు మోక్షం మాత్రమే లక్ష్యంగా కలిగివుండి పేద ప్రజలకు, రోగులకు, అన్యాయానికి గురై న్యాయం కోసమని వచ్చేవారికి త్యాగంతో కూడిన పవిత్రసేవ మాత్రమే చెయ్యాలని ఎవరికి వారు సంకల్పించుకోగలరు."* 

*"కర్మఫల ఆపేక్ష లేకుండా ఎవరయితే కర్మలు చేస్తారో వారే ముక్తికి అర్హులు."* 

*"భగవంతుడు అని లోకులు పిలిచేది కూడా అలాంటి వారినే."*

*"అలాగే ప్రజలు కూడా తమను పాలించాల్సిన నాయకులను వారి గుణగణాలను అంచనా వేసి ఎన్నుకోవాలి."*

*"చెడ్డవారిని ఎన్నుకుంటే వారు చేసే పాపాలలో వారిని ఎన్నుకున్నవారు కూడా భాగం పంచుకోవాల్సివస్తుందని అందరూ గ్రహించాలి."*

*"రాజ్యాలను పాలించడానికి అధికారం కోసం ప్రజలవద్దకు వచ్చే వారిలో చెడ్డగుణాలు లేనివారిని ప్రజలు గుర్తించి ఎన్నుకోవాలి."* 

*"రాజ్యంలోని ప్రకృతి సంపదను, ప్రజాధనాన్ని పేద ప్రజల కష్ట నష్టాలకు వెచ్చించకుండా ప్రజలిచ్చిన అధికారం అడ్డుపెట్టుకుని చట్టాలలోని చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకుని చట్టాలకు చిక్కే అవకాశం రానివ్వకుండా ప్రజా ధనాన్ని ఎవడయితే తన సొంతం చేసుకుని తానుమాత్రమే కోట్లకు అధిపతి అవుతాడో అలాంటివాడు ప్రజలను పాలించడానికి అర్హుడు కానే కాదని అందరూ గ్రహించాలి."*

*"అలాంటివాడు కేవలం “దొంగే” అవుతాడుగాని “రాజు” ఎన్నటికీ కాలేడు."* 

*"అలాంటి వాడి పాలనలో ప్రజలకు మోక్షం లభించదు."*

*"కాబట్టి ప్రజలు తమను పాలించే నాయకుడిని ఎన్నుకోవలసిన సమయాలలో అత్యంత అప్రమత్తంగా ఉండి పవిత్రమయిన నిర్ణయాలు తీసికోవాల్సి ఉంటుంది."*

*"ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెడ్డవారికి మద్దతిచ్చే బుద్ది మనలో ఉందంటే మన మనస్సు అపవిత్రంగా ఉన్నట్లే గదా!"*

*"అలాంటి అపవిత్రమయిన బుద్ది, మనస్సుతో మనకు ముక్తి ఎలా లభిస్తుంది. మోక్షాన్ని కోరుకునేవారు తాము చేసే ప్రతి కర్మను మా కులం, మా మతం, మా ప్రాంతం, మాకేంటి లాభం అనే మోహపూరిత స్వార్ధదృష్టితో కాకుండా వివేకంతో ఆలోచించి ధర్మదృష్టితో నిర్ణయం తీసికోగలగాలి."*

*"మోక్షం కావాలంటే మోహం వదలాల్సిందే మరో మార్గం లేనే లేదు. అలా పవిత్ర కర్మలు చేసే పవిత్రులకు మాత్రమే మోక్షం సులభతరం అవుతుంది."* 

*"అలాంటి పవిత్రులకు మోక్షమార్గంలో సకల దేవతల అండ కోరకుండానే లభిస్తుందని తెలుసుకోవాలి."*

*"అలాగే మన లక్ష్యం మోక్ష్యం అయినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోని ఇతర వ్యక్తులతో గాని వారి గొప్పలతో గాని మన జీవితాలను పోల్చుకోగూడదు."* 

*"డబ్బు సంపాదిస్తే ఏవేవో సుఖాలు లభిస్తాయి అనే కామంతో డబ్బు సంపాదించడానికి అస్సలు ప్రయత్నం చెయ్యకూడదు."* 

*"ఈ డబ్బు నాకు కాదు."*

 *"ఇది నా కర్తవ్యపాలన కొరకు మాత్రమే."* 

*"నాకు కావాల్సింది ఈ ముల్లోకాలలో ఏదీ లేదు."*

*"నన్ను నేను దర్సించుకోవడమే నా జీవిత లక్ష్యం అని నిత్యం మనసులో భావిస్తూ వుండాలి."*

*"జీవిత పర్యంతం ఈ శరీరానికి ఒక్క మితమయిన ఆహారం ఇవ్వడం తప్ప మరోదాని మీద ఏమాత్రం ఆసక్తి కలగకుండా చూసుకోవాలి."* 

*"లోక విషయాలు ఏమాత్రం మనసులోకి రానివ్వకుండా వీలైనంత మౌనంగా ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ వుండాలి."* 

*"లోకంలోని ఏ వస్తువుతోగాని జనులతోగాని ఎలాంటి అనుబంధాలు ఏర్పరచుకోగూడదు."* 

*"మనసులోంచి ఆశను లోకం మీద ఆసక్తిని క్రమేణా తగ్గిస్తూ రావాలి."*

*"మోక్షం లక్ష్యంగా కలిగిన వారు పెళ్లి అయినవారు కానివ్వండి లేదా పెళ్లి కానివారు కానివ్వండి ఎవరయినా సరే “బ్రహ్మచర్యం” మాత్రం తప్పక పాటించాల్సిందే."* 

*"అయితే పెళ్లి అనే బంధాన్ని ఏర్పరచుకున్న వారు పిల్లలకు జన్మనివ్వడం అనే లోక మర్యాదను పాటించి ఇక ఆ తర్వాత నుంచి బ్రహ్మచర్యం పాటించాలి."*

*ఎప్పటివరకు అంటే..* 

*"ఎప్పటివరకూ అయితే ఈ శరీరం నిలిచి వుంటుందో అప్పటివరకూ బ్రహ్మచర్యం పాటించాల్సిందే."*

*"ఎందుకంటే సంభోగం అనేది శరీరాలను ఉపయోగించి పొందే ఆనందం."* 

*"మోక్షం అనేది నేను శరీరం అనే భావన నుంచి బయటపడ్డ వారికే లభిస్తుంది."* 

*"ఒక ప్రక్క ఈ శరీరాలను ఉపయోగించి ఏదో కల్పిత ఆనందం పొందుతూ మరియొక ప్రక్క ‘ఈ శరీరం నేను కాదు’ నా లక్ష్యం మోక్షం అని నాలుకతో పలికితే ‘ఆత్మానుభవం’ కలగదని అందరూ అర్ధం చేసుకోవాలి."* 

*“బ్రహ్మచర్యం” పాటించకుండా మోక్షం అనే స్వస్వరూప స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవడం సాధ్యం కాదని అందరూ గ్రహించాలి."*

*"అలాగే మనం ఎవరినయినా ఏదయినా ఆటలో ఓడించాలంటే అందులో వారి శక్తి ఎంతటిదో ముందే తెలుసుకుని వారికంటే అధిక శక్తిని మనం కలిగిఉండి ఆటలోకి ప్రవేశించాలి."*

*"అప్పుడే మనం వారిని ఏ ఆటలో అయినా ఓడించగలం."* 

*"లోకంలో బలవంతుని చేతిలో బలహీనుడు ఓడిపోవడం అనేది అందరూ ఎరిగిన సర్వసాధారణమైన విషయమే గదా!"*

*"కాబట్టి మనం మోక్షాన్ని గనక పొందాలనుకుంటే మరణాన్ని జయించాలి."* 

*"మరణాన్ని జయించాలంటే మరణం కంటే శక్తివంతమయిన ఆయుధాన్ని మనం కలిగి ఉండాలి."*

*"మరణం కంటే శక్తివంతమయిన ఆయుధ మేదయినా మానవుని వద్ద ఉందా అంటే అతడి వద్ద అలాంటి ఆయుధం ఒకటి తప్పక ఉంది అనేదే విస్పష్టమయిన సమాధానం."*

*"మానవుని వద్ద ఉన్న మరణాన్ని జయించగలిగే ఆ ఒకే ఒక్క వజ్రాయుధమే బ్రహ్మచర్యం."*
              💖🔥💖🔥💖
                    💖🕉️💖
         

శ్రీరమణీయం: మనం ఏమి కోరుకోవాలి ? ఏమి కోరుకోకూడదు అనేది ఎలా తెలుసుకోవాలి !?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"475"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"మనం ఏమి కోరుకోవాలి ? ఏమి కోరుకోకూడదు అనేది ఎలా తెలుసుకోవాలి !?"*

*"అవగాహన లేకుంటే మన కోరికలు ఎంత అసమంజసంగా ఉంటాయో అర్ధం అవుతుంది. ఒక వృద్ధ వితంతువు ఒకరోజు మహాతాత్వికులు జిడ్డు కృష్ణమూర్తిగారి వద్దకు వచ్చి మరణించిన తన భర్తను తలుస్తూ విలపించింది. తిరిగి తన భర్త సాంగత్యం కావాలనిపిస్తుందని చెప్పింది. అప్పుడు కృష్ణమూర్తి గారు "నీకు పెళ్ళినాటి పాతికేళ్ళ భర్త కావాలా ? పిల్లలతో సరదాగా గడిపిన నడివయసు భర్త కావాలా ? చనిపోయేముందున్న వృద్ధాప్యపు భర్త కావాలా ? అని ప్రశ్నించారు. ఆలోచిస్తే ఈ మాటల్లో ఎంతో గూడార్ధం దాగివుంది ! మనం కోరుకునే విషయాలు ఎంత అసమంజసంగా ఉంటాయో అర్ధం అవుతుంది. పాతికేళ్ళ నాటి తన భర్తవస్తే ఆమె అతనితో సహజీవనం చేయలేదు. నడివయసుతో వచ్చినా అదే సమస్య ఎదురవుతుంది. వృద్ధుడిగా వస్తే తిరిగి మరణం తప్పదు. కాబట్టి మనం కోరుకునే విషయంలో మనకే అవగాహన ఉండదన్న విషయాన్ని కృష్ణమూర్తిగారు సున్నితంగా చెప్పారు !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
          

16. ఆత్మ జ్ఞానం, మోక్షమార్గం

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 🔥 *"16"* 🔥
   🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
   🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
     💖🔥💖🔥💖🔥💖
           💖🔥🕉🔥💖
                 💖🔥💖
                       💖
*"ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు "*

*"చివరిగా మోక్షాన్ని పొందడానికి మానవుడు ఎలా ప్రయత్నించాలి అనేది చెప్పుకుందాం."*

*"ఒకడికి పట్టు వస్త్రాలు లభించలేదని ఉన్న వస్త్రాలను వదులుకోడు కదా."* 

*"పట్టు వస్త్రాలు లభించేంతవరకూ ఉన్న వస్త్రాలను కట్టుకుంటాడు."* 

*"అలాగే మోక్షం లభించేంత వరకూ మహా మహా జ్ఞానులకే శరీర భ్రమ కొద్ది కొద్దిగా అయినా నిలిచి వుంటుంది."* 

*"శరీర భ్రమ ఉన్నంతవరకు ఆహరం, గృహం, నీరు లాంటివి ఎవరికయినా కావలసిందే."* 

*"వాటికొరకు మానవుడు ప్రయత్నించాల్సిందే."* 

*"అలా కాకుండా ఏదో సుఖాన్ని పొందాలి మరేదో సాధించాలి ఇంకేదో పొందాలి  నేను అంతటి వాణ్ని కావాలి ఇంతటి వాణ్ని కావాలి గొప్ప ధనవంతుణ్ణి కావాలి అని అనుకుంటూ ధనం కొరకు ప్రయత్నించకూడదు."* 

*"అలాంటి భావనలన్నీ మనసులోంచి తొలగించి వెయ్యాలి."* 

*"మోక్ష్యం లక్ష్యంగా కలిగినవాడు ధనంలేని పేదవాడయితే కేవలం ఆహారం కొరకు మాత్రమే కర్మలు చెయ్యాలి."* 

*"శరీర లక్షణాలయిన కామం, క్రోదం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే లక్షణాలను విడచిపెట్టాలి. మోక్షం లక్ష్యంగా కలిగిన వ్యక్తికి భార్యా, పిల్లలు ఉన్నారనుకుందాం. అప్పుడు వారి ఎడల అతడు ఎలా మెలగాలి అంటే!"* 

*"వాళ్ళను రక్షించడం అతడి కర్తవ్యం కనుక ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాలి."*

*"నా భార్య, నా పిల్లలు అనుకుంటూ ప్రేమ, మోహం అధికం చేసుకోగూడదు."* 

*"గొప్పలకు పోకుండా తక్కువ ఖర్చుతో పిల్లలను చదివించడం, వారికి కూడా తనకు తెలిసిన ధర్మం, మోక్షం గురించి చిన్నతనం నుంచే తెలియచేస్తూ వారిలో కూడా ప్రపంచ మోహాన్ని తగ్గిస్తూ, ఇక వారిఎడల తన కర్తవ్యాన్ని నెరవేర్చడం కొరకు మాత్రమే ధర్మ మార్గంలో డబ్బు సంపాదించాలి."*

*"మనం సంపాదించే డబ్బుని పరులు నిందించకపోవడమే ధర్మమార్గం."* 

*"ఇక అనేక లోకులు అనేక విధాలుగా ప్రదర్శించే గొప్పలను మనమూ ప్రదర్శించాలని భావిస్తూ మనకేం అవసరమో ఎంత అవసరమో తెలీని స్థితిలోకి వెళ్ళిపోతూ ఎక్కడో ఒక అగాధంలో కూలకుండా జాగ్రత్త వహించాలి."* 

*"మనకు చలి వేస్తె అగ్ని వద్దకు వెళ్లి తగినంత దూరంలోనే నించుని చలి తీవ్రతను తగ్గించుకుంటాం."* 

*"అంతేగాని చలి వేస్తోందని అగ్నిలోకి దూకము గదా!"*

*"మనకు దాహం అనిపిస్తే నది వద్దకు వెళ్లి దాహం తీరడానికి మాత్రమే కొంచెం నీరు తాగుతాముగాని నదిలోకి దూకం గదా!"*

*"ఈ విశ్వంలో ఎంతో గాలి ఉన్నా మనకు అవసరమయినంతే పీల్చుకుంటున్నాం."* 

*"ఇన్ని విషయాల్లో మనకు ఎంతవసరమో తెలుసుకుని అంత మాత్రమే స్వీకరిస్తున్నాం."* 

*"కానీ ఈ ధనం దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనకు అది ఎంత అవసరమో తెలుసుకోలేక శరీరం యొక్క విలువయిన ఆయుష్షు అంతా డబ్బు సంపాదించే కార్యక్రమాలకే వెచ్చించి చివరి రోజుల్లో సంపాదించిందంతా చూసుకుంటూ నేను జీవితం మొత్తం కష్టించి సంపాదించిందంతా ఎవరెవరో తింటున్నారు అని లోన ఏడుస్తూ ఒక రోజు ఈ శరీరంతో పాటు పతనం అవ్వడం జరుగుతోంది."* 

*"ఇదంతా ఎంత విచారకరం."* 

*"డబ్బు లేనివారికి కొంత డబ్బవసరం."* 

*"డబ్బు ఉన్నవారికి డబ్బెందుకు?"* 

 *"కాలాన్నంతా మోక్షం కొరకు ఉపయోగించుకోవచ్చు గదా?"*

*"ఈ లోకంలోని జనులు తమ జీవితకాలమంతా చెమటోడ్చి సంపాదించిన దానిలో 99% ఇక్కడే వదిలేసి మరణంతో పర లోకాలకు వెళ్ళిపోవుచున్నారు."* 

*"విచిత్రం ఏంటంటే 99% ఇక్కడే వదిలెయ్యాల్సిన సంపదల కొరకు మానవుడు తన జీవితకాలంలోని 99% ఆయుష్షును ఖర్చు చెయ్యడమే."* 

*"ఇదెంతటి విచారకరం."*

*"మానవుడి ఈ అమాయకత్వం గమనించిన జ్ఞానులు అతడికి నచ్చ చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు."*

 *"కానీ మానవుడికేమో ఇదంతా చెవికెక్కడం లేదు."* 

*"అతడి దారి అతడిదే."*

*"అలాంటి మోహంలో వున్న వారు ధనమార్గం నుంచి “ఆత్మ” మార్గంలోకి మళ్ళాలని ఆశిద్దాం."*

*"అలానే మానవుడు కేవలం త్యాగం వల్లనే ఆత్మను చేరుకోగలడు."* 

*"స్వార్దబుద్ధి కలిగివున్నవారు ఆత్మలోకి ప్రవేశించలేరు."* 

*"త్యాగం అంటే అర్ధం ఇవ్వడం."* 

*"స్వార్ధం అంటే పొందడం."*

*"ఇచ్చేవాడు అన్ని బంధాలనుంచి విముక్తుడవుతాడు."* 

*"పొందేవాడు పొందబడేవాటితో బందింపబడతాడు."* 

*"తనలోని స్వార్ధంతో తనను తాను బంధాలలో బంధించుకునేవాడికి ఇక ముక్తి ఎక్కడిది."*

*"అలానే రాజ్య అధికారం, వృత్తి నైపుణ్యం ఉన్నవాళ్లు వాటిని ప్రజలకు సేవ చెయ్యడానికి మాత్రమే ఉపయోగించాలి."* 

