Friday, May 31, 2024

గురువున్నవాడు భాగ్యశాలి!

 *గురువున్నవాడు భాగ్యశాలి!*
                 ➖➖➖

**గురుస్సాక్షాత్ పరబ్రహ్మ!* 
(సమస్త గురువుల పాదపద్మములకు ఈఅక్షర కుసుమాల మాల అంకితం) 

**మనసును గురువు చుట్టూ తిప్పితే, తలతిరిగే మత్తు శరీరానికి ఎక్కుతుంది...!!!*
ఆమత్తులో కలిమాయ చిత్తవుతుంది..!
ఇది గురువు మాత్రమే చెయ్యగల గమ్మత్తు...!!! 

**ఒక్క సూర్యుడు వెయ్యి కడవల్లో గల నీటిలో దర్శనమిచ్చినట్లు, ఒక్క గురువు వేలమంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనిమిస్తాడు...!!!* 
సూర్యుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తాడు,గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తాడు...!!!

**గురువు చూపుయే ఉపదేశం...!!!* 
గురువు జీవితమే ఓ సందేశం...!
గురువు పలుకులే ఉపనిషత్తుల సారాంశం...!!
గురువు స్పర్శయే ముక్కోటి దేవతల ఆశీర్వాద ఫలం...!!!
శిష్యుడి జీవితం ఓ వాహనం,
గురు కృప అందులోని ఇంధనం...!!! 

**మాంస నేత్రాలతో చూసేవాళ్లకు గురువు ఓ శరీరం...!!!* 
మనో నేత్రంతో చూసేవాళ్లకు గురువు పరబ్రహ్మం యొక్క సాకారం...!
గురువు సర్వజ్ఞుడు...!!
గురువు దైవజ్ఞుడు...!!!

**మూర్తీభవించిన పరంజ్యోతి యొక్క కరుణయే గురువు...!!!* 
గుండెల్లో గురువు ఉంటే, జీవితంలో కరువు ఉండదు...!
గురువు యొక్క చూపు, శిష్యుడి జీవితనౌకకు బలమైన చుక్కాని...!!
గరువు యొక్క మనసు, మమతానురాగాల మాగాణి...!!!

**సంకెళ్లతో బంధియైన శిష్యుని జీవాత్మకు ముక్తిని ప్రసాదించగలిగే ఏకైక శక్తిశాలి గురువొక్కడే...!!!* 
అగమ్యగోచరంగా సాగుతున్న కోట్ల జన్మల ప్రయాసకు ముగింపు చేప్పే ఏకైక దిక్సూచి గురువొక్కడే...!!!

**గురువు నిండు మేఘమై వర్షించగలడు...!!!* 
గురువు చల్లటి చినుకై స్పృశించగలడు...!
గురువు తేజోవంతమైన విత్తనమై నాటుకోగలడు...!!
గురువు మహావృక్షమై నీడనీయగలడు. 
గురువు కమ్మటి మెతుకై ఆకలి తీర్చగలడు...!!!

**కాలికి గ్రుచ్చిన ముల్లును తీయుటకు వజ్రాయుధాన్ని ఉపయోగించటం ఎంతటి అజ్ఞానమో,* 
బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేయగల గురువును తృచ్ఛమైన  కోరికలు కోరడం అంతటి అజ్ఞానమే...!!!

**గురువు శరీరంతో కనిపించగలడు, కాంతి పుంజముల అఖండ ధారగా అనంతాన్ని ఆవరించగలడు...!!!* 
సమస్త గ్రహములు ఉపగ్రహములతో నిండిన కక్ష్యలు గురువు మెడలో రుద్రాక్ష మాలలు...!!!
సమస్త నక్షత్ర మండలాల సమూహంతో నిండిన అంతరిక్ష తళాలు గురువు కిరీటంలో గల వజ్రాల పలకలు...!!!

**గురువున్నవాడు భాగ్యవంతుడు...!* 
గురువున్నవాడు ఐశ్వర్యవంతుడు...!!
గురువున్నవాడు అదృష్టవంతుడు...!!!
.

*****మౌనంగానే ఎదగాలి

 🙏 మౌనంగానే ఎదగాలి 🙏

🌺వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.

🌹అయిదు ‘శాంతి’లలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు.

‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత.   ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’ అన్నారు స్వామి వివేకానంద.🌹

🌹మౌనం మూడు రకాలు.🌹
     
1. ఒకటవది: వాక్‌మౌనం. వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి.

2. రెండోది అక్షమౌనం. అంటే ఇంద్రియాలను నిగ్రహించడం.

3. మూడోది కాష్ఠమౌనం. దీనినే ‘మానసిక మౌనం’ అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దాన్నీ అరికట్టినప్పుడే కాష్ఠమౌనం సాధ్యపడుతుంది.

మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, అంతర సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటివారిలో  పరివర్తన  తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగ మవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యమిచ్చారు.

మౌనాన్ని అవలంబించిన మహాత్ముల్లో రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ వంటి వారెందరో ఉన్నారు.

ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు.

రోజూ అరగంట మౌనంగా ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ,  టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్‌ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని మాటను, మనసును మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది.

ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు’ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి.🌺

ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే…‘మౌనం’.

ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది.   భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే. మనందరం మౌనంగానే ఎదుగుదాం!

🌹సేకరణ.🌹

****రమణుల సమస్త ఉపదేశసారం

 ఓం నమో భగవతే శ్రీ రమణ

గురు సన్నిధి

‘‘నువ్వేమిటో తెలుసుకోకుండా, 
జగత్తును తెలుసుకోవాలనుకుంటే, 
అది నిన్ను చూసి వెక్కిరిస్తుంది.
ముందు నీ మనస్సుని చదువు. 
తర్వాత జగత్తును చూడు. 
అప్పుడు ప్రపంచమే ఆత్మ అవుతుంది.
 నీకు అవగతమవుతుంది’’అంటారు భగవాన్‌ రమణ మహర్షి.

 భగవదన్వేషణలో ఎన్నెన్నో ప్రశ్నలతో రమణాశ్రమం చేరినవారికి ఆశ్చర్యకరంగా భగవానుల శక్తిమంతమైన మౌనంలోనే సంశయ నివారణ అయ్యేది. 

⭐ఆయన మౌనమే వారికి మహాజ్ఞానబోధ. ⭐

రమణుల సమస్త ఉపదేశసారం ఏమంటే 

⭐‘‘నిన్ను నీవు తెలుసుకో’’.⭐

నీకేది కావాలో ఆయనకు తెలుసు

శివదర్శనం కోసం తహతహలాడుతున్న భక్తురాలిని చూచి భక్తిని గురించి వివరించారు రమణులు. 

‘‘భగవంతుడిని శరణు వేడు. 
ఆయన ఇష్టానికి తలవంచు. 
నీ ఇష్టమొచ్చినట్లు ఆయన నడుచుకోవాలనుకోవడం శరణాగతి కాదు. నీకు ఎప్పుడు, ఏది, ఎలా చెయ్యాలో ఆయనకే బాగా తెలుసు. ఈ విషయంలో నీకిక బాధ్యతలే ఉండవు. అన్ని బాధ్యతలూ ఆయనవే. ఇదే అసలైన శరణాగతి. 

ఆ పరమాత్మ పేరే ‘నేను’. 
అన్నిటా వ్యాపించిన ఆ భావనతో కలిగే 
సద్భావస్థితిని ఉత్తమమైన భక్తి అంటారు. 
ప్రేమ, వికాసం, అనురాగం కలిగివుండటం 
నిజమైన భక్తుని లక్షణం.  

అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల...🙏🏻

అవధూత అంటే ఎవరు ? సన్యాసి అంటే ఎవరు ?

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*అవధూత అంటే ఎవరు ? సన్యాసి అంటే ఎవరు ?*
.
*ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు..*

*అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటు గా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు.*

*అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు సన్యాసం గురించి తెలుసుకుందాము.*

*సన్యాసం నాలుగు రకాలు.*

*1. వైరాగ్య సన్యాసం :*
*వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది. ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు. అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది.*

*2. జ్ఞాన సన్యాసం :*
*సత్ సాంగత్యం ద్వారా, లౌకిక వాంచలు తగ్గిపోయి సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ, ఏది తనకు అంటకుండా వసిస్తూ ఉంటాడు .*

*౩. జ్ఞాన వైరాగ్య సన్యాసం :*
*సాధన ద్వారా , ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని నిత్య ఆనంద స్థితిలో జీవిస్తాడు.*

*4. కర్మ సన్యాసం :*
*బ్రహ్మచర్యము, గృహస్త, వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ, ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం.*

*ఈ సన్యాసులు ఆరు రకాలు :*

*1. కుటిచకుడు :*
*శిఖ, యఙ్ఞోపవితము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తీ మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు.*

*2. బహుదకుడు :*
*ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాధన చేస్తూ ఉంటారు.*

*౩. హంస :*
*ఇతను జడధారియై కౌపినం ధరించి ఉంటాడు.*

*4. పరమహంస :*
*వెదురు దండాన్ని కలిగి , ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని, కౌపీనం మాత్రం ధరించి నిరంతర సాధనలో ఉంటారు.*

*5. తురియాతీతుడు :*
*దేహాన్ని ఓ శవంలా చూస్తాడు .*

*6. అవధూత :*
*ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియమాలు లేవు. జగత్ మిధ్య నేను సత్యం అంటూ, నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు. చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు. నాకు పాప పుణ్యాలు, సుఖ దుఖాలు లేవు. గర్వము, మాత్సర్యము, డంభము, దర్పము, ద్వేషము, అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహరం అర్పణ చేస్తూ, దొరకని రోజు ఏకాదశి, దొరికిన రోజు ద్వాదశి అంటూ రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు.*

*కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు.*

 *సద్గురు రూపాలైన అవధూత లందరికీ సాష్టాంగ దండ ప్రణామములు🙏🙇🏻‍♀️*

నిశ్శబ్దాన్ని అభ్యసించండి / Cultivate Silence

 *🌹 నిశ్శబ్దాన్ని అభ్యసించండి / Cultivate Silence 🌹*
*✍️ ప్రసాద్ భరద్వాజ*

*సృష్టి అంతటి వెనుక నిశ్శబ్దమే ఉంది.  నిశ్శబ్దం అనేది సృష్టి అంతటికి మరియు సృష్టించబడిన అన్నింటికీ కీలకమైన అంశం.  ఇది దాని స్వంత హక్కులతో ఉన్న ఒక శక్తి.  కళాకారుడు ఖాళీ కాన్వాస్‌తో ప్రారంభిస్తాడు తన రచనను -  సృష్టికర్త, స్వరకర్త నిశ్శబ్దమును గమనికల మధ్య మరియు వెనుక ఉంచాడు.  మీ ఆలోచనలన్నింటి నుండి బయటకు వచ్చే మీ ఉనికికి మూలం ఈ నిశ్శబ్దం.*

*మౌనానికి మార్గం ధ్యానం.  మీరు మీ స్వంత మౌనంలోకి వచ్చినప్పుడు మీకు నిజమైన స్వేచ్ఛ మరియు దాని నిజమైన శక్తి తెలుస్తుంది.  ఒక్క నిమిషం కేటాయించి, ప్రతిరోజు మీలో ఈ నిశ్శబ్దాన్ని వినండి.*


*🌹 Cultivate Silence 🌹*

*Behind all creation is silence. Silence is the essential condition, the vital ingredient for all creation and all that is created. It is a power in its own right. The artist starts with a blank canvas – silence. The composer places it between and behind the notes. The very ground of your being, out of which comes all your thoughts, is silence.*

*The way to silence is through meditation. When you arrive in your own silence you will know true freedom and real power. Stop, take a minute, and listen to the silence within you everyday.*
🌹🌹🌹🌹🌹

****ఆధ్యాత్మిక సాధనలో మౌనం వహించే పాత్ర గురించి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఏమంటారంటే....





 *శ్రీ గురుభ్యోనమః*
💐💐💐💐💐💐

*ఆధ్యాత్మిక సాధనలో మౌనం వహించే పాత్ర గురించి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఏమంటారంటే....* 

🌹🌹🌹🌹🌹🌹

*హృదయం భౌతికమైనది కాదు,  ఆధ్యాత్మికమైనది.*
*ఇదే కేంద్రం.*
*ఇది ఆలోచనల నుండి ఉద్భవిస్తుంది, అవి దానిపై ఆధారపడి ఉంటాయి మరియు అవి అక్కడ పరిష్కరించ బడతాయి.*
*ఆలోచనలు మనస్సు యొక్క విషయాలు, అవి విశ్వాన్ని రూపొందిస్తాయి. సాధనలో మౌనం ఒక భాగమా ? మౌనమే సాధనా ఫలమా ?*


*మనసులో ఏ అలజడిలేని మౌనమే అత్యుత్తమ దీక్ష అని భగవాన్ శ్రీరమణమహర్షి చెప్పారు.* 


*మౌనం అంటే మాటలు ఆగటం కాదు. విషయాల కోసం మనసు కదలకుండా ఉండటమే మౌనం !*

*మహిళలు తమ నివాసాల్లోనే ఎన్నో రకాల పిండి వంటలు చేస్తారు. అలా చేస్తున్నంతసేపు ఒక్క పిండి వంట విషయంలో కూడా వారికి నోరూరదు. అంటే అన్ని వంటకాల మధ్య రుచుల విషయంలో వారి మనసు మౌనంగానే ఉంటుంది. జ్ఞాని కూడా విషయ ప్రపంచంలో తాను చేయాల్సిన పనులన్నీ చేస్తూనే అలా మౌనంగా ఉంటాడు.* 

*మనసుకు అలాంటి మౌనాన్ని అలవర్చటమే ఏ దీక్షకైనా ఫలం. నిజానికి మనం ఎంచుకున్న లక్ష్యాన్ని ఫలంగా పొందటమే దీక్ష. మౌనమే అత్యుత్తమ సాధన, దీక్ష ! మౌనదీక్ష చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటారా ?*

*మౌనమే అత్యుత్తమ దీక్ష అని భగవాన్ శ్రీరమణమహర్షి అన్నారు అంటే మిగిలిన సాధనలన్నీ తిరస్కరించమని కాదు. వాటినే పరమావధిగా భావించి అక్కడే ఆగిపోవద్దని మహర్షి బోధ.*

*ఒక గమ్యానికి వెళ్ళదలుచుకున్న వారికి అక్కడికి చేరుకోవడం దీక్ష. బస్సు ఎక్కటం, కార్లో  ప్రయాణించటం ఇవన్నీ ఆ దీక్షకు ఉపకరించే విషయాలు మాత్రమే కానీ అవి దీక్ష కాదు. అలాగే సాధనలో ఏ దీక్ష అయినా లక్ష్యంగా ఎంచుకున్న ఆ ఫలం కోసమే. దీక్షలోని మిగిలిన ప్రక్రియలన్నీ ఆ ఫలాన్ని పదేపదే గుర్తుకు తెచ్చేందుకే.*

*మనం ధరించే ప్రత్యేక దుస్తులు కానీ మాలలు కానీ జపించే మంత్రంగాని చేసే ధ్యానంగాని దీక్షకు ఉపకరణాలు మాత్రమే. ఏ మార్గంలోనైనా అందరూ కోరుకునేది మనసు ఆగితే లభించే శాంతినే !*

*మనసుకు మాయ వచ్చి చేరిందా ? మనసే మాయగా ఉందా !*
*మాయ అంటే లేనిది ఉన్నట్లుగా కనిపించటం.*

*ఆధ్యాత్మిక సాధనలో మనసును ఆవరించిన మాయను విడనాడాలని అంటారు. నిజానికి మనసే మాయ అని శ్రీరమణమహర్షి చెప్తున్నారు. ఎందుకంటే *నిద్రలో కేవలం మనం మాత్రమే ఉంటున్నాం. అలా ఉన్నామనే ఆలోచన కానీ అనుకోవటం కానీ లేకుండా కేవలం ఉంటున్నాం అంతే ! కానీ నిద్ర లేవగానే మనసు నేను-అది అనే ద్వైత భావం పొందుతుంది. కనుక మనసుకు మరొక మాయ వచ్చి చేరదు. మెలకువ రాగానే రూపం తీసుకునే మనసే మాయగా ఉంది. సత్య వస్తువుకు ద్వైతం అని, అద్వైతం అని ఏదీలేదు, అది ఉంటుందంతే. మెలకువ రాగానే నేను, ఈ సృష్టి వేర్వేరు అనే ద్వైత భావన వచ్చింది. కాబట్టి అద్వైతం అనే మాట వాడాల్సివస్తుంది.*

*పసి పిల్లవాడికి నీళ్ళకు, నిప్పుకు తేడా తెలియదు. అప్పుడు వాడికున్నది అద్వైత భావన అని చెప్పలేం. ఎందుకంటే అసలు తేడానే తెలియని వాడికి  ద్వైతం ఏంటి? అద్వైతం ఏంటి?*  

*మాయ ఆవరించిన మనసుకు ద్వైతం అలవడుతుంది. తేడా తెలుస్తుంది. తేడా తెలిసిన తర్వాత అది పోగొట్టు కోవటం కోసం సాధన చేయాలి. ఆ సాధననే అద్వైత సాధన.  పుట్టినప్పుడు మనసు లేదు. క్రమంగా పెరుగుతున్న కొద్దీ భౌతిక విషయాల పట్ల కొంత అవగాహన ఏర్పడుతున్న కొద్దీ మనసు ఏర్పడుతుంది. అదే ద్వైతానికి దారి తీస్తుంది. ఆ ద్వైత భావన ఏర్పడిన మనసును మళ్ళీ అద్వైతం లోకి తీసుకువెళ్లాలి.  అంటే, మనసు లేని స్థితికి చేరుకోవాలి.* 

*పసిపిల్లల్లోని  ఉన్న ఆ మనసు మనసు లేని స్థితికి, అద్వైత భావనా స్థితికి, ఆ అద్వైత స్థితినే అలవరచుకునే ప్రయత్నము మనం చేయాలి.*

*ఏ స్థితి నుంచి వచ్చామో, మళ్ళీ అదే స్థితికి చేరుకోవాలి. అదే ఆధ్యాత్మిక సాధన.*  

💐🙏💐🙏💐

కర్మ బంధం

 కర్మ బంధం

🌷🌷🌷🌷

ఈ చరాచర సృష్టిలో కర్మలకు బందీ అయ్యేది మానవ జన్మ. ప్రతి మనిషి ఆయా దశల్లో కర్మలకు బందీ అవ్వాల్సినదే. బందీ కా కుండా కర్మబంధం నుండి తప్పించుకోవడానికి కొన్ని మార్గాలను తెలియజేస్తున్నాయి మన ఇతి హాసాలు. కర్మ బంధం విముక్తి కలగాలంటె కర్తృ త్వబుద్ధిని విడిచిపెట్టాల్సిందే అంటున్నాయి.
మనస్సు ద్వారా అభ్యాసయోగం చేయలేని వారు శరీరంతో భగవంతుని కొరకు కర్మలు చేస్తూ క్రమక్రమంగా సిద్ధిని పొందవచ్చు. మొత్తం మీద ఈ మార్గం కూడా మోక్షానికి దారితీస్తుంది.
ప్రపంచంలో అందరికీ ఒకే సాధన పనికిరాదు. వారివారి స్వభావాన్ని బట్టి, స్థితిని బట్టి, అర్హతలను బట్టి సాధనలు వేరువేరుగా ఉండాలి. ఇలా అనేక మార్గాలను (సాధనలను) చూపితే ఎవరికి కావలసిన మార్గాన్ని వారు ఎంచుకోవచ్చు. అయితే ఇక్కడే ఒక సందేహం. అన్నీ భగ వంతుని కొరకే చేస్తుంటే మన పనులు ఎవరు చేస్తారు, మనకోసం కొన్ని పనులు తప్పవు గదా! అని. ఐతే ‘అన్నీ మన పనులే చేసుకోవాలి’ అంటే భగవంతుని కోసం పనులు చేయనక్కర్లేదా అని ఎవరికీ సందేహం రాదు. అన్నీ భగవంతుని కొరకే పనులు చేయండి అంటేనే మరి మన పనులో అనే సందేహం.

సాధారణంగా మన తిండితిప్పల కోసం, సుఖం కోసం, భోగాల కోసం, అవసరాల కోసం కొన్ని పనులు చేస్తుంటాం. ఇవి మన కొరకు చేసే పనులు. ఇక సమాజం కోసం సభలు, సమావేశా లు, దేవాలయాలు, కళ్యాణ మండపాలు కట్టించటం, బావులు త్రవ్వించటం, వృద్ధాశ్రమాలు నిర్వహంచటం ఇవన్నీ సమాజం కోసం. ఇక పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, వేదాధ్యయనం మొదలైనవి భగవంతుని కొరకు చేసేవి. ఇలా 3 రకాలుగా చేస్తుంటాం. అయితే భగవంతుడేమో అన్నీ నాకొరకే చేయాలి అంటున్నాడు. ఎలా మరి, మనం చేసే పనులన్నీ మన కోసమైనా, సమాజం కోసమైనా, భగవంతుని కోసమై నా అన్నింటిని భగవంతుని పనులుగానే చెయ్యాలి. ఎలా, నేను కర్తను, నేనే వీటిని చేస్తున్నాను అనే అహంకారాన్ని కర్తృత్వ భావాన్ని వదిలి, నా కర్తవ్యం అనుకుంటూ చేస్తే సరి. నా వల్లనే ఈ పనులు జరుగుతున్నాయి అనే అహంకారం లేకుండా మనం భగవంతుని చేతిలో పనిముట్టులా చేస్తే అవి అన్నీ భగవత్‌ కర్మలే అవుతాయి. అన్ని అనర్థాలకు కర్తృత్వ మే మూలం. బల్బులు వెలుగుతున్నాయంటే బల్బుల గొప్పతనం కాదు. కరెంటు గొప్పతనమే. కలం కవిత్వాన్ని వ్రాస్తున్నదంటే కలం గొప్పతనం గాదు. దాన్ని పట్టుకున్న వాడి గొప్పతనమే. అవయవాలన్నీ పనిచేస్తున్నాయంటే వాటి గొప్పతనం కాదు. వాటికి శక్తినిస్తున్న చైతన్యం యొక్క గొప్పతనమే.
పరిస్థితి ఇదైతే మధ్యలో మనకు లేనిపోని పెత్తనం అహంకారం ఎందుకు, అహంకారం విడిచిపెడితే ఆత్మప్రాప్తియే. కనుక కర్మలు చేస్తున్నాం అంటే అవి మనను బంధంలో పడేస్తాయి. కర్మబంధం నుండి తప్పించుకోవాలంటే కర్తృత్వబుద్ధిని విడిచిపెట్టాల్సిందే. మన దృష్టిని భగవంతునిపై నిలిపి ఏ రకం కర్మలు చేసినా, ఎన్ని కర్మలు చేసినా అవి అన్నీ భగవత్పరమైన కర్మలే అవుతాయి.

ಓಂ ನಮಃ ಶಿವಾಯ
 కర్మానుభవం

🌷🌷🌷🌷🌷

మానవ జన్మకు విముక్తి దొరకాలంటే చేసిన పాపం అయినా, పుణ్యం అయినా అనుభవించితీరాల్సిందే!ప్రారబ్ధం మొదట రచించబడి తరువాత శరీరం రచించబడుతుంది. కాబట్టి, చింత దేనికి                                                    

 పూర్వం ఒక సాధువు ఉండేవాడు. అతడు నిరంతరం భగవంతుని నామం జపిస్తూ ఉoడేవాడు. అతని వద్ద అనేకమంది శిష్యులు ఉండేవారు. వారు ఆ సాధువుకి సపర్యలు చేసేవారు.  కొంతకాలానికి సాధువు ముసలివాడయైపోయాడు. మంచం మీదనుండి లేవలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు అతని శిష్యులు ఆ సాధువు నిత్యకృత్యాలు తీర్చుకోవడానికి సహాయం చేసేవారు. సాధువు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారు వచ్చి అతడిని శౌచానికి తీసుకెళ్ళేవారు.  రాను రాను శిష్యులు రెండుమూడు సార్లు పిలిస్తేనే గాని వచ్చేవారు కాదు. సాధువు చాలా బాధపడేవాడు. నేను ఇలా మంచానపడి ఉండటం ఎందుకు భగవంతుడు తీసుకొనిపోతే బాగుండును అనుకొనేవాడు. భగవంతుని నామజపం మాత్రం నిరంతరం చేసేవాడు.  తరువాత కాలంలో ఒక బాలకుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వచ్చి సాధువుకి సపర్యలు చేసేవాడు♪. అతని స్పర్శ చాలా మృదువుగా ఆహ్లాదంగా ఉండేది♪. ఈ బాలకుడిని నేను ఎప్పుడూ చూడలేదే అని సాధువు అనుకొనేవాడు.  ఒకరోజు సాధువు ఆ బాలుని చేయి గట్టిగా పట్టుకొని, 'నీవెవరువు, నిన్ను ఇదివరకు నేను ఎన్నడూ చూడలేదు' అని అడిగాడు.  అప్పుడు భగవంతుడు తనను తాను ప్రకటించుకున్నాడు. సాధువు భగవంతునికి నమస్కరించి, 'స్వామి! నాకు మీరు సేవ చేస్తున్నారా, నన్ను ఈ విధంగా కష్టపెట్టే కంటే నీ వద్దకు తీసుకుపోవచ్చుకదా!' అన్నాడు. 

 భగవంతుడు, 'నీవు చేసుకున్న కర్మఫలం ఇంకా మిగిలి ఉన్నది. అది పూర్తిగా తీరేవరకూ నీవు కష్టాలు అనుభవించాలి' అని సమాధానం చెప్పాడు. సాధువు, 'స్వామి! మీరు తలచుకుంటే నా కర్మఫలం తొలగించవచ్చుకదా! మీకు అసాధ్యం ఏముంటుంది' అన్నాడు. దానికి బదులుగా భగవంతుడు,'నీ కర్మఫలం ఈ జన్మలో నీవు అనుభవించకపోతే, ఆ కర్మఫలం అనుభవించడానికి నీవు మరలా జన్మించాల్సి ఉంటుంది' అన్నాడు. ఇంకా ఇలా చెప్పాడు. 'చిన్న చిన్న పాపాలు నా నామస్మరణ వలన తొలగిపోతాయి. పాపకర్మల ఫలం కూడా నా నామజపంతో పోగొట్టుకొనవచ్చును. కానీ పెద్ధ పాపాలు ఖచ్చితంగా ఎవరికి వారే అనుభవించి తీరాలి. కానీ నా నామజపం వలన ఆ కష్టాలు సులభంగా గట్టెక్కుతాయి' అని చెప్పి భగవంతుడు అదృశ్యమయ్యాడు.               

"అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశ్శుభం"

"చేసిన పాపం అయినా, పుణ్యం అయినా అనుభవించితీరాల్సిందే!"

ಓಂ ನಮಃ ಶಿವಾಯ

ఆధ్యాత్మిక రహస్యం అనగానేమి

 ఆధ్యాత్మిక రహస్యం అనగానేమి
 
      మన జీవితం లో సర్వ సాధారణం గా మనకి ఏది లేదో, ఏది దూరం అయిందో, ఏది దక్కలేదో మనం ఎక్కువగా ఆలోచిస్తాం. 

      భగవంతుడికి ఎన్నో పూజలు చేసినా, ఆయన కరుణ పొందలేక పోయామని వాపోతాం...

     అప్పుడప్పుడు మనం అంతర్ముఖులమై వివేకం తో విశ్లేషించి చూస్తే కొన్ని విషయాలు మనకే ఋజువు అవుతాయి. 

    మనం పొందలేక పోయినవి కాక, పొందినవి, సంపాదించుకున్నవి, నిద్రాణంగా ఉన్నవి, ప్రతిభలు
సేవ చేయడానికి లభించే అవకాశాల గురించి ఎప్పుడన్నా ఆలోచించామా...

      భగవంతుడు మనకి పుట్టుక తోనే ఎన్నో సుగుణాలు అర్హతలు,యోగ్యతలు, ప్రతిభలు, సేవ చేయగల శక్తి అవకాశాలు కూడా ఇచ్చాడో ఎప్పుడన్నా ఆలోచించామా...

       మన లో అంతర్గతంగా ఉన్న శక్తులను నిరంతరం జాగృతం చేసి, చైతన్యం చేసి సేవ చేసే ఒక చిన్న అవకాశం కూడా వదిలి పెట్టకూడదు!!...

       ఒకవేళ బద్ధకం తో వీటిని నిర్లక్ష్యం చేస్తే, మనలో ఆ శక్తులు చైతన్యం కావు, సేవ చేసే అవకాశాలు మళ్లీ లభించక పోవచ్చు.

     మానవ పరిణామమే చాలా మందగిస్తుంది.
10 జన్మల్లో చేసే పని చేయ డానికి 20 జన్మలు పట్టచ్చు...

అందుకే శ్రీ కృష్ణుడు " జ్ఞాని కాని వాడు సదా కర్మలు ఆచరిస్తూనే ఉండాలి"  అన్నాడు..

       మన గురించి మనం సంపూర్ణం గా తెలుసుకుంటే, పిరికి తనం , సోమరి తనం, అలసత్వం, దుఃఖం,అవిద్య దూరం అవుతాయి. 

      ఎన్ని అవరోధాలు వచ్చినా, నిందలు, అవమానాలు, కన్నీళ్లు, దుష్కర్మలు ఎదురైనా, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తో కర్మలని ఎదిరించాలి.. 

ఇదే ఆధ్యాత్మిక రహస్యం

ಓಂ ನಮಃ ಶಿವಾಯ

మరణం తర్వాత ఆత్మ

 మరణం తర్వాత ఆత్మ

మనిషి మరణించాక శరీరం వదిలి పెట్టి వెళ్ళడానికి ఇష్టపడడు, రోదిస్తూ ఉంటాడు, భార్య బిడ్డలపై ప్రేమ, తల్లి తండ్రి పై ప్రేమ, స్నేహితుల పై ప్రేమ, డబ్బు పై ప్రేమ, జ్యూద్ధం పై ప్రేమ, కామం పై ప్రేమ, ఒకడి నాశనం పై ప్రేమ, ఇలా ఇవన్నీ తీరక మరణించిన తర్వాత కూడ శరీరాన్ని వదలలేక మరణం తర్వాత శరీరంలో ఉండలేక రోదిస్తూ ఉంటాడు జీవుడు.

కానీ యమభటులు వచ్చి యమపాశం వేసి ఈ భౌతిక శరీరంతో ఉన్న బంధాలను తెంపి ఆత్మను శరీరంతో వేరు చేస్తారు, అప్పుడు ఆత్మ పరిమాణం అంగుష్ఠమాత్రం అంటే మన చేతి బొటన వేలి సైజ్ లో ఉంటుంది.

శరీరం నుండి వేరు పరిచాక భౌతిక శరీరాన్ని ప్రేతంఅంటారు, వేరుపడిన జీవుడిని ఆత్మ అంటారు, ఆత్మకు కాళ్ళు చేతులు ఆకారం ఉండదు, ఎలాంటి శక్తి ఉండదు. అలా అంగుష్ట మాత్రం ఆకారంతో 12 రోజులు ఆ ఇంటనే తిరుగుతూ ఉంటుంది, ఇష్టమైనవారితో మాటాడాలని చూస్తూ ఉంటుంది, ఎవరు ఎం మాట్లాడుతున్నారో వింటుంది కానీ ఎవరికీ సమాధానం చెప్పడానికి సాధ్యపడదు.

12 రోజులు కర్మలు చేయాలి, వాటినే ద్వాదశ కర్మలు అంటారు, పిండ కర్మలు, తిల తర్పణాలు, దానాలు ధర్మాలు, గరుడపురాణ పారాయణం, ఇవన్నీ కచ్చితంగ 12 రోజులు చేయాలి, గరుడపురాణంలో చెప్పినవిదంగాచేయాలి. కానీ కొందరు మూడురోజులకు కలిపి ఒకరోజు చేస్తారు, కొందరు 12 రోజులవి కలిపి ఒకరోజు చేస్తుంటారు, ఇది తప్పని గరుడ పురాణం చెబుతుంది, ధ్వదస దిన కర్మలు సరిగా చేస్తే ఆ అంగుష్ట మాత్రం ఆత్మ సైజ్ ఉన్న ఆత్మ అరచేయి సైజ్ కి పెరుగుతుంట, అలా మారిన ఆకారాన్ని దివ్య శరీరం అంటారు, 

దివ్యశరీరాన్ని తీసుకెళ్లి పాప పుణ్యాల విశ్లేషణ చేస్తారు చిన్న వెలుగుల కనిపించే యముడి ముందు, ఆ తర్వాత పాపానికి శిక్షలు అనుభవించి, పుణ్యానికి పితృలోకానికి వెళ్తారు అక్కడ కొన్ని రోజులు ఉంటారు, తర్వాత ఏ కోరిక లేకపోతే పరమాత్మలో కలిసి పోతారు, లేదా మల్లి భూమీద మనిషి గ పుట్టడానికి ఎన్నో జన్మలు ఎత్తుత ఉంటాడు చివరగా మనిషి జన్మ తీసుకొని ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు దాన్నే గత జన్మ వాసన అంటారు. 

ధ్వదస కర్మలు సరిగా చేయకపోతే ఆత్మ పరిమాణం పెరగక ఆ ఆత్మని యమభటులు ఇక్కడే వదిలేస్తారు, దాన్నే పున్నామ నరకం అంటారు, పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అంటారు, పుత్రుడు సరిగా కర్మలు చేయకపోతే ఆత్మ పున్నామ నరకం నుండి బయట పడక ఇక్కడే భాదపడుతూ కొన్నాళ్ళు తిరుగుతా ఉంటుంది, ఎలాంటి కొడుకును కన్నానే అని చింతిస్తుంది, అలా ఆత్మ చింతిస్తే అది పితృ దోషం కింద మారి ఆ వంశాన్ని దహిస్తుంది, వంశంలో ఒక్కడు చేసిన తప్పుకు వంశంలో అందరికి శిక్షపడుతుంది, కాబట్టి ద్వాదశ కర్మలు గరుడపురాణంలో చెప్పినమాదిరి శాస్త్రోక్తంగా చేసుకుని మరణించిన వారిని పున్నామ నరకం నుండి తప్పించి వారిని ఊర్ధ్వలోకాలకు వెళ్లేల కర్మలు చేయండి. 

అందుకే ఎవరైన వెళ్ళిపోతే వారికి సద్గతి కలగాలి అని కోరుకోవడం మన విధి, అంటే వారికి ఉన్నత లోకాలు కలగాలి అని కోరుకోవడం అన్నమాట, ఆడైన మగైనా మరణించిన తర్వాత ఆత్మను జీవుడు అంటారు. ఆత్మకు ఆడఆత్మ మగఆత్మ అని లింగ బేధం ఉండదు, కాబట్టి జీవుడు అంటారు, ఇక్కడ శాంతిగ ఉండటం ఏంటి, ఆత్మకు కర్మలు చేస్తే ఊర్ధ్వ లోకాలకు వెళుతుంది అలా వెళ్లాలని మనం కోరుకోవాలి.. కానీ ఆత్మకు శాంతికలగాలి అనడం అర్థం లేనిదీ...

కాబట్టి సద్గతిప్రాప్తిరస్తు అని చెప్పండి.

ಓಂ ನಮಃ ಶಿವಾಯ

****భక్తి, జ్ఞాన, శరణాగతి, &* *వైరాగ్యములు

 *ఆ నాలుగు ~~*

         *భక్తి, జ్ఞాన, శరణాగతి, &*
                 *వైరాగ్యములు*
                   ➖➖➖✍️

*ఈ సృష్టిని చేసి, దానిని ఒక పద్ధతిగా నిర్వహించే ఒకానొక ‘మహా శక్తి’ ఉంది.*

*దాని పేరే పరమాత్మ!*

*పరమాత్మకు రూపం కానీ, నామము కాని లేవు, గుణం కూడా లేదు. ఏవైనా ఉన్నాయి అనుకుంటే అది మన కల్పన.* 

*ఈ మహాశక్తికి మనం ‘శరణాగతి’ చెయ్యాలి.*

*అన్ని ఈ మహాశక్తికి నియమాలకు లోబడి నడుస్తున్నాయి.*

*మన వ్యక్తిగత అహంకారంతో వీటిని విభేదించి నడుచుకోవడం సరి అయిన విధానం కాదు.*

*దీనికి శిక్ష తప్పదు!*

*కాబట్టి మనం అహంకార నిర్ములన కావాలి అనుకుంటే దానికి చేయవలసినది, ‘శరణాగతి!’*

*విశ్వ నియమాలకు అనుగుణంగా, విశ్వఆలోచనలకు అనుగుణంగా _(Universal thought plan)_ మన వ్యక్తిగత ఆలోచనలు ఉండాలి. _(Individual thought plan)._* 

*దీనినే _role playing_ అంటారు.*

*అహాంకారం నాశనం కావాలి అనుకున్నవారు తమలో ఈ మార్పు తెచ్చుకోవాలి!*

*ఈ విశ్వంలో ప్రతిదీ,  మనతో సహా,    “ఈ విశ్వ ప్రణాళికకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే", అన్న సత్యాన్ని మరువకూడదు.*

*ఇది శరణాగతి కి సంభందించిన అంశము.*

*ఇక పరమాత్మ(మాహాశక్తి)… ఈ సృష్టిని తనలోనుంచి సృష్టించిన  మాయ సహకారంతో సృష్టించారు.*

*మాయని ప్రకృతి అని కూడా అంటారు.*

*ఈ ప్రకృతి పంచ భూతాలు, త్రిగుణాలలో ఉంటుంది.*

*మాయ స్వతహాగా జడము, కదలిక లేనిది.*

*కానీ మాయ నిత్యము మార్పుకు లోను కావాలి కాబట్టి కదలిక అవసరం.*

*ఎలా అయితే రైలు పెట్టెలు స్వయంగా కదలవో, తాను కదులుతూ వాటిని కదిపే ఇంజిన్ ఉందో,*

*అలా పరమాత్మ తాను* *సృష్టించినదానిలోకి ప్రవేశించి దానిలో కదలిక ఏర్పరిచి, కావాల్సిన మార్పులు తెస్తున్నారు.*

*సృష్టిలో పరమాత్మ  ప్రవేశం ఒక ప్రతిబింబం లాగా ఉంటుంది.*

*అంటే ఆయన స్వయంగా స్థిరంగా ఒక చోట ఉండి* (ఆ చోటును పరంధామం అని అంటాము, భగవద్గీతలో ఈ చోటుకి చేరినవారు తిరిగి జన్మ తీసుకోరు అన్నారు) *ఈ సృష్టి లో ఉన్నారు.*