*"ఆ నిస్వార్దసేవ అనే త్యాగం అతడిని ఆత్మ అనే బ్రహ్మానందం వద్దకు చేర్చి అందులో అతడికి శాశ్వతమయిన స్థానాన్ని ప్రసాదిస్తుంది."*

 *"అలా కాకుండా అనారోగ్యంతోనో లేక మరేదో కష్టంతోనో సహాయాన్ని అర్ధించి వచ్చే వారి వివశతను సొమ్ముగా మార్చుకోవడానికి ఎవరయితే ప్రయత్నిస్తారో అలాంటివారు ఈ శరీరాన్ని కోల్పోయాక నీచమయిన శరీరాలను పొంది ఎంతో దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుందని అందరూ గ్రహించాలి."* 

*"ఎందుకంటే ఎవరి కర్మలకు వారే భాద్యులు."*

*"కర్మలు సత్కర్మలు కానివ్వండి లేదా దుష్కర్మలు కానివ్వండి"*

*"ఆయా కర్మల ఫలం మాత్రం తప్పక ఆ కర్మలు చేసినవాడు అనుభవించాల్సిందే."* 

*"ఉదాహరణకు ఒక అనారోగ్యంతో వచ్చిన రోగి వివశతను ఒక వైద్యుడు ధనం సంపాదించడానికి అవకాశంగా మార్చుకుని ఆ రోగినుంచి అధిక మొత్తాన్ని పొంది ఆ డబ్బుతో ఈ లోకంలో ఏవేవో కొన్ని సుఖాలను అతడు అతడి సంబంధీకులు తాత్కాలికంగా ఇప్పటికి మాత్రం అనుభవించవచ్చేమో!"* 

*"కానీ రోగబాధతో వచ్చిన రోగికి సేవ చేసి ఆ సేవకు తగ్గ ధనం మాత్రమే తీసికోవాల్సిన వైద్యుడు అలా చెయ్యకుండా రోగి యొక్క రోగ బాధ అనే అతడి వివశతను అతడినుంచి అధిక ధనం గుంజుకోవడానికి ఒక అవకాశంగా మార్చుకుని అధిక ధనాన్ని రోగినుంచి పొందడం అనేది పరమ పాప కర్మ అవుతుంది."* 

*"ఆ పాపకర్మ యొక్క సంస్కారం అతడి చిత్తంలోకి వెళ్లి చేరిపోతుంది."*

*"ఈ లోకంలో కనిపించే పశు, పక్షి, కీటకం లాంటి అనేక ఆకారాలతో కూడిన శరీరాలు, జన్మలు అనేవన్నీ ఏర్పడింది గతజన్మలలోని ప్రాణుల కర్మలనుంచి ఏర్పడిన చిత్తంలోని సంస్కారాల వల్లే."*

*"మితిమీరిన స్వార్ధం, లాభం కోసం మానవుడు చేసే చెడ్డ కర్మలవల్ల చెడ్డ సంస్కారాలు అతడి చిత్తంలో చేరి పశు, పక్షి, కీటకం లాంటి జన్మలకు కారణమవుతూ ఉంటాయి."* 

*"మానవుడు తన కపట తెలివితేటలతో అసత్యాన్ని సత్యంగా మార్చి ఈ లోకం మొత్తాన్ని అయినా నమ్మించగలడేమో గాని అతడి ఆత్మను అతడు మభ్యపెట్టలేడు."* 

*"మానవుడు చేసే ప్రతి కర్మ యొక్క సంస్కారం నేరుగా అతడి చిత్తంలోకి వెళ్ళిపోతుంది."*

*"అతడు తన చెడ్డ కర్మలను కపట తెలివితో మంచివిగా మార్చి లోకాన్ని నమ్మించినట్లుగా అతడియొక్క ఆత్మను నమ్మించి ఆ పాపకర్మను పుణ్యకర్మగా మార్చి తన చిత్తంలోకి పంపించలేడు."* 

*"కాబట్టి ఒక డాక్టర్ అయినా ఒక లాయర్ అయినా ఒక అధికారి అయినా లేక రాజ్యాన్ని పాలించే ఒక చక్రవర్తి అయినా ఒక్క నిష్కామకర్మతోనే ముక్తిని పొందగలరు."* 

*"ఏదో భరించలేని తీవ్ర కష్టంతోనో లేక తీవ్ర అనారోగ్యంతోనో వచ్చే ప్రాణులను ఎవరయితే “నేను మిమ్ములను రక్షించగలను అధైర్యపడకండి” అని ధైర్యం చెప్పి వారికి జీవితం మీద తిరిగి నమ్మకం కలిగించి వారి రోగానికి వైద్యం చేసి వారియొక్క రోగబాధను తొలగించి ధర్మ మార్గంలో వారినుంచి వృత్తి సేవకు తగిన ధనాన్ని మాత్రమే స్వీకరిస్తారో అలాంటివారు నేరుగా మోక్షాన్ని పొందుతారు."*

 *"అలాంటి మహా పవిత్రులకు సకల దేవతల ఆశీర్వాదాలు అన్ని సమయాలలోను ఉంటాయి."* 

*"అలాంటి వారు చేసే పవిత్ర సేవ వారికి చెందిన పది జన్మల పూర్వీకులకు మరియు వర్తమానంలోని అతడి రక్త సంబందీకులకు ఇంకా వారినుంచి రాబోవు పది జన్మల వారికి గూడా స్వర్గలోకాలకు చేరే సౌభాగ్యం ప్రసాదిస్తుంది."*

*"పవిత్ర సేవకు అంతటి శక్తి ఉంది."*

*"ఇక పది పైసల వృత్తి సేవకు తొంబై పైసలు వసూలు చేసే నీచుల యొక్క జన్మల గురించి చెప్పాల్సి వస్తే అలాంటివారి రాబోవు నీచ జన్మలకు అంతు అనేదే ఉండదని మాత్రం చెప్పగలము."* 

*"అలాంటి వారు ఇప్పటి ఈ శరీరం ఒకరోజు కోల్పోయాక ఆ తర్వాత జరుగబోవు తీవ్ర దుఃఖ పరిణామాలను ఇప్పటికయినా గ్రహించి ముక్తిని ప్రసాదించే త్యాగ మార్గంలోకి వెంటనే రావలసిందని జ్ఞానులు ఆహ్వానం పలుకుతున్నారు."*
            💖🔥💖🔥💖
                  💖🕉️💖
 🕉 *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏🌷🙏

*భగవాన్ శ్రీ రమణ మహర్షి* సమాధానాలు:

💥ప్రశ్న: మా అజ్ఞానం వల్ల మిమ్మల్ని మళ్లీ అడుగుతున్నాం.
మమ్మల్ని క్షమించి, సమాధానం ఇవ్వమని శ్రీ భగవానుని ప్రార్థిస్తున్నాము. 
మనస్సు నుండి విముక్తి పొందాలంటే ఆధ్యాత్మిక సాధన [అభ్యాస] తప్పక చేయాలని చెబుతారు.
ఇది ఎలా చేయాలి?

భగవాన్: 'నాశనము చేయవలసిన మనస్సు ఎవరిది?' అని మనస్సుతో విచారించడమే మనస్సు నుండి విముక్తి పొందే అభ్యాసము. 

ప్రశ్న: నేను ఎవరు? నాకు తెలియదు.

భగవాన్: మనం ఎవరో కూడా తెలియకుండానే మనం ఇంకేదో సాధించాలనుకుంటున్నాం. 
మనం సాధించాలనుకున్నది మనం ఇప్పటికే ఉన్నదే. 
మనకు అనుభవానికి వచ్చిన ఏదైనా పరిస్థితి లేదా స్వర్గలోకపు అనుభవం లాంటిది ఏదైనా చివరికి మళ్లీ వెళ్లిపోతుంది. వచ్చి పోయేది నేను కాదు. 
ప్రతి ఒక్కరి అనుభవంలో ఎప్పుడూ ఉండేదే మన నిజమైన నేను అది మోక్షం.

🙏🌷🙏 *శుభం భూయాత్*  🙏🌷🙏

అంతర్యామి - 33* 🥀 *వినయమే విజయగానం* 🥀

 *అంతర్యామి - 33*
      🥀 *వినయమే విజయగానం* 🥀
             ✍️ *వెంకట్ గరికపాటి* 
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️

మనిషి ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా, వినయం లేకపోతే - ఆ మనిషి సాధించిన ఉన్నతి కానీ, చదువుకున్న చదువు కానీ శోభించవు. మనిషి ఎండలోగానీ, వానలోగానీ ఇబ్బంది పడకుండా గొడుగు ఎలా రక్షిస్తుందో, ఆదే విధంగా మనిషికి వినయం అన్ని సందర్భాల్లోనూ, సర్వవేళల్లోనూ రక్షకవచంగా నిలుస్తుంది. *'విద్యాదదాతి వినయం'* అనేది ఆర్యోక్తి. 

నిజమైన వినయంతో చరించి, జనులను కార్యాలను సాధించమని తెలపడమే విద్య పరమార్ధం.  విద్యవల్ల పండితుడు గర్వించక వినయాన్ని కలిగి ఉంటేనే ఆ విద్య ఉన్నతమైనది ఆవుతుంది. అటువంటి ఉన్నత విద్యను కలిగి ఉన్నవాడే జగతిలో ఉత్తముడిగా నిలిచి, జనహితానికి పాటుపడగలడు.

శ్రీరామచంద్రుడు దశరథ చక్రవర్తి కుమారుడే అయినా, ఎడతెగని వినయాన్ని ఆభరణంగా కలిగినవాడై, నిరాడంబరంగా మహర్షి విశ్వామిత్రుడితో వనాల్లో పాదచారియై చరించి, ఆయన తల పెట్టిన యజ్ఞసంరక్షణా విధిని నిర్వర్తించాడు. ఆ క్రమంలోనే అనితర సాధ్యమైన ఎన్నో దివ్యాస్త్రాలను విశ్వామిత్రుడు ఉపదేశించగా వినయశీలియై సాధించాడు.

మహాబలశాలి అయిన ఆంజనేయుడు అతివిశాలమైన జలధిని లంఘించి, సింహికను భంజించి లంకను చేరి సీతమ్మను దర్శనం చేసుకున్నాడు. ఆ తరవాత ఆయన పలికే మాటలు- హనుమ వినయ సంపదకు నిలువెత్తు అద్దం పడతాయి. సీతమ్మతో హనుమ, అమ్మా! నేను నిన్ను అన్వేషించడానికి నియోగితుడైన సామాన్యుడిని. సాధారణంగా లోకంలో ఏదన్నా కార్యాన్ని తల పెట్టినప్పుడు ముందుగా తక్కువబలం ఉన్నవారిని వినియోగిస్తారన్న విషయం నీకు తెలుసు కదా! ఆ విధంగా నిన్ను వెదికే క్రమంలో నేను ఈ లంకానగరికి వచ్చాను. నన్ను మించిన మహాబలశాలురు సుగ్రీవుడి సైన్యంలో ఎందరో విరాజిల్లుతున్నారు. వారితో కూడి శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై లంకకు వచ్చి రావణుణ్ని జయించి, నిన్ను చేపట్టగలడు. అంటూ ఎనలేని వినయంతో పలుకుతాడు. దైన్యస్థితిలో ఉన్న సీతాదేవికి శ్రీరాముడి రాకపై, విజయంపై అపార విశ్వాసాన్ని కలిగిస్తాడు. ఒక దూతగానే గాక, కార్యసాధకుడి వర్తనలో చూపవలసిన వినయం హనుమలో మనకు ఎన్నో రామాయణ ఘట్టాల్లో అత్యున్నతంగా దర్శనమిచ్చి, మార్గదర్శనం చేస్తుంది. 

విద్యాధికులకంటే, బలవంతులకంటే వినయసంపన్నులే అప్రతిహత విజయాలను సొంతం చేసుకున్న సంఘటనలు కోకొల్లలుగా మనకు చరిత్రలోనూ దర్శనమిస్తాయి.

అదే నీతి, స్ఫూర్తి పిల్లల కథల్లోనూ ప్రతిఫలిస్తాయి. కుందేలు, తాబేలు కథ - వినయంగా వర్తించడం వల్ల కలిగే ప్రయోజనాన్ని మనకు సాక్షాత్కరింపజేస్తుంది. ఒకసారి ఒక తాబేలు, కుందేలుతో పందెం వేసుకుని, ఎవరు ముందుగా నిర్దేశిత గమ్యాన్ని చేరగలిగితే వాళ్లదే విజయం అన్నప్పుడు - కుందేలు గర్వంతో విర్రవీగింది. నిదానపు నడకకు మారు పేరైన తాబేలు తనను ఏ విధంగానూ గెలవలేదని భావించి, సగం దూరం దాటాక నిద్రించింది. తాబేలు ఎటువంటి తొట్రుపాటూ లేక, ముందుకు సాగి గమ్యం చేరి విజయాన్ని సాధించింది.

వినయంతో కూడిన విద్య మనలో నిలువెల్లా నిండినప్పుడు విశ్వంలోని ప్రతి అంశాన్నీ సమదృష్టితో చూస్తూ, నియతితో ముందుకు సాగగలమంటుంది భగవద్గీత. అది అక్షర సత్యం. అందరిలో సమభావం తొణికిసలాడితే, ఈ ప్రపంచమంతా ఒక ఆనందాల పొదరిల్లుగా, శుభాలతో నిండి వర్ణరంజితమైన హరివిల్లుగా పరిఢవిల్లుతుంది.

*Courtesy* : *ఈనాడు*
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ:*

గృహస్థుడు

 🪔🪔 గృహస్థుడు🪔🪔

🌹మన సనాతన ధర్మం మానవ జీవితాన్ని నాలుగు దశలుగా విభజించింది. ఏ దశలో ఏ విధి నిర్వహించాలో నిర్దేశించింది. ప్రతివ్యక్తీ తన జీవితాన్ని తాను చక్కగా అనుభవిస్తూనే సమాజానికి సేవ చేయడానికి ఉపయోగపడేలా ఒక మంచి వ్యవస్థను ఊహించింది. దాని ప్రకారం మనిషి జీవితాన్ని వయోధర్మాన్ని బట్టి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలనే నాలుగు దశలుగా విభజించింది. ప్రతిదశలోనూ వ్యక్తి తన వ్యక్తిగత, సామాజిక బాధ్యతల్ని నిర్వహిస్తూనే జీవిత ధ్యేయాన్ని సాధించుకోవడానికి కృషిచేసే అవకాశం ఉంది.

🌹సన్యాసాశ్రమం అందరికీ సాధ్యం కాదు. బ్రహ్మచర్యం తరవాత సన్యాసాశ్రమం తీసుకున్నవారూ అరుదుగా ఉన్నారు. ఆధునిక కాలంలో వానప్రస్థాశ్రమం ఉనికిని కోల్పోయింది. పూర్వకాలంలో రుషులు, రాజర్షులు ఉండేవారు. కొన్ని మతాలు, భావనలు సన్యాస జీవితాన్ని ప్రోత్సహిస్తాయి. సంసార జీవితాన్ని అంతగా అంగీకరించవు. భార్యాబిడ్డలు ఆధ్యాత్మిక జీవితానికి అడ్డంకి అని భావించేవారు అన్ని కాలాల్లోనూ ఉంటారని చరిత్ర గతిని చూసినప్పుడు బోధపడుతుంది. 

🌹వివాహం చేసుకున్నవారు యోగసాధనకు పనికిరారని భావించేవారూ ఉన్నారు. గృహస్థ జీవితానికి, ఆధ్యాత్మిక సాధనకు పొంతన కుదరదనేవారు ఉన్నారు. కానీ, సనాతన సంప్రదాయాన్ని పరిశీలించినప్పుడు ఈ అభిప్రాయం ఆధారం లేనిదని తెలుస్తుంది.

🌹వేదమార్గాన్ని దర్శించిన రుషుల్లో పవిత్రమైన గృహస్థ జీవితాన్ని గడిపిన వారెందరో ఉన్నారు. వేద ధర్మాన్ని అనుసరించిన రుషులు చాలా మంది నాలుగు ఆశ్రమాల నిర్వహణలో జీవితం పరిపూర్ణత చెందాలని దర్శించి నిర్దేశించినవారే. కొందరు మాత్రం తమ స్వభావాలను బట్టి గృహస్థాశ్రమాన్ని స్వీకరించక ఆజన్మ బ్రహ్మచారులుగా ఉండేవారు. అయితే వారు తమ ప్రణాళికకు తగిన మార్గాన్ని అనుసరించారుగాని, గృహస్థాశ్రమ స్వీకరణ దోషమని చెప్పలేదు.

🌹 గృహస్థాశ్రమం మనిషి జీవితంలో కీలకదశ. సమాజ జీవితానికి కేంద్రం గృహస్థాశ్రమం. దాని ఆధారంగానే మిగిలిన జీవన శాఖలు పెరిగి వృద్ధి చెందుతాయి. అందరూ ఆ కల్పవృక్షాన్ని ఆశ్రయించి బతుకును కొనసాగిస్తారు. గృహస్థ ధర్మానికి మూలం కుటుంబం. కుటుంబ ధర్మానికి మూలాధారం దాంపత్య ధర్మం. కాలగతిలో ఎన్ని పరిణామాలు ఎదురవుతున్నా ఈ ధర్మమే పరంపరను నిలబెట్టింది.