*ఎలాగైతే మిట్టమద్యాహ్నము సూర్యుడు భూమిమీద ఉన్న మట్టికుండలోని నీటిలో ప్రకాశిస్తున్నాడో, అలా ప్రతిబింబ రూపంలో అలా పరమాత్మ ఈ సృష్టి యావత్తు నందు ప్రతిబింబ రూపంలో ప్రకాశిస్తున్నాడు.*

 *ఆయన అన్నిటి యందు సమముగా ఉన్నారు కాబట్టి ఈ సృష్టి లోని ప్రాణి కోటి యావత్తు సమానమే,*

*ఎవ్వరు ఎక్కువ కాదు, తక్కువ కాదు.*

*ఈ అవగాహనే జ్ఞానము.*

*అంటే పరమాత్మ నీలో, నాలో, అందరిలో సమముగా తిష్ట వేసుకొని ఉన్నాడు.*

*ఈ జ్ఞానమును విష్ణు తత్వము అంటారు. _Omnipresence, omnipotent_ అంటారు.*

*ఈ అవహాగనకి ఒక రూపము కల్పించి,  ఆ రూపానికి అదే విష్ణు నామము జోడించి,  ఆయనను వైకుంఠంలో ఉంచాము మనము అజ్ఞానంతో.*

*విశ్వవ్యాప్తి అయిన పరమాత్మ మనలో కూడా  ఉన్నారు.*

*దీనిని స్వస్వరూపం అని అంటారు.*

*ఈ స్వస్వరూపమును ప్రేమించడము, ఆరాధించడం ‘భక్తి’ అంటారు.*

 *ఈ స్వస్వరుపమును మరచి, బాహ్యంగా ఆయనకు ఆరాధన చేయడం…*
*ఇంట్లో దైవాన్ని మరచి ఊళ్ళో దైవాలకి ఉత్సవాలు చేసినట్టు,*

*లేదా…* 

*ఇంట్లో ఉన్న భోజనాన్ని మరచి పక్కింటిలో భోజనం అడుక్కుంటునట్టు.*

*ఈ స్వస్వరూప అనుసంధానం భక్తి,*

*ఈ స్వరూపమునకి శరణాగతి చేయడం c"ఈశ్వర ప్రణీదానం",*
*ఈ స్వస్వరూపము పేరు…"ఓం".*
 *(తస్య వాచక ప్రణవః అన్నారు).*

 *ఓంకారనాదానుసంధానమే…,*
 *నిజమైన ఆరాధన, నిజమైన ప్రార్థన.*

*ప్రారంభములో "ఓం"ని నెమ్మదిగా ఉచ్ఛరిస్తు, దీర్ఘ నెమ్మది అయిన శ్వాసతో అను సంధానం చేస్తూ ఆ "ఓంకారము" తనంతట తానుగా మనకి వినబడే దశకు చేరుకోవడం ఈ …ఓంకారనాదానుసంధాన గమ్యం!*

 *ఇది భక్తి!*

*ఇక పరమాత్మ సృష్టించిన యావత్తూ మన జీవన సౌకర్యం కోసమే.*

*అంతే కాని అవి మనవి కావు,*

*మనం శాశ్వతంగా వీటితో  మార్పు లేకుండా ఉండలేము.*

*ఈ అవగాహనే వైరాగ్యాము.* 

*మనకి రాగము పంచభూతములతో ఏర్పడ్డ విషయములపై ఉంటుంది.*

*ఆ విషయములు శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన.*

*పంచభూతములతో ఏర్పడిన రూపం పట్ల రాగము ఉంటుంది.*

*రాగము ఉన్నచోట ద్వేషం కూడా ఉంటుంది.*

*ఈ రాగద్వేషాలని ‘సూక్ష శరీరం’ అంటాము.*

*ఈ సూక్ష శరీరం ఉన్నంత వరకు మనకి ముక్తి రాదు.*

*కాబట్టి వైరాగ్యం తప్పని సరి.*

*అహంకారము వల్ల బేధ దృష్టి ఏర్పడుతుంది.*

*ఇదే కారణం….    మనకి ముక్తి రాకపోవడానికి, లేదా బంధం ఏర్పడటానికి!*

*ఈ అహంకారమునకు విరుగుడు,  ఈశ్వర శరణాగతి.*

*రాగ ద్వేషాలు మమకారనికి హేతువులు,*

*దీనికి విరుగుడు వైరాగ్యం!*

*ఇదండీ నిజమైన భక్తి, జ్ఞాన, శరణాగతి, వైరాగ్యములు.

గురుసేవ-గురుశుశ్రూష* 4 విధాలు

 గురుసేవ

*గురుసేవ-గురుశుశ్రూష* 4 విధాలు. 

*(1) స్థాన శుశ్రూష:-* గురువు ఉన్న ఇంటిని, ఆశ్రమాన్ని, ప్రదేశాన్ని శుభ్రం చేయటం. ఆయన పరిసరాలను శుభ్రం చేయటం. ఆయన వాడే వస్తువులను శుభ్రం చేయటం - (అదీ తప్పనిసరి కర్తవ్యంగా గాక - తనకు అదృష్టవశాత్తు లభించిన అవకాశంగా భావించి) 

*(2) అంగ శుశ్రూష:-* స్వయంగా ఆయన పాదాలొత్తి సేవచెయ్యటం. ఆయన యొక్క ఆరోగ్య విషయాలను స్వయంగా చూచుకుంటూ తగిన ఏర్పాట్లు చెయ్యటం. ఆయన అవసరాలను కనిపెట్టి ఉండటం. 

*(3) భావ శుశ్రూష:-* ఆయన మనస్సులోని భావాలను తెలుసుకుంటూ అందుకనుగుణంగా నడుచుకోవటం. ఆయన కోరకుండానే ఆయన అవసరాలు తీర్చటం. ఆయనకు ఏ లోటూ కలగకుండా చూచుకోవటం. 

*(4) ఆత్మశుశ్రూష:-* తన మాటలు - చేతలు గురువును నొప్పించకుండా ఆయన నడిచే మార్గంలోనే నడవటం. ఆధ్యాత్మిక చింతనతో ఆయనతో పోటీ పడటం. తన శరీరం - తన ధనసంపదలు - తన మనస్సు సర్వమూ గురువు కోసమేననే భావన బుద్ధిలో దృఢంగా ఉండాలి.
           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

దేవుడున్నాడు - దేవుడున్నాడు

 *దేవుడున్నాడు - దేవుడున్నాడు*

ఎందరికో వారి వారి అవసరానుగుణంగా వేరువేరు సందర్భాలలో  'దేవుడున్నాడు'  అనే భావం కలుగుతుంది...
అది వారి జీవిత పధాన్ని మార్చి వేస్తుంది...
దేనికయినా సమయం రావాలి... 
వాల్మీకి, తులసీదాసు, పురందర దాసు, మున్నగు మహా భక్తుల గాధలన్నీ ఇటువంటివే కదా! 

*ఒక చిన్న కథ ఇలాంటిదొకటి చూద్దాం...*
ఒక పెద్ద గజ దొంగ ఉండేవాడు, ఎవరింటి లోనైనా కన్నమువేసి దోచుకోవడంలో మహా నేర్పరి...
ఆ దొంగ ఒక నాటి రాత్రి  తన పన్నెండు సంవత్సరాల కొడుకు తో కలసి దొంగతనానికి బయలుదేరాడు,
ఆ దొంగతనంలో ఉన్నటువంటి మెళుకువలు అన్నీ కొడుక్కి నేర్పుతూ వస్తుండగా, 
అతనిదృష్టికి ఒక పెద్ద భవంతి వైపు మళ్ళింది...
బహుశా యేదో వేడుక జరుగుతోంది కాబోలు, ఆ భవనం దీపాలతో అలంకరింపబడి ఉంది. 
ఆ భవంతిని చూపిస్తూ, దొంగ ( తండ్రి ) గర్వంగా ఇలా అన్నాడు. 
*"చూడరా!ఆ భవనాన్ని, మూడుసార్లు కన్నమువేసి, మొత్తం దోచుకున్నాను."*ఆదిత్యయోగీ*

కొడుకు ఒక నిముషం ఆ భవనం వైపు, తండ్రి వైపు మార్చి మార్చి  అయోమయంగా చూసి, తన సందేహం ప్రకటించాడు....

*"నాన్నా, నువ్వు మూడుసార్లు  మొత్తం దోచుకున్నా, వాళ్ళు అలాగే సుఖ సంపదలతో, హాయిగా, ఆనందంగా ఉన్నారు. మరి మనమెందుకు ఇంకా ఇలాగే ఉన్నాము. "?*

తండ్రి కి నోటిమాట రాలేదు, నడుస్తున్నవాడల్లా ఒక్కసారి ఆగి పోయాడు, ఆకాశము వంక చూశాడు..
బహుశా అతనిలో అణగారిన జ్యోతి యేదో వెలిగింది. 
పై వంక చూస్తూ అన్నాడు...
*" దేవుడున్నాడు రా, దేవుడున్నాడు. "*
ఆ క్షణమే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. 
కొడుకు వేసిన ప్రశ్న అతణ్ణి అంతర్ముఖుణ్ణి చేసింది, గజ దొంగ ను పరమ భక్తునిగా  మార్చి వేసింది...
.
  దేవుడు ఉన్నాడు  
. ఉన్నాడా  ? ...
. లేడు   ...
. లేడా  ?  ...

ఈ డోలాయమాన స్థితి 
 మనిషికి స్థిరత్వమివ్వదు  !
దేవుడు లేడు అనే కంటే 
ఉంటే ఏం చేయాలి  ..
ఆ కృప ఎలా పొందాలి  ...
అది నాకు సాధ్యమేనా  ...
అనుకొని ఎంతో నమ్మినవారు 
 ఎందరో ఉన్నారు  
   సాధనలో వారు ముందున్మారు  

. ఇవన్నీ కాదు 
పుట్టిన ప్రతి జీవి గిట్టడం ఎంత సత్యమో
అతడితో పాటు అతడి లోపల బయట
భగవంతుడు ఉన్నాడన్నది అంతే సత్యం

వేల సంవత్సరాలు చీకటి నిండిన గదిలోనూ
చిరుదీపం వల్ల అంతటా వెలుగు నిండుతుంది
అలాగే మానవుడు దేవుడి పట్ల కలిగించుకుని
వెలిగించుకునే చిన్నపాటి నమ్మకమే
అతడి జీవితంలో గాడాందకారాన్ని
పటాపంచలు చేస్తుంది ..

వెలుగు లక్షణం   ....
లక్ష్యం  చీకటి పారదోలడం   ..
మనిషి జీవితంలో 
నమ్మకాన్ని వెలిగించుకుంటే  ..
భక్తి సాధన  గమనం  గమ్యం 
ఆయనే చూసుకుంటాడు ..
భగవంతుడు ఉన్నాడని
నమ్మడమంత భద్రమైన జీవితం
మరెక్కడా లేదు  ..

నిన్ను నమ్ము కున్నానని
ఆయనకు హామి ఇవ్వనక్కరలేదు
ఒట్టు పెట్టి మరి చెప్పనక్కరలేదు
ఒక చెంబడు నీళ్ళు ఆయనపై పోయాలనే
ఆ భావం మనసులో ఉదయిస్తే చాలు
పువ్వును అనుసరించే పరిమళంలా
భగవంతుడి అనుగ్రహా ప్రకాశం
భక్తుడి నమ్మకాన్ని వెన్నెంటి వస్తుంది ...
.                          
                           
     శరీరంలోని వివిధ ఆకార, అవయవాల క్రియాధర్మంతో, సజీవ శరీరం జీవితాధారంగా వుంది. అలాగే నిరాకార మనసు.
మనసు, జ్ఞానం, బుద్ధి, తెలివి, చిత్తం ఆకార బ్రెయిన్ స్పందనగా, స్థావరంగా, జీవిత తయారీకి సహకరిస్తున్నాయి. అదేవిధంగా, శరీర అంతర్గత నాడీ చలన స్పర్శ, అంతరాత్మ గా, అంతఃకరణం గా, ఆత్మగా ఆధ్యాత్మిక భావనలకు కారణమవుతున్నాయి. అయితే, " ఆకార సంబంధ నిరాకారత, భౌతిక జీవన, జీవిత నిర్వహణకు, ఆత్మ నిరాకారత, ఆధ్యాత్మిక
సాధన జ్ఞాన వృద్ధికి కారకాలుగా వుంటున్నాయి అని అంటున్నారు గురువుగారు.
     * అయితే జీవన జీవితానికి సంబంధించి, దాని కర్త, మనిషి
వునికి, పరిశీలనాంశముగా, తత్సంభంద, దృశ్యత అదృశ్యతగ అవగాహన అవసరం.
     అండం, పిండం తరువాత  శిశు జననం, జీవన క్రమం - జీవిత గమనం ,వ్యక్తి - సమాజం.
     అవసరం, అనిపించడం, ఆలోచన, ఆచరణ, దాని ఫలితం అనుభవం, పునః జీవనం, ఇదే జీవితం. అనిపించే దానిని మనసుగా భావిస్తే, ఆ తరువాత అందుకు తగిన ఆలోచనా
మనసుదే. శరీర ఆచరణా, మనసు ప్రోత్సాహమే అని అంటున్నారు గురువుగారు. * వయసు క్రమంలో, దాని అవసరాలు, ఆలోచనలు మారుతూ వుంటాయి. కనుక, దానితో
పాటే మనసు స్వరూప లక్షణాలు, స్వభావాలు క్రమ క్రమంగా
మార్పు చెందుతూ వుంటాయి. విషయ జ్ఞానం సేకరణ, ఇందుకు
 సహకారిగా వుంది. తెలియడం మనసుకే కనుక, జ్ఞానం - మనసు సేకరణే . వయసు క్రమంలో, ఆలోచనకు, యోచన విచక్షణ, జ్ఞానాన్ని అనుసరించే వుంటాయి. కనుక, తెలివి, బుద్ధి
జ్ఞానాన్ని అనుసరించే వుంటాయి. మనసు ' స్థాయి ' వాటితో  పాటే. నిజానికి, మనసు జ్ఞాన శేఖర స్థాయే, తెలివి, బుద్ధిగా
సందర్భానుసారం , క్రియారూపంలో, జీవిత నిర్వహణ సాగి పోతూ వుంటుంది. వ్యక్తి జ్ఞానమే వ్యక్తిత్వ స్థిరత అని అంటున్నారు గురువుగారు.

ఉపయోగ, వినియోగ గుణం,  స్వభావం పదార్ధత సహజత..ఆదిత్యయోగీ..
భిన్నరీతిలో, దాని వ్యక్తత. సాధారణంగా సహజత, మూలంలో
మార్పుకు అవకాశం తక్కువ. దీనినే జీవులలో స్వభావం, మనస్తత్వంగా భావించబడుతోంది. మార్పు లేని దీనినే ' చిత్తం ', 
వ్యక్తి తత్వంగా అనుకోవచ్చు. అయితే బాహ్యతతో ప్రారంభమైన, సాధారణ ఇంద్రియ మనసు జ్ఞాన ప్రభావంతో,
వివిధ స్థాయిలుగా వినియోగ పడుతుంది. అందుకే, మనసు, తెలివి , జ్ఞానం, బుద్ధి, భిన్న విధాలుగా వ్యక్తిత్వ, తత్వంగా, చిత్తం ( will ), క్రియా విధానంలో వుంటుంది. అయితే చిత్త
చంచలం, దాని అసలు మార్పు కాదు...

“సంపూర్ణంగా జీవిస్తే, మీరు ఎంతో కర్మని కరిగించేస్తారు. సంపూర్ణంగా జీవించడం అంటే ఎదురయ్యే ప్రతిదాన్ని సంపూర్ణంగా ఇంకా తీక్షణంగా అనుభూతి చెందడం...
..
 
*1 . ఆత్మ   .... స్వయం ప్రకాశం*

*2 . నిద్ర ..... మొదటి తలుపు*

*3 . మహత్ ..తత్వం ... తొలి మెట్టు*

*4 . అజ్ఞానం లేక కారణ శరీరం..... లోపల గోడ*

*5 . అహంకారం .....  అద్దం*

*6 . ఐదు జ్ఞానేంద్రియాలు ..... కిటికీలు*

*7 . లోపల గది ..... గాడ నిద్ర లో  .....కారణ శరీర వికాసం*

*8 . మధ్యమ గది ...... స్వప్న అవస్థ లో .....సూక్ష్మ శరీర  వికాసం*

*9 . వెలుపల ఆవరణ  ..... జాగ్రత్ అవస్త .... స్థూల శరీర వికాసం...
.
సాధనయే రహస్య తాళం చెవి 

*సాధన అనేది పాక్షికమైన విశ్వం నుండి ఇంద్రియాలను దూరం చేయడం మరియు  ఆత్మ మీద మనస్సు యొక్క ఏకాగ్రత. ఇది శాశ్వతత్వంలోని జీవితం లేదా ఆత్మలో శాశ్వతమైన జీవితం అందిస్తుంది. అది మనిషిని దైవత్వంలోకి మారుస్తుంది. ఇది నిరుపేదలకు ఆశను, అణగారిన వారికి ఆనందం, బలహీనులకు బలం మరియు అజ్ఞానులకు జ్ఞానాన్ని అందిస్తుంది. సాధన అనేది బాహ్య ఆనందం మరియు లోతైన స్థిరమైన శాంతి యొక్క రంగాలను తెరవడానికి  రహస్య తాళం చెవి..

ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం అంటే భగవంతునికి చేరువ కావడానికి ప్రయత్నించడం కాదు - మీరు భగవంతునిలో ఐఖ్యం అయ్యేందుకు చూస్తున్నారని......*
.      

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
.
 అంతర్ముఖ ప్రయాణం అంటే ఏమిటి? తత్త్వమసి మహావాక్యంతో చివరిదాకా అణువునుంచి మహత్తుదాకా తెలియబడినదంతా అంతర్ముఖ ప్రయాణం 
ఫేజ్ - 1
       అసలైన అంతర్ముఖ ప్రయాణం ఏమిటి? మార్జాల కిశోర న్యాయంగా జరగవలసినదేదైతే ఉందో, ఈ 'న ఇతి' అనే ప్రయాణం.
          4 మహా వాక్యాల తరువాత అవాంతర వాక్యంగా నీవు చేయవలసిన ప్రయాణం ఏదైతే ఉందో అది 'నేతి నేతి' మహావాక్యంతో చేయవలసిన ప్రయాణం ఫేజ్ - 2
            అందుకని అవతార్‌ మెహెర్‌బాబా నాలుగు దివ్యయానములుగా విభజించారు. నీవు మానవుడివి అవటంతో దివ్యయానం నెం.1 పూర్తయింది. మానవ ఉపాధిని ధరించటం ద్వారా ఈ సృష్టిలో అణువు నుండి మానవోపాధికి వచ్చేప్పటికి దివ్యయానం ప్రథమభాగం పూర్తయింది. 
ఇక ఇక్కడ నుండి క్షరము, అక్షరము పురుషోత్తముడు మూడు స్థితులని మూడు దివ్య యానములుగా విభజించారు.
 
ఈ శరీరం నేను కాదు. జీవుడు, చైతన్యము, జ్ఞాత అని ఎరగడం ఏదైతే ఉందో అది దివ్యయానం రెండవ భాగం. 

అక్కడినుండి నేను బ్రహ్మ స్వరూపుడను, నేను అక్షరుడను అని తెలుసుకునే స్థానం వరకు, జీవన్ముక్తావస్థ అనుభవం వరకు ఉన్నది దివ్యయానం మూడు. 