🌹బ్రహ్మచారులకు, భిక్షువులకు, సాధు సన్యాసులకు, అంగవికలురకు పోషణ స్థానం గృహస్థుడే. | గృహస్థుడి వల్లనే మిగిలిన ఆశ్రమాలవారికి సుఖజీవనం సాధ్యమవుతోంది. గృహస్థుడు తన ధర్మాన్ని ఏమాత్రం అలక్ష్యం చేసినా సమాజ జీవనం అస్తవ్యస్తమవుతుంది. వైదిక సంస్కృతి గృహస్థుడికి అగ్ని ఉపాసన నిత్యవిధిగా పేర్కొంది. అతడు పంచయజ్ఞాలు నిర్వహించవలసి ఉంది. తన ఉనికికి, మనుగడకు కారణమవుతూ దృశ్యంగా, అదృశ్యంగా ఉన్నవాటన్నింటికీ మనిషి కృతజ్ఞత ప్రకటించడమే ఈ యజ్ఞాల లక్ష్యం. 

🌹అవి దేవ, పితృ, భూత, మనుష్య, బ్రహ్మ యజ్ఞాలు. దేవతల పట్ల కృతజ్ఞత ప్రకటించడం దేవయజ్ఞం. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతా ప్రకటనం పితృయజ్ఞం. ఇది తర్పణ శ్రాద్ధాదుల ద్వారా జరుగుతుంది. తల్లిదండ్రుల స్థానం దేవతలతో | సమానమైనదిగా ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతిలో మనతోపాటు పెరుగుతున్న ప్రాణులు మన జీవనానికి సహకరిస్తున్నాయి. ఆ జీవకోటికి ఆహారం అందించడాన్ని 'బలిహరణం' అంటారు. మనుష్య యజ్ఞమంటే అతిథి సత్కారం. బ్రహ్మయజ్ఞం అంటే వేదాధ్యయనం.

🌹కాలంతోపాటు ఎన్నో వికృతులు ప్రవేశించి కుటుంబ జీవితం పూర్వపు ఉన్నతిని కోల్పోతోంది. ధర్మశాస్త్రానుసారం గృహస్థాశ్రమం నిర్వహించగలిగినప్పుడు సమాజంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. 
🌹అదే భారతీయ చింతన.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 

శివాద్వైతం

 *శివాద్వైతం*
             ✍️ డా. శ్రీ గరికపాటి నరసింహారావు గారు.
⚜️🌹🪷🌹🪷🕉️🌹🪷🌹🪷🔱

🔱 *అన్నింటిలోనూ తానై ఉన్నవాడు... జగమంతా తానే అయినవాడు శివుడు. యోగమూ శివుడే... భోగమూ శివుడే. ఆయనది ప్రధానంగా జ్ఞానదృష్టి, ఆయనకు ఎక్కువ తక్కువల పట్టింపు లేదు. సమభావమే ఆయన మతం.* ⚜️

🔱┉┅━❀🕉️❀┉┅━⚜️

⚜️ జీవుడికీ దేవుడికీ భేదం లేదన్నారు ఆదిశంకరులు. ఆ అభేదం... ఆ అద్వైతం... ఆ జ్ఞానాన్ని పొందడానికే శివరాత్రిని పెద్దలు ఏర్పరిచారు. ఆనాడు తిండి, బట్ట, నిద్ర అనే ప్రాధమిక అవసరాలను వదిలిపెట్టి శివధ్యానం చేయాలి. సదాశివుణ్ణి సోహం భావనతో పూజించాలి. మనసులోని భేదభావాలు పోవాలి. అంతర్ముఖులమై శివదర్శనం చేయాలి. 

🔱 *నమశ్శివాయ* అనే పంచాక్షరిని ప్రాణవాయువుకు జోడించాలి. రేచక, పూరక, కుంభకాలతో మంత్రాన్ని జోడిస్తే దానిని మంత్రశాస్త్రంలో సగర్భజపం అంటారు. అలా కొద్దిసేపు జపం చేసినా చాలు... జపసాధన పరమార్గంగా లభించవలసిన మనశ్శాంతి మనకు తప్పకుండా లభిస్తుంది. అజ్ఞాచక్రంలో శివదర్శనం జరుగుతుంది. ఇదే మనోదృష్టి. కనులు మూసుకున్నా కనిపించేది. అదే నిజమైన శివదర్శనం.

⚜️ సదాశివుడు త్రయంబకుడు. పురాణాల్లో శివుడు మూడోకన్ను తెరిస్తే ప్రపంచం భస్మమైపోతుందని చెబుతారు. ఆ మాటకు అసలైన అర్థం ప్రపంచంలో ఉన్న భేదాలన్నీ పోతాయని. జ్ఞాన నేత్రం తెరుచుకుంటే మనలో దృష్టి మారుతుంది. మన గుండెలో ఉండే ఆత్మయే శివలింగం. దానిని దర్శించగలిగిననాడు అన్ని భేదభావాలు పోతాయి.

🔱 *'నేనే నీవని తెలుసుకో'* అని శివుడు మనకు బోధిస్తున్నాడు. పురాణకాలంలో ఒకనాడు ఇదే *మాఘ బహుళ చతుర్దశి* నాడు బ్రహ్మవిష్ణువులకు మహాగ్నిలింగంగా కనిపించాడు. ఆద్యంతాలు లేని తన తత్త్వాన్ని వారిముందు ఆవిష్కరించాడు. ఆ తత్వాన్ని భావనలోకి తెచ్చుకుంటే మన ఎదురుగా ఉన్న ప్రతిపదార్ధమూ శివుడు. వర్తమానంలోని ప్రతిక్షణమూ శివుడే. మనకు దక్కిన ప్రతి అనుభూతి శివుడే.

*Courtesy:* 'భక్తి' మాసపత్రిక

*సేకరణ:*

అరుణాచలం విహార యాత్ర కాదు మనల్ని పరమేశ్వరునిలో లయం చేసే తీర్థ యాత్ర

 *🌿🌼🙏అరుణాచలం వెళ్ళే భక్తులందరికీ ఒక మనవి ... పౌర్ణమికి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేవారు లక్షల్లో ఉంటారు, మన తెలుగు వారు కూడా వేలల్లో వస్తుంటారు అని అందరికీ తెలిసిన సంగతే ... మీలోనూ చాలా మంది చేసే ఉండచ్చు ... అయితే మనందరం కొన్ని విషయాలు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ... అసలు మనం అరుణాచల గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నట్లు ? అరుణాచల పర్వతం అంటే ఏమిటి ? అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే విధానం ఏమిటి ? *🕉️🚩🕉️
ఈ ప్రశ్నలకు సమాధానం మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది, అయినా కాస్త ఓపికగా పూర్తిగా చదివమని మనవి చేసుకుంటున్నాము. 

అరుణాచలం సాక్షాత్తూ శివుడే ఒక పర్వత రూపంలో ⛰️దర్శనమిచ్చే మహా క్షేత్రం, అటువంటి క్షేత్రంలో అడుగు పెట్టడం అంటే తండ్రి ఒడిలోకి చేరిన అనుభూతి కలగాలి ... మన నాన్న ఏదైనా పనిలో నిమగ్నమై ఉంటే, ఆయనకు మన వల్ల ఏ ఇబ్బంది కలుగకుండా ఎంత జాగ్రత్తగా నడుచుకుంటామో, అలానే ధ్యానంలో నిమగ్నమై ఉన్న పరమేశ్వరునికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అంత కంటే ఎక్కువ జాగ్రత్తగా నడుచుకోవాలి కదా ... గిరి ప్రదక్షిణ చేసే సాటి భక్తులకు కూడా ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలి .

⛰️ అరుణాచల గిరి ప్రదక్షిణలో మేము గమనించిన కొన్ని విషయాలు మా హృదయాన్ని కలచి వేశాయి ... ముఖ్యంగా మన తెలుగు వారు చేస్తున్న గిరి ప్రదక్షిణలో అనుకోకుండా నా చెవిన పడిన కొన్ని విషయాలు, నేనుగా కొంతమందిని అడిగి తెలుసుకున్న విషయాలు చాలా బాధను కలిగించాయి ... మన వాళ్ళు చేసే కొన్ని పనులు ఇంకా ఎక్కువ బాధ కలిగించాయి ... వాటిని మీ ముందు ఉంచుతున్నాము .

షుమారు 55 సంవత్సరాల వ్యక్తిని పలకరించాను, ఆయన చెప్పిన విషయాలు ... మాది ఫలానా ఊరు, నేను ఒక బ్యాంక్ లో పని చేస్తున్నాను, ఎక్కువ సేపు కూర్చుని చేసే పని కనుక కాస్త పొట్ట పెరిగింది, రోజు ఎంత వాకింగ్ చేసినా, ఇలా అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే కొంచెము ఎక్కువ సేపు వాక్ చేయొచ్చని అని ఇలా వస్తుంటాను .
ఇద్దరు తెలుగు👭 ఆడవారు నిదానంగా నడుస్తూ ఇలా మాట్లాడుకుంటున్నారు ( ఒక రెండు నిమాషాలలో వారి సంభాషణ ఇలా సాగింది ) ... మొన్న మా ఆడపడుచు కూతురి పెళ్ళికి వెళ్లినప్పుడు నేను కట్టుకున్న చీరే హైలైట్ అయ్యింది ... మా ఆడపడుచు నా చీర చూసి తెగ కుళ్ళుకుంది ... తన చెల్లెలి చేత ఎక్కడ కొన్నానని అడిగించింది . 

షుమారు 25 సంవత్సరాల వయసు గల నలుగురు 👬👬కుర్రవాళ్ళు ఉడికించిన వేరు శెనగ తింటూ, ఆ పొట్టును దారంతా వేసుకుంటూ వెళుతున్నారు .                  " ఆ పబ్లిక్ టాయిలెట్స్ అంత శుభ్రంగా ఉండవు, బయట కానిచ్చేస్తే హాయిగా ఉంటుంది రా ...",  అని స్నేహితునికి ఒకరి ఉచిత సలహా .

" ఊ ... త్వరగా నడువు అప్పుడే బాగా చెమట పట్టి కొవ్వు కరుగుతుంది, అని ఒకరు తన భార్యతో అంటున్నారు. 

ఇక్కడ అరటి పువ్వుతో వేడి వేడి వడలు🧆 వేస్తుంటారు అవి తింటే, ఎక్కడ ఉన్నా ప్రతి పౌర్ణమికీ వెతుక్కుంటూ అరుణాచలం వచ్చేస్తావ్ అని ఒకరు . 

🎋చెరకు గడలు తింటూ ఆ పిప్పిని రోడ్ మీదే ఊసేసే వాళ్ళు కొందరు ..., ఉడికించిన మొక్క జొన్న కంకులు తిని వాటిని రోడ్ మీద వేసే వారు కొందరు... , పుచ్చకాయ తిని ఆ తొక్కలను రోడ్ మీదే వేసేవారు కొందరు, కాళీ నీళ్ళ బాటిళ్ళు,🧂 కూల్ డ్రింక్ టెట్రా పాక్ బాటిళ్ళు రోడ్ పైనే,

ఇలాంటివి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి ... అరుణాచల పర్వతం అంటేనే సాక్షాత్తూ శివ స్వరూపమని, దేవతలు సైతం అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తుంటారని, కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనే గానీ కనీసం అరుణాచలం గురించి వినలేమనీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వంటి గురువులు తమ ప్రవచనాల ద్వారా చెప్పారు ... అటువంటి క్షేత్రానికి వెళ్లినప్పుడు మనం భక్తి శ్రద్ధలతో పాటుగా, ఆ క్షేత్ర పవిత్రతను, శుభ్రతను కాపాడాలా వద్దా చెప్పండి !

🤫మౌనంగానో, 👏నామ స్మరణ చేస్తూనో చేయాలి గానీ ఎప్పుడూ ఉండే ముచ్చట్లు మాట్లాడుకోవడానికి అరుణాచలం ఎందుకు వెళ్ళడం .

మార్గ మధ్యలో ఏదైనా తినడం తాగడం సహజమే కానీ కేవలం తినిన తరువాత, తాగిన తరువాత ఆ వ్యర్ధాలను చెత్త కుండీలో వేయడం మన కనీస బాధ్యత కాదా ! 

వాకింగ్ కోసమనో, కాసేపు సరదాగా స్నేహితులతోనో, బంధువులతోనో కలిసి నాలుగు రోజులు గడిపి రావడానికో, అరుణాచలం రావడం ఎందుకు ... అటువంటి వాటి కోసం ఎన్నో విహార యాత్రలు ఉన్నాయి కదా 

పబ్లిక్ టాయిలెట్స్ అంటే అవి శుభ్రంగా ఉండకపోవచ్చు, అవి అలా ఉండడానికి మనం కూడా కొంతవరకూ బాధ్యులమే, కొందరు అక్కడి టాప్ లను కనీసం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు, ఎవరైనా వాడుతుంటే వాటిలో నీళ్ళు తీసుకుని కనీసం మళ్ళీ కట్టేయకుండా వెళ్ళిపోతుంటారు ..   ప్రసాదంగా ఇచ్చినవి జాగ్రత్తగా కింద పడకుండా తినడానికి ప్రయత్నించాలి, పొరపాటున కింద పడినా, లేదా అది మనకు సహించకపోయినా ఎవరూ తొక్కకుండా, వాటిని తీసేసి చెత్త కుండీలలో వేయాలి కదా ... రోడ్ మీద ఎన్నో చోట్ల ప్రసాదాలు కింద పడి ఉంటాయి 

పువ్వులు 🌸💐🪷🌹అమ్మవారి స్వరూపం అవి ఎక్కడైనా నెల మీద పడి ఉంటే వాటిని తీసి ఎవరూ తొక్కని చోట వేయాలి .

క్షేత్ర పవిత్రతను మనమే కాపాడాలి, 🏘️మన ఇల్లు ఎంత శుభ్రంగా అందంగా ఉండాలని కోరుకుంటామో అంతకంటే అందంగా మన ఆలయం🛕 ఉండాలని కోరుకోవాలి, అందుకు మన వంతు కృషి చేయాలి .

🙏ఎవరి మనసైనా కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించండి, మార్పు మనలోనే , మనతోనే మొదలవ్వాలి, మీరు కూడా స్వచ్ఛమైన, పరిశుభ్రమైన అరుణాచలాన్ని చూడాలని ఆశిస్తుంటే ఇది అందరికీ షేర్ చేయండి, అందరికీ దీని ప్రాముఖ్యతను వివరించి చెప్పండి, మీవంతుగా అరుణాచలం స్వచ్ఛతను కాపాడేందుకు ప్రయత్నించండి, అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తున్నాము.

ఇది మన నినాదంగా పెట్టుకుందాం 

" అరుణాచలం విహార యాత్ర కాదు 
మనల్ని పరమేశ్వరునిలో లయం చేసే తీర్థ యాత్ర   🕉️🚩🕉️ 

🌹ఒక శిష్యుడికి మరొక శిష్యుడికి ఎంతో భేదం ఉంటుంది. 🌹ఈ శిష్యులు 4 విధాలుగా ఉంటారు

 🌹ఒక శిష్యుడికి మరొక శిష్యుడికి ఎంతో భేదం ఉంటుంది.

🌹ఈ శిష్యులు 4 విధాలుగా ఉంటారు

🌹వారిని తుపాకీ మందు, ఎండిన బొగ్గులు, ఎండు కట్టెలు మరియు తడి కట్టెలు, అని భగవాన్ శ్రీ రమణులు చెప్పారు.

🌹మొదటి రకం వారు ఒక మాటతో ఒక నిప్పు రవ్వతో తుపాకీ మందు వలె, అజ్ఞానం నుండి విడిపడతారు.

🌹రెండవ వారు, వారికి కొంత బోధ, కొంత స్వప్రయత్నం కావాలి

🌹మూడవ వారికి ఎంతో బోధ, శిక్షణ, అబ్యాసం కావాలి

🌹ఇక నాల్గవ వారికి వారి వారి పక్వాతా స్థితి అనుసరించి కొన్ని కొన్ని సాధనలు అవసరం అవుతాయి.

🌹కావున, చాలామంది శిష్యులు చాలా కాలం సాధన చేస్తే గాని ఆత్మ విచారంతో గమ్యం చేరలేరు.

🌹చాలా మంది విజయం పొందనందుకు నిరాశచెంది సాధనను మాని వేయ చూస్తారు.

🌹ఇటువంటి వారు భగవంతుని పై భక్తి ఒక్కటే సమాధానం.


సేకరణ : మహాయోగము, ఆంగ్లమూలం శ్రీ కే. లక్ష్మణ శర్మ, ఆంధ్రానువాదం శ్రీమతి శొంటి అనసూయమ్మ


........ కోటంరాజు శ్రీనివాసరావు, హైదరాబాద్. 

:::::::: కొనసాగడం ::::::::

 *:::::::::::: కొనసాగడం ::::::::::*
      

    ఏదైనాసరే కొనసాగాలి అనుకోవడమే  సమస్య.

   ఏదో ఒక అనుభూతి 
ప్రతి క్షణం మనకు కలుగుతూ
వుంటుంది.
  ఎప్పటికప్పుడు కలుగుతూ వున్న అనుభూతులలో ఎప్పుడైతే ఒకానొక అనుభూతి కొనసాగాలనో, కొనసాగ కూడదనో, సంభవించాలనో, సంభవించకూడదనో కోరుకుంటామో,
 అప్పటి నుండి  సమస్య మొదలు అవుతుంది .

   ఎందుకంటే కొనసాగడం మనం చేతిలో లేని పని .
  కొనసాగడం అంటే కాలం గడవటం. కాలం మన చేతి లోనిది కాదు.