అక్కడినుండి చివరి పాదమైనటువంటి చైతన్య రహిత పద్దతి, చైతన్యం తన మూలాన్ని తాను గుర్తెరిగి తానే లేకుండా పోయేటటువంటి చిట్టచివరి ప్రయాణం దివ్యయానం నాలుగు.

        ఇది జన్మరాహిత్య పద్ధతి. ఈ దివ్య యానముల చార్టు చూస్తే 4వ దివ్యయానము తరువాత ఒక చుక్క ఉంటుంది. 
దాని తరువాత ఏమీ ఉండదు. వేదాంత తత్త్వ విజ్ఞానం కూడ ఆ బిందువునుంచే ఆరంభమైందని అంతా చెబుతారు. 
మరల ఆ బిందువు ఎప్పుడైతే లేకుండా పోయిందో, బిందు మధ్యమందు శూన్యమున్నది. ఇది శాక్తేయ విధానంలో కూడ బోధించబడుతుంది.
          కాబట్టి ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికి ఉన్న సత్యమంతా ఇదే. తత్త్వమసి మహావాక్య ప్రధానంగా నీవు బ్రహ్మ నిష్ఠుడవై సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్యములనే చతుర్విధ ముక్తులను కరతలామలకంగా బ్రహ్మనిష్ఠ ద్వారా అనుభూతి చెందినవాడవై, తిరిగి మరల అణువు వరకు వచ్చి 'న ఇతి న ఇతి' అంటూ కైవల్యాన్ని పొందాలి. కేవల పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి.

దక్షిణామూర్తి స్తోత్రం - 10

విద్యాసాగర్ స్వామి 🙏🏻

ఏకాంత ఉపాసన

 ఏకాంత ఉపాసన

🌷🌷🌷🌷🌷

మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు. ఒంటరితనం, ఏకాంతవాసం ఒకటిగా కనిపించినా- రెండింటి నడుమ అగాధం ఉంది. పదిమంది మధ్యన ఉంటూనే తాను ఏకాకినని అనుకోవడం, బాధపడటం చాలామందికి అలవాటు. చుట్టూ బాజా బజంత్రీలు మోగుతున్నా ఆనందంగా ఉండే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. ఒంటరితనానికి భయం, ఏకాంతానికి వైరాగ్యం మూలకారణాలు. ఏకాకిని చీకటి భయం, పగటి పూట అభద్రత వెంటాడుతూ ఉంటాయి. రేపు ఏమవుతుందో, ఉన్నది ఎవరు దోచుకుపోతారో అన్న ఆందోళన కంటికి కునుకు పట్టనివ్వదు. ఈ జగత్తు ఒక మాయాజాలం. ఈ భౌతిక జీవితంలో ఆనందం ఎండమావి అన్న ఎరుక మనిషిని ఏకాంతం వైపు ఆకర్షిస్తుంది. బయటి ప్రపంచం నుంచి తన లోపల ఉన్న మరో ప్రపంచం దిశగా ఆ మనిషి జీవన ప్రస్థానం మొదలవుతుంది.
నేనెవరు, ఈ జీవితం ఏమిటి, నేను ఎందుకు వచ్చాను, ఏం సాధించాలి, మరణం ఎలా ఉంటుంది, విధి ఎక్కడికి తీసుకెళ్తుంది, ఆ తరవాత ఏమవుతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆలోచనాపరుడైన మనిషిలో బుసలు కొడతాయి. సమాధానాలు వెదకడానికి సమాధిస్థితి కావాలి. అది ఏకాంతంలోనే కుదురుతుంది. యోగజీవికి పగలు రాత్రి అని, రాత్రి పగలని గీత చెబుతున్నది. భోగజీవికి పగలు యోగజీవికి రాత్రితో సమానం. ఆ భోగజీవికి ఏది రాత్రో యోగజీవికి అది పగలు. మేధావులు, కవులు, కళాకారులు, తమ చుట్టూ మరో లోకం నిర్మించుకుని అందులో ఏకాంతంగా జీవిస్తారు. పూర్వం రుషులు పర్ణశాలల్లో తలదాచుకుని అడవిలో తపస్సు చేసుకునేవారు. అలాంటి వెసులుబాటు లేని ఈ ఆధునిక యుగంలో తనువు సమాజంలో, తలను అరణ్యంలో ఉంచుకోవాలి. సంఘజీవి అయిన సామాన్యుడి కోసం ఆశ్రమధర్మాలు, పురుషార్థాలు ఉన్నాయి. బ్రహ్మచర్యం, గృహస్తు ధర్మం, ఆ తరవాత వానప్రస్థం, చివర సన్యాసం పాటించాలని శాస్త్రాలు ఆదేశించాయి. భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ధర్మార్థకామాలను ఆచరిస్తూ పరమ పురుషార్థమైన మోక్షం పొందవచ్చు. అంచెలంచెల మోక్షం అంటే ఇదే! పాము కుబుసం విడిచినట్టుగా, సంసార బంధాల నుంచి విముక్తి పొందితే ఆ మనిషి మనీషి అవుతాడు. జీవన్ముక్తుడు ఈ లోకంలోనే జీవిస్తూ, తోటివారికి సాయం చేస్తాడు.
ఆధునిక ప్రపంచంలో ఒంటరితనం ఒక జాడ్యంగా మారింది. అనారోగ్యానికి చిరునామా అయింది. అనాదిగా భారతదేశం యోగభూమిగా పేరెన్నికగన్నది. ఆధునిక విజ్ఞానంపట్ల మోజు పెరిగి మూలాలను కోల్పోతున్నది. ధ్యానం యోగంలో ఒక భాగం. శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును నియంత్రించి బుద్ధిని ఏకాగ్రం చేసి ఆత్మను ఉపాసించమని విపాసన లాంటి సంస్థలు తమవంతు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రపంచ యోగాదినం ఘనంగా జరుపుతోంది. అన్నింటికన్నా మిన్న- ఆత్మ సంయమనం. అన్నింటిలో ఉన్నది ఒకే ఆత్మ అన్న భావన ఏకాంతానికి నిచ్చెన. నేను వేరు ఇవన్నీ వేరు అన్న తలపు ఒంటరితనపు తలుపు. ఏకాంతం కోరుకోవడం అంటే మానసిక స్వాతంత్య్రాన్ని స్వాగతించడం. మనసే బంధానికి, మోక్షానికి కారణం కాబట్టి మనోజయానికి కావలసిన వాతావరణాన్ని ఎవరికి వారే ఏర్పాటు చేసుకోవాలి. ఏకమే అనేకం అన్న సత్య జ్ఞానం ఒంటరితనానికి ప్రాకారం, ఏకాంత జీవితానికి శ్రీకారం.

🌷ఓం నమో నారాయణాయ🌷
 యోగసాధన

ఆత్మ సాక్షాత్కారం పొందడం ద్వారా మానవ జన్మయొక్క పరిపూర్ణ లక్ష్యమైన మోక్షం సాధ్యమవుతుంది. అయితే ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి 'యోగం' కూడా ఒక సాధనం.

యోగశాస్త్రం ఇలా చెప్తుంది - अध तत्त्वदर्शनोपायो योगः | ఆత్మసాక్షాత్కారానికి ఉపాయం యోగం. యోగశాస్త్రంలో సూచించినట్లుగా యమ, నియమాదులను ఆచరిస్తే వైరాగ్యం, ఏకనిష్ఠమైన మనస్సు లభిస్తాయి. ఆ రెండూ ముముక్షువునకు అత్యంతం అవసరమైనవి.

ప్రాపంచిక విషయాల్లో నిమగ్నమైయున్న మనస్సు, జీవితంలో ఏకైక లక్ష్యాన్ని చేరుకోలేదు. సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవటమూ కష్టమే. అందువలన మనస్సు యొక్క ఏకాగ్రతకు ప్రతివ్యక్తి కూడా యోగసాధన చేయక తప్పదు.

మనస్సును ఎలా అదుపులో పెట్టుకోవాలో శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో అర్జునునికి చెప్పాడు.

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् |
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ||

నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే. దానిని వసపరచుకోవటం మిక్కిలి కష్టమే. కానీ అభ్యాస, వైరాగ్యాలద్వారా, చంచలమైన మనస్సును అదుపులోకి తెచ్చుకోవచ్చును. యోగాభ్యాసాన్ని నిష్ఠతో, దశలవారీగా చేయాలి. అప్పుడే దాని ప్రయోజనం లభిస్తుంది.

శంకర భగవత్పాదులు గొప్పజ్ఞాని మాత్రమే కాదు, గొప్ప యోగి కూడాను. వారి జీవితంలో యోగం ద్వారా అనేక మహత్యాలు చేసి ప్రపంచానికి చూపించారు. అలాగే సదాశివబ్రహ్మేంద్రులు మొదలైనవారు విశేషంగా యోగ సాధనచేసి ప్రఖ్యాతినిపొందారు. ముముక్షువులు, యోగసాధన ద్వారా శ్రేయస్సును సాధించవచ్చు.

हर नमः पार्वती पतये हरहर महादेव 

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.

అద్భుతాలు - పరమాచార్యుల అభిప్రాయం

 అద్భుతాలు - పరమాచార్యుల అభిప్రాయం
సనాతన ధర్మంలో అనేకులైన మహనీయులు, గురువులు, సన్యాసులు ఎన్నో అద్భుతాలను లీలలుగా చేసి చూపించారు. నేటి కాలంలో చాలామందిని వేధించే ప్రశ్న ఆ అద్భుతాలు అవసరమా? అవి నిజమా? ప్రజలను మోసం చేసేవా? దీని గురించి పరమాచార్యుల వారి అభిప్రాయమేమిటి? ఎస్. బాలకృష్ణన్ గారు 1930 దశకం నుండి పరమాచార్యుల వారి భక్తులు. ఆయన ఒకసారి ఒక చిన్న సమూహంలో దీని గురించి చెప్పిన సమాధానాన్ని మనకు వివరించారు.

"ప్రజలకు అనేకానేక కామ్యములు. అవి తీర్చుకోవటానికి ఇలాంటి అద్భుతాలు చేసే వారి వద్దకు వెళుతూ ఉంటారు. అసలు అద్భుతాలు ఎవరు చేయగలరు? సిద్ధి పొందిన వారు మాత్రమే. ఇక్కడ రెండు ప్రయోజనాలున్నాయి - ఒకటి ఆ వ్యక్తి తాను ఉపాసన చేసిన దేవతపై మరింత మందికి నమ్మకం కలిగించటం, రెండవది ఆర్తులైన వారి కామ్యము/సమస్యను తీర్చటం. రెండూ కూడా మానవ జన్మ ఎత్తినందుకు సహజమైనవే, అద్భుతాల ద్వారా అటువంటివి తీరటం కూడా సబబే. సమస్యల్లా 1. అది ఆ వ్యక్తులు చేశారనుకోవటం 2. ఆ వ్యక్తులు అలా సిద్ధుల ప్రదర్శన వద్దే ఆగిపోవటం.

మరి దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?

1. ఎవరు ఏ సిద్ధిని ఉపయోగించి ఎటువంటి అద్భుతాలు చేసినా, అది పూర్తిగా పరమాత్మ లీలగానే భావించాలి. ఒక వ్యక్తి యొక్క గొప్పతనంగా భావించరాదు. ఆ వ్యక్తి రూపంలో పరమాత్మ ఉన్నాడని, ఒక పెద్ద కారణం చేతనే అలా అద్భుతాలు చేయబడుతున్నాయని భావించి తీరాలి. అప్పుడే మానవీయ పరిధిని దాటి ఆ అద్భుతాలను పరిశీలించగలము.

2. సిద్ధులు అనేవి ఆధ్యాత్మిక మార్గంలో సహజంగా కలిగే ఫలితాలు. వాటిలోనే మునిగిపోతే ఆధ్యాత్మిక ప్రయాణం ఆగిపోయినట్లే. సమాజ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, దాని శ్రేయస్సు కోసం, వ్యక్తిగత అభ్యున్నతి కోసం సిద్ధులను దాటి ప్రయాణించగలగాలి, అటువంటి వ్యక్తుల వద్దకు వెళ్లే వారికి కూడా అదే ప్రధాన ఆకర్షణ కారాదు. ఒక వ్యక్తి సిద్ధులను సాధించగలిగాడంటే అతను మరింత ఎంత సాధించగలడో అన్నది ఆలోచించి శాశ్వతమైన ఆనందం కోసం పాటుపడే పరిస్థితులను ఆ వ్యక్తి, అతని వద్దకు సమస్యలతో వెళ్లే వారు కలిగించాలి. తప్పకుండా సిద్ధులు కలిగిన మానవులు ఇతరుల కన్నా ఆధ్యాత్మికంగా ముందున్నట్లే. కానీ, అక్కడే ఆగిపోకూడదు, అవే పరమావధి కారాదు. "

మరి పరమాచార్యులు ఏమి చేశారు? అద్భుతాలను అర్హులైన వారికి అనుభూతులుగా అందజేశారు, వాటిని స్వయంగా బహిర్గతం చేయలేదు, ప్రచారం కూడా చేయలేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక స్త్రీ ఎన్నో సమస్యలలో ఉండి స్వామి వారి వద్దకు వచ్చి వేడుకుంది. స్వామి ఆమెకు ఒక గంధపు ముద్దనిచ్చి దానిని కామాక్షీ అమ్మ రూపంగా నమ్మకంతో, విశ్వాసంతో ఆరాధించమన్నారు. ఆమె అలాగే చేసింది. ఆమె చూపిన నమ్మకానికి, భక్తికి ఆ గంధపు ముద్ద కొన్నాళ్లకు అమ్మ రూపంగా పరిణామం చెందసాగింది, ముఖము, చెవులు, ముక్కు, కాళ్లు, చేతులు ఆకృతులు ఆ గంధంలో ఉద్భవించాయి. ఆమె సమస్యలు తీరాయి. ఇక్కడ అద్భుతం ఎవరిది? ఆలోచిస్తే మనం నేడు ఎదుర్కుంటున్న విపరీతాలకు సమాధానం దొరుకుతుంది.
 Vipassana is an insight meditation
It is based on pure internal observation
And maintaining Awareness and balancing the mind in all situations ( Samata)..
The outcome is peace and happiness.
It is like Cleaning , washing, and purifying.
Tranquility and Satisfaction comes on its own in practicing Vipassana.
Liberation of mind from clutches of old rotten habits is one of the aims.
It is a wonderful technique gifted by Buddha, a great Scientist

అధ్యవసాయము అనే పదానికి వివరణ ఏమిటి?

 అధ్యవసాయము అనే పదానికి వివరణ ఏమిటి? (27-05-24)

అధ్యవసాయము అనే పదాన్ని వివిధ సందర్భాలలో వాడుతున్నారు.

1. శ్రీమన్నారాయణుని శ్రీపాదములకు తలను చేర్చి ‘ నువ్వు తప్ప వేరు గతి లేదని ‘ పరిపూర్ణ విశ్వాసమును ప్రకటించటము శరణాగతి అని చెప్పబడింది ఇది మహా విశ్వాసము , అధ్యవసాయము అని శాస్త్రము చెబుతున్నది.

2.• గొప్ప మిత్రుడెవరు ? 
• ఉద్యమము, ఉత్సాహము, అధ్యవసాయము. 

3.ఐదు లక్షణములు శిష్యునకు ఉండాలి. 
1) అనన్యసాధ్యత్వము
2) ఆర్తి
3) అధ్యవసాయము
4) ఆదరము
5) అనసూయ

1) అనన్యసాధ్యత్వము : సాధ్యాసాధ్యాలయందు ఆసక్తి లేకుండా తాను ఆశ్రయించినగురువు/ఆచార్యుని ద్వారా ఏది పొందవలెనో దానిమీదనే దృష్టి పెట్టి ఉండేలక్షణము:

2) ఆర్తి : ఎట్టి పరిస్థితులలోనూ తాను పొందవలసిన దానికి దూరముగా జరుగక,వ్యతిరిక్త పరిస్థితులలో కూడా తాను పొందవలసిన దానిపైననే ధ్యాస తప్ప ఇంకొకమార్గముపై ధ్యాసలేకుండుట.

3) అధ్యవసాయము : తాను ఏది పొందవలెనని ఆచార్యుని ఆశ్రయించాడో అదియే తానుతప్పక పొందవలెనన్న గట్టిపూనిక కలిగి ఆ పూనికను రోజు రోజుకూ గట్టిపరచుకునేలక్షణము కలిగు ఉండుట.

4) ఆదరము : తాను తెలుసుకోవలసిన విద్య లేదా పొందవలసిన దానిని గూర్చిన విషయపరిజ్ఙానము సంపాదించుకొనే పథంలో ఆ విషయములను ఎవరు చెప్పిననూ చెప్పినవాడుతక్కువ వాడా లేక ఎక్కువ వాడా అన్నది ఆలోచించక ఆదరముతో వినుట. వినయముతో
ఉండుట.

5) అనసూయ : తాను తెలుసుకోవలసినది తెలుసుకోలేకపోయినను, పొందవలసినదిపొందలేకపోయినను, తానది పొందలేకపోయాను కాబట్టి దానియందు దోషములనెంచక దానిగుణములను కీర్తించుట. ఇతరులు పొందిన గుణములను చూసి సంతోషించిప్రోత్సహించుట.

ఈ పై ఐదు లక్షణములు కలవారు ఆచార్యుని పొందటానికి సంపూర్ణ అర్హులు,యోగ్యులు.

4. అధ్యవసాయము అంటే నిశ్చయము

5. అధ్యవసాయము=ఉత్సాహము
-తాడేపల్లి పతంజలి 🙏🏻

ప్రశ్న:: _ఆత్మానుభవం కావాలంటే, చెయ్యాల్సిన సాధన ఏమిటి?

 *"సాధన":: అనుష్టాన మార్గము*
*~~~~~*
         —  సద్గురు శ్రీ మెహెర్
              చైతన్యజీ మహరాజ్

*(ప్రశ్న::  _ఆత్మానుభవం కావాలంటే, చెయ్యాల్సిన సాధన ఏమిటి?)_*

*గురుదేవులు::*

_1)   ఎవరినీ పరోక్షంలో విమర్శించకూడదు._

_2)   గౌరవాన్ని ఆశించకూడదు. పొగడ్తలకు పొంగిపోకూడదు. తెగడ్తలకు కృంగిపోకూడదు._

_3)    ఎంత బాధ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఉండాలి. ముఖంలో బాధ ఇసుమంత కూడా కనిపించకూడదు. నవ్వుతూ ప్రశాంతంగా ఉన్నట్లుండాలి. ఎంత బాధ వచ్చినా, నీలో నీవే ఉంచుకోవాలి గానీ, ఎవరికీ కొంచెము కూడా చెప్పకూడదు._

_4)    దేనికీ అధైర్యపడకుండా, ధైర్యముతో ఉండాలి. ఎవరికీ భయపడకూడదు. గట్టిగా మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడకూడదు._

_5)      ఎవరితోనూ పోట్లాట పెట్టుకోకూడదు. అందరినీ సమానంగా చూడాలి. ఎవరినీ విసుక్కోకూడదు._

_6)     అబద్ధం చెప్పకూడదు. పనికి బద్ధకించకూడదు._

_7)      అనవసర విషయాల్లో జోక్యం చేసుకోగూడదు._ 


           –   జైబాబా  – 
-----------------------------------
Source::
– దివ్య ప్రవచనములు -6,
Pg:: 274

****ఓం

 ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🏻🌺

                 ఓం
         🌸🌸🌸🌸

కఠోపనిషత్ యొక్క ఘోషణ ఏంటంటే... అన్ని వేదాలు దేనిని వర్ణన చేస్తాయో, దేన్ని పొందడానికి అన్ని రకాల తపస్సులు చేస్తారో మరియు దేన్ని పొందాలని కోరికతో బ్రహ్మచారులు గురుకులంలో ఉంటూ కఠోరమైన బ్రహ్మచర్యను పాటిస్తారో ఆ పదానికి అర్థం సంక్షిప్తంగా చెప్పాలంటే ఆ పదము 'ఓం'.

    ఒక బ్రహ్మచారి ఒక గురువు దగ్గరికి వెళ్లి తను వచ్చిన పని చెప్తాడు. నాకు గుప్త మంత్రం తెలుసుకోవాలని ఉంది.  దానివలన జీవనం యొక్క అన్ని సుఖాలు దొరికేలా ఉండాలి.  ఆ మంత్రసిద్ధి వలన పెద్దపెద్ద ఖజానాలు తెరవబడాలి. అలాంటి గుప్త మంత్రం మీకు తెలుసా అని అడుగుతాడు. 

     దానికి గురువుగారు అంటారు మహాత్వమైన మంత్రాన్ని తెలుసుకోవాలంటే మహాత్వమైన సాధన చేయాలి.  మరి నువ్వు సాధన చేయడానికి సిద్ధంగా ఉన్నావా? బ్రహ్మచారి అందుకు అంగీకరిస్తాడు. 

     గురువుగారు చాలా కాలం వరకు శాస్త్రాలను బ్రహ్మచారికి బోధిస్తారు.  కానీ అతను అడిగిన మంత్రం మాత్రం చెప్పలేదు.  బ్రహ్మచారి ఇక ఆగలేక ఒకరోజు గురువు వద్దకు వెళ్లి అడిగేస్తాడు ఆచార్య చాలా కాలంగా మీ ఆజ్ఞను పాటించి శాస్త్రాల అధ్యయనం చేశాను.  కానీ మీరు ఇప్పటివరకు నాకు ఆ మంత్రాన్ని చెప్పలేదు అంటాడు.  సరే నువ్వు ఇంతలా ఆత్రుతగా ఉన్నావు కాబట్టి ఈరోజు నీకు ఆ మంత్రం చెబుతాను నీ చెవిని నా దగ్గరికి తీసుకురా అని  మంత్రం చెప్తారు . కానీ ఈ మంత్రాన్ని నిత్యం ధ్యానించాలి సుమా!  అలా ధ్యానిస్తే తొందరగా నీకు అన్ని ఖజానాలు లభిస్తాయి.  అని అతని చెవిలో ఆచార్యులు మంత్రం చెప్తారు. 

     ఆ బ్రహ్మచారి ఏకాంత ప్రదేశంలో జపం చేస్తూ కూర్చుంటాడు 'ఓం' అని మంత్ర జపం చేయడం మొదలుపెడతాడు. ఓంకారము అతను చేస్తుంటే పక్కనుండి కూడా ఓంకార ధ్వని వినబడుతుంది.  బ్రహ్మచారి ఆశ్చర్యంగా చూస్తే అక్కడ వేరే వ్యక్తి కూడా ఓంకారాన్ని చేస్తున్నారు.  బ్రహ్మచారి అక్కడి నుండి  బయలుదేరుతాడు.  గ్రామంలోని వారు కూడా ఓం అనే పదాన్ని ఉపయోగించడం చూసి వాహ్ గురువుగారు వాహ్! మీరు నన్ను మోసం చేశారు.  'ఓం' గుప్త మంత్రం అని చెప్పారు.  ఇది అందరూ పలుకుతున్నారు.  మరి ఇది గుప్త మంత్రం ఎలా అయింది? ఆరంభంలో ఓం అంతంలో ఓం మరియు 'ఓం' రహస్యం ఎలా అయింది? ఆచార్య నేను మీకు గుప్త మంత్రం అడిగాను కానీ మీరు ఇచ్చినది గుప్త మంత్రం ఎలా అయింది అందరూ దానిని పలుకుతున్నారు కదా అని గురువుగారిని ప్రశ్నిస్తాడు బ్రహ్మచారి.

     దానికి గురువుగారు నాయనా నీకు గుప్త మంత్రమే ఇచ్చాను.  కానీ నీలాంటి శిష్యులు అనేకం ఉంటారు.  అలాగే గుప్త మంత్రం ఇచ్చే నాలాంటి గురువులు కూడా అనేకమంది ఉంటారు.  సరే నా దగ్గర వేరొక గుప్త మంత్రం ఉంది.  దాన్ని పొందడానికి నువ్వు ఒక పని చేయాలి అంటూ లోపల నుండి ఒక రాయిని తెచ్చి బ్రహ్మచారికి ఇచ్చి, ఇది మా ఆచార్యులు నేను గుప్త మంత్రం అడిగితే దీనిని నాకు ఇచ్చారు.  దీన్ని ఈరోజు  నీకు ఇస్తున్నాను.  బజారుకు వెళ్లి ఇది అమ్మడానికి ప్రయత్నం చెయ్యి.  కానీ అమ్మకు.  ఒకవేళ నువ్వు దీని యొక్క అసలైన విలువను తెలుసుకొని వస్తే నేను నీకు ఆ రెండో మంత్రాన్ని చెప్తాను అంటారు.  

     బ్రహ్మచారి బజారుకు వెళ్లి చాలామంది వ్యాపారులకు రాయిని  చూపించి దీన్నినేను అమ్మాలనుకుంటున్నాను అని చెప్తాడు.  వాళ్ళు ఆ రాతిని కొనడానికి ఎవరూ ముందుకు రారు ఆఖరికి ఒక వ్యాపారి దగ్గరికి వెళ్లి రాతిని చూపిస్తాడు రాయిని చూపిస్తాడు.  అతడు ఆ రాయిని చూసి ఇంత విలువైన వస్తువును కొనే అర్హత నాకు లేదు.  ఇది రాజులు మీ ఆచార్యునికి బహుమతిగా ఇచ్చిన రత్నం అయి ఉంటుంది.  దీనిని కొనే శక్తి నాకు లేదు.  దీని విలువ ఎవ్వరు కూడా కట్టలేరు.  అని చెప్తాడు ఆ వ్యాపారి.  బ్రహ్మచారి ఆచార్యుని దగ్గరికి వెళ్లి  చాలామందికి దీని విలువ తెలియలేదు.   ఒక్క వ్యాపారి మాత్రమే ఇది చాలా విలువైనది అని గుర్తించాడు. కానీ ఇంత విలువైనదని తెలిసి కూడా మీరు నాకెందుకు అమ్మమన్నారు ఆచార్య? అని అడుగుతారు. 

     ఎందుకంటే నువ్వు 'ఓం' యొక్క విలువని తెలుసుకోవాలని.  ఈ రాయి విలువ అందరూ తెలుసుకోలేకపోయారు.  అంటే దీని విలువ గుప్తమే కదా!  అందరూ దీని విలువ కట్టలేకపోయారు.  కానీ సునిశితమైన దృష్టి కలవాడే ఇది రత్నం అని తెలుసుకున్నాడు.  అదేవిధంగా 'ఓం' కూడా ఒక రత్నమే.  దాని విలువ గుప్తమైనది.  నిత్యం 'ఓం' ను జపించిన వారు కూడా ఓం విలువ, ఓం రహస్యం తెలుసుకోలేరు.

నిత్యం జపించిన వారు కూడా ఓం విలువ తెలుసుకోలేరా?  కానీ ఇది ఎలా సంభవం?

      బహుశా అందుకే పురాణకారులు 'ఓం' యొక్క మహత్వాన్ని బోధించడానికి ఒక అద్భుతమైన కథను రచించారు. 

     కార్తికేయుడు బ్రహ్మ ప్రజాపతి దగ్గరకు వెళ్లి మీకు నేనొక ప్రశ్న అడగాలి అంటాడు.  దానికి బ్రహ్మ అడుగు ఏం అడగాలి అంటారు.

 ఓం యొక్క అర్థం ఏంటి? 
మీకు 'ఓం' యొక్క తాత్పర్యం తెలుసా? తెలియదా... సరే అయితే మీరు నాకు బందీగా ఉండండి అంటాడు.  సృష్టి రచనా కారుడే తనంతట తాను తన రచనలోనే బందీ అయ్యాడు.

కానీ సృష్టికార్యంలో అలజడి రేగింది.  సృష్టిలో రచన ఆగిపోయింది.  పూలు వికసించడం, చెట్లు ఫలించడం ఆగిపోయింది. దేవతలందరూ భయపడి శంకరుని వద్దకు వెళ్లి ప్రార్థించారు.  అప్పుడు దేవతల యొక్క ప్రార్థన విని ఆశుతోషుడు కార్తికేయుని అడిగాడు.

కార్తికేయ! నువ్వు ప్రజాపతిని బందీ ఎందుకు చేశావు? 

అన్ని ప్రశ్నలకు సమాధానం ఉండవలసిన వారి దగ్గర నా ప్రశ్నకి సమాధానం లేదు.  అందువలన నేను కాదు ఆయనే స్వయంగా బందీ అయ్యారు. 

'ఓం' యొక్క అర్థం నీకు తెలుసా?  అని శివుడు అడిగారు. 

ఇది తెలుసుకోవాలంటే మీరు నన్ను గురువుగా స్వీకరించాలి.  అందుకు శివుడు అంగీకరిస్తారు. అప్పుడు కార్తీకేయుడు 'ఓం' యొక్క అర్థం ఇలా వివరించాడు.

     'ఓం' ఒక అక్షరం.  ఒక శబ్దం.  'ఓం' ధ్వని మరియు నాదం కూడా. 'ఓం' లో మూడు అక్షరాలు ఉన్నాయి.  అవి  అ, ఉ, మ. ఎప్పుడైతే అ, ఉ కలిసి పోతాయో ఓ అవుతుంది.  ఓ, మ కలిసినప్పుడు ఓం అవుతుంది. ఏ వ్యక్తైనా, అతని మాతృభాష ఏదైనా సరే అతను ఉఛ్ఛరించడానికి నోరు తెరిస్తే స్వాభావికంగా 'అ'కారం యొక్క ధ్వని వెలువడుతుంది.  అతను ఉఛ్ఛరించిన తర్వాత నోటిని మూసినప్పుడు కేవలం 'మ'కారం యొక్క ధ్వని వినిపిస్తుంది.  అతను పెదవులను దగ్గరికి తెచ్చి నోటిని సగం తెరిచి, సగం మూసి ఉంచేటప్పుడు 'ఉ'కారం యొక్క నైసర్గిక ధ్వని వినిపిస్తుంది. 

     అంటే నోటిని తెరిస్తే ఆకారం.  నోటిని మూస్తే మ కారం.  రెండింటికి మధ్యలో ఉకారం  వస్తుంది.  అందువలన అన్ని భాషల యొక్క అన్ని ధ్వనులు (అచ్చులు కానీ హల్లులు కానీ)  అన్నీ కూడా ఓంకార పరిధిలోనే వస్తాయి.  అందువలన 'ఓం'  విశిష్టమైన వైశ్విక ధ్వని.  ఓం ఈశ్వరుని ప్రతీక కూడా. 

     మాండూక్య ఉపనిషత్ ప్రకారం జాగ్రద్ యొక్క సమగ్ర జాగ్రత్ ప్రపంచం ఓంకారం యొక్క ప్రథమ అక్షరం 'అ' నుండే అభివ్యక్తం అవుతుంది.  మరియు సమస్త స్వప్న అవస్థ యొక్క ప్రపంచం 'ఉ' నుండి అభివ్యక్తం అవుతుంది . సుషుప్తి అవస్థ యొక్క ప్రపంచం 'మ' నుండి అభివ్యక్తం అవుతుంది . సంపూర్ణ ప్రపంచమే ఈశ్వరుడు.  మరియు జాగ్రత్, స్వప్న, సుషుప్తే సమస్త ప్రపంచం.  ఈ మూడింటి ప్రతీక  అ,ఉ,మ.  అందువలన 'ఓం' ఈశ్వరుని యొక్క అత్యద్భుతమైన ప్రతీక. 

       ఓంకారం ఈశ్వరుని యొక్క నిర్గుణ స్వరూపానికి కూడా ప్రతీక.  మాండూక్య ఉపనిషత్ యొక్క ఘోషణ ఏంటంటే ఎలాగైతే ఈ మూడు అవస్థలు బ్రహ్మ లేదా ఆత్మలోనే ఉత్పన్నమవుతాయి మళ్లీ అందులోనే విలీనం అయిపోతాయో... 

     అలాగే మూడు అక్షరాలతో కూడిన 'ఓం' కూడా శాంతి లేదా నిశ్శబ్దం నుండి ఉత్పన్నమై మళ్ళీ అందులోనే విలీనం అయిపోతుంది.  అందువలన రెండు ఓంకారాలకు మధ్య ఉన్న నిశ్శబ్దతను 'అ' మాత్ర అంటారు.  నిర్గుణ బ్రహ్మ యొక్క ప్రతీక. 

     ఓంకారం ఉచ్చరించే సమయంలో అకారం ఉకారంలో,  ఉకారం మకారంలో విలీనం అవుతుంది.  మరియు మకారం నిశ్శబ్దంలో విలీనం అవుతుంది. అదే విధంగా ఉపాసన సమయంలో ఈ 'ఓం' యొక్క ఉఛ్ఛారణను ఆధారంగా చేసుకుని సాధకుడు స్థూల జాగ్రత్  ప్రపంచాన్ని సూక్ష్మ లేదా మానసిక ప్రపంచంలో, సూక్ష్మ ప్రపంచాన్ని కారణ ప్రపంచంలో విలీనం చేస్తాడు.  తరువాత దానిని కూడా అతిక్రమించి అతను కేవలం శాంత నిర్గుణ శాంతం, శివం, అద్వైతం ఆత్మలోనే స్థిరమైపోతాడు.  ఇదే ఓంకార ఉపాసనకి చరణసీమ. 

     అంటే ఏవైతే అస్తిత్వంలో ఉన్నాయో మరియు సముచయ అస్తిత్వం యొక్క విలువలను అన్నింటిని 'ఓం' అభివ్యక్తం చేస్తుంది.  మరియు అన్నింటికీ 'ఓం' అతీతమైనది.  'ఓం' ని ప్రణవం కూడా అంటారు.  అంటే దీని ద్వారా ఈశ్వరుని స్తుతించగలరు. 

     'ఓం' యొక్క దార్శనికార్ధం అయితే తెలిసింది.  కానీ చాలా మంత్రాలలో ప్రార్థనలలో ప్రారంభంలో ఓం ఎందుకు వాడుతారు?  ఓం నమశ్శివాయ,  ఓం నమో నారాయణాయ మొదలైనవి. 

     ఈశ్వరుడు ఈ సంసారం యొక్క రచన 'ఓం' మరియు య'అథ' ఉచ్చారణ చేసి ఆ తర్వాతే సృష్టిని ఆరంభించారు అని చెప్తారు. అందువలన ఏదైనా కఠినమైన కార్యం ఆరంభించే ముందు 'ఓం' ఉచ్చారణ యొక్క ధ్వని శుభం అవుతుందని అంటారు.  అందువలన చాలా మంత్రాలు, వైదిక ప్రార్థనలో 'ఓం' తోనే ప్రారంభమవుతాయి. అంతేకాదు దైనిక జీవనంలో అభివాదం చేయడానికి కూడా 'ఓం'  ను ప్రయోగిస్తారు.
  హరిః ఓం అని. 

     ఈ విధంగా ఓం అన్నింటిని వ్యక్తం చేస్తుంది.  జీవనం యొక్క లక్ష్యం మరియు లక్ష్యం వరకు చేర్చే  సాధన కూడా.  జగత్తు మరియు దాని అధిష్టానం రూపమైన సత్యం వరకు 'ఓం' చేరుస్తుంది. 


హరిః ఓం 🙏🏻జైగురుదేవ 🙏🏻 🏵️ 
           ‌
 జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *కేనోపనిషత్తు* - 1వ భాగము.
"కేన" అనే పదంతో ప్రారంభమౌతుంది గనుక దీనిని "కేనోపనిషత్తు" అని పేరు పెట్టడం జరిగింది. ఇది సామవేదానికి చెందినది. ఇది శిష్యులు అడిగిన ప్రశ్నలకు గురువు చెప్పే సమాధాన రూపంగా సాగుతుంది. ఉమాదేవి కధ ఇందులో కానవస్తుంది. బ్రహ్మపదార్ధమును వర్ణించుట దుర్లభమని దానిని అనుభవంతోనే గ్రహించాలని ప్రభోదిస్తుంది ఈ ఉపనిషత్తు.
శాంతి మంత్రము :
నా అవయవములు శక్రివంతములు అగు గాక. నా వాక్కు, ప్రాణములు, కన్నులు, చెవి మొదలగు ఇంద్రియములన్నియు శక్తివంతములు అగు గాక. సర్వము బ్రహ్మమే. నేను ఎన్నడును బ్రహ్మమును నిరాకరింపకుండెదను గాక. బ్రహ్మము నన్ను నిరాకరింపకుండు గాక. ఉపనిషత్తులలో తెలుపబడిన ధర్మములు నాయందు స్థిరపడు గాక. ఓం శాంతిః శాంతిః శాంతిః.
ప్రధమఖండము - మంత్రముల వివరణ :
శిష్యుడు : ఎవరిచేత ప్రేరేపింపబడి మనస్సు వస్తుప్రపంచము వైపు ఆకర్షింపబడుతున్నది? ఎవరి ఆజ్ఞకు లోబడి ప్రాణము నిలుస్తున్నది? ఎవరి వలన వాక్కు ప్రకటితమౌతున్నది? ఏ జ్ఞానము కళ్ళను, చెవులను ప్రేరేపిస్తున్నది?
గురువు : చెవికి చెవిగా, మనస్సునకు మనస్సుగా, వాక్కనకు వాక్కుగా, ప్రాణమునకు ప్రాణముగా, నేత్రమునకు నేత్రముగా అయివున్న వస్తువు ఒకటుంది. దీనిని గ్రహించినవారు వస్తుప్రపంచము నుండి విముక్తినొంది అమృతతత్వమును పొందుతారు.
దానిని నేత్రములు చూడలేవు, వాక్కు వర్ణించలేదు. దానిని తెలుపుట కష్టము ఎందుకంటే అది తెలిసినదానికంటే, తెలియనిదానికంటే అతీతమైనది. మా పూర్వీకులనుండి మేము గ్రహించినది ఏమిటంటే, దేనిని వాక్కు వ్యక్తపరచలేదో, దేనివలన వాక్కు వ్యక్తమగునో అదే బ్రహ్మము. అంతేగాని ఇక్కడ జీవులు ఉపాసించునది మాత్రము కాదు.
దేనిని గూర్చి మనస్సు మననము చేయలేదో, దేనివలన మనస్సు సంచరించుచున్నదో అదే బ్రహ్మము. అంతేకాని ఇక్కడ జీవులు ఉపాసించునది కాదు. దేనిని నేత్రములు దర్శించలేవో, దేనివలన నేత్రములు చూడగలుగుచున్నవో అదే బ్రహ్మము. అంతేగాని ఇక్కడ జీవులు ఉపాసించునది కాదు.
దేనిని చెవులు ఆలకించలేవో, దేనివలన చెవులు ఆలకించగలుగుతున్నవో అదే బ్రహ్మము. అంతేగాని ఇక్కడ జీవులు ఉపాసించునది కాదు. దేనిని ముక్కు శ్వాసించలేదో, దేనివలన ముక్కు శ్వాసించుచున్నదో అదే బ్రహ్మము. అంతేగాని ఇక్కడ జీవులు ఉపాసించునది కాదు.
*తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము.