*షణ్ముఖానంద 98666 99774*

శివుడు మహా దేవుడు

 *శివుడు మహా దేవుడు* 

పరమశివుడు అర్ధనారీశ్వరుడు. ఆదిభిక్షువు. భక్త వత్సలుడు. బోళాశంకరుడు. నిర్వికారుడు, నిరాకారుడు, నిరాడంబరుడు. ఇన్ని వేదాంత లక్షణాలున్న ఈశ్వరుడు ఏ శివక్షేత్రంలో చూసినా లింగాకారంలోనే కనపడతాడు కాని శరీరాకృతిలో దర్శనమివ్వడు. అదెలాగంటే ఒక వృత్తం తన ఆకారంలో చాలా గొప్పది. అది అనంతమైన మోతాదులో పెరుగుతూ వెళ్లినా దాని కేంద్రం ఒక్కటే. పరిపూర్ణ తత్త్వమనేది ఒక గోళానికి చెందింది. పరిపూర్ణమైన దానిలోని భాగాలన్నీ పరిపూర్ణాలే అని తెలుసుకోగలగడమే ఆధ్యాత్మిక సాధన! అందుకే పౌరాణికవేత్తలు సృష్టి యావత్తూ శివలింగమేనంటారు. అన్ని స్పందనలూ, చేతనలూ ఈశ్వరుడిలోనే, ఈశ్వరుడి వల్లనే అంటారు! అందుకే అటు అనంతం ఇటు అనంతం, òపైన అనంతం, కింద అనంతం చుట్టూ తిరిగి చూస్తే సర్వం లింగాకారమే... అదే శివతత్త్వం.

మహేశ్వరుని వంటి నిరాడంబరుడు మనకెక్కడా దర్శనమివ్వడు. గజచర్మం కట్టుకుంటాడు. చేతిలో కపాలం పట్టుకుని బిచ్చమెత్తుకుంటాడు. కాష్టాలవాడలో కాపురముంటాడు. విషపు నాగులను మెడనిండా మాలలుగా ధరిస్తాడు. రుద్రాక్షపూసల్ని వంటినిండా అలంకరించుకుంటాడు. ఆయన సిగలో చంద్రుడున్నాడని గొప్పలు పోదామంటే అదీ కుదరదు. ఆ శిరస్సున ఉండే చంద్రుడు వెన్నెల సోనలు కురిపించే నిండు చందురుడేమీ కాదు. సన్నని చంద్రరేఖ. పోనీ, సరైన వాహనమైనా ఉందా అంటే లేదు. ముసలి ఎద్దునెక్కి ఊరేగుతాడు. ఆయనని సేవించే పరిజనం ఏమైనా పెద్దవాళ్లా అంటే ప్రమద గణాలు, భూతగణాలే. అయితేనేం, వారితోనే ఆయన జగత్‌ ప్రసిద్ధుడయ్యాడు.

మహా విరాగి

ఎంత పేదవారయినా సరే, పెళ్లికి పట్టుబట్టలు కట్టుకుంటారు, వంటికి చందనాలు అద్దుకుంటారు. సుగంధ పరిమళాలతో కూడిన పూదండలను అలంకరించుకుంటారు. వేగంగా సంచరించే పక్షినో, జంతువునో వాహనంగా చేసుకుంటారు. పెళ్లికి అందరూ రాగలిగేందుకు అనువైన ముహూర్తాన్ని చూసి పగలు లేదా సాయంత్రం పెళ్లి పెట్టుకుంటారు. కానీ, పరమ విరాగి అయిన శివుడేమో పెళ్లికి కూడా గజచర్మమే కట్టుకు తిరుగుతాడు. ముసలి ఎద్దునెక్కి వూరేగుతాడు. ఏ వాసనా లేని తుమ్మిపూలు చాలంటాడు. బూడిద పూసుకు తిరుగుతాడు. ఒక విందూ లేదూ, వినోదమూ లేదు. తన భక్తులు తనకు నవకాయ పిండివంటలు వండి నివేదించనక్కరలేదు. కటిక ఉపవాసముంటే చాలంటాడు. తనకోసం ఒక పూట మేలుకుని ఉంటే మంచిదంటాడు.  

ప్రతి చర్యలోనూ అంతులేనంతటి అంతరార్థం

శివుణ్ణి దిగంబరుడంటారు. దిగంబరుడంటే దిక్కులే వస్త్రాలుగా కలిగినవాడని అర్థం. అందుకే ఆయన సర్వాంతర్యామి అయ్యాడు. లోకంలో ప్రతివారు కీడును పోగొట్టుకోవడానికి, సంపదలు పొందడానికి మంగళకర ద్రవ్యాలైన సుగంధ చందనాదులను ధరిస్తారు. ఇవి మళ్లీ కోరికలు పుట్టిస్తాయి. కోరికలు లేనివాడయిన శివునికి వీటితో పనిలేదు. అందుకే అన్నింటికీ దూరంగా ఉంటాడు. భాగ్యవంతుడు కాకున్నా కోరిన వారికి సకల సంపదలను ప్రసాదిస్తాడు. సంచరించేది శ్మశానంలోనే అయినా, లోకాన్నిటినీ శాసించగలడు. తనకే సంపదలూ లేకపోతేనేం, ఆయన అనుగ్రహమే గొప్ప సంపద. అంటే మనకు ఏమీ లేకపోయినా, అవతలి వారికి ఇవ్వాలన్న మనసు ఉంటే చాలనీ, పైపై ఆడంబరాలు లేకున్నా, గొప్ప కార్యాలు సాధించడానికి అదేమీ అడ్డం కాదన్నది ఆయన రూపంలోని, చర్యలలోని అంతరార్థంగా భావించాలి.   

అర్ధనారీశ్వరత్వం

శివుడెలా ఉంటాడో, ఆయన భార్య పార్వతి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఆయన గజచర్మమే చుట్టుకున్నా, ఆవిడ మాత్రం పట్టుబట్టలు కట్టుకుంటుంది. ఒంటినిండా నగలు ధరిస్తుంది. çశరీరానికి చందనం అద్దుకుంటుంది. సింహాన్ని వాహనంగా చేసుకుని నవరత్న ఖచిత సింహాసనంపై ఆసీనురాలవుతుంది. తనకు లేవు కదా అని ఆయన తన దేవేరి అయిన పార్వతిని పట్టుబట్టలు కట్టుకోవద్దనలేదు. ఆభరణాలు ధరించవద్దని కానీ, అలంకారాలు చేసుకోవద్దని కానీ శాసించలేదు. ఆమెను ఆమెగా ప్రేమించాడు. తన శరీరంలో సగభాగాన్ని ఆమెకు ఇచ్చేశాడు.

శివతత్త్వాన్ని అలవాటు చేసుకోవడమంటే నిరాడంబర జీవితాన్ని ఎంచుకోవడమేనని వేదాంతులు, పండితులు చెబుతారు. ఎందుకంటే అది అనుభవంలోకి వస్తే తప్ప అర్థం కాదు. శివుడంటే ఒక వ్యక్తా? అతనికి ఒక ఆకారం ఉన్నదా? ఎక్కడో ఫలానా ప్రదేశంలో కూర్చుని ఉన్నవాడా? కాదు. సమస్త విశ్వమూ శివుడే. దేనిలో నుంచి అంతా వచ్చిందో, దేనిలో అంతా జీవిస్తున్నదో, తిరిగి దేనిలోనికి అంతా లయమైపోతున్నదో అదే శివతత్వం. దీని నుంచి బయటకు వెళ్లడానికి వీలుకాదు. ఎందుకంటే సృష్టి అంతా శివుడే. ఆయన విశ్వరూపుడు. అదే సమయంలో ఆయన రూపం లేనివాడు, నిరాకారుడు. ఒకవైపు రుద్రమూర్తి. మరోవైపు బోళాశంకరుడు. సుందరేశుడు ఆయన. సౌందర్యానికి అధిపతీ ఆయనే.

అదే సమయంలో భయంకరమైన అఘోర రూపం కూడా ఆయనదే. ఆనంద తాండవంలో చైతన్య శీలతనూ, ధ్యానంలోని స్థిరత్వాన్నీ, చీకటినీ, వెలుగు నూ, అమాయకత్వాన్నీ, తార్కికబుద్ధినీ, దయాగుణాన్నీ.. అన్నింటినీ కలగలిపి ఒక్కటిగా పంచేదే శివతత్త్వం. ఇది ఒక లీల. విశ్వచైతన్యపు ప్రదర్శన. ఎలాగైతే నాట్యమూ, నాట్యకారుడూ విడివిడి గా ఉండలేరో.. అలాగే సృష్టి, సృష్టికర్త వేర్వేరు విషయాలు కావు. ఈ సత్యమే నటరాజ స్వరూపంలో కనిపిస్తుంది. ఈ రూపంలో పంచభూతాలు గోచరిస్తాయి. నటరాజు స్వయంగా చైతన్య స్వరూపం. 

****మనసు ను మన అధీనంలో ఉంచుకోవాలి

 మనసు ను మన అధీనంలో ఉంచుకోవాలి
                  ➖➖➖

 *ఈ కలియుగంలో ఇంద్రియములను, మనసును అదుపులో పెట్టుకోవడం చాలా కష్టము!*

*అర్జునుడంతటి వాడే 'చంచలం హి మనః కృష్ణా!' అన్నాడు. ఎలా అంటే ప్రాపంచిక విషయములు, కామవాంఛలు ఇంద్రియములను తమ వంకకు లాగుతాయి. మనసు ఇంద్రియముల వెంట వెళుతుంది. బుద్ధి నిస్సహాయంగా మిగిలిపోతుంది.* 

*దీనిని కట్టడి చేయాలంటే ఒకటే మార్గము. ధ్యానంలో కూర్చుంటే ఇంద్రియములను, మనసును నిగ్రహించవచ్చును. అప్పుడు బుద్ధి భగవంతుని యందు స్థిరంగా ఉంటుంది.*

*సాధారణంగా బయట ప్రపంచములో తిరుగుతున్నపుడు ఎన్నో వస్తువులను, విషయాలను, మనుషులను చూస్తుంటాము. మనసు వాటి మీద లగ్నం అవుతుంది. వాటిపై ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి కోరికగా మారుతుంది. ఆ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. కోపంలో ఏమి చేస్తున్నామో తెలియని మోహం ఆవరిస్తుంది. అప్పుడు విచక్షణా జ్ఞానం కోల్పోతాం. బుద్ధి పనిచెయ్యడం మాని వేస్తుంది. జీవితం సర్వనాశనం అవుతుంది.* 

*అదే మనసును మన వశంలో ఉంచుకుంటే ఈ విపరీత పరిణామములు సంభవించవు.*

*ధ్యానము వలన మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. మనస్సు ప్రసన్నంగా ఉంటే దుఃఖములు నశిస్తాయి. అప్పుడు బుద్ధి పరమాత్మయందు లగ్నం అవుతుంది. తద్వారా ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది.*
.

15. ఆత్మ జ్ఞానం, మోక్షమార్గం

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 🔥 *"15"* 🔥
   🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
   🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
     💖🔥💖🔥💖🔥💖
           💖🔥🕉🔥💖
                 💖🔥💖
                       💖
*"ఆత్మ జ్ఞానం / మోక్ష మార్గం / సృష్టి రహస్యం / ఏడు జన్మలు ఏమిటి ? / నేను అంటే ఎవరు ? / దుఃఖం ఎలా తొలగుతుంది ? / జ్ఞాన విచారణ / మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు "*

*"మనం వెళ్లి ఆ విగ్రహాలకు దణ్ణం పెట్టుకుని ఇక మన పని అయిపోయినట్లుగా భావించి తిరిగి వచ్చేస్తున్నాం.'"* 

*"అంటే మన ఉద్దేశ్యంలో భగవంతుడు అంటే ఒక వస్తువా?"* 

*"ఒక విగ్రహమా?"*

*"లేక ఒక మానవదేహమా?"* 

*"ఇవేవీ భగవంతుడు కాదని గ్రహించండి."*

*"భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇవన్నీ దారి చూపే మార్గాలు."*

*"మార్గాలు ఏర్పరచింది “భగవంతుడు” అనే లక్ష్యం చేరుకోవడానికి."*

*"అంతేగాని ప్రతిసారీ మార్గం వరకూ వెళ్లి లక్ష్యాన్ని వదిలేసి వెనక్కు మరలటానికి కాదు."* 

*"భగవంతుడు అంటే ఎప్పటికీ నాశనం అనేది లేనివాడు అనికదా అర్ధం."*

*"మరి ఈ లోకంలోని సకల వస్తువులు శరీరాలు అన్నీ కాలంతో పాటు నశించేవే కదా!"*

*"మరి నశించేవి భగవంతుడు ఎలా అవుతాయి?"* 

*"ఏది నశించదో అదే భగవంతుడు. ఏది నశించదు?"* 

*"ఏదయితే ఆకారం కాదో అది నశించదు."* 

*"అది ఏదంటే వెలుతురును చీకటి చూడగలదా?"* 

*చూడలేదు."* 

*"అలాగే చీకటిని వెలుతురు చూడగలదా?"*

*చూడలేదు."*

*"ఒకటి వుంటే రెండోది ఉండదు."* 

*"కానీ చీకటినీ వెలుతురునీ ఈ రెండింటినీ చూస్తూ ఇది చీకటి ఇది వెలుతురు అని ఏదయితే గ్రహిస్తోందో అదే ‘భగవంతుడు’."* 

*"అదే జీవులన్నింటిలోని “ఆత్మ”. ఆత్మకు వెలుతురు కనిపిస్తుంది."* 

*చీకటి కనిపిస్తుంది.*

 *కానీ వెలుతురుకి చీకటి కనిపించదు.*

*చీకటికి వెలుతురు కనిపించదు."* 

*"చీకటీ వెలుతురు అనేవి రెండూ నశించేవి."* 

*"వెలుతురు వస్తే చీకటి నశిస్తుంది."*

*"చీకటి వస్తే వెలుతురు నశిస్తుంది."* 

*"కానీ ఈ రెండింటినీ చూసేది నశించదు."* 

*"అదే ప్రాణులలోని “ఆత్మచైతన్యం”."*

*"తాను కనిపించకుండా అన్నింటినీ చూసేదే “భగవంతుడు” అంటే."*

*"మన ఇంటి పెరటిలో ఒక చెట్టు ఉంది.* 
*దాని కొమ్మలు పెరిగి ఇంటి వాకిలికి అడ్డు వస్తున్నాయి. అప్పుడు మనమేమి చేస్తున్నాం."*
   
        *"కత్తితో కొమ్మలను నరికి దారికి అడ్డు తొలగించుకుంటున్నాం."*

*"అలా కాకుండా ఓ వృక్షమా నీ కొమ్మలను వాకిలికి అడ్డుగా రానివ్వకు అని ఆ చెట్టు వినేటట్లు ఆజ్ఞాపించాం అనుకుందాం."*

*"ఆ ఆజ్ఞ వల్ల చెట్టు కొమ్మలు వాకిలికి అడ్డుగా రాకుండా మరొక వైపుగా వెళ్ళిపోతాయా?"* 

*"లేదు గదా. ఎందువల్ల?"* 

*"మన ఆజ్ఞ ఆ చెట్టు వినదు గనక."* 

*ఎందుకు వినదు?* 

*"ఎందుకంటే ఆ చెట్టు మనకంటే వేరయిన మనకు సంబంధం లేని బయటి వస్తువు."*

*"ఏదయితే మనం కాదో ఆ మనం కానిదాని యొక్క వృద్ది క్షయం కూడా మన ఆజ్ఞకు లోబడి ఉండదు."* 

*"ఈ సిద్దాంతం ప్రకారం ఇప్పుడు మానవ శరీరం యొక్క వ్యవహారం చూద్దాం."*

*"మానవుడు అంటే ఈ శరీరం కాదు అని లోకంలోని ఎందరో జ్ఞానులు సత్యం చెబుతున్నా కాదు కాదు “నేను అంటే నా ఈ శరీరమే” అని మనం నమ్ముతున్నాం గదా!"* 

*"ఇప్పుడు ఈ శరీరం దగ్గరకే వద్దాం."*

*"ఈ శరీరంలో జుట్టు పెరిగి ముఖానికి అడ్డుగా వస్తుంటే మనం వెళ్లి కత్తిరించుకుంటున్నాం."*

*"చేతి వ్రేళ్ళ గోళ్ళు పెరిగితే కత్తిరించుకుంటున్నాం."* 

*"మరి మనం ఈ శరీరమయితే ఈ శరీరంలోని  వెంట్రుకలు, గోళ్ళ పెరుగుదల తరుగుదల మన అదుపులో ఎందుకు ఉండటం లేదు?"* 

*"ఈ శరీరంలోని తల వెంట్రుకలు తెల్లబడితే అద్దంలో చూసుకుని అయ్యో నా వెంట్రుకలు అప్పుడే తెల్లగా అయిపోయాయా!"* 

*"అని భయపడుతూ రంగు వేసుకుంటున్నాం."*

*"అంతేగాని అవి తెల్లగా మారకుండా మనం ఆపగలుగుతున్నామా?"* 

*"పళ్ళు కదులుతుంటే అయ్యో నా పళ్ళు అప్పుడే ఊడిపోతున్నాయా అని భయపడుతున్నాం."*

*"ఈ శరీరం బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వృద్దాప్యం లోకి ప్రవేశిస్తుంది."* 

*"ప్రతి మానవుడు యవ్వనాన్ని కోరుకుంటాడు."* 

*"వృద్దాప్యం లోకి వెళ్ళాలని ఎవ్వడూ కోరుకోడు."*

*"మరి ఈ శరీరం వృద్దాప్యం లోకి వెళుతుంటే ఈ శరీరాన్ని వృద్దాప్యంలోకి వెళ్ళనివ్వకుండా యవ్వనం లోనే ఎందుకు ఆపలేకపోతున్నాడు."* 

*"నేను ఈ శరీరం అనుకునే వాడి ఇష్టా ఇష్టాల ప్రకారం ఈ శరీరంలో ఒక్కటయినా జరుగుతోందా?"*

 *"శరీరంలో జరిగే మార్పు చేర్పులను గమనిస్తూ నా కళ్ళల్లో చూపు తగ్గిపోతోందే!"*

*"నా మోకాళ్ళు అరిగిపోతున్నాయే!"* 

*"నా చర్మం మునుపటిలా కాంతితో కనిపించడం లేదే అని ఆశ్చర్యపోతున్నాడు గాని.."* 

*"శరీరం యొక్క పెరుగుదలను అతడు ఆపగలుగుచున్నాడా?"* 

*"ఈ శరీరం నేను అనుకోవడం తప్ప ఈ శరీరం మన మాట ఒక్కటయినా విని ఎక్కడయినా ఆగుతోందా?""* 

*"అది ఆగనే ఆగట్లేదు. ఈ శరీరం పుట్టినప్పటి నుంచి నశించేంత వరకు దాని ఇష్ట ప్రకారం అది వెళుతోందిగాని మనం దాన్ని ఎక్కడయినా ఒక్క క్షణం పాటయినా నిలువరించగలిగామా?"* 

*"ఇదంతా బహు ఆశ్చర్యకరమయిన విషయం."*

*"ఏ మాత్రం మన అదుపులోలేని దానంతట అది సాగిపోయే శరీరాన్ని చూసుకుని మనం అనుకుంటున్నాం."* 

*"ఏదయితే ఈ శరీర యాత్రను బాల్యం నుంచి వృద్దాప్యం వరకూ గమనిస్తూ మనలో ఒక సాక్షి ఉందో దాన్ని మనం చూడలేకపోతున్నాం."*

*"ఎంతటి దుఃఖకరం ఇది. ఈ శరీరాన్ని బాల్యం నుంచి వృద్దాప్యం దాకా చివరకు దీని పతనం వరకూ గూడా దీని యొక్క అన్ని దశలను గమనిస్తూ ఒక సాక్షి ఈ శరీరంలో ఉందో అదే మానవుని రూపం."* 

*"మనిషి ఎప్పుడయితే ఆ సాక్షిని ఎరిగి ఈ శరీరం నుంచి తనను తాను వేరు చేసుకుని చూసుకుంటాడో అప్పుడిక ఈ శరీర పతనం అతడి పతనం కాజాలదు."* 

*"అలా కాకుండా శరీర మోహం వదల్లేక శరీరాన్నే తగులుకుని వుండి ఈ శరీరమే నేను అనుకుంటూ శరీరం యొక్క లక్షణాలు అయిన బాల్యం, యవ్వనం, వృద్దాప్యం అన్నీ తనకే అనుకుంటూ ఆ శరీర దశలన్నీ ఎవడయితే అనుభవిస్తాడో అతడు శరీరంతో పాటు కూలిపోతాడు."*

*"అలా కూలినవాడు తిరిగి ఇంకో దేహం ధరించి ఈ లోకంలోకి మళ్ళీ వస్తాడు."* 

*"మానవుడు ఎప్పటివరకు ఈ శరీరంలో వున్న “ఆత్మ” దర్శనం చేసుకోడో అప్పటి వరకూ జన్మ మరణం అనే అనుభవాలను శరీరంతోపాటే పొందుతూ ఈ లోకంలోకి రాకపోకలు సాగిస్తూనే వుంటాడు."*

 *"ఎప్పుడయితే ఏదో ఒక జన్మలో ఈ శరీరాలతో విసిగిపోయి తనలోని వివేకం నిద్ర లేచి తాను కాని ఈ శరీర భ్రమ ను వదిలేసి తన స్వస్వరూపమయిన “ఆత్మ”ను అనుభవంలోకి తెచ్చుకుంటాడో ఇక అతడికి అదే “ఆఖరి జన్మ” అనే బ్రాంతి అవుతుంది."*

*అదే మోక్షం.*
*అదే “బ్రహ్మానందం”.* 

*"అట్టి మానవుని యొక్క స్థితే “భగవంతుడు” అనే శబ్దం యొక్క అర్ధం కూడా."*
             💖🔥💖🔥💖
                   💖🕉️💖
        

శ్రీరమణీయం: మనసంటే ఏమిటో, మనసులోని ఖాళీతనం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంది ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"474"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"మనసంటే ఏమిటో, మనసులోని ఖాళీతనం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంది ?"*

*"మనసంటే ఉన్న విషయాలను తెలుసుకునే శక్తి. మనసులోని ఖాళీని అర్థం చేసుకున్నప్పుడే వర్తమానంలో మార్పును అంగీకరించ గలుగుతాం. జరుగుతున్న విషయంలోనే మార్పు ఉంటుంది కానీ జరిగిపోయిన వాటిలో ఇక ఈ మార్పు ఉండదు. ఎందుకంటే అది అప్పటికే మారిపోయి ఉంది. మనసులోని ఆ ఖాళీతనం తెలియటమే ధ్యానం ! ఈ ఖాళీతనం తెలియాలంటే అసలు మనసు అంటే ఏమిటో ముందు తెలియాలి. మనసంటే ఉన్న విషయాలను తెలుసుకునే శక్తి. మనసు బయటి విషయాలు గమనించటంతో పాటు వాటిని తనలో జ్ఞాపకంగా దాచుకోగలదు. బయట ఉన్న విషయాలను, లోపలి జ్ఞాపకాలను అది ఒకేసారి గ్రహించగలదు. లోపలవున్న జ్ఞాపకంలాగా బయటి ప్రపంచం ఉండాలనుకుంటే అది సాధ్యంకాదు. ఆ భావనే మనకున్న సహజ ధ్యానస్థితిని భంగపరుస్తుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

ప్రశ్న : _దుఃఖం ఒక ఆలోచనా?

 🕉 *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏🌷🙏

*భగవాన్ శ్రీ రమణ మహర్షి*  సమాధానం:

💥ప్రశ్న :  _దుఃఖం ఒక ఆలోచనా?_ 

💥 *భగవాన్* : అన్ని ఆలోచనలు దుఃఖకరమైనవే

🙏🌷🙏 *శుభం భూయాత్*  🙏🌷🙏

మొరార్జీదేశాయి మర్చి 1977 నుండి జులై 1979 వరకు భారత ప్రధాని.

 🌹మొరార్జీదేశాయి మర్చి 1977 నుండి జులై 1979 వరకు భారత ప్రధాని.

🌹వారు తమ ఆత్మకథ "ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ " లో ఇట్లు వ్రాశారు

🌹"ఆగష్టు 1935 లో భగవాన్ శ్రీ రమణులను చూచే భాగ్యం నాకు కలిగింది.

🌹భగవాన్ సోఫా పైన కూర్చొని ఉన్నారు

🌹కౌపినము దాల్చారు. శాంతి, ఆనందము వారి వదనంలో వెలిగిపోతుంది.

🌹ఆ ముఖం మీద ఒక జ్యోతి చక్రము కూడ గమనించాను.

🌹వారిని ఏమి అడగలేదు

🌹వారు కూడా నాతో మాట్లాడ లేదు

🌹వారి ముఖాన్నే చూస్తూ ఒక గంట పైన కూర్చున్నాను

🌹వారిని అడగాలని నాకే ప్రశ్నలు తట్టలేదు

🌹చిత్త శాంతితో ఉండిపోయాను

🌹మరునాడు 12 గంటలకు వెళ్ళాను. సెలవు కోరగా, భగవాన్ నన్ను భోజనాoతరము వెళ్ళమని వారు అన్నారు.

🌹భోజనము చేసి వెళ్ళాను ".

ఢిల్లీ లోని శ్రీ రమణ కేంద్రము నిర్వహించిన శ్రీ రమణ 99 వ జయంతి వేడుకలో అధ్యక్షత వహిస్తూ 1979 జనవరి 13 న భారత ప్రధాని, శ్రీ మొరార్జీ దేశాయి ఇలా అన్నారు :-

🌹భగవాన్ కి జంతు భాష తెలుసు. వాటి ఫిర్యాదులను వినే వారు.

🌹వారి దృష్టిలో అందరూ సమానమే

🌹ఎవ్వరిని మార్చుటకు ప్రయత్నం చేయలేదు. వారి సన్నిధి వల్లనే మనిషిలో పరివర్తన కలిగినది.

🌹ఎవరైనా తనకి నచ్చిన విధాన సాధన గమ్యాన్ని చేరవచ్చు నని శ్రీ రమణులు చెప్పారు.


..... సేకరణ : శ్రీ రమణ మహర్షితో ముఖాముఖి, ఆంగ్ల మూల సంకలనం ప్రొ. లక్ష్మీ నారాయణ్, తెలుగు అనువాదం పింగళి సూర్య సుందరం గారు



..... కోటంరాజు శ్రీనివాసరావు, హైదరాబాద్ 

అరుణగిరి ప్రదక్షిణా మాహాత్మ్యం

 🌺 అరుణగిరి ప్రదక్షిణా మాహాత్మ్యం 🌺

కైలాసవాసుడైన పరమేశ్వరుడు అగ్నిలింగంగా అరుణాచలం రూపంలో భూమిమీద వెలిసాడు. ఆ దివ్య పర్వతం చుట్టూ ఎంతో మంది దేవతలు పరివేష్ఠించి ఉన్నారు. 

“యానికానిచపాపాని జన్మాంతకృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే” అన్న శ్లోకం ప్రకారం, జన్మాంతరాల్లో చేసిన పాపాలు కూడా ఆ అరుణగిరికి ప్రదక్షిణ చేస్తే తొలగిపోతాయి. 

కోటి అశ్వమేధయాగాలు, కోటి వాజపేయ యాగాలు చేస్తే వచ్చే ఫలితం, సర్వతీర్థాలలో స్నానం చేస్తే వచ్చే ఫలితం, కేవలం ఒక్కసారి అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కలుగుతుంది. 

ఎంత నికృష్టజన్మ ఎత్తిన వారికైనా సరే, అరుణగిరి ప్రదక్షిణ ముక్తిని ప్రసాదిస్తుంది. 

ఆ గిరికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేసేవారు, సకల యజ్ఞాలు చేసిన ఫలం పొందుతారు.

అరుణాచల ప్రదక్షిణ కోసం వెళ్ళేవారు ఒక్క అడుగు వేసినంత మాత్రాన్నే భూలోకాన్ని, రెండో అడుగుతో అంతరిక్షాన్ని, మూడో అడుగుతో స్వర్గాన్ని పొందుతారు. అలాగే మొదటి అడుగుతో మానసికంగా చేసిన పాపం, రెండో అడుగుతో వాక్కుద్వారా చేసిన పాపం, మూడో అడుగుతో శరీరం ద్వారా చేసిన పాపం తొలగిపోతుంది. 

ఒక్కడుగుతో సకల పాపాలూ నశిస్తాయి. రెండో అడుగు వేస్తే సర్వతపస్సుల ఫలితం వస్తుంది.

పరమపవిత్రమైన ఈ అరుణగిరి చుట్టూ ఎన్నో సిద్ధాశ్రమాలున్నాయి. ఈ శిఖరం మీదే సర్వేశ్వరుడు సిద్ధేశ్వర రూపంతో, దేవతలంరిచేతా పూజించబడుతుంటాడు. 

"ఈ దివ్య పర్వతం అగ్ని మయమని, ఈ పర్వతం అంతర్భాగంలో సర్వభోగాలతో కూడిన ఒక గుహ ఉందని భావిస్తూ ధ్యానిస్తూ, ఈ గిరికి ప్రదక్షిణ చేయాలి. అలా చేసిన వారి పాపాల్ని దోషాల్ని తొలగిస్తానని పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడు. 

అలాగే ఈ గిరిని పరమేశ్వరుడి అష్టమూర్తిగా కూడా అందరూ గ్రహించి నమస్కరించాలి. 

అరుణగిరికి నిత్యం ప్రదక్షిణ చేసేవారికి నిత్యత్వం లభిస్తుంది. 

ఈ గిరి ప్రదక్షిణ చేసేవాడి పాదధూళితో భూమి పవిత్రమవుతుంది.

అరుణాచలశివ 🌹

8 (అష్ట) శివరూపాలు

 *8 (అష్ట) శివరూపాలు*
               ✍️ శ్రీ రావి ఎన్. అవధాని.‌
🕉️⚜️🔱⚜️🔱✳️🔱⚜️🔱⚜️🕉️

*శర్వోభవః తథా రుద్రో ఉగ్రో భీమః పశోః పతిః!* 
*ఈశానశ్చ మహాదేవో మూర్తయశ్చాష్ట విశ్రుతాః!!* 

⚜️ శివుడు సర్వవ్యాపి. ఈ జగత్తు అంతటా శివచైతన్యమే నిండి ఉంది. అయితే,  అంతటా నిండివున్న శివుణ్ణి ఎలా గుర్తుపట్టాలి? అని సనత్కుమారుడు ఒక పర్యాయం నందీశ్వరుని అడిగాడు. అప్పుడు..., 

🔱 "ఓ సనత్కుమారా! *భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, జీవాత్మ, సూర్యుడు, చంద్రుడు* -  మొదలైన వాటన్నింటిలో తన ఎనిమిది స్వరూపాల్లో శివుడే అధిష్టించి ఉన్నాడు. ఆయన అష్టమూర్తి తత్త్వాన్ని తెలుసుకుంటే ఆయనను తెలుసుకోవడం తేలికవుతుంది. 

⚜️ *శివుని అష్టమూర్తులు ఇవి....* 

*1 .శర్వుడు:*  🙏

🔱 స్థావర జంగమాత్మక మైన ప్రాణికోటినంతటినీ భరించే భూమిని *శర్వుడు* అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. ప్రళయకాలంలో ప్రాణులను లయం చేసే శివస్వరూపమే శర్వుడు. *ఓం శర్వాయ క్షితి మూర్తయే నమః*  అని స్మరిస్తూ భూమిపై నడచినా, భూమిని స్పర్శించినా ధ్యానపారవశ్యం కలిగి పాపనాశనమవుతుంది.

*2. భవుడు:* 🙏 

⚜️ సర్వజగత్తులో సకలప్రాణులను జీవింపజేసే జలమును *భవుడు* అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. నీటిని స్పర్శించినప్పుడు, త్రాగినప్పుడు *ఓం భవాయ జలమూర్తయే నమః* అని స్మరించాలి.

*3. రుద్రుడు:* 🙏 

🔱 ఈ జగత్తును ప్రకాశింపజేసే అగ్నిని *రుద్రుడు* అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. అగ్నిని దర్శిస్తూ, *ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః* అని స్మరిస్తే మనస్సు అంతర్ముఖమై పుణ్యం చేకూరుతుంది.

*4. ఉగ్రుడు:* 🙏

⚜️ ప్రాణుల బాహ్యమందు, లోపల చలించే వాయువును *ఉగ్రుడు* అనే మూర్తి రూపంలో శివుడు ఉంటాడు. వాయువు వీస్తుంటే,  *ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమః* అని స్మరిస్తే శాంతి, సౌఖ్యం, సద్గుణాలు లభిస్తాయి.

*5. భీముడు:* 🙏

🔱 జీవులందరికీ అవకాశాన్ని కలిగిస్తూ, సర్వాన్ని వ్యాపించే ఆకాశాన్ని,  *భీముడు* అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. ఆకాశాన్ని దర్శిస్తూ, *ఓం భీమాయ ఆకాశమూర్తయే నమః* అని స్మరిస్తే శీఘ్రంగా ఆత్మానందం కలుగుతుంది.

*6. పశుపతి:* 🙏 

⚜️ సర్వదేహాలలోని జీవులందరిలో *పశుపతి* అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. జీవుల అజ్ఞానమోహాలను నశింపజేసే శివస్వరూపమే పశుపతి. ఏ ప్రాణిని దర్శించినా *ఓం పశుపతయే యజమాన మూర్తయే నమః* అని స్మరిస్తే మోహం నశించిపోతుంది.

*7. ఈశానుడు:* 🙏 

⚜️ సర్వజగత్తును ప్రకాశింపజేసి జీవశక్తిని ప్రసాదించే సూర్యుని *ఈశానుడు* అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. సూర్యుని దర్శిస్తూ, *ఓం ఈశానాయ సూర్యమూర్తయే నమః*  అని స్మరిస్తే వారికి ఆరోగ్యం, జ్ఞానం, ధ్యానం సిద్ధిస్తాయి.

*8. మహాదేవుడు:* 🙏 

⚜️ సర్వ జగత్తుకు అమృతకిరణాలను వెదజల్లుతూ వెలుగును ప్రసాదించే చంద్రునిలో *మహాదేవుడు* అనే మూర్తి రూపంలో శివుడు ఉంటాడు. చంద్రుని దర్శిస్తూ,  *ఓం మహాదేవాయ సోమ మూర్తయే నమ:* అని స్మరిస్తే ఆనందం చేకూరుతుంది.... 

✅ అని నందీశ్వరుడు సనత్కుమారునికి చెప్పాడు.