సాధనయే రహస్య తాళం చెవి / Sadhana is the secret master key

 *🌹 సాధనయే రహస్య తాళం చెవి / Sadhana is the secret master key 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*సాధన అనేది పాక్షికమైన విశ్వం నుండి ఇంద్రియాలను దూరం చేయడం మరియు  ఆత్మ మీద మనస్సు యొక్క ఏకాగ్రత. ఇది శాశ్వతత్వంలోని జీవితం లేదా ఆత్మలో శాశ్వతమైన జీవితం అందిస్తుంది. అది మనిషిని దైవత్వంలోకి మారుస్తుంది. ఇది నిరుపేదలకు ఆశను, అణగారిన వారికి ఆనందం, బలహీనులకు బలం మరియు అజ్ఞానులకు జ్ఞానాన్ని అందిస్తుంది. సాధన అనేది బాహ్య ఆనందం మరియు లోతైన స్థిరమైన శాంతి యొక్క రంగాలను తెరవడానికి  రహస్య తాళం చెవి.*

*🌹 Sadhana is the secret master key 🌹*
✍️ Mahavatar Babaji

*Sadhana is the turning away of the senses from the objective universe and the concentration of the mind within. It is eternal life in the soul or spirit. It transmutes a man into Divinity. It brings a message of hope to the forlorn, joy to the depressed, strength to the weak and knowledge to the ignorant. Sadhana is the secret master key to open the realms of external bliss and deep abiding peace.*
🌹🌹🌹🌹🌹

*****ఆధ్యాత్మికత అంటే ఏమిటి ? అది మనకి ఎందుకు అంత ముఖ్యం ??

 ఆధ్యాత్మికత అంటే ఏమిటి ?
అది మనకి ఎందుకు అంత ముఖ్యం ??

మనిషి ఎప్పుడూ సుఖంగా శాంతిగా వుండాలను కోవటం వల్ల. తానూ తనవాళ్ళూ ఎప్పుడూ సుఖంగా శాంతిగా వుండటం కోసం మనిషి నిరంతరం ఆరాటపడుతుంటాడు. ఎల్లప్పుడూ కేవలం అందుకోసమే ప్రయత్నిస్తుంటాడు. ఏ ఆలోచన చేసినా, ఏ పనిచేసినా అది కాక మరో కారణం ఉండనే వుండదు. సుఖ శాంతుల కోసం మనిషి తనకు చాతనైనంత వరకు ఎన్నో ఏర్పాట్లు చేసుకొంటూ వున్నాడు. ఆ ఏర్పాట్లు చేసుకోవటానికి ఎంతో శ్రమ, బాధ పడుతూనే వున్నాడు. ఐనా జీవితంలో ఎన్నోసార్లు మళ్ళీ మళ్ళీ అశాంతీ, అలజడీ, దుఃఖమూ, భయమూ, విసుగూ ఎదురౌతూనే వున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటని చూసినట్లయితే ఈ క్రింది నాలుగు విషయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

మార్పు, మరణం, ప్రతికూలత, ఊహలు

ఈ నాలుగింటి వల్ల మనిషి అశాంతితో, అలజడితో, విసుగుతో, బాధతో, భయంతో ఇంకా ఏదో చేయాలనే తాపత్రయంతో చివరికి మృత్యువు ఒడిలోకి జారి పోతుంటాడు. సామాన్యమైన వ్యక్తులంతా ఈ వూబిలో పడిపోయి వుంటారు.

మార్పు :- ఏదో ఒక వస్తువును కొన్నప్పుడు చాలా సంతోషంగానే, ఆనందంగానే వుంటుంది. ఐతే ఆ వస్తువుని జాగ్రత్త పరచడంలో అలసట, ఆందోళన, భయము పొంచి వుంటున్నాయి. కొంత కాలం తర్వాత మార్పు వల్ల ఆ వస్తువు పాతబడి పోతుంది. దాని స్థానంలో మరో కొత్తది కావాలనిపిస్తుంది. కొత్తది కొంటే పాతదాన్నేమి చేయాలి? ఇదో సమస్య. ఐనకాడికి అమ్మేయాలా?
ఎవరికైనా ఇచ్చేయాలా? లేకపోతే ఎక్కడ పెట్టాలి? ఇదొక ఎడతెగని అంతర్మధనం. ఈ రకమైన అంతర్మధనం, ఊగిసలాట కేవలం వస్తువుల విషయంలోనే కాక, బంధువులు, స్నేహితుల విషయంలో కూడా వర్తిస్తున్నది.సమస్యతో సహజీవనం చేయడం, సర్దుకు పోవడం తప్పనిసరిగా మారుతున్నది.

మరణం :- తాను మరణిస్తానేమోననే ఆందోళన ఉండనే వుంది. అలాగే తనవాళ్ళు మరణిస్తారనే భయము, అలజడి, దుఃఖము.

ప్రతికూలత :- తాను అనుకున్నది జరగనప్పుడు చికాకు, బాధ పడటమే కాకుండా, చిన్న, పెద్ద విషయాలలో కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదు అని మళ్ళీ మళ్ళీ గతించిన చేదు విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొని బాధ పడుతుంటాడు.

ఊహలు :- భవిష్యత్తుకు సంబంధించిన విషయాల ఊహలతో సతమత మౌతుంటాడు.

ప్రతి మనిషీ ఎంతటి ప్రయత్నం చేసి ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ మార్పుల వల్లా, మరణం వల్లా, ప్రతికూలతల వల్లా, ఊహలవల్లా బాధ, దుఃఖము, అశాతి, అలజడి, విసుగు, ఆందోళన అడుగడుగునా ఎదురౌతూనే వున్నాయిగదా! కానీ ఈనాడు కొత్తగా వచ్చిన సమస్యకాదు. అనాదిగా మానవుడు ఎదుర్కొంటున్న సమస్యే. ఐతే మేధావంతులైన ప్రాచీన మహర్షులు జటిలమైన ఈ సమస్యను కూలంకషంగా అధ్యయనం చేసి మహత్తరమైన అనుభవాలతో ఈ క్రింది పరిష్కార మార్గాన్ని ప్రతిపాదించారు.
మనిషి తన ఆధీనంలో లేనటువంటి బాహ్య విషయాల ప్రభావానికి లోనవటం వలన తాను అంతర్గతంగా దుఃఖము, బాధ, విసుగు, అలజడి, ఆందోళన, భయము మొదలైన వికారాలను పొందుతున్నాడు. బాహ్య విషయాలు తన ఆధీనంలో లేనివి కనుక తాను తనకు అనుగుణంగా మార్చగలిగేవి కాదు. అందువల్ల వాటిని మార్చాలనే ప్రయత్నం ఎంత గొప్పగా చేసినా, కాలానుగుణంగా అది నిరుపయోగమే కాగలదు. ఐతే బాహ్య విషయాల ప్రభావానికి తాను లోనవటం వల్లనే గదా తాను దుఃఖము మొదలైన వికారాలకు గురౌతున్నది. కావున తాను ఏదోవిధంగా బాహ్య విషయాల ప్రభావానికి లోను కాకుండా ఉండగలిగితే దుఃఖ పడవలసిన అగత్యం వుండదు. ఈ విధమైన దృక్పథంతో బాహ్య విషయాలను ప్రక్కన పెట్టి అంతర్గతంగా తమలో ఏమి ఉన్నదో, దుఃఖము, భయము మొదలైన వికారాలు అసలు ఎలా కలుగుతున్నాయో నిశితంగా పరిశీలించారు.
ఇదే అంతర్ముఖం అవ్వటం, అంతశ్శోధన చేయటం అనబడుతుంది. ఇప్పటివరకు తాను బహిర్ముఖుడై తనకు బాహ్య విషయాల వల్ల దుఖం కలుగుతున్నదని గ్రహించడం చేత, అసలు బాహ్య విషయాలు ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అలా చూస్తున్నప్పుడు తనకు గోచరమౌతున్న స్థూల విషయాలన్నీ పంచ భూతములతో నిర్మితమైనవిగనూ, తాను పంచభూతముల కంటే సూక్ష్మముగనూ, భిన్నముగనూ వున్నట్లు తెలియుచున్నది.
ఇప్పటివరకు స్థూల దేహమే తాననుకోవటం వలన దేహ సంబంధ మైన విషయాలు తనపై నాపాదించుకోవటం జరిగింది. ఇప్పుడు ఇతర విషయాల సరసన దేహం కూడా తనకు భిన్నంగా గోచరిస్తున్నది. అలాగే స్థూలమైన దేహం కంటే సూక్ష్మమైన ఇంద్రియాలు, అంతకంటే సూక్ష్మమైన మనస్సు, బుద్ధి, ప్రాణము తనకు గోచరమౌతున్నాయి కనుక ద్రష్టయైన తాను గోచరమౌతున్న దృశ్యానికి భిన్నముగా సూక్ష్మతమమై యున్నట్లు తెలియుచున్నది. ఈ విధంగా సాంఖ్యానమ్ చేసిన మహర్షులు ఆత్మ యొక్క విస్త్రుతత్వాన్ని వివరించారు.

ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగమవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’. కొన్నిసార్లు అజ్ఞానం వల్ల, అనేకసార్లు కావాలనే ఈ పదాన్ని సదుపయోగమో, దురుపయోగమో చేస్తున్నారు. ఈ దురుపయోగం కారణంగా అందరిలో ఎంత గందరగోళం ఏర్పడిందంటే అందరూ దానివల్ల ప్రయోజనమేమైనా ఉందా, లేదా అని సందేహించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇది చాలా  అనిశ్చిత స్థితిని ఏర్పరిచింది. ఆ మార్గంలో అనేక సంవత్సరాలు నడచిన తర్వాత కూడా, చాలామందికి  అందులో ఎంతో సందిగ్ధత, ఎంతో అపార్థం. ఈ  కారణంగానే వారి మనస్సులో ఎన్నో సందేహాలు.

ఆలోచన మానసికమైంది, అదెప్పుడూ ఆధ్యాత్మికత అవ్వదు. మనం మన మనస్సులో ఆలోచించేదంతా ఆధ్యాత్మికం కాదు. మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు రావు. మీరు దేవుణ్ణి గురించి, స్వర్గం గురించి, మోక్షం గురించి ఆలోచించేదంతా ఆధ్యాత్మికత కాదు. ఆలోచన మానసికమైంది, అదెప్పుడూ ఆధ్యాత్మికత అవ్వదు.  ఇది ఎలాంటిదంటే, నాకు ఒక ఆధ్యాత్మికమైన చిటికెన వేలుందనడం లాంటిదది. వేలు ఎప్పుడూ భౌతికమైనదే. అది కేవలం భౌతికం మాత్రమే కాగలదు. నేను నా శరీరాన్ని, నా చిటికెన వేలును, ఆధ్యాత్మిక ప్రక్రియకు అనుకూలమైన సాధనంగా మలచుకోవచ్చు. కానీ అంతమాత్రాన అవే ఆధ్యాత్మికం కాదు. అదొక మంచి భౌతికమైన చిటికెన వేలు మాత్రమే. అది అడ్డంక్కి లాగా ఐనా ఉండచ్చు లేదాఆవలికి ఓ ద్వారమైనా కావచ్చు . ఏదైనప్పటికీ, అది భౌతికం మాత్రమే.

భౌతికత ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు. మనకీ భౌతిక శరీరం ఉంది కాబట్టే మరో కోణం గురించి ఆలోచించగలుగుతున్నాం.
 లేకపోతే ఆ అవకాశమే లేదు. మనం ఇక్కడ భౌతికంగా ఉండకపోతే ఆధ్యాత్మిక ప్రక్రియకు అవసరమే రాదు. అందువల్ల ఆధ్యాత్మికతకు భౌతిక శరీరం ఒక ప్రాథమిక మార్గమే కాని అదే ఆధ్యాత్మికత కాలేదు. అదేవిధంగా మానసిక, భావోద్వేగ సంబంధమైనవి కూడా ఆధ్యాత్మికత కాలేవు. అవి జీవితంలోని భిన్నకోణాలు, వాటి విషయంలో తప్పూ లేదు, ఒప్పూ లేదు. వాటిని మనమెలా ఉపయోగిస్తామనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. 

మనం ఈ శరీరాన్ని ఒక నిరోధంగా, ఒక ఉచ్చుగా ఉపయోగించవచ్చు లేదా ఒక ద్వారంగా ఉపయోగించవచ్చు. అదే విధంగా ఈ బుద్ధిని దుఃఖాన్ని సృజించే యంత్రంగా లేదా ఆధ్యాత్మిక సంభావ్యతకు సాధకంగా ఉపయోగించవచ్చు. కాని బుద్ధి, శరీరం, భావోద్వేగం ఆధ్యాత్మికం కాలేవు.

                  🌷శుభమస్తు🌷

          సమస్త లోకా సుఖినోభవంతు.

Saturday, May 25, 2024

మీ ఫోకస్ను మెరుగుపరచుకొని తెలివితేటలను ఎలా పెంచుకోవాలి How To Improve Your Focus & Intelligence

 

మీ ఫోకస్ను మెరుగుపరచుకొని తెలివితేటలను ఎలా పెంచుకోవాలి How To Improve Your Focus & Intelligence


YouTube video - https://youtu.be/Ixnu7fAgIEo?si=3SrPsNDUrrlZJVet

అంతా మిధ్య తలంచి చూచిన

 భక్తుడు :"మిధ్య" అంటే ఏమిటో నేను తెలుసుకో దలిచాను భగవాన్?
భగవాన్ : నేను అంటున్నారే , ఆ నేను ఎవరో తెలుసుకుంటే... ఆ తర్వాత మీకే తెలుస్తుంది..... మిధ్య అంటే ఏమిటో....
భక్తుడు: ఇప్పుడు నేను భౌతిక ప్రపంచం లో ఉన్నాను భగవాన్...
భగవాన్: సరే మంచిదే .....గాఢనిద్రలో ఎక్కడ ఉన్నారు?
భక్తుు :గాఢనిద్రలో ....నేను ఉన్నాను కానీ అక్కడ ఈ
నేను పనిచే యటం లేదు
భగవాన్ : అవును నిద్రలో మీరు ఉన్నారు కదా నిద్రలోని నేనే... మెళుకువలను ఉన్నది కదా!
భక్తుడు అవును..
భగవాన్ : అయితే వ్యత్యాసం నిద్రలోని నేను..... ఆలోచించే మనసు తో కలవడం లేదు ..మెలుకువ లో
కలుస్తోంది నిజమేనా?
భక్తుడు అవును....
భగవాన్ : నీ నిజ స్వరూపం ఏది ??ఆలోచన తో కలిసి పోవడమా.?.. కలగకుండా వేరుగా ఉండడమా.?...
భక్తుడు : నిద్రలోని నేను ..ను....నేను తెలుసుకోలేకపోతున్నాను కదా..
భగవాన్: ఇప్పుడు అంటే మెలుకువలో
ఇలా చెప్తున్నావు .....మరీ నిద్రలో ఇలా అనలేవ కదా .... పోనీ.... నిద్రలో నేను అనగలవా?
భక్తుడు :అనలేను...
భగవాన్ : రెండు అవస్థలలొను...నీవు ఉన్నావు.... అసలు ఉండుట అనేది "ఆత్మ" లక్షణము... ఉన్నాను అను స్పురణను ...అనుభవిస్తూనే ఉన్నావు.. ఈ ఆత్మే నీ అసలు స్వరూపము...
భక్తుడు: ఈ సత్యాన్ని తెలుసు కోవడానికి అయ్యినా
ఆలోచించాలి కదా?
భగవాన్ : ఇతర ఆలోచనలని తొలిగించడానికే
ఈ ఆలోచన..
భక్తుడు: క్షమించాలి నేను అజ్ఞానిని.. శుధమైన.....ఆత్మ
తత్వ్వాని గ్రహించలేక పోతున్నాను...
భగవాన్: ఈ నేను ఏవరు? .....ఎవరిది ..ఈ అజ్ఞానం ...ఈ ప్రశ్నలకు జవాబు దొరికితే.... ఆత్మ ను గుర్తించినట్లే ఎవరైనా ఎంతటి అజ్ఞాని..... అయినా తాను లేనని అనలేడు కదా....నిద్రలో నేను లేనని అనలేడు కదా.... అలా నిజమైన ....ఆత్మ ఉనికిని....అంగీకరించక తప్పదు... ఆ ఆత్మను గుర్తిస్తే ఈ అజ్ఞానం
ఉండదు..
భక్తుడు : ఆత్మజ్ఞానం అంటే కోరికలు లేకపోవడమే కదా? కోరికలు లేకపోతే అతను మానవుడు అవుతాడా?
భగవాన్: నిద్రలో నేను .....ఉన్నది కానీ మనస్సు
తో కలవలేదు... అప్పుడు శరీరాన్ని కూడా.... గుర్తించలేదు ....అందుచేత నేను అంటే... ఈ దేహము....మాత్రమే అని అనవు...... నీకు అన్యంగా దేనిని చూడవు..
ఇక ఇప్పుడు దేహంతో ఏకత్వం పొంది యున్నావు..
నేను అంటే ఈ దేహమే అని తలుస్తూన్నావు..
నీకు అన్యంగా... ఇతర వస్తువులు....... విషయాలు ఉన్నాయని తలుస్తూన్నావు...... అప్పుడు కోరికలు
పుడుతన్నాయి....నిద్రలో ...నీకు ఏ కోరికా లేదు ...ఏ....దుఃఖమూ లేదు ..ఈ. మానవ ఆకారమే "నేను" అనుకున్నప్పుడే ఈ కోరికలు పుడతాయి...... కనుక ఈ మానవ ఆకారమే నేను అనుకొని.......ఈ.. కోరికలు ....ఈ..వేడుకలు ఎందుకు తెచ్చుకోవాలి?
నిజానికి ఈ జడ శరీరము నేను అని పలకదు.... మరి ఈ శరీరానికి భిన్నంగా మరో ఒకటి ఉండాలి కదా...అది ఏమిటి???....అదియే "ఆత్మ ".....ఈ శరీరమే నేను అని అనదు .......మధ్యలో మెలుకువతో పాటు నేను అని ఒకటి పుడుతుంది అది "అహం" ..మును...ముందుగా ఈ "నేను " ఎవరు అని నిరంతరం ప్రశ్నించుకో...అపుడు
నీకు తప్పక సమాధానం దొరుకుతుంది..!

భగవాన్ శంకరులు-ఙిఙ్ఞాసామధనం.