*Courtesy:* 'భక్తి' మాసపత్రిక
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ:* 
🕉️⚜️🔱⚜️🔱✳️🔱⚜️🔱⚜️🕉️
 🕉 *नमो भगवते श्री रमणाय* 🙏🌷🙏

*Bhagavan Sri Ramana Maharshi'*  says:

💥When women, carrying jars of water on their heads stop to talk, they are very careful, keeping their mind on the water jars. Similarly, when a sage engages in activity, his mind remains fixed in the Self and his activity does not distract him."💥

🙏🌷🙏 *शुभम् भूयात्*  🙏🌷🙏

🕉 *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏🌷🙏

*భగవాన్ శ్రీ రమణ మహర్షి'*  చెప్పారు:

💥మహిళలు తలపై నీటి కుండలను మోసుకెళ్లేటప్పుడు, మాట్లాడటానికి ఆగినా,  చాలా జాగ్రత్తగా, నీటి కుండల మీదనే మనస్సును ఉంచుతారు. 
అదేవిధంగా, ఒక జ్ఞాని బాహ్య కార్యకలాపంలో నిమగ్నమైనప్పుడు, అతని మనస్సు ఆత్మలోనే స్థిరంగా ఉంటుంది మరియు అతని కార్యాచరణ అతని దృష్టి మరల్చదు."💥

🙏🌷🙏 *శుభం భూయాత్*  🙏🌷🙏

శ్రీరమణీయం: జ్ఞాపకాలను ప్రేమించటం, ఇష్టపడటం, వాటితో కాలం గడపటం మంచి పనిగా భావించవచ్చా ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"473"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"జ్ఞాపకాలను ప్రేమించటం, ఇష్టపడటం, వాటితో కాలం గడపటం మంచి పనిగా భావించవచ్చా ?"*

*"జ్ఞాపకాలను ఇష్టపడే మనసు వర్తమానాన్ని స్వీకరించలేదు, మార్పును అంగీకరించలేదు. నిన్నటి విందుభోజనం తాలూకు జ్ఞాపకం నేటి ఆకలిని తీర్చలేదు. ఇప్పుడు సిద్ధంగావున్న భోజనం తినకుండా నిన్నటి విందును గుర్తుకు తెచ్చుకుంటే ప్రయోజనం నెరవేరదు. ఏ జ్ఞాపకమైనా జీవన ప్రయాణంలో ఉపయోగపడే మైలురాయి కావాలి. అంతేగాని ప్రయాణాన్ని ముందుకు సాగనివ్వని మజిలీ కాకూడదు. తీర్థయాత్రలకు బయలుదేరిన ఒక వ్యక్తి మార్గంలో ఒక హోటల్లో భోజనం చేశాడు. ఆతనికి ఆ వంటల రుచి అమోఘం అనిపించింది. కానీ దారి పొడవునా అతనికి అదే రకమైన రుచి దొరకదు. రుచికోసం అక్కడే ఆగితే ప్రయాణం సాగదు. పురోగమనం అంటే ముందుకు సాగటం. గతాన్ని వదిలి వర్తమానంలో ఉండటమే నిజమైన పురోగమనం. జ్ఞాపకాలతో కాలాన్ని వృధా చేయటం వివేకం కాదు !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
            

:::::ఆలోచన vs వివేచన:::::

 *:::::ఆలోచన vs వివేచన:::::::::*

  1)ఆలోచన  జ్ఞాపకాల నుండి పుడుతుంది.
వివేచన నైతికత నుండి పుడుతుంది.
2) ఆలోచన సమస్యను సృష్టిస్తుంది.
వివేచన సమస్యను పరిష్కరిస్తుంది.
3)ఆలోచన స్వార్ధం చుట్టూ తిరుగుతుంది
వివేచన మంచి చుట్టూ తిరుగుతుంది.
4) ఆలోచన పిలవక పోయినా వస్తుంది.
వివేచన అనేది పెంపోందించుకునే సామర్థ్యం.
5)ఆలోచన మూర్ఖంగా, నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా,వివేచనా రహితంగా వుండొచ్చు.
వివేచన వీటి అన్నింటిని దరికి రానివ్వదు.
6) ఆలోచనలు శాస్త్ర విరుద్ధంగా,ఆహేతుకంగా కూడా వుంటాయి
వివేచన శాస్త్రీయంగా వుంటుంది.
7) ఆలోచనలు భ్రమను కలిగించే వచ్చు.
వివేచన భ్రమను దూరం చేస్తుంది.
8)ఆలోచనా రహిత స్థితి కోరుకోవచ్చు.
వివేక రహిత స్థితి ఎవరూ కోరరు.

*షణ్ముఖానంద 98666 99774*

****స్త్రీ పురుష శరీరాలలోని 'సంగమం' సుఖం ఎంతో ఒకసారి పరిశీలిద్దాం.

ఈ ప్రపంచంలో మానవుడు వదలాలని అనుకున్నా ఎవరో పట్టుకుని లాగుతున్నట్లుగా వదలలేకపోతున్న ఈ  స్త్రీ పురుష శరీరాలలోని సుఖం ఎంతో ఒకసారి పరిశీలిద్దాం."*

 *"ఈ లోకంలో స్త్రీ శరీరం కోసం పురుషుడు, పురుష శరీరం కోసం స్త్రీ తాపత్రయపడుతున్నారు."*

*"రక్తం, మాంసం, ఎముకలు, చర్మం తప్ప ఈ స్త్రీ పురుష శరీరాలలో ఏం ప్రత్యేకత ఉంది."* 

*"అసలు ఒక పురుషుని శరీరానికి ఒక స్త్రీ శరీరానికి ఒక అడవిలో తిరిగే గాడిద శరీరానికీ భేదం ఏముంది?"* 

*"శరీరాలన్నీ రక్త మాంసాలే గదా!"* 

*"అలా అని ఎందుకనుకోవాలి మాకు వీటినుంచి సుఖానుభవం కలుగుతోంది గదా అని అంటే!"*

*"ఇందులో వున్న సుఖానుభవం ఎంతో ఇప్పుడు చూద్దాం."* 

*"స్త్రీ పురుషుల మద్య “సంగమం” జరిగే సమయంలో ఒకానొక దశలో పురుషుడి శరీరంలోని వీర్యం బయటకు విడవబడుతుంది."*

*"అట్టి క్షణాలలో అనిర్వచనీయమయిన సుఖానుభవం ఆ రతి క్రీడలో వున్న ఇరువురికీ కలుగుతుంది."* 

*"ఆ సుఖం శరీరాల వల్లే లభిస్తుందని భావిస్తూ ఒకరి శరీరంకోసం మరొకరు తమ తమ ధన, మాన, ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు."*

*"కానీ ఇందులోని సత్యం జనులు తెలుసుకోలేకపోతున్నారు."* 

*"స్త్రీ పురుషుల మధ్య రతి క్రీడలో సుఖానుభవం కలిగేది రెండు శరీరాల మద్య జరిగే ఘర్షణ వల్ల కాదు."* 

*"వీర్యపాతం జరిగే సమయానికి ఇద్దరి మనసులో ఎట్టి విషయాలు అనేవి లేకుండా పోయి మనస్సు నిర్విషయ స్థితిలోకి వెళ్ళిపోతుంది."* 

*"ఆ స్థితిని శిష్యుల అజ్ఞానం తొలగించడానికి లోకంలోని గురువులు ఆత్మ స్థితితో కూడా పోల్చి చెబుతుంటారు."*

 *"అట్టి మనస్సు యొక్క “నిర్విషయ” స్థితి వల్లే కొద్ది క్షణాలు కృత్రిమమయిన సుఖానుభవం ఇద్దరికీ కలుగుతుంది."* 

*"అంతేగాని వీర్యం బయటకు పోవడం వల్ల కాదని అందరూ ఇక్కడ గ్రహించాలి."* 

*"వీర్యం వల్లే ఆనందం లబించేట్లయితే మరి వీర్యం బయటకు పోనప్పుడు కూడా శరీరంలోనే ఉంది కదా!"* 

*"శరీరంలో వున్నప్పుడు ఆనందం ఎందుకు లభించట్లేదు?"*

*"కాబట్టి ఆత్మస్థితి ఎట్టిదో ఎరిగిన ఋషులు ఇంకా అనేకమంది జీవులు తమ మనస్సులోనుంచి సర్వం త్యజించి ఏకాంతంగా ఎక్కడో హిమాలయ పర్వత ప్రాంతాల్లోనో లేక మరో పవిత్ర స్థలంలోనో వుంటూ మనస్సులోకి లోక సంఘటనలు అనే విషయాలు రానివ్వకుండా నిర్విషయ స్థితిలో..."*

 *"[మనసులోకి విషయాలు రానివ్వకుండా విషయరహిత స్థితిలో మనస్సును నిరంతరం నిలిపి ఉంచుకోవడం]"*  

*"మనస్సును దీర్ఘ కాలం పాటు నిలిపి ఉంచి బయట ప్రపంచం వైపు పదే పదే వెళ్ళాలని భావించే మనస్సు యొక్క మాయాశక్తిని తమ బుద్ధి బలంతో అడ్డుకుని కొన్నాళ్ళకు మనస్సును ఆత్మ అనే తమ స్వస్వరూపంలో లయం చేసి స్త్రీపురుష సంభోగసుఖం అనే ఆనందంతో పోలిస్తే దానికి కొన్ని కోట్ల రెట్ల అధికమయిన అకృర్తిమమయిన ఆనందాన్ని క్షణక్షణం నిరంతరాయంగా అనుభవిస్తూ ఆ “బ్రహ్మానంద” స్థితిలో తేలియాడుతున్నారు."*

 *"అట్టి స్థితిలోకి ఒకసారి వెళ్ళినవాడు తిరిగి ఈ లోకంలోకి ఎప్పటికీ రాడు."* 

*"అదే మానవుని స్వస్వరూప మోక్ష సామ్రాజ్యం."*

 *"దానికోసం ఈ మానవజన్మ అనే అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి."*

*"అలాగే ఈ లోకంలో ఎన్నో ఋషి ఆశ్రమాలు ఉన్నాయి."*

*"ఎందరో గొప్ప ఋషులు అక్కడ  వుంటున్నారు."*

*"ఆశ్రమాలకు వెళ్లి ఋషులకు దణ్ణం పెట్టి మన భాధ్యత అయిపోయినట్లుగా తిరిగి వచ్చేస్తున్నాం."*

*"ఎన్నో దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఈ లోకంలో ఉన్నాయి."* 

*"వాటిల్లో ఎందరివో మహా పురుషుల విగ్రహాలు కొలువై ఉన్నాయి."*

********14. ఆత్మ జ్ఞానం, మోక్షమార్గం

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 🔥 *"14"* 🔥
   🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
   🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
     💖🔥💖🔥💖🔥💖
           💖🔥🕉🔥💖
                 💖🔥💖
                       💖
*"ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ౹"*

*"అలా మననం చేయబడ్డ విషయాలు మరింత శక్తిని పుంజుకుని తిరిగి చిత్తంలో పై పై నే ఉంటూ మనస్సు భావించినప్పుడల్లా ఎగిరెగిరి మనస్సులోకి వచ్చి రకరకాల అనుభవాలను మనస్సుకు ఇచ్చి తిరిగి చిత్తం లోకి వెళ్లిపోతుంటాయి."*

*"ఎప్పుడయితే మానవుడు ముక్తిని లక్ష్యంగా చేసుకుని విషయాలను మనస్సుతో స్మరించడం ఆపి వేస్తాడో అప్పుడు మనస్సు చిత్తంలోని పాత జ్ఞాపకాలను వెనక్కు తీసికుని మననం చెయ్యాలని ప్రయత్నిస్తుంటుంది."* 

*"అట్టి స్థితిలో మానవుడు తన బుద్ధి బలంతో మనస్సును కట్టడి చేసి చిత్తంలోని పాత విషయాలలోకి మనస్సును వెళ్ళనివ్వకుండా ఆపగలగాలి."* 

*"అప్పుడు చిత్తంలోని పాత విషయాలన్నీ కూడా కొంత కాలానికి చిత్తంలో లేకుండాపోతాయి."* 

*"ఎప్పుడయితే చిత్తంలో విషయాలే లేకుండా పోతాయో అప్పుడు చిత్తమే లేకుండా పోతుంది."*

*"ఎందుకంటే విషయాలకు మరొక పేరే చిత్తం."* 

*"విషయాలు, జ్ఞాపకాలు అంటూ లేని చిత్తం ఎక్కడా ఉండదు.* 

*"చిత్తం లేనట్టి అట్టి స్థితిలో మనస్సు తన స్వస్థానమయిన ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతుంది."* 

*"ఇంకా చెప్పాలంటే ఆత్మే అజ్ఞానమనే తనకంటే వేరుగాని మనస్సు అనే బ్రాంతి తనలో తొలగించుకుని “బ్రహ్మానంద” స్థితిలో ఉండిపోతుంది."*

*"అట్టి స్థితిలో ఈ శరీరం జ్ఞప్తికి రాదు."*

*"ఈ శరీరాన్ని ఈ శరీరం నేను అనుకునేది ఆత్మలోనుంచి ఏర్పడ్డ ఈ మనస్సే ."* 

*"మనస్సు  ఆత్మలో లీనమైపోయాక ఇక ఈ శరీరాన్నిగాని ఈ ప్రపంచాన్నిగాని చూసేది ఏముంటుంది."* 

*"ఆ స్తితే మరణాన్ని జయించడం-ముక్తిని పొందడం అంటే."*

*"అలాగే ఈ ప్రపంచంలో మానవుడు వదలాలని అనుకున్నా ఎవరో పట్టుకుని లాగుతున్నట్లుగా వదలలేకపోతున్న ఈ  స్త్రీ పురుష శరీరాలలోని సుఖం ఎంతో ఒకసారి పరిశీలిద్దాం."*

 *"ఈ లోకంలో స్త్రీ శరీరం కోసం పురుషుడు, పురుష శరీరం కోసం స్త్రీ తాపత్రయపడుతున్నారు."*

*"రక్తం, మాంసం, ఎముకలు, చర్మం తప్ప ఈ స్త్రీ పురుష శరీరాలలో ఏం ప్రత్యేకత ఉంది."* 

*"అసలు ఒక పురుషుని శరీరానికి ఒక స్త్రీ శరీరానికి ఒక అడవిలో తిరిగే గాడిద శరీరానికీ భేదం ఏముంది?"* 

*"శరీరాలన్నీ రక్త మాంసాలే గదా!"* 

*"అలా అని ఎందుకనుకోవాలి మాకు వీటినుంచి సుఖానుభవం కలుగుతోంది గదా అని అంటే!"*

*"ఇందులో వున్న సుఖానుభవం ఎంతో ఇప్పుడు చూద్దాం."* 

*"స్త్రీ పురుషుల మద్య “సంగమం” జరిగే సమయంలో ఒకానొక దశలో పురుషుడి శరీరంలోని వీర్యం బయటకు విడవబడుతుంది."*

*"అట్టి క్షణాలలో అనిర్వచనీయమయిన సుఖానుభవం ఆ రతి క్రీడలో వున్న ఇరువురికీ కలుగుతుంది."* 

*"ఆ సుఖం శరీరాల వల్లే లభిస్తుందని భావిస్తూ ఒకరి శరీరంకోసం మరొకరు తమ తమ ధన, మాన, ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు."*

*"కానీ ఇందులోని సత్యం జనులు తెలుసుకోలేకపోతున్నారు."* 

*"స్త్రీ పురుషుల మధ్య రతి క్రీడలో సుఖానుభవం కలిగేది రెండు శరీరాల మద్య జరిగే ఘర్షణ వల్ల కాదు."* 

*"వీర్యపాతం జరిగే సమయానికి ఇద్దరి మనసులో ఎట్టి విషయాలు అనేవి లేకుండా పోయి మనస్సు నిర్విషయ స్థితిలోకి వెళ్ళిపోతుంది."* 

*"ఆ స్థితిని శిష్యుల అజ్ఞానం తొలగించడానికి లోకంలోని గురువులు ఆత్మ స్థితితో కూడా పోల్చి చెబుతుంటారు."*

 *"అట్టి మనస్సు యొక్క “నిర్విషయ” స్థితి వల్లే కొద్ది క్షణాలు కృత్రిమమయిన సుఖానుభవం ఇద్దరికీ కలుగుతుంది."* 

*"అంతేగాని వీర్యం బయటకు పోవడం వల్ల కాదని అందరూ ఇక్కడ గ్రహించాలి."* 

*"వీర్యం వల్లే ఆనందం లబించేట్లయితే మరి వీర్యం బయటకు పోనప్పుడు కూడా శరీరంలోనే ఉంది కదా!"* 

*"శరీరంలో వున్నప్పుడు ఆనందం ఎందుకు లభించట్లేదు?"*

*"కాబట్టి ఆత్మస్థితి ఎట్టిదో ఎరిగిన ఋషులు ఇంకా అనేకమంది జీవులు తమ మనస్సులోనుంచి సర్వం త్యజించి ఏకాంతంగా ఎక్కడో హిమాలయ పర్వత ప్రాంతాల్లోనో లేక మరో పవిత్ర స్థలంలోనో వుంటూ మనస్సులోకి లోక సంఘటనలు అనే విషయాలు రానివ్వకుండా నిర్విషయ స్థితిలో..."*

 *"[మనసులోకి విషయాలు రానివ్వకుండా విషయరహిత స్థితిలో మనస్సును నిరంతరం నిలిపి ఉంచుకోవడం]"*  

*"మనస్సును దీర్ఘ కాలం పాటు నిలిపి ఉంచి బయట ప్రపంచం వైపు పదే పదే వెళ్ళాలని భావించే మనస్సు యొక్క మాయాశక్తిని తమ బుద్ధి బలంతో అడ్డుకుని కొన్నాళ్ళకు మనస్సును ఆత్మ అనే తమ స్వస్వరూపంలో లయం చేసి స్త్రీపురుష సంభోగసుఖం అనే ఆనందంతో పోలిస్తే దానికి కొన్ని కోట్ల రెట్ల అధికమయిన అకృర్తిమమయిన ఆనందాన్ని క్షణక్షణం నిరంతరాయంగా అనుభవిస్తూ ఆ “బ్రహ్మానంద” స్థితిలో తేలియాడుతున్నారు."*

 *"అట్టి స్థితిలోకి ఒకసారి వెళ్ళినవాడు తిరిగి ఈ లోకంలోకి ఎప్పటికీ రాడు."* 

*"అదే మానవుని స్వస్వరూప మోక్ష సామ్రాజ్యం."*

 *"దానికోసం ఈ మానవజన్మ అనే అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి."*

*"అలాగే ఈ లోకంలో ఎన్నో ఋషి ఆశ్రమాలు ఉన్నాయి."*

*"ఎందరో గొప్ప ఋషులు అక్కడ  వుంటున్నారు."*

*"ఆశ్రమాలకు వెళ్లి ఋషులకు దణ్ణం పెట్టి మన భాధ్యత అయిపోయినట్లుగా తిరిగి వచ్చేస్తున్నాం."*

*"ఎన్నో దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఈ లోకంలో ఉన్నాయి."* 

*"వాటిల్లో ఎందరివో మహా పురుషుల విగ్రహాలు కొలువై ఉన్నాయి."*
             💖🔥💖🔥💖
                   💖🕉️💖

శివారాధన

 శివారాధన
శివ శబ్దానికి ఎన్నో అర్థాలు, కలగబోయే శ్రేయస్సు, అరిష్టనాశం, సుఖాన్ని కలిగించేది, శుభాలను అందించేది, ధన్యతను ప్రసాదించేది, కోరికలను తీర్చేది, పుట్టుకకు కారణమైంది, కుత్సితాలను పోగొట్టేది, అశుభాలను తరిమికొట్టేది, మంచితనంతో కూడి ఉండేది... ఇలా ఎన్నో ఈ పేరులో ఇమిడి ఉన్నాయి. ఇన్ని శివగుణాలు కలవాడు శివుడు. ఆయనను ఆరాధిస్తే ఆరాధకుడికి ఆ గుణాలే అలవడతాయి.
రుద్రుడు అంటే రోదనాన్ని పోగొట్టేవాడు. రోదనం అంటే దుఃఖమే. దుఃఖం మనిషికి పుట్టుకతోనే వస్తుంది. ఇది పుడమి గర్భంలో మనిషి కలిసిపోయేదాకా ఉంటుంది. దుఃఖం లేని మనిషి అలలులేని సాగరం ఉండనే ఉండవు. సముద్రజలాలను అలలు ఎలా కల్లోలం చేస్తుంటాయో జీవన సాగరంలోనూ దుఃఖాల కెరటాలు మనిషిని పడదోస్తుంటాయి. రుఃఖించే మనిషికి ఓదార్పు కావాలి. చేయూత కావాలి.
ఇలాంటి నేపథ్యంలో మనిషికిగల ఏకైకగమ్యం శివారాధన, శివుడు ఇలాంటి ఒడుదొడుకులేవీ లేనివాడు. నిశ్చలుడు. అందుకే అతడికి స్థాణువు అనే పేరుంది. స్థాణువు అంటే రాయి కాదు. మానసిక స్థైర్యం. అది పరమేశ్వరుడి సహజగుణం. ఎంతటి ప్రళయంలోనైనా చెక్కుచెదరని స్థిరత్వం. ప్రపంచాన్నే భస్మం చేయగల హాలాహల విషాన్ని కంఠంలో దిగమింగే ధీరత్వం. అది మనిషికి కావాలి. ఎలాంటి దుర్భర పరిస్థితిలోనైనా నిలబడే ఆత్మశక్తి రావాలి. జీవితమంతా విజయసోపానం కావాలి. అందుకు శివారాధనే శరణ్యం.
శివుడికి ఏ కోరికలూ లేవు. వాటికోసం పరుగులు తీయాలనే తలపు లేదు. ఆయన కోరిక అంతా విశ్వశ్రేయస్సే. అందరూ బాగుండాలనే అభిమతమే! శివుడి స్థిరత్వాన్ని భంగం చేయడానికి మన్మథుడు ప్రయత్నించాడు. నిశ్చలచిత్తుడైన పరమేశ్వరుడి పైనే పూలబాణాలు కురిపించబోయాడు. శివుడి మనసును కోరికలతో మలినం చేయాలని భావించాడు. సంయమి అయిన శివుడి ముందు అతడి ఆటలు సాగలేదు. తన నిశ్చలత్వాన్ని నాశనం చేయజూసిన మన్మధుడిపై మూడోకన్ను తెరచి, భస్మం చేశాడు. అతడ్ని అనంగుడిగా (శరీరం లేనివాడిగా) మార్చివేశాడు. మనిషి కూడా శివుడిలా ఉండాలి. ప్రపంచంలో తన చుట్టూ ఎన్నో ప్రలోభాలు ఉసిగొల్పుతున్నా సంయమనాన్ని కోల్పోరాదు. ఎందరు ఎన్ని ఆశలు పెట్టినా మోసపోరాదు. అన్నింటిలోనూ యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉండాలి. ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే చేయాలి. తాత్కాలిక లాభాలకోసం బంగారు భవిష్యత్తును పణంగా పెట్టరాదు. శివుడిలా వీరుడిలా, ధీరుడిలా నిలవాలి. ఇదే శివారాధనలోని
ఈ ప్రపంచంలో అంతా శివభావనామయం. పంచభూతాల్లో శివుడున్నాడు. సూర్యచంద్ర నక్షత్రరాశుల్లో శివుడున్నాడు. శివుడు లేనిదెక్కడ? అణువణువూ శివుడే. అడుగడుగునా శివుడే సకల బ్రహ్మాండ భాండమే శివమయం అని రుద్రాధ్యాయం చెబుతోంది. మనిషి ఎల్లవేళలా శివభావనలో లీనం కావాలి. తన జీవితాన్ని శివానందపూరితంగా మార్చుకోవాలి!🙏🪷 

సంసారమంటే....* ✍️ శ్రీ రమణమహర్షి

 *సంసారమంటే....*
            ✍️ శ్రీ రమణమహర్షి
🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼

🌹 ‘సాధకుల అంతరాయాలకు సంసారమే కారణమని ఎక్కువమంది ఆరోపిస్తుంటారు. ఇది నిజమేనంటారా స్వామీ?' - అని అడిగాడు శిష్యుడు. 

ఆ ప్రశ్నకు రమణ మహర్షులు సమాధానమిస్తూ... 

✳️ *'సంసారం బయటకు కనిపించేదా, మనలోనే ఉందా?'* అని ఎదురు ప్రశ్నించారు రమణులు. 

✳️ 'ఉహూ మనలోపల కాదు, బయటదే! అది భార్యాబిడ్డల రూపంలో అడ్డు వస్తోంది' అన్నాడతను. 

✳️ దానికి ఆయన నవ్వి, 'అలాగే అనుకుందాం! కానీ నువ్వు చెబుతున్న సంసారాన్ని వదిలి ఇక్కడుంటే ఇదొక సంసారం కాదా? పోనీ,  కమండలం ధరించి కూర్చుంటే అది సంసారం కాదా?' అన్నారు. 

✳️ శిష్యుడు ఆశ్చర్యపోయి,  *'ఇంతకీ సంసారానికి నిర్వచనమేంటి?* అన్నాడు. 

✳️ *'మనలో జరిగే నిత్య సంఘర్షణ, పోరాటాలే సంసారం. అంటే మనసే అసలైన సంసారం.* ఆ చంచలత్వాన్ని అదుపులో పెట్టలేక కుటుంబసభ్యులను నిందిస్తుంటాం. వాస్తవానికి వారు మనకి ధర్మ సాధనలో తోడ్పడతారు. *భౌతిక సంసారాన్ని సజావుగా నిర్వహించ గలిగినప్పుడే మానసిక సంసారాన్ని అదుపుచేయగలం.* 

✳️ సంసారాన్ని క్షణంలో వదిలేయొచ్చు. కానీ అది ధర్మశాస్త్రరీత్యా పాపం. అలా చేయ కూడదు' అంటూ వివరించారు రమణులు. 

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

అంతర్యామి - 34* 🥀 *పనే పరమేశ్వరుడు!*

 *అంతర్యామి - 34*
     🥀 *పనే పరమేశ్వరుడు!* 🥀
           ✍️ *డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు*
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️

చేస్తున్న పని పట్ల శ్రద్ధ కనబరిస్తే అది పలువురి ప్రశంసలు పొందుతుంది. ఫలితం బాగుంటుంది. ఏడుపు ముఖంతో ఇష్టం లేకుండా చేసేపనికి ఫలితం ఏడుస్తున్నట్లే ఉంటుంది. ఈ సూత్రం అన్ని రంగాలకూ వర్తిస్తుంది. యజమానులు తమ అంచనాలకు తగ్గట్టుగా పనిచేసే వారిని ఇష్టపడతారు. 

అందరికీ అసలు యజమాని *పరమేశ్వరుడు.* మానవత్వంతో ప్రవర్తించే మనుషులంటే ఆయనకు పరమప్రియం. *‘కాయకమే కైలాసం’* అని చాటిన బసవేశ్వరుడు *‘పని చేయడమే కైలాసం చేరుకునే మార్గం’* అని భావించాడు. తనను ఆడంబరాలతో తెగ పూజించే వారికంటే, లభించిన వృత్తినే పరమ పవిత్రంగా భావించి నిజాయతీతో పనిచేసే వారిని ఈశ్వరుడు ఇష్టపడతాడు. 

బసవ పురాణంలో వర్ణించిన కష్టజీవుల కథలు ఇందుకు నిదర్శనం.

ఆధ్యాత్మిక మేరు శిఖరం ఆదిశంకరులు. *‘ఆధ్యాత్మిక తత్త్వాన్ని మాత్రమే సాధించండి... ప్రాపంచిక జీవితాన్ని వదిలేయండి!’* అని ఆదిశంకరులు చెప్పలేదు. అదే ఆయన బోధనలో విశిష్టత. జీవధర్మాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహించమని బోధించారు. 

మానవ జీవనధర్మం కర్తవ్య నిర్వహణ. మహాత్ముల జీవనవిధానం చూస్తే పని ప్రాధాన్యం తెలుస్తుంది.

కోల్‌కతాలో డాక్టర్‌ మహేంద్రనాథ్‌ పేరు ప్రఖ్యాతులున్న వైద్య శిఖామణి. ఆ వృత్తిలో రెండు చేతులా సంపాదించాడు. రామకృష్ణ పరమహంస గురించి విని ఆయనను దర్శించడానికి వెళ్ళాడు. పూలతోట వద్దకు వెళ్ళేటప్పటికి,  *‘పరమహంస వద్దకు వట్టి చేతులతో పోకూడదు. పూలు సమర్పిస్తే బాగుంటుంది...’* అనిపించింది. తోటలో ఒక వ్యక్తి పనిచేస్తూ కనబడ్డాడు. ‘ఏయ్‌ తోటమాలీ! మంచి పూలు కొన్ని కోసి ఇవ్వు’ అని అడిగాడు మహేంద్రనాథ్‌. ‘మీకు పూలతో పనేమిటి?’ అని అడిగాడు పనిలో నిమగ్నమైన వ్యక్తి. ‘రామకృష్ణ పరమహంసకు సమర్పించాలి!’ అన్నాడు మహేంద్రనాథ్‌.

ఆ వ్యక్తి ఇచ్చిన పూలు తీసుకొని ఆయన లోనికి వెళ్ళాడు. అప్పటికే చాలామంది భక్తులు అక్కడ పరమహంస దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇంతలో పరమహంస అక్కడకు రానే వచ్చారు. భక్తులందరూ ఆయనకు ప్రణామం చేశారు. మహేంద్రనాథ్‌ నిర్ఘాంతపోయాడు. ఇందాక పూల తోటలో పనిచేస్తున్న వ్యక్తి ఆయన! 

పూలను పరమహంస పాదాలపై పెట్టి,  ‘స్వామీ! ఇందాక మిమ్మల్ని తోటమాలిగా భావించి అలా మాట్లాడాను... మన్నించండి!’ అన్నాడు మహేంద్రనాథ్‌ పశ్చాత్తాపంతో. 

‘నాయనా! తోటపనీ భగవదారాధనే... నువ్వు చేసే పనినే దైవపూజగా భావించు. నీ వృత్తిలో దేవుణ్ని చూడు’ అని పరమహంస బోధించారు.

జనకుడు రాజు. ధనానికి కొదవ లేదు. సంపాదనపై ఆయనకు ఆశ లేదు. అయినా అనునిత్యం కృషి చేస్తుండేవాడు. ఒక సామాన్య రైతు లాగా హలం చేతపట్టి పొలం దున్నుతూ ఉండేవాడు. రుషిలాగా నిరాడంబర జీవితం గడుపుతూ రాజర్షి అని ప్రఖ్యాతి గాంచాడు. ఆయన పొలం దున్నుతున్నప్పుడే సీత లభించింది. జనకుడి జీవితం వాస్తవానికి ప్రతిబింబం. కష్టాలు పడే కుమార్తెకు తండ్రి ఆ రైతు! ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించడానికి సిద్ధంగా ఉండే నిత్య కృషీవలుడు జనకుడు ధన్యజీవి.

కొందరు ఏ పనికీ ముందుకు రారు. ఏం చేయమన్నా ఒకటే సమాధానం - ‘అబ్బే... నాకేం చేతనవుతుందండీ... నా మొహం! నా వల్ల ఏమవుతుంది?’ అని. పని చేయడానికి వాళ్లు ముందుకు రాకపోగా అందరిలో నిరుత్సాహాన్ని నింపుతారు. ఆత్మవిశ్వాసమే ఇందుకు మందు. 

అర్జునుడు కురుక్షేత్రంలో ముందు నిరుత్సాహానికి గురవుతాడు. పార్థసారథి అర్జునుణ్ని తన గీతా ప్రబోధంతో కర్తవాన్ని గుర్తుచేసి, ఉత్సాహవంతుడిగా మార్చి విజయుణ్ని గావించాడు.

*లోకాస్సమస్తా సుఖినోభవంతు*

*Courtesy* : *ఈనాడు*

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

13. ఆత్మ జ్ఞానం, మోక్షమార్గం

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 🔥 *"13"* 🔥
   🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
   🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
     💖🔥💖🔥💖🔥💖
           💖🔥🕉🔥💖
                 💖🔥💖
                       💖
*"ఆత్మ జ్ఞానం 🔥 మోక్ష మార్గం 🔥 సృష్టి రహస్యం 🔥 ఏడు జన్మలు ఏమిటి ? 🔥 నేను అంటే ఎవరు ? 🔥 దుఃఖం ఎలా తొలగుతుంది ? 🔥 జ్ఞాన విచారణ 🔥 మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు 🔥"*

*"మరి ఈ శరీరంలోనే ఉంటూ ఈ అనుభవాలు అన్నీ పొందే “నేను” అనే ఆకారం లేని చైతన్య స్వరూపుడు  ఇందులోకి ఎక్కడి నుంచి వచ్చాడు?"* 

*"పదార్దాల నుంచి పదార్దాలు ఏర్పడడం సహజం."* 

*"కానీ ఆహారం నుంచి తయారయిన ఈ శరీరంలోకి “నేను” అనే ఆకారం లేని “చైతన్య స్వరూపుడు” ఎక్కడి నుంచి వచ్చి ఇందులో ప్రవేశించాడు."* 

*"ఇది తీపి, ఇది చేదు, ఇది ఇష్టం, ఇది కష్టం అని అనేకానేక అనుభవాలు పొందుతున్న ఇందులోని చైతన్య స్వరూపుడికి కారణం ఎవరు?"*

*"ఈ ప్రశ్నకు సూటి అయిన సమాదానం ఏంటంటే!"* 

*"శరీరాలన్నీ కేవలం భ్రమ."*

*"ఇవి ఏ సమయంలోనూ ఉన్నవి కాదు అని. ‘చైతన్యమే’ శరీరాలను కల్పన చేసుకుని అవి తనకంటే వేరుగా ఉన్నట్లుగా భావిస్తూ తనే వాటిని బాహ్యంలో దర్సిస్తోంది తప్ప ఈ శరీరాలన్నీ వున్నవి కాదు."*

*"ఉన్నది ఏకైక నిరాకార చైతన్యమే."* 

*"అయితే చైతన్యం అలా ఎందుకు చేస్తోంది అనేదానికి సమాదానం లేదు."* 

*"జబ్బు వచ్చాక దాన్ని తొలగించుకోవడమే తక్షణ కర్తవ్యంగాని అసలు జబ్బు ఎందుకు వచ్చింది?"* 

*"ఎక్కడ వచ్చింది?"*

*"ఏమి తింటే వచ్చింది?"* 

*"అని తర్కించుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం."*  

*"రోగం తీవ్రత పెరిగి రోగి మరణిస్తాడు."*

*"కాబట్టి రోగం ఎలాగయినా రానీ రోగం ఉందని తెలిసాక ముందు రోగాన్ని నయం చేసుకోవడమే అత్యవసరం."*