 భగవాన్ శంకరులు-ఙిఙ్ఞాసామధనం.🌹
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
మానవీయ మహాప్రస్థానములో విలువలు ఙిఙ్ఞాసావిష్కరణలు.
భగవాన్ శంకరులుఙిఙ్ఞాసామధనంలో అంత వరకు చేరనిలోతుకు చేరి తన మనో వికాసాన్ని మానవ మేధోపురోగతికితోడుచేశారు. అప్పటి అవిష్కరణలు మన (మానవ) జాతి గమనములో మైలురాళ్ళుమాత్రమే. గీత గోవిందంలో చెప్పినట్టు వ్యాకరణాన్ని వల్లెవేయడము పురోగమన గతి కాజాలదు. మన దృక్పధము నిరంతర పురోగామిత్వముకావలె నన్నదే మహానభావుల ఆశయము. సత్యసోధనలో మనిషికి యెదురయ్యే ప్రశ్నలకి జవాబులు మారుతూనే వుంటాయి. ఎందుకంటే సత్యము నిశ్చయంగా జటిలము. నిత్య నవ జాతము. పైగా బ్రహ్మ విద్య. గురుభావము గురుత్వ గరిమ నిత్యనిరవధిక సోధనలోనే అంతర్లీనంగా వుంటుంది. మన'ని మనము అవగాహన చేసుకుని అవిష్కృత సత్యములన చదువు సంస్కారముల ద్వారా పరివ్యాప్తి చేయడమే ఆచార్యుల ఆంతర్యము. సహ జీవన సౌరభంలో వినడమూ వినుకోవడమూ అనేవి నిత్య వ్యవహారాన్నీ సత్య వ్యవహారాన్నీ పొంతన చెయడములో ఒదిగి వుంటాయి.
ఐహికాముష్మికసాధనసామర్థ్యం కలుగుతుంది. కనుక వీలయితే మూల శ్లోకాలతో , కనీసం ఈ తెలుగయినా రోజుకొకసారి చదివి మననం చేయాలి.
ప్రశ్నలన్నీ శిష్యుడు అడిగినవీ జవాబులన్నీ గురువుగారు చెప్పినవీగా తెలుసుకోవాలి:
🌺🌺🌺
1. భగవన్, గ్రహించవలసినదేమిటి?
గురువాక్యం.
.
2. వదలవలసినదేమిటి?
చేయరాని పని.
.
3. గురువెవరు?
తత్త్వం తెలిసి ఎల్లపుడూ శిష్యునికి మేలు చేయటానికి సంసిద్ధుడయి ఉండేవాడు.
.
4. బుద్ధిమంతుడు త్వరపడి చేయవలసినదేమిటి?
సంసారం = జననమరణ చక్రం విరగగొట్టటం.
.
5. ముక్తి తరువుకు విత్తనం ఏమిటి?
కర్మాచరణం వల్ల (కలిగిన చిత్త శుద్ధి ద్వారా) లభించే తత్త్వజ్ఞానం.
.
6. అన్నింటికంటె పథ్యమైనదేది?
ధర్మం.
.
7. ఈ లోకంలో శుచి అయినవాడెవ్వడు?
పరిశుద్ధమైన మనస్సుకలవాడు.
.
8. పండితుడెవరు?
ఆత్మానాత్మ వివేకం కలవాడు.
.
9. ఏది విషం?
గురువులను అవమానించటం.
.
10. సంసారంలో సారమైన దేమిటి?
అనేకులు అనేకవిధాలుగా ఆలోచించి నిర్ణయించినదే.
.
11. మానవులకు అన్నింటికంటె ఇష్టమైన దేమిటి?
తనకు మేలుచేసుకొనటానికీ ఇతరులకుపకారం చేయటానికీ నిరంతరం పూనుకొనే జన్మ.
.
12. మద్యంలా మత్తెక్కించేదేమిటి?
స్నేహం.
.
13. దొంగలెవరు?
ఇంద్రియవిషయాలు.
.
14. సంసారంలో కట్టిపడవేసే తీగె ఏమిటి?
తృష్ణ.
.
15. శత్రువెవరు?
ప్రయత్నించకపోవటం.
.
16. దేనికి భయపడాలి?
మృత్యువుకి.
.
17. గ్రుడ్డివానికంటె కబోది ఎవడు?
రాగం, విషయాసక్తి కలవాడు
..
18. శూరుడెవరు?
లలనల చూపుల తూపుల వ్యథచెందని వాడు.
.
19. కర్ణాం జలులతో పానం చేయదగిన అమృతం ఏది?
సదుపదేశం.
20. గౌరవానికి మూలం ఏమిటి?
యాచించకపోవటం.
.
21. గహనమైనదేమిటి?
కాంతనడత.
.
22. చతురుడెవరు?
కాంతనడతవల్ల ఖండితుడు కానివాడు.
.
23. ఏది దుఃఖం?
అసంతృప్తి.
.
24. తేలికచేసేది ఏది?
అధముని యాచించటం.
.
25. ఏది జీవితం?
దోషరహితం.
.
26. ఏదిజడత్వం?
చదివినా రాకపోవటం.
.
27. మేలుకొని ఉండేవాడెవడు?
వివేకి.
.
28. ఏది నిద్ర?
ప్రాణి మూఢత్వం.
.
29. తామరాకు మీది నీరులా చంచలమైనదేది?
యౌవనమూ, ధనమూ, ఆయువూ.
.
30. చంద్రకిరణాల వంటి వారెవరు?
సజ్జనులు.
.
31. ఏది నరకం?
ఒకరికి లొంగి ఉండటం.
.
32. ఏది సౌఖ్యం?
సర్వసంగపరిత్యాగం.
.
33. సాధించవలసినదేమిటి?
ప్రాణిహితం.
.
34. ప్రాణులకు ఏది ప్రియం?
ప్రాణం.
.
35. అనర్థకరమేది?
మానం.
.
36. ఏది సుఖప్రదం?
సాధుజనమైత్రి.
.
37. సకల కష్టాలూ పోగొట్టుకొనగలవాడెవడు?
సర్వవిధత్యాగి.
.
38. ఏది మరణం?
మూర్ఖత్వం .
.
39. ఏది అమూల్యం?
అవసరానికిచ్చిన దానం.
.
40.మరణం వరకూ బాధించేదేది?
చాటున చేసిన పాపం.
.
41. ఏ విషయమై ప్రయత్నించాలి?
విద్యాభ్యాసం, మంచిమందు, దానం.
.
42. తిరస్కరించవలసినదేది?
ఖలుడు, పరకాంత, పరధనం.
.
42. రేయింబవళ్లు ఆలోచించవలసినదేది?
సంసారం అసారమని, కాంత గురించి కాదు.
.
44. దేనిని ఇష్టం చేసుకోవాలి?
దీనులపై కరుణ, సజ్జనులతో మైత్రి.
.
45. ప్రాణాలు పోయేటపుడు కూడా ఎవరి మనస్సు కరగదు?
మూర్ఖుడు, శంకితుడు, విషాదగ్రస్తుడు, కృతఘ్నుడు -వీరిది
..
46. ఎవరు సాధువు?
మంచి నడవడి కలవాడు.
.
47. అధముడెవరు?
చెడునడవడి కలవాడు.
.
48. ఈ జగత్తును జయించిన వాడెవడు?
సత్యమూ, ద్వంద్వసహిష్ణుతా కలవాడు.
.
49. దేవతలెవనికి నమస్కరిస్తారు?
దయముఖ్యమనుకొనేవానికి.
.
50. ఏదంటే పండితునికి భయం?
సంసారారణ్యమంటే.
.
51. ప్రాణిగణం ఎవనికి వశమవుతుంది?
వినయవంతుడయి వినేవారినికి ప్రియమైన సత్యం పలికే వానికి.
.
52. కనిపించే ప్రయోజనం సిద్ధించటానికి ఎక్కడ ఉండాలి?
న్యాయ్యమార్గంలో.
.
53. ఎవడు కబోది?
అయోగ్యకార్యాలు చేయటంలో ఆసక్తికలవాడు.
.
54. ఎవడు చెవిటివాడు?
హితవుమాటలు విననివాడు.
.
55. మూగవాడెవడు?
సమయానికి తగు ప్రియమైన మాటలాడడం తెలియనివాడు
..
56. ఏదిదానం?
ప్రతిఫలమాశించనిది
..
57. ఎవడు మిత్రుడు?
పాపం నుంచి మరలించే వాడు.
.
58. ఏది అలంకారం?
శీలం.
.
59. పలుకులకు ఏది భూషణం?
సత్యం.
.
60. మెరపుమెరపులా చంచలమైనదేది?
దుర్జనసాంగత్యమూ యువతులూ.
.
61. కలికాలంలో కూడా కులశీలాల నుంచి కదలింపరానివారెవరు?
సజ్జనులే.
.
62. ఇహంలో చింతాణిలా దుర్లభమైనదేది?
చతుర్భద్రం.

.
63. అంటే ఏమిటంటారు తమస్సు విదిలించుకొన్న జ్ఞానులు?
ప్రియవాక్యసహితమైన దానం, గర్వరహితమైన జ్ఞానం, క్షమాయుతమైన శౌర్యం, త్యాగసమేతమైన విత్తం - ఇది చతుర్భద్రం. ఇది దుర్లభం.
.
64. శోచనీయమేది?
కలిమిగల లోభిత్వం.
.
65. ప్రశస్తమేది?
ఔదార్యం.
.
66. విద్వాంసులు కూడ పూజించదగినవాడెవడు?
స్వభావసిద్ధమైన వినయం ఎల్లవేళలా కలవాడు.
.
67. ఈ జగత్తు ఎవనికి వశమవుతుంది?
ప్రియమైన హితమైన పలుకులు పలుకుతూ ధర్మాసక్తి కలవానికి.
.
68. విద్వాంసుల మనస్సును ఏది హరిస్తుంది?
జ్ఞానసహితమైన సత్కవిత్వం.
.
69. ఆపద లెవరినంటవు?
ఇంద్రియ నిగ్రహమూ ప్రకృష్టమైన జ్ఞానమూ కలవారి నను వర్తించేవానిని.
.
70. లక్ష్మి ఎవరిని కోరుకొంటుంది?
మనస్సులో సోమరితనం లేక నీతిమంతమైన నడవడి కలవానిని.
.
71. లక్ష్మిహఠాత్తుగా ఎవరిని వదలిపెడుతుంది?
ద్విజులను, గురువులను, సురలను, నిందించేవానినీ, సోమరినీ.
.
72. ఏమి ఉంటే నరుడు శోచనీయుడు కాకుండా ఉంటాడు?
చెప్పిన మాట వినే భార్యా, నిలుకడగల కలిమీ ఉంటే.
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
 [5/24, 21:52] +91 98661 88266: జీవితంలో సంపాదించాల్సిందేంటి అని ప్రశ్నించుకుంటే సమాధానం వింతగా దొరికింది.
డబ్బు,హోదా,ఆరోగ్యం,బంధు మిత్రులు ఇలా తరచి చూస్తే అన్నీ ఒడిదుడుకులకు లోనయ్యేవి,తాత్కాలికమైనవి అని అర్ధమయ్యింది.మరి ఏది సంపాదించాల్సింది,మన జీవితాంతం తోడుండేది,నిరంతరం పెరిగేది అని ఆలోచిస్తే సత్యం గురించిన జ్ఞానాన్వేషణ అని సమాధానం దొరికింది!!
దీనికి మీరేమంటారు మిత్రులారా?
---  దండమూడి శ్రీచరణ్
9866188266



[5/25, 14:30] +91 98661 88266: నీకు అది వుంది ఇది వుంది అని గర్వపడకు.నీకు జీవితంలో కసి వుందా, అది చెప్పు!!
కసి వుంటే నీకు నెత్తురు మరుగుతుంది. నిన్ను క్షణం కూడా నిలువనీయదు. నువ్వు వూపిరి తీసుకునే క్షణంలో కూడా పరిగెడుతూ వుంటావు-- ఏదైనా చెయ్యాలని!
ఇప్పుడు చెప్పు...నీలో కసి వుందా?
--- _దండమూడి శ్రీచరణ్_
9866188266

మామిడి పండు మాయాసారం

 మామిడి పండు మాయాసారం

రెండు చేతులలో మామిడి పండును తేరి పారా చూస్తూ పట్టుకుంటామే ,దీనినే  *"వ్యామోహం"* అని అంటారు.😛 

మగ్గిన పండును చూసి పరవశించి , పండంతా గుడ్లప్పగించి తడిమి చూచుకుంటామే, దీనినే  *"వాత్సల్యం"* అని విశదీకరించారు😛.

చేతికందిన పండును చూచి భుజాలు గజాలు అవ్వగా , చొక్కాతో అపురూపంగా పండుని సుతారంగా నిమురుతుంటామో, దీనినే  *"ఆప్యాయత"* అని చాటి చెప్పారు.😛

పండంతా ఆబగా తినిన తరువాయి కూడా , టెంకను చీకుతూ మైమరుస్తుంటామే అదిగో దానినే *"లోభం"* అని అన్నారు.😛

మన పండంతా తిని  ఆస్వాదించాక, టెంక విసిరేసి , చేతులు నాక్కుంటూ, పక్క వాడు తింటున్న మామిడిపండు ఇంకా అవ్వటం లేదేమిటి అని ఆలోచిస్తుంటామే దానినే  *"అసూయ"* అని వివరించారు.😛

మామిడిపండు చేతికి చిక్కాక , ఆబగా  చివర్లలో కొరికి రసాద్వాసన చేసే ప్రయత్నంలో , గుజ్జు టెంకతో సహా ఆ కొరుకుడు ప్రాంతం నుంచీ జారి పడిపోయి నప్పుడు , మనం వేసే చిందులతో కూడిన తాండవమునే, *"క్రోధం"* అని వివరంగా తెలిపారు.😛

మామిడి పండు తిని తొక్కను ఆవులకు, మేకలకు విసిరి, పండంతా పెట్టినట్టు  దీర్ఘ శ్వాస వదలి బిగుసుకు పోతామే, ఇదిగో దీనినే  *"అహంకారం"* అని చాటారు.😛

మామిడి పండు అంతా తిని పెదవులు మరియు మూతి నాలికతో అందుకుంటూ, టెంకను మురిపెంగా చూచుకుని , దానిని శుభ్రంగా కడిగి, మొక్కవుతుందని నేలలో పాతి పెడతామే, దానినే  *"మమకారం"* అని తెలిపారు.😛

అతిగా మామిడి పళ్ళు తిని , జడివానలా వచ్చే వమనములుకై చెరువు గట్టుకు పరిగెడుతుంటామే, ఇదిగో దీనినే ముఖ్యంగా *"ఆత్రం"* అని విశదీకరించారు.😛

*ఒక  పండు ఆరగింపు ముద్దు,*
*రెండు కద్దు*
 *మూడు అసలే వద్దు,*
 *ఉండాలి దేనికయినా సరిహద్దు.*
 దీనినే   *స్వీయ నియంత్రణ* అని విపులీకరించారు మన పెద్దలు.😛 

*ఇదీ మామిడిపండు రసలీలాసారం*..😄😄

(ఎవరు దీన్ని జనాల మీదికి వదిలారో‌ తెలియదు!)
 *బెంగుళూరు లోని ఓ ఇంటి ముందు*
*తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి* 
*శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు..కారులోంచి దిగారు.* 
లోపలికి వెళ్ళి చూస్తే..అంతా నిశ్శబ్దం. 
మంచం మీద ఓ వృద్ధుడు నిస్తేజంగా 
పడుకుని ఉన్నారు. చుట్టూ ఎవరెవరో వున్నారు. 
ప్రసాద్ తాను వచ్చిన పని గురించి చెప్పారు. 
అందులో ఓ వ్యక్తి ఆసక్తిగా ముందుకు వచ్చి..
నాన్నగారు వారం నుంచి కోమాలో వున్నారు,
అంటూ ప్రసాద్ గారిని మంచం దగ్గరకు
తీసుకుపోయి..ఆ వృద్ధుని చెవిలో 
"నాన్నగారూ..నాన్నగారూ" అంటూ పిలిచాడు. 
సమాధానం లేదు. ఈ సారి చెవి దగ్గరగా..
"మీ కోసం తిరుమల నుండి ప్రసాదం వచ్చింది"
అన్నాడు. అప్పుడు తెరుచుకున్నాయి.. 
ఆ వృద్ధుని కళ్ళు. అర్ధ నిమీలిత నేత్రాలతో 
ఆయన ప్రసాద్ వంక, ఆయన చేతిలోని ప్రసాదం 
వంక చూస్తున్నాడు. ప్రసాద్ వెళ్లి ఆయన మెడలో 
శ్రీవారి డాలర్ హారం అలంకరించి, శాలువా కప్పి, 
శ్రీవారి ప్రసాదాన్ని ఆయన చేతిలో ఉంచారు..

"మిమ్ము స్వామి వారి ఆస్థాన విద్వాంసునిగా 
నియమిస్తున్నాము" అని నియామక పత్రాన్ని 
ఆయనకు అందించారు. ఆ వృద్ధుని కళ్ళు 
వాటి వంక చూశాయి..కళ్ళనుంచి 
నీళ్లు కారుతున్నాయి.పెదాలు వణుకుతున్నాయి. 
ఏవో మాటలు  వినిపిస్తున్నాయి.
ఏదీ అర్ధం కావడం లేదు.
ఆఖరు మాట ఒక్కటే అందరికీ వినిపించింది..

"స్వామీ! ఇన్నాళ్లకు నా మీద దయకలిగిందా?"
అంటూ..తన చేతనున్న వాటిని తడుముకుంటూ.. 
అనిర్వచనీయ అనుభూతిని అనుభవిస్తూన్నాడు.
స్వామి వారి కరుణ లభించింది.ఇక తన 
జీవితానికి విముక్తి లభించిందన్నట్లు మరో 
పది నిముషాల తరువాత....
"రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి ప్రాణాలు 
అనంత వాయువుల్లో కలిసిపోయాయి! 
అందరికీ అదో అద్భుతం,అనిర్వచనీయం!

ఎవరీ..రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?

శ్రీనివాసునిపై అన్నమయ్య రాసిన కీర్తనలు 
30 వేలకు పైగా ఉన్నాయి. అప్పటి పాలకులు
అన్నమయ్య కీర్తనలను తాళపత్రాలపై 
చెక్కించారు. వాటిని స్వామి వారి ఆలయంలో 
నిక్షిప్తం చేశారు. 20 శతాబ్దంలో ఆలయ 
నిర్వహణప్పుడు..ఇవి బయటపడ్డాయి. 
ఆ తాళపత్రాలను గ్రంధ రూపంలోకి తెచ్చి,..
"జో అచ్యుతానంద..జోజో ముకుందా" 
అని మనం పాడుకోగలుగుతున్నామంటే.. 
ఆ కృషికి కారకులు..'వేటూరి ప్రభాకర శాస్త్రి, 
రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు!

ఓ రోజు సంగీత సమావేశం ముగిశాక..
అన్నమాచార్య ప్రాజెక్ స్పెషల్ ఆఫీసర్ 
కామిశెట్టి శ్రీనివాసులు..ప్రసాద్ గారితో..
సర్! రేపు మీరు బెంగుళూరు వెళుతున్నారు.
రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ గారు ప్రస్తుతం 
అక్కడే ఉన్నారు. అన్నమయ్య కీర్తనలను 
జనబాహుళ్యంలోకి తీసుకు రావడానికి 
ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన 
సమకాలికులకు అన్ని  గుర్తింపులు లభించాయి. 
కానీ రాళ్లపల్లి వారికి మాత్రం అన్యాయం జరిగింది. 
ఆయనను మీరు కలిస్తే బాగుంటుంది" అన్నారు.

పివిఆర్కే ప్రసాద్ చాలా సేపు ఆలోచించి 
ఓ నిర్ణయానికి వచ్చారు. డిప్యూటీ ఈ.ఓ.ని పిలిచి..
ఉదయానికల్లా..రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని 
ఆస్థాన విద్వాంసునిగా నియామక పత్రం, 
శ్రీవారి గోల్డ్ డాలర్,శాలువా, ప్రసాదం
అక్షింతలు వగైరా సిద్ధం చేయండి అన్నారు!
డెప్యూటీ ఈ.ఓ.అవాక్కయ్యాడు.
"సర్! అలా నియమించే అధికారం మీ 
పరిధిలోనిది కాదు.బోర్డు ఓ కమిటీని నియమించి,
ఆ కమిటీ ఎంపిక చేసిన వారిని మాత్రమే 
బోర్డు నియమిస్తుంది. రూల్స్ కు విరుద్ధంగా 
అలా చేస్తే మీ మీద ఏ చర్యలైనా తీసుకునే 
అధికారం బోర్డుకు ఉంటుంది.అవసరమైతే 
మిమ్ము ప్రభుత్వానికి సరెండర్ చేయొచ్చు 
అన్నాడు..
అయినా ప్రసాద్ గారు వినలేదు.
వెంటనే నేను చెప్పినట్లు చేయండి..అన్నారు! 
అలాగే అన్నీ సిద్ధం అయిపోయాయి.
అవి తీసుకుని బెంగుళూరు బయలుదేరారు
పివిఆర్కే ప్రసాద్ గారు. బెంగుళూరులో ఆఖరు 
క్షణాలలో..వాటిని రాళ్లపల్లి వారికి సమర్పించడం.
దాని కోసమే ఆయన ఎదురుచూస్తున్నట్లుగా..
ఆ శుభ సందేశం అందుకోగానే ఆయన 
స్వర్గస్థులవడం జరిగిపోయాయి!
            *        *        *
టిటిడి బోర్డు మీటింగ్ హాలు..వాతావరణం
సీరియస్ గా వుంది. జరిగిందంతా చెప్పి 
ప్రసాద్ గారు నిశ్శబ్దంగా కూర్చున్నారు.
"ప్రసాద్ గారూ - మీరు చేసినది చాలా పెద్ద 
తప్పిదం. రూల్స్ కు విరుద్ధం" అన్నాడో సభ్యుడు. 
మీ మనసుకు ఏది తోస్తే అది చేసెయ్యడానికి 
ఇక బోర్డు ఎందుకు? అన్నారు మరొకరు.
ఎవరికి తోచింది వారు మాట్లాడారు. చివరిలో 
అందరూ చైర్మన్ నాగిరెడ్డిగారి వంక చూశారు.
ఆయన చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వారు!
"స్వామి వారికి బోర్డు చైర్మన్ నుండి..సాధారణ
యాత్రికుడి వరకూ అందరూ సమానం. ఆయన
సమస్త జీవరాసులను సమానంగా ప్రేమిస్తాడు.
ఎవరిని ఎప్పుడు, ఎక్కడ ఆదుకోవాలో
అప్పుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు.
ఆయన లీలలు అలా ఉంటాయి. రాళ్లపల్లి వారిని
జీవన చరమాంకంలో సంతోష పెట్టేందుకే ప్రసాద్
గారిని అలా తరుముతున్నట్లు బెంగుళూరు
పంపించాడేమో? అని నేను భావిస్తున్నాను.

ఈ రూల్సు అన్నీ ప్రసాద్ గారికి తెలియనివి కావు.
రాళ్లపల్లివారికి ఎప్పుడో జరగవలసిన సత్కారం
అప్పుడు జరగలేదు.ఇప్పుడు మనకు భగవంతుడు
కల్పించిన అవకాశంగా నేను భావిస్తున్నాను!
ప్రసాద్ గారి చర్యకు ఆమోదం తెలుపుతున్నాను.
అన్నాడు. అంతా నిశ్శబ్దం. నాగిరెడ్డిగారి 
తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. 

ఎన్నో చిత్రాలలో..కథలను మలుపులు తిప్పి,
ఉత్కంఠ రేకెత్తించి, ముగింపులో ఓ సందేశంతో
ప్రేక్షకులను ఇంటికి పంపే విజయాధినేత 
నాగిరెడ్డిగారు..ఈ సమస్యకు ఒక్క చిరునవ్వుతో
ముగించిన ఆయన  స్థితప్రజ్ఞతకు మనసులోనే
కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ప్రసాద్ గారు!
 *🙏ఓం నమో వేంకటేశాయా!!!🙏*

Courtesy Whatsapp
 _*(25.05.24) నుండి రోహిణి కార్తే ప్రారంభం రోహిణి కార్తె అంటే ఏంటీ ? ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి ?*_
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలే మంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి. మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఏలా ఉంటుందో గమనిద్దాం. తేదీ.  ఈ సంవత్సరం రోహిణి కార్తే మే 25 న ప్రారంభమై జూన్ 8  వరకు రోహిణి కార్తె ఉంటుంది.

రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు , ఎండ తీవ్రతలు , అగ్ని ప్రమాదాలు , ఉక్కపోతలు ఉంటాయి.


ఎండ తీవ్రతకు శరీరం అలసి పోతుంది. కావునా ఆరోగ్య రీత్య తగు శ్రద్దలు తీసుకోవాలి. ఎక్కువ మట్టికుండ నీళ్ళు త్రాగడం , మజ్జిగా, పండ్ల రసాలు , కొబ్బరినీళ్ళు , నిమ్మరసం , రాగి జావ , ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది కొంత ఉపశమనం లభిస్తుంది. మసాలాకు సంబంధించిన ఆహార పదార్ధాలు , వేపుళ్ళు , పచ్చళ్ళు , ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదు.
నీళ్ళ సౌకర్యం ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయండి. అన్నిరకాల వయస్సు వారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి , తెల్లని రంగు కల్గినవి , తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. శారీరక తాపం తగ్గుతుంది. చిన్నపిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో తుడిచి బట్టలు మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమం.
ముఖ్యంగా సాటి జీవులైన పశు , పక్ష్యాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటికి నీళ్ళను ఏర్పాటు చేయండి. బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన వాళ్ళ దాహాన్ని తీర్చెందుకు వారికి త్రాగడానికి చల్లటి నీళ్ళను అందివ్వండి. ఇలాంటి సంఘ సేవా కార్యక్రమాలు చేయడం వలన మీకున్న గ్రహభాదలు నివారణకు మార్గమై కొంత ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యఫలం దక్కి అంతా మంచి జరుగుతుంది.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

నారద జయంతి

 _🔥నారద జయంతి*_🔥


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*ఆదర్శ పాత్రికేయుడు నారదుడు*

నారదుడు దేవర్షి , సంగీతజ్ఞుడు. నిరంతరం లోక సంచారం చేస్తారు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ  తెలుపుతుంటారు. ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత , త్రేతా , ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన ఉంటారు.

నారదుని జన్మతిధి వైశాఖ బహుళ పాడ్యమి. ఈ తిధినాడే ప్రపంచమంతా నారద జయంతిని జరుపుకుంటున్నది.

 *ముల్లోకసంచారి*

నారదుడు త్రిలోక సంచారి. మూడు లోకాల్లోను సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటారు. ఎంతోమంది సాత్వికులకు అయన మోక్షమార్గాన్ని చూపించాడు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తుంటాడు. అయితే కొంతమంది మేధావులు , రచయితలు మాత్రం ఆయన్ను *“కలహా భోజనుడు” గా “కలహా ప్రియుడు” గా* అభివర్ణించారు.

ఈ లోకం తీరే ఇంత. నిజం మాట్లాడే వాడికి ఎప్పుడు కష్టాలే. అందుకే అన్నారు *‘యదార్ధవాది లోక విరోధి’*. ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించే వాళ్ళంటే అదో చిన్నచూపు. వారిని లోక విరోధులుగానే చూస్తారు. అనేక కష్టాలకు గురి చేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కొరకు నిరంతరం తపించేవాడు. ముల్లోకాలలోనూ సంచరిస్తూ దేవ , మానవ , దానవులకు  సందర్భానుసారంగా కర్తవ్య బోధ చేస్తుంటాడు. అయితే నారదుడిది ఒకటే లక్ష్యం. ధర్మం గెలవాలి.

*‘నార’* అనగా మానవ జాతికి ఉపయోగపడే జ్ఞానం అని , *‘ద’* అనగా ఇచ్చే వాడని అర్ధం ఉంది. మానవజాతి నిరంతర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి , వారిని సన్మార్గంలో నడిపించేవాడే నారదుడు. అంతేకాదు , నారదుడు ఒక అత్యున్నత సంగీతకారుడు.

*జన్మ వృత్తాతం*

ప్రళయం తర్వాత కాలంలో పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుడి నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ మరీచి , అత్రి మొదలైన ఎనిమిది మంది ప్రజపతులను సృష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు.

*ధర్మ రక్షణలో నారదుడి పాత్ర*

 *రామాయణ రచనలో*

రామాయణ రచనలో మనకు నారదుడి పాత్ర కనిపిస్తుంది. వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారదుడితో *“ఎన్ని కష్టాలు వచ్చినా , ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఋజువర్తనలో సాగిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ?”* అంటూ ప్రశ్నించాడు వాల్మీకి. అప్పుడు అయోధ్య రాజైన శ్రీరామచంద్రుడు గురించి మొదట వాల్మీకికి తెలిపింది నారదుడే. వాల్మీకి మహర్షి రామకథను విని పులకించి పోయాడు. నారదుడి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి రామకథను శ్లోక రూపంలో రచించమని కోరాడు.

*మహర్షికి మార్గదర్శనం*

ఒకసారి మహర్షి వేదవ్యాసుడు వేదాలను ఋగ్ , యజుర్ , సామ , అధర్వణమని నాలుగు భాగాలుగా విభజించాడు. సామాన్యులకు వేదాలు మరింత సులభంగా అర్ధం కావాలనే తలంపుతో పురాణాలను రచించాడు. మహాభారతాన్ని రాశాడు. మానవాళి శ్రేయస్సుకై ఇన్ని రచించినప్పటికీ ఆయనకు తృప్తి కలుగలేదు. ఒకరోజు సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఆలోచనలో నిమగ్నుడై ఉండగా నారదుడు వచ్చి ఆయన్ను పలకరించాడు. భక్తి మహత్యాన్ని తెలిపే నారాయణుడి లీలలను తెలిపే భాగవతాన్ని రాయమని కోరాడు. ఈ రచనతో కలియుగంలో ప్రజలకు దైవభక్తి , సత్సాంగత్యం కలుగుతాయని నారదుడు తెలిపాడు.

ఇలా మానవాళికి మార్గం చూపే రామాయణం , మహాభారతం , భాగవతాలను గ్రంధస్థం చేయడంలో , వాటి ప్రచారంలో నారదుడి పాత్ర చాలానే ఉంది.

అలాగే వాల్మీకి , ధ్రువుడు , చిత్రకేతు , ప్రహ్లాదుడు  సావిత్రి వంటి వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించినది కూడా నారద మహర్షియే.

*ధ్రువుడు*

ఉత్తానపాద మహారాజుకి ఇద్దరు భార్యలు. వారిలో ఒకరు సునీత. ఆమె కుమారుడు ధ్రువుడు. రెండవ భార్య సురుచి. ఆమె కుమారుడు ఉత్తముడు. ఒకరోజు సురుచి *“నువ్వు రాజు కావడానికి అనర్హుడివి” అని ధ్రువుడిని నిందిస్తుంది. దానితో విష్ణువుని మెప్పించి రాజార్హత సంపాదిస్తానని ఐదేళ్ళ వయసులోనే అడవి బాట పడతాడు ధ్రువుడు. ధ్రువుని శపథం విన్న నారదుడు వెంటనే అతని వద్దకు వచ్చి తపస్సు చేసే పద్ధతి వివరిస్తాడు. “ఓం నమో భగవతే వాసుదేవాయ”* అన్న మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. నారదుని ఉపదేశం ప్రకారం ధ్రువుడు తన తపస్సు ద్వారా శ్రీ మహావిష్ణువుని మెప్పిస్తాడు.

 *చిత్రకేతు*

శూరసేన రాజ్యానికి సంబంధించిన కథలోనూ నారదుడి పాత్ర మనకు కనిపిస్తుంది. ఈ రాజ్యానికి రాజు చిత్రకేతు. ఆయనకు ఎన్నో ఏళ్ల తర్వాత ఒక కుమారుడు జన్మిస్తాడు. అయితే చిత్రకేతు మిగిలిన భార్యలు ఆ పిల్లవాడికి విషం పెట్టి చంపేస్తారు. లేక లేక పుట్టిన కుమారడు మృతి చెందడంతో చిత్రకేతు చాలా దుఃఖిస్తాడు. నారదుడు వచ్చి అతనిని ఎంత అనునయించినా ఫలితం లేకపోవడంతో , తన యోగ శక్తితో చనిపోయిన చిత్రకేతు కుమారుని బ్రతికిస్తాడు. తిరిగి ప్రాణం పోసుకొన్న అ బాలుడు *“నేను ఎన్నో జన్మలను ఎత్తాను. ఎంతోమంది తల్లితండ్రులను చూశాను. ఒకరి చేతిలోనుంచి ఇంకొకరి చేతిలోకి మారే నాణెం లాగా మానవుడు తన కర్మానుసారం ఒక జన్మ తర్వాత మరొక జన్మ ఎత్తుతాడు. నేను ఈ జన్మ చక్రం నుంచి బయటపడలనుకుంటున్నాను”* అని దేహ త్యాగం చేశాడు. దీంతో చిత్రకేతుకు జ్ఞానోదయమవుతుంది. అతని మనస్సు నిర్మలమవుతుంది. చిత్రకేతుకి మంత్రోపదేశం చేసి మోక్షమార్గాన్ని చూపాడు నారదుడు.

*భక్త ప్రహ్లాద*

భక్త ప్రహ్లాదుడికి సంబంధించిన వృత్తాంతం లోనూ మనకు నారదుడు దర్శనమిస్తారు. హిరణ్యకశిపుడు దేవతలకు శత్రువు. ఒకసారి అతడు మంధర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉండగా , ఇంద్రుడు అతని భార్యని చెరపడతాడు. వెంటనే అక్కడకు వచ్చిన నారదుడు ఇంద్రుడిని వారిస్తాడు. ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నావని హెచ్చరిస్తాడు. హిరణ్యకశిపుని భార్యను నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఆమెకు ధర్మానికి సంబంధించిన విషయాలతో పాటు శ్రీమన్నారాయణుని లీలను బోధించేవారు. వీటిని ఆమె గర్భంలోని శిశువు ఎంతో ఆసక్తితో వినేవాడు. నారదుడి బోధనలు విన్న ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహావిష్ణువు భక్తుడయ్యాడు.

*సతీ సావిత్రి*

సావిత్రి కథలోనూ మహర్షి నారదుడు కనిపిస్తారు. మద్ర రాజు ఆశ్వపతి కుమార్తె సావిత్రికి సత్యవంతునితో వివాహం జరుగుతుంది. నారదుడు వచ్చి సత్యవంతుడు చాలా బుద్ధిమంతుడని , అయితే ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే జీవిస్తాడని చెబుతాడు. అయినా అంతా శుభమే జరుగుతుందని నారదుడు సావిత్రికి ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత నారదుడి ఉపదేశానుసారం సావిత్రి తన పతిభక్తితో యమధర్మ రాజు ను మెప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి కాపాడుకుంటుంది.

 శ్రీ కృష్ణుడి కథల్లోనూ నారదుడు మనకు దర్శనమిస్తాడు. ఇటు ధర్మరాజుకి రాజధర్మం , ప్రజలకోసం రాజు నిర్వహించాల్సిన కార్యాలను గురించి  కూడా నారదుడు వివరిస్తాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారికి ఉపయుక్తమైన కథలు , ధర్మాలు చెప్పమని మార్కండేయ మహర్షిని వారివద్దకు పంపిస్తారు.

ఇంకా వేదాలు , ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావన మనకు కనిపిస్తాయి. ఖగోళ , సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు. వేదాలలో చెప్పిన విషయాలను దేశ , కాల పరిస్థితులకు తగినట్లుగా అన్వయించుకుని , ఎలా పాటించాలో చెప్పేవే స్మృతులు. నారదుడు కూడా అటువంటి స్మృతిని రచించాడు. దానిని `నారద స్మృతి’ అంటారు.  నారదుని *“నారద శిక్ష”* అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. నారద భక్తి సూత్రాలు అనే గొప్ప గ్రంథాన్ని ఆయన రచించారు. ఇందులో భక్తి మార్గము , దాని విశిష్టత , దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించారు. అలాగే `బృహన్నారదీయమ్’, `లఘునారదమ్’ అనే గ్రంధాలలో ఆస్తిపంపకాలు మొదలైన ధర్మాలన్నీ వివరించారు. అవి నేటికీ ఉపయోగపడుతున్నాయి. నారదుడు రచించిన శిల్పశాస్త్రం కూడా ఉంది.  ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై ధర్మ రక్షణ కోసం నారద మహర్షి తనదైన పాత్ర పోషించారు.

*మొదటి పాత్రికేయుడు నారదుడు*

ఇలా చెప్పుకొంటూ పోతే నారదుడు చేసిన మంచి పనులు అన్నీ ఇన్నీ కావు. మానవాళి శ్రేయస్సు కొసం ఎన్నో మంచిపనులు చేశారు. అవసరమైతే వ్యక్తుల మధ్య కలహాలు కూడా సృష్టించాడు. ఎన్ని కలహాలు సృష్టించినప్పటికీ అయన ధ్యేయం ధర్మ రక్షణే. శిష్ట రక్షణ , దుష్ట శిక్షణే. అయితే ఆయన అందరితో స్నేహం చేసేవాడు. చివరికి దానవులతో కూడా ఆయనకు సత్సంబంధాలున్నాయి. కానీ ధర్మానికి హాని చేసేవారు ఎంత స్నేహితులైన ఉపెక్షించే వాడు కాదు నారదుడు. తప్పు చేసినవాడు ఎంతటి వాడైన అతనికి శిక్ష పడేటట్లు చేయటమే నారదుని లక్ష్యం. మానవాళి శ్రేయస్సు కోసం , ధర్మ రక్షణ కోసం నారదుడు ఎప్పుడూ తపిస్తూ ఉంటాడు. అందుకే నారదుడు మహర్షి అయ్యాడు. మహర్షి అంటే ఋషులకే ఋషి. ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడేవారిని ఋషులనే అంటారు.

నేటి సమాజంలో ఒక పాత్రికేయుని జీవితం కూడా ప్రజల తరఫున పోరాడటమే. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయుని జీవితం సాగుతుంది. ఈ మార్గంలో పత్రికేయులందరికి మహర్షి నారదుని జీవితం పరమ ఆదర్శం. అందుకే నారదుడిని మొదటి పాత్రికేయుడు అంటాం.

*నారద జయంతి –  ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం*

వైశాఖ బహుళ పాడ్యమి మహర్షి నారదుని జన్మ తిధి. మొదటి ఆదర్శ పాత్రికేయుడయిన నారదుని జయంతిని ప్రపంచం యావత్తు పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆ రోజున పాత్రికేయ వృత్తికి న్యాయం చేకూర్చే కొంతమంది పాత్రికేయులకు సన్మాన సత్కారాలు జరుగుతాయి. ఆ రోజున మహర్షి నారదుని స్మరించుకొని నిజమైన పాత్రికేయ వృత్తిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పాత్రికేయులంతా మహర్షి నారదుని బాటలో నడిస్తే ఇక ప్రజలకు కష్టలెక్కడి నుండి వస్తాయి ? ధర్మ మార్గంలో  నడిచే సమ సమాజం వెల్లివిరిస్తుంది.

✡️✡️✡️✡️✡️✡️✡️