*"అలాగే అజ్ఞానం చేత ఆత్మ ఎలా శరీరాన్ని కల్పించుకుని మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగు రూపాలుగా మారి సుఖ దుఃఖాల కల్పనలో పాల్గొంటోంది అనేది ఒకసారి పరిశీలిద్దాం."*

*"మనస్సు మననం చేస్తుంది."* 

*"బుద్ధి నిర్ణయం తీసికుంటుంది."* 

*"చిత్తం ఈ తతంగాన్నంతా తనలో నిల్వ చేసుకుంటుంది."*

*"ఈ శరీరమే నేను అని నమ్మడమే అహం యొక్క లక్షణం."*

*"ఒక అందమయిన స్త్రీ ని ఒక వ్యక్తి యొక్క మనస్సు కంటి చూపు ద్వారా చూసినప్పుడు ఆహా ఏమీ ఆ స్త్రీ అందం, ఎంత చక్కటి శరీరం అని భావన చేస్తుంది."* 

*"అప్పుడు ఆ స్త్రీ తన కంటి ముందు నుంచి వెళ్ళిపోతూ కనుమరుగగుచున్నప్పుడు అతడి మనస్సు తను భావించిన తన కోరికను బుద్ధిలోకి పంపిస్తుంది."* 

*"బుద్ధి అప్పటికప్పుడు తక్షణం ఏమి చెయ్యాలో సంకేతం ఇస్తుంది."* 

*"అప్పుడు మనస్సు బుద్ధి చెప్పిన ప్రకారం నడిచి వెళుతున్న ఆ స్త్రీ వెనుకే తనూ నడుస్తుంది."*

*"కొంచెం దూరం వరకు వెళ్ళిన ఆ స్త్రీ ఒకచోట బైక్ పై కూర్చుని తనకోసం ఎదురు చూస్తున్న ఒక యువకుని వద్ద ఆగి అతడి వెనకాల అదే బైక్ మీద కూర్చుని రయ్ మని వెళ్ళిపోతుంది."* 

*"ఆ స్త్రీని వెనుక అనుసరిస్తూ వస్తున్న వ్యక్తి మనస్సు తన ఎదురుగా జరిగిన ఆ సంఘటన మొత్తాన్ని ఉసూరుమంటూ చూసి ఇక తనేం చెయ్యాలో తెలీక మళ్ళీ బుద్ధిలోకి పంపిస్తుంది."* 

*"బుద్ధి వెంటనే ‘వెనక్కు వచ్చేయ్’ అని సంకేతం ఇస్తుంది."* 

*"మనస్సు ఇక చేసేదేమీలేక వెనక్కు వచ్చేస్తుంది."* 

*"కొంచెం సమయం పాటు మనస్సు దుఃఖిస్తూ దుఃఖస్థితిలో వుంటుంది."* 

*"ఆ తర్వాత జరిగినదంతా మరచిపోయి వేరే పనిలో తన దృష్టిని పెడుతుంది."*

*"అయితే ఏదయితే ఒక అనుభవం మనస్సు బుద్ధి మూలంగా లోన రూపు దిద్దుకునిందో అదంతా అతడి “చిత్తం” అనే చోటుకి వెళ్లి నిల్వ ఉండిపోతుంది."* 

*"మనసుపెట్టి ఏదయితే చేస్తామో ఆ ప్రతిదీ చిత్తంలోకి వెళ్లి నిల్వ ఉండిపోతుంది."*

*"ఈ చిత్తమే జన్మలు, దేహాలు, లోకాలు అనే భ్రమలకు మూల వస్తువు."*

*"ఈ చిత్తాన్ని నాశనం చేస్తేనే మానవునికి ముక్తి."* 

*"శరీర నాశనంతో ఏదీ నాశనమవదు."* 

*"చిత్త నాశనమే సర్వ దుఃఖ నాశనం. అదే ముక్తి."*

*"మరి చిత్తాన్ని ఎలా నాశనం చెయ్యాలి అంటే మానవుడు తన మనసులో ఏ విషయాలూ భావించకూడదు."* 

*"మనస్సులోకి విషయాలు రానివ్వకూడదు."*

*"మనస్సును నిశ్చలంగా నిర్విషయ స్థితిలో నిరంతరం నిలుపి ఉంచుకోవడం సాధన చెయ్యాలి."* 

*"చిత్తంలో వున్న పాత విషయాలను ఈ మనస్సు అప్పుడప్పుడు వెనక్కు తీసికుని మననం చేస్తూ వుంటుంది."* 

*"వీటినే జ్ఞాపకాలు అని కూడా అంటాం."*
            💖🔥💖🔥💖
                  💖🕉️💖
        

శ్రీరమణీయం: ప్రకృతిలో నేను అంతర్భాగమేనన్న సత్యాన్ని ఎందుకు తెలుసుకోలేక పోతున్నాను ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"472"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"ప్రకృతిలో నేను అంతర్భాగమేనన్న సత్యాన్ని ఎందుకు తెలుసుకోలేక పోతున్నాను ?"*

*"మన అహంభావనే (నేను అనే భావన) మనం ప్రకృతిలో అంతర్భాగమేనన్న సత్యాన్ని గుర్తించనివ్వదు ! మనకు సంబంధంలేని విషయాల్లో ఎంతటి మార్పునైనా మనం సునాయాసంగా అంగీకరించేస్తాం. కానీ మనకు సంబంధించిన విషయాల్లో అనుకూలం కాని చిన్న మార్పును కూడా ఏమాత్రం సహించలేక పోతున్నాం. నదిలో స్నానంచేసి వచ్చిన పరమానందయ్య శిష్యులు తమను తాము మినహాయించుకుని వారి సంఖ్యను లెక్కించుకున్నారు. ఒకరు తగ్గారంటూ దుఃఖించటం మొదలుపెట్టారు. మార్పును అంగీకరించడంలో మన పరిస్థితి కూడా అంతే తయారైంది. ప్రకృతిలో జరిగే సహజమైన మార్పు నుండి మనలను మనం మినహాయించుకోవటం అలవాటైంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"

ఆత్మానందము..."

 🙏🕉🙏                  ..... *"శ్రీ"*

   🔥 *"ఆత్మానందము..."*  🔥
   🔥⚜️🔥⚜️🔥⚜️🔥
         🔥⚜️🕉⚜️🔥
               🔥⚜️🔥
                     🔥
*"బోధ్కోన్యసాధనేభ్యో హి*
*సాక్షాన్మోక్షైక సాధనం |*
*పాకస్య వహ్నివత్‌ జ్ఞానం*
*వినా మోక్షో న సిద్ధ్యతి ||"*

*"తా || వంట చెయ్యటానికి అగ్ని ఎట్లా ప్రధాన సాధనం అయి ఉందో అట్లాగే మోక్షాన్ని పొందటానికి ఆత్మజ్ఞానం ముఖ్య సాధనం అయి ఉంది. ఇతర సాధనాలతో పోల్చినప్పుడు గురుబోధ అనే ఆత్మజ్ఞానం ఒక్కటే మోక్షానికి ఉత్తమమైన సాధనం."*

*"వివరణ..."*

*"దేహమే నేను అనే భ్రాంతిని తొలగించుకొని, ఆత్మే నేను అనే జ్ఞానాన్ని గ్రహించటమే నిజమైన జ్ఞానం అయి ఉంది. గురువు శిష్యునికి జ్ఞానాన్ని ఇవ్వటం అంటే నువ్వే బ్రహ్మవి, నువ్వు దేహానివి కావు, నీ పరమేశ్వరుడు నీ లోనే ఉన్నాడు, నీ ఆత్మని నువ్వు తెలుసుకొని నీ చైతన్యాన్ని నీ సత్‌ తో కలుపుమని జ్ఞానాన్ని బోధిస్తాడు. అపరోక్ష జ్ఞానాన్ని శిష్యుడు అవగతం చేసుకొనేటట్లు చేస్తాడు."*

*"దేహమే నేను అని అనుకోవటమే అజ్ఞానమని, దాన్నుంచి విముక్తి పొంది జ్ఞానంతో జీవించమని శిష్యునికి గురువు బోధిస్తాడు. చిత్‌ సత్‌ తో కలుపటానికి కావలసిన సాధన మార్గాన్ని బోధించి శిష్యుడు సచ్చిదానందాన్ని అనుభవించేటట్లు చెయ్యగలగుతాడు. జ్యోతిర్బ్రహ్మను, నాదబ్రహ్మను, శబ్దబ్రహ్మను, అమృత బ్రహ్మను అనుభవించటానికి కావలసిన సాధన మార్గాన్ని గురువు శిష్యునికి ప్రసాదించి శిష్యుడు తానే బ్రహ్మగా నిలిచేటట్లు చెయ్య గలుగుతాడు. ఇదే ఆత్మజ్ఞానానికి నిజమైన మార్గం."* 

*"లోకంలో సాధకునికి కర్మ మార్గం, భక్తి మార్గం, యోగమార్గం అని అనేక మార్గాలు ఉన్నప్పటికి ఆత్మబోధకు, ఆత్మానందానికి జ్ఞానమార్గం ఒక్కటే సరైన దారని ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ తెలియజేశారు."*

*"సూర్యుని బొమ్మను చూపించి సూర్యకాంతి వస్తుంది అంటే రాదు కదా.. అదే విధంగా వంటకు కావలసిన పప్పు, ఉప్పు, బియ్యం, కారం, చింతపండు, కాయగూరలు, నూనె వగైరా అన్నీ ఉన్నా తింటానికి కావలసింది తయారు కాదు గదా... అగ్ని లేకపోతే పదార్థాలన్నీ కూడా వాటి పూర్వస్థితి లోనే ఉండిపోతాయి.. పొయ్యి కింద నిప్పుపెట్టి, పదార్థాలను అన్నిటిని తగు పాళ్ళలో ఉపయోగించి వంట చేసినప్పుడే కదా కావలసిన రుచి, తింటానికి పదార్థం లభిస్తుంది. పదార్థాలు పక్వం అవ్వటానికి, ఆహారం తినటానికి నిప్పు ఎంత అవసరం అయిందో అదే విధంగా ఆత్మానందాన్ని అనుభవించటానికి ఆత్మజ్ఞానం కూడా అంతే అవసరం."*

*"తపస్సు, మనో నిగ్రహం, శాస్త్రజ్ఞానం, జ్ఞాన విచక్షణ, వివేకం, శ్రద్ధ మొదలైనవి అన్నీ కూడా పారమార్థిక జ్ఞానాభివృద్ధిని కలిగిస్తాయే కాని.. మోక్షానికి కావలసిన ఆత్మానందాన్ని మాత్రం ఇవ్వలేవు. గురువు ప్రసాదించే ఆత్మజ్ఞానం మాత్రమే ఆ అనుభూతిని, ఆ ఆనందాన్ని ప్రసాదించ గలుగుతాయి. కావున సాధకుడు ఆత్మసాక్షాత్కార వైభవాన్ని గురుజ్ఞానంద్వారా మాత్రమే పొంద గలుగుతాడు. పుస్తకాల్లో ఎన్ని రాసి ఉన్నా జీవించి ఉన్న గురువు ద్వారా ప్రత్యక్షంగా వాటి సాధనలను, సాధక బాధకాలను అవగాహన చేసుకొని అనుభూతిని పొందినప్పుడే సాధకుడు నిజమైన జ్ఞానం ఏమిటో గ్రహించ గలుగుతాడు. ఆత్మను తెలుసుకొన్న వాడికి ఈ జీవితమనే శోక సముద్రాన్ని దాటటం తెలుస్తుంది. పుట్టింది దుఃఖించటానికి కాదు, ఆత్మానందాన్ని అనుభవించటానికి అని తెలుస్తుంది."*
             🔥⚜️🔥⚜️🔥
                   🔥🕉️🔥
               

ఎప్పుడైనా అహంకారం మనిషినైనా ఆకునైనా అధోపతళానికి తీసుకువెళతాయి అణుకువ వినియం కలిగి ఉందాం భగవంతుడిని కృపను పొందుదాం

 🙏🏿💐
ఎవరికైనా అహంకారమే అవరోధం🙏🏽💐
అహంకారంతో ఎందరో మహానుభావులు నామరూపాలు లేకుండా పోయారు రావణాసురుడు హిరణ్యకశిపుడు హిరణ్యక్షుడు దుర్యోధనుడు లాంటివారు ఎందుకు కొరగాని వాళ్ళు అయిపోయారు🙏🏽💐
ఎప్పుడైనా అహంకారం లేకుండా అణుకువ వినియం కలిగి ఉంటే మామూలు వ్యక్తులు కూడా మహాత్ములు అవుతారు అనేది సత్యం అహం ఉంటే మనుషులే కాదు ఆకులు అలములు కూడా గౌరవం కోల్పోతాయి🙏🏽💐
ఒక చిన్న కథ చాలా బాగుంది చదవండి 🙏🏿💐
ఒకసారి ఆకులన్నీ సభ పెట్టుకున్నాయి. ముందుగా మామిడాకు తల ఎగరేస్తూ మాట్లాడింది నేను ప్రతి శుభానికి శుభకార్యానికి ఎంతో అవసరం ఆఖరికి దేవుడు విగ్రహాలను పటాలను కూడా నేను లేకుండా పెట్టరు గోప్ప జన్మ నాది అని మామిడాఅంది అయితే గుమ్మాలకి ద్వారాలకి తలకిందులుగా వేలాడటమే మామిడాకు స్థానం అని నిజాన్ని మర్చిపోయింది అంటే బతుకు తల్లకిందలైందనే విషయాన్ని గ్రహించలేకపోయింది🙏🏽💐
ఇక తర్వాత అరిటాకు నిలిచింది తన ప్రతిభను చెప్పుకోవడం మొదలుపెట్టింది దేవునికి ప్రసాదం నివేదన అరిటాకుల్లోనే చేస్తారని గొప్పగా చెప్పుకుంది పెళ్ళిలో పేరంటాల్లో అరిటాకులో భోజనాలు వడ్డించితే సాంప్రదాయ పద్ధతిలో భోజనాలు పెట్టారనే గొప్ప పేరు ఆ భోజనానికి వస్తుందని గర్వంగా తల ఎగరేసింది  అయితే అవసరార్థం అరిటాకును వాడిన చివరకు తాను ఎంగిలాకుల కుప్పలో పడవలసిందే అని అరిటాకు మర్చిపోయింది🙏🏿🙏🏽🙏🏽💐
ఇక కరేపాకు వంతు వచ్చింది వంట రుచి రావాలంటే సుగంధ భరితం అవ్వాలంటే కరేపాకు ఎంతో అవసరం. కరేపాకు లేకపోతే ఆ వంట దానికి సార్థకత రాదు అంతటి ప్రాముఖ్యత కలదాన్ని నేను అని కరేపాకు అహం ప్రదర్శించింది అవునవును తింటున్నప్పుడు నిన్ను (కరేపాకు తీసి )అవతల పారేస్తారు అంత నీచమైన స్థానం నీది అని మిగతా ఆకులు విని  వినబడనట్లు గోణుక్కున్నాయి🙏🏿🙏🏽💐
ఇక తర్వాత తమలపాకు మాట్లాడింది మంచి సువసనతో నోరులన్నిటినీ పండిస్తాను తాంబూలం సేవనానికి మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉందని తన గొప్పతనాన్ని తానే చెపుతుంది తమలపాకు అవునవును తాంబూల సేవనం అయిన తర్వాత పిప్పిగా మిగిలిపోయిన నిన్ను వుంమ్ముగా వూసి పారేస్తారు అది నీ స్థానం అని హాస్యంగా నవ్వుకుంటూ ఎగతాళి చేశాయి మిగతా ఆకులు🙏🏿🙏🏽💐
తమలపాకు తర్వాత మారి ఏ ఆకు మాట్లాడటానికి నిలబడలేదు అయితే వినమ్రరంగా కూర్చుని అంతా వింటున్న ఓ ఆకు తులసి ఆకు వైపు చూసింది తులసి ఆకుని తన గొప్పదనాన్ని చెప్పుకోమని తులసిఆకుకు ఎంతగానో చెప్పింది తులసి ఆకు మాత్రం ససేమీరా మాట్లాడలేనని కరాఖండిగా చెప్పింది మాట్లాడవలసిందే అని అన్ని ఆకులు తులసిని ఆకును బలవంతం చేశాయి చేసేదేమీ లేక మాట్లాడటానికి సిద్ధపడింది తులసి ఎంతో వినమ్రరంగా నిలుచుని ఇలా అంది నేను చాలా చిన్న ఆకుని నాకే ప్రత్యేకత లేదు అని చెప్పి నెమ్మదిగా కూర్చుంది తులసి ఆకులో అణువణువునా ఏమాత్రం అహంకారం అహభావం ఏ మాత్రం కనిపించలేదు అందుకే తులసి ఆకు పవిత్రమైంది అమ్మ స్థానం పొందింది తులసమ్మాయింది ప్రతి వారి చేత నిత్యం పూజలు అందుకుంటుంది
చూశారా ఎప్పుడైనా అహంకారం మనిషినైనా ఆకునైనా అధోపతళానికి తీసుకువెళతాయి
అణుకువ వినియం కలిగి ఉందాం భగవంతుడిని కృపను పొందుదాం 🙏🏿🙏🏿💐💐
(ఒక మహానుభావుడు రచన నుండి సేకరణ